రష్యా హ్యాకింగ్‌పై అమెరికన్ల స్పందనిది..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా రష్యా హ్యాకింగ్‌కు పాల్పడిందని, రిపబ్లికన్‌ల విజయానికి అది దోహదపడిందని ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో రష్యా సైబర్ దాడులపై ఎన్‌బీసీ నిర్వహించిన సర్వేలో అమెరికా ప్రజానికం అభిప్రాయం ఇలా ఉంది.
అమెరికాలోని 55 శాతం మంది రష్యా సైబర్ దాడుల విషయంలో ఎంతో కొంత ఆందోళనగా ఉన్నారని ఎన్‌బీసీ సర్వేలో వెల్లడైంది. అయితే డెమోక్రాట్లలో 86 శాతం మంది సైబర్ దాడుల పట్ల తీవ్రంగా స్పందించగా.. రిపబ్లికన్‌లలో 29 శాతం మంది మాత్రమే ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, రష్యా సైబర్ దాడులు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయలేదని 57 శాతం మంది నమ్ముతుండగా.. ట్రంప్ గెలుపుకు హ్యకింగ్ దోహదపడిందని సర్వేలో పాల్గొన్న 37 శాతం మంది అభ్రిప్రాయపడ్డారు.