Hotline
-
ర్యాష్ డ్రైవింగ్: జొమాటో హాట్‌లైన్ నంబర్ లాంచ్
న్యూఢిల్లీ: డెలివరీ పార్ట్నర్లు ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తున్న పక్షంలో ప్రజలు తమకు ఫిర్యాదు చేసేందుకు వీలుగా కొత్త డెలివరీ బ్యాగ్‌లను ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని ఆన్లైన్ ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. తమ బ్యాగ్‌లపై ‘హాట్‌లైన్ ఫోన్ నంబర్‘ ముద్రించి ఉంటుందని ట్వీట్ చేశారు. వేగంగా డెలివరీలు చేయాలంటూ తాము పార్ట్నర్లను ఒత్తిడి చేయమని ఆయన పేర్కొన్నారు. సత్వరం అందిస్తే ప్రోత్సాహకాలు ఇవ్వడం, లేకపోతే పెనాల్టీలు విధించడం వంటివి ఏమీ ఉండవని గోయల్ స్పష్టం చేశారు. అసలు వారికి ఎస్టిమేటెడ్ డెలివరీ కూడా చెప్పం. ఈ నేపథ్యంలో తమ డె లివరీ పార్ట్నర్లు ఎవరైనా వేగంగా నడుపుతుంటే. తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. తద్వారా రోడ్లపై ట్రాఫిక్‌ను రద్దీ లేకుండా నివారించాలని ఆయన కోరారు. 10 నిమిషాల్లోనే ఇన్స్టంట్ డెలివరీ సర్వీసులు ప్రారంభిస్తున్నామని గతంలో ప్రకటించినప్పుడు డెడ్‌లైన్ పేరిట డెలివరీ పార్ట్నర్లపై ఒత్తిడి పెంచుతున్నారంటూ జొమాటోపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో గోయల్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. As promised earlier, we have started rolling out delivery bags which mention a hotline phone number to report rash driving by our delivery partners. Please remember – we don’t incentivise our delivery partners for on time deliveries, nor do we penalise them for late ones. (1/2) pic.twitter.com/Jic36Rt1qn — Deepinder Goyal (@deepigoyal) November 2, 2022 -
బాబోయ్ కరోనా
బీజింగ్/న్యూఢిల్లీ: చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తోంది. ఈ వైరస్ బారిన పడి సోమవారం వరకు 81 మంది చనిపోయారు. 2,744 మందికి ఈ వైరస్ సోకినట్లు ధ్రువీకరించారు. వీరిలో 461 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ఈ వైరస్ మొదట వెలుగు చూసిన వుహాన్ నగరంలో సోమవారం చైనా ప్రధాని లీ కెక్వింగ్ పర్యటించారు. బాధితులకు అందుతున్న చికిత్స వివరాలను, వైరస్ వ్యాపిని నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించారు. బాధితులు ఉన్న పలు ఆసుపత్రులను తనిఖీ చేశారు. వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న 32,799 మందిని పరీక్షించామని, వారిలో 583 మందిని ఆదివారం మొత్తం అబ్జర్వేషన్లో ఉంచి, సోమవారం డిశ్చార్జ్ చేశామని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. థాయిలాండ్, జపాన్, దక్షిణ కొరియా, అమెరికా, వియత్నాం, సింగపూర్, మలేసియా, నేపాల్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాల్లో కూడా ఈ వైరస్ సోకిన కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునే దిశగా చైనా పలు చర్యలు తీసుకుంది. నగరంలోకి రాకపోకలు నిషేధించిన జనవరి 23 లోపే వుహాన్ నుంచి దాదాపు 50 లక్షల మంది వెళ్లిపోయారని ఆ నగర మేయర్ జో జియాన్‌వాంగ్ తెలిపారు. ఆ నగర జనాభా దాదాపు కోటి పదిలక్షలు. భారతీయుల కోసం మూడు హాట్‌లైన్స్ హ్యుబెయి రాష్ట్రంలో ఉన్న భారతీయుల కోసం చైనాలోని భారతీయ రాయబార కార్యాలయం 3 హాట్‌లైన్ నెంబర్లను ప్రారంభించింది. వుహాన్‌లో చిక్కుకుపోయిన దాదాపు 300 మంది భారతీయులను తీసుకురావడానికి సంబంధించి చైనా విదేశాంగ శాఖతో భారతీయ అధికారులు సోమవారం సంప్రదింపులు జరిపారు. కాగా, ముంబైలోనూ పలు అనుమానిత కేసులు నమోదయ్యాయి. స్థానిక కస్తూర్బా ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ఒక అనుమానిత వ్యాధిగ్రస్తుడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. -
కరోనా వైరస్ తీవ్రతరం
బీజింగ్/న్యూఢిల్లీ: చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ రోజు రోజుకూ బలం పుంజుకుంటోంది. ఇప్పటివరకూ ఈ వ్యాధి కారణంగా మొత్తం 41 మంది మరణించగా ఒక్క చైనాలోనే 1287 మందికిపైగా వ్యాధి బారినపడినట్లు.. వీరిలో 237 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో 1,965 మంది వ్యాధిబారిన పడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. కరోనా వైరస్ ఇప్పటికే హాంకాంగ్, మకావు, తైవాన్, నేపాల్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, వియత్నాం, అమెరికాలకు విస్తరించగా భారత్‌లోనూ ఈ వ్యాధిపై ఆందోళన మొదలైంది. మధ్య చైనా ప్రాంతంలోని వూహాన్, హుబే యూనివర్సిటీల్లో సుమారు 700 మంది భారతీయ విద్యార్థులు ఉండటం దీనికి కారణమవుతోంది. భారత దౌత్య కార్యాలయం ఇప్పటికే ఈ విద్యార్థులను సంప్రదించేందుకు హాట్లైన్లను ఏర్పాటు చేయడం గమనార్హం. వూహాన్లో కొత్త ఆసుపత్రి... కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు చైనా ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వైరస్‌కు మూలకేంద్రంగా భావిస్తున్న వూహాన్ నగరంలో కొత్తగా ఇంకో ఆసుపత్రిని నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రెండు వారాల్లోపు ఇక్కడ 1000పడకలతో మరో ఆసుపత్రిని కడతామని ప్రభుత్వం చెబుతోంది. వైరస్ బాధితులకు చికిత్స అందించేందుకు మిలటరీ వైద్యులను రంగంలోకి దింపింది. వూహాన్‌తోపాటు పరిసరాల్లోని సుమారు 12 నగరాల్లో రవాణాపై నిషేధం కొనసాగుతూండగా, శనివారం నాటి కొత్త సంవత్సర వేడుకలపై దీని ప్రభావం కనిపించింది. బీజింగ్‌లోనూ కొత్త సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన పలు ప్రత్యేక కార్యక్రమాలు రద్దయ్యాయి. ఫర్బిడన్ సిటీ, షాంఘైలోని డిస్నీల్యాండ్ వంటి పర్యాటక ప్రాంతాలనూ మూసివేశారు. టీకా తయారీకీ యత్నాలు కరోనా వైరస్ బారి నుంచి కాపాడేందుకు చైనా, అమెరికన్ శాస్త్రవేత్తలు టీకా తయారీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ వైరస్ బారిన పడితే వ్యాధి లక్షణాలను నియంత్రించడం మినహా ప్రస్తుతం ఏరకమైన చికిత్స లేదు. చైనా మొత్తం తనిఖీలు కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశం మొత్తమ్మీద తనఖీలు చేపట్టాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. విమానాలు, రైళ్లు, బస్సుల్లోనూ వైరస్ సోకిన వారి కోసం పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టాలని, ప్రత్యేక తనిఖీ కేంద్రాల ద్వారా నుమోనియా లక్షణాలతో ఉన్న వారిని గుర్తించి ఎప్పటికప్పుడు వారిని వైద్య కేంద్రాలకు తరలించాలని నేషనల్ హెల్త్ కమిషన్ శనివారం ఒక ప్రకటనలో ఆదేశించింది. అమెరికాలో మరో కేసు అమెరికాలోని షికాగోలో తాజాగా ఒక మహిళ ఈ వ్యాధి బారిన పడింది. మరో యాభైమందిని పరిశీలనలో ఉంచారు. జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే నేపాల్లోనూ 32 ఏళ్ల పురుషుడు ఒకరు ఈ వ్యాధి బారిన పడ్డారు. వూహాన్ నుంచి ఇటీవలే నేపాల్ వచ్చిన ఇతడికి ప్రస్తుతం ఖట్మండూలో చికిత్స అందించి డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు తెలిపారు. యూరప్‌లోని ఫ్రాన్స్‌లో ఇద్దరికి ఈ వ్యాధి సోకినట్లు వార్తలు వస్తూండటం ఆందోళన కలిగిస్తోంది. -
పాకిస్తాన్‌కు భారత్ హెచ్చరిక
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పాకిస్తాన్ అదనపు బలగాల్ని మోహరించడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తూ జనావాస ప్రాంతాలు లక్ష్యంగా దాడులకు దిగొద్దని హెచ్చరించింది. పుల్వామా, బాలాకోట్ ఘటనల తరువాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ తన బలగాలు, ఆయుధ సంపత్తిని అఫ్గానిస్తాన్ సరిహద్దుల నుంచి నియంత్రణ రేఖ వైపు తరలిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం భారత్ స్పందిస్తూ.. పాకిస్తాన్ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరికలు జారీచేసింది. (ఫేక్ వీడియోతో అడ్డంగా దొరికిపోయిన పాక్) ఎల్వోసీ వెంట సామాన్య పౌరులు లక్ష్యంగా మోర్టార్ దాడులకు దిగొద్దని మంగళవారం హాట్‌లైన్ ద్వారా జరిపిన సంభాషణలో భారత అధికారులు పాక్‌ను హెచ్చరించారు. ఎల్వోసీ, అంతర్జాతీయ సరిహద్దులో నిఘాను పటిష్టం చేశారు. పాకిస్తాన్ నుంచి ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు ఎదురైనా దీటుగా తిప్పికొడతామని ఆర్మీ తెలిపింది. (‘బాలాకోట్’ సాక్ష్యాలివిగో!) -
విద్యార్థుల వివరాలకు హాట్‌లైన్
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికాలో వీసా మోసం కేసులో అరెస్టయిన 129 మంది భారతీయ విద్యార్థులను విడిపించేందుకు భారత విదేశాంగ శాఖ, అమెరికాలోని భారత దౌత్య కార్యాలయాలు కృషి చేస్తున్నాయి. అరెస్టయిన విద్యార్థులకు సంబంధించిన వివరాలు అందించేందుకు వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయంలో హాట్లైన్లను ఏర్పాటు చేశారు. +12023221190, +12023402590 నంబర్లకు ఫోన్ చేయడం ద్వారా అరెస్టయిన విద్యార్థులకు సంబంధించిన వివరాలను వారి బంధువులు, స్నేహితులు తెలుసుకోవచ్చని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ నంబర్లు 24x7 పనిచేస్తాయనీ, cons3. washington@mea.gov.in కు ఈ–మెయిల్ పంపడం ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. విద్యార్థి వీసాలను దుర్వినియోగం చేస్తున్న విదేశీయులను పట్టుకునేందుకు అమెరికా అధికారులే ఫార్మింగ్టన్ యూనివర్సిటీ పేరుతో నకిలీ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి వల పన్నడం తెలిసిందే. ఈ యూనివర్సిటీలో 600 మంది విద్యార్థులుగా చేరారు. వారిని చేర్పించిన 8 మంది మధ్యవర్తులను కూడా పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ యూనివర్సిటీలో తరగతులుండవు, నిబంధనల ప్రకారం ఈ విశ్వవిద్యాలయం పనిచేయదని తెలిసినా కేవలం అమెరికాలో ఉండి, ఇతర ఉద్యోగాలు చేసుకోవడం కోసమే ఆ 600 మంది ఇక్కడ చేరారని అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయం వారికి తెలియదనీ, చాలా యూనివర్సిటీ కోర్సుల్లో చదువుతున్న సమయంలోనే ఉద్యోగాలు చేసుకునే వీలు కూడా ఉంది కాబట్టి ఇది కూడా అసలైనదేనని విద్యార్థులు భావించారని అరెస్టయిన వారి తరఫు న్యాయవాదులు అంటున్నారు. రాజకీయ చర్య తీసుకున్న భారత్ విద్యార్థులు అరెస్టవ్వడంపై భారత్ శనివారం రాజకీయపరమైన చర్య తీసుకుంది. అరెస్టయిన విద్యార్థులను కలిసేందుకు భారత దౌత్యాధికారులను తక్షణం అనుమతించాలని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని కోరింది. ప్రస్తుత పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామనీ, చర్యలు తీసుకుంటున్నామని విదేశాంగ శాఖ తెలిపింది. ఇప్పటికే కొందరు దౌత్యాధికారులు అరెస్టయిన విద్యార్థులను కలుసుకున్నారని చెప్పింది. అరెస్టయిన వారందరినీ విడుదల చేయాలనీ, వారికి ఇష్టం లేకుండానే అమెరికా నుంచి పంపించి వేయద్దని భారత్ కోరింది. ఎక్కడికీ వెళ్లకుండా ప్రత్యేక పరికరాలు ఈ యూనివర్సిటీలో చేరిన 130 మందిని (వారిలో 129 మంది భారతీయులు) ఇప్పటికే అరెస్టు చేసిన అధికారులు, మరింత మందిని త్వరలో పట్టుకునే చాన్సుంది. కాగా, కొంతమంది విద్యార్థులు వారు నివసిస్తున్న ప్రదేశం నుంచి ఎక్కువ దూరం బయటకు వెళ్లడానికి వీలు లేకుండా వారి కాలి చీలమండ దగ్గర ట్రాకింగ్ పరికరాలను అమర్చారు. -
భారత్, చైనాల మధ్య హాట్‌లైన్
బీజింగ్: రక్షణ మంత్రుల స్థాయిలో హాట్‌లైన్ ఏర్పాటుతోపాటు 12 ఏళ్లనాటి రక్షణ ఒప్పందాన్ని పునరుద్ధరించాలనే అంశంపై భారత్, చైనాలు చర్చలు జరుపుతున్నాయి. చైనా రక్షణ మంత్రి వీ ఫెంగ్ గత వారం ఢిల్లీలో ప్రధాని మోదీ, రక్షణ మంత్రి సీతారామన్‌తో సమావేశమయ్యారు. వుహాన్‌లో జిన్‌పింగ్, మోదీ మధ్య జరిగిన భేటీలో తీసుకున్న నిర్ణయాల అమలుపై చర్చించారు. డోక్లాం సంక్షోభం వంటివి తలెత్తినప్పుడు రెండు దేశాల సైనికాధికారులు ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలనే అంశం కూడా ఇందులో ఉందని చైనా రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి బీజింగ్‌లో తెలిపారు. రెండు దేశాల రక్షణ మంత్రులతోపాటు సైనికాధికారుల మధ్య హాట్‌లైన్ ఏర్పాటు, 2006లో భారత్, చైనాల మధ్య కుదిరిన పరస్పర అంగీకార ఒప్పందాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు కూడా చర్చలు జరిగాయన్నారు. -
సామరస్యానికి ప్రొటోకాల్ అడ్డు!
1962 భారత–చైనా యుద్ధం నాటి గందరగోళమే ఇంకా రాజ్య సరిహద్దులో కొనసాగుతోంది. రెండు దేశాల సైనిక దళాల మధ్య పనిచేయాల్సిన హాట్‌లైన్ ప్రొటోకాల్ సమస్యల్లో చిక్కుకుపోయింది. రెండు దేశాల మధ్య 3,488 కిలోమీటర్ల పొడవున్న సరిహద్దులో తరచు తలెత్తే అవకాశమున్న సమస్యలు ఎదురైతే చైనా యుద్ధ కమాండర్‌తో భారత్ వైపు నుంచి హాట్లైన్లో ఎవరు మాట్లాడాలి? భారత్ వైపున ఉన్న ఆర్మీ ప్రధాన కార్యాలయంలోని సైనిక కార్యకలాపాల (ఆపరేషన్స్) డైరెక్టర్ జనరల్ (డీజీఎంఓ) స్వయంగా మాట్లాడాల్సి వస్తే, రెండు సైన్యాల సైనికాధికారుల మధ్య సమాన హోదాకు సంబంధించిన ప్రొటోకాల్ సమస్య తలెత్తుతుంది. ఎవరైనా కొన్ని తప్పని సరి పొరపాట్లు చేయడం తప్పుకాదు. అయితే, రక్షణ రంగంలో ఉద్దేశపూర్వక నిష్క్రియాపరత్వం సరి కాదు. ఇక్కడ అవకాశం పోతే దాన్ని సమర్ధించుకో వడం కుదరదు. భారత సైనిక, రక్షణ వ్యవస్థలో మౌలిక మార్పులు తీసుకొచ్చే విషయంలో మోదీ ప్రభుత్వం ఎన్నో అవకాశాలు వదులుకుంటోంది. 30 ఏళ్ల తర్వాత పూర్తి మెజారిటీతో గద్దెనెక్కిన ప్రభుత్వానికి ఎన్నో ఏళ్లుగా వాయిదాపడుతున్న సంస్కర ణలు సైనిక రంగంలో అమలు చేయడానికి అవకాశం వచ్చింది. ఈ పని చేయకుండా గత ప్రభుత్వాలను నిందించి ప్రయోజనం లేదు. సైన్యానికి అనుకూల మనే అభిప్రాయం ఉన్న కారణంగా మోదీ సర్కారు చాలా చేస్తుందనే అంచనాలు వేశారు. ఏ ఇతర రంగంలో లేనంతగా రక్షణ రంగ సంస్కరణ విష యంలో కేంద్ర వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద సైనిక వ్యవ స్థను విప్లవాత్మక మార్పులతో ఆధునికీకరించే అరు దైన అవకాశం లభించినా తన పాలనాకాలంలోని చివరి సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఏవేవో కొన్ని చిన్నాచితకా చర్యలతో కాలం గడుపుతోంది. తన సైనిక కాల్బలానికి అవసరమైన మౌలిక రైఫిళ్లు, సైనిక దళాలకు ఓ మోస్తరు బూట్లు సమకూర్చడానికి నానా పాట్లు పడుతోంది. వైమానికి దళానికి ఆధునికీకరిం చిన జాగ్వార్ యుద్ధ విమానాలు ఇస్తున్నట్టు సగ ర్వంగా చెప్పుకుంటోంది. కాని మొదట ఈ రకం విమానాలను ప్రవేశపెట్టి 40 ఏళ్లు దాటాయి. సైన్యా నికి ఆయుధాలు, సామాగ్రి సరఫరా చేయడంలో వెనుకబాటు మంచిది కాదు. కానీ, రక్షణ రంగంలో వ్యవస్థీకృత సంస్కరణలు ఆలస్యం చేస్తే జరిగే నష్టం చాలా ఎక్కువ. ఈ విషయంపైనే ఇండియాను చైనా సూటిగా ప్రశ్నించింది. ‘‘మా వైపున అత్యవసర సమ యంలో మాట్లాడడానికి హాట్‌లైన్‌ను ఎవరు నిర్వ హిస్తారో మాకు తెలుసు. భారత సరిహద్దులో తూర్పు నుంచి పశ్చిమ కొస వరకూ యుద్ధ రంగ కమాండర్ ఈ పని చేస్తారు. మరి మీ వైపును ఎవరు చూస్తారు?’’ అని చైనా వేసిన ప్రశ్న ఆందోళనకరం. భారత సరిహద్దులో చైనాకు ఒకే కమాండర్! భారత సరిహద్దులో మోహరించే చైనా సైనిక దళా లన్నింటికీ ఒకే కమాండర్ ఉన్నారు. చైనా బలగాలకు ఒక ఉన్నత సైనిక కమాండర్, ఒక ప్రధాన సైనిక కార్యాలయం ఉంటే, ఇందుకు విరుద్దమైన పరిస్థితి భారత్‌ది. చైనా సరిహద్దున ఉన్న అరుణాచల్, సిక్కిం– భూటాన్ ప్రాంతం తూర్పు ఆర్మీ కమాండర్ నియంత్రణలో ఉంటుంది. ఉత్తరాఖండ్(మధ్య) సెక్టర్ మధ్య ఆర్మీ కమాండర్ అదుపులో, హిమా చల్–టిబెట్ సరిహద్దు ప్రాంతం పశ్చిమ ఆర్మీ కమాండర్ నియంత్రణలో ఉంటాయి. ఇకపోతే, కశ్మీర్ మొత్తం, లద్దాఖ్ చివరి వరకూ ఉత్తర ఆర్మీ కమాండర్ చేతిలో ఉన్నాయి. భారత వైమానికి దళం (ఐఏఎఫ్) కూడా తన తూర్పు, మధ్య, పశ్చిమ కమాండ్ల ద్వారా సరిహద్దులో తన విధులు నిర్వహి స్తోంది. అంటే, చైనా సరిహద్దులో మూడు నక్షత్రాల హోదా ఉన్న కనీసం ఎనిమిదిమంది భారత సైనిక కమాండర్లు ఒకే ఒక చైనా కమాండర్‌తో విధుల నిర్వహణలో పోటీపడుతుంటారన్న మాట. ఆధునిక సైన్యాన్ని నడిపించే విధానం ఇది కాదు. రెండు దేశాల సైనిక దళాల మధ్య పని చేయాల్సిన హాట్‌లైన్ ప్రొటోకాల్ సమస్యల్లో చిక్కుకుపోయింది. రెండు దేశాల మధ్య 3,488 కిలోమీటర్ల పొడవున్న సరిహ ద్దులో తరచు తలెత్తే అవకాశమున్న సమస్యలు ఎదు రైతే చైనా యుద్ధ కమాండర్‌తో భారత్ వైపు నుంచి హాట్లైన్లో ఎవరు మాట్లాడాలి? భారత్ వైపున ఉన్న ఆర్మీ ప్రధాన కార్యాలయంలోని సైనిక కార్య కలాపాల (ఆపరేషన్స్) డైరెక్టర్ జనరల్(డీజీఎంఓ) స్వయంగా మాట్లాడాల్సి వస్తే, రెండు సైన్యాల సైని కాధికారుల మధ్య సమాన హోదాకు సంబంధించిన ప్రొటోకాల్ సమస్య తలెత్తు తుంది. మన మొత్తం సైనిక(ఆర్మీ) దళాల డీజీఎంఓ చైనాకు చెందిన ‘కేవలం’ యుద్ధరంగ(థియేటర్) కమాండర్‌తో మాట్లాడడం కుదురుతుందా? అనే ప్రశ్న మన సైన్యాన్ని ఇబ్బంది పెడుతోంది. ఇది కేవలం ప్రొటోకాల్‌కు సంబంధించినదే అయితే హాస్యాస్పదం కాదా? ఆధునిక యుద్ధంలో వేగం, పోరు తీరు, శరవేగంతో దళాలు, ఆయుధాల తర లింపు, ఆయుధాల పనితీరు, సమన్వయంతో కూడిన యుద్ధ వ్యూహాలు అత్యంత కీలకమైనవి. మన మౌలిక సైనిక వ్యవస్థలను బ్రిటిష్‌వారు మనకు అప్పజెప్పి వెళ్లిన స్థాయిలోనే ఇప్పటికీ కొనసాగు తున్నాయి. బ్రిటిష్ పాలనలో ఏర్పాటైన సైనిక కంటోన్మెంట్లే ఇంకా పనిచేస్తున్నాయి. ఇటీవల మాజీ నౌకాదళ అధిపతి అరుణ్ ప్రకాశ్‌తో మాట్లాడిన ప్పుడు ఆయన ఆశ్చర్యకరమైన విషయం వెల్లడిం చారు. ‘‘డొక్లామ్ సరిహద్దులో చైనాతో పోరాటం మొదలై ఉంటే–ఐదు రకాల భారత సైనిక విభా గాలు(కమాండ్లు) చైనా ఆర్మీతో తలపడాల్సివచ్చేది. వివిధ భారత విభాగాల మధ్య సమన్వయం సమస్యే. అదే చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఒకే కమాండ్ కింద ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా భారత దళాలతో పోరాడేది,’’ అని ఆయన చక్కగా కీలక పోరు సమస్యను వివరించారు. స్వల్ప కాలంలో, కొద్ది ప్రదేశంలో జరిగే భీకరపోరులో మనం ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయగలం? 19 విభిన్న కమాండ్లుగా భారత సైన్యం! భారత సైనిక దళాలను ప్రస్తుతం 19 విభిన్న విభా గాలుగా(కమాండ్లు) విభజించిందీ అరుణ్‌ప్రకాశ్ వివరించారు. ఏ రెండు సైనిక కమాండ్లూ ఏక లక్ష్యంతో, ఒకే ప్రాంతంలో లేవని ఆయన చెప్పారు. ఇంతటి అధ్వాన స్థితిలో సైనిక వ్యవహారాలు నడు స్తున్నాయి. చైనా, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్ సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే తూర్పు ఆర్మీ కమాండ్ కోల్‌కతాలో ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లోని తీవ్రవాద గ్రూపులను అదుపులో పెట్టే బాధ్యత కూడా దీనిదే. ఈ ఆర్మీ కమాండ్‌తో సమన్వయంతో కలిసి పనిచేయాల్సిన తూర్పు వైమానిక దళ కమాండ్ విచిత్రంగా యుద్ధ విమానాలు దిగే ఎయిర్‌స్ట్రిప్ కూడా లేని ప్రాంతంలో ఉంది. సుందరమైన పర్వతా లకు నిలయమైన ఎగువ షిల్లాంగ్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటే ఎంత ఇబ్బందికరంగా ఉందంటే–కోల్‌కతా నుంచి వేగంగా విమానంలో షిల్లాంగ్ వెళ్లాలంటే బంగ్లాదేశ్ గగనతలంపై పయ నించాల్సి ఉంటుంది. ఆర్మీ కమాండ్ ఉన్న కోల్‌కతా లోనే దీన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని బ్రిటిష్ వారు ప్రశ్నిస్తున్నారు. ఇక తూర్పు నౌకాదళ కమాండ్ విషయానికి వస్తే ఇది దక్షిణాన విశాఖపట్నంలో ఉంది. తూర్పు రంగంలో మాత్రమే ఇంతటి గందర గోళ పరిస్థితులున్నాయంటే పొరపడినట్టే. పశ్చిమ కమాండ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పశ్చిమ ఆర్మీ కమాండ్ చండీగఢ్ నగరం శివార్లలోని చండీమంది ర్లో ఉంది. కాగా, పశ్చిమ వైమానికి దళ కమాండ్ ఢిల్లీ నుంచి పనిచేస్తోంది. భారత వైమానిక దళా ధిపతి ప్రధాన కార్యాలయం, అతి పెద్ద కమాండ్ ఒకే నగరంలో ఎందుకు ఏర్పాటు చేశారు? ఈ రెండింటికి మధ్య దూరం కేవలం ఐదు మైళ్లే. ఇలా దేశంలోని సైనిక కమాండ్ల జాబితాలు, వివరాలు చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. అన్ని కమాండ్లలోనూ ఒకే రకమైన అవ్వవస్థ రాజ్యమేలు తోంది. దక్షిణ ఆర్మీ కమాండ్ పుణె నగరంలో ఉండగా, పాకిస్థాన్‌కు సరిహద్దుల్లో ఉన్న గుజరాత్– రాజస్థాన్ ఏడారి ప్రాంతం రక్షణ బాధ్యత దీనికి అప్పగించారు. కాని, దీనికి తోడ్పడాల్సిన నైరుతి వైమానికి దళ కమాండ్ గాంధీనగర్ నుంచి పని చేస్తోంది. ఇంకా, వైమానిక దళ దక్షిణ కమాండ్ తిరు వనంతపురంలో ఉంది. దీనికి మొత్తం ద్వీపకల్ప ప్రాంత రక్షణ బాధ్యత కల్పించారు. ఆర్మీ నైరుతి కమాండ్ జైపూర్‌లో ఉండగా, దానికి సాయమం దించే వాయుసేన ప్రధానకార్యాలయాలు ఢిల్లీలో (పశ్చిమ), గాంధీనగర్‌లో ఏర్పాటై ఉన్నాయి. అల హాబాద్(మధ్య)లోని వైమానిక దళ కమాండ్ కూడా దీనితో కొన్నిసార్లు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అంటే, ఏ రెండు కమాండ్లూ ఒక చోట నుంచి, ఒకే లక్ష్యంతో పని చేయడం లేదని స్పష్టమౌతుంది. ఒక్క అండమాన్ దీవుల్లో మాత్రమే త్రివిధ బలగాల కమాండ్లు ఒకేచోట కేంద్రీకృతమై పనిచేస్తున్నాయి. ఢిల్లీలో ఏర్పాటు చేసిన కొత్త సమీకృత కమాండ్లు కూడా ఇదే పద్ధతిలో ఉన్నాయని చెప్పవచ్చు. చివరి సంవత్సరంలో హడావుడి ఇంతటి గందరగోళ పరిస్థితుల మధ్య ఇప్పటికే ఎక్కువగా విస్తరించి ఉన్న ఆర్మీ తూర్పు కమాండ్ ఆజమాయిషీలో కొత్తగా మౌంటెన్ స్ట్రయిక్ కోర్ అనే కొత్త దళాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదన పెండింగ్‌లో పెట్టారు. పైన వివరించిన ఆందోళనకరమైన విషయాలు ‘ద ప్రింట్’ వెబ్సైట్లో వెల్లడవడంతో కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కొత్త దళం ఏర్పాటు విషయాన్ని ఆర్మీ నిర్ణయానికే వదిలేశామని ఆమె చెప్పారు. ఆర్మీ చీఫ్ అనవసరంగా సైనిక కమాం డ్లను విస్తరించే కన్నా ఉన్న వాటిని బలోపేతం చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఇందుకు ఆయన ఎంతో తెగువ, తెలివితేటలు ప్రద ర్శిస్తున్నారని భావిస్తున్నాను. మరో ముఖ్య విషయం ఏమంటే, సైన్యానికి సంబంధించిన మౌలిక సంస్థా గత విషయాలపై మంత్రి స్పందన. సంయుక్త యుద్ధ రంగ కమాండ్ల ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు ప్రభుత్వం అనుకూలమని ఆమె చెప్పారు. ఈ విషయం మనం గతంలో ఎన్ని సార్లు విన్నాం? ఈ విషయంలో ముందుకు సాగడానికి ఇదివరకటి ప్రభు త్వాలకు రాజకీయ బలం లేదు. మరి మోదీ ప్రభు త్వం ఈ నాలుగేళ్లలో ఈ పనిచేయకుండా ఎవరు అడ్డుకున్నారు? మొదటి నాలుగు సంవత్సరాలూ కళ్లు మూసుకున్న మోదీ ప్రభుత్వం చివరి దశలో హడావుడి చేస్తోంది. ప్రజాస్వామ్య వ్యస్థలో పరిపా లన అంటే పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్ కాదు. వ్యాసకర్త: శేఖర్ గుప్తా, దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
‘హాట్‌లైన్ కొనసాగుతుంది’
వాషింగ్టన్: భారత ప్రధాని, అమెరికా అధ్యక్షుడు నేరుగా సంభాషించుకునేందుకు 2015లో బరాక్ ఒబామా పాలనలో ఏర్పాటు చేసిన హాట్‌లైన్, కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టాక కూడా కొనసాగుతుందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జోష్ ఎర్నెస్ట్ తెలిపారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కొత్తగా ఏర్పాటైన హాట్‌లైన్ ఇదొక్కటే కావడం గమనార్హం. 2015లో భారత గణతంత్ర వేడుకలకు ఒబామా అతిథిగా వచ్చారు. ఆ సమయంలో భారత ప్రధానితో హాట్‌లైన్ ఏర్పాటు చేయాలని ఒబామా నిర్ణయించారు. రష్యా, చైనా, బ్రిటన్, భారత్‌లకు మాత్రమే ఇప్పటివరకు శ్వేతసౌధంలో హాట్‌లైన్ ఉంది. హాట్‌లైన్ ఏర్పాటయ్యాక ఒబామా, మోదీ ఓసారి గంటకు పైగా మాట్లాడుకున్నట్టు భారత్‌లో అమెరికా రాయబారి వెల్లడించారు. -
విద్యుత్ ఉండగానే మరమ్మతులు!
ఇది హాట్‌లైన్ సిబ్బంది ప్రత్యేకత!! సీలేరు : విద్యుత్ ఉండగా వైర్లను ఎవరైనా ముట్టుకుంటారా? అలా తాకితే బతికి బట్టకడతారా? కానీ వీరు మాత్రం విద్యుత్ సరఫరా అవుతున్న తీగలతోనే గడుపుతారు. అయినా ఆ విద్యుత్ వీరిని ఏమీ చేయదు! వినడానికి ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా నిజం!! ఆ కథాకమామిషూ ఏమిటంటే.. జెన్కో హాట్‌లైన్ విభాగం సిబ్బంది విజయవాడకు విద్యుత్ సరఫరా అవుతుండగానే మరమ్మతులు చేయడంలో దిట్టలు. ప్రస్తుతం రాష్ట్రంలో జలవిద్యుత్కేంద్రాల్లో తయారయ్యే విద్యుత్‌ను 220 కేవీ ద్వారా ఇతర ప్రాంతాలకు సరఫరా చేసే లైన్లకు మరమ్మతులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలోని సీలేరు విద్యుత్ కాంప్లెక్స్‌లో రెండ్రోజులుగా విద్యుత్ లైన్లను బాగు చేస్తున్నారు. కళ్లు మాత్రమే కనిపించేలా ఒంటి నిండా రబ్బరుతో తయారు చేసిన ప్రత్యేక దుస్తులు ధరించారు. చేతులకు గ్లౌజుల్లాంటివి వేసుకున్నారు. గురువారం సీలేరు జలవిద్యుత్ కేంద్రం నుంచి గాజువాక, కొంబూరు సబ్స్టేషన్లకు సరఫరా అయ్యే 220 కేవీ విద్యుత్ లైన్‌ను మరమ్మతులు చేపట్టారు. విజయవాడ హాట్‌లైన్ సిబ్బంది విద్యుత్ సరఫరా అవుతుండగానే మరమ్మతులు చే శారు. విద్యుత్ సరఫరా జరుగుతున్నా అవలీలగా తీగల వెంబడి పాకుతూ, నిలబడుతూ ప్రాణాలకు తెగించి మరమ్మతు పనులు చేస్తుండడాన్ని చూసిన వారు ఔరా! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.