delivery boys
-
మీ ఆర్డర్.. వచ్చిందండీ..
సాక్షి, భీమవరం: ఇటీవల కాలంలో ఆన్లైన్ బిజినెస్ పెరిగింది. ఫ్యాన్సీ, ఎలక్ట్రికల్, క్లాత్, రెడీమేడ్, టూల్స్, హోమ్ నీడ్స్, మెడికల్, కిరాణా, ఫర్నిచర్ తదితర వివిధ రకాల వస్తువుల నుంచి ఫుడ్ ఐటమ్స్ వరకు అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే వస్తువులను డోర్ డెలివరీ సేవలందించే ఈ కార్ట్, డెలివరీ, అమెజాన్, షాడోఫెక్స్, ఈ.కామ్ ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బీస్, బ్లూడార్ట్, వాల్మో తదితర ఈ–కామర్స్ సంస్థలు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ–కార్ట్ బ్రాంచీలు మూడు వరకు ఉన్నాయి. తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, భీమవరం, నరసాపురం, ఆకివీడు తదితర పట్టణాలతో పాటు పలు మండల కేంద్రాల్లోను తమ బ్రాంచ్‌లు ఏర్పాటుచేశాయి. జిల్లా వ్యాప్తంగా ఆయా సంస్థలకు చెందిన బ్రాంచ్‌లు 80కు పైనే ఉన్నాయి. డెలివరీ బాయ్స్‌కు డిమాండ్ ఆన్లైన్ ఆర్డర్లు పెరగడంతో డెలివరీ బాయ్స్‌కు డిమాండ్ ఏర్పడింది. పార్శిళ్లపై గతంలో అంతంత మాత్రంగా ఉండే కమీషన్‌ను ఇటీవల ఏజెన్సీలు పెంచాయి. ప్రస్తుతం లోకల్, లాంగ్ రూట్‌ను బట్టి ఒక్కో పార్శిల్ డెలివరీపై రూ.14 నుంచి రూ.20 వరకు కమీషన్ ఇస్తున్నాయి. వారం వారం పేమెంట్లు చేస్తున్నాయి. నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదించుకోవచ్చునంటూ విస్తృతంగా ప్రచారం చేస్తూ నిరుద్యోగ యువతను ఆకర్షిస్తున్నాయి. డెలివరీ బాయ్స్‌కు బైక్, డ్రైవింగ్ లైసెన్స్, స్మార్ట్‌ఫోన్ తప్పనిసరి. ఒక్క భీమవరంలోనే 500 మందికిపైగా డెలివరీ బాయ్స్/ఏజెంట్లుగా సేవలు అందిస్తూ ఉపాధి పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు వేలకు పైగా డెలివరీ బాయ్స్ ఉంటారని అంచనా. అధిక శాతం మంది ఫుల్ టైమ్ వర్కర్స్‌గా పనిచేస్తున్నారు. 5 శాతం వరకు మహిళలు కూడా డెలివరీ సర్విస్ చేస్తున్నారు. రోజుకు 40 నుంచి 60 వరకు పార్శిళ్లు డెలివరీ చేయడం ద్వారా నెలకు 15 వేల నుంచి రూ. 20 వేలకు పైగా ఆర్జిస్తున్నారు. ఫుడ్ డెలివరీ యాప్‌లతో పార్ట్‌టైం అవకాశాలు ఒకప్పటిలా రెస్టారెంట్‌కు వెళ్లి తినడం, పార్శిల్ తెచ్చుకోవడమంటే ఇప్పుడు చాలా మంది పెద్ద పనిగా ఫీల్ అయిపోతున్నారు. మొబైల్లోని జొమాటో, స్విగ్గీ తదితర ఫుడ్ డెలివరీ యాప్‌పై ఒక క్లిక్ ద్వారా తమకు ఇష్టమైన రెస్టారెంట్ నుంచి ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారు. దీంతో ఫుడ్ డెలివరీ సంస్థల సేవలు మారుమూల ప్రాంతాలకు విస్తరించాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి నిర్ణీత వేళల్లో ఫుడ్ ఆర్డర్లు ఉండటం వల్ల వీటిలో పార్ట్‌టైం జాబ్ అవకాశాలు ఉంటున్నాయి. ఆయా సమయాల్లో మూడు నాలుగు గంటల పాటు డోర్ డెలివరీ సర్విస్ చేస్తూ ఆదాయం పొందుతున్నారు. పాకెట్ మనీగా పనికొస్తాయని విద్యార్థులు, డిగ్నిటీ ఆఫ్ లేబర్‌ను స్ఫూర్తిగా తీసుకుని డిగ్రీ, పైచదువులు చదివిన వారు సైతం డెలివరీ బాయ్స్‌గా చేస్తున్నారు. ఈ ఫుడ్ డెలివరీ యాప్‌లలో పని చేస్తున్న వారు మూడు వేల వరకు ఉండగా అధికశాతం మంది నిరుద్యోగ యువత, విద్యార్థులు ఉంటున్నారు. రోజుకు రూ. 500 నుంచి రూ.700 వరకు ఆర్జిస్తున్నారు. కాలంతో పోటీపడుతూ పార్శిల్ డెలివరీ చేస్తేనే డెలివరీ బాయ్స్‌కు కమీషన్ వస్తుంది. అందుకయ్యే బైక్ మెయింటినెన్స్, పెట్రోల్ ఖర్చులను వీరే భరించాలి. ట్రాఫిక్ ఉన్నా, గుంతల రోడ్లైనా కాలంతో పోటీ పడుతూ నిర్ణీత సమయానికి ఆర్డర్ కస్టమర్లకు డెలివరీ ఇవ్వడంలోనే ఆనందాన్ని వెతుక్కుంటారు.ట్రైన్లో ఉన్నా ఆర్డర్ చెంతకు చేరుస్తారు. ఒక్కోసారి తప్పుగా ఇచ్చిన అడ్రస్‌లు, ఫోన్ నెంబర్లతో ఆచూకీ తెలియక ఇబ్బందులు పడుతుంటారు. ఆర్డర్ పెట్టిన వస్తువులు సరిగా లేదనో, చెప్పిన సమయానికి రాలేదనో కస్టమర్ల చీత్కారాలకు చిరునవ్వుతో బదులిస్తూనే సాగిపోతుంటారు.బ్యాగు నిండా పార్శిళ్లతో.. ఇప్పుడు ఎక్కడ చూసినా డెలివరీ బాయ్లే. పగలనక రేయనకా, ఎండనక వాననక కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్లు బైక్‌లు, స్కూటర్లపై రయ్ రయ్ మంటూ ఉరుకులు పరుగులు పెడుతూ కనిపిస్తున్నారు. వస్తువులు, ఆహారాన్ని ఆర్డర్ పెట్టిన వారి చెంతకు చేరుస్తూ సేవలందిస్తున్నారు.ఇన్‌టైంలో అందిస్తేనే..రెండు నెలల నుంచి డెలివరీ బాయ్‌గా చేస్తున్నాను. రోజుకు 40 నుంచి 50 వరకు పార్శిళ్లు డెలివరీ చేస్తుంటాను. ఇన్‌టైంలో ఆర్డర్ పెట్టిన వారికి పార్శిల్ డెలివరి చేయాలన్నదే మా టార్గెట్. అది రీచ్ అయితేనే ఆనందంగా ఉంటుంది. – బి.అశోక్ కుమార్, వీరవాసరం ఉరుకుల పరుగుల జీవితం మూడేళ్ల నుంచి డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాను. ఆర్డర్లో సూచించిన సమయానికి పార్శిల్ డెలివరీ చేయాలి. అందుకనే ఎండైనా వానైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉరుకులు పరుగులు పెడుతూ పార్శిల్స్ అందజేస్తుంటాం. – ఎం.సునీల్ కుమార్, డెలివరీ బాయ్, భీమవరం ఇబ్బందులు ఉంటాయిడెలివరీ చేసే సమయంలో ఆర్డర్ పెట్టిన వారు ఫోన్ నంబర్, అడ్రస్ సరిగా ఇవ్వకపోవడం వల్ల ఒక్కోసారి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆర్డర్ డెలివరీ చేస్తేనే మాకు కమిషన్ వస్తుంది. లేకపోతే ఎంత తిరిగినా ఫలితం లేక నష్టపోతాం. – పి.రమేష్, డెలివరీ బాయ్, పెన్నాడ -
క్లౌడ్ కిచెన్
ఒకరి వద్ద ఉద్యోగిగా పనిచేయడం కన్నా.. ఏదైనా చిన్న వ్యాపారం చేసి తన కాళ్లపై తాను నిలబడాలనుకుంటోంది ప్రస్తుత తరం. అలాంటి వారే ‘స్టార్టప్ కంపెనీ’ అనే పేరుతో వివిధ రకాల వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. ఇందులోంచి పుట్టిందే క్లౌడ్ కిచెన్ కాన్సెప్‌్ట. ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత ట్రెండింగ్, సక్సెస్ఫుల్ బిజినెస్ అంటే ఇదే. 2015లో మొదటి క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభమైంది. 2016లో ఇది ఓ వ్యాపారంగా మారింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,500కి పైగా క్లౌడ్ కిచెన్ స్టార్టప్‌లు నడుస్తున్నాయి. త్వరలో మరిన్ని మార్కెట్లోకి రానున్నాయి. జాతీయ క్లౌడ్ కిచెన్ బిజినెస్ మార్కెట్ విలువ ఈ ఏడాది చివరి నాటికి రూ.25వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా.క్లౌడ్ కిచెన్ అంటే..సాధారణంగా ఒక పెద్ద రెస్టారెంట్గానీ, హోటల్గానీ పెట్టాలనుకుంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. రెస్టారెంట్ డిజైన్ చేయించుకోవాలి. అది వాణిజ్య ప్రదేశంలో ఉండాలి. అందువల్ల అద్దె కూడా ఎక్కువగా చెల్లించాలి. కానీ, ఈ క్లౌడ్ కిచెన్ కాన్సెప్్టలో కేవలం ఒక మంచి వంటగది ఏర్పాటుచేసుకుంటే సరిపోతుంది. రెస్టారెంట్లో ఏ విధంగా కిచెన్ ఏర్పాటుచేస్తారో అలాగే ఇంటి వద్ద కూడా కిచెన్ ఏర్పాటుచేసుకోవచ్చు. ఫుడ్ ఆర్డర్లను మీరు ఆన్లైన్ ద్వారా పొందవచ్చు. ఇందుకోసం స్విగ్గి, జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లతో ఒప్పందం చేసుకుంటే సరిపోతుంది. అంతేకాదు.. కిచెన్ సమీపంలోని ఐదు కిలోమీటర్ల పరిధిలో ఫోన్ ద్వారా ఆర్డర్లు తీసుకుని సొంత డెలివరీ బాయ్స్ ద్వారా ఫుడ్ చేరవేస్తే మరింత లాభం వచ్చే అవకాశం ఉంది.రెస్టారెంట్ పరిశ్రమలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. డైన్–ఇన్ కంటే డోర్‌స్టెప్ ఫుడ్ డెలివరీని కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో క్లౌడ్ కిచెన్ల హవా పెరిగింది. వీటిని డార్క్ కిచెన్లు, గోస్ట్ కిచెన్లు, వర్చువల్ రెస్టారెంట్లు, శాటిలైట్ రెస్టారెంట్లు అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఇవి జనాదరణ పొందుతుండడంతో చాలా రెస్టారెంట్లు ఇప్పుడు డైన్–ఇన్ రెస్టారెంట్ కల్చర్ నుంచి డోర్ డెలివరీ సెటప్ వైపు మొగ్గుచూపుతున్నాయి. తక్కువ నిర్వహణ ఖర్చులతో ఎక్కువ లాభాలు పొందడమే ఈ క్లౌడ్ కిచెన్ల ప్రత్యేకత. –సాక్షి, అమరావతిఅనుమతులు తప్పనిసరి..