kid
-
పిన్నీసు మింగిన మూడునెలల పసికందు..ప్రాణం కాపాడిన ఆంకురా ఆస్పత్రి వైద్యులు
అంకురా ఆస్పత్రి వైద్యులు ప్రాణ ప్రదాతలుగా నిలిచారు. అరుదైన ఆపరేషన్ చేసి మూడు నెలల పసికందుకు ప్రాణం పోశారు. ఇటీవల మూడు నెలల పసికందును.. పక్కనే ఆడుకొంటున్న తోబుట్టువుల వద్ద కుటుంబ సభ్యులు పడుకోబెట్టారు. ఆ సమయంలో పసికందు ఓ పన్నీసును మింగేసింది. ఊపిరి పీల్చుకోవడంతో పాటు ఇతర సమస్యలు తలెత్తడంతో అత్యవసర చికిత్స కోసం తల్లిదండ్రులు అంకురా ఆస్పత్రికి తరలించారు.ఆస్పత్రికి వచ్చిన వెంటనే అంకురా ఆస్పత్రి కన్సల్టెంట్ పీడియాట్రిక్ గ్యాస్టోఎంటరాలజిస్ట్, హెపాటాలజిస్ట్ డాక్టర్ పారిజాత్ రామ్ త్రిపాఠి పరీక్షలు నిర్వహించారు. రేడియోగ్రాఫిక్ పరీక్షల్లో పిన్నీసు కడుపులో గుచ్చుకున్నట్లు నిర్ధారించారు. ఇది ప్రాణాంతకంగా మారి పసికందుకు ప్రమాదమని భావించారు.వెంటనే డాక్టర్ పారిజాత్ రామ్ త్రిపాఠిల వైద్యుల బృందం పసికందు పొట్ట భాగంలో క్లిష్టమైన ఎండోస్కోపిక్ శస్త్రచికిత్స చేశారు. మినిమల్ ఇన్వాసివ్ టెక్నిక్ ను ఉపయోగించి రెండు సెంటీమీటర్ల పిన్నీసును తొలగించారు. పసికందు ప్రాణాన్ని కాపాడారు. ఈ సందర్భంగా అంకురా హాస్పిటల్ ఫర్ వుమెన్ అండ్ చిల్డ్రన్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ వున్నం మాట్లాడుతూ.. గృహోపకరణాలతో చిన్న పిల్లలకు ప్రమాదం పొంచిఉందని ఈ సంఘటన గుర్తు చేస్తుంది. ప్రాణాంతక పరిస్థితులను నివారించడంలో తల్లిదండ్రుల అవగాహన, వేగంగా స్పందించడం చాలా అవసరమని తెలిపారు. అంకురా హాస్పిటల్ సంరక్షణను అందించడమే కాకుండా రోగుల భద్రతకు కట్టుబడి ఉందని అన్నారు.మూడు నెలల పసికందుకు శస్త్రచికిత్స చేసిన డాక్టర్ పారిజాత్ రామ్ త్రిపాఠి మాట్లాడుతూ.. మేము ఎండోస్కోపీ ద్వారా పిన్నీసును విజయవంతంగా తొలగించాం. తీవ్రమైన సమస్యలను నివారించడానికి సకాలంలో చర్య అవసరం. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ఈ విధానం ద్వారా బాధితులకు ఓపెన్ సర్జరీ అవసరాన్ని తగ్గించడమే కాకుండా ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది. వెంటనే కోలుకోవచ్చని తెలిపారు. -
చిన్నారి ప్రాణం తీసిన సెల్‌ఫోన్ ఛార్జర్
నిర్మల్ జిల్లా, కడెం మండలం కొత్త మద్దిపడగలో విషాదం చోటు చేసుకుంది. సెల్‌ఫోన్ ఛార్జర్ చిన్నారి ప్రాణం తీసింది. చిన్నారి సెల్‌ఫోన్ ఛార్జర్ కేబుల్‌తో ఆడుకుంటూ నోట్లో పెట్టుకుంది. దీంతో విద్యుత్ షాక్‌కు గురై చిన్నారి ప్రాణాలు కొల్పోయింది. ఈ విషాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పోలీసులతో దాగుడుమూతలు..
-
నాలుగు నెలల చిన్నారి టాలెంట్..పుట్టుకతోనే పుట్టెడు బుద్దులు
-
కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
విదేశాల్లో బిడ్డ దగ్గరకు వెళ్లి ఆనందంగా ఉన్న సమయంలో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని నింపింది. కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇండియాకు చెందిన దంపతులు, వారి మూడు నెలల మనవడు దుర్మరణం చెందారు. ఆ కారులో ఉన్న చిన్నారి తల్లిదండ్రులు కూడా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. టొరంటోకు తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న విట్బీలోని హైవే 401పై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై విచారాన్ని వ్యక్తం చేసిన ఒట్టావాలోని భారత హైకమిషన్ మృతులకు సంతాపాన్ని తెలియజేసింది.ఏం జరిగిందంటే ఇండియాకు చెందిన మణివణ్ణన్(60) మహాలక్ష్మి(55) దంపతులు ఎజాక్స్‌లో ఉంటున్న మనవడిని చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అందరూ కలిసి బయటికి వెళ్లగా మృత్యువు వారిని కబళించింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం . బోమన్‌విల్లేలో మద్యం దుకాణంలో చోరీ చేసిన ఇద్దరు నిందితులను పోలిసులు వెంబడించారు. పోలీసులను నుంచి తప్పించు కునే క్రమంలో హైవేపై వ్యాన్‌లో రాంగ్రూట్లో వెళుతూ వారు పలు కార్లను ఢీకొట్టారు. ఇందులో బాధితుల కారు కూడా ఉంది. ఈ ఘటనలో నిందితుల్లో ఒకరు ఘటనా స్థలంలోనే మరణించాడు. చిన్నారి తల్లిదండ్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ,తల్లి ఐసీయూలో ఉందని ఒంటారియో స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ యూనిట్ (SIU) తెలిపింది.‘‘ఎప్పటిలాగే ఆ హైవేపై కారులో వెళుతున్నాను ఇంతలో నిందితులు రాంగ్రూట్లో ఎదురుగా వచ్చారు. ఆరు కార్లను ఢీకొట్టారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఆ క్షణం నా కళ్లను నేనే నమ్మలేకపోయాను’’ ఈ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ ఓ ప్రత్యక్ష సాక్షి మరోవైపు ఘటనపై కెనడా పోలీసులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. యాక్సిడెంట్ ఎలా జరిగిందనేది ఆరా తీస్తున్నారు. ప్రత్యేక బృందాలతో వివిధ కోణాలలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటనపై టొరొంటోలోని భారతీయ కాన్సులేట్ విచారం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి సంతాపం తెలియజేసింది. ఈ ఘటనపై కెనడా అధికారులతో టచ్‌లో ఉన్నామని బాధిత కుటుంబానికి అన్నిరకాలుగా అండగా ఉంటామని పేర్కొంది. -
వండర్ బుడ్డోడు..చిన్న వయసులోనే పెద్ద రికార్డు
-
ఆనంద్ మహీంద్రాకే కంటతడి పెట్టిస్తోంది! వీడియో వైరల్
నిత్యజీవితంలో ప్రతి రోజూ మనసును తాకే సంఘనటనలు ఎన్నెన్నో కనిపిస్తూ ఉంటాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఇలాంటి సంఘటన దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా'ను సైతం కన్నీళ్లు పెట్టుకునే చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కార్తీక్ సింగ్ అనే ఒక చిన్నారి క్యాన్సర్ చికిత్స కోసం క్రమం తప్పకుండా ఆసుపత్రికి వస్తాడు, వచ్చిన ప్రతిసారి మహీంద్రా థార్ వీడియోలు చూడటం పట్ల, ఆ కారు గురించి మాట్లాడటం పట్ల ఎక్కువ ఆసక్తి కనపరిచేవాడు. అక్కడి వైద్యులతో తానూ పెద్దవాడైన తరువాత మహీంద్రా థార్ కొనుగోలు చేస్తానని చెప్పేవాడు. దీంతో ఆ చిన్నారి కోరికను నెరవేర్చారు. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా స్వయంగా తన ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేశారు. నిజానికి ఈ వీడియోను అపోలో హాస్పిటల్స్ లక్నో షేర్ చేసింది. హాస్పిటల్ అధికారులు కార్తీక్‌కు సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. దీని కోసం లక్నో సమీపంలోని డీలర్‌షిప్‌ను సందర్శించి అక్కడి సిబ్బందికి విషయాన్ని పూర్తిగా వివరించింది. డీలర్షిప్ కూడా వారికి సహాయం సంతోషించారు. కార్తీక్ తరువాత కీమో సెషన్ షెడ్యూల్ సమయానికి అతనిని పికప్ చేయడానికి మహీంద్రా థార్ అతని ఇంటికి వచ్చింది. అప్పటికే కారు క్యాబిన్ బెలూన్లతో నిండిపోయి ఉంది. ఇది చూసి కార్తిక్ ఎంతగానో సంతోషించాడు. నిజంగా హాస్పిటల్ సిబ్బంది తీసుకున్న చొరవ చాలా అభినందనీయం. ఇదీ చదవండి: ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబం.. ఒక షిప్ విలువే వేల కోట్లు! తమ కుమారుడిని సంతోషపెట్టేందుకు ఆసుపత్రి అధికారులు చేసిన ప్రయత్నాలకు తల్లిదండ్రులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఆనంద్ మహీంద్రా ఈ వీడియో షేర్ చేస్తూ 'నాకు మాటలు రావడం లేదు, కళ్ళల్లో కన్నీళ్లు మాత్రమే ఉన్నాయంటూ' వెల్లడించాడు. మమ్మల్ని ఈ మంచి పనిలో భాగస్వామ్యం చేసినందుకు హాస్పిటల్ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలిపాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తూ అభిఞ్ఞాదిస్తున్నారు. I’m speechless. Just tears in my eyes. Thank you @drsangitareddy Thank you Apollo Hospitals for an initiative with such humanity & for making us a part of it. और कार्तिक, मैं आपका सबसे बड़ा Fan हूं ! pic.twitter.com/d0Z1LETB9a — anand mahindra (@anandmahindra) September 23, 2023 -
అత్యంత అరుదైన వ్యాధి..మెడిసిన్ ఖర్చే ఏకంగా రూ. 17 కోట్లు!
అత్యంత అరుదైన వ్యాధులు చాలానే ఉన్నాయి. అందులో మనకు తెలిసినవి చాలా తక్కువ. కొన్నింటికి చికిత్స లేకపోగ, మరికొన్నిటికి చికిత్సకు అయ్యే ఖర్చు చూస్తే అసలు సామాన్యుడు కాదు కదా ధనవంతుడైన ఖర్చుపెట్టలేనంతగా ఖరీదుగా ఉంటుంది. ఇక మరొకొన్నిటికి అసలు చికిత్స అనేది ఉండదు. అలాంటి అత్యంత ఖరీదైన వైద్యంతో కూడిన అరుదైన వ్యాధి బారిన పడ్డాడు ఓ చిన్నారి. అతడికోసం ముఖ్యమంత్రి కదిలివచ్చి పరామర్శించడమే గాక అత్యంత ఖరీదైన మెడిసిన్‌ను అందజేశారు. వివరాల్లోకెళ్తే..ఢిల్లీలో అత్యంత అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రోఫీ(ఎస్ఎంఏ) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు ఏడాదిన్నర చిన్నారి. అతడి పరిస్థితిని చూసి చలించిన ముఖ్యంమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆ చిన్నారిని పరామర్శించి చికిత్సలేని ఆ వ్యాధికి ఇచ్చే అత్యంత ఖరీదైన మందును ఆయనే స్వయంగా అందజేశారు. ఆ డ్రగ్ ఖరీదు ఏకంగా రూ. 17.5 కోట్లు. అని చెప్పారు. ఇంతకీ అసలు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అంటే ఏంటీ? ఎందువల్ల వస్తుందంటే.. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అంటే వెన్నెముక కండరాల క్షీణత(ఎస్ఎంఏ). దీని వల్ల వెన్నుపాములోని మోటారు న్యూరాన్లను కోల్పోతుంది. దీంతో కండరాల బలహీనత, క్షీణతకు దారితీస్తుంది. దీన్ని జన్యు నాడీ కండరాల రుగ్మత అని కూడా పిలుస్తారు. ఈ మేరకు ఫోర్టిస్ హాస్పిటల్ షాలిమార్ బాగ్ న్యూరాలజీకి చెందిన అసోసియేట్ కన్సల్టెంట్ డాక్టర్ సౌరభ్ నంద్వానీ మాట్లాడుతూ..భారతదేశంలో ఎస్ఎంఏ అనేది చాలా అరుదు. ఇది వస్తే మాత్రం గణనీయమైన ప్రభావం ఉంటుంది. ప్రతి ఏడు వేల మంది జననాలలో మూడు వేలమంది శిశువులు దీని భారిన పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీని కారణంగా పక్షవాతం వచ్చి క్రమంగా ఆరోగ్యం క్షీణిచడం తోపాటు మిగతా అవయవాలపై దీని ప్రభావం కూడా ఉంటుందని తెలిపారు. చికిత్స: దీనికి పూర్తి నివారణ లేదు. వెన్నుముక కండరాల క్షీణత కారణమైన జన్యవులను ప్రభావితం చేసేలా చికిత్స అందించడం ద్వారా ఈ సమస్యను అధిగమించడం వంటివి మాత్రమే చేయగలం అని తెలిపారు. దీని కోసం జోల్జెన్స్మా అనే జన్యు పునఃస్థాపన చికిత్స తోపాటు న్యూసినెర్సెన్ (స్పిన్రాజా), రిస్డిప్లామ్ (ఎవిర్స్డ్) అనే రెండు మందులను తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే బాధిత కుటుంబాల జన్యు క్రమాన్ని అధ్యయనం చేసి తత్ఫలితంగా చికిత్స అందించేలా వైద్య విధానాలు మెరుగుపడాల్సి ఉందని చెప్పారు. (చదవండి: మతిమరుపు అనేది వ్యాధా! ఇది వస్తే అంతేనా పరిస్థితి!!) -
బొమ్మ కాదురా నాయనా.. పామును చేతిలో పట్టుకుని..
-
ఓ తండ్రి దుశ్చర్య.. పొరపాటున తన కూతుర్ని ఢీ కొట్టాడని ఆ బుడ్డోడిని..
పిల్లలకు మంచి ఏదో.. చెడు ఏదో చెప్పాల్సిన తండ్రే ప్రతికార వాంఛ తీర్చుకునేందుకు యత్నించాడు. చిన్నారులు ఆకతాయితనంతో.. తెలిసో తెలియక చేసే అల్లరి పనులను గుర్తించి సరిచేయడమో లేక మంచిగా చెప్పి వినేలా చేయడమో చేయకపోగా అతడే చిన్న పిల్లాడి మాదిరి ప్రవర్తించాడు. హుందాగా ఆ చిన్నారికి తాను చేసిని పని గురించి వివరించి చెప్పడం మాని అమానుషంగా ప్రవర్తించి కెమెరాకు చిక్కాడు. ఈ అనూహ్య ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..చైనాలో గుయ్గాంగ్లోనో ఓ ప్లే గ్రౌండ్లో పిల్లలు పేరెంట్స్ సమక్షంలో ఆడుకుంటూ ఉన్నారు. ఐతే ఓ చిన్నారి ఓ తండ్రి కూతుళ్లు నుంచొన్న వైపుకి వచ్చి అనుకోకుండా అతడి కూతుర్ని ఢీ కొట్టాడు. దీంతో ఆ తండ్రి కోపంతో ఆ చిన్నారి వంక చూసి అడ్డుకోవడమే గాక దాడి చేశాడు. అభం శుభం తెలియని చిన్నారి అని కూడా లేకుండా అమానుషంగా కొట్టడం వంటివి చేశాడు. ఆఖరికి ఏదో వస్తువుని గాల్లోకి లేపినట్లుగా ఆ చిన్నారిని లేపి నేలపైకి విసిరేశాడు. సరిగ్గా ఆ సమయానికి ఆ చిన్నారి తల్లి వచ్చి అతడితో వాగ్వాదానికి దిగింది. ఎందుకు ఇలా చేశావంటూ అతన్ని నిలదీసింది. ఆ తర్వాత తన పిల్లాడిని అక్కడ నుంచి తీసుకెళ్లిపోయింది. అందుకు సంబంధించిన వీడియోని న్యూయార్క్ పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Dad violently knocks around a stranger’s kid at a playground 😳 pic.twitter.com/wBhBwJkMWj — Daily Loud (@DailyLoud) May 20, 2023 (చదవండి: నిద్రిస్తుండగా వేటకొచ్చిన చిరుత..ఆ వీధి కుక్క అతడిని బతికిచ్చింది) -
‘పిల్లలు కావాలి సార్.. నా భర్తకి పెరోల్ ఇవ్వండి’
భోపాల్: సెంట్రల్‌జైలు అధికారులకు ఓ మహిళ చేసిన అరుదైన అభ్యర్థన ప్రస్తుతం వార్తల్లోకెక్కింది. తనకు సంతానం కావాలని, అందుకు జైలులో ఉన్న తన భర్తను పెరోల్‌పై విడుదల చేయాలని ఆమె జైలు అధికారులకు దరఖాస్తు చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శివపురికి చెందిన ఓ మహిళ దారా సింగ్ జాదవ్ అనే వ్యక్తిని కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే జాదవ్ హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల దారా సింగ్ జాదవ్ తండ్రి కరీం సింగ్ జాదవ్ అనారోగ్యానికి గురయ్యారు. చనిపోయేలోపు మనవడిని, మనవరాలిని చూడాలనుకున్నాడు. దీంతో ఆ మహిళ తన భర్తను పెరోల్‌పై విడుదల చేయాలని జైలు అధికారులకు దరఖాస్తు చేసింది. ఈ విషయంపై గ్వాలియర్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ విదిత్ సిరివియా మాట్లాడుతూ.. జీవిత ఖైదు శిక్ష పడ్డ ఖైదీలు వారి రెండేళ్లు శిక్షాకాలంలో మంచిగా ప్రవర్తిస్తే పెరోల్ పొందే అవకాశముందని చెప్పారు. అయితే ఈ పెరోల్ మంజూరు నిర్ణయం జిల్లా కలెక్టర్ చేతుల్లోనే ఉందని అధికారలు చెబుతున్నారు. గతంలోనూ రాజస్థాన్‌లోని జోధ్‌పుర్ న్యాయస్థానం.. ఇటువంటి కేసులో ఓ ఖైదీకి 15 రోజుల పెరోల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: ఎంతకు తెగించారు.. అద్దెకు ఇల్లు తీసుకుని ఇంటినే డ్రగ్స్ ఫ్యాక్టరీగా మార్చారు! -
ఏం టైమింగ్ రా?.. 60 మందిని కాపాడాడు
Viral Video: పిల్లలను నేర్పాల్సింది విద్యాబుద్ధులు మాత్రమే కాదు.. సంఘంలో ఎలా మెలగాలన్నది కూడా!. సోషల్ మీడియాలో ఎరాలో పిల్లల్ని తప్పుదోవ పట్టించే రీతిలోనే ఉంటోంది చాలామంది తల్లిదండ్రుల పెంపకం. టెక్నాలజీ అవసరమే.. కానీ అది ఏ తరహాలో ఉండాలన్నది పిల్లలకు అలవాటు చేయాల్సింది పేరెంట్స్. ఇదంతా ఎందుకంటే.. తాజాగా ఏడో గ్రేడ్ చదివే ఓ చిన్నారి చేసిన పని.. ఏకంగా 60 మందికి పైగా ప్రాణాల్ని నిలబెట్టింది కాబట్టి. మిచిగాన్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది. డ్రైవర్ కళ్లు తిరిగి పడితే.. ఓ విద్యార్థి సకాలంలో స్పందించాడు. డ్రైవర్ సీటులోకి దూకి.. ఎమర్జెన్సీ స్టాపర్ సాయంతో బస్సును ఆపేశాడు. ఆ ఘటన బస్సులోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. సాహసంగా ముందుకు దూకిన స్టూడెంట్ను దిల్లాన్ రీవ్స్గా గుర్తించిన అధికారులు అభినందించారు. బస్సును ఆపడమే కాదు.. ఎమర్జెన్సీ నెంబర్‌కు డయల్ చేయాలంటూ కేకలు వేశాడు ఆ స్టూడెంట్. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. -
పేదింటి చిన్నోడికి.. పెద్ద కష్టం
నిర్మల్‌రూరల్: ఆడుతూ పాడుతూ తిరిగే చిన్నారి అనారోగ్యానికి గురి కావడంతో నిరుపేద కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. మండలంలోని తల్వేద గ్రామానికి చెందిన వైశాలి, రవి దంపతుల కుమారుడు రాహుల్ (9 నెలలు) రక్తప్రసరణ వ్యవస్థలో ఇబ్బంది తలెత్తింది. వైద్యానికి రూ.లక్షలు కావడంతో ఆ పేద కుటుంబం ఒక్కగానొక్క బిడ్డను కాపాడుకునేందుకు అల్లాడుతోంది. వైశాలి, రవి దంపతులకు మూడేళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్ల తర్వాత రాహుల్ జన్మించాడు. ఏడు నెలల వయసులో జ్వరం రావడంతో జిల్లా కేంద్రంతో పాటు నిజామాబాద్‌లో వైద్యులకు చూపించారు. ఎంతకీ నయం కాకపోవడంతో హైదరాబాదులోని ఓ ప్రైవేటు పిల్లల ఆసుపత్రిని సంప్రదించారు. అయితే అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం రాహుల్‌కు రక్తప్రసరణ వ్యవస్థలో లోపం ఉందని, తప్పనిసరిగా ఆపరేషన్ చేయాలని సూచించారు. ఆపరేషన్ ఖర్చు సుమారుగా రూ.3.50 లక్షలు అవుతుందని వైద్యులు తెలిపారు. ఆ నిరుపేద తల్లిదండ్రులు ఆపరేషన్‌కు డబ్బులు లేక తల్లడిల్లుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో తమను ఆదుకోవాలని, దాతల తమ కుమారుడిని కాపాడాలని వేడుకుంటున్నారు. సంప్రదించాల్సిన నం. 9676034110 -
ఈ బుడ్డోడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
-
5 ఏళ్ల పాప... ఆడుకుంటుంది అనుకున్న తల్లికి ఊహించని షాకిచ్చింది!
ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మధ్య కాలంలో చిన్నారులు ఆట బొమ్మలకంటే స్మార్ట్ఫోన్లతోనే కాలంక్షేపం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు బొమ్మలతో ఆడుకున్నట్లే ఫోన్లతో ఆడుకుంటున్నారని లైట్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత జరిగే పరిణామాలను చూసి కంగుతింటున్నారు. తాజాగా ఓ ఐదేళ్ల చిన్నారి తన తల్లికి ఊహించని షాకిచ్చింది. ఈ ఘటన అమెరికాలో వెలుగు చూసింది. మసాచుసెట్స్‌కి చెందిన జెస్సికా నూన్స్ అనే మహిళ కారులో వెళ్తుండగా తన ఐదేళ్ల కూతురు లీల గోల చేస్తూ ఉంది. దీంతో పాపకి తన ఫోన్ ఇవ్వడంతో సైలెంట్ అయ్యింది. అయితే ఫోన్లో గేమ్స్, లేదా వీడియోలు చూస్తూ ఉందేమో అని జెసికా అనుకుంది. అయితే లీలా మాత్రం అమెజాన్ యాప్ ఓపెన్ అందులో 3,180 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.2.46 లక్షల) బొమ్మలను ఆర్డర్ చేసింది. లీలా ఆర్డర్ చేసిన బొమ్మలలో.. 10 మోటార్‌సైకిళ్ల బొమ్మలు, ఒక జీప్ బొమ్మ, 10 జతల ఉమెన్స్ కౌగర్ల్ బూట్లు ఉన్నాయి. బైక్‌లు, జీప్ ఆర్డర్లు కలిపి 3,180 డాలర్లు ఉండగా... అందులో బూట్లే సుమారు 600 డాలర్లు ఉన్నాయి. మోటార్‌సైకిళ్లు, బూట్ల ఆర్డర్లలో సగం క్యాన్సిల్ చేసినప్పటికీ, అప్పటికే డెలివరీ చేసిన ఐదు మోటార్‌సైకిళ్లు, ఒక పిల్లల జీప్‌ను ఆమె ఆపలేకపోయింది. వీడియో గేమ్‌లు లేదా షాపింగ్ యాప్‌ల కోసం పిల్లల తల్లిదండ్రులకు తెలియకుండా ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం ఇదే మొదటిసారి కాదు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. -
అడవిలో తప్పిపోయిన బాలుడ్ని కాపాడిన ఫారెస్ట్ అధికారులు
-
చిట్టడివి..చీకటి.. ఓ చిన్నారి కథ
పోరుమామిళ్ల: ఏడేళ్ల బాలుడు ఇంటికి బయలుదేరాడు. ఊరు దారి విడిచి అడవి దారి పట్టాడు. చిట్టడవిలో చిక్కుకుపోయాడు. చీకట్లో బిక్కుబిక్కుమంటూ తెల్లార్లు గడిపాడు. బిడ్డ కోసం తల్లిదండ్రులు, గ్రామస్తులు రాత్రంతా అడవిలో వెతుకులాడినా ఫలితం లేదు. తెల్లవారిన తర్వాత తప్పిపోయిన పశువుల కోసం వెతుకుతున్న వారి కంట పడ్డాడు. సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరాడు. 14 గంటల గ్రామస్తుల ఉత్కంఠకు తెరదించాడు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల మండలంలో కవలకుంట్ల పంచాయతీలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం... కవలకుంట్ల పంచాయతీ బుచ్చంపల్లెకు చెందిన మతకాల వెంకటసుబ్బయ్య, సీతామహాలక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు సుమంత్(7) ఒకటవ తరగతి చదువుతున్నాడు. వెంకటసుబ్బయ్య గేదెలు మేపుకుంటూ, సీతామహాలక్ష్మి కూలిపనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం బడి నుంచి వచ్చిన సుమంత్ తల్లి కట్టెపుల్లలకు వెళుతుంటే తనూ వెళ్లాడు. సమీపంలో అడవికి దగ్గరలో తండ్రి గేదెలు మేపుతుండగా అమ్మతో చెప్పి నాన్న దగ్గరకు వెళ్లాడు. చీకటి పడుతుందని, నీవు ఈ దారిలో ఇంటికి వెళ్లు అని వెంకటసుబ్బయ్య కొడుక్కు చెప్పి..తాను చెట్లు, పొదల్లో మేస్తున్న గొడ్లను తోలుకొస్తానని దారి చూపించి వెళ్లాడు. బుడ్డోడు సరేనని నాన్న చూపించిన దారిలో బయలుదేరాడు. పొరపాటున కొండదారి పట్టాడు. అలా నాలుగైదు కిలోమీటర్లు వెళ్లేసరికి బాగా చీకటిపడింది. కనుచూపు మేరలో ఊరు కనిపించలేదు. కేకలు వేసినా పలికే దిక్కు లేదు. బిక్కు బిక్కు మంటూ అలాగే ఓ పొద దగ్గర కూలబడిపోయాడు. చీకటి పడ్డా బిడ్డ ఇంటికి చేరకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. కనపడిన వారందరినీ అడిగారు. ఆచూకీ లభించలేదు. విషయం ఊరంతా పాకిపోయింది. ఓ యాభై మంది పిల్లాడిని వెతికేందుకు అడవికి బయలుదేరారు. పోలీసులు, ఫారెస్టు సిబ్బందికి సమాచారం అందడంతో వారూ వెతకడానికి వెళ్లారు. తెల్లారేంతవరకు పిల్లాడి ఆచూకీ దొరకలేదు. పశువుల కోసం వెతుకుతుండగా... ఈ నేపథ్యంలో బుధవారం పొద్దుపొడవక ముందే కవలకుంట్లకు చెందిన ఏసయ్య, శాంతయ్యలు తప్పిపోయిన తమ గొడ్లను వెతికేందుకు అడవి దారి పట్టారు. అలా వారు వెళుతుండగా ఆరు గంటల ప్రాంతంలో పొద దగ్గర బాలుడి ఏడుపు విని అటు వెళ్లడంతో సుమంత్ కనిపించాడు. విచారిస్తే విషయం అర్థమయింది. బాలుడిని ఎత్తుకొని తల్లిదండ్రులకు అప్పగించేందుకు ఊరి దారి పట్టారు. దారిలో ఉండగానే ఫారెస్టు సిబ్బంది, గ్రామస్తులు ఎదురయ్యారు. సుమంత్‌ను చూసి ఫారెస్టు సిబ్బంది వాళ్లకు కృతజ్ఞతలు చెప్పి పిల్లాడిని తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. 14 గంటలు ఎంతో టెన్షన్ పెట్టినా చివరాఖరుకు కథ సుఖాంతమయింది. -
మా అమ్మను అరెస్టు చేయండి.. స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసిన బుడ్డోడు
భోపాల్: మూడేళ్ల బుడ్డోడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పిర్యాదు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారింది. ఆ బుడతడు మాటలు చూసి అక్కడున్న పోలీసులు పగడలబడి నవ్వారు. కానీ మనోడు చెప్పిన ప్రతి అక్షరాన్ని కంప్లెయింట్‌గా తీసుకున్నారు. ఇంతకీ ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. నాన్నను వెంటపెట్టుకుని మరీ ఈ చిన్నారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది తన సొంతతల్లిపై ఫిర్యాదు చేయడానికే. వాళ్ల అమ్మ అసలు చాక్లెట్లు తిననిన్వడం లేదట. వాటిని దొంగిలించి తనకు దొరక్కుండా దాచి పెడుతోందట. అంతేకాదు క్యాండీలు కావాలని అడిగినప్పుడల్లా కొడుతుందట. బుడ్డోడు ఎంతో క్యూట్‌గా ఈ విషయాలు చెప్పడం అక్కడున్న వారిని నవ్వులు పూయించింది. మహిళా పోలీస్ కూడా అతడు చెప్పిన ప్రతి అక్షరాన్ని ఫిర్యాదులో రాసింది. చిన్నారికి కాటుక పెట్టే సమయంలో అతడు చాక్లేట్లు తింటూ అటూ ఇటూ కదిలాడని, దీంతో వాళ్లమ్మకు కోపమొచ్చి చెంపపై మెల్లగా కొట్టిందని తండ్రి చెప్పాడు. వెంటనే తనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లమని మారాం చేశాడని వివరించాడు. దీంతో తప్పక తన కూమరుడ్ని స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు చెప్పాడు. ఇంత చిన్న వయసులో పిల్లాడు స్టేషన్‌కు వెళ్లి సొంతతల్లిపైన ఫిర్యాదు చేసిన అతని అమాయకత్వాన్ని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. మధ్యప్రదేశ్ బర్హాన్‌పూర్ జిల్లా డేడ్తలాయి గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో మీరూ చూసేయండి.. मध्यप्रदेश के बुरहानपुर में तीन साल का बच्चा मम्मी की शिकायत लेकर पुलिस थाने पहुंच गया। उसने पुलिस से कहा कि मम्मी मेरी कैंडी और चॉकलेट चुरा लेतीं हैं। उनको जेल में डाल दो। बच्चे की मासूमियत देखकर सभी की हंसी छूट गई।#MadhyaPradesh #Video pic.twitter.com/iGdHVOZEF6 — Hindustan (@Live_Hindustan) October 17, 2022 చదవండి: గంగూలీ వ్యవహారంపై మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి.. ‘ఇది నిజంగా షాక్’ -
డాడీ.. మంచి ఒక ముచ్చట జెప్పవే!
బహుశా.. ఆ పోరడు సంబురంగా ఇంటికి చేరే ఉంటడు. మధ్యల ఆగి షాపుల కొత్త బట్టలు కొనుక్కునే ఉంటడు. ముక్కవాసనొచ్చే దుప్పట్లు, ఇడిసిన బట్టలు ఉతికించుకుని కూడా ఉంటడు. అట్లే.. అమ్మ చేసిన గారెలు, కారప్పుస తింటూ.. సరదాగా దోస్తులతో ఆడుకుంట.. బాంబులు పేల్చుకుంట.. డాడీ చేతిల తన్నులు వడుకుంట ఉండాలనే కోరుకుందం. ఎందుకంటే ఆ పోరడు అవ్వయ్యలను అంతగా ఒర్రిచ్చిండు కావట్టి. పండుగలొస్తే సొంత ఊళ్లకు బయలుదేరే జోష్‌లో మునిగిపోతుంటారు అంతా. కానీ, హాస్టల్ స్టూడెంట్స్‌కు మాత్రం అవి భావోద్వేగాలతో నిండిన క్షణాలనే చెప్పొచ్చు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడు వస్తారా? అనే ఎదురుచూపులు వర్ణణాతీతం. అలాంటి పిలగాడి ఆడియో క్లిప్ ఒకటి ‘హాస్టల్ తిప్పలు’ పేరుతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ‘‘డాడీ.. నాకు మనసొప్పుతదలేదే..’’ అంటూ మొదలుపెట్టిన ఆ చిన్నారి.. తన తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి గత రెండు మూడు రోజులుగా విపరీతంగా వైరల్ అవుతోంది. వాట్సాప్ మొదలు.. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఎక్కడ చూసినా ఈ క్లిప్ సందడి చేస్తోంది. ‘‘డాడీ.. ఒక మంచి ముచ్చట చెప్పవే.. అన్నీ సర్దుకుని రెడీగా ఉండమంటూ’’ తల్లిదండ్రులు చెప్పాల్సిన మాటలను కూడా తనే చెప్పి.. వాళ్లకు విసుగు తెప్పించాడు ఆ చిన్నారి. అంతేకాదు ఆ తండ్రితో పాటు తల్లి కూడా అతన్ని సముదాయించేందుకు చెప్పిన మాటలు, పదే పదే ఫలానా డేట్‌కు కన్ఫర్మ్ వస్తరు కదా అని అడగడం, గిదే లాస్ట్ అంటూ చివర్లో ఆ చిన్నారి పలికిన పలుకులు నవ్వులు పూయిస్తున్నాయి. అయితే.. అదే సమయంలో ఊపిరి తీయకుండా ఆ చిన్నారి మాట్లాడిన మాటలు, అతనిలోని బాధ-ఆందోళన.. అన్నింటికి మించి సున్నితత్వాన్ని ప్రతిబింబించాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు. హాస్టల్లో ఉంటేనే.. అలాంటి కష్టాలు తెలుస్తాయని కామెంట్లు చేస్తున్నారు. దసరా సెలవులంటే.. బహుశా ఇది ఈ మధ్య సంభాషణ అయి ఉండొచ్చు. ఆడియో క్లిప్ ఉద్దేశం ఏదైనా.. వైరల్ మాత్రం విపరీతంగా అయ్యింది. మరి.. అనుకున్నట్లు ఆ తల్లిదండ్రులు ఆ పిలగాడి దగ్గరకు వెళ్లారా? ఇంటికి తీసుకువెళ్లారా? అనే ఆత్రుతతో ప్రశ్నించే వాళ్లే కామెంట్ బాక్స్‌లో ఎక్కువైపోయారు. మొత్తానికి ఆ ఫ్యామిలీ ఎవరో.. ఎక్కడుంటారో!. Video Credits: pranks telugu -
పుట్టినరోజునాడే విషాదం.. స్కూల్ బస్సులో చిన్నారి నిద్ర.. సిబ్బంది నిర్లక్ష్యంతో..
ఓ చిన్నారి పుట్టిన రోజునే మరణించిన ఘటన కంటతడి పెట్టిస్తోంది. బాలిక మరణానికి కారణమైన స్కూల్‌ను మూసి వేయాలంటూ దేశ ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేసింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు..కేరళకు చెందిన మిన్సా మరియమ్ జాకబ్ (4) ఖతార్‌లోని అల్ వక్రా ప్రాంతంలోని స్ప్రింగ్ఫీల్డ్ కిండర్ గార్టెన్ స్కూల్లో నర్సరీ చదువుతుంది. ఈక్రమంలో మిన్సా పుట్టిన రోజు కావడంతో... స్కూల్లో తోటి చిన్నారుల సమక్షంలోనే జరుపుకోవాలని అనుకుంది. ఎప్పటిలాగానే ఆ రోజుకూడా స్కూల్ బస్‌లో బయలు దేరింది. అయితే, మార్గం మధ్యలో మిన్సా బస్సులో నిద్ర పోయింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బస్సు సిబ్బంది..చిన్నారి లోపల ఉన్నది గమనించలేదు. ఆమె దిగి వెళ్లిపోయిందని అనుకున్నారు. బస్సును పార్కింగ్ చేసి వెళ్లిపోయారు. తిరిగి మధ్యాహ్నం డ్రైవర్ బస్సు డోర్లు ఓపెన్ చేసి చూడగా చిన్నారి అపస్మారక స్థితిలో ఉంది. దీంతో అత్యవసర చికిత్స కోసం ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ, మిన్సా ప్రాణాల్ని కాపాడలేకపోయారు. తీవ్రమైన ఎండలకు ఊపిరాడక చిన్నారి బస్సులో మృతి చెందినట్లు పోలీసుల జరిపిన ప్రాథమిక విచారణలో తేలింది. పుట్టినరోజునాడే తమ బిడ్డకు నూరేళ్లు నిండాయంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. The Ministry of Education and Higher Education decided to close the private kindergarten which witnessed the tragic accident that shook the community with the death of one of the female students, — وزارة التربية والتعليم والتعليم العالي (@Qatar_Edu) September 13, 2022 ఈ సంఘటన తర్వాత, అల్ వక్రాలోని స్ప్రింగ్ఫీల్డ్ కిండర్ గార్టెన్ను మూసివేయాలని ఖతార్ దేశ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక చిన్నారి మరణానికి కారణమైన ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. -
చెర్రీ స్వరూప్ ..ఈ బుడతడి సౌండే వేరు!
ప్లేస్ ఏదైనా ఆ బుడ్డోడు స్టిక్ పట్టాడంటే బీట్ అదిరిపోవాల్సిందే.. బేస్ కాస్త పెంచి బాదాడంటే బాక్సులు బద్దలైపోవాల్సిందే.. ఆ సౌండ్‌కి ఎవరైనా ముగ్దులైపోవాల్సిందే. విజయవాడ పాతబస్తీకి చెందిన ముత్యాల చెర్రీ స్వరూప్ రేంజ్ అది మరి. మూడేళ్లకే స్టేజ్ షోలు ప్రారంభించి, వీక్షకుల చేత ఔరా అనిపించుకున్నాడు. మేటి సంగీత కళాకారులతో మన్ననలు అందుకుని అనేక అవార్డులు, సత్కారాలు పొందుకున్నాడు. విజయవాడ కల్చరల్: సంగీతం ఒక మహా సముద్రం.. సాధనే అందులో ప్రావీణ్యత వచ్చేలా చేస్తుంది.. సరైన శిక్షణ ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేస్తుంది. ఇక తండ్రే మంచి శిక్షకుడైతే ఇక తిరుగుండదు. విజయవాడ పాతబస్తీకి చెందిన ముత్యాల చెర్రీ స్వరూప్ ఇదో కోవలోకి వస్తాడు. తండ్రి ప్రోద్బలంతో మూడేళ్లప్పుడే స్టిక్స్ చేతబట్టిన ఈ బుడతడు.. డ్రమ్స్ వాయించడంలో విశేష ప్రతిభ చూపిస్తున్నాడు. వెస్ట్రన్ ఐనా, జానపదమైనా, శాస్త్రీయమైనా బీట్ ఏదైనా తనకు కొట్టిన పిండి అని నిరూపిస్తున్నాడు. ఇలా దేశంలోని వివిధ ప్రాంతాలలో ఇప్పటికే వందకుపైగా ప్రదర్శనలతో అదరగొట్టేశాడు. ప్రస్థానం సాగిందిలా.. చెర్రీ చిన్నతనంలో తండ్రి ముత్యాల పరమేష్‌తో పాటు డ్రమ్స్ వాయించే కార్యక్రమంలో పాల్గొనేవాడు. తండ్రి వాయించే శబ్దాలకు అనుగుణంగా కాళ్లు చేతులు, లయబద్ధంగా కదిలించేవాడు. కుమారుడిలోని తాళ జ్ఞానాన్ని గుర్తించిన పరమేష్ శిక్షణ ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే తండ్రిని మించిన శిష్యుడయ్యాడు. పట్టణం, నగరం అన్న తేడా లేకుండా దేశంలోని అనేక చోట్ల స్టేజ్ షోలు ఇచ్చాడు. అతిరథ మహారథుల మధ్య అనేక సార్లు తన ప్రతిభను ప్రదర్శించాడు. అభినందనల మందార మాల.. చెర్రీలోని ప్రతిభను గుర్తించి అంతర్జాతీయ డ్రమ్స్ ప్లేయర్ శివమణి, వందేమాతరం శ్రీనివాస్, సినీ సంగీత దర్శకుడు కోటి, దేవిశ్రీ ప్రసాద్‌లు పలు సందర్భాల్లో పొగడ్తలతో ముంచెత్తారు. సినీ గేయ రచయత, సిరివెన్నెల సీతారామశాస్త్రి, సినీ నటుడు చిరంజీవి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, శైవపీఠాధిపతి శివస్వామి తోపాటు పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. అవార్డులు ఇవి.. చెర్రీలోని ప్రతిభను గుర్తించిన పలు సంస్థలు బాలరత్న, బాల ప్రతిభ, వండర్ కిడ్ పురస్కారాలతో సత్కరించాయి. -
ప్రపంచంలోనే అత్యంత బాల కుబేరుడు ఎవరో తెలుసా?
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న పిల్లాడు ఆషామాషీ బుడ్డోడేమీ కాదు, ఇతగాడు బాలకుబేరుడు. పట్టుమని పదేళ్ల వయసైనా లేదు గాని, వయసుకు మించినన్ని లగ్జరీ కార్లు, రాజప్రాసాదాన్ని తలపించే భవంతి, ఒక ప్రైవేటు విమానం ఇతడి సొంతం. ఈ నైజరీయన్ బాలకుబేరుడి పేరు మహమ్మద్ అవల్ ముస్తఫా. నైజీరియాలో ఇతడు ‘మోంఫా జూనియర్’గా ఫేమస్. ఈ బాలకుబేరుడి కథా కమామిషూ ఏమిటంటే, ఇతడి తండ్రి ఇస్మాయిలా ముస్తఫా నైజీరియాలో ఇంటర్నెట్ సెలిబ్రిటీ. ‘మోంఫా’ పేరుతో బాగా ఫేమస్. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఇతగాడి ఫాలోవర్ల సంఖ్య 12 లక్షల మందికి పైమాటే! ‘మోంఫా’ ప్రధాన ఆదాయ వనరు ఇంటర్నెట్ అయితే, దీనితో వచ్చిన ఆదాయంతో వేర్వేరు వ్యాపారాలూ సాగిస్తూ ఇబ్బడిముబ్బడిగా డబ్బు గడిస్తున్నాడు. తన కొడుకు ‘మోంఫా జూనియర్’కు మూడేళ్ల కిందట– 2019లో అతడి ఆరో పుట్టినరోజు సందర్భంగా లాగోస్ నగరంలో రాజప్రాసాదాన్ని తలపించే ప్యాలెస్‌ను కానుకగా ఇచ్చాడు. ‘మోంఫా జూనియర్’ కూడా ఇప్పుడు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో బాగా ఫేమస్ అయ్యాడు. బ్రాండెడ్ దుస్తులతో, లగ్జరీ కార్లతో పోజులిస్తూ ఫొటోలు పెడుతుండటంతో ఈ బాలకుబేరుడికి ఫాలోవర్లు బాగానే పెరుగుతున్నారు. ఇదిలా ఉంటే, బాలకుబేరుడి తండ్రి సీనియర్ ‘మోంఫా’ మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటుండటం గమనార్హం. -
Viral Video: ఈ పిల్లాడి ‘హోమ్ వర్క్ ఫ్రస్ట్రేషన్’ మామూలుగా లేదుగా..!
న్యూఢిల్లీ: స్కూల్ నుంచి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత తన స్నేహితులతో కలిసి ఆడుకోవాలని భావిస్తారు పిల్లలు. కానీ, ఇంటికి రాగానే హోమ్‌వర్క్ చేయమంటే నిరాశకు లోనవుతారు. అయిష్టంగానే పుస్తకాలు తెరుస్తారు. కొందరైతే.. కోపంతో నేను చేయను పో అని తెగేసి చెప్తారు. ఆ కోవకే చెందుతాడు ఈ పిల్లాడు. హోమ్ వర్క్ చేయమన్న తన తల్లిపైనే అసహనం వ్యక్తం చేశాడు. ఆ బుజ్జాయి మాటలు వింటే మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియోలో.. హిందీ నోట్‌బుక్‌ను తెరిచిన పిల్లాడు తన తల్లికి ఎదురు సమాధానమిస్తున్నాడు. హోమ్‌వర్క్ చేయలేక తాను ఈ లోకం నుంచి వెళ్లాలనుకుంటున్నాని షాక్ ఇచ్చాడు. ‘మమ్మీ నేను పరేషాన్ అవుతున్న. అసుల ఈ దినియాలోకి ఎందుకు వచ్చాను. నేను ఈ లోకం నుంచి వెళ్లిపోతాను, వెళ్లిపోతాను.’ అంటూ తన పెన్సిల్‌ను పదే పదే పుస్తకంపై బాదుతూ చెప్పాడు. ఎందుకు వెళ్లాలనుకుంటున్నావని అతడి తల్లి అడగగా.. నాకు ఈ ప్రపంచంలో ఉండాలని లేదు, నువ్ అందంగా లేవు అని సమాధానమిచ్చాడు. దానికి ఆమె పడిపడి నవ్వసాగింది. ఆ వీడియోను ఎమోబోయిస్ఇండియా అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. హోమ్ వర్క్ చేయమంటే ఏం జరుగుతుందో చూడండి అంటూ రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Emo Bois of India (@emoboisofindia) ఇదీ చదవండి: Viral Video: అవమానపడ్డ టూరిస్ట్...టచ్ చేయకూడనవి టచ్ చేస్తే ఇలానే ఉంటుంది! -
టీచర్ దండన.. విలవిలలాడిన చిన్నారి
దండిస్తే.. పిల్లలు క్రమశిక్షణ తప్పరు, సరిగా చదువుతారనేది ఒకప్పడు ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. అయితే పిల్లల్ని దండించడంలో మాత్రం చాలాదూరం వెళ్లాడు ఇక్కడో టీచర్. అతను పెట్టిన హింసతో ఆస్పత్రి పాలయ్యాడు ఓ విద్యార్థి. ఐదేళ్ల పిలగాడిని ఓ టీచర్ దారుణాతిదారుణంగా హింసించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముందుగా ఓ కర్రతో పిల్లాడిని బాదిన టీచర్.. అది విరిగిపోయినా ఊరుకోకుండా రెచ్చిపోయాడు. చెంపదెబ్బలు కొడుతూ.. జుట్టు లాగేస్తూ పిడిగుద్దులతో స్టూడెంట్‌పై విరుచుకుపడ్డాడు. తనని వదలమని ఆ పిలగాడు రోదిస్తూ ఎంత బతిమాలినా వినిపించుకోలేదు. కిందపడిపోయిన ఆ స్టూడెంట్ను.. కనికరం లేకుండా హింసించాడు ఆ టీచర్. ఇదంతా మిగతా పిల్లలు భయంభయంగానే చూస్తూ ఉండిపోయారు. స్పృహ తప్పిపోయిన ఆ పిల్లాడిని.. ఆస్పత్రిలో చేర్పించారు. విషయం తెలిసిన స్థానికులు కోచింగ్ సెంటర్‌పై పడి టీచర్ చోటూను చితకబాదేశారు. చిన్నతప్పిదానికే అలా హింసించాడని తోటి స్టూడెంట్స్ చెప్తుండగా.. బీపీ వల్లే ఆ టీచర్ అలా దాడి చేశాడంటూ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు సమర్థించడం కొసమెరుపు. బీహార్ రాజధాని పాట్నాలోని Dhanarua బ్లాక్‌లో.. జయ కోటించ్ క్లాసెస్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనను వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సహనంగా పాఠాలు చెప్పాల్సిన వృత్తిలో అతనికి అర్హత లేదంటూ మండిపడుతున్నారు. ఘటనపై ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. టీచర్‌పై చర్యలు తీసుకునేంత వరకు పిల్లల్ని కోచింగ్ సెంటర్‌కు పంపమని తల్లిదండ్రులు చెప్తున్నారు. 'शिक्षक' नहीं… ये 'हानिकारक' है! वीडियो देखकर सहम उठेंगे. ये पिटाई नहीं...ऐसा लग रहा है कि ये जान लेने के लिए उतारू है.शख्स धनरूआ में एक कोचिंग चलाता है. आरोप है कि बच्चे ने एक लड़की के साथ गलत हरकत की थी.पुलिस कोचिंग संचालक की तलाश कर रही है. वीडियो- जहानाबाद से रंजीत राजन. pic.twitter.com/KPBLMYxEau — Prakash Kumar (@kumarprakash4u) July 3, 2022 -
చిన్నారిని చిదిమేసిన నిర్లక్ష్యం
సనత్‌నగర్: ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడాది వయస్సున్న బాలికను కారు ఢీ కొనటంతో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడి మృతిచెందింది. సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జింకలవాడలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ తెలిపిన మేరకు.. ప్రైవేట్ ఉద్యోగం చేసుకునే అఖిల్ జింకలవాడ బస్తీలో గత కొన్నేళ్లుగా నివాసముంటున్నాడు. అతని కుమార్తె మోక్షిత (14 నెలలు) ఆదివారం మధ్యాహ్నం ఇంటిముందు ఆడుకుంటోంది. ఇదే సమయంలో అటుగా వచ్చిన కారు అఖిల్ ఇంటి ముందు ఆగింది. డ్రైవింగ్ సీటులో ఉన్న యువకుడితో పాటు కొంతమంది యువకులు అక్కడ దిగిన తరువాత మహ్మద్ రసూల్ అనే వ్యక్తి డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కారు నడుపుకుంటూ వెళ్తున్నాడు. కారు ముందున్న పాపను గమనించకుండా నిర్లక్ష్యంగా కారును నడిపి చిన్నారిని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడ్డి చిన్నారిని తల్లిదండ్రులు నీలోఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. చిన్నారి మృతికి కారణమైన రసూల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా గాయపడ్డ చిన్నారికి తల్లిదండ్రులు సపర్యలు చేస్తుంటే కారుతో ఢీకొట్టిన మహ్మద్‌రసూల్ నిలబడి చూస్తుండడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. (చదవండి: అరెస్ట్ భయంతో ఆత్మహత్యాయత్నం)