ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల్లో, సామాజిక్ మాధ్యమాల్లో ఫేమస్‌కావాలని యువతకు ఎంతో ఆశగా ఉంటుంది. అందుకు ఎన్నో మార్గాలను ఎంచుకుని ప్రయత్నాలు చేస్తారు. అందుకు అనుగునంగా కొందరు అనుకున్న విధంగా సోషల్ మీడియాలో వ్యూస్ పెంచుకుంటారు. అయితే ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ సేవల సంస్థ జొమాటో పేరును వాడుకొని ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, పాపులర్ అయ్యేందుకు వింత ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా ఓ యువతి జనాల దృష్టిని ఆకర్షించాలని జొమాటో డ్రెస్ కోడ్‌లో యమహా R15 బైక్‌తో రోడ్డుపై చక్కర్లు కొట్టిన సంఘటన ఇండోర్‌లో జరిగింది.
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలో జొమాటో పాపులర్ అయింది. అయితే జొమాటో ద్వారా ఫుడ్ డెలివరీ చేసే వారు ఎక్కువగా అబ్బాయిలే ఉంటారు. కానీ ఓ యువతి మాత్రం ఓ స్టైలిష్ బైక్‌పై జొమాటో బ్యాగ్, డ్రైస్ ధరించి రోడ్లపై రౌండ్లు వేస్తూ నెట్టింట్లో వైరల్ అయింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగినట్లుగా ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా తెలుస్తోంది.
ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో ఇది జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ దృష్టికి వెళ్లింది. ఈ వీడియోకు సంబంధించి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందించారు. జొమాటోకు దీనితో ఎలాంటి సంబంధం లేదన్నారు. హెల్మెట్ లేని బైక్ రైడింగ్‌ను తాము ప్రోత్సహించబోమని చెప్పారు. తమకు ఇండోర్‌లో మార్కెటింగ్ హెడ్ లేరన్నారు. అయితే మహిళలు ఇలా ఫుడ్ డెలివరీ ఏజెంట్లుగా మారడంలో తప్పు లేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment