
అమెరికా ప్రభుత్వ కంప్యూటర్ల హ్యాకింగ్
చైనా సైన్యంపై అనుమానం
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వ కంప్యూటర్లు భారీ స్థాయిలో హ్యాకింగ్‌కు గురయ్యాయి. చైనా సైన్యం తరఫున పనిచేస్తున్నట్లు భావిస్తున్న హ్యాకర్లు.. అమెరికా ప్రభుత్వానికి చెందిన దాదాపు ప్రతి విభాగంలోకి చొరబడి 40 లక్షల మంది ప్రస్తుత, మాజీ ఫెడరల్ ఉద్యోగుల వ్యక్తిగత వివరాలను తస్కరించి ఉంటారని అనుమానిస్తున్నారు. వ్యక్తిగత గుర్తింపు సమాచారం వంటి వివరాలను ప్రభావితం చేసే సైబర్ నేరాన్ని గుర్తించినటట్లు సిబ్బంది నిర్వహణ కార్యాలయం తెలిపింది.
ప్రభుత్వ కంప్యూటర్ల నెట్‌వర్క్‌లోకి భారీస్థాయిలో చొరబడ్డం ఇదే తొలిసారి అని భావిస్తున్నారు. దీనిపై అమెరికా కంప్యూటర్స్ ఎమర్జెన్సీ రెడీనెస్ టీమ్, ఎఫ్‌బీఐలు దర్యాప్తు మొదలుపెట్టాయి. చైనా ప్రభుత్వమే హ్యాకింగ్ చేసిందని వాషింగ్టన్ పోస్ట్, వాల్‌స్ట్రీట్ జర్నల్‌లు పేర్కొన్నాయి. సిబ్బంది నిర్వహణ కార్యాలయ కంప్యూటర్లను చైనా నుంచి హ్యాకింగ్ చేయడం ఏడాది కాలంలో ఇది రెండోసారి పేర్కొన్నాయి. ఆరోపణలను చైనా ఖండించింది.