క్రైస్తవుల ఆస్తులను రక్షించుకుందాం
క్రైస్తవుల ఆస్తులను రక్షించుకుందాం
Published Wed, Feb 22 2017 11:23 PM | Last Updated on Tue, Sep 5 2017 4:21 AM
–కోల్స్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ
– జిల్లా నలుమూలల నుంచి హాజరైన బాప్టిస్ట్ సంఘం సభ్యులు
– ర్యాలీకి మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలు
కర్నూలు సీక్యాంప్: క్రైస్తవ ఆస్తులను రక్షించుకోవాలని క్రైస్తవ జేఏసీ చైర్మన్ ప్రభుదాసు అన్నారు. క్రైస్తవ బాప్టిస్ట్ జాయింట్ యాక‌్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి బాప్టిస్ట్ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కోల్స్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది. వీరికి వివిధ రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా ప్రభుదాసు మాట్లాడుతూ జిల్లాలో బాప్టిస్ట్ చర్చి ఆస్తులు ఆత్మకూరు, నందికొట్కూరు, డోన్, ఆదోని తదితర ప్రాంతాల్లో ఉన్నాయన్నారు. నగరంలో రాక్‌వుడ్, సీసీ చర్చి, స్టాంటన్ చర్చిలపై కొందరు అధికార పార్టీ నాయకులు కన్నేశారన్నారు. క్రైస్తవుల ఆస్తులను అడ్డదారిలో కబ్జా చేస్తున్న వారికి ప్రభుత్వం కూడా సహకరిస్తుండటం సిగ్గుచేటన్నారు. క్రైస్తవ ఆస్తులను దోచుకునే వారిని చర్చీలలోకి వస్తే తరమికొట్టాలన్నారు. ధర్మబద్ధమైన పోరాటానికి ప్రతిఒక్కరూ కలిసిరావాలసి కోరారు. క్రైస్తవుల ఆస్తులతో ఇళ్లు, షాపింగ్ మాళ్లు కట్టుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుమందు ఎమ్మెల్యే ఎస్పీ మోహన్‌రెడ్డికి, కేజే రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో బాప్టిస్ట్ చర్చి సంఘ సభ్యులు, పాస్టర్లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement