christains
-
‘క్రైస్తవ సోదరులను ప్రభుత్వం ఆదుకుంటుంది’
సాక్షి, హైదరాబాద్ : క్రైస్తవుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం పాటుపాడుతోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వారి కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. చదువుకొని ఉద్యోగాలు లేని వారికి లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి కోసం ఆదుకుంటున్నామన్నారు. నగరంలోని మినిస్టర్స్ క్వాటర్స్‌లో శుక్రవారం క్రిస్టియన్ మత పెద్దల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని క్రైస్తవులు కోరుకున్నారన్నారు. (అంబేడ్కర్ విగ్రహం నమూనా విడుదల) ‘ఈ ఆరేళ్లలో ఎక్కడ చిన్న సమస్య వచ్చినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది. అన్ని వర్గాలకు ప్రభుత్వం చేయుతనందిస్తోంది. క్రైస్తవుల స్మశాన వాటిక కోసం స్థలం కూడా కేటాయించి అన్ని సదుపాయాలు ఉండేలా చూస్తాం. కోవిడ్ కారణంగా మరణించిన క్రిస్టియన్ సోదరులను ప్రభుత్వం ఆదుకుంటుంది. ప్రభుత్వ పథకాలను కూడా క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. ఈ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే ఉద్దేశ్యంతో సమూల మార్పులు జరుగుతున్నాయి’. అని పేర్కొన్నారు.(‘డబుల్ ఇళ్లు చూపిస్తామని పారిపోయారు’) -
‘క్షమాపణ’లో తడిసిముదై్దన యోసేపు!!
యోసేపు చిన్నప్పటి నుండీ దేవుని భయం కలిగిన వాడు. దేవుని భయమంటే తెలియని అతని అన్నలు ఆ కారణంగా అతనిపై పగబట్టారు. అన్నల దుర్మార్గపు ప్రవర్తన గురించిన నివేదికలు యోసేపు తమ తండ్రియైన యాకోబుకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వచ్చిన కారణంగా అన్నలతనిపై మరింత కక్ష పెంచుకున్నారు. ముందతన్ని చంపుదామనుకున్నారు, ఆ తర్వాత మనసు మార్చుకొని ఐగుప్తు వర్తకులకు బానిసగా అమ్మేసి, అడవిలో యోసేపు క్రూరమృగం బారినపడి చనిపోయాడని తండ్రికి అబద్ధం చెప్పారు. అలా చిన్నతనంలోనే ఒక బానిసగా ఐగుప్తుకు వెళ్లిన యోసేపు మరెన్నెన్నో శ్రమలనుభవించినా, అతని సత్ప్రవర్తనకు దేవుని అపారమైన కృప కూడా తోడైన కారణంగా, ఏడేళ్ల భయంకరమైన కరువుకాలంలో ఒక్క ఐగుప్తు దేశానికే కాదు పొరుగు దేశాలవాసులకు కూడా అన్నం పెట్టిన ఒక గొప్ప ప్రధానమంత్రిగా దేవుని ద్వారా నియమించబడి ప్రఖ్యాతి చెందాడు. పొరుగునే ఉన్న అతని అన్నలు కూడా ఒకరోజున ధాన్యం కోసం అతని సమక్షానికి రావలసి వచ్చింది. యోసేపు వెంటనే వారిని గుర్తుపట్టాడు. కానీ దైవభయం, తన అత్యున్నత స్థితికి కారకుడు దేవుడేనన్న కృతజ్ఞత, నమ్రత, తగ్గింపు స్వభావం కల్గిన ఒక అసమాన విశ్వాసిగా, చేజిక్కిన అన్నలపై పగ తీర్చుకోకుండా, వారిని హృదయపూర్వకంగా క్షమించాడు. పైగా మీరు నాకు అన్యాయమేమీ చెయ్యలేదు, అబ్రాహాము వంశంగా తనకోసం ప్రత్యేకించుకున్న మనల్నందర్నీ ఇలాంటి కరువులో పోషించి కాపాడటం కోసం