
20 యేళ్లుగా కరాటేలో శిక్షణ ఇస్తున్న మాస్టర్ రమేష్
ఇప్పటి వరకూ దాదాపు లక్ష మందికి శిక్షణ
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఉచిత కోచింగ్
వరంగల్ జిల్లా స్టేషన్ ఘణపురం ఇప్పాయిగూడేనికి చెందిన బొంతూరి రమేష్ కుటుంబసభ్యులు 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం భాగ్యనగరానికి వలస వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. రమేష్ గోల్కొండలో 9వ తరగతి చదువుతున్నప్పుడే కరాటేపై ఆసక్తి పెంచుకున్నాడు. పదో తరగతి పాసైనా ఆర్థిక పరిస్థితి సహకరించక మధ్యలోనే చదువు ఆపేశాడు. బ్రూస్‌లీ సినిమాలు చూసి 12వ యేట నుంచే కరాటే నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.
తల్లిదండ్రులు, గ్రాండ్ మాస్టర్ ఆర్‌కే కృష్ణ ప్రోత్సాహంతో కరాటేలో బ్లాక్‌బెల్ట్ సాధించాడు. అనంతరం కిక్‌బాక్సింగ్ నేర్చుకుని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు గెలుచుకున్నాడు. ప్రస్తుతం మాస్టర్ రమేష్ జవహర్‌గర్ పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులు, కానిస్టేబుళ్లకు మార్షల్ ఆర్ట్స్ నేర్పుతున్నాడు. ఇప్పటి వరకూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో రన్‌వీర్ తైక్వాండో అకాడమీ ద్వారా దాదాపు లక్ష మంది విద్యార్థులకు కరాటే శిక్షణ ఇచ్చినట్లు రమేష్ తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా కరాటే విద్యనందించి బీపీ, షుగర్, మానసిక వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక యోగా శిక్షణ అందిస్తున్నాడు. ఇప్పటికే పలువురు విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు అందుకునేలా కృషి చేస్తున్నాడు. వేసవికాలంలో మరింత మంది విద్యార్థులకు కరాటే విద్యను అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు.
మార్షల్ ఆర్ట్స్‌లో ప్రతిభ..
2011 బెంగళూరులో నేషనల్ గోల్డ్ మెడల్
2016లో అక్షయ్‌కుమార్ ఇంటర్‌నేషనల్ గోల్డ్‌మెడల్
వివిధ జిల్లాల్లో రాష్ట్ర స్థాయి పోటీల్లో దాదాపు
220 గోల్డ్, సిల్వర్ మెడల్స్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రతిభ.. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రతిభ