Ananth Kumar
-
అనంత్‌కుమార్‌కు కన్నీటి వీడ్కోలు
సాక్షి, బెంగళూరు: అశేష అభిమానులు, అగ్రనేతల కన్నీళ్ల మధ్య కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అనంత్‌కుమార్ (59) పార్థివ దేహానికి అంత్యక్రియలు జరిగాయి. బెంగ ళూరు దక్షిణ ఎంపీ అయిన అనంత్ కుమార్ ఆస్పత్రిలో క్యాన్సర్‌తో కన్నుమూయడం తెలిసిందే. స్మార్త బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం, అధికారిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు. నగరంలోని చామరాజపేట హిందూ రుద్రభూమిలో మంగళవారం మధ్యా హ్నం ఒంటిగంటకు అంత్యక్రియలు జరిగాయి. ఉదయం బెంగళూరు బసవనగుడిలో ఆయన నివాసం నుంచి భౌతికకాయాన్ని బీజేపీ కార్యాలయం ‘జగన్నాథ భవన్’కు తరలించారు. అనంతరం నేషనల్ కాలేజీ మైదానంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. అక్కడ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆయనకు నివాళులర్పించి, సతీమణి తేజస్వినిని, కూతుళ్లను ఓదార్చారు. బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ, బీజేపీ అధినేత అమిత్‌షా సహా పలువురు కేంద్రమంత్రులు సహచరునికి నివాళులర్పించారు. వేలాది మం ది ప్రజలు సందర్శించారు. కొంతసేపటికి సైనిక వాహనంలో భౌతిక కాయాన్ని రుద్రభూమికి ఊరేగింపుగా తరలించారు. చితికి నిప్పంటించిన సోదరుడు అనంత్‌కుమార్ భౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో గౌరవ వందనం సమర్పించి అంతిమ సంస్కారాల నిమిత్తం కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంత్‌కుమార్ భౌతిక కాయంపై కప్పిన జాతీయ జెండాను సతీమణి తేజస్వినికి సైనికాధికారులు అంద జేశారు. సంప్రదాయం ప్రకారం చితికి సోద రుడు నందకుమార్ నిప్పంటించారు. భర్త జ్ఞాపకాలను తలుచుకుంటూ తేజస్విని విలపిం చారు. అంతిమయాత్రలో బీజేపీ అధినేత అమిత్ షా, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్ఎస్ఎస్ సహ కార్యదర్శి భయ్యాజీ జోషి, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, రవి శంకర్ ప్రసాద్, పియూష్ గోయెల్, ధర్మేంద్ర ప్రధాన్ తదితరులతో పాటు గవర్నర్ వజూభాయ్‌వాలా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ అనంతకుమార్ మృతికి సంతాపం తెలిపింది -
కేంద్ర కేబినెట్లో స్వల్ప మార్పులు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రమంత్రి అనంత్‌కుమార్ (59) సోమవారం అనారోగ్యంతో మృతి చెందడంతో కేబినెట్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. అనంత్‌కుమార్ నిర్వర్విస్తున్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, ఎరువులు, రసాయనాల శాఖల బాధ్యతల్ని నరేంద్రసింగ్ తోమర్, సదానంద గౌడలకు అప్పగించారు. ప్రధాని మోదీ సూచనతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ మార్పులు చేసినట్టు రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. ఇకపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖని నరేంద్రసింగ్ తోమర్, ఎరువులు, రసాయనాల శాఖని సదానంద గౌడ నిర్వహించనున్నారు. కాగా, సదానంద గౌడ గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖనీ.. నరేంద్రసింగ్ తోమర్ గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, గనుల శాఖల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు తాజాగా కేటాయించిన శాఖల్ని వీరు అదనంగా నిర్వహిస్తారని రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. (కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ కన్నుమూత) -
విలువైన సహచరుడిని కోల్పోయాను..
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుల అనంత్‌కుమార్ మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. విలువైన సహచరుడిని కోల్పోయాను: మోదీ అనంత్‌కుమార్ మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన ప్రధాని.. విలువైన సహచరుడిని కోల్పోయానని అన్నారు. యువకుడిగా ప్రజా జీవితంలో అడుగుపెట్టిన ఆయన ఎంతో సేవ చేశారని తెలిపారు. అనంత్‌కుమార్ చేసిన మంచి పనులు ఆయనను చిరకాలం గుర్తుంచుకునేలా చేస్తాయని పేర్కొన్నారు. కర్ణాటకలో బీజేపీ బలోపేతానికి ఆయన చాలా కష్టపడ్డారని కొనియాడారు. అనంత్‌కుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన మోదీ.. ఆయన భార్యను ఫోన్లో పరామర్శించారు. కర్ణాటక ప్రజలకు తీరనిలోటు: రామ్‌నాథ్ కోవింద్ అనంత్‌కుమార్ మృతి చాలా బాధ కలిగించిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ఆయన మృతి దేశ ప్రజలకు, ముఖ్యంగా కర్ణాటక ప్రజలకు తీరనిలోటని తెలిపారు. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంత్‌కుమార్ మృతి షాక్‌కు గురిచేసింది: అమిత్ షా అనంత్‌కుమార్ మృతి షాక్ గురిచేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. ఎంతో నిబద్ధతతో ఆయన దేశానికి సేవ చేశారని కొనియాడారు. కర్ణాటకలో బీజేపీని బలోపేతం చేయడానికి ఆయన అహర్నిశలు శ్రమించాడని అన్నారు. అనంత్‌కుమార్ కుటుంబానికి, సహచరులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారికి శక్తిని ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్ జగన్ అనంత్‌కుమార్ మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చదవండి: కేంద్రమంత్రి అనంత్‌కుమార్ కన్నుమూత -
కేంద్రమంత్రి అనంత్‌కుమార్ కన్నుమూత
-
కేంద్రమంత్రి అనంత్‌కుమార్ కన్నుమూత
సాక్షి, బెంగళూరు: కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు అనంత్‌కుమార్(59) ఆకస్మికంగా కన్నుమూశారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా పలు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన మృతిచెందడం బీజేపీ శ్రేణులను విషాదంలో ముంచెత్తింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అనంత్‌కుమార్ బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున రెండు గంటలకు తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు.. ఆయనకు కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. 1959 జూలై 22న జన్మించిన అనంత్‌కుమార్ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఏబీవీపీలో కీలక పాత్ర పోషించారు. 1996లో తొలిసారి దక్షిణ బెంగళూరు నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అదే స్థానం నుంచి ఆయన ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నికవుతూ వచ్చారు. అనంత్‌కుమార్ వాజ్‌పేయి కేబినెట్లో విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖతో పాటు ఎరువులు, రసాయన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతోపాటు పలువురు రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంత్‌కుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
పాపం సోనియాజీ.. మ్యాథ్స్‌లో పూర్ అనుకుంటా!
సాక్షి, న్యూ ఢిల్లీ: కేంద్రం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ప్రతిపక్షాలు బలనిరూపణకు పావులు కదుపుతున్నాయి. అటు అధికార పార్టీ కూడా అవిశ్వాసం వీగిపోవడం ఖాయమని ధీమాగా ఉంది. ఈ క్రమంలో అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. అవిశ్వాసం గెలవడానికి అవసరమైన సంఖ్యా బలం తమకు ఉందని, బీజేపీయేతర శక్తులను కలపుకొని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ ధీమా వ్యక్తం చేశారు. సోనియా వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అనంతకుమార్ స్పందించారు. సోనియాజీ.. పాపం మ్యాథ్స్‌లో పూర్ అనుకుంటా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముందుగా వారి పార్టీ ఎంపీల సంఖ్య ఎంతో చూసుకోండని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వానికి ఇంటా బయట స్పష్టమైన మద్దతుందని తెలిపారు. శివసేన పార్టీ ఎన్డీయేలో భాగస్వామేనని ఓ ప్రశ్నకి సమాధానంగా తెలిపారు. ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీఏ కూటమి బలం 313 ఉండటంతో అవిశ్వాసంలో తమదే గెలుపని అనంతకుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. 15 సంవత్సరాల తర్వాత తొలిసారి అవిశ్వాసంపై చర్చ జరగనుంది. చివరిసారిగా 2003లో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఇలాంటి సందర్భాన్ని ఎదుర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభత్వం పెండింగ్‌లో ఉన్న బిల్లులను వీలైనన్ని ఆమోదించుకోవాలని భావిస్తోంది. ఇప్పటివరకు 68 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కనీసం 25 బిల్లులకైనా ఆమోద్రముద్ర లభించే దిశగా పావులు కదుపుతోంది. ఇక ప్రతిపక్షాలు కూడా మోదీ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగాలనే ఉద్దేశంతో ఉంది. దళితులపై దాడులు, మహిళల రక్షణ, రైతు సమస్యలు, నిరుద్యోగం తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. -
నేటి నుంచి సభా సమరం
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. 18 సిట్టింగుల్లో మొత్తం 24 రోజుల పాటు జరిగే సభా కార్యకలాపాలు ఆగస్టు 10న ముగుస్తాయి. ఈసారి 46 బిల్లులను చర్చకు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం విపక్ష పార్టీల నాయకులతో సమావేశమై సభ సజావుగా జరిగేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలను లేవనెత్తాలని కోరారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ ఈ వివరాలను వెల్లడించారు. ‘సభ సజావుగా, ఫలవంతంగా జరిగేందుకు ప్రధాని మోదీ విపక్షాల సహకారం కోరారు. జాతీయ ప్రయోజనాల విషయాలపై పార్లమెంట్ చర్చిస్తుందని దేశం మొత్తం ఆశతో ఉంది. అన్ని రాజకీయ పార్టీలు లేవనెత్తే సమస్యలను చర్చించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. సమావేశాల్లో నిర్మాణాత్మక, సానుకూల వాతావరణం సృష్టించేందుకు అందరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. సభను సజావుగా నిర్వహించడానికి ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తుంది’ అని తెలిపారు. ఉభయ సభల్లో ప్రతిష్టంభనను చర్చల ద్వారానే పరిష్కరించాలన్నారు. ఉన్నత విద్యా సంస్థల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల తొలగింపు, మూక దాడుల నియంత్రణకు చట్టం రూపకల్పన తదితరాలను విపక్ష నాయకులు లేవనెత్తారు. రిజర్వేషన్లపై చర్చ జరుగుతుందని ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు సభను సజావుగా జరగనీయమని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ అన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా వేర్వేరుగా అఖిల పక్ష భేటీలు నిర్వహించారు. చర్చ జరిగితే వారి అనైక్యత బట్టబయలు మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరిగితే ప్రతిపక్షాల అనైక్యత బయటపడుతుందని అధికార ఎన్డీయే కూటమి భావిస్తోంది. ఎస్పీ, ఆర్జేడీ లాంటి పార్టీలు బిల్లు ప్రస్తుత రూపాన్ని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఎన్డీయే పక్షాల సమావేశం తరువాత బీజేపీ మిత్ర పక్ష నాయకుడు ఒకరు ఇదే విషయమై స్పందిస్తూ..వెనకబడిన, అణగారిన వర్గాలకు చెందిన కొందరు ఎంపీలు మహిళా రిజర్వేషన్ బిల్లులో తమ వర్గానికి ఉపకోటా కోరుతూ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.బీజేపీ మిత్రపక్షం ఎల్జేపీ కూడా ఇదే వైఖరిని అనుసరిస్తోంది. పలు పంటలకు మద్దతు ధరలను పెంచినందుకు ప్రధాని మోదీని అభినందిస్తూ ఎన్డీయే మిత్రపక్షాలు ఒక తీర్మానాన్ని ఆమోదించాయి. భారత్ ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినందుకు మరో తీర్మానానికి కూడా పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..ఎన్డీయే కూటమి 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని, తమ కుటుంబం వేగంగా విస్తరిస్తోందని అన్నారు. మరోవైపు, మహిళా రిజర్వేషన్, ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా తదితర కీలక బిల్లులపై చర్చించి ఆమోదించేందుకు తమతో కలసిరావాలని కేంద్రం కాంగ్రెస్‌ను కోరింది. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారు. కేంద్రంపై మళ్లీ అవిశ్వాసం ఈ సమావేశాల్లో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రకటించింది. ఇందు కోసం ఇతర ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. మూక హత్యలు, మహిళా భద్రత తదితర కీలక సమస్యలను లేవనెత్తుతామని పేర్కొంది. అనుమానాలతో వ్యక్తులను కొట్టి చంపడం, గో సంరక్షణ పేరిట దాడులు సర్వసాధారణమయ్యాయని ఆ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంట్లో దుమారం? ‘ముస్లిం కాంగ్రెస్’ వ్యాఖ్యలు పార్లమెం ట్లో దుమారం రేపే అవకాశాలున్నాయి. కీలకమైన మూడు రాష్ట్రాలకు త్వరలో జరుగనున్న ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రధాన అస్త్రంగా మారనున్నా యి. కొద్ది నెలల్లో ఎన్నికలు జరిగే రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ ప్రభుత్వాలపై వ్యతిరేకతను తట్టుకోవటంతోపాటు, వచ్చే ఏడాదిలో జరిగే లోక్‌సభ ఎన్నికలకు గాను తమ హిందుత్వ ఎజెండాకు అనుకూలంగా ఈ అంశాన్ని మార్చుకోవాలని కూడా బీజేపీ నాయకులు యోచిస్తున్నారు. ఆర్థిక రంగ వైఫల్యాలు, దేశ వ్యాప్తంగా అమాయకులపై దాడులు, రాజకీయ అంశాలపై ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు యత్నిస్తే రాహుల్ వ్యాఖ్యలను అధికార బీజేపీ ప్రధాన అంశంగా తెరపైకి తెచ్చే అవకాశాలు న్నాయి. గత బడ్జెట్ సమావేశాల్లో మాదిరిగానే ఈసారి కూడా పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు అవకాశాలు లేవని పలువురు పేర్కొంటున్నారు. -
అవిశ్వాసంపై చర్చకు సిద్ధమే.. కానీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా కేంద్ర సర్కారుపై వైఎస్సార్సీపీ ఇచ్చిన అవిశ్వాసతీర్మానం మరోసారి వాయిదా పడింది. హోదాపై తాము ఇచ్చిన నాలుగో నోటీసు కూడా చర్చకు రాకపోవడాన్ని వైఎస్సార్సీపీ ఎంపీలు గర్హించారు. వాయిదా అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభ సమావేశాలు పునఃప్రారంభమయ్యాయి. అప్పటికే టీఆర్ఎస్, ఏఐడీఏంకే ఎంపీలు పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ తోట నర్సింహంలు ఇచ్చిన నోటీసులను చదివిన స్పీకర్.. సభ ఆర్డర్లో లేనికారణంగా చర్చను చేపట్టలేనని స్పష్టం చేశారు. సభ్యులు ఎవరిస్థానాల్లో వారు కూర్చోవాలని కోరినా ఫలితం రాకపోవడంతో సభను గురువారానికి వాయిదావేశారు. పరీక్షకు సిద్ధమే కానీ: సభ ఆర్డర్లో లేని కారణంగా అవిశ్వాస తీర్మానం చర్చ వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్ నేడు లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. విశ్వాస పరీక్షను ఎదుర్కోవడానికి మోదీ సర్కార్ సిద్ధంగా ఉందని, ఓటింగ్‌లోనూ నెగ్గుతామని, అయితే చర్చ జరగాలంటేమాత్రం సభ ఆర్డర్లో ఉండితీరాల్సిందేనని మంత్రి అన్నారు. ‘‘సభ్యులంతా మీమీ స్థానాల్లో కూర్చుంటే ఎలాంటి చర్చనైనా చేపట్టొచ్చు. అవిశ్వాసం తీర్మానంలో మేమే గెలుస్తాం. సభ సజావుగా జరిగేలా అందరూ సహకరించాలని స్పీకర్ ద్వారా కోరుతున్నాను’’ అని అనంతకుమార్ పేర్కొన్నారు. మళ్లీ నోటీసులు: అవిశ్వాస తీర్మానాన్ని కోరుతూ తాము ఇచ్చిన నాలుగో నోటీసులపైనా చర్చ జరగకపోవడంతో మరోమారు నోటీసులు ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీలు భావిస్తున్నారు. చర్చ జరిగేదాకా నోటీసులు ఇస్తూనే ఉంటామని ఆ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నేడు రాజ్యసభకు ట్రిపుల్ తలాక్ బిల్లు
న్యూఢిల్లీ: నేడు రాజ్యసభ ముందుకు రానున్న ట్రిపుల్ తలాక్ (ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ)బిల్లులో సవరణల కోసం ఒత్తిడి చేయొద్దని కాంగ్రెస్‌ను కేంద్రం కోరింది. లోక్‌సభలో సహకరించినట్లుగానే రాజ్యసభలోను బిల్లు ఆమోదానికి సాయపడాలని కాంగ్రెస్‌ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ కోరారు. ఈ బిల్లుపై లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ సవరణలు కోరినా ఒత్తిడి చేయలేదు. బిల్లుపై చర్చ కోసం సమయం కేటాయించాలని మంగళవారం సమా వేశమైన రాజ్యసభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ నిర్ణయించింది. అయితే బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ కోరినట్లు సమాచారం. -
అనంత్ కుమార్ దేశద్రోహి: భట్టి
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగాన్ని మారుస్తామంటూ మాట్లాడిన కేంద్రమంత్రి అనంత్‌కుమార్ విచ్ఛిన్నకర శక్తి, దేశద్రోహి అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు. గాంధీభవన్‌లో గురువారం మాట్లాడుతూ జాతికి పునాదులేసిన అంబేడ్కర్ ఆలోచనా విధానం ప్రశ్నార్థకంగా తయారైందని పేర్కొన్నారు. అనంత్‌కుమార్‌ను కేంద్రమంత్రి వర్గం నుంచి తప్పించాలన్నారు. అన్ని కులాలను, మతాలను ఏకతాటిపైకి తెచ్చి, మార్పు దిశగా నడిపించే శక్తి ఒక్క కాంగ్రెస్ మాత్రమేనన్నారు. సామాజిక మార్పు కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న చరిత్ర కాంగ్రెస్‌దన్నారు. లౌకికవాదమనే బలమైన పునాదులతో కాంగ్రెస్ నిర్మాణం జరిగిందని చెప్పారు. జాతి సమగ్రతను కోరుకునే వారందరికీ కాంగ్రెస్ పుట్టిన రోజు ఓ పండుగ అన్నారు. అంబేడ్కర్ ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా భిన్నత్వంలో ఏకత్వం కోసం కాంగ్రెస్ పాటుపడుతోందని పేర్కొన్నారు. రాజకీయ విలువలతో పాటు సామాజికంగా, ఆర్థికంగా తీసుకువెళ్తున్న పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. అనేకరకాల పేదరిక, కులం, మతం వంటి ఎన్నో సామాజిక రుగ్మతలపై పోరాడిన చరిత్ర అని వివరించారు. బెనర్జీ నేతృత్వంలో ప్రారంభమై మహాత్మా గాంధీ, నెహ్రూ, నేతాజీ, లజపతిరాయ్, తిలక్, ఇందిరా వంటివారి ఆలోచనలను పుణికిపుచ్చుకున్న రాహుల్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు. పోలీసుల వలయంలో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, శాంతిభద్రతలు లేవకపోవడంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే పెట్టుబడిదారులు భయపడుతున్నారని చెప్పారు. ఏ లక్ష్యాల కోసం తెలంగాణ తెచ్చుకున్నామో వాటికి వ్యతిరేకంగా పాలన ఉందని విమర్శించారు. ఓయూలోకి వెళ్లి మాట్లాడటానికి భయపడటం వల్లే అక్కడ నిర్వహించాల్సిన సైన్స్ కాంగ్రెస్‌ను రద్దు చేశారని ఆరోపించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, నేతలు కమలాకర్‌రావు, కుసుమకుమార్ పాల్గొన్నారు. -
‘లౌకికవాదులకు వాళ్ల రక్తం ఏంటో తెలియదు’
కొప్పల్(కర్ణాటక) : భారత రాజ్యాంగం నుంచి ‘లౌకికతత్వం’ పదాన్ని తొలగించాలని కేంద్రం ప్రభుత్వం భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే వెల్లడించారు. కొప్పల్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. సెక్యులరిస్టులపై విరుచుకుపడ్డారు. లౌకికవాదులకు వాళ్ల రక్తం ఏంటో తెలియదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మేము సెక్యులరిస్టులం అని చెప్పుకోవడానికి రాజ్యాంగం ప్రజలకు అనుమతి ఇచ్చింది. రాజ్యాంగాన్ని పలుమార్లు సవరించారన్న విషయం గుర్తుంచుకోవాలి. మేం కూడా రాజ్యాంగాన్ని సవరించి లౌకికతత్వం అనే పదాన్ని తొలగిస్తాం. మేం అధికారంలోకి వచ్చింది అందుకే. మీరు ముస్లింలు, క్రైస్తవులు లేదా వేరే మతాలకు చెందిన వారు అయితే ఆ మతంతో, కులంతో సంబంధం కలిగివున్నందుకు గొప్పగా భావించండి. అంతేకానీ, అసలు ఎవరీ లౌకికవాదులు?. లౌకికవాదులకు తల్లిదండ్రులు లేరు’ అని వ్యాఖ్యానించారు అనంత్. అనంత కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతేడాది ఇస్లాం మతాన్ని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడినందుకు ఆయనపై కేసు నమోదైంది. ఈ ఏడాది నవంబర్‌లో జరిగిన టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆయన నిరాకరించారు. -
‘హనుమంతుని రాజ్యంలో రావణ పాలన’
సాక్షి, మైసూరు: హనుమంతుని రాజ్యంలో రావణ పాలనను సాగిస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్రంలో కుల, మత విద్వేషాలు చోటుచేసుకోవడానికి ముఖ్య కారకులవుతున్నారంటూ కేంద్రమంత్రి అనంతకుమార్ ఆరోపించారు. సోమవారం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సిద్దరామయ్య నేతృత్వంలోని పాలన రావణ పాలనను తలపిస్తోందన్నారు. టిప్పు జయంతి, ఈద్‌మిలాద్, పీఎఫ్ఐ ఊరేగింపులకు అనుమతులిచ్చి, హనుమజ్జయంతి ఊరేగింపులను అడ్డుకుంటూ సిద్ధరామయ్య హిందూ మత వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. హనుమంతుని నాడుగా ప్రసిద్ధి చెందిన కర్ణాటకలో హనుమజ్జయంతి ఊరేగింపులకు అనుమతులు ఇవ్వకుండా సీఎం సిద్ధరామయ్య మత విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రుద్రేశ్, శరత్ మడివాళ ,రాజు, కుట్టప్ప తదితర 19 మంది హిందూ సంఘాల కార్యకర్తలు హత్యలకు గురైనా, హంతకులెవరో తెలిసినా కూడా మౌనం వహిస్తూ సిద్ధరామయ్య రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. హుణుసూరులో హనుమ భక్తులు, హిందూ సంఘాల కార్యకర్తలను అరెస్ట్ చేయించి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకునేలా సీఎం సిద్దరామయ్య కుట్రలు చేశారని ఆరోపించారు. సీఎం కుట్ర పూరిత ఆదేశాలతో రాజ్యాంగం, చట్టాలను అతిక్రమించి జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఒక ఎంపీని అరెస్ట్ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని తాము తీవ్రంగా పరిగణించామని కలెక్టర్, ఎస్పీలు ఎంపీ హక్కులను ఉల్లంఘించిన ఘటనపై ఇదే నెల 15 నుంచి జరుగనున్న శీతాకాల పార్లమెంటరీ సమావేశాల్లో నిరసన తెలుపుతామని చెప్పారు. -
యడ్యూరప్పకు కోర్టు నోటీసులు
సాక్షి, బెంగళూరు: కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్‌తో పాటు కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్పకు బెంగళూరు సెషన్స్ కోర్టు శనివారం నోటీసులు జారీ చేసింది. రెండు నెలల కిందట నగర బీజేపీ కార్యాలయంలో వీరిద్దరూ వేదికపై ‘మనం కూడా హైకమాండ్‌కు ముడుపులు ఇచ్చాం. అయితే అందరికీ తెలిసేటట్టు ఇస్తామా’ అని ఒకరికొకరు చెప్పుకుంటున్నట్లున్న వీడియోను కాంగ్రెస్ నాయకులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ సీడీలను కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఉగ్రప్ప సిటీ సైబర్ పోలీస్‌స్టేషన్‌లో అందజేసి దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా కోరారు. పోలీసులు కోర్టును ఆశ్రయించగా వీరిద్దరికీ కోర్టు నోటీసులు జారీ చేస్తూ, ఇవి అందిన ఏడు రోజుల్లోపు స్వర పరీక్షలకు హాజరు కావాలని ఆదేశించింది. -
స్టెంట్ల కొరత సృష్టిస్తే లైసెన్సులు రద్దు
కేంద్రమంత్రి అనంతకుమార్ బనశంకరి (బెంగళూరు): గుండె శస్త్ర చికిత్సలో ఉపయోగించే స్టెంట్ ధరలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఔషధ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్ హెచ్చరించారు. స్టెంట్ల ఉత్పత్తి గతంలో మాదిరిగానే కొనసాగాలని స్పష్టం చేశారు. స్టెంట్ ధర తగ్గించడం చరిత్రాత్మక నిర్ణయమా? కాదా? అనే అంశంపై శుక్రవారం బెంగళూరులో ఏర్పాటు చేసిన సదస్సులో మంత్రి పాల్గొని మాట్లాడారు. తగ్గించిన ధరలు ఈ నెల 13 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయన్నారు. సాధారణ స్టెంట్ (మెటల్స్టెంట్) మార్కెట్లో రూ.40 వేల నుంచి రూ. 50 వేలకు విక్రయించేవారని, ఇకపై రూ.7,260 కంటే ఎక్కువ ధరకు విక్రయించరాదని ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. ప్రత్యేక స్టెంట్లు రూ.లక్షా 70 వేలకు విక్రయించేవారని, ఇకపై వీటిని రూ.29,600 కంటే అధిక ధరకు విక్రయించరాదన్నారు. నియమాలు ఉల్లంఘించిన సంస్థల అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. -
స్టెంట్ల ధరలు 85 శాతం తగ్గింపు
-
స్టెంట్ల ధరలు 85 శాతం తగ్గింపు
హృద్రోగులకు కేంద్రం తీపికబురు ► మెటల్ స్టెంట్ రూ. 7,260గా, డ్రగ్ స్టెంట్ రూ. 29,600గా నిర్ణయం ► సవరించిన ధరలు తక్షణం అమల్లోకి న్యూఢిల్లీ: లక్షలాది మంది హృద్రోగులకు ఊరట నిచ్చేలా స్టెంట్ల ధరలు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గుండె శస్త్ర చికిత్సలో ఎంతో కీలమైన కరోనరీ స్టెంట్ల ధరల్ని 85 శాతం మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బేర్ మెటల్ స్టెంట్ (బీఎంఎస్) ధరను రూ. 7,260గా, డ్రగ్ ఎలుటింగ్ స్టెంట్ (డీఈఎస్) ధరను రూ. 29,600గా నిర్ణయిం చామని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంత్ కుమార్ మంగళవారం తెలిపారు. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. వ్యాట్, స్థానిక పన్నులతో కలిపి గరిష్టంగా బీఎంఎస్ రూ.7,623కు, డీఈఎస్ రూ.31,080కు దొరుకుతుం దని చెప్పారు. ఇప్పటివరకు బీఎంఎస్ ధర గరిష్టంగా రూ. 45 వేలు ఉండగా, డీఈఎస్ రూ. 1.21 లక్షల వరకూ ఉండేది. ప్రస్తుతం కంపెనీల వద్ద ఉన్న స్టెంట్ల నిల్వలకు కూడా సవరించిన ధరల్ని అమలు చేయాలని, ఒకవేళ రోగుల నుంచి ఎక్కువ వసూలు చేస్తే... ఆస్పత్రులు, స్టెంట్ల సరఫరా దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అనంత్ కుమార్ హెచ్చరించారు. రూ. 4,450 కోట్ల మేర తగ్గనున్న భారం ‘పలు ఆస్పత్రుల్లో కరోనరీ స్టెంట్ల ధరలు భారీగా ఉండడంపై కొనసాగుతున్న ఆందోళనకు ముగింపు పలకాలనుకున్నాం. ఎంతో జాగ్రత్తగా ఆలోచించి, వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకున్న అనంతరం జాతీయ ఫార్మాస్యూటికల్ ధరల సంస్థ (ఎన్ పీపీఏ) స్టెంట్ల గరిష్ట ధరను నిర్ణయించింది’ అని మంత్రి చెప్పారు. ఈ తగ్గింపుతో ఏడాదికి రూ. 4,450 కోట్ల మేర గుండె సంబంధిత రోగులపై భారం తగ్గుతుందన్నారు. స్టెంట్ల సరఫరాలోని వివిధ దశల్లో ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నట్లు కనుగొన్నామని ఎన్ పీపీఏ పేర్కొంది. దీంతో ఆర్థికంగా రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, వారికి ఊరటనిచ్చేలా కరోనరీ స్టెంట్ల గరిష్ట ధరల్ని తక్షణం సవరించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ప్రభుత్వ ప్రకటనను పలు వైద్య విభాగాలు స్వాగతించాయి. కొన్ని ఆస్పత్రుల అనైతిక చర్యలకు ఈ నిర్ణయంతో చెక్ పెట్టారంటూ ఆలిండియా డ్రగ్ యాక్షన్ నెట్వర్క్, డాక్టర్స్ ఆఫ్ ఎథికల్ హెల్త్‌కేర్‌లు ప్రశంసించాయి. -
మనమూ ముడుపులిచ్చాం కదా!
► బీజేపీ నేత యడ్యూరప్ప, కేంద్ర మంత్రి అనంత్ సంభాషణ! ► సీడీ విడుదల చేసిన కర్ణాటక మంత్రులు సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రధాన విపక్షమైన బీజేపీ మధ్య ఎత్తుకు పైఎత్తులతో రాజకీ యం జోరుగా సాగుతోంది. సీఎం సిద్ధరామయ్య పదవిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పెద్దలకు రూ. వెయ్యికోట్ల ముడుపులిచ్చాడని, ఆ డైరీ ఈడీ వద్ద ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప ఆరోపించడం, ఆయనపై పరువునష్టం దావావేస్తానని సీఎం ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మంత్రులు బసవరాజ రాయ రెడ్డి, ఎంబీ పాటిల్, రమేష్‌కుమార్ సోమవారం విధానసౌధలో ఒక చేశారు. యడ్యూరప్ప, కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌లు ఆదివారం బెంగళూరు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి. అందులో సిద్ధరామయ్యపై ఆరోపణలు చేసి భలే ఇరికించారని అనం త్.. యడ్యూరప్పతో అంటారు. మీరు, నేను కూడా పార్టీ పెద్దలకు ముడుపులు ఇచ్చాం కదా.. అని అనంత్‌కుమార్ మళ్లీ అంటారు. యడ్యూరప్ప స్పందిస్తూ ఎంత ఇచ్చినా ఎవరైనా డైరీలో రాస్తారా? అని సమాధానం ఇస్తారు. ఈ సంభాషణపై సుప్రీంకోర్టు జడ్జితో దర్యాప్తు చేయించాల ని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. సీడీ విషయంపై అనంత్‌కుమార్, యడ్యూరప్ప స్పందిస్తూ.. తాము మాట్లాడిన పూర్తి మాటలను కాకుండా అక్కడొక పదం, ఇక్కడొక పదం తీసి సీడీని రూపొందించారని ఆరోపించారు. -
మందుల మాఫియాకు అడ్డుకట్ట
3వేల జన్ ఔషధి కేంద్రాలను తెరవనున్న కేంద్రం న్యూఢిల్లీ: దేశంలో రెచ్చిపోతున్న మెడిసిన్ మాఫియాకు అడ్డుకట్టవేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. మార్చి చివరి కల్లా దేశవ్యాప్తంగా 3వేల జన్ ఔషధి కేంద్రాలను తెరిచి తక్కువధరకే నాణ్యమైన మందులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయని రసాయన, ఎరువుల మంత్రి అనంత్ కుమార్ శుక్రవారం తెలిపారు. జాతీయ యువ సహకార సొసైటీ (ఎన్ వైసీఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. ‘దురదృష్టవశాత్తూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో మెడిసిన్ మాఫియా ఆధిపత్యం నడుస్తోంది. ఇష్టమొచ్చిన రేట్లకు మందులను విక్రయిస్తూ.. సామాన్యుణ్ని ఇబ్బందులు పెడుతున్నారు. జెనరిక్ మందులతో పోలిస్తే జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు బ్రాండెడ్ (పేటెంట్ హక్కులున్న) మందులకు అత్యధికంగా డబ్బులు తీసుకుంటున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయాలి’ అని తెలిపారు. జెనరిక్ దుకాణాల్లో అమ్మే మందుల నాణ్యత ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో సరిపోతుందని, ధర కూడా చాలా తక్కువగా ఉంటుందన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో మెడిసిన్ మాఫియా నిశ్శబ్దంగా ఉండదన్నారు. -
ముగిసిన తొలిదశ బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ తొలి దశ బడ్జెట్ సమావేశాలు గురువారంతో ముగిశాయి. మలి దశ సమావేశాలు మార్చి 9న ప్రారంభమై ఏప్రిల్ 2తో ముగుస్తాయి. జనవరి 31న ప్రారంభమైన తొలి దశలో భాగంగా లోక్‌సభ ఏడుసార్లు, రాజ్యసభ ఎనిమిది సార్లు సమావేశమైనట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ తెలిపారు. ఇరు సభల్లో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ పూర్తయిందని, లోక్‌సభ సమావేశాలు 113 శాతం, రాజ్యసభ సమావేశాలు 97 శాతం ఫలప్రదమయ్యాయని ఆయన పేర్కొన్నారు. మొదటి దశ సమావేశాల్లో భాగంగా ఉభయ సభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించడంతో పాటు ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టారు. లోక్‌సభలో ఆర్థిక బిల్లు, పేమెంట్ ఆఫ్ వేజెస్(సవరణ) బిల్లు, స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్ల బిల్లు, ఐఐఎం బిల్లు, రిపీలింగ్ అండ్ అమెండింగ్ బిల్లుల్ని ప్రవేశపెట్టారు. వీటిలో పేమెంట్ ఆఫ్ వేజెస్ బిల్లును ఇరు సభలు ఆమోదించాయి. -
శరణార్థులకు ట్రంప్ షాక్
అమెరికాలోకి సిరియా శరణార్థుల వలసపై నిరవధిక నిషేధం ► ఏడు ఇస్లామిక్ దేశాల పౌరులకు 90 రోజులు వీసాల జారీ నిలిపివేత ► శరణార్థుల పునరావాస కార్యక్రమం 120 రోజులు బంద్ వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం చెప్పింది చెప్పినట్లు ఆచరణలో పెట్టేస్తున్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదుల్ని అమెరికాలో ప్రవేశించకుండా అడ్డుకుంటామన్న ఎన్నికల హామీని అమలు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై శనివారం సంతకం చేశారు. ఉత్తర్వు ప్రకారం అమెరికాలోకి సిరియా శరణార్థుల ప్రవేశాన్ని నిరవధికంగా నిషేధించారు. ఇతర దేశాల శరణార్థుల్ని ఆసాంతం పరిశీలించాకే అనుమతిస్తారు. వలసదారులకు సంబంధించి కొత్త నిబంధనలు రూపొందించే వరకు ఇరాక్, సిరియా, ఇరాన్ , సూడాన్ , లిబియా, సోమాలియా, యెమెన్ పౌరులకు 90 రోజుల వరకు వీసాల జారీ నిలిపేస్తారు. అమెరికాలోని శరణార్థుల పునరావాస కార్యక్రమం కనీసం 120 రోజుల పాటు ఆపేస్తారు. సిరియా వలసదారుల్లో క్రైస్తవులకు ప్రాధాన్యమిస్తారు. సంతకం చేశాక ట్రంప్ మాట్లాడారు. ‘ఇస్లామిక్ ఉగ్రవాదులను అమెరికా బయటే ఉంచేందుకు అత్యంత కఠినమైన నిబంధనలు తీసుకువస్తున్నాం. ఉగ్రవాదులు ఇక్కడ ఉండాలని మేము కోరుకోవడం లేదు. అమెరికాకు మద్దతిచ్చే, ప్రేమించే ప్రజలే ఇక్కడకు రావాలని కోరుకుంటున్నాం’అని ట్రంప్ పేర్కొన్నారు. 9/11 దాడులు నేర్పిన పాఠాల్ని ఎప్పుడూ మరవకూడదని చెప్పారు. ‘విదేశాల్లో జన్మించి అమెరికాలో ఉంటున్న అనేకమందికి ఉగ్ర నేరాల సంబంధాలపై శిక్షలు పడ్డాయి. శరణార్ధి ఒప్పందంలో భాగంగా అమెరికాలోకి ప్రవేశించిన వారికీ నేరాలతో సంబంధాలు ఉన్నాయి’ అని ఉత్తర్వుల్లో వెల్లడించారు. నిర్ణయంపై నిరసనల వెల్లువ ట్రంప్ సంతకంపై అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు, పలు దేశాల అధినేతలు తీవ్రంగా స్పందించారు. డెమొక్రటిక్ సెనెటర్ కమలా హారిస్ వ్యాఖ్యానిస్తూ... ‘హోలోకాస్ట్ (మారణహోమం) మెమొరియల్ డే’ రోజున ట్రంప్ సంతకం చేశారని, ఇది ముస్లింలపై నిషేధమేనని పేర్కొన్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామం తనని కలచి వేసిందన్నారు. ‘అనేక మంది అమెరికన్లలా నేనూ వలసదారుల వారసుడినే. అందుకు గర్వపడాలి. దేశానికి ప్రమాదం తలపెట్టే వారిపై మాత్రమే దృష్టి పెట్టాలి. శరణు కోరినవారికి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచాలి’ అని జుకర్‌బర్గ్ ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. అమెరికాకు ప్రతిభావంతుల్ని తీసుకురావడంలో ట్రంప్ నిర్ణయం అడ్డంకులు సృష్టిస్తుందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెప్పారు. ట్రంప్ ఆదేశాలతో తమ కంపెనీలో కనీసం 187 మంది ఉద్యోగాలు కోల్పోతారని చెప్పారు. భారత్‌పై ప్రభావం ఉండదు ట్రంప్ విధానాలు భారత్‌లోని ఐటీ, బయోటెక్, ఫార్మా పరిశ్రమలపై ప్రభావాన్ని చూపబోవని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంత కుమార్ అన్నారు. భారత్‌తో వాణిజ్య తరహా దృక్పథాన్ని అమెరికా కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
‘వేసవిలో సమావేశాలు బాగా జరిపిస్తాం’
న్యూఢిల్లీ: ఎలాంటి ఫలితాలను ఇవ్వకుండానే మొత్తానికి శీతాకాల సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. దాదాపు నెల రోజులపాటు జరిగిన సమావేశాల్లో లోక్ సభ కేవలం 17.04శాతం మాత్రమే పనిచేయగా.. రాజ్యసభ 20.61శాతం నడిచిందని కేంద్ర మంత్రి అనంత కుమార్ చెప్పారు. లోక్ సభలో నాలుగు, రాజ్యసభలో ఒక బిల్లుకు ఆమోదం అయినట్లు ఆయన చెప్పారు. విపక్షాల కారణంగానే సభలు నడవలేదని ఆయన అన్నారు. వేసవికాలంలో జరిగే పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేలా చూసుకుంటామని హామీ ఇచ్చారు. -
ఉభయసభల్లో మారని తీరు
-
ఉభయసభల్లో మారని తీరు
నోట్ల రద్దుపై చర్చకు సిద్ధమన్న ప్రతిపక్షం న్యూఢిల్లీ: మూడు వారాలు గడుస్తున్నా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఏం మార్పూ లేదు. విపక్షాల ఆందోళన, ప్రభుత్వం ఎదురుదాడి మధ్య శుక్రవారమై ఉభయ సభలు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే వాయిదాపడ్డాయి. నోట్ల రద్దుపై చర్చకు సిద్ధమంటూ లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రకటించినా 16 రోజులుగా సభను అడ్డుకున్నందుకు క్షమాపణలు చెప్పాలంటూ ప్రభుత్వం డిమాండ్ చేయడంతో గందరగోళం కొనసాగింది. రాజ్యసభలో నోట్ల రద్దు అంశంతో పాటు గోధుమలపై దిగుమతి సుంకం తగ్గించడాన్ని విపక్షాలు వ్యతిరేకించాయి. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభను స్పీకర్ వాయిదా వేయగా, వాయిదాల అనంతరం సమావేశమైన రాజ్యసభలో కోరం లేకపోవడంతో డిప్యూటీ చైర్మన్ తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేశారు. లోక్‌సభలో కాంగ్రెస్ నేత ఖర్గే మాట్లాడుతూ... నోట్ల రద్దు, దాని పరిణామాలపై చర్చించేందుకు ప్రతిపక్షం సిద్ధంగా ఉందన్నారు. ఇంతలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ జోక్యం చేసుకుంటూ.. విపక్షాలు 16 రోజులుగా సభను నడవనీయలేదని అందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ సభ్యురాలు మీనాక్షీ లేఖీ మాట్లాడుతూ... రాష్ట్రపతి సూచించినట్లు నిరసనలు, ధర్నాల కోసం జంతర్‌మంతర్ సరైన వేదికని పార్లమెంట్కాదన్నారు. ఉదయం సభ మొదలవగానే డిసెంబర్ 13, 2001న పార్లమెంట్‌పై ఉగ్రదాడి ఘటనను గుర్తు చేసుకుంటూ... ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బందికి నివాళులర్పించారు. కోరం లేక రాజ్యసభ వాయిదా.. గోధుమలపై దిగుమతి సుంకం ఎత్తివేయడంపై రాజ్యసభలో కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, జేడీయూ, లెఫ్ట్ పార్టీలు నిరసన తెలిపాయి. ఈ నిర్ణయంతో రైతులు తీవ్రంగా నష్టపోతారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో గోధుమల కొరత లేదని, ఇటీవల ధరలు పెరగడంతో తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆహార మంత్రి పాశ్వాన్ చెప్పారు. ఇదే తుది నిర్ణయం కాదని, అవసరమనుకుంటే సమీక్షించవచ్చన్నారు. ఇంతలో కురియన్ జీరో అవర్ ప్రారంభించగా ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి వెళ్లి రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని సహించేది లేదంటూ నినాదాలు చేశారు. -
సభలో అద్వానీ ఆగ్రహంతో మాట్లాడినా..
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో పార్లమెంటులో తరచూ గందరగోళం చెలరేగి.. సమావేశాలు పూర్తిగా స్తంభించిపోతుండటంపై బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ ఆగ్రహంగా కనిపించారు. సభలో ఒకవైపు ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో గందరగోళం కొనసాగుతుండగానే.. పార్టీ సహచరుడు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్‌తో అద్వానీ ఆగ్రహంతో మాట్లాడారు. 'ఎవరు సభను నడుపుతున్నారు? సమయమంతా వృథా అవుతోంది. ఇటు స్పీకర్ (సుమిత్రా మహాజన్) కానీ, అటు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కానీ సభను నడిపించడం లేదు' అంటూ 89 ఏళ్ల ఆయన ఒకింత ఉద్వేగంతో, ఆగ్రహంతో అనంత్‌కుమార్‌ను ఉద్దేశించి అన్నారు. లోక్‌సభలో మధ్యాహ్న భోజన విరామానికి 15 నిమిషాల ముందు అద్వానీ స్వయంగా తనవద్దకు అనంత్‌కుమార్‌ను పిలిపించుకొని ఈ వ్యాఖ్యలు చేస్తూ కనిపించారు. లోక్‌సభలో గతకొన్ని రోజులుగా గందరగోళ దృశ్యాలు పునరావృతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో సీనియర్ సభ్యులు, ప్రతిపక్ష సభ్యులను సముదాయించేందుకు అనంత్‌కుమార్ ఎంత ప్రయత్నిస్తున్నా సఫలం కావడం లేదు. స్పీకర్ కుర్చీకి సమీపంలో ఉన్న ప్రెస్ గ్యాలరీలోకి ప్రవేశించి ఆందోళన చేపడుతున్న విపక్ష ఎంపీలను ఉద్దేశించి.. 'ప్రజలు చూస్తున్నారు. ఇలా చేయడం తగదు' అంటూ అనంత్‌కుమార్ పదేపదే పేర్కొంటున్నా ప్రయోజనం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో సభ తీరుతో ఆందోళన చెందిన అద్వానీ.. "సమావేశాలు ఇలాగే కొనసాగితే ఇదే విషయాన్ని నేను బాహాటంగా ప్రజలకు చెప్తాను. స్పీకర్‌కు చెప్తాను' అని అసహనంగా పేర్కొన్నారు. అనంతరం స్పీకర్ సభను వాయిదా వేయగా.. వాయిదా ఎందుకు సైన్‌డై చేయొచ్చుగా అంటూ లోక్‌సభ అధికారులతో ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత లంచ్ బ్రేక్‌లో ఎవరితో మాట్లాడకుండా అద్వానీ వెళ్లిపోయారు. దీంతో బీజేపీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. సభను తరచూ ఆటంక పరుస్తుండటంతో ఒక సీనియర్ పార్లమెంటేరియన్ ఆందోళన, ఆక్రోషం ఇదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇందుకు ప్రతిపక్షాలే కారణమని నిందించారు. -
‘జీఎస్టీ’ కోసం ముందుగానే శీతాకాల సమావేశాలు
నవంబర్ తొలి వారంలో జరపాలని కేంద్రం యోచన న్యూఢిల్లీ: కీలకమైన వస్తు సేవల బిల్లుకు సంబంధించిన కార్యక్రమాలన్నీ వీలైనంత త్వరగా పూర్తిచేసి వచ్చే ఏడాది ఏప్రిల్ 1నుంచి అమలుచేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా సీజీఎస్టీ, ఐజీఎస్టీ బిల్లులను ఆమోదించేందుకు పార్లమెంటు శీతాకాల సమావేశాలను కాస్త ముందుగానే నిర్వహించాలనుకుంటోంది. సాధారణంగా నవంబర్ మూడు, నాలుగో వారాల్లో శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే ఈసారి మొదటి వారంలోనే (దీపావళి అయిపోయిన తర్వాత) మొదలుపెట్టాలని భావిస్తోంది. ఇందుకోసం పార్లమెంటు వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. వర్షాకాల సమావేశాల్లాగే శీతాకాల సమావేశాలనూ విజయవంతం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. అనకున్న సమయానికి సీజీఎస్టీ, ఐజీఎస్టీ బిల్లులకు ఆమోదం పొందితే.. ఆర్థికశాఖ జీఎస్టీని అంత పకడ్బందీగా అమలు చేసేందుకు అవకాశం దొరుకుతుంది. వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన జీఎస్టీ బిల్లుకు 50శాతానికి పైగా రాష్ట్రాలు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నెల మొదట్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బిల్లుకు అంగీకారాన్ని తెలపగా.. కేంద్రం వెంటనే జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కాగా, జీఎస్టీతోపాటు తయారీరంగాన్ని కాపాడుకునేందుకు ఒక్కో ఉత్పత్తికి ఒక్కో పన్ను విధానం (శ్లాబులు) విధించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. అన్ని రంగాలకూ ఒకే రకమైన రేటుతో పన్నులు విధించలేమన్నారు. చిన్న సంస్థలకు కూడా స్థిరమైన జీఎస్టీని అమలు చేయటం ద్వారా అవి మనుగడ సాధించలేవని.. అందువల్ల వీటికి తక్కువ పన్ను విధిస్తామన్నారు. బికనీర్ పాపడ్‌పై కేవలం ఒకశాతం పన్ను మాత్రమే అమల్లో ఉందని మంత్రి తెలిపారు. -
'అఖిలపక్ష సమావేశం సంతృప్తిగా జరిగింది'
న్యూఢిల్లీ: సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నేడు అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో.. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు విపక్షాలు సహకరించాలని ఎన్డీఏ కోరింది. అలాగే పెండింగ్ బిల్లుల ఆమోదంపై చర్చ జరిగింది. జీఎస్టీ బిల్లుతో సహా పలు కీలక బిల్లుల ఆమోదానికి సహకరించాలని ప్రభుత్వం ప్రతిపక్షాలను కోరింది. ఈ సందర్భంగా అన్ని పార్టీలు ప్రభుత్వానికి సహకరిస్తామని హామీ ఇచ్చాయని, సమావేశం సంతృప్తిగా జరిగిందని మంత్రి అనంతకుమార్ తెలిపారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్ సీపీ తరఫున మేకపాటి, విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే వస్తు సేవల పన్ను(జీఎస్టీ) బిల్లు ఆమోదం పొందుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం చెన్నైలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జీఎస్టీ బిల్లుకు అన్ని పార్టీలు అంగీకరించాయని, ఈ బిల్లుతో అందరికీ మేలు జరుగుతుందని అన్నారు. -
'అఖిలపక్ష సమావేశం సంతృప్తిగా జరిగింది'
-
యెడ్డీకి తిరుగుబాటు సెగలు!
కర్ణాటకలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఇటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సొంత పార్టీలో అసమ్మతి ఎదుర్కొంటుండగా.. అటు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్పకు వ్యతిరేకంగా తిరుగుబాటు సెగలు ఎగిసిపడుతున్నాయి. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి బీజేపీని అధికారంలో తెచ్చే లక్ష్యంతో గత ఏప్రిల్‌లో పార్టీ పగ్గాలను కమల అధినాయకత్వం యెడ్డీకి అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే, అందరినీ కలుపుకొని ముందుకెళ్లడానికి బదులు యెడ్డీ నియంతలాగా వ్యవహరిస్తున్నారని బీజేపీ కర్ణాటక సీనియర్ నేతలు మండిపడుతున్నారు. సీనియర్ నాయకులైన కేఎస్ ఈశ్వరప్ప, జగదీశ్ షెట్టర్, కేంద్రమంత్రులు అనంత్ కుమార్, డీవీ సదానంద గౌడ యెడ్డీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సీనియర్ నేతలను విస్మరించి.. వారి అభిప్రాయాలకు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా యడ్యూరప్ప ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వారు భగ్గుమంటున్నారు. మాజీ సీఎం అయిన యెడ్డీ తాజాగా చేపట్టిన జిల్లా అధ్యక్షులు, ఆఫీస్ బేరర్ల నియామకంలో తమను సంపద్రించలేదని, తమ అభిప్రాయాలు ఏమాత్రం వినకుండా ఇష్టానుసరం ఈ నియామకాలు చేపట్టారని కర్ణాటక బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప మీడియా ముందే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర సీనియర్ నేతలు మీడియా ముందుకు రానప్పటికీ వారు కూడా ఇదేవిధంగా రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. కర్ణాటక బీజేపీలోని యెడ్డీ వ్యతిరేక గ్రూపు తమ అసంతృప్తిని మూకుమ్మడిగా పార్టీ అధిష్ఠానానికి నివేదించాలని నిర్ణయించినట్టు తెలిసింది. శీతాకాలం సమావేశాల సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్రమోదీకి యెడ్డీ తీరుపై ఫిర్యాదు చేయాలని అసమ్మతి నేతలు నిర్ణయించారు. -
ఏపీలో ఫార్మా రీసెర్చ్ సెంటర్!
హైదరాబాద్‌లో ఫార్మా క్లస్టర్ ఏర్పాటు? బెంగళూరు: ఆంధ్రప్రదేశ్‌లో ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటును ఆర్థిక శాఖకు ప్రతిపాదించామని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ తెలిపారు. అలాగే హైదరాబాద్‌లోనూ 350 ఎకరాల విస్తీర్ణంలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటు ప్రతిపాదన ఒకటి ఉందన్నారు. వచ్చే ఐదేళ్లలో ఫార్మా రంగంలో స్వయం సమృద్ధిని సాధిస్తామని చెప్పారు. ఆయన ఇక్కడ జరిగిన ‘ఇండియా ఫార్మా 2016’లో ప్రారంభోపన్యాసం చేశారు. -
ఒక్క కేజ్రీవాల్‌కి 120మంది ఎంపీలా?
న్యూఢిల్లీ: ఒక్క కేజ్రీవాల్‌ని ఎదుర్కొనడానికి 120 మంది ఎంపీలని రప్పిస్తున్నారని బీజేపీపై అమ్ అద్మీ పార్టీ ఎదురు దాడికి దిగింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి 120 మంది ఎంపీలని బరిలో దించుతామని కేంద్రమంత్రి అనంత్ కుమార్ వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయి నుంచి విమర్శలు రావడంతో వెంటనే ఎంపీలు కూడా పార్టీ కార్యకర్తలే, 120 మంది ఎంపీలు ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి రావడంలేదని కేంద్రమంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ వివిరణ ఇచ్చారు. -
250 ర్యాలీలు.. 1000 బ్యానర్లు.. 120 మంది ఎంపీలు
న్యూ ఢిల్లీ:ఢిల్లీ శాసన సభకి జరగబోయే ఎన్నికలని బీజేపీ ప్రతిష్టాత్మకంగాతీసుకుంటోంది. ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి 120 మంది ఎంపీలని బరిలో దింపనున్నట్లు కేంద్రమంత్రి అనంత్ కుమార్ చెప్పారు. అంతేకాకుండా వచ్చే ఏడు రోజుల్లో 250 ర్యాలీలు నిర్వహించి, ప్రతి నియోజక వర్గంలో 1000 వరకు బ్యానర్లు ఏర్పాటు చేస్తామని అనంత్ కుమార్ అన్నారు. ఢిల్లీ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 7న జరగనున్నయి. -
చౌక ధరల్లో ఔషధాలు అందించాలి..
రసాయనాల శాఖ మంత్రి అనంత కుమార్ న్యూఢిల్లీ: ప్రజలకు నాణ్యమైన ఔషధాలను అందుబాటు ధరల్లో అందించాలని భారత ఫార్మా కంపెనీలకు రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంత కుమార్ సూచించారు. ఫార్మా రంగంలో విధానాలను, నిబంధనాలను మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక్కడి రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. బల్క్‌డ్రగ్‌ల దిగుమతులపై చైనాపై అధికంగా ఆధారపడుతున్నామని, ప్రభుత్వం దీనికి పరిష్కారం అన్వేషిస్తుందని పేర్కొన్నారు. దేశీయంగా బల్క్‌డ్రగ్‌ల ఉత్పత్తిని చేపట్టే చర్యలు తీసుకోవాలన్నారు. కాగా బల్క్‌డ్రగ్‌ల ఉత్పత్తికి అనువైన వాతావరణాన్ని భారత్ సృష్టించుకోవలసిన అవసరం ఉందని ఫార్మాస్యూటికల్స్ సెక్రటరీ వి.కె. సుబ్బురాజ్ చెప్పారు.ఆర్ఐఎస్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. మన దేశంలో ఫార్మా రంగం మంచి వృద్ధిని సాధించిందని పేర్కొన్నారు. కానీ బల్క్‌డ్రగ్స్, మెడికల్ పరికరాల కోసం దిగుమతులపైననే అధికంగా ఆధారపడుతున్నామని చెప్పారు. బల్క్‌డ్రగ్ రీసెర్చ్, డెవలప్మెంట్ సెంటర్‌గా హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైపర్) కార్యకలాపాలు నిర్వహిస్తోందని వివరించారు. -
అన్యాయం
కార్మిక చట్టాలను మార్చడంపై మల్లికార్జున ఖర్గే ఆగ్రహం కార్పొరేట్ వర్గాలు, వ్యాపారవేత్తలకే లబ్ధి అని ఆరోపణ కేంద్ర ప్రభుత్వ చర్యలపై మండిపాటు కార్మికుల సంక్షేమంపై తమకూ ప్రత్యేక శ్రద్ధ ఉందన్న కేంద్ర మంత్రి అనంతకుమార్ సాక్షి, బెంగళూరు : అనేక సంవత్సరాలుగా ఉన్న కార్మిక చట్టాల్లో మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించడంపై కేంద్ర మాజీ మంత్రి, పార్లమెంటు సభ్యుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. కార్మిక చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకురాదలచిన మార్పుల వల్ల కార్మికులకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని విమర్శించారు. కార్పొరేట్ వర్గాలు, వ్యాపారవేత్తలకు ప్రయోజనం చేకూర్చేలా కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్మిక చట్టాల్లో మార్పులకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మల్లికార్జున ఖర్గే పై విధంగా స్పందించారు. శుక్రవారమిక్కడి వసంతనగర్‌లో నవీకరించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టాలను డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్‌ల కాలంలో రూపొందించినవని చెప్పారు. ఈ చట్టాల్లో ఏవైనా చిన్నపాటి సవరణలు చేయవచ్చు కానీ పూర్తిగా చట్టాలనే మార్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇక ఇప్పుడున్న కార్మిక చట్టాలతోనే జీడీపీ 10 శాతం నుంచి 12 శాతానికి పెరిగిందని, జీడీపీ నెపాన్ని చూపుతూ కార్మిక చట్టాల్లో మార్పులకు సన్నద్దం కావడం సరికాదని అన్నారు. కార్మిక చట్టాల్లో మార్పుపై మరోసారి ఆలోచించాల్సిందిగా ప్రధానికి సూచించాలని అదే వేదికపై ఉన్న కేంద్ర మంత్రి అనంతకుమార్‌ను ఖర్గే కోరారు. అనంతరం కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ...నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పనిచేస్తోందని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ టీ అమ్ముకుంటూ ప్రధాని స్థానానికి చేరుకున్నారని, అందువల్ల కేంద్ర ప్రభుత్వానికి కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ ఉందని తెలిపారు. రాష్ట్రంలో ప్రారంభోత్సవం కోసం ఎదురుచూస్తున్న ఈఎస్ఐ ఆస్పత్రుల గురించి త్వరలోనే కేంద్ర కార్మికశాఖ మంత్రితో చర్చిస్తానని అనంతకుమార్ వెల్లడించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాష్ట్ర మంత్రి ఆంజనేయ తదితరులు పాల్గొన్నారు. -
అనంతకుమార్ స్థానంలో నద్దా
న్యూఢిల్లీ: బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శిగా సీనియర్ జేపీ నద్దా నియమితులయ్యారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. కేంద్ర మంత్రి అనంత కుమార్ స్థానంలో నద్దాను నియమించారు. పార్టీ అభ్యర్థుల ఎంపిక, ఇతర ఎన్నికలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో 15 మంది సభ్యులతో కూడిన కేంద్ర ఎన్నికల కమిటీదే కీలకపాత్ర. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ సభ్యులుగా ఉన్నారు. కాగా సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీలకు స్థానం లభించలేదు. -
రామగుండం యూరియా ప్లాంటుకు పూర్వవైభవం
న్యూఢిల్లీ: యూరియా ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే చర్యలను కేంద్రం చేపట్టింది. మూతపడిన ప్రభుత్వ రంగ యూరియా కర్మాగారాల పునరుద్ధరణకు పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించింది. రామగుండం, తాల్చేర్‌లలో మూతపడిన యూరియా ప్లాంట్లను రూ.10 వేల కోట్ల పెట్టుబడితో పునరుద్ధరించే ప్రతిపాదనలను గత వందరోజుల్లో ఆమోదించామని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ గురువారం మీడియాకు తెలిపారు. సింద్రిలోని మరో మూతపడిన ప్లాంటు పునరుద్ధరణ యత్నాలు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. అస్సాంలోని బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ (బీవీఎఫ్సీఎల్) ప్రాంగణంలో యూరియా - అమోనియా ప్లాంటును కొత్తగా నిర్మించే యత్నాల్లో ఉన్నట్లు వివరించారు. ఇంత భారీ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్లు చేయడం గత దశాబ్దంలో ఇదే ప్రథమమని అన్నారు. గత పదేళ్లలో దేశంలో ఒక్క ఎరువుల ప్లాంటును కూడా నిర్మించలేదని చెప్పారు. యువతకు ఉపాధి కల్పించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ కలలను సాకారం చేసేందుకు జగదీశ్‌పూర్-హల్దియా గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణంపై పెట్రోలియం మంత్రితో ఇప్పటికే రెండుసార్లు చర్చించానని అనంత్‌కుమార్ వెల్లడించారు. -
అనంత కుమార్‌కు కేంద్ర మంత్రి పదవి ?
నేడు ప్రమాణ స్వీకారం ! ఆరుగురికి అధికారిక ఆహ్వానం నేడు జగన్నాథ భవన్లో వేడుకలు ఢిల్లీకి రాష్ర్ట నాయకులు సాక్షి, బెంగళూరు : తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల సహా బెంగళూరు దక్షిణ పార్లమెంటు స్థానం నుంచి ఆరు పర్యాయాలు ఎంపీగా ఎన్నికైన అనంతకుమార్‌కు కేంద్ర మంత్రి మండలిలో స్థానం దక్కడం దాదాపు ఖాయమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఆయన భార్య తేజస్వినీతో కలిసి ఢిల్లీలో మకాం వేసినట్లు తెలుస్తోంది. సోమవారం నరేంద్రమోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వేదికపై అనంతకుమార్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఒకవేళ రాష్ట్రానికి రెండు కేంద్ర మంత్రి పదవులు కేటాయించాలని మోడీ భావిస్తే మరో పదవి మాజీ సీఎం డీ.వీ సదానంద దక్కనుందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. కేంద్ర మంత్రి పదవుల కోసం తాజా ఎంపీలు యడ్యూరప్ప, రమేష్ జిగజిణగిలు చివరి వరకూ పోరాడినా ఫలితం లేకపోయింది. ‘సాధ్యమైనంత తక్కువ సంఖ్యలో మంత్రి మండలి, ఎన్డీఏలోని మిత్రపక్షాలకూ మంత్రిమండలిలో స్థానం’ ఇవ్వాలని కాబోయే ప్రధాని నరేంద్రమోడీ భావిస్తుండటంతో ప్రస్తుతానికి కర్ణాటకకు ఒకటి లేదా రెండు మంత్రి పదవులు మాత్రమే దక్కాయని కర్ణాటక కమలనాథులు చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉండగా మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర శాఖకు చెందిన ఆరుగురికి అధికారిక ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. వీరిలో మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్, మాజీ ఉపముఖ్యమంత్రి కే.ఎస్, మాజీ మంత్రులు అరవింద లింబావళి, సీ.టీ రవి, గోవిందకారజోళ, సంతోష్‌లు ఉన్నారు. వీరు కాక నూతనంగా ఎన్నికైన 17 మంది పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొననున్నారు. మరోవైపు మోడీ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో రాష్ట్రంలోని వివిధ నగరాల్లో వేడుకలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్రశాఖ నిర్ణయించింది. బెంగళూరులోని పార్టీ ప్రధాన కార్యాలయం జగన్నాథ భవన్‌తోపాటు మైసూరు సర్కిల్ వద్ద వేడుకలు నిర్వహించి కమలనాథులు ప్రజలకు మిఠాయిలు పంచనున్నారు. అయితే బీజేపీలోని అనంతకుమార్ వ్యతిరేక వర్గీయులు మాత్రం తద్విరుద్ధంగా చెబుతున్నారు. అద్వానీ శిష్యుడిగా ముద్రపడ్డ అనంతకుమార్‌కు ఇప్పట్లో కేంద్రమంత్రి పదవి ఇచ్చే ఆలోచన మోడీకి లేదని చెబుతున్నారు. అందువల్లే ఆయన ఢిల్లీలో ఉంటూ ఆర్ఎస్ఎస్ నేతనలను ప్రసన్నం చేసుకుని అమాత్య పదవిని పొందాలని వ్యూహ రచన చేస్తున్నారని వారు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా మరో కొన్ని గం టల్లో రాష్ట్రానికి చెందిన ఎంతమందికి కేంద్ర మం త్రి మండలిలో స్థానం దక్కనుందో తేలిపోనుంది.