ఫిలిప్పీన్స్‌లోని సిబూ సిటీలోని ఒక వీధిలో ఒక చిన్నారి చేసిన తప్పు కారణంగా ఒక్క సారిగా ఫుడ్ డెలివరీ బాయ్స్‌తో ఆ కాలనీ నిండిపోయింది. అక్కడ ఉన్న 7 ఏళ్ల చిన్నారి 2ఆర్డర్‌లకు బదులుగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లో చేసిన చిన్న తప్పు కారణంగా 42 ఆర్డర్‌లను బుక్ చేసింది. దింతో అప్పటికే చాలా రద్దీగా ఉండే ఆ వీధి ఒక్కసారిగా ఫుడ్ డెలివరీ బాయ్స్‌తో నిడిపోయింది. దీనికి సంబదించిన ఒక వీడియోను ఫేస్‌బుక్ యూజర్ డాన్ కైన్ సువారెజ్ అనే వ్యక్తి షేర్ చేసాడు. (చదవండి: వాట్సాప్ vs టెలిగ్రామ్: ఏది అత్యంత సురక్షితం?)
వివరాల్లోకి వెళ్ళితే.. 7 ఏళ్ల చిన్నారి తన బామ్మతో కలిసి భోజనం చేయడానికి 2 బాక్సుల చికెన్ ఫిల్లెట్‌ను ఫుడ్ డెలివేరి యాప్ లో ఆర్డర్ చేయడానికి ప్రయత్నించింది. ఆ పాప ఆర్డర్ చేసినప్పుడు ఇంటర్ నెట్ కనెక్షన్ సరిగా లేకపోవడంతో ఆ ఫుడ్ ఆర్డర్ పై 42 సార్లు ప్రెస్ చేసింది. ఇలా చేయడం వల్ల ఒక్క సారిగా 42 ఫుడ్ డెలివరీ బాయ్స్ చాలా రద్దీగా ఉండే కాలనీలోకి వచ్చేసరికి అక్కడ వింత వాతావరణం చోటు చేసుకుంది. ఈ అమ్మాయి ఇలా చేయడం మొదటి సారి కాదు గతంలో కూడా ఇలా చాలా సార్లు చేసింది. అసలు ఒక్క ఆర్డర్ ధర వచ్చేసి 290 రూపాయలు. ఇప్పుడు 42 ఆర్డర్‌లకు కలిపి పూర్తి బిల్లు 12,186 రూపాయలు అయ్యింది. దాంతో ఆ పిల్ల బోరున ఏడుపు అందుకుంది. అక్కడ ఉన్నా ప్రజలకు ఈ విషయం తెలవడంతో ఆ ఆర్డర్ లను వారు అవసరం లేకున్నా కొన్నారు. అందుకే మీరు కూడా ఆర్డర్ చేసే ముందు జర జాగ్రత్త. అలాగే, మీ పిల్లకు కూడా ఇలాంటి అవకాశాన్ని వారికి ఇవ్వకండి.
Comments
Please login to add a commentAdd a comment