
యడ్యూరప్పకు కోర్టు నోటీసులు
సాక్షి, బెంగళూరు: కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్‌తో పాటు కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్పకు బెంగళూరు సెషన్స్ కోర్టు శనివారం నోటీసులు జారీ చేసింది. రెండు నెలల కిందట నగర బీజేపీ కార్యాలయంలో వీరిద్దరూ వేదికపై ‘మనం కూడా హైకమాండ్‌కు ముడుపులు ఇచ్చాం. అయితే అందరికీ తెలిసేటట్టు ఇస్తామా’ అని ఒకరికొకరు చెప్పుకుంటున్నట్లున్న వీడియోను కాంగ్రెస్ నాయకులు విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఆ సీడీలను కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఉగ్రప్ప సిటీ సైబర్ పోలీస్‌స్టేషన్‌లో అందజేసి దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా కోరారు. పోలీసులు కోర్టును ఆశ్రయించగా వీరిద్దరికీ కోర్టు నోటీసులు జారీ చేస్తూ, ఇవి అందిన ఏడు రోజుల్లోపు స్వర పరీక్షలకు హాజరు కావాలని ఆదేశించింది.