న్యూఢిల్లీ: డెలివరీ పార్ట్‌నర్లు ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తున్న పక్షంలో ప్రజలు తమకు ఫిర్యాదు చేసేందుకు వీలుగా కొత్త డెలివరీ బ్యాగ్‌లను ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని ఆన్‌లైన్ ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. తమ బ్యాగ్‌లపై ‘హాట్‌లైన్ ఫోన్ నంబర్‘ ముద్రించి ఉంటుందని ట్వీట్ చేశారు.
వేగంగా డెలివరీలు చేయాలంటూ తాము పార్ట్‌నర్లను ఒత్తిడి చేయమని ఆయన పేర్కొన్నారు. సత్వరం అందిస్తే ప్రోత్సాహకాలు ఇవ్వడం, లేకపోతే పెనాల్టీలు విధించడం వంటివి ఏమీ ఉండవని గోయల్ స్పష్టం చేశారు. అసలు వారికి ఎస్టిమేటెడ్ డెలివరీ కూడా చెప్పం. ఈ నేపథ్యంలో తమ డె లివరీ పార్ట్‌నర్లు ఎవరైనా వేగంగా నడుపుతుంటే. తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. తద్వారా రోడ్లపై ట్రాఫిక్‌ను రద్దీ లేకుండా నివారించాలని ఆయన కోరారు.
10 నిమిషాల్లోనే ఇన్‌స్టంట్ డెలివరీ సర్వీసులు ప్రారంభిస్తున్నామని గతంలో ప్రకటించినప్పుడు డెడ్‌లైన్ పేరిట డెలివరీ పార్ట్‌నర్లపై ఒత్తిడి పెంచుతున్నారంటూ జొమాటోపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో గోయల్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.
As promised earlier, we have started rolling out delivery bags which mention a hotline phone number to report rash driving by our delivery partners. Please remember – we don’t incentivise our delivery partners for on time deliveries, nor do we penalise them for late ones. (1/2) pic.twitter.com/Jic36Rt1qn
— Deepinder Goyal (@deepigoyal) November 2, 2022
Comments
Please login to add a commentAdd a comment