చిన్నారి గుండెకు భరోసా
విజయవాడ(లబ్బీపేట) :
గుండె వ్యాధులతో బాధపడుతున్న 19 మంది చిన్నారులకు ఉచిత శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు ఆంధ్రా హాస్పిటల్ ఎండీ డాక్టర్ పీవీ రమణమూర్తి తెలిపారు. ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇంగ్లాండుకు చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్, యూకే చారిటీలు చిన్నారులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. నగరంలోని ఆం్ర«ధా హాస్పిటల్స్‌తో కలిసి ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు శిబిరం నిర్వహించినట్లు చెప్పారు. గత ఏడాది డిసెంబరు నుంచి ఇప్పటి వరకూ మూడు శిబిరాలు నిర్వహించి 52 మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వ సాయం కోరనున్నట్లు వివరించారు. యూకే నుంచి వచ్చిన పిడియాట్రిక్ ఇంటర్‌వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ కుడముల మాట్లాడుతూ తాము నిర్వహించిన శస్త్ర చికిత్సలన్నీ అత్యంత క్లిష్టతరమైనవేనన్నారు. కొంత మందికి గుండెలో రం్ర«థాలు, ఊపిరితిత్తుల రక్తనాళాల్లో వత్తిడి ఎక్కువుగా ఉండటం, మూడు లేక నాలుగు రకాల గుండె సమస్యలు ఉన్న చిన్నారులకు విజయవంతంగా గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు. డాక్టర్ ప్రేమ్ మాట్లాడుతూ ఇండియాకు వచ్చి చిన్నారులకు శస్త్ర చికిత్సలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సమావేశంలో ఆంధ్రా హాస్పిటల్స్ పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పీవీ రామారావు, యూకే వైద్య బృందంలోని సభ్యులు డాక్టర్ నయన్‌సెట్టి, డాక్టర్ సైనుల్లా, మెరిజోనా, జూలి, రేచల్ ఉన్నారు.