దేవుడే ముందస్తు ప్రణాళికతో మీ ద్వారా ఐగుప్తుకు నన్ను ముందుగా పంపించాడంటూ దేవుని ప్రణాళికను వారికి వివరించాడు. వారిని క్షేమంగా ఇళ్లకు పంపి అన్నలను, వారి కుటుంబాలను, తన తండ్రిని కూడా సాదరంగా ఐగుప్తుకు రప్పించుకొని వాళ్లందరినీ పోషించాడు. దేవుని అపారమైన ప్రేమకు, సిలువలో పరిమళించిన యేసుక్రీస్తు క్షమాస్వభావానికి యోసేపు నిలువెత్తు నిదర్శనం. యోసేపు నిజానికి ‘స్వయం సాధక వ్యక్తి’ గా తనను తాను శ్లాఘించుకోవచ్చు. అయితే తన జీవితంలో జరుగుతున్న ప్రతి మంచి, చెడు, చిన్న, పెద్ద సంఘటన దేవుని సంకల్పం మేరకు తనకు, తన ద్వారా లోకానికి మేలు కలిగేందుకే జరుగుతుందని, జరుగుతోందని విశ్వసించిన యోసేపు పాతనిబంధన కాలంలో నివసించిన కొత్తనిబంధన కాలపు మహా విశ్వాసి(రోమా 8:28). పాతనిబంధన కాలంలో తరచుగా జరిగినట్టుగా, యోసేపు తమను, తమ కుటుంబాలను కత్తివాతకు గురి చేసి చంపుతాడేమోనని భయంతో బిక్కచచ్చిన అన్నలతో ‘భయపడకండి, నేను దేవుని స్థానంలో ఉన్నానా? మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ మీతోపాటు లక్షలాదిమందిని ఈ భయంకరమైన కరువులో చనిపోకుండా బతికేంచేందుకు దేవుడు మీ కీడును నాకు, లోకానికి కూడా మేలు గా మార్చాడు’ అంటూ వారికి కొత్తనిబంధన కాలపు క్షమాసిద్ధాంతాన్ని వివరించాడు. రాబోయే వేలసంవత్సరాల తర్వాత క్రీస్తు ద్వారా ఆవిష్కరించబడనున్న క్షమాయుగపు కృపాసువార్తను ముందే తెలుసుకొని దాన్ని అంగీకరించి, అనుభవించి, ఆచరించి, తద్వారా దేవుని ఆశీర్వాదాలు తనివితీరా పొందిన అసమాన విశ్వాసం యోసేపుది!! పాతనిబంధన వాడైనా క్షమాస్వభావిగా యోసేపు జీవితం చరిత్ర, బైబిల్ పుటలకెక్కితే, కొత్తనిబంధన విశ్వాసులమైన మనం మాత్రం పగలతో రగులుతూ, ప్రతీకారేచ్ఛలతో జీవితాలను అశాంతిమయం చేసుకొంటున్న పాతనిబంధన తాలూకు కరడుగట్టిన ప్రజలముగా మిగిలిపోతున్నాం. పగ, కోపం, ప్రతీకారేచ్ఛ శత్రువుకన్నా ముందుగా మనల్నే దహించి బూడిద చేస్తుంది. క్షమాస్వభావం హృదయాన్ని దూదికన్నా తేలికగా చేసి దేవుడు తెరిచిన ఆశీర్వాదాల ద్వారాల గుండా హాయిగా ఆనందంగా ఎగురుతూ, లోకానికి ఆశీర్వాదాలు పంచే పరిచర్యలో మనల్ని ప్రతిష్టిస్తుంది. విశ్వాసికి క్షమాపణ, ప్రేమ శ్వాసగా మారాలి, అప్పుడే అతనిలో, అతని కుటుంబంలో శాంతి, ఆనందం అపారంగా ప్రజ్వలిస్తాయి. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
క్రైస్తవుల ఆస్తులను రక్షించుకుందాం
–కోల్స్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ – జిల్లా నలుమూలల నుంచి హాజరైన బాప్టిస్ట్ సంఘం సభ్యులు – ర్యాలీకి మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలు కర్నూలు సీక్యాంప్: క్రైస్తవ ఆస్తులను రక్షించుకోవాలని క్రైస్తవ జేఏసీ చైర్మన్ ప్రభుదాసు అన్నారు. క్రైస్తవ బాప్టిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి బాప్టిస్ట్ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కోల్స్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది. వీరికి వివిధ రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా ప్రభుదాసు మాట్లాడుతూ జిల్లాలో బాప్టిస్ట్ చర్చి ఆస్తులు ఆత్మకూరు, నందికొట్కూరు, డోన్, ఆదోని తదితర ప్రాంతాల్లో ఉన్నాయన్నారు. నగరంలో రాక్‌వుడ్, సీసీ చర్చి, స్టాంటన్ చర్చిలపై కొందరు అధికార పార్టీ నాయకులు కన్నేశారన్నారు. క్రైస్తవుల ఆస్తులను అడ్డదారిలో కబ్జా చేస్తున్న వారికి ప్రభుత్వం కూడా సహకరిస్తుండటం సిగ్గుచేటన్నారు. క్రైస్తవ ఆస్తులను దోచుకునే వారిని చర్చీలలోకి వస్తే తరమికొట్టాలన్నారు. ధర్మబద్ధమైన పోరాటానికి ప్రతిఒక్కరూ కలిసిరావాలసి కోరారు. క్రైస్తవుల ఆస్తులతో ఇళ్లు, షాపింగ్ మాళ్లు కట్టుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుమందు ఎమ్మెల్యే ఎస్పీ మోహన్‌రెడ్డికి, కేజే రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో బాప్టిస్ట్ చర్చి సంఘ సభ్యులు, పాస్టర్లు పాల్గొన్నారు. -
సబ్‌రిజిస్ట్రార్ సస్పెన్షన్‌కు డిమాండ్
- కోల్స్ స్థలం రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలి - కాలేజీ ఎదుట క్రైస్తవుల ఆందోళన కర్నూలు (టౌన్) : నిషేధిత స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన సబ్‌రిజిస్ట్రార్ మహబూబ్‌బాషాను సస్పెండ్ చేయాలని క్త్రెస్తవ సంఘాల నాయకులు, బాప్టిస్టు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ, బీసీ జేఏసీ చైర్మన్ ప్రభుదాస్ డిమాండ్ చేశారు. కోల్స్ స్థలం రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలన్నారు. ఆదివారం 11వ రోజు దీక్షలు కొనసాగాయి. స్థానిక కోల్స్ కళాశాల ఆవరణలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో క్త్రెస్తవులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతకు ముందు కమిటీ నాయకులు, కోల్స్ చర్చి సభ్యులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ ఆథారిటీ పత్రాలు సృష్టించుకుని కోల్స్ కాలేజీ కాంపౌండ్‌ను అమ్ముకున్న పి.సోలమోన్ను అరెస్టు చేయాలన్నారు. సిగ్గు, షరం లేకుండా కోనుగోలు చేసిన రాజకీయ నేతలు స్వచ్చందంగా స్థలాన్ని వదులుకోవాలన్నారు. లేకుంటే రాబోయే రోజుల్లో అన్ని చర్చిలను ఏకం చేసి కొన్న, అమ్మిన వారి ఇళ్ల వద్ద దీక్షలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు. వంద సంవత్సరాల చరిత్ర ఉన్న కోల్స్ స్థలం కబ్జాకు గురికావడంతో యావత్తూ క్త్రెస్తవ లోకం ఆందోళనలో ఉందన్నారు. ఉద్యమం ఉదృతం కాకముందే ... ప్రభుత్వం, అధికారులు స్పందించి న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు చంద్రశేఖర్, షడ్రక్, దినకర్, సుధీర్‌కుమార్, స్టాన్లీజోన్స్, మాజీ కార్పోరేటర్ గిడ్డమ్మ తదితరులు పాల్గొన్నారు.