Occupied lands
-
ఆక్రమిస్తే చర్యలు తప్పవు
సాక్షి ప్రతినిధి, వరంగల్: చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై ప్రభుత్వ వైఖరి ఒకేలా ఉంటుందని, ఆక్రమణదారులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ సమగ్రాభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టిని సారించారని, హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేయడం కోసం అందరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గ్రేటర్ వరంగల్‌లో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.పోచమ్మకుంట మోడల్ గ్రేవ్ యార్డ్, గ్రేటర్ వరంగల్ పరిధిలోని పార్కు స్థలాల ఆక్రమణ, రీజనల్ సైన్స్ సెంటర్ భూమి ఆక్రమణ, నాలాల ఆక్రమణలపై మంత్రి ఆరా తీశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, వాటి పురోగతిపైనా కలెక్టర్లు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ వరంగల్ నగర అభివృద్ధికి నిధులను కేటాయిస్తున్నామని, స్మార్ట్ సిటీ నిధులను కూడా విడుదలయ్యేందుకు కృషి చేస్తామన్నారు. నాలాలపై ఎలాంటి నిర్మాణాలున్నా.. ఉపేక్షించవద్దని, నాలాలపై నిరుపేదలున్నట్లయితే వారికి సరైన చోట నివాస సదుపాయం కలి్పంచాలని సూచించారు.వరంగల్ ఎంజీఎంలో కొందరు వైద్యులు పేషెంట్లకు మందులివ్వకుండా ప్రైవేట్ మెడికల్ షాపులకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమ నిర్మాణాలను పట్టించుకోకుండా అనుమతులు ఇస్తుండటం పట్ల మున్సిపల్ అధికారులపైనా మంత్రి సీరియస్ అయ్యారు. పాత్రికేయులకు ఇంటి స్థలాల కేటాయింపు విషయంలో తమ ప్రభుత్వం హామీ ఇచి్చందని, అర్హులైన జర్నలిస్టులందరికీ తప్పకుండా ఇంటి స్థలాలను ఇస్తామని చెప్పారు.వరంగల్ పశి్చమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ నగరంలో పార్కుస్థలాలు చాలాచోట్ల కబ్జాకు గురయ్యా యని, ఇక్కడ కూడా వాడ్రా ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారిని నియమించాలని కోరారు. సమావేశంలో పర్యావరణ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్య శారద తదితరులు పాల్గొన్నారు. -
Russia-Ukraine War: ఉక్రెయిన్‌లో దాడులు.. 25 మంది దుర్మరణం
కీవ్: రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగంలో ఆదివారం ఒక మార్కెట్‌పై జరిగిన దాడిలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్ సేనలే ఈ దాడులకు తెగబడినట్లు రష్యా ఆరోపిస్తోంది. దీనిపై ఉక్రెయిన్ ఇంకా స్పందించలేదు. డోనెట్స్క్ నగరం సమీపంలోని టెక్స్టిల్చిక్ ప్రాంత మార్కెట్‌పై జరిగిన ఈ దాడిలో 20 మందికిపైగా గాయపడ్డారు. మరోవైపు ఆదివారమే రష్యాలోని కింగ్‌సెప్ జిల్లాలోని ఉస్ట్–లూగా పోర్ట్ రసాయన రవాణా టెరి్మనల్ వద్ద రెండు భారీ పేలుళ్లు, తర్వాత భారీ అగి్నప్రమాదం జరిగిన నేపథ్యంలో ఈ సంఘటనలను రష్యా, ఉక్రెయిన్ల పరస్పర దాడులుగా అంతర్జాతీయ మీడియా అభివరి్ణస్తోంది. నాలుగు ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేయడం వల్లే రసాయన రవాణా టెర్మినల్ వద్ద గ్యాస్ ట్యాంక్ పేలిందని రష్యా స్థానిక మీడియా ఆరోపిస్తోంది. -
అంగుళం కూడా చైనా ఆక్రమించలేదనడం అబద్ధం
న్యూఢిల్లీ/లేహ్: లద్దాఖ్‌లోని అంగుళం భూమిని కూడా చైనా ఆర్మీ ఆక్రమించుకోలేదంటూ ప్రధాని మోదీ చేసిన ప్రకటన అబద్ధమని కాంగ్రెస్ నేత రాహుల్ అన్నారు. చైనా సైన్యం అక్కడి పచ్చిక బయళ్లను ఆక్రమించుకోవడంపై లద్దాఖ్ వాసులు ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు. తన తండ్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులరి్పంచేందుకు శనివారం రాహుల్ లద్దాఖ్‌కు చేరుకున్నారు. ‘చైనా సైన్యం చొచ్చుకువచ్చి పచి్చక బయళ్లను లాగేసుకుందని ఇక్కడి వారంతా చెబుతున్నారు. భూమి ఆక్రమణకు గురి కాలేదంటూ ప్రధాని చెబుతున్నది నిజం కాదని వాళ్లు స్పష్టంగా చెబుతున్నారు’అని రాహుల్ అన్నారు. కాగా, రాహుల్∙చైనా తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నట్లుగా ఉందని బీజేపీ మండిపడింది. ఇటువంటి ప్రకటనలతో రాహుల్ దేశం పరువు తీస్తున్నారని ఆరోపించింది. -
ఆధారాలు ఉన్నందునే ఆక్రమణల తొలగింపు
దొండపర్తి (విశాఖ దక్షిణ): అన్యాక్రాంతమైన భూములను ఆంధ్రా యూనివర్శిటీ తిరిగి స్వాధీనం చేసుకోవడం దారుణమా? ఆక్రమిత భూముల్లో నిర్మించిన దుకాణాలను తొలగించడం కూల్చివేతల కలకలమా? ఏయూ ఆస్తులను కబ్జా చేసి అనుభవిస్తున్న ప్రైవేట్ వ్యక్తులపై టీడీపీ నేతలకు ఎందుకంత ప్రేమ? ఈనాడు ప్రచురించినట్లుగా 16 షాపుల్లో 200 మంది పని చేస్తుంటే అవి చిన్న దుకాణాలా? టీడీపీ నాయకుల డ్రామాలు, ఎల్లో మీడియా కథనాల్లో నిజం ఉందా? కబ్జాదారుల చెర నుంచి తమ భూములను ఆంధ్రా యూనివర్శిటీ స్వాధీనం చేసుకుంటే టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రైవేట్ వ్యక్తులను సమర్థించటాన్ని అంతా తప్పుబడుతున్నారు. ఏయూ స్థలాన్ని ఆక్రమించి షెడ్లు నిర్మించిన వారి వద్ద ఆ స్థలానికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేవు. దుకాణదారులంతా తమ వస్తువులు తీసుకొని మధ్యాహ్నానికే అక్కడ నుంచి వెళ్లిపోయారు. చాలా ఏళ్లుగా ఆక్రమణలకు గురైన విలువైన ఏయూ భూములను స్వాధీనం చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. ఏయూ పూర్వ విద్యార్థులు, నగరపౌరులు దీనిని స్వాగతిస్తున్నారు. ► విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీకి పాత సీబీఐ జంక్షన్ నుంచి పోలమాంబ ఆలయం వరకు సువిశాలమైన భూమి ఉంది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నుంచి పోలమాంబ ఆలయం వరకు రహదారికి ఆనుకుని ఉన్న విలువైన స్థలాన్ని కొందరు ఆక్రమించి అనధికారంగా దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. బడాబాబుల అండదండలతో కార్ షెడ్లు, మాంసం దుకాణాలు, టీ పాయింట్లు, టిఫిన్ సెంటర్లు నిర్వహిస్తూ అద్దెలు వసూలు చేసుకుంటున్నారు. టీడీపీ హయాంలో కబ్జాదారులు దుకాణాలను నిర్మించుకుని నెమ్మదిగా విస్తరించినా కన్నెత్తి కూడా చూడలేదు. తాజాగా ఏయూ అధికారులు మరోసారి జీవీఎంసీకి ఫిర్యాదు చేయడంతో అక్రమ నిర్మాణాలను సోమవారం తొలగించారు. ► పెదవాల్తేరు పోలమాంబ ఆలయానికి ఆనుకుని ఏయూకు 2.5 ఎకరాల భూమి ఉంది. 1941లోనే దీన్ని నిర్ణీత రుసుము చెల్లించి కొనుగోలు చేసింది. కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం అప్పటి నుంచి ఆ భూమి ఏయూ స్వాధీనంలోనే ఉంది. టౌన్ సర్వే రిజిస్టర్ ప్రకారం ఈ భూములు ఏయూకు చెందినవేనని 1989 నాటి అడంగల్ కాపీలు ఏయూ వద్ద ఉన్నాయి. ► 1992లో ఈ స్థలాన్ని ఆక్రమించుకోడానికి ప్రయత్నించిన కొందరు కోర్టుకు వెళ్లగా స్పెషల్ కోర్టు ఏయూకు అనుకూలంగా తీర్పునిచ్చింది. 1993 ఫిబ్రవరి 16న తహశీల్దార్ స్వయంగా ఇక్కడ ఉన్న తాటాకు ఇళ్లను తొలగించారు. ఆక్రమణదారులైన కుందం అప్పారావుతో పాటు మరో 13 మంది నుంచి భూమిని స్వాధీనం చేసుకొని ఖాళీ స్థలాన్ని ఏయూకు అప్పగించారు. దీనిపై ఏయూకే సర్వహక్కులు ఉన్నాయంటూ తహశీల్దార్ ఏయూకు లిఖిత పూర్వకంగా ఉత్తర్వులు ఇచ్చారు. ► పెట్రోల్ బంక్ నుంచి పోలమాంబ ఆలయం వరకు రహదారి విస్తరణకు ఏయూకు చెందిన ఈ స్థలం నుంచే కొంత భూమిని జీవీఎంసీకి అప్పగించింది. దీనికి పరిహారంగా ఏయూకు జీవీఎంసీ ప్రత్యామ్నాయ భూమిని సైతం ఇచ్చింది. అందులోనే ఏయూ అంతర్జాతీయ విద్యార్థినుల హాస్టల్ సముదాయాన్ని నిర్మించింది. అన్ని ఆధారాలున్నాయి.. ఆక్రమణలు తొలగించిన స్థలం నిస్సందేహంగా ఏయూదే. ఆ పత్రాలన్నీ మావద్ద ఉన్నాయి. గతంలో పనిచేసిన వీసీలు, రిజిస్ట్రార్లు కూడా వీటిని స్వాధీనం చేసుకోవాలని ఉత్తర ప్రత్యుత్తరాల రూపంలో అప్పటి ప్రభుత్వాలను కోరారు. – ఆచార్య పి.వి.జి.డి ప్రసాదరెడ్డి, వీసీ -
హమ్మమ్మ.. అయ్యన్నా.. ఏకంగా కోర్టునే తప్పుదోవ పట్టించిన వైనం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టుగా ఉంది టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యవహారం. నోరు తెరిస్తే బూతులతో పాటు నీతులు చెప్పే అయ్యన్న.. తనవరకు వచ్చే సరికి మాత్రం ఫోర్జరీ పత్రాలతో నిరంభ్యంతర పత్రం(ఎన్వోసీ) సృష్టించి తప్పును ఒప్పుగా చూపించుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఏకంగా కోర్టును కూడా తప్పుదోవ పట్టించి తన అక్రమ ఇంటి కట్టడాన్ని కూల్చేయకుండా స్టే తెచ్చుకున్నారు. కాలువ భూమిని ఆక్రమించి.. కట్టుకున్న తన ఇంటిని సక్రమమైన నిర్మాణం చేసుకునేలా అయ్యన్న వ్యవహరించిన తీరు అందరూ ఛీత్కరించుకునేలా ఉంది. మరోవైపు అయ్యన్న చేసింది అక్రమమని తేలిన నేపథ్యంలో సీఐడీ రంగంలోకి దిగడంతో టీడీపీ నేతలు బీసీ కార్డును ఉపయోగించడం మరీ విడ్డూరంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ నిర్మాణం.. సక్రమం చేసుకునేలా.. నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడు ఇంటికి ఆనుకుని పంట కాలువ ఉంది. నిర్మాణ సమయంలో బిల్డింగ్ అనుమతి కోసం ఇచ్చిన దరఖాస్తులో కూడా తాము నిర్మించబోయే ఇంటికి దక్షిణం, పశ్చిమాన పంట కాలువ ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. తీరా నిర్మాణం సమయం.. అది కూడా టీడీపీ అధికారంలో ఉన్న సమయం కావడంతో ఏకంగా పంట కాలువను ఆక్రమించి ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. ఇన్నాళ్లుగా గుట్టుగా ఉన్న ఈ వ్యవహారం వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బట్టబయలైంది. ప్రభుత్వ భూములను కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డ్రైవ్‌లో భాగంగా రెవెన్యూ యంత్రాంగం సర్వే చేసింది. ఇందులో జలవనరుల శాఖకు చెందిన పంట కాలువను ఆక్రమించి అయ్యన్న కుటుంబ సభ్యులు ఇంటి నిర్మాణాన్ని చేపట్టారని సర్వేలో తేలింది. ఈ మేరకు చర్యలు తీసుకునేందుకు రెవెన్యూ యంత్రాంగం ఉపక్రమించింది. అక్రమంగా పంట కాలువలో నిర్మించిన నిర్మాణాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తే తన నోటి దురుసుతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించి అధికారులను అడ్డుకున్నారు. అదే సమయంలో అక్రమ నిర్మాణం కాదంటూ ఫోర్జరీ సంతకాలతో నిరంభ్యంతర పత్రం(ఎన్వోసీ)ను సృష్టించి.. సక్రమ నిర్మాణమేనని చెప్పుకునేందుకు యత్నించారు. తీరా సదరు అధికారి ఎన్వోసీలో ఉన్నది తన సంతకం కాదని స్పష్టం చేసి సీఐడీకి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది. ఫోర్జరీ సంతకాలు.. తప్పుడు స్టాంపు పేపర్లు చింతకాయల విజయ్ పేరుతో నర్సీపట్నంలో అయ్యన్న కుటుంబ సభ్యులు 2017లో ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం నర్సీపట్నం మున్సిపాలిటీకి సర్వే నంబర్లు 277, 278/1లోని 387.33 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణానికి అనుమతి కోరుతూ దరఖాస్తు(సెటిల్మెంట్ డీడ్ నం–3660 ఆఫ్ 2017) చేశారు. దక్షిణం, పశి్చమం వైపు పంట కాలువ ఉన్నట్టు పేర్కొన్నారు. అనంతరం ఈ కాలువను ఆక్రమించి మరీ నిర్మాణం చేపట్టారు. దీనిపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి పెట్టడంతో ఫోర్జరీ సంతకాలతో నిరంభ్యంతర సర్టిఫికెట్ (ఎన్వోసీ) సృష్టించడమే కాకుండా ఏకంగా కోర్టునే తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారు. 2019 ఫిబ్రవరి 25న ఇంటి నిర్మాణం కోసం ఎన్వోసీని జలవనరులశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లికార్జున రావు సంతకంతో ఇచ్చినట్టుగా కోర్టులో సమర్పించారు. దీనిని పరిశీలించిన ఈఈ ఎన్వోసీలో ఉన్నది తన సంతకం కాదని గుర్తించారు. అంతేకాకుండా దీనిపై కార్యాలయంలోని ఫైళ్లను పరిశీలించగా.. తాను ఇవ్వలేదని గుర్తించారు. కోర్టుకు సమర్పించిన ఎన్వోసీ పత్రాల్లో ఉన్న సంతకం తనది కాదని కూడా స్పష్టమైంది. ఈ నేపథ్యంలో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని పేర్కొంటూ జలవనరులశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లికార్జునరావు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి వాగు, కెనాల్, నాలా, డ్రెయిన్ బౌండరీకి 9–10 మీటర్లలోపు ఎటువంటి నిర్మాణం చేపట్టరాదని ఏపీ బిల్డింగ్ చట్టం–2017 చెబుతోంది. ఇందుకు అనుగుణంగా కెనాల్ బౌండరీని మొదటగా నిర్ణయించాల్సి ఉంటుంది. అసలు ఇక్కడ కెనాల్ బౌండరీని నిర్ణయించకుండా ఎన్వోసీ ఇవ్వడం సాధ్యం కాదు. అయినప్పటికీ తన పేరుతో ఎన్వోసీ ఇచ్చినట్టుగా కోర్టులో చూపారని ఈఈ మల్లికార్జునరావు పేర్కొన్నారు. అసలు ఆ డాక్యుమెంటులో ఉన్న సంతకం తన స్టయిల్లో చేసిన సంతకం కాదని.. సంతకం కింద తేదీ వివరాలు పేర్కొనడం కూడా ఫోర్జరీనేనని తెలిపారు. మరోవైపు కార్యాలయం సీల్ కూడా తమది కాదని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు సీఐడీకి 30 సెపె్టంబరు 2022లో ఈఈ ఫిర్యాదు చేయగా... దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇన్స్పెక్టర్ పైడిరాజు విచారణ అధికారిగా తన నివేదికను సమర్పించారు. ఈ నివేదికలో ఫోర్జరీ ఎన్వోసీ వ్యవహారం స్పష్టంగా తేటతెల్లమైంది. కప్పిపుచ్చుకునేందుకు కులం కార్డు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో వందల కోట్ల విలువ చేసే భూములను కాపాడింది. 430 ఎకరాల మేర ప్రభుత్వ భూములను స్వా«దీనం చేసుకుంది. ఇందులో భాగంగానే నర్సీపట్నంలో కూడా అయ్యన్న కుటుంబసభ్యులు ఇంటి నిర్మాణం కూడా పంట కాలువను ఆక్రమించి నిర్మించారని సర్వేలో తేలింది. ఈ అక్రమ నిర్మాణాన్ని కూలగొట్టేందుకు యత్నించగా భౌతికంగా అడ్డుకునే ప్రయత్నంతో పాటు ఈ నిర్మాణానికి ఎన్వోసీ ఉందంటూ ఫోర్జరీ డాక్యుమెంట్‌ను సృష్టించారు. అది తీరా సీఐడీ విచారణలో ఫోర్జరీ అని తేలడంతో చివరకు టీడీపీ నేతలు కులం కార్డును తెరమీదకు తెచ్చారు. వాస్తవానికి గతంలో ఏ ప్రభుత్వ హయాంలో లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మేలు చేస్తోంది. బీసీల్లో గతంలో ఎన్నడూలేని విధంగా మెజార్టీ కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వారికి రాజకీయ అధికారాన్ని కట్టబెట్టింది. మరోవైపు టీడీపీ మాత్రం అమరావతి ప్రాంతంలో సామాజిక సమీకరణ దెబ్బతింటుందని పేర్కొంటూ అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే చట్టాన్ని సవరించి మరీ పట్టాలను ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే.. దానిని కూడా టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారు. ఆయా వర్గాలపై తనకున్న వ్యతిరేకతను నిర్లజ్జగా కనబరుస్తున్న టీడీపీ.. అక్రమ వ్యవహారంలో కూరుకున్న అయ్యన్న విషయానికి వచ్చేసరికి మాత్రం బీసీ కార్డును ప్రయోగిస్తుండం ఆశ్చర్యం కలిగిస్తోంది. -
సీఐకి రివర్స్ పంచ్
సాక్షి, హైదరాబాద్: భూ కబ్జాను అడ్డుకుని, అక్రమాన్ని బయటపెట్టిన పోలీసు అధికారికి పదోన్నతి రాకపోయినా గుర్తింపు, ఉన్నతాధికారుల మన్ననలు లభిస్తాయి. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. కబ్జాకోరులపై తన అనుమతి లేకుండా చర్యలు ఎలా తీసుకుంటావంటూ సదరు ఇన్స్పెక్టర్పై ఓ ఎమ్మెల్యే కస్సుమన్నారు. పట్టుబట్టి మరీ ఆ అధికారిని బదిలీ చేయించారు. వెస్ట్‌జోన్‌లోని ఓ ఠాణాలో పోస్టింగ్ ఇచ్చిన మూడు నెలలు కూడా కాకుండానే ఉన్నతాధికారులు ఆయన్ను బదిలీ చేశారు. ఇందులో కొసమెరుపు ఏంటంటే.. కబ్జా అంశంపై కేసు నమోదు, దర్యాప్తు, అరెస్టులు ప్రతిదీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరగటం. సమర్థుడిగా గుర్తింపు ఉండటంతోనే పోస్టింగ్... అత్యంత ప్రముఖులు నివసించే, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన పశ్చిమ మండలంలోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో ఏప్రిల్ 2న జరిగిన రేవ్ పార్టీ తీవ్ర కలకలం సృష్టించింది. ఆ సందర్భంలో స్థానిక ఇన్స్పెక్టర్పై బదిలీ వేటు వేసిన ఉన్నతాధికారులు ఆ స్థానంలో సమర్థుడిగా గుర్తింపు ఉన్న అధికారిని నియమించారు. ఈ నియామకానికి ముందే ఉన్నతాధికారులు సదరు అధికారి వ్యవహారశైలి, పనితీరు తదితరాలను పరిగణనలోకి తీసుకున్నారు. కబ్జా కేసుతో విభేదాలు.. పశ్చిమ మండలంలో ఉన్న రూ.40 కోట్ల విలువైన స్థలం కబ్జా వ్యవహారం గత నెలలో వెలుగులోకి వచ్చింది. దీనిపై కన్నేసిన కొందరు అక్రమార్కులు నకిలీ డాక్యుమెంట్లు, బోగస్ వ్యక్తులతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలా ఆ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి అనుమతి పొందారు. బాధితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఓ ఎమ్మెల్సీ వారికి అండగా నిలిచారు. కబ్జా పర్వాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వారి ఆదేశాల మేరకు కేసు నమోదైంది. ఆద్యంతం అన్ని అంశాలను సదరు ఇన్స్పెక్టర్ పరిశీలించి.. కబ్జా నిజమేనని తేల్చారు. అడ్డా కూలీలను స్థల యజమానులుగా మార్చి రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు. ఈ వివరాలు ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి, వారు అనుమతించిన తర్వాతే నిందితులను అరెస్టు చేశారు. మొత్తం 16 మంది నిందితులుగా ఉండగా అయిదుగురిని కటకటాల్లోకి పంపారు. అనుమతి రద్దు చేసిన జీహెచ్ఎంసీ... పశ్చిమ మండల పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, అరెస్టు చేసిన నిందితుల వివరాలు పరిగణనలోకి తీసుకున్న జీహెచ్ఎంసీ అంతర్గత విచారణ జరిపింది. ఇందులో అసలు విషయం తేలడంతో సదరు నిర్మాణానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేసింది. ఈ విషయాన్ని కబ్జాకోరుల ద్వారా తెలుసుకున్న నగర ఎమ్మెల్యే ఆగ్రహానికి గురయ్యారు. తనకు తెలియకుండా కబ్జాపై కేసు ఎలా నమోదు చేస్తారని, అరెస్టుల వరకు ఎలా వెళ్తారంటూ సదరు ఇన్స్పెక్టర్పై రంకెలు వేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలు, తనకు లభించిన ఆధారాలను బట్టే ముందుకు వెళ్లానంటూ సదరు ఇన్స్పెక్టర్ చెప్పడాన్ని ఎమ్మెల్యే జీర్ణించుకోలేక అతడిని బదిలీ చేయాల్సిందేనంటూ పట్టుబట్టారు. చేతులెత్తేసిన ఉన్నతాధికారులు... ఓ దశలో ఈ విషయం రాష్ట్రంలోనే కీలక కార్యాలయం వరకు వెళ్లింది. అక్కడి అత్యున్నత అధికారులు జరిగిన అంశంపై నివేదిక కోరారు. ఆద్యంతం ప్రతి అంశాన్నీ వివరిస్తూ నగర పోలీసులు రిపోర్టు కూడా సమర్పించారు. దీన్ని పరిశీలించిన ఆ కీలక కార్యాలయంలో ఇన్స్పెక్టర్ తప్పులేదని భావించింది. అయినప్పటికీ ఎమ్మెల్యే ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు తీసుకువచ్చారు. ఇన్స్పెక్టర్ను బదిలీ చేయించారు. కబ్జాపై కేసు, దర్యాప్తు, అరెస్టుకు ఆదేశించిన ఉన్నతాధికారులు చేతులెత్తేశారు. ఎమ్మెల్యే ఒత్తిడి తట్టుకోలేక సదరు ఇన్స్పెక్టర్ను బదిలీ చేస్తూ మరో పోలీసుస్టేషన్లో ఎస్హెచ్ఓగా నియమించారు. నగరంలో ముగ్గురు ఇన్స్పెక్టర్ల బదిలీ.. నగర కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న ముగ్గురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హబీబ్‌నగర్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న ఎం.నరేందర్‌ను బంజారాహిల్స్‌కు బదిలీ చేశారు. ఇక్కడ ఉన్న కె.నాగేశ్వర్రావుకు మారేడ్‌పల్లి ఠాణా స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. మారేడ్‌పల్లి ఇన్స్పెక్టర్ ఎం.మట్టయ్యను సీసీఎస్‌కు మార్చారు. (చదవండి: ఫారిన్ ట్రేడింగ్ మాయాజాలం.. రూ.152 కోట్లతో పలాయనం) -
Anakapalle: అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు
-
ములుగు జిల్లాలో గిరిజనుల ఆందోళన
-
హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న భూ మంత్రగాళ్లు
‘శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాతంరాయిలో సర్వే నంబర్ 2,5,6లలోని ఫిరంగి నాలాలో అర్ధరాత్రి మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. చారిత్రక ఫిరంగి నాలాను అపర్ణ, సుమధుర కన్స్ట్రక్షన్ సంస్థలు ధ్వంసం చేసి భారీ నిర్మాణాలు చేపడుతున్నాయని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వీటిని ఆపాలని కోరుతూ ఎంపీటీసీ మాజీ సభ్యుడు నరేందర్ రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్, నీటిపారుదలశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సహా సీఎల్పీ నేత భట్టివిక్రమార్కలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు’ ‘కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 19, 20లలో నివాస గృహాల మధ్య ఎలాంటి అనుమతుల్లేకుండా గోదాములు, ఫంక్షన్‌హాళ్లు నిర్మిస్తున్నారు. పాటు కాల్వను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతుండటంతో వర్షపు నీరు నిలిచిపోయి మహిళా సమాఖ్య భవనం దెబ్బతిందని, ఈ నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని స్థానికుడు శివకుమార్ ఇటీవల మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం’ సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ యంత్రాంగం ఒకవైపు అక్రమార్కులపై కొరడా ఝుళిపిస్తుంటే.. మరో వైపు ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వ భూములు, చెరువు శిఖం, నాలాలపై నిర్మాణాలు వెలుస్తూనే ఉన్నాయి. పాత పంచాయతీల నుంచి అనుమతులు తీసుకుని, కొత్తగా నిర్మాణాలు చేపడుతూనే ఉన్నారు. వీటిని గుర్తించి అడ్డుకుంటున్న క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. వాటి జోలికి వెళ్లొద్ధంటూ హుకుం జారీ చేస్తున్నా.. టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇప్పటికే శివారు జిల్లాల్లో వందకుపైగా నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు తెలిసింది. అయినా అక్రమ వెంచర్లు, భవన నిర్మాణాలు ఆగకపోగా.. మరిన్ని వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. వీటి వెనుక బడా కార్పొరేట్ సంస్థలు, ప్రజాప్రతినిధులు ఉండటమే కా రణమని టాస్క్‌ఫోర్స్ బృందాలు అభిప్రాయపడుతున్నాయి. 16 మున్సిపాలిటీల పరిధిలో.. ► రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నాలుగు వేలకుపైగా వెంచర్లు ఉన్నట్లు సమాచారం. 16 మున్సిపాలిటీల పరిధిలో 1397 లే అవుట్లు ఉండగా, వీటిలో 380 లేఅవుట్లకు మాత్రమే హెచ్ఎండీ అనుమతులు ఉన్నాయి. మిగిలిన వాటికి ఎలాంటి అనుమతులు లేవు. వీటిలో రెండు వేలకుపైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించి నోటీసులు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ► వీటిలో ఎక్కువగా మణికొండ, నార్సింగి, తుర్కయాంజాల్, హయత్‌నగర్, మీర్పేట్, బడంగ్ పేట్ మున్సిపాలిటీల పరిధిలోనే ఎక్కువ ఉన్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ ఏటా 12 వేల నిర్మాణాలకు, హెచ్ఎండీఏ ఏటా నాలుగు వేల నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నాయి. జీ+పోర్కు అనుమతులు తీసుకుని, అంతకంటే ఎక్కువ అంతస్తులు నిర్మిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ► ఇలా వీటి పరిధిలో అయిదు వేలకుపైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో కొనుగోలుదారులంతా ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఉన్న అక్రమ నిర్మాణాలను డిసెంబర్ 31లోగా అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆ పనుల్లో వేగం పెంచారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తున్న అధికారులకు అండగా నిలబడాల్సిన ప్రజాప్రతినిధులు కూల్చివేతలను ఆపాల్సిందిగా కోరుతూ క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. మచ్చుకు కొన్ని కూల్చివేతలు.. ► మణికొండ మున్సిపాలిటీ అల్కాపూర్ రోడ్ నంబర్– 2లో అనుమతించిన దానికన్నా అదనంగా నిర్మించిన అంతస్తులను కూల్చివేశారు. పైపులైన్ రోడ్డులో అయిదు అంతస్తులకు అనుమతి పొంది ఆరు అంతస్తులు నిర్మిస్తుండగా, అధికారులు గుర్తించి కూల్చివేతలు చేపట్టారు. ► నార్సింగ్ పరిధిలోని పంచవటి లక్ష్మీసాయి లేఅవుట్లో రహదారిని ఆక్రమించి నిర్మించిన ప్రహరీ సహా బుల్కాపూర్ నాలా బఫర్‌జోన్‌లో చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు. ► శంషాబాద్ మున్సిపాలిటీ సహా ఆ పరిసర ప్రాంతాల్లోని గ్రామాలన్నీ 111 జీఓ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ► తొండుపల్లి, ఊట్పల్లి, రాళ్లగూడ, గొల్లపల్లిల్లో భారీ నిర్మాణాలు, గోదాములు నిర్మించారు. కేవలం మున్సిపాలిటీ పరిధిలోనే 146 అక్రమ నిర్మాణాలు గుర్తించి, ఆ మేరకు జిల్లా టాస్క్‌ఫోర్స్‌కు నివేదించారు. ► ఇబ్రహీంపట్నం శేరిగూడలోని వార్డు నంబర్ 14, 16లలో అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న రెండు భవనాలను అధికారులు కూల్చివేశారు. ► శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంనగర్ కాలనీలో అక్రమంగా రోడ్డును ఆక్రమించి నిర్మిస్తున్న ఓ నిర్మాణంతో పాటు అదే కాలనీలో అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న మరికొన్ని భవనాలకు నాలుగు రోజుల క్రితం అధికారులు నోటీసులు జారీ చేశారు. ► కొందుర్గు గ్రామ పంచాయతీ పరిధిలో 23 అక్రమ నిర్మాణాలతో పాటు మరో 11 అక్రమ వెంచర్లను అడ్డుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో పంచాయతీ కార్యదర్శిపై జిల్లా అధికారులు వేటువేశారు. ► ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఓ వెంచర్లో ప్రజావసరాలకోసం వదిలిన పార్కు స్థలాల స్థిరాస్తి వ్యాపారులు ఆ తర్వాత ఆ çస్థలాన్ని 44 ప్లాట్లు చేసి 12 మందికి విక్రయించినట్లు అధికారులు గుర్తించి, ఆయా ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు రద్దు చేయాల్సిందిగా కలెక్టర్ అమయ్‌కుమార్ సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ► పెద్ద అంబర్పేట్ సర్వే నంబర్ 47, 48లలో ప్రహరీ సహా పసుమాములలోని సర్వే నంబర్ 91(పి), 96(పి)లలో అనుమతి లేని వెంచర్లో నిర్మిస్తున్న ప్రహరీలను కూల్చివేశారు. -
అసోంలో ఆక్రమణదారులపై పేలిన పోలీసు తూటా
గువాహటి: అసోంలోని దరాంగ్ జిల్లా సిఫాజర్‌లో ఆక్రమణదారుల తరలింపు ప్రక్రియ హింసాత్మకంగా మారింది. పోలీసులకు, నిరసనకారులకు మధ్య గురువారం జరిగిన ఘర్షణలు రణరంగాన్ని తలపించాయి. ఖాకీల తూటాలకు ఇద్దరు నిరసనకారులు ప్రాణాలు కోల్పోగా, చాలా మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వ్యవసాయానికి సంబంధించిన ఒక ప్రాజెక్టు కోసం కావల్సిన భూసేకరణలో భాగంగా ధోల్పూర్లోని సిఫాజర్‌లో 800 కుటుంబాలను తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ స్థలమే అయినప్పటికీ కొన్ని దశాబ్దాల నుంచి ఆ కుటుంబాలు అక్కడే నివాసం ఉంటున్నాయి. చదవండి: తెలంగాణ శాసన సభాసమరానికి సర్వం సిద్ధం వారిని అక్కడ్నుంచి ఖాళీ చేసే ప్రక్రియ సోమవారం నుంచి ప్రభుత్వం మొదలు పెట్టింది. అయితే దీనిని వ్యతిరేకించిన ఆ కుటుంబాలు తమకు పునరావాసం కల్పించాలంటూ నిరసనలకు దిగారు. వారిని చెదరగొట్టడానికి లాఠీలు, తుపాకీలతో పోలీసులు క్రౌర్యాన్ని ప్రదర్శించారు. విచక్షణా రహితంగా నిరసనకారుల్ని చితకబాదడమే కాకుండా వారిపై నేరుగానే కాల్పులు జరిపారు. ఈ ఘర్షణలన్నింటినీ వీడియో తీయడానికి జిల్లా యంత్రాంగం నియమించిన కెమెరామ్యాన్ విజయ్‌శంకర్ బనియా నిరసనకారులపై అత్యంత దారుణంగా ప్రవర్తించారు. బుల్లెట్ గాయంతో ప్రాణాలు కోల్పోయి నేలపై పడి ఉన్న ఒక వ్యక్తిని విజయ్‌శంకర్ కాళ్లతో తన్నిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ప్రభుత్వం ఆ కెమెరామ్యాన్ అరెస్ట్ చేసింది. ఈ ఘటనలపై తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తంకావడంతో అస్సాం ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. మరోవైపు నిరసనకారులు పోలీసులపైకి పదునైన ఆయుధాలు, రాళ్లతో దాడి చేశారని, వారు చేసిన దాడిలో ఎనిమిది మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని దరాంగ్ ఎస్పీ, ముఖ్యమంత్రి హిమాంత్ బిశ్వా సోదరుడు సుశాంత్ బిశ్వా శర్మ చెప్పారు. గువాహటి మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మొనిరుద్దీన్ పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని సద్దామ్ హుస్సేన్, షేక్ ఫోరిడ్‌గా గుర్తించారు. అస్సాం ప్రభుత్వమే కాల్పుల్ని స్పాన్సర్ చేస్తోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. బీజేపీ సర్కార్ అధికారంలోకొచ్చాక ప్రజలపై వేధింపులు పెరిగినట్లు అస్సాం పీసీసీ అధ్యక్షుడు భూపేన్ బోరా అన్నారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం -
ఈటలపై చర్యలు ఏమయ్యాయి?
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ అసైన్డ్ భూములను ఆక్రమించారని, అవినీతికి పాల్పడ్డారని హడావుడి చేసి ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈటల బీజేపీలో చేరిన తర్వాత దాని గురించి ఆయన ఎందుకు మాట్లాడడం లేదని, విచారణ నివేదికలు ఎటు పోయాయని నిలదీశారు. ఆదివారం గాంధీభవన్‌లో కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ ఎంపీ మల్లు రవిలతో కలిసి ఆయన మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ టీఆర్ఎస్, బీజేపీలవి కొనుగోలు రాజకీయాలని మండిపడ్డారు. ఈటల బీజేపీలో చేరిక సందర్భంగా ఆయనతో చర్చించేందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వచ్చిన ప్రైవేట్ విమానం కేసీఆర్ ఏర్పాటు చేసిందేనని ఆరోపించారు. బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ల యాత్రలపై స్పందిస్తూ అవి బీజేపీలోని కేసీఆర్ అనుకూల, వ్యతిరేక వర్గాలు చేస్తున్న యాత్రలని దుయ్యబట్టారు. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక వ్యవహారం దామోదర రాజనర్సింహ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ చూసుకుంటుందన్నారు. తాను రావిర్యాల సభలో మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయమైనవి కావని, ఐపీఎస్ అధికారిగా ఆయన పనితీరు గురించి మాత్రమే మాట్లాడానని చెప్పారు. బీఎస్పీతో కలిసి పనిచేయాలన్న చర్చ తమ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో జరగలేదని చెప్పారు. సీఎం హోదాలో కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాల్లో అభివృద్ధి శూన్యమని, మేడ్చల్ జిల్లాలోని మూడుచింతలపల్లి కూడా అదే కోవలోకి వస్తుందని, ఆ గ్రామంలో ఎంత అభివృద్ధి జరిగిందో తాము మీడియాకు చూపిస్తామన్నారు. ఇందుకోసమే ఆ గ్రామంలో 24, 25 తేదీల్లో దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష చేపడుతున్నామని చెప్పారు. మూడో అడుగు ఖాయం మూడో అడుగు కేసీఆర్ నెత్తిమీద పెట్టడం ఖాయమని రేవంత్ వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాను గజ్వేల్‌కు వెళ్లడం ఖాయమన్నారు. గజ్వేల్‌లో ఉప ఎన్నికలు రావాలంటే ముందు కేసీఆర్ రాజీనామా చేయాలి కదా అని ఓ ప్రశ్నకు బదులిచ్చిన రేవంత్.. గజ్వేల్‌కు ఉప ఎన్నికలు వస్తే తాను పోటీ చేయాలా వద్దా అనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. టీపీసీసీ పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటుకు కొంత సమయం పడుతుందని, ఇప్పుడు ప్రజాసమస్యలపైనే కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టిందని చెప్పారు. -
‘ఈటల ఆక్రమించిన దళిత భూములు తిరిగి ఇవ్వాలి : మోత్కుపల్లి
-
కిటికీలోంచి కారం చల్లి, పెట్రోల్‌తో దాడి
సాక్షి, జవహర్‌నగర్: మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్‌నగర్ మున్సిపాలిటీలో అక్రమ కట్టడాల కూల్చివేతల్లో గురువారం ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించేందుకు వెళ్లిన కమిషనర్ మంగమ్మ, కాప్రా తహసీల్దార్ గౌతమ్‌కుమార్, జవహర్‌నగర్ ఠాణా సీఐ పి.భిక్షపతిరావును లక్ష్యంగా చేసుకుని కబ్జాదారులు రెచ్చిపోయారు. పెట్రోల్, కారం పొడితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సీఐ భిక్షపతి చేతులకు, కాళ్లకు మంటలు అంటుకున్నాయి. అలాగే కార్పొరేషన్ సిబ్బంది, జవహర్‌నగర్ ‘సాక్షి’ విలేకరి సురేందర్‌కు గాయాలయ్యాయి. చదవండి: భాగ్య పెళ్లి.. ప్రతి ఒక్కరినీ కదిలిచింది.. ఘటన నేపథ్యమిదీ.. జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ 432లో 1,500 గజాల స్థలాన్ని మహిళల కోసం పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలని 6 నెలల కింద అప్పటి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ భూమిపై కన్నేసిన కబ్జాదారులు రాత్రికి రాత్రే గదులు నిర్మించడంతో ఎమ్మార్వో గౌతమ్‌కుమార్ నేతృత్వంలోని బృందం నేలమట్టం చేసింది. అప్పటినుంచి ఆ భూమిని తాత్కాలిక డంపింగ్ కేంద్రంగా మున్సిపల్ అధికారులు వాడుతున్నారు. అయినా కూడా జవహర్‌నగర్ వాసి పూనమ్ చంద్ కుటుంబం మళ్లీ రెండు గదులు నిర్మించి ఆ భూమిని దక్కించుకోవాలని ప్లాన్ చేశారు. అయితే వాసం వెంకటేశ్వర్లు స్థానంలో కలెక్టర్‌గా వచ్చిన శ్వేతా మహంతి ఆ భూమిలో మహిళల కోసం షీ టాయిలెట్స్ పనులు చేపట్టాలంటూ మళ్లీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారం రోజుల కింద ఇక్కడకు వచ్చిన కార్పొరేషన్ అధికారులను పూనమ్ చంద్ కుటుంబసభ్యులు చనిపోతామంటూ బెదిరించడంతో వెనుదిరిగారు. తీవ్ర ఉద్రిక్తత.. మళ్లీ గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో 20 నుంచి 30 మంది పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆ రెండు గదులను కూల్చేందుకు వచ్చారు. జేసీబీ యంత్రాలతో తొలగించేందుకు సిద్ధం అవుతుండగా పూనమ్ చంద్, శాంతి కుమారి ఆ గదిలోకి వెళ్లి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని గడియపెట్టుకున్నారు. ఇది గమనించిన ఎస్సై సైదులు, ఇతర సిబ్బంది అక్కడికి వెళ్లగా, గది కిటికీలోంచి కారం పొడి చల్లారు. కర్రలకు బట్టలుచుట్టి వాటిపై పెట్రోల్ పోసి నిప్పంటించి బయటకు విసిరారు. ఆ వెంటనే అక్కడికి చేరుకున్న స్థానిక రాజకీయ పార్టీ నేతలు పూనమ్ చంద్ కుటుంబసభ్యులకు మద్దతు పలికారు. ‘వారు చస్తారు. లేదంటే చంపుతారు’ అంటూ రెచ్చొగొట్టేలా నినాదాలు చేశారు. అప్పటికే సాయంత్రం 6.30 గంటలైంది. సీఐ భిక్షపతి నేతృత్వంలోని పోలీసులు అక్కడి నుంచి అందరినీ చెదరగొట్టారు. అయితే గది లోపల కాగడాల మంటలు ఉండటంతో పూనమ్ చంద్ కుటుంబసభ్యులకు ఏమైనా అవుతుందని సీఐ తలుపులను కాళ్లతో తన్నారు. వెంటనే ఆ గదిలో ఉన్న శాంతి కుమారి నేరుగా పెట్రోల్ చల్లడంతో సీఐ భిక్షపతిపై పడింది. కుట్ర కోణంలో విచారణ: రాచకొండ సీపీ గదిలో నుంచి పొగలు వస్తున్నాయని సీఐ భిక్షపతి తలుపు తెరిచేందుకు యత్నించాడు. తలుపు తెరుచుకున్న వెంటనే లోపలి నుంచి మంటలు వచ్చాయి. ఎవరైనా అతడి మీద దాడి చేశారా.. అనేది పోలీసు విచారణలో తేలుతుంది. ఈ ఘటనలో కుట్ర కోణంతో పాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం. గదిలో ఉన్న శాంతికుమారి, పూనమ్‌చంద్‌లకు ఏమీ జరగలేదు. కేసు విచారణ కోసం వారిని అదుపులోకి తీసుకున్నాం. సీఐ భిక్షపతికి చేతులు, కాళ్లు 14 నుంచి 15 శాతం వరకు కాలాయి. – రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ -
గో కార్ట్ నిర్మాణాలను కూల్చేసిన జీవీఎంసీ అధికారులు
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ అధికారులు మంగమారి పేట వద్ద స్వాధీనం చేసుకున్న గో కార్ట్ ప్రదేశం అక్రమాలకు.. ఆక్రమణలకు కేరాఫ్‌గా చెప్పుకోవచ్చు. విశాఖ భీమిలి బీచ్ రోడ్లో ఉన్న గో కార్ట్ చిన్నారులు నుంచి యువత వరకు కార్.. గో కార్ట్ పోటీలు నిర్వహిస్తుంటారు. పదినిమిషాల రేస్‌కు 300 నుంచి వసూలు చేసేవారు. ఈ దశలో సముద్రతీరానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. నిజానికి వుడా పరిధిలో ఉన్న గో కార్ట్ గ్రూప్ నిర్మాణాలకు సంబంధించి జీవీఎంసీ అనుమతులు తీసుకోవాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే ఏళ్ళతరబడి కార్ట్ పోటీలు నిర్వహించడమే కాక అక్కడ రెస్టారెంట్ కూడా కొనసాగిస్తున్నారు. సర్వేనెంబర్ 299, 301 పరిధిలోని దాదాపు నాలుగు ఎకరాల 48 సెంట్ల భూమిలో అక్రమ వ్యవహారం కొనసాగుతున్నట్టు గతంలో ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఈ దశలో జీవీఎంసీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించారు. గేమ్ ఆడేందుకు వచ్చిన పర్యాటకుల కోసం అనధికారికంగా కొనసాగిస్తున్న టీ రెస్టారెంట్‌ను కూడా తొలగించారు. ఇదే రీతిన అనధికారిక నిర్మాణాలు అన్నిటినీ తొలగిస్తామని జీవీఎంసీ టౌన్ ప్లానింగ్డీసీపీ అధికారి వెల్లడించారు. (ఆయన దారి.. జాతీయ రహదారి) కాగా.. గో కార్ట్ నిర్వాహకుడు కాశీవిశ్వనాథ్ వ్యవహారాలపై చాలా ఆరోపణలు ఉన్నాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడిగా పలు అనధికారిక వ్యవహారాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అందులో భాగంగా గో కార్ట్‌తో పాటు రుషికొండ వద్ద టూరిజం ప్రదేశంలో రేవ్ పార్టీ నిర్వహించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ మేరకు రుషికొండ వద్ద జరిగిన ఓ పార్టీలో మద్యం సేవించిన వ్యవహారంపై 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో గో కార్ట్ నిర్వాహకులు కాశీ విశ్వనాథ్ తనయుడు కూడా ఉన్నాడు. ఆ పార్టీ సమయంలో డ్రగ్స్ కూడా వినియోగించిన వ్యవహారంపై ఆరీలోవ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా ఉండగా గో కార్ట్ ప్రదేశంలో కూడా బెట్టింగ్‌లు జరిగినట్టు చాలా వరకూ ఆరోపణలున్నాయి ఈ దశలో ఈ నిర్మాణం తొలగించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
‘జగత్’ కంత్రీలు.. వెలుగులోకి 'భూమా'య..
ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పుకునే వారే కబ్జాదారుడికి అండగా నిలిచారు. పీర్ల మాన్యం ఆక్రమణలో తమ వంతు పాత్ర పోషించారు. ఆక్రమిత స్థలంలో డెయిరీ నిర్మాణాన్ని సైతం చేపట్టారు. బాధిత ప్రజలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ‘భూ మా’య విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. సాక్షి, నంద్యాల: ఆళ్లగడ్డ పట్టణంలోని సర్వే నం. 67లో 6.40 ఎకరాల పీర్ల మాన్యం భూమి ఉంది. దీన్ని ముల్లా మక్తుమ్ సాహెబ్ వారసులు అనుభవించేవారు. ఈ భూమిపై వచ్చే ఆదాయంతో పీర్ల చావిడి సేవలు, పండుగలు ఘనంగా జరిపేవారు. అయితే ఈ భూమిపై భూమా అఖిలప్రియ అనుచరుడు కోతమిషన్ షరీఫ్ కన్ను పడింది. ముల్లా కుటుంబ సభ్యులను భయపెట్టి మాన్యాన్ని కబ్జా చేశారు. ఈ భూమిని తిరిగి ఇవ్వకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికతో ఇళ్లను నిర్మించారు. వీటిని కొంత మందికి అమ్మేశారు. మరికొంత స్థలంలో భూమా కుటుంబ సభ్యులు జగత్ డెయిరీని నిర్మించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని 67 సర్వే నంబరులో రికార్డుల ప్రకారం ఏయే నిర్మాణాలు ఉన్నాయో తెలపాలని ముల్లా కుటుంబం రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సర్వే నంబరులో ఇళ్లు, జగత్ డెయిరీ, బీబీఆర్ స్టేడియం, షాదీఖానా, రోడ్లు, జగత్ డెయిరీ ఫార్మా నిర్మాణాలు ఉన్నాయని, 4.50 ఎకరాలు ఖాళీ స్థలం ఉందని ఆళ్లగడ్డ తహసీల్దార్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. మాన్యం భూమిలో 0.66సెంట్లు ఆక్రమించి జగత్ డెయిరీ ఫార్మా నిర్మించినట్లు తేలింది. పీర్ల మాన్యం మొత్తం ఆక్రమణలో ఉన్నా.. రెవెన్యూ, వక్ఫ్‌బోర్డు అధికారులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పుకునే టీడీపీ ఆళ్లగడ్డ నియోజకవర్గ ఇన్చార్జ్ భూమా అఖిలప్రియ సైతం నోరుమెదపడం లేదు. (అఖిలా.. ఇన్నాళ్లూ ఎక్కడికెళ్లావ్?) ముస్లింలకు న్యాయం చేయాలి భూమా అఖిలప్రియ మాటలు, చేష్టలు వేర్వేరుగా ఉన్నాయి. ముస్లింలపై ఎనలేని ప్రేమ కురిపిస్తున్నట్లు మాట్లాడుతారు. ఆళ్లగడ్డలో మాత్రం ముస్లింలకు చెందిన భూములను ఆక్రమించుకొని, అందులో కట్టడాలు నిర్మిస్తారు. ఆళ్లగడ్డలో పీర్ల మాన్యం ఆక్రమించుకున్న వారిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకొని ముస్లింలకు న్యాయం చేయాలి. – శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే కలెక్టర్‌కు ఫిర్యాదు.. పీర్ల మాన్యం ఆక్రమణకు గురైందని, తమకు న్యాయం చేయాలని ముల్లా కుటుంబ సభ్యులు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డిని కోరారు. ముల్లా కుటుంబీకులతో కలిసి ఇరువురు ఎమ్మెల్యేలు గురువారం జిల్లా కలెక్టర్ వీరపాండియన్‌కు వినతి పత్రం అందించారు. పీర్ల మాన్యాన్ని భూమా అనుచరుడు ఆక్రమించడంతో ఆదాయం కోల్పోయి పీర్ల పండుగ ఘనంగా నిర్వహించలేకపోతున్నామని ముల్లా వంశస్తులు మహబూబ్‌బాషా, గౌస్‌మొద్దీన్, ముక్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేనెంబరు 67లో ఉన్న 6.40 ఎకరాల పీర్ల మాన్యం తమకు అప్పగించి న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. (నిన్ను చంపితేగాని చైర్మన్ పదవి రాదు: భూమా విఖ్యాత్‌రెడ్డి) విచారణ జరపండి.. ఆళ్లగడ్డ పట్టణంలోని పీర్ల మాన్యం ఆక్రమణ విషయంపై జిల్లా కలెక్టర్ వీరపాండియన్ వెంటనే స్పందించారు. ఆళ్లగడ్డ తహసీల్దార్‌కు ఫోన్ చేసి, రికార్డులను పరిశీలించి విచారణ జరపాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఇన్చార్జ్ భూమా అఖిల ప్రియ సైతం నోరు మెదపడం లేదు ముస్లింల మాన్యం భూమిని ఆక్రమించుకొని అందులో జగత్ డెయిరీని నిర్మించుకున్న భూమా అఖిలప్రియకు ముస్లింల గురించి మాట్లాడే అర్హత లేదు. ముస్లింలపై మీకు నిజంగా ప్రేమ, అభిమానం ఉంటే పీర్ల మాన్యంలో నిర్మించుకున్న కట్టడాలను తీసివేసి స్థలం వారికి ఇవ్వాలి. ముస్లిం కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేశారు. భూమా కుటుంబ సభ్యులు మాత్రం శవ రాజకీయాలు చేస్తున్నారు. – గంగుల బిజేంద్రారెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే -
'గీతంకు విద్యా దాహం కంటే భూ దాహం ఎక్కువైంది'
సాక్షి, విశాఖపట్నం: గీతం భూముల విషయంలో కోర్టు ఆర్డర్‌ను టీడీపీ వక్రీకరించి ప్రచారం చేస్తోందని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 'నారా లోకేష్ తోడల్లుడు, బాలకృష్ణ అల్లుడు భరత్‌కు చెందిన గీతం విద్యా సంస్థల ప్రాంగణంలో ఆక్రమిత ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే టీడీపీ రాజకీయం చేస్తోంది. 70 రోజులు జైళ్లో ఉన్న అచ్చెన్నాయుడు కూడా గీతం భూములపై మాట్లాడుతున్నారు. విశాఖలో ఆక్రమిత భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రజలు ఎన్నో సార్లు విజ్ఞప్తి చేశారు. గీతం ఆధీనంలోని 40 ఎకరాల ఆక్రమిత భూమి ప్రభుత్వ స్వాధీనం చేసుకోవడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. (గీతం అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు) గీతం యాజమాన్యం కోర్టు ఆర్డర్‌ను కూడా వక్రీ కరించి ప్రచారం చేస్తోంది. రిట్ పిటిషన్ గీతం ఆధీనంలో ఉన్న శాశ్వత నిర్మాణాలు మాత్రమే తొలగించవద్దు అని కోర్టు సూచించింది. కానీ టీడీపీ పచ్చమీడియా కోర్టు ఆర్డర్లను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తోంది. ఆగస్టు 3న సీఎం వైఎస్ జగన్‌కి గీతం యాజమాన్యం తమ ఆధీనంలోని 43 ఎకరాలు క్రమబద్ధీకరించాలని కోరింది. ఇప్పటికే సర్కారు నుంచి 71 ఎకరాలు తీసుకుని ఇంకా భూమి కావాలని కోరింది. గీతం యాజమాన్యం తన సొంత భూమి రియల్ ఎస్టేట్ అవసరాల కోసం ఖాళీగా ఉంచుకుంది. గీతం యాజమాన్యానికి విద్యాదాహం కంటే భూదాహం ఎక్కువగా కనిపిస్తుంది. వేల కోట్ల విలువ చేసే భూములను ఆక్రమించి క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని కోరడం సరికాదు. పేదల కోసం ప్రభుత్వం ఉచితంగా స్థలాలు ఇస్తుంది కానీ ఇలా భూ దాహం వున్న వ్యక్తులకు ఇవ్వలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఆఖరి క్యాబినెట్లో గీతం భూముల క్రమబద్దీకరణ అంశాన్ని అప్పటి క్యాబినెట్ వాయిదా వేసింది. గీతం నుంచి స్వాధీనం చేసుకున్న విలువైన భూములను ప్రజా అవసరాలకు ప్రభుత్వం వినియోగిస్తుంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములు ఉన్నాయని విమర్శలు చేసే టీడీపీ నాయకులు రుజువు చేయాలి. టీడీపీ అవినీతి విశ్వవిద్యాలయాన్ని నడిపిస్తోంది. చంద్రబాబు నాయుడు అవినీతి, అక్రమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి తాపత్రయపడుతున్నారు' అంటూ గుడివాడ అమరనాథ్ చంద్రబాబు తీరును ఎండగట్టారు. (చంద్రబాబు బంధువులు అయితే..) -
టీడీపీ కార్యాలయం కూడా ఆక్రమణలోనే..
సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్సిటీ ఆక్రమణలో 40 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. భూ ఆక్రమణలపై అధికారులు వారి బాధ్యతను వారు నిర్వహిస్తే టీడీపీ నేతలు ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. నారా లోకేష్ తోడల్లుడు, బాలకృష్ణ అల్లుడు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడి భూమి స్వాధీనం చెసుకుంటే టీడీపీ నేతలు ఎందుకు గోగ్గులు పెడుటున్నారని దుయ్యబట్టారు. రూ.800 కోట్లు విలువ చేసే 40 ఎకరాలు భూమిని గీతం యూనివర్సిటీ అక్రమించిందని, భూ ఆక్రమణలు తొలగిస్తే టీడీపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గీతం యూనివర్సిటీ ఆక్రమించిన భూమిపై కోర్టులో కేసుల్లో లేదు, ఓ ప్రైవేట్ యాజమాన్యం భూమి అక్రమిస్తే వాటిని స్వాధీనం చేసుకోవడం తప్పా అని మండ్డిపడ్డారు. టీడీపీ పొలిట్‌బ్యూరోలో ఉన్నవారంతా అత్యంత అవినీతికి పాల్పడ్డవారే అని, ఈఎస్ఐ స్కామ్‌లో ఉన్న అచ్చెన్నాయుడికి టీడీపీ అధ్యక్ష పదవి ఇచ్చిందని దుయ్యబట్టారు. భూములు కాజేసినవారికే టీడీపీలో పదవులు ఇస్తున్నారని, టీడీపీ కార్యాలయం కూడా ఆక్రమణలోనే ఉందన్నారు. ఆక్రమించిన భూమికి నోటీసీలు ఇవ్వకుండా, వందల కోట్ల విలువ చేసే భూమి అక్రమిస్తే చూస్తూ ఉరుకోవాలా అని నిలదీశారు. ప్రభుత్వం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై కక్ష సాధింపుతో టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. విశాఖలో ఆక్రమణకు గురైన విలువైన భూములు కాపాడుతామని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. టీడీపీ హయంలో వేసిన సిట్ వాస్తవాలు బైటకు రాలేదని, గజం భూమి కూడా సీఎం వైఎస్ జగన్ పాలనలో కబ్జాకు గురికాదని అన్నారు. చదవండి: గీతం యూనివర్సిటీలో ఆక్రమణల తొలగింపు గీతం యూనివర్సిటీలో గాంధీ పేరు చెప్పుకొని గాడ్సే పనులు జరుగుతున్నాయని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు మండిపడ్డారు. విలువైన భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో విశాఖ ప్రజల్లో సంతోషం ఉందని తెలిపారు. గీతంలో ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున విశాఖలో భూములను మింగేశారని అన్నారు. మాజీ మేయర్ సబ్బంహరితో పాటు పలువురు ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీ యాజమాన్యం గాంధీ పేరు చెప్పుకొని గాడ్సే పనులు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ భూములు ఎవరు ఆక్రమించినప్పటికీ తిరిగి స్వాధీనం చేసుకోవడం ఖాయం అన్నారు. ఆక్రమణలు తొలగిస్తే రాజకీయం చేయడం తగదని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ పేర్కొన్నారు. -
కబ్జా చెరలో పాలేరు జలాశయం
కూసుమంచి: పాలేరు రిజర్వాయర్ (జలాశయం) బ్యాక్ వాటర్ ప్రాంతం క్రమక్రమంగా కుదించుకుపోతోంది. ఏటా రిజర్వాయర్ చుట్టూ ఉన్న రైతులు రిజర్వాయర్ భూమిని మాగాణులుగా మార్చుతున్నారు. దీంతో దాని విస్తీర్ణం క్రమంగా తగ్గుతూ వస్తోంది. అవకాశం ఉన్న చోటల్లా రైతులు రిజర్వాయర్ భూమిని తమ భూముల్లో కలుపుకుపోతున్నారు. కొందరైతే ఏకంగా పట్టాలే పొందినట్లు సమాచారం. మండలంలోని పాలేరు రిజర్వాయర్ జిల్లాకే వరప్రదాయినిగా మారింది. ఈ రిజర్వాయర్ ద్వారానే జిల్లాకు సాగునీరు, తాగునీరు సరఫరా అవుతోంది. వంతాలి మత్స్యకారులకు ఆధారమైంది. సుమారు 6,500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రిజర్వాయర్ కొన్నేళ్లుగా ఆక్రమణలకు గురవుతుండగా ఏటేటా విస్తీర్ణం తగ్గిపోతోంది. మాగాణులుగా.. పాలేరు రిజర్వాయర్ ఇటు కూసుమంచి మండలంతో పాటు అటు సూర్యాపేట జిల్లాలోని మోతె మండలం వరకు విస్తరించి ఉంది. ఈ రిజర్వాయర్ ముఖ భాగం నాయకన్‌గూడెం, పాలేరు గ్రామాల వద్ద రాష్ట్రీయ రహదారికి ఆనుకుని ఉంది. ఇక చివరి భాగం (బ్యాక్ వాటర్ ప్రాంతం) కూసుమంచి, మోతె మండలాల్లోని సుమారు 15 గ్రామాల వరకు విస్తరించి ఉంది. దీంతో ఆయా గ్రామాలకు చెందిన రైతులకు రిజర్వాయర్ లోతట్టులో భూములు ఉన్నాయి. వారు తమ భూములను సాగు చేసుకుంటూనే రిజర్వాయర్ బ్యాక్‌వాటర్ ప్రాంతాన్ని కలుపుకుని మాగాణులుగా మార్చి తమ వ్యవసాయ భూముల్లో కలుపుకుంటున్నారు. రిజర్వాయర్ నిండినా వారు ఆక్రమించిన భూములు మునగకుండా ఎత్తుగా కట్టలు పోసి మడులుగా మార్చుతున్నారు. సంబంధిత అధికారులు గుర్తించ లేకపోవడం, గుర్తించినా కఠిన చర్యలు తీసుకోకపోవడంతో రైతులు తమ పనిని మానడం లేదు. ఇప్పటి వరకు రిజర్వాయర్ భూమిని వందలాది ఎకరాల్లో రైతులు ఆక్రమించి వ్యవసాయ భూములుగా మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరు రైతులు ఆక్రమించిన భూమికి ఏకంగా పట్టాలు పొందినట్లు సమాచారం. ఎన్నెస్పీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపంతో రెవెన్యూ అధికారులు ఆ భూములకు పట్టాలు ఇస్తుండటంతో ఎన్సెస్పీ అధికారులు ఏం చేయలేని పరిస్థితి నెలకొంటోంది. భవిష్యత్‌కు ప్రమాదం.. పాలేరు రిజర్వాయర్ జిల్లాలోనే అతిపెద్ద జలాశయంగా ఉంది. ఈ రిజర్వాయర్ 23 అడుగుల నీటి నిలువ కాగా 2.558 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుతం ఆక్రమణలతో విస్తీర్ణం తగ్గిపోతుండటంతో రిజర్వాయర్ ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. నీటి నిల్వ సామర్థ్యం ఏటేటా ఆక్రమణల వల్ల తగ్గుతుండటంతో రాబోయే రోజుల్లో సాగునీటికి, తాగునీటికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో సీతారామ ప్రాజెక్టు నీరు పాలేరు రిజర్వాయర్‌కు చేరితే అందుకు తగ్గ నీటినిల్వకు అవకాశం ఉండదని పలువురు భావిస్తున్నారు. ఆక్రమణలను చెరిపి రిజర్వాయర్ భూములను కాపాడితేనే నీటి నిల్వ పెరిగి అవసరాలకు అనుగుణంగా ఉంటుందని, ఆక్రమణలను అరికట్టాలని పలువురు ప్రజలు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటున్నాం.. పాలేరు రిజర్వాయర్ బ్యాక్‌వాటర్ ప్రాంతాన్ని కొందరు రైతులు ఆక్రమించుకుని వ్యవసాయ భూములుగా మార్చుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. మేం ఆ భూములను పరిశీలిస్తే కొందరు రైతులు తమకు పట్టాలు ఉన్నట్లు చూపుతున్నారు. ఆ భూములను మేం సర్వే చేయాలని రెవెన్యూ అధికారులను కోరాం. ఆక్రమణ భూముల వివరాలను సేకరించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటాం. -మన్మథరావు, డీఈఈ, ఓఅండ్ఎం, ఎన్నెస్పీ ఎఫ్టీఎల్ చూపితే హద్దులు నిర్ణయిస్తాం రిజర్వాయర్ ప్రాంతం ఆక్రమణకు గురవుతున్నట్లు ఎన్సెస్పీ అధికారులు మా దృష్టికి తీసుకువచ్చారు. వారు ముందుగా ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) ప్రాంతాన్ని గుర్తిస్తే మేం హద్దులు నిర్ణయిస్తాం. ప్రస్తుతం సర్వేయర్ల కొరత కూడా ఉంది. ఎఫ్టీఎల్ గుర్తించిన వెంటనే మేం హద్దులు పెట్టి ఆక్రమణలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం. -శిరీష, తహసీల్దార్, కూసుమంచి -
టీడీపీ నేత బరితెగింపు
బుచ్చెయ్యపేట(చోడవరం): మండలంలో ఎల్బీ పురానికి చెందిన ప్రభుత్వ భూమిని టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సోదరుడు ఆక్రమించాడు. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించడమే కాకుండా జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలు చేసిన సుమారు రూ.15 లక్షల విలువైన పనుల ప్రాంతంలో జేసీబీతో చదును చేయించడంపై పలువురు కూలీలు,రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన 109 సర్వే నంబరులో తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో ఈ భూమిని కొంతమంది ఆక్రమించి అన్యాక్రాంతం చేయడంపై పలువురు కలెక్టర్‌కు, సిట్‌లో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలు మేరకు అప్పటి తహసీల్దార్ కె.వి.వి. శివ, రెవెన్యూ సిబ్బంది సర్వే చేసి ప్రభుత్వ భూమిగా గుర్తించి, ఏవరైనా ఆక్రమిస్తే చర్యలు తీసికుంటామని హెచ్చరిస్తూ బోర్డు ఏర్పాటు చేశారు. రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసికుని ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో నమోదు చేయించారు. ఆరు నెలల కిందట ఇదే భూమిలో రూ.15 లక్షల వ్యయంతో జాతీయ ఉపాధి హామీ పథకం కింద వందల మంది కూలీలతో ట్రెంచ్‌లు,భూమి లెవిల్ పనులు చేయించారు. కూలీలు చేసిన పనులకు ఇంకా ఆడిట్ అవలేదని వీఆర్పీ మెల్లి సత్యనారాయణ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సోదరుడు ఆ భూమిని ఆక్రమించుకుని రెండు రోజులుగా జేసీబీతో చదును చేయించాడు. దీంతో గ్రామానికి చెందిన రైతు సంఘ నాయకులు తమరాన శ్రీను,సింహాచలంనాయుడు,గుర్రు రామునాయుడు తదితరులు శనివారం జేసీబీ అడ్డుకుని, వీఆర్వో త్రినాథ్‌కు, తహసీల్దార్ మహేశ్వరరావు, ఏపీవో, పీడీలకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఆదేశం మేరకు వీఆర్వో గ్రామాన్ని సందర్శించి, స్థలాన్ని పరిశీలించారు. వెంటనే పనుల నిలిపివేయాలని తెలిపారు. లక్షలు విలువ చేసే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవకుండా తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. -
టీడీపీ నాయకుడి వీరంగం..
