జొమాటో ఫౌండర్ అండ్ సీఈఓ 'దీపిందర్ గోయల్' తన గ్యారేజిలో మరో ఖరీదైన 'ఆస్టన్ మార్టిన్ వాంటేజ్' కారును చేర్చారు. రూ.3.99 కోట్ల ప్రారంభ ధర వద్ద లభిస్తున్న ఈ కారును ఇప్పటి వరకు ఎవరూ కొనుగోలు చేయలేదు. కాబట్టి ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కారును కొన్న మొదటి వ్యక్తిగా గోయల్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసాడు.
దీపిందర్ గోయల్ కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో గుర్గావ్‌లోని పార్కింగ్ వద్ద ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ ఉండటం చూడవచ్చు. ఇప్పటికే ఈయన గ్యారేజిలో ఆస్టన్ మార్టిన్ డీబీ12 కారుకు కూడా కొనుగోలు చేశారు. కాబట్టి ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ అనేది బ్రాండ్‌కు చెందిన రెండో కారు.
ఆస్టన్ మార్టిన్ ఈ ఏడాది ఆగస్ట్‌లో కొత్త వాంటేజ్‌ను ప్రారంభించింది. ఇది టూ-డోర్ కూపే. ఇందులో పెద్ద గ్రిల్, వర్టికల్ ఎయిర్ కర్టెన్‌లు, రివైజ్డ్ బోనెట్, హై పెర్ఫార్మెన్స్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, మెరుగైన ఫెండర్ ఎయిర్ డక్ట్‌లు, రివైజ్డ్ రియర్ బంపర్, రియర్ డిఫ్యూజర్, 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి.
10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 15-స్పీకర్ ఆడియో సిస్టమ్, కొత్త స్టీరింగ్ వీల్, ఫిజికల్ టోగుల్స్ వంటి ఇంటీరియర్ ఫీచర్స్ కూడా ఇందులో చూడవచ్చు. ఈ కారులోని 4.0 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ 502.88 Bhp పవర్, 675 Nm టార్క్ అందిస్తుంది. కేవలం 3.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమయ్యే ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 325 కిమీ కంటే ఎక్కువ.
దీపిందర్ గోయల్ గ్యారేజిలోని ఇతర కార్లు
దీపిందర్ గోయల్ గ్యారేజిలో ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కారు మాత్రమే కాకుండా.. ఆస్టన్ మార్టిన్ డీబీ12, బీఎండబ్ల్యూ ఎం8 కాంపిటీషన్, ఫెరారీ రోమా, పోర్స్చే 911 టర్బో ఎస్, లంబోర్ఘిని ఉరుస్, పోర్స్చే కారెరా ఎస్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment