న్యూఢిల్లీ/లేహ్: లద్దాఖ్‌లోని అంగుళం భూమిని కూడా చైనా ఆర్మీ ఆక్రమించుకోలేదంటూ ప్రధాని మోదీ చేసిన ప్రకటన అబద్ధమని కాంగ్రెస్ నేత రాహుల్ అన్నారు. చైనా సైన్యం అక్కడి పచ్చిక బయళ్లను ఆక్రమించుకోవడంపై లద్దాఖ్ వాసులు ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు. తన తండ్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులరి్పంచేందుకు శనివారం రాహుల్ లద్దాఖ్‌కు చేరుకున్నారు.
‘చైనా సైన్యం చొచ్చుకువచ్చి పచి్చక బయళ్లను లాగేసుకుందని ఇక్కడి వారంతా చెబుతున్నారు. భూమి ఆక్రమణకు గురి కాలేదంటూ ప్రధాని చెబుతున్నది నిజం కాదని వాళ్లు స్పష్టంగా చెబుతున్నారు’అని రాహుల్ అన్నారు. కాగా, రాహుల్∙చైనా తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నట్లుగా ఉందని బీజేపీ మండిపడింది. ఇటువంటి ప్రకటనలతో రాహుల్ దేశం పరువు తీస్తున్నారని ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment