‘క్రైస్తవ సోదరులను ప్రభుత్వం ఆదుకుంటుంది’ | Koppula eshwar: Telangana Government Cares Christian Brothers | Sakshi
Sakshi News home page

‘తెలంగాణ ఏర్పడాలని క్రైస్తవులు కోరుకున్నారు’

Published Fri, Sep 18 2020 1:53 PM | Last Updated on Fri, Sep 18 2020 2:07 PM

Koppula eshwar: Telangana Government Cares Christian Brothers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : క్రైస్తవుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం పాటుపాడుతోందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. వారి కోసం రెసిడెన్షియల్‌ పాఠశాలలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. చదువుకొని ఉద్యోగాలు లేని వారికి లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి కోసం ఆదుకుంటున్నామన్నారు. నగరంలోని మినిస్టర్స్‌ క్వాటర్స్‌లో శుక్రవారం క్రిస్టియన్‌ మత పెద్దల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, కొప్పుల ఈశ్వర్‌ పాల్గొన్నారు. కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని క్రైస్తవులు కోరుకున్నారన్నారు. (అంబేడ్కర్‌ విగ్రహం నమూనా విడుదల)

‘ఈ ఆరేళ్లలో ఎక్కడ చిన్న సమస్య వచ్చినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది. అన్ని వర్గాలకు ప్రభుత్వం చేయుతనందిస్తోంది. క్రైస్తవుల స్మశాన వాటిక కోసం స్థలం కూడా కేటాయించి అన్ని సదుపాయాలు ఉండేలా చూస్తాం. కోవిడ్ కారణంగా మరణించిన క్రిస్టియన్ సోదరులను ప్రభుత్వం ఆదుకుంటుంది. ప్రభుత్వ పథకాలను కూడా క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. ఈ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే ఉద్దేశ్యంతో సమూల మార్పులు జరుగుతున్నాయి’. అని పేర్కొన్నారు.(‘డబుల్‌ ఇళ్లు చూపిస్తామని పారిపోయారు’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement