
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏ మలుపు తిరుగుతుందోనని ప్రపంచ దేశాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఉక్రెయిన్‌పై రష్యా మున్ముందు ఎలాంటి దాడులు చేస్తుందోనని పలు దేశాలు అప్రమత్తమవుతున్నాయి.ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో రాయబార కార్యాలయాన్ని మూసేసిన అమెరికా బాటలోనే పలు దేశాలు కూడా నడుస్తున్నాయి.
ఇటలీ ,గ్రీస్,స్పెయిన్‌లు కూడా కీవ్‌లోని తమ ఎంబసీలను తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తోంది. కీవ్‌లోని తమ ఎంబసీపై రష్యా భారీ వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉందనే సమాచారం అందడంతో వెంటనే దానిని అమెరికా తాత్కాలికంగా మూసివేసింది. నవంబర్ 20న దాడి జరగబోతోందని తమకు అందిన కచ్చితమైన సమాచారంతోనే ఎంబసీ ఖాళీ చేసినట్లు అమెరికా వెల్లడించింది.
ఈ క్రమంలోనే ఇటలీ, గ్రీస్, స్పెయిన్‌లు తమ ఎంబసీలను తాత్కాలికంగా మూసివేశాయి.కాగా,రష్యా అణ్వాయుధాల వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సరళతరం చేసే కీలక ఫైల్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా సంతకం చేసిన సంగతి తెలిసిందే.అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగానే రష్యా పరిగణించనుంది.
Comments
Please login to add a commentAdd a comment