సాక్షి, చీపురుపల్లి: మా పొలంలోకి మీరంతా ఎందుకొచ్చారు.. మీరేం చెయ్యగలరు.. కనీసం సెంటు భూమి కూడా తీసుకోలేరు.. ప్రభుత్వమే నేను.. నేనే ప్రభుత్వం.. నా సంగతి మీకు తెలియదు.. మీరు ఏమీ ......(పత్రికల్లో రాయకూడని భాష) లేరు.. అంటూ సాక్షాత్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు అనుచరుడు, లావేరు మండలం లింగాలవలసకు చెందిన టీడీపీ నాయకుడు లెంక నారాయణరావు చీపురుపల్లి మండల రెవెన్యూ అధికారులను బెదరించాడు. కర్లాం రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 302/21లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ గెడ్డ, రస్తా భూములను గుర్తించేందుకు ఆర్ఐ, సర్వేయర్, వీఆర్ఓ, వీఆర్ఏలు శుక్రవారం సర్వే చేపడుతున్నారు. ఇంతలో అక్కడకు చేరుకున్న నారాయణరావు అధికారులను తిడుతూ వీరంగం సృష్టించాడు. అంతేకాకుండా రెవెన్యూ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తూ భయాందోళనలకు గురి చేసే విధంగా వ్యవహరించడంతో ఆందోళన చెందిన రెవెన్యూ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. రెవెన్యూ అధికారులను మాత్రమే కాకుండా ఆ భూముల్లో గెడ్డ, రస్తా ఆక్రమణల విషయాన్ని బయటకు తీసిన పత్రికా విలేకరులపై కూడా బూతుల పురాణం అందుకున్నాడు. అయితే ఆ భూములు ఆ టీడీపీ నేతకు చెందిన సొంత భూములు కూడా కావు. ఆయనతో పాటు అతని సోదరులు మధ్యవర్తులుగా ఉంటూ ఇతరులకు అమ్మకాలు సాగించారు. ఆ భూముల్లో ఉన్న ప్రభుత్వ గెడ్డ, రస్తా ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తుంటే అసలైన భూమి యజమానులు రాకుండా, మధ్యవర్తిత్వం చేసిన ఈ టీడీపీ నేత, ఆయన సోదరులు వచ్చి రెవెన్యూ అధికారులపై హల్చల్ చేశారు. దీంతో ఆర్ఐ గౌతమ్, వీఆర్ఓ జగన్నాథం తమ విధులకు నారాయణరావు, తదితరులు ఆటంకం కలిగించారని చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గెడ్డ, రస్తాల ఆక్రమణల పర్వం... మండలంలోని కర్లాం రెవెన్యూ పరిధిలో గల సర్వే నంబర్ 284, 302, 304లలో 15.40 ఎకరాల జిరాయితీ భూమిని లింగాలవలసకు చెందిన టీడీపీ నేతలు లెంక నారాయణరావు, అబ్బినాయుడు, తదితరులు మధ్యవర్తిత్వం వహించి వారి బంధువులకు కొనుగోలు చేయించారు. ఆ జిరాయతీ భూముల చుట్టూ సర్వే నంబర్ 302/21లో 2.41 ఎకరాల గెడ్డ, 302/4లో 0.28 సెంట్లు రస్తాను కప్పేసి ఆ జిరాయితీ భూముల్లో కలిపేసుకున్నారు. ఆ సర్వే నంబర్లో ఎకరా పొలం విలువ దాదాపు రూ.15 లక్షల వరకు ఉండడంతో గెడ్డ, రస్తాలను కలిపేసుకునేందుకు ప్రణాళికలు రచించారు. గెడ్డ, రస్తా కలిపి 2.69 ఎకరాలు ఉండడంతో దాదాపు రూ.40 లక్షల వరకు ఆస్తి వరకు కలుస్తుందని భావించారు. అయితే గెడ్డను కప్పేయడం ద్వారా కర్లాం పరిధిలో గల పోలమ్మ చెరువుకు నీరు అందకుండా పోతుందని, దీంతో 300 ఎకరాలు ఆయకట్టు నష్టపోతుందని గ్రామస్తులు, పెద్దలు తహసీల్దార్‌కు గతంలో ఫిర్యాదు చేశారు. మూడు రోజులుగా సర్వే.. కర్లాం భూముల్లో ఆక్రమణలపై మూడు రోజులుగా రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఈ నెల 21న ప్రారంభమైన సర్వే శుక్రవారం వరకు కొనసాగింది. చివరకు శుక్రవారం మధ్యాహ్నం ఆక్రమణలు గుర్తించిన రెవెన్యూ అధికారులు జెండాలు పాతారు. అనంతరం సరిహద్దు రైతులు, పెద్దలతో స్టేట్మెంట్లు కూడా రికార్డు చేస్తున్నారు. ఇదే సమయంలో అక్కడకు చేరుకున్న లెంక నారాయణరావు అసహనంతో ఊగిపోయాడు. రెవెన్యూ అధికారులపై చిందులేశాడు. మీరేం చేయగలరంటూ నానా దుర్భాషలాడాడు. అధికారులను భయపెట్టేందుకు ప్రయత్నించడంతో వారు వెళ్లిపోయారు. పోలీసులకు ఫిర్యాదు .. కర్లాం భూముల్లో ఆక్రమణలు గుర్తించేందుకు వెళ్లిన తమపై లెంక నారాయణరావు దుర్భాషలాడుతూ, భయాందోళనకు గురిచేశాడని ఆర్ఐ గౌతమ్, మండల సర్వేయర్ ఎంఈ సత్యనారాయణ, వీఆర్ఓ జగన్నాథంలు తహసీల్దార్ పీవీ శ్యామ్‌సుందర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వారు ఉన్నత అధికారులతో చర్చించిన అనంతరం ఆర్ఐ గౌతమ్, వీఆర్ఓ జగన్నాథంలు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై చీపురుపల్లి ఏఎస్సై చిన్నారావు మాట్లాడుతూ ఆర్ఐ గౌతమ్, వీఆర్ఓ జగన్నాధం ఇచ్చిన ఫిర్యాదు మేరకు లెంక నారాయణరావుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
టీడీపీ నేతలు.. సాగించిన భూ దందా
సాక్షి, మార్టూరు: గత టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతలు సాగించిన భూ దందా అంతా ఇంతా కాదు. అధికారులను బెదిరించి, భయపెట్టి విలువైన ఎన్నో ప్రభుత్వ భూములను తమ హస్తగతం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మార్టూరు జాతీయ రహదారికి పక్కన ఉన్న కూరగాయల మార్కెట్‌కు పోలీస్‌స్టేషన్‌కు మధ్యన సర్వే నంబర్ 640ఏలో 2 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. బహిరంగ మార్కెట్లో ఇక్కడ ఎకరా కోటి రూపాయల పైనే ఉంటుంది. అయితే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ భూమి ఒకటిన్నర దశాబ్దాలుగా నిరుపయోగంగా పడి ఉంది. టీడీపీ నేత కన్ను.. ఈ భూమి తనదంటూ స్థానిక టీడీపీ నేత ఒకరు అధికారులు భూమి వైపు రాకుండా నయానో, భయానో ఒప్పించి ఇప్పటి వరకు అడ్డుకుంటూ వచ్చాడు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో ఈ భూమిని తమ కుటుంబం పేర రికార్డుల్లో ఎక్కించి ఆన్లైన్ చేసుకోవడం కోసం అప్పటి ప్రజాప్రతినిధి అండదండలతో తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే సదరు నాయకుడు ఈ భూమిని కబ్జా చేయడం నచ్చని అదే పార్టీకి చెందిన కొందరు నేతలు రెవెన్యూ అధికారులపై పరోక్షంగా ఒత్తిడి తీసుకురావడంతో తమకు ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ అధికారులు సహకరించలేదు. ప్రభుత్వం 2 ఎకరాలభూమిని ఎవరికైనా ఇవ్వాలంటే మిలటరీ పదవీ విరమణ చేసిన వారో, ఎస్సీ, ఎస్టీ కేటగిరికి చెంది భూమి లేని పేదలో అయి ఉండాలి. కానీ అగ్రవర్ణానికి చెందిన ఓ వ్యక్తి 2 ఎకరాల విలువైన భూమి తనదంటూ చెబుతుంటే రెవెన్యూ అధికారులు చోద్యం చూడటం అనుమానాలకు తావిస్తోంది. రెవెన్యూ అధికారుల పాత్ర పై అనుమానాలు.. ఎన్నికల ముందు బదిలీపై వెళ్లిన ఓ తహసీల్దార్ తన ఆరు నెలల హయాంలో ఇష్టారీతిన కొందరికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే సర్టిఫికెట్లపై సంతకాలు మాత్రం 2007లో ఇక్కడ విధులు నిర్వహించిన అప్పటి తహసీల్దార్ నాగేంద్రమ్మ పేరుతో ఉండటం గమనార్హాం. ఈ క్రమంలో ఈ 2 ఎకరాల భూమికి పూర్వపు తహసీల్దార్ నాగేంద్రమ్మ సంతకంతో కూడిన పొజిషన్ సర్టిఫికెట్ ఇప్పుడు వెలుగులోనికి రావడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ నెల 5 వతేదీ స్థానిక ప్రజాసంఘాల నాయకులు ప్రస్తుత తహసీల్దారు నాగమల్లేశ్వరరావుతో సమస్య గురించి ప్రస్తావించి ఆ భూమి పూర్వపరాలు పరిశీలించి పేదలకు పట్టాలు ఇవ్వాలని కోరారు. తాను ఎన్నికల నేపథ్యంలో వచ్చానని త్వరలో బదిలీపై వెళుతున్నందున ఈ భూమి వివరాలు తనకు తెలియవని తహసీల్దారు అన్నట్లు సమాచారం. దీనిపై తహశీల్దార్ ఆర్ నాగమల్లేశ్వరరావును వివరణ కోరగా.. 640 ఏ సర్వే నంబర్ భూమిపై ప్రజాసంఘాల నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు ఇచ్చారని తెలిపారు. నేను కొత్తగా రావడంతో పూర్తి వివరాలు తెలియవని, రికార్డులు పరిశీలించి పూర్తి వివరాలు తెలియజేస్తామని పేర్కొన్నారు. -
ప్రత్తిపాటి పుల్లారావు అక్రమ గెస్ట్ హౌస్
సాక్షి, గుంటూరు: కార్పొరేషన్ స్థలాన్ని ఆక్రమించి గుంటూరులో నిర్మించిన టీడీపీ రాష్ట్ర కార్యాలయం అక్రమం.. టీడీపీ హయాంలో నిర్మించిన ప్రజావేదిక అక్రమం.. చిలకలూరిపేట పట్టణంలో నిర్మిస్తున్న టీడీపీ కార్యాలయం అక్రమం.. ఆఖరికి ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట పట్టణంలో నిర్మిస్తున్న గెస్ట్ హౌస్ కూడా అక్రమ కట్టడమే.. దీని కోసం పోరంబోకు స్థలాన్ని ఆక్రమించేశారు. వివరాల్లోకి వెళితే.. చిలకలూరిపేట పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్ వెనుక సర్వే నంబర్ 89 బ్లాక్ నంబర్ ఐదులో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు 345 చదరపు గజాల స్థలం ఉంది. ఈ స్థలంలో గత సంవత్సరంలో ఆయన మంత్రిగా ఉన్న సమయంలో గెస్ట్ హౌస్ నిర్మాణం ప్రారంభించారు. మూడు అంతస్తుల గెస్ట్ హౌస్ భవన నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం ఇంటీరియల్ వర్క్ జరుగుతోంది. కానీ ఈ భవన నిర్మాణం మాత్రం అక్రమం. కనీసం గెస్ట్ హౌస్ నిర్మాణానికి మున్సిపాలిటీ అనుమతులు కోరుతూ దరఖాస్తు కూడా చేసుకోలేదు. అధికార బలంతో ఆక్రమ నిర్మాణం చేపట్టారు. మున్సిపల్ అధికారులు సైతం మంత్రికి ఎదురు చెప్పలేక చూసీచూడనట్టు వదిలేశారు. ‘సాక్షి’ కథనంతో వెలుగులోకి.. నిబంధనలకు విరుద్ధంగా ఎన్ఎస్పీ కెనాల్స్‌లో టీడీపీ కార్యాలయం అక్రమ నిర్మాణంపై శనివారం(10వ తేదీ) సాక్షి దినపత్రికలో ‘కబ్జా స్థలంలో టీడీపీ దర్జా’ అనే శీర్షికతో క£థనం ప్రచురితమైంది. ఈ కథనానికి కదిలిన పేట మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. మరో వైపు గెస్ట్ హౌస్ నిర్మాణం గురించి తెలియడంతో దీనికీ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. మాజీ మంత్రి నిర్మించిన అక్రమ కట్టడాన్ని గుట్టుచప్పుడు కాకుండా బీపీఎస్‌లో పెట్టి క్రమబద్ధీకరించాలని ప్రయత్నాలు సాగాయి. ఇప్పటి వరకూ మున్సిపల్ అధికారులు ఈ భవనానికి పన్ను వేయకపోవడంతో బీపీఎస్‌కు దరఖాస్తుకు అడ్డంకి పడింది. సర్వే నంబర్ 89 బ్లాక్ ఐదులో ప్రత్తిపాటికి 345 చదరపు గజాల స్థలం ఉంది. గెస్ట్ హౌస్ నిర్మాణం 479 చదరపు గజాల్లో చేపట్టారు. తన స్థలానికి అనుకుని ఉన్న పోరంబోకు స్థలాన్ని ప్రత్తిపాటి కబ్జా చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి గెస్ట్ హౌస్ నిర్మిస్తున్న ప్రాంతంలో గజం స్థలం రూ.25 వేలకుపైగా మాటే. ఈ లెక్కన మంత్రి తన గెస్ట్ హౌస్ నిర్మాణంలో కలుపుకున్న 134 చదరపు గజాల స్థలం విలువ రూ.30 లక్షలకుపైనే ఉంటుందని తెలుస్తోంది. నోటీసులు ఇచ్చేందుకు వెనుకడుగు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణానికి నోటీసులిచ్చేందుకు చిలకలూరిపేట మున్సిపాలిటీలోని ఓ టీపీవో వెనకడుగు వేస్తున్నారు. అక్రమ నిర్మాణాన్ని బీపీఎస్‌లో పెట్టి క్రమబద్ధీకరించడం కోసం టీడీపీకి చెందిన ఓ ఇంజినీర్, సదరు టీపీవో రూ.లక్షల్లో వసూలు చేసినట్టు సమాచారం. దీంతో కమిషనర్ మాజీ మంత్రికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించినా టీపీవో కార్యాలయానికి రాకుండా కాకమ్మ కబుర్లు చెబుతూ కాలయాపన చేస్తున్నారు. నోటీసు తయారు చేసినప్పటికీ కనీసం సంతకం చేసేందుకు కూడా టీపీవో అందుబాటులో లేరు. పైపెచ్చు అక్రమ కట్టడంపై చర్చలు తీసుకునేందుకు ముందుకు వస్తున్న మిగిలిన సిబ్బందిని సైతం టీపీవో, ఇంజినీర్ ఇబంది పెడుతున్నారు. సాగునీటి కోసం ఎదురుచూస్తున్నాం ఐదేళ్లుగా నాగార్జునసాగర్ కుడికాలువ ఆయకట్టులో సాగు నీరు అందలేదు. నేను మాగాణి వదిలేసి మెట్ట పంటలు సాగ చేశాను. కేవలం వర్షాధారం పంటలపై ఆధారపడటంతో ఆర్థికంగా నష్టాల పాలయ్యాను. ప్రస్తుతం సాగర్‌కు భారీగా వరద నీరొస్తోంది. దీంతో మళ్లీ పొలాలకు జల కళ రానుంది. - డీ శ్రీనివాసరెడ్డి, వి.రెడ్డిపాలెం, రొంపిచర్ల మండలం సాగు నీటి కష్టాలకు చెక్ సాగర్ కాలువలకు నీరులేక మాగాణి భూముల్లో మెట్ట పంటలు పండక నష్టాల పాలయ్యా. వ్యవసాయంపై ఆధారపడి పని చేసే కూలీలు సైతం పనుల్లేక వలసలు వెళ్లారు. సాగర్‌కు నీరొస్తే రెండు పంటలు పండుతాయి. ప్రతి సీజన్లో కూలీలకు ముమ్మరంగా పని దొరుకుతుంది. ప్రస్తుతం అందరి ఆశలు చిగురిస్తున్నాయి. -విప్పర్ల బుడే, సంతగుడిపాడు, రొంపిచర్ల మండలం -
కుంటనూ వదలరు.. దారినీ వదలరు
సాక్షి, నాగులుప్పలపాడు (ప్రకాశం): గతంలో ఏర్పడిన ఎన్నో కరువులకు, నీటి ఎద్దడులకు తట్టుకొని పొలాలు, మూగ జీవాలకు నిరంతరంగా నీరు అందించిన కుంట అది. కాలక్రమంలో ఆక్రమణలకు గురై నేడు పక్కనున్న పొలాల రైతులకు కూడా ఇబ్బందులకు గురిచేస్తున్న వైనం ఇది. మండలంలోని మాచవరం గ్రామంలోని సర్వే నంబరు 74 లో మెత్తం 13.71 సెంట్లులో లింగన్నకుంట ఉండేది. ఈ కుంట చుట్టు పక్కల పొలాల రైతులకు నీటి వసతి కోసం చాలా అనువుగా ఉండేది. అయితే ఇది కాలక్రమంలో ఆక్రమణలకు గురై నేడు నీటి జాడలు ఉన్నయనడానికే పరిమితమయింది. ఈ సర్వే నంబరులో మొత్తం వీస్తీర్ణంలో కొంత భాగం రిటైర్డు ఆర్మీకి కేటాయించారు. మిగిలిన భాగంలో ఆక్రమణలకు గురయింది. అది అంతటితో కాకుండా చివరకు కుంట కట్టలను కూడా దున్నేసి పొలంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేశారు. కుంటకు ఆవల వైపునున్న పొలాలకు వెళ్లడానికి ఈ కుంట కట్ట మీద గుండానే వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్నకట్టను కూడా ఆక్రమించి కలుపుకుపోతే చేలల్లోకి వెళ్లడానికి మార్గం ఏదని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించే పరిస్థితికి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఈ ఆక్రమణ ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో వర్షాలు పడి కుంట నిండితే కట్ట తెగితే నీరంతా పంట పొలాలలోనే ఉంటుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా అక్రమలు తొలగించి రైతులు పొలాలకు వెళ్లే మార్గంతో పాటు నీటి ఎద్దడిని తీర్చడానికి కుంట విస్తీర్ణం మెత్తాన్ని సరిచేసి కాపాడాలని రైతులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. గతంలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు కూడా గ్రామ పెద్దల సమక్షంలో పరిష్కారం చూపిన మరలా ఇప్పుడు సమస్యలు ఉత్పన్నమవడం భాధాకరంగా ఉందని వాపోతున్నారు. ఇదే విషయమై తహశీల్దార్‌ను వివరణ కోరగా మాచవరం గ్రామంలో లింగన్నకుంటకు సంబంధించి ఆక్రమణల విషయంలో పూర్తి స్థాయిలో విచారించి ఎవరికి ఆటంకం లేకుండా సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. దారిని కూడా వదలడం లేదు.. మా పొలాలకు వెళ్లడానికి ఉన్న ఏకైక మార్గం కుంట కట్ట మీద గుండానే వెళ్లాలి. ఇప్పుడు ఈ కట్టను కూడా ఆక్రమించేస్తే ట్రాక్టర్లు కాదు కదా కనీసం మోటారు సైకిళ్లు కూడా పొలాల వద్దకు పోలేవు. ఇకనైనా ఈ సమస్యను పరిష్కరంచాలని కోరుతున్నాం. –ఇనగంటి రాఘవ రెడ్డి, రైతు భయపెడుతున్నారు.. లింగన్న కుంట ఆక్రమణల గురించి ఇప్పటికే పలు సార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదు. చివరకు కట్ట కూడా ఆక్రమణలకు గురయ్యే పరిస్థితుల్లో కట్ట అవసరత గురించి అడిగితే అక్రమ కేసులు పెట్టడానికి కూడా వెనుకాడని పరిస్థితుల్లో ఉన్నారు. –కోడెల నెహ్రూ, రైతు -
ఎయిర్‌పోర్టుకు శరవేగంగా భూసేకరణ
► వచ్చే నెలాఖరునాటికి పూర్తిస్థాయిలో సర్వే ► ఇంకా సేకరించాల్సినది 345ఎకరాలు మాత్రమే ► పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్న రెవెన్యూ అధికారులు భోగాపురం : గ్రీన్‌ఫీల్డు ఎయిర్‌పోర్టుకు దాదా పు భూములు సిద్ధమయ్యాయి. సర్వే పనుల్లో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చినెలలో పూర్తి స్థాయిలో భూసేకరణ చేసేందుకు అవసరమైన పనులు ముమ్మరం చేస్తున్నారు. ఎయిర్‌పోర్టుకు తుది నోటిఫికేషన్ ప్రకారం 2545 ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఒప్పటికి 2200 ఎకరాల సేకరణ పూర్తయింది. ఇంకా సేకరించాల్సింది కేవలం 345ఎకరాలే. దానికి సంబంధించిన రైతులు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం కావాలని కోరుతూ హైకోర్టులో స్టే తెచ్చుకోవడంవల్ల ఈ జాప్యం ఏర్పడింది, అయితే వారిని కూడా అంగీకరింపజేసే పనిలో రెవెన్యూ అధికారులు ఉన్నారు. చేతులు మారిన డి–పట్టా భూముల స్వాధీనం: ఎయిర్‌పోర్టు ప్లానులో గతంలో ఇచ్చిన డి–పట్టాభూములు ఎక్కువగా చేతులు మారిన విషయాన్ని రెవెన్యూ సిబ్బంది గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నారు. ప్లానులో ఇలా 215 ఎకరాలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. దానిలో 175ఎకరాలకు సంబంధించిన రైతులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారు 3నెలల్లో ఎలాంటి అభ్యంతరాలున్నా ఆర్డీఓ ఎదుట అప్పీలు చేసుకోవాల్సి ఉంది. ఇంతవరకూ 50ఎకరాలకు సంబంధించిన రైతులు అప్పీలు చేసుకున్నారు. ఇంకా 40 ఎకరాలకు సంబంధించి నోటీసులు ఇవ్వాల్సి ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కవులవాడ రెవెన్యూలో 120 ఎకరాలు, కంచేరు రెవెన్యూలో 8, గూడెపువలస రెవెన్యూలో 50, రావాడ రెవెన్యూలో 30 ఎకరాలు డి పట్టా భూములు చేతులు మారాయని తహసీల్దారు అధికారికంగా తెలిపా రు. ఈ నెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు పనులు వేగవంతం చేస్తున్నారు. పునరావాస స్థల అభివృద్ధి బాధ్యత వుడాకు: ఎయిర్‌పోర్టు ప్లానులో మరడపాలెం, బొల్లింకలపాలెం, రెల్లిపేట, ముడసర్లపేట గ్రామాలను తరలించాల్సి ఉంది. ఆయా గ్రామాల్లో 376 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. వీరందరికీ చెరుకుపల్లి వద్ద నివాస యోగ్యమైన స్థలాన్ని అధికారులు గుర్తించి దానిని అభివృద్ధి చేసే బాధ్యత వుడాకు అప్పగించారు. త్వరలో పునరావాస పనులను చేపట్టనున్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఆక్రమిత భూముల సర్వే: ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత భూముల్లో డి పట్టాలు లేకుండా సాగుచేస్తున్న భూమి 40 ఎకరాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆ భూముల్ని ఎవరు సాగుచేస్తున్నారో తెలుసుకునేందుకు అధికారులు సర్వే చేపడుతున్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావివ్వకుండా పక్కాగా సర్వే చేపట్టే పనిలో ఉన్నారు. దీనిపై ఇప్పటికే తహసీల్దారు డి.లక్ష్మారెడ్డి సిబ్బందికి తగు సూచనలు ఇవ్వడంతో పాటు సిబ్బంది ఎటువంటి ప్రలోభాలకు తలొంచినా వారిపై వేటు తప్పదని గట్టిగా హెచ్చరించారు. -
‘బాబు’ బినామీల చెర నుంచి విముక్తి
బాలాయపల్లి, న్యూస్‌లైన్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం ఇండలి గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి బినామీలు ఆక్రమించిన పేదల భూములకు మోక్షం కలిగింది. తొమ్మిదేళ్ల కిందట పట్టాలు ఇచ్చిన రెవెన్యూ అధికారులు ఇప్పటిదాకా భూములు చూపకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం లబ్ధిదారులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. వీరి ఆందోళనను ‘బాబు భూబాగోతం’ శీర్షికన బుధవారం సాక్షి ప్రముఖంగా ప్రచురించింది. దీంతో కలెక్టర్ శ్రీకాంత్ ఆదేశం మేరకు గూడూరు ఆర్డీవో మధుసూదనరావు, తహశీల్దార్ పూర్ణచంద్రరావు, ఆర్ఐ మురళీకృష్ణ, వీఅర్లో చెంచయ్య బుధవారం ఆ భూముల్లో సర్వే నిర్వహించారు. గిరిజనుల భూములు ఆక్రమణకు గురైన విషయాన్ని నిర్ధారించారు. 2004లో డీకేటీ పట్టాలు జారీ చేసిన 18 మందిలో (మేకల రమణయ్య ఊరొదిలి వెళ్లిపోగా, తిరుమల శెట్టి శంకరమ్మ చనిపోయారు, మరో ఇద్దరు అందుబాటులో లేరు.) మిగిలిన 14 మందికి ఒక్కొక్కరికి 77 సెంట్ల చొప్పున 13.88 ఎకరాల భూమిని స్వాధీనం చేశారు. అందుబాటులో లేని వారిద్దరికీ వారంలోపు భూములు చూపిస్తామని తెలిపారు. భూమి స్వాధీనం చేసినా తమకు దారిచూపలేదని గిరిజనులు ప్రశ్నించడంతో, ముందు భూమిని స్వాధీనం చేసుకోవాలని త్వరలోనే పట్టాదారులతో మాట్లాడి దారి ఏర్పాటుచేస్తామని ఆర్డీవో వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ పట్టాదారులు తమ భూములకు హద్దులు ఏర్పాటుచేసుకుని సాగు చేసుకోవాలని చెప్పారు. సర్వే నంబరు 139లో ఉన్న అసైన్డ్ భూమిలో 13.88 సెంట్ల భూమిని ఎస్సీ, ఎస్టీలకు స్వాధీనం చేశామని, వాటిని ఎవరైనా ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.