⇒ క్లౌడ్ కిచెన్ నిర్వహణ కోసం స్థానికంగా మున్సిపాలిటీ నుంచి అనుమతి తీసుకోవాలి. ⇒ అలాగే, సంస్థను రిజిస్టర్ చేయించుకోవడంతోపాటు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ లైసెన్స్, జీఎస్టీ రిజి్రస్టేషన్, హెల్త్ లైసెన్స్, ఫైర్ అండ్ సేఫ్టీ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ అవసరం. ⇒ ఇలా కేవలం రూ.50 వేల నుంచి రూ.5 లక్షలు పెట్టుబడితో క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభించవచ్చు. ⇒కాస్త భారీస్థాయిలో అయితే రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టాలి. అధ్యయనం ముఖ్యం.. క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముఖ్యమైంది అధ్యయనం. కిచెన్ పెట్టాలనుకుంటున్న ప్రాంతంలో ఎలాంటి ఫుడ్‌కు డిమాండ్ ఉంది? ప్రజల ఇష్టాయిష్టాలు, ఆహారపు అలవాట్లు, ఇప్పటికే ఎలాంటి ఫుడ్ ఎంత ధరలో అందుబాటులో ఉంది.. దాని ధరలు ఎలా ఉన్నాయి.. వంటి వివరాలను తెలుసుకుని దానిబట్టి ప్రజలు ఎక్కవగా ఇష్టపడే ఆహారాన్నే రుచికరంగా, నాణ్యతతో, తక్కువ ఖర్చులో అందించాలి. క్లౌడ్ కిచెన్‌కు లొకేషన్‌తో సంబంధంలేదు. కానీ, రోడ్డుకు కొంచెం దగ్గరగా ఉంటే మంచిది. 500 చదరపు అడుగుల స్థలం సరిపోతుంది. డెలివరీ చేసే వాహనాల పార్కింగ్‌కు స్థలం ఉండేలా చూసుకోవాలి. సోషల్ మీడియాయే ప్రచారాస్త్రం.. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం.. వ్యాపారం ఏదైనాసరే సోషల్ మీడియా పేజీ ఉండాల్సిందే. ఎందుకంటే దీనిద్వారా మరింత మంది కస్టమర్లు రావచ్చు. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్, ట్విట్టర్లలో అకౌంట్లు ఓపెన్ చేయాలి. రెగ్యులర్‌గా అప్డేట్స్ ఇస్తుంటే. ఆటోమెటిగ్గా ఈ బిజినెస్ గురించి జనాలకు తెలుస్తుంది.ఖర్చు తక్కువ.. క్లౌడ్ కిచెన్ కాన్సెప్‌్టతో వ్యాపారాన్ని తొలుత హైదరాబాద్‌లో మొదలుపెట్టాలనుకున్నాం. కానీ, విజయవాడ వాసులు ఆహార ప్రియులు కావడంతో ఇక్కడే ఏర్పాటుచేసుకున్నాం. మా దగ్గర నాణ్యత ఉన్న ఆహారాన్ని బాక్స్‌లో ప్యాక్‌చేసి ఇస్చ్తాం. ఉ.11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఆహారాన్ని ఆన్లైన్ ద్వారా డెలివరీ ఇస్తున్నాం. సాధారణ రెస్టారెంట్‌తో పోలి్చతే దాదాపు 30–50 శాతం ఖర్చులు తక్కువ. అందువల్లే ధరలు తగ్గించి ఇవ్వగలుగుతున్నాం. – ప్రసాద్, క్లౌడ్ కిచెన్ నిర్వాహకుడు, విజయవాడ -
జొమాటో యూనిఫామ్‌లో మార్పులు.. క్షణాల్లోనే నిర్ణయం వెనక్కి..
ప్రత్యేకంగా శాకాహారమే కోరుకునే వినియోగదారుల కోసం ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ పేరుతో ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కొత్త సేవలు ప్రారంభించింది. శాకాహారుల కోరిక మేరకే ఈ సేవలు ప్రారంభించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ తెలిపారు. అయితే ఈ ప్రకటన చేసిన సమయంలో డెలివరీ స్టాఫ్‌కు ప్రత్యేకంగా గ్రీన్‌కలర్ డ్రెస్‌కోడ్ ఉంటుందని ప్రకటించారు. అలా ప్రకటన వెలువరించిన కాసేపటికే కంపెనీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇకపై అందరూ ఎర్ర రంగు యూనిఫామ్‌ను ధరిస్తారని చెప్పింది. అయితే ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ సేవలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. వెజ్ ఆర్డర్లను అందించడానికి ప్రత్యేక సిబ్బంది ఉంటారని కంపెనీ వివరించింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో వ్యతిరేక సామాజిక పరిణామాలు ఎదురైతే మాత్రం ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ను వెంటనే నిలిపివేస్తామని దీపిందర్ గోయల్ తెలిపారు. ఆకుపచ్చ యూనిఫామ్ ధరించడంపట్ల కొన్ని సమాజిక వర్గాల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్యూర్ వెజ్ ఫ్లీట్ వెనుక ఎలాంటి రాజకీయ, మతపరమైన ఉద్దేశాలు లేవని గోయల్ స్పష్టం చేశారు. ‘చాలామంది వినియోగదారులు నిత్యం నాన్‌వెజ్ ఆర్డర్ చేస్తారు. డెలివరీ సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ డెలివరీ బాక్సుల్లో పదార్థాలు కొన్నిసార్లు ఒలికిపోయే అవకాశం ఉంటుంది. దాంతో ఆ వాసన అలాగే ఉండిపోతుంది. తదుపరి ఆర్డర్ చేసే శాకాహార వినియోగదారులకు అది ఒకింత ఇబ్బంది కలిగించే అంశం. దాంతో ఫ్లీట్‌ను విభజించాం. కొంతమంది ప్యూర్ వెజిటేరియన్ హోటళ్ల నుంచి మాత్రమే ఫుడ్ ఆర్డర్ పెడతారు. వారిని దృష్టిలో ఉంచుకుని తాజా నిర్ణయం తీసుకున్నాం’ అని సీఈఓ వివరించారు. భారత్‌లోనే అత్యధిక శాతం శాకాహారులు ఉన్నారని గోయల్ తెలిపారు. ఆహారం వండే విధానం, దాన్ని నిర్వహించడంపై వారు ఒక స్పష్టమైన అభిప్రాయంతో ఉంటారని అన్నారు. కేవలం శాకాహారమే అందించే రెస్టారెంట్ల ఎంపిక, నాన్-వెజ్ ఆహారాన్ని మినహాయించడం వంటివి ఫ్యూర్ వెజ్ మోడ్‌లో ఉంటాయి. ఇదీ చదవండి: ఉద్యోగుల జీతాల పెంపునకు టీసీఎస్ ఎస్? ఫ్యూర్ వెజ్ ఫ్లీట్ ఆహారాన్ని డెలివరీ చేసేందుకు జొమాటో సాధారణంగా వినియోగించే ఎర్ర బాక్సుల స్థానంలో ఆకుపచ్చ డెలివరీ బాక్స్‌లను వినియోగించనుందని ముందుగా ప్రకటించింది. కొన్ని వర్గాల నుంచి సామాజిక మాధ్యమాల్లో విమర్శలు రావడంతో డెలివరీ బాక్స్‌లు, యూనిఫామ్ విషయంతో ప్రకటనను తిరిగి వెనక్కి తీసుకుంది. కానీ ప్యూర్ వెజ్ ఫ్లీట్ సేవలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. Update on our pure veg fleet — While we are going to continue to have a fleet for vegetarians, we have decided to remove the on-ground segregation of this fleet on the ground using the colour green. All our riders — both our regular fleet, and our fleet for vegetarians, will… — Deepinder Goyal (@deepigoyal) March 20, 2024 -
5 లక్షల ప్రమాద బీమా.. 10 లక్షల ఉచిత వైద్యం
సాక్షి, హైదరాబాద్: ఉబర్, ఓలా, జొమాటో, స్విగ్గీ, అర్బన్ కంపెనీ లాంటి యాప్ ఆధారిత సంస్థల్లో పనిచేస్తున్న డ్రైవర్లు, బాయ్‌లకు రూ. 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్య సాయం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌లో ఫుడ్ డెలివరీ కోసం వెళ్లినప్పుడు కుక్క తరమడంతో కంగారులో భవనం పైనుంచి పడి మరణించిన ఓ డెలివరీ బాయ్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2 లక్షలు అందించాలని అధికారులను ఆదేశించారు. క్యాబ్ సంస్థలు నిర్వహిస్తున్న తరహాలో ఓ యాప్‌ను టీ–హబ్ ద్వారా సిద్ధం చేసి అవకాశం ఉన్న వారికి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌గాంధీ తెలంగాణలో పర్యటించినప్పుడు నవంబర్ 27న కొందరు ఫుడ్ డెలివరీ బాయ్‌లతో భేటీ కావడం తెలిసిందే. అప్పుడు వారి సమస్యలను అడిగి తెలుసుకున్న రాహుల్... తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఆయా సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తిని ఈ మేరకు ఆదేశించారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఓలా, ఉబర్ ద్వారా పనిచేసే ఆటో డ్రైవర్లతోపాటు క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్‌ల సమస్యలను తెలుసుకోవడానికి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న బాయ్‌లతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా ఆయా సంస్థల్లో పనిచేస్తూ రక్షణ లేకుండా ఇబ్బందులు పడుతున్న వారికి రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నామని వెల్లడించారు. అసంఘటిత రంగ కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని... ఆ క్రమంలో విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందుకోసం రాజస్తాన్‌లో చేసిన చట్టాన్ని అధ్యయనం చేసి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అంతకంటే మెరుగైన విధంగా చట్టం తయారీకి బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. కార్మికుల సంక్షేమంపై దృష్టిపెట్టని సంస్థలపై చర్యలు.. ‘సంస్థలు కూడా లాభాపేక్ష మాత్రమే చూడకుండా కార్మికులు, ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి పెట్టాలి. సిబ్బంది సంక్షేమాన్ని విస్మరించే ఎంత పెద్ద సంస్థలపైనైనా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోం. నాలుగు నెలల క్రితం ఓ స్విగ్గి డెలివరీ బాయ్ కుక్క తరిమితే భవనం పైనుంచి పడి మృతి చెందాడు. అప్పటి ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం అందుతుందేమోనని చూశా. కానీ ఆ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ప్రభుత్వాలు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మానవత్వంతో వ్యవహరించాలి. అందుకే ఆ కుటుంబం వివరాలు సేకరించి సీఎం సహాయనిధి నుంచి మృతుని కుటుంబానికి రూ. 2 లక్షలు అందించాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా’అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించే ప్రజాపాలన గ్రామసభల్లో పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్‌లకు సీఎం సూచించారు. డిజిటల్, మాన్యువల్ రూపంలోనైనా దరఖాస్తులు ఇవ్వొచ్చన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అన్నింటినీ పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, ఏఐసీసీ సెక్రటరీలు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీఖాన్, మాధుయాష్కీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఆటోవాలాలు ఆందోళన పడొద్దు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో కల్పించిన ఉచిత ప్రయాణ సౌకర్యం వల్ల తమ ఉపాధి దెబ్బతింటోందని ఆటోవాలాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆటోవాలాలతోనూ త్వరలో చర్చించి వారికి ఇబ్బంది లేని రీతిలో తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. క్యాబ్, ఫుడ్ డెలివరీ బాయ్స్‌తో సమావేశం అనంతరం పొన్నం ప్రభాకర్ విలేకరులతో మాట్లాడారు. ఈ పథకం వల్ల ఆటోవాలాల ఉపాధి పడిపోదని, బస్సులు దిగాక ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రయాణికులు మళ్లీ ఆటోలనే కదా ఆశ్రయించాల్సిందని అన్నారు. -
గిగ్ వర్కర్స్ తో రాహుల్ గాంధీ భేటీ
-
ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌తో రాహుల్ మాటామంతి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని వివిధ వర్గాలతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, పారిశుధ్య కార్మికులతో మాటామంతి జరిపారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంపాదించినదంతా డీజీల్, పెట్రోల్‌కే సరిపోతుందని ఆటోడ్రైవర్లు అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయాలు కల్పించాలని డెలివరీ బాయ్స్ విజ్ఞప్తి చేశారు. గిగ్‌వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ కోసం రాజస్థాన్‌లో ఒక స్కిమ్ అమలు చేస్తున్నామని, ప్రతి ట్రాన్సాక్షన్లో కొంత మొత్తాన్ని గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ కోసం కేటాయిస్తున్నామని రాహుల్ తెలిపారు. చదవండి: కేసీఆర్‌కు కొత్త సంకటం.. రేవంత్ వ్యూహం ఫలించేనా? -
బైక్‌పై జొమాటో డెలివరీ గర్ల్ రైడింగ్..సీఈవో ఏమన్నారంటే!
ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో, సామాజిక్ మాధ్యమాల్లో ఫేమస్కావాలని యువతకు ఎంతో ఆశగా ఉంటుంది. అందుకు ఎన్నో మార్గాలను ఎంచుకుని ప్రయత్నాలు చేస్తారు. అందుకు అనుగునంగా కొందరు అనుకున్న విధంగా సోషల్ మీడియాలో వ్యూస్ పెంచుకుంటారు. అయితే ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ సేవల సంస్థ జొమాటో పేరును వాడుకొని ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, పాపులర్ అయ్యేందుకు వింత ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా ఓ యువతి జనాల దృష్టిని ఆకర్షించాలని జొమాటో డ్రెస్ కోడ్‌లో యమహా R15 బైక్‌తో రోడ్డుపై చక్కర్లు కొట్టిన సంఘటన ఇండోర్‌లో జరిగింది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీలో జొమాటో పాపులర్ అయింది. అయితే జొమాటో ద్వారా ఫుడ్ డెలివరీ చేసే వారు ఎక్కువగా అబ్బాయిలే ఉంటారు. కానీ ఓ యువతి మాత్రం ఓ స్టైలిష్ బైక్‌పై జొమాటో బ్యాగ్, డ్రైస్ ధరించి రోడ్లపై రౌండ్లు వేస్తూ నెట్టింట్లో వైరల్ అయింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగినట్లుగా ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా తెలుస్తోంది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో ఇది జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ దృష్టికి వెళ్లింది. ఈ వీడియోకు సంబంధించి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందించారు. జొమాటోకు దీనితో ఎలాంటి సంబంధం లేదన్నారు. హెల్మెట్ లేని బైక్ రైడింగ్‌ను తాము ప్రోత్సహించబోమని చెప్పారు. తమకు ఇండోర్‌లో మార్కెటింగ్ హెడ్ లేరన్నారు. అయితే మహిళలు ఇలా ఫుడ్ డెలివరీ ఏజెంట్లుగా మారడంలో తప్పు లేదని చెప్పారు. View this post on Instagram A post shared by I N D O R E - R E E L G R A M (@indore_reelgram.official) -
స్విగ్గీ డెలివరీ ఏజెంట్లకు గుడ్ న్యూస్.. ఇప్పుడే తెలుసుకోండి..!
హైదరాబాద్: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీతో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ టైఅప్ అయింది. హెల్త్ ఇన్సూరెన్స్‌తోపాటు వ్యక్తిగత ప్రమాద బీమా, మొబైల్ ఫోన్ ఇన్సూరెన్స్ కవరేజీని.. దేశవ్యాప్తంగా ఉన్న 3 లక్షల మంది స్విగ్గీ డెలివరీ ఏజెంట్లకు గల్లాగర్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ద్వారా రిలయన్స్ జనరల్ అందించనుంది. గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ కింద ఔట్ పేషెంట్ చికిత్సలతోపాటు.. ఆస్పత్రిలో చేరినప్పుడు, మేటర్నిటీ కవరేజీ తదితర ప్రయోజనాలు ఈ ప్లాన్‌లో ఉన్నాయి. ప్రమాద మరణం ఏర్పడితే రూ.10 లక్షల పరిహారం లభిస్తుంది. లేదా శాశ్వత వైకల్యం పాలైనా పరిహారం లభిస్తుంది. పాక్షిక వైకల్యం కలిగితే ఆ సమయంలో కోల్పోయిన ఆదాయాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది. ప్రమాదం కారణంగా మొబైల్ ఫోన్ దెబ్బతింటే రూ.5,000 పరిహారం లభిస్తుంది. రూ.31 కోట్ల చెల్లింపులు 2022–23 సంవత్సరంలో స్విగ్గీ తన డెలివరీ భాగస్వాములకు రూ.31 కోట్ల బీమా క్లెయిమ్‌ల చెల్లింపులకు సాయం అందించినట్టు ప్రకటించింది. 2015 నుంచి స్విగ్గీ తన డెలివరీ ఏజెంట్లకు బీమా కవరేజీ అందిస్తోంది. -
జొమాటోకు మరో ఎదురు దెబ్బ!
ట్రాఫిక్ కష్టాల్ని దాటుకుని వన్.. టూ.. త్రీ.. రన్ అంటూ పది నిమిషాల్లో కస్టమర్లకు కావాల్సిన వస్తువుల్ని డెలివరీ చేసే ఉద్యోగులు బ్లింకిట్‌కు భారీ షాకిచ్చారు. వారం రోజుల పాటు డెలివరీ ఉద్యోగులు చేసిన స్ట్రైక్ దెబ్బకు సంస్థ స్పందించకపోవడంతో ఇతర సంస్థల్లో చేరినట్లు తెలుస్తోంది. గతంలో కస్టమర్లకు కావాల్సిన వస్తువుల్ని గంటల్లో డెలివరీ చేస్తాం’ అంటూ సంస్థలు ప్రచారం చేసేవి. కానీ ఇప్పుడు అలాంటి మాటలు వినిపించడం లేదు. ఆర్డర్ పెట్టడం ఆలస్యం పదే పదినిమిషాల్లో మీ కాలింగ్ బెల్ కొట్టేస్తాం.. అంటున్నాయి క్విక్ కామర్స్ సంస్థలు. ఆ కోవకే చెందుతుంది జొమాటోకి చెందిన బ్లింకిట్ అనే గ్రోసరీ యాప్. స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్, జెప్టో, బిగ్‌బాస్కెట్‌కు పోటీగా బ్లింకిట్ క్విక్ కామర్స్ సేవల్ని అందిస్తుంది. పది నిమిషాల్లో ఆర్డర్స్‌ను డెలివరీ చేయడంలో మంచి పేరు సంపాదించింది. కానీ ఆర్డర్ తీసుకొని బయలుదేరిన మరుక్షణం నుంచి సరుకును చేరవేసే వరకూ.. ప్రతిక్షణం ఒత్తిడికి గురయ్యే డెలివరీ ఉద్యోగులకు శ్రమకు తగ్గ వేతనాలు ఇవ్వడం లేదనే కారణంతో ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఇదివరకు డెలివరీపై రూ.50 ఉండే చార్జీని రూ.25కు తగ్గించిందని, ఇప్పుడు దాన్ని ఏకంగా రూ.15 చేయడం వల్ల తమ ఆదాయం చాలా తగ్గిపోతోందని, న్యాయం చేయాలని కోరుతూ ఢిల్లీ - ఎన్సీఆర్ ప్రాంతాల్లో కార్యకలాపాల్ని నిలిపి వేశారు. దీంతో బ్లింకిట్ ఆయా స్టోర్ల కార్యకలాపాల్ని నిలిపి వేసింది. ఈ తరుణంలో నోయిడా, గ్రేటర్ నోయిడా, ఢిల్లీ గురుగావ్, గజియాబాద్, ఫరీదాబాద్‌లలో ఆందోళన చేస్తున్న ఉద్యోగులు ఇతర కంపెనీల్లో చేరారు. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. బ్లింకిట్‌కు చెందిన ఢిల్లీ -ఎన్సీఆర్లలో దాదాపు వందల స్టోర్లు మూత పడ్డాయి. సమ్మెకు ముందు బ్లింకిట్ తన ప్లాట్‌ఫారమ్‌లో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో దాదాపు 3,000 మంది డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు ఉండగా.. వారిలో మూడింట ఒక వంతు మంది ఇతర ఫ్లాట్ఫారమ్లలో కార్యకలాపాలకు ఉపక్రమించారు. బ్లింకిట్‌లో పని చేసే ఉద్యోగులు తక్కువ వేతనం కారణంగా ఇతర సంస్థల్లో చేరాల్సి వచ్చింది. వేతనం విషయంలో బ్లింకిట్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని ఉద్యోగులకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఉద్యోగులకు స్ట్రైక్‌తో బ్లింకిట్ భారీగా నష్టపోవడంతో కొత్త చెల్లింపు పద్దతిని అమలు చేయనున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉 ఇది యాపారం?..విరాట్ కోహ్లీ ట్వీట్ వైరల్! -
కేంద్రం కీలక నిర్ణయం.. డెలివరీ బాయ్స్ కష్టాలకు చెక్!
గిగ్ ఉద్యోగుల భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు సోషల్ సెక్యూరిటీ అంటే లైఫ్ ఇన్సూరెన్స్, పర్సనల్ యాక్సిడెంట్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు కల్పించాలని ఓలా, ఉబర్, స్విగ్గీ, జొమాటో, అర్బన్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై కేంద్ర కార్మిక శాఖ ఆయా సంస్థలతో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం కేంద్రం - సంస్థల మధ్య కొనసాగుతున్న చర్చలు సఫలమైతే డెలివరీ బాయ్స్‌తో పాటు ఇతర రంగాల్లో పనిచేస్తున్న గిగ్ ఉద్యోగుల కష్టాలు గట్టెక్కనున్నాయి. దేశంలోని అనధికారిక కార్మికులందరికీ సామాజిక భద్రతను అందించేలా తీసుకొచ్చిన నాలుగు కార్మిక చట్టాలు అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. కార్మికుల వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సాంఘిక భద్రత, ఆక్యుపేషనల్ భద్రత, ఆరోగ్య, పని నిబంధనలకు సంబంధించిన ఈ నాలుగు లేబర్ చట్టాలపై ఇప్పటికే ఓ ప్రకటన చేసింది. 2022 జులై 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ కార్మిక చట్టాలు ఉమ్మడి అంశం కాబట్టి కేంద్ర, రాష్ట్రాలు సంబంధిత నిబంధనల ఆధారంగా వాటిని అమలు కావాల్సి ఉంది. కానీ అవి ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇటీవల కాలంలో గిగ్ ఉద్యోగుల భవితవ్యంపై ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో కేంద్రం..గిగ్ ఉద్యోగులకు సోషల్ సెక్యూరిటీ సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది. అయినప్పటికీ వారికి బెన్ఫిట్స్ అందించే విషయంలో అనేక ఇబ్బందులు ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. 40శాతం మంది కార్మికులు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ - 2021 నివేదిక ప్రకారం, వెబ్ ఆధారిత ప్లాట్‌ఫారమ్‌లలో కేవలం 40శాతం మంది కార్మికులు ఆరోగ్య బీమాను కలిగి ఉన్నారు. అయితే 20% కంటే తక్కువ మందికి యాక్సిడెంటల్ పాలసీ, నిరుద్యోగం, డిజేబిలిటీ ఇన్సూరెన్స్ (disability insurance), వృద్ధాప్య పెన్షన్లు లేదా పదవీ విరమణ ప్రయోజనాలు పొందుతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ సంఖ్య మరింత తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. గిగ్ వర్కర్లు అంటే ఎవరు? ఫలానా సమయానికి/ ఫలానా పని కోసం నియమితులయ్యే కార్మికులే గిగ్ వర్కర్లు. తమ పనిగంటలను ఎంపిక చేసుకునే సౌలభ్యం వీళ్లకు ఉంటుంది.నీతి ఆయోగ్ గణాంకాల ప్రకారం.. గిగ్ ఎకానమీ వర్కర్ల వాటా గణనీయంగా పెరుగుతున్నట్లు తెలిపింది. వర్క్ ఫోర్స్‌లో 1. 3 శాతం కంటే ఎక్కువగా ఉంది. చదవండి👉 జొమాటోకు షాకిచ్చిన ఉద్యోగులు.. భారీ ఎత్తున నిలిచిపోయిన సేవలు! -
జొమాటో డెలివరీ పార్ట్నర్స్కు ఎలక్ట్రిక్ స్కూటర్లు!
ముంబై: ఎలక్ట్రిక్ బైక్ షేరింగ్ కంపెనీ యూలూ, ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో చేతులు కలిపాయి. ఇందులో భాగంగా జొమాటో డెలివరీ భాగస్వాములకు యూలూ 25–35 వేల యూనిట్ల డీఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లను అద్దె ప్రాతిపదికన సరఫరా చేయనుంది. (రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు) కంపెనీ అందించే పరిష్కారాలతో డెలివరీ భాగస్వాముల ఆదాయం 40 శాతం వరకు అధికం అవుతుందని యూలూ తెలిపింది. ఫిబ్రవరి నాటికి జొమాటో వేదికగా 4,000 పైచిలుకు డెలివరీ పార్ట్నర్స్ యూలూ ఈవీలను వినియోగిస్తున్నారని వెల్లడించింది. (రియల్ ఎస్టేట్‌కు తగ్గని డిమాండ్.. హైదరాబాద్‌లో భారీగా పెరిగిన అమ్మకాలు) -
ఆన్లైన్లో ఐఫోన్లు ఆర్డర్.. డెలివరీ బాయ్స్ ఫోన్ స్విచాఫ్.. కట్ చేస్తే
బనశంకరి(బెంగళూరు): ఐఫోన్ల పార్శిల్‌తో పారిపోయిన ఇద్దరు డెలివరి బాయ్‌లను మంగళవారం కేంద్ర విభాగ సీఈఎన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 6.5 లక్షల విలువైన ఆరు ఐఫోన్లు, రెండు యాపిల్ వాచీలు, ల్యాప్‌టాప్, నాలుగు మొబైల్స్, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 5న సుణకల్ పేటే దుకాణంలో ఆరు ఐఫోన్లు, ఒక యాపిల్ ఫోన్ తస్లీం అనే వ్యక్తి కొనుగోలు చేసి విజయనగర ఇంటి అడ్రస్‌కు పంపడానికి ఓ ఆన్లైన్ డెలివరిని ఆశ్రయించాడు. అరుణ్ పాటిల్ అనే పేరుతో పార్శిల్ చేశారు. అయితే కొద్ది సమయం అనంతరం నయన్ అనే వ్యక్తి ఫోన్ చేసి పార్శిల్ తనకు అందిందని, కొద్ది నిమిషాల్లో పార్శిల్ తీసుకువస్తానని తస్లీంకు ఫోన్ చేశారు. అనంతరం ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో తస్లీం సీఈఎన్ను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేసి బసవరాజ, మాళప్ప అనే ఇద్దరిని అరెస్ట్ చేసి మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. చదవండి Viral Video: వీడి కథేంటో.. కారు డిక్కీలో కూర్చొని డబ్బులు విసిరేస్తూ..! -
యువతరం మారుతోంది
యువతరం ఆలోచన మారుతోంది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, అవసరాలు వారి ఆలోచనలో మార్పు తెస్తుంటే.. అందుబాటులోకి వస్తున్న సరికొత్త ఉపాధి అవకాశాలు ఉత్సాహాన్నిస్తున్నాయి. హుందాగా పనిచేస్తూ కష్టాన్ని బట్టి సంపాదన పెంచుకునే అవకాశం వారిని ఆకర్షిస్తోంది. దీంతో చదువుకుంటూనే, పోటీ పరీక్షలకు సిద్ధమవుతూనే కుటుంబంపై ఆధారపడకుండా అవసరమైన ఖర్చుల కోసం ఆహారం, సరుకులు, వస్తువుల ఆన్లైన్ డెలివరీ బాయ్స్‌గా, బైక్ ట్యాక్సీ డ్రైవర్లుగా చేరిపోతున్నారు. వీరిలో ఎక్కువ మంది (80 శాతం) విద్యాధికులు కావడం ఆసక్తి కలిగించే అంశం. – సాక్షి, హైదరాబాద్ నగర బాట.. ఉపాధి వేట మొత్తం మీద విద్య కోసమో, ఉద్యోగం కోసమో లక్షలాది మంది యువత హైదరాబాద్ మహా నగరానికి వలస వస్తోంది. వీరిలో ఎక్కువ శాతం పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వాళ్లే. మొన్నటి వరకు ఇంటి నుంచి పంపించే డబ్బులను జాగ్రత్తగా వాడుకుంటూ చదువుకోవడమో, మంచి ఉద్యోగం వెతుక్కోవడమో చేస్తూ వచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావడంతో ఇక తల్లిదండ్రుల డబ్బులపై ఆధారపడి ఉండాలని అనుకోవడం లేదు. తమ అవసరాలు తామే తీర్చుకోవడానికి పార్ట్ టైం ఉద్యోగాలను వెతుక్కుంటున్నారు. వేగంగా విస్తరిస్తున్న డెలివరీ రంగం వీరికి గొప్ప అవకాశంగా మారింది. 75 వేల మందికి పైనే.. మహానగరంలో 75 వేల మందికి పైగానే ఫుడ్, గ్రోసరీ డెలివరీ, బైక్ ట్యాక్సీ రంగంలో కొనసాగుతున్నట్లు ఆయా కంపెనీల ఆధికార గణంగాలు స్పష్టం చేస్తున్నాయి. స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఈట్స్, ఫుడ్‌పాండా, రాపిడో తదితర సంస్థలు తమ మార్కెట్‌ను విస్తరించుకోవడంలో భాగంగా యువతను రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఇక అమెజాన్, మింత్ర, ఫ్లిప్‌కార్ట్, బిగ్‌బాస్కెట్, జెప్టో వంటి సంస్థలు కూడా తమ సరుకులు, వస్తువుల డెలివరీకి యువతను వినియోగిస్తున్నాయి. పని చేయాలనే తపన ఉంటే సరి.. పార్ట్ టైం ఉద్యోగం చేయాలనే తపన, కాలం విలువ తెలిస్తే చాలు ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేయొచ్చు. కనీస విద్యార్హతతో పాటు లైసెన్స్, ద్విచక్రవాహనానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, బ్యాంక్ వివరాల ఒరిజినల్స్‌తో కంపెనీలో సంపద్రిస్తే సరిపోతుంది. కస్టమర్‌కు ఆర్డర్ సమయానికి ఎలా అందించాలి? వారితో ఎలా నడుచుకోవాలి? ఇన్సెంటివ్స్ కోసం ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? నగరంలో డ్రైవింగ్ ఎలా చేయాలి? తదితర వాటిపై సదరు కంపెనీలు శిక్షణ ఇస్తున్నాయి. బీకాం చేస్తూనే డెలివరీ... బీకాం కంప్యూటర్ ఫైనల్ ఇయర్ చేస్తూ పార్ట్‌టైంగా ఫుడ్ డెలివరీ బోయ్‌గా పనిచేస్తు న్నా. ప్రతిరోజు రూ.400 నుంచి రూ.500 వరకు సంపాదిస్తున్నా. కాలేజీ, ట్యూషన్ ఫీజులు, చేతి ఖర్చులకు సరిపోతున్నాయి. ఇంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తల్లిదండ్రులపై ఆధార పడకుండా సొంతంగా సమకూర్చుకుంటుండటంతో సంతృప్తిగా ఉంది. నా మిత్రు లు చాలామంది ఇలా చదువుకుంటూనే పార్ట్‌టైంగా పని చేస్తూ సంపాదిస్తున్నారు. – మొహియొద్దీన్, ఫుడ్ డెలివరీ బాయ్, మల్లాపూర్ ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతూనే బీటెక్ పూర్తి కావడంతో అదనపు కోర్సుల కోసం నగరానికి వచ్చాను. కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లో చేరా. ఏడాది పాటు ఇంటి నుంచి డబ్బులు పంపించారు. తర్వాత కుటుంబానికి భారంగా మారకూడదనే ఉద్దేశంతో ఫ్రెండ్ బైక్‌తో పార్ట్ టైం జాబ్‌లో చేరాను. ఆ డబ్బులతోనే ఇప్పుడు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నా. – వెంకటేశ్వర్లు, నల్లగొండ డిగ్నిటీ ఆఫ్ వర్క్.. సిటీలో ఫుడ్, గ్రాసరీ డెలివరీ, బైక్ ట్యాక్సీ డిగ్నిటీ ఆఫ్ వర్క్‌గా మారాయి. నిరుద్యోగులు, విద్యార్థులతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు సైతం పార్ట్‌టైం జాబ్ చేస్తూ సంపాదించుకుంటున్నారు. – షేక్ సలావుద్దీన్, అధ్యక్షుడు, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ -
జొమాటో సూపర్ న్యూస్.. వారికి ఇక ఇబ్బందులు తప్పినట్టే!
ఉరుకులు, పరుగులు పెడుతూ విశ్రాంతి లేకుండా సేవలందిస్తున్న ఫుడ్ డెలివరీ ఏజెంట్స్‌కు జొమాటో సూపర్ న్యూస్ చెప్పింది. ఆర్డర్స్ స్వీకరించడం, డెలివరీ చేయడం.. ఇలా బిజీ షెడ్యూల్‌తో ఫుడ్ డెలివరీ ఏజెంట్స్ పనిచేస్తుంటారు. కాస్త విశ్రాంతి తీసుకుందామన్న సమయం దొరకదు. సమయం దొరికినా ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలో తెలియని పరిస్థితి. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో డెలివరీ ఏజెంట్ల కోసం ‘రెస్ట్ పాయింట్లు’ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేవలం జొమాటో ఏజెంట్స్ మాత్రమే కాకుండా ఇతర సంస్థలకు చెందిన డెలివరీ ఏజెంట్లు కూడా ఈ రెస్ట్ పాయింట్లను వినియోగించుకోవచ్చని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. గురుగ్రామ్‌లో ఇప్పటికే రెండు రెస్ట్ పాయింట్లు ఏర్పాటు చేశామని, త్వరలోనే మరికొన్ని చోట్ల ఏర్పాటు చేస్తామని తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ రెస్ట్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ రెస్ట్ పాయింట్స్‌లో తాగునీరు, ఫోన్ ఛార్జింగ్, హై-స్పీడ్ ఇంటర్నెట్, వాష్‌రూమ్‌లు, 24×7 హెల్ప్‌డెస్క్, ఫస్ట్ ఎయిడ్ వంటి సదుపాయాలు కల్పిస్తారు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం విధులు నిర్వర్తిస్తున్న డెలివరీ ఏజెంట్స్ సంక్షేమంలో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టినట్లు దీపిందర్ గోయల్ తెలిపారు. ఈ రెస్ట్ పాయింట్స్ ఏర్పాటుతో ఏజెంట్లు అలసట నుంచి విముక్తి పొంది శారీరకంగా, మానసికంగా ఉపశమనం పొందుతారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: Neal Mohan యూట్యూబ్ కొత్త సీఈవో: మరోసారి ఇండియన్స్ సత్తా) -
ర్యాష్ డ్రైవింగ్: జొమాటో హాట్‌లైన్ నంబర్ లాంచ్
న్యూఢిల్లీ: డెలివరీ పార్ట్నర్లు ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తున్న పక్షంలో ప్రజలు తమకు ఫిర్యాదు చేసేందుకు వీలుగా కొత్త డెలివరీ బ్యాగ్‌లను ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని ఆన్లైన్ ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. తమ బ్యాగ్‌లపై ‘హాట్‌లైన్ ఫోన్ నంబర్‘ ముద్రించి ఉంటుందని ట్వీట్ చేశారు. వేగంగా డెలివరీలు చేయాలంటూ తాము పార్ట్నర్లను ఒత్తిడి చేయమని ఆయన పేర్కొన్నారు. సత్వరం అందిస్తే ప్రోత్సాహకాలు ఇవ్వడం, లేకపోతే పెనాల్టీలు విధించడం వంటివి ఏమీ ఉండవని గోయల్ స్పష్టం చేశారు. అసలు వారికి ఎస్టిమేటెడ్ డెలివరీ కూడా చెప్పం. ఈ నేపథ్యంలో తమ డె లివరీ పార్ట్నర్లు ఎవరైనా వేగంగా నడుపుతుంటే. తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. తద్వారా రోడ్లపై ట్రాఫిక్‌ను రద్దీ లేకుండా నివారించాలని ఆయన కోరారు. 10 నిమిషాల్లోనే ఇన్స్టంట్ డెలివరీ సర్వీసులు ప్రారంభిస్తున్నామని గతంలో ప్రకటించినప్పుడు డెడ్‌లైన్ పేరిట డెలివరీ పార్ట్నర్లపై ఒత్తిడి పెంచుతున్నారంటూ జొమాటోపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో గోయల్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. As promised earlier, we have started rolling out delivery bags which mention a hotline phone number to report rash driving by our delivery partners. Please remember – we don’t incentivise our delivery partners for on time deliveries, nor do we penalise them for late ones. (1/2) pic.twitter.com/Jic36Rt1qn — Deepinder Goyal (@deepigoyal) November 2, 2022 -
జొమాటో సీఈవో దీపిందర్ గోయల్‌కు భారీ షాక్, బెడిసి కొట్టిన మాస్టర్ ప్లాన్!
జొమాటో సీఈవో దీపిందర్ గోయల్‌కు భారీ షాక్ తగిలింది. పదినిమిషాల్లో డెలివరీ అంటూ గోయల్ వేసిన మాస్టర్ ప్లాన్ బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. ఆరంభం అదిరేలా గూర్గావ్ కేంద్రంగా జొమాటో 10నిమిషాల్లో ఫుడ్ డెలివరీ పైలెట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. కానీ డెలివరీ బాయ్స్ లేక..చెప్పిన టైంకు కస్టమర్లకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్‌ను డెలివరీ చేయడంలో విఫలమవుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అదే సమస్యతో స్విగ్గీ సైతం తన 'జెనీ' సేవల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆర్డర్లు ఆలస్యం అవ్వడంతో ఏం జరుగుతుందో అర్ధం గాక కస్టమర్లు తలలు పట్టుకుంటున్నారు. మేం అందుబాటులోకి తెచ్చే పదినిమిషాల ఫుడ్ డెలివరీ సర్వీస్ ప్రపంచంలో ఇంత వరకు ఏ ఇతర ఫుడ్ డెలివరీ సంస్థలు కస్టమర్లకు అందించలేదు. కానీ మేం అందిస్తాం. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయబోతున్నాం. తొలత ఈ టెన్ మినిట్స్ డెలివరీ పైలెట్ ప్రాజెక్ట్‌ను గుర్గావ్లో ప్రారంభిస్తున్నాం. తర్వాత దేశ వ్యాప్తంగా కస్టమర్లకు ఫుడ్ డెలివరీ అందిస్తున్నామని ప్రకటించి జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ గట్టి ప్లానే వేశారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ బెడిసి కొట్టినట్లు తెలుస్తోంది. పది నిమిషాల సంగతి దేవుడెరుగు పది నిమిషాల సంగతి దేవుడెరుగు. ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఐటమ్ 15 నుంచి 20 నిమిషాలకు కూడా అందడం లేదంటూ జొమాటోపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ కంపెనీ ప్రతినిధులు మాత్రం తాము చెప్పినట్లుగానే జొమాటో ఇన్స్టంట్ ద్వారా పదినిమిషాల్లో ఫుడ్‌ను కస్టమర్లకు అందిస్తున్నామని చెబుతున్నారు. గూర్గావ్లో జొమాటో ఇన్స్టంట్ ద్వారా టెన్ మినిట్స్ డెలివరీపై ఊహించని రెన్సాన్స్ వచ్చిందని, మే నెలలో బెంగళూరులో సైతం ఈ డెలివరీ విధానాన్ని అమలు చేయనున్నట్లు చెబుతున్నారు. జొమాటో ఇన్స్టంట్ యాప్‌లో సైతం ఫుడ్ డెలివరీ టైం 15 నుంచి 20నిమిషాల సమయం చూపెట్టడంపై ఫుడ్ లవర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డెలివరీ బాయ్స్‌కు కొత్త కష్టాలు ఈ నేపథ్యంలో జొమాటో 10నిమిషాల్లో ఫుడ్ డెలివరీ చేయడం సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతుండగా..సీఎన్‌బీసీ టీవీ18 ఆసక్తికర కథనం వెలుగులోకి వచ్చింది. ఆ కథనం ప్రకారం..క్విక్ కామర్స్ (10నిమిషాల్లో ఆర్డర్ అందించడం), జాబ్ మొబిలిటీ (ఉన్న జాబ్ వదిలేసి మరో కొత్త ఫీల్డ్‌లోకి వెళ్లడం) వంటి అంశాలు స్విగ్గీ, జొమాటోలకు డెలివరీ బాయ్స్ గుడ్ బై చెబుతున్నట్లు నివేదించింది. దీంతో పాటు సమ్మర్ సీజన్, ఐపీఎల్, వర్షాల కారణంగా డెలివరీ బాయ్స్..ఆర్డర్లను డెలివరీ చేసేందుకు ముందుకు రావడం లేదని తెలిపింది. సేమ్ టూ సేమ్ దీంతో ఇన్ టైమ్‌లో కస్టమర్లకు ఫుడ్ డెలివరీని అందించకపోవడంతో జొమాటో, స్విగ్గీలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్ సీజన్ కారణంగా డిమాండ్‌కు తగ్గట్లు డెలివరీ బాయ్స్ లేక స్విగ్గీ సంస్థ జెనీ పేరుతో నిర్వహిస్తున్న పిక్ అప్.. డ్రాప్ ఆఫ్ సేవల్ని ముంబై, హైదరాబాద్, బెంగళూరులలో సేవల్ని తాత్కాలికంగా నిలిపివేసింది. “క్రికెట్, పండుగల సీజన్ ఫలితంగా ఫుడ్ మార్కెట్‌ప్లేస్, ఇన్‌స్టామార్ట్ రెండింటికీ అవసరాల్ని తీర్చడానికి డిమాండ్ పెరిగింది. అందుకు అనుగుణంగా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రస్తుతం స్విగ్గీ జెనీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటలో స్విగ్గీ తెలిపింది. చదవండి👉స్విగ్గీ బంపరాఫర్: డెలివరీ బాయ్స్ కష్టాలకు చెక్.. కళ్లు చెదిరేలా జీతాలు! -
పది నిమిషాలు సరే.. ప్రాణాలు పోతే బాధ్యత ఎవరిది ?
టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఆకాశమే హద్దుగా విస్తరిస్తోన్న డెలివరీ బిజినెస్‌పై దృష్టి సారించాలని, అవసరమైన నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం కోరారు. గిగ్ ఎకానమీలో జోమాటో, స్విగ్రీ, డూన్జో ఇలా ఎన్నో కంపెనీలు వేగంగా డెలివరీ చేసేందుకు పోటీ పడుతున్నాయని, అయితే ఈ క్రమంలో డెలివరీ బాయ్ సెక్యూరిటిని ఎవరూ పట్టించుకోవడం లేదంటూ పార్లమెంటులో ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. జోమాటో, స్విగ్రీ, డూన్జో ఇలా అనేక కంపెనీలు డోర్ డెలివరీ చేస్తున్నాయి. జోమాటో అయితే ఏకంగా పది నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ చేస్తామని చెబుతున్నాయి. ఇలా చేసేప్పుడు ఆ కంపెనీలుకు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నాయి. డెలివరీ బాయ్ పర్సనల్ వెహికల్స్‌ను కమర్షియల్‌గా వాడుకుంటున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సిన అవసరం ఉందని కార్తి చిదంబరం అన్నారు. ఇక డెలివరీ బాయ్‌లను కంపెనీలు తమ ఉద్యోగులుగా పరిగణించడం లేదు. కనీసం వారికి ఇన్సురెన్సు చేయించడం లేదు. కానీ పది నిమిషాల్లె డెలివరీ అందిస్తామని చెబుతున్నాయి. ఈ వేగాన్ని అందుకునే క్రమంలో డెలివరి బాయ్స్ ప్రమాదాలకు గురైతే బాధ్యత ఎవరూ తీసుకోవడం లేదు. ఎంతోమంది డెలివరి బాయ్స్ ఎటువంటి రక్షణ లేకుండా పని చేస్తున్నారు. This is absurd! It’s going to put undue pressure on the delivery personnel, who are not employees & who have no benefits or security, who have no bargaining power with @zomato I have raised this in Parliament & have written to the Govt. Will pursue this further. https://t.co/fH8yflloiY pic.twitter.com/PfQIe2nfR4 — Karti P Chidambaram (@KartiPC) March 21, 2022 టెక్నాలజీ రావడంతో గిగ్ ఎకానమీ ఊపందుకుంది. ఈ స్వింగ్‌ని ఇలా కొనసాగిస్తూనే డెలివరీ బాయ్స్ రక్షణ విషయంలో, వారి హక్కుల విషయంలో ప్రభుత్వం దృష్టి సారించాలి. డెలివరీ సంస్థలకు కచ్చితమైన నియమ నిబంధనలు జారీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చదవండి: జొమాటో సంచలన నిర్ణయం..! ఇకపై పది నిమిషాల్లోనే డెలివరీ..ముందుగా అక్కడే -
కొంప ముంచుతున్న ఆఫర్లు! మా ప్రాణాలు ఫణంగా పెట్టి వ్యాపారం చేస్తారా?
ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయాక మన దేశంలో ఈ కామర్స్ రంగం ఆకాశమే హద్దుగా వృద్ధి చెందుతోంది. ఇక కరోనాతో ఫిజికల్ డిస్టెన్సింగ్ వంటివి జన జీవితంలో భాగమయ్యాక డిజిటల్ సర్వీసెస్‌కి గిరాకీ పెరిగింది. దీంతో అనేక కంపెనీలు ఈ కామర్స్‌లోకి వస్తున్నాయి. కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ క్రమంలో కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. వీటిలో కొన్ని ప్రమాదకరంగా మారాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పాలు, కూరగాయలు మొదలు ఉప్పు, పప్పు, సోపు, షాంపూ వరకు అన్ని రకాల నిత్యావసర వస్తువులు ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. ఈ రంగంలో ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్‌బాస్కెట్, జియోమార్ట్ వంటి ప్రముఖ సంస్థలు గ్రోసరీస్ డోర్ డెలివరీ సర్వీస్‌లు అందిస్తున్నాయి. వీటికి పోటీగా అనేక స్టార్టప్‌లు వస్తున్నాయి. ఈ క్రమంలో ముంబై, ఢిల్లీ, గురగ్రామ్ ప్రాంతాల్లో బ్లింకిట్, జెప్టో వంటి ఈ కామర్స్ సైట్స్ ప్రారంభమయ్యాయి. మార్కెట్లో పాగా వేసేందుకు పోటీ కంపెనీల కంటే భిన్నమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. పది నిమిషాల్లోనే సబ్బు, సర్ఫ్, పాలు, కాఫీ ఏదైనా సరే ఆర్డర్ చేసిన పది నిమిషాల్లో మీకు హోం డెలివరీ చేస్తామంటూ బ్లింకిట్, జెప్టోలు ప్రకటించాయి. ఆర్డర్ చేసిన క్షణం నుంచి పది నిమిషాలు ముగిసేలోగా నిజంగానే కష్టమర్లకు ఆర్డర్లను చేరవేస్తున్నాయి కూడా. ఢిల్లీ, ముంబైలాంటి నగరాల్లో కాలంలో పోటీ పడి పని చేసే టెకీలు ఈ సర్వీసుల పట్ల ఆకర్షితులు అవుతున్నాయి. యూరప్, అమెరికా లాంటి దేశాలకే ఈ స్పీడ్ డెలివరీ సర్వీస్ సాధ్యమని అనుకున్నాం, కానీ మన దగ్గర కూడా టెన్ మినిట్స్ డెలివరీ వచ్చిందంటూ ఈ స్పీడ్‌ను స్వాగతిస్తున్నారు. రద్దు చేయండి మరోవైపు పది నిమిషాల్లో డెలివరీ సర్వీసు తమ ప్రాణాల మీదకు వచ్చిందంటున్నారు డెలివరీ బాయ్స్. పేరు చెప్పడానికి డెలివరీ బాయ్స్ తాము పడుతున్న ఇబ్బందులను రాయిటర్స్ దృష్టికి తీసుకెళ్లారు. తద్వారా ఈ అంశం జాతీయ మీడియాలో సంచలనంగా మారింది. గుంతలమయంగా ఉండే రోడ్లు, ఇరుకు గల్లీలు, తరచుగా జరిగే ర్యాలీలు, ట్రాఫిక్ కష్టాలు వంటి స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పది నిమిషాల డెలివరీ సర్వీసును రద్దు చేయాలని కోరుతున్నారు. రేసింగ్లా ఉంది డెలివరీ బాయ్స్ చెబుతున్న వివరాల ప్రకారం.. ఆర్డర్ బుక్ చేసిన తర్వాత సదరు వస్తువును ప్యాక్ చేసుకుని డాక్యుమెంట్ వర్క్ పూర్తి చేయడానికే రెండు నుంచి మూడు నిమిషాల సమయం పడుతుంది. అక్కడి నుంచి గమ్యస్థానానికి చేరుకునేందుకు కేవలం 5 నుంచి 7 నిమిషాల సమయమే మిగిలి ఉంటుంది. ఇంత తక్కువ సమయంలో డెలివరీ అందించేందుకు ఎంతో స్పీడ్‌గా డ్రైవ్ చేయాల్సి వస్తుందంటున్నారు. తాము రేసింగ్‌లో పాల్గొంటున్నట్టుగా బైకులు నడుపుతున్నామని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది ప్రమాదంలో పడ్డారని, అదృష్టవశాత్తు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని చెబుతున్నారు. లేటయినా పర్వాలేదు డెలివరీ బాయ్స్ ఆందోళన ఇలా ఉంటే ఈ కామర్స్ ప్రతినిధుల వాదన మరోలా ఉంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు పది నిమిషాల డెలివరీ సర్వీసును అందిస్తున్నాం. ఈ సర్వీస్‌కి కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. కచ్చితంగా పది నిమిషాల్లోనే వెళ్లాలని అనే నిబంధన ఏమీ డెలివరీ బాయ్స్‌కి పెట్టడం లేదు. ఆలస్యమయితే ఎలాంటి ఫైన్లు విధించడం లేదు. కస్టమర్లను త్వరగా సేవలు అందివ్వడమే తమ లక్ష్యమని చెబుతున్నాయి. వాస్తవంలో అలా లేదు పది నిమిషాల్లో డెలివరీ చేయకపోయినా పర్వాలేదంటూ కంపెనీ ప్రతినిధులు చెబుతున్న మాటలు అబద్దం అంటున్నారు డెలివరీ బాయ్స్. సకాలంలో ఆర్డర్‌ని అందివ్వకపోతే చాలా మందికి రోజువారి జీతంలో రూ.300ల వరకు కోత విధిస్తున్నారని, తమని నొప్పించేలా స్టోర్ మేనేజర్లు మాట్లాడుతున్నారని డెలివరీ బాయ్స్ అంటున్నారు. మొదలైన చర్చ ప్రపంచంలోనే రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మరణాలు సంభవిస్తున్న దేశంగా ఇండియా ఉంది. ఇక్కడ ప్రతీ నాలుగు నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారు. సగటున ఏడాదికి లక్షన్నర మంది చనిపోతున్నారు. మరోవైపు ఇండియాలో ఆన్లైన్ గ్రాసరీ మార్కెట్ విలువ 600 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనాలు ఉన్నాయి. దీంతో బడా కార్పోరేట్ కంపెనీలకు తోడు స్టార్టప్‌లు ఇక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఈ తరుణంలో డెలివరీ బాయ్స్లు పడుతున్న ఇబ్బందులపై చర్చ మొదలైంది. రోడ్ సెఫ్టీ విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఆఫర్లు ప్రకటించాలని డెలివరీ బాయ్స్ అంటున్నారు. చదవండి: డెలివరీబాయ్ దుర్మరణం.. జొమాటో స్పందన ఇది -
అమ్మ బాబోయ్.. ఇవేం కెమెరాలు
సరదాగా కారులో పోయేప్పుడు.. ఉల్లాసం కోసం ఫుల్ సౌండ్‌లో రేడియో వింటాం. సరదాగా బయటకు తొంగి చూస్తుంటాం. ఒక్కోసారి హడావిడిలో సిగ్నల్ జంప్ కొట్టి పోతాం. దారినపోయే వెహికిల్స్‌కు కట్టింగ్లు కొడతాం. ఓ.. ఇంకా చాలా పనులు చేస్తాం. ఇదంతా వ్యక్తిగతంగా ఫీలవుతుంటారు చాలామంది. అయితే ఆ వ్యక్తిగతంపై నిఘా నీడలు అలుముకుంటే?.. యస్.. అలాంటి పవర్ఫుల్ కెమెరాలు సమీప భవిష్యత్తులో మనదగ్గరికీ రాబోతున్నాయి. తన డెలివరీ వ్యవస్థను పటిష్టపర్చుకునేందుకు కొత్త తరహా కెమెరా నిఘా వ్యవస్థను తీసుకొచ్చింది అమెజాన్. ఆన్లైన్ సేల్స్, గూడ్స్ డెలివరీ సర్వీసుల్లో భాగంగా డెలివరీ వెహికిల్స్‌లో ‘నెట్రాడైన్ కెమెరాల’ను ఉపయోగిస్తోంది అమెజాన్. డెలివరీ బాయ్స్ మీద నిఘా, భద్రత దృష్ట్యా త్వరలో వీటిని భారత్‌లో ప్రవేశపెట్టాలని అమెజాన్ భావిస్తోంది. పూర్తి అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీతో పని చేసే ఈ కెమెరాలు.. ప్రతీది నిశితంగా పరిశీలిస్తాయి. నాలుగు లెన్స్‌ల ఈ కెమెరాలు ముందుగా డెలివరీ డ్రైవర్ ముఖాన్ని, బాడీని స్కాన్ చేసుకుని ఆ బయోమెట్రిక్ డేటా ద్వారా షిఫ్ట్‌లో ఉన్నంతసేపు పర్యవేక్షిస్తుంటుంది. డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకున్నారా? రోడ్లపై సరిగా వెళ్తున్నారా? సమయానికి డెలివరీలు అందిస్తున్నారా? ఇలా.. ప్రతీది చూస్తుంటాయి. పైగా ఈ కెమెరాల ద్వారానే డ్రైవర్ల పనితీరుపై ఓ అంచనాకి రావడం, బోనస్‌లు, ఇతరత్రా నజరాల్ని ప్రకటిస్తున్నారు. అయితే.. డ్రైవర్ల ఆవేదన ఈ హైస్టాండర్డ్ కెమెరాల వల్ల తాము శిక్షకు గురికావాల్సి వస్తోందని కొందరు డెలివరీ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిరంతర పర్యవేక్షణ వల్ల సమయానికి డెలివరీలు చేయలేకపోతున్నామని, తద్వారా జీతంలో కోతలు.. పనితీరు సరిగా లేదనే నోటీసులు అందుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. చివరికి డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ‘ఆవులించినా సరే’.. సదరు ఉద్యోగికి నెగెటివ్ పాయింట్స్ పడుతున్నాయట. అయితే అమెజాన్ మాత్రం ‘ఏఐ కెమెరా’ చర్యలను సమర్థించుకుంటోంది. 48 శాతం యాక్సిడెంట్లు తగ్గాయని, ట్రాఫిక్ ఉల్లంఘనలు 77 శాతం తగ్గాయని చెబుతోంది. సీట్ బెల్ట్ ఛలానాలు, నిర్లక్క్ష్యపు డ్రైవింగ్ ఉదంతాలు సైతం తగ్గినట్లు చెబుతోంది. చదవండి: ఇదేం అమ్మాయి.. ఈ భూమ్మీద ఎక్కడా చూసి ఉండరు!! -
ప్యాకెట్లలో బండరాళ్లు, పెంకులు
సైదాపూర్ (హుస్నాబాద్): తక్కువ సమయంలో ఎక్కువ సొమ్ము సంపాదించాలనే ఆలోచనతో పనిచేస్తున్న సంస్థకే కన్నం వేశారు ఓ నలుగురు యువకులు. వీరి వ్యవహారంపై పైస్థాయి ఉద్యోగికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ నలుగురు చేసిన మోసం బయటపడింది. ఈ కేసు వివరాలను హుజురాబాద్ ఏఎస్పీ వెంకటరెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రం, వెన్కెపల్లి గ్రామానికి చెందిన నీర్ల కల్యాణ్(24), అనగోని వికాస్(23), కనుకుంట్ల అనిల్(26), తూటి వినయ్ (22) హుజూరాబాద్‌లోని లార్జ్ లాజిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఫ్లిప్‌కార్ట్ కొరియర్ బోయ్స్‌గా 3 నెలల నుంచి పని చేస్తున్నారు. వీరు తక్కువ సమయంలో అధిక డబ్బులు సంపాదించాలనుకున్నారు. దీని కోసం ఆన్లైన్లో మోసం చేయడం ఎలా అని యూట్యూబ్‌లో వెదికారు. ఆ తర్వాత ఆన్లైన్లో విలువైన వస్తువుల్ని వీరి స్నేహితుల ఫోన్నంబర్ల నుంచి బుక్ చేసుకున్నారు. ఆ వస్తువులు హుజూరాబాద్ ఫ్లిప్‌కార్టు హబ్‌కు రాగానే డెలివరీ ఇచ్చేందుకు వారిపేరున అసైన్ చేసుకుని సైదాపూర్‌కు తీసుకొచ్చారు. పార్శిల్ ఓపెన్ చేసి ఆ వస్తువులు తీసేసుకుని, రిటర్న్‌ల పేరిట ఆ కవర్లో బండరాళ్లు, పెం కులు నింపి వెనక్కి పంపించేశారు. కాజేసిన వస్తువుల్ని అమ్ముకుని ఆ సొమ్ముతో జల్సాలు చేశారు. అనుమానంతో కదిలిన డొంక వీరి వ్యవహారంపై టీంలీడర్ నవీన్‌కు అనుమానం వచ్చి సైదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో వీరి మోసం బయటపడింది. ఆదివారం నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరాన్ని ఒప్పుకోవడంతో వారినుంచి రూ.9లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. -
డొమినోస్ పిజ్జా కొత్త నిర్ణయం... పొల్యూషన్ ఫ్రీ డెలివరీ !
హైదరాబాద్: ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మీరాచానుకి జీవితాంతం ఫ్రీ ఆఫర్ ప్రకటించి దేశ ప్రజల మన్ననలు అందుకున్న డోమినోస్ మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకుంది. వాతవారణ కాలుష్యం తగ్గించడంలో భాగంగా తన వంతు ప్రయత్నాలను ప్రారంభించింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ డెలివరీ పర్సన్స్ ప్రస్తుతం ఉపయోగిస్తున్న పెట్రోలు బైకులు, స్కూటర్ల స్థానంలో ఇక నుంచి కాలుష్యం విడుదల చేయని ఎలక్ట్రికల్ వెహికల్స్‌ను ఎంపిక చేసిన నగరాల్లో ప్రయోగాత్మకంగా ఉపయోగించాలని డొమినోస్ నిర్ణయించింది. అక్కడ సానుకూల ఫలితాల వస్తే క్రమంగా దేశవ్యాప్తంగా అన్ని స్టోర్లలో పని చేస్తున్న డెలివరీ పర్సన్స్ ప్రస్తుతం ఉన్న పెట్రోలు బైకుల స్థానంలో ఎలక్ట్రిక్ బైకులు ఉపయోగించేలా మార్పులు తేనుంది. రివోల్ట్ 300 కాలుష్య నియంత్రణలో భాగంగా రివోల్ట్ 300 మోడల్ ఎలక్ట్రిక్ బైకులను డొమినోస్ పిజ్జా ఉపయోగించనుంది. ఈ మేరకు రివోల్ట్‌తో సంప్రదింపులు చేపడుతోంది. డెలివరీకి అనుగుణంగా ఈ బైకులను కష్టమైజ్ చేయనున్నారు. ఈ బైకులను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 నుంచి 150 కి,.మీ రేంజ్ మైలేజీ ఇవ్వగలవు. గరిష్ట వేగం గంటలకు 65 కిలోమీటర్లు. వేలల్లో డెలివరీ పర్సన్స్ డొమినోస్ పిజ్జాకి దేశ వ్యాప్తంగా వేలాది అవుట్లెట్లు ఉన్నారు. వేలాది మంది డెలివరీ బాయ్స్ నిత్యం నగరాల్లో బైకులపై తిరుగుతూ పిజ్జాలను డెలివరీ చేస్తున్నారు. వేలల్లో ఉన్న ఈ డెలివరీ పర్సన్స్ నిత్యం పెట్రోలు బైకులపై తిరుగుతూ తమ విధులు నిర్వహ్తిన్నారు. -
నాలుగు గంటలు పనిచేస్తే చాలు రూ. 60 వేలు మీ సొంతం..!
కరోనా మహమ్మారి రాకతో ఈ-కామర్స్ వ్యాపారం గణనీయంగా వృద్ధి చెందింది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కొనుగోలుదారులకు మరింత వేగంగా వస్తువులను డెలివరీ చేయడానికి వ్యూహాలను రచిస్తున్నాయి. అందులో భాగంగా అమెజాన్ డెలివరీ సేవలను మరింత విస్తృత పరిచేందుకు డెలివరీ బాయ్స్‌లను నియమించనుంది. డెలివరీ బాయ్స్‌కు ఫిక్స్డ్ సాలరీగా ప్రతినెలా అమెజాన్ రూ 12 వేల నుంచి రూ. 15 వేల వరకు అందిస్తోంది. అమెజాన్ ఒక ప్రకటనలో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు నెలలో రోజూ 4 గంటలు పనిచేయడంతో సుమారు రూ.55 వేల నుంచి 60 వేల వరకు వస్తాయని పేర్కొంది. అది ఏలా అంటే అమెజాన్ ప్రకారం.. డెలివరీ బాయ్స్‌కు అత్యధిక సాలరీలు వారి డెలివరీ ప్యాకేజ్‌లపై ఆధారపడి ఉంటుంది. ఒక ప్యాకేజ్ డెలివరీ చేస్తే ప్యాకెజ్పై సుమారు రూ. 10 నుంచి రూ. 15 కమిషన్ వస్తోంది. ఇలా ఒక రోజులో సుమారు 100 నుంచి 150 ప్యాకేజ్‌లను డెలివరీ చేస్తే నెలకు గరిష్టంగా రూ. 60 వేలను పొందవచ్చును. కంపెనీ ప్రకారం ప్యాకేజీల డెలివరీ 10కి.మీ నుంచి 15 కి.మీ దూరంలో ఉంటుందని పేర్కొంది. దీంతో ప్యాకేజ్‌లను సుమారు నాలుగు నుంచి ఐదు గంటల్లో డెలివరీ చేయవచ్చును. -
తెలంగాణ వ్యాప్తంగా మరింత కఠినంగా లాక్ డౌన్
-
ఎల్పీజీ: అదనంగా రూ. 6 కోట్లు!
గ్రేటర్ హైదరాబాద్‌లో ఎల్పీజీ వంట గ్యాస్ సిలిండర్‌పై డెలివరీ బాయ్స్ ప్రతినెలా అదనంగా ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా.? అక్షరాల రూ.6 కోట్ల పైమాటే. ఆశ్చర్యపోతున్నారా..? ఇది నిజం. ప్రతి వినియోగదారుడు సిలిండర్ రిఫిల్పై డెలివరీ బాయ్స్‌కు బిల్లుపై అదనంగా రూ.20 నుంచి రూ.30 చెల్లిస్తున్నారు. చిల్లరే కదా అనుకుని తేలిగ్గా తీసుకోవడంతో అది కాస్తా ‘తప్పనిసరి‘గా మారింది. సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో గ్యాస్ బండ( సిలిండర్) వినియోగదారులకు నానాటికి భారంగా మారుతోంది. ఓ వైపు ఆరు నెలలకోసారి ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల ధరను పెంచుతుండగా, మరో వైపు డెలివరీ బాయ్స్ డిమాండ్ చేసి మరీ అదనపు మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. ఎల్పీజీ రీఫిల్ బుక్ చేసి ఆన్లైన్లో నిర్ణీత ధర చెల్లించినా డెలివరీ సమయంలో అదనపు బాదుడు తప్పడం లేదు. ఇక నగదు చెల్లింపు అయితే బిల్లుతో కలిపి అదనంగా రూ. 30 వరకు వినియోగదారుల జేబులకు చిల్లు పడుతోంది. ఈ అదనపు వసూళ్లు డెలివరీ బాయ్స్‌కు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అయితే ప్రధాన ఆయిల్ కంపెనీలు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసం లేదని స్పష్టం చేస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ప్రస్తుతం ఇంటికి సిలిండర్ డెలివరీ చేస్తే నిర్ణీత ధర రూ.746.50పైసలు అయినా నగదు రూ.770 చెల్లించాల్సిందే. అదే చేతిలో చిల్లల లేకుంటే మరో పది రూపాయిలు కూడా పెరగొచ్చు. డెలివరీ బాయ్స్ వినియోగదారుడి చేతికి బిల్లు ఇచ్చి అదనపు మోత కలిపి వసూలు చేయడం పరిపాటిగా తయారైంది. ఏజెన్సీల నిర్లక్ష్యం.. ఏజెన్సీలు వినియోగదారులకు రీఫిల్ డోర్ డెలివరీ బాధ్యతలో నిర్లక్ష్యం వహించడం విస్మయానికి గురి చేస్తోంది. ఫలితంగా చమురు సంస్థలు నిర్దేశించిన ధర అమలు కావడం లేదు. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు రీఫిల్ ధర, గ్యాస్, డోర్ డెలివరీ చార్జీ (రవాణా, హమాలీ, నిర్వహణ)లతో కలుపుకొని బిల్లింగ్ చేసి వినియోగదారులకు సరఫరా చేయాల్సి ఉంటుంది. చమురు సంస్థల నిర్దేశించిన ధరనే బిల్లింగ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు వినియోగదారులకు సిలిండర్ సరఫరా బాధ్యతను డెలివరీ బాయ్స్‌కు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. అదనపు వసూళ్లపై డిస్ట్రిబ్యూటర్లకు ఫిర్యాదుచేసినా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. చాలీచాలని వేతనాలు.. సిలిండర్ డెలివరీ బాయ్స్‌కు చాలీచాలని వేతనాల చెల్లిస్తుండటం కూడా వినియోగదారులపై అదనపు బాదుడుకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా డెలివరీ బాయ్స్‌కు ఏజెన్సీలు కనీస వేతనాలు అమలు చేయడం లేదు. కొందరు డిస్ట్రిబ్యూటర్లు వారికి నామమాత్రపు వేతనాలు చెల్లిస్తుండగా, మరికొందరు రీఫిల్ డెలివరీపై కమీషన్ ఇస్తున్నారు. ఫలితంగా డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేయడం సర్వ సాధారణంగా మారింది. నిబంధనల ప్రకారం బాయ్స్ సిలిండర్‌ను డోర్ డెలివరీ చేసే సమయంలో ప్రత్యేక పరికరంతో రీఫిల్ నిర్ణీత బరువును వినియోగదారులకు చూపించాలి. అయితే ఈ నిబంధన ఎక్కడ కూడా అమలవుతున్న దాఖలాలు లేవు. కేవలం బిల్లింగ్‌పై అదనపు బాదుడు తప్ప బరువు చూపించాలన్న ధ్యాస లేకుండా పోయింది. నిబంధనలు ఇవీ ⇔ వినియోగదారుడు ఆన్లైన్లో గ్యాస్ రీఫిల్ బుకింగ్ చేసుకున్న తర్వాత బిల్లు జనరేట్ చేసి డోర్ డెలివరీ చేయాలి ⇔ ఏజెన్సీ నుంచి 5 కిలో మీటర్ల వరకు ఉచితంగా డోర్ డెలివరీ ఇవ్వాలి. ⇔ ఏజెన్సీ నుంచి 6 కిలో మీటర్ల నుంచి 15 కిలో మీటర్లు ఉంటే రవాణా చార్జీల పేరుతో రూ.10 వసూలు చేయవచ్చు. ⇔ 16 –30 కిలో మీటర్లు దూరం ఉంటే రవాణా చార్జీగా రూ. 15 వసూలు చేయాలి ⇔ వినియోగదారుడు సిలిండర్ రీఫిల్‌ను గ్యాస్ కంపెనీ గోదాముకు వెళ్లి తీసుకుంటే బిల్లులో రూ.8 మినహాయించాలి. -
ట్రెండింగ్: పొరపాటున 42 ఆర్డర్లను బుక్ చేసిన చిన్నారి
ఫిలిప్పీన్స్‌లోని సిబూ సిటీలోని ఒక వీధిలో ఒక చిన్నారి చేసిన తప్పు కారణంగా ఒక్క సారిగా ఫుడ్ డెలివరీ బాయ్స్‌తో ఆ కాలనీ నిండిపోయింది. అక్కడ ఉన్న 7 ఏళ్ల చిన్నారి 2ఆర్డర్లకు బదులుగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లో చేసిన చిన్న తప్పు కారణంగా 42 ఆర్డర్లను బుక్ చేసింది. దింతో అప్పటికే చాలా రద్దీగా ఉండే ఆ వీధి ఒక్కసారిగా ఫుడ్ డెలివరీ బాయ్స్‌తో నిడిపోయింది. దీనికి సంబదించిన ఒక వీడియోను ఫేస్బుక్ యూజర్ డాన్ కైన్ సువారెజ్ అనే వ్యక్తి షేర్ చేసాడు. (చదవండి: వాట్సాప్ vs టెలిగ్రామ్: ఏది అత్యంత సురక్షితం?) వివరాల్లోకి వెళ్ళితే.. 7 ఏళ్ల చిన్నారి తన బామ్మతో కలిసి భోజనం చేయడానికి 2 బాక్సుల చికెన్ ఫిల్లెట్ను ఫుడ్ డెలివేరి యాప్ లో ఆర్డర్ చేయడానికి ప్రయత్నించింది. ఆ పాప ఆర్డర్ చేసినప్పుడు ఇంటర్ నెట్ కనెక్షన్ సరిగా లేకపోవడంతో ఆ ఫుడ్ ఆర్డర్ పై 42 సార్లు ప్రెస్ చేసింది. ఇలా చేయడం వల్ల ఒక్క సారిగా 42 ఫుడ్ డెలివరీ బాయ్స్ చాలా రద్దీగా ఉండే కాలనీలోకి వచ్చేసరికి అక్కడ వింత వాతావరణం చోటు చేసుకుంది. ఈ అమ్మాయి ఇలా చేయడం మొదటి సారి కాదు గతంలో కూడా ఇలా చాలా సార్లు చేసింది. అసలు ఒక్క ఆర్డర్ ధర వచ్చేసి 290 రూపాయలు. ఇప్పుడు 42 ఆర్డర్లకు కలిపి పూర్తి బిల్లు 12,186 రూపాయలు అయ్యింది. దాంతో ఆ పిల్ల బోరున ఏడుపు అందుకుంది. అక్కడ ఉన్నా ప్రజలకు ఈ విషయం తెలవడంతో ఆ ఆర్డర్ లను వారు అవసరం లేకున్నా కొన్నారు. అందుకే మీరు కూడా ఆర్డర్ చేసే ముందు జర జాగ్రత్త. అలాగే, మీ పిల్లకు కూడా ఇలాంటి అవకాశాన్ని వారికి ఇవ్వకండి.