మాస్కో:అమెరికా-రష్యా మధ్య అత్యవసర కమ్యూనికేషన్‌కు కీలకమైన హాట్‌లైన్ వ్యవస్థ ఇప్పుడు అందుబాటులో లేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. అమెరికా,రష్యాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తితే రెండు దేశాల అధ్యక్షులు చర్చించేందుకు ఓ సురక్షితమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఉందని,ఇది వీడియో కూడా ప్రసారం చేయగలదని పెస్కోవ్ గతంలో చెప్పారు.
అయితే ప్రస్తుతం ఇది వినియోగంలో లేదని తాజాగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు పెస్కోవ్ సమాధానమిచ్చారు. కాగా,రష్యాపై అమెరికా తయారీ లాంగ్‌రేంజ్ మిసైల్స్ వాడేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు బైడెన్ అనుమతివ్వడంతో యూరప్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి.
దీనికి ప్రతిగా అణ్వాయుధాల ప్రయోగంపై నిబంధనలను రష్యా సరళతరం చేసింది.ఈ పరిణామాల నడుమ మంగళవారం(నవంబర్ 19) కీవ్ దళాలు రష్యా ప్రధాన భూభాగంపై క్షిపణులతో దాడులు చేశాయి.ఇందుకు ప్రతీకారంగా ఉక్రెయిన్‌పై మాస్కో దళాలు దాడి చేయవచ్చనే భయాలు పెరిగిపోయాయి. దీంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని తన దౌత్య కార్యాలయాన్ని అమెరికా ఖాళీ చేసింది.ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా,రష్యా మధ్య హాట్‌లైన్ వాడకంలో లేదన్న వార్త మరింత భయాందోళనలకు కారణమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment