కీవ్ : రష్యాతో యుద్ధంతో ఉక్రెయిన్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా ఉక్రెయిన్‌లో అమెరికా రాయబార కార్యాలయాన్ని (ఎంబసీ) తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వైట్ హౌస్ ప్రతినిధులు వెల్లడించారు.
ఇటీవల అమెరికా ఏటీఏసీఎంఎస్ క్షిపణులను ఉక్రెయిన్‌కు సరఫరా చేసింది. ఆ క్షిపణులను ఉక్రెయిన్.. శత్రుదేశంపై ప్రయోగించింది. అయితే, ఉక్రెయిన్ క్షిపణుల దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు రష్యా సిద్ధమైంది. కీవ్‌పై ఊహించని విధంగా వైమానిక దాడులు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేస్తున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది.
వెంటనే ఉక్రెయిన్‌లో తమ ఎంబసీని మూస్తువేస్తున్నట్లు ఎంబసీ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఎంబీసీలో పనిచేసే ఉద్యోగులు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలని సూచించింది. దీంతో పాటు ఉక్రెయిన్‌లో ఉన్న అమెరికన్ పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేసింది.
అమెరికా అందించిన ఏటీఏసీఎంఎస్ క్షిపణులను ఉక్రెయిన్ రష్యాపై ప్రయోగించింది. ఈ దాడులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ఉక్రెయిన్‌కు తగిన విధంగా బదులిస్తామని హెచ్చరించారు. గత నెలలో ఉత్తర కొరియా అందిస్తున్న క్షిపణలతో దాడులు చేస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment