china army
-
వీడియో: చరిత్రలో మొదటిరోజు.. దీపావళి వేడుకల్లో భారత్, చైనా బలగాలు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పండుగ వేళ ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు. అటు, భారత సరిహద్దుల్లో కూడా పండుగ వాతావరణం నెలకొంది. దీపావళి సందర్బంగా భారత్-చైనా బలగాలు వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట పలుచోట్ల స్వీట్స్ పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇటీవల రష్యాలో జరిగిన బ్రిక్స్ సమావేశాల సందర్బంగా భారత్, చైనా దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో ఎల్ఏసీ వెంట సరిహద్దుల్లో భారత్, చైనాలు తమ బలగాలను పూర్తిగా ఉపసహంరించుకున్నాయి. అంతేకాకుండగా.. తూర్పు లడఖ్‌లోని దెప్పాంగ్, దేమ్‌చుక్ ప్రాంతాల నుంచి సైన్యాల ఉపసంహరణ పూర్తయ్యిందని, త్వరలోనే పెట్రోలింగ్ ప్రారంభిస్తామని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఎల్ఏసీ వద్ద ఒప్పందం అమలు వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతోంది. భవిష్యత్తులో కూడా చర్చలు కొనసాగుతాయని సైనిక వర్గాలు వెల్లడించాయి.మరోవైపు.. నేడు దీపావళి పండుగ సందర్భంగా భారత్, చైనాకు చెందిన సైనికులు స్వీట్లను ఇచ్చిపుచ్చుకున్నారు. లఢఖ్ సెక్టార్‌లోని కోంగ్లా ప్రదేశంలో ఎల్ఏసీ వెంట రెండు దేశాలకు చెందిన సైనికులు కలుసుకోవడం విశేషం. ఈ సందర్బంగా సైనికులు ఆనందం వ్యక్తం చేశారు.Soldiers of the Indian and Chinese Army exchange sweets at KongkLa in Ladkah Sector on the occasion of #Diwali. (Source: Indian Army) pic.twitter.com/KKEJpEHgPo— ANI (@ANI) October 31, 2024 Just in: Indian, Chinese PLA troops exchange Diwali sweets in at least five border points along LAC in Ladakh; MoD statement says this marks a “new era of cooperation”.- Karakoram Pass, - Daulat Beg Oldie - Chushul-Moldo Meeting Point- Kongka La- Hot Springs pic.twitter.com/mepbzoFetG— Dhairya Maheshwari (@dhairyam14) October 31, 2024 -
G20 Summit: జిన్‌పింగ్ ఎందుకు రావట్లేదు ?
జీ20 సదస్సుకు కయ్యాలమారి చైనా అంతగా ప్రాధాన్యత ఇవ్వట్లేదా ?. అందుకే అధ్యక్షుడు జిన్‌పింగ్ తనకు బదులు ప్రధాని లీ కియాంగ్‌ను పంపించారా ?. ఇలాంటి ప్రశ్నలకు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు తలో విశ్లేషణ చెబుతున్నారు. జీ20 కూటమి ఆవిర్భావం తర్వాత చైనా అధ్యక్షులు ఒకరు శిఖరాగ్ర సదస్సులో పాల్గొనకపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇంతటి ప్రతిష్టాత్మకమైన సదస్సుకు హాజరుకాకుండా జిన్‌పింగ్ చైనాలోని ఉండి ఏం చేస్తున్నారు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 2020 మే నెల నుంచి భారత్‌తో సరిహద్దు వెంట ఇరుదేశాల సైనికులు బాహాబాహీకి దిగడం, భారీగా సైన్యం మొహరింపు వంటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతుండటం వల్లే జిన్‌పింగ్ ఆగ్రహంతో సదస్సుకు రావట్లేదని చాలా మంది భావిస్తున్నారు. అసలు కారణం అది కాదని మరో వాదన బలంగా వినిపిస్తోంది. అదే అదుపు తప్పుతున్న చైనా ఆర్థిక పరిస్థితి. జిన్‌పింగ్ ధనవంతుల కుటుంబంలో పుట్టాడు. అప్పుడే వచ్చిన సాంస్కృతిక విప్లవం ధాటికి ఆయన తండ్రి పేదవాడిగా మిగిలిపోయాడు. దీంతో జిన్‌పింగ్ బాల్యంలో కష్టాలు చూశాడు. పొలంలో సాధారణ కూలీగా పనిచేశాడు. ఆరేళ్లు ఇబ్బందులు పడ్డాడు. అయితే బలీయమైన చైనాకు అధ్యక్షుడిగా ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలతో పోలిస్తే ఆనాటి కష్టాలు గడ్డిపరకతో సమానమే. ‘చైనా రాజ్య విస్తరణ వాదం, దక్షిణ చైనా సముద్రంపై గుత్తాధిపత్యం, ప్రపంచ వస్తూత్పత్తి మార్కెట్‌కు ఏకైక దిక్కుగా మారాలన్న వ్యూహాలతో చైనా చాలా ప్రపంచ దేశాలకు శత్రువుగా మారింది. ఇలాంటి తరుణంలో చైనాతో కలిసి జీ20 వేదికను కలిసి పంచుకునేందుకు తోటి దేశాలు విముఖత చూపుతున్నాయి’ అని మేథో సంస్థ కార్నీగ్ చైనా డైరెక్టర్ పాల్ హెనెల్ వ్యాఖ్యానించారు. ఆ అప్రతిష్ట పోగొట్టుకునేందుకే ‘ సదస్సు విజయవంతం అవడానికి అందరితో కలిసి పనిచేస్తాం’ అని బీజింగ్ తాజాగా ప్రకటించింది. ‘విదేశీ పర్యటనకు పక్కనబెట్టి స్వదేశ సమస్యలపై జిన్‌పింగ్ దృష్టిపెట్టారు. దేశ రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పొరుగు దేశాలతో కయ్యానికి దిగారు. ఆర్థిక వ్యవస్థ సమస్యల్లో చిక్కుకోవడంతో జిన్‌పింగ్‌కు తలనొప్పి పెరిగింది’ అని సింగపూర్‌లోని నేషనల్ యూనివ ర్సిటీ ప్రొఫెసర్ ఆల్ఫ్రెడ్ వూ వ్యాఖ్యానించారు. దెబ్బకొట్టిన హౌజింగ్ రంగం ఇటీవల దశాబ్దాల కాలంలో ఎన్నడూలేనంతగా పలు సమస్యలు చైనాలో తిష్టవేశాయి. కుటుంబాలు తమ ఖర్చులను తగ్గించుకున్నాయి. కర్మాగారాల్లో ఉత్పత్తి తగ్గిపోయింది. వ్యాపారవేత్తలు నూతన పెట్టుబడులకు ముందుకు రావట్లేదు. ఎగుమతులు దిగజారాయి. ఆగస్టులో ఎగుమతులు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8.8 శాతం తగ్గాయి. దిగుమతులు 7.3 శాతంపెరిగాయి. నిరుద్యోగిత భారీగా పెరగడంతో ప్రభుత్వం తాజా గణాంకాలు బహిర్గతంచేయడం మానేసింది. ఆస్తుల మార్కెట్ విలువ భారీగా పతనమైంది. ప్రధాన డెవలపర్లు చేతులెత్తేసి దివాలాను ప్రకటించారు. దీంతో రియల్ ఎసేŠట్ట్ రంగం సంక్షోభంలో చిక్కింది. 40 ఏళ్ల భవిష్యత్ అభివృద్ది మోడల్‌ను ఈ అంశాలు తలకిందులుచేసేలా ఉన్నాయి. ప్రాపర్టీ రంగంపై అతిగా ఆధారపడటం, అత్యంత కఠినమైన కోవిడ్ ఆంక్షల విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయని నిపుణులు భావిస్తున్నారు. రుణాల పునాదిపై నెలకొల్పిన అభివృద్ధి మోడల్ ఈ పరిస్థితికి మరో కారణం. దేశం అప్పులు పెరిగిపోయాయి. 2023 తొలి త్రైమాసికంలో అప్పులు–జీడీపీ నిష్పత్తి రికార్డు స్థాయిలో 279 శాతంగా నమోదైందని బ్లూమ్‌బర్గ్ విశ్లేషించింది. రుణాలు అతిగా తీసుకొచ్చి మౌలిక వసతులపై ఖర్చుచేసిన పాపం ఇప్పుడు పండిందని మరో వాదన. హౌజింగ్ బుడగ బద్ధలైంది. చైనా ఆర్థిక వ్యవస్థ 25 శాతం ప్రాపర్టీ మార్కెట్‌పైనే ఆధారపడింది. ఇన్నాళ్లూ కేవలం చైనాపై ఆధారపడిన విదేశీ బ్రాండ్లు ఇప్పుడు చైనాతోసహా ఇతర(చైనా ప్లస్ స్ట్రాటజీ) దేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. దీని వల్ల ప్రధానంగా లాభపడేది ఇండియానే. ఆపిల్, టెస్లా మొదలుకొని నైక్ వరకు అన్ని ప్రధాన సంస్థల తయారీకేంద్రాలు చైనాలోనే ఉన్నాయి. కార్మికులకు అధిక జీతభత్యాలు, అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో విదేశీ సంస్థలు చైనాకు బదులు వేరే దేశాల వైపు చూస్తున్నాయి. ఆర్మీలో అవిధేయత? చైనా ఆర్మీలో పెరిగిన అవినీతి, పాలక పార్టీ పట్ల తగ్గిన విధేయతపై జిన్‌పింగ్ భయపడుతున్నారని ఆసియా పాలసీ సొసైటీ ఇన్స్టిట్యూట్లో జాతీయ భద్రతా విశ్లేషకుడు లైల్ మోరిస్ చెప్పారు. చైనా సైన్యంలో అణ్వస్త్ర సామర్థ్య రాకెట్ విభాగంలోని జనరల్, డెప్యూటీ జనరల్‌లను తొలగించడాన్ని ఆయన ఉటంకించారు. తనకు నమ్మకస్తుడైన విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్‌ను జిన్‌పింగ్ తప్పించడంతో పార్టీ వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి రేగింది. జిన్‌పింగ్ పాలనా సామర్థ్యానికి ఈ ఘటనలు మాయని మచ్చలని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇలాంటి సమస్యలు ఇంకొన్ని పెరిగితే డ్రాగన్ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పాలనకు తెరపడే ప్రమాదముందని కొందరు సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. ఇన్ని సమస్యలు ఇంట్లో పెట్టుకునే జిన్‌పింగ్ చైనాను వదలి బయటకు రావట్లేదనే విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంగుళం కూడా చైనా ఆక్రమించలేదనడం అబద్ధం
న్యూఢిల్లీ/లేహ్: లద్దాఖ్‌లోని అంగుళం భూమిని కూడా చైనా ఆర్మీ ఆక్రమించుకోలేదంటూ ప్రధాని మోదీ చేసిన ప్రకటన అబద్ధమని కాంగ్రెస్ నేత రాహుల్ అన్నారు. చైనా సైన్యం అక్కడి పచ్చిక బయళ్లను ఆక్రమించుకోవడంపై లద్దాఖ్ వాసులు ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు. తన తండ్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులరి్పంచేందుకు శనివారం రాహుల్ లద్దాఖ్‌కు చేరుకున్నారు. ‘చైనా సైన్యం చొచ్చుకువచ్చి పచి్చక బయళ్లను లాగేసుకుందని ఇక్కడి వారంతా చెబుతున్నారు. భూమి ఆక్రమణకు గురి కాలేదంటూ ప్రధాని చెబుతున్నది నిజం కాదని వాళ్లు స్పష్టంగా చెబుతున్నారు’అని రాహుల్ అన్నారు. కాగా, రాహుల్∙చైనా తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నట్లుగా ఉందని బీజేపీ మండిపడింది. ఇటువంటి ప్రకటనలతో రాహుల్ దేశం పరువు తీస్తున్నారని ఆరోపించింది. -
సైన్యాధికారిణిగా గల్వాన్ అమరుని అర్ధాంగి
న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో చైనా సైన్యంతో ఘర్షణల్లో అమరుడైన భారత సైనికుడు నాయక్ దీపక్ సింగ్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన సతీమణి సైతం కదనరంగంలోకి దూకారు. చెన్నై కేంద్రంగా పనిచేసే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ)లో విజయవంతంగా ఆర్మీ శిక్షణ పూర్తిచేసుకున్నాక 29 ఏళ్ల లెఫ్టినెంట్ రేఖా సింగ్.. ఆర్మీ ఆర్డ్‌నన్స్ కోర్ విభాగంలో శనివారం విధుల్లో చేరారు. తూర్పు లద్దాఖ్‌లో ఫ్రంట్‌లైన్ యూనిట్లో ఆమె కర్తవ్య దీక్షను మొదలుపెట్టారని ఆర్మీ ఉన్నతాధికారులు చెప్పారు. ఆర్మీ మెడికల్ కోర్లో సభ్యుడైన నాయక్ దీపక్ సింగ్ ఆ తర్వాతికాలంలో బిహార్ రెజిమెంట్ 16వ బెటాలియన్‌లో నర్సింగ్ అసిస్టెంట్‌గా చేరారు. 2020 జూన్‌లో గల్వాన్‌లోయలో చైనా సైనికులతో పోరాడింది ఈ బెటాలియన్ బృందమే. ఘర్షణల్లో గాయపడినా కూడా నాయక్ తోటి 30 మంది క్షతగాత్రులైన సైనికులకు అత్యవసర వైద్యసాయం చేసి అద్భుత ధైర్యసాహసాలు ప్రదర్శించారని నాడు కేంద్రం శ్లాఘించింది. -
ఓటమి నేర్పిన పాఠాలు
భారత్–చైనా యుద్ధానికి 60 ఏళ్లు! నాయకత్వ వైఫల్యాలు, సన్నద్ధంగా లేని సైన్యం కారణంగా భారత్ అందులో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడిక ప్రశ్న ఏమిటంటే 1962 నాటి ఆ యుద్ధం నుంచి మనం ఏమైనా పాఠాలు నేర్చుకున్నామా అని! నేర్చుకున్నామనే చెప్పాలి. అయితే ఆ పాఠాలు చొరబాట్లను ఎదుర్కోడానికి మాత్రమే పనికొచ్చేవి. సరిహద్దు సమస్యల్ని పరిష్కారించుకోడానికైతే మిగిలి ఉన్న మార్గం ఒక్కటే. 1959–60 ప్రతిపాదనల ప్రకారం... ఇరుదేశాలు ‘ఇచ్చిపుచ్చుకునే’ ధోరణిలో ముందుకు వెళ్లడం! అక్సాయ్ చిన్ను చైనాకు వదిలేసి, అరుణాచల్ ప్రదేశ్‌ను భారత్ ఉంచుకోవడం. అంటే సరిహద్దు రేఖల్ని ఉన్నవి ఉన్నట్లుగా ఇరు దేశాలు అంగీకరించడం! సరైన ఆయుధాలు, దుర్భేద్యమైన సైనిక దుస్తులు లేకుండా ఈశాన్య సరిహద్దు ప్రాంతం (నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ – ఎన్.ఇ.ఎఫ్.ఎ.)లో గస్తీ కాస్తున్న భారత దళాలు ఒక హఠాత్పరిణామంగా 1962 అక్టోబర్ రాత్రి 19–20 తేదీల మధ్య చైనా జరిపిన చొరబాటు దాడులతో అనేక ప్రాధాన్య స్థావరాలను కోల్పోయాయి. ఆశ్చర్యకరంగా, చైనా సైని కుల్ని వెనక్కి తరిమికొట్టే బాధ్యత... దానికి ఎంతమాత్రమూ తగని ‘గజరాజ్ కోర్’ సేనాని, నెహ్రూ మనిషిగా పరిగణన పొందిన లెఫ్ట్‌నెంట్ జనరల్ బి.ఎం.కౌల్‌పై పడింది! ఆ అయోమయంలో ఆయన వెంటనే ఢిల్లీ వెళ్లిపోయారు. ఈశాన్య సరిహద్దు ప్రాంతంలో వ్యూహమంటూ లేని మన గందరగోళం గురించి ఢిల్లీలోని రాజకీయ దిగ్గజాలకు నివేదించడం ఆయన ఉద్దేశం. ఈశాన్య భారతదేశానికి, టిబెట్‌కు మధ్య ఉన్న మక్‌మహన్ సరిహద్దు రేఖ వెంబడే చైనా మూకల చొరబాట్లు కొనసాగుతూ ఉండటంతో ఢిల్లీ వెళ్లిన కౌల్ మళ్లీ తిరిగిరాలేదు. సైనిక దళాల మోహరింపు, యుద్ధ ప్రణాళికలకు వ్యూహరచన జరుగుతుండే ఢిల్లీలోనూ అయోమయం నెలకొంది. చైనా వెన్నుపోటు పొడిచిందని నెహ్రూ, ఆయన అనుచరులు ఆ తర్వాత వాదిస్తూ వచ్చారు కానీ, మావో నేతృత్వంలోని కమ్యూనిస్టు నాయకత్వం ఏం చేయనుందో 1950ల చివరి నుంచీ చాలినన్ని హెచ్చరికలు కనిపిస్తూనే ఉన్నాయి. చైనాను బుజ్జగించడానికి టిబెట్ స్వాతంత్య్రానికి మద్దతు ఇవ్వడం మానేస్తామని భారత్ ఇచ్చిన హామీపై 1954లో ‘పంచశీల’ ఒప్పందానికి చైనా అంగీకారం తెలిపింది. అయినప్పటికీ అక్సాయ్ చిన్లోగానీ, తవాంగ్‌లో మక్‌మహన్ నియంత్రణ రేఖను మీరిన భాగాన్ని కూడా తనదేనన్న వాదననుగానీ చైనా వదులుకోలేదు. 1959లో లోంగ్జులో జరిగిన వాగ్వివాదాలను భారత్ తేలిగ్గా తీసుకుంది. లోంగ్జులో వందలాది భారత సైనిక దళాలు తమ భూభాగం లోకి ప్రవేశించాయంటూ చైనాలోని భారత రాయబార కార్యాలయా నికి చైనా నిరసన పత్రం పంపినప్పుడు భారత్ ఏమాత్రం దీటైన జవాబు ఇవ్వలేకపోయింది. మావో, కృశ్చేవ్‌ల మధ్య కుదిరిన ఒప్పం దాన్ని అనుసరించి సోవియట్ వైమానిక, భూ ఉపరితల సేనల సహ కారంతో టిబెట్ భూభాగంపై చైనా తన సైనిక బలగాలను స్థిరంగా పెంచు కుంటూ పోయింది. ఆ పరిణామాన్ని కూడా భారత్ పట్టించు కోలేదు. 1959లో అమెరికా సాయంతో టిబెట్ నుంచి భారత్‌కు తప్పించుకున్న దలైలామా, ఆయన అనుచరులు భారత్‌లో ఆశ్రయం పొందడం చైనాకు ఆగ్రహం తెప్పించింది. నిజానికి ముందుగా అనుకున్నది వారు అమెరికా వెళ్తారని. అన్నిటినీ మించి చైనా కోపానికి కారణమైన అంశం... అమెరికా కార్యకలాపాలకు భారత్ ఒక ప్రధాన కేంద్రం అవడం. సీఐఏ శిక్షణ పొందిన సాయుధ టిబెటన్ తిరుగు బాటు దళాల్ని టిబెట్‌లోకి పంపించేందుకు భారత్‌ను అమెరికా ఒక ‘లాంచ్ ప్యాడ్’గా ఉపయోగించుకుంది. ఇక స్వదేశంలో ఒత్తిళ్లకు లోనైన నెహ్రూ భారత భూభాగాలలోంచి చైనీయులను విసిరి బయట పడేయమని భారత సైన్యాన్ని ఆదేశించారు. ఆ దూకుడులో ఆయన చైనా ప్రధాని చౌ ఎన్–లై 1960లో ఇండియా పర్యటించినప్పుడు చేసిన ప్రతిపాదనలను సైతం విస్మరించారు. అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనాకు ఉంచి, మక్‌మహన్ రేఖకు దక్షిణ వైపున ఉన్న ప్రాంతాన్ని భారత్ తీసుకోవడం ద్వారా సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవాలన్నదే ఆ ప్రతిపాదన. నిజానికి 1962 భారత్–చైనా యుద్ధంలో మన సేనలు మెరుగైన ప్రతిఘటననే ఇచ్చాయి. సరిహద్దు వెంబడి ప్రాధాన్య స్థావరాలపై తమ పట్టును కోల్పోకుండా ఉండేందుకు వీరోచితంగా పోరాడాయి. మన సేనాపతులు తమ సైనికులపై ఎన్ని నెపాలు మోపినా గానీ, ఆ సైనికుల అసమాన శౌర్య పరాక్రమాలకు ఎన్నో నిదర్శనాలు కనిపి స్తాయి. అలాగైతే ఎందుకు ఓడిపోయాం? చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ థాపర్, జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ (ఈస్ట్రన్ కమాండ్) లెఫ్ట్‌నెంట్ జనరల్ ఎల్.పి.సేన్ల నిస్పృహ కలిగించే పాత్రతో పాటుగా, నెహ్రూ నిర్ణయం కూడా మన పరాజయానికి కారణమైంది. ఇంటెలిజెన్స్ చీఫ్ బి.ఎన్.మాలిక్ సలహాపై భారత వైమానిక దళాలను రంగంలోకి దింపేందుకు నెహ్రూ అనుమతించలేదు. అలా చేస్తే చైనాను మరింతగా రెచ్చగొట్టినట్లు అవుతుందని నెహ్రూ భావించారు! అదొక పెద్ద తప్పిదంగా చరిత్రలో నిలిచిపోయింది. భారత్–చైనా యుద్ధం జరిగి 60 ఏళ్లయింది. ఇప్పుడిక అసలు ప్రశ్న ఏమిటంటే 1962 నాటి ఆ యుద్ధం నుంచి మనం ఏవైనా పాఠాలు నేర్చుకున్నామా అని! నేర్చుకున్నామని చెప్పడమే న్యాయంగా ఉంటుంది. ఇందుకు అనేక ఉదాహరణలను చూపవచ్చు. ముఖ్యంగా, 1967లోనే చైనా నాథు లా పాస్, చో లా పాస్ మార్గాలు వెళ్లే హిమాలయ సరిహద్దు ప్రాంతాల్లో భారత్‌కు వ్యతిరేకంగా కండలు తిప్పడం మొదలు పెట్టీ పెట్టగానే అక్కడి జననల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ సగత్ సింగ్ తన అధీనంలోని కంచె లోపలి భాగంలోకి ఎలాంటి విదేశీ చొరబాట్లను అనుమతించబోనని తన పై అధికారులకు ముందస్తు సమాచారం పంపించారు. అంటే తనిక ఎలాంటి ఆదేశాల కోసమూ ఎదురు చూడబోయేది లేదని. 20 ఏళ్ల పాటు నిశ్శబ్దంగా ఉండిపోయిన చైనా 1986–87లో అరుణాచల్ ప్రదేశ్‌లోని సోమ్డోరోంగ్ లోయలోకి చొరబడింది. ఆర్మీ చీఫ్ జనరల్ సుందర్జీ మెరుపు వేగంతో ప్రతిస్పందించి భారత సేనల్ని గగనతలం గుండా సోమ్డోరోంగ్పై దింపారు. మన సైన్యం చైనా సేనల్ని చుట్టుముట్టింది. ప్రత్యర్థి మూకలు మారు మాట్లాడకుండా వెన కడుగు వేశాయి. ఆ ఘటన ప్రధాని రాజీవ్ గాంధీ రక్తాన్ని ఉత్తేజంతో ఉరకలెత్తించింది. అనంతర పరిణామంగా 1988లో జరిగిన రాజీవ్ చైనా పర్యటన, ఆ సందర్భంగా రెండు దేశాల మధ్య వరుసగా కుది రిన అనేక ఒప్పందాలు ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. ఇటీవల 2020లో గల్వాన్ లోయలో చైనా చొరబాట్లకు కూడా భారత్ మునుప టంత వేగంగానే స్పందించింది. చైనా మితిమీరి, పరిస్థితి ముదిరితే కనుక గల్వాన్‌లో మన సైనికులు దెబ్బకు దెబ్బ తీసిన విధంగానే వాణిజ్య పరమైన ఆంక్షలను విధించేందుకు కూడా భారత్ సిద్ధమైంది. గగనతలం నుంచి పోరుకు సైతం సన్నద్ధం అయింది. గతం నుంచి మనం ఇంకా నేర్చుకోవలసింది ఏమైనా ఉందీ అంటే అది చైనా ఉద్దేశాలను మరింతగా అర్థం చేసుకోగలగడం. అక్సాయ్ చిన్‌పై చైనా తన నియంత్రణను వదులుకునేలా చేయడానికి బీజింగ్‌తో భారత్ దౌత్యపరమైన సంభాషణలు జరపడం వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. అక్సాయ్ చిన్ వ్యూహాత్మకంగా చైనాకు ఎంతో ప్రాముఖ్యమైనది. ముఖ్య నదులు, యురేనియం నిక్షేపాలు ఉన్న ప్రాంతం అది. అక్కడి నుంచే జి 219 హైవే వెళుతుంది. చైనాలోని రెండు కీలక ప్రాంతాలైన షిన్జాంగ్, టిబెట్లను ఆ దారి కలుపుతుంది. మరైతే అక్సాయ్ చిన్ సమస్యకు పరిష్కారం ఏమిటి? ముందుకు వెళ్లే దారేది? ఒక మార్గం అయితే ఉంది. 1959–60 ప్రతిపాదనల ప్రకారం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్లడం. అప్పుడిక అక్సాయ్ చిన్ చైనాకు, అరుణాచల్ ప్రదేశ్ భౌగోళిక ప్రాంతాలు భారత్ భూభాగానికి వస్తాయి. అంటే సరిహద్దు రేఖల్ని ఉన్నవి ఉన్నట్లుగా ఇరు దేశాలు అంగీకరించడం. ప్రస్తుతం రెండు దేశాలకు శక్తిమంతమైన నాయకులే ఉన్నారు కనుక సరిహద్దు వివాదాలను పరిష్కరించుకుని, రాజకీ యంగా సరళమైన మనుగడ సాగించవచ్చు. అయితే వారు అలా చేయ డానికి సిద్ధంగా ఉన్నారా అన్నదే ప్రశ్న. మరూఫ్ రజా వ్యాసకర్త వ్యూహాత్మక వ్యవహారాల విశ్లేషకులు (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
దొంగదెబ్బ తీసిన కమాండర్లకు ప్రమోషన్.. టాప్ పోస్టులతో సత్కారం!
బీజింగ్: పొరుగు దేశం చైనా మరోసారి తన కుటిల బుద్ధిని చాటుకుంది. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత సైనికులపై దొంగదెబ్బ తీయటంలో కీలకంగా వ్యవహరించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పీఎల్ఏ కమాండ్ జనరల్స్‌పై ప్రశంసలు కురిపించింది. చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. భారత సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు కమాండ్ జనరల్స్‌కు ప్రమోషన్ కల్పిస్తూ.. టాప్ పోస్టులు కట్టబెట్టారు. ప్రస్తుతం భారత సరిహద్దులోని వెస్టర్న్ థియోటర్ కమాండ్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ► జనరల్ హీ వెయిడాంగ్(65)ను సెంట్రల్ మిలిటరీ కమిషన్(సీఎంసీ) కొత్త వైస్ ఛైర్మన్‌గా నియమించారు జిన్‌పింగ్. సీఎంసీకు అధ్యక్షుడి హోదాలో జిన్‌పింగ్ నేతృత్వం వహిస్తారు. మరోవైపు.. సీఎంసీలో ఎలాంటి పదవులు చేపట్టకుండానే వైస్ ఛైర్మన్ పోస్టులోకి జనరల్ హీ వెయిడాంగ్ను నియమించటం గమనార్హం. ► జనరల్ ఝాంగ్ యూక్సియా(72).. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు సంపాదించారు. పదవీ విరమణ వయసు దాటినప్పటికీ ఆయనను ఫస్ట్ ర్యాంకింగ్ వైస్ ఛైర్మన్‌గా కొనసాగించాలని నిర్ణయించారు. పీఎల్ఏలో జిన్‌పింగ్‌కు కుడిభుజంగా ఝాంగ్‌ను చెప్పుకుంటారు. ► జనరల్ జు క్విలింగ్(60)ను 205 మంది సభ్యులుగా ఉన్న పార్టీ కొత్త సెంట్రల్ కమిటీలో నియమించారు జిన్‌పింగ్. మరోవైపు.. నియంత్రణ రేఖ వద్ద సంక్షోభం తలెత్తిన క్రమంలో జనరల్ జు క్విలింగ్ ఇంఛార్జిగా ఉన్నారు. దీంతో 2021 జులైలో డబ్ల్యూటీసీ హెడ్‌గా , లెఫ్టినెంట్ జనరల్ నుంచి జనరల్‌గా పదోన్నతి పొందారు. మరోవైపు.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ(69)కి సైతం పదవీ విరమణ వయసు దాటినప్పటికీ తనతోనే అట్టిపెట్టుకున్నారు జిన్‌పింగ్. పొలిట్ బ్యూరోలోకి వాంగ్ యీని తీసుకున్నారు. పార్టీ విదేశీ వ్యవహారాల సెంట్రల్ కమిషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: చరిత్రకెక్కిన జిన్‌పింగ్.. మావో జెడాంగ్ తర్వాత తొలినాయకుడిగా.. -
భారత్-చైనా సరిహద్దు వివాదంలో కీలక పురోగతి
సాక్షి, న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దు వివాదంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేలా కీలక ముందడుగు పడింది. తూర్పు లద్దాక్ పెట్రోలింగ్ పాయింట్ 15 సమీపంలోని గోగ్రా హైట్స్ హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో ఇరుదేశాలు తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకున్నాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రక్రియ మంగళవారం పూర్తయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అంతేకాదు ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కోసం ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక నిర్మాణాలను కూడా ఇరు దేశాల సైన్యాలు తొలగించాయి. దీంతో 2020 మే తర్వాత ఈ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. గోగ్రా హాట్‌స్ప్రింగ్స్‌లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ సెప్టెంబర్ 12న పూర్తవుతుందని భారత విదేశీ వ్యవహారాల శాఖ గతవారమే చెప్పింది. భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కూడా మంగళవారంతో ఈ ప్రక్రియ పూర్తవుతుందని సోమవారం వెల్లడించారు. శనివారం ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన తూర్పు లద్దాక్‌లో పరిస్థితిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. 2020 మే 5న భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ తలెత్తినప్పటినుంచి తూర్పు లద్దాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత సరిహద్దులోని ఇతర ప్రాంతాలకు ఈ వివాదం విస్తరించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇరు దేశాల సైనికాధికారులు రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. మొత్తం 16 సార్లు కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిపారు. పరస్పర ఒప్పందం ప్రకారం ఎట్టకేలకు బలగాల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేశారు. చదవండి: అందరూ దొంగలే.. అవినీతిపై మంత్రి సంచలన వ్యాఖ్యలు.. -
చైనా మరో కుట్ర.. భారత్‌ను దిగ్బంధించే వ్యూహం పన్నుతోందా?
బీజింగ్: భారత్ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఇప్పటికే శ్రీలంకలోని హంబన్‌టోటా పోర్టులో పరిశోధక నౌకను నిలిపింది చైనా. ఇప్పుడు మరో కుట్రకు తెరతీసింది. బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లో భారీగా పెట్టుబడులు పెట్టిన డ్రాగన్.. వాటి రక్షణ పేరుతో కుటిల బుద్ధిని చూపిస్తోంది. పాకిస్థాన్‌లో సొంతంగా మిలిటరీ ఔట్‌పోస్ట్‌లు నిర్మించి బలగాలను మోహరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు దౌత్యమార్గాల ద్వారా బహిర్గతమైంది. భారత్‌ను అష్టదిగ్బంధనం చేసే వ్యూహం పన్నుతున్నట్లు కనిపిస్తోందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. సెంట్రల్ ఆసియాలో తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మార్గాలను ఎంచుకుంది చైనా. ఆయా దేశాల్లో వ్యూహాత్మక పెట్టుబడులకు తెర తీసింది. పాకిస్థాన్‌లో చైనా పెట్టుబడులు ఇప్పటికే 60 బిలియన్ డాలర్లు దాటాయి. దాయాది దేశం కేవలం ఆర్థికంగానే కాకుండా మిలిటరీ, దౌత్య మద్దతులో చైనాపైనే అధికంగా ఆధారపడుతోంది. దీంతో మిలిటరీ ఔట్‌పోస్ట్‌లు నిర్మించేందుకు పాకిస్థాన్‌పై చైనా ఒత్తిడి చేస్తోంది. ఇప్పటికే పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో, ఆర్మీ చీఫ్ నజరల్ కమర్ జావేద్ బజ్వాతో చైనా రాయబారి నాంగ్ రోంగ్ భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆయన పాకిస్థాన్‌కు వెళ్లారు. చైనా బలగాలను మోహరించేందుకు వీలుగా ఔట్‌పోస్ట్‌లో నిర్మాణంపై పాక్ కొత్త ప్రభుత్వంతో చర్చలు జరిపారు నాంగ్ రోంగ్. చైనా పెట్టుబడులు పెట్టిన ప్రాజెక్టులు, తమ పౌరుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఒత్తిడి తెస్తున్నట్లు పలువురు దౌత్యవేత్తలు చెబుతున్నారు. చైనా ఇప్పటికే గ్వాదర్‌లో సెక్యూరిటీ ఔట్‌పోస్ట్ నిర్మాణానికి డిమాండ్ చేస్తోంది. అలాగే.. గ్వాదర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తమ ఫైటర్ జెట్స్ కోసం వినియోగించుకునేందుకు అనుమతులు ఇవ్వాలని చెబుతోంది. అయితే, భారీగా చైనా బలగాలను దేశంలోకి అనుమతిస్తే స్వదేశ ప్రజలకు ఇబ్బందులు తప్పవని పలువురు ఉన్నతాధికారులు పాకిస్థాన్‌ను హెచ్చరిస్తున్నారు. చైనాకు చెందిన సంస్థలకు 300 బిలియన్ పాకిస్థాన్ రూపాయలను చెల్లించాల్సి ఉంది. రుణాలు తిరిగి చెల్లించలేకపోతే విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లను నిలిపివేస్తేమాని ఇప్పటికే హెచ్చరించాయి చైనా సంస్థలు. పాకిస్థాన్‌లో.. బోస్టన్ ఇండస్ట్రీయల్ జోన్, గ్వాదర్ పోర్ట్, స్పెషల్ జోన్ 1, 2, సీపెక్, మోహ్మద్ మార్బల్ సిటీ, సోస్త్ డ్రై పోర్ట్, మోక్‌పాండస్ సెజ్ వంటివి చైనాకు చెందిన ప్రధాన ప్రాజెక్టులు. చైనా రుణాల ట్రాప్‌లో పాకిస్థాన్ కూరుకుపోయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు.. పాకిస్థాన్ సెక్యూరిటీ విభాగాలపై తమకు ఎలాంటి నమ్మకం లేదని చైనా పరిపాలన విభాగం చెబుతూ వస్తోంది. చైనా ఒత్తిడికి తలొగ్గటం తప్పా పాకిస్థాన్‌కు వేరే మార్గం కనిపించటం లేదు. అయితే, చైనా డిమాండ్‌ను ఆమోదిస్తే అంతర్జాతీయంగా మరింత దిగజారనుంది. ఇదీ చదవండి: భారత్, శ్రీలంక.. ఒక చైనా నౌక -
చైనా వక్రబుద్ధి.. పాకిస్థాన్ ఆర్మీ కోసం పీఓకేలో నిర్మాణాలు
న్యూఢిల్లీ: భారత్ ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్నా చైనా తన వక్రబుద్ధిని మానుకోవటం లేదు. సరిహద్దుల్లో ఏదోరకంగా తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పాకిస్థాన్ ఆర్మీ కోసం పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే), బలోచిస్థాన్, సింధ్ ప్రాంతాల్లోకి ప్రవేశించింది. చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(సీపీఆసీ) నిర్మాణంలో మాత్రమే కాకుండా చైనా ఇంజనీర్లు పీఓకేలోనూ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)కు చెందిన 10-12 మంది వ్యక్తులు పీఓకేలోని శార్దా ప్రాంతంలో కనిపించారు. వారు పాకిస్థాన్ ఆర్మీ కోసం భూగర్భ బంకర్లు నిర్మించటంలో నిమగ్నమయ్యారు. పాక్ సైన్యం ఆ ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తోంది. నియంత్రణ రేఖకు సమీపంలోని నీలం లోయలో 10-15 మంది చైనా ఇంజనీర్లు బంకర్లు నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఫుల్లవాయ్‌గా పిలుస్తారు. కశ్మీర్లోకి ఉగ్రవాదులు చొరబడేందుకు ఎక్కువగా ఈ మార్గాన్నే ఎంచుకుంటారు. మరోవైపు.. సింధ్, బలోచిస్థాన్ ప్రాంతాల్లోనూ చైనా సైనికులు నిర్మాణాలు చేపడుతున్నారు. అలాగే రానికోట్, నవాబ్షా, ఖుజ్దార్ ప్రాంతాల్లోనూ ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే.. పాకిస్థాన్ ఆర్మీకి కావాల్సిన మౌలిక సదుపాయాల నిర్మాణంలో చైనా సైన్యం ఎందుకు పాల్గొంటుందన్న అంశంపై ఎలాంటి స్పష్టత లేదు. సీపెక్ ప్రాజెక్ట్ అనుకున్న స్థాయిలో విజయవంతం కాకపోవటం వల్లే పాకిస్థాన్ సైన్యానికి చైనా ఆర్మీ సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. సీపెక్ ద్వారా సింకియాంగ్‌ను గ్వాదర్ పోర్ట్‌తో అనుసంధానించాలని భావించారు, అయితే అది అక్కడికి చేరుకోవడానికి చాలా దూరంలో ఉంది. ఇదీ చదవండి: చైనా, పాక్ తీరుని తిట్టిపోసిన భారత్! ఊరుకునేది లేదని వార్నింగ్ -
ఎల్ఏసీకి అతి సమీపంలో చైనా యుద్ధ విమానాలు.. భయంతోనే అలా!
సాక్షి, న్యూఢిల్లీ: సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు ఇరు దేశాల మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్నప్పటికీ చైనా కవ్వింపు చర్యలను ఆపడం లేదు. తూర్పు లద్దాఖ్ సరిహద్దులోని వాస్తవాధీన రేఖకు అతి సమీపంలో యుద్ధ విమానాలలో చక్కర్లు కొడుతోంది. గత మూడ్నాలుగు వారాల్లో భారత సైన్యాన్ని కవ్వించేందుకు పలుమార్లు ప్రయత్నించింది. భారత రక్షణ యంత్రాంగం గుట్టును తెలుసుకునేందుకే డ్రాగన్ దేశం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. చైనాకు భారత సైన్యం దీటుగా బదులిస్తోందని సైనిక వర్గాలు తెలిపాయి. డ్రాగన్ దేశం ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా, భద్రతా ముప్పు వాటిల్లేలా చేసినా క్షణాల్లో తిప్పికొట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నాయి. సరిహద్దుకు అతి సమీపంలో మిగ్ 29, మిరాజ్ 2000 యుద్ధ విమానాలకు మోహరించినట్లు వెల్లడించాయి. అదే సమయంలో సంయమనంతో వ్యవహరిస్తూ ఉద్రిక్తతలు పెరగకుండా చూస్తున్నట్లు పేర్కొన్నాయి. భయంతోనే.. అయితే డ్రాగన్ దేశ సైన్యం భయంతోనే యుద్ధ విమానాలతో చక్కర్లు కొడుతున్నట్లు సైనిక వర్గాలు పేర్కొన్నాయి. లద్దాక్ సెక్టార్లో భారత సైన్యం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అప్‌గ్రేడ్ చేసిందని, చైనా సైన్యానికి సంబంధించిన కార్యకలాపాలను అత్యంత సమీపం నుంచి పసిగడుతోందని చెప్పాయి. ఆ భయంతో చైనా యుద్ధ విమానాలతో వాస్తవాధీన రేఖకు సమీపంలో చక్కర్లు కొడుతున్నట్లు పేర్కొన్నాయి. జూన్ 24-25 మధ్య చైనా కవ్వింపు చర్యలు మొదలయ్యాయని, జులై 17న ఇరు దేశాల మధ్య జరిగిన కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల్లోనూ ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. భారత్ కూడా తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో నిఘాను మరింత పటిష్టం చేసినట్లు సమాచారం. చదవండి: సోనియా గాంధీ గురించి అలా మాట్లాడుతారా? బీజేపీ యాంటీ వుమెన్ -
కాళ్లతో తన్నారు.. కరెంట్ షాక్ పెట్టారు
అగర్తలా: చైనా భూభాగంలో గల్లంతైన భారతీయ బాలుడు మిరమ్ తరోన్.. తీవ్ర ఉద్రిక్తతల నడుమ తిరిగి స్వదేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పటిదాకా బంధీగా ఉంచుకుని.. అప్పగించే ముందు తమ కొడుకును చైనా సైన్యం చిత్ర హింసలు పెట్టిందని బాలుడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అయ్యారు. చైనా సైనికులు మిరమ్ తరోన్‌ను చాలాసార్లు తన్నారని, రెండుసార్లు కరెంట్ షాకిచ్చారని తండ్రి ఓపాంగ్ తరోన్ ఆరోపించారు. కుమారుడి రాక సంతోషాన్నిచ్చిందని, కానీ మిరామ్‌ను చైనా బాధించిందని ఆ పేద రైతు వాపోయారు. చైనా భూభాగంలోకి వచ్చినట్లు గమనించి తప్పించుకోవడానికి మిరమ్ యత్నించాడని, కానీ చైనా సైనికులు పట్టుకొని హింసించారని ఓపాంగ్ చెప్పారు. అనంతరం మిరమ్‌ను బంధించి టిబెట్ భాషలో ప్రశ్నించారని, వారి భాష అర్థం కాక తన కుమారుడు సరైన సమాధానమివ్వకపోవడంతో కరెంటు షాకులిచ్చారని తెలిపారు. ఎప్పుడైతే మిరమ్ మిస్సింగ్ వార్త మీడియాలో వచ్చిందో.. ఆపై హింసించడం మానుకున్నారన్నారు. ఇప్పటికీ తన కుమారుడు చాలా బాధను అనుభవిస్తున్నాడన్నారు. మిరమ్‌కు చికిత్సనందిస్తామని భారత ఆర్మీ అభయం ఇచ్చినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. జనవరి 18న మిరమ్ తరోన్ కనిపించకుండా పోయాడు. దీనిపై భారతీయ ఆర్మీ వెంటనే స్పందించి ఆచూకీ కనిపెట్టమని చైనా ఆర్మీని కోరింది. అనంతరం తమ బంధీగా ఉన్న మిరమ్‌ను.. పలు చర్చల అనంతరం జనవరి 27న చైనా ఆర్మీ మిరామ్‌ను భారత్‌కు అప్పగించింది. సంబంధిత వార్త: మిస్సింగ్’ మిరమ్ తరోన్ దొరికాడు! చైనా ఆర్మీ ప్రకటన -
తరోన్‌ను భారత ఆర్మీకి అప్పగించిన చైనా ఆర్మీ
న్యూఢిల్లీ: ఇటీవల అదృశ్యమైన అరుణాచల్‌ప్రదేశ్ యువకుడు మిరమ్ తరోన్‌ను భారతీయ సైనికులకు చైనా ఆర్మీ (పీఎల్ఏ) అప్పగించిందని కేంద్ర న్యాయమంత్రి కిరణ్ రిజుజు గురువారం ప్రకటించారు. అరుణాచల్‌లోని వాచా– దమాయ్ సరిహద్దు ప్రాంతం వద్ద తరోన్‌ను అప్పగించారన్నారు. ఈనెల 18న తరోన్ చైనా భూభాగంలోకి వెళ్లి అదృశ్యమయ్యాడు. అతన్ని వెతికి అప్పగించాలని పీఎల్ఏను భారత ఆర్మీ కోరింది. తరోన్ జాడ కోసం ఆర్మీ చేసిన కృషిని కిరణ్ కొనియాడారు. ఈ మేరకు తరోన్, సైనికులున్న ఫొటోను ఆయన షేర్ చేశారు. తరోన్ ఆచూకీ తెలిసినట్లు ఈ నెల 20న చైనా ఆర్మీ వెల్లడించింది. The Chinese PLA handed over the young boy from Arunachal Pradesh Shri Miram Taron to Indian Army at WACHA-DAMAI interaction point in Arunachal Pradesh today. I thank our proud Indian Army for pursuing the case meticulously with PLA and safely securing our young boy back home 🇮🇳 pic.twitter.com/FyiaM4wfQk — Kiren Rijiju (@KirenRijiju) January 27, 2022 చదవండి: (పాక్‌లో జిహాద్ పేరుతో నిధులు సేకరించొద్దు) -
చైనీయులకు షాకిచ్చే త్రిశూల్.. వజ్ర..!
న్యూఢిల్లీ: పరమశివుని చేతిలో త్రిశూలం..ఇప్పుడిక భారత బలగాల చేతుల్లో ఆయుధంగా మారనుంది. డ్రాగన్ ఆర్మీకి షాకిచ్చేందుకు త్రిశూల్, వజ్ర పేర్లతో ప్రాణహాని కలిగించని ఆయుధాలను భారత సైన్యం సిద్ధం చేసుకుంటోంది. గల్వాన్ ఘటన సమయంలో చైనా బలగాలు ఇనుపరాడ్లు, ఇనుప ముళ్లు లాంటి ఆయుధాలతో భారత సైనికులపైకి దాడికి వచ్చిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లో ఘర్షణల సమయంలో ప్రాణహాని కలిగించని ఆయుధాలనే వాడాలంటూ రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల మేరకు చైనా ఆర్మీ అప్పట్లో వీటిని ఉపయోగించింది. ఈ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని చైనా సరిహద్దుల్లోని భారత బలగాలు దీటైన వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. చైనా సైన్యం(పీఎల్ఏ) వాడిన మాదిరిగా సంప్రదాయ ఆయుధాలనే భారత సైన్యం కూడా సమకూర్చుకుంటోంది. ఈ మేరకు బాధ్యతలను నోయిడాకు చెందిన అపాస్టెరాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ త్రిశూల్, వజ్ర వంటి పేర్లతో ప్రాణహాని కలిగించని సంప్రదాయ ఆయుధాలకు రూపకల్పన చేసింది. దీనిపై అపాస్టెరాన్ సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మోహిత్ కుమార్ ఏఎన్ఐతో మాట్లాడుతూ..‘చైనా బలగాలను ముఖాముఖి ఎదుర్కొనే సమయంలో ప్రాణహాని కలిగించని ఆయుధాలను తయారు చేయమంటూ భారత ఆర్మీ మాకు బాధ్యతలు అప్పగించింది. మేం రూపొందించిన త్రిశూల్, వజ్ర వంటి వాటిని చూసి ఆర్మీ అధికారులు సానుకూలంగా స్పందించారు. ‘శివుని చేతిలో త్రిశూలం స్ఫూర్తిగా తీసుకుని ‘త్రిశూల్’ను తయారు చేశాం. త్రిశూల్ నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది. దీనిని తాకిన శత్రు సైనికుడు కొద్ది సెకన్లలోనే షాక్‌తో పడిపోతాడు. శత్రువుల వాహనాలను అడ్డుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా, వజ్ర.. ఇనుపరాడ్లాగా కనిపించే ఈ ఆయుధం మెరుపులాంటి షాక్ కలిగిస్తుంది. శత్రు సైనికులపై ముఖాముఖి పోరులో దాడి చేసేందుకు, వారి బుల్లెట్ ప్రూఫ్ వాహనాల టైర్లకు పంక్చర్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. చేతికి వేసుకునే గ్లవ్స్ మాదిరిగా ఉండే ‘సప్పర్ పంచ్’అనే ఆయుధం ధరించి శత్రు సైనికుడిని కొడితే ఒకటీ రెండు దెబ్బలకే అతడు షాక్‌తో పడిపోవడం ఖాయం’అని మోహిత్ చెప్పారు. ‘ఈ ఆయుధాలను కేవలం భారత సైన్యం, భద్రతాబలగాల కోసం మాత్రమే రూపకల్పన చేశాం. ఇతర వ్యక్తులు లేదా సంస్థలకు వీటిని విక్రయించం’అని ఆయన అన్నారు. అయితే, వీటి తయారీ బాధ్యతలను ఆర్మీ ఎప్పుడు అప్పగించిందనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. కాగా, నూతన రూపకల్పనలపై ప్రభుత్వం నుంచి గానీ, ఆర్మీ నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. #WATCH 'Trishul' and 'Sapper Punch'- non-lethal weapons-developed by UP-based Apasteron Pvt Ltd to make the enemy temporarily ineffective in case of violent face offs pic.twitter.com/DmniC0TOET — ANI (@ANI) October 18, 2021 చదవండి: గాల్వాన్ లోయలో అమరులైన మన దేశ ముద్దుబిడ్డలు.. -
India, China Military Talks: అసంపూర్తిగానే సుదీర్ఘ సైనిక చర్చలు
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లో మిగతా ప్రాంతాల్లోని ప్రతిష్టంభనపై భారత మరియు చైనా సైనిక కమాండర్ల మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు భారత సైన్యం ప్రకటించింది. అయితే భారత్–చైనా మధ్య 13వ దఫా కార్ప్స్ కమాండర్ స్థాయి సైనిక చర్చలు చుషుల్–మోల్డో బోర్డర్ పాయింట్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చైనా ప్రతిపాదనలను భారత్ సైన్యం అంగీరించడానికీ ముందుకు వచ్చినా చైనా ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదని పేర్కొంది. ఈ సమావేశంలో తూర్పు లడఖ్‌లోని మిగతా ప్రాంతాల్లో సమస్యల పరిష్కార మార్గానికి భారత్ కొన్ని ప్రతిపాదనలు సూచించిన చైనా ఏ మాత్రం ఆమోదించడానికి మొగ్గు చూపలేదని స్పష్టం చేసింది. (చదవండి: భారత స్పేస్ అసోసియేషన్‌ని ప్రారంభించనున్న మోదీ) కాగా, సరిహద్దు ప్రాంతాల్లో ఘర్ణణ వాతావరణం ఏర్పడకుండా ఉండటానికీ సహకరిస్తామని ఇరు సైన్యాలు అంగీకరించినట్లు తెలిపింది. భారత్-చైనాల ద్వైపాక్షిక సంబంధాల దృష్ట్యా సరిహద్దు సమస్యల పరిష్కారానికై కృషి చేస్తున్నమాని భారత్ పేర్కొంది. గోగ్రాలోని రిజల్యూషన్ ఆరు ఫ్లాష్పాయింట్లలో నాలుగింటిలో భారత్ , చైనాలు వెనక్కి తగ్గడానికి అంగీకరించాయి. అదేవిధంగా మిగిలిన గంగాన్, పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ సరిహద్దు ప్రాంతాల్లోని డిప్సాంగ్, హాట్ స్ప్రింగ్స్‌లో చైనా బలగాలు వెనక్కి తగ్గి సహకరించాలని భారత్ ఒత్తిడి చేస్తోంది. ఇటీవల చైనా సైన్యం వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ను అతిక్రమించి ఉత్తరాఖండ్‌లోని బారాహోతి సెక్టార్, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాలంటే డెప్సాంగ్తో సహా మిగిలిన వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా బలగాలు సాధ్యమైనంత త్వరగా వెనక్కి వెళ్లిపోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇదే అత్యుత్తమైన పరిష్కార మార్గం అని భారత్ నొక్కి చెబుతోంది. మే 5,2020న తూర్పు లడఖ్‌లో భారత్–చైనా సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగిన అనంతరం ఇరు దేశాల అధికారులు సంప్రదింపుల కారణంగా 12వ దఫా కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు ఈ ఏడాది జూలై 31న జరిగిన సంగతి తెలిసిందే . (చదవండి: "మేం ఒత్తిడికి తలొగ్గుతామని భ్రమపడొద్దు") -
పీపీ–15 నుంచి వెనక్కి వెళ్లిపోండి: చైనాకు తెగేసి చెప్పిన భారత్
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో మిగిలిన వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా బలగాలు సాధ్యమైనంత త్వరగా వెనక్కి వెళ్లిపోవాలని భారత్ మరోసారి తేల్చిచెప్పింది. భారత్–చైనా మధ్య 13వ దఫా కార్ప్స్ కమాండర్ స్థాయి సైనిక చర్చలు ఆదివారం జరిగాయి. ఇరు దేశాల నడుమ చుషుల్–మోల్డో బోర్డర్ పాయింట్ వద్ద చైనా వైపు భూభాగంలో ఉదయం 10.30 గంటలకు మొదలైన ఈ చర్చలు రాత్రి 7 గంటలకు ముగిశాయని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. 8.30 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన చర్చల్లో కీలకాంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిపాయి. భారత్ తరఫు బృందానికి లేహ్‌లోని 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పి.జి.కె.వీునన్ నేతృత్వం వహించారు. ప్రధానంగా తూర్పు లద్దాఖ్ హాట్‌స్ప్రింగ్స్ ప్రాంతంలోని పెట్రోలింగ్ పాయింట్(పీపీ)–15 నుంచి బలగాల ఉపసంహరణ గురించే చర్చించినట్లు తెలిసింది. గత ఏడాది మే నెలలో చోటుచేసుకున్న ఘర్షణ పురావృతం కాకుండా సరిహద్దుల్లో పెట్రోలింగ్ చేపట్టాలని, ఇందుకోసం కొత్త ప్రోటోకాల్స్ రూపొందించుకోవాలని ఇరు వర్గాలు ఒక అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. అయితే, దీనిపై సైన్యం నుంచి అధికారిక ప్రకటనేదీ వెలువడలేదు. గోగ్రా నుంచి ఉపసంహరణ పూర్తి 2020 మే 5వ తేదీన తూర్పు లద్దాఖ్‌లో భారత్–చైనా సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇరువైపులా పదుల సంఖ్యలో జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా వివిధ స్థాయిల్లో అధికారులు సంప్రదింపులు ప్రారంభించారు. రాజకీయ, దౌత్య, సైనిక పరమైన చర్చలు జరుగుతున్నాయి. 12వ దఫా కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు ఈ ఏడాది జూలై 31న జరిగాయి. ఈ చర్చల్లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గోగ్రా నుంచి తమ బలగాల ఉపసంహరణ ప్రక్రియను భారత్, చైనా పూర్తి చేశాయి. ఇరు దేశాల నడుమ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడాలంటే డెస్పాంగ్‌తో సహా అన్ని వివాదాస్పద ప్రాంతాలపై ఒక ఒప్పందానికి రావాలని భారత్ నొక్కి చెబుతోంది. ఇటీవల చైనా సైన్యం వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ను అతిక్రమించి ఉత్తరాఖండ్‌లోని బారాహోతి సెక్టార్, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. ఇరు దేశాల అధికారులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో 13వ దఫా చర్చలు సాఫీగా సాగడం విశేషం. -
సరిహద్దుల్లో మరోసారి బరితెగించిన చైనా
న్యూఢిల్లీ: చైనా మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. సరిహద్దు సమస్యలపై భారత్‌తో చర్చలు జరుపుతూనే దొంగ దెబ్బ తీయాలని కుయుక్తులు పన్నింది. గత వారంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో యాంగ్త్సే సరిహద్దుల వెంబడి దాదాపుగా 200 మంది చైనా బలగాలు భారత్ భూభాగంలోకి రావడానికి ప్రయత్నించాయి. అయితే, భారత్ వారిని సమర్థవంతంగా అడ్డుకొని వెనక్కి పంపినట్టు ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ఇరు దేశాల బలగాల మధ్య కాసేపు ఘర్షణ నెలకొంది. ఇరుదేశాల సైనికులు బాహాబాహీకి కూడా దిగారు. ‘‘ఇరు సైన్యాలు పరస్పరం భౌతిక దాడులకు కూడా పాల్పడ్డారు. కొన్ని గంటల సేపు ఆ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం కొనసాగింది. ఆ తర్వాత పరస్పర అంగీకారంతో సరిహద్దుల నుంచి వెనక్కి వెళ్లిపోయాయి’’అని ఆ వర్గాలు తెలిపాయి. రోజూ నిర్వహించే పెట్రోలింగ్‌లో భాగంగానే చైనా సైనికులు మన భూభాగంలోకి రావడానికి ప్రయత్నించడాన్ని సైనికులు గుర్తించారు. ఈ సందర్భంగా కొందరు చైనా సైనికుల్ని భారత సైనికులు కొన్ని గంటలసేపు నిర్బంధించి ఉంచారని కూడా వార్తలు వచ్చాయి. స్థానిక కమాండర్ల స్థాయిలో చర్చలు ఒక కొలిక్కి రావడంతో చైనా సైనికుల్ని భారత్ విడిచిపెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జూ లిజియాన్‌ను ప్రశ్నించగా అలాంటి విషయమేదీ తనకు తెలియదని బదులిచ్చారు. తూర్పు లద్దాఖ్ వివాదంపై రెండు దేశాల అత్యున్నత స్థాయి మిలటరీ చర్చలు మరో విడత జరగడానికి కొద్ది రోజుల ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఇటీవల డ్రాగన్ దేశం సరిహద్దుల వెంబడి సైన్యాన్ని మోహరిస్తూ కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో బారాహోతి సెక్టార్లో కూడా 100 మంది చైనా జవాన్లు భారత్ భూభాగంలోకి 5 కిలోమీటర్ల మేర ప్రవేశించి వంతెనను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది మే 5వతేదీన లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు వెంబడి జరిగిన హింసాత్మక ఘటనతో రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఆ తర్వాత పలు దఫాలుగా రెండు దేశాల మధ్య మిలటరీ అధికారులు, దౌత్యప్రతినిధుల, విదేశాంగ మంత్రులు మధ్య చర్చలు జరిగాయి. ఫిబ్రవరిలో పాంగాంగ్ సరస్సు పరిసరాల నుంచి ఇరు దేశాలు బలగాలను పూర్తిగా వెనక్కి తీసుకున్నాయి. ప్రస్తుతం ఇరుపక్షాలకు చెందిన 50 వేల నుంచి 60 వేల బలగాలు సరిహద్దుల వెంబడి మోహరించి ఉన్నాయి. -
China-US: అమెరికా, చైనా మధ్య తొలిసారి సైనిక చర్చలు
బీజింగ్: అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ అధికార పగ్గాలు చేపట్టాక తొలిసారిగా అమెరికా, చైనా మధ్య సైనిక చర్చలు జరిగాయి. అఫ్గాన్‌లో పరిస్థితులపై ఇరు దేశాల మిలటరీ ప్రతినిధుల మధ్య చర్చ జరిగినట్టుగా శనివారం చైనా మీడియా వెల్లడించింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫీస్ ఫర్ ఇంటర్నేషనల్ మిలటరీ కో–ఆపరేషన్ మేజర్ జనరల్ హాంగ్ జూపింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమెరికా మిలటరీ జనరల్ మైఖేల్ చేజ్‌తో చర్చించారు. చదవండి: విమానాశ్రయాన్ని దిగ్బంధిస్తున్న తాలిబన్లు అఫ్గాన్‌లో జరుగుతున్న పరిణామాలు అన్ని దేశాలపై ప్రభావం చూపిస్తాయని చర్చల సందర్భంగా చైనా ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో అమెరికా, చైనా విదేశాంగ మంత్రుల మధ్య అఫ్గాన్ ప్రస్తావన వచ్చినప్పటికీ అమెరికా దానిని నిర్లక్ష్యం చేసిందని చైనా ఆరోపిస్తోంది. అమెరికా, చైనా కలసికట్టుగా అఫ్గాన్ సమస్యపై దృష్టి సారిస్తే ఇరు దేశాలకు పెద్ద ప్రమాదమే తప్పిపోతుందని చైనా మిలటరీ భావిస్తోంది. ఈస్ట్ టర్కెస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్ తిరిగి బలాన్ని పుంజుకొని విస్తరిస్తే చైనా సహా ఎన్నో దేశాలకు ప్రమాదమని, దీనిని అన్ని దేశాలు కలసికట్టుగా ఎదుర్కోవాలని అమెరికాను చైనా కోరినట్టుగా ఆ కథనాలు వెల్లడించాయి. చదవండి: అమెరికా స్థావరాల్లో అఫ్గాన్ శరణార్థులు -
చైనా సైన్యం పూర్తిగా వెనక్కి మళ్లాల్సిందే
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని డెస్పాంగ్, హాట్‌స్ప్రింగ్స్, గోగ్రాతోపాటు ఇతర కీలక ప్రాంతాల నుంచి చైనా సైన్యం వెనక్కి వెళ్లిపోవాలని భారత్ పునరుద్ఘాటించింది. బలగాల ఉపసంహరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని డ్రాగన్ దేశానికి స్పష్టం చేసింది. సరిహద్దుల్లో మోహరించిన ఆయుధ సంపత్తిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. బలగాల ఉపసంహరణపై భారత్, చైనా మధ్య 12వ దఫా సైనిక చర్చలు శనివారం తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) సమీపంలో చైనా వైపు ఉన్న మోల్డో బోర్డర్ పాయింట్ వద్ద జరిగాయి. ఇరు దేశాల సైనికాధికారులు దాదాపు 9 గంటలపాటు చర్చించుకున్నట్లు తెలిసింది. ఈసారి చర్చలు సమగ్రంగా జరిగాయని, పలు కీలక అంశాలపై ఇరు దేశాల అధికారులు అభిప్రాయాలను పంచుకున్నారని భారత సైనిక వర్గాలు వెల్ల డించాయి. అయితే, ఈ భేటీలో చివరకు ఏం తేల్చారన్న దానిపై సైన్యం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. భారత్, చైనా మధ్య ఘర్షణకు కారణమవుతున్న ప్రాంతాల నుంచి ఇరు దేశాల సైన్యం సాధ్యమైనంత త్వరగా వెనక్కి వెళ్లిపోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. హాట్‌స్ప్రింగ్స్, గోగ్రాలో చైనా కార్యకలాపాల పట్ల భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. భారత్, చైనా నడుమ 11వ దఫా చర్చలు ఏప్రిల్ 9వ తేదీన 13 గంటలపాటు జరిగిన సంగతి తెలిసిందే. శనివారం జరిగిన 12వ దఫా చర్చల్లో భారత్ తరపున లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్ పాల్గొన్నారు. తూర్పు లద్దాఖ్‌లో ఎల్ఏసీ వద్ద భారత్, చైనా ప్రస్తుతం దాదాపు 60,000 చొప్పున సైనికులను మోహరించాయి. -
ఎట్టకేలకు దిగొచ్చిన చైనా
న్యూఢిల్లీ/బీజింగ్: తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో గతేడాది జూన్ 15న భారత సైన్యంతో జరిగిన భీకర ఘర్షణలో తమకు ఎలాంటి నష్టం వాటిల్లలేదంటూ ఇన్నాళ్లూ బొంకిన చైనా ప్రజా విముక్తి సైన్యం(పీఎల్ఏ) ఎట్టకేలకు మౌనం వీడింది. నాలుగు దశాబ్దాల తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన అతి పెద్ద ఘర్షణగా రికార్డుకెక్కిన ఈ ఘటనపై దాదాపు ఎనిమిది నెలల తర్వాత మొదటిసారిగా స్పందించింది. భారత సైన్యం చేతిలో పెద్ద సంఖ్యలో చైనా సైనికులు హతమయ్యారని ప్రపంచమంతా నమ్ముతున్నప్పటికీ అర్ధసత్యాన్నే బయటపెట్టింది. ప్రజలకు వాస్తవాలు చెబుతున్నామంటూ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించింది. గల్వాన్ ఘర్షణలో తమ సైనికులు కేవలం నలుగురు ప్రాణాలు కోల్పోయారని శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. వారి త్యాగాలను స్మరించుకుంటూ, సెంట్రల్ మిలటరీ కమిషన్ ఆఫ్ చైనా(సీఎంసీ) వారికి మరణానంతర శౌర్య పురస్కారాలను ప్రదానం చేసినట్లు పీఎల్ఏ తెలియజేసింది. కనీసం 45 మంది చైనా సైనికులు మృతి! గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో తమ సైనికులు 20 మంది మృతిచెందినట్లు భారత సైన్యం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిలో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన కల్నల్ బి.సంతోష్‌బాబు కూడా ఉన్నారు. అయితే, ఈ ఘటనలో చైనా సైన్యం 30 మందిని కోల్పోయినట్లు అప్పట్లో భారత్ వెల్లడించింది. కనీసం 45 మంది చైనా సైనికులు మరణించి ఉంటారని రష్యా అధికారిక న్యూస్ ఏజెన్సీ టీఏఎస్ఎస్ అంచనా వేసింది. గల్వాన్ ఘటనలో చైనా సైన్యానికి సంభవించిన నష్టంపై రకరకరాల ప్రచారాలు సాగుతున్నాయని, వాటికి అడ్డుకట్ట వేసి, ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలన్నదే తమ ప్రయత్నమని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ చెప్పారు. అందుకే మృతుల వివరాలు బయటపెట్టామని అన్నారు. తమ సైనికుల త్యాగాలను ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని చెప్పారు. నేడు భారత్–చైనా మధ్య చర్చలు పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల నుంచి భారత్, చైనా సైనిక బలగాలను, ఆయుధాలను పూర్తిగా ఉపసంహరించుకున్నాయి. హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, డెస్పాంగ్ నుంచి బలగాలను వెనక్కి తీసుకోవడంపై చర్చించేందుకు భారత్, చైనా మధ్య ఉన్నతస్థాయి సైనిక చర్చలు జరుగనున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. కమాండర్ స్థాయి పదో దఫా చర్చలు ఎల్ఏసీ వద్ద చైనా భూభాగంలో మోల్డో బోర్డర్ పాయింట్లో శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని వెల్లడించాయి. పాంగాంగ్ సరస్సు నుంచి బలగాలను వెనక్కి తీసుకున్న తర్వాత జరిగే తొలి చర్చలు ఇవే. -
కలకలం: భారత్‌లోకి చైనా సైనికుడు
న్యూఢిల్లీ : తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సో వద్ద చైనా సైనికుడొకరు వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ని అతిక్రమించి భారత భూభాగంలోకి ప్రవేశించాడు. అతడిని భారత సైన్యం పట్టుకుంది. అతడిని ప్రశ్నిస్తున్నట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్ 19వ తేదీన లద్దాఖ్‌లోని డెమ్చోక్ సెక్టార్లో దారితప్పి ఎల్ఏసీని దాటి వచ్చిన చైనా కార్పొరల్ వాంగ్ యా లాంగ్‌ను భారత బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అతని ప్రవేశం వెనుక గూడచార్య ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో భారత ఆర్మీ అధికారులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు సైనికుడి అదృశ్యంపై చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్కే) స్పందించింది. తమ సైనికుడిని వెంటనే సురక్షితంగా విడుదల చేయాలని భారత ఆర్మీ అధికారులను కోరింది. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆదేశ ఆర్మీఅధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. చీకట్లో దారి తప్పి ప్రమాదవశాత్తూ భారత సరిహద్దుల్లోకి ప్రవేశించాడని, అతన్ని వెంటనే తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేసింది. అతనిపై ఎలాంటి చర్యలకు పాల్పడకుండా వదిలిపెట్టి సరిహద్దుల్లో శాంతిని కొనసాగించాలని చైనా ఆర్మీ పేర్కొంది. కాగా గల్వాన్ లోయలో చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణల అనంతరం ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. అనంతరం ఇరు దేశాల సైనిక అధికారుల చొరవతో సుదీర్ఘ చర్చల అనంతరం శాంతి నెలకొంది. అయితే చైనా సైనికుడు ప్రవేశంపై ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయని భారత్.. అతన్ని విచారించిన అనంతరం విడుదల చేస్తామని తెలిపింది. అయితే అర్థరాత్రి వేళ చైనా జవాన్ సరిహద్దుల్లోకి అక్రమంగా ప్రవేశించడం కలకలం రేపింది. -
సరిహద్దుల్లో డ్రాగన్ మరో కుట్ర
న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లోని భారత్ సరిహద్దుల్లో డ్రాగన్ దేశం మరో కుట్రకు తెరలేపింది. మెక్‌మోహన్ రేఖ చట్టబద్ధతను ప్రశ్నిస్తూ సుమారు 65 చదరపు కిలోమీటర్ల భారత భూభాగం తమదేనంటూ వాదించేందుకు సరిహద్దులకు అత్యంత సమీపంలో మూడు వరకు గ్రామాలను నిర్మించింది. తూర్పు లద్దాఖ్‌లో ఒకవైపు భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతూనే మరోవైపు ఈ ప్రణాళికను అమలు చేసింది. భారత్–చైనా–భూటాన్ సరిహద్దులు కలిసే బూమ్లా కనుమకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో కొండ ప్రాంతంలో ఈ గ్రామాలను ఏర్పాటు చేసింది. ఇంటర్నెట్ సహా అన్ని వసతులను కల్పించింది. అన్ని వేళలా ప్రయాణించేందుకు వీలుండే రహదారులను నిర్మించింది. హన్ చైనీయులు, టిబెట్ కమ్యూనిస్టు పార్టీకి చెందిన పశుపోషకులను ఈ గ్రామాల్లోకి తరలించింది. 2017లో భారత్– చైనా బలగాల మధ్య డోక్లాం ప్రతిష్టంభన చోటు చేసుకున్న ప్రాంతానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో, భూటాన్ భూభాగంలో కొన్ని గ్రామాలను చైనా అక్రమంగా నిర్మించినట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడైన వారానికే ఈ పన్నాగం బయటపడటం గమనార్హం. క్రమక్రమంగా సరిహద్దులకు సమీపంలోకి చొచ్చుకువచ్చి తిష్టవేసేందుకు చైనా ఆర్మీ ప్రయత్నిస్తోందని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ 2017లోనే అప్పటి ఆర్మీ చీఫ్, ప్రస్తుత చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హెచ్చరించడం గమనార్హం. అరుణాచల్ సరిహద్దుల వెంట ఉన్న భూభాగం అంతా తమదేనని వాదించేందుకు చైనా ఈ ఎత్తుగడలకు పాల్పడుతోందని విశ్లేషకుడు డాక్టర్ బ్రహ్మ చెల్లనీ అంటున్నారు. భారత్ మాత్రం మెక్‌మోహన్ రేఖే సరిహద్దులకు ప్రాతిపదిక అంటూ తిప్పికొడుతోంది. ఉపగ్రహ చిత్రాలు ఏం చెబుతున్నాయి? ప్లానెట్ ల్యాబ్స్ నుంచి ఎన్డీటీవీ సంపాదించిన నివేదికను బట్టి ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన ఉపగ్రహ చిత్రాన్ని బట్టి భారత సరిహద్దులకు సమీపంలోని కొండలపై 20 వరకు ఇళ్లున్న ఒకే ఒక్క గ్రామం ఉంది. నవంబర్ 28వ తేదీన ఉపగ్రహం పంపిన రెండో చిత్రంలో అక్కడికి సమీపంలోనే మరో 50 వరకు ఇళ్ల నిర్మాణాలు కనిపిం చాయి. మరో 10 ఇళ్ల నిర్మాణా లతో మరో ప్రాంతం కూడా అక్కడికి సమీపంలోనే ఉన్నట్లు ఎన్డీటీవీ తెలిపింది. మొత్తంగా చైనా ఆ ప్రాంతంలో కనీసం మూడు గ్రామాలను నిర్మించినట్లు తేలింది. చైనా అధికార గ్లోబల్ టైమ్స్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ గ్రామాల్లో ఉండే పశుపోషకులు సరిహద్దులను కాపలా కాస్తుంటారని కూడా పేర్కొంది. ఫిబ్రవరి 17న తీసిన తొలి చిత్రంలో కొత్తగా నిర్మించిన గ్రామాలు (వృత్తంలో) నవంబర్ 28 నాటి రెండో చిత్రంలో కొత్తగా వెలిసిన నివాసాలు (వృత్తంలో) -
చైనా సూపర్ సైనికులను సృష్టిస్తోంది: అమెరికా
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను ఆర్థికంగా దెబ్బ తీయడం కోసమే చైనా కరోనా వైరస్‌ని తయారు చేసి వదిలిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికన్ ఇంటిలిజెన్స్ అత్యున్నతాధికారి ఒకరు ప్రపంచం మీద ముఖ్యంగా అమెరికాపై పట్టు సాధించడం కోసం చైనా జీవశాస్త్రపరంగా అత్యున్నత సామార్థ్యాలు కలిగిన సూపర్ సైనికులను సృష్టిస్తోంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాక రెండవ ప్రపంచయుద్ధం ముగిసిన నాటి నుంచి డ్రాగన్ దేశం ప్రపంచ దేశాల ప్రజాస్వామ్యం, స్వేచ్ఛలకు పెద్ద ప్రమాదంగా మారిందని తెలిపారు. నేషనల్ ఇంటిలిజెన్స్ డైరెక్టర్ రాట్క్లిఫ్ వాల్‌స్ట్రీట్ జర్నల్ వెబ్సైట్లో ప్రచురించిన ఓ ఆర్టికల్‌లో చైనాపై సంచలన ఆరోపణలు చేశారు. పైగా ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి కనుక చైనా విషయంలో నిజాయతీగా ఉండాలని సూచించారు. ఇక ఈ కథనంలో రాట్క్లిఫ్ చైనా జీవశాస్త్రపరంగా మెరుగైన సామార్థ్యాలు కల సూపర్ సైనికులను సృష్టిస్తోందని.. ఇప్పటికే వీరిపై అనేక ట్రయల్స్ కూడా నిర్వహించారని ఆరోపించారు. ఇక చైనా నేడు అమెరికాకు అతిపెద్ద ప్రమాదంగా మారిందని.. కానీ రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన నాటి నుంచే డ్రాగన్ ప్రపంచ దేశాల స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాలకు ముప్పుగా మరిందని వెల్లడించారు. (చదవండి: పక్కా ప్లాన్ ప్రకారమే గల్వాన్ దాడి..) ఇక ఫెడరల్ వార్షిక బడ్జెట్లో 85 బిలియన్ డాలర్ల వనరులను చైనాపై దృష్టి సారించడానికే వినియోగిస్తున్నామన్నారు రాట్క్లిఫ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతేడాదిలో రాట్క్లిఫ్ని అత్యున్నత అమెరికా గుఢచార పదవిలో నియమించారు. ఇక రాట్క్లిఫ్ మాట్లాడుతూ.. చైనా ఆర్థిక గుఢచర్యం రాబ్, రిప్లికేట్ అండ్ రిప్లేస్(దొంగిలించడం, నకలు తయారి చేయడం, రీప్లేస్ చేయడం)గా సాగుతుందని తెలిపారు. చైనా కంపెనీలు అన్ని ఈ విధానాన్ని అనుసరించి అమెరికా కంపెనీల టెక్నాలజీని దొంగతనం చేసి.. దానికి కాపీ తయారు చేసి.. తిరిగి మార్కెట్లోకి తక్కువ ధరకు తీసుకొస్తాయని ఆరోపించారు రాట్క్లిఫ్. అంతేకాక చైనా, అమెరికా రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని దొంగతనం చేసిందని.. ఆ తర్వాతే జిన్‌పింగ్ చైనా మిలిటరీ ఆధునికీకరణ కార్యక్రమాల్లో దూకుడు పెంచారని ఆరోపించారు. చైనా అధికారులు అమెరికా రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలని భావించారని రాట్క్లిఫ్ వెల్లడించారు. అయితే అమెరికా చేసిన టెక్నాలజీ దొంగతనం వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని చైనా విదేశాంగ ప్రతినిధి హువా చునింగ్ ఎద్దేవా చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చైనా మార్కెట్ విస్తరిస్తుండటంతోనే అమెరికా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని విమర్శించారు. (చదవండి: డోక్లాంలో చైనా గ్రామం.. ఖండించిన భూటాన్) ఇదే కాక అమెరికా-బీజింగ్ మధ్య గత కొంతకాలంగా కరోనా వైరస్, హాంకాంగ్‌పై చైనా పట్టు, సౌత్ చైనా సీ అంశంలో తలెత్తిన వివాదం, వాణిజ్యం, జిన్‌పింగ్ పాలనలో చోటు చేసుకుంటున్న మానవ హక్కుల హననం వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య విబేధాలు తలెత్తాయి. ప్రస్తుతం అమెరికా-చైనాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. రాటక్టిఫ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు సృష్టించి, ప్రచారం చేయడం అమెరికాకు కొత్త కాదని చైనా విమర్శించింది. ఇక బుధవారం అమెరికన్ ప్రభుత్వం యూఎస్ ఆడిటింగ్ నిబంధనలను పూర్తిగా పాటించని చైనా కంపెనీలను స్టాక్ ఎక్స్ఛేంజ్ నుంచి తొలగించే చట్టాన్ని ఆమోదించింది. -
చైనా సైనికుడ్ని పీఎల్ఏకు అప్పగించిన భారత సైన్యం
న్యూఢిల్లీ : అనుకోకుండా భారత సరిహద్దుల్లోకి ప్రవేశించిన చైనా సైనికుడ్ని భారత సైన్యం.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)కి అప్పగించింది. బుధవారం ప్రోటోకాల్స్‌ను అనుసరిస్తూ చుషూల్ మోల్డో పాయింట్ వద్ద చైనా సైన్యానికి అప్పగించింది. కాగా, చైనా సైనికుడు వాంగ్ యా లాంగ్ సోమవారం తూర్పు లద్ధాఖ్లోని డెమ్చోక్ వద్ద అనుకోకుండా భారత భూభాగంలోకి ప్రవేశించాడు. దీంతో భారత సైన్యం అతడ్ని అదుపులోకి తీసుకుంది. వాంగ్ జేబులో ఉన్న ఐడెంటిటీ కార్డు ఆధారంగా చైనాలోని సెంట్రల్ జెజియాంగ్, షాంగ్జిజెన్ పట్టణానికి చెందిన వాడిగా గుర్తించింది. ( చైనా సైన్యాన్ని ఎప్పుడు తరిమేస్తారు? ) దీనిపై ఓ అధికారి మాట్లాడుతూ.. ‘‘అతడ్ని అదుపులోకి తీసుకున్న తర్వాత వైద్య సహాయం అందించాము. ఆ తర్వాత అతడినుంచి వివరాలు అడిగి తెలుసుకున్నాము. గూఢచర్యానికి సంబంధించిన కోణం మాకు కనిపించలేదు’’ అని తెలిపారు. తమ సైనికుడు పశువులు మేపుకునే వ్యక్తులకు సహాయం చేస్తుండగా పొరపాటున భారత సరిహద్దులోకి ప్రవేశించాడని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. -
యుద్ధానికి సిద్ధంకండి!
వాషింగ్టన్: భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సైన్యాన్ని యుద్ధానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మీకున్న శక్తియుక్తులన్నింటినీ యుద్ధంపైనే నిమగ్నం చేయండని చైనా ఆర్మీతో జిన్‌పింగ్ చెప్పినట్టుగా సీఎన్ఎన్ ఒక కథనాన్ని ప్రచురించింది. గాంగ్‌డాంగ్‌లో మంగళవారం ఒక సైనిక స్థావరాన్ని సందర్శించిన జిన్‌పింగ్ అక్కడ సైనికులతో మాట్లాడుతూ దేశం పట్ల విశ్వసనీయంగా వ్యవహరించండంటూ వారికి హితబోధ చేశారు. ‘‘మీకున్న శక్తిని, మేధస్సుని యుద్ధ వ్యూహ రచనపై కేంద్రీకరించండి. అందరూ అత్యంత అప్రమత్తంగా ఉండండి. యుద్ధానికి సిద్ధంగా ఉండండి ’’అని జిన్‌పింగ్ చెప్పినట్టుగా సీఎన్ఎన్ తన కథనంలో పేర్కొంది. అయితే ఏ దేశంపైన, ఎప్పుడు దండెత్తడానికి జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారన్న దానిపై స్పష్టత లేదు. తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌తో ఉద్రిక్తతలు, అగ్రరాజ్యం అమెరికాతో విభేదాలతో పాటుగా దక్షిణ చైనా సముద్ర ప్రాంతానికి సంబంధించి ఇతర దేశాలతో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) నావికాదళ జవాన్లతో జిన్‌పింగ్ మాట్లాడారు. మరోవైపు చైనా మీడియా మాత్రం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మరింత బలోపేతం కావడానికి, సైనికుల్లో ఆత్మ విశ్వాసాన్ని నెలకొల్పడానికి జిన్‌పింగ్ సైనిక స్థావరాన్ని సందర్శించారని చెబుతోంది. ఇప్పటివరకు భారత్, చైనా ఏడు రౌండ్లు చర్చలు జరిగినప్పటికీ ఉద్రిక్తతల నివారణకు చర్యలు అమలు చేయడంలో చైనా వెనుకడుగ వేస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో జిన్‌పింగ్ నోటి వెంట యుద్ధం ప్రస్తావన తేవడం మరింత ఆందోళనని పెంచుతోంది. -
ఎల్ఏసీ వద్ద పాకిస్తాన్ సైనికులు!
న్యూఢిల్లీ/లేహ్: భారత్–చైనా సరిహద్దు అయిన వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చైనా సైన్యంతోపాటు దాని సన్నిహిత మిత్ర దేశం పాకిస్తాన్ సైనికులు కూడా తిష్ట వేశారా? చైనాకు మద్దతుగా వారు కూడా పహారా కాస్తున్నారా? చైనా జర్నలిస్టు షెన్ షెవీ శనివారం షేర్ చేసిన ఓ వీడియోను గమనిస్తే ఇది నిజమేనని స్పష్టమవుతోంది. 52 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో చైనా సైనికులతోపాటు గుబురు గడ్డంతో ఉన్న మరో సిపాయి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాడు. అతడి రూపురేఖలు, ఎత్తు, దేహ దారుఢ్యం వంటివి చైనా పౌరుల కంటే పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఎల్ఏసీ వద్ద చైనాకు సాయంగా పాకిస్తాన్ సైన్యం సైతం రంగంలోకి దిగిందని పలువురు భావిస్తున్నారు. అలాగే పాకిస్తాన్ సైనికులకు చైనా శిక్షణ ఇస్తోందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల సరిహద్దులో భారత్–చైనా సైనికుల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 12న భారత్–చైనా ఆర్మీ ఏడో రౌండ్ చర్చలు న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో నెలలుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించుకునే దిశగా భారత్–చైనా ఆర్మీ ఏడో దఫా చర్చలు ఈ నెల 12వ తేదీన జరగనున్నాయి.తూర్పు లద్దాఖ్‌లోని ఉద్రిక్త ప్రాంతాల నుంచి ఇరు దేశాలు సైన్యాలను ఉపసంహరించుకునే కచ్చితమైన రోడ్ మ్యాప్ రూపొందించడమే ఈ సమావేశం ఎజెండా అని విశ్వసనీయ వర్గాల సమాచారం. సెప్టెంబర్ 21వ తేదీన జరిగిన చర్చల్లో సరిహద్దుల్లోకి మరిన్ని అదనపు బలగాలను పంపించరాదనే నిర్ణయంతోపాటు పలు కీలక అంశాల్లో ఏకాభిప్రాయం సాధించారు. సైన్యం, వైమానిక దళం ఉమ్మడి కార్యాచరణ తూర్పు లద్దాఖ్‌లో చైనా సైన్యం దూకుడును అడ్డుకోవాలని భారత సైన్యం నిర్ణయించింది. వైమానిక దళంతో కలిసి ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని భావి స్తోంది. సరిహద్దులో చెలరేగిపోతున్న చైనా సైనికులకు తగిన గుణపాఠం నేర్పడానికి భారత సైన్యం, వైమానిక దళం సన్నద్ధమ వుతున్నాయి. త్రివిధ దళాలను ఎప్పటి కప్పుడు సమన్వయ పరుస్తూ ముందుకు నడిపించడానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సూచనలతోనే సైన్యం, వైమానిక దళం కలిసి పని చేయనున్నాయి. లేహ్ ఎయిర్ ఫీల్డ్‌లో ఇప్పటికే వైమానిక దళం యుద్ధ విమానాలను మోహరించింది. వాస్తవా« దీన రేఖ(ఎల్ఏసీ) వద్ద పరిస్థితి మరింత దిగజారితే వెంటనే ఉమ్మడిగా కొన్ని ఆపరేషన్లు చేపట్టడానికి సైన్యం, వైమానిక దళం ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
భారత ఆర్మీకి భయపడి ఏడ్చిన చైనా జవాన్లు!
బీజింగ్: భారత్-చైనా సరిహద్దుల మధ్య కొంతకాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తూర్పు లద్దాఖ్‌లోని 20 ప్రధాన పర్వత ప్రాంతాలపై భారత సైన్యం ఆధిపత్యం సాధించడంతో ఆయా ప్రాంతాల్లో చైనా అదనపు బలగాలను మెహరించింది. ఈ నేపథ్యంలో ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో భారత సరిహద్దు ప్రాంతమైన లద్దాఖ్‌కు బస్సులో వెళుతున్న చైనా జవాన్లు.. మనసులో బాధను బయటకు కక్కలేక, మింగలేక తెగ అవస్థ పడుతున్నారు. అదే సమయంలో భావోద్వేగంగా సాగే 'గ్రీన్ ఫ్లవర్స్ ఇన్ ద ఆర్మీ' అనే మిలిటరీ పాటకు గొంతు కలుపుతూ కన్నీళ్లు కార్చారు. ఈ వీడియో తైవాన్ మీడియా కంటపడటంతో డ్రాగన్ దేశానికి తనదైన శైలిలో చురకలు అంటించింది. (చదవండి: చైనాకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్) "సరిహద్దులో గస్తీ కాయడానికి వెళ్తున్న చైనా జవాన్లు భారత సైన్యంతో తలపడేందుకు భయపడి ఏడుస్తున్నారు" అంటూ కథనాలు రాసింది. అసలే భారత్ పేరు వింటేనే తోక తొక్కిన తాచులా లేస్తున్న చైనాకు ఈ కథనాలు అస్సలు మింగుడు పడలేదు. దీంతో తైవాన్ కథనాలను ఖండిస్తూ.. తమ యువ సైనికులు అప్పుడే వారి కుటుంబాలకు తొలిసారిగా వీడ్కోలు పలికి వస్తున్నందువల్లే కంటతడి పెట్టుకున్నారని చైనా వివరణ ఇచ్చింది. పైగా వారు పాడుతుంది చైనా మిలిటరీ సాంగ్ కావడంతో సహజంగానే ఉద్వేగానికి లోనయ్యారని స్పష్టం చేసింది. ఇక ఈ వీడియోను అన్హూయ్ ప్రావిన్స్‌లోని ఫుయాంగ్ రైల్వే స్టేషన్ సమీపంలో చిత్రీకరించారు. (చదవండి: ఇండియన్ అవెంజర్స్ వచ్చేశారు) 上车后被告知上前线 炮灰们哭的稀里哗啦!pic.twitter.com/wHLMqFeKIa — 自由的鐘聲🗽 (@waynescene) September 20, 2020 -
మళ్లీ చైనా కాల్పులు
న్యూఢిల్లీ/జమ్మూ: భారత సైనికులను బెదిరించే ఉద్దేశంతో ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర తీరం వద్ద చైనా సైనికులు గతవారం మరోసారి గాలిలో కాల్పులు జరిపారు. భారత్, చైనా దేశాల విదేశాంగ మంత్రులు జైశంకర్, వాంగ్ యిల మధ్య రష్యా రాజధాని మాస్కోలో చర్చలు జరగడానికి ముందు ఫింగర్ 4 రిడ్జ్‌లైన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. వ్యూహాత్మకంగా కీలకమైన ఆ ప్రాంతంలో ఉన్న భారత జవాన్ల వైపు భారీ సంఖ్యలో చైనా సైనికులు దూకుడుగా వచ్చారని, అయితే, భారత జవాన్లు దీటుగా ఎదుర్కోవడంతో వెనక్కు వెళ్లారని వివరించాయి. వెనక్కు వెళ్తూ.. భారత సైనికులను బెదిరించేందుకు గాలిలో 100 నుంచి 200 రౌండ్లు కాల్పులు జరిపారని వెల్లడించాయి. 45 ఏళ్ల తరువాత తొలిసారి సెప్టెంబర్ 7న తూర్పు లద్దాఖ్‌లోని చైనా సరిహద్దుల్లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలోని రెజాంగ్ లా రిడ్జ్‌లైన్ వద్ద ఉన్న భారత జవాన్లను బెదిరించే లక్ష్యంతో చైనా సైనికులు గాలిలో పలు రౌండ్లు కాల్పులు జరిపారు. మనవాళ్లే మెరుగు తూర్పు లద్దాఖ్‌లో ప్రతికూల వాతావరణం ఉండే చలి కాలంలో కూడా.. చైనాతో పూర్తి స్థాయి యుద్ధానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ రిటైర్డ్ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. యుద్ధం తప్పని పరిస్థితులనే చైనా కల్పిస్తే.. సుశిక్షితులైన, సంసిద్ధంగా ఉన్న, మానసికంగా ధృఢంగా ఉన్న భారత బలగాలను వారు ఎదుర్కోవాల్సి ఉంటుందని బ్రిగేడియర్(రిటైర్డ్) హేమంత్ మహాజన్ హెచ్చరించారు. మానసికంగా, శారీరకంగా చైనా సైనికుల కన్నా.. భారత జవాన్లు దృఢమైనవారన్నారు. చైనా సైనికులు ప్రధానంగా పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన సున్నితమైన వారని, విధుల్లో భాగంగా సంక్లిష్ట క్షేత్ర పరిస్థితుల్లో ఎక్కువకాలం ఉన్నవారు కాదని వివరించారు. మొదట బుధవారం ఉదయం ఈ ప్రకటన భారత సైన్యం నార్తర్న్ కమాండ్ ప్రజా సంబంధాల అధికారి(పీఆర్ఓ) నుంచి మీడియాకు వచ్చింది. కానీ, ఆ తరువాత ఆ ప్రకటనలోని అంశాలు నార్తర్న్ కమాండ్ లేదా ఇండియన్ ఆర్మీ అభిప్రాయాలు కావని ఆ పీఆర్ఓ వివరణ ఇచ్చారు. ఈ వివరాలన్నీ పదవీ విరమణ చేసిన బ్రిగేడియర్ హేమంత్ మహాజన్‌వని వివరించారు. శాంతి, సుస్థిరతకు కట్టుబడి ఉన్నాం భారత్ సరిహద్దుల్లో శాంతి, సుస్థిరతకు కట్టుబడి ఉన్నామని చైనా ప్రకటించింది. భారత్‌తో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలను గౌరవిస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో తమ దేశ సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో చేసిన ప్రకటనపై స్పందించాలన్న మీడియా ప్రశ్నకు.. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ బుధవారం పై విధంగా స్పందించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు తాము కారణంకాదని చైనా తెలిపింది. దీర్ఘకాల మోహరింపునకు సిద్ధం బ్రిగేడియర్(రిటైర్డ్) హేమంత్ మహాజన్ వాదన ప్రకారం.. సరిహద్దుల్లో దీర్ఘకాలం మోహరించేందుకు భారత దళాలు సిద్ధమై ఉన్నాయి. లద్దాఖ్ అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలున్న ప్రాంతం. ఇక్కడ నవంబర్ తరువాత 40 అడుగుల వరకు మంచు పేరుకుపోయే పరిస్థితి ఉంటుంది. మైనస్ 30 నుంచి మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఇక్కడ సర్వసాధారణం. దానికి తోడు చలిగాలులు పరిస్థితిని మరింత దిగజారుస్తాయి. రోడ్లను మంచు కమ్మేస్తుంది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ.. భారత్‌కు ఉన్న సానుకూల అంశం సుశిక్షితులైన మన సైనికులే. చలి కాలంలో యుద్ధం సాగించేందుకు అవసరమైన అనుభవం మన సైనికులకు ఉంది. స్వల్ప వ్యవధిలోనే రంగంలోకి దిగగల మనోస్థైర్యం కూడా మనవారికి ఉంది. చైనా సరిహద్దుల కన్నా దారుణమైన వాతావరణ పరిస్థితులు ఉండే సియాచిన్‌లో నెలల తరబడి ఉన్న అనుభవం మన సైనికులకు ఉంది. లద్దాఖ్‌కు చేరుకునేందుకు ఇప్పటివరకు రెండు మార్గాలు ఉన్నాయి. తాజాగా ‘దార్చా టు లేహ్’ మార్గం అందుబాటులోకి రావడంతో యుద్ధ, సహాయక సామగ్రి తరలింపు మరింత సులభమైంది.పెద్ద సంఖ్యలో ఎయిర్‌బేస్‌లు ఉండటం భారత్‌కు కలసివచ్చే అంశం. -
భారతీయుల కిడ్నాప్.. చైనా స్పందన
న్యూఢిల్లీ: భారత్-చైనా ఉద్రిక్తతల మధ్య డ్రాగన్ దళాలు గత వారం ఐదుగురు భారతీయులను సరిహద్దుల దగ్గర నుంచి కిడ్నాప్ చేశాయనే వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే సెప్టెంబర్ 5న ట్వీట్ ద్వారా మొదటిసారి ఈ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో దీని గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయుల అదృశ్యం గురించి చైనా సైన్యానికి హాట్‌లైన్ మెసేజ్ పంపించామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ క్రమంలో చైనా ఇలా స్పందించడం గమనార్హం. ‘ఆ ప్రాంతంలో ఐదుగురు భారతపౌరుల అదృశ్యం గురించి భారత సైన్యం పీఎల్ఏకు సందేశం పంపించిందనే దాని గురించి కూడా మా దగ్గర ఎటువంటి వివరాలు లేవు’ అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిజియన్ జావో వ్యాఖ్యానించినట్లు సమాచారం. అరుణాచల్ ప్రదేశ్‌ను తామెప్పుడూ గుర్తించలేదన్న చైనా.. అది తమ దేశంలోని దక్షిణ టిబెట్ ప్రాంతమని సంచలన వ్యాఖ్యలు చేసింది. (చదవండి: ఆగని డ్రాగన్ ఆగడాలు) వేటకు వెళ్లిన సమయంలో టగిన్ తెగకు చెందిన టోచ్ సింగ్కమ్, ప్రసత్, రింగ్లింగ్, డోంగ్టు ఎబియా, తను బకెర్, ఎంగ్రూ దిరి అనే ఐదుగుర్ని చైనా సైన్యం అపహరించింది. మరో ఇద్దరు అక్కడి నుంచి తప్పించుకొని రావడంతో...ఈ విషయం వెలుగు చూసినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 37-పసిఘాట్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నినాంగ్ ఎరింగ్ ట్విటర్లో ‘కొన్ని నెలల ముందు, ఇలాంటి సంఘటన జరిగింది. మరోమారు పునరావృతం అయ్యింది. చైనాకు తగిన సమాధానం ఇవ్వాలి’ అని ట్వీట్ చేయడంతో అని ఈ విషయం మొదట వెలుగులోకి వచ్చింది. ఐదుగురిని అపహరించారని.. జిల్లాలోని నాచో గ్రామం నుంచి పీఎల్ఏ వారిని కిడ్నాప్ చేసిందని ఎరింగ్ తెలిపారు. -
భారత పౌరులను కిడ్నాప్ చేసిన చైనా ఆర్మీ!
న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. తమ రాష్ట్రంలోని సుబన్సిరి జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులను చైనా ఆర్మీ అపహరించిందని ఎమ్మెల్యే నినాంగ్ ఎరింగ్ ట్విటర్లో పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని అరుణాచల్ టైమ్స్ వార్తా సంస్థ కూడా ట్విటర్లో పేర్కొనడం గమనార్హం. మరోవైపు ఐదు నెలల క్రితం కూడా ఇలాంటి ఘటనే జరిగిందని ఎమ్మెల్యే ఎరింగ్ వెల్లడించారు. మార్చి 19న సుబన్సిరి జిల్లా ఎగువ ప్రాంతంలోని మెక్‌మోహన్ రేఖకు సమీపంలో 21 ఏళ్ల వ్యక్తిని చైనా ఆర్మీ అపహరిందని తెలిపారు. ఇక తాజాగా కిడ్నాప్‌నకు గురైన వారి వివరాలతో కూడిన స్క్రీన్ షాట్‌ను కూడా ఎమ్మెల్యే ఎరింగ్ షేర్ చేశారు. అయితే, ఈ ఘటన జరిగిందెప్పుడన్నది మాత్రం ఎమ్మెల్యే చెప్పలేదు. కిడ్నాప్ ఘటనపై చైనా స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, తూర్పు లద్దాఖ్‌లో యథాతథ స్థితిని చెడగొట్టిన చైనా ప్యాంగ్యాంగ్ సరస్సు తీరంలోని భూభాగంలోకి చొరబడదామనుకున్న యత్నాలను భారత్ సమర్థంగా ఎదుర్కున్న సంగతి తెలిసిందే. దాంతోపాటు భారత దళాలు రక్షణపరంగా కీలకమై స్థావరాలకు చేరుకుని చైనాపై పైచేయి సాధించాయి. దీంతో భారత్ చర్యలను చైనా ఖండించగా.. నియంత్రణ రేఖను దాటిపోలేదని భారత్ సమాధానమిచ్చింది. ఇదిలాఉండగా.. ఇరు దేశాల రక్షణశాఖ మంత్రులు మాస్కోలో నేడు సమావేశమయ్యారు. (చదవండి: చైనా రక్షణ మంత్రితో రాజ్‌నాథ్ సింగ్ భేటీ) SHOCKING NEWS: Five people from Upper Subansiri district of our state Arunachal Pradesh have reportedly been ‘abducted’ by China’s People’s Liberation Army (PLA). Few months earlier,a similar incident happened. A befitting reply must be given to #PLA and #CCPChina. @PMOIndia https://t.co/8gRdGsQfId pic.twitter.com/KbDMJ3bUi2 — Ninong Ering (@ninong_erring) September 4, 2020 -
సైనికుల అంత్యక్రియలు.. చైనా అభ్యంతరం!
బీజింగ్: గల్వాన్ వ్యాలీ ఘటనపై చైనా ఇప్పటికి కూడా వాస్తవాలను వెల్లడించడం లేదు. ఈ క్రమంలో నాటి ఘర్షణలో మరణించిన సైనికులకు ప్రభుత్వ లాంఛనాలు కాదు కదా.. కనీసం సాంప్రదాయపద్దతిలో అంత్యక్రియలు కూడా నిర్వహించకూడదంటూ చైనా ప్రభుత్వం ఆదేశించినట్లు అమెరికా ఇంటిలిజెన్స్ తెలిపింది. ఈ మేరకు సదరు సైనిక కుటుంబాలపై చైనా ఒత్తిడి తెచ్చినట్లు ఇంటిలిజెన్స్ వెల్లడించింది. గత నెల 15న గల్వాన్ వ్యాలీ ఘర్షణలో ఇరు దేశాలు సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. నాటి ఘటనలో అమరులైన భారత సైనిక వీరులకు యావత్ దేశప్రజలు నివాళులర్పించిన సంగతి తెలిసిందే. కేంద్రం అమరులైన సైనికుల వివరాలు వెల్లడించడమే కాక వారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. ఇదే కాక జూన్ నెల మన్‌కీబాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ సైనికులు కుటుంబాలకు సంతాపం తెలిపారు. (గల్వాన్ దాడి; విస్తుగొలిపే నిజాలు!) అయితే గల్వాన్ వ్యాలీ ఘర్షణ జరిగి నెలరోజులు కావస్తున్నప్పటికి చైనా మాత్రం ఇంకా తన మరణించిన సైనికులు వివరాలు వెల్లడించలేదు. ఆ కుటుంబాలను ఓదార్చడం కాదు కదా కనీసం ధైర్యం కూడా చెప్పలేదని అమెరికా ఇంటిలిజెన్స్ అభిప్రాయపడింది. నాటి ఘర్షణలో సుమారు 35 చైనా సైనికులు మరణించినట్లు తెలిపింది. అయితే చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ వీరికి ఒక్కొక్కొరికి సాంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు నిర్వహించకూడదని ఆదేశించినట్లు సమాచారం. అంతేకాక.. అందరిని ఒకేసారి ఖననం చేయాల్సిందిగా ఆదేశించినట్లు అభిప్రాయపడింది. దీనిపై సదరు సైనికుల కుటుంబాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఇలా ఆదేశించినట్లు చైనా ప్రభుత్వం సమాధానమిచ్చినట్లు సమాచారం. (గల్వాన్‌పై ఎందుకు చైనా కన్ను?) -
వెనక్కి తగ్గిన చైనా
న్యూఢిల్లీ: దాదాపు రెండు నెలలుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న చైనా సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్‌లో శాంతి, సంయమనం దిశగా తొలి అడుగులు పడ్డాయి. ఉద్రిక్తతలకు కేంద్ర స్థానమైన గల్వాన్‌లోయ నుంచి సోమవారం చైనా దళాలు వెనక్కు వెళ్లాయి. పెట్రోలింగ్ పాయింట్(పీపీ) 14 వద్ద నిర్మించిన తాత్కాలిక శిబిరాలు, ఇతర నిర్మాణాలను తొలగించాయి. దాదాపు కిలోమీటరుకు పైగా చైనా బలగాలు వెనక్కు వెళ్లాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. అయితే, ఎంత దూరం వెనక్కు వెళ్లాయో కచ్చితంగా తెలియదన్నాయి. ఇరుదేశాల కమాండర్ స్థాయి ఆర్మీ అధికారుల మధ్య జరిగిన చర్చల్లో కుదిరిన ఒప్పందాల మేరకు చైనా బలగాల ఉపసంహరణ ప్రారంభమైందని వెల్లడించాయి. అయితే, భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ రంగంలోకి దిగిన తరువాతే ఈ ప్రక్రియ వేగవంతమైనట్లు తెలుస్తోంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో ధోవల్ ఆదివారం ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. బలగాల ఉపసంహరణను వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఈ చర్చల సందర్భంగా నిర్ణయించారు. సరిహద్దుల్లో శాంతి నెలకొనాలంటే ముందు బలగాల ఉపసంహరణ జరగాలని, అభిప్రాయభేదాలు ఘర్షణలుగా మారకుండా జాగ్రత్త పడాలని ఇరువురు అంగీకారానికి వచ్చారు. ధోవల్, వాంగ్ యి భారత్, చైనాల తరఫున సరిహద్దు చర్చల్లో ప్రత్యేక ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. రెండు దేశాల ఆర్మీలకు భారీగా ప్రాణనష్టం సంభవించిన జూన్ 15 నాటి గల్వాన్ ఘర్షణల తరువాత ఈ ఇద్దరు చర్చించుకోవడం ఇదే ప్రథమం. సరిహద్దుల్లో ఇటీవలి పరిణామాలపై ఆదివారం నాటి చర్చల్లో ధోవల్, వాంగ్ నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చారని భారత విదేశాంగ శాఖ ఆదివారం ప్రకటించింది. వాస్తవాధీన రేఖను ఇరుదేశాలు గౌరవించాలని, య«థాతథ స్థితిని ఏకపక్షంగా ఎవరూ ఉల్లంఘించరాదని అంగీకారానికి వచ్చారని తెలిపింది. సరిహద్దుల్లో పూర్తి స్థాయిలో శాంతి నెలకొనేవరకు దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు కొనసాగించాలని ధోవల్, వాంగ్ యి నిర్ణయించారని పేర్కొంది. వేగంగా, దశలవారీగా వివాదాస్పద ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకునే విషయంపై అంగీకారానికి వచ్చినట్లు తెలిపింది. దీనికి సంబంధించి ఇరు దేశాల ఆర్మీ కమాండర్ స్థాయి చర్చల్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని నిర్ణయించారని పేర్కొంది. ద్వైపాక్షిక సంబంధాలు మరింత సానుకూలంగా ముందుకు సాగాలంటే సరిహద్దుల్లో శాంతి నెలకొనడం ఆవశ్యకమని ఇరువురు ఏకాభిప్రాయానికి వచ్చారని తెలిపింది. ధోవల్, వాంగ్ యి మధ్య జరిగిన చర్చలపై చైనా విదేశాంగ శాఖ కూడా ప్రకటన విడుదల చేసింది. ఇరువురి మధ్య సరిహద్దు వివాదానికి సంబంధించి లోతైన చర్చ జరిగిందని పేర్కొంది. భారత్, చైనాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 70 సంవత్సరాలు అవుతున్న విషయాన్ని వాంగ్ చర్చల్లో ప్రస్తావించారని వెల్లడించింది. పీపీ 14, పీపీ 15, పీపీ 17ల నుంచి వెనక్కు.. పీపీ 14, పీపీ 15, పీపీ 17ల నుంచే కాకుండా, గొగ్రా హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల నుంచి కూడా చైనా బలగాలు, వాహనాలు సోమవారం వెనక్కు వెళ్లాయి. పాంగాంగ్ సొ నుంచి వెనక్కు వెళ్లాయా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియను భారత్ నిశితంగా పరిశీలిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా భారత్‌కు పెరిగిన మద్దతు, ఇటీవల లేహ్ పర్యటనలో ప్రధాని మోదీ ఇచ్చిన స్పష్టమైన సందేశం.. చైనా తాజా నిర్ణయానికి దోహదపడి ఉండొచ్చని పేర్కొన్నాయి. సరిహద్దు వివాదంపై చైనాతో దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా తెలిపారు. చర్చలే ప్రారంభం కానట్లయితే, పరిస్థితి మరింత దారుణంగా మారేదని వ్యాఖ్యానించారు. ‘కరోనా మహమ్మారి సమయంలో దౌత్య సంబంధాలు’ అనే అంశంపై జరిగిన వెబినార్‌లో సోమవారం ఆయన పాల్గొన్నారు. ‘దేశాలు పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలి. చర్చలు జరగాలి. అలా జరగని పక్షంలో, సమస్యలు, ఘర్షణలు పెరుగుతాయి. ఉదాహరణకు, చైనాతో సరిహద్దు వివాదానికి సంబంధించి చర్చలు జరగనట్లయితే, పరిస్థితి మరింత దారుణంగా మారేది’ అని వివరించారు. -
423 మీటర్లు భారత భూభాగంలోకి..
న్యూఢిల్లీ: చైనా చెప్పేదొకటి, చేసేదొకటి అన్నదానికి రోజు కొక సాక్ష్యం వెలుగులోకి వస్తూనే ఉంది. లద్దాఖ్ సరిహద్దుల్లోని గల్వాన్ లోయ సమీపంలో చైనా సైన్యం 423 మీటర్ల మేరకు భారత భూభాగంలోకి వచ్చినట్టుగా ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా వెల్లడవుతోంది. జూన్ 25 నాడు తీసిన చిత్రాల్లో మొత్తం చైనాకు చెందిన 16 టెంట్లు , మరో అతి పెద్ద శిబిరం, 14 వాహనాలు భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చినట్టుగా జాతీయ మీడియా ప్రసారం చేసిన ఫోటోల్లో స్పష్టంగా తెలుస్తోంది. 1960–61లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రచురించిన ఒక డాక్యుమెంట్ ప్రకారం సరిహద్దుల్లో ఎవరి భూభాగం ఎంతవరకో అన్నది ఒక స్పష్టమైన వివరణ ఉంది. ఇరుదేశాలు సరిహద్దు భూభాగాలపై ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత రూపొందించిన డాక్యుమెంట్ ఇది. కానీ చైనా ఆ ఒప్పందాన్ని తుంగలోకి తొక్కింది. గల్వాన్ నదికి ఉత్తరంగా భారత్ భూభాగాన్ని 423 మీటర్ల మేరకు ఆక్రమించుకొని చైనా దళం తిష్టవేసుకొని కూర్చుంది. -
లద్దాఖ్‌కు క్షిపణి వ్యవస్థ
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి ముందుకు చొచ్చుకువచ్చిన చైనా ఆర్మీ వెనక్కి తగ్గేది లేదంటూ మొండికేసింది. పైపెచ్చు వివాదాస్పద ప్రాంతాల్లోకి భారీగా సైనిక బలగాలను దించుతోంది. దీంతో భారత్ అదే స్థాయిలో చర్యలు చేపడుతోంది. లద్దాఖ్‌కు ఆర్మీతోపాటు వైమానిక బలగాలను తరలించింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) పాల్పడే ఎలాంటి దుస్సాహసాన్నైనా తిప్పికొట్టేందుకు కీలకమైన గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థలను తరలించింది. గల్వాన్ ఘటన జరిగిన పెట్రోల్ పాయింట్–14 వద్దకు రెండు దేశాలు బలగాలను, సైనిక సంపత్తిని భారీగా తరలించాయి. ఈ ఘటన జరిగిన అనంతరం అదే రోజు రెండు దేశాల కార్ప్స్ కమాండర్ల స్థాయిలో చర్చలు ఒక వైపు సాగుతుండగానే చైనా అబ్జర్వేషన్ పోస్టులు, టెంట్లతోపాటు గోడను నిర్మించినట్లు ఉపగ్రహ చిత్రాల్లో తేలింది. అక్కడి నుంచి వెనక్కి తగ్గేందుకు చైనా నిరాకరించడంతో ఆ రోజు జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. గతంలో ఎన్నడూ కూడా గల్వాన్ లోయను తమ మ్యాప్‌లో చైనా చూపించుకోలేదు. అయినప్పటికీ, అది తమ భూభాగం కాబట్టే అక్కడికి వచ్చామనీ, తిరిగి ఎందుకు వెనక్కి వెళ్లాలని చైనా ప్రతినిధులు వాదించినట్లు సమాచారం. ఆ తర్వాత జరగాల్సిన చర్చల తేదీలు కూడా ఖరారు కాకపోవడం గమనార్హం. ఇదే సమయంలో రెండు దేశాలు ఎల్ఏసీ వెంట ఆయుధ సంపత్తిని, బలగాలను మోహరించడం కొనసాగిస్తున్నాయి. మరో మూడు నెలల తర్వాత లద్దాఖ్‌లో మళ్లీ మంచు కురియడం మొదలవుతుంది. ఆ సమయంలో లద్దాఖ్‌కు మిగతా భారత దేశంతో దాదాపు 6 నెలలపాటు సంబంధాలు తెగిపోతాయి. భారత సైన్యం కూడా అటువంటి పరిస్థితులకు తగ్గట్లుగా ఏర్పాట్లకు సిద్ధమైంది. చైనా మోహరింపులిలా.. ► ఎల్ఏసీ వెంట చైనా భారీగా బలగాలు, ట్యాంకులు, క్షిపణులు, యుద్ధ విమానాలను మోహరించింది. పాంగాంగ్ త్సోలోని ఫింగర్4 వద్ద హెలిప్యాడ్‌ను ఏర్పాటుచేసింది. ► సుఖోయ్–30 వంటి యుద్ధ విమానాలు, వ్యూహాత్మక బాంబర్లను అక్కడ మోహరించింది. ఇవి భారత్‌తో సరిహద్దులకు 10 కిలోమీటర్లకు పైగా దూరం నుంచి పహారా కాస్తున్నట్లు సమాచారం. ► దౌలత్ బేగ్ ఓల్డీ, పెట్రోలింగ్ పాయింట్–14 సమీపంలోని గల్వాన్ లోయ, పెట్రోలింగ్ పాయింట్–15,17, 17ఏ, ఫింగర్ పాయింట్, పాంగోంగ్ త్సోలకు సమీపంలోని చైనా సైనిక హెలికాప్టర్లు గస్తీ చేపట్టాయి. భారత్ ఏం చేస్తోందంటే.. ► ఉత్తర భారతదేశంలోని ఎయిర్ బేస్‌లు, కంటోన్మెంట్లలో ఉన్న బలగాలు, ఫిరంగులు, శతఘ్ని దళాలు, నిఘా రాడార్లు, ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు గత నెల నుంచి లద్దాఖ్‌కు తరలుతున్నాయి. నూతనంగా ఏర్పాటైన కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌లో ప్రస్తుతం 45వేల సైన్యం మోహరించి ఉంది. ► చైనా బలగాలు ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా తక్షణమే తప్పికొట్టేందుకు వైమానిక, నావికా దళాలకు చెందిన గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థను తూర్పు లద్దాఖ్‌కు తరలించింది. వేగంగా ప్రయాణించే యుద్ధ విమానాలతోపాటు డ్రోన్లను సైతం రెప్పపాటులోనే నేలకూల్చే సామర్ధ్యం ఉన్న ఆకాశ్ క్షిపణులు ఇందులో ఉన్నాయి. ► చండీగఢ్‌లోని వైమానిక స్థావరం నుంచి 46 టన్నుల భారీ టి90 యుద్ధట్యాంక్‌ను సి17 గ్లోబ్‌మాస్టర్ విమానం లద్దాఖ్‌కు మోసుకెళ్లింది. ► దౌలత్ బేగ్ ఓల్డీ, ఫుక్చే, నియోమాల్లోని అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్స్‌ను ఎయిర్ ఫోర్స్ అప్రమత్తం చేసింది. ఈ ప్రాంతంలో ఎస్యు30 ఎంకేఐ యుద్ధ విమానాలను మోహరించింది. శ్రీనగర్, లేహ్‌లో జాగ్వార్, మిరాజ్–200 యుద్ధ విమానాలు, అపాచీ హెలికాప్టర్లను రంగంలోకి దించింది. ► సముద్రంలో చైనా కదలికలపై కన్ను వేసి ఉంచేందుకు నేవీ తన పి–81 నిఘా విమానాన్ని గస్తీకి పంపింది. ► లద్దాఖ్‌లోని 1,597 కిలోమీటర్ల పొడవైన చైనా సరిహద్దుల్లో ఉన్న 65 పాయింట్లలో పహారాను మరింత పెంచింది. ► సరిహద్దుల్లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గల్వాన్ లోయ, లద్దాఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్, డెప్సంగ్ మైదానాలు, ప్యాంగాంగ్ త్సోతోపాటు ఉత్తర సిక్కింలోని నకు లా ప్రాంతాల్లో భారత్, చైనా బలగాలు అత్యంత సమీపంలో మోహరించి ఉండటంతో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. నిపుణులు ఏమన్నారంటే.. ► ‘అతిక్రమణలను, భారత భూభాగం వైపు నిర్మాణాలు చేపట్టడం చైనా నిలిపివేయాలి. సైనిక ప్రతిష్టంభన తొలగిపోవడానికి ఏకైక పరిష్కారం ఇదే’ అని చైనాలో భారత రాయబారి విక్రమ్ మిస్రీ అన్నారు. ► వెనక్కి తగ్గేందుకు రెండు పక్షాలు ఏమేరకు సానుకూలంగా ఉన్నాయనే దానిపైనే వివాద పరిష్కారం ఆధారపడి ఉంది’ అని మాజీ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హూడా అన్నారు. ► ‘సరిహద్దుల్లో మోహరింపులు సుదీర్ఘకాలం కొనసాగే అవకాశాలున్నాయి. బలగాల ఉపసంహరణ టి–20 మ్యాచ్‌లాగా వెంటనే ఫలితం తేలేది కాదు, టెస్ట్ మ్యాచ్ వంటిది. ఇందుకు 2, 3 నెలల వరకు పట్టవచ్చు. అంతకంటే, ఎక్కువ కాలం కూడా కొనసాగవచ్చు’ అని సైనిక ప్రధాన కార్యాలయంలోని ఓ అధికారి అంచనా వేశారు. ► భారత్‌తో సరిహద్దుల వెంట చైనా అనుసరిస్తున్న వైఖరితో ఆ దేశం భవిష్యత్తులో సుదీర్ఘ కాలం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని డిప్యూటీ చీఫ్ ఆర్మీ స్టాఫ్(రిటైర్డు) లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ పేర్కొన్నారు. ఇలాంటి తీరుతో ఆ దేశం అంతర్జాతీయంగా ఏకాకిగా మారుతుందన్నారు. ప్రపంచమంతా కోవిడ్–19 మహమ్మారితో పోరాడుతుంటే చైనా మాత్రం లద్దాఖ్‌లో దుశ్చర్యకు పాల్పడటం ఆ దేశం నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసిందని అమెరికాతో టారిఫ్ యుద్ధం, ఆస్ట్రేలియాతో విభేదాలు, హాంకాంగ్‌లో దిగజారుతున్న పరిస్థితులతో చైనాకు గడ్డు పరిస్థితులు తప్పవన్నారు. గల్వాన్ ఘటనతో చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఒక రాజకీయ బలగమే తప్ప దానికి ఎలాంటి సైనిక ప్రమాణాలు లేనట్లు అర్థమవుతోందని చెప్పారు. -
మళ్లీ చైనా కయ్యం?
న్యూఢిల్లీ: చైనా ఇంకో చోట మళ్లీ కయ్యానికి కాలుదువ్వుతోందంటున్నారు మిలటరీ విశ్లేషకులు. తూర్పు లద్దాఖ్‌లో చైనా సైనికుల కదలికలను పరిశీలిస్తే దౌలత్ బేగ్ ఓల్డీ, డెప్సాంగ్ సెక్టార్లలో తాజాగా వివాదాలు లేవనెత్తే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోందన్నారు. దౌలత్ బేగ్ ఓల్డీకి తూర్పు ప్రాంతంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైన్యం చురుకుగా కదులుతోందని, ఆ ప్రాంతంలో క్యాంపులు ఏర్పాటు కావడమే కాకుండా.. వాహనాల కదలికలు కూడా ఎక్కువయ్యాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 2016 ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ సైనిక స్థావరం వద్దనే ఈ క్యాంపులు ఏర్పాటు కావడం గమనార్హం. ఈ నెలలో తీసిన కొన్ని ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా కొత్త క్యాంపుల గురించి తెలియగా.. స్థానిక నిఘా వర్గాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. చైనా కదలికలకు అనుగుణంగా భారత్ మే నెల చివరిలోనే డెప్సాంగ్ ప్రాంతానికి తన బలగాలను తరలించిందని సమాచారం. 2013లో చైనా ఇదే డెప్సాంగ్ ప్రాంతంలో భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. గల్వాన్‌లో బల ప్రదర్శన తూర్పు లద్దాఖ్ ప్రాంతంలోని గల్వాన్ లోయలో భారత్ చైనాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఒకవైపు చైనా సైనికులు గల్వాన్ ప్రాంతంలోనే తిష్టవేయగా.. భారత్ తన యుద్ధ విమానాలతో ఆ ప్రాంతంలో విన్యాసాలు చేయించింది. జూన్ 15న ఈ ప్రాంతంలో ఇరు దేశాల సైనికులు బాహాబాహీకి దిగడం మేకులతో కూడిన గదలు, కర్రలతో చైనా సైనికులు జరిపిన దాడిలో భారత సైనికులు 20 మంది వీరమరణం పొందడం తెలిసిన విషయమే. ఈ ఘటన తరువాత ఇరు పక్షాలు అక్కడికి మరిన్ని బలగాలను తరలించి బలప్రదర్శనకు దిగాయి. (వేగంగా బలగాలు వెనక్కి) తాజాగా బుధవారం లేహ్‌లోని ఓ వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అయిన భారత యుద్ధ విమానాలు 240 కి.మీ.ల దూరంలోని సరిహద్దుల వరకూ ప్రయాణించాయి. రోడ్డుమార్గంలో చెక్పాయింట్లు ఏర్పాటు కావడమే కాకుండా లేహ్‌లో మిలటరీ కార్యకలాపాలు ఒక్కసారిగా ఊపందుకున్నట్లు సమాచారం. లేహ్ రహదారులపై మిలటరీ వాహనాలు క్యూలు కట్టాయని స్థానికులు తెలపగా.. భారత సైనికులు ఇప్పుడు చెప్పుకోదగ్గ స్థాయిలో ఈ ప్రాంతంలో ఉన్నారని మిలటరీ అధికారి ఒకరు తెలిపారు. పాకిస్థాన్, చైనాలు రెండింటికీ సరిహద్దు అయిన ఈ ప్రాంతంలో మిలటరీ కార్యకలాపాలు మనుపెన్నడూ లేనంత స్థాయిలో చోటు చసుకోవడంలో స్థానికుడు ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. గల్వాన్ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడిప్పుడే తగ్గే సూచనలేవీ కనిపించడం లేదని, అదే సమయంలో చైనా ఆక్రమించినట్టుగా చెబుతున్న భూభాగాన్ని భారత్ మళ్లీ చేజిక్కించుకునే అవకాశాలు తక్కువేనని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన హర్‡్ష పంత్ వ్యాఖ్యానించడం గమనార్హం. జూన్ 22 నాటి ఉపగ్రహచిత్రం -
గల్వాన్ ఘటనతో వణికిన చైనా సైన్యం
న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో జూన్ 15న భారత సైనికులు చూపిన తెగువకు చైనా సైన్యం వణికిపోయిం దని సమాచారం. చైనా సైన్యం చేతుల్లో బందీలుగా ఉండి.. సైనికాధికారుల చర్చల అనంతరం విడుదలైన భారతీయ సైనికుల ద్వారా ఈ విషయం స్పష్టమైనట్లు తెలుస్తోంది. సుమారు 60 గంటలపాటు చైనా సైనికుల అదీనంలో ఉన్న కారణంగా భారతీయ సైనికాధికారులు, జవాన్లకు వివిధ పరీక్షలు నర్విహించారు. ఈ క్రమంలో చైనా సైన్యం మానసిక స్థితిపై ఉన్నతాధికారులు ఒక అంచనాకు రాగలిగారు. బందీలుగా ఉండి విడుదలైన ఇద్దరు మేజర్లు, ఇద్దరు కెప్టెన్లు చాలా ఉత్సాహపూరితంగా కనిపించారని, శత్రుదేశపు బందీలుగా ఉన్నా ఇలా ఉండటం ఆశ్చర్యకరమని నిపుణులు చెబుతున్నారు. జూన్ 15న తమ కంటే ఎక్కువ సంఖ్యలో చైనీయులు విరుచుకుపడుతున్నా భారత సైన్యం వెనక్కు తగ్గకపోగా చైనీయుల చేతుల్లోని ఇనుప రాడ్లు, మేకులతో కూడిన గదల్లాంటి ఆయుధాలను లాక్కుని ప్రతిదాడికి దిగారని, ఈ క్రమంలో పెట్రోల్ పాయింట్ 14 వద్ద కనీసం 40 మంది చైనీయులు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. ఈ సాహసం కారణంగానే భారతీయ సైనికులు ఉత్సాహంగా కనిపించారని, చైనీయులను తరుముకుంటూ వారి ఆధిపత్యంలోని ప్రాంతాల్లోకి చొచ్చుకుపోవడం వల్లనే భారతీయులు బందీలుగా చిక్కారని ఓ అధికారి తెలిపారు. కల్నల్ సంతోష్‌బాబు మరణించిన సమాచారం తెలుసుకున్న చైనీయులు వెనుతిరిగి పారిపోయారని... వారిని వెంటాడుతూ భారతీయ సైనికులు వెళ్లారని చెప్పారు. షాక్‌లో చైనా సైనికులు జూన్ 15 నాటి ఘటనతో చైనా సైనికులు ఒక రకమైన షాక్‌కు గురైనట్లు చైనా నిర్బంధం నుంచి విడుదలైన సైనికుల ద్వారా తెలిసింది. భారతీయ సైనికులు తెగబడి పోరాడటమే కాకుండా ప్రతీకార దాడులకు పాల్పడతారని చైనీయులు భయపడ్డారని కొన్ని గంటల వ్యవధిలో మరింత మంది భారతీయ సైనికులు తమ మాదిరిగానే దాడి చేస్తారని వారు అంచనా వేశారని అధికార వర్గాల ద్వారా తెలిసింది. మొత్తమ్మీద చైనా దశాబ్దాలపాటు అసలైన యుద్ధంలో పాల్గొనక పోవడం కేవలం సన్నాహక విన్యాసాల్లో పాల్గొనటం సైనికులపై ప్రభావం చూపుతున్నట్లు భారతీయ అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్ 15 నాటి ఘటనతో చైనీయులు భారతీయ సైన్యం అసలు రూపాన్ని చూశారని సంఖ్యాబలంలో తక్కువైనా ప్రత్యర్థులను చంపగలగడం వారిని భీతవహులను చేసిందని అధికారి ఒకరు తెలిపారు. కాగా, గల్వాన్ ఘటనపై చైనా సోషల్‌మీడియాలో అసంతృప్తి వ్యక్తమైంది. వాట్సప్ తరహా సామాజిక మాధ్యమం వీబోలో పీఎల్ఏ సైనికులు ఎంత మంది మరణించారన్న విషయంపై ఆసక్తికరమైన చర్చలు జరిగాయి. -
రాళ్ల దెబ్బలు.. నిలువెల్లా గాయాలతో..
న్యూఢిల్లీ: దేశం కోసం ప్రాణాలర్పించిన తెలంగాణ ముద్దు బిడ్డ, సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్‌బాబు వీరోచిత పోరాటం వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. భారతీయ సైనికుల్ని ముందుండి నడిపించిన ఆయనలో నాయకత్వ లక్షణాలు, శౌర్య పరాక్రమాలు తీవ్ర ఉద్వేగానికి గురి చేస్తాయి. రాళ్ల దెబ్బలు తగిలి నిలువెల్లా గాయాలైనా పోరాటస్ఫూర్తిని మరిచిపోని ఆ వీరుడికి ప్రతీ భారతీయుడు పిడికిలి బిగించి జై కొట్టాలి. సంతోష్‌బాబు ఎంతటి తెగువ చూపించారో ఒక ఆర్మీ అధికారి జాతీయ చానెల్‌తో పంచుకున్నారు. కల్నల్ ఎలా ముందుకు సాగారంటే.... ఇండియన్ ఆర్మీ 16 బిహార్ బెటాలియన్‌కు సంతోష్ బాబు కమాండింగ్ ఆఫీసర్ (సీఓ)గా వ్యవహరిస్తున్నారు. జూన్ 6న ఇరుపక్షాల సైనికుల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి చర్చల్లో గల్వాన్ లోయలో పెట్రోలింగ్ పాయింట్ 14 దగ్గర నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని అంగీకారానికి వచ్చాయి. చైనా తన శిబిరాన్ని తీసేసి సైన్యాన్ని వెనక్కి పిలిచింది. కానీ హఠాత్తుగా జూన్ 14 రాత్రి మళ్లీ వాస్తవాధీన రేఖ వెంబడి చైనా శిబిరాలు ఏర్పాటు చేసింది. ఈ విషయం తెలియగానే సంతోష్ బాబు, చైనా కమాండింగ్ ఆఫీసర్‌తో ఫోన్లో మాట్లాడారు. చర్చల్లో ఒక అంగీకారానికి వచ్చాక మళ్లీ తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు ఎలా చేస్తారంటూ నిలదీశారు. ఆ తర్వాత చైనా సైనికులు వెనక్కి మళ్లారన్న సమాచారం అందింది. ఆ విషయాన్ని నిర్ధారణ చేసుకోవడానికి కల్నల్ స్వయంగా గల్వాన్ లోయకు బయల్దేరారు. ఇలాంటి పరిస్థితుల్లో మేజర్ ర్యాంకు అధికారిని పంపి పరిస్థితుల్ని పర్యవేక్షించాలని చెప్పి ఉండొచ్చు. కానీ సంతోష్‌బాబు ఆ పని చేయలేదు. డ్రాగన్ సైన్యం వెనక్కి వెళ్లి ఉండదన్న అనుమానంతో సైనికుల్ని తీసుకొని వెళ్లారు. అప్పటికే అక్కడ కొందరు చైనా సైనికుల కొత్త ముఖాలు కనిపించాయి. ఎంతో మర్యాదగానే కల్నల్ సంతోష్ బాబు వారితో సంభాషణ మొదలు పెట్టారు. మళ్లీ ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. దీనికి జవాబుగా సైనికులు సంతోష్ బాబుపై రాళ్ల వర్షం కురిపించారు. ఇరుపక్షాల మధ్య 30 నిమిషాల సేపు ఘర్షణలు జరిగాయి. చైనా శిబిరాల్ని భారత జవాన్లు నాశనం చేశారు. ఈ దాడుల్లో సంతోష్‌బాబు తీవ్రంగా గాయపడినా వెనుకడుగు వేయలేదు. గాయపడిన ఇతర జవాన్లను వెనక్కి పంపేస్తూ తానే సింహంలా ముందుకు ఉరికారు. అంతలోనే అటువైపు నుంచి మరికొందరు ఇనుప రాడ్లతో, కొత్త తరహా ఆయుధాలతో భారతీయ సైనికులపై దాడి చేశారు. కల్నల్ అనుమానం నిజమైంది. చైనా పథకం ప్రకారమే సైన్యాన్ని అక్కడ దింపిందని అర్థమైంది. మళ్లీ ఇరువర్గాల మధ్య భీకర పోరు జరిగింది. రాత్రి 9 గంటల సమయంలో పెద్ద రాయి వచ్చి కల్నల్ తలకి గట్టిగా కొట్టుకోవడంతో ఆయన గల్వాన్ నదిలో పడిపోయారు. పోరు ముగిశాక సంతోష్‌బాబుతో సహా చాలా మంది జవాన్లు నిర్జీవంగా నదిలో ఉన్న దృశ్యాలు అందరి గుండెల్ని పిండిచేశాయి. చాలాసేపు అక్కడ ఉద్విగ్న భరిత వాతావరణమే నెలకొందటూ పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ అధికారి వివరించారు. -
చర్చల కోసం ఒత్తిడే చైనా లక్ష్యం
సరిహద్దుల్లో భారత బలగాలపై చైనా ఆకస్మిక దాడి 1962 తర్వాత భారత్‌ను మరోసారి తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లోకి నెట్టింది. 2014లో నరేంద్రమోదీ గద్దెకెక్కిన తర్వాత కేంద్రప్రభుత్వం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సంక్షోభంగా చెప్పుకోవచ్చు. భారత సైన్యం చైనా వాస్తవ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమైంది. ఇరు దేశాల సైనిక నేతలు పరిష్కారం కోసం చర్చిస్తున్న సమయంలోనే చైనా బలగాలు భారత్‌ను దెబ్బతీయాలని నిర్ణయించుకున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల కూటమిలో భారత్ భాగమవుతుండటం, జి7 దేశాల కూటమిలో భారత్ భాగస్వామి కావాలని అమెరికా సూచిస్తుండటంతో భారత్ ప్రచ్ఛన్న క్రీడలో పాల్గొంటోందన్న సందేహం చైనాకు బలంగా ఏర్పడింది. ఫలితంగానే భారత్‌కు ముగుదాడు వేయడం లక్ష్యంగా చైనా సైనిక దాడిని తలపెట్టింది. ఒక అగ్రరాజ్యం స్థాయికి చేరుకున్న చైనా భారత్‌తో పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రారంభించే ఉద్దేశంతో మన భూభాగంలోకి ప్రవేశించలేదు. 1962లో మావో జెడాంగ్ పేర్కొన్నట్లుగానే భారత్‌ను చర్చల ప్రక్రియకు ఒత్తిడి పెట్టటమే చైనా ఉద్దేశం. ఇది భారత్ ఆగ్రహంతో స్పందించాల్సిన సమయం కాదు. హెన్రీ కిసింజర్ కంటే ఉత్తమంగా చైనాను మరే దౌత్యవేత్త కూడా అర్థం చేసుకోలేరు. 1962లో భారత్–చైనా యుద్ధ నేపథ్యంలో కిసింజర్ ఒక ఆసక్తికరమైన ఘటనను వర్ణించారు. 1962 అక్టోబర్‌లో నాటి చైనా అధినేత మావో జెడాంగ్ బీజింగ్‌లో చైనా అత్యున్నత సైనిక కమాండర్లు, రాజకీయ నేతలతో సమావేశానికి పిలుపునిచ్చిన ఘటనను కిసింజర్ గుర్తు చేశారు. అది భారతదేశంతో చైనా సైనిక సంఘర్షణలో మునిగి ఉన్న సమయం. ఆనాటి ప్రతిష్టంభనను తేల్చిపడేయాలని మావో నిర్ణయించుకున్నారు. చైనా, భారత్‌లు శాశ్వత శత్రుత్వంతో అంతరించిపోవని మావో ఆ సమావేశానికి హాజరైన వారితో చెప్పారు. ఇరుదేశాలు మళ్లీ సుదీర్ఘ శాంతి కాలాన్ని గడుపుతాయని, కానీ అలా జరగాలంటే చైనా బలప్రయోగంతో భారత్‌ను దెబ్బతీసి తిరిగి చర్చల బల్లవద్దకు తీసుకురావాల్సి ఉంటుందని మావో చెప్పారు. ఆ తర్వాతే చైనా అనూహ్యంగా, భారత్ భూభాగంపై విధ్వంసకర దాడికి దిగి మళ్లీ మునుపటి ఆధీన రేఖకు తరలిపోయింది. ఈ క్రమంలో భారత్ నుంచి కైవసం చేసుకున్న భారీ ఆయుధాలను కూడా చైనా వెనక్కు ఇచ్చేసింది. నేడు, చైనా 1962 తర్వాత భారత్‌ను మరోసారి తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లోకి నెట్టింది. గాల్వాన్ లోయలో చైనా బలగాలతో తాజాగా జరిగిన దొమ్మీలో 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. గాయపడిన సైనికుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. తూర్పు లద్దాఖ్‌లో 60 చదరపు మైళ్ల విస్తీర్ణంలో భారత భూభూగాన్ని చైనా ఆక్రమించిందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. దీన్ని 2014లో నరేంద్రమోదీ గద్దెకెక్కిన తర్వాత కేంద్రప్రభుత్వం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సంక్షోభంగా చెప్పుకోవచ్చు. ఈ సంక్షోభం ఏప్రిల్ నెలలోనే ఉన్నట్లుండి మొదలైంది కానీ భారత సైన్యం చైనా వాస్తవ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమైంది. చైనా దూకుడు చర్యకు ఒక్క నిర్దిష్ట కారణాన్ని కూడా భారత ప్రభుత్వం కానీ, నిపుణులు కానీ ఎత్తి చూపలేకపోయారు. చైనా కూడా తన దూకుడు చర్యకు కారణాన్ని ఇప్పటివరౖకైతే వెల్లడించలేదు. కానీ చైనా బలగాలు ప్రదర్శించిన పరమ నిర్లక్ష్య వైఖరి గాభరా కలిగిస్తుంది. ఈ సమస్యకు ఇరు దేశాల సైనిక నేతలు పరిష్కారం కోసం చర్చిస్తున్న సమయంలోనే చైనా సైనిక బలగాలు భారత్‌ను చావు దెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్నాయి. ఇరుసైన్యాల కమాండర్ల మధ్య చర్చలు జరిగిన తర్వాత చైనా, భారత బలగాలు కొన్ని కిలోమీటర్ల వెనక్కు తరలిపోయినట్లు సమాచారం. అయితే ఆధీన రేఖను దాటివచ్చింది చైనా బలగాలు అయితే భారత సైనిక బలగాలు ఎందుకు తిరోగమించాయి అన్నది నా అవగాహనకు అందనిది. భారతీయ భూభాగంలోకి ప్రవేశించింది చైనా బలగాలే. దీనివెనుక స్పష్టమైన ఉద్దేశం వెల్లడి కానందున, భారతీయ సైనికులను ఇలా చావుదెబ్బ తీయడం అనేది భారత్‌పై ఒత్తిడి ప్రయోగించి దాన్ని చర్చల బల్ల వద్దకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగానే జరిగిందని చెప్పవచ్చా? మరి సమస్య ఇదే అయితే చర్చలు దేనిపై జరుపుతారు, ఎందుకు జరపుతారు అనేది మరో ప్రశ్న. గత రెండు వారాలుగా భారత్‌పై తన ఆగ్రహానికి పలు కారణాలను పేర్కొంటూ చైనా ప్రభుత్వ అధికార వాణి అయిన ది గ్లోబల్ టైమ్స్ సూచనప్రాయంగా తెలుపుతూ వచ్చింది. దీనికి రెండు బలమైన కారణాలు బయటకు కనిపిస్తున్నాయి. వాటిలో మొదటిది అమెరికాతో భారత్ సన్నిహితంగా మెలగడం క్రమంగా పెరుగుతోంది. ఇండియా–పసిఫిక్ రీజియన్‌లో చైనా వ్యతిరేక కూటమిని సృష్టించడానికి భారతదేశం, అమెరికా ప్రయోజనాల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటోందని చైనా బలంగా నమ్ముతోంది. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల కూటమిలో భారత్ భాగమవుతుండటం, జి7 దేశాల కూటమిలో భారత్ భాగస్వామి కావాలని అమెరికా సూచిస్తుండటంతో అమెరికా తరపున భారత్ ప్రచ్ఛన్న క్రీడలో పాల్గొంటోందన్న సందేహం చైనాకు బలంగా ఏర్పడిపోయింది. తర్వాత భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికాలో హౌడీ మోదీ కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్‌కు గౌరవ ఆహ్వానం పలకడం, అహమ్మదాబాద్‌లో నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్‌కు భారీ ఎత్తున స్వాగతం పలకడం అనేవి చైనాను మండించాయి. భారత్‌తో అమెరికా మైత్రీ భాషణను చైనా చూస్తూ ఊరుకోలేదని 2020 ఫిబ్రవరి 23వ తేదీనే గ్లోబల్ టైమ్స్ పత్రిక రాసింది కూడా. ట్రంప్ భారత్ పర్యటనలో ఉన్నప్పుడు ఆ పత్రిక అలా రాసిందని మర్చిపోకూడదు. కాగా, 2020 జూన్ 5న గ్లోబల్ టైమ్స్ మరొక వ్యాసం ప్రచురించింది. మోదీ రెండో దఫా పాలనను ప్రారంభించినందున, చైనా పట్ల భారత్ వైఖరి మారిపోయింది. చైనాను లక్ష్యంగా చేసుకుంటున్న అమెరికా పధకాలు చాలావాటిలో భారత్ క్రియాశీలకంగా పాల్గొం టోందని చెప్పడం న్యాయంగా ఉంటుందన్నది ఆ వ్యాససారాంశం. ఆ తర్వాత స్పష్టంగానే చైనా తన వైఖరి గురించి సూచనలు పంపడం మొదలెట్టింది. చైనా హెచ్చరికలను భారత నాయకత్వం పట్టించుకోవలసి ఉండింది. నిస్సందేహంగానే ఒక దేశం ఆదేశాలకు అనుగుణంగా భారత్ వంటి సౌర్వభౌమాధికారం కలిగిన దేశం తన విదేశీ విధానాన్ని నిర్వహించుకోవడం వంటి ఒత్తిళ్లకు తలొగ్గలేదు. కానీ తన పొరుగునే ఉన్న చైనా వంటి శక్తివంతమైన దేశం అభిప్రాయాలను భారత్ విస్మరించలేదన్నది కూడా వాస్తవమే. రెండు, జమ్మూ కశ్మీర్ భౌగోళిక ముఖచిత్రాన్ని మార్చివేయడానికి మోదీ ప్రభుత్వం తలపెట్టిన ప్రయత్నం చైనా నాయకత్వానికి ఇష్టం లేదు. ఆర్టికల్ 370 రద్దుపై పార్లమెంటులో చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, లద్దాక్‌లోని అక్సాయి చిన్ని కూడా భారత్ తన భూభాగంగా చూస్తోందని చెప్పడం చైనాను రెచ్చగొట్టింది. ఈ విషయమై చైనా సీనియర్ అధికారి వాంగ్ షిదా ఇటీవలే ఒక వ్యాసం రాశారుకూడా. ఆర్టికల్ 370 రద్దు అనేది పాకిస్తాన్, చైనాల సార్వభౌమాధికారానికి తీవ్ర సవాలుగా నిలిచిందని వాంగ్ ఆ వ్యాసంలో పేర్కొన్నారు. ఆ క్రమంలోనే ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్‌కు చైనా బలంగా మద్దతునివ్వడం ప్రారంభించింది. చైనా ఒత్తిడి కారణంగానే గత 50 సంవత్సరాలలో మొదటిసారిగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కశ్మీర్ అంశం లాంఛనప్రాయంగా చర్చకు వచ్చింది. కాబట్టి, భారత భూభాగంలోని గాల్వన్ లోయ వంటి ప్రాంతాల్లోకి చైనా దళాలు ప్రవేశించడం అనేది సాధారణమైన ఘటన కాదని, ఆ దేశానికి ఇంకా పెద్ద కారణాలు ఉన్నాయనడానికి ఇది ఒక సంకేతం మాత్రమే. దీనికి అనుగుణంగానే భారతదేశం తన దౌత్యాన్ని నిర్వహించుకోవలసి ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాని నరేంద్రమోదీకి తప్పు సలహాలు ఇచ్చినట్లు కనబడుతోంది. చైనా అగ్రనాయకత్వాన్ని సంతృప్తిపరచడానికి భారత ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేపట్టలేదు. ఇప్పుడు ఆధీనరేఖలో భారతీయ సైనికుల హత్యా ఘటనతో ప్రధాని తన పదవీ బాధ్యతలను నిర్వహించడం కష్టమవుతుంది. పైగా మితిమీరిన జాతీయవాదాన్ని, యుద్ధోన్మాదాన్ని జపిస్తున్న తన పార్టీలోని సైద్ధాంతిక శ్రేణులు కాని, బయటి శక్తులు కానీ ఇప్పుడు కంటికి కన్ను, పంటికి పన్ను మాత్రమే ఇప్పుడు సరైన పరిష్కారమని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చు. ఈ ఒత్తిడికి లోబడకపోతే మోదీ నాయకత్వంపై వీరు దాడి చేయవచ్చు కూడా. అయితే ఇక్కడ వివాదాస్పదమైన ప్రశ్న ఏమిటంటే, భారత్ మరింత దూకుడుగా వ్యవహరించాల్సి ఉంటుందా? రెండు కారణాలతో ఈ ప్రశ్నకు లేదు అన్నదే సమాధానం అని చెప్పాల్సి ఉంటుంది. మొదటిది, చైనా తన సైనిక చర్యల సమయాన్ని అత్యంత జాగ్రత్తగా ఎంచుకుంది. భారత్ కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్లో ఉన్నప్పుడు, కుప్పకూలిపోయిన ఆర్థిక వ్యవస్థతో తలమునకలై ఉన్నప్పుడు భారతీయ భూభాగంలోకి చైనా అడుగుపెట్టింది. రెండు, చైనా ప్రతి సంవత్సరం 261 బిలియన్ డాలర్లు రక్షణరంగంపై వెచ్చిస్తుండగా, భారత్ 71 బిలియన్ డాలర్లను మాత్రమే రక్షణ రంగంపై వెచ్చిస్తోంది. 2000 సంవత్సరం నుంచి చైనా పకడ్బందీ పథకం అమలు చేస్తూ 2049 నాటికల్లా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని తయారు చేయాలని కంకణం కట్టుకుంది. ఇక బీజేపీ నాయకులు, మద్దతుదారుల విషయానికి వస్తే మోదీ నాయకత్వంలోని భారత్ 1962 నాటి నెహ్రూ పాలన నాటి భారత్‌లా లేదని గర్వంగా ప్రకటిస్తున్నారు. జాతీయ టీవీ చానెల్స్ కూడా ఇలాంటి వాణినే డాంబికంగా ప్రసారం చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి ప్రకటనలు ఆకర్షణీయంగానే ధ్వనించవచ్చు. కానీ వాస్తవం ఏమిటంటే నేడు చైనా ఒక అగ్రరాజ్యం. ప్రపంచ రాజకీయాల్లో అత్యంత ప్రభావితంగా ఉంటున్న అమెరికాను ఆ స్థానం నుంచి తొలగించాలనే స్పష్టమైన ఆకాంక్షతో చైనా ముందుకెళుతోంది. పైగా భారత్ ఒక బాధ్యతాయుతమైన దేశం. సరిహద్దు ఘర్షణలను తగ్గించడానికి దౌత్యపరమైన, తెరవెనుక చర్చలపైనే భారత్ ఆధారపడాలి. భారత్‌తో పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రారంభించే ఉద్దేశంలో చైనా మన భూభాగంలోకి ప్రవేశించలేదు. 1962లో మావో జెడాంగ్ పేర్కొన్నట్లుగానే భారత్‌ను చర్చల ప్రక్రియకు ఒత్తిడి పెట్టటమే చైనా ఉద్దేశం. ఈ నేపథ్యంలో ఇది భారత్ ఆగ్రహంతో స్పందించాల్సిన సమయం కాదు. అశుతోష్ వ్యాసకర్త జర్నలిస్టు, రచయిత -
విషం చిమ్మిన చైనా..
న్యూఢిల్లీ: ఇండో–చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య సోమవారం రాత్రి జరిగిన తీవ్రస్థాయి హింసాత్మక ఘర్షణల్లో రెండు దేశాలకు భారీగా ప్రాణ నష్టం జరిగింది. ముఖాముఖీ పోరాటంలో రాళ్లు, ఇనుప రాడ్లతో చైనా సైనికులు దాడి చేశారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. వారి దాడిలో తెలుగువాడైన ఒక కల్నల్, ఇద్దరు జవాన్లు అమరులైనట్లు మొదట ఆర్మీ ప్రకటించింది. కానీ, ఘర్షణలు పెద్ద ఎత్తున జరిగాయని, భారీగా మోహరించిన రెండు దేశాల సైనికులు కొన్ని గంటల పాటు ముఖాముఖి తలపడటంతో ఇరు వర్గాల సైనికులు పెద్ద సంఖ్యలో చనిపోయారని అనంతరం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత్–చైనా సరిహద్దు ఊహాచిత్రం... ఆ తరువాత, లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో 20 మంది భారతీయ సైనికులు అమరులైనట్లు మంగళవారం రాత్రి ఆర్మీ ప్రకటించింది. ఘటనాస్థలి నుంచి రెండు దేశాల సైనికులు వెనక్కు వెళ్లారని పేర్కొంది. చైనాకు కూడా భారీగానే నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. 43 మంది చైనా సైనికులు భారత సైనికుల దాడిలో చనిపోయి ఉండొచ్చని సమాచారం. అయితే, ఐదుగురు చైనా సైనికులు చనిపోయారని, 11 మంది గాయపడ్డారని పేర్కొంటూ చైనా అధికార మీడియా గ్లోబల్ టైమ్స్ సీనియర్ రిపోర్టర్ చేసినట్లుగా చెబుతున్న ట్వీట్ ఒకటి వైరల్ అయింది. ప్రధాని సమీక్ష ఈ ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెంటనే స్పందించారు. గాల్వన్ లోయ ప్రాంతంలో సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఘటన, తదనంతర పరిణామాలు, వాస్తవాధీన రేఖ వెంబడి ప్రస్తుత పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. అంతకుముందు, విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో రాజ్‌నాథ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్యాంగ్యాంగ్ సొ, దెమ్చోక్, దౌలత్ బేగ్ ఓల్డీ, గాల్వన్ లోయ ప్రాంతాల్లో భారత బలగాల సంఖ్యను భారీగా పెంచాలని ఆ భేటీలో నిర్ణయించినట్లు సమాచారం. ఆ తరువాత, జై శంకర్, ఆర్మీ చీఫ్ నరవణెలతో రాజ్‌నాథ్ మళ్లీ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం పఠాన్‌కోట్ పర్యటనను ఆర్మీ చీఫ్ రద్దు చేసుకున్నారు. మరోవైపు, హోం మంత్రి అమిత్ షా కూడా ప్రధాని మోదీతో సమావేశమై చైనా సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితిపై చర్చించారు. మే తొలివారం నుంచి.. మే 5వ తేదీ నుంచి చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. రెండు దేశాలు సరిహద్దులకు భారీగా బలగాలను, ఆయుధ సామగ్రిని తరలించాయి. పలుమార్లు రెండు దేశాల సైనికులు బాహాబాహీకి దిగి, గాయాల పాలయ్యారు. అనంతరం, ఉద్రిక్తతలను తగ్గించే దిశగా రెండు దేశాల మధ్య దౌత్య, సైనిక మార్గాల్లో చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మేజర్ జనరల్ స్థాయి చర్చలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక అవగాహన మేరకు రెండు దేశాలు తమ సైన్యాలను వెనక్కు తరలించడం ప్రారంభించాయి. ఆ క్రమంలోనే సోమవారం రాత్రి రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ ప్రారంభమై తీవ్రరూపు దాల్చిందని సైనిక వర్గాలు తెలిపాయి. దాడుల అనంతరం మంగళవారం ఇరుదేశాల సైన్యంలోని ఉన్నతాధికారులు ఘటనాస్థలంలో సమావేశమయ్యారని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. ఫింగర్ ఏరియా కీలకం ప్యాంగ్యాంగ్ సొ సరస్సు చుట్టూ ఫింగర్ ఏరియాలో భారత్ చేపట్టిన రోడ్డు నిర్మాణాన్ని, గాల్వన్ లోయలో దార్బుక్– షాయొక్– దౌలత్ బేగ్ ఓల్డీలను అనుసంధానించే భారత్ చేపట్టిన మరో రోడ్డు నిర్మాణాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్యాంగ్యాంగ్ సొ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం భారత్‌కు అత్యంత కీలకం. చైనా వ్యతిరేకతను పట్టించుకోకుండా, తూర్పు లద్దాఖ్ ప్రాంతంలోని సరిహద్దుల్లో మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తి చేయాలని భారత్ కృత నిశ్చయంతో ఉంది. 2022 నాటికి చైనా సరిహద్దుల్లో 66 కీలక రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. చైనా తీరు ఏకపక్షం సరిహద్దుల్లో యధాతథ స్థితిని మార్చేందుకు చైనా ఏకపక్షంగా చేసిన ప్రయత్నం కారణంగానే తీవ్రస్థాయి హింసాత్మక ఘర్షణ చోటు చేసుకుందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఉన్నత స్థాయిలో ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని చైనా గౌరవించి ఉంటే.. రెండు దేశాల సైనికులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది కాదని పేర్కొంది. వాస్తవాధీన రేఖకు ఇవతలి(భారత్) వైపుననే భారత్ చేపట్టే అన్ని కార్యకలాపాలు ఉంటున్నాయని స్పష్టం చేసింది. చైనా నుంచి కూడా అదే తీరును ఆశిస్తున్నామంది. భారత్‌దే తప్పు: చైనా జూన్ 15న భారత దళాలు వాస్తవాధీన రేఖను రెండుసార్లు దాటి వచ్చి, తమ సైనికులపై దాడులు చేసి రెచ్చగొట్టారని చైనా ఆరోపించింది. దాంతో రెండు దేశాల సైనికులు బాహాబాహీకి దిగే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. ‘గతంలో అంగీకారానికి వచ్చిన ఏకాభిప్రాయానికి కట్టుబడి ఉండాలని, తమ దళాలు సరిహద్దు దాటకుండా చూసుకోవాలని, పరిస్థితులు విషమించేలా ఏకపక్ష చర్యలకు దిగకుండా చూసుకోవాలని భారత్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావొ లిజియాన్ వ్యాఖ్యానించారు. గాల్వన్ లోయ ప్రాంతం చైనాదేనని ఆ దేశ మిలటరీ అధికార ప్రతినిధి కల్నల్ జాంగ్ షుయిలీ మంగళవారం పేర్కొన్నారు. ‘నాకందిన సమాచారం మేరకు అక్కడ జరిగింది ముఖాముఖీ పోరాటమే. కొందరు చైనా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. దుందుడుకుగా వ్యవహరించవద్దని, చైనా సంయమనాన్ని బలహీనతగా భావించవద్దని భారత్‌కు చెబుతున్నా. భారత్‌తో ఘర్షణను చైనా కోరుకోవడం లేదు. అలా అని మేమేం భయపడడం లేదు’ అని అధికార మీడియా గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ హు జీజిన్ ట్వీట్ చేశారు. చైనా దుందుడుకుతనం గాల్వన్లోయతో పాటు తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్ సొ, దెమ్చోక్, దౌలత్ బేగ్ ఓల్డీల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో నెలరోజులకు పైగా సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పలుమార్లు ప్యాంగ్యాంగ్ సొ సహా కొన్ని ప్రాంతాల్లో సరిహద్దును దాటి చైనా దళాలు భారత భూభాగంలోకి చొరబడ్డాయి. వాస్తవాధీన రేఖ సమీపానికి శతఘ్నులను, ఇతర ఆధునిక ఆయుధ సామగ్రిని భారీగా తరలించింది. సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో బాహాబాహీకి దిగిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ చొరబాట్లను భారత్ తీవ్రంగా ఖండిస్తూ, వెంటనే వెనక్కు వెళ్లాలని చైనాను హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు ప్రారంభమయ్యాయి. జూన్ 6న లేహ్‌లోని 14 కార్ప్స్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ హరీందర్ సింగ్, టిబెట్ మిలటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ మేజర్ జనరల్ ల్యూ లిన్ల మధ్య 7 గంటల పాటు చర్చలు జరిగాయి. ఆ తరువాత మేజర్ జనరల్ స్థాయి చర్చలు రెండు దఫాలుగా జరిగాయి. ఆ చర్చల్లో, ఉద్రిక్తతల ముందు నాటి యథాతథ స్థితి ఏర్పడాలని, చైనా దళాలు వెంటనే వెనక్కు వెళ్లాలని భారత్ డిమాండ్ చేసింది. రెండు దేశాలు తమ దళాలను క్రమంగా ఉపసంహరించుకుంటున్నాయని శనివారం భారత ఆర్మీ చీఫ్ నరవణె తెలిపారు. చర్చలు ఫలవంతమయ్యాయని, గాల్వన్ లోయకు ఉత్తరం వైపు నుంచి భారత దళాల ఉపసంహరణ ప్రారంభమైందని చెప్పారు. భారత్, చైనా సరిహద్దులు ఇలా .. ► భారత్, చైనా సరిహద్దుల్ని మూడు సెక్టార్ల కింద విభజించారు. వీటిలో పశ్చిమ సెక్టార్ ఎప్పుడూ ఉద్రిక్తతలకి, చొరబాట్లకి కేంద్ర బిందువుగా ఉంటోంది. ► కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి 1,597 కి.మీ. ప్రాంతాన్ని పశ్చిమ సెక్టార్ అంటారు. ► హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో 545 కి.మీ. పొడవునా మధ్య సెక్టార్ ఉంది. ► తూర్పు సెక్టార్లో 1,346 కి.మీ. మేర సరిహద్దు ఉంది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దుగా ఈ సెక్టార్ ఉంది. తెలుగువాడి వీర మరణం చైనా సైనికులతో ఘర్షణలో భారత సైన్యానికి చెందిన కల్నల్ సంతోశ్ బాబు, మరో ఇద్దరు జవాన్లు మృతి చెందారని ఆర్మీ ప్రకటించింది. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోశ్ గాల్వన్ లోయ ప్రాంతంలో 16 బిహార్ రెజిమెంట్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. చనిపోయిన ఇద్దరు జవాన్లను హవల్దార్ పళని, సిపాయి ఓఝా అని ఆర్మీ తెలిపింది. ఈ ఘర్షణల సందర్భంగా కాల్పులు చోటు చేసుకోలేదని, తుపాకుల వంటి మారణాయుధాలను ఉపయోగించలేదని భారత సైన్యాధికారి ఒకరు తెలిపారు. రాళ్లు, కర్రలు, ఐరన్ రాడ్లను ఉపయోగించినట్లు సమాచారముందన్నారు. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా.. గాల్వన్‌లోయలోని ఒక ప్రాంతం నుంచి చైనా దళాలు వెనక్కు వెళుతుండగా, ఘర్షణ ప్రారంభమైందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. మొదట కల్నల్ సంతోష్, కల్నల్‌తో పాటు ఉన్న సైనికులపై చైనా దళాలు దాడి చేశాయని, భారత్ ప్రతిదాడికి దిగడంతో ఘర్షణ తీవ్రరూపు దా ల్చిందని వివరించాయి. గత ఐదు దశాబ్దాల్లో ఈ స్థాయి ఉద్రిక్తత రెండు దేశాల మధ్య నెలకొనలేదు. చైనా టెంట్‌ను తొలగించమన్నందుకే.. న్యూఢిల్లీ: భారత్–చైనా జవాన్ల మధ్య ఘర్షణ, పలువురి మృతికి దారితీసిన పరిణామం ఏమిటన్న దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రభుత్వ అధికార వర్గాల కథనం ప్రకారం.. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో భారత భూభాగంలో పెట్రోలింగ్ పాయింట్ 14 అనే చోట చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) టెంట్ వేసిందన్న సమాచారంతో భారత జవాన్లు రంగంలోకి దిగారు. ఈ నెల ప్రారంభంలోనే ఈ టెంట్ వేసినట్లు సమాచారం. ఆ టెంట్‌ను తొలగించే ప్రయత్నంలోనే ఇరు దేశాల సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. వాస్తవాధీన రేఖకు(ఎల్ఏసీ) ఇటువైపున భారత భూభాగంలోనే చైనా సైనికులు టెంట్ ఏర్పాటు చేశారు. ఆ టెంట్‌ను వెంటనే తొలగించాలని భారత జవాన్లు సూచించగానే, పెట్రోలింగ్ పాయింట్ 14 పై భాగం నుంచి చైనా జవాన్లు రాళ్లు విసరడం ప్రారంభించారు. ఇనుప రాడ్లతో దాడికి దిగారు. భారత సైనికులు కూడా ధీటుగా బదులిచ్చినట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడిన భారత జవాన్లను మిలటరీ ఆసుపత్రికి తరలించారు. పెట్రోలింగ్ పాయింట్ 14 గాల్వన్, ష్యోక్ నదుల సంగమ ప్రాంతం సమీపంలోనే ఉంది. గత వారం ఇక్కడే భారత్, చైనా డివిజన్ కమాండర్ స్థాయి అధికారుల సమావేశం జరిగింది. గాల్వన్‌లో బలగాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోవాలని ఇరు దేశాల అధికారులు నిర్ణయించుకున్నారు. ఐరాస ఆందోళన ఐక్యరాజ్యసమితి: భారత్–చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఆయన మంగళవారం పిలుపునిచ్చారు. ఉద్రిక్తతను చల్లార్చేందుకు భారత్–చైనా చర్యలు ప్రారంభించినట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. -
చైనాలో పది వేలమందిని చంపేశారు..!
