లక్షలాది మంది హృద్రోగులకు ఊరట నిచ్చేలా స్టెంట్ల ధరలు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గుండె శస్త్ర చికిత్సలో ఎంతో కీలమైన కరోనరీ స్టెంట్ల ధరల్ని 85 శాతం మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బేర్ మెటల్ స్టెంట్ (బీఎంఎస్) ధరను రూ. 7,260గా, డ్రగ్ ఎలుటింగ్ స్టెంట్ (డీఈఎస్) ధరను రూ. 29,600గా నిర్ణయిం చామని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంత్ కుమార్ మంగళవారం తెలిపారు. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించారు.