heart surgery
-
తెలంగాణకు మణిహారం.. తెలుగు ప్రజలకు సంజీవని
సాక్షి, సిద్దిపేట: మరణం అంచుకి వెళ్లిన చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేసి పునర్జన్మనిస్తూ, తెలంగాణ రాష్ట్రానికి మణిహారంగా, తెలుగు ప్రజలకు సంజీవనిలా సత్యసాయి ఆస్పత్రి సేవలందిస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాకలో శ్రీసత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్‌కేర్, రీసెర్చ్‌లో తొలిసారి గుండె ఆపరేషన్లు జరగ్గా.. శనివారం హరీశ్‌రావు సందర్శించిన అనంతరం మాట్లాడారు. దేశంలో 5వ ఆస్పత్రిని సిద్దిపేటలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం చేయని పనిని సత్యసాయి ట్రస్ట్, మధుసూదన్ సాయి చేస్తున్నారని కొనియాడారు. గుండె ఆపరేషన్ల కోసం రూ.3 నుంచి రూ.5 లక్షలు ఖర్చు పెట్టలేక ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని, ఉచితంగా సర్జరీలు చేయడం అభినందనీయం అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో 5.77 లక్షల మందికి ఓపీ, 33,600 మంది చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు చేశారన్నారు. ఆరు రోజుల్లో 18 మంది చిన్నారులకు సర్జరీలు పూర్తి చేసి వారికి పునర్జన్మ ప్రసాదించడం గొప్ప విషయం అని కొనియాడారు. మధుసూదన్ సాయి కళాశాల వార్షికోత్సవం సందర్భంగా కార్యక్రమానికి వచి్చనప్పుడు ఇక్కడ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని 2022లో కోరానని, దీంతో స్పందించి 2023లో ఓపీ ప్రారంభించారని తెలిపారు. మంత్రి, ఎమ్మెల్యే పదవుల్లో అనుభూతి కంటే గుండె ఆపరేషన్ అయిన తర్వాత పిల్లల్లో సంతోషం చూసి తన జన్మ ధన్యమైందన్నారు.శ్రీసత్యసాయి ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ మొదట కొండపాకలో యంగ్ అడోల్సెంట్ కార్యక్రమం నిర్వహించాలనుకున్నా.. హరీశ్‌రావు చొరవతో ఇక్కడ గుండె శస్త్రచికిత్సల ఆస్పత్రిని ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక్కఫొటోతో బాడీ ప్రొఫైల్ వచ్చే విధంగా హెచ్డీ స్టెత్‌తో గుండె పనితీరు తెలుసుకునే అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రమణాచారి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి పాల్గొన్నారు. ఆరు నెలల కిందట తెలిసింది నా బిడ్డ పేరు రక్ష. వయసు పదేళ్లు. ఆర్నెల్ల కిందట నిలోఫర్‌లో డాక్టర్లు పరిశీలించి గుండెలో హోల్ ఉందని చెప్పారు. బయట ఆస్పత్రుల్లో రూ.5 లక్షలు అవుతాయన్నారు. అయితే సిద్దిపేటలో ఫ్రీగా గుండె ఆపరేషన్లు చేస్తారని నిలోఫర్ డాక్టర్లు చెప్పారు. దీంతో అక్కడ ఆపరేషన్ చేయించాం. ఈ డాక్టర్లకు, ట్రస్ట్‌కు మేము రుణపడి ఉంటాం. నా బిడ్డ కూడా డాక్టర్ అయి ఇలా ఉచితంగా సేవలందిస్తుంది. ఏమిచ్చినా రుణం తీర్చుకోలేంమాది మెదక్ జిల్లా చిన్నశంకరంపే ట. మెకానిక్ గా పని చేస్తా. నా బిడ్డ వయసు ఆరేళ్లు. దగ్గు, జలుబు, వాంతులు అయ్యా యి. అప్పుడు వెంటనే లోకల్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాం. వారు చూసి గుండె స్పీడ్ గా కొ ట్టుకుంటోంది అని చెప్పారు. దీంతో నిమ్స్, నిలోఫర్ ఆ స్పత్రులు తిరిగాం. ఇక్కడ ఫ్రీగా చేస్తారని తెలిసింది వెంటనే వచ్చాం. నా బిడ్డకు పునర్జన్మనిచి్చన డాక్టర్లు, ట్రస్ట్ వారికి ఏమిచి్చనా రుణం తీర్చుకోలేం. -
చెదురుతున్న గుండెకు అండగా...!
గుండె తన పూర్తి సామర్థ్యాన్ని కనబరచకుండా అది విఫలమయ్యే కండిషన్‌ను ‘హార్ట్ ఫెయిల్యూర్’గా చెబుతారు. హార్ట్ ఫెయిల్యూర్‌తో బాధపడేవారు... తాము కొద్దిగా నడవగానే వారికి ఊపిరి సరిగా అందకపోవడం, తీవ్రంగా ఆయాసం రావడం వంటి సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. హార్ట్‌ఫెయిల్యూర్ బాధితులు ఈ కింద సూచించిన జీవనశైలి మార్పులు చేసుకోవడం చాలా మంచిది. ద్రవాహారానికి దూరంగా ఉండటం: హార్ట్ ఫెయిల్యూర్ బాధితుల్లో ఒంట్లోకి నీరు చేరుతుంటే వాళ్లు ద్రవాహారం తీసుకోవడం తగ్గించాలి. ఒంట్లోకి నీరు చేరనివాళ్లు మాత్రం రోజు లీటరున్నర వరకు ద్రవాహారాలు తీసుకోవచ్చు. ఉప్పు బాగా తగ్గించడం : ఒంట్లో నీరు చేరడం, ఆయాస పడటం, ఊపిరి అందక΄ోవడం వంటి లక్షణాలు కనబడితే ఉప్పు వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. రోజుకు 2.5 గ్రాములు (అరచెంచా) కంటే తక్కువే తీసుకోవాలి. వీళ్లు తినే వంటల్లో ఉప్పు వేయకపోవడం మేలు. పచ్చళ్లు, బేకరీ ఐటమ్స్, బయటి చిరుతిండ్లను పూర్తిగా మానేయాలి. డ్రైఫ్రూట్స్, పండ్లు, పాలు : బాదాం, జీడిపప్పు, ఆక్రోటు వంట్ నట్స్, పాలు, పండ్ల వంటివి తీసుకోవచ్చు. వీటిల్లో ఆరోగ్యానికి చేటు చేసే లవణాలు తక్కువ. విశ్రాంతి : హార్ట్ ఫెయిల్యూర్‌తో బాధపడేవారు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని చాలామందిలో ఓ అపోహ. అయితే ఇది సరికాదు. వైఫల్యం తీవ్రంగా ఉంటే తప్ప... శరీరం సహకరించినంత మేరకు, ఆయాసం రానంత వరకు శరీరాన్ని మరీ కష్టపెట్టకుండా శ్రమ చేయవచ్చు. తేలికపాటి నడక, మెట్లు ఎక్కడం వంటి వ్యాయామాలూ చేయవచ్చు. మానసికంగా ప్రశాంతంగా ఉండటం: హార్ట్ ఫెయిల్యూర్‌తో బాధపడేవారు తమ సమస్య కారణంగా చాలా మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశాలెక్కువ. ఒక్కోసారి తీవ్రమైన భావోద్వేగాలకూ లోనుకావచ్చు. వారు ఒత్తిళ్లకు దూరంగా ఉంటూ మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఇందుకు యోగా, ధ్యానం వంటివి చేయడం మంచిది. ఈ మందులు వద్దు : హార్ట్ఫెయిల్యూర్తో బాధపడేవారు కొన్ని మందులకు... ముఖ్యంగా నొప్పి నివారణ కోసం వాడే... ఇబూప్రొఫేన్, డైక్లోఫెనాక్ వంటి ఎన్ఎస్ఏఐడీ రకం మందులకు దూరంగా ఉండాలి. స్టెరాయిడ్స్ కూడా వాడకూడదు. ఇవి ఒంట్లోకి నీరు చేరేందుకు దోహదం చేస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.నాటు మందుల్లో ఏ పదార్థాలు ఉంటాయో, అవి గుండె మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియదు. కాబట్టి వాటికి దూరంగా ఉండటం మేలు. ఇంకా చెప్పాలంటే కార్డియాలజిస్ట్‌కు చెప్పకుండా ఎలాంటి మందులూ వాడకపోడమే మంచిది. ఇక నొప్పులు మరీ భరించలేనంతగా ఉన్నప్పుడు అవి తగ్గేందుకు డాక్టర్‌ను ఒకసారి సంప్రదించి పారాసిటమాల్ వంటి సురక్షిత మందుల్ని వాడుకోవచ్చు. ∙వైద్యపరమైన జాగ్రత్తలు బాధితులు తమ గుండె వైఫల్యానికి వాడుతున్న మందులతోనూ అప్పుడప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. అందుకే ఎప్పటికప్పుడు డాక్టర్ ఫాలో అప్‌లో ఉంటూ, అవసరాన్ని బట్టి వాటి మోతాదుల్లో మార్పులు చేసుకోవడం లేదా మందులను మార్చడం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అందుకే తరచూ గుండెవైద్య నిపుణులను సంప్రదిస్తూ, వారు చెప్పే సూచనలు, జాగ్రత్తలు అనుసరించాలి. (చదవండి: మై లిటిల్ మార్ఫీ..! చిన్నారులు హాయిగా నిద్రపోయేలా..!) -
Heart stent surgery: స్టెంటేశాక రెస్టెంత? బెస్టెంత?
ఇటీవలగుండె జబ్బుల తర్వాత చాలామందికి స్టెంట్ వేయడం, ఇక కొందరిలోనైతే బైపాస్ అని పిలిచే సీఏబీజీ సర్జరీ చేయాల్సి రావడం మామూలే. గుండెకు నిర్వహించే ఇలాంటి ప్రోసిజర్ తర్వాత, ఆ బాధితుల్ని ఎప్పట్నుంచి నార్మల్‌గా పరిగణించ వచ్చు, లేదా ఎప్నట్నుంచి వారు తమ రోజువారీ పనులు చేసుకోవచ్చు అన్న విషయాలు తెలుసుకుందాం...నిజానికి ఓ ప్రోసిజర్ తర్వాత నార్మల్ కావడం అన్నది వారివారి శరీర ధర్మం, ఫిట్నెస్, గాయం పూర్తిగా తగ్గేందుకు పట్టే సమయం... ఇలా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కానీ సగటు కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే... తమ ఫిట్నెస్, తమ పనులు ఇక తాము చేసుకోగలమనే ఆత్మవిశ్వాసాన్ని బట్టి ఈ సమయం కాస్త అటు ఇటుగా ఉంటుందని తెలుసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా సర్జరీ జరిగినప్పుడు వీలైనంత తర్వాత సాధారణ స్థితికి రావాలని బాధితులందరికీ ఉంటుంది. అంతేకాదు... గాయమంతా పూర్తిగా మానేవరకు అందరూ విశ్రాంతి తీసుకుంటూ ఉండరు. అంతకంటే చాలా ముందుగానే... అంటే 80 శాతం తగ్గేనాటికే తమతమ మామూలు పనులు మొదలుపెట్టేస్తుంటారు. బాధితులు తమ ్రపోసీజర్ అయిన ఆరు వారాల తర్వాత నుంచి నిరభ్యంతరంగా పనులు మొదలు పెట్టవచ్చు. అయితే అప్పటికి తగ్గింది కేవలం 80శాతం మాత్రమే కావడం వల్ల కొన్ని బరువైన పనులు చేయడం మాత్రం అంత మంచిది కాకపోవచ్చు.డిశ్చార్జీ అయిన ఆరువారాల తర్వాతి నుంచి... చేయదగిన పనులు : 🔸తేలికపాటి నడక / (వాకింగ్) బట్టలు ఉతకడం (మెషిన్ ఉపయోగించి మాత్రమే) 🔸శ్రమలేనంతవరకు అంట్లు తోముకోవడం / పాత్రలు శుభ్రం చేసుకోవడం 🔸శ్రమలేనంతవరకు వంట చేసుకోవడం 🔸శ్రమ లేనంతవరకు / తేలికపాటి శారీరక శ్రమతో ఇల్లు శుభ్రం చేసుకోవడం ▶️శ్రమ లేనంతవరకు మెట్లు ఎక్కడం (ఈ ప్రక్రియలో శ్రమగా అనిపించినా / ఆయాసం వచ్చినా మళ్లీ ఈ పని చేయకూడదు. ఆమాటకొస్తే... శ్రమ అనిపించిన లేదా ఆయాసంగా అనిపించిన ఏ పనినైనా బలవంతంగా చేయకూడదని గుర్తుంచుకోవాలి).చేయకూడని పనులు : 🔸బరువైనవి ఎత్తడం (ప్రధానంగా 5 కిలోలకు మించినవేవీ ఎత్తడం సరికాదు) 🔸బరువైన వాటిని అటు ఇటు లాగడం లేదా తోయడం 🔸వాహనం నడపడం.ఎనిమిది వారాల తర్వాత :🔸మనకు జరిగిన ప్రోసిజర్‌లో... శస్త్రచికిత్సలో భాగంగా ఎదుర్రొమ్ము ఎముకకు గాటు పెట్టి విడదీసి ఉంటే... అది ఆరు నుంచి ఎనిమిది వారాల నాటికి 80 శాతం తగ్గుతుంది. ఆరు / ఎనిమిది వారాలు దాటాక వాహనాన్ని నడపడం (డ్రైవింగ్) మొదలుపెట్టవచ్చు. మనం చేసే పని భౌతికమైన శ్రమతో కూడుకున్నది కాకపోతే మన వృత్తులకు / కార్యాలయానికి వెళ్లవచ్చు. ఆరు వారాలు దాటాక మళ్లీ యథాతథ స్థితిలోకి వచ్చేందుకు అవసరమైన కార్యకలాపాలు చేయడానికి (కార్డియాక్ రీహ్యాబిలిటీషన్కు) ఇది అనువైన సమయమని తెలుసుకోవాలి. ఈ సమయంలో గుండెపై ఒత్తిడి పడకుండానే... దాని పనితీరు / సామర్థ్యం (ఎండ్యూరెన్స్) పెంచుకునే వ్యాయామాలు మొదలుపెట్టాలి. అలా తేలిగ్గా మొదలుపెట్టి శ్రమతెలియనంత వరకు ఆ వ్యాయామాల తీవ్రతను పెంచుకుంటూ పోవచ్చు. శ్రమ అనిపించగానే మళ్లీ తగ్గిస్తూ... అలా క్రమంగా మీ యథాపూర్వక స్థితిలోకి వెళ్లడం మంచిది. ఇది చేస్తున్న క్రమంలో మనకు ఏ శ్రమ తెలియకపోతే... మనం అన్ని పనులూ ఎప్పుడెప్పుడు చేయవచ్చో మనకే క్రమంగా అర్థమవుతూ ఉంటుంది.పది, పన్నెండు వారాల తర్వాత అది శస్త్రచికిత్సా / మరో ప్రక్రియా... అది ఏదైనప్పటికీ... పది, పన్నెండు వారాలు గడిచాక... అంతకు మునుపు చేసిన పనులన్నీ ఎలాంటి శ్రమ లేకుండా చేయగలుగుతుంటే... ఆపై ఇక నిర్భయంగా... తేలికపాటి పరుగు (జాగింగ్), టెన్నిస్‌లాంటి ఇతరత్రా ఆటలు ఆడుకోవచ్చు. (అయితే ఆడే సమయంలో శ్రమ ఫీల్ అవ్వకుండా తేలిగ్గా చేయగలిగితేనే ఆ పనులు కొనసాగించాలి). రోజూ 30 నిమిషాల చొప్పున కనీసం వారంలో ఐదు రోజులు వ్యాయామాలు చేయాలి. దాని గుండెకు తగినంత బలం చేకూరి... దీర్ఘకాలంలో మేలు జరుగుతుంది.మానడానికి టైమ్ ఇవ్వండి : ఏదైనా గాయం మానడానికి పట్టే సమయం... ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. అందుకే ఏ కొద్దిపాటి శ్రమ అనిపించినా మళ్లీ తేలికపనులకు వచ్చేసి మళ్లీ శ్రమ కలిగించే పనులవైపునకు మెల్లగా క్రమక్రమంగా వెళ్తుండాలి. బాధితులకు డయాబెటిస్ లేదా ఇతరత్రా ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే గాయం మానడం మరింత ఆలస్యమవుతుంది. అందుకే ఆరువారాల సమయాన్ని ఒక సాధారణ ్రపామాణిక సమయంగా మాత్రమే పరిగణించాలి. ఎవరిలోనైనా ఏదైనా గాయం పూర్తిగా అంటే 100 శాతం మానడానికి కనీసం ఏడాది సమయం తీసుకుంటుందని గుర్తుంచుకోవాలి. అందుకే ఏదైనా పనిని చేయడచ్చా లేదా అన్న విషయాన్ని ఎవరికి వారు తెలుసుకోడానికి ఉన్న ఒకే ఒక మార్గం... ‘ఆ పనిని తేలిగ్గానే చేయడానికి సాధ్యమవుతోందా, లేదా’ అనే విషయాన్ని చూసుకోవాలి. అలా ఏదైనా పని చేస్తునప్పుడు నొప్పి అనిపించినా, ఆయానం వచ్చినా లేదా గాయం వద్ద అసౌకర్యంగా ఉన్నా ఆ పనిని వెంటనే ఆపేయాలి.ఏదైనా పని సరికాదని గుర్తుపట్టడం ఎలా? ▶️అసాధారణమైన / తట్టుకోలేనంతగా నొప్పి వచ్చినప్పుడు ▶️ఏదైనా పనిచేస్తున్నప్పుడు ఎదుర్మొమ్ము వద్ద ‘కలుక్కు’మని అనిపించినా లేదా అలాంటి శబ్దం వచ్చినా ▶️ఏదైనా పనిచేస్తున్నప్పుడు ఎదుర్రొమ్ము గాయం ఎర్రబారినా లేదా ఆ గాయం నుంచి స్వల్పంగానైనా రక్తం / చీము లాంటి స్రావాలు వస్తున్నా ▶️దగ్గినప్పుడు ‘కలుక్కు’మన్నా ▶️సుదీర్ఘంగా శ్వాస తీసుకున్నప్పుడు ‘కలుక్కు’మన్నా. (ఇలా జరిగినప్పుడు ఎదుర్రొమ్ముకు వేసిన కుట్లు తెగాయేమోనని అనుమానించి, వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షింపజేసుకోవాలి). ఈ విషయాలన్నింటినీ ఎవరికి వారు గమనించుకుంటూ స్వీయ పరిశీలన ద్వారా రొటీన్ పనుల్లోకి క్రమక్రమంగా ప్రవేశించాలి. -
పేద కుటుంబానికి ఆదుకున్న హీరో.. సోషల్ మీడియాలో వైరల్!
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ పరిచయం అక్కర్లేని పేరు. అరుంధతిలో పశుపతి పాత్రలో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు. అంతేకాదు.. తెలుగులో అల్లు అర్జున్ చిత్రం జులాయిలో తన నటనతో ఆకట్టుకున్నారు. చాలా సినిమాల్లో విలన్ పాత్రల్లో మెప్పించారు. అయితే సోనూ సూద్ తెరపై మాత్రమే కాదు.. అభిమానుల గుండెల్లో రియల్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. కరోనా సమయంలో వేలమందికి అండగా నిలిచారు.తాజాగా మరో నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి గొప్ప మనసును చాటుకున్నారు. డెహ్రాడూన్‌కు చెందిన ఓ పేద కుటుంబంలోని మూడేళ్ల బాలుడికి వైద్య సాయమందించారు. అత్యవసరంగా గుండెకు సర్జరీ చేయాల్సి రావడంతో సోనూ సూద్ ఆదుకున్నారు. ఆ బాలుడికి సర్జరీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయించారు. ఇది చూసిన నెటిజన్స్ సోనూ రియల్ హీరో అంటూ పోస్టులు పెడుతున్నారు. సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా.. సోనూ సూద్ ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్నారు. Appointment fixed with the doctor at 11.30 am today . Will be done ❤️✔️@SoodFoundation 🇮🇳 https://t.co/O1K88v0Pl1— sonu sood (@SonuSood) June 7, 2024 -
జూలియట్ మళ్లీ ఆడుకుంది!
న్యూఢిల్లీ: హుషారుగా గెంతుతూ చలాకీగా తిరుగుతూ తమ కుటుంబంలో భాగమైపోయిన ఏడేళ్ల శునకం గుండె జబ్బుతో బాధపడటం చూసి ఆ కుటుంబం అల్లాడిపోయింది. ఎలాగైనా అది మళ్లీ హుషారుగా తిరిగితే చాలు అని మనసులోనే మొక్కుకున్నారు. వారి బాధను అధునాతన చికిత్సవిధానంతో పోగొట్టారు ఢిల్లీలోని ఒక మూగజీవాల వైద్యుడు. రెండేళ్ల క్రితం అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఒక నూతన వైద్యవిధానంతో డాక్టర్ భానుదేవ్ శర్మ నేతృత్వంలోని వైద్యబృందం ఆ శునకానికి కొత్త జీవితం ప్రసాదించింది. ఏమిటీ సమస్య? ఏడేళ్ల బీగల్ జాతి శునకం జూలియట్ రెండేళ్లుగా మైట్రల్ వాల్వ్ సమస్యతో బాధపడుతోంది. గుండెలో ఎడమ ఎగువ కరి్ణక నుంచి జఠరికకు వెళ్లాల్సిన రక్తం తిరిగి కరి్ణకలోకి లీక్ అవుతోంది. దీంతో గుండె కొద్దికొద్దిగా కుంచించుకుపోయి, ఊపిరితిత్తుల్లో నీరు చేరి మృత్యువు ఒడికి చేరే ప్రమాదముంది. దీంతో విషయం తెల్సుకున్న ఢిల్లీలోని ఈస్ట్ కైలాశ్ ప్రాంతంలోని మ్యాక్స్ పెట్జ్ ఆస్పత్రిలోని డాక్టర్ భానుదేవ్ శర్మ నేతృత్వంలోని వైద్య బృందం ఆపరేషన్ చేసేందుకు ముందుకొచి్చంది. చిన్న జీవాలకు గుండె ఆపరేషన్లు చేయడంలో శర్మ నిష్ణాతునిగా పేరొందారు. ‘‘ అమెరికాలోని కొలర్యాడో స్టేట్ యూనివర్సిటీలో రెండేళ్ల క్రితమే ఈ కొత్త ఆపరేషన్ విధానం అమల్లోకి వచి్చంది. ట్రాన్స్క్యాథటర్ ఎడ్జ్ టు ఎడ్జ్ రిపేర్(టీఈఈఆర్) విధానంలో మే 30న జూలియట్‌కు గుండె ఆపరేషన్ చేశాం. ఓపెన్ హార్ట్ సర్జరీలాగా దీనికి పెద్ద కోత అక్కర్లేదు. చాలా చిన్న కోత సరిపోతుంది. గుండె ఊపిరితిత్తుల బైపాస్ మెషీన్‌తో పని ఉండదు. గుండె కొట్టుకుంటుండగానే ఆపరేషన్ చేసేయొచ్చు. ఛాతీ వద్ద అత్యల్ప రంధ్రం చేసి మెషీన్‌ను పంపి గుండె కవాటం ద్వారాన్ని సరిచేస్తాం’’ అని శర్మ వివరించారు. ఆపరేషన్ చేసి రెండు రోజులకే జూలియట్‌ను డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం అది ఆరోగ్యంగా ఆటుకుంటూ కుటుంబంలో మళ్లీ సంతోషాన్ని నింపింది. ఈ తరహాలో 80 శాతం మరణాలు భారత్‌సహా ప్రపంచవ్యాప్తంగా శునకాలు ఎదుర్కొంటున్న హృద్రోగ సమస్యల్లో ఈ తరహావే 80 శాతం ఉండటం గమనార్హం.శునకాల మరణాలకు ప్రధాన కారణాల్లో ఈ సమస్య కూడా ఒకటి. ఆసియా ఖండంలో శునకాలకు ఈ తరహా ఆపరేషన్ చేయడం ఇదే తొలిసారి అని ఆ వెటర్నరీ ఆస్పత్రి తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేసిన రెండో ప్రైవేట్ వైద్య బృందం వీళ్లదేనని ఆస్పత్రి పేర్కొంది. -
రెండేళ్లలో 2,030 గుండె శస్త్రచికిత్సలు
తిరుపతి తుడా/తిరుమల: టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో రెండేళ్ల కాల వ్యవధిలో రికార్డు స్థాయిలో 2,030 మందికి గుండె శస్త్ర చికిత్సలు చేశారని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. అలాగే ఎనిమిది మందికి గుండె మార్పిడి శస్త్రచికిత్సలు చేయగా, ఏడు విజయవంతమయ్యాయని సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డితో కలిసి ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో చిన్నపిల్లల కోసం ఆస్పత్రి ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2021లో ఈ ఆస్పత్రిని ప్రారంభించారని తెలిపారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి నేతృత్వంలో 15 మంది వైద్య బృందం శస్త్రచికిత్సల్లో 95 శాతం సక్సెస్ రేట్ సాధించడం అభినందనీయమన్నారు. ఇటీవల రాష్ట్రంలోనే ఉత్తమ ఆస్పత్రిగా అవార్డు అందుకోవడం అందుకు నిదర్శనమన్నారు. ఆరోగ్యశ్రీతో పాటు కేంద్ర ప్రభుత్వ హెల్త్ స్కీమ్ కింద ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో 350 పడకలతో సూపర్ స్పెషాలిటీ చిన్నపిల్లల ఆస్పత్రి నిర్మాణం పూర్తి కానుందని తెలిపారు. అనంతరం గుండె మార్పిడి చేసుకున్న గుంటూరుకు చెందిన సుమతి(31), కైకలూరుకు చెందిన కరుణాకర్(39)ను డిశ్చార్జి చేశారు. కాగా, అలిపిరి నడకమార్గం ప్రారంభంలో పాదాల మండపం వద్ద ఉన్న ఒక విశ్రాంతి మండపం కూలిపోయే స్థితిలో ఉందని, మరమ్మతులు చేయడానికి వీలు లేకపోవడం వల్ల పునర్నిర్మాణం తప్పనిసరి అని సాంకేతిక నిపుణులు నివేదిక సమర్పించారని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ మండపం నిర్మాణం విషయమై కొందరు వ్యక్తులు పురావస్తు శాఖ అనుమతి తీసుకుని నిర్మించాలని వ్యక్తీకరించారని చెప్పారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు లేఖ రాశామని, పురావస్తు శాఖ అనుమతి అవసరమా లేదా తెలియజేయాలని కోరామని తెలియజేశారు. -
ఇకపై ఓపెన్ హార్ట్ సర్జరీల అవసరం లేదు
సాక్షి, విశాఖపట్నం: గుండెకు నిబ్బరాన్నిచ్చే ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఇన్నాళ్లూ హృద్రోగులకు వారి పరిస్థితిని బట్టి స్టెంట్లు వేస్తున్నారు. అందుకు వీలుకాని పరిస్థితి ఉంటే ఓపెన్ హార్ట్ సర్జరీలు చేస్తున్నారు. ఈ సర్జరీకి 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది. పైగా వారం, 10 రోజులకు పైగా ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుంది. ఓపెన్ హార్ట్ సర్జరీలు రోగికి నొప్పితోపాటు వైద్యులకు ప్రయాసతో కూడుకున్న పని. ఈ నేపథ్యంలో తాజాగా పర్క్యూటనస్ వ్యాడ్స్ (వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైసెస్) వాల్వ్ రీప్లేస్మెంట్ విధానం అందుబాటులోకి వచ్చిందని అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ప్రఖ్యాత హృద్రోగ నిపుణుడు ప్రసాద్ చలసాని తెలిపారు. విశాఖపట్నంలో ఏఏఐపీ నిర్వహిస్తున్న గ్లోబల్ హెల్త్ సమ్మిట్‌కు వచ్చిన ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. గుండెపోటుకు గురైన వారికి ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా చిన్నపాటి సర్జరీ ద్వారా ఈ వాల్వులను రీప్లేస్ చేస్తారన్నారు. హృద్రోగికి ఈ వాల్వుల అమరిక కేవలం అర గంట నుంచి గంటలోపే వైద్యులు పూర్తి చేస్తారని చెప్పారు. ఈ శస్త్రచికిత్స జరిగిన 24 గంటల్లోపే రోగిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయవచ్చన్నారు. దీని సక్సెస్ రేటు 99.9 శాతం ఉందని తెలిపారు. అమెరికాలో పర్క్యూటనస్ వ్యాడ్ వాల్వుల వినియోగం జరుగుతోందని, భారత్‌లో ఇప్పుడిప్పుడే ఈ విధానం అందుబాటులోకి వస్తోందని చెప్పారు. ఇప్పటివరకు విశాఖ, హైదరాబాద్ వంటి నగరాల్లో అతి కొద్దిమందికి మాత్రమే వీటిని అమర్చారన్నారు. ఇందుకయ్యే ఖర్చు రూ.20 లక్షల వరకు ఉందని, అందువల్ల ప్రస్తుతానికి సామాన్యులకు భారమేనన్నారు. మున్ముందు ఖర్చు తగ్గే అవకాశముందని తెలిపారు. 35 ఏళ్లు దాటిన వారెవరైనా హైకొలె్రస్టాల్, మధుమేహం, రక్తపోటు, కాల్షియం, పరీక్షలను విధిగా చేయించుకోవాలని ఆయన సూచించారు. ఇదీ చదవండి: ‘సీఎం జగన్ మాటిచ్చారు.. నెరవేర్చారు’ -
ఇక ఉచితంగా బాలల గుండె శస్త్ర చికిత్సలు
కొండపాక(గజ్వేల్): ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు అందించేందుకు నెలకొల్పిన బాలల శస్త్ర చికిత్స పరిశోధనాస్పత్రి అపర సంజీవనిగా నిలుస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక శివారులోని ఆనంద నిలయం ఆవరణలో సత్యసాయి సేవాసంస్థ ఆధ్వర్యంలో గురువారం ఆస్పత్రిని సత్యసాయి ట్రస్టు నిర్వహణ ప్రతినిధి సద్గురు మధుసూదన్‌సాయితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వందమంది పిల్లల్లో ఒకరు గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలు వెచ్చించి ఆపరేషన్లు చేయించుకోవడం కంటే సత్యసాయి ఆస్పత్రిలో చికిత్స పొందేలా అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. రూ.50 కోట్లతో 100 పడకలు, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆస్పత్రి ఏర్పాటు కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. సత్యసాయి ట్రస్టు నిర్వహణ ప్రతినిధి సద్గురు మధుసూదన్‌సాయి మాట్లాడుతూ తెలంగాణలోని గ్రామీణ ప్రాంత పేద పిల్లలకు వైద్యాలయం ద్వారా గుండె శస్త్ర చికిత్సలను ఉచితంగా అందజేస్తామన్నారు. నవంబరు 23 రోజున సత్యసాయి బాబాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వైద్యాలయ సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ.రమణాచారి, ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, సిద్దిపేట జెడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు. -
గుండె శస్త్రచికిత్స కోసం ముంబైకి మంత్రి విశ్వరూప్
అమలాపురం టౌన్: కొద్ది రోజుల కిందట అస్వస్థతకు గురై, హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొంది, అక్కడి తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ గుండె శస్త్రచికిత్సకు శుక్రవారం ముంబై బయలుదేరి వెళ్లారు. ముంబైలోని ఏషియన్ హార్ట్ సెంటర్లో ఆయనకు సోమవారం గుండె శస్త్రచికిత్స చేస్తారని మంత్రి విశ్వరూప్ తనయుడు కృష్ణారెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి మంత్రి విశ్వరూప్ తన కుటుంబ సభ్యులతో కలిసి విమానంలో ముంబై వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం ముంబై ఏషియన్ హార్ట్ సెంటర్ ఆస్పత్రిలో ఆయన అడ్మిట్ అయినట్లు కృష్ణారెడ్డి చెప్పారు. -
స్టెంట్ వేశాక మళ్లీ పూడుకుపోతే..?
అన్ని అవయవాలకు అందినట్లే గుండెకు కూడా రక్తం నిరంతరం అందుతుండాలి. ఒక్కోసారి గుండెకు రక్తాన్ని చేరవేసే ధమనుల్లో పూడిక చేరినప్పుడు స్టెంట్లు వేసి, గుండె కండరానికి రక్తం నిరంతరాయంగా అందేలా చూస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇలా స్టెంట్లు వేసినప్పటికీ... అవి మళ్లీ పూడుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా జరిగినప్పుడు అందుకు కారణాలను కనుగొని, స్టెంట్లలో ఏర్పడ్డ పూడికలను తొలగించి, ఆ రక్తనాళాలు మళ్లీ పూడుకుపోకుండా చేసేందుకు అందుబాటులో ఉన్న చికిత్సల గురించి కథనమిది. గుండెకు రక్తాన్ని చేరవేసే ప్రధాన ధమనుల్లో ఎక్కడైనా పూడికలు ఏర్పడినప్పుడు... సాధారణంగా యాంజియోప్లాస్టీ అనే చికిత్స ప్రక్రియ ద్వారా స్టెంట్ వేసి, సన్నబడ్డ రక్తనాళాన్ని మళ్లీ విచ్చుకునేలా చేస్తారు. అయితే స్టెంట్ వేశాక... మళ్లీ ఆ రక్తనాళం పూడుకుపోకుండా డాక్టర్లు కొన్ని జాగ్రత్తలు సూచిస్తారు. ఉదాహరణకు మధుమేహాన్ని, అధికరక్తపోటును అదుపులో పెట్టుకోవడం, స్మోకింగ్, మద్యం అలవాట్లను పూర్తిగా మానేయడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం, మళ్లీ కొవ్వు పేరుకోడాన్ని నివారించేందుకుగాను కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే సమతులాహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు చెబుతారు. అయితే స్టెంట్ వేశాక కొంతమంది బాధితులు ఈ నియమాలన్నింటినీ పాటించరు. దాంతో... నియమాలు పాటించని వారిలో మళ్లీ పూడికలు వచ్చే అవకాశం ఉంటుంది. తీవ్రమైన లక్షణాలు హఠాత్తుగా ఛాతీలో నొప్పి చెమటలు పట్టడం వాంతులు దీర్ఘకాలికమై లక్షణాలు శ్వాసలో ఇబ్బంది ఛాతీలో అసౌకర్యం నడక, కదలికల సమయంలో ఆయాసం తమ కదలికలు కేవలం కొద్ది దూరాలకు మాత్రమే పరిమితమైపోవడం. నిర్ధారణ పరీక్షలు ఈసీజీ ఎకోకార్డియోగ్రామ్ కరొనరీ యాంజియోగ్రామ్ పూడికలు ఎక్కడ వస్తాయంటే...? ఒక్కోసారి ఇలా వేసిన స్టెంట్లోనే మళ్లీ పూడిక రావచ్చు. లేదా స్టెంట్‌కు పరిసర ప్రాంతాల్లో రెండోసారి పూడికలు రావచ్చు. స్టెంట్ వేశాక కూడా ఇలా రక్తనాళాలు తిరిగి మూసుకుపోవడానికి 3 నుంచి 5 శాతం వరకు అవకాశాలుంటాయి. ఇన్స్టెంట్ స్టెనోసిస్ అంటే... స్టెంట్ వేశాక ఏర్పడే పూడిక... స్టెంట్ లోపలగానీ లేదా దానికి 5 మిల్లీమీటర్ల పరిధిలోగానీ, స్టెంట్ అంచుల్లోగానీ ఏర్పడితే దాన్ని ఇన్స్టెంట్ స్టెనోసిస్ అంటారు. ఈ పూడికను కరొనరీ ఇమేజింగ్ పద్ధతుల ద్వారా దాన్ని కనిపెట్టాల్సి ఉంటుంది. కరొనరీ ఇమేజింగ్ అంటే ‘ఇంట్రావాస్క్యులార్ అల్ట్రాసౌండ్’ లేదా ‘ఆప్టికల కొహరెన్స్ టోమోగ్రఫీ’ అనే ఇమేజింగ్ ప్రక్రియలు. ఇలా స్టెంట్ లోపలగానీ లేదా చుట్టుపక్కల గానీ, అంచుల్లోగానీ పూడికలు మళ్లీ ఏర్పడటానికి కారణం... స్టెంట్ అవసరమైనంత మేరకు వ్యాకోచించకపోవడం అన్నమాట. ఇలా జరగడాన్ని ‘స్టెంట్ అండర్–ఎక్స్‌ప్యాన్షన్’ అంటారు. అలాగే స్టెంట్ ఫ్రాక్చర్‌కు గురికావచ్చు కూడా. స్టెంట్ పొడవు 30 మిల్లీమీటర్లకు మించినప్పుడు అది తిరిగి పూడుకుపోయే అవకాశాలు కొంతమేర ఎక్కువ. అలాగే ఒకటికి మించి... రెండు స్టెంట్లు వేసిన సందర్భాల్లోనూ ఒకదాని పైకి ఒకటి వచ్చేలా (ఓవర్‌ల్యాప్ చేస్తున్నట్లుగా) వేసిన సందర్భాల్లోనూ ఇలా మరోసారి పూడిక చేరేందుకు అవకాశాలు ఎక్కువ. అలాగే స్టెంట్ వేసినప్పుడు, అందులో ఎముకల తాలూకు అవశేషాలు పేరుకుని ఉన్నట్లయితే, స్టెంట్ అవసరమైన మేరకు వ్యాకోచించడానికి అది అడ్డంకిగా మారవచ్చు. అలాంటిప్పుడు దాన్ని సరిచేయకపోతే... ఆ తర్వాతి కాలంలో తిరగి పూడికలు ఏర్పడేందుకు అవకాశాలు ఎక్కువ. స్టెంట్ లోపల మరో స్టెంట్... ఈ ప్రక్రియను వైద్యులు చివరి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. సాధారణంగా స్టెంట్లోపల మరోస్టెంట్ వేయడం వల్ల రక్తనాళం మరింత ఇరుగ్గా మారిపోయే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా రక్తనాళం తిరిగి పూడుకుపోయే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి మిగతా ఏ విధానాలూ పనిచేయని సందర్భాల్లో మాత్రమే అరుదుగా ఇలా రీస్టెంటింగ్ ప్రక్రియను చివరగా ఉపయోగిస్తారు. డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్... స్టెంట్లలో రెండురకాలు ఉంటాయి. అవి... బేర్ మెటల్ స్టెంట్స్, డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్. ప్రస్తుతం బేర్ మెటల స్టెంట్లు అందుబాటులో లేవు. అయితే ఈ బేర్ మెటల్ స్టెంట్లు తిరిగి పూడుకుపోయేందుకు అవకాశాలు ఎక్కువ. వీటిలో కణజాలం పెరగకుండా నిరోధించడం అసాధ్యం. అందుకే బేర్ మెటల్ స్టెంట్లకు బదులుగా డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్లు వాడుకలోకి వచ్చాయి. ఈ స్టెంట్లలో ఉండే ఔషధ పదార్థం (డ్రగ్) మూడు నెలల నుంచి ఆరు నెలల పాటు విడుదలవుతూ... స్టెంట్లోపల కణజాలం పెరుగుదలను నియంత్రిస్తుంది. తద్వారా ఇది చాలాకాలంపాటు పూడుకుపోకుండా ఉంటుంది. ఇలాంటి డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్లు వేయించుకున్న రోగుల్లో, తిరిగి పూడికలు ఏర్పడే అవకాశాలు కేవలం 3 నుంచి 5 శాతం మేరకే ఉంటాయి. కానీ బేర్ మెటల్ స్టెంట్లు వేయించుకున్నవారిలో తిరిగి పూడికలు ఏర్పడే అవకాశాలు 30 శాతం వరకు ఉంటాయి. అందుకే ఇవి అంతగా ప్రాచుర్యం పొందలేదు. లేజర్‌తో పూడిక తొలగింపు.... స్టెంట్లో కణజాలం మళ్లీ పెరిగి. అవి మళ్లీ పూడుకుపోయే కండిషన్‌ను ‘టిష్యూ హైపర్‌ప్లేసియా’ అంటరు. ఇలాంటి కండిషన్‌ను లేజర్‌తో చక్కదిద్దవచ్చు. తొలత లేజర్లను ఉపయోగించి పూడికను తొలగించాక... ఆ తర్వాత డ్రగ్ పైపూతగా ఉన్న బెలూన్ల సహాయంతో స్టెంట్ లోపలి పొరల్లోకి ఔషధపదార్థాన్ని పంపుతారు. ఇందుకోసం ‘పాక్లిటాక్సెల లేదా ‘సిరోలిమస్’ అనే ఔషధాలను (డ్రగ్స్)ను వైద్యులు ఉపయోగిస్తారు. ఇన్స్టెంట్ స్టెనోసిస్‌కు చికిత్స ఇలా... కరొనరీ ఇమేజింగ్ ద్వారా స్టెంట్ తగినంతగా వ్యాకోచించలేదని గుర్తిస్తే... అప్పుడు ఆ స్టెంట్ తాలూకు అండర్–ఎక్స్‌ప్యాన్షన్ కండిషన్‌కు చికిత్స చేసి, సరిదిద్దాల్సి ఉంటుంది. అంతే తప్ప పాత స్టెంట్ స్థానంలో కొత్త స్టెంట్ ఏర్పటు చేయడం సరికాదు. కాబట్టి స్టెంట్ అండర్–ఎక్స్ప్యాన్షన్కు తగిన కారణాలను కనిపెట్టి, వాటిని సరిదిద్దాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో స్టెంట్ చుట్టూరా క్యాల్షియమ్ లేదా దృఢ కణజాలం పేరుకుపోయి స్టెంట్ తగినంతగా వ్యాకోచించడానికి అడ్డుపడవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ ఒత్తిడితో కూడిన బెలూన్ల సహాయంతో స్టెంట్‌ను తిగిరి వ్యాకోచించేలా చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో రొటాబ్లేషన్, కటింగ్ బెలూన్ల వంటి ప్రక్రియలతో స్టెంట్‌ను తగినంతగా వ్యాకోచించేలా చేయవచ్చు. -డాక్టర్ ఎ. శరత్‌రెడ్డి, సీనియర్ కార్డియాలజిస్ట్ -
గుండెఘోషకు ‘సూపర్’ వైద్యం
సాక్షి, అమరావతి: ముద్దులొలికే చిన్నారులు. ఆటపాటలతో బోసినవ్వులు చిందించే వయసు. కానీ, ఆ పసి గుండెల్లో పేరుకున్న విషాదంతో నిత్యం కన్నవారికి కన్నీరే.. ఆందోళనే. పైపెచ్చు పేదరికంతో ఎటూ పాలుపోని నిస్సహాయత. అయితే అమ్మవారి పాదాల సాక్షిగా తిరుపతిలో ప్రారంభమైన పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుపత్రి వీరికి నిజమైన పండగ తీసుకొచ్చింది. ఆరంభమైన 4 నెలల్లో ఏకంగా 128 మంది చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేసి.. ఆ కుటుంబాలకు జీవితానికి సరిపడేంత సంతోషాన్నిచ్చింది. ఏపీలోనే మొట్టమొదటిది.. నిజానికి రాష్ట్రంలో గుండె సంబంధిత రుగ్మతలతో బాధపడే పిల్లలకంటూ ప్రత్యేకించి పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుపత్రి వంటిదేమీ లేదు. ఇతర ఆసుపత్రుల్లోనే పిల్లలకూ కార్డియాక్ సేవలందిస్తున్నారు. దీంతో ఈ అవసరాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి... తిరుపతిని దీనికి వేదికగా చేసుకున్నారు. ఫలితంగా 70 పడకలతో తాత్కాలికంగా శ్రీ పద్మావతి పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుపత్రి ఏర్పాటు కావటం... గతేడాది ఆక్టోబరు 11న ముఖ్యమంత్రి ప్రారంభించటం సాధ్యమయ్యాయి. నిరుపేదలకు ఖరీదైన, సమర్థమైన వైద్యాన్ని అందించటమే లక్ష్యంగా ముందుకెళుతున్న సర్కారు సాయంతో ఈ 4 నెలల్లో ఆరోగ్య శ్రీ ద్వారా 128 మంది పిల్లలకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు చేయగలిగారు. తాత్కాలికంగా తిరుపతిలోని ‘బర్డ్’ ఆస్పత్రి పాత బ్లాక్‌లో పనిచేస్తున్న ఈ ఆస్పత్రికి టీటీడీ ఫెసిలిటేటర్‌గా వ్యవహరిస్తోంది. అత్యాధునిక పరికరాలతో పాటు 40 ఐసీయూ పడకలు... మూడు లామినార్ ఫ్లో ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. వ్యాధిగ్రస్త చిన్నారులు, వారి తల్లిదండ్రులు వేచి ఉండే ప్రాంతంతో పాటు ఔట్ పేషెంట్ బ్లాక్‌లో ఐదు కన్సల్టేషన్ సూట్లు ఏర్పాటు చేశారు. ఇంకా పది మంది రెగ్యులర్ స్పెషలిస్ట్‌లతో పాటు.. ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నుంచి విజిటింగ్ నిపుణులు ప్రతివారం ఇక్కడకొచ్చి వైద్య సేవలు అందిస్తున్నారు. ఏటా 10 వేల మంది చిన్నారులకు... రాష్ట్రంలో ఏటా సుమారు 10 వేల మంది వరకూ చిన్నారులు గుండె సంబంధిత సమస్యలతో పుట్టడమో, పుట్టిన కొద్ది నెలల్లోనే ఇలాంటి సమస్యలు ఎదుర్కోవటమో జరుగుతోంది. వీరిలో మూడొంతుల మంది పిల్లలది క్లిష్ట పరిస్థితి. సకాలంలో చికిత్స అందించకపోతే ప్రాణాంతకమే. మరోవైపు.. రాష్ట్ర విభజన తర్వాత పిల్లల ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు ఏపీలో ప్రత్యేకంగా ఆస్పత్రి అనేదే లేకుండా పోయింది. దీంతో ఈ తరహా చిన్నారులకు సరైన చికిత్స అందించాలన్న సీఎం ఆలోచనల్లోంచి పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుపత్రి పుట్టుకొచ్చింది. 350 పడకలతో మరో ‘సూపర్ స్పెషాలిటీ’ తాత్కాలిక ఆసుపత్రి అందిస్తున్న సేవలు మరింత విస్తృతపరచాల్సి ఉన్న తరుణంలో... టీటీడీ 350 పడకలతో మరో సూపర్ స్పెషాలిటీ పీడియాట్రిక్ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తోంది. దీన్లో గుండె సంబంధిత చికిత్సలు మాత్రమే కాకుండా సబ్ స్పెషాలిటీలకు సంబంధించి పది ఇతర విభాగాలు ప్రారంభిస్తున్నారు. నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఈ ఆసుపత్రిలో న్యూరో, జెనిటికల్ ఛాలెంజ్డ్, తలసేమియా బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్, ఆంకాలజీ, డెవలప్మెంటల్ పీడియాట్రిక్స్ మొదలైన 14 స్పెషాలిటీ సేవలందించేలా ప్రణాళిక రూపొందించారు. -
లక్షణాలు లేనివారిలో హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువ.. ఈ పరీక్షలో స్కోర్ ఎక్కువగా ఉంటే!
కర్నూలు(హాస్పిటల్): మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిళ్లతో చిన్న వయస్సులోనే కొందరు గుండెపోటుకు గురై తనువు చాలిస్తున్నారు. కడుపునిండా తినడం వ్యాయామాలు చేయకపోవడం, కూర్చుని చేసే పనులు అధికంగా ఉండటం, జంక్‌ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్ అధికంగా తీసుకోవడం తదితర కారణాలతో ఇటీవల గుండెజబ్బులు ఎక్కువయ్యాయి. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియాలజీ విభాగంలో ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహించే ఓపీకి 200 నుంచి 250 మంది రోగులు చికిత్స కోసం వస్తున్నారు. ఇన్‌పేషంట్లుగా ప్రతి నెలా 350 నుంచి 400 మంది వరకు చికిత్స అందుకుంటున్నారు. పెద్దాసుపత్రిలో ప్రతిరోజూ 400 మందికి ఈసీజీ, 40 నుంచి 50 వరకు 2డీ ఎకో పరీక్షలు నిర్వహిస్తున్నారు. నంద్యాలలోని కార్డియాలజిస్టులలో ఒక్కొక్కరి వద్దకు ప్రతిరోజూ 20 నుంచి 50 మంది వరకు చికిత్స కోసం వెళ్తుంటారు. జిల్లా మొత్తంగా ప్రతిరోజూ 40 నుంచి 60 మందికి గుండె శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. లక్షణాలు లేనివారిలో రిస్క్ ఎక్కువ గుండెజబ్బుకు సంబంధించి లాంటి లక్షణాలు లేని వారిలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారి కోసం కరోనరి కాల్షియం స్కాన్ ఉపయోగ పడుతుంది. ఈ పరీక్షకు ఉపయోగించే పరికరం రక్తనాళాల్లో ఏర్పడ్డ అడ్డంకులను, నాళాల అంచులకు ఏర్పడ్డ ఫ్లేక్(ఫలకం)లను గుర్తిస్తుంది. గుండెలో కొలెస్ట్రాల్ లోడ్ ఏ లెవెల్లో ఉందో చెప్పేస్తుంది. కరోనరి ఆర్టరి కాల్షియం స్కోర్‌ను చూపిస్తుంది. దీని ద్వారా గుండె కాల్సిఫికేషన్(బోన్ డిపోజిషన్)ను అంచనా వేస్తుంది. ఈ నివేదిక ప్రకారం భవిష్యత్‌లో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయో కార్డియాలజిస్టు చెప్తారు. స్కోర్ ఎక్కువగా ఉంటే వైద్యుల సూచనలతో మందులు వాడి, భవిష్యత్‌లో హార్ట్ ఎటాక్‌ను నివారించుకోవచ్చు. జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి కరోనరి కాల్షియం స్కాన్ అందరికీ అవసరం లేదు. 40 ఏళ్లు పైబడిన వారికి రిస్క్ ఫాక్టర్స్ అధికంగా ఉంటే ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. ఈ పరీక్షలో మొదటి నుంచి చివరి వరకు చేసే ప్రక్రియకు ఐదు నుంచి పది నిమిషాల వరకు సమయం పడుతుంది. ఈ పరీక్ష ఐదేళ్లకు ఒకసారి చేయించుకోవాలి. స్కానింగ్ రిపోర్ట్‌ను బట్టి వైద్యులు రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి స్పష్టంగా చెప్పగలగుతారు. స్కోర్ 400లకు పైగా ఉంటే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు కార్డియాలజిస్టుల పర్యవేక్షణలో మందులు వాడాలి. జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. –డాక్టర్ తేజానందన్రెడ్డి, కార్డియాలజిస్టు, కర్నూలు -
అదృష్టం అంటే ఇదే.. కోట్లలో లాటరీ!
లాటరీ తగిలితే.. ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా తోడవుతుంది. ఆరోగ్యం బాగాలేక చికిత్స తీసుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో లాటరీ గెలిస్తే.. సంతోషానికి హద్దు ఉండదు. అచ్చం ఇటువంటి ఓ ఘటన అమెరికాలోని మసాచుసెట్స్‌లో చోటు చేసుకుంది. మసాచుసెట్స్‌లోని అలెగ్జాండర్ మెక్లీష్ ఓపెన్ హార్ట్ సర్జరీ చికిత్స చేయించుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే ఆయనకు తన స్నేహితుడి దగ్గర నుంచి వచ్చిన గెట్వెల్ కార్డులో వన్ మిలియన్(రూ.7.5 కోట్లు) డాలర్ల లాటరీ తగిలింది. మసాచుసెట్స్ రాష్ట్ర లాటరీ కమిషన్ తెలిపిన వివారాల ప్రకారం.. మెక్లీష్కి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుంటున్న సమయంలో అతని స్నేహితుడు మూడు లాటరీ స్క్రాచ్ ఆఫ్ టిక్కెట్లను తిసుకున్నాడు. అయితే సర్జరీ అనంతరం మెక్లీష్ వాటిని స్క్రాచ్ చేయగా.. వన్ మిలియన్ భారీ లాటరీ గెలుచుకున్నాడు. అన్ని టాక్స్‌లు పోను మెక్లీష్ సుమారు 4.8 కోట్లను సొంతం చేసుకున్నాడు. అయితే కేవలం 20 డాలర్లు (రూ.1500) పెట్టి కొన్న లాటరికీ 6,50,000 డాలర్లు (రూ. 4.8 కోట్లు) పొందటంపై మెక్లీష్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. -
సోనూసూద్ దాతృత్వం.. ఖమ్మం నుంచి ముంబై రప్పించుకుని..
కల్లూరు రూరల్(ఖమ్మం): మూడు నెలల పసికందు గుండెలో తీవ్ర సమస్య.. వైద్యం చేయించటానికి లక్షల రూపాయలు వెచ్చించలేని నిరుపేద కుటుంబం. ఈ విషయాన్ని సామజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న నటుడు సోనూసూద్ స్పందించారు. ఆ చిన్నారికి ఆపరేషన్ చేయించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలొని చెన్నూరు గ్రామానికి చెందిన కంచెపోగు కృష్ణ, బిందుప్రియ దంపతులకు 2021 జులైలో బాబు పుట్టాడు. మూడు నెలల బాబుకు సాత్విక్ అనే పేరుపెట్టారు. బాబు పట్టుకతోనే గుండెలో సమస్య ఏర్పడింది. హైదరాబాద్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు చిన్నారి సాత్విక్ కు గుండెలో తీవ్ర సమస్య ఉందని, ఆపరేషన్ చేయటానికి రూ.6లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. (చదవండి: చెరుకు రసం ఆశ చూపి యువకుడిపై అత్యాచారం) చిన్నారి తండ్రి కంచపోగు కృష్ణ హైదరాబాద్‌లోని ఒక ప్రవేటు కంపెనీలో చిరుద్యోగిగా పనిచేస్తున్నాడు. చిన్నారి బాబు వైద్యం కొసం రూ.6లక్షలు లేక తల్లి తండ్రులు తల్లడిల్లి పోతున్నారు. ఈవిషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా తిరువూరులో ఉన్న జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు తెలుసుకుని సినీనటుడు సోనూసూద్‌కు తెలిపారు. ఆయన వెంటనే స్పందించి తల్లిదండ్రులు కంచెపోగు కృష్ణ, బిందు ప్రియ, చిన్నారి సాత్విక్ ప్రేమ్‌ను ముంబై పిలిపించుకొని ప్రఖ్యాత వాడియా ఆస్పత్రిలో సాత్విక్‌కు శనివారం అత్యంత కష్టమైన గుండె ఆపరేషన్ చేయించారు. చిన్నారి ఆరోగ్యం బాగుందని, తల్లిదండ్రులు కృష్ణ, బిందు తెలిపారు. నిరు పేద చిన్నారి ఆరోగ్య సమస్యను తెలుసుకొని చలించి పోయి, గుండె ఆపరేషన్ చేయించిన నటుడు సోనూసూద్‌కు కల్లూరు వాసులు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: బొగ్గు సరఫరా రైళ్లకు బ్రేక్.. కలకలం) -
3డీ మ్యాపింగ్.. ‘గుండె’ నార్మల్
లక్డీకాపూల్(హైదరాబాద్): గుండె కవాటం మూసుకుపోయి బాధపడుతున్న 56 ఏళ్ల మహిళకు నిజాం వైద్య విజ్ఞాన సంస్ధ (నిమ్స్) వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ప్రమాదకర స్థాయిలో కొట్టుకుంటున్న గుండెలో సమస్యను 3డీ మ్యాపింగ్, బెలూన్ వాల్వ్ సాంకేతికత సాయంతో పరిష్కరించారు. ఖరీదైన ఈ శస్త్రచికిత్సను ఆరోగ్యశ్రీ కింద నిర్వహించడం గమనార్హం. నిమిషానికి 250 సార్లు గుండె కొట్టుకుని.. కామారెడ్డి జిల్లాలోని రెడ్డిపేటకు చెందిన బాలమణి పొలం పనులు చేసుకుంటూ జీవిస్తోంది. మూడు నెలల క్రితం ఆమె ఒక్కసారిగా అనారోగ్యానికి గురైంది. గుండె దడదడలాడడం, కడుపు ఉబ్బరం, ఆయాసం మొదలయ్యాయి. నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లినా ఏమీ తేలలేదు. చివరికి నిమ్స్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఆమెకు పరీక్షలు చేసిన నిమ్స్ వైద్యులు.. ఆమె గుండె నిమిషానికి 250 సార్లు కొట్టుకుంటోందని, గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తం పంప్ చేసే కవాటం మూసుకుపోయిందని గుర్తించారు. ఈ నెల 17న 3డీ మ్యాపింగ్, బెలూన్ వాల్వ్ విధానంలో శస్త్రచికిత్స చేశారు. తొడ భాగంలోని రక్త నాళం నుంచి ప్రత్యేక పరికరాల ద్వారా బెలూన్ను గుండె వద్దకు పంపి.. మూసుకుపోయిన కవాటాన్ని తెరిచారు. కార్డియాలజీ ప్రొఫెసర్ సాయి సతీశ్ ఆధ్వర్యంలో వైద్యులు హేమంత్ హరీశ్, అర్చన, మణికృష్ణ తదితరుల బృందం ఈ క్లిష్టమైన చికిత్సను పూర్తి చేసింది. -
యశోద నుంచి నిమ్స్‌కు గుండె తరలింపు.. 15 నిముషాలల్లో 11 కి.మీ
సాక్షి, హైదరాబాద్: గ్రీన్ ఛానల్ ద్వారా మలక్‌పేటలోని యశోద ఆసుపత్రి నుంచి పంజగుట్ట నిమ్స్‌కు బుధవారం ప్రత్యేక అంబులెన్స్‌లో గుండెను తరలించారు. నిమ్స్ ఆసుపత్రిలో ఓ వ్యక్తికి ఈరోజు వైద్యులు గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయనున్నారు. రెండు ఆస్పత్రుల మధ్య దూరం 11కి.మీ కాగా కేవలం 15 నిమిషాల్లో అంబులెన్స్ నిమ్స్ ఆసుపత్రికి చేరుకుంది. గుండెను తరలించే క్రమంలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అధికారులు, పోలీసులు ముందే ఏర్పాట్లు చేశారు. చదవండి: మంత్రి కేటీఆర్ మత్తులో ఉండి ట్వీట్ చేశారా? : రేవంత్‌రెడ్డి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి గుండె సేకరణ ఈ నెల 12వ తేదీన గొల్లగూడెం వద్ద కానిస్టేబుల్ వీరబాబు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బైక్ అదుపుతప్పి వీరబాబు కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఖమ్మం జిల్లాకు చెందిన కానిస్టేబుల్ వీరబాబు బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు మంగళవారం యశోద వైద్యులు ప్రకటించారు. కానిస్టేబుల్ గుండె దానానికి ఆయన కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. గుండె కోసం జీవన్‌దాన్‌లో 30 ఏళ్ల వయసున్న ఓ పెయింటర్ నమోదు చేసుకున్నాడు. దీంతో కానిస్టేబుల్ గుండెను ఆ వ్యక్తికి నిమ్స్ వైద్యులు ఇవాళ అమర్చనున్నారు. నిమ్స్‌లో గతంలోనూ పలుమార్లు గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగిన సంగతి తెలిసిందే. చదవండి: వివాదస్పదంగా మారిన యూపీ సీఎం ‘అబ్బాజాన్’ వ్యాఖ్యలు -
ఎమర్జెన్సీ సర్జరీ చేస్తుండగా పక్షవాతం బారిన పడ్డ దిగ్గజ ఆల్‌రౌండర్
సిడ్నీ: న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, దిగ్గజ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్ పక్షవాతం బారినపడ్డాడు. అస్ట్రేలియాలో గుండెకు ఎమర్జెన్సీ సర్జరీ చేసేటప్పుడు వెన్నెముకలో స్ట్రోక్ రావడంతో రెండు కాళ్లు చచ్చుపడిపోయాయని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం అతనికి రీహాబిలిటేషన్ ప్రక్రియ నిర్వహించేందుకు ఆస్ట్రేలియాలోనే మరో ఆసుపత్రికి తరలించినట్లు వారు తెలిపారు. కెయిన్స్.. గత కొంతకాలంగా ఆరోటిక్ డిసెక్షన్ అనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా, 51 ఏళ్ల క్రిస్ కెయిన్స్ అంతర్జాతీయ క్రికెట్లో 1989 నుంచి 2006 వరకు న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తన 17 ఏళ్ల కెరీర్లో కెయిన్స్ కివీస్ తరపున 62 టెస్టుల్లో 3320 పరుగులు.. 218 వికెట్లు , 215 వన్డేల్లో 4950 పరుగులు.. 201 వికెట్లు పడగొట్టాడు. కెయిన్స్ తన జమానాలో మేటి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. చదవండి: అఫ్గాన్లను చంపడం ఆపండి ప్లీజ్.. రషీద్ ఖాన్ ఉద్వేగం -
మహానేత... నిన్ను మరువం: మా ‘గుండెచప్పుడు’ నువ్వే!
వెబ్‌డెస్క్ : అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకును పట్టి చూస్తే చాలు. అదే విధంగా సమాజంపై ఓ రాజకీయనేత ఎలాంటి ప్రభావం చూపాడనేది అంచనా వేయడానికి ఊరూరూ, ఇళ్లిళ్లు తిరగక్కర్లేదు. ఒక గ్రామం, ఒక ఇల్లు పరిశీలిస్తే చాలు ఆ నాయకుడి ముందుచూపు, సాటి మనిషి కష్టాల పట్ల స్పందించే గుణాలు ఇట్టే తెలిసిపోతాయి. మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమాజంపై ఎంతగానో ప్రభావం చూపారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంతో పాటు పాదయాత్రలో ఎదురైన అనుభవాలు ఆయనను అంతకు ముందున్న నేతలకు భిన్నంగా మార్చాయి. అందుకు ఉదాహరణ శనిగపురం గ్రామం. అక్కడి ప్రజల అనుభవాలు. కులమతాలకు అతీతం మహబూబాబాద్ పట్టణాన్ని ఆనుకునే ఉంటుంది శనిగపురం గ్రామం. ఇటీవల మున్సిపాలిటీలో కూడా భాగం అయ్యింది. ఆ గ్రామంలో ఐదువేల మంది జనాభా నివసిస్తున్నారు. ఐదు వందల గడపల జనాభా. అన్ని కులాలు, మతాల వాళ్లు ఆ ఊళ్లో ఉన్నారు. మతాచారాలకు అనుగుణంగా ఎవరి దేవుడిని వారు పూజిస్తారు. కానీ కులమతాలకు అతీతంగా వారు దేవుడితో సమానంగా కొలిచే మరో వ్యక్తి ఉన్నారు. ఊళ్లో సగం ఇళ్లల్లో ఆయన ఫోటోలే దర్శనం ఇస్తాయి. ఆయన మరెవరో కాదు మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన్ని ఆ గ్రామం గుండెల్లో పెట్టుకుంది. ఎందుకంటే ఆగిపోయే గుండెలను డబ్బు అవసరం లేకుండానే కొట్టుకునేలా ఆయన చేశారు. అందుకే ఆయనంటే వారికి అంత అభిమానం. ఇక్కడ ఒక్కొక్కరిని కదిలిస్తే ఒక్కో రకంగా ఆ మహానేత గురించి చెబుతారు. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఓసారి ఆ మరువలేని జ్ఞాపకాలను నెమరు వేసుకుందాం. వైఎస్సార్ లేకుంటే ? పొలంలో కొట్టేందుకు పురుగుల మందు కొనుక్కుని ఇంటికి వెళ్తున్న రాములు నాయక్‌కి ఉన్నట్టుండి ఛాతీలో మంట మొదలైంది. చూస్తుండగానే నొప్పి పెద్దదైంది. కాళ్ల కింద భూమి కంపించిన ఫీలింగ్. భార్య, ఇద్దరు పిల్లలు కళ్ల ముందు కదలాడారు. కళ్లు తెరిస్తే ఆస్పత్రిలో ఉన్నాడు రాములు నాయక్. గుండె ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు, దానికి రూ. 5 లక్షల ఖర్చు అవుతుందన్నారు. రెండెకరాలు అమ్మినా అంత సొమ్ము రాదు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో రాములు నాయక్‌కి ఆదుకుంది ఆరోగ్య శ్రీ పథకం. రాములు నాయక్‌కి ఉన్న రెండెకరాల పొలం అలాగే ఉంది. బయట నుంచి ఒక్క రూపాయి కూడా అప్పు తేలేదు. అయినా సరే హైదరాబాద్‌లో అపోలో ఆస్పత్రిలో గుండె ఆపరేషన్ జరిగింది. ఈ ఘటన జరిగింది 2008లో అప్పుడు ఆయన వయస్సు 27 ఏళ్లు. డాక్టర్ వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ లేకపోయి ఉంటే తన పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడానికే కష్టంగా ఉందంటూ కన్నీటితో చెబుతాడు రాములు నాయక్. అందుకే తనింట్లో దేవుళ్ల ఫోటోల పక్కన వైస్సార్ ఫోటో ఉంటుంది. మనలోనే ఉన్నాడు రాములు నాయక్ ఆపరేషన్ తర్వాత అదే ఊళ్లో బానోతు బుజ్జి, నేలమారి కాటం రాజులకు కూడా ఆరోగ్య శ్రీ ద్వారా గుండె ఆపరేషన్ జరిగింది. అప్పటికే వ్యవసాయంలో ఆటుపోట్లు చూస్తున్న రైతన్నలకు రుణమాఫీ ద్వారా భారీ మేలు జరిగింది. అందుకే శనిగపురం గ్రామం వైఎస్సార్‌ను తమ గుండెల్లో పెట్టుకుంది. యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి తమవాడే, తమ ఇంటి పెద్ద బిడ్డ అనుకునే ఇలాంటి శనగపురాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ మండలంలో నాలుగైదు ఉన్నాయి. ప్రతీ గడపకు ఆయన సేవలు అందాయి. అందుకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువుకున్న విద్యార్థుల భవిష్యత్తులో, ఆసరా ఫించన్లు పొందుతున్న అవ్వా, తాతాల దీవెనల్లో, ఉచిత కరెంటు పొందుతున్న ప్రతీ రైతు కళ్లలో వెలుగై రాజన్న ఇంకా మన మధ్యే ఉన్నాడు. చిరకాలం అలాగే ఉంటాడు! -
పెద్ద మనసు చాటుకున్న సుధీర్ బాబు
తెరపైనే కాదు నిజ జీవితంలో కూడా హీరోననే నిరూపించుకున్నాడు టాలెంటెడ్ యాక్టర్ సుధీర్ బాబు. హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్న ఓ చిన్నారికి ఆపరేషన్ చేయించి పెద్ద మనసును చాటుకున్నాడు. వివరాల్లోకి వెళ్లితే.. కొన్నాళ్ల క్రితం బేబీ సంస్కృతి కోసం సోషల్ మీడియా వేదికగా సుధీర్ బాబు ఒక ఫండ్ రైజర్ నిర్వహించాడు. ట్విటర్లో సదరు చిన్నారి హార్ట్ ప్రాబ్లం గురించి చెప్పాడు. ‘ఎమర్జెన్సీ: బేబీ సంస్కృత గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటుంది. ఆమె ఆపరేషన్ ప్రారంభించడానికి నేను 1 లక్షలు అందిస్తున్నా, కానీ ఆమె ఆపరేషన్ కోసం, ఇతర వైద్య ఖర్చుల కోసం 3.5 లక్షలు కావాలి. కాబట్టి నేను వ్యక్తిగతంగా నిధులు సేకరిస్తున్నాను. దయచేసి సహకరించండి’ అంటూ ట్వీట్ చేశారు. EMERGENCY: Baby Samskruti is facing heart complications. I am contributing 1 Lakh for initiating the operation but her family needs 3.5 lakh more to complete the treatment & meet other medical expenses. So, I am raising funds personally. Please contributehttps://t.co/6pyRLdxbAZ — Sudheer Babu (@isudheerbabu) May 14, 2021 సుధీర్ బాబు పిలుపుతో చాలా మంది డబ్బును విరాళంగా ఇచ్చారు. దీంతో ఆ చిన్నారి ప్రమాదం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యంగా ఉంది. చిన్నారి ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కోసం బ్యాంకులో కొంత డబ్బుని డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు సుధీర్ బాబు. పని గుండె కోసం పరితపించిన సుధీర్ బాబుపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రియల్ హీరో అంటూ కామెంట్లు చేస్తున్నారు. Happy that I was and I will be helpful. It's some great feeling to see the smiles back on their faces. https://t.co/QX4NVBKvPQ — Sudheer Babu (@isudheerbabu) June 2, 2021 -
ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది.. నీలం రంగులోకి చిన్నారి శరీరం
అభిమన్యు బోసినవ్వులతో వెలిగిపోతున్న ఆ ఇంట ఒక్కసారిగా విషాదం అలుముకుంది. చిన్నారి రాకతో ఆ ఇంట ఆనందం వెల్లివెరిసింది. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఓ రోజు అతని శరీరం క్రమంగా నీలం రంగులోకి మారిపోతుండటంతో ఆ తల్లిదండ్రులు షాకయ్యారు. వెంటనే వైద్యులను సంప్రదించగా వారు చెప్పిన నిజం తెలిసి గుండె పగిలేలా రోదిస్తున్నారు. తీవ్రమైన టెట్రాలజీ ఆఫ్ ఫాలోట్, పల్మనరీ స్టెనోసిస్ అనే వ్యాధితో చిన్నారి బాధపడుతున్నాడని వైద్యులు నిర్థారించారు. చిన్నారి పుట్టినప్పటి నుంచే గుండె సంబంధింత సమస్యలతో బాధపడుతున్నాడని, వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం అని వైద్యులు తెలిపారు. అయితే ఆర్థికంగా స్థోమత లేని ఆ దంపతులు నిస్సహుయులుగా ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కెటో (ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ) చికిత్స కోసం డబ్బులు లేని ఎంతో మందికి సాయం అందిస్తోంది. ఆ చిన్నారి సమస్య గురించి ఆ తల్లి ఏం చెబుతుందో ఒక్కసారి తెలుసుకుందాం. సంవత్సరం క్రితమే అభిమన్యు మా జీవితాల్లోకి వచ్చాడు. అతని రాకతోనే ఎన్నో వెలుగులు తెచ్చాడు. ఆ బోసినవ్వులతో ఎంతో చక్కగా సాగిపోతున్న మా జీవితాల్లో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. తల్లిదండ్రులు కాబోతున్నాం అని ఎంత సంతోషించామో ఇప్పటికీ గుర్తు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు కొనసాగలేదు. నా బిడ్డ కొన్ని రోజుల నుంచి జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. సాధారణంగా అందరు పిల్లల్లో ఉండేదే అనుకున్నాం. కానీ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటం, క్రమంగా శరీరం నీలం రంగులోకి మారుతుండటంతో చాలా భయపడుతూనే హాస్పిటల్‌కి వెళ్లాం. అప్పుడు రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు నా చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో ప్రాణాలతో పోరాడుతున్నాడని చెప్పారు. వెంటనే బాబుకు చికిత్స చేయాలని లేదంటే ప్రాణానికే ప్రమాదం అని వైద్యులు చెప్పారు. ఈ ట్రీట్మెంట్ మొత్తానికి దాదాపు 10లక్షల రూపాయలు అవుతుందని డాక్టర్లు చెప్పారు. నా భర్త కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తారు. కానీ ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా పనులు లేక కుటుంబ పోషణే జటిలమైపోయింది. డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. అభిమన్యుకు మా పేదరికం కారణంగా ఏమైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా బాబును కాపాడగలదు’. దయచేసి మా బిడ్డను కాపాడండి. నా అభిమన్యుకు ప్రాణ భిక్ష పెట్టండి. కెటో ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ద్వారా ఆర్థికంగా చితికిపోయిన ఎంతో మందికి సహాయం అందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న హాస్పిటల్‌తో కొలాబరేట్ అయ్యి డబ్బులు లేని వారెందరికో సోషల్ మీడియా ద్వారా ఫండింగ్ చేసి చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించండి. (అడ్వర్టోరియల్) -
కరోనాలో అరుదైన చికిత్స.. 60 ఏళ్ల ఐటీ నిపుణుడికి పునర్జన్మ
సాక్షి, రాయదుర్గం: కరోనా కాలంలో సంక్లిష్టమైన హృద్రోగ చికిత్స చేసి 60 ఏళ్ల ఐటీ నిపుణుడికి పునర్జన్మను ప్రసాదించారు నానక్‌రాంగూడలోని కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు. డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం... హైపర్ టెన్షన్, ఎడమవైపు చాతిలో నొప్పి, దడ వంటి లక్షణాలతో బాధపడుతున్న 60 ఏళ్ల వ్యక్తి ఆరు నెలలుగా మందులు వాడినా ఎలాంటి ఉపశమనం కలగలేదు. దీంతో ఆయన కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరాడు. ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఆశుతోష్కుమార్, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మీరాజీరావు, వైద్యాధికారులు అభిషేక్ మొహంతి, రామకృష్ణుడు ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రెండు దశల్లో చికిత్సను చేశారు. ప్రధానంగా 3డీ(త్రీ డైమెన్షనల్) కార్డియాక్ మ్యాపింగ్ అనే అత్యాధునిక గుండె చికిత్స పద్ధతిని, అరిథ్మియాను సరిదిద్దడానికి రేడియో ఫ్రీక్వెన్సీ ఆబ్లేషన్ ప్రాసెస్‌ను వినియోగించారు. నాలుగు గంటలకుపై శ్రమించి చికిత్సను విజయవంతంగా పూర్తి చేసి రోగి ప్రాణాలను కాపాడారు. -
బాలుడికి ఊపిరి పోసిన ‘సాక్షి’ కథనం
రహమత్‌నగర్: లాక్డౌన్ సమయం.. నా అనే వారు లేని బీద కుటుంబం.. ఓ వైపు ఉపాధిలేక మరోవైపు తమ కుమారుడికి ఆపరేషన్ చేయించలేక ఆ తల్లిదండ్రులు అల్లాడి పోయారు. ఆ సమయంలో వీరి దీన గాధపై గత ఏడాది మే 26వ తేదీన ‘మా బాబుకు ప్రాణం పోయండి’ అనే శీర్షిçకతో సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో మానవతాదృక్పథంతో దాతలు ముందుకువచ్చి తమవంతుగా ఆర్థిక సహాయం అందించారు. వారికి తోడు గా వైద్యులు సైతం నిలిచారు. లాక్డౌన్, వైద్య పరీక్షలు మూలంగా దాదాపుగా ఏడాది తరువాత బాబుకు ఆదివారం ఆపరేషన్ నిర్వహించారు. తమ కుమారుడికి ప్రాణం పోసిన, సాక్షి దినపత్రికకు, డాక్టర్లకు, ఆర్థిక సాయం అందించిన దాతలకు తల్లిదండ్రులు చేతులెత్తి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. గత ఏడాది సాక్షిలో ప్రచురితమైన కథనం బీహర్ నుంచి భాగ్యనగర్‌కు.. బీహర్‌కు చెందిన రమేశ్ మాఖీయా, ఆశాదేవిల కూమారుడు ప్రియాంక మాఖీయా(6) పుట్టకతోనే గుండెకు చిల్లు పడింది. ఈ క్రమంలోనే లాక్డౌన్ సమయంలో ఎస్పీఆర్హిల్స్లో చేరుకున్న మాఖీయా దంపతుల దీన స్థితిని వివరిస్తూ ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన స్థానిక బీజేఆర్ బస్తీ నేత సంజీవ్‌రావు బాధితులకు నివాసం, భోజనం ఏర్పాటు చేశాడు. వారి కుటుంబానికి అండగా నిలిచారు. ఈ కథనానికి స్థానికులు, నగరవాసులు మాఖీయా కుటుంబానికి దాదాపు రూ.3లక్షల వరకు ఆర్థిక సాయం అందించారు. బాబు పరిస్థితి చూసిన వైద్యులు డాక్టర్ నాగేశ్వర్, డాక్టర్ చిన్నాస్వామిరెడ్డి(బెంగుళూరు) తమకు తెలిసిన వైద్యులతో ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు భరిస్తామని ముందుకు వచ్చారు. వివిధ రకాల వైద్య పరీక్షల అనంతరం ఆదివారం బంజారహిల్స్‌లోని రెయిన్బో ఆస్పత్రిలో ఆపరేషన్ నిర్వహించారు. -
ఓ వైపు కాలిపోతున్నా.. మరోవైపు ఆపరేషన్
మాస్కో: మన చుట్టు పక్కల ఎప్పుడైనా.. ఎక్కడైనా ప్రమాదం జరిగితే చాలు.. ఎవరికి వారు క్షేమంగా బయటపడాలని ఆలోచిస్తారు. ప్రాణభయంతో పరుగులు తీస్తారు. ఎక్కడో కొందరు మాత్రం తమ ప్రాణాలు పణంగా పెట్టి ఇతరులను కాపాడతారు. ఇలాంటి ఘటనే ఒకటి రష్యాలో చోటు చేసుకుంది. ఓ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. సహాయక సిబ్బంది ఆస్పత్రిలో ఉన్న వారిని క్షేమంగా బయటకు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రిలో ఓ వ్యక్తికి గుండె ఆపరేషన్ చేస్తున్నారు కొందరు వైద్యులు. ప్రమాదం గురించి తెలిసినప్పటికి వారు అక్కడి నుంచి వెళ్లిపోలేదు. విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసి.. తమతో పాటు రోగిని కూడా క్షేమంగా బయటకు తరలించారు. ఆ వివరాలు.. రష్యాలోని బ్లేగోవెష్చెన్స్క్లోని ఓ ఆస్పత్రిలో శుక్రవారం మంటలు చెలరేగాయి. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది ఆస్పత్రిలో ఉన్న 120 మందిని క్షేమంగా బయటకు తరలించారు. ఇదే సమయంలో హస్పిటల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఓ వ్యక్తికి ఒపెన్ హార్ట్ సర్జరీ జరుగుతుంది. దాదాపు 8 మంది వైద్యులు ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. ప్రమాదం గురించి తెలిసి వారు భయపడలేదు. సర్జరీ కొనసాగించాలని భావించారు. అయితే అగ్ని ప్రమాదం వల్ల ఆస్పత్రిలో పవర్ కట్ చేశారు. దాంతో ఓ విద్యుత్ వైరును సర్జరీ చేస్తున్న గదికి కనెక్ట్ చేసి పవర్ సప్లై చేశారు. ఇక ప్రమాదం వల్ల ఆపరేషన్ థియేటర్లోకి పొగ చేరడంతో అప్పిటికప్పుడు దాన్ని బయటకు పంపించే అధునాతన పరికరాలను ఏర్పాటు చేసి.. ఏలాంటి ఆటంకం లేకుండా ఆపరేషన్ కొనసాగేలా చూశారు. వైద్యులు తమ ప్రాణాలు పణంగా పెట్టి సదరు పెషేంట్ జీవితాన్ని నిలబెట్టారు. విజయవంతంగా సర్జరీ పూర్తి చేసి.. తమతో పాటు సదరు రోగిని కూడా క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. ప్రస్తుతం అతడిని మరొక ఆస్పత్రికి తరలించారు. ప్రాణాలు పణంగా పెట్టి మరి వృత్తి ధర్మాన్ని నిర్వర్తించిన వైద్యులపై ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు. ఈ సందర్భంగా ఓ వైద్యుడు మాట్లాడుతూ.. ‘‘ఇందులో మా గొప్పతనం ఏం లేదు. మా విధులు మేం నిర్వర్తించాం. కాకపోతే ఇది కాస్త రిస్కీ ఆపరేషన్. అదృష్టం కొద్ది మాతో పాటు పేషెంట్‌ని కూడా కాపాడగలిగాం’’ అన్నాడు. ప్రమాద దృశ్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. చదవండి: మూడు రోజుల చిన్నారికి అరుదైన శస్త్ర చికిత్స 10 మంది సజీవ దహనం: నన్ను క్షమించండి.. -
బాలుడి గుండెలో గుండుసూది
యశవంతపుర: విద్యార్థి హృదయ భాగంలోని గుండుసూదిని వైద్యులు శస్త్రచికిత్స చేసి పునర్జన్మనిచ్చారు. కర్ణాటకలోని మంగళూరు నగరంలో బజార్ పక్కలడ్కకి వీధికి చెందిన ఆబ్దుల్ ఖాదర్ కుమారుడు ముఖశ్కీర్(12)కు పదేపదే జ్వరం వస్తుండేది. పలువురు వైద్యుల వద్ద చూపించినా నయం కాలేదు. దీంతో మంగళూరులోని చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ రామ్‌గోపాలశాస్త్రి వద్దకు తీసుకెళ్లారు. ఎక్స్‌రే తీయించి పరిశీలించగా హృదయ భాగంలో గుండుసూది ఉన్నట్లు తేలింది. దీంతో శుక్రవారం వైద్యులు శస్త్రచికిత్స చేసి గుండుసూదిని బయటకు తీసి బాలుడి ప్రాణం కాపాడారు. చదవండి: చేపకు.. ఆపరేషన్ -
మా అర్హన్‌ను కాపాడండి (స్పాన్సర్డ్)
చిన్నారి బోసినవ్వులతో వెలుగుతున్న ఆ ఇంట ఇప్పుడు అంతులేని విషాదం నెలకొంది. నెలల వయసున్న చిన్నారి అర్హన్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు అత్యంత సంక్లిష్ట దశలో ఉంది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఆర్థికంగా స్థోమత లేని ఆ దంపతులు నిస్సహుయులుగా ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. భారతదేశంలో ఎంతో మందికి మూడు పూటల తిండి దొరకడమే కష్టం. అలాంటి వారిపై వ్యాధులు కూడా దండయాత్ర చేస్తే వారికి రక్షణకవచంలా నిలిచేదెవరు? వారిని రక్షించుకోవలసిన అవసరం లేదా? కెటో (ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్) చికిత్స కోసం డబ్బులు లేని ఎంతో మందికి సాయం అందిస్తోంది. ఇలా వైద్యం భారమైన ఎంతో మందికి బాసటగా నిలుస్తోంది.ఆ చిన్నారి సమస్య గురించి ఆ తల్లి ఏం చెబుతుందో ఒక్కసారి తెలుసుకుందాం. నా బిడ్డను రక్షించుకోగలనా? సమయానికి డబ్బు అందకపోతే నా అర్హన్‌ను ఎత్తుకోవడం ఇదే చివరిసారి కానుందా? హాస్పిటల్ కారిడార్‌లో ఇవే ప్రశ్నలు నన్ను వేధించాయి. మా కొడుకు అర్హన్ పరిస్థితి గురించి డాక్టర్లు చెప్పగానే కుప్పకూలిపోయాం. అర్హన్‌కు అత్యవసరంగా గుండె ఆపరేషన్ చేయాలని, ఇందుకు దాదాపు 5.5- 6 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. అంత డబ్బును మేం ఎంత ప్రయత్నించిన తీసుకురాలేము. మాకు కన్నీళ్లు ఆగడం లేదు. కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే మేము అంత డబ్బును సమకూర్చలేం. డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. మా పేదరికం కారణంగా బాబుకు ఏదైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా బాబును కాపాడగలవు. దయచేసి మా అర్హన్‌ను కాపాడండి. కెటో ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ద్వారా డబ్బులు లేని చిన్నారులెందరికో చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించండి. (అడ్వర్టోరియల్) సహాయం చేయాలనుకునేవారు 81685914నెంబర్‌ను సంప్రదించగలరు. లేదా ఇక్కడ క్లిక్ చేయండి -
నా కొడుకు ప్రాణాలు కాపాడండి
డబ్బు ఉన్నవారా, లేనివారా అన్న తేడా వచ్చే జబ్బులకు తెలియదు. వాటికి కేవలం ప్రాణం తీయడం, ఆర్ధికంగా కుంగదీయడం మాత్రమే తెలుసు. భారతదేశంలో ఎంతో మందికి మూడు పూటల తిండి దొరకడమే కష్టం. అలాంటి వారిపై వ్యాధులు కూడా దండయాత్ర చేస్తే వారికి రక్షణకవచంలా నిలిచేదెవరు? వారు సమాజంలో భాగం కారా? వారిని రక్షించుకోవలసిన అవసరం లేదా? 'కెటో' (ఇండియాస్ క్రౌడ్ ఫండింగ్ సైట్) ఇలా వైద్యం భారమైన ఎంతో మందికి బాసటగా నిలుస్తోంది. పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి యదార్థ గాథను తెలుసుకుందాం. సందీప్- మాధవీలత దంపతుల ముద్దుల చిన్నారి రియాన్స్. ఎన్నో రోజులు ఎదురుచూడగా పుట్టిన మొదటి సంతానం కావడంతో ఆ ఇంట్లో నవ్వులు పూసాయి. పట్టరాని సంతోషంతో అందరూ పులకరించిపోయారు. కానీ ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. పుట్టకతోనే తనకు తనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని డాక్టర్ చెప్పగానే తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. సర్జరీకి 10 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. కానీ అంత డబ్బును మేం ఎంత ప్రయత్నించినా వారు తీసుకురాలేరు. సందీప్ ఓ జ్యువెలరీ దుకాణంలో పనిచేసేవాడు. కానీ కోవిడ్ కారణంగా ఉద్యోగం కోల్పోయాడు. కుటుంబ పోషణ కోసం ఇప్పుడు కూలీగా చేస్తున్నాడు. ‘మేం దాచుకున్న డబ్బులన్నీ రియాన్స్ ట్రీట్మెంట్ కోసం వాడేశాము. డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. రియాన్స్‌కు మా పేదరికం కారణంగా ఏమైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా బాబును కాపాడగలదు’. దయచేసి రియాన్స్ను కాపాడండి. తనకు ప్రాణ భిక్ష పెట్టండి. కెటో ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ద్వారా డబ్బులు లేని చిన్నారులెందరికో చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించి వీర్‌కు అండగా నిలవడమే. (అడ్వర్టోరియల్) సహాయం చేయాలనుకునేవారు 81686400ను సంప్రదించగలరు. లేదా ఇక్కడ క్లిక్ చేయండి -
గుండె మార్పిడి శస్త్ర చికిత్సకు మెట్రో రైలు వినియోగం
సాక్షి, హైదరాబాద్: గుండె మార్పిడి శస్త్ర చికిత్స కోసం తొలిసారిగా మెట్రోరైలును వినియోగించనున్నారు. అపోలో హాస్పిటల్ వైద్యుడు గోకులే నేతృత్వంలో జరిగే శస్త్ర చికిత్స కోసం గుండెను మెట్రో రైలులో తరలిచించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం మెట్రోతో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అపోలో ఆస్పత్రిలో గుండె మార్పిడి చికిత్సకు వైద్యులు సిద్దం చేస్తున్నారు. -
హార్ట్ సర్జరీ! బిగ్‌బాస్ విన్నర్ అభ్యర్థన
ముంబై: హిందీ బిగ్‌బాస్ 11వ సీజన్ విన్నర్ శిల్పా షిండే బంధువు తృప్తి పటేల్ షిండే గుండెకు శస్త్ర చికిత్స చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె క్షేమంగా ఉండాలని ప్రార్థించమని శిల్పా అభిమానులను కోరింది. ఈ మేరకు తృప్తితో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది. "అభిమానులే నా దేవుళ్లు. కష్టసుఖాల్లో నా వెంట నిలబడుతున్న అభిమానులకు కృతజ్ఞతలు. నా దగ్గరి బంధువు తృప్తికి నానావతి ఆస్పత్రిలో హార్జ్ సర్జరీ జరగబోతుంది. ఆమెకు అంతా మంచి జరగాలని కోరుకోండి" అంటూ ఫ్యాన్స్‌ను అభ్యర్థించింది. (చదవండి: టీవీ నటుడి రెండో పెళ్లి) ఇదిలా వుంటే శిల్పా.. "బాబీ జీ ఘర్ పర్ హై"లో అనిత బాబీ పాత్రలో ఉత్తమ నటన కనబర్చావంటూ నేహా పెండ్సేను మెచ్చుకుంది. నిజానికి ఆ పాత్రను నటి సౌమ్య టండన్ కొన్నేళ్లుగా చేస్తోంది. అయితే ఈ మధ్యే ఆమె సీరియల్ నుంచి తప్పుకోవడంతో నేహా కొత్తగా ఆ స్థానంలో అడుగుపెట్టింది.. ఇక అదే సీరియల్లో అంగూరి బాబీగా మెప్పించిన శిల్పా సైతం తప్పుకోవడంతో ఆమె స్థానంలో శుభంగి ఆత్రే నటిస్తోంది. శిల్పా లాక్డౌన్లో "గ్యాంగ్స్ ఆఫ్ ఫిల్మిస్తాన్" అనే కామెడీ షోలోనూ పాల్గొంది. కానీ అది టీవీలో టెలికాస్ట్ కాకముందే షో నుంచి తప్పుకోవడం గమనార్హం. (చదవండి: స్నేహితుడిని పెళ్లాడిన బాలీవుడ్ సింగర్) View this post on Instagram A post shared by Shilpa Shinde (@shilpa_shinde_official) -
హీరో మహేష్‌బాబు ఉదారత
తూర్పుగోదావరి, అల్లవరం: మండలంలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన కుంచె ప్రదీప్, నాగజ్యోతిల నెల రోజుల బాబుకి గుండెశస్త్ర చికిత్సకు ప్రముఖ హీరో మహేష్‌బాబు సహకరించి నిజజీవితంలో రియల్ హీరో అయ్యాడు. మే 31 సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు పురస్కరించుకుని విజయవాడలోని ఆంధ్ర ఆస్పత్రిలో బాబుకు గుండె శస్త్రచికిత్స చేయించారు. ఈ దంపతులకు మొదటి కాన్పులో బాబు పుట్టాడు. మొదట్లో ఆరోగ్యంగా ఉన్నా రోజులు గడుస్తున్న కొద్దీ బాబు శరీరంలో మార్పులు గమనించి అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స ప్రారంభించారు. బాబును పరీక్షించిన వైద్యులు అరుదైన గుండె జబ్బుతో బాధపడుతున్నట్టుగా గుర్తించి త్వరితగతిన శస్త్ర చికిత్స చేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. (మహేశ్‌తో ఢీ?) మెరుగైన వైద్యం కోసం విజయవాడ లేదా హైదరాబాద్ తీసుకెళ్లాల్సి ఉంటుందని, ఖర్చు ఎక్కువగానే అవుతుందని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రదీప్ అమలాపురంలో తన స్నేహితుడు ద్వారా హీరో మహేష్‌బాబు ట్రస్టు ద్వారా పిల్లలకు ఉచితంగా శస్త్ర చికిత్స చేయిస్తున్నారని తెలుసుకుని విజయవాడలోని ఆంధ్ర ఆస్పత్రి హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్ వైద్యులను గత నెల 30న సంప్రదించారు. రెండు రోజుల అనంతరం జూన్ 2న శస్త్ర చికిత్స వైద్యులు పరీక్షలు నిర్వహించారు. శస్త్ర చికిత్స తర్వాత బాబు ఆరోగ్యం కొంత ఆందోళన కలిగించింది. బీపీ తక్కువగా నమోదుకావడం, గుండె కొట్టుకోవడంలో తేడా ఉండడంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు రెండు వారాల అనంతరం బాబు కోలుకుని ఆరోగ్యంగా ఉండడంతో స్వగ్రామానికి పంపించారు. ప్రస్తుతం బాబు పూర్తి ఆరోగ్యం ఉన్నాడని ప్రదీప్ తెలిపారు. తమ బాబుకి పునర్జన్మ ఇచ్చిన హీరో మహేష్‌బాబుకి ధన్యవాదాలు తెలిపారు. -
మూడు రోజుల చిన్నారికి అరుదైన శస్త్ర చికిత్స
పంజగుట్ట: అరుదైన గుండె సంబందిత వ్యాధితో బాధపడుతున్న మూడు రోజుల పసికందుకు రెయిన్ బో చిల్డ్రన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు పసికందుకు ఐసీయూలో చికిత్స అందించామని ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా ఉందని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ధర్మారావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. వైద్య పరిభాషలో హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్ (హెచ్ఎల్హెచ్ఎస్) అనే అరుదైన గుండె వ్యాధితో బాధపడుతున్న మూడు రోజుల చిన్నారి సంక్లిష్టమైన పరిస్థితుల్లో వెంటిలేటర్‌పై ఉండగా తమ ఆసుపత్రికి వచ్చిందన్నారు. ఈ సమస్య ఎదురైతే శ్వాస తీసుకోవడం కష్టమౌతుందని, ఎడమ వైపు గుండె రక్తనాళాలకు రక్తం పంప్ చేసే నాళాలు చిన్నవిగా ఉండటంతో అత్యవసర గుండె శస్త్రచికిత్స అనివార్యమైందన్నారు. దీనిని ‘నార్ వుడ్ ప్రొసీజర్’ ప్రక్రియగా పేర్కొంటారని, ఎంతో సంక్లిష్టమైన ఈ గుండె శస్త్రచికిత్స దేశంలోని అతి కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే చేసే అవకాశం ఉందన్నారు. రెయిన్బో వైద్యులు విజయవంతంగా ఈ ఆపరేషన్ చేశారన్నారు. తొమ్మిది రోజుల ఐసీయూలో చికిత్స అందించిన తర్వాత ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉందన్నారు. పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జి చేసేందుకు వైద్యులు అనుమతిచ్చారన్నారు. శస్త్రచికిత్స నిర్వహించిన పిడియాట్రిక్ సర్జన్ డైరెక్టర్ డాక్టర్ తపన్ కె డాష్ మాట్లాడుతూ .. కరోనా నేపథ్యంలో, లాక్డౌన్ సమయంలో ఈ శస్త్రచికిత్స చేయడంవల్ల ఓ చిన్నారి ప్రాణం కాపాడామన్నారు. -
కిమ్‌కి శస్త్ర చికిత్స జరిగిందా ?
సియోల్ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఉన్ కుడి చెయ్యి మణికట్టుపై సూదితో పొడిచినట్టు ఉన్న గుర్తులు కనిపిస్తున్నా యి కదా ! ఆ గుర్తులు ఏమిటన్న దానిపై సర్వత్రా చర్చ జ రుగుతోంది. 20 రోజుల పాటు కనిపించకుండా పోయిన కిమ్ మే 1న ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అప్పుడు తీసిన ఫొటోల్లో కిమ్ చేతిపై కనిపించే గుర్తులు చూసి ఆయన గుండెకి శస్త్రచికిత్స జరిగిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అంతకు ముందు కిమ్ ఏప్రిల్ 11న ప్రజల మధ్యకి వచ్చినప్పుడు తీసిన ఫొటోల్లో చేతిపై అలాంటి గుర్తులేవీ కనిపించలేదు. గుండెలో రంధ్రాలను పూడ్చడానికి స్టంట్ అమర్చడం కోసం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చేతి ద్వారా కూడా శస్త్రచికిత్స ప్రక్రియ జరుగుతుందని కొందరు వైద్య నిపుణులు వాదిస్తూ ఉంటే మరికొందరు గుండెకి స్టంట్ వెయ్యడానికి చేసే ఇంట్రావీనస్ ప్రక్రియకి అలాంటి గురుతులు పడవని అంటున్నారు. ఆయన గుండెకు ఆపరేషన్ చేయడానికి ముందు ఏవైనా పరీక్షలు జరిగి ఉండవచ్చునని వారు చెబుతున్నారు. అయితే, కిమ్‌కు సర్జరీ జరిగిందంటూ వస్తున్న వార్తల్ని దక్షిణ కొరియా కొట్టి పారేసింది. కిమ్‌కి ఎలాంటి శస్త్రచికిత్స కానీ, వైద్య పరీక్షలు కానీ జరగలేదని స్పష్టం చేశారు. -
కిమ్ ఆరోగ్యంపై గందరగోళం
సియోల్/వాషింగ్టన్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ బ్రెయిన్ డెడ్ అయిందన్న కథనాలతో ప్రపంచమే ఉలిక్కిపడింది. 36 ఏళ్ల వయసున్న కిమ్ గుండెకి జరిపిన శస్త్రచికిత్స ఆయన ప్రాణం మీదకి తెచ్చిందన్న అమెరికా మీడియాలో కథనాలు వస్తుంటే ఉత్తర కొరియా నోరు మెదపడం లేదు. కిమ్ ఆరోగ్యస్థితిపై అక్కడ మీడియా వార్తల్ని ప్రచురించలేదు. రోజువారీ వార్తల్ని కిమ్ సాధించిన విజయాలు, వివిధ రంగాలపై కిమ్ గతంలో వెల్లడించిన అభిప్రాయాల్ని మాత్రమే మీడియా ఇస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కిమ్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. కిమ్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలు నిజమో, కాదో తనకు తెలీవని చెప్పారు. కిమ్ బాగానే ఉన్నారని తాను భావిస్తున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 15న కిమ్ తన తాత ఇల్ సంగ్ 108 జయంతి వేడుకల్లో పాల్గొనకపోవడంతో ఆయన ఆరోగ్యం బాగోలేదన్న వదంతులు మొదలయ్యాయి. ఉత్తర కొరియాకు అత్యంత ముఖ్యమైన ఈ వేడుకలకు కిమ్ 2011లో అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. కిమ్ చివరిసారిగా ఏప్రిల్ 12న బయట ప్రపంచానికి కనిపించారని దక్షిణ కొరియా మీడియాలో చాలా వార్తలొచ్చాయి. ఊబకాయం, చైన్ స్మోకింగ్, పని ఒత్తిడి కారణంగా కిమ్‌ను గత ఆగస్టు నుంచి అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయని ప్యాంగ్యాంగ్ దగ్గర్లోని రిసార్టులో ఉంచి ఆయనకి చికిత్స అందిస్తున్నారని దక్షిణ కొరియా మీడియా చెబుతోంది. అయితే కిమ్ ఆరోగ్య పరిస్థితిపై అమెరికా నిఘా విభాగ అధికారులు నిరంతరం నిఘా వేశారని అమెరికాలోని భద్రత విభాగం ఉన్నతాధికారులు చెబుతున్నారు. వారసులపై ఊహాగానాలు 7దశాబ్దాలుగా అక్కడ వంశపారంపర్య పాలనే నడుస్తోంది. 1948 నుంచి కిమ్ కుటుంబమే అధికారాన్ని చెలాయిస్తోంది. తన తండ్రి కిమ్ సంగ్ మరణానంతరం కిమ్ జాంగ్ ఇల్ 1994లో కొరియా పగ్గాలు చేపట్టారు. జాంగ్ ఇల్ మరణానంతరం కిమ్ 2011లో పీఠమెక్కారు. కిమ్ 2009లో రి సోల్ జూ అనే సింగర్‌ని పెళ్లాడారు. వారికి ముగ్గురు పిల్లలు. వీరంతా చిన్నవాళ్లు కావడంతో గద్దెనెక్కే పరిస్థితి లేదు. రేసులో ఎవరు ! కిమ్ యో జాంగ్ అధ్యక్షుడు కిమ్ సోదరి కిమ్ యో జాంగ్ ఆయనకు అత్యంత సన్నిహితురాలు. కిమ్ కుటుంబ సభ్యుల్లో ప్రభుత్వంలో కీలకంగా ఎదుగుతూ అధికారంపై పట్టు సంపాదించిన ఏకైక వ్యక్తి జాంగ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధినేత జిన్‌పింగ్‌లతో కలిసి ఐక్యరాజ్య సమితి సదస్సుల్లో కిమ్ పాల్గొన్నప్పుడు ఆమె తన సోదరుడి వెంటే ఉన్నారు. ఈ నెల మొదట్లో అధికారి వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియాలో ప్రత్యామ్నాయ పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఎన్నికయ్యారు. అయితే పురుషాధిక్యత కలిగిన ఉత్తర కొరియా సమాజంలో ఒక మహిళకు అధికారం అప్పగిస్తారా అన్నది అనుమానమేనన్న విశ్లేషణలు వినబడుతున్నాయి. కిమ్ హాన్ సోల్ కిమ్ సవతి సోదరుడైన కిమ్ జాంగ్ నామ్ కొడుకు ఇతను. కిమ్ జాంగ్–2 పెద్ద కుమారుడైన నామ్ జూదానికి అలవాటు పడి చైనాకు ప్రవాసం వెళ్లిపోయాడు. తరచు తన సవతి తమ్ముడు కిమ్ పాలనను విమర్శిస్తూ ఉండేవారు. 2017లో మలేసియా కౌలాలంపూర్ విమానాశ్రయంలో నామ్ దారుణ హత్యకు గురయ్యారు. ఆ హత్య వెనుక కిమ్ హస్తముందనే ఆరోపణలున్నాయి. దీంతో నామ్ కుమారుడు కిమ్ హాన్ సోల్ ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్కు వచ్చే సాహసం చెయ్యలేదు. కిమ్ వంశంలో మగవారికే అధికారాన్ని అప్పగించాల్సి వస్తే హాన్ సోల్ కూడా రేసులో ఉన్నట్టే. కిమ్‌జాంగ్ చోల్ కిమ్‌కున్న సోదరుల్లో జీవించి ఉన్న వ్యక్తి చోల్ మాత్రమే. అయితే ఆయనకి రాజకీయాలపై అంతగా ఆసక్తి లేదు. గిటార్ వాయించడంలో చోల్ అత్యంత ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తారు. తండ్రి కిమ్ జాగ్–2కి చోల్‌ను వంశోద్ధారకుడిలా కాకుండా ఒక కూతురిలా చూసేవారన్న వార్తలు వచ్చాయి. 2011లో సింగపూర్‌లో ఒక కచేరికి హాజరైన సందర్భంలో జాంగ్ చోల్‌ను దక్షిణ కొరియాకి చెందిన మీడియా సంస్థ కేబీఎస్ ఫొటోలు తీసింది. జాంగ్ చోల్ స్విట్జర్లాండ్‌లో చదువుకున్నారన్న విషయం మినహా ఆయన గురించి వివరాలేవీ తెలీవు. -
అఖండ సం‘దీపం’
ఆ గుండె పదిలం.. విధాత తలపునే మార్చిన మానవత్వం.. 15 నెలల పసిబిడ్డ గుండెలో రంధ్రం ఏర్పడిందని, అతడి వైద్యానికి దాతలు ఆదుకోవాలని ‘సాక్షి’ కథనం ప్రచురించిన మరుక్షణం పిల్లల నుంచి పెద్దల వరకు స్పందించారు.. అతి సామాన్యుల నుంచి మహేష్‌బాబు వంటి సూపర్స్టార్ల వరకు సాయమందించారు.. అందరి ఆశీస్సులతో ఆ బాలుడికి విజయవాడలో నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది. చంద్రబాబు హయాంలో తిరస్కరించినా ఆరోగ్యశ్రీ సైతం వర్తింపజేస్తామని అధికారులు తెలిపారు. టెక్కలి రూరల్: నెలల వయసున్న పసిబిడ్డ గుండెలో రంధ్రం ఏర్పడిందని తెలుకుని ఆందోళనకు గురైన ఆ తల్లిదండ్రులకు ఎట్టకేలకు ఊరట లభించింది. దాతల సాయంతో శస్త్రచికిత్స జరగడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. టెక్కలి మండలం పోలవరం గ్రామానికి చెందిన లఖినాన త్రినాథరావు, సుజాత దంపతుల కుమారుడు సందీప్(15నెలలు)కు గుండెలో రంధ్రం ఏర్పడింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఆపరేషన్‌కు లక్షలు రూపాయలు ఖర్చవుతాయని తెలిసి, అంత డబ్బులు వెచ్చించే స్థోమత లేక కుమిలిపోయారు. ఈ విషయమై గత నెల 25న ‘సాక్షి’లో ‘ఆ గుండెను కాపాడండి’ పేరిట కథనం ప్రచురితమైంది. దీనిపై సినీ నటుడు మహేష్‌బాబు జిల్లా ఫ్యాన్స్, సేవాసమితి అధ్యక్షుడు వంకెల శ్రీనివాస్ స్పందించి మహేష్‌బాబు దృష్టికి విషయం తీసుకువెళ్లారు. అనంతరం విజయవాడలోని ఆంధ్ర ఆస్పత్రిలో బాలుడికి మంగళవారం శస్త్రచికిత్స చేయించారు. రెండు రోజుల పరిశీలన అనంతరం ఆపరేషన్ విజయవంతమైనట్లు వైద్యులు గురువారం ప్రకటించారు. మహేష్‌బాబు సేవా సమితితో పాటు మరికొందరు దాతలు, స్వచ్ఛంద సంఘాలు, ఉపాధ్యాయులు సైతం స్పందించి సందీప్‌కు చేయూతను అందించారు. ఎట్టకేలకు తమ కుమారుడికి సాంత్వన చేకూరడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ సైతం వర్తింపు.. టీడీపీ హయాంలో ఎన్టీఆర్ వైద్యసేవలో భాగంగా సందీప్‌కు గుండె శస్త్రచికిత్స చేయాలని తల్లిదండ్రులు ప్రయత్నించగా, అప్పటి ప్రభుత్వ తీరు కారణంగా ఆమోదం రాలేదు. తాజాగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీలో మరిన్ని వ్యాధులు చేర్చడం, సందీప్ ఆరోగ్య పరిస్థితిపై మీడియాలో కథనాలు రావడంతో సంబంధిత అధికారులు స్పందించి తక్షణం ఆరోగ్యశ్రీ వర్తింపజేశారు. మహేష్‌బాబు సహకారంతో శస్త్రచికిత్స చేసినప్పటికీ.. ఆరోగ్యశ్రీ ద్వారా నిధులు మంజూరైతే ఆ మొత్తాన్ని చిన్నారి మందుల కోసం వెచ్చించే అవకాశముందని తల్లిదండ్రులు చెబుతున్నారు. -
బోధనాస్పత్రులకు ‘గుండెజబ్బు’
సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక ప్రభుత్వ బోధనాస్పత్రుల్లోని కార్డియాలజీ విభాగాలు తీవ్రమైన గుండెపోటుతో బాధపడుతున్నాయి. మౌలిక సదుపాయాల కొరతకు తోడు ఆస్పత్రి అధికారులు ఆయా విభాగాలపై చిన్నచూపు చూస్తుండటం, చికిత్స చేసేందుకు అవసరమైన నిపుణులు లేకపోవడం, ఏళ్ల తరబడి ఖాళీలను భర్తీ చేయక పోవడంతో ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. దీంతో అవి కేవలం వ్యాధి నిర్ధారణ పరీక్షలకే పరిమిత మవుతున్నాయి. గాంధీ ఆస్పత్రి కార్డియాలజీ విభా గానికి రోజుకు సగటున 150 నుంచి 200 మంది హృద్రోగ బాధితులు వస్తుండగా, ఉస్మానియాకు రోజుకు సగటున 250 మంది వరకు వస్తుంటారు. వీరిలో 20 నుంచి 30 మంది వరకు పుట్టుకతోనే గుండెకు రంద్రాలు ఏర్పడిన శిశువులు ఉంటారు. వీరిలో 20 నుంచి 30 శాతం మందికి అమర్చాల్సి ఉండగా, 5 నుంచి 10 మందికి బైపాస్ సర్జరీలు అవసరమవుతుంటాయి. అయితే ఆయా ఆస్పత్రుల్లో రోగుల నిష్పత్తికి తగినంత మంది హృద్రోగ నిపుణులు లేకపోవడం, క్యాథ్‌ల్యాబ్ సర్వీసు ముగియడం, వాటిలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో గుండె చికిత్సలకు విఘా తం ఏర్పడుతోంది. దీంతో రోగులకు కేవలం వ్యాధినిర్ధారణ పరీక్షలు చేయడం, మందులు రాయడం, అవసరమైన వారికి స్టంట్లు వేయడం మినహా ఇతర మేజర్ (బైపాస్)చికిత్సలేవీ జరగడం లేదు. వేధిస్తున్న పర్ఫ్యూజనిస్ట్ల కొరత ఇతర సర్జరీలతో పోలిస్తే బైపాస్ సర్జరీ కొంత క్లిష్టమైంది. కార్డియో థొరాసిక్ సర్జన్ సహా అనెస్తీషియా వైద్యనిపుణుడితో పాటు (పంప్టీమ్)పర్ఫ్యూజనిస్ట్, స్టాఫ్ నర్సులు, ఇతర టెక్నీషియన్ల సహకారం అవసరం. ఇది పూర్తిగా టీమ్ వర్క్‌తో ముడిపడి ఉంటుంది. సీటీ సర్జన్ రోగి ఛాతిపై 6 నుంచి 8 ఇంచుల వరకు కోత పెట్టి ఛాతిని ఓపెన్ చేసి దెబ్బతిన్న గుండె భాగాన్ని పునరుద్ధరిస్తే, మత్తు వైద్యుడు నొప్పిని నియంత్రిస్తాడు. సర్జరీ సమయంలో గుండె నుంచి రక్త ప్రసరణ నిలిపివేసి, మెషిన్ ద్వారా ఇతర శరీర భాగాలకు రక్తం సహా ఆక్సిజన్‌ను సరఫరా చేయాల్సి వస్తుంది. కీలకమైన ఈ మిషన్‌ను పర్ఫ్యూజనిస్ట్లు ఆపరేట్ చేస్తుంటారు. ఇటీవల ఈ టెక్నిషియన్లు పదవీ విరమణ చేశారు. ప్రభుత్వం ఆయా ఖాళీలను భర్తీ చేయలేదు. కీలకమైన టెక్నిషియన్ లేకపోవడంతో పాటు సర్జరీకి మూడు నుంచి ఆరు గంటల సమయం పడుతుండటం, ఆ తర్వాత రోగిని ఐసీయూలో అడ్మిట్ చేసి, అనునిత్యం అప్రమత్తంగా వ్యవహరించాల్సి వస్తోంది. అధిక సమయంతో పాటు ఎక్కువ రిస్క్‌ను ఫేస్ చేయాల్సి వస్తుండటంతో వైద్యులు వీటికి దూరంగా ఉంటున్నారు. అదే కార్డియాలజీ విభాగాల్లో రోజుకు సగటున రెండు మూడు సాధారణ ప్రొసీజర్లు చేస్తున్నప్పటికీ..కార్డియోథొరాసిక్ విభాగాల్లో ఏడాదికి కనీసం ఒకటి రెండు కూడా చేయక పోవడానికి ఇదే ప్రధాన కారణమని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా తీవ్రమైన హృద్రోగ సమస్యతో బాధపడుతూ బైపాస్ సర్జరీలు అవసరమైన నిరుపేద రోగులు చేసేది లేక కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తుంది. నిమ్స్ కొంత నయం హృద్రోగ చికిత్సల్లో నిమ్స్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎయిమ్స్ సహా మరెక్కడా లేని విధంగా నిమ్స్‌లో అన్ని విభాగాల నిపుణులు అందుబాటులో ఉండటంతో పాటు కార్డియాలజీ, కార్డియోథొరాసిక్, పుట్టుకతో వచ్చే జన్యుసంబంధ గుండె జబ్బుల చికిత్సలు, రక్తనాళాల మార్పిడి, గుండె మార్పిడి వంటి కీలక విభాగాలన్నీ ఒకే గొడుగు కింద పని చేస్తున్నాయి. అనేక అరుదైన గుండె మార్పిడి చికిత్సలు చేసిన అనుభవం ఇక్కడి వైద్యులకు ఉంది. మూసుకుపోయిన రక్తనాళాలను స్టంట్లతో ఓపెన్ చేయడం, లీకేజీలను నియంత్రించడం వంటి సర్జరీలు సహా బైపాస్, వాల్వ్రీప్లేస్, హార్ట్/లంగ్ ట్రాన్స్ఫ్లాంటేషన్లు కూడా ఇక్కడ జరుగుతుండటం, ఇతర ఆస్పత్రులతో పోలిస్తే ఇక్కడ నిపుణులు అందుబాటులో ఉండటం, మెరుగైన చికిత్సలు అందుతుండటం వల్ల సాధారణ రోగులతో పాటు ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కూడా ఇక్కడ చేరేందుకే ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఉస్మానియా, గాంధీలో సీటీ సర్జరీలు నిలిపివేయడంతో ఆ రోగులు కూడా ఇక్కడికే వస్తుంటారు. ఇతర విభాగాలకు లేని గుర్తింపు కార్డియాలజీ విభాగాలకు దక్కుతుండటంతో పరిపాలన విభాగంలోని కొందరు అధికారులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయా విభాగాలను ఓ ప్రణాళిక ప్రకారం నిర్వీరం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అరుదైన చికిత్సలతో ఆస్పత్రికి గుర్తింపు తెస్తున్న వైద్యులను ప్రోత్సహించక పోగా, నిర్లక్ష్యం చేస్తుండటంతో పలువురు వైద్యులు మనస్తాపంతో ఆస్పత్రిని వీడుతున్నట్లు సమాచారం. ఫలితంగా గత ఏడాది నుంచి ట్రాన్స్ప్లాంటేషన్లు నిలిచిపోగా, సాధారణ చికిత్సలు కూడా గణనీయంగా తగ్గినట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
పేదోడి గుండెకు భరోసా
గుంటూరు మెడికల్: కార్పొరేట్ ఆస్పత్రులకు ఏ మాత్రం తీసిపోని విధంగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పతి గుండె వైద్య విభాగంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను నిరుపేదలకు ఉచితంగా అందిస్తున్నారు. కార్డియాలజీ పీజీ వైద్యులు పేద రోగులకు అందుబాటులో ఉండి నిరంతరం గుండె వైద్యసేవలను అందిస్తున్నారు. జీజీహెచ్ క్యాథ్‌ల్యాబ్‌లో అన్ని రకాల గుండె జబ్బులకు ఆధునిక వైద్య పద్ధతులు ఉపయోగించి ఆపరేషన్లు పూర్తిచేస్తూ పేదోళ్ల గుండెకు కార్డియాలజీ వైద్యులు అభయాన్ని ఇస్తున్నారు. మనిషి శరీరంలో గుండె కీలకం శరీరంలోని అన్ని అవయవాల్లో గుండె ప్రధానమైంది.లబ్‌డబ్ మంటూ నిరంతరం కొట్టుకుంటూ ఉండే గుప్పెడంత గుండె కొద్దిసేపు విశ్రమిస్తే ప్రాణాలు గాల్లో కలిసినట్లే. ఇంతటి ప్రాధాన్యం ఉన్న గుండెకు వైద్యం కూడా చాలా ఖరీదుతో కూడుకున్నదే. గతంలో కేవలం కొద్ది రకాల గుండె వ్యాధులకు మాత్రమే జీజీహెచ్ గుండె వైద్యవిభాగంలో సేవలు లభించేవి. ఆపరేషన్లు చేయాలంటే హైదరాబాద్‌కు రిఫర్ చేసేవారు. నేడు మెట్రోపాలిటన్ నగరాల్లో లభించే కార్డియాలజీ వైద్యసేవలన్నీ జీజీహెచ్‌లో ఉచితంగా లభిస్తున్నాయి. అందిస్తున్న వైద్యసేవలు క్యాథ్‌ల్యాబ్‌లో గుండెలో రక్తనాళాలు మూసుకుపోయి గుండె నొప్పితో బాధపడేవారికి యాంజి యోగ్రామ్ పరీక్ష చేసి బైపాస్ ఆపరేషన్ చేయాలో వద్దో నిర్ణయిస్తారు. గుండె రక్త నాళాలు మూసుకున్న వారికి మూసుకున్న రక్తనాళంలో ప్లాస్టిక్ గొట్టం(యాంజీయోప్లాస్టీ) స్టెంట్ వేస్తారు. గుండె సరిగా కొట్టుకోని వారికి పేస్‌మేకర్(తాత్కాలిక, శాశ్వత)ని అమరుస్తారు. గుండె కవాటాల సమస్యలు ఉన్నవారికి ఇక్కడ పీబీఎంవీ, పీబీవీపీ వైద్య పద్ధతిలో వైద్యం చేస్తారు. చిన్న పిల్లల్లో గుండెలో రంధ్రాలు పూడిపోకపోతే వాటిని మూసివేసే ఆపరేషన్లు(ఏఎస్డీ, వీఎస్డీ క్లోసర్) చేస్తారు. కాళ్లు ,చేతుల్లో రక్తనాళాలకి కూడా ప్లాస్టిక్ గొట్టాలు వేస్తారు. వైద్య సేవలు పొందాలంటే... జీజీహెచ్‌లో లభించే గుండె వైద్య సేవలు పొందాలనుకునే వారు అవుట్ పేషెంట్ విభాగంలోని 10 నంబర్ గదిలో సోమవారం, బుధవారం, శుక్రవారం రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండుగంటల వరకు వైద్య సేవలు పొందవచ్చు. అక్కడ వైద్యులు ఈసీజీ, టుడి ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్ లాంటి గుండెజబ్బు నిర్ధారణ పరీక్షలు చేసి అవసరం ఉన్నవారికి ఇన్‌పేషేంట్ విభాగంలో అడ్మిట్ చేసుకుంటారు. ఇన్‌పేషేంట్ విభాగంలో(డాక్టర్ పొదిల ప్రసాద్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్)లో 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉంటారు. హార్ట్ స్ట్రోక్ వచ్చినవారిని ఓపీకి తీసుకెళ్లకుండా నేరుగా వార్డులోకి తీసుకురావచ్చు. రాజీవ్ ఆరోగ్యశ్రీకార్డు, తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి క్యాథ్‌ల్యాబ్‌లో లక్షలాది రూపాయలు ఖరీదు చేసే గుండె వైద్య సేవలు ఉచితంగా లభిస్తాయి. కార్డు లేనివారికి సైతం సీఎమ్సీఓ ఆఫీసు నుంచి అనుమతి పత్రం తెచ్చుకుంటే సేవలన్నీ ఉచితమే. అందుబాటులో క్యాథ్‌ల్యాబ్ సేవలు గుండెజబ్బుల వైద్య విభాగంలో గత ఏడాది డిసెంబర్ నుంచి 24 గంటలు క్యాథ్‌ల్యాబ్ వైద్యసేవలు అందుబాటులోకి రావటంతో గుండెజబ్బు రోగులకు సకాలంలో వైద్యసేవలు అందుతున్నాయి. గుండె ఆపరేషన్లు చేసేందుకు ఫిలిప్స్ కంపెనీకి చెందిన అజురియన్ 7.సి అత్యాధునిక క్యాథ్‌ల్యాబ్ మిషన్‌ను ఏర్పాటుచేశా>రు. నీతి అయోగ్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఏపీలో క్యాథ్‌ల్యాబ్‌ను మొట్టమొదట గుంటూరు జీజీహెచ్‌లో ఏర్పాటుచేశారు. సుమారు రూ.4. 5 కోట్లతో ఏర్పాటుచేసిన ఆధునిక క్యాథ్‌ల్యాబ్‌తో 50 శాతం రేడియేషన్ తక్కువగా ఉంటుంది. గుండె జబ్బులను అశ్రద్ధ చేయకూడదు గుండెజబ్బులను ఏ మాత్రం అశ్రద్ధ చేసినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఛాతీలో నొప్పి అనిపించిన వెంటనే గుండె వైద్యులను సంప్రదించాలి. జీజీహెచ్‌లో గుండె వైద్య సేవలన్నీ ఉచితంగా లభిస్తున్నాయి. సీనియర్ రెసిడెంట్ వైద్యులు, పీజీ వైద్యులు, సీనియర్ కార్డియాలజిస్టులు 24 గంటలు విధుల్లోనే ఉండి సేవలందిస్తున్నారు.–డాక్టర్ కరోడి మురళీకృష్ణ,కార్డియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ -
గుండెలో అరకిలో కణితి
కర్నూలు(హాస్పిటల్): గుండెలో కాస్త ఇబ్బంది అయితేనే ఎంతో కష్టంగా ఉంటుంది. ఊపిరాడకుండా గుండె ఆగిపోతుందన్న ఆందోళన, భయం మనిషిని కుంగదీస్తుంది. అయితే ఓ వ్యక్తి గుండెలో అరకిలో కణితితో నిత్యం నరక యాతన అనుభవిస్తున్నాడు. అతని బాధను శస్త్రచికిత్సతో కర్నూలు పెద్దాసుపత్రి వైద్యులు తొలగించి ప్రాణం పోశారు. అనంతపురం జిల్లా పెనుగొండ మండలం నాగలూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు(42) వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు కొద్దికాలంగా గుండెలో సమస్య ఎదురైంది. స్థానికంగా వైద్యులకు చూపించుకోగా వారు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రెఫర్ చేశారు. నెలరోజుల క్రితం ఆయన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియోథొరాసిక్ విభాగానికి వచ్చాడు. విభాగాధిపతి డాక్టర్ సి.ప్రభాకర్‌రెడ్డి పరీక్షించి వైద్యపరీక్షలు నిర్వహించారు. శ్రీనివాసులు మైట్రల్ వాల్వు(కవాటం)లో కాల్షియం చేరడం వల్ల అది కాస్తా చిన్నగా మారిందని, దాని వల్ల ఎడమ కర్ణికలో అరకిలో పరిమాణంలో రక్తం గడ్డకట్టిందని తెలుసుకున్నారు. అవసరమైన అన్ని రకాల వైద్యపరీక్షలు, చికిత్స అనంతరం గత మంగళవారం ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించి కణితి తొలగించారు. శ్రీనివాసులు కణితి కారణంగా హార్ట్ ఫెయిల్యూర్, గుండెదడ సమస్యతో బాధపడేవాడని, అతను మరింత ఆలస్యం చేసి ఉంటే కణితిలోని ముక్క బయటకు వచ్చి మెదడుకు చేరుకుని, పక్షవాతానికి దారి తీసే అవకాశం ఉందని శుక్రవారం తనను కలిసిన విలేకరులతో డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. శస్త్రచికిత్స సమయంలోనూ కణితిలోని ముక్క జారకుండా జాగ్రత్త పడ్డామన్నారు. ప్రస్తుతం అతను ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. -
ఆదుకున్న ఆరోగ్య శ్రీ
నిజామాబాద్ అర్బన్: గుండె సమస్యతో బాధపడుతున్న తొమ్మిది మందికి ఒకే రోజు ఆరోగ్యశ్రీ కింద వైద్యులు ఆపరేషన్ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన తొమ్మిది మంది గుండె సంబంధిత వ్యాధితో జిల్లా కేంద్రంలోని ప్రగతి హార్ట్‌సెంటర్‌కు వచ్చారు. వీరిని పరీక్షించిన డాక్టర్ గోపికృష్ణ.. బాధితులు ఆయాసం, ఛాతీ నొప్పి, స్పృహ కోల్పోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అరుదుగా ఉండే ఏవీఆర్‌టీ గుండె జబ్బుగా నిర్ధారించారు. ఆదివారం వీరందరికీ శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్స నిర్వహించడంతో రోగులకు ఆర్థిక భారం తగ్గిందని, లేదంటే ప్రైవేట్‌లో ఖర్చు ఎక్కువయ్యేదని పేర్కొన్నారు. శస్త్ర చికిత్సల్లో డాక్టర్ గోపికృష్ణతో పాటు డాక్టర్ విక్రం, నరేంద్ర, విజయ్, గుండెరావ్, రాజు, దిలీప్, కళావతి ఉన్నారు. -
హాస్యనటుడు బ్రహ్మానందంకు హార్ట్ సర్జరీ!
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంకు ముంబైలోని ఓ ఆసుపత్రిలో హార్ట్ సర్జరీ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. గత ఆదివారం అనారోగ్యంతో ముంబైలోని ఏషియన్ హర్ట్ ఇన్స్టిట్యూట్లో చేరిన ఆయనకు సర్జరీ అవసరమని డాక్టర్లు సూచించారు. డాక్టర్ రమాకాంత్ పాండా ఆధ్వర్యంలో సోమవారం ఆయనకు సర్జరీ జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అభిమానులు సోషల్ మీడియాలో ట్వీట్లు, కామెంట్లు చేస్తున్నారు. ఆయన కుమారులు గౌతమ్, సిద్ధార్థ్‌లతో పాటు కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దే ఉన్నారు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించి హాస్యలోకపు రారాజుగా వెలుగొందిన బ్రహ్మానందంకు ఇటీవల సినిమాలు తగ్గాయి. -
పుట్టకముందే పునర్జన్మ!
సాక్షి, హైదరాబాద్: తల్లి గర్భంలో ఉండగానే ఓ శిశువు గుండెకు కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా చికిత్స చేశారు. మూసుకుపోయిన గుండె రక్తనాళాలను తెరిచి జన్మించకముందే పునర్జన్మ ప్ర సాదించారు. ఇలాంటి చికిత్స దేశంలోనే తొలిదని వైద్యులు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో డాక్టర్ కె.నాగేశ్వరరావు, డాక్టర్ టీవీఎస్ గోపాల్, డాక్టర్ శ్వేతబాబు, డాక్టర్ జగదీశ్, డాక్టర్ రియాజ్‌ఖాన్, డాక్టర్ రాఘవరాజు వివరాలను మీడియాకు వెల్లడించారు. 25వ వారంలో బయటపడ్డ లోపం కడప జిల్లా చిన్నమడెంకు చెందిన కీర్తి క్రిస్టఫర్(31)కు ఏడాది కింద వివాహమైంది. ఆమె గర్భం దాల్చింది. రెగ్యులర్ చెకప్‌లో భాగంగా 25వ వారంలో ఆమెకు అల్ట్రాసౌండ్ పరీక్ష చేయగా, కడు పులో ఉన్న బిడ్డ గుండె (పల్మనరీ వాల్వ్)రక్తనాళం మూసుకుపోయినట్లు డాక్టర్లు గుర్తించారు. పరిష్కారం కోసం రాయచూర్, కడపలోని వైద్య నిపుణులను సంప్రదించారు. వారి సూచన మేరకు మే చివరిలో కేర్ వైద్యులను సంప్రదించారు. పీడియాట్రిక్ హృద్రోగ నిపుణుడు డాక్టర్ నాగేశ్వర్రావు వైద్య పరీక్షలు చేశారు. గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తం సరఫరా చేసే పల్మ నరీ వాల్వ్ మూసుకుపోవడంతో బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలలో లోపమున్నట్లు గుర్తించారు. చికిత్స అందించకుంటే కుడివైపు ఉన్న జఠరికం చిన్నగా మారుతుందని అన్నారు. శిశువు జన్మించాక ఊపిరితిత్తులకు రక్తం సరఫరా కాక, బిడ్డ శరీరం నీలం రంగులోకి మారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని, చికిత్స చేస్తే బతికించొచ్చని తెలి పారు. కీర్తి క్రిస్టఫర్ అంగీకరించడంతో జూన్ తొలివారంలో చికిత్స చేశారు. చికిత్స ఎలా చేశారంటే? చికిత్స సమయంలో బిడ్డ కదలికలతో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉండటంతో కడుపులోని బిడ్డ కదలికలను నియంత్రించేందుకు ముందు 18జీ సూదితో తల్లి ఉదరభాగం నుంచి బిడ్డ తొడభాగానికి ఇంజెక్షన్ ద్వారా అనస్థీషియా ఇచ్చారు. ఆ తర్వాత తల్లికి మత్తుమందు ఇచ్చారు. అల్ట్రాసౌండ్ సాయంతో తల్లి గర్భం నుంచి బిడ్డ గుండె వరకు సూదిని పంపారు. అదే సూది ద్వారా ఓ బెలూన్ను రక్త నాళంలోకి పంపి, మూసుకుపోయిన రక్తనాళాన్ని తెరిపించారు. ఈ ప్రక్రియ కు 48 నిమిషాల సమయం పట్టింది. ఇదే సమయంలో మరో బ్లాక్ ఉన్నట్లు గుర్తించారు. అప్పుడు కడుపులోని బిడ్డ వయసు ఇరవై ఆరున్నర వారాలు మాత్రమే. ఇటీవల కీర్తి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం బిడ్డ 3.2 కేజీల బరువు ఉంది. బిడ్డ పుట్టిన రెండోరోజే రెండో బ్లాక్‌నూ బెలూన్ సాయంతో తెరిపించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్ నాగేశ్వరరావు చెప్పారు. ఇప్పటి వరకు ఇలాంటి చికిత్సలు ఐదు చేయగా, మూసుకుపోయిన గుండె రక్తనాళం తెరిపించడం ఇదే మొదటి సారని వివరించారు. -
అరుదైన సర్జరీ.. 7 నెలల చిన్నారికి పునర్జన్మ
లక్నో: అలిఘర్ ముస్లిం యూనివర్సిటీ జవహార్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ(జేఎన్ఎమ్సీ) వైద్యులు అరుదైన సర్జరీతో ఓ పసికందు ప్రాణాలు నిలబెట్టారు. అత్యంత సంక్లిష్టమైన ఆపరేషన్‌ను నాలుగు గంటలపాటు శ్రమించి విజయవంతంగా పూర్తి చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అలిఘర్‌కు చెందిన సల్మాన్ కూతురు మెహిరా అనే 7 నెలల చిన్నారి పుట్టుకతోనే గుండెసంబంధిత వ్యాధితో బాధపడుతోంది. వారు జేఎన్ఎమ్సీని ఆశ్రయించగా.. వైద్యులు ఆచిన్నారికి పునర్జన్మను ప్రసాదించారు. ఆ పసికందు కడుపులో ఉన్నప్పుడే గుండెకు సంబంధించిన గదులు నిర్మితం కాలేదని, పైగా ఆ గుండెకు రంధ్రం కూడా పడిందని డాక్టర్లు పేర్కొన్నారు. దీంతో ఆమె రక్తం కలుషితమై నీలి రంగులోకి మారిందని, శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది కలిగిందని తెలిపారు. ఆపరేషన్‌తో ఆ చిన్నారి రక్తం తల నుంచి మెడ, చేతుల ద్వారా ఊపిరితిత్తులకు చేరేలా చేశామన్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకుందని, డిశ్చార్జ్కూడా చేసినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్య లేకుండా ఆరోగ్యమైన జీవితాన్ని గడపవచ్చన్నారు. ఈ ఆపరేషన్ రాష్ట్రీయ బాల్ స్వస్త్యా కార్యక్రమం(ఆర్బీఎస్కే) ద్వారా ఉచితంగా నిర్వహించినట్లు తెలిపారు. జేఎన్ఎమ్సీలో ఇప్పటి వరకు గుండెకు సంబంధించిన శస్త్రశికిత్సలు చాలా చేశామని డాక్టర్ అజమ్ హసన్ మీడియాకు వివరించారు. సుమారు 80 మంది పిల్లలకు ఆర్బీఎస్కే ద్వారా ఉచితంగా సర్జరీలు చేసి ప్రాణాలు కాపాడినట్లు పేర్కొన్నారు. -
జీవో సరే.. నిధులేవీ ?
సాక్షి, గుంటూరు: నిరు పేదలకు అందించే వైద్య సేవలపై నిర్లక్ష్యం వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు జీజీహెచ్‌లో గతంలో గుండె ఆపరేషన్లు జరిగేవీ కావు. 2015 మార్చి 18వ తేదీ నుంచి సహృదయ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలేతో కూడిన వైద్యుల బృందం పీపీపీ పద్ధతిలో గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. జీజీహెచ్‌లో గత మూడేళ్లలో 500 మందికి పైగా నిరుపేదలకు బైపాస్ సర్జరీలు చేశారు. వీటితో పాటు నలుగురు నిరుపేద హృద్రోగులకు రూ.20 లక్షల వరకు ఖర్చయ్యే గుండె మార్పిడి ఆపరేషన్లు సైతం జీజీహెచ్‌లో ఉచితంగా చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. అయితే డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే చేస్తున్న కృషికి, ఆయన పడుతున్న కష్టానికి సహకారం అందించాల్సిన ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. దాతల సహాయంతో ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్న డాక్టర్ గోఖలే కనీసం గుండె మార్పిడి ఆపరేషన్లకైనా ప్రభుత్వం సహకరించాలని పలు మార్లు విన్నవించారు. 2016లో జీజీహెచ్‌కు వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య సైతం గుండె మార్పిడి ఆపరేషన్లను ఆరోగ్యశ్రీలో చేరుస్తామంటూ ప్రకటించారు. ఆ తరువాత కొద్ది నెలలకే జీవో కూడా ఇచ్చారు. 2016 మే 20వ తేదీన దాతల సహకారంతో ఏడు కొండలు అనే నిరుపేద రోగికి గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఈ ఆపరేషన్ జరిగి రెండేళ్లు దాటినా ప్రభుత్వం ఇంత వరకు ప్యాకేజీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరం. దేశంలో అతి తక్కువ కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాత్రమే నిర్వహించే గుండెమార్పిడి ఆపరేషన్‌ను గుంటూరు జీజీహెచ్‌లో ఉచితంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం మాత్రం అందుకు తగ్గ సహకారం అందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి వీరికి మరింత ప్రోత్సాహం అందిస్తే జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్లు మరిన్ని నిర్వహించేందుకు డాక్టర్ గోఖలే బృందం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటాల కోసం పెట్టే ఖర్చు వీరికి వినియోగిస్తే మరికొన్ని నిరుపేద ప్రాణాలు నిలబెట్టే అవకాశం దక్కుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గుండె మార్పిడి ఆపరేషన్లు జరిగిన ప్రతిసారీ మంత్రులు, ముఖ్యమంత్రి శాలువాలు కప్పి అభినందిస్తూ, తమ ప్రభుత్వంలో ఇవన్నీ జరుగుతున్నాయనే బిల్డప్ ఇవ్వడం మినహా సహకారం అందించడం లేదు. ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవోకు లేఖ ఆపరేషన్లకు నిధులు మంజూరు చేయాలంటూ 2016 అక్టోబర్ 12వ తేదీన ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవోకు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు లేఖ కూడా రాశారు. 2015 మార్చి నుంచి పీపీపీ పద్ధతిలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సహృదయ హెల్త్ మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో 240కు పైగా గుండె ఆపరేషన్లు విజయవంతంగా చేశామని పేర్కొన్నారు. 2016 అక్టోబర్ 4న బి.హీరామతిబాయి అనే మహిళకు గుండె మార్పిడి ఆపరేషన్‌తో పాటు అత్యవసర వైద్యం అందిస్తున్నామని నిధులు వెంటనే మంజూరు చేయించాలని డాక్టర్ రాజునాయుడు ఎన్టీఆర్ వైద్యసేవ సీఈవోకు రాసిన లేఖలో విన్నవించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం గుండె మార్పిడి ఆపరేషన్లకు నిధులు మంజూరు చేసి నిరుపేదలకు సహకారం అందించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. -
డబుల్ సెంచరీ
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగంలో 200 గుండె శస్త్రచికిత్సలు పూర్తయినట్లు ఆ విభాగం అధిపతి డాక్టర్ సి. ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన సీటీవీసీ విభాగంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి. చంద్రశేఖర్ చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2016 సెప్టెంబర్ 22న సాజిదాబీ అనే నందికొట్కూరుకు చెందిన మహిళకు మొట్టమొదటిసారిగా గుండెలో ఏర్పడిన రంధ్రానికి బైపాస్ సర్జరీ చేయడం ద్వారా ప్రస్థానం మొదలైందన్నారు. 2017 సెప్టెంబర్ 12న తాడిపత్రికి చెందిన వెంకటరామిరెడ్డికి బీటింగ్ హార్ట్ సీఏబీజీ చేయడం ద్వారా 100 కేసులు, అదే సంవత్సరం డిసెంబర్ 8న కర్నూలుకు చెందిన ప్రభాకర్ అనే వ్యక్తికి అతిక్లిష్టమైన బైపాస్ సర్జరీ ద్వారా 150 కేసులు పూర్తి చేశామన్నారు. గురువారం బెలూంకు చందిన బాలపుల్లయ్యకు పూర్తిగా బ్లాక్ అయి స్టంట్ వేయడం కుదరని పరిస్థితిలో బీటింగ్ హార్ట్ సర్జరీ ద్వారా బైపాస్ చేసి 200 కేసులు పూర్తి చేశామన్నారు. మొత్తం 200 ఆపరేషన్లలో ఏసీడీలు 16, వీసీడీలు 7, ఎంవీఆర్లు 40, డీవీఆర్లు 20, సీఏబీజీలు 53, ఊపిరితిత్తుల ఆపరేషన్లు 36, వాక్యులర్ ఆపరేషన్లు 11, ఏవీఆర్‌లు 4, పీడీఏలు 5 ప్రధానంగా ఉన్నాయన్నారు. రుమాటిక్ హార్ట్ డిసీజ్ రోగులకు వాల్వు రీప్లేస్మెంట్ ఎక్కువగా చేయడం సంతృప్తినిచ్చిందని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ జబ్బే లేదని, ఇక్కడే ఇలాంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. యుక్తవయస్సులో కరోనరి బ్లాక్స్ రావడం బాధాకరంగా ఉందన్నారు. ఆరు నెలల వయస్సు నుంచి 80 సంవత్సరాల వయస్సు వారికి ఇక్కడ గుండె ఆపరేషన్లు నిర్వహించామన్నారు. అత్యధికంగా డబుల్ వాల్వ్ ఆపరేషన్లు చేయడం రికార్డు అని తెలిపారు. బీటింగ్ హార్ట్ సర్జరీ ఒక ప్రత్యేకత అని, ఎంఐసీఎస్ చిన్న కోతతో చేసే రూ.6 లక్షల వరకు ఖర్చుతో కూడిన హార్ట్ ఆపరేషన్లు 25 మంది పేదలకు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అనెస్తెషియా విభాగం వైద్యులు డాక్టర్ రఘురామ్, డాక్టర్ భాస్కర్ పాల్గొన్నారు. -
నవజాత శిశువుకు గుండె ఆపరేషన్
లబ్బీపేట(విజయవాడతూర్పు): టోటల్ ఎనామీలస్ పల్మనరీ వీనస్ రిటర్న్ అనే అత్యంత క్లిష్టమైన గుండె సమస్యతో జన్మించిన శిశువుకు ఆంధ్రా హాస్పటల్ వైద్యులు ఆయుష్షు పోశారు. 18 రోజుల వయస్సులోనే క్లిష్టతరమైన ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించడంతో ప్రస్తుతం ఆ శిశువు కోలుకుని ఆరోగ్యంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయింది. ఈ సందర్బంగా బుధవారం ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పీవీ రామారావు వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన సుమతిరాణి, సురేష్‌బాబులకు ఏప్రిల్ 20న శిశువు జన్మించగా, చికిత్స నిమిత్తం ఆంధ్రా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఇక్కడి వైద్యులు శిశువును పరీక్షించి గుండెలోపలికి మంచి రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాలు ఎడమచేతి పక్కన కాకుండా, గుండెలోపల కరోనరీ సైనస్ అనే చోట చేరడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ శిశువుకు ఈ నెల 3న విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించామని తెలిపారు. శస్త్ర చికిత్స చేసిన డాక్టర్ దిలీప్ మాట్లాడుతూ ఈ శిశువుకు క్లిష్టతరమైన సమస్య కావడంతో ఛాలెంజ్‌గా తీసుకుని చేశామన్నారు. పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కుడుముల విక్రమ్, కార్డియాలజిస్ట్ డాక్టర్ జె.శ్రీమన్నారాయణ, కార్డియాక్ అనస్థీషియా డాక్టర్ రమేష్ పాల్గొన్నారు. -
చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌లో ఈ నెల 23 నుంచి నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో 14 మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించారు. హీలింగ్ లిటిల్ హార్ట్స్, యూకే చారిటీ వారి సహకారంతో పది మంది ఇంగ్లాండ్ వైద్యుల బృందం క్లిష్టతరమైన గుండె సమస్యలు ఉన్న చిన్నారులకు నూరుశాతం విజయవంతంగా సర్జరీలు నిర్వహించినట్లు ఆంధ్రాహాస్పటల్స్ పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పీవీ రామారావు చెప్పారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ పీవీ రామారావు మాట్లాడుతూ తమ హాస్పటల్స్‌లో 2015 డిసెంబరు నుంచి నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాల ద్వారా ఇప్పటి వరకూ 300 మంది చిన్నారులకు విజయవంతంగా గుండె శస్త్ర చికిత్సలు ఉచితంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ శిబిరంలో అత్యంత క్లిష్టమైన గుండె సమస్యలకు విజయవంతంగా శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు రామారావు చెప్పారు. యూకే హాస్పటల్స్, లెస్టర్ రాయల్ ఇంపమరీ, గ్రేట్హార్మోన్ స్ట్రీట్ హాస్పటల్ లండన్, రాయల్ మాంచెస్టర్ చిల్డ్రన్స్ హాస్పటల్ వంటి ప్రముఖ హాస్పటల్స్ నుంచి వైద్యులు ప్రత్యేక శిబిరాల్లో పాల్గొని శస్త్ర చికిత్సలు నిర్వహించారన్నారు. సమావేశంలో యూకే వైద్యులు డాక్టర్ ఒప్పిడో గిడో, డాక్టర్ సెర్రావు ఆండ్రియా, కార్వే లైనుసయమారీ, స్కేర్పాటి క్యాటీలోసిదే, బీచార్డ్ ఎలిజెబెత్ జీన్, మేరీ క్యాథలీన్, గోపిశెట్టి షర్మిల, ఆంధ్రా హాస్పటల్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ కుడుములు, కార్డియాలజిస్ట్ డాక్టర్ జె.శ్రీమన్నారాయణ, కార్డియోథోరాసిక్ సర్జన్ డాక్టర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు. హీరో మహేష్‌బాబు అభినందనలు... నవ్యాంధ్రలో గుండెజబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్న ఆంధ్ర హాస్పటల్స్, యూకే వైద్యుల బృందాన్ని సినీహీరో మహేష్‌బాబు అభినందించారు. యూకే వైద్యులతోపాటు, శస్త్ర చికిత్సలు చేయించుకున్న చిన్నారులు, తల్లిదండ్రులు శుక్రవారం హోటల్ డీవీ మానర్‌లో మహేష్‌బాబును కలిశారు. మహేష్‌బాబు మట్లాడుతూ ఇంత మంది చిన్నారులకు నూరుశాతం సక్సెస్ రేటుతో సర్జరీలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. గుండెజబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు సేవలు అందించే విషయంలో తమవంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. -
ఐ యామ్ బ్యాక్
...కామన్ ఆడియన్స్‌కు ఇది మామూలు ఫ్రేస్ కావొచ్చు. కానీ ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ అభిమానులకు, ‘టెర్మినేటర్’ మూవీ సిరీస్ ఫ్యాన్స్‌కు ‘ఐ యామ్ బ్యాక్’ అనే లైన్ ఒక ఎమోషన్. ‘ఐ యామ్ బ్యాక్’ అనే పంచ్‌లైన్ ఆర్నాల్డ్ ఫస్ట్ ‘టెర్మినేటర్’ సినిమాలోనే వాడారు. సినిమా రిలీజై పెద్ద హిట్ అయిన తర్వాత నుంచి ఈ లైన్ ఆర్నాల్డ్ స్టైల్ స్టైట్మెంట్లో ఒక భాగమైపోయింది. ఈ మధ్య ఆర్నాల్డ్ ఆరోగ్యం కొంచెం దెబ్బతింది. దాంతో హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. ఆ ఆపరేషన్ ఎలా జరిగింది? ఆర్నాల్డ్ ఎలా ఉన్నారు? అని ఆయన అభిమానులు ఆందోళన చెందారు. దాంతో ఆర్నాల్డ్ తన ఫ్యాన్స్ కోసం తన హెల్త్ గురించిన అప్డేట్ ఇవ్వాలని ‘ఐ యామ్ బ్యాక్’ అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘‘మెసేజ్‌లు, ఫోన్ కాల్స్, కార్డ్స్, ఈ మెయిల్స్ ద్వారా ప్రపంచం నలుమూలల నుంచి ప్రేమను పంచిన అభిమానులందరికీ థ్యాంక్స్. నేను బావున్నాను అని మీ అందరికీ తెలియజేయడానికే ఈ వీడియో మెసేజ్. ఎంత పాజిటీవ్‌గా చెప్పాలనుకున్నా ఐ యామ్ నాట్ గ్రేట్. బట్ గుడ్. గ్రేట్ అంటే అది వేరే లెవల్. ప్రస్తుతానికైతే ఐ యామ్ గుడ్. నాకు మంచి డాక్టర్స్, నర్సస్ ఉన్నారు. వాళ్ల బాగా కేర్ తీసుకున్నారు. థ్యాంక్యూ ఆల్’’ అని పేర్కొన్నారు ఆర్నాల్డ్. విశేషం ఏంటంటే సర్జరీ జరిగిన తర్వాత మేలుకొన్న వెంటనే ఆర్నాల్డ్ ‘ఐ యామ్ బ్యాక్’ అని అన్నారట. -
జయంత్ ససానే కన్నుమూత
సాక్షి, ముంబై : షిర్డీలోని సాయిబాబా సంస్థాన్ మాజీ అధ్యక్షుడు జయంత్ ససానే (60) సోమవారం ఉదయం కన్నుమూశారు. అదే రోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. అనారోగ్యం కారణంగా ఆయన గత కొంతకాలంగా బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన అహ్మద్‌నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. 1985లో మొదటిసారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 1999–2009 వరకు శ్రీరాంపూర్ నియోజక వర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. 15 ఏళ్లు నగరాద్యక్షుడిగా కొనసాగారు. 2004లో అప్పటి ప్రభుత్వం ససాణే అ«ధ్యక్షతన సాయి సంస్థాన్ ధర్మకర్తల మండలి స్థాపించింది. తన ఎనిమిదేళ్ల పదవీ కాలంలో ఆయన సాయి సంస్థాన్ రూపురేఖలు మార్చివేశారు. ఆసియా ఖండంలోని వివిధ పుణ్యక్షేత్రాలతో పోలిస్తే ఎక్కడా లేని రీతిలో షిర్డీలో అతి పెద్ద ప్రసాదాలయం, సోలార్ ప్రాజెక్టు నిర్మించారు. భక్తుల హుండీలో వేసిన కానుకలతో 2007లో 23న బాబాకు బంగారు సింహాసనం తయారు చేయించారు. సాయిబాబా ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలతోపాటు అందులో గుండె శస్త్రచికిత్స సేవలను కూడా ససాణే అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ప్రారంభించారు. -
స్టెంట్ల ధరల్లో మార్పులు
న్యూఢిల్లీ: దాదాపు ఏడాది అనంతరం గుండె శస్త్రచికిత్సల్లో(యాంజియోప్లాస్టీ) వాడే కరోనరీ స్టెంట్ల గరిష్ట ధరల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. సవరించిన ధరల మేరకు బేర్ మెటల్ స్టెంట్ల(బీఎంఎస్) ధర రూ. 7,400 నుంచి రూ. 7,660కి పెరగగా, డ్రగ్‌తో కూడిన స్టెంట్ల(డీఈఎస్)ధర రూ. 30,180 నుంచి రూ. 27,890కి తగ్గింది. ఈ ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని, 2019 మార్చి 31 వరకూ అమల్లో ఉంటాయని జాతీయ ఫార్మాస్యూటికల్ ధరల నియంత్రణ విభాగం (ఎన్పీపీఏ) తెలిపింది. ఇప్పటికే స్టోర్లలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న స్టెంట్లకు కూడా తాజా ధరలే వర్తిస్తాయంది. డీపీసీఓ(డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్) 2013, షెడ్యూల్ 1 ప్రకారం కరోనరీ స్టెంట్లు ముఖ్యమైన డ్రగ్స్ కేటగిరీలోకి వస్తాయని, విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వాటి ధరల నియంత్రణ కొనసాగాల్సిన అవసరముందని పేర్కొం ది. స్టెంట్లపై తయారీదారులు జీఎస్టీ విధించవచ్చని, అయితే ఎమ్మార్పీ ధరకు అదనంగా ఏ ఇతర చార్జీలు ఉండవంది. -
తరచు గొంతు బొంగురు ఎందుకిలా?