బీజింగ్: చైనాలో జరిగిన ఓ పోరాటానికి సంబంధించిన ప్రాణ నష్టంపై బ్రిటన్ రహస్య దౌత్య సమాచార విభాగం సంచలన విషయం తెలిపింది. తమకు ప్రజాస్వామ్యం కావాలంటూ 1989 జూన్ నెలలో తియాన్మెన్ కూడలి వద్ద జరిగిన పోరాటంలో దాదాపు 10 వేలమందిని చైనా సైన్యం చంపేసిందని వెల్లడించింది. 'ఆ నాడు జరిగిన ఉద్యమంలో కనీసం 10,000మందిని చంపేసినట్లు అంచనా' అని బ్రిటన్ రాయబారి అలాన్ డోనాల్డ్ లండన్‌కు నాడు పంపిన టెలిగ్రాంలో తెలిపారు. ఆ విషయానికి సంబంధించిన డాక్యుమెంట్ ఒకటి ఇప్పుడు తాజాగా 28 ఏళ్ల తర్వాత బయటకు వచ్చింది. చైనాలో కమ్యునిస్టు ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే. అయితే, తమకు మిగితా దేశాల మాదిరిగా ప్రజాస్వామ్య పరిపాలన కావాలంటూ దాదాపు ఏడు వారాలపాటు పౌరులు వీధుల్లోకి వచ్చి పోరాడారు. 1989 మే నెల నుంచే ఇది ప్రారంభమైంది. అయితే, జూన్ 5న వారంతా తియాన్మెన్ కూడలి వద్దకు చేరుకొని ఉద్యమించగా వారిపై సైన్యం కాల్పులు జరిపింది. ఆ సమయంలో ఒక వెయ్యిమంది చనిపోయారంటూ ప్రపంచాన్ని నమ్మించారు. అయితే, అందుకు పది రెట్లమందిని చంపేసినట్లు నాటి బ్రిటన్ రాయబారి టెలిగ్రాం ద్వారా తాజాగా తెలిసింది. -
శీతాకాలంలోనూ డోక్లాంలో చైనా సైన్యం?
బీజింగ్: శీతాకాలంలో డోక్లాం వద్ద కాస్త ఎక్కువ సంఖ్యలోనే బలగాలను మోహరిస్తామని చైనా ఆర్మీ సంకేతాలిచ్చింది. ఆ ప్రాంతం చైనాదేనని మరోసారి పేర్కొంది. సరిహద్దుల్లో చైనా రోడ్డు నిర్మాణాన్ని ఆపేయడంతో రెండున్నర నెలల వివాదానికి ముగింపు పలుకుతూ భారత్ గత ఆగస్టు 28న ఈ సమస్యను పరిష్కరించుకోవడం తెలిసిందే. సాధారణంగా డోక్లాం వద్ద చలికాలంలో వాతావరణం మరింత కఠినంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో భారత్, చైనాలు డోక్లాం ప్రాంతం నుంచి తమ బలగాలను ఉపసంహరించేవి. -
డోక్లాం: భారత్‌కు చైనా ఆర్మీ వార్నింగ్
బీజింగ్: రెండు నెలలకుపైగా కొనసాగిన డోక్లాం సరిహద్దు వివాదం ముగిసిపోయిన నేపథ్యంలో.. ఈ సైనిక ప్రతిష్టంభన నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని భారత్‌కు చైనా ఆర్మీ హెచ్చరించింది. డోక్లాం కొండప్రాంతంలో ఇరుదేశాల సైన్యాలు మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లబోతున్న నేపథ్యంలో మంగళవారం ఇరుదేశాలు డోక్లాం నుంచి తమ బలగాలను ఉపసంహరించుకోవడానికి అంగీకరించడంతో వివాదానికి తెరపడింది. ఈ వివాదానికి పరిష్కారం లభించిన నేపథ్యంలో చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) సీనియర్ కల్నల్ వు కియాన్ ఒక ప్రకటన విడుదల చేశారు. 'భారత్-చైనా ప్రతిష్టంభన నేపథ్యంలో చైనా ఆర్మీ ఇకనుంచి ఎంతో అప్రమత్తంగా ఉంటూ జాతీయ ప్రాదేశికతను, సార్వభౌమాధికారాన్ని కాపాడుతుంది' అని కియాన్ అన్నారు. 'ఈ ప్రతిష్టంభన నుంచి పాఠాలు నేర్వాల్సిందిగా మేం భారత్‌కు గుర్తుచేస్తున్నాం. అంతర్జాతీయ చట్టాలు, ఒడంబడికలను అనుసరించి సరిహద్దుల్లో శాంతిని, సుస్థిరతను కాపాడటానికి, ఇరుదేశాల సైన్యాల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం పెంపొందించడానికి కలిసి పనిచేయాల్సిందిగా కోరుతున్నాం' అని ఆయన అన్నారు. డోక్లాం నుంచి ఇరుదేశాల సైన్యాలు ఉపసంహరించుకున్నాయని భారత్ తెలియజేయగా.. క్షేత్రస్థాయి పరిస్థితుల్లో వచ్చిన మార్పు మేరకు, భారత్ ప్రతిస్పందన మేరకు కొన్ని మార్పులు మాత్రమే చేసినట్టు చైనా చెప్తోంది. -
చైనా శత్రుదుర్భేద్యం!
► దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ధీమా ► చైనా ఆర్మీ 90వ వార్షికోత్సవం సందర్భంగా ఆయుధాల ప్రదర్శన బీజింగ్: చైనా శత్రుదుర్భేద్యమైన దేశమని అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆదివారం ధీమా వ్యక్తం చేశారు. తమపై యుద్ధానికి వచ్చే ప్రపంచంలోని ఏ దేశాన్నైనా ఓడించే సామర్థ్యం తమ ఆర్మీకి ఉందని అన్నారు. చైనా సైన్యం యుద్ధానికి సన్నద్ధంగా ఉండటాన్ని ఆయన ప్రశంసించారు. 23 లక్షల మంది సైనికులను కలిగిన చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ప్రపంచంలోనే అతిపెద్దది. 1927 ఆగస్టు 1న మావో జెడాంగ్ నేతృత్వంలోని చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) పీఎల్ఏను స్థాపించింది. అప్పటి నుంచి పీఎల్ఏ చైనా ప్రభుత్వం కింద కాకుండా సీపీసీ ఆధ్వర్యంలోనే పనిచేస్తోంది. తాజాగా పీఎల్ఏ 90వ వార్షికోత్సవం సందర్భంగా మంగోలియాలోని ఝరిహెలో భారీ పరేడ్, ఆయుధాల ప్రదర్శనను నిర్వహించారు. ఈ ప్రదర్శనను జిన్‌పింగ్ తిలకించారు. 12 వేల దళాలు, 100కు పైగా యుద్ధ విమానాలు, 600 రకాల ఆయుధాలను ప్రదర్శించారు. వీటిలో సగం ఆయుధాలు కొత్తగా రూపొందించినవే. స్వల్ప, మధ్య, దీర్ఘశ్రేణి లక్ష్యాలను ఛేదించగల ఐదు అణు, సంప్రదాయ క్షిపణులతోపాటు భారత సరిహద్దులో పరీక్షించారని చెబుతున్న కొత్త యుద్ధ ట్యాంకును కూడా ఈ ప్రదర్శనలో ఉంచారు. ఇంకా బలమైన ఆర్మీ అవసరం.. సీపీసీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కూడా అయిన జిన్‌పింగ్...సైనికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ‘సీపీసీ నాయకత్వం ఇచ్చే ఆదేశాలను మీరు విధిగా పాటించాలి. పార్టీ ఏం చెబితే అది చేయాలి. మనపైకి వచ్చే శత్రువులందరినీ ఓడించగలమనే విశ్వా సం, సామర్థ్యం మన ఆర్మీకి ఉంది’ అని అన్నారు. ప్రపంచ శక్తిగా ఎదుగుతున్న క్రమంలో చైనాకు మరింత బలమైన ఆర్మీ అవసరం ఉందనీ, పీఎల్ఏను ప్రపంచంలోనే ఉత్తమ ఆర్మీగా మలచాలని పేర్కొన్నారు. భారత్ సరిహద్దులోని డోక్లామ్ లో ఉద్రిక్తత గురించి మాత్రం ప్రస్తావించలేదు. అయితే చైనా భూభాగంలోకి భారత దళా లు చొచ్చుకువచ్చాయని చైనా విదేశాంగ, రక్షణ శాఖలు ఆరోపిస్తున్న నేపథ్యంలో జిన్‌పింగ్ పైవ్యాఖ్యలు చేశారు. కాగా, జిన్‌పింగ్ ప్రదర్శనకు హాజరవడానికి కొద్దిసేపటి ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రం ప్ మాట్లాడుతూ ఉత్తర కొరియాను నిలువరించడంలో చైనా విఫలమైందన్నారు. అమెరికా మొత్తంలో ఎక్కడైనా ప్రయోగించగలిగే సామర్థ్యం ఉన్న ఖండాంతర క్షిపణిని ఉత్తర కొరియా పరీక్షించడం తెలిసిందే. క్షిపణి నిరోధకాన్ని పరీక్షించిన అమెరికా ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి పరీక్ష జరిపిన మరుసటి రోజే క్షిపణులను అడ్డుకోగల వ్యవస్థను అమెరికా విజయవంతంగా పరీక్షించింది. దీనిని కొరియా ద్వీపకల్పంలో మోహరించే అవకాశం ఉంది. పరీక్షలో భాగంగా అమెరికా ‘ఎయిర్‌ఫోర్స్ సీ–17’ నుంచి ఓ మధ్యశ్రేణి క్షిపణిని ప్రయోగించగా, దీనిని అలస్కాలోని థాడ్ (టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్) క్షిపణి నిరోధక వ్యవస్థ గుర్తించి నాశనం చేసింది. థాడ్‌ను తమ ప్రాంతంలో ఏర్పాటుచేసే ప్రక్రియను వేగవంతం చేస్తామని దక్షిణ కొరియా తెలిపింది. -
టిబెట్‌లో చైనా సైనిక బలప్రదర్శన
బీజింగ్: సిక్కిం సరిహద్దులో భారత్‌తో ఉద్రిక్తత నేపథ్యంలో చైనా సైన్యం టిబెట్ పీఠభూమిపై బలప్రదర్శన చేసింది. పీఠభూముల్లో దాడులు చేసే సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికి 5వేల అడుగుల ఎత్తులోని టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో ఈ నెలలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనిక విన్యాసాలు చేసినట్లు చైనా ఆర్మీ తెలిపింది. యుద్ధ విమానాలు, ట్యాంకులు, బంకర్లపై దాడి చేసే గ్రెనేడ్లు, క్షిపణులు, శతఘ్నులను సైనికులు వాడుతున్నట్లున్న దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. టిబెట్ మిలటరీ కమాండ్ జవాన్లు.. 11 గంటలపాటు కాల్పులు, వేగంగా మోహరింపు, బహుళ దళాల సంయుక్త దాడి, యుద్ధ విమానాల నుంచి రక్షణ తదితర విన్యాసాలు చేశారని చైనా డైలీ తెలిపింది. విన్యాసాలు సోమవారం కూడా కొనసాగాయి. -
అమెరికా ప్రభుత్వ కంప్యూటర్ల హ్యాకింగ్
చైనా సైన్యంపై అనుమానం వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వ కంప్యూటర్లు భారీ స్థాయిలో హ్యాకింగ్‌కు గురయ్యాయి. చైనా సైన్యం తరఫున పనిచేస్తున్నట్లు భావిస్తున్న హ్యాకర్లు.. అమెరికా ప్రభుత్వానికి చెందిన దాదాపు ప్రతి విభాగంలోకి చొరబడి 40 లక్షల మంది ప్రస్తుత, మాజీ ఫెడరల్ ఉద్యోగుల వ్యక్తిగత వివరాలను తస్కరించి ఉంటారని అనుమానిస్తున్నారు. వ్యక్తిగత గుర్తింపు సమాచారం వంటి వివరాలను ప్రభావితం చేసే సైబర్ నేరాన్ని గుర్తించినటట్లు సిబ్బంది నిర్వహణ కార్యాలయం తెలిపింది. ప్రభుత్వ కంప్యూటర్ల నెట్‌వర్క్‌లోకి భారీస్థాయిలో చొరబడ్డం ఇదే తొలిసారి అని భావిస్తున్నారు. దీనిపై అమెరికా కంప్యూటర్స్ ఎమర్జెన్సీ రెడీనెస్ టీమ్, ఎఫ్‌బీఐలు దర్యాప్తు మొదలుపెట్టాయి. చైనా ప్రభుత్వమే హ్యాకింగ్ చేసిందని వాషింగ్టన్ పోస్ట్, వాల్‌స్ట్రీట్ జర్నల్‌లు పేర్కొన్నాయి. సిబ్బంది నిర్వహణ కార్యాలయ కంప్యూటర్లను చైనా నుంచి హ్యాకింగ్ చేయడం ఏడాది కాలంలో ఇది రెండోసారి పేర్కొన్నాయి. ఆరోపణలను చైనా ఖండించింది. -
మళ్లీ చైనా చొరబాటు
ఈటానగర్/న్యూఢిల్లీ: చైనా మళ్లీ చొరబడింది. ఏకంగా నాలుగురోజుల పాటు మన భూభాగంపై తిష్ట వేసింది. లడఖ్‌లో మాదిరిగా భార త సైన్యానికి ఎదురునిలిచింది. ఈ నెల 11న అరుణాచల్ ప్రదేశ్‌లోని చగ్లాగామ్ ప్రాంతంలోని భారత భూభాగంలోనికి చైనా దళాలు 20 కిలోమీటర్లకు పైగా చొచ్చుకువచ్చినట్లు ఢిల్లీలోని రక్షణశాఖ వర్గాలు బుధవారం వెల్లడించాయి. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బృందం ఏకంగా నాలుగురోజుల పాటు అక్కడే ఉందని తెలిపాయి. 13వ తేదీన విషయం గుర్తించిన భారతీయ దళాలు వారిని వెనక్కి మళ్లాల్సిందిగా హెచ్చరించాయని, ఆ ప్రాంతాన్ని విడిచిపోవాల్సిందిగా రెండుపక్షాలూ పరస్పరం బ్యానర్లు ప్రదర్శించుకున్నాయని వివరించాయి. నాలుగురోజుల తర్వాత చైనా సైన్యం అక్కడినుంచి కదిలిందని రక్షణ వర్గాలు తెలిపాయి. సరిహద్దు దళాలతో 15 నిమిషాల పాటు సమావేశానంతరం చైనా దళాలు అక్కడినుంచి వెళ్లినట్టు ఈటానగర్‌లోని అధికారవర్గాలు చెప్పాయి. ‘వాళ్లు వచ్చారు..వెళ్లారు. తగిన సంఖ్యలో భారతీయ దళాలు ఇప్పుడక్కడ ఉన్నాయి..’ అని ఆ వర్గాలు వివరించాయి. ఆ ప్రాంతంలోని నియంత్రణ రేఖ ఆకృతిని బట్టి చగ్లాగామ్ ‘చేప తోక’గా కూడా ప్రాచుర్యంలో ఉంది. గతంలో కూడా అనేకమార్లు చైనా ఇక్కడ చొరబాట్లకు తెగబడింది. అయితే దళాలు తక్షణమే తిరిగి వెళ్లేవి. ఈసారి మాత్రం దీర్ఘకాలం పాటు తిష్టవేశాయి. ఈ సంఘటనను ఇటు ఢిల్లీలోని ఆర్మీ ప్రధాన కార్యాలయం, విదేశాంగ శాఖ తేలిగ్గా కొట్టేశాయి. ప్రాధాన్యత లేని అంశాలను దౌత్య ప్రక్రియలో చేర్చలేమని విదేశాంగ శాఖ ప్రతి నిధి అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. భారత సైన్యం దీన్ని ప్రతిఘటించిందని, ఇంతకుమించి ముందు కెళ్లాలని తాము భావించడం లేదని అన్నారు. లడఖ్‌లో పాక్ కాల్పులు: సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం దుశ్చర్యలు ఆగడం లేదు. మంగళవారం రాత్రి ఆ దేశ బలగాలు జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతం షాక్మా సెక్టార్‌తోపాటు మారోల్ సెక్టార్లో భారత ఆర్మీ పోస్టులపై ఎలాంటి కవ్వింపూ లేకుండానే కాల్పులు జరిపాయి. భారత జవాన్లు వీటిని గట్టిగా తిప్పికొట్టారు.