
సాక్షి, తిరుపతి: తిరుచానూరులో కబ్జా రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఎన్‌ఆర్‌ఐలకు చెందిన స్థలాలపై కబ్జా రాయుళ్ల కన్నుపడింది. తిరుచానూరులో కోట్ల విలువైన భూములపై పాగా వేశారు. సెటిల్‌మెంట్ చేసుకొని పక్షంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఏపీ లో బీహార్ రాష్ట్ర తరహా ఘోరాలు జరుగుతున్నాయంటూ ఎన్‌ఆర్‌ఐ రాజేంద్రప్రసాద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తిరుచానూరులో కోట్లు విలువ చేసే తన భూమిని కబ్జా చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన కూడా పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు. తన తండ్రి రిటైర్డ్ ఎక్సైజ్ సూపరింటెండ్‌గా పనిచేసిన వ్యక్తి అని.. ఆయన నాలుగు సార్లు ఎస్పీని కలిసిన తిరుచానూరు సీఐ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీఎన్‌ఆర్‌టీ ద్వారా ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా కేసు నమోదు చేశారన్నారు.
ఏపీలో మరో బీహర్ తరహా దోపిడీ ఘోరాలు జరుగుతున్నాయని.. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని ఎన్‌ఆర్‌ఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రవాస ఆంధ్రుల భూములకు రక్షణ కరువైందన్నారు. ఎన్నికలు సమయంలో కూటమి ప్రభుత్వానికి మద్దతుగా పనిచేసినందుకు బాధపడుతున్నామని ఆయన చెప్పారు.