ఈఎన్టీ కౌన్సెలింగ్ నేను లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. ఇటీవల అప్పుడప్పుడూ నాకు గొంతు బొంగురుపోయినట్లుగా అనిపిస్తోంది. నాలాంటి వారు గొంతు విషయంలో నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి. – సంతోష్, విజయవాడ కొంతమంది తమ వృత్తిపరంగా తమ గొంతునూ, స్వరాన్ని ఎక్కువగా ఉపయోగించాల్సి ఉంటుంది. వీరిని ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్ అంటారు. అంటే ఉదాహరణకు ఉపాధ్యాయులు, లెక్చరర్లు, గాయకులు, రేడియోజాకీలు, సేల్స్ జాబ్‌లో ఉండేవాళ్లు. వీళ్లు రోజూ తమ రోజువారీ పనిలో గొంతునే ఉపయోగించాల్సి ఉంటుంది. వీళ్ల రోజువారీ పనులు ముగిశాక వాళ్ల వోకల్ కార్డ్స్ ఎంతగానో అలసిపోతాయి. ఇలాంటివారు తమ గొంతు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే... ∙రోజులో కనీసం 15 నిమిషాల పాటు చొప్పున మూడుసార్లైనా తమ గొంతుకు పూర్తిగా విశ్రాంతి ఇవ్వాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయాలి ∙రోజూ నీళ్లు పుష్కలంగా తాగాలి ∙ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేయాలి. పొగాకు అలవాటును తక్షణం వదిలేయాలి. కాఫీ అలవాటును పూర్తిగా తగ్గించుకోవాలి ∙గొంతు గరగర వచ్చి అది సుదీర్ఘకాలం ఉంటే తప్పకుండా ఈఎన్టీ నిపుణులను కలుసుకొని తగిన చికిత్స తీసుకోవాలి. కొందరిలో యాసిడ్ పైకి ఎగజిమ్మడం వల్ల కూడా గొంతులో సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ఇలాంటివారు తప్పకుండా తమ అసిడిటీ తగ్గించుకోవాలి. వోకల్ నాడ్యుల్స్ అంటే ఏమిటి నేను ఒక ప్రైవేటు కోచింగ్ ఇన్స్టిట్యూట్లో విద్యార్థులకు కోచింగ్ ఇస్తుంటాను. ఇటీవల నా గొంతు బొంగురుగా ఉంటే ఈఎన్టీ వైద్యులను సంప్రదించాను. ‘వోకల్ నాడ్యుల్స్’ వచ్చాయని అన్నారు. ఇవి ఎందుకు వస్తాయి? నాకు తగిన పరిష్కారం చెప్పండి. – సుధాకర్, విశాఖపట్నం మీలాంటి సమస్యనే చాలామందిలో చూస్తుంటాం. వృత్తిపరంగా గొంతును ఎక్కువగా ఉపయోగించే చాలా మందిలో కనిపించే ప్రధాన సమస్య వోకల్ నాడ్యూల్స్. ఇందులో స్వరపేటికలోని రెండు అర్ధభాగాలు కలిసే చోట కండ ఒక చిన్న గడ్డలా పెరుగుతుంది. ఇలా పెరిగిన వోకల్ నాడ్యూల్స్ వల్ల స్వరపేటికలోని రెండు అర్ధభాగాలు పూర్తిగా మూసుకుపోవు. దాంతో కంఠస్వరంలో మార్పు వస్తుంది. సాంకేతికంగా చెప్పాలంటే మన మాటల్లో మునుపు ఉండే నాణ్యత (క్వాలిటీ ఆఫ్ వాయిస్) లోపిస్తుందన్నమాట. అంతేగాక ఒక్కోసారి గొంతు బొంగురుపోయినట్లుగా ఉండటం, మాట్లాడే సమయంలో నొప్పి రావడం, మాట వస్తూ వస్తూ మధ్యలో ఆగిపోవడం వంటివీ జరగవచ్చు. మాట పూర్తిగా పెగలకపోవచ్చు. లోగొంతుకతో మాట్లాడుతున్నట్లూ అనిపించవచ్చు. అంతేగాక... స్వరపేటికలో స్వరతంత్రులు (వోకల్ కార్డ్స్) కూడా ఉంటాయి. వీటిలోనూ మళ్లీ ట్రూ కార్డ్స్, ఫాల్స్ కార్డ్స్ అనే రకాలుంటాయి. ఈ సమస్య ఉన్నవారిలో ట్రూ కార్డ్స్ అనేవి స్పందించినప్పుడు గొంతులో నొప్పి వస్తుంటుంది. అందువల్ల ఆ నొప్పిని అధిగమించడానికి వీళ్లు ఫాల్స్ కార్డ్స్ అనే తంత్రుల సహాయంతో మాట్లాడుతుంటారు. దానివల్ల స్వరంలో మార్పు వస్తుందన్నమాట. మీరు ఈఎన్టీ నిపుణులను, స్పీచ్ థెరపిస్ట్‌లను కలవండి. మీ నాడ్యూల్స్ మరీ ఎక్కువ పరిమాణానికి పెరిగితే అవసరమైతే శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించడం వల్ల మీకు ఉపశమనం కలుగుతుంది. ముక్కులోఎప్పుడూ ఏమిటా అడ్డు? నాకు ముక్కులో ఎప్పుడూ ఏదో అడ్డం పడినట్లుగా అనిపిస్తుంది. చాలా రకాల మందులు వాడాను. అవి వాడుతున్నప్పుడు సమస్య తాత్కాలికంగా తగ్గినట్లు అనిపించినా మళ్లీ తిరగబెడుతోంది. రాత్రిపూట రెండు ముక్కు రంధ్రాలు మూసుకుపోతున్నాయి. నోటితో గాలి తీసుకోవాల్సి వస్తోంది. నా సమస్య ఏమిటి? దీనికి తగిన పరిష్కారం చెప్పండి. – అరుణ్‌కుమార్, ఖమ్మం ఇటీవల కాలుష్యం వల్ల, జీవనశైలిలో మార్పుల వల్ల చాలామందిలో అలర్జీ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలర్జీ సంబంధిత సమస్యలలో మొదట ఉండేది ముక్కుకు సంబంధించిన సమస్యలే. మీరు చెప్పిన వివరాలను బట్టి మీకు ముక్కుదూలం వంకరపోవడం లేదా అలర్జీ లేదా ముక్కులో పాలిప్స్ లేదా ఈ అన్ని సమస్యలు కలగలిసి ఉండవచ్చు. మీరు మొదట నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి ముక్కుకు సంబంధించిన పరీక్షలు చేయించి, అవసరమైతే సీటీ స్కాన్ కూడా తీయించాల్సిరావచ్చు. ఈ పరీక్షలతో ముందుగా మీ వ్యాధిని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. వాటిలో వచ్చే ఫలితాల ఆధారంగా చికిత్స ఉంటుంది. మీకు ముక్కుదూలం వంకరపోతే దాన్ని ఒక చిన్న ఆపరేషన్‌తో సరిచేయవచ్చు. దీనినే సెప్టోప్లాస్టీ అంటారు. లేదా ముక్కులో పాలిప్స్ ఉన్నట్లయితే వాటిని కూడా ఆపరేషన్‌తో తొలగించవచ్చు. అలర్జీ వల్ల వచ్చే సమస్య అయి ఉంటే అందుకు కారణమైన అంశాలకు దూరంగా ఉండటం, ముఖ్యంగా కాలుష్యానికి దూరంగా ఉండటం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తాజా పదార్థాలు మాత్రమే తినడం, చల్లటి వాతావరణానికి, వస్తువులను దూరంగా ఉండటం వంటి చేయడం వల్ల మీ సమస్యను నివారించవచ్చు. కొన్ని రకాల నేసల్ స్ప్రేలు వాడటం వల్ల మీ సమస్యను అదుపులో ఉంచవచ్చు. గుండె సర్జరీ తర్వాత గొంతులో ఏదో అసౌకర్యం... ఎందుకిలా? నాకు ఇటీవలే ‘ఓపెన్ హార్ట్ సర్జరీ’ అయ్యింది. అప్పట్నుంచి మాట సరిగా రావడం లేదు. మాట్లాడబోతుంటే గాలిలాగా వస్తోంది. తినేప్పుడు, తాగేప్పుడు, మిగడంలో ఇబ్బందిగా ఉంది. ఎప్పుడూ గొంతులో ఏదో అడ్డం పడ్డట్లుగా ఉంది. దగ్గు కూడా వస్తోంది. దీనికి తగిన పరిష్కారం చూపండి. – అనిల్‌కుమార్, హైదరాబాద్ మీకు స్వరపేటికలోని ‘వోకల్ ఫోల్డ్’లో సమస్య ఉన్నట్లుగా అనిపిస్తోంది. గుండెకు సంబంధించిన ఆపరేషన్లు (ముఖ్యంగా ఓపెన్‌హార్ట్ సర్జరీ), ట్రకియాస్టమీ, మెడ, ఊపిరితిత్తులకు సంబంధించిన ఆపరేషన్లలో కొన్నిసార్లు ‘వోకల్ ఫోల్డ్’పై ఒత్తిడి పడటానికీ లేదా అవి చెడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. దాంతో మింగడం, మాట్లాడటంలో సమస్యలు రావచ్చు.. కొన్నిసార్లు వోకల్‌ఫోల్డ్ పెరాలసిస్ వచ్చేందుకూ అవకాశం ఉంది. మీ సమస్యను నిర్ధారణ చేయడానికి ముందుగా మీరు నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి ‘ల్యారింగోస్కోపీ లేదా ఎండోస్కోపీ’ వంటి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అంతేగాక స్పీచ్‌థెరపిస్ట్‌ను సంప్రదించి మింగడంలోని ఇబ్బందులు తొలగిపోడానికీ, గొంతురావడానికి అవసరమైన ఎక్సర్‌సైజ్‌లను తెలుసుకుని వాటిని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. – డాక్టర్ ఇ.సి. వినయ కుమార్ హెచ్ఓడి – ఈఎన్టి సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్ -
హృదయాలయం
- జీజీహెచ్‌లో మూడు రోజుల్లో ముగ్గురికి గుండె ఆపరేషన్లు కర్నూలు (హాస్పిటల్): రాష్ట్ర విభజన అనంతరం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల అరుదైన గుండెశస్త్రచికిత్సలకు వేదికైంది. మూడు రోజుల్లో మూడు అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహించి ప్రాణం పోశారు. ఇందులో ఒకరు జీవిత ఖైదు పడిన ఖైదీ, మరొకరు బాలింత కూడా ఉండటం విశేషం. ముగ్గురికీ ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేశారు. వివరాలను బుధవారం ఆసుపత్రిలోని కార్డియోథొరాసిక్ విభాగంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ ప్రభాకర్రరెడ్డి వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే ‘ వైఎస్ఆర్ కడప జిల్లా ముద్దాపురానికి చెందిన ఆర్. వెంటకరెడ్డి(72) ఒక కేసు విషయంలో జీవితఖైదును అనుభవిస్తున్నాడు. ఆయనకు కొరనరి ఆర్టరి డిసీస్ అనే గుండెజబ్బు ఉండటంతో గుండెనొప్పి, ఆయాసంతో బాధపడేవాడు. ఆయనకు గుండెలో మూడు వాల్వులు బ్లాక్ అయ్యాయి. దీనికితోడు గుండె సైతం ఫుట్‌బాల్ అంత సైజులో పెరిగింది. సాధారణంగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి రాష్ట్ర రాజధానిలోని ఆసుపత్రిలో ఆపరేషన్ నిర్వహిస్తారు. ఈ తరుణంలో ఆయనకు జైళ్ల శాఖ నుంచి అనుమతి తీసుకుని కర్నూలులోనే బీటింగ్ హార్ట్ సర్జరీ నిర్వహించాం. బాలింతకు అరుదైన గుండెజబ్బు ఎమ్మిగనూరు మండలం గుడేకల్ గ్రామానికి చెందిన జి. మాదన్న భార్య సువర్ణ(25)కు ఏడు నెలల పాప ఉంది. బాలింత అయిన ఆమె పాపకు రోజూ పాలివ్వాలి. ఇదే సమయంలో ఆమెకు అరుదైన మైట్రల్ స్టెనోసెస్ అనే గుండెజబ్బు వచ్చింది. తీవ్రమైన ఆయాసం, దగ్గుతో బాధపడుతున్న ఆమె చికిత్స నిమిత్తం తమ వద్దకు వచ్చింది. గత నెల 29వ తేదీన ఆమెకు క్రాస్ క్లాంప్, స్కిన్ టు స్కిన్ అనే విధానంలో ఆపరేషన్ నిర్వహించాం. రాష్ట్రంలో తొలి గుండెశస్త్రచికిత్స కోడుమూరుకు చెందిన గిడ్డయ్య(45)కు అయోటిక్ స్టెటోసిస్ అనే గుండెవ్యాధి ఉంది. ఆయనకు వాల్వ్ రీప్లేస్మెంట్ చేయాలి. ఆయనకు ఛాతి ఎముకలు కట్ చేయకుండా ఈ నెల 1వ తేదీన అరోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ చేశాము. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి ఆపరేషన్ చేయడం ఇదే మొదటిసారి. ఇలాంటి విదానం వల్ల రోగికి తక్కువగా నొప్పి ఉండి, త్వరగా కోలుకునే అవకాశం ఉంది. నెలరోజుల్లోనే ఆయన వంద కిలోల బరువు కూడా ఎత్తే సామర్థ్యం వస్తుంది. -
ఇలాంటి డాక్టర్ దేవుళ్లూ ఉన్నారు
చెన్నై: కాసుల కక్కుర్తి కోసం శవాలకు సైతం చికిత్సలు చేసే కార్పొరేట్ డాక్టర్లున్న నేటి సమాజంలో లక్షలాది రూపాయలు వచ్చే అదే కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య వృత్తిని కాలదన్ని పేద పిల్లల గుండెలకు ఉచితంగా ఆపరేషన్లు చేస్తూ నిండు ప్రాణాలను నిలబెడుతున్న డాక్టర్లు కూడా ఉన్నారు. డాక్టర్ గోపి నల్లయాన్, డాక్టర్ హేమప్రియ నటేషన్ దంపతులు ఈ కోవకు చెందిన వారే. వృత్తిరీత్య హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో పనిచేసిన ఈ డాక్టర్ దంపతులు గుండె జబ్బులతో బాధ పడుతున్న తమ పిల్లలకు శస్త్రచికిత్సలు చేయించేందుకు డబ్బుల్లేక బాధపడుతున్న ఎంతోమంది తల్లిదండ్రుల దీనస్థితిని చూసి కరిగిపోయారు. అంతే కార్డియాలజి నిపుణులైన డాక్టర్ గోపి దంపతులు తాము చేస్తున్న కార్పొరేట్, ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేసి మధురై కేంద్రంగా ‘లిటిల్ మోపెట్ హార్ట్ ఫౌండేషన్’ ఏర్పాటు చేసి ‘కాంజెనిటల్ హార్ట్ డిసీస్’తో బాధపడుతున్న పేద పిల్లలకు ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నారు. పుట్టుకతో వచ్చే ఈ జబ్బు వల్ల మన దేశంలో ఏటా 78 వేల మంది పిల్లలు మరణిస్తున్నారు. ఈ జబ్బును సకాలంలో గుర్తించకపోవడం వల్ల, గుర్తించినా ఆపరేషన్ చేయించే ఆర్థిక స్థోమత లేకపోవడం వల్లనే ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారు. ఈ ఆపరేషన్‌కు మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారు. గతేడాది నవంబర్ నెలలోనే హార్ట్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసిన డాక్టర్ గోపి ఇంతవరకు 500 ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద పిల్లల్లో ఈ జబ్బును ముందుగానే గుర్తించేందుకు ఈ డాక్టర్ దంపతులు ఊరూరు, గడపగడప తిరుగుతూ పిల్లలకు గుండె పరీక్షలు చేస్తున్నారు. ఆపరేషన్ అవసరమైన వారికి మధురైలో ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో భారీ జీతాలు అందుకున్నప్పుడు లేని ఆనందం పేద తల్లిదండ్రుల కళ్లల్లో కనిపించే ఆనందమే తమకు ఎక్కువ తృప్తిని ఇస్తోందని డాక్టర్ హేమప్రియ చెప్పారు. పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలకు వెళ్లి వైద్య పరీక్షలు చేయడంకన్నా గ్రామీణ ప్రాంతాల్లోని ఇంటింటికి తిరుగుతూ వైద్య పరీక్షలను చేయడం వల్ల తమకు ఎక్కువ ప్రయోజనం ఉన్నట్లు తెల్సిందని చెప్పారు. ముందుగా మదురైతోపాటు సమీపంలోని అన్ని జిల్లాలో నివసిస్తున్న పేద ప్రజల పిల్లలకు హార్ట్ స్క్రీనింగ్ చేయాలనుకుంటున్నామని, ఫౌండేషన్‌కున్న పరిమితమైన నిధుల కారణంగా ఆశించిన మేరకు పనిచేయలేకపోతున్నామన్న కాస్త బాధ తప్పించి తాము సంతృప్తిగా వైద్య వృత్తిని జీవితంగా గడుపుతున్నామని డాక్టర్ గోపీ వ్యాఖ్యానించారు. వోర్సెస్, శ్యామ్ అనే తమ ఇద్దరు పిల్లలకు గోపీ దంపతులు గత డిసెంబర్ నెలల ఉచితంగా ఉపరేషన్ చేశారని, ఇప్పుడు తమ పిల్లలు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఆ పిల్లల తల్లిదండ్రులు తెలిపారు. -
స్టెంట్ల కొరత సృష్టిస్తే లైసెన్సులు రద్దు
కేంద్రమంత్రి అనంతకుమార్ బనశంకరి (బెంగళూరు): గుండె శస్త్ర చికిత్సలో ఉపయోగించే స్టెంట్ ధరలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఔషధ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్ హెచ్చరించారు. స్టెంట్ల ఉత్పత్తి గతంలో మాదిరిగానే కొనసాగాలని స్పష్టం చేశారు. స్టెంట్ ధర తగ్గించడం చరిత్రాత్మక నిర్ణయమా? కాదా? అనే అంశంపై శుక్రవారం బెంగళూరులో ఏర్పాటు చేసిన సదస్సులో మంత్రి పాల్గొని మాట్లాడారు. తగ్గించిన ధరలు ఈ నెల 13 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయన్నారు. సాధారణ స్టెంట్ (మెటల్స్టెంట్) మార్కెట్లో రూ.40 వేల నుంచి రూ. 50 వేలకు విక్రయించేవారని, ఇకపై రూ.7,260 కంటే ఎక్కువ ధరకు విక్రయించరాదని ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. ప్రత్యేక స్టెంట్లు రూ.లక్షా 70 వేలకు విక్రయించేవారని, ఇకపై వీటిని రూ.29,600 కంటే అధిక ధరకు విక్రయించరాదన్నారు. నియమాలు ఉల్లంఘించిన సంస్థల అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. -
స్టెంట్ల ధరలు 85 శాతం తగ్గింపు
-
స్టెంట్ల ధరలు 85 శాతం తగ్గింపు
హృద్రోగులకు కేంద్రం తీపికబురు ► మెటల్ స్టెంట్ రూ. 7,260గా, డ్రగ్ స్టెంట్ రూ. 29,600గా నిర్ణయం ► సవరించిన ధరలు తక్షణం అమల్లోకి న్యూఢిల్లీ: లక్షలాది మంది హృద్రోగులకు ఊరట నిచ్చేలా స్టెంట్ల ధరలు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గుండె శస్త్ర చికిత్సలో ఎంతో కీలమైన కరోనరీ స్టెంట్ల ధరల్ని 85 శాతం మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బేర్ మెటల్ స్టెంట్ (బీఎంఎస్) ధరను రూ. 7,260గా, డ్రగ్ ఎలుటింగ్ స్టెంట్ (డీఈఎస్) ధరను రూ. 29,600గా నిర్ణయిం చామని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంత్ కుమార్ మంగళవారం తెలిపారు. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. వ్యాట్, స్థానిక పన్నులతో కలిపి గరిష్టంగా బీఎంఎస్ రూ.7,623కు, డీఈఎస్ రూ.31,080కు దొరుకుతుం దని చెప్పారు. ఇప్పటివరకు బీఎంఎస్ ధర గరిష్టంగా రూ. 45 వేలు ఉండగా, డీఈఎస్ రూ. 1.21 లక్షల వరకూ ఉండేది. ప్రస్తుతం కంపెనీల వద్ద ఉన్న స్టెంట్ల నిల్వలకు కూడా సవరించిన ధరల్ని అమలు చేయాలని, ఒకవేళ రోగుల నుంచి ఎక్కువ వసూలు చేస్తే... ఆస్పత్రులు, స్టెంట్ల సరఫరా దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అనంత్ కుమార్ హెచ్చరించారు. రూ. 4,450 కోట్ల మేర తగ్గనున్న భారం ‘పలు ఆస్పత్రుల్లో కరోనరీ స్టెంట్ల ధరలు భారీగా ఉండడంపై కొనసాగుతున్న ఆందోళనకు ముగింపు పలకాలనుకున్నాం. ఎంతో జాగ్రత్తగా ఆలోచించి, వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకున్న అనంతరం జాతీయ ఫార్మాస్యూటికల్ ధరల సంస్థ (ఎన్ పీపీఏ) స్టెంట్ల గరిష్ట ధరను నిర్ణయించింది’ అని మంత్రి చెప్పారు. ఈ తగ్గింపుతో ఏడాదికి రూ. 4,450 కోట్ల మేర గుండె సంబంధిత రోగులపై భారం తగ్గుతుందన్నారు. స్టెంట్ల సరఫరాలోని వివిధ దశల్లో ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నట్లు కనుగొన్నామని ఎన్ పీపీఏ పేర్కొంది. దీంతో ఆర్థికంగా రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, వారికి ఊరటనిచ్చేలా కరోనరీ స్టెంట్ల గరిష్ట ధరల్ని తక్షణం సవరించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ప్రభుత్వ ప్రకటనను పలు వైద్య విభాగాలు స్వాగతించాయి. కొన్ని ఆస్పత్రుల అనైతిక చర్యలకు ఈ నిర్ణయంతో చెక్ పెట్టారంటూ ఆలిండియా డ్రగ్ యాక్షన్ నెట్వర్క్, డాక్టర్స్ ఆఫ్ ఎథికల్ హెల్త్‌కేర్‌లు ప్రశంసించాయి. -
కరీంనగర్లో చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు
-
సీమలో తొలిసారిగా బీటింగ్ హార్ట్ సర్జరీ
–పెద్దాసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు గుండె పనిచేస్తుండగానే శస్త్రచికిత్స ద్వారా రక్తనాళాలను విజయవంతంగా సరిచేశారు. వివరాలను సోమవారం ఆసుపత్రిలోని కార్డియాలజి విభాగంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్డియోథొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి వివరించారు. అనంతపురం జిల్లా వజ్రకరూర్కు చెందిన తిరుపాల్‌నాయక్(42) నెలరోజుల క్రితం గుండెపోటుతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేరాడు. కార్డియాలజి విభాగాధిపతి డాక్టర్ పి.చంద్రశేఖర్ ఆయనకు ప్రథమ చికిత్స అందించి, అనంతరం యాంజియోగ్రామ్ పరీక్ష నిర్వహించారు. గుండెకు రక్తం సరఫరా చేసే మూడునాళాల్లో ఒకటి మూసుకుపోయి ఉన్నట్లు గుర్తించారు. అన్ని రకాల వైద్యపరీక్షల అనంతరం గత శనివారం కార్డియోథొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, కార్డియాలజిస్టులు డాక్టర్ పి.చంద్రశేఖర్, డాక్టర్ మహ్మద్అలి నేతృత్వంలో గుండె కొట్టుకుంటుండగానే బైపాస్ సర్జరీ చేశారు. డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ బీటింగ్ హార్ట్ సర్జరీ చేయడం చాలా కష్టంతో కూడుకున్నదన్నారు. హార్ట్‌లంగ్ మిషన్ సహాయం లేకుండానే ఆఫ్మిషన్ పద్ధతిలో ఈ శస్త్రచికిత్స నిర్వహించామన్నారు. వెంట్రుకవాసి కంటే సన్నటి దారంతో 8 కుట్లు వేశామన్నారు. రోగికి 12.30 గంటలకు ఆపరేషన్ పూర్తయితే సాయంత్రం 4.30 గంటలకే వెంటిలేటర్ తొలగించామన్నారు. ఇలాంటి ఆపరేషన్‌లో రక్తస్రావం తక్కువగా ఉంటుందని, నొప్పి కూడా ఎక్కువగా ఉండదన్నారు. అందువల్ల రోగి త్వరగా కోలుకుంటాడని చెప్పారు. ఊపిరితిత్తులు, మూత్రపిండాల సమస్యలున్న వారికి ఇలాంటి ఆపరేషన్ ఎంతో ఉపయోగకరమన్నారు. ఎన్టిఆర్ వైద్యసేవ పథకం కింద ఈ ఆపరేషన్‌ను రోగికి ఉచితంగా చేశామని, అదే ప్రైవేటులో అయితే రూ.5లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. ఈ విభాగం ప్రారంభమైన రెండు నెలలు కూడా కాకముందే 19 గుండెశస్త్రచికిత్సలు చేశామని, అందులో 12 ఓపెన్ హార్ట్ సర్జరీలు ఉన్నాయన్నారు. ఈ విభాగంలో అన్ని రకాల వసతులు, సదుపాయాలు, మందులు ఉన్నాయి కాబట్టే ఇలాంటి శస్త్రచికిత్సలు చేయగలుగుతున్నామని వివరించారు. సమావేశంలో కార్డియాలజిస్టులు డాక్టర్ పి.చంద్రశేఖర్, డాక్టర్ మహమ్మద్ అలి పాల్గొన్నారు. -
గాటు తక్కువ.. రిలీఫ్ ఎక్కువ!
ఇప్పటికీ సంప్రదాయ గుండె శస్త్రచికిత్సలు జరుగుతూనే ఉన్నాయి. ఒకసారి గుండెజబ్బు వచ్చాక కొన్నిసార్లు భవిష్యత్తులో వచ్చే గుండెపోటు ప్రమాదాన్ని నివారించడానికి గుండె ఆపరేషన్ చేయడం మామూలే. దీన్ని ఓపెన్‌హార్ట్ సర్జరీ అని కూడా వ్యవహరిస్తుంటారు. సంప్రదాయ గుండె శస్త్రచికిత్సలో సరిగ్గా ఛాతీ మధ్య భాగాన ఒక గాటు పెడతారు. ఆ తర్వాత గుండెను చేరేవరకు ఛాతీని తెరుస్తారు. ఇలా సంప్రదాయ శస్త్రచికిత్స చేసే సమయంలో గుండెను చేరడానికి మన ఉరఃపంజరంలోని రెండు వైపులా పక్కటెముకలను కలిపి ఉంచే ప్రధాన ఛాతీ ఎముకను కోయాల్సి ఉంటుంది. సంప్రదాయ ఆపరేషన్ ఎలా చేస్తారు...? ఈ స్టెర్నమ్‌ను తెరవడం ఒకింత శ్రమతో కూడుకున్న వ్యవహరమే. ఛాతీపై చర్మాన్ని కట్ చేశాక... స్టెర్నమ్‌ను కూడా కట్ చేసి రెండు వైపులా విస్తరించాలి. ఛాతీ ఎముకకు ఇరువైపులా పంజరంలా పక్కటెముకలు ఉంటాయి. పక్కటెముకలన్నీ కలిసి ఒక పంజరంగా (ఉరఃపంజరంగా) ఏర్పడి మనలోని కీలకమైన అవయవాలైన గుండె, ఊపిరితిత్తులు వంటి అవయవాలను భద్రంగా సంరక్షిస్తుంటాయి. ఆ పంజరాన్ని ఛేదించి రెండు వైపులా ఇలా విస్తరించడం ఒకింత కష్టమే. పైగా బలంగా విస్తరించే సమయంలో వెనకవైపు ఉండే వెన్నుపూసలపై కూడా ఒత్తిడి పడుతుంది. కొందరిలో ఈ పక్కటెముకల పంజరాన్ని కనీసం 6-7 సెంటీమీటర్లు వెడల్పు చేయాల్సి ఉంటుంది. అరుదుగా మరికొందరిలో 10 సెంటీమీటర్లు కూడా జరపాల్సి వస్తుంది. సంప్రదాయ చికిత్సలో ప్రయోజనం: ఛాతీ ఎముకలను విప్పి చేసే సంప్రదాయ చికిత్సలో ప్రయోజనం ఏమిటంటే గుండెను పూర్తిగా, స్పష్టంగా చూడవచ్చు. అది పూర్తిగా కనిపిస్తుంటుంది. అదే తక్కువగా గాటు పెట్టినప్పుడు ఆపరేషన్ ఒకింత సంక్లిష్టమవుతుంది. మరి తక్కువ గాటు ఆపరేషన్ ఎందుకు...? గుండె స్పష్టంగా కనిపించడం మాట ఎలా ఉన్నా... సంప్రదాయ చికిత్సలో అంత పెద్ద పంజరాన్ని పూర్తిగా పక్కలకు నెట్టడం వల్ల ఛాతీ పూర్తిగా కదిలిపోతుంది. అక్కడ ఎదుర్రొమ్ము ఎముక చీల్చిన ప్రదేశంలో నొప్పి కూడా ఎక్కువగానే ఉంటుంది. సంప్రదాయ ఆపరేషన్‌లో 20 నుంచి 25 సెంటీమీటర్ల గాటు ఉంటే, తక్కువ గాటు చేసే చికిత్సలో కేవలం 6 సెంటీమీటర్ల మేరకు గాటు పెడితే చాలు. మరోమాటలో చెప్పాలంటే కేవలం మూడు వేళ్లు దూర్చేంత గాటు మాత్రమే ఈ తక్కువ గాటు శస్త్రచికిత్స ( మినిమమ్ ఇన్వేసివ్ సర్జరీ)లో సరిపోతుంది. తక్కువ గాటు సర్జరీ ప్రక్రియలో కుడి పక్కన ఉండే ధమనుల నుంచి గుండె లోపలికి పంపించే ఒక పరికరం (క్యాథెటర్) సహాయంలో గుండెలోని కవాటాలను మార్చడం లేదా రిపేర్ చేయడం వంటి చికిత్స చేయవచ్చు అలాగే ఎడమవైపు ఉండే రక్తనాళాల్లోకి క్యాథెటర్‌ను పంపి బైపాస్ సర్జరీని చేయవచ్చు. వాల్వ్‌ను సరిదిద్దాలంటే కుడివైపున ఉండే రక్తనాళాల్లోకి క్యాథెటర్‌ను పంపుతారు. తక్కువ గాటు శస్త్రచికిత్సలో... గుండె స్పందిస్తూ... శరీరంలోని అన్ని అవయవాలకూ రక్తాన్ని సరఫరా చేస్తుందన్న విషయం తెలిసిందే. రక్తంతో నిండి ఉన్న గుండె పెద్ద పరిణామంలో ఉంటుంది. అయితే గుండెకు రక్తసరఫరా ఆపేస్తారు. గుండె చేసే పని హార్ట్ లంగ్ మిషన్ అనే యంత్రం చేసేలా జాగ్రత్త తీసుకుంటారు. అప్పుడు గుండెకు రక్తసరఫరా తగ్గడంతో గుండె సైజ్ కుంచించుకుపోతుంది. ఉన్న ఖాళీలో గుండె సైజ్ తగ్గడంతో చిన్న గాటు సహాయంతోనే గుండెకు చేయాల్సిన రిపేర్లు సులువుగా చేయవచ్చు. ఈలోపు గుండె చేయాల్సిన పని హార్ట్ లంగ్ మెషిన్ చేస్తుంది. తక్కువ గాటు సర్జరీ ప్రయోజనాలు... సంప్రదాయ చికిత్సలో గాయం 25 సెం.మీ. ఉంటుంది. ఆ గాయం చాలా పెద్దది కావడంతో మానడానికి పట్టే సమయం కూడా ఎక్కువే. అది మానడానికి కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది. అయితే తక్కువ గాటుతో చేసే ఆపరేషన్‌లో గాటు సైజు కేవలం ఆరు సెంటీమీటర్లు కావడంతో అది మాని, కోలుకునేందుకు పట్టే సమయం కూడా చాలా తక్కువ గాయం తక్కువ కావడంతో రక్తస్రావం అయ్యే అవకాశాలు కూడా తక్కువ గాయం తక్కువ కావడంవల్ల ఇన్ఫెక్షన్కు ఆస్కారం కూడా తక్కువే అల్పాదాయ వర్గాల్లో హృద్రోగం వల్ల ఎక్కువ కాలం పనికి వెళ్లకుండా ఉండటం ఆర్థికంగా భారమే. ఇక చాలా కీలకమైన బాధ్యతలు నిర్వహించే వారు సైతం ఎక్కువ రోజులు తమ బాధ్యతలకు దూరంగా ఉండటం సాధ్యం కాదు. తక్కువ గాటు సర్జరీ వల్ల ప్రయోజనం ఈ రెండు వర్గాలకూ చేకూరుతుంది. . భవిష్యత్తులో : గుండె సర్జరీల్లో మొదట 25 సెంటీమీటర్ల గాటుతో చేసే శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు కేవలం 6 సెంటీమీటర్ల గాటుతో చేయగల శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. ఇక భవిష్యత్తులో కేవలం చిన్న రంధ్రం మాత్రమే పెట్టి (కీ-హోల్) చేయగల సర్జరీలు అందుబాటులోకి రానున్నాయి. తద్వారా అటు ఖర్చు, ఇటు కోలుకునే సమయం రెండూ తగ్గే అవకాశాలు ఉన్నాయి. గుండె సర్జరీ అంటే గుండెకోత పెట్టాల్సింది. కానీ ఆ గుండెకోత కూడా అవసరం లేకుండానే గుండెకు శస్త్రచికిత్స సాధ్యమైతే...? అవుతుంది. అదే మినిమల్లీ ఇన్వేజివ్ హార్ట్ సర్జరీ. దీని గురించి తెలుసుకుందాం రండి... గుండె కవాటాలు... వాటి సమస్యలు గుండెలోని రక్తం ఒకవైపు ప్రవహించడానికి కవాటాలు (వాల్వ్స్) తోడ్పడతాయి. గుండెలో నాలుగు కవాటాలు ఉంటాయి. అవి... ట్రైకస్పిడ్ వాల్వ్, పల్మునరీ వాల్వ్, మైట్రల్ వాల్వ్, అయోర్టిక్ వాల్వ్. ఈ నాలుగు వాల్వ్స్లోనూ ప్రధానంగా రెండు రకాల సమస్యలు రావచ్చు. అవి... 1. వాల్స్సన్నబడటం (స్టెనోసిస్) 2. వాల్వ్ లీక్ కావడం (రీగర్జిటేషన్) వాల్వ్స్ సమస్యలకు కారణాలు.. కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల రుమాటిక్ హార్ట్ డిసీజెస్ వల్ల మరికొందరిలో ఇవి పుట్టుకతోనే రావచ్చు ఇంకొందరిలో వయసు పెరగడం వల్ల రావచ్చు. వాల్వ్స్ సమస్యలు... లక్షణాలు: హార్ట్ ఫెయిల్యూర్ వల్ల ఆయాసం పొడిదగ్గు పడుకుంటే ఆయాసం వల్ల నిద్ర నుంచి లేవాల్సి రావడం గుండెదడ గుండె దడ (పాల్పిటేషన్స్) నీరసం ఒక్కోసారి గుండెనొప్పి కూడా రావచ్చు. ప్రత్యేక లక్షణాలు: ఈ సాధారణ లక్షణాలతో కొందరిలో సమస్య వచ్చిన వాల్వ్‌ను బట్టి నిర్దిష్టంగా కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. ఉదాహరణకు... ట్రైకస్పిడ్ వాల్వ్ లీక్ (రీగర్జిటేషన్) సమస్యలో కాళ్లలో వాపు కనిపిస్తుంది మైట్రల్ వాల్వ్ సన్నబడటం (స్టెనోసిస్) అయితే రక్తపు వాంతులు కావచ్చు అయోర్టిక్ వాల్వ్ సన్నబడితే స్పృహ తప్పవచ్చు. ట్రాన్స్ ఈసోఫేజియల్ కార్డియోగ్రామ్ ఒక వరం... ఇప్పుడు ట్రాన్స్ ఈసోఫేజియల్ ఎకో కార్డియోగ్రామ్ అనే పరీక్ష వల్ల గుండెను మరింత స్పష్టంగా చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్దిష్టంగా సమస్య ఒక్కచోటే ఉంటే మొత్తం వాల్వ్‌ను మార్చవచ్చు. వాల్వ్స్ సమస్యలకు చికిత్స ఇలా: వాల్వ్ సమస్యలకు కొంతవరకు మందులతో చికిత్స చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో మందులతో చికిత్స సాధ్యం కాకపోతే రోగి పరిస్థితి( కండిషన్)ని బట్టి సర్జరీ అవసరం అవుతుంది. అంటే... మైట్రల్ వాల్వ్ సన్నగా మారితే (స్టెనోసిస్) అలాంటి రోగుల్లో బెలూన్ వాల్విలోప్లాస్టీ అనే చికిత్స ద్వారా సన్నబడ్డ వాల్వ్‌ను తిరిగి తెరవవచ్చు మిగతా వాల్వ్స్ సన్నగా మారి, లీక్ అవుతున్న సందర్భాల్లో ఈ వాల్విలోప్లాస్టీ ప్రక్రియ సాధ్యం కాదు. అలాంటప్పుడు వాల్వ్ రీప్లేస్మెంట్ అన్నదే పరిష్కారం. వాల్వ్‌ను రీప్లేస్ చేసే క్రమంలో రెండు రకాల వాల్వ్స్‌ను ఉపయోగించవచ్చు. 1) మెటల్ వాల్వ్ 2) టిష్యూ వాల్వ్ మెకానికల్ వాల్వ్ (మెటల్ వాల్వ్)ను ఉపయోగించినప్పుడు ఒక ప్రతికూలత (డిజట్వాంటేజ్) ఉంది. ఇలాంటి రోగులకు జీవితాంతం రక్తాన్ని పలచవార్చే మందు అసిట్రోమ్ వాడాలి ఇక టిష్యూ వాల్వ్ అన్నవి ఇతర జంతువుల కండరాలతో చేసినవి. ఈ వాల్వ్స్‌ను వాడిన వాళ్లలో రక్తాన్ని పలుచబార్చే మందు ఎసిట్రోమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది 15 ఏళ్ల వరకు పనిచేస్తుంది. వాల్వ్స్కు సరికొత్త చికిత్స ప్రక్రియలివే ప్రస్తుతం వాల్వ్స్కు వచ్చే సమస్యలకు సర్జరీ కంటే వాల్వ్‌ను రిపేరు చేయడానికే ప్రాధాన్యం. ఎందుకంటే... వాల్వ్ రీప్లేస్ చేయడం కంటే ఉన్నవాల్వ్ ఎప్పుడూ మెరుగైనది కావడం వల్ల ఇప్పుడు వైద్యనిపుణులు రిపేర్‌కే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. పైగా ఉన్న వాల్వ్నే రిపేర్ చేసిన సందర్భాల్లో జీవితాంతం వాడాల్సిన ఎసిట్రోమ్ (రక్తాన్ని పలుచబార్చే మందు)ను వాడాల్సి అవసరం లేదు. కాబట్టే ఇప్పుడు వాల్స్‌ను (ప్రత్యేకంగా మైట్రల్, ట్రైకస్పిడ్ వాల్వ్స్ అయితే) రిపేర్ చేయడానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. మహాధమని (అయోర్టా)తో జాగ్రత్త...! నా వయసు 42 ఏళ్లు. ఒక ప్రైవేట్ ఆఫీసులో పనిచేస్తున్నాను. గత కొంతకాలం నుంచి నేను ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నాను. మొదట్లో నాకు ఛాతీలో నొప్పి వచ్చేది. ఆ నొప్పి వెన్ను మీద నుంచి భుజాల వరకు పాకేది. నాకు సిగరెట్ అలవాటు ఉంది. బీపీ వచ్చిందేమోనని అనుమానంతో డాక్టర్ని కలిస్తే అదేమీ లేదంటూ కొన్ని మందులు రాసిచ్చారు. వాడాను. తగ్గకపోగా తరచూ కడుపునొప్పి రావడంతో పాటు నా గొంతు బొంగురుపోవడాన్ని గమనించాను. మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్లాను స్కానింగ్ చేసి అయోర్టా సమస్య ఉందని చెప్పారు. అసలు అయోర్టా అంటే అంటే ఏమిటి? ఇది ప్రాణాంతకమైనదా? దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - సుబ్బారావు, నెల్లూరు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తుంటే మీరు ‘అయోర్టిక్ వాల్‘ (మహాధమని)కి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. ఇది మన శరీరంలోని చాలా ముఖ్యమైన రక్తనాళం. గుండె నుంచి ఇతర అవయవాలన్నింటికీ శుద్ధి చేసిన రక్తాన్ని సరఫరా చేసే అతి పెద్ద రక్తనాళం ఇది. ఇది సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. రక్తప్రసరణ వేగానికి తగ్గట్లుగా ఇది సాగడం మళ్లీ ముడుచుకుపోవడం చేస్తుంది. అయితే ఈ మహాధమని (అయోర్టా)లోని ఏదో ఒక భాగం ఉబ్బిపోతే ‘అయోర్టిక్ అన్యురిజమ్’ సమస్య ఏర్పడుతుంది. ఒక్కోసారి ఉబ్బిన భాగం పగిలిపోయి తీవ్ర రక్తప్రావం జరిగి మరణానికి దారితీస్తుంది. ఈ సమస్య రక్తపోటు, గుండెజబ్బు, కొవ్వు అధికంగా తీసుకోవడం, వయసు పైబడటం, పొగతాగడం వల్ల వస్తుంది. అంతేకాకుండా జన్యుపరంగా గానీ రక్తనాళంలో అరుగుదల వల్లగానీ ఈ అయోర్టిక్ వాల్ సమస్య తలెత్తవచ్చు. ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు చాలా సందర్భాల్లో బయటకు కనిపించవు. అందుకే దీన్ని సెలైంట్ కిల్లర్‌గా వైద్యులు పరిగణిస్తారు. ఈ వ్యాధి రెండు భాగాలుగా సంక్రమించే అవకాశం ఉంది. ఒకటి థొరాసిక్ అన్యురిజమ్, రెండు అబ్డామినల్ అయోర్టిక్ అన్యురిజమ్. మీకు పొగతాగే అలవాటు ఉన్నట్లు చెప్పారు. మీ విషయానికి వస్తే మీరు చెబుతున్న లక్షణాలు ‘ధొరాసిక్ అన్యురిజమ్’తో సరిపోలుతున్నాయి. కాబట్టి మీరు వెంటనే అన్ని సౌకర్యాలు ఉన్న ఆసుపత్రికి వెళ్లి, అక్కడ నిపుణులైన ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్‌కు చూపించండి. వారు మీకు అల్ట్రాసౌండ్, సీటీస్కాన్ వంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్ధారణ జరుపుతారు. రిపోర్టుల్లో మీరు హైరిస్క్ కేటగిరిలో ఉన్నట్లు తేలితే ఏమాత్రం అధైర్యపడకండి. ఈ సమస్యకు అత్యాధునికమైన చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. కత్తిగాటు లేకుండా మినిమల్లీ ఇన్వేజిక్ ప్రక్రియ (సర్జరీ) ద్వారా స్టెంట్ అమర్చి దెబ్బతిన్న రక్తనాళం భాగాన్ని మరమ్మతు చేయవచ్చు. ఆలస్యం చేస్తే అయోర్టిక్ అన్యురిజమ్లో రక్తపు గడ్డలు పగిలి వాటి అవశేషాలు రక్తప్రసరణలో చేరి మెదడుకు చేరుకొని స్ట్రోక్ (పక్షవాతం)కు దారితీయవచ్చు. అది ప్రాణాపాయం కూడా కావచ్చు. మీరు ఇక ఎంతమాత్రమూ ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా ఒక మంచి కార్డియాలజిస్ట్‌ను కలిసి చికిత్స చేయించుకోండి. -
'ఆ తరువాతే లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నా'
న్యూఢిల్లీ: గతంలో తాను చేయించుకున్నహార్ట్ సర్జరీ జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో నేర్పిందని వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ స్పష్టం చేశాడు. తాను సర్జరీ చేయించుకున్నతరువాత జీవిత పరమార్థం బోధ పడిందని తెలిపాడు. దాదాపు 11 సంవత్సరాల క్రితం వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా గుండె సంబంధిత సమస్య తీవ్రంగా ఇబ్బంది పడిన గేల్.. అదే సమయంలో సర్జరీ చేయించుకున్నాడు. ఈ విషయంపై స్పందించిన గేల్.. తాను సర్జరీ చేయించుకునే సమయానికి గుండెలో రంధ్రం ఉన్న సంగతి ఎవ్వరికీ తెలియదన్నాడు. ' ఆస్ట్రేలియా పర్యటనలో గుండె సమస్యతో బాధపడ్డా. ఆస్ట్రేలియాలోని చికిత్స చేయించుకోవడానికి వెళితే గుండెలో హోల్ ఏర్పడినట్లు డాక్టర్లు చెప్పారు. అప్పటివరకూ నా సమస్య ఏ ఒక్కరికీ తెలియదు. కనీసం నా తల్లి దండ్రులకు కూడా ఈ విషయం తెలియదు. అయితే హార్ట్ సర్జరీకి వెళుతున్న విషయాన్ని మాత్రమే తల్లి దండ్రులకు చెప్పా'అని తన ఆత్మకథ '‘సిక్స్ మెషీన్-ఐ డోన్ట్ లైక్ క్రికెట్... ఐ లవ్ ఇట్’ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమానికి ఢిల్లీ వచ్చిన గేల్ తెలిపాడు. ఆ తరువాత జీవితం విలువ ఏమిటో జ్ఞానబోధ అయినట్లు గేల్ అన్నాడు. ఆ సర్జరీ తన మొత్తం జీవిత శైలినే మార్చేసిందని, ఆ క్రమంలోనే ఎంజాయ్ చేయడం మొదలు పెట్టానని పేర్కొన్నాడు. -
చిన్నారి గుండెకు భరోసా
విజయవాడ(లబ్బీపేట) : గుండె వ్యాధులతో బాధపడుతున్న 19 మంది చిన్నారులకు ఉచిత శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు ఆంధ్రా హాస్పిటల్ ఎండీ డాక్టర్ పీవీ రమణమూర్తి తెలిపారు. ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇంగ్లాండుకు చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్, యూకే చారిటీలు చిన్నారులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. నగరంలోని ఆం్ర«ధా హాస్పిటల్స్‌తో కలిసి ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు శిబిరం నిర్వహించినట్లు చెప్పారు. గత ఏడాది డిసెంబరు నుంచి ఇప్పటి వరకూ మూడు శిబిరాలు నిర్వహించి 52 మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ సాయం కోరనున్నట్లు వివరించారు. యూకే నుంచి వచ్చిన పిడియాట్రిక్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ కుడముల మాట్లాడుతూ తాము నిర్వహించిన శస్త్ర చికిత్సలన్నీ అత్యంత క్లిష్టతరమైనవేనన్నారు. కొంత మందికి గుండెలో రం్ర«థాలు, ఊపిరితిత్తుల రక్తనాళాల్లో వత్తిడి ఎక్కువుగా ఉండటం, మూడు లేక నాలుగు రకాల గుండె సమస్యలు ఉన్న చిన్నారులకు విజయవంతంగా గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు. డాక్టర్ ప్రేమ్ మాట్లాడుతూ ఇండియాకు వచ్చి చిన్నారులకు శస్త్ర చికిత్సలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సమావేశంలో ఆంధ్రా హాస్పిటల్స్ పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పీవీ రామారావు, యూకే వైద్య బృందంలోని సభ్యులు డాక్టర్ నయన్సెట్టి, డాక్టర్ సైనుల్లా, మెరిజోనా, జూలి, రేచల్ ఉన్నారు. -
'మోదీ తాత చాక్లెట్లిచ్చారు'
పుణె: నిజమైన ఆనందమంటే ఆరేళ్ల వైశాలిదే. చిల్లు పడిన తన గుండెను సరిచేయడానికి సహకరించి ప్రధానమంత్రిని కలుసుకున్నప్పుడు ఆమె ముఖంలో కనిపించిన సంతోషం.. బహుశా నరేంద్ర మోదీకి కూడా కిక్ ఇచ్చి ఉండొచ్చు. ప్రధాని కార్యాలయం(పీఎంవో) సహకారంతో ఇటీవలే గుండె ఆపరేషన్ చేయించుకున్న చిన్నారి వైశాలి శనివారం పుణెలో ప్రధానమంత్రిని కలుసుకుంది. స్మార్ట్ సిటీ మిషన్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు శనివారం పుణె వచ్చిన ప్రధాని మోదీ కాస్తంత తీరికచేసుకునిమరీ చిన్నారితో మాట్లాడారు. (చదవండి: హృద్రోగ బాలిక లేఖకు పీఎంఓ స్పందన) కుటుంబ సభ్యులతో కలిసి తన వద్దకు వచ్చిన వైశాలిని ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించారు. మరాఠీ భాషలో ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అటుపై గుప్పెడు చాక్లెట్లు ఇచ్చి సంతోషపెట్టారు. భేటీ అనంతరం వైశాలి కుటుంబసభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. 'మోదీగారి దయవల్లే మా పాప బతికింది. ఎలాంటి బెరకు లేకుండా ప్రధానితో మాట్లాడిన వైశాలి.. 'మోదీ తాత నాకు చాక్లెట్లిచ్చారని' అందరితో చెప్పుకుంటోంది. ఆయన మేలును మర్చిపోం' అని అన్నారు. వైశాలిని కలుసుకోవడం సంతోషంగా ఉందటూ భేటీ అనంతరం ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. Young Vaishali wrote to me seeking help for her heart surgery. Glad that we were able to help this little girl. pic.twitter.com/oj0007vIsa — Narendra Modi (@narendramodi) 25 June 2016 -
మాకెందుకీ శాపం..!
అనారోగ్యంతో మంచానపడిన భార్యాభర్తలు ఒకరికి లివర్ కేన్సర్.. మరొకరికి హార్ట్ సర్జరీ మందులకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న దంపతులు {పైవేట్ టీచర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న పెద్ద కూతురు మానవతావాదులు ఆదుకోవాలని వేడుకోలు పోచమ్మమైదాన్ : వరంగల్ నగరంలోని 11వ డివిజన్ క్రిస్టియన్ కాలనీకి చెందిన మేకల నర్సయ్య, నిర్మల దంపతులకు ఇద్దరు కూతు ళ్లు అరుణ, అపర్ణ, కుమారుడు చందు ఉన్నారు. అరుుతే నర్సయ్య స్థానిక చక్కర్ బీడీ ఖార్కానాలో కొన్నేళ్ల నుంచి ప్యాకింగ్ పనులు చేస్తూ భార్య, పిల్లలను పోషించుకుంటున్నారు. కాగా, నర్సయ్య కొన్ని నెలల నుంచి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల నొప్పి ఎక్కువగా రావడంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆయనను హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లి హార్ట్ సర్జరీ చేరుుంచారు. అరుుతే గుండెకు ఆపరేషన్ జరగడంతో నర్సయ్య రోజువారీ పనులకు వెళ్లకుండా మంచానికే పరిమితమయ్యారు. భార్యకు లివర్ కేన్సర్.. కొద్ది రోజుల క్రితం నర్సయ్య హార్ట్ సర్జరీ చేయించుకుని ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో ఆయనకు సపర్యలు చేస్తుండడంతోపాటు భార్య నిర్మల స్థానికంగా ఉన్న కేక్‌ల ఫ్యాక్టరీలో రోజువారీ కూలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేది. అరుుతే పనులకు వెళ్లిన సమయంలో నిర్మలకు ఒకసారి కడుపులో తీవ్రంగా నొప్పి వచ్చింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు ఆమెను వరంగల్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు నిర్మల లివర్ కేన్సర్‌తో బాధపడుతున్నట్లు చెప్పారు. దీంతో నిర్మల సొంత ఖర్చులతో హైదరాబాద్‌లోని జీఎన్ఎమ్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంది. అరుుతే వారానికి మూడు రోజులు హైదరాబాద్‌కు వచ్చి చికిత్స పొందాలని, ప్రతి నెల రూ. 10వేలు విలువ చేసే మందులు వేసుకుంటేనే ఆరోగ్యం కొంతవరకు కుదుటపడుతుందని డాక్టర్లు చెప్పడంతో భార్యాభర్తలు బోరున విలపిస్తున్నారు. కూలీనాలి చేసుకుని కుటుం బాన్ని పోషించుకుంటున్న ఆ దంపతులపై రోగాల పిడుగు పడింది. మాయదారి జబ్బులతో వారు మంచానికే పరిమితమై బోరున విలపిస్తున్నారు. అరుుతే అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మానాన్నను కాపాడుకునేందుకు వారి పిల్లలు పడరాని పాట్లు పడుతున్నారు. మానవతావాదులు స్పందించి తమ తల్లిదండ్రుల ను ఆదుకోవాలని చేతులెత్తి వేడుకుం టున్నారు. హృద్రోగం, లివర్ కేన్సర్ తో తల్లడిల్లుతున్న నిరుపేద దంపతులపై ప్రత్యేక కథనం. మందులకు డబ్బులు లేక ఇబ్బందులు.. నర్సయ్య పెద్ద కూతురు అరుణ పీజీ పూర్తి చేసి స్థానికంగా ఉన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది. అరుుతే ఆమెకు నెలకు రూ. 2,500 వేతనం వస్తుండడంతోపాటు నర్సయ్యకు వృద్ధాప్య పిం ఛన్ కింద నెలకు రూ. 1000 వస్తుంది. దీంతో వచ్చిన డబ్బులతో అరుణ ఇంటి అవసరాలను తీర్చుతుం దే కానీ.. తల్లిదండ్రులకు మందులు కొనుగోలు చేయలేకపోతుంది. కాగా, నర్సయ్య కూతుర్లు, కొడుకు రోజు ఒక పూటనే భోజనం చేస్తూ రెండు రోజులకోసారి వారికి మందులు కొనుగోలు చేసి ఇస్తున్నారు. ఇదిలా ఉండగా, అనారోగ్యంతో బాధపడుతున్న నర్సయ్య దంపతుల పరిస్థితిని చూసిన స్థానికులు సుమారు 20 మంది ఇటీవల ఇంటికి రూ.100 చొప్పున వసూలు చేసి వారికి అందజేశారు. కాగా, అరు ణ రోజు మందులు వేసుకునే పరిస్థితి లేకపోవడంతో లివర్ సైజు పెరుగుతూ కడుపు ఉబ్బుతోంది. దీం తో తల్లిదండ్రుల అనార్యోగాన్ని చూడలేక పిల్లలు నిత్యం గుండెలవిసేలా రోదిస్తున్నారు. దాతలు ఆదుకోవాలి.. అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మానాన్నకు మందులు కొనుగోలు చేసి ఇచ్చేందుకు మా దగ్గర డబ్బులు లేవు. లివర్ కేన్సర్‌తో అమ్మ పొట్ట సైజు రోజురోజుకూ పెరుగుతోంది. గుండెకు ఆపరేషన్ జరగడంతో నాన్న ఏపనిచేసే పరిస్థితిలో లేడు. దాతలు సాయం అందించి అమ్మానాన్నకు మెరుగైన వైద్యం అందించాలి. సాయం చేసే మానవతావాదులు సెల్ నంబర్ 95738-25964లో సంప్రదించాలి. -అరుణ, అపర్ణ, చందు -
నవాజ్ షరీఫ్ త్వరగా కోలుకోవాలి: మోదీ
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ త్వరగా కోలుకోవాలని నరేంద్రమోదీ ముందస్తుగా ఆకాక్షించారు. ఈ మేరకు మోదీ ట్విట్టర్లో కామెంట్ చేశారు. నవాజ్ షరీఫ్ ఈ నెల31న గుండె ఆపరేషన్ కోసం బ్రిటన్ వెళ్లనున్నారని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా అసిఫ్ ధ్రువీకరించారు. వైద్యుల సూచన మేరకు ఆయన ఒక వారం పాటు లండన్ లో ఉంటారు. నవాజ్ కూతురు మర్యమ్ నవాజ్ కూడా ఆయనతోపాటు అండన్ వెళ్తున్నారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 2011లో ప్రధాని గుండెకు జరిగిన ఆపరేషన్ వల్ల ఇప్పుడు మరో సమస్య ఉత్పన్నమైందని, దీనిని వైద్యులు నిర్ధారించారని మార్యమ్ చెప్పారు. సర్జరీ కోసం వారం పాటు ప్రధాని బ్రిటన్ వెళ్లనున్నారని ఆయన క్షేమం కోసం పాకిస్థాన్ ప్రజలు అల్లాకు ప్రార్థనలు చేయాలని కోరారు. PM NS undergoing open heart surgery on Tuesday. Prayers are the most effect & potent medicine. Millions will pray for him. IA he'll be fine. — Maryam Nawaz Sharif (@MaryamNSharif) 27 May 2016 PM in 2011 had a cardiac procedure called 'Atrial Fibrillation Ablation', during which certain complications occurred resulting in..... — Maryam Nawaz Sharif (@MaryamNSharif) 27 May 2016 PM in 2011 had a cardiac procedure called 'Atrial Fibrillation Ablation', during which certain complications occurred resulting in..... — Maryam Nawaz Sharif (@MaryamNSharif) 27 May 2016 Perforation of heart which was in turn treated by open heart surgery. The PM for this reason had been visiting his doctor for the follow up. — Maryam Nawaz Sharif (@MaryamNSharif) 27 May 2016 Due to certain recent symptoms, doctors made further investigations. The team of cardiologists & cardiac surgeons after thorough examination — Maryam Nawaz Sharif (@MaryamNSharif) 27 May 2016 Scans & tests,have decided to go for an open heart surgery. He will be on specific medication for the next 3 days before his surgery on Tues — Maryam Nawaz Sharif (@MaryamNSharif) 27 May 2016 The recovery period & hospital stay will be one week & he will travel Insha'Allah back to Pak as soon as the doctors allow. Prayers needed. — Maryam Nawaz Sharif (@MaryamNSharif) 27 May 2016 -
చిన్నారులకు సాయం సంతృప్తికరం: సమంత
విజయవాడ (లబ్బీపేట) : ప్రత్యూష సపోర్ట్ చారిటీస్ సహకారంతో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న చిన్నారులకు గుండె శస్త్ర చికిత్సలు చేయించడం తనకు అత్యంత సంతృప్తి కలిగిస్తోందని ట్రస్టు నిర్వాహకురాలు, సినీ నటి సమంత పేర్కొన్నారు. పిల్లలకు వైద్య సహాయం అందించడం మంచి కార్యక్రమమని, ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం అందిస్తామని హామీ ఇవ్వడం సంతోషించదగిన విషయమన్నారు. ప్రత్యూష సపోర్టు చారిటీస్ సహకారంతో ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌లో 17మంది చిన్నారులకు యూకేకు చెందిన 11మంది వైద్యుల బృందం గుండె శస్త్రచికిత్సలు నిర్వహించిన విషయం విదితమే. ఈ సందర్భంగా వారితో మాట్లాడేందుకు సమంత శనివారం నగరానికి వచ్చారు. క్యాజువాలిటీలో ఉన్న చిన్నారులను చూసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. త్వరలో చెన్నైకు ట్రస్టు సేవలు విస్తరించనున్నట్లు తెలిపారు. ఆంధ్రా హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ పీవీ రమణమూర్తి మాట్లాడుతూ సమంత ప్రత్యూష సపోర్టు ట్రస్టు సహకారంతో ఇలాంటి బృహత్తర కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. -
కుట్లు లేకుండానే గుండె వాల్వు మార్పిడి!
గుండెల్లో వాల్వు మార్పిడి అంటే.. అందరూ ఎంతో టెన్షన్ పడతారు. కానీ, అస్సలు కుట్లే వేయకుండా వాల్వు మార్పిడి చేసి ఢిల్లీ వైద్యులు చరిత్ర సృష్టించారు. ఫిజీకి చెందిన 54 ఏళ్ల పేషెంటుకు డాక్టర్ సుశాంత్ శ్రీవాత్సవ ఈ చికిత్స చేశారు. బీఎల్కే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యుల బృందం ఈ ఆపరేషన్ చేసింది. ఔట్ పేషెంటుగా వచ్చిన ఆ వ్యక్తి శ్వాస అందక బాగా ఇబ్బంది పడుతున్నారని, దాంతోపాటు గుండెనొప్పి కూడా వచ్చిందని అంటున్నారు. అతడి ఆర్టిక్ వాల్వు బాగా సన్నబడిపోవడంతో.. గుండె నుంచి రక్తం పంపింగ్ కావడానికి బాగా ఇబ్బంది అవుతోందని పరీక్షలలో గుర్తించారు. దాంతో గుండెమీద ఒత్తిడి పెరిగింది. కుట్లు లేకుండా ఆపరేషన్ చేస్తామని ఆ పేషెంటుకు చెప్పారు. ప్రస్తుతం ఆ పేషెంటు ఐసీయూలో బాగా కోలుకుంటున్నారని, వారం రోజుల్లో తిరిగి వాళ్ల దేశానికి పంపేస్తామని వైద్యులు తెలిపారు. మొత్తం ఆపరేషన్‌లో కూడా ఇంప్లాంటు పెట్టేందుకు ఒక నిమిషం మాత్రమే పట్టిందని చెప్పారు. హైరిస్క్ పేషెంట్లకు ఇది బాగా ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. -
కేజీహెచ్ పై దిగివచ్చిన ప్రభుత్వం
విశాఖ మెడికల్: కేజీహెచ్‌లో గుండె శస్త్రచికిత్సల విభాగాన్ని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిన కేర్ ఆస్పత్రికి అప్పగించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఎట్టకేలకూ వెనక్కుతీసుకొంది. ప్రభుత్వ రంగంలో పనిచేసే కార్డియోథొరాసిక్ సర్జన్లు అందుబాటులో లేకపోవడంతో పీపీపీ విధానంలో ప్రైవేటు ఆస్పత్రుల నుంచి సర్జన్లను రప్పించి శస్త్రచికిత్సలు చేయించాలని ప్రభుత్వం భావించింది. ఈ విషయమై వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య విద్యా సంచాలకుల సూచనల మేరకు కేజీహెచ్‌లో గుండె శస్త్రచికిత్సలను కేర్ ఆస్పత్రి కార్డియోథొరాసిక్ సర్జన్ల పర్యవేక్షణలో నిర్వహించాలని తొలుత నిర్ణయించి ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై ఈ నెల 16న సాక్షిలో ‘కేజీహెచ్ గుండె ప్రైవేటు పరం’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, ఇతర పలు ప్రజాసంఘాలు, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టాయి. దీంతో ప్రభుత్వం కేర్ ఆస్పత్రితో ఒప్పందాన్ని రద్దుచేసుకుంది.ఖాళీగా ఉన్న ఓపెన్ హార్ట్ సర్జన్ పోస్టును భర్తీచేసింది. దాదాపు ఏడాదిన్నర తరువాత ఓపెన్ హార్ట్ సర్జరీలకు మళ్లీ మంచిరోజులు వచ్చాయి. -
లాలూ ప్రసాద్ కు హార్ట్ సర్జరీ!
ముంబై: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు హార్ట్ సర్జరీ చేస్తున్నామని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ వైద్యుడు విజయ్ డిసిల్వా మీడియాకు తెలిపారు. ప్రాథమిక చికిత్స నివేదికల ఆధారంగా లాలూ హార్ట్ సర్జరీ నిర్వహిస్తున్నామని ఆయన మీడియాకు తెలిపారు. ఎలాంటి సర్జరీ నిర్వహించేది మరికొన్ని నివేదికల ఆధారంగా వెల్లడవుతుందని వైద్యులు తెలిపారు. లాలూ ఆరోగ్యంగానే ఉన్నారు. ఆగస్టు 21న జరిగిన బీహార్ అసెంబ్లీ ఉప ఎన్నికలు ప్రచారంలో విస్తృత ప్రచారం చేసిన సంగతి మనం చూశాం అని వైద్యులు అన్నారు. రోటిన్ మెడికల్ చెకప్ కోసం వచ్చిన లాలూ సోమవారం ఏషియన్ హార్ట్ ఆస్పత్రిలో చేరారు. -
70 ఏళ్ల బామ్మకు ఓపెన్‌హార్ట్ సర్జరీ
న్యూఢిల్లీ: ముదిమి వయసు మీదపడింది... అప్పటికే ఓ కిడ్నీని సోదరుడికి దానం చేసింది. గతంలో రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స చేయించుకున్న చరిత్ర కూడా ఉంది. ఇన్ని సమస్యలున్న వ్యక్తికి గుండెపోటు వస్తే.... ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వస్తే... వైద్యులుసైతం వెనకడుగు వేయడం ఖాయం. కానీ ఓ బామ్మ విషయంలో నగరంలోని ఫోర్టిస్ ఎస్కార్ట్ హార్ట్ ఆసుపత్రి వైద్యులు ధైర్యంగా వ్యవహరించారు. 70 సంవత్సరాల వయసులోనే ఆమెకు ఓపెన్‌హార్ట్ సర్జరీ చేసి శభాష్ అనిపించుకున్నారు. వివరాల్లోకెళ్తే... ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన నిర్మల అనే వృద్ధురాలి గుండెలో సమస్య తలెత్తింది. హృదయం నుంచి మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం కుంచించుకుపోవడంతో దాని ప్రభావం గుండెపై పడసాగింది. ఈ కారణంగా గత ఆరునెలలుగా శ్వాస తీసుకోవడంతో కూడా ఆమె తీవ్రమైన ఇబ్బంది పడుతోంది. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే ఆమె ప్రాణాలకే ముప్పని తెలియడంతో నగరంలోని ఫోర్టిస్ ఎస్కార్ట్ హార్ట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. సమస్యను గుర్తించిన వైద్యులు ఆమెకు ఓపెన్‌హార్ట్ సర్జరీ చేయాలని నిర్ణయించారు. అయితే అప్పటికే ఆమెకు రొమ్ము క్యాన్సర్ సోకడంతో కుడి రొమ్మును తొలగించారని, రేడియేషన్, కీమోథెరపీ వంటి తీవ్రమైన చికిత్సలు కూడా చేయించుకుందని తెలియడంతో ైవె ద్యులు కొంత సంకోచించారు. పైగా సోదరుడికి ఓ మూత్రపిండాన్ని ఇచ్చి, ఒకే మూత్రపిండంతో బతుకుతోంది. ఇన్ని సమస్యలున్న ఆమెకు ఓపెన్‌హార్ట్ సర్జరీ చేయొచ్చా? అని మల్లగుల్లాలు పడ్డారు. గత్యంతరం లేకపోవడం, కుటుంబ సభ్యులు కూడా సర్జరీ చేయాలని ఒత్తిడి తేవడంతో ఎస్ఎన్ ఖన్నా నేతృత్వంలోని బృందం సర్జరీకి సమాయత్తమైంది. హృదయం నుంచి మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాన్ని మార్చేందుకు అవసరమైన ఏర్పాట్లను చేసుకున్నారు. సమస్య ఉన్న రక్తనాళాన్ని తొలగించి, మరోదానిని అమర్చారు. ఈ విషయమై వైద్య బృందానికి నేతృత్వం వహించిన ఖన్నా మాట్లాడుతూ... ‘అప్పటికే అనేక సమస్యలతో బాధపడుతున్న నిర్మలకు తప్పనిసరిగా ఓపెన్‌హార్ట్ సర్జరీ చేయాల్సి వచ్చింది. వయసు మీద పడడంతో కొంత సంశయించినా తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్ చేశాం. సర్జరీ తర్వాత కూడా ఆమె వేగంగా కోలుకుంటోంద’న్నారు. -
ఎయిమ్స్‌లో హార్ట్ సర్జరీ కోసం ఎదురుచూస్తున్నవారి సంఖ్య 4000
సాక్షి, న్యూఢిల్లీ: హార్ట్ ఎటాక్... ఇది దాడి చేసిన క్షణాల్లో వైద్యం అందకపోతే ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే. అంతటి అత్యవసర వైద్యం అవసరమైన నాలుగు వేల మంది ఎయిమ్స్‌లో హార్ట్ సర్జరీ కోసం ఎదురుచూస్తున్నారు.. ఇప్పటికే ఒకట్రెండు సార్లు ఈ మహమ్మారి దాడి చేయడంతో మృత్యువు గడపవద్దకు వెళ్లి.. ఎయిమ్స్‌కు తిరిగొచ్చిన వీరు ఆ మహమ్మారి మళ్లీ ఎప్పుడు దాడి చేస్తుందో తెలియక గుప్పెడంత గుండెను అరచేతిలో పట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. తమవంతు ఎప్పుడు వస్తుందో తెలియక ఎదురుచూస్తున్నారు. సరిపడా వైద్యసదుపాయాలు లేకపోవడంతో ఎయిమ్స్‌లో హృద్రోగుల దుస్థితి ఎంతో దయనీయంగా మారింది. ఎయిమ్స్‌లో ప్రస్తుతం హార్ట్ సర్జరీ కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య నాలుగు వేలకు చేరిందని ఆర్టీఐ కింద వేసిన ఓ దరఖాస్తుతో వెలుగులోకి వచ్చింది. ఇందులో మహిళలు, పిల్లలు ఉన్నారు. ఇదే పరిస్థితి ఢిల్లీలోని మిగిలిన సర్కార్ ఆసుపత్రుల్లోనూ ఉంది. దేశంలోనే అత్యంత పెద్ద ఆసుపత్రి అయిన ఎయిమ్స్ వర్గాలు ఆర్టీఐకి జవాబిస్తూ ‘రోగుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోందని’పేర్కొన్నాయి. రోగి పరిస్థితి ఆధారంగా వెయిటింగ్ లిస్టులో చేరుస్తున్నట్టు చెబుతున్నారు. అత్యవసరమైన వారికి జాబితాలో నాలుగు నెలల తర్వాత సర్జరీ ఉన్నా ఒక నెలకు మారుస్తున్నారు. కాస్త ఫర్వాలేదనుకన్నవారికి ఏడాది వరకు ఆపుతున్నట్టు పేర్కొన్నారు. ఎయిమ్స్ సీనియర్ హార్ట్ సర్జన్ తెలిపిన ప్రకారం.. రోగుల సంఖ్య ఇంత ఎక్కువ ఉంటే మేం ఏం చేయలేమని ఆయన తెలిపారు. ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ హార్ట్ సర్జరీ చేస్తున్నా, ప్రజలకు ఎయిమ్స్ వైద్యులపైనే నమ్మకం ఎక్కువ ఉంటోందన్నారు. ఇతర ఆసుపత్రుల్లో ఉచితంగా హార్ట్ సర్జరీలు చేస్తున్నారని, ఎయిమ్స్‌లో ఇదే సర్జరీకి లక్షన్నర రూపాయల వరకు ఖర్చవుతున్నా రోగుల సంఖ్య తగ్గడం లేదని వారు తెలిపారు. ప్రస్తుతం ఎయిమ్స్‌లోని ఎనిమిది ఆపరేషన్ థియేటర్లలో సర్జరీలు చేస్తున్నారు. మరోవైపు ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో 52 మంది హార్ట్ పేషంట్లు సర్జరీ కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో 14 మంది చిన్నారులు ఉన్నారు. మొత్తం నలుగురు హార్ట్ సర్జన్లు పనిచేస్తున్నారు. ఒక్కో రోగికి సర్జరీకి నెల వరకు పడుతోంది. జూలై 20 వ రకు ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం మేరకు ఈ వివరాలు వెల్లడయ్యాయి. అయితే రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఇక్కడ చేర్చవచ్చని పేర్కొంటున్నారు. ఆర్ఎంఎల్లోనూ నిపుణులైన సిబ్బందితోపాటు అత్యాధునిక వసతులు అందుబాటులో ఉన్నట్టు వారు చెబుతున్నారు. హైదర్‌పురాలో 500 పడకల ఆసుపత్రి సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర ఢిల్లీ ఎంసీడీ పరిధిలోని హైదర్‌పురాలో 500 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సోమవారం నిర్వహించిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదముద్ర పడింది. హైదర్ పురా వార్డు నంబర్ 54-55లో దీన్ని నిర్మించనున్నారు. రోహిణి వాసులకు అందుబాటులోకి రానున్న ఈ ఆసుపత్రికోసం ఇప్పటికే ఏడున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించారు. స్టాండింగ్ కమిటీ చైర్మన్ రామ్ సంఘల్ తెలిపిన వివరాల ప్రకారం.. నార్త్ ఎంసీడీ పరిధిలో ఇప్పటికే ఐదు ఆసుపత్రులున్నాయన్నారు. కానీ స్థానికుల అవసరాల మేరకు మరో పెద్ద ఆసుపత్రి రోహిణిలో నిర్మిచాలని నిర్ణయించామన్నారు. ఈ ప్రతిపాదన ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉంటూ వస్తోందన్నారు. మొత్తం 13 అంతస్తుల్లో ఆసుపత్రి భవనం నిర్మించనున్నామని చెప్పారు. దీనిలో బేస్మెంట్ పార్కింగ్ అందుబాటులో ఉంటుందని, ఆసుపత్రి నిర్మాణానికి రూ.600 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. దీనిలో అల్లోపతితోపాటు హోమియోపతి, ఆయుర్వేద వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. -
రకరకాల గుండెకోతలు!
గుండెకు వెళ్లే రక్తనాళాల్లో కొవ్వు పదార్థాలు చేరడంగాని లేదా రక్తం గడ్డకట్టడం వల్ల కాని రక్తప్రసరణకు అడ్డంకులు ఏర్పడతాయి. ఆ రక్తప్రసరణలోని అడ్డంకులు ఒక గుండె కండరానికే సంభవిస్తే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్య తలెత్తినప్పుడు సాధారణంగా మందుల ద్వారానే దాన్ని నయం చేయవచ్చు. అయితే కొంతమందిలో మాత్రం ఆ అడ్డంకులను తీసేయడానికి బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తుంది. దీనితోపాటు గుండెకు చేసే శస్త్రచికిత్సల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ, బీటింగ్ హార్ట్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ, మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ, ఎండోస్కోపిక్ సర్జరీ అంటూ రకరకాల పదాలు వినిపిస్తుంటాయి. ఈ రకరకాల సర్జరీలు ఏమిటి, వాటి ప్రయోజనాలేమిటి, ఎందుకు? ఎప్పుడు చేస్తారు... లాంటి సందేహాల నివృత్తికే ఈ కథనం. గుండెకు వెళ్లే రక్తనాళాల్లో అడ్డంకులను బెలూన్ ద్వారా తొలగించి అక్కడ ఒక ‘స్టెంట్’ అమర్చడాన్ని బెలూన్ యాంజియోప్లాస్టీ లేదా స్టెంట్ ఆపరేషన్ అంటారు. ఇది పూర్తిగా శస్త్రచికిత్సగా పరిగణించలేం. ఇక పూర్తిస్థాయి శస్త్రచికిత్సల విషయానికి వస్తే... ముందుగా అసలు బైపాస్ సర్జరీ అంటే ఏమిటో చూద్దాం. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళల్లో ఏవైనా అడ్డంకులు ఉంటే వాటికి ప్రత్యామ్నాయంగా వేరే రక్తనాళాలను ఉపయోగించి, కొత్తమార్గం ద్వారా రక్తప్రసరణ జరిగేలా చేయడమే బైపాస్ శస్త్రచికిత్స. ఈ ప్రక్రియకోసం అవసరమైన అదనపు రక్తనాళాన్ని కాలి నుంచి తీసిన సిరను గాని లేదా రొమ్ము ఎముక పక్కనే ఉన్న మ్యామరీ ధమనిని గాని ఉపయోగిస్తారు. గుండెకు సంబంధించిన సర్జరీలలో చాలాపేర్లు వినిపిస్తుంటాయి. అవి ఏయే సందర్భాల్లో, ఎందుకు చేస్తారో చూద్దాం. బైపాస్ ఎవరెవరికి, ఎలాంటి ఫలితం...? గుండెకు రక్తసరఫరా చేసే ప్రధాన రక్తనాళంలో అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండెలో ఎడమపక్క ఉండే ముఖ్య రక్తనాళంలోని మొదటిభాగంలోనే అడ్డంకి ఉన్నప్పుడు గుండె పంపింగ్ శక్తి తక్కువగా ఉన్నప్పుడు రక్తనాళంలో అనేకచోట్ల అడ్డంకులు ఏర్పడినప్పుడు మధుమేహవ్యాధి ఉన్న వారికి... ఓపెన్‌హార్ట్ సర్జరీ అంటే...? బైపాస్ శస్త్రచికిత్స సమయంలో రొమ్ముఎముకను చీల్చి సర్జన్ గుండె ఉపరితలానికి చేరుకుంటాడు. గుండె అనుక్షణం కొట్టుకుంటూ ఉంటే ఆపరేషన్ చేయడం క్లిష్టంగా ఉంటుంది. అందుకే తాత్కాలికంగా గుండెను అచేతన స్థితిలో ఉంచి ఈ ఆపరేషన్ చేస్తారు. అప్పుడు శరీరానికి రక్తప్రసరణ యథావిధిగా కొనసాగేందుకు హార్ట్‌లంగ్ మెషిన్ అనే పరికరాన్ని వాడతారు. ఏ శస్త్రచికిత్సలోనైతే ఈ హార్ట్‌లంగ్ మెషిన్‌ను ఉపయోగించి చేస్తే... దాన్ని ‘ఓపెన్‌హార్ట్ సర్జరీ’ అనుకోవచ్చు. క్లోజ్డ్ హార్ట్ సర్జరీ అంటే...? ఏ శస్త్రచికిత్సలోనైతే పైన పేర్కొన్న హార్ట్ లంగ్ మెషిన్‌ను ఉపయోగించకుండా శస్త్రచికిత్స చేస్తారో దాన్ని క్లోజ్డ్ హార్ట్ సర్జరీ అంటారు. సాధారణంగా గుండె కవాటాల్లో ఒకటైన మైట్రల్ వాల్వ్‌ను బాగుచేసేప్పుడు ఈ శస్త్రచికిత్స చేస్తారు. బీటింగ్ హార్ట్ సర్జరీ అంటే...? దీన్ని ‘ఆఫ్ పంప్ సర్జరీ’ అని కూడా అంటారు. ఇందులో కూడా రొమ్ము ఎముకను చీలుస్తారు. ఈ ప్రక్రియలో ఓ పక్క గుండె స్పందనలు యథావిధిగా కొనసాగుతుండగానే బైపాస్సర్జరీ నిర్వహిస్తారు. ఆక్టోపస్ అనే ఒక పరికరం ద్వారా గుండెలో ఆపరేషన్ జరుగుతున్న భాగం వరకు కదలకుండా చేస్తారు. మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ అంటే..? గత ఐదేళ్లకాలంలో గుండె శస్త్రచికిత్సలో అత్యంత అధునాతన వైద్యవిధానాలు చోటుచేసుకున్నాయి. కేవలం చాలా చిన్నగాటు సహాయంతోనే బైపాస్ సర్జరీ నిర్వహించడం వీటిల్లో ఒకటి. ఇందులో రొమ్ము ఎముకను చీల్చాల్సిన అవసరం లేదు. అయితే పెద్ద శస్త్రచికిత్సల్లోలాగే మత్తుమందు ఇవ్వాల్సి ఉంటుంది. చాలా చిన్న రంధ్రం ద్వారా ఈ లాపరోస్కోపిక్ ఆపరేషన్ చేస్తారు. టోటల్ ఆర్టీరియల్ రీవాస్క్యులరైజేషన్ అంటే ఈ ప్రక్రియలో కాలి సిరలను గాక మణికట్టులోనివి, ఎడమ, కుడి రొమ్ము ఎముక ధమనులను ఉపయోగించి సర్జరీ చేస్తారు. ఎండోస్కోపిక్ సర్జరీ అంటే...? ప్రస్తుతం మణికట్టు నుంచి తీసే ధమని లేదా కాలి నుంచి తీసే సిరల విషయంలో పూర్తిగా గాటు పెట్టి తీయకుండా, చిన్న రంధ్రం చేసి మాత్రమే వాటిని సేకరిస్తారు. దీనివల్ల ఆ గాయం చిన్నది కావడం వల్ల రోగి త్వరగా కోలుకుంటాడు. హైబ్రీడ్ సర్జరీ అంటే...? కొన్నిసార్లు బైపాస్ శస్త్రచికిత్సలో రోగి చాలా సంక్లిష్టపరిస్థితిలో ఉన్నప్పుడు కొన్ని రక్తనాళాలకు యాంజియోప్లాస్టీ ద్వారా, మరికొన్నింటికి బైపాస్ ద్వారా శస్త్రచికిత్స నిర్వహించడం వల్ల చాలా రిస్క్‌లు తగ్గి, రోగి చాలా త్వరగా కోలుకునేలా చేయవచ్చు. ఇలా పలురకాల శస్త్రచికిత్స ప్రక్రియలను చేయడాన్ని ‘హైబ్రీడ్ బైపాస్ సర్జరీ’ అంటారు. రొబోటిక్ బైపాస్ సర్జరీ అంటే...? పేరులో పేర్కొన్నట్లుగా ఇందులో బైపాస్ శస్త్రచికిత్సను రోబో సహాయంతో డాక్టర్లు నిర్వహిస్తారు. ఇందులో చాలా చిన్న రంధ్రం మాత్రమే చేసి, శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అంత చిన్న రంధ్రం నుంచి డాక్టర్ వేళ్లు రోగి శరీరంలోకి ప్రవేశింపజేయడం కష్టం. అందుకే రోబో తాలూకు సన్నని వేళ్లని ఆ రంధ్రంలోకి ప్రవేశింపజేసి, సర్జన్లు వాటిని బయటి నుంచి నియంత్రిస్తూ శస్త్రచికిత్స పూర్తి చేస్తారు. - నిర్వహణ : యాసీన్ బైపాస్ సర్జరీ తర్వాత... బైపాస్ శస్త్రచికిత్స తర్వాత రోగి కోలుకోడానికి 2-3 నెలలు పడుతుంది. మొదట్లో కొద్దిగా నీరసంగా ఉండటం సహజం. రొమ్ము ఎముకను చీల్చడం వల్ల ఛాతీకండరాల్లో, మెడ ఎముకల్లో, వెన్నుపూసల్లో, జబ్బల్లో నొప్పులు సాధారణం. అదే సమయంలో కాలు లేదా చేతి నుంచి రక్తనాళాన్ని బయటకు తీస్తారు కాబట్టి అక్కడా నొప్పి, వాపు ఉండవచ్చు. కొందరు ఈ ఆపరేషన్ తర్వాత మనోనిబ్బరం కోల్పోతారు. మరికొందరికి జ్ఞాపకశక్తి, దృష్టికేంద్రీకరణ శక్తి కొద్దిగా తగ్గవచ్చు. కానీ ఆర్నెల్లల్లో రోగి పూర్వస్థితికి చేరుకునే అవకాశం ఉంది. జీవనోపాధి కోసం వారు చేసే పనులు బరువైనవి కాకపోతే రెండు నెలల తర్వాతి నుంచే పనికి వెళ్లవచ్చు. మిగతావారు మూడు నెలలు ఆగడం శ్రేయస్కరం. ఇక ఈ ఆపరేషన్ తర్వాత రెండునెలల పాటు ఎలాంటి వాహనం నడపడం మంచిది కాదు. శస్త్రచికిత్స తర్వాత రోగి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పొగతాగడం పూర్తిగా మానేయాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. బరువును నియంత్రించుకోవడం, కొవ్వును అదుపులో ఉంచుకోవడం, మనోనిబ్బరంతో వ్యవహరించడం, వైద్యుల సూచనలను పాటించడం వంటివి చేస్తూ మిగతా జీవితాన్ని మామూలుగానే గడిపేయవచ్చు. -
గుండె శస్త్ర చికిత్స ధరలపై ఆరోగ్యశ్రీ సీఈఓ హామీ
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ పరిధిలో జరుగుతున్న గుండె శస్త్రచికిత్సల (యాంజియోప్లాస్టీ) ధరలపై పునఃపరిశీలన చేస్తామని ఆరోగ్యశ్రీ సీఈఓ ధనుంజయరెడ్డి ప్రకటించారు. గతంలో యాంజియోప్లాస్టీకి రూ. 60 వేలుగా ఉన్న ధరను జూన్ 28 నుంచి రూ. 40 వేలకు కుదించడంతో ఐదు రోజులుగా హృద్రోగ నిపుణులు గుండె శస్త్రచికిత్సలను నిలిపేసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా గుండె శస్త్రచికిత్సలు నిలిపేస్తున్నట్టు హృద్రోగ నిపుణులు ప్రకటించడంతో ఎట్టకేలకు ఆరోగ్యశ్రీ సీఈఓ స్పందించారు. బుధవారం ఆరోగ్యశ్రీ భవన్లో ఏపీ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ (అప్నా), ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా), కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) ప్రతినిధులతో ఆరోగ్యశ్రీ సీఈఓ ధనుంజయరెడ్డి చర్చలు జరిపారు. చర్చల సందర్భంగా గుండె శస్త్రచికిత్సల ధరలకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులతో కమిటీని ఏర్పాటు చేస్తామని, ఈ కమిటీ ధరలపై పరిశీలన జరిపి సెప్టెంబర్ 20లోగా నివేదిక ఇస్తుందని ఆయన చెప్పారు. దీంతో అప్నా, ఆశా, సీఎస్ఐ వైద్యులు గుండె శస్త్రచికిత్సలను యాథావిధిగా కొనసాగించేందుకు అంగీకరించారు. 2013 జూన్ 28కి ముందు ఈ శస్త్రచికిత్సలకు రూ. 60వేలు ఉండేదని, ఈ ధరకు మరో 30 శాతం అధికంగా ఇవ్వాలని, అంటే రూ.78 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ సీఈఓ నుంచి హామీ వచ్చిన తర్వాతే గుండె శస్త్రచికిత్సలు కొనసాగించేందుకు అంగీకరించారు. సీఎస్ఐ అధ్యక్షుడు డా. కల్నల్ సీతారాం పేర్కొన్నారు. ఈ చర్చల్లో ఆశా సంఘం తరఫున డా. భాస్కరరావు, డా. గోవింద్ హరి, అప్నా సంఘం తరఫున డా. నర్సింగ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గురువారం నుంచి అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో యథావిధిగా గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్టు చర్చల అనంతరం మూడు సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. కమిటీ ఇచ్చే నివేదికలో ధరల్లో మార్పు లేకపోతే తదనుగుణంగా తాము నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. వైద్యశాఖలో మరో ఆర్నెల్లు ‘ఎస్మా’ పొడిగింపు సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖలో ‘ఎస్మా’ కాలపరిమితిని ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జూనియర్ డాక్టర్లతోపాటు పీజీ వైద్యవిద్యార్థులు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, సీనియర్ వైద్యులు అందరూ ఎస్మా పరిధిలోనే ఉంటారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ‘ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్-1971’(ఎస్మా) ప్రకారం సమ్మెలను నిషేధించినట్లు తెలిపారు. ఈ నిషేధం గురువారం నుంచి ఆరు మాసాలపాటు అమల్లో ఉంటుందన్నారు.