Yeddyurappa
-
యడ్డిపై పోక్సో కేసు విచారణ వారం వాయిదా
శివాజీనగర: మాజీ సీఎం బీ.ఎస్.యడియూరప్పపై నగర పోలీసులు దాఖలు చేసిన పోక్సో కేసు విచారణను హైకోర్టు ఒక వారంపాటు వాయిదా వేసింది. ఈ కేసు అక్రమమని, చార్జిషీటును రద్దు చేయాలని యడియూరప్ప హైకోర్టులో అర్జీ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణ చేపట్టిన హైకోర్టు ఒక వారం ఈ కేసు విచారణను వాయిదా వేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో యడ్డికి స్వల్ప ఊరట దక్కినట్లయింది. -
కన్నడ నాట అరాచక సర్కార్
సాక్షి, హైదరాబాద్: కన్నడ నాట కాంగ్రెస్ ఆధ్వర్యంలో అరాచక సర్కార్ రాజ్యమేలుతోందని కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ అధికార దాహంతో ఇచ్చిన ఉచిత పథకాల దుష్పరిణామాలు ఇప్పటికే కర్ణాటకపై కనిపిస్తున్నాయన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలల కాలంలోనే దివాళా స్థితికి తెచ్చిన ఘనత కాంగ్రెస్ నేతలదేనని విమర్శించారు. రాష్ట్రంలో బీజే పీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన బుధవారం పార్టీ మీడియా సెంటర్లో విలేకరులతో మాట్లాడారు. కర్ణాటకలో ఇచ్చిన ఐదు గ్యారంటీలు ఉత్తుత్తివే అని, ప్రజలకు అవి ఏమాత్రం భరోసాను ఇవ్వలేదని స్పష్టమైందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు ఉత్తివేనని.. వాటిని నమ్మి కర్ణాటక మాదిరిగా తెలంగాణ ప్రజలు మోసపోవద్దని చెప్పారు. ఉచిత విద్యుత్, అన్నభాగ్య తదితర పథకాలేవీ సరిగా అమలు కావడం లేదని ఆరోపించారు. ఆయా ప థకాల అమలుకు నిధుల కేటా యింపు నామమాత్రంగా చేస్తుండటంతో వాటి మనుగడే ప్రశ్నార్థకంగా మారిందన్నారు. దీంతో మంత్రులు, పార్టీ నేతలు సాంకేతిక కారణాలను సాకుగా చూపి పథకాల అమలు సరిగా జరగడం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అక్కడి ప్రజలు పథకాల అమలుకోసం నిలదీయడంతోపాటు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పారు. అన్న భాగ్య పథకం కింద పేదలకు పదికేజీల బియ్యం ఇస్తామని హామీ ఇచ్చినా దానిని ఎక్కడా పూర్తిస్థాయిలో అమలుచేస్తున్న దాఖలాలు లేవన్నారు. అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరాను కూడా అనేక నిబంధనలు పెట్టి అటకెక్కిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్ హామీలను, ఇంకా బీఆర్ఎస్ వాగ్దానాలను నమ్మి మోసపోవద్దని యడియూరప్ప చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేస్తామని, ఎస్సీల వర్గీకరణ, ఉచితంగా 4 గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి వాటిని అమలు చేస్తామన్నారు -
కర్ణాటక రాజకీయం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా ఎన్నికలపై కర్ణాటక రాజకీయలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. మూడు ప్రధాన పార్టీలు ఆ రాష్ట్ర అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తు న్నాయి. అక్కడ జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమవుతోందనే అంశాన్ని బీఆర్ఎస్ ఓటర్లలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ఓటేస్తే.. ఇచ్చిన హామీలను గాలికొదిలేస్తుందనే ప్రచారం చేస్తోంది. ఇటీవల జహీరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. ఎన్నికల ప్రచార ంలో భాగంగా కర్ణాటక వాసులతో బంధుత్వం ఉన్న మల్లేశంతో ప్రత్యేకంగా ముచ్చటించారు. అక్కడ వ్యవసాయానికి విద్యుత్ సరఫరా బాగా లేదని, పింఛన్లు నామమాత్రంగా ఇస్తున్నారనే అంశాన్ని ఆయనతో చెప్పించి ఓటర్లకు వివరించే ప్రయత్నం చేశారు. అక్కడి ఓటర్లు కాంగ్రెస్‌ను ఎందుకు ఎన్నుకున్నామా? అని ఆ రాష్ట్రంలోని తమ బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పిన మాటలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. హస్తం నేతల ప్రచారం ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం విదితమే. ఆ ప్రభావం ఎక్కువగా జహీరాబాద్ నియోజకవర్గంపై ఉంటుందని పార్టీ భావిస్తోంది. ఈ మేరకు జహీరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి ఆరాష్ట్ర మంత్రులు హాజరవుతున్నారు. ఇటీవల పట్టణంలో ఉన్న షెట్కార్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సమావేశానికి మంత్రులు రహీం, ఈశ్వర్ఖాండ్రే హాజరయ్యారు. తమ రాష్ట్రంలో ఎన్నికల హామీలు విజయవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ సైతం.. బీజేపీ సైతం కర్ణాటక పార్టీ నేతలతో జహీరాబాద్‌లో ప్రచారం చేయిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పతో పట్టణంలో బహిరంగ సభను నాయకులు ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో వెనుకబడిన పార్టీ ఆ రాష్ట్ర నేతలతోనైనా కొంతమేరకు ఊపు వస్తుందనే భావిస్తోంది. ప్రచారానికి వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. ఆ రాష్ట్రంతో సత్సంబంధాలు కర్ణాటకతో జిల్లాలో ప్రధానంగా జహీరాబాద్, నారాయణఖేడ్ రెండు నియోజకవర్గాలకు సరిహ ద్దులు ఉన్నాయి. అందోల్ నియోజకవర్గంలోని రాయ్‌కోడ్ వంటి మండలాలు కూడా సమీపంలో ఉన్నాయి. దీంతో ఈ మూడు నియోజకవర్గాల ప్రజలు ఆరాష్ట్రంతో బంధుత్వాలు, స్నేహ సంబంధాలు కలిగి ఉంటారు. వ్యాపార లావాదేవీల కోసం కూడా సంబంధాలుంటాయి. ఈ నేపథ్యంలో అక్క డి రాజకీయాలు ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతాయో లేదో తెలియాలంటే వేచిచూడాలి. నేడు కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప రాక జహీరాబాద్: బుధవారం పట్టణానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఎన్నికల ప్రచారానికి వస్తున్నట్లు బీజేపీ అభ్యర్థి రాంచందర్ రాజనర్సింహ మంగళవారం తెలిపారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న సభలో ఆయన ప్రసంగిస్తారన్నారు. సభకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు. -
విభేదాలే ఓటమికి కారణమా?
శివాజీనగర: ఈసారి విధానసభా ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలై గత ఎన్నికల కంటే 38 సీట్లను తక్కువ గెలిచింది. మాజీ సీఎం, సీనియర్ నేత యడియూరప్పకు పెద్దపీట వేయకపోవడం, జగదీశ్ షెట్టర్ వంటి లింగాయిత నేతలను దూరం చేసుకోవడం, నేతల మధ్య విభేదాలే ఈ దుస్థితికి కారణమని పార్టీలో ఆవేదన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా యడియూరప్పను, ఆయన సన్నిహితులను పక్కనపెట్టడం వల్ల 10 నియోజకవర్గాల్లో బీజేపీ ఓడిపోయినట్లు అంచనా. దీంతో లింగాయత ఓట్లను లక్ష్యంగా పెట్టుకొన్న బీజేపీకి నష్టం వాటిల్లగా, అనేక నియోజకవర్గాల్లో ఓట్లను కోల్పోయింది. సీటీ రవి వర్సెస్ యడ్డి చిక్కమగళూరులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీ.టీ.రవి, హెచ్.డీ.తమ్మయ్య చేతిలో ఓడిపోయారు. హెచ్.డీ.తమ్మయ్య యడ్డి సన్నిహితుల్లో ఒకరు. అయితే టికెట్ దొరక్కపోవడంతో కాంగ్రెస్‌లోకి చేరి పోటీ చేశారు. ఆయన లింగాయత వర్గానికి చెందినవారు కాగా, సుమారు 6 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అక్కడ లింగాయత్ ఓటర్లు పెద్దసంఖ్యలో ఉండడం గమనార్హం. ఎన్నికలకు ముందు సీటీ రవి యడియూరప్పపై విజయేంద్రపై పరోక్షంగా విమర్శలు గుప్పించేవారు. బీజేపీలో అభ్యర్థుల టికెట్లను ఏ ఒక్కరి ఇంట్లోనో నిర్ణయించరని అన్నారు. వారి విభేదాల వల్ల చిక్కమగళూరులో యడియూరప్ప ప్రచారం కూడా చేయలేదు. ఆయన వర్గీయులు తమ్మయ్యకు గుట్టుగా మద్దతిచ్చి సీటీ రవిని ఓడించినట్లు ప్రచారం సాగుతోంది. -
యడియూరప్ప వక్కతోటలో చేతబడి పూజలు
కర్ణాటక: శాసనసభ ఎన్నికల్లో శివమొగ్గ జిల్లా శికారిపుర నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బీవై విజయేంద్ర ఎన్నికల్లో గెలవ కూడదని చేతబడి చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శికారిపుర తాలూకా బండిబైరనహళ్లి వద్ద ఉన్న మజిరె సిద్దాపుర గ్రామంలో యడియూరప్పకు చెందిన వక్క తోటలో అడవి పిల్లిని తీసుకువచ్చి దానికి పూజలు చేసి అక్కడే పాతిపెట్టారు. అక్కడి పూజలు చూసిన తోటలో పనిచేసే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేబినెట్లో గణేష్‌కు చోటివ్వాలి కంప్లి: బళ్లారి జిల్లాలో రెండోసారి గెలుపొందిన కంప్లి క్షేత్ర ఎమ్మెల్యే జేఎన్.గణేష్‌కు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జీఎస్.మహ్మద్ రఫీక్ అన్నారు. మాజీ జెడ్పీ సభ్యులు కే.శ్రీనివాసరావు, మాజీ టీపీ సభ్యులు కే.షణ్ముఖప్ప ఎమ్మెల్యే గణేష్ పరంగా అహోరాత్రులు గెలుపు కోసం శ్రమించారని, వారి శ్రమ వృథా కాకుండా ఉండాలంటే రెండుసార్లు బీజేపీ అభ్యర్థిపై గెలుపు సాధించిన గణేష్‌కు మంత్రిగా అవకాశం కల్పించాలని కోరారు. -
కర్ణాటకలో మళ్లీ బీజేపీదే విజయం: యడియూరప్ప
-
కర్ణాటక ఎన్నికల్లో పన్నీరు శిబిరం
సాక్షి, చెన్నై: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పోటీచేస్తున్నట్టు ఆ పార్టీ సమన్వయ కమిటీ కనీ్వనర్ పన్నీరు సెల్వం శిబిరం ప్రకటించింది. కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్పతో ఆ శిబిరం ముఖ్యనేత పుహలేంది శుక్రవారం భేటీ అయ్యారు. మెజారిటీ శాతం నేతలు, సభ్యుల మద్దతుతో అన్నాడీఎంకేను పళనిస్వామి కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన పగ్గాలు కూడా చేపట్టారు. అయితే, ఇవన్నీ తాత్కాలికమేనని కోర్టులో జరుగుతున్న న్యాయ పోరాటంలో గెలుపు తమదే ధీమాను ఆ పార్టీ సమన్వయ కమిటీ కనీ్వనర్ పన్నీరుసెల్వం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పళనిస్వామి కన్నా ముందుగా బీజేపీకి దగ్గరయ్యే విధంగా పన్నీరుసెల్వం ఓ అడుగు ముందుకు వెళ్లారు. కర్ణాటకలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీతో కలిసి పయనించేందుకు అన్నాడీఎంకే సిద్ధంగా ఉన్నట్టు పన్నీరు ప్రకటించారు. అలాగే, తన మద్దతు నేత పుహలేందిని కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్పతో భేటీకి పంపించారు. ఆయన్ను కలిసిన పుహలేంది పోటీ విషయంగా చర్చించి రావడం గమనార్హం. పోటీ తథ్యం.. మీడియాతో పన్నీరు సెల్వం మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికలలో తమ శిబిరం తరఫున అన్నాడీఎంకే అభ్యర్థులు పోటీలో ఉండడం తథ్యమని స్పష్టం చేశారు. తాము పోటీ చేస్తున్నామని ఇందులో మార్పులేదన్నారు. కోర్టు తుది తీర్పు అన్నాడీఎంకేకు గట్టి సమాధానంగా ఉంటుందని ధీమా వ్యక్తంచేశారు. నిబంధనలకు విరుద్ధంగా, నోట్ల కట్టలతో ప్రధాన కార్యదర్శి పగ్గాల చేపట్టిన పళణిస్వామికి మున్ముందు ఆ శిబిరం నేతలు బుద్ధి చెప్పే రోజులు రాబోతున్నాయన్నారు. ప్రధాని మోదీని కలిసే అవకాశం కోరినట్టు, పిలుపువస్తే కలిసేందుకు సిద్ధమని పన్నీరుసెల్వం తెలిపారు. -
యడ్డి, తనయుడిపై లోకాయుక్తలో కేసు
శివాజీనగర: బీజేపీ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి బీ.ఎస్.యడియూరప్పకు ఎదురుదెబ్బ తగిలింది. యడ్డి, ఆయన తనయుడు, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడైన బీ.వై.విజయేంద్రలపై కేసు నమోదైంది. వివరాలు.. యడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బెంగళూరు అభివృద్ధి ప్రాధికార (బీడీఏ) పనుల కాంట్రాక్టు మంజూరులో భారీగా ముడుపులు తీసుకున్నారని టీజే అబ్రహాం అనే సామాజిక కార్యకర్త కోర్టులో ప్రైవేట్ కేసు వేయగా కోర్టు తిరస్కరించింది. అబ్రహాం హైకోర్టులో సవాల్ చేయగా, ఆయన పిటిషన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఇటీవల ప్రజా ప్రతినిధుల కోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో లోకాయుక్త కేసు నమోదు చేసింది. ఈ ఆరోపణలు అన్నీ అవాస్తవాలనీ యడ్డి అన్నారు. (చదవండి: IRTC Scam: తేజస్వీ యాదవ్ బెయిల్ రద్దు చేయండి) -
బ్రేకింగ్: కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజు బొమ్మై
-
వెళ్తూ వెళ్తూ దాదాపు 14 లక్షల మందికి లబ్ధి చేకూర్చిన కర్ణాటక మాజీ సీఎం
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి ఇదివరకే రాజీనామా చేసిన యడియూరప్ప… వెళ్తు వెళ్తు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. రాజీనామాకు కొద్ది గంటల ముందు ఉద్యోగుల డీఏను 10.25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉద్యోగుల మూలవేతనంలో డీఏ 21.50 శాతానికి పెరిగింది. ప్రస్తుతం కర్నాటకలో ప్రభుత్వ ఉద్యోగుల డీఏ వారి మూలవేతనంలో 11.25 శాతంగా ఉంది. ఇప్పుడు అది ఏకంగా 21.50కు చేరింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. యడ్డీ నిర్ణయంతో రాష్ట్రంలోని 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, 4.5 లక్షల మంది పెన్షనర్లతో పాటు వివిధ పీఎస్‌యూలు, కార్పొరేషన్లలో పనిచేసే దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. కాగా, ఇవాళ రాత్రి 7 గంటలకు బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బీజేపీ అధిష్టానం ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించనుంది. ఇప్పటికే పరిశీలకులుగా కేంద్రమంత్రులు ధర్మేంధ్ర ప్రధాన్, జి. కిషన్‌రెడ్డిలని నియమించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, రేపేమాపో కర్ణాటక కొత్త సీఎంను ఎన్నుకునేందుకు బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. అంతవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా గవర్నర్ వ్యవహరించనున్నారని తెలుస్తోంది. -
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఖాయం!
-
యడియూరప్పను మార్చాల్సిందే అంటున్న రెబల్స్
-
ముఖ్యమంత్రికి హెలికాప్టర్ కష్టాలు
యశవంతపుర/కర్ణాటక: పలు రాష్ట్రాలలో శాసనసభలకు జరుగుతున్న ఎన్నికల కారణంగా హెలికాప్టర్లకు డిమాండ్ పెరిగింది. బెంగళూరులోని ప్రైవేటు హెలికాప్టర్లు ఆయా రాష్ట్రాల బడా నేతలు బాడుగకు తెప్పించుకున్నారు. సీఎం యడియూరప్ప రాష్ట్రంలో దూరప్రాంతాలకు హెలికాప్టర్లో వెళ్తుంటారు. కానీ గిరాకీ వల్ల హెలికాప్టర్ దొరక్కపోవడంతో కారులోనే వెళ్లారు. గత ఆదివారం 9:30 గంటలకు దావణగెరె జిల్లా హరిహరకు వెళ్లారు. అక్కడ వివిధ మఠాల కార్యక్రమాలలో పాల్గొన్నారు. తిరిగి మధ్యాహ్నం 1:30 గంటలకు బెంగళూరుకు రోడ్డుమార్గంలో సాయంత్రం 4 గంటలకు చేరుకున్నారు. ఎండలో ఆరు వందల కిలోమీటర్లు కారులో తిరిగిన సీఎం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎంపీ హెగ్డేకి బెదిరింపు కాల్ యశవంతపుర: ఎంపీ అనంతకుమార్ హెగ్డేకి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌కాల్ చేసి బెదిరించాడు. ఘటనపై శిరసి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల ఐదోతేదీ రాత్రి రెండు గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ‘గతంలో ఫోన్ చేసినప్పుడు ఆ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశావు.ఈ సారి ఎలాగైనా ప్రాణం తీస్తా’ అంటూ ఆవ్యక్తి ఉర్దూ భాషలో మాట్లాడుతూ బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. చదవండి: కోర్టు వద్దని చెప్పినా సభకు హాజరైన మాజీ సీఎం -
‘బీజేపీ బతకాలంటే సీఎంను మార్చండి’
బెంగళూరు : భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్పపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ బతికి బట్టకట్టాలంటే ముఖ్యమంత్రిని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ వచ్చే ఎన్నికలకు బీజేపీకి ఇలాంటి సీఎం అక్కర్లేదు. కర్ణాటకలో బీజేపీ బతికుండాలంటే సీఎంను మార్చాల్సిన అవసరం ఉంది. సీఎంను కచ్చితంగా మార్చాలి’’ అని అన్నారు. కాగా, కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేయటం తరచుగా జరుగుతోంది. కొద్దిరోజుల క్రితం బీజేపీ సీనియర్ లీడర్ ఒకరు యడియూరప్పపై కామెంట్లు చేశారు. యడియూరప్ప పంచమశాలి లింగాయత్‌లను తన రాజకీయ స్వలాభం కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. చదవండి : మోదీ ఎప్పుడైనా టీ గార్డెన్‌ను సందర్శించారా? -
తొలి రోజే రచ్చ.. షర్టు విప్పేసిన ఎమ్మెల్యే..
సాక్షి, బెంగళూరు: బడ్జెట్ సమావేశాలు రచ్చతోనే ప్రారంభమయ్యాయి. అధికార– ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం ఏర్పడింది. గురువారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. విధానసభలో ఒక దేశం– ఒక ఎన్నికపై చర్చించాలని సభాపతి విశ్వేశ్వరహెగడే కాగేరి సూచించారు దీనిపై కాంగ్రెస్ పక్ష నేత సిద్ధరామయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరికీ చెప్పకుండా చర్చకు ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. ఆర్టికల్ 363 ప్రకారం ఉన్న విశేషాధికారాలతో చర్చకు ఆహ్వానించినట్లు సభాపతి తెలిపారు. విపక్ష సభ్యులు సభాపతి పోడియం చుట్టుముట్టారు. చర్చిస్తే తప్పేముందని బీజేపీ సభ్యులు వాదించారు. ఇరువర్గాల అరుపులతో గందరగోళం నెలకొంది. గందరగోళం తగదు: సీఎం.. సీఎం యడియూరప్ప మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించబోరన్నారు. మొదటిరోజే గందరగోళం సృష్టించడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత లేదు, సభలో ఆందోళన చేయడం సరికాదని సూచించారు. షర్టు విప్పేసిన ఎమ్మెల్యే.. భద్రావతి కాంగ్రెస్ ఎమ్మెల్యే సంగమేశ్ సభాపతి పోడియం ముందుకు వచ్చి చొక్కా విప్పి నిరసన వ్యక్తం చేయడం కలకలం రేపింది. అసభ్యంగా ప్రవర్తించారని ఆయనను సభాపతి సస్పెండ్ చేశారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సంగమేశ్‌కు షర్టు వేశారు. ఈ ఘటనతో 10 నిమిషాల పాటు స్పీకర్ సభను వాయిదా వేశారు. మళ్లీ సభ మొదలుకాగా మాజీ స్పీకర్ రమేశ్‌కుమార్ –స్పీకర్ కాగేరి మధ్య సభాపతి ప్రత్యేక అధికారాలపై తీవ్ర చర్చ సాగింది. ఇక సెక్స్‌స్కాండల్‌లో ఇరుక్కుని మంత్రి పదవిని కోల్పోయిన రమేశ్ జార్కిహొళి సభకు గైర్హాజరయ్యారు. ఆయన సోదర ఎమ్మెల్యేలూ ముఖం చాటేశారు. ఒక ఎన్నికతో మేలు: స్పీకర్ దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే ఖర్చు తగ్గుతుందని సభాపతి పేర్కొన్నారు. వేర్వేరుగా ఎన్నికల వల్ల సిబ్బందిపై ఎంతో భారం పడుతుంది, రాష్ట్రంలో పాలన కూడా కుంటుపడుతుందన్నారు. ఇది ఆర్ఎస్ఎస్ ఎజెండా, మాకు వద్దని కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. చదవండి: రాసలీలల వీడియో : ఆ యువతి ఎక్కడ? శశికళ నిష్క్రమణ వెనుక.. -
గడ్డు పరిస్థితుల్లో యడ్డి సర్కార్: అసెంబ్లీలో అగ్నిపరీక్ష
సాక్షి, బెంగళూరు: భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసరాల ధరలు, వీటికి తోడు రమేశ్ జార్కిహొళి శృంగార బాగోతం మధ్య సీఎం యడియూరప్పకు అగ్నిపరీక్ష ఎదురుకాబోతోంది. గురువారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఇప్పటికే ఉన్న సమస్యలకు తోడు జార్కిహొళి సీడీ వివాదంపై ప్రతిపక్షాలు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే అవకాశం ఉంది. ఏడాదిన్నర కిందట కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడంలో కీలకపాత్ర పోషించిన రమేశ్ జార్కిహొళి అంశంపై ఎక్కువ చర్చలు జరిగే అవకాశముందని అంచనా. అలాగే ఇటీవల సంభవించిన శివమొగ్గ, చిక్కబళ్లాపుర పేలుళ్లపై కూడా ప్రశ్నించనున్నాయి. ఉభయ సభలూ చర్చకు బదులు రచ్చలతో దద్దరిల్లినా ఆశ్చర్యం లేదని అంచనాలు నెలకొన్నాయి. 8వ తేదీన బడ్జెట్ సమర్పణ.. నేడు మొదలయ్యే బడ్జెట్ సమావేశాలు సుమారు 19 రోజుల (మార్చి 31 వరకు) పాటు జరుగుతాయి. మొదటి రెండురోజులు ప్రధాని మోదీ ప్రతిపాదించిన ‘ఒకే దేశం– ఒకే ఎన్నికలు’ అంశంపై చర్చిస్తారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చిస్తున్న తొలి రాష్ట్రం కర్ణాటక కావడం గమనార్హం. ఇక 8వ తేదీన సోమవారం సీఎం యడియూరప్ప రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పిస్తారు. ఈ సమావేశాల్లో కర్ణాటక పౌరసభ బిల్లు–2021, సొసైటీల రిజిస్ట్రేషన్ బిల్లు వంటి బిల్లులపై చర్చ జరగనుంది. సందర్శకులకు అనుమతిస్తారు. గ్యాలరీలో భౌతిక దూరం పాటిస్తూ ప్రజలు, విద్యార్థులు సమావేశాలను వీక్షింవచ్చు. చదవండి: కన్నడ నేతల రాసలీలలు.. ప్రతిసారీ రాజీనామాలు చిన్నమ్మ సంచలన నిర్ణయం -
కన్నడనాట రిజర్వేషన్ల యుద్ధం
బనశంకరి: రిజర్వేషన్లను పెంచాలని వాల్మీకులు, ఎస్టీల్లో చేర్చాలని కురుబలు, తమనూ బీసీలుగా గుర్తించాలని అగ్రవర్ణ వీరశైవ, లింగాయత్‌ల ఆందోళనలు కర్ణాటకలో ఊపందుకున్నాయి. నెలరోజుల నుంచి ఎవరికి వారు ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తూ యెడియూరప్ప సర్కారుపై ఒత్తిడి పెంచుతున్నారు. ఆఖరికి మంత్రులు సైతం తమ వర్గాల సమావేశాల్లో పాల్గొంటూ గళమెత్తడంతో సీఎం యెడియూరప్పకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. గుణపాఠం తప్పదన్న పంచమసాలిలు .. ఈ నేపథ్యంలో బెంగళూరు ప్యాలెస్ మైదానంలో ఆదివారం లింగాయత పంచమసాలి వర్గీయులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ వర్గీయులు అధికంగా ఉండే కలబురిగి, విజయపుర, బాగల్‌కోటే, యాదగిరి, బీదర్, రాయచూరు, కొప్పళ, బళ్లారి, హావేరి, ధారవాడ, బెళగావిల నుంచి వేలాదిగా తరలివచ్చారు. బీసీల్లో 3బీ గా ఉన్న తమను తక్షణం 2ఏ కు మార్చి రిజర్వేషన్ వసతులను పెంచాలని నేతలు డిమాండ్ చేశారు. లేదంటే రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కూడల సంగమ పంచమసాలి పీఠాధిపతి శ్రీ బసవజయ మృత్యుంజయ స్వామీజీ మాట్లాడుతూ ఒకవేళ రాష్ట్రప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే తమ వర్గం స్వామీజీల నేతృత్వంలో నిరాహార దీక్ష చేపడతామని తెలిపారు. వ్యవసాయమే జీవనాధారమైన తమకు రిజర్వేషన్ ఇవ్వడం ప్రభుత్వ కర్తవ్యమని తెలిపారు. సమావేశంలో మంత్రులు మురుగేశ్ నిరాణి, సీసీపాటిల్, అన్ని పార్టీల నుంచి 20 మందికిపైగా ఎమ్మెల్యేలు, స్వామీజీలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఏమంటున్నారు ? వరుస ఆందోళనల నేపథ్యంలో సీఎం యెడియూరప్ప అన్ని వర్గాలను బుజ్జగించేలా ప్రకటనలు చేస్తున్నారు. మంత్రిమండలిలో తగిన నిర్ణయం తీసుకుంటామని చెబుతూ వస్తున్నారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని మంత్రులకు స్పష్టంచేశారు. -
సీఎం కార్యదర్శి ఆత్మహత్యాయత్నం
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజాకీయ కార్యదర్శి ఎన్ఆర్ సంతోష్ కుమార్ శుక్రవారం ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. తన నివాసంలో నిద్ర మాత్రలు వేసుకొని అపస్మారక స్థితిలో కనిపించారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే సంతోష్ కుమార్‌ను స్థానిక ఎంఎస్ రామయ్య ఆస్పత్రికి తరలించారు. భర్త ఆత్మహత్య యత్నంపై ఆయన భార్య జాహ్నవి మీడియాతో మాట్లాడుతూ.. ‘ నా భర్త సంతోష్ కుమార్ శుక్రవారం సాయంత్రం చాలా ఆందోళనతో పాటు, బాధగా కనిపించారు. సాయంత్రం 7గంటల సమయంలో ఆయన ఇంటి మేడపైకి వెళ్లారు. నేను డిన్నర్‌కు ఏం వండాలో అడుగుదామని మేడపైకి వెళ్లాను. అప్పటికే ఆయన స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలో ఉన్నారు. పక్కనే నిద్ర మాత్రలు కనిపించాయి. దీంతో వెంటనే స్థానిక అస్పత్రిలో చేర్చాం’ అని ఆమె తెలిపారు. తమ కుటుంబం చాలా సంతోషంగా ఉందని, తమకు ఎలాంటి సమస్యలు లేవని జాహ్నవి వెల్లడించారు. చదవండి: అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ఈ ఘటనపై ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్పందిస్తూ.. ‘అతను ఎందుకు అలా ఆత్మహత్యకు యత్నించాడో తెలియదు. సంతోష్‌కు సరైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించాన’ని తెలిపారు. అలాగే సంతోష్ కుమార్ కుటుంబ సభ్యులతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడి, వారికి ధైర్యం చెప్పారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా సంతోష్ కుమార్ తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం. ఆయన ఈ ఏడాది ప్రారంభంలో ముఖ్యమంత్రికి రాజకీయ కార్యదర్శిగా నియమితులైన విషయం తెలిసిందే. అయితే సంతోష్ కుమార్ ఆత్మహత్య యత్నానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘ప్రియురాలి’ కోసం కొడుకుని చంపిన తల్లి -
ప్రముఖ జర్నలిస్ట్ మృతి; సీఎం సంతాపం
సాక్షి, బెంగళూరు: ప్రముఖ జర్నలిస్ట్, రచయిత రవి బెలగెరే (62) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున బెలగెరేను గుండెపోటుతో ఆస్సత్రికి తరలించగా.. ఆయన చికిత్సకు స్పందించకపోవంతో అప్పటికే మృతిచెందినట్లు ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. కాగా.. చివరిసారిగా నివాళులు అర్పించడానికి అతని మృతదేహాన్ని ప్రార్థనా మందిరానికి తరలించారు. బెలగెరే మృతి పట్ల కర్ణాటక సీఎం యడ్యూరప్ప సంతాపం తెలియజేశారు. ఈ మేరు తన ట్విటర్ ఖాతాలో.. 'రవిగెరే కుటుంబానికి, ఆయన అభిమానులకు ఈ సమయంలో ఆయన లేరన్న బాధను తట్టుకునే దైర్యాన్ని, శక్తిని ఇవ్వాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు. (కర్ణాటకలోనూ బాణాసంచాపై నిషేధం) మార్చి 15, 1958న బళ్లారిలో జన్మించిన ఆయన జర్నలిస్ట్‌గా, రచయితగా మంచి గుర్తింపు పొందాడు. బెలగెరే కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి చరిత్ర, పురావస్తు శాస్త్రంలో ఎంఏ చేశారు. కర్ణాటక సాహిత్య అకాడమీ అవార్డు, రాజ్యోత్సవ అవార్డు, కర్ణాటక మీడియా అవార్డుతో పాటు పలు అవార్డులను అందుకున్నారు. బెలగెరే తన ప్రసిద్ధ కన్నడ టాబ్లాయిడ్ 'హాయ్ బెంగళూరు' నుంచి కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన కల్పన, అనువాదం, కాలమ్, జీవిత చరిత్రలు సహా 70పైకి సాహిత్య రచనలు చేశారు. అతను నేర ప్రపంచంపై రాసిన ప్రసిద్ద కాలమ్ పాపిగళ లోకదల్లి బాగా ప్రాచుర్యం పొందింది. (ప్రీ వెడ్డింగ్ షూట్.. జంట మృత్యువాత) -
వారి జీతాల కోసం చెట్లు అమ్మాలా ?
సాక్షి, బెంగళూరు : ఉద్యోగుల జీతాలు చెల్లించడానికి శివమొగ్గలోని మైసూర్ పేపర్ మిల్లు పరిధిలోని చెట్లను అమ్మేయాలా అని అటవీ శాఖ అధికారులను సీఎం బి.ఎస్.యడియూరప్ప ప్రశ్నించారు. మిల్లు పరిస్థితిపై రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో సీఎం శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యడియూరప్ప మాట్లాడుతూ.. 1960లో శరావతి విద్యుత్ కేంద్రాన్ని నిర్మించే సమయంలో శివమొగ్గలోని 3,500 కుటుంబాలు తమ భూములను కోల్పోయాయన్నారు. వారందరికీ పునరాసంతో పాటు 9,800 ఎకరాల భూమిని ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని కానీ వారికి సరైన సాయం అందలేదని తెలిపారు. ఆ కుటుంబాలకు సహాయం చేయడానికి వెంటనే టైటిల్ డీడ్స్ సిద్ధం చేయాలని శివమిగ్గ జిల్లా పాలన యంత్రాంగాన్ని ఆదేశించినట్లు పేర్కొన్నారు.అదే విధంగా ఈ భూమలుపై సమగ్ర సర్వే చేపట్టాలని తెలిపారు. దీంతో పాటు భూములకు సంబంధించిన పహానీలను పొందేందుకు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయాలని అధికారులకు తెలిపారు. రోడ్లను వేయడానికి సంబంధిత శాఖ వద్ద ఎన్వోసీ పొందే విధంగా చర్యలు చేపట్టాలని టూరిజం శాఖకు వెల్లడించారు. తిర్థల్లి ఎమ్మెల్యే అరగ జ్ఞానేంద్ర మాట్లాడుతూ.... మిల్లు ఉద్యోగులకు మూడు, నాలుగేళ్లుగా జీతాలు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో వారికి జీతాలు ఇవ్వడానికి కనిపిస్తున్న ఏకైక మార్గం పేపర్ మిల్లు పరిశ్రమలోని చెట్లను అమ్మడమేనని ఆయన అన్నారు. కాగా పేపర్ తయారీ కోసం 1936లో అప్పటి మైసూర్ రాజు కృష్ణరాజ వడయార్ బహదూర్ భద్రావతి నది ఒడ్డున శివమొగ్గలో దీన్ని స్థాపించారు. అది 1977లో ప్రభుత్వ సంస్థగా మారింది. ఈ మిల్లులో కర్ణాటక ప్రభుత్వానికి 64.7 శాతం వాటా ఉంది. ప్రభుత్వంతోపాటు ఆ ప్రాంత ప్రజలు, ఐడీబీఐ బ్యాంకు, ఎల్ఐసీ కూడా మిల్లులో వాటా దక్కించుకున్నాయి. -
శ్రీవారిని దర్శించుకున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
-
200 కోట్లతో అధునాతన కర్ణాటక సత్రం
సాక్షి, చిత్తూరు : కర్ణాటక సత్రాల నూతన సముదాయ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భవన నిర్మాణ భూమి పూజలో పాల్గొన్నారు. దాదాపు 200కోట్ల రూపాయలతో ఓ అధునాతన కర్ణాటక సత్రం రూపుదిద్దుకోనుంది. 7 ఎకరాల్లో ఐదు కాంప్లెక్స్‌లు, రోజుకు 1800 మంది భక్తులకు వసతి కల్పించేలా వాటి నిర్మాణం జరగనుంది. కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన నిధులతో టీటీడీ ఈ భవనాలను నిర్మించనుంది. (సుందరకాండ పారాయణంలో ముఖ్యమంత్రులు) కాగా, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కరోనా నేపథ్యంలో లోక కళ్యాణార్ధం టీటీడీ గత మార్చి నెలనుంచి నిర్వహిస్తోన్న ధన్వంతరి మహా యాగం, ధన్వంతరి యోగ వశిష్ట్యం, గీతా పారాయణం, సుందరకాండ పారాయణం కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనం కోసం కర్ణాటక నుంచి వచ్చే భక్తుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం సత్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి తిరుమలలో జరిగిన భవన నిర్మాణ పూజా కార్యక్రమంలో @AndhraPradeshCM @ysjagan గారు మరియు @CMofKarnataka @BSYBJP గారు పాల్గొన్నారు. pic.twitter.com/DIG4fmiPZu — Y V Subba Reddy (@yvsubbareddymp) September 24, 2020 -
శ్రీవారిని దర్శించుకున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
-
సుందరకాండ పారాయణంలో ముఖ్యమంత్రులు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం మరోసారి దర్శించుకున్నారు. సీఎం జగన్‌తో కలిసి కర్ణాటక సీఎం యడియూరప్ప స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన కర్ణాటక సీఎంకు, మహాద్వారం ప్రవేశ మార్గం వద్ద ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు ఇరు ముఖ్యమంత్రులకు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. శ్రీవారి దర్శనము ముగించుకుని ఆలయం ఎదురుగా ఉన్న నాద నీరాజనంకు ఇరు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు చేరుకున్నారు. లోక కళ్యాణర్ధం కరోనా నేపథ్యంలో టీటీడీ గత మార్చి నెలనుంచి ధన్వంతరి మహా యాగం, ధన్వంతరి యోగ వశిష్ట్యం, గీతా పారాయణం, సుందరకాండ పారాయణం నిర్వహిస్తోన్న కార్యక్రమంలో ఇరువురు సీఎం పాల్గొన్నారు. ఉదయం 8:10 గంటలకు కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి సీఎం జగన్ కర్ణాటక సత్రాల భవన నిర్మాణ భూమి పూజలో పాల్గొననున్నారు. అనతంరం ఉదయం 10:20కి రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి సీఎం జగన్ గన్నవరం బయల్దేరనున్నారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎస్వీబీసీ ఛానెల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు
సాక్షి, తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమవుతాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని సంప్రదాయల ప్రకారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈనెల 23న తిరుమల శ్రీవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. అదే రోజు సాయంత్రం 7గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తిరుమల చేరుకుంటారని, ఈనెల 24వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు శ్రీవారి దర్శించుకుంటారని వెల్లడించారు. (బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ) అనంతరం శ్రీవారి ఆలయం ఎదుట నాద నీరాజనంలో జరిగే సుందరకాండ పారాయణంలో పాల్గొంటారని తెలిపారు. తిరుమలలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించే వసతి సముదాయాల శంకుస్థాపన కార్యక్రమములో ఇరు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఎస్వీబీసీ ఛానెల్ ద్వారా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా అందిస్తున్నామని ఆయన తెలిపారు.(బాబు మరో జన్మెత్తినా వైవీ కుటుంబానికి సాటిరారు) -
‘ప్రతి కుటుంబంలో ఆవులు ఓ భాగం’
బెంగుళూరు: ప్రతి కుటుంబంలో ఆవులు ఓ భాగమని, అలాంటి ఆవులను చంపడం నేరమని కర్నాటక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కే.సుధాకర్ తెలిపారు. చిక్కబల్లాపూర్లో గోశాల ప్రారంభత్సంలో సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గోసంరక్షణ, గోవధ నిషేధ చట్టాన్ని రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు. వ్యాధి కారకాలను ఆవు నిరోదిస్తుందని ఇది వరకే రుజువు అయిన విషయాన్ని సుధాకర్ గుర్తు చేశారు. గోవద నిషేద చట్టాన్ని అమలు చేయడానికి ముఖ్యమంత్రి యడియూరప్ప సిద్దంగా ఉన్నారని తెలిపారు. కాగా కరోనా వ్యాప్తి తగ్గగానే ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని, గోవద నిషేద చట్టానన్న అమలు చేస్తున్న గుజరాత్, యూపీ తదితర రాష్ట్రాలకు వెళ్లి గోవద నిషేద చట్టాన్ని అధ్యయనం చేస్తామని పశుశాఖ అధికారులు తెలిపారు. అయితే బీజేపీ గోవద నిషేద చట్టాన్ని 2018అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా తమ మేనిఫెస్టేలో చేర్చిన విషయం తెలిసిందే. చదవండి: నిఖిల్ పెళ్లిపై విచారణకు ప్రభుత్వం ఆదేశం -
థాంక్యూ సీఎంజీ
సాక్షి, కర్ణాటక: ఇటీవల సీఎం యడియూరప్ప, బీజేపీ వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్లు వార్తల్లోకి ఎక్కిన కత్తి సోదరులు, మురుగేశ్ నిరాణి తమ డిమాండ్లను పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రమేశ్ కత్తికి రాజ్యసభ టికెట్‌కు సిఫార్సు చేసినందుకు ధన్యవాలు తెలిపారు. ఆదివారం ఉదయం సీఎం నివాసం కావేరిలో కత్తి సోదరులు, నిరాణి వెళ్లి కలిశారు. కాగా, డిమాండ్ల సాధనకు ఉమేశ్ కత్తి ఆధ్వర్యంలో నిరాణి తదితర బీజేపీ ఎమ్మెల్యేలు విందు రాజకీయం నిర్వహించడం తెలిసిందే. దీంతో యడియూరప్ప వారిని పిలిపించి బుజ్జగించారు. మురుగేశ్ నిరాణి వర్గానికి మండ్య జిల్లా పాండవపుర సహకార కార్మాగారాన్ని 40 సంవత్సరాల పాటు కాంట్రాక్ట్‌కు అప్పగించినట్లు తెలిసింది. చదవండి: ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక రాజకీయాలు -
ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక రాజకీయాలు
సాక్షి, బెంగళూరు : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సంక్రమిస్తున్న తరుణంలో కన్నడ నాట రాజకీయ అసమ్మతి తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో అధికార భారతీయ జనతా పారీ్టకి ప్రమాదం ముంచుకొస్తోందని పుకార్లు షికారు చేశాయి. అయితే అసమ్మతి ఎమ్మెల్యేగా ముద్ర వేసుకున్న ఉమేశ్ కత్తి మరోసారి తన నివాసంలో గురువారం రాత్రి కొందరు నేతలతో సమావేశం నిర్వహించారు. ఈక్రమంలో శుక్రవారం ఉదయం నుంచి రాజకీయంగా చర్చ మొదలైంది. అంతేకాకుండా ఉమేశ్ కత్తిని తన ఇంటికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆహ్వానించారు. ఉమేశ్ కత్తి బెంగళూరులోని సీఎం నివాసం సమావేశమై అనంతరం మీడియాతో మాట్లాడారు. తన నివాసంలో సమావేశానికి.. రాజకీయానికి సంబంధం లేదని కొట్టి పారేశారు. రహస్య సమావేశంపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించారు. రేణుకాచార్య ఏమన్నారంటే.. ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప నాయకత్వంపై తమకందరికి విశ్వాసముందని, ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి ఎంపీ రేణుకాచార్య తెలిపారు. శుక్రవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ యడియూరప్ప ఎమ్మెల్యేలందరి విశ్వాసంతో పాలన అందిస్తున్నారన్నారు. సీఎం నాయకత్వంపై ఎవరికీ ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. చిన్నపాటి వివాదాలున్నా పరిష్కరించేందుకు పార్టీ ప్రముఖులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సీఎం యడియూరప్ప కరోనా సమస్యను సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. చదవండి: జయ ఆస్తిపై పూర్తి హక్కులు వారికే కష్టసుఖాలు మాట్లాడుకున్నాం : ఉమేశ్ కత్తి బీజేపీలో బాధ్యతాయుత ఎమ్మెల్యేలుగా ఉన్నాం. అందరూ కలిసి భోజనం చేశాం. కష్టసుఖాల గురించి మాట్లాడుకున్నాం. ఎలాంటి రాజకీయ చర్చలు జరపలేదు. బీజేపీలో తిరుగుబాటు లేచిందని, ఎమ్మెల్యేలు ప్రత్యేక సమావేశం నిర్వహించారనే వార్తల్లో నిజం లేదు. మా నాయకుడు మోదీ ప్రభుత్వం మరో మూడేళ్లు ఉండాలని కోరుకున్నాం. రాజ్యసభ స్థానం గురించి ఎలాంటి చర్చలు జరుగలేదు. చదవండి: ప్రముఖ జ్యోతిష్యుడు కన్నుమూత తిరుగుబాటు ఎమ్మెల్యేలు కాదు : యత్నాళ్ తాము తిరుగుబాటు ఎమ్మెల్యేలు కాదని.. ప్రభుత్వాన్ని కూల్చటం లేదని ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాళ్ తెలిపారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తల్లో నిజం లేదన్నారు. లాక్డౌన్ ద్వారా హోటల్ బంద్ అయిన కారణంగా ఉమేశ్ కత్తి ఇంట్లో విందుకు వెళ్లామన్నారు. ప్రభుత్వానికి ఢోకా లేదు : మంత్రి బీ.సీ.పాటిల్ నాయకత్వ మార్పు ఎట్టి పరిస్థితిలోను ఉండబోదని.. మరో మూడేళ్లపాటు బీజేపీ ప్రభుత్వం భద్రంగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి బీసీ.పాటిల్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా యడియూరప్ప సమర్థ పాలన అందిస్తున్నారన్నారు. స్నేహితులందరు ఒకచోట కలిస్తే తప్పుగా భావించడం సరికాదన్నారు. -
కర్ణాటకలో వారికి నో ఎంట్రీ
బెంగళూరు : కరోనా విజృంభణ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యధిక కేసులు నమోదవుతున్న గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ నుంచి వచ్చే వారిని ఈ నెల 31 వరకూ తమ రాష్ట్రంలోకి అనుమతించబోమని సీఎం యడియూరప్ప స్పష్టం చేశారు. అయితే దశల వారీగా వారిని తీసుకొస్తామని తెలిపారు. ఆయా రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి కరోనా ఉండటంతో, రాష్ట్రంలోని కేసులు అధికమవుతున్నాయని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం నుంచి ఆ నాలుగు రాష్ట్రాల నుంచి బస్సులు బయలుదేరతాయని చెప్పారు. -
నిఖిల్ పెళ్లి సింపుల్‌గా జరిగింది: యడియూరప్ప
బెంగళూరు : మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు, శాండల్‌వుడ్ హీరో నిఖిల్ గౌడ వివాహంపై వెల్లువెత్తుతున్న విమర్శలపై ముఖ్యమంత్రి యడియూరప్ప మరోసారి స్పందించారు. కుమారస్వామి కుటుంబాన్ని వెనకేసుకొచ్చారు. శనివారం కరోనా వైరస్‌పై జరిగిన చర్చలో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ‘‘పెళ్లి జరపటానికి కావాల్సిన అన్ని అనుమతులు వారు తీసుకున్నారు. పెళ్లిని కూడా చాలా సింపుల్‌గా జరిపించారు. దాని గురించి చర్చలు అనవసరం. వారి పరిధిలో వారు చాలా చక్కగా చేశారు, దానికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నా’నని అన్నారు. కాగా, నిఖిల్ కుమార స్వామి-రేవతిల పెళ్లి శుక్రవారం రామనగరకు సమీపంలోని కేతగానహళ్లిలోని ఫాంహౌస్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ( ఇదేం పెళ్లి తంతు.. ఇప్పుడు అవసరమా! ) కరోనా లాక్డౌన్ కారణంగా ముఖ్యులైన కొద్దిమద్ది అతిధుల మధ్యే ఈ వివాహ వేడుక జరిగింది. అయితే ఈ పెళ్లి వేడుకకు హాజరైన అతిధుల్లో ఎవరూ కూడా మాస్క్‌లు ధరించకపోవటం, సామాజిక దూరాన్ని పాటించపోవటం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా వేదికగా రచ్చ జరుగుతున్న వేళ స్పందించిన ముఖ్యమంత్రి యడియూరప్ప ఈ సంఘటనపై విచారణ జరిపించాలని ఆదేశించారు. అయితే ఈ వివాహ వేడుకకు హాజరైన కొద్దిమంది ముఖ్యుల్లో సీఎం యడియూరప్ప కూడా ఉండటం గమనార్హం. -
నిఖిల్ పెళ్లిపై వివాదం: విచారణకు సీఎం ఆదేశం
సాక్షి, బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి కుమారుడు నిఖిల్ వివాహ వేడుకపై వివాదం నెలక్కొంది. కరోనా వైరస్ నేపథ్యంలో అందరూ సామాజిక దూరం పాటించాలన్న ప్రభుత్వ ఆదేశాలకు కనీసం పాటించకుండా వివాహం జరిపించారని అధికార బీజేపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో వివాహ వేడుకపై విచారణ జరిపించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆదేశించారు. కాగా బెంగళూరు సమీపంలోని రాంనగర్‌లోని ఫాంహౌస్‌లో నిఖిల్ కుమార స్వామి-రేవతిల పెళ్లి శుక్రవారం ఉదయం జరిగిన విషయం తెలిసిందే. వధువరులతో పాటు ఎవరూ కూడా ముఖానికి మాస్క్‌లు ధరించినట్లు కనిపించట్లేదు. ఈ వివాహానికి వందలాది మంది అతిథులు వచ్చారని పలువురు సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. (నిరాడంబరంగా మాజీ సీఎం ఇంట పెళ్లి) ఇక దీనిపై కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి కూడా విమర్శలు గుప్పించారు. వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఎలాంటి భద్రతలేకుండా వివాహం వేడుకలేంటని అసహనం వ్యక్తం చేశారు. ఆదర్శంగా ఉండాల్సిన మాజీ ప్రధాని దేవెగౌడ , మాజీ సీఎం కుమారస్వామి లాక్డౌన్ సమయంలో పెళ్లి చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. కాగా పెళ్లి వేడుకకు ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా హాజరుకావడం గమనార్హం. కుమారస్వామితో కరచాలనం చూస్తూ సీఎం ఫోటోలకు పోజులిచ్చారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 359గా నమోదైంది. శుక్రవారం తాజాగా 44 పాజిటివ్ కేసులు వెలుగుచూసినట్లు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. కరోనా కట్టడికి ప్రభుత్వ అధికారులు కఠిన చర్యలు అమలు చేస్తున్నారు. -
ఏపీ సీఎం వైఎస్ జగన్ పథకాలు భేష్
సాక్షి,బళ్లారి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు భేషుగ్గా ఉన్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కితాబు ఇచ్చారు. ప్రకాశం జిల్లాకు చెందిన వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర నేత పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్‌రెడ్డితో పాటు పలువురు నేతలు శుక్రవారం యడ్యూరప్పను బెంగళూరులోని ఆయన నివాసంలో కలిసి ఘనంగా సన్మానించి శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా యడ్యూరప్ప మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం పీఠాన్ని అధిష్టించిన వెంటనే అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించి వాటిని పకడ్బందీగా అమలు చేస్తున్నారన్నారు. పేదల సంక్షేమానికి అమలు చేస్తున్న నవరత్నాల పథకాలు ఆదర్శనీయమని కొనియాడారు. -
ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత మీడియాదే
సాక్షి, బెంగళూరు: ‘కొత్తగా వస్తున్న మాధ్యమాలు అనతికాలంలోనే ప్రజలకు చేరువ అవుతున్నాయి. ఈ క్రమంలో నిజాలను జనాలను తెలియజేయాల్సిన బాధ్యత మాధ్యమాలదే. కొన్ని సంవత్సరాలుగా సంప్రదాయ మాధ్యమాలు వాస్తవాలను వెలుగులోకి తేవడంతో విజయవంతం అయ్యాయి’అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. శనివారం బెంగళూరులోని హిందూ గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ది హడిల్’ నాలుగవ ఎడిషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్రపతి మాట్లాడుతూ మాధ్యమ రంగంలో వాస్తవాలు తెలియజేయడం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, న్యాయం, మానవీయత అనే ఐదు అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇటీవల కాలంలో కొత్తగా ఎన్ని పత్రికలు వచ్చినా.. ఎప్పటి నుంచో ఉన్న వార్తా సంస్థలకు ప్రాధాన్యం తగ్గలేదన్నారు. క్రీడలు, వ్యాపారం, రాజకీయం, సామాజిక రంగాల వార్తలకు ప్రముఖ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోందన్నారు. సోషల్ మీడియా పెరిగిపోతున్నా, పత్రికలకు ప్రాధాన్యం తగ్గలేదన్నారు. జాతిపిత కూడా విలేకరే... జాతిపిత మహాత్మాగాంధీ కూడా పత్రికా విలేకరిగా పని చేశారని రాష్ట్రపతి గుర్తు చేశారు. సత్యం, ప్రామాణికమే మాధ్యమాల ప్రధాన ఆయుధం అన్నారు. మాధ్యమాల్లో నిజాయితీ, పాలనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం యడియూరప్ప అన్నారు. పాలనలోని పారదర్శకతను గుర్తించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీడియా రంగంపై ఉందని చెప్పారు. మంచి పాలన అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. -
కర్ణాటక బంద్: ఆంధ్రా బస్సుపై రాళ్ల దాడి
బెంగళూరు : ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కన్నడిగులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలంటూ కన్నడ సంఘాలు ఇవాళ రేపు కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు ఇప్పటికే అన్ని సంఘాలు (ఆటో, క్యాబ్, రైతు, కార్మిక) తమ మద్దతును ప్రకటించడంతో రాష్ట్ర బంద్ ఉద్రిక్తంగా మారింది. గురువారం ఉదయం తిరుపతి నుంచి మంగళూరు వెళ్తున్న బస్సుపై ఫరంగిపెటె ప్రాంతంలో కొందరు నిరసన కారులు రాళ్ల దాడి చేశారు. సరోజినీ బిందురావ్ నివేదికను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన సంఘాల ప్రతినిధులు రేపు ముఖ్యమంత్రి యడియూరప్పకు నివేదికను సమర్పించనున్నారు. అయితే ప్రభుత్వ, స్కూళ్లు, కాలేజీలు యథావిధిగా నడుస్తాయని, ఎటువంటి సెలవు లేదని విద్యాశాఖ మంత్రి సురేశ్ కుమార్ తెలిపారు. బంద్‌కు పిలుపునిచ్చిన సంస్థలు శాంతియుతంగా నిరసనలు తెలపాలని విజ్ఞప్తి చేశారు. Mangaluru: Stones pelted on a Tirupati-Mangaluru bus in Farangipet. Several pro-Kannada groups have called for Karnataka bandh today demanding implementation of Sarojini Mahishi report which recommended certain percentage of jobs to Kannadigas in private&public sector companies pic.twitter.com/mPJXUXJTR5 — ANI (@ANI) February 13, 2020 మరోవైపు కర్ణాటక సీఎం యడ్యురప్ప ప్రజలకు నిరసనకారులు ఎలాంటి అసౌకర్యం కలిగించరాదని విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం కన్నడిగులకు అనుకూలంగా ఉందని తెలిపారు. ఆందోళన కారులు తమతో మాట్లాడటానికి అనుకూలంగా ఉంటే తమ ప్రభుత్వం వారితో చర్చించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని వెల్లడించారు. సరోజినీ మహిషి నివేదికను అమలు చేయడానికి తాము ఇప్పటికే సాధ్యమైనవన్నీ చేశామని, ఇంకా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కాగా 1984లో కర్ణాటక ప్రభుత్వం కేంద్ర మాజీ మంత్రి సరోజినీ బిందురావ్ మహిషి నేత్రుత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. రెండు సంవత్సరాల అనంతరం 1986లో ఈ కమిటీ తమ నివేదికను సమర్పించింది. నివేదికలో 56 సిఫారసులను పేర్కొన్న కమిటీ.. కన్నడిగులకు అన్ని సెక్టార్లో 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని సూచించింది. -
బీదర్‌కు ట్రూజెట్ సర్వీసులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రూజెట్ పేరుతో విమాన సేవల్లో ఉన్న హైదరాబాద్ సంస్థ టర్బో మేఘా ఎయిర్వేస్ తాజాగా తన నెట్‌వర్క్‌లోకి బీదర్‌ను చేర్చింది. ఉడాన్ సర్వీసుల్లో భాగంగా బెంగళూరు–బీదర్–బెంగళూరు మధ్య ఫ్లయిట్‌ను ప్రతిరోజూ నడుపుతారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కొత్త సర్వీసును శుక్రవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం మంత్రులు, కంపెనీ ప్రతినిధులతో కలిసి విమానంలో బీదర్ ప్రయాణించారు. బస్సులో 12 గంటల సమయం పడుతుందని, విమానంలో గంట 40 నిమిషాల్లోనే చేరుకున్నామని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. బీదర్ చేరికతో ట్రూజెట్ నెట్‌వర్క్‌లో డెస్టినేషన్ల సంఖ్య 24కు చేరుకుందని టర్బో మేఘా ఎయిర్వేస్ డైరెక్టర్ కె.వి.ప్రదీప్ వెల్లడించారు. కార్యకలాపాలు ప్రారంభించిన నాలుగేళ్లలోనే ఈ స్థాయికి చేరుకున్నామని కంపెనీ సీఈవో కల్నల్ ఎల్ఎస్ఎన్ మూర్తి తెలిపారు. కాగా, స్ప్రింగ్ సర్ప్రైజ్ పేరుతో నాలుగు రోజుల సేల్‌లో భాగంగా బెంగళూరు–బీదర్–బెంగళూరు రూట్లో బేస్ ఫేర్ రూ.699కే అందిస్తోంది. సర్వీసు ప్రారంభిస్తున్న కర్ణాటక సీఎం, తదితరులు -
యెడ్డీ కేబినెట్లో మరో 10 మంది
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప గురువారం తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయి, బీజేపీ అధికారంలోకి రావడానికి సహకరించిన 10 మంది ఫిరాయింపు నేతలు తాజా విస్తరణలో కేబినెట్ మంత్రులుగా చోటు దక్కించుకున్నారు. ఆ 10 మంది నేతలు గత డిసెంబర్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై గెలిచారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ వజూభాయ్‌వాలా గురువారం ఉదయం వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తవారికి ఈనెల 8వ తేదీన శాఖలు కేటాయించనున్నట్లు సీఎం యడియూరప్ప తెలిపారు. గతేడాది జూలైలో కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి 17 మంది ఎమ్మెల్యేలు అనర్హతకు గురైన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. వారిలో డిసెంబర్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేసి గెలిచిన 10 మంది ఇప్పుడు మంత్రివర్గంలో చేరారు. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన 17 మందికి న్యాయం చేస్తానని గతంలో యడియూరప్ప హామీ కూడా ఇచ్చారు. బీజేపీ వారికి నో!: తాజా విస్తరణతో కర్ణాటకలో మంత్రివర్గ సభ్యుల సంఖ్య 28కి చేరింది. తదుపరి విస్తరణలో మరో ఆరుగురికి స్థానం కల్పించే అవకాశముంది. ఈ మంత్రివర్గ విస్తరణలో బీజేపీ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించలేదు. ఉమేశ్ కట్టి, అరవింద్ లింబావలి, సీపీ యోగేశ్వర్ అనే ముగ్గురు బీజేపీ నేతలకు అవకాశం కల్పిస్తామని సీఎం ప్రకటించారు. కానీ పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించే విషయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశామని వివరణ ఇచ్చారు. మంత్రివర్గంలో స్థానం కోసం పలువురు ఆశావహుల నుంచి భారీగా ఒత్తిడి వచ్చిన నేపథ్యంలోనే సొంత పార్టీ వారికి ప్రస్తుతానికి అవకాశం కల్పించలేదని తెలుస్తోంది. అవకాశం కల్పించకపోతే పార్టీని వీడుతామనే హెచ్చరికలు కూడా వారినుంచి వచ్చాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం బీజేపీకి అసెంబ్లీలో 117 మంది సభ్యులున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కింది వీరికే ఎస్టీ సోమశేఖర్, రమేశ్ జార్కిహోళి, ఆనందసింగ్, కె.సుధాకర్, భైరతి బసవరాజు, శివరామ్ హెబ్బార్, బీసీ పాటిల్, కె.గోపాలయ్య, కేసీ నారాయణెగౌడ, శ్రీమంత పాటిల్. -
మంత్రిగిరి కోసం.. ధవళగిరి ప్రదక్షిణ
సాక్షి బెంగళూరు: మంత్రివర్గంలో చోటు ఆశించిన పలువురు శాసనసభ్యులు డాలర్స్ కాలనీలోని ముఖ్యమంత్రి నివాసం ధవళగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. నేడు (శనివారం) కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కర్ణాటక రానున్న సందర్భంగా మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని ఆశావహులు జోరు పెంచారు. ఈమేరకు సీఎం యడియూరప్పతో ఎవరికి వారు లాబీయింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు కర్తవ్యం నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం నివాసం వద్ద కొందరు ఎమ్మెల్యేలు మీడియాకు తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఉమేశ్ కత్తి, కె.గోపాలయ్య, గోలిహట్టి శేఖర్, ఎం.చంద్రప్ప, సోమశేఖరరెడ్డి, రేణుకాచార్య, జ్ఞానేంద్ర, మాజీ మంత్రులు ఎంటీబీ నాగరాజు, ఆర్.శంకర్ మత్తికెరెలోని సీఎం నివాసానికి శుక్రవారం వెళ్లి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రివర్గంలో తమకు చోటు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. శనివారం ఉదయం ప్రత్యేక విమానం ద్వారా అమిత్‌షా బెంగళూరు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్యాలెస్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మధ్యాహ్నం 12 గంటలకు పాల్గొంటారు. తర్వాత సాయంత్రం 4 గంటలకు హుబ్బళి బయలుదేరి వెళ్తారు. అక్కడ పౌరసత్వ సవరణ చట్టంపై జాగృతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆదివారం ఉదయం ఢిల్లీ వెళ్తారు. కాగా అమిత్‌షా శుక్రవారమే కర్ణాటక వస్తారని భావించారు. కానీ ఆయన ఉన్నఫలంగా నిర్ణయం మార్చుకుని శనివారానికి వాయిదా వేసుకున్నారు. అమిత్‌షాతో నేడు సీఎం భేటీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు శనివారం కర్ణాటక రానున్నారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప భేటీ అయి మంత్రివర్గ విస్తరణ గురించి చర్చిస్తారని తెలిసింది. ఈమేరకు ఇప్పటికే మంత్రివర్గం జాబితా కూడా సీఎం సిద్ధం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాలకు ముందే కేబినెట్ విస్తరిస్తారా? లేక తర్వాతా? అనేది కూడా నేడు తేలనుంది. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలి? ఏ శాఖ ఇవ్వాలనే దానిపై అమిత్‌షాతో సీఎం యడియూరప్ప చర్చించనున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కాగా ఉప ఎన్నికల్లో గెలిచిన వారందరికీ మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని సీఎం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఓడిన వారిని మంత్రిమండలిలోకి తీసుకోవాలా? వద్దా? అనే దానిపై అమిత్‌షాతో చర్చించి తీర్మానిస్తారు. దీనికి తోడు పార్టీలో ఎన్నో ఏళ్లుగా ఉంటూ ఎమ్మెల్యేలుగా గెలుస్తున్న సీనియర్ నేతలను కూడా కేబినెట్లోకి తీసుకునే విషయమై మాట్లాడుతారు. -
సిద్ధు బాగున్నారా.. యడ్డి పరామర్శ
సాక్షి బెంగళూరు: నిత్యం రాజకీయంగా కత్తులు దూసుకునే నాయకులు కలిశారు. మాజీ సీఎం సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి యడియూరప్ప పరామర్శించి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. హృదయ సంబంధిత సమస్యతో బాధపడుతూ యాంజియోప్లాస్టీ ఆపరేషన్ చేయించుకున్న సిద్ధరామయ్య ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి యడియూరప్ప, గ్రామీణాభివృద్ధి మంత్రి కేఎస్ ఈశ్వరప్ప, హోం మంత్రి బసవరాజు బొమ్మాయి తదితరులు సిద్ధరామయ్యను పరామర్శించారు. ‘నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఎలాంటి సమస్య లేదు. శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం మామూలుగానే ఉన్నాను’ అని సిద్దరామయ్య తెలిపారు. రెండు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాలని డాక్టర్లు సూచించినట్లు చెప్పారు. -
కర్ణాటక: కాంగ్రెస్ అందుకే ఓడిపోయింది
సాక్షి, బెంగుళూరు: కర్ణాటక అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ సునాయసంగా గెలుపు సాధించి, అధికారం చేజిక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా మారి.. ప్రస్తుతం ఆ పార్టీ భవిష్యత్ అగమ్యగోచరంలో పడింది. మహారాష్ట్ర మాదిరిగానే కర్ణాటకలో బీజేపీ హవాను అడ్డుకుంటామని ఆశపడ్డ కాంగ్రెస్ పార్టీకి సోమవారం వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఓటమికి పలు కారణాలు కనిపిస్తున్నాయని పార్టీ నేతలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జేడీఎస్‌తో పొత్తు, కూటమిలో అంతర్గత విభేదాలు, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యచరణలపై స్పష్టత లేకపోడం. బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కేవలం ఆరు సీట్లు అవసరమయితే.. కాంగ్రెస్- జేడీఎస్ కూటమి తిరిగి అధికారాన్ని రాబట్టడానికి 12 స్థానాల్లో గెలవాల్సి రావడం. మాజీ సీఎం సిద్ధరామయ్య జేడీఎస్-కాంగ్రెస్ కూటమితో ఏర్పడిన కుమారస్వామి ప్రభుత్వ పనితీరును గతంలో గట్టిగా విమర్శించడం. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఇన్చార్జీ కేసీ వేణుగోపాల్ ఉప ఎన్నికల ప్రచారంలో సరిగా పాల్గొనకపోవడం. కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేసే సరియైన నాయకుడు లేకపోవడం, పార్టీలో అంతర్గత కుమ్ములాటను అడ్డుకట్ట వేయకపోవడం. ఉత్తర కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తిరిగి బలం పుంజుకోవాలంటే.. లింగాయత్‌లను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేయాలి. కర్ణాటక ప్రాజ్ఞవ్యంత జనతా పార్టీ (కేపీజేపీ) నుంచి గెలిచి, కాంగ్రెస్ పార్టీలో విలీనమైన అనర్హత ఎమ్మెల్యే ఆర్. శంకర్‌కు.. ఉప ఎన్నికల్లో తిరిగి పోటీ చేయడానికి టికెట్ దక్కకపపోవడంతో.. ఆ స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేసిన అరుణ్ కుమార్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అసెంబ్లీకి ఒక స్వతంత్ర శాసనసభ్యుడు, చట్టసభ సభ్యుడిని ప్రభుత్వం నామినేట్ చేయడం. కర్ణాటక మాజీ స్పీకర్ కేఆర్ రమేష్ 17 మంది ఎమ్మెల్యేలను (శాసనసభ్యులు) అనర్హులుగా ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. కానీ వారిని ఉప ఎన్నికలలో పోటీ చేసే వెసులుబాటు కల్పించడంతో.. ఓటర్లు పార్టీలకతీతంగా అభ్యర్థి వైపు మొగ్గుచూపరనే విషయాన్ని గమనించవచ్చు. ఉప ఎన్నికలు ఎందు వచ్చాయంటే..? కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి బీజేపీకి మద్దతివ్వడంతో.. జేడీఎస్ నేత కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలి యడియూరప్ప ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అనంతరం జూలై 29న యడియూరప్ప అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గారు. పార్టీ ఫిరాయించిన17 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయాన్ని సమర్థిస్తూనే, అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చనే వెసులుబాటు కల్పించింది. దీంతో మైనారిటీలో ఉన్న యడియూరప్ప ప్రభుత్వ మనుగడకు, అనర్హత ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తుకు 15 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు కీలకంగా మారాయి. డిసెంబర్ 5న జరిగిన ఉప ఎన్నికల్లో.. అనర్హతకు గురైన ఎమ్మెల్యేల్లో 13 మంది బీజేపీ తరఫున బరిలో దిగారు. గతంలో ఈ 15 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో.. 12 స్థానాల్లో కాంగ్రెస్, 3 సీట్లలో జేడీఎస్ గెలుపొందాయి. కీలకంగా మారిన ఈ ఉప ఎన్నికల్లో 15 స్థానాలు కైవసం చేసుకుంటామని సీఎం యడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు. ఇక ఎన్నికల్లో 13 మంది అనర్హులు బీజేపీ తరఫున పోటీ చేశారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవులు ఇస్తామని సీఎం యడియూరప్ప ఎన్నికల ప్రచారంలో పదేపదే ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం సొంతంగా మెజారిటీ సాధించాలంటే కనీసం 8 స్థానాల్లో గెలవాల్సి ఉంది. అయితే బీజేపీ, కాంగ్రెస్ అన్నిస్థానాల్లోను, జేడీఎస్ 12 చోట్ల పోటీలో ఉంది. డిసెంబరు 9న వెలువడిన ఉప ఎన్నికల ఫలితాల్లో.. బీజేపీ తరఫున పోటీ చేసిన 13 మంది అనర్హత ఎమ్మెల్యేల్లో 11 మంది విజయం సాధించారు. కాంగ్రెస్‌కు ఘోర పరాజయం చవిచూడగా.. బీజేపీ ఘన విజయం సాధించింది. ఎంటీబీ నాగరాజు, హెచ్.విశ్వనాథ్ బీజేపీ నుంచి పోటీచేసి ఓడిపోగా.. ఆర్.శంకర్‌కు టికెట్ దక్కలేదు. 15 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 12 సీట్లను కమలం పార్టీ గెల్చుకుని విజయఢంకా మోగించింది. రెండు స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. కర్ణాటక ఉప ఎన్నికల్లో విజయంతో రాష్ట్రంలో యడియూరప్ప ప్రభుత్వం మెజారిటీ మార్క్‌ను (113) సునాయాసంగా అధిగమించి.. 117 స్ధానాలతో బలం సాధించి.. రాష్ట్రంలో సుస్థిర పాలన గమ్యం సుగమైంది. సీఎం యడియూరప్ప సొంత జిల్లా మాండ్యలో.. ఒక్కసారి కూడా సీటు గెలువని బీజేపీ ఉప ఎన్నికల ద్వారా తొలిసారి అసెంబ్లీ సీటును తన ఖాతాలో వేసుకుంది. ఒక్కలింగ సామాజిక వర్గానికి కంచుకోట లాంటి మాండ్య జిల్లాలో బీజేపీ గెలవడాన్ని బట్టి కాషాయ పార్టీ హవా సాగిన విధానాన్ని అర్థం చేసుకోవచ్చు. కర్ణాటక ఉప ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎల్పీ నేత సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు గుండూరావు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
యడ్డీ ముందు మరో సవాల్
సాక్షి, బెంగళూరు: అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను ఎన్నికల్లో గెలిపిస్తే మంత్రి పదవులు ఇస్తామని సీఎం యడియూరప్ప ఎన్నికల ప్రచారంలో పదేపదే ప్రకటించారు. ఎన్నికల్లో 13 మంది అనర్హులు బీజేపీ తరఫున పోటీ చేయగా 11 మంది విజయం సాధించారు. వారందరికీ మంత్రి పదవులు ఇస్తా రా? అనేది ఉత్కంఠగా మారింది. వారికి కేబినెట్లో చోటిస్తే బీజేపీలో సీనియర్ నేతలు భగ్గుమనే ప్రమాదం ఉంది. దీనికి తోడు ఓడిన ఎంటీబీ నాగరాజు, హెచ్.విశ్వనాథ్, టికెట్ దక్క ని ఆర్.శంకర్‌కు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలన్నా ఖాళీలు లేవు. జిల్లాకు నలుగురు మంత్రులా? ఉప ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా మారిన బెళగావి జిల్లా రాజకీయాలు ఫలితాల అనంతరం కూడా వేడిగానే ఉన్నాయి. జిల్లా నుంచి ప్రస్తుతం లక్ష్మణ సవది మంత్రివర్గంలో ఉన్నారు. అ యితే మరో ముగ్గురు (గోకాక్ – రమేశ్ జార్కిహోళి, కాగవాడ – శ్రీమంతపాటిల్, అథణి – మహేశ్ కుమటళ్లి) ప్రస్తుతం గెలిచారు. ఇచ్చిన మాట ప్రకారం ముగ్గురికి మంత్రి పదవులు వస్తే జిల్లా నుంచి నలుగురు కేబినెట్లో ఉంటారు. ఇక ఉత్తర కన్నడ జిల్లా నుంచి హెబ్బార్‌కు, చిక్కబళ్లాపుర నుంచి కె.సుధాకర్‌కు మంత్రి పదవి దక్కాల్సి ఉంది. బెంగళూరు నుంచి అరడజను పైగా మంత్రివర్గంలో బెర్తు ఆశించిన యశవంతపుర – ఎస్టీ సోమశేఖర్, మహలక్ష్మి లేఅవుట్ – కె.గోపాలయ్య, కృష్ణరాజపురం – భైరతి బసవరాజుకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని సమాచారం. కాగా బెంగళూరు పరిధిలో ప్రస్తుతం అశ్వర్థ నారాయణ (మల్లేశ్వరం), ఆర్.అశోక్ (పద్మనాభనగర), సురేశ్ కుమార్ (రాజాజీనగర), సోమణ్ణ (గోవిందరాజనగర) కేబినెట్లో కొనసాగుతున్నారు. మండ్య నుంచి కేబినెట్లో చేరే ఏకైక మంత్రిగా కేసీ నారాయణెగౌడ అవుతారు. అదేవిధంగా బళ్లారి జిల్లాకు కూడా (ఆనందసింగ్ – విజయనగర) మంత్రిగిరి రావాలి. వీరందరికీ పదవులు ఎలా సాధ్యం, యడియూరప్ప ఎలా పరిష్కరిస్తారన్నది పార్టీలో చర్చనీయాంశమైంది. -
ప్రశాంతంగా కర్ణాటక ఉప ఎన్నికలు
బెంగళూరు: కర్ణాటకలోని అనర్హత ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు, యెడ్యూరప్ప నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ మనుగడకు కీలకంగా మారిన 15 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. 15 నియోజకవర్గాల్లోని మొత్తం 37.78 లక్షల మంది ఓటర్లలో సాయంత్రం 6 గంటల వరకు 66.59% మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు. హోసకోటెలో అత్యధికంగా 90.44%, కృష్ణరాజపురంలో అత్యల్పంగా 43.25% పోలింగ్ నమోదైందని తెలిపారు. బెంగళూరు పరిధిలోని మహాలక్ష్మి లేఅవుట్లో 50.92%, శివాజీనగరలో 44.60%, యశ్వంత్‌పురలో 54.13% పోలింగ్ నమోదైందన్నారు. ఈ నెల 9వ తేదీన ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను వెల్లడిస్తారు. బీజేపీ ప్రభుత్వం సొంతంగా మెజారిటీ సాధించాలంటే కనీసం 8 స్థానాల్లో గెలవాల్సి ఉంది. అయితే సీఎం యెడ్యూరప్ప 15 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ అన్ని స్థానాల్లోను, జేడీఎస్ 12 చోట్ల పోటీలో ఉంది. అనర్హతకు గురైన ఎమ్మెల్యేల్లో 13 మంది బీజేపీ తరఫున బరిలో దిగారు. కోర్టు కేసులున్నందున మస్కి, రాజరాజేశ్వరి నగర నియోజకవర్గాలకు ఎన్నికలు జరగలేదు. ఈ ఉప ఎన్నికల్లో అధిక స్థానాల్లో బీజేపీనే గెలిచే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం 15 స్థానాల్లో, బీజేపీకి 10, కాంగ్రెస్‌కు 2 నుంచి 4, జేడీఎస్ 2 సీట్లు లభిస్తాయని పలు సర్వేలు అంచనా వేశాయి. ఈ 15 స్థానాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ 12, జేడీఎస్ 3 సీట్లలో గెలుపొందాయి. -
వెనక్కి తగ్గని బీజేపీ రెబల్స్
బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌లు తాడోపేడో తేల్చుకోవాలనుకుంటున్న ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం కూడా ముగిసింది. అనుకున్నట్లుగానే ఇద్దరు జేడీఎస్ అభ్యర్థులు తెల్లజెండా ఊపారు. ఇద్దరు బీజేపీ రెబెల్స్ వెనక్కి తగ్గలేదు. శివాజీనగరలో అత్యధికంగా 19 మంది పోటీలో నిలిచారు. ప్రచారం, ప్రలోభాల పర్వం మిన్నంటబోతోంది. సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబరు 5న జరగనున్న ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. ఇప్పటివరకు రెబెల్స్ అభ్యర్థులను బుజ్జగించడం, నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేసిన పార్టీలు శుక్రవారం నుంచి ప్రచార బరిలో దిగనున్నారు. జేడీఎస్ పారీ్టకి పెద్ద షాక్ తగిలింది. హీరేకరూర్, అథని నియోజకవర్గాల్లో జేడీఎస్ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. హావేరి జిల్లా హీరేకరూర్‌లో అభ్యర్థి శివలింగ శివాచార్య స్వామిజీ నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అథణిలో ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవది జరిపిన చర్చల తర్వాత జేడీఎస్ అభ్యర్థి గురుదాస్యల్ పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక బీజేపీ రెబెల్స్ శరత్ బచ్చేగౌడ (హొసకోటె), కవిరాజ్ అరస్ (హొసపేటె)లు వైదొలగకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. చివరకు 15 స్థానాలకు 165 మంది రంగంలో మిగిలారు. నేటి నుంచి దూకుడు శుక్రవారం నుంచి సీఎం యడియూరప్ప, కేంద్ర మంత్రులు డీవీ సదానందా గౌడ, సురేశ్ అంగడి, ప్రహ్లాద్ జోషి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు నళిన్ కుమార్‌కటీల్‌లు ప్రచారంలోకి దిగనున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి సిద్ధరామయ్య, జేడీఎస్ నుంచి కుమారస్వామిలు ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. దేవెగౌడ కూడా నేటి నుంచి ప్రచారం చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ మనుగడకు ఎంతో కీలకమైన ఈ ఎన్నికలను బీజేపీ, ప్రతిపక్షాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని కదనరంగంలోకి దిగాయి. అత్యధిక స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలనే బీజేపీ ఆరాటం అయితే అనర్హత ఎమ్మెల్యేలను ఓడించడంతో పాటు ప్రభుత్వాన్ని కూలదోల్చడం ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్, జేడీఎస్‌లు ప్రణాళికలు రచిస్తున్నాయి. శివాజీనగరలో 19 మంది పోటీ: సీఈవో మొత్తం 15 నియోజకవర్గాల్లో 37,77,970 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినయోగించుకోనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సంజీవ్ కుమార్ తెలిపారు. నామినేషన్లు ముగిసే నాటికి మొత్తం 165 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గురువారం మొత్తం 53 మంది ఉపసంహరించుకున్నారు. అత్యధికంగా శివాజీనగరలో 19 మంది, అత్యల్పంగా కేఆర్ పేట, యల్లాపుర ఏడుగురు చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాగా, డిసెంబర్ 5న పోలింగ్ జరగనుండగా, 9వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం సన్నాహాలను చేపట్టింది. ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై సిబ్బందికి అవగాహన తరగతులను గురువారం బెంగళూరు కేఆర్ పురంలో ప్రారంభించింది. -
‘బంగ్లా’ రగడ
శివాజీనగర: విమర్శలు, ప్రతి విమర్శలతో వేడిమీదున్న యడియూరప్ప, సిద్ధరామయ్య మధ్య బంగ్లా మరో వివాదమైంది. అదృష్ట నివాసంగా రాజకీయ రంగంలో గుర్తింపు పొందిన కావేరి బంగ్లా కోసం ముఖ్యమంత్రి బీ.ఎస్.యడ్యూరప్ప, శాసనసభా ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్యల మధ్య సంఘర్షణ తారాస్థాయికి చేరింది. నాలుగు రోజుల్లోఇల్లు ఖాళీ చేయకపోతే సదుపాయాలను బంద్ చేయనున్నట్లు అందులో ఉంటున్న సిద్ధరామయ్యను ప్రభుత్వం హెచ్చరించడంతో ఈ రగడ రచ్చకెక్కింది. కావేరి బంగ్లా గేటుకున్న సిద్ధరామయ్య నామ ఫలకాన్ని శనివారం రాత్రి డీపీఏఆర్ సిబ్బంది తొలగించి, నాలుగు రోజుల్లోగా ఇంటిని ఖాళీ చేయాలని అక్కడి సిబ్బందికి స్పష్టంచేశారు. ఒకవేళ నిర్ధారించిన సమయంలోగా ఇల్లు ఖాళీ చేయకపోతే 5 రోజుల తరువాత విద్యుత్, నీటి సరఫరాతో పాటు ప్రభుత్వ సదుపాయాలను స్తంభింపజేయనున్నట్లు నోటీస్‌లో పేర్కొన్నారు. కావేరి నివాసం ఇప్పటికే ముఖ్య మంత్రి బీ.ఎస్.యడ్యూరప్పకు కేటాయించారు. కానీ ఇందులో ఇప్పటికీ సిద్ధరామయ్యే ఉంటున్నారు. నిజానికి ఆయన ప్రతిపక్ష నాయకునికి కేటాయించిన రేస్ కోర్స్ రోడ్డులోని కాటేజ్ రేస్ వ్యూ– 2కు మారాలి. లేనిపక్షంలో చట్టపరంగానే ఖాళీ చేయిస్తామని అధికారులు తాజా నోటీస్‌లో తేల్చిచెప్పడం గమనార్హం. డీపీఏఆర్ సిబ్బంది శనివారం సిద్ధరామయ్య కార్యాలయానికి దీనిపై సమాచారం అందించగా, ఈ వారంలోగా కావేరి నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం సీఎం యడియూరప్ప నగరంలో డాలర్స్ కాలనీలో ఉన్న సొంత ఇంట్లో కార్యకలాపాలు చేపడుతున్నారు. ప్రతి రోజు రాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రిని కలుసుకోవటానికి వందలాది మంది వస్తుంటారు. ధవళగిరి నివాసంలో అంతమందిని కలవడానికి స్థలం లేదు. ప్రజలు రోడ్ల మీదనే నిలబడుతుంటారు, దీనివల్ల స్థానిక ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కార్యక్రమాలకు వీలుగా ముఖ్యమంత్రికి కావేరి నివాసాన్ని కేటాయించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఇచ్చిన గడువు పూర్తయిందని, ఇంక పొడిగించడం సాధ్యం కాదని సిద్ధరామయ్యకు స్పష్టం చేశారు. అయితే సిద్ధరామయ్య ఎలా స్పందిస్తారోనని ఉత్కంఠ నెలకొంది. -
కన్నడ విషయంలో రాజీపడబోం
బెంగళూరు/ చెన్నై: భారత్‌కు ఒకే జాతీయ భాష ఉండాలనీ, ఆ లోటును హిందీ భర్తీ చేయగలదన్న హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం, బీజేపీ నేత యడియూరప్ప స్పందించారు. తమ రాష్ట్రంలో కన్నడే ప్రధాన భాష అని, కన్నడ ప్రాధాన్యత విషయంలో తాము రాజీపడబోమని స్పష్టం చేశారు. ‘మన దేశంలోని అన్ని అధికార భాషలు సమానమే. ఇక కన్నడ విషయానికొస్తే అది రాష్ట్ర ప్రధాన భాష. కన్నడ భాషను ప్రోత్సహించడంతో పాటు రాష్ట్ర సంస్కృతి విషయంలో మేం రాజీ పడబోం’ అని తెలిపారు. షా, సుల్తాన్లు మార్చలేరు: కమల్ హాసన్ హిందీని తమపై బలవంతంగా రుద్దే ప్రయత్నాలను వ్యతిరేకిస్తామని మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ ప్రకటించారు. ‘భారత్ గణతంత్ర దేశంగా అవతరించగానే మనదేశంలో భిన్నత్వంలో ఏకత్వం కొనసాగుతుందని హామీ లభించింది. దీన్ని ఏ షా(అమిత్ షా), సుల్తాన్, సామ్రాట్లు కూడా మార్చలేరు. మేం అన్ని భాషలను గౌరవిస్తాం. కానీ మా మాతృభాష మాత్రం ఎప్పటికీ తమిళమే’ అని అన్నారు. -
ముఖ్యమంత్రికి నటి సూటి ప్రశ్న
సాక్షి, బెంగళూరు : నటి సోనుగౌడ సీఎం యడియూరప్పకు సవాల్ విసిరారు. బెంగళూరు వాహనాలకు జరిమానాలు విధించే ముందు సరైన రోడ్లను తయారు చేయాలని సూచించారు. ఈమేరకు శుక్రవారం ట్వీట్ చేశారు. జరిమానాలను విధించటం కాదు. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బులను జరిమానాల రూపంలో వసూలు చేయటంకాదు. మొదట ప్రజలు జీవించటానికి సరైన రోడ్లను అందించాలని కోరారు. తన ట్వీటర్ ఖాతాలో బైకుదారుడు ఒకరు రోడ్డుపై పడుతున్న ఫొటోను పోస్ట్ చేశారు. అందులో తాగినందుకు రూ.10 వేలు, సెల్ ఫోన్ వాడితే రూ. 5 వేలు జరిమానా అంటూ రాశారు. అయితే బైకుదారుడు రోడ్డుపై పడితే ప్రభుత్వానికి ఎంత జరిమానా అంటూ ప్రశ్నించారు. గతంలో మత్స్య కన్య వేషంలో ఉన్న ఫోటోను కూడా వేశారు. ఇటీవల కళాకారుడు బాదల్ నంజుండస్వామి గగనయాత్ర అంతరిక్ష ప్రయోగం చంద్రయాన్–2 ఫొటోలను కూడా జత చేశారు. -
యడ్డీ.. ఏ ముహూర్తాన ప్రమాణం చేశారో!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ముగిసినప్పటికీ పాలనాపరమైనా లోటుమాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. బీఎస్ యడియూరప్ప నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 18 రోజులు కావస్తున్నా ఇప్పటికీ మంత్రివర్గాన్ని మాత్రం ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుపడుతున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు బుధవారం రాష్ట్ర గవర్నర్ వాజూభాయ్ వాలాను కలిసి మంత్రివర్గ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని, మంత్రివర్గం లేకపోవడంతో సహాయ చర్యలు పూర్తిగా నిలిచిపోయాయని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. గతనెల 18న యడీయూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు మంత్రివర్గాన్ని మాత్రం ఏర్పాటు చేయలేకపోయారు. కర్మ,కర్త,క్రీయా అంతా తానే వ్యవహరిస్తూ.. రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. భారీ వరదల కారణంగా పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దీని కారణంగా ఇప్పటికే 54మంది మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓవైపు సీఎం, మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. సహాయ చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కానీ మంత్రివర్గంలేకపోవడంలో అధికారుల్లో స్పష్టత కరువైంది. దీంతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొక తప్పడంలేదు. మంత్రివర్గం ఏర్పాటు చేయడానికి కేంద్ర నాయకత్వం నుంచి ఇంకా గ్రీన్‌సిగ్నల్ రానట్లు తెలుస్తోంది. మంత్రివర్గం జాబితాను యడియూరప్ప సిద్ధం చేసి పెట్టుకున్నా.. అధిష్టానం పిలుపు కోసం ఆయన నిరీక్షిస్తున్నారు. జమ్మూ కశ్మీర్ విభజన అంశంలో బీజేపీ కేంద్ర పెద్దలు బిజీగా ఉండటంతో మంత్రివర్గ విస్తరణను కేంద్ర నాయకత్వం తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు సమాచారం. దీంతో యడియూరప్ప కూడా పార్టీ అధిష్టానంపై ఒత్తిడి చేయలేకపోతున్నారు. హైకమాండ్ పైనే భారం నిజానికి యడ్యూరప్ప ఎప్పుడో మంత్రివర్గ విస్తరణ చేపట్టేవారని, కానీ అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల విషయం పై ఇంకా స్పష్టత కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. దాదాపు యాభై మంది వరకూ బీజేపీ నేతలు మంత్రివర్గంలో చేరడానికి పోటీ పడుతున్నారు. కొందరు ఏకంగా అధిష్టానానికి అప్పీల్ కూడా చేసుకున్నారు. అందుకే సీఎం కూడా మంత్రివర్గ విస్తరణను అధిష్టానానికే వదిలేస్తే తాను నాలుగు ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చన్న ఆలోచనలో ఉన్నారు. మొత్తం మీద యడియూరప్ప ముఖ్యమంత్రిగా చేపట్టిన ముహూర్తం కలిసిరాలేదేమో. పార్టీ కేంద్ర నాయకత్వం వివిధ పనుల్లో బిజీగా ఉండటం, వరదలు, వానలతో రాష్ట్రం అతలాకుతలవ్వడంతో పూర్తిగా సతమవుతున్నారు. -
యడ్డికి షాక్!
సాక్షి, చెన్నై: కర్ణాటక సీఎం యడియూరప్ప ప్రయత్నాలకు ఆదిలోనే బ్రేక్ పడింది. కుమార స్వామి సర్కారు వదలిపెట్టిన పనిని తాను ముగించేందుకు దూకుడు పెంచగా, కేంద్ర పర్యావరణ, అటవీశాఖ షాక్ ఇచ్చింది. మేఘదాతుకు అనుమతులు నో అంటూ ఆ శాఖ స్పష్టం చేసింది. తమిళనాడు అంగీకరించి, రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినప్పుడే డ్యాం సాధ్యమని తేల్చింది. సీఎం పళనిస్వామి చేస్తూ వచ్చిన ప్రయత్నాలకు తాజాగా ఫలితం తగ్గడం అన్నాడీఎంకే వర్గాల్లో ఆనందాన్ని నింపింది. కర్ణాటక– తమిళనాడు మధ్య కావేరి నదీ జలాల పంపిణీ వివాదం కొత్తేమీ కాదు. తమిళనాడుకు ప్రతి ఏటా కర్ణాటక సర్కారు 177.25 టీఎంసీల నీళ్లు పంపిణీ చేయాల్సి ఉంది. ఆ మేరకు జూన్‌లో 9.19 టీఎంసీలు, జూలైలో 31.24 టీఎంసీలు, ఆగస్టులో 45. 95 టీఎంసీలు, సెప్టెంబరులో, డిసెంబరులో 7.35 టీఎంసీలు, జనవరిలో 2.76 టీఎంసీలు, ఫిబ్రవరి నుంచి మే వరకు 2.5 టీఎంసీలు చొప్పున దశల వారీగా నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే, ప్రతిఏటా ఈ నీళ్ల కోసం భగీరథ ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి తమిళనాడుకు తప్పడం లేదు. ఇక, గతంలో తమిళనాడుకు అనుకూలంగా కావేరి ట్రిబ్యునల్ ఇచ్చినతీర్పును తుంగలో తొక్కిన కేంద్రం పాలకులు ఎట్టకేలకు ప్రత్యామ్నాయంగా కావేరి యాజమాన్య సంస్థ, కావేరి నదీ జలాల పర్యవేక్షణ కమిటీని మమా అనిపించే రీతిలో ఏర్పాటు చేశారు. అయినా, తమిళనాడుకు ఒరిగింది శూన్యమే. ఈ కమిటీ ముందు సైతం నీటి కోసం సమరం సాగించాల్సిన పరిస్థితి తమిళనాడుకు తప్పడం లేదు. గత ఏడాది ఈ సంస్థ ఏర్పాటు చేసినా, నైరుతి రుతుపవనాల రూపంలో భారీగానే కావేరిలోకి నీళ్లు వచ్చాయి. మెట్టూరు జలాశయం రెండు సార్లు నిండి, ఉబరి నీరు సైతం వృథాగా సముద్రంలోకి వెళ్లింది. అదే సమయంలో వృథా అవుతున్న నీటిని పరిరక్షించుకుంటామన్న నినాదంతో కావేరి తీరంలో కొత్తగా జలాశయంపై కర్ణాటక పాలకులు దృష్టి పెట్టారు. నో..నో..నో.... కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న దృష్ట్యా, మేఘదాతులలో డ్యాం నిర్మాణ పనులకు మార్గం సుగమం అవుతుందని భావించిన ప్రస్తుతం సీఎం యడియూరప్ప వేసిన లెక్కలు తప్పుయ్యాయి. రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీని సైతం కలిసిన యడియూరప్ప డ్యాం నిర్మాణ అనుమతుల విషయంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిస్థితుల్లో యడ్డి ప్రయత్నాలకు, దూకుడుకు బ్రేక్ వేస్తూ అటవీ, పర్యావరణశాఖ బుధవారం ఓ ప్రకటన చేసింది. ఇది యడ్డి సర్కారుకు షాక్కే. అటవీ, పర్యావరణ అనుమతులు కోరుతూ ఆ శాఖకు వెళ్లిన అన్ని రకాల పరిశీలనలు తిరస్కరణకు గురయ్యాయి. మేఘదాతులో జలాశయం నిర్మాణం విషయంగా తమిళనాడుతో చర్చించాల్సిన అవసరం ఉందని, తమిళనాడు అనుమతి తప్పనిసరిగా అందులో పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరగాల్సి ఉందని, తమిళనాడు అంగీకారం తదుపరి వచ్చే ఏకాభిప్రాయం మేరకు మేఘదాతులో నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా, ప్రస్తుతం ఎలాంటి అనుమతులు ఇచ్చే ప్రసక్తే లేదని ఆ శాఖ తేల్చింది. అలాగే, ఇప్పటికే పలుమార్లు తమిళనాడు ప్రభుత్వం ఆ డ్యాంకు వ్యతిరేకంగా కేంద్రాన్ని ఆశ్రయించి ఉన్నదని గుర్తు చేశారు. 4,096 హెక్టార్ల స్థలంలో డ్యాం నిర్మాణం అన్నది అసాధ్యం అని, ఈ దృష్ట్యా, కర్ణాటక విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. సీఎం పళనిస్వామి గత కొన్ని నెలలుగా మేఘదాతుకు వ్యతిరేకంగా తీవ్ర చర్యలు చేపట్టారు. ఢిల్లీ వెళ్లినప్పుడు, ఇక్కడకు వచ్చినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీని కలిసి మేఘాదాతులకు వ్యతిరేకంగా వినతి పత్రాలు సమర్పించారు. అధికారవర్గాలు సైతం కావేరి అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీల ముందు బలమైన వాదనల్ని వినిపించిన దృష్ట్యా, తాజాగా అందుకు తగ్గ ఫలితం దక్కినట్టు అయింది. కర్ణాటక ఆ డ్యాం నిర్మాణం కోసం మళ్లీ మళ్లీ కేంద్రం వద్ద ప్రయత్నాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయని, తాజా ప్రకటన, పరిస్థితుల్ని పరిగణించి, మళ్లీ మేఘదాతు నినాదాన్ని కర్ణాటక చేతిలోకి తీసుకోకుండా పకడ్బందీ కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి పీఎంకే నేత రాందాసు ఓ ప్రకటన సూచించారు. మేఘదాతుతో అడ్డంకి .. కావేరి తీరంలోని మేఘదాతు 64 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేందుకు తగ్గట్టుగా జలాశయ నిర్మాణంపై కర్ణాటక పాలకులు దృష్టి పెట్టారు. మేఘదాతులో జలాశయ నిర్మాణం జరిగి తీరుతుందని తొలుత సిద్ధరామయ్య, ఆ తదుపరి కుమారస్వామి సర్కారులు బల్లగుద్ది మరీ చెప్పాయి. అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు వేగవంతం చేశాయి. మేఘదాతుల జలాశయం నిర్మించి, ఆ నీటిని బెంగళూరు అవసరాలకు ఉపయోగించబోతున్నట్టుగా ప్రకటించి, అందుకు తగ్గ పనులు వేగాన్ని పెంచారు. దీంతో తమిళనాట మేఘదాతులకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు, సమరాలు తప్పలేదు. అలాగే, ఈ డ్యాం నిర్మాణం కోసం కేంద్రం అనుమతి కోరే రీతిలో పలుమార్లు కర్ణాటక పాలకులు ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. ఈ పరిస్థితుల్లో గత పాలకులు వదలిపెట్టిన పనుల్ని తన నేతృత్వంలో ముగించేందుకు తగ్గట్టుగా కర్ణాటక బీజేపీ ముఖ్యమంత్రి యడియూరప్ప సిద్ధమయ్యారు. -
చినజీయర్ ఆశీస్సుల కోసం వచ్చా....
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ముచ్చింతల్‌లోని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ ఉదయం ఆశ్రమంలో సీతారామ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీయాగంలో యడియూరప్ప పాల్గొంటారు. ఈ సందర్భంగా యడియూరప్ప మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా చినజీయర్ ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చినట్లు చెప్పారు. కాగా నిన్నశంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో చినజీయర్ స్వామి ఆశ్రమానికి వచ్చిన యడియూరప్పకు వేద పండితులు ఆశీర్వచనాలతో ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన చినజీయర్ స్వామిని కలుసుకుని ఆశీస్సులు తీసుకున్నారు. కర్ణాటక అసెంబ్లీలో జరిగిన విశ్వాసపరీక్షలో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప విజయం సాధించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన ఆయన రాత్రి ఆశ్రమంలోనే బస చేశారు. -
చినజీయర్ ఆశీస్సులు తీసుకున్న యెడియూరప్ప
-
యెడ్డీ సర్కారు సంచలన నిర్ణయం!
బెంగళూరు : కర్ణాటకలో కొలువుదీరిన బీజేపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ జయంతి వేడుకల నిర్వహణను రద్దు చేసింది. ఈ వేడుకల కారణంగా రాష్ట్రంలో మత ఘర్షణలు చెలరేగుతున్నాయని.. ఇటువంటి సున్నితమైన అంశాలు మరింత వివాదాస్పదం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటిచింది. ఈ మేరకు.. ‘ వివాదాస్పద, మత కల్లోలాలకు కారణమవుతున్న టిప్పు జయంతిని మా ప్రభుత్వం రద్దు చేసింది’ అని కర్ణాటక బీజేపీ తన ట్విటర్ ఖాతాలో పేర్కొంది. కాగా బ్రిటిషర్లకు చుక్కలు చూపించిన టిప్పు సుల్తాన్ గౌరవార్థం గత కాంగ్రెస్ ప్రభుత్వం 2015 నుంచి ఆయన జయంతి వేడుకల నిర్వహణను ప్రారంభించింది. సిద్ధరామయ్య హయాంలో ప్రారంభమైన ఈ వేడుకలను బీజేపీ ఆది నుంచీ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో వేడుకలను రద్దు చేస్తూ యెడ్డీ సర్కారు మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఇక సోమవారం జరిగిన బలపరీక్షలో 106 మంది సభ్యులు తమకు అనుకూలంగా ఓటు వేయడంతో యెడియూరప్ప ప్రభుత్వం విశ్వాస పరీక్షలో సునాయాసంగా నెగ్గిన విషయం తెలిసిందే. -
విశ్వాస పరీక్షలో నెగ్గిన యడ్డీ సర్కార్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప విశ్వాస పరీక్షలో నెగ్గారు. సోమవారం జరిగిన బలపరీక్షలో ప్రభుత్వానికి మద్దతుగా 106 మంది సభ్యులు ఓటేశారు. దీంతో మ్యాజిక్ ఫిగర్‌ను యడ్డీ సునాయాసంగా ఛేదించగలిగారు. సభకు కాంగ్రెస్-బీజేఎస్ సభ్యులు కూడా హాజరయ్యారు. వీరంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ.. విశ్వాస పరీక్షలో సర్కార్ విజయం సాధించింది. బీజేపీకి ఉన్న 105 మందితో పాటు ఓ స్వతంత్ర ఎమ్మెల్యేతో కలుసుకుని బలం 106కి చేరింది. దీంతో మ్యాజిక్ ఫిగర్ 104 కంటే రెండు ఓట్లను ఎక్కువగా సాధించి బలపరీక్షలో గెలుపొందింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 99 మంది సభ్యులు ఓటు వేశారు. మూజువాణి పద్దతిలో స్పీకర్ రమేష్ కుమార్ ఓటింగ్‌ను చేపట్టారు. ప్రభుత్వానికి స్పష్టమైన మెజార్టీ ఉండడంతో విశ్వాస పరీక్షలో ప్రభుత్వం విజయం సాధించిందని స్పీకర్ ప్రకటించారు. అనంతరం సీఎం యడియూరప్ప సభలో సంతోషం వ్యక్తం చేశారు. ఇది ప్రజల విజయమన్నారు. విశ్వాస పరీక్షకు ముందు సభలో యడియూరప్ప మాట్లాడుతూ.. బల నిరూపణలో తమ ప్రభుత్వం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ స్ఫూర్తితో పాలనలో ముందుకు వెళ్తామని ఆయన అన్నారు. రైతులకు పెద్దపీఠ వేస్తామని స్పష్టం చేశారు. ప్రజల, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని సీఎం పేర్కొన్నారు. చర్చలో భాగంగా కాంగ్రెస్ నేత సిద్దరామయ్య మాట్లాడుతూ.. యడియూరప్ప వ్యాఖ్యలను తాము పూర్తిగా స్వాగతిస్తున్నామని అన్నారు. ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడపాలని సూచించారు. రైతుల సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వాలు ఎంతో చేశాయని ఆయన గుర్తుచేశారు. కాగా బలపరీక్షలో ప్రభుత్వం విజయం సాధించడంతో.. గత కొంత కాలంగా సాగుతోన్న రాజకీయ సంక్షోభానికి తెరపడినట్టయింది. కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలడానికి కారణమయిన 17 మంది సభ్యులపై స్పీకర్ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. స్పీకర్ చర్యతో సభలో మ్యాజిక్ ఫిగర్ 104కి పడిపోయింది. దీంతో విశ్వాస పరీక్షలో యడియూరప్ప సునాయాసంగా విజయం సాధించారు. -
మేమేమి సన్నాసులం కాదు..
బెంగళూరు, తుమకూరు: ‘ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తూ ఊరుకోవడానికి మేమేమి సన్నాసులం కాదు’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప అన్నారు. ఆదివారం పట్టణ శివార్లలోని మంచల్‌కుప్పలో బాగూరు సొ రంగ కాలువ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. సంకీర్ణ ప్రభుత్వ ఎమ్మెల్యేల రాజీనామాలపై విధానసభ స్పీకర్ నిర్ణయం తీసుకున్న తరువాత అధిష్టానంతో చర్చించి తదు పరి కార్యాచరణకు శ్రీకారం చుడతామన్నారు. కాంగ్రెస్– జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో బీజేపీకి సంబంధం లేదని చెప్పారు. 13 మంది ఎమ్మెల్యేలురాజీనామ చేసిన అనంతరం సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని, ఈ తరుణంలో అధికారం చేజి క్కించుకోకుండా దూరంగా ఉండడానికి మేమేమి సన్నాసులం కాదని స్పష్టంచేశారు.ఎట్టిపరిస్థితుల్లోనూ మధ్యంతర ఎన్నికలకు అవకాశమివ్వబోమని, రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనించి నిర్ణయం తీసుకుంటామన్నారు. హేమావతి నీరు రాకుండా కుట్ర హేమావతి కాలువలో రాతిబండలు అడ్డమేసి తుమకూరుకు నీళ్లు రాకుండా కుట్ర చేశారంటూ యడ్డి ఆరోపించారు. కాలువలో రాళ్లను అడ్డంగా వేసి తుమకూరుకు రావాల్సిన 25 టీఎంసీల నీటి లో ఒక్క చుక్కనీరు కూడా రాకుండా అడ్డుపడిందెవరో ప్రజలందరికీ తెలుసన్నారు. సిద్దగం గ మఠంలో శివకుమార స్వామీజీ సమా ధిని యడ్డి దర్శించుకున్నారు.కార్యక్రమం లో ఎంపీ బసవరాజు పాల్గొన్నారు. -
కుమారస్వామి రాజీనామా చేస్తారా?
సాక్షి బెంగళూరు: సంకీర్ణ ప్రభుత్వం డోలాయమానంలో పడడంతో రాష గవర్నర్ వజూభాయ్‌వాలా తదుపరి ఏం చేస్తారనే దానిపై అందరి దృష్టి మళ్లింది. ఆపరేషన్ పక్కాగా నిర్వహిస్తున్న యడ్యూరప్ప, ఇతర బీజేపీ కేంద్రమంత్రులు, సీనియర్లు దీనిపై నోరు మెదపడం లేదు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ రద్దయి మధ్యంతర ఎన్నికలు వస్తాయా? లేక రాష్ట్రపతి పాలన తప్పదా? అనేది సస్పెన్స్‌గా మారింది. సీఎం కుమారస్వామి బెంగళూరుకు రాగానే ఏం చేస్తారనేది తెలుస్తుంది. చదవండి: కన్నడ సంక్షోభం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జరుగుతున్న అసమ్మతి ఒక్కసారిగా తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యేల నుంచి రాజీనామాలు లేఖలు అందుకున్న గవర్నర్ వజూభాయ్‌వాలా ఏం నిర్ణయం తీసుకోబోతున్నారనేది అనేది కీలకంగా మారింది. సంకీర్ణ సర్కారును బలం నిరూపించుకోమంటారా?, అతిపెద్ద పార్టీ అయిన బీజేపీకి అవకాశమిస్తారా? అనేదానిపై రాజకీయ పండితు లు సైతం ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. కేంద్ర హోంశాఖతో ఆయన ఎప్పటికప్పుడు సంప్రదింపుల్లో ఉన్నారు. నైతికంగా బాధ్యత వహించి ఈ నేపథ్యంలో సీఎం కుమారస్వామి రాజీనామా చేస్తారా? లేక కొనసాగుతారా? అనేది చర్చనీయంగా మారింది. మాకు సంబంధం లేదు: యడ్డి కాంగ్రెస్ – జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాతో తనకు ఎలాంటి సంబంధం లేదని యడ్యూరప్ప స్పష్టం చేశారు. గవర్నర్‌ను కలవనని, స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. అంతేకానీ ప్రభుత్వ ఏర్పాటుకు ఇప్పటి వరకు ఎలాంటి కసరత్తు చేయలేదన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో గందరగోళం కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభాపతి కార్యాలయానికి మంత్రి డీకే శివకుమార్ వెళ్లి ఒక ఎమ్మెల్యే రాజీనామా పత్రం చింపివేయడాన్ని ప్రజలు చూస్తున్నారని అన్నారు. యడ్యూరప్పే సీఎం : డీవీఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తే యడ్యూర ప్ప సీఎంగా బీజేపీ సర్కారును ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రమంత్రి డీవీ సదానందగౌడ తెలిపారు. అసమ్మతి నేపథ్యంలో నైతిక బాధ్యతగా కుమారస్వామి సీఎం పదవికి రాజీనామా చేయాలని కోరారు. కాంగ్రెస్ మంతనాలు కాంగ్రెస్ ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ సమక్షంలో జరిగిన సమావేశంలో మాజీ సీఎం సిద్ధరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈక్రమంలో మంత్రులు కృష్ణభైరేగౌడ, యూటీ ఖాదర్, కేజే జార్జి, దేశపాండే, డీకే శివకుమార్‌తో రాజీనామా చేయించి వారి స్థానంలో అసంతృప్తులకు మంత్రి పదవులు కట్టబెట్టాలని తీర్మానించినట్లు సమాచారం. అయితే మంత్రులు రాజీనామా చేస్తారా? దీంతో సద్దుమణుగుతుందా? అనేది తేలాల్సి ఉంది. కాగా, దీనంతటికీ కారణం సిద్ధరామయ్యేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజీనామా చేసిన వారిలో సిద్ధరామయ్య అనుచరులుగా పేరుపొందిన వారు ఎక్కువ మంది ఉండటం విశేషం. -
సంకీర్ణంలో సంక్షోభం
బెంగళూరు: కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరి, సంక్షోభం మరింత ముదురుతున్నట్లు కనిపిస్తోంది. ఇరు పార్టీల్లోని పలువురు ఎమ్మెల్యేలు సంకీర్ణ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పరిస్థితిని చక్కదిద్దడం కోసం కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్య నాయకులతో చర్చలు జరిపేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక వ్యవహారాల ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్ బెంగళూరుకు రానున్నట్లు సమాచారం. మరో సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ కూడా వేణుగోపాల్‌తోపాటు బెంగళూరుకు రావాల్సి ఉన్నప్పటికీ పార్టీలో ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా ఆయన రావడం లేదని తెలిసింది. కాంగ్రెస్ నేతలైన సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర, కాంగ్రెస్ రాష్ట్రాధ్యక్షుడు దినేశ్ గుండూరావు, మంత్రి డీకే శివకుమార్‌లతో వేణుగోపాల్ ప్రధానంగా భేటీ కానున్నారు. సీఎం కుమారస్వామి ఈ భేటీలో పాల్గొనే చాన్సుంది. అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు కుమారస్వామి కూడా నేరుగా రంగంలోకి దిగారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు కర్ణాటక మంత్రివర్గంలో మార్పులు చేయవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ నాయకుడు ఎస్ఎం కృష్ణను ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేశ్ జర్కిహోళి, సుధాకర్‌లు కలిసిన నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు ముందుజాగ్రత్త చర్యలకు దిగినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచీ ఊగిసలాటే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి కేవలం రెండే సీట్లలో గెలిచి ఘోర పరాభవం చెందడం తెలిసిందే. అనంతరం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ జూన్ 10 తర్వాత కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు. కర్ణాటక శాసనసభలో మొత్తం 224 సీట్లు ఉండగా, కాంగ్రెస్‌కు 79, జేడీఎస్‌కు 37, బీఎస్పీకి ఉన్న ఒక ఎమ్మెల్యేతో కలిపి మొత్తంగా 117 మంది ఎమ్మెల్యేలు అధికారపక్షంలో ఉండగా, బీజేపీకి సొంతంగా 105 మంది శాసనసభ్యులు ఉన్నారు. అయితే ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు బీజేపీ ‘ఆపరేషన్ కమల’ను చేపడుతుందని పలుసార్లు వార్తలు వచ్చాయి. సంకీర్ణ ప్రభుత్వంపై అటు కాంగ్రెస్, ఇటు జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా పలుసార్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు కాంగ్రెస్‌తో పొత్తు లేకపోయి ఉంటే లోక్‌సభ ఎన్నికల్లో మరిన్ని సీట్లు గెలిచే వాళ్లమని జేడీఎస్ ఎమ్మెల్యే ఒకరు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఖాళీ స్థానాల భర్తీ మాత్రమే: సిద్దు సంకీర్ణ ప్రభుత్వం కూలిపోకుండా ఉండేందుకు మంత్రివర్గంలో మార్పులు చేయబోతున్నారన్న వార్తలను మాజీ సీఎం సిద్దరామయ్య తోసిపుచ్చారు. మంత్రివర్గంలో మార్పులు ఏమీ ఉండబోవనీ, అయితే ప్రస్తుతం ఖాళీగా ఉన్న 3స్థానాలను మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ‘ఇదొక రకం విస్తరణ. మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేసేందుకు ప్రణాళికలు ఉన్నాయి’ అని సిద్దరామయ్య మైసూరులో చెప్పారు. కొందరు అసంతృప్త ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇవ్వడం కోసం ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారి చేత రాజీనామా చేయిస్తారని వార్తలు వస్తున్న విషయాన్ని ప్రస్తావించగా, ఆ విషయం తనకు తెలీదన్నారు.మంత్రివర్గంలో 34 మంది ఉండాలి. వీరిలో 22 మంది కాంగ్రెస్ నుంచి, 12 మంది జేడీఎస్ నుంచి మంత్రులుగా ఉండేలా ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం జేడీఎస్‌కు చెందిన రెండు, కాంగ్రెస్ నుంచి ఒక స్థానం మంత్రివర్గంలో ఖాళీగా ఉంది. మంత్రివర్గంలో చోటు సంపాదించేందుకు పలువురు నేతలు ఇప్పటికే కుమారస్వామితో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తాను మంత్రిని కావాలనుకుంటున్నానని కాంగ్రెస్ నేత మునియప్ప అన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ సభ్యుల్లో అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం సీఎం కుమారస్వామి, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ దినేశ్ గుండూరావులతో సిద్ధరామయ్య భేటీ అయ్యారు. సుపపరిపాలనను, సమర్థ పాలనను అందించడమే తమ సంకీర్ణ ప్రభుత్వ లక్ష్యమనీ, బీజేపీ బెదిరింపులతో తమ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది లేదని సిద్దరామయ్య అన్నారు. మా వాళ్లు ఒక్కరు కూడా బయటకు వెళ్లరు: యడ్యూరప్ప కాంగ్రెస్–జేడీఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళితే బాగుంటుందని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప మంగళవారం అన్నారు. అలాగే బీజేపీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ లేదా జేడీఎస్‌లోకి వెళ్లేందుకు సిద్ధంగా లేరనీ, అయోమయాన్ని సృష్టించేందుకు ఆ పార్టీలు పుకార్లు పుట్టిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘రాష్ట్రంలోని 177 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మా పార్టీ తొలి స్థానంలో ఉంది. మేం 28కి 25 లోక్‌సభ స్థానాలు గెలిచాం. వాళ్లు శాసనసభను రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళితే బాగుంటుంది. వారు ఆ నిర్ణయం తీసుకుంటే మేం స్వాగతిస్తాం’ అని యడ్యూరప్ప అన్నారు. -
‘అదే జరిగితే.. జూన్ 1న రాజీనామా’
బెంగళూరు : యడ్యూరప్ప చెప్పినట్లు జూన్ 1న తమ ప్రభుత్వం పడిపోతే.. అదే రోజున తన పదవికి రాజీనామా చేస్తానంటూ కర్ణాటక సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్ కూటమి అధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి.. దాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప.. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని.. త్వరలోనే వారు బీజేపీలో చేరతారని.. జూన్ 1 నాటికి జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యనించారు. తాజాగా సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలపై స్పందించారు. యడ్యూరప్ప సంవత్సరం నుంచి ఇదే మాట చెప్తున్నారని.. మరో నాలుగేళ్లు కూడా ఇలానే చెప్తారని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినంతా మాత్రాన రాష్ట్రంలో కూడా అలానే జరగాలనుకోవడం అత్యాశ అన్నారు. తమ ప్రభుత్వం చాలా బలంగా ఉందని.. ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీని వీడటానికి సిద్ధంగా లేరని తెలిపారు. ఒక వేళ యడ్యూరప్ప చెప్పినట్లుగానే.. జూన్ 1న తమ ప్రభుత్వం కూలిపోతే.. అదే రోజున తాను తన పదవికి రాజీనామా చేస్తానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. -
కర్ణాటకలో పెనుమార్పులు
తాండూరు టౌన్: లోక్‌సభ ఎన్నికల అనంతరం కర్ణాటకలో పెనుమార్పులు సంభవిస్తాయని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అన్నారు. ప్రస్తుతం ఉన్న కుమారస్వామి ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల అనంతరం కుప్పకూలే అవకాశం ఉందని, ఇప్పటికే ఆ ప్రభుత్వంలోని 20 మందికి పైగా ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారన్నారు. బుధవారం ఆయన తెలంగాణ–కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని చించోళిలో జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తూ తాండూరులో బీజేపీ సీనియర్ నేత అరవింద లింబావళితో కలిసి విలేకరులతో మాట్లాడారు. చించోళి, కందుగోళ్ నియోజకవర్గాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు 25 వేలకు పైగా మెజార్టీ సాధిస్తారన్నారు. ప్రభుత్వం పడిపోతే మల్లిఖార్జున ఖర్గే సీఎం అవుతారని, ఏకంగా సీఎం కుమారస్వామి ప్రకటించడం పట్ల వారి ప్రభుత్వంపై ఆయనకు నమ్మకం సడలినట్లేనని ఎద్దేవా చేశారు. ఈసారి కర్ణాటకలో 20 నుంచి 22 ఎంపీ సీట్లు గెలుస్తామని, దేశవ్యాప్తంగా 285కు పైగా ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలిచి తిరిగి నరేంద్ర మోదీ ప్రధాని కావడం ఖాయమన్నారు. అనంతరం సీనియర్ నాయకులు అరవింద లింబావళి మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల అనంతరం కర్ణాటకలో కుమారస్వామి ప్రభు త్వం కూలిపోతుందని, యడ్యూరప్ప తిరిగి సీఎం అవుతారన్నారు. -
‘త్వరలోనే ప్రభుత్వం కూలిపోతుంది’
సాక్షి, వికారాబాద్: కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరు వచ్చిన ఆయన.. భావిగి భద్రేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పడిపోవడంలో తమ ప్రమేయం ఏమీలేదన్నారు. ఇటీవల జరిగిన రెండు ఉప ఎన్నికల ఫలితాల తరువాత తమ బలం మరింత పెరగనుందన్నారు. ఇటీవల ఓ కాంగ్రెస్ నేత మాట్లాడుతూ.. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం మల్లికార్జున ఖర్గేను సీఎంగా నియమిస్తామని ప్రకటించిన అనంతరం వారికి ప్రభుత్వంపై విశ్వాసం పోయిందని ఎడ్డీ తెలిపారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 280 సీట్లు సాధించి మోదీ మరోసారి ప్రధాని కాబోతున్నారని అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో 20-22 ఎంపీ సీట్లు, తెలంగాణ మహబూబ్‌నగర్, సికింద్రాబాద్ స్థానాలను గెలుచుకుంటామని జోస్యం చెప్పారు. -
దమ్ముంటే ఎమ్మెల్యేలను దాచుకోండి
శివాజీనగర: ‘లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. సత్తా ఉంటే కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు వారి ఎమ్మెల్యేలను దాచిపెట్టుకోండి’ అని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.ఎస్.యడ్యూరప్ప సవాల్ చేశారు. సోమవారం చించోళి ఎన్నికల సభలో, కల్బుర్గిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఫలితాల తరువాత ముఖ్యమంత్రి అవుతానని తాను ఎక్కడా చెప్పలేదు, అయితే ఏమైనా జరగవచ్చు అని తెలిపారు. కాంగ్రెస్–జేడీఎస్ నాయకులకు దమ్ముంటే వారి ఎమ్మెల్యేలు జారిపోకుండా గట్టిగా పట్టుకోవాలని, అంతేకానీ తమపై లేనిపోని ఆరోపణలు చేయటం ఎందుకని అన్నారు. లోక్‌సభ, శాసనసభా ఉప ఎన్నికల ఫలితాల తరువాత ప్రభుత్వం మనుగడ కష్టమేనని అన్నారు. సంకీర్ణంలో కలహాలు మాజీ సీఎం సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు హెచ్.విశ్వనాథ్ ధ్వజమెత్తటం వెనుక ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి హస్తముందని యడ్డి ఆరోపించారు. ‘అవి కేవలం విశ్వనాథ్ మాటలు కావు, కుమారస్వామి విశ్వనాథ్ ద్వారా మాట్లాడించారు. విశ్వనాథ్ వ్యాఖ్యలు సంకీర్ణ ప్రభుత్వంలోని నాయకుల మధ్య గొడవ ఏ స్థాయిలో ఉందనేది బహిర్గతమైంది. సర్కారు వారివల్లనే పతనమవుతుంది, అప్పటివరకు వేచి చూస్తాం. సంకీర్ణ కలహాలతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. కుమారస్వామి అసమ్మతి వేడిని చల్లార్చుకోవడానికి రిసార్ట్‌కు వెళ్లారు తప్ప విశ్రాంతి కోసం కాదు. చించోళి, కుందగోళ శాసనసభా ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలుపు సాధిస్తారు’ అన్నారు. మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చులకనగా మాట్లాడటమే అలవాటుగా పెట్టుకున్నారని యడ్యూరప్ప విమర్శించారు. ప్రధానిపై మాట్లాడితే పెద్దవారవుతామని అనుకొంటున్నారు, ఓటమి భయంతో ఖర్గే ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 22 సీట్లు గెలుపొందుతామని చెప్పారు. -
యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు
-
ప్రధాని పదవిపై ఆశ.. 7 స్థానాల్లో పోటీ
బెంగళూరు : అద్వానీలా తాను రాజకీయాల నుంచి రిటైర్ కాబోనని మాజీ ప్రధాని దేవెగౌడ చేసిన వ్యాఖ్యలను బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప తిప్పికొట్టారు. దేవెగౌడ ప్రధాని కావాలని ఆశపడుతున్నారని ఆయన విమర్శించారు. ఓ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో యడ్యూరప్ప మాట్లాడుతూ.. ‘కర్ణాటకలో జేడీఎస్ కేవలం ఏడు లోక్‌సభ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. ఐనా కూడా ఆ పార్టీ నేత(దేవెగౌడను ఉద్దేశిస్తూ) ప్రధానమంత్రి లేదా ప్రధాని సలహాదారు కావాలని ఆశపడుతున్నారు’ అని విమర్శించారు. ఎన్నికల్లో పోటీ చేయబోనని కొన్ని సంవత్సరాల కిందట ప్రకటించిన మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మళ్లీ ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించారు దేవెగౌడ. గతంలోనే ఎన్నికల నుంచి తప్పుకొంటానని ప్రకటించినా.. మళ్లీ పరిస్థితులు తనను పోటీ చేసేలా పురికొల్పాయన్నారు. ప్రస్తుతానికి తనకు ఎలాంటి రాజకీయ ఆశయాలు, ఆశలు లేవన్నారు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీలా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకునే ఉద్దేశం కూడా తనకు లేదని ఆయన చెప్పారు. తన పార్టీని కాపాడుకోవడమే తన ప్రధాన ఉద్దేశమని, అధికారమనేది ఆ తర్వాతి విషయమని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే.. ఆయనకు అండగా నిలబడతానని, ప్రధాని కావాలని తనకు లేదని చెప్పుకొచ్చారు. చిన్న పార్టీ అయినప్పటికీ, తమకు సోనియాగాంధీ కర్ణాటకలో మద్దతుగా నిలిచారని.. అందుకే కాంగ్రెస్ పార్టీతో కలిసి సాగాల్సిన బాధ్యత తమపై ఉందని దేవెడౌడ స్పష్టం చేశారు. -
యడ్యూరప్ప హెలికాఫ్టర్‌లో ఎన్నికల సింబ్బంది తనిఖీలు
-
‘22 సీట్లు గెలిస్తే.. 24 గంటల్లోపే ప్రభుత్వాన్ని కూలుస్తాం’
బెంగళూరు : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ గనక 22 స్థానాల్లో గెలిస్తే.. 24 గంటల్లోపే తాము అధికారాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఓ బహిరంగ సభకు హాజరైన యడ్యూరప్ప ప్రసంగిస్తూ.. ‘నేను అహంకారంతో ఇలా మాట్లడటం లేదు. మా పార్టీ అధికారినికి దూరమై ఎంతో కాలం కావట్లేదు. కానీ ఒక వేళ ఈ లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో మా పార్టీ కనక 22 స్థానాల్లో గెలిస్తే.. 24 గంటల్లోపే జేడీఎస్‌ను గద్దె దింపి రాష్టంలో మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అధికారాన్ని హస్తగతం చేసుకుంటామ’ని తెలిపారు. అంతేకాక ఆరున్నర కోట్ల మంది కర్ణాటక ప్రజలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని శపిస్తున్నారన్నారు. త్వరలోనే ఈ ప్రభుత్వం పడిపోతుందని తెలిపారు. అంతేకాక ‘ఈ ఎన్నికల్లో బీజేపీ 300 స్థానాల్లో గెలుస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. అంటే కర్ణాటకలోని 28 స్థానాల్లో బీజేపీ తప్పక గెలవాలి. అందుకు తగ్గట్టు మనం కృషి చేయాలి. అది మనందరి బాధ్యత’ అంటూ కార్యకర్తలకు యడ్యూరప్ప పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సర్జికల్ స్ట్రైక్ 2 జరిగిన తర్వాత కూడా యడ్డి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. మెరుపు దాడులు యువతలో ఉత్సాహాన్ని నింపాయని, దీని కారణంగా కర్ణాటకలో బీజేపీ 22 స్థానాలు గెలుస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. (చదవండి : సర్జికల్ స్ట్రైక్స్-2: మేం 22 సీట్లు గెలుస్తాం!) -
అమిత్ షా సమక్షంలోనే వివాదం?
సాక్షి, బెంగళూరు : జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చేపట్టిన ఆపరేషన్ కమల విఫలమైన తరువాత బీజేపీ నాయకుల మధ్య లోలోపల నెలకొన్న వివాదం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో భగ్గుమంది. శుక్రవారం జరిగిన కేంద్ర నాయకుల సమావేశంలో పాల్గొన్న అమిత్ షా సమక్షంలో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, జాతీయ సహ సంఘటనా కార్యదర్శి సంతోష్ పరస్పరం వాగ్వివాదానికి దిగారు. సమయం లభించనప్పుడు పదే పదే యడ్యూరప్పకు వ్యతిరేకగా హైకమాండ్ నాయకులకు ఫిర్యాదు చేస్తున్న సంతోష్, ఆపరేషన్ కమల విఫలమై పార్టీకి తీవ్ర స్థాయిలో ఎదురుదెబ్బ తగిలింది. ఆపరేషన్ కమల నాయకులను నియంత్రించాలని నేరుగానే యడ్యూరప్పపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆపరేషన్ కమలకు పూనుకొన్న కొందరు నాయకులపై కూడా సంతోష్... అమిత్ షాకు ఫిర్యాదు చేయగా, ఈ రాజకీయ కార్యకలాపాల నుంచి పార్టీకి భంగపాటు కలగటమే కాకుండా ప్రజల ముందు తలదించుకొనే పరిస్థితి నెలకొంది. బీజేపీకి ఇటువంటి రాజకీయ కార్యకలాపాలు సరికాదని చెప్పినట్లు తెలిసింది. పార్టీ అధ్యక్షుడికి తనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన సంతోష్‌పై అసంతృప్తిని వ్యక్తం చేసిన యడ్యూరప్ప, సంతోష్ జాతీయ సహ సంఘటనా కార్యదర్శిగా ఉన్నా కూడా రాష్ట్రంలో బీజేపీ వ్యవహారాల్లో జోక్యం చేసుకొంటున్నారు. ద్వేషం పెట్టుకొని పని చేస్తున్నారు. వీరికి బుద్ధి చెప్పాలని యడ్యూరప్ప కూడా అమిత్ షాకు ఫిర్యాదు చేశారని తెలిసింది. ఒక ప్రయత్నం చేశాం శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉంది. అంతేకాకుండా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలల అసంతృప్తిని ఉపయోగించుకొని ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నం చేశాం. ఇందులో తప్పేముంది. రాజకీయాలలో ఇలాంటి సహజం. తమ ప్రయత్నం కొన్ని కారణాలతో సఫలం కాలేదని, ముందు తాము విజయం సాధిస్తాం. అందులో అనుమానమే అవసరం లేదు. అయితే ప్రస్తుతం జరిగిన వైఫల్యాలను పెద్దదిగా చేస్తూ ఏదో అయిపోయిందన్న విధంగా కొందరు నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఇది సరికాదని యడ్యూరప్ప.. షాకు తెలియజేశారని సమాచారం. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో అతి సమీపంలో ఉండగా, పార్టీ అభ్యర్థుల గెలుపుకు కలసికట్టుగా పనిచేయాల్సి ఉంది. అనవసరంగా ఇంతకు ముందు జరిగినదాన్నే మాట్లాడటం సరికాదు. ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. తాము ఆపరేషన్ కమల చేపట్టినందుకు ప్రజలు విసుగుచెందలేదు. ప్రజల భావాలు తమకు తెలుసునని యడ్యూరప్ప అమిత్ షాకు వాస్తవ స్థితిని తెలియజేసే ప్రయత్నం చేశారని తెలిసింది. -
యడ్యూరప్పకు బెయిల్
సాక్షి బెంగళూరు: ‘ఆపరేషన్ కమల’లో భాగంగా ఆడియో కేసుకు సంబంధించి రాయచూరు జిల్లాలో తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కోర్టు ఆయనకు షరతులతో కూడిన మందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసుకు సంబంధించి యడ్యూరప్పతో పాటు మరో నలుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసులో ఉన్న మిగతా వారికి కూడా ముందస్తు బెయిల్ వచ్చింది. జేడీఎస్ ఎమ్మెల్యే నాగనెగౌడ కందకూరు తనయుడు శరణేగౌడ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయచూరు జిల్లా దేవదుర్గ పోలీస్‌స్టేషన్‌లో యడ్యూరప్పపై కేసు నమోదైంది. కలబుర్గి హైకోర్టు బెంచి పరిధిలోకి దేవదుర్గ పోలీస్ స్టేషన్ వస్తుంది. ఫలితంగా కలబుర్గి హైకోర్టు బెంచికి అర్జీ ఇవ్వనున్నారు. కాగా అవినీతి నిరోధక చట్టం ప్రకారం దేవదుర్గ పోలీస్ స్టేషన్లో యడ్యూరప్పపై కేసు నమోదు చేశారు. రూ.లక్ష విలువ చేసే బాండు, పోలీసుల దర్యాప్తునకు సహకరించాలి. సాక్షులను ప్రభావితం చేయకూడదు. కోర్టు అనుమతి లేనిదే పరిధి దాటి వెళ్లకూడదని తదితర షరతులతో సిటీ సివిల్ కోర్టు తీర్పు ఇచ్చింది. -
దేవెగౌడపై సంచలన వ్యాఖ్యలు..
బెంగళూరు : కర్ణాటకలో ఆడియో టేపుల వ్యవహారం సెగలు పుట్టిస్తోంది. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప బేరసారాలు జరిపినట్టుగా చెబుతున్న ఆడియోలను ముఖ్యమంత్రి కుమారస్వామి, కాంగ్రెస్ నేతలు విడుదల చేయడంతో ఈ దుమారం మొదలైంది. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే.. జేడీఎస్ ఎమ్మెల్యే కుమారుడితో మాట్లాడినట్టుగా చెబుతున్న ఓ ఆడియో టేపు... జేడీఎస్ కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. హసన్ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడదిగా చెప్పుకుంటున్న తాజా ఆడియో క్లిప్పులోని వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రీతమ్ గౌడగా చెప్పబడుతున్న బీజేపీ ఎమ్మెల్యే.. జేడీఎస్ ఎమ్మెల్యే కుమారుడితో మాట్లాడుతూ.. ‘త్వరలోనే మాజీ ప్రధాని దేవెగౌడ చనిపోతారు... ఆయన కొడుకు కుమారస్వామి ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. అతి త్వరలోనే జేడీఎస్ ఓ చరిత్రగా మిగిలిపోతుంది’ అంటూ ఆ ఆడియో టేపులో రికార్డ్ అయ్యింది. దీన్ని కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేయడంతో... జేడీఎస్ కార్యకర్తలు రగిలిపోయారు. హసన్ జిల్లాలోని ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడ ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అయితే తనను చంపేందుకు జేడీఎస్ ప్రయత్నిస్తోందని ప్రీతమ్ గౌడ ఆరోపించారు. కాగా ప్రీతమ్ గౌడ ఇంటిపై దాడిని ఖండించిన ముఖ్యమంత్రి కుమారస్వామి... జేడీఎస్ కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. ఈ ఆడియో టేపుల వ్యవహారం కన్నడ రాజకీయాలను ఎటు తీసుకుపోతాయో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. -
‘నా పరిస్థితి అత్యాచార బాధితురాలిలా ఉంది’
బెంగళూరు : తమ పార్టీ ఎమ్మెల్యేను ప్రలోభాలకు గురిచేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ప్రయత్నించినట్లుగా ఉన్న ఆడియో క్లిప్పింగులపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ చేయించనున్నట్లు కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్లిప్పింగుల్లో తన పేరును కూడా ప్రస్తావించినందున నిజాలు నిగ్గు తేల్చాలంటూ అసెంబ్లీలో స్పీకర్ రమేశ్ కుమార్ ప్రభుత్వానికి సూచించారు. ఈ విషయమై అసెంబ్లీలో చర్చ రావడంతో రమేశ్ కుమార్ మాట్లాడుతూ... తనను తాను అత్యాచార బాధితురాలితో పోల్చుకున్నారు. ‘ ప్రస్తుతం నా పరిస్థితి అత్యాచార బాధితురాలిలాగా ఉంది. ఒకే ప్రశ్న గురించి వాళ్లను ఎలా అయితే అనేక మార్లు ప్రశ్నిస్తారో నా పేరు ప్రస్తావించడం కూడా అలాగే అన్పించింది’అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆడియో క్లిప్పింగుల అంశాన్ని ప్రస్తావించిన బీజేపీ రాజకీయ కక్షతోనే కుమారస్వామి ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించిందని ఆందోళన చేశారు. ఈ క్రమంలో సభను వాయిదా వేసినట్లు ప్రకటించిన స్పీకర్.. ‘బాగా చర్చించి.. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన ఆవశ్యకత ఉంది’ అని పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ అధికార కాంగ్రెస్–జేడీఎస్ కూటమి, ప్రతిపక్ష బీజేపీ కొంతకాలంగా పరస్పరం ఆరోపణలు చేసుకోవడం, క్యాంప్ రాజకీయాలు చేయడం విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటీవల సీఎం కుమారస్వామి.. బీజేపీ నేత యడ్యూరప్ప జేడీ(ఎస్)కు చెందిన ఎమ్మెల్యేను ప్రలోభపెడుతున్నట్లుగా ఉన్న ఫోన్ సంభాషణ క్లిప్పింగులను మీడియా ఎదుట ప్రదర్శించారు. ఒకవేళ అధికార పక్ష ఎమ్మెల్యేలు బీజేపీ పక్షాన చేరినట్లయితే స్పీకర్ వారికి అనుకూలంగా రూలింగ్ ఇచ్చేందుకు గాను రూ.50 కోట్లు ఇద్దామంటూ యడ్యూరప్ప అన్నట్లుగా అందులో రికార్డయి ఉంది. యడ్యూరప్ప ఏమన్నారు? మొదట్లో వీటిని ఖండించిన యడ్యూరప్ప.. జేడీఎస్ ఎమ్మెల్యే నాగనగౌడ కుమారుడు శరణ్ గౌడతో తాను మాట్లాడింది నిజమేనంటూ ఆదివారం ప్రకటించారు. అయితే, సీఎం ప్రోద్బ లంతోనే అతడు తనతో భేటీ అయ్యాడని ఆరోపించారు. అందులోని కీలక అంశాలను తొలగించి, తమకు అనువుగా ఉండేలా సంభాషణ క్లిప్పింగులు రూపొందించారని అన్నారు. శాసనసభ సమావేశాలకు గైర్హాజరవుతున్న నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కాంగ్రెస్ కోరింది. -
యెడ్డీ ఆడియో క్లిప్పులపై సిట్
బెంగళూరు: అధికార జేడీ(ఎస్)కు చెందిన ఎమ్మెల్యేను ప్రలోభపరిచేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ప్రయత్నించినట్లుగా ఉన్న ఆడియో క్లిప్పింగులపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ చేయించనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. అయితే, యడ్యూరప్ప ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. స్వయంగా ముఖ్యమంత్రే నిందితుడిగా ఉన్న ఈ కేసులో సిట్ దర్యాప్తుతో నిజాలు ఎలా వెలుగులోకి వస్తాయని ప్రశ్నించారు. యడ్యూరప్ప మాట్లాడినట్లు ఉన్న క్లిప్పింగుల్లో తన పేరును కూడా ప్రస్తావించినందున నిజాలు నిగ్గు తేల్చాలంటూ సోమవారం అసెంబ్లీలో స్పీకర్ రమేశ్ కుమార్ ప్రభుత్వానికి సూచించారు. నిజాయతీపరుడు, నిబద్ధత కలిగిన స్పీకర్ రమేశ్‌కుమార్‌పై వచ్చిన ఆరోపణలను తప్పని రుజువు చేసి, ఆ పదవి ఔన్నత్యాన్ని కాపాడాలని అధికార పక్ష సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన ముఖ్యమంత్రి కుమారస్వామి ఆ ఆడియో క్లిప్పింగులపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, క్లిప్పింగుల్లో స్పీకర్ పేరు ప్రస్తావనపై మాత్రమే విచారణను పరిమితం చేయాలని, లేకుంటే సిట్‌ను ప్రభుత్వం దుర్వినియోగం చేసే అవకాశాలున్నాయంటూ ప్రతిపక్ష బీజేపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ అధికార కాంగ్రెస్–జేడీఎస్ కూటమి, ప్రతిపక్ష బీజేపీ కొంతకాలంగా పరస్పరం ఆరోపణలు చేసుకోవడం, క్యాంప్ రాజకీయాలు చేయడం విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటీవల సీఎం కుమారస్వామి.. బీజేపీ నేత యడ్యూరప్ప జేడీ(ఎస్)కు చెందిన ఎమ్మెల్యేను ప్రలోభపెడుతున్నట్లుగా ఉన్న ఫోన్ సంభాషణ క్లిప్పింగులను మీడియా ఎదుట ప్రదర్శించారు. ఒకవేళ అధికార పక్ష ఎమ్మెల్యేలు బీజేపీ పక్షాన చేరినట్లయితే స్పీకర్ వారికి అనుకూలంగా రూలింగ్ ఇచ్చేందుకు గాను రూ.50 కోట్లు ఇద్దామంటూ యడ్యూరప్ప అన్నట్లుగా అందులో రికార్డయి ఉంది. యడ్యూరప్ప ఏమన్నారు? మొదట్లో వీటిని ఖండించిన యడ్యూరప్ప.. జేడీఎస్ ఎమ్మెల్యే నాగనగౌడ కుమారుడు శరణ్ గౌడతో తాను మాట్లాడింది నిజమేనంటూ ఆదివారం ప్రకటించారు. అయితే, సీఎం ప్రోద్బ లంతోనే అతడు తనతో భేటీ అయ్యాడని ఆరోపించారు. అందులోని కీలక అంశాలను తొలగించి, తమకు అనువుగా ఉండేలా సంభాషణ క్లిప్పింగులు రూపొందించారని అన్నారు. శాసనసభ సమావేశాలకు గైర్హాజరవుతున్న నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కాంగ్రెస్ కోరింది. -
ఆ గొంతు నాదే : యడ్యూరప్ప
బెంగళూరు : కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న ఆడియో టేపు వ్యవహారంలో ఆసక్తికర ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ టేపులో మాటలు తనవేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప పరోక్షంగా అంగీకరించిన అంశం సంచలనం సృష్టించింది. తమ ప్రభుత్వాన్ని కూల్చే లక్ష్యంతో యడ్యూరప్ప తమ శాసనసభ్యులను కొనేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ముఖ్యమంత్రి కుమారస్వామి ఓ ఆడియో టేపును విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆరోపణలను ఖండించిన యడ్యూరప్ప ‘ఆ ఆడియో సంభాషణ నాదేనని నిరూపిస్తే రాజీనామా చేస్తా’నంటూ సవాలు కూడా చేశారు. అయితే ఆదివారం హుబ్బళ్లిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా యడ్యూరప్ప మాట్లాడుతూ.. ‘నేను దేవదుర్గకు వెళ్లినప్పుడు అర్ధరాత్రి ముఖ్యమంత్రి కుమారస్వామి తన పార్టీ ఎమ్మెల్యే కుమారుడిని పంపి నాతో మాట్లాడేలా ప్రేరేపించారు. ఆ సంభాషణలో తనకు అవసరమైన మాటల్ని కత్తిరించి ఎడిట్ చేసి వాటిని విడుదల చేశారు’ అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహించిన యడ్యూరప్ప ఆడియోలో సంభాషణ తనదేనని అంగీకరించారు. ఆడియో టేపుల విషయంలో యడ్యూరప్ప నిజం ఒప్పుకోవడంతో కాంగ్రెస్, జేడీఎస్ పక్షాలు ఆయనపై విమర్శల దాడికి దిగాయి. యడ్యూరప్ప రాజీనామా చేయాల్సిందేనంటూ ఉప ముఖ్యమంత్రి జీ పరమేశ్వర డిమాండ్ చేశారు. -
బీజేపీ ప్రలోభాలకు ఆధారాలున్నాయ్
బెంగళూరు: తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను ప్రలోభపెట్టేందుకు ప్రతిపక్ష బీజేపీ ప్రయత్నిస్తోందనీ, అందుకు సాక్ష్యమిదేనంటూ శుక్రవారం కర్ణాటక సీఎం కుమారస్వామి ఓ ఆడియో క్లిప్పింగ్‌ను మీడియాకు వినిపించారు. ఆ ఆడియోలో...అధికార జేడీ(ఎస్)కు చెందిన ఎమ్మెల్యే నాగన్ గౌడ కొడుకు శరణ్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ఫోన్లో మంతనాలు జరుపుతున్నట్లుగా ఉంది. బీజేపీ పక్షంలోకి వస్తే మంత్రి పదవితోపాటు మరిన్ని లాభాలు కల్పిస్తామని, స్పీకర్ సైతం వస్తే రూ.50 కోట్లు ఇస్తామన్నట్లుగా ఆడియోలో ఉంది. ఆ ఆడియోను లేబొరేటరీకి పంపి అందులోని వాయిస్ ఎవరిదో తేలుస్తామన్నారు. జేడీఎస్ ఎమ్మెల్యేను ప్రలోభపెట్టే క్రమంలో తన పేరు ప్రస్తావనకు రావడంపై స్పీకర్ రమేశ్ కుమార్ స్పందించారు. ఆ ఆడియో క్లిప్‌పై విచారణ చేయించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అందులో ఎవరు ఎవరితో మాట్లాడుతున్నదీ స్పష్టంగా లేనప్పటికీ ఇది చాలా తీవ్రమైన అంశమన్నారు. ఆ క్లిప్పులో జడ్జీల పేర్లు, ప్రధాని మోదీతోపాటు బీజేపీ చీఫ్ అమిత్‌ల పేర్లు ప్రస్తావనకు వచ్చాయని వివరించారు. సీఎం కుమారస్వామి చేసిన ఆరోపణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప కొట్టిపారేశారు. కాగా, సీఎల్పీ సమావేశానికి గైర్హాజరైన తమ నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. బుధవారం నుంచి మొదలైన బడ్జెట్ సమావేశాలకు హాజరుకాని రమేశ్ జర్కిహోలి, ఉమేశ్ జాధవ్, మహేశ్ కుమతాలి, బి.నాగేంద్రలపై ఫిరాయింపుల చట్టం కింద చర్య తీసుకోనున్నట్లు సీఎల్పీ నేత సిద్ధరామయ్య వెల్లడించారు. -
‘మా ఎమ్మెల్యేకు బీజేపీ భారీ ఆఫర్ ఇచ్చింది’
సాక్షి, బెంగళూరు : కర్ణాటక బీజేపీ నేతలపై ముఖ్యమంత్రి కుమారస్వామి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉందని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆపరేషన్ కమల్ ఇంకా కొనసాగుతోందని ఆరోపించారు. గత రాత్రి తమ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి భారీ మొత్తంలో డబ్బును ఆఫర్ చేశారని తెలిపారు. ఎంత డబ్బు ఇస్తామన్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారని చెప్పారు. అయితే, బీజేపీ ఆఫర్‌ను తమ ఎమ్మెల్యే తిప్పికొట్టారని తెలిపారు. తనకు డబ్బు అవసరం లేదని, ఎలాంటి కానుకలు వద్దని.. ఇలాంటి చర్యలతో ప్రలోభపెట్టొద్దని బీజేపీ నేతలను తమ ఎమ్మెల్యే హెచ్చరించారని కుమారస్వామి తెలిపారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని.. డబ్బు ఎరచూపి తమ ఎమ్మెల్యేలను లొంగదీసుకోలేరని తేల్చి చెప్పారు. కాగా సీఎం కుమారస్వామి ఆరోపణలను బీజేపీ నేతలు ఖండించారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను తాము ఎలాంటి ప్రలోభాలకు గురిచేయలేదని చెప్పారు. ఆధారాలు ఉంటే కుమారస్వామి బయటపెట్టాలని సవాల్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప మాట్లాడుతూ.. ఇలాంటి ఆధారాలు లేని మాటలు సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ‘మేము ఆపరేషన్ కమలను నిలిపివేశాం. జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల అంతర్గత విభేదాల వల్ల కొంతమంది బయటకు వస్తున్నారు. విభేధాలు రాకుండా చూసుకోవడం ఆయన(కుమారస్వామి) విధి. ఇలాంటి ఆధారాలు లేని మాటలు మాట్లాడడం ఆయన ఆపాలి. మాకు 104 మంది ఎమ్మెల్యేలు, మరో ఇద్దరు స్వతంత్రులు కూడా తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. ఆరోపణలు వదలి పాలనపై దృష్టిపెట్టాలి’ అని విమర్శించారు. -
కుమార స్వామి సర్కార్‌ను కూలదోయం : యడ్యూరప్ప
సాక్షి, బెంగళూర్ : కుమార స్వామి నేతృత్వంలోని జేడీఎస్-కాంగ్రెస్ సర్కార్‌ను కూలదోసేందుకు తమ పార్టీ సభ్యులెవరూ ప్రయత్నించడం లేదని బీజేపీ కర్ణాటక చీఫ్ బీఎస్ యడ్యూరప్ప స్పష్టం చేశారు. కర్ణాటకలో పాలక సంకీర్ణం, బీజేపీల మధ్య అధికారం కోసం పోరు జరుగుతున్న క్రమంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడుతున్నారని ఇరు పక్షాలు పరస్పరం ఆరోపణలకు దిగుతున్న సంగతి తెలిసిందే. ముంబైలో ఉన్న పాలక సంకీర్ణ ఎమ్మెల్యేలను బీజేపీ ఎలాంటి ప్రలోభాలకు గురిచేయడంలేదని మాజీ సీఎం యడ్యూరప్ప పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో విఫలమైన కాంగ్రెస్-జేడీఎస్ తమపై చౌకబారు ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు తమ పార్టీ నేతలెవరూ ఎలాంటి ఆపరేషన్‌నూ చేపట్టడం లేదని పేర్కొన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఒక చోట చేరితే వారెందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్, జేడీఎస్‌లో అంతర్గత పోరు అదుపుతప్పిందని, వారి అంతర్గత వైఫల్యాలకు బీజేపీని నిందించడం తగదని యడ్యూరప్ప హితవు పలికారు. -
వీరుడి చుట్టూ.. వివాదాల గుట్టు
సాక్షి, బెంగళూరు : మైసూర్ పులిగా పిలవబడే టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలపై కర్ణాటకలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. జేడీఎస్ చీఫ్, కర్ణాటక సీఎం కుమారస్వామి ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నవంబర్ 10న రాష్ట్ర వ్యాప్తంగా టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలోని ముస్లింలను ఆకట్టుకునేందుకే జేడీఎస్-కాంగ్రెస్ టిప్పు ఉత్సవాలను నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల తరుణంలో ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ కొత్తనాటకానికి తెరలేపిందని అన్నారు. టిప్పు పాలనలో హిందూవులను చిత్రహింసలకు గురిచేశారని, ఆయనను యాంటీ హిందూపాలకుడిగా బీజేపీ వర్ణించింది. యడ్యూరప్ప వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ఖండించారు. 18వ శతాబ్దంలో బ్రిటీష్ వారిని ఎదురించిన గొప్ప పోరాడయోధుడు టిప్పుసుల్తానని, అలాంటి వ్యక్తి జయంతి ఉత్సవాలను జరుపుకోవడంలో తప్పేమీ లేదని వివరించారు. పోరాటయోధులను బీజేపీ ఎప్పుడూ గౌరవించలేదని.. టిప్పుపై రాజకీయం ఆరోపణలు చేయడం సమంజసం కాదని శివకుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో హిందూ-ముస్లింల మధ్య విభేదాలు సృష్టించాలనే ఏజెండాతో బీజేపీ ఈ ఆరోపణలకు దిగిందని అన్నారు. టిప్పు ఉత్సవాలను నిర్వహించడంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గతంలో అభినందిచినట్లు ఆయన గుర్తుచేశారు. గతంలో కర్ణాకట అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా టిప్పుపై వివాదం రేగింది. ప్రతి ఏడాది టిప్పు జయంతి, వర్థింతి వేడుకల సమయంలో రాజకీయంగా దుమారంరేగడం కన్నడలో సాధారణంగా మారిపోయింది. కాగా బ్రిటిష్ హయాంలో మైసూర్ పాలకుడిగా ఉన్న టిప్పు సుల్తాన్ వారితో వీరోచితంగా పోరాడి 1799 మే 4న 49 ఏళ్ల వయస్సులో వీరమరణం పొందారు. ముఖ్యంగా యుద్దంలో అనుసరించాల్సిన వ్యూహాలను రచించడంతో టిప్పును దిట్టగా చరిత్రకారులు వర్ణిస్తారు. ఆధునిక చరిత్రలో యుద్దంలో తొలిసారిగా రాకెట్లను ఉపయోగించిన ఘనత టిప్పు సుల్తాన్‌కే దక్కుతుందని ఇటీవల శాస్త్రవేత్తలు వెల్లడించిన విషయం తెలిసిందే. -
విజయం మాదే : యడ్యూరప్ప
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మూడు లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. బళ్లారి, శివమొగ్గ, మండ్య లోక్‌సభ స్థానాలలో పోలింగ్ కొనసాగుతోంది. రామనగరం, జమ్ఖండి అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమయింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుంది. బీజేపీదే విజయం : యడ్యూరప్ప ఉపఎన్నికల్లో తన కూమారుడు బీఎస్ రాఘవేంద్ర భారీ విజయం సాధిస్తాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. 101 శాతం శివమొగ్గ నుంచి రాఘవేంద్ర విజయం తథ్యమన్నారు. బళ్లారిలో భారీ మెజారిటీతో గెలుస్తామన్నారు. అన్ని స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు. అందరి దృష్టి బళ్లారిపైనే ఐదు స్థానాల కంటే బళ్లారి లోక్‌సభ ఉపఎన్నికపైనే అందరి దృష్టి ఉంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ నువ్వా..నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. అధికార కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్రప్పకు మద్దతుగా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు. బీజేపీ తరుపున పోటీ చేస్తున్న జే. శాంతకు మద్దతుగా ఆయన సోదరుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు బీ. శ్రీరాములు జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేశారు. రెండూ పార్టీలు ఇక్కడ తమదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. -
కాంగ్రెస్ నేతలు టచ్‌లో ఉన్నారు
సాక్షి బెంగళూరు: కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చాలనే ఉద్దేశం తమకు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప అన్నారు. అయితే కాంగ్రెస్‌లోని చాలామంది సీనియర్ నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఆదివారం నగరంలోని డాలర్స్ కాలనీలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు ఆరోపించడం తగదన్నారు. ఆ రెండు పార్టీల నేతల మధ్య సమన్వయం కొరవడిందని, ప్రభుత్వంపై వారికి నమ్మకం లేక తమపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికలకు తాముసిద్ధమవుతున్నట్లు యడ్డి చెప్పారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక తదితర కసరత్తులు చేపట్టినట్లు చెప్పారు. అంతే కానీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఉద్దేశంతో తాము సమావేశాలు నిర్వహించలేదని అన్నారు. తమ పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయించామన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థుల స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తామన్నారు. బీజేపీ ప్రలోభాలకు లొంగవద్దు: కుమారస్వామి ఆపరేషన్ కమల్ పేరుతో అధికార పక్షంలోని కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోందని సీఎం కుమారస్వామి ఆదివారం బెంగళూరులో ఆరోపించారు. అయితే అధికార పక్షంలోని ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీ ప్రలోభాలకు లొంగవద్దని కోరారు. ఈ మేరకు ఆయన అధికార పార్టీల ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. బీజేపీ చేస్తున్న ఆరోపణల గురించి పట్టించుకోవద్దని చెప్పారు. మంత్రి డీకే శివకుమార్‌పై ఈడీ, ఎఫ్ఐఆర్ తదితర కేసులు నమోదు చేస్తున్నారన్నారు. అయితే ఇదే సమావేశంలో నామినేటెడ్ పోస్టుల నియామకం, కేబినెట్ విస్తరణ తదితర విషయాల గురించి కూడా చర్చించినట్లు సమాచారం. -
దీన్నేమంటారు ?
బొమ్మనహళ్లి : రాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి రేవణ్ణ కొడగులో వరద బాధితులకు బిస్కెట్ పాకెట్లను విసిరివేయడం తప్పని చెబుతున్న బీజేపీ నాయకులు మాజీ సీఎం యడ్యూరప్ప తన పుట్టిన రోజున కేక్ కట్ చేసి చాకుతో విద్యార్థులకు కేక్ తినిపించడాన్ని ఏమనాలని జేడీఎస్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు వారు సోషల్ మీడియాలో యడ్యూరప్ప చాకుతో ఓ విద్యార్థికి కేక్ తినిపిస్తున్న ఫొటో పెట్టడంతో అది వైరల్‌గా మారింది. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న యడ్యూరప్ప ఇటీవల పేదల మధ్య తన పుట్టిన రోజును జరుపుకొని వారికి కేక్ చేత్తో తినిపించకుండా చాకుతో తినిపించడాన్ని వారు తీవ్రంగా తప్పుబడుతున్నారు. -
రాష్ట్ర విభజనకు మద్దతివ్వం ..
సాక్షి బెంగళూరు: ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్ర విభజనకు తాము ఒప్పుకోబోమని, అయితే ప్రయోజనాల సాధనకు మద్దతిస్తాం అని పార్టీ రాష్ట్రాధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. బెంగళూరులో పార్టీ కార్యాలయంలో శనివారం బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితి, ఉత్తర, దక్షిణ కర్ణాటక విభజన, సీఎం కుమారస్వామి పాలనపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. కుమారస్వామి కర్ణాటక మొత్తానికి ముఖ్యమంత్రి అని, కానీ ఆయన మాత్రం 37 నియోజకవర్గాలకు మాత్రమే సీఎంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం విడిపోతే భవిష్యత్ తరాలు కుమారస్వామిని క్షమించవని అన్నారు. సీఎం కుమారస్వామి కుటుంబం కేవలం ఉత్తర కర్ణాటకను మాత్రమే కాదు, రాష్ట్రం మొత్తాన్ని నాశనం చేసిందని విమర్శించారు. 75 ఏళ్ల సీనియర్ నాయకుడిగా ఏ కారణంతోనూ రాష్ట్రం విడిపోవడానికి తాను ఒప్పుకోనని యడ్డి చెప్పారు. ఆగస్టు రెండో తేదీన ఉత్తర కర్ణాటక పోరాట సమితి పిలుపుని చ్చిన ఉత్తర కర్ణాటక బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. బడ్జెట్లో ఉత్తరకు అన్యాయం కుమారస్వామి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉత్తర కర్ణాటకకు అన్యాయం జరిగిందని యడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తరహాలో ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకురావాలని కొందరు చూస్తున్నారని విమర్శించారు. అలాగే ఈ నెలాఖరులో వాటాల్ నాగారాజు ఆధ్వర్యంలో జరిగే కర్ణాటక బంద్‌కు కూడా మద్దతిస్తామని చెప్పారు. ఈ బంద్‌లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రుణమాఫీ ప్రకటించారనే కానీ ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి అడుగులు వేయలేదని చెప్పారు. కాగా, ఆగస్టు 9 నుంచి మూడు బృందాలుగా విడిపోయి రాష్ట్ర బీజేపీ నేతలందరూ రాష్ట్ర పర్యటన చేస్తారని తెలిపారు. తొలి బృందంలో తాను, గోవింద కారజోళ, శోభ కరంద్లాజే, రెండో బృందంలో ఆర్.అశోక్, అరవింద్ లింబావళి, జగదీశ్ శెట్టర్, మూడో బృందంలో కేఎస్ ఈశ్వరప్ప, సీటీ రవి, లక్ష్మణ సవదిలు ఉంటారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సాధనలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. 22 ఎంపీ సీట్లు గెలుస్తాం తమ సమావేశంలో లోక్‌సభ ఎన్నికలపై చర్చించాం, అభ్యర్థుల ఎంపిక చర్చకు రాలేదని తెలిపారు. ప్రధాని మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో 28 లోక్‌సభ స్థానాలకు 22– 23 స్థానాలు కచ్చితంగా గెలుచుకోగలుగుతామని జోస్యం చెప్పారు. ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం కోసం శ్రీరాములు డిమాండ్ చేయడం లేదని, కేవలం ఉత్తర కర్ణాటక అభివృద్ధి కోసమే ఆయన ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ఏ కారణంతోనూ రాష్ట్రం విడిపోవడానికి బీజేపీ మద్దతివ్వదని చెప్పారు. మీడియా ప్రతినిధులను విధానసౌధలోకి రానివ్వనని సీఎం అనడం సమంజసం కాదని అన్నారు. మీడియాను నిర్బంధించడం మంచి పరిణామం కాదని చెప్పారు. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటన జరగలేదని తెలిపారు. -
షాకిచ్చిన ప్రభుత్వం.. హుందాగా మాజీ సీఎం!
సాక్షి, బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్పకు హెచ్డీ కుమారస్వామి కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. అయితే యెడ్డీ మాత్రం చాలా హుందాగా వ్యవహరించి తన గౌరవాన్ని కాపాడుకున్నారని తెలుస్తోంది. సీఎంగా ఉన్న సమయంలో యడ్యూరప్ప రేస్‌కోర్స్ రోడ్డులోని నంబర్2 ఇంట్లో ఉండేవారు. అయితే కొన్ని రోజుల కిందట ప్రతిపక్షనేతగా తనకు ఆ ఇంటిని తిరిగి కేటాయించాలని కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తిచేశారు. కానీ కుమారస్వామి ప్రభుత్వం యెడ్డీకి అదే రోడ్డులోని నంబర్ 4 ఇంటిని కేటాయించింది. బీజేపీ నేత అడిగిన ఇంట్లో ప్రస్తుతం మంత్రి మహేష్ ఉంటున్నారు. దీంతో యెడ్డీకి వేరే ఇంటిని ఇవ్వగా అందుకు ఆయన నిరాకరించారు. దీనిపై మాజీ సీఎం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ.. ‘మిత్రులారా.. నేను ఆ ఇంటిని కేటాయించాలని చాలాకాలం కిందటే కోరాను. కానీ నాకు అందుకు అవకాశం ఇవ్వలేదు. నా సొంత ఇంట్లోనే ఉంటాను. ప్రస్తుతం నాకు కేటాయించిన నంబర్ 4 ఇంటిని వేరే నేతకు కేటాయిస్తే ప్రయోజనం ఉంటుంది. దీనిపై ఇంతకంటే ఎక్కువ విషయాలు చెప్పదలుచుకోలేదు’ అని చెప్పారు. ప్రతిపక్షనేతగా తనను గౌరవం ఇచ్చేందుకైనా గతంలో ఉన్న ఇంటిని కర్ణాటక ప్రభుత్వం తనకు కేటాయిస్తుందని యడ్యూరప్ప ఎన్నో ఆశలు పెట్టుకున్నారని సమాచారం. బంగ్లా కేటాయింపు వివాదంపై సీఎం కుమారస్వామి స్పందిస్తూ.. యడ్యూరప్పకు ఓ నివాసాన్ని కేటాయించాం. కచ్చితంగా ఆయన బంగ్లానే కేటాయించాలంటే కష్టం. చాలామంది మంత్రులు అదే ఇంటిని అడుగుతున్నారు. ఒకరికి ఆ ఇంటిని కేటాయించామని’ వివరించారు. -
కావేరి బోర్డుపై న్యాయ పోరాటం
సాక్షి బెంగళూరు: కావేరి నది నీటి నిర్వహణ బోర్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయాలని కర్ణాటక సర్కారు నిర్ణయించింది. సీఎం కుమారస్వామి ఆధ్వర్యంలో శనివారం విధానసౌధలో జరిగిన అఖిలపక్ష భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జూలై 2న జరిగే బోర్డు సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఇద్దరు సీనియర్ అధికారులు కర్ణాటక తరఫు వాదనలు వినిపించాలని తీర్మానించారు. అన్ని పార్టీల ఎంపీలు ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని నిర్ణయించారు. సమావేశంలో అన్ని పార్టీల నేతలతో పాటు కేంద్రమంత్రులు సదానందగౌడ, అనంత్‌కుమార్ పాల్గొన్నారు. భేటీ అనంతరం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డీకే శివకుమార్ మాట్లాడారు. ‘కావేరీ నిర్వహణ ప్రాధికార సంస్థ, నియంత్రణ కమిటీలను కేంద్రం ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో బోర్డును హడావుడిగా నియమించాల్సిన అవసరం లేదని మాత్రమే మేం చెబుతున్నాం’ అని పేర్కొన్నారు. జూలై 2న జరిగే బోర్డు సమావేశంలో కర్ణాటక ప్రతినిధులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ వాదనలను, రైతుల నీటి కష్టాలను వివరిస్తారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై తమ న్యాయ నిపుణులు మోహన్ కటార్కి, ఫాలి నారిమన్, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తారని వెల్లడించారు. ఈ భేటీలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప పాల్గొన్నారు. -
బెంగళూరుపై కాంగ్రెస్ పట్టు; యడ్డీ అప్సెట్!
సాక్షి, బెంగళూరు: దశాబ్దకాలం తర్వాత భారత ఐటీ రాజధాని బెంగళూరు నగరంపై కాంగ్రెస్ పార్టీ తిరిగి గట్టి పట్టు సాధించినట్లైంది. బుధవారం వెల్లడైన ఫలితాల్లో జయనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్య రెడ్డి గెలుపొందడంతో సిటీలో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 16కు పెరిగింది. బెంగళూరు నగర పరిధిలో మొత్తం 28 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, బీజేపీ 11 సీట్లు మాత్రమే దక్కించుకోగలిగింది.. అందునా ఐదు చోట్ల బొటాబొటి మెజారిటీతో గట్టెక్కింది. బీజేపీకి ఓటు బ్యాంకు అధికంగా ఉండే నగర, పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి తారుమారు అవుతున్నదనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని, 2019లో బెంగళూరులోని అన్ని లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. 70 శాతం మంది మిడిల్ క్లాసే! : దక్షిణ బెంగళూరులోని జయనగర్ నియోజకవర్గంలో 70 శాతం మంది మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారున్నారు. అంతకుముందు కాంగ్రెస్‌కు కంచుకోటలా ఉన్న జయనగర్ స్థానంలో 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి కూడా అయిన విజయ్‌కుమార్ అకస్మిక మరణంతో ఇక్కడ మే 12న జరగాల్సిన ఎన్నిక జూన్ 11కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. గడిచిన పదేళ్లుగా జయగనర్‌లో బీజేపీదే ఆధిక్యం. గతంలో ఇక్కడి నుంచి నాలుగుసార్లు గెలుపొంది, డీలిమిటేషన్ తర్వాత వేరే స్థానానికి వెళ్లిపోయిన కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్. రామలింగారెడ్డి.. ఈ దఫా జయనగర్ నుంచి తన కూతురు సౌమ్య రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. ఇప్పటికే జేడీయూ-కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన దరిమిలా మిత్రపక్షాలకు చెందిన పెద్ద నాయకులెవరూ ప్రచారానికి రాలేదు. దీంతో రామలింగారెడ్డే అంతా తానై వ్యవహరించారు. బీజేపీ అభ్యర్థి బీఎన్ ప్రహ్లాద్(దివంగత విజయ్‌కుమార్ సోదరుడు)పై కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్య రెడ్డి 2,889 ఓట్ల వెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్‌కు 54,457 ఓట్లు నమోదవ్వగా.. బీజేపీకి 51,568 ఓట్లు వచ్చాయి. యడ్యూరప్ప కస్సుబుస్సు: జయనగర్‌లో పార్టీ ఓటమిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం యడ్యూరప్ప తీవ్రఅసహనానికి గురయ్యారు. మీడియాతో మాట్లాడకుండా ముఖంచాటేశారు. జయనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి అనంతకుమార్ వల్లే పార్టీ ఓడిపోయిందని యడ్డీ తన అనుచరులతో అన్నట్లు సమాచారం. ప్రచార బాధ్యతలు తీసకున్న అనంతకుమార్.. స్థానిక నాయకత్వాన్ని పట్టించుకోకుండా ఇష్టారీతిగా వ్యవహరించారని, ఎగువ మధ్యతరగతి ఓట్లు అధికంగా ఉన్న జయనగర్‌లో బీజేపీ సునాయాసంగా గెలుస్తుందని భావించినా, చేదు ఫలితాన్ని చవిచూడాల్సి వచ్చిందని యడ్డీ కస్సుబుస్సులాడినట్లు తెలిసింది. -
యడ్యూరప్పపై ఏసీబీకి ఫిర్యాదు
సాక్షి, బెంగుళూరు : ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కర్ణాటక భారతీయ జనతా పార్టీ(బీజేపీ) శాసనసభా పక్ష నేత యడ్యూరప్ప ప్రయత్నించారంటూ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ గురువారం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి ఫిర్యాదు చేసింది. యడ్యూరప్పతో పాటు మరో ఐదుగురు బీజేపీ నాయకులు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు లంచం ఇచ్చి కొనుగోలు చేసేందుకు యత్నించారని ఫిర్యాదులో పేర్కొంది. బల నిరూపణ సమయంలో ఈ తతంగం నడిచిందని వివరించింది. బీజేపీ నాయకులు బేరసారాలు సాగించిన ఆడియో టేపులను ఇందుకు ఆధారాలుగా సమర్పించింది. కాగా, బల నిరూపణకు ముందు బీజేపీ నేతలకు సంబంధించిన ఆడియో టేపులను విడుదల చేసిన కాంగ్రెస్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, బీజేపీ ఆ టేపులు నకిలీవని, తమ గొంతులను మిమిక్రీ చేసి రికార్డు చేశారని ఆరోపించింది. కాగా, కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఫిర్యాదుపై ఏసీబీ ఇప్పటివరకూ కేసు నమోదు చేయలేదు. యడ్యూరప్ప, ఆయన తనయుడు విజయేంద్ర, బీజేపీ కర్ణాటక ఇంచార్జ్ మురళీధర్ రావు, గాలి జనార్ధన్ రెడ్డి, బీ శ్రీరాములు, బీజే పుట్టస్వాములు ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించారని ఫిర్యాదులో కాంగ్రెస్ పేర్కొంది. -
అతి తక్కువ కాలం సీఎంలు వీరే!
సాక్షి, హైదరాబాద్: చివరివరకూ ఉత్కంఠ భరితంగా సాగిన కర్ణాటక రాజకీయాలకు క్లైమాక్స్‌లో బీజేపీ నేత యడ్యూరప్ప అనూహ్య ట్విస్ట్ ఇచ్చారు. కేవలం మూడు రోజుల వ్యవధిలో సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసందే. అనంతరం గవర్నర్ వజుభాయ్ వాలాకు రాజీనామా లేఖ సమర్పించారు. తద్వారా భారతదేశ ముఖ్యమంత్రులలో అతి తక్కువ రోజులు సీఎంగా ఉన్న ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేత జగదాంబికా పాల్ సరసన చేరారు. ఈ నెల 17న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప 19న (శనివారం) రాజీనామా చేసిన విషయం తెలిసిందే. భారతదేశ రాజకీయాల్లో గతంలో కొన్ని పార్టీల నేతలు రాజకీయ సంక్షోభాల కారణంగా పదవి నుంచి తప్పుకున్నారు. విశ్వాస పరీక్షలో నెగ్గకపోవడం, ఇతర పార్టీల మద్దతు లభించకపోవడంతో పలువురు ముఖ్యమంత్రులు రాజీనామాలు చేశారు. అతి తక్కువ రోజులు సీఎంగా చేసిన నేతలు వీరే.... 1) జగదాంబికా పాల్ (ఉత్తర ప్రదేశ్) : మూడో రోజు రాజీనామా (1998లో ఫిబ్రవరి 21 నుంచి 23వరకు) 2)యడ్యూరప్ప (కర్ణాటక) : మూడో రోజు రాజీనామా (2018లో మే 17 నుంచి 19వరకు (58 గంటల పాటు)) 3)సతీశ్ ప్రసాద్ సింగ్ (బిహార్) : ఐదో రోజు రాజీనామా (1968లో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1వరకు) 4)ఓం ప్రకాష్ చౌతాలా (హరియాణా) : 6వ రోజు రాజీనామా (1990లో జులై 12 నుంచి 17వరకు) 5)నితీష్ కుమార్ (బిహార్) : 8వ రోజు రాజీనామా (2000లో మార్చి 3 నుంచి 10వరకు) 6)యడ్యూరప్ప (కర్ణాటక) : 8వ రోజు రాజీనామా (2007లో నవంబర్ 12 నుంచి 19వరకు) 7)ఎస్.సీ మరాక్ (మేఘాలయ) : 12వ రోజు రాజీనామా (1998లో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 10వరకు) 8)ఓం ప్రకాష్ చౌతాలా (హరియాణా) : 17వ రోజు రాజీనామా (1991లో మార్చి 21 నుంచి ఏప్రిల్ 6వరకు) 9)జానకీ రామచంద్రన్ (తమిళనాడు) : 24వ రోజు రాజీనామా (1988లో జనవరి 7 నుంచి 30వరకు) 10)బీపీ మండల్ (బిహార్) : 31 రోజులు (1968లో ఫిబ్రవరి 1 నుంచి మార్చి 2వరకు) -
యెడ్డీ రాజీనామా : సోషల్ మీడియా పేలిపోతోంది
బెంగళూరు : కర్ణాటక సీఎం పదవి యడ్యూరప్పకు మూణ్నాళ్ల ముచ్చటగానే నిలిచిపోయింది. అసెంబ్లీలో బలం నెగ్గించుకోలేమని ముందుస్తుగా అర్థమైపోయి, బీజేపీ ముందుగానే చేతులెత్తేసింది. తమకు బలం లేదంటూ ఒప్పేసుకుని సీఎంగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి, యడ్యూరప్ప అక్కడి నుంచి బయటికి వచ్చేశారు. దీంతో ఇన్నిరోజుల నుంచి నడిచిన హైడ్రామాకు చెక్ పడింది. ఫలితాల ప్రకటన నుంచి నేటి వరకు కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుపై సోషల్ మీడియా చాలా చురుగ్గా స్పందిస్తూ వచ్చింది. తాజాగా యడ్యూరప్ప రాజీనామాపై కూడా సోషల్ మీడియా తనదైన శైలిలో జోకులు పేలుతోంది. ఆ జోకులు ఏ విధంగా ఉన్నాయో మీరే ఓసారి చూడండి... #karnataka cm #Yeddyurappa resign his cm post. #NoTrustVote in #KarnatakaAssembly. #KarnatakaFloorTest #southkicksbjp #Kumaraswamy #DemocracySaved #VidhanSoudha #Congress #jds #RahulGandhi #modi @PhoenixTamil pic.twitter.com/hm7LSywEDo — Phoenix Tamil (@PhoenixTamil) May 19, 2018 #Yeddyurappa resign his cm post. He said we will work for the people of #Karnataka. No trust vote in assembly. #CongressWin #Kumaraswamy will be the cm of kN. #KarnatakaFloorTest #KarnatakaCMRace #FloorTest #KarnatakaVerdict #Siddaramaiah #VidhanaSoudha @PhoenixTamil pic.twitter.com/nV1cLzRird — Phoenix Tamil (@PhoenixTamil) May 19, 2018 BJP’s Yeddyurappa resigns as chief minister ahead of #KarnatakaFloorTest pic.twitter.com/YHDfkcUcHC — Dhaval Maraskolhe (@Dhaval750) May 19, 2018 BJP in SouthIndia #KarnatakaFloorTest 😂😂 pic.twitter.com/PrUx96z3Ct — Sonia Arunkumar (@rajakumaari) May 19, 2018 -
యడ్యూరప్ప మూడో 'సారీ'..
సాక్షి, బెంగుళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి పదవి కోసం యడ్యూరప్ప చివరి వరకూ విశ్వప్రయత్నం చేస్తూ వచ్చారు. అయితే సీఎం కుర్చీ ఆయనకు ఏ మాత్రం కలిసి రానట్టే ఉంది. కర్ణాటకలో చక్రం తిప్పుదామనుకున్న ప్రతిసారి ఆయన్ను విధి వెక్కిరించింది. పూర్తిస్థాయిలో ప్రజలను పాలించే అదృష్టం యడ్డీకి ఏమాత్రం కలగలేదు. అధికారంలో ఐదేళ్లు ఉండాలని ఆయన ఈరోజు వరకూ గజినీ మహ్మద్ తరహాలో దండయాత్ర చేస్తూనే ఉన్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రి కుర్చీ అందినట్టే అంది చేజారి పోయింది. 2007 నవంబర్ 12న యడ్యూరప్ప తొలిసారి సీఎం కుర్చీ అధిష్టించారు. అయితే ఆ ఆనందం పట్టుమని పదిరోజులు కూడా మిగల్లేదు. కేవలం 8 రోజులు మాత్రమే ఆయన సీఎంగా కొనసాగారు. అయితే పలు వివాదాలు చెలరేగిన నేపథ్యంలో నవంబర్ 12న ఆయన పదవి నుంచి దిగిపోయారు. అనంతరం అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి పాలన అనంతరం 2008 మే 30న మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈ సారి దాదాపు మూడేళ్ల, రెండు నెలల రెండు రోజులు పాటు పదవిలో కొనసాగారు. కుదురుగా ఐదేళ్లు పరిపాలన అందిస్తారనుకున్న సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో 2011 జులై 31న యడ్యూరప్ప రాజీనామా చేశారు. చివరగా 2018లో జరిగిన ఈ ఎన్నికల్లో 104 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద మెజారిటీ పార్టీగా అవతరించింది. దీంతో గవర్నర్ వజుభాయ్ వాలా ఆయన్ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 111 సీట్లు లేవంటూ కాంగ్రెస్, జేడీఎస్‌లు సుప్రీం కోర్టు తలుపు తట్టడంతో యడ్యూరప్పకు ఎదురుదెబ్బ తగిలింది. నేడు (శనివారం) విశ్వాస పరీక్ష పెట్టకముందే తన సీఎం పదవికి రాజీనామా చేశారు అయితే తగిన సంఖ్యాబలం లేని కారణంగా ఆయన మూడో సారి తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఆయన అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి 55 గంటలు మాత్రమే సీఎంగా విధులు నిర్వర్తించారు. ఏడుగురు సభ్యులు బీజేపీలో చేరి ఉంటే యడ్యూరప్ప సీఎంగా కొనసాగేవారు. -
అయ్యో.. యడ్యూరప్ప!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తన పదవికి సీఎం బీఎస్ యడ్యూరప్ప రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అసెంబ్లీలో విశ్వాసపరీక్షకు ముందే ప్రకటన చేసి ట్విస్ట్ ఇచ్చారు. సభ వాయిదా పడిన యడ్యూరప్ప రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పించారు. దీంతో మూణ్నాళ్ల ముచ్చటగానే యడ్యూరప్ప ప్రభుత్వం ముగిసింది. కేవలం మూడు రోజుల్లోనే.. అంటే 58 గంటల్లోనే యడ్యూరప్ప సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేకపోయామని గ్రహించిన యడ్యూరప్ప సభలో ఉద్వేగభరితంగా ప్రసంగించారు. మరోవైపు సీఎం రాజీనామాతో ప్రజాస్వామ్యం నెగ్గిందంటూ కాంగ్రెస్-జేడీఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. గతంలోనూ యెడ్డీ ఇలాగే.. 2007లో నవంబర్ 12న సీఎంగా బాధ్యతలు చేపట్టిన యడ్యూరప్ప కేవలం 8 రోజులపాటు పదవిలో కొనసాగి అదే నెల 19న రాజీనామా చేశారు. 2008-2011లో మూడేళ్లపాటు యడ్యూరప్ప సీఎంగా కొనసాగారు. కీలకంగా మారిన సుప్రీంకోర్టు తీర్పు ఏ పార్టీ మెజార్టీ సాధించని పక్షంలో అత్యధిక సీట్లు 104 గెలుపొందిన బీజేపీ వైపు గవర్నర్ వజుభాయ్ వాలా మొగ్గు చూపారు. గురువారం రాత్రి యడ్యూరప్పతో సీఎంగా ప్రమాణం స్వీకరించి.. బలపరీక్షకు 15 రోజుల గడువిచ్చారు. అయితే కాంగ్రెస్-జేడీఎస్ పిటిషన్‌ను శుక్రవారం విచారించిన సుప్రీంకోర్టు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు కర్ణాటక అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని బీజేపీని ఆదేశించిన విషయం తెలిసిందే. తక్కువ సమయం దొరకడంతో బీజేపీ నేతలు ‘ఆపరేషన్ కమలం’ ను విజయవంతం చేసుకోలేకపోయారు. జగదాంబిక పాల్‌ను మర్చిపోలేం! గతంలోనూ ఇలాంటి పరిస్థితుల్లోనే కొన్ని రాష్ట్రాలు న్యాయం కోసం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది 1998లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఏర్పాటు ఘటన. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేత జగదాంబిక పాల్ ఫిబ్రవరి21న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే మూడు రోజుల్లోనే ఫిబ్రవరి 23న ఆ ప్రభుత్వం కుప్పకూలింది. ఒక్క రోజు సీఎంగా ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికీ జగదాంబిక పాల్‌ను స్థానికులు చెప్పుకుంటుంటారు. ఎన్నికల్లో మెజారిటీ సాధించిన బీజేపీ నేత కళ్యాణ్ సింగ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించకపోవడం అప్పట్లో యూపీలో వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటుకు జగదాంబిక పాల్‌ను ఆహ్వానించిన గవర్నర్ రోమేష్ భండారీ బల నిరూపణ చేసుకోవాలని సూచించారు. విశ్వాస పరీక్ష సమయంలో అసెంబ్లీలో హింస చెలరేగి రక్తపాతం జరగడంతో రాష్ట్రపతి పాలన విధించాలని భండారీ కేంద్రానికి సూచించారు. చివరికి ఇతర పార్టీల మద్దతుతో కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. -
బలపరీక్షలో ఓడిపోయాం: యడ్యూరప్ప
సాక్షి, బెంగళూరు: బలపరీక్ష సందర్భంగా కర్ణాటక అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓటింగ్ జరుగడానికి ముందే బీజేపీ ఓటమిని అంగీకరించింది. వాయిదా అనంతరం మధ్యాహ్నం 3:30కు ప్రారంభమైన సభలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప బలపరీక్ష తీర్మానంపై ప్రసంగిస్తూ.. మా దగ్గర 104 మంది ఎమ్మెల్యేల మాత్రమే ఉన్నారు కాబట్టి బలపరీక్షలో విఫలమయ్యామని చెప్పారు. ఈ సందర్భంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ఇది నిజంగా అగ్నిపరీక్ష. ఇలాంటి పరీక్షలు ఎన్నో నా జీవితంలో ఎదుర్కొన్నాను. గతంలో రాష్ట్రం కోసం ఎంతో చేశాను. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టంకట్టారు. కాంగ్రెస్, జేడీఎస్‌లను ఓటర్లు విశ్వసించలేదు. కానీ ఇవాళ వారు అపవిత్రపొత్తుతో ముందుకొచ్చారు. అవును. మాదగ్గర 104 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కాబట్టి బలపరీక్షలో మేం విఫలమయ్యాం అని చెప్పడానికి చింతిస్తున్నాం. అయితే నా ఆఖరి శ్వాస వరకు రాష్ట్రం కోసం పాటుపడతా. 2019లో 28కి 28 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటాం’’ అని యడ్యూరప్ప చెప్పారు. అనంతరం ఆయన తన సీఎం పదవికి రాజనీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 222 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాలు, కాంగ్రెస 78, జేడీఎస్ 38, బీఎస్పీ 1, ఇతరులు 2 సీట్లను గెలుచుకోవడం, అతిపెద్ద పార్టీ అయిన కారణంగా బీజేపీనే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడం, ఆ వెంటనే యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం లాంటి పరిణామాలు చకచక జరిగిపోయాయి. సరిగ్గా 60 గంటలు కూడా గడవకముందే యడ్డీ బలపరీక్షలో ఓటమిని అంగీకరిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారు. -
కర్ణాటక అప్డేట్స్: గవర్నర్‌తో కుమారస్వామి భేటీ
సాక్షి, బెంగళూరు : తీవ్ర ఉత్కంఠభరిత పరిణామాల నడుమ విశ్వాసపరీక్షకు ముందే ముఖ్యమంత్రి పదవికి బీఎస్ యడ్యూరప్ప రాజీనామా చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 104 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ.. తమకు తగినంత మెజారిటీ రాకపోవడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. దీంతో కర్ణాటక అసెంబ్లీలో బలనిరూపణ జరగకముందే ఆయన తప్పుకున్నట్టయింది. 55 గంటలపాటు సీఎంగా ఉన్న యెడ్డీ.. నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా సమర్పించారు. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై లైవ్ అప్డేట్స్ ఇవి.. లైవ్ అప్డేట్స్: రాజ్‌భవన్‌కు చేరుకున్న కుమారస్వామి. గవర్నర్‌తో భేటీ అయిన కుమారస్వామి. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు సాయంత్రం 7.30 గంటలకు గవర్నర్ వజుభాయ్ వాలాను కలువనున్న కుమారస్వామి.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేయనున్న కుమారస్వామి.. కాంగ్రెస్-జేడీఎస్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం.. మంత్రిమండలి కూర్పును సిద్ధం చేస్తున్న ఇరుపార్టీల నేతలు యడ్యూరప్ప రాజీనామాతో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్న కుమారస్వామి.. గవర్నర్ ఆహ్వానం కోసం ఎదురుచూస్తున్నాం.. పిలుపు అందగానే ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్‌ను కలుస్తాం: జేడీఎస్ ఎల్పీ నేత కుమారస్వామి గవర్నర్ వజుభాయ్ వాలాకు రాజీనామా లేఖ సమర్పించిన యడ్యూరప్ప యడ్యూరప్పతో పాటు ఇతర బీజేపీ నేతలు కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారన్న గులాం నబీ ఆజాద్. కొందరు ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసే యత్నం కూడా జరిగిందని ఆరోపణలు. రాజ్‌భవన్‌కు చేరుకున్న యడ్యూరప్ప. గవర్నర్ వజుభాయ్ వాలాతో భేటీ కానున్న యెడ్డీ. ప్రజాస్వామ్యం గెలిచిందంటూ నినాదాలు చేసిన కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు యడ్యూరప్ప రాజీనామా ప్రకటన అనంతరం వాయిదా పడిన కర్ణాటక అసెంబ్లీ భావోద్వేగంతో ప్రసంగిస్తూ సీఎం పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన యడ్యూరప్ప. గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖ సమర్పిస్తాని చెప్పిన యడ్యూరప్ప. విశ్వాసపరీక్షకు ముందే వెనక్కి తగ్గిన యెడ్డీ ప్రజాస్వామ్యంపై నాకు నమ్మకం ఉందన్నారు యడ్యూరప్ప. ప్రజలు మాకు అత్యధిక సీట్లు అప్పగించారు. కానీ కర్ణాటక ప్రజలకు సేవచేసే భాగ్యం కలగక పోవడం మా దురదృష్ణం. రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన సీఎం యడ్యూరప్ప ఆనంద్‌సింగ్‌తో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రొటెం స్పీకర్ బోపన్న. అనంతరం ఆనంద్ సింగ్ పక్కనే కూర్చున్న డీకే శివకుమార్ అసెంబ్లీ గ్యాలరీలో బీజేపీ, కాంగ్రెస్ ముఖ్య నేతలు. కాంగ్రెస్ నుంచి గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, గెహ్లాట్. బీజేపీ నుంచి సదానందగౌడ, అనంతకుమార్. వాయిదా అనంతరం 3:30 గంటలకు మళ్లీ ప్రారంభమైన కర్ణాటక అసెంబ్లీ. నేతలతో ప్రమాణ స్వీకారం చేస్తున్న ప్రొటెం స్పీకర్ బోపన్న అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ పాటిల్‌లతో కాంగ్రెస్ పార్టీ నేతల చర్చలు. ఆనంద్, ప్రతాప్‌లు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయరని అభిప్రాయపడ్డ శివకుమార్ గవర్నర్ వజుభాయ్ వాలను కలిసేందుకు రాజ్‌భవన్‌కు వెళ్లిన యడ్యూరప్ప. గవర్నర్‌తో సమావేశమైన యెడ్డీ. అయితే గవర్నర్‌ను కలిసే ముందు అమిత్ షాతో ఫోన్లో మాట్లాడిన యెడ్డీ. విశ్వాస పరీక్షకు ముందు కర్ణాటకలో బీజేపీలో జోరుగా మంతనాలు కాంగ్రెస్ మిస్సింగ్ ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్ గోల్డ్‌ఫించ్ హాటల్ నుంచి అసెంబ్లీకి బయలుదేరారు. ఆనంద్‌సింగ్ ఉదయం ప్రమాణ స్వీకారం సమయంలో కనిపించకుండా పోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్ అసెంబ్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ నేతలు డీకే సురేష్, దినేష్ గుండు రావుతో కలిసి భోజనం చేసిన ప్రతాప్ గౌడ ప్రతాప్ గౌడ పాటిల్ -
యడ్యూరప్ప బేరసారాలు వెలుగులోకి..!!
సాక్షి, బెంగళూరు : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శాసనసభా పక్ష నేత, కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి యడ్యూరప్ప కాంగ్రెస్ ఎమ్మెల్యేతో బేరసారాలు జరిపిన ఆడియో టేప్ సంచలనం రేపుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీసీ పాటిల్‌కు ఫోన్ చేసిన యడ్యూరప్ప బీజేపీకి మద్దతు తెలిపితే మంత్రి పదవి ఇస్తానని, అన్ని విధాలుగా అండగా ఉంటానని చెబుతున్న ఆడియో టేపును కాంగ్రెస్ పార్టీ బయటపెట్టింది. బల పరీక్షకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ బీజేపీ పెద్ద ఎత్తున ప్రలోభాలకు దిగుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. యడ్యూరప్ప తనయుడికి సంబంధించిన మరో టేపును కూడా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. కాగా, ఇప్పటివరకూ విపక్ష శిబిరం నుంచి మొత్తం 10 మందికి బీజేపీ గాలం వేసినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడుగురు, జేడీఎస్ నుంచి ఒకరు, ఇద్దరు ఇండిపెండెట్లను బీజేపీ తనవైపు ఆకర్షించిందని తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ, నారాయణరావు, రాజశేఖర్ పాటిల్, మహాతేజ, హోళగెరి, బయ్యాపూర్ అమెరగడలు, జేడీఎస్ నుంచి వెంకట రావ్ నడగడ, స్వతంత్రులు నరేష్, శంకర్లు ఇందులో ఉన్నట్లు సమాచారం. కాగా, ఇప్పటివరకూ ప్రొటెం స్పీకర్ 210 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు. మధ్యాహ్నం 03.30 గంటలకు అసెంబ్లీని వాయిదా వేశారు. దీంతో మిగతావారి ప్రమాణస్వీకారంపై ప్రతిష్టంభన నెలకొంది. -
ఎంపీ పదవులకు యడ్యూరప్ప, శ్రీరాములు రాజీనామా
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములు శనివారం తమ లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. వీరిరువురి రాజీనామాలను లోక్ సభ స్పీకర్ ఆమోదించారు. కాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో షికారిపుర నియోజకవర్గం నుంచి యడ్యూరప్ప, మొళకాల్మూరు నియోజకవర్గం నుంచి శ్రీరాములు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం విధాన సౌధలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటివరకూ శ్రీరాములు బళ్లారి, యడ్యూరప్ప షిమోగా ఎంపీలుగా కొనసాగారు. ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప కర్ణాటక అసెంబ్లీలో ఇవాళ సాయంత్రం బలపరీక్షకు సిద్ధం అవుతున్నారు. -
బీజేపీలో కొత్త ధీమా, బోపయ్యకు ఓకే..
సాక్షి, బెంగళూరు : బలపరీక్ష నిరూపణ సమయం దగ్గర పడుతున్న కొద్దీ భారతీయ జనతా పార్టీలో కొత్త ధీమా కనిపిస్తోంది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం 10 నుంచి 15మంది కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారంటూ బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బలపరీక్షలో ఎలాగైనా నెగ్గేందుకు బీజేపీ తన విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్-జేడీఎస్‌కు చెందిన పదిమంది ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకోవడం, మరోవైపు 14మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యే విధంగా చేసేందుకు పావులు కదుపుతోంది. సాయంత్రం జరిగే బలపరీక్షలో తాము గెలిచి తీరుతామని ముఖ్యమంత్రి యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. ఆదివారమే మంత్రివర్గ సమావేశం ఉంటుందని, రైతులకు ఇచ్చిన రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. సాయంత్రం సంబురాలు జరుపుకుంటామని ఆయన అన్నారు. కాగా బలపరీక్ష చేపట్టేందుకు ప్రొటెం స్పీకర్ బోపయ్యకే సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కర్ణాటక అసెంబ్లీ శనివారం ప్రత్యేకంగా సమావేశం అయింది. ఈ సందర్భంగా ప్రొటెం స్పీకర్ బోపయ్య...నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రి యడ్యూరప్ప, సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం మధ్యాహ్నం వరకూ కొనసాగనుంది. కర్ణాటక అసెంబ్లీలో బలబలాలు బీజేపీ 104, కాంగ్రెస్ 78, జేడీఎస్ 36, ఇతరులు 3 మొత్తం 222 సీట్లు, మ్యాజిక్ ఫిగర్ 111 రెండు స్థానాల్లో గెలిచిన కుమారస్వామికి ఒకే ఓటు బలపరీక్షలో విజయంపై రెండు పక్షాల్లో ధీమా ఇంకా తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారంటున్న కాంగ్రెస్-జేడీఎస్ సాయంత్రం 4 గంటలకు కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష తమకు 116 ఎమ్మెల్యేలు ఉన్నారంటున్న కాంగ్రెస్-జేడీఎస్ భద్రతా వలయంలో కర్ణాటక విధాన సౌధ రంగంలోకి 200మంది మార్షల్స్ -
కర్ణాటకలో బీజేపీ నేతల అత్యవసర భేటీ
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో రాజకీయం రసవత్తరంగా మారింది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు అసెంబ్లీలో బల నిరూపణ నేపథ్యంలో క్యాంపు రాజకీయాలతో నేతలు హడావుడిగా ఉన్నారు. మరోవైపు బీజేపీ నేతలు నగరంలోని ఓ హోటల్లో శనివారం ఉదయం అత్యవసరంగా సమావేశం అయ్యారు. సీఎం యడ్యూరప్ప, ప్రకాశ్ జవదేకర్, అనంత్ కుమార్, సదానంద గౌడ ఈ సమావేశంలో పాల్గొని పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశంతో పాటు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఇవాళ పది గంటలకు అసెంబ్లీలో బీజేఎల్పీ సమావేశం కానుంది. కాగా బలపరీక్షపై బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి సదానంద గౌడ మాట్లాడుతూ....‘సాయంత్రం 4.30 వరకూ వేచి చూడండి. బలపరీక్షలో యడ్యూరప్ప నెగ్గుతారు. అయిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తారు.’ అని ధీమా వ్యక్తం చేశారు. హిల్టన్ హోటల్లో 76మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లీ మెరిడియన్ హోటల్లో 36మంది జేడీఎస్ ఎమ్మెల్యేలు శాంగ్రిల్లా రిసార్ట్స్ లో బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలతో ఆయా పార్టీల కీలక నేతల సమావేశం సభలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రతి వ్యూహాలపై చర్చ మరి కాసేపట్లో అసెంబ్లీకి బయలుదేరనున్న అన్ని పార్టీల ఎమ్మెల్యేలు -
బెంగళూరు చేరుకున్న ఎమ్మెల్యేల బృందం..
సాక్షి, బెంగళూరు : కర్ణాటక రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. గవర్నర్ ఆహ్వానంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుతో శనివారం బలనిరూపణకు సిద్ధమైంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు తరలి వెళ్లిన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు తిరిగి శనివారం ఉదయం బెంగళూరుకు చేరుకున్నారు. ఆపరేషన్ లోటస్‌తో బీజేపీ తమ ఎమ్మెల్యేలను లాక్కుంటుందనే భయంతో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు గురువారం రాత్రి ఈగల్టన్ రిసార్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో బలపరీక్ష నేపథ్యంలో్ కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు తిరిగి బెంగళూరులోని హోటల్ హిల్టన్ చేరుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యేల బృందం బయలుదేరింది. మొత్తం ఐదు బస్సులో ఎమ్మెల్యేలను తరలించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కాంగ్రెస్- జేడీఎస్ ఎమ్మెల్యేలతోపాటు తెలంగాణ చెందిన నేతలు కూడా వెళ్లారు. ప్రస్తుతం కర్ణాటక పోలీసుల భద్రతలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేల వాహనాలకు ముందు వెనుకా కాంగ్రెస్ శ్రేణుల వావానాలు ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో శనివారం యడ్యూరప్ప సర్కారు బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు కర్ణాటక అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. -
యడ్యూరప్ప కార్యాలయానికి తాళం
జయనగర: విధాన సౌధలోని మూడో అంతస్తులో ఉన్న సీఎం కార్యాలయానికి తాళం పడింది. గురువారం ఉదయం ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసిన అనంతరం విధాన సౌధ మూడవ అంతస్తులో ఉన్న సీఎం కార్యాలయం చేరుకున్నారు. యడ్యూరప్ప పూజలు నిర్వహించి సీఎం సీటులో ఆశీనులయ్యారు. కొన్ని గంటలపాటు అక్కడే గడిపారు. కార్యాలయం ముందు సిద్దరామయ్య బోర్డు తొలగించి యడ్యూరప్ప నామఫలకం కూడా తగిలించారు. అయితే శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయానికి తాళం పడింది. బలపరీక్ష నెగ్గేవరకు పాలనాపరమైన ఎలాంటి నిర్ణయాలను తీసుకోరాదని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో విధానసౌధ అధికారులు ముఖ్యమంత్రి యడ్యూరప్ప కార్యాలయానికి తాళంవేశారు. -
యడ్యూరప్ప నోటివెంట అసలు నిజం..
బెంగళూరు: బలపరీక్షలో బీజేపీనే నెగ్గుతుందని ఆ పార్టీ నాయకులు బల్లగుద్దిమరీ చెబుతున్నారు. ఎలా గెలుస్తారంటే మాత్రం.. ‘రేపు మీరే చూస్తారుగా..’. అని తప్పించుకుంటున్నారు. కానీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మాత్రం అసలు నిజం కక్కేశారు. శుక్రవారం రాత్రి బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. నూటికి నూటాఒక్కశాతం బలపరీక్షలో తమదే విజయమన్నారు. అంతటితో ఆగకుండా.. ‘‘అవును. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల మద్దతు లేకుంటే మేమెలా గెలవగలం..’’ అని అనేశారు. రేపు రాష్ట్రంలో సంబురాలు: ‘‘ఊహించినదానికంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తాం. రేపు సాయంత్రం కర్ణాటకలో సంబురాలు జరుగుతాయి. ఆ విజయాన్ని ఆరుకోట్ల కన్నడిగులకు అంకితం చేస్తాం. జేడీఎస్-కాంగ్రెస్‌లది అపవిత్రపొత్తు, వాళ్లు జాతి విద్వేషాలను రెచ్చగొట్టారు. కులాల మధ్య గొడవలు పెట్టాలని చూశారు. ప్రజలు బుద్ధిచెప్పినా, దొడ్డిదారిలో అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదిఏమైనా చివరికి గెలుపుమాదే’’ అని సీఎం యడ్యూరప్ప అన్నారు. -
బలపరీక్షలో గెలిచేది బీజేపీనే! ఎలాగో తెలుసా..
న్యూఢిల్లీ: కర్ణాటక పొలిటికల్ థ్రిల్లర్‌లో నిమిషానికో మలుపు.. సెకనుకో ఊహాగానం! శుక్రవారం నాటి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కర్ణాటక అసెంబ్లీలో శనివారం జరుగనున్న బలపరీక్షలో ఏం జరుగుతుందోనని సర్వత్రా ఎదురుచూస్తున్నవేళ.. జేడీయూ-కాంగ్రెస్ కూటమికి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీలోనే ఉన్నారని, గవర్నర్‌కు సమర్పించిన 115 సంతకాల్లో ఆ ఎనిమిది మందివి ఫోర్జరీ చేసిఉండొచ్చని ‘రిపబ్లిక్ టీవీ’ మరో సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రకారం.. సుప్రీంకోర్టుకు ఫోర్జరీ సంతకాల జాబితా: కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు, జేడీఎస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రస్తుతం హైదరాబాద్ శిబిరంలో లేరు. వారంతా ఢిల్లీలో బీజేపీ నేతల సంరక్షణలో ఉన్నారు. శనివారం బలపరీక్ష సమయానికి వారిని బెంగళూరుకు తరలించనున్నారు. నిజానికి బెంగళూరు ఈగిల్టన్ రిసార్ట్స్, షాంగ్రీ-లా హోటల్ల్లో శిబిరాలు ఏర్పాటేచేసేనాటికే ఆ ఎనిమిది మంది జంప్ అయ్యారట. గవర్నర్‌కు సమర్పించిన ఎమ్మెల్యేల జాబితాలోనూ ఈ ఎనిమిది మంది సంతకాలు చేయలేదట. దీంతో ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచి సంతకాలను సేకరించి.. ఫోర్జరీ చేశారట. ఆ ఎనిమిది ఫోర్జరీ సంతకాల జాబితానే కాంగ్రెస్, జేడీఎస్‌లు గవర్నర్‌కు, ఆపై సుప్రీంకోర్టుకు పంపాయని ‘రిపబ్లిక్’ కథనంలో వెల్లడించింది. అలా 104కు మరో ఎనిమిది మంది జంప్ జిలానీలు తోడుకాగా బీజేపీ బలం మ్యాజిక్ ఫిగర్(112)కు చేరుకుంటుంది కాబట్టి బలపరీక్షలో యడ్యూరప్ప సునాయాసంగా గెలుస్తారన్నది ఆ కథనం సారాంశం. కాంగ్రెస్ ఏమంటోంది?: తమ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరిని.. బీజేపీ నేతలు ఢిల్లీలో బంధించారని కాంగ్రెస్ ఆరోపించింది. ఆ ఎమ్మెల్యే (ఆనంద్ సింగ్) పేరును కూడా వెల్లడించింది. అయితే, ‘రిపబ్లిక్’ కథనం చెప్పినట్లు 8 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపుపై కాంగ్రెస్ వర్గాలు ఎక్కడా ఏమీ మాట్లాడకపోవడం గమనార్హం. -
యడ్యూరప్ప 3 రోజుల ముఖ్యమంత్రేనా?
సాక్షి, వెబ్ డెస్క్ : కర్ణాటకలో రాజకీయ నాటకీయత తుది దశకు చేరుకుంది. రేపు (శనివారం) సాయంత్రం నాలుగు గంటలకు కర్ణాటక అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన శనివారం బల పరీక్ష జరగనుంది. బల పరీక్ష బీజేపీకి శరాఘాతమనే చెప్పుకోవాలి. సుప్రీంకోర్టులో ఆ పార్టీ తరఫు న్యాయవాది చేసిన ఏ వాదనతో ముగ్గరు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకీభవించలేదు. కచ్చితంగా బల పరీక్ష జరిగి తీరాలని తీర్పునిచ్చింది. గతంలోనూ ఇలాంటి పరిస్థితుల్లోనే కొన్ని రాష్ట్రాలు న్యాయం కోసం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది 1997 ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఏర్పాటు ఘటన. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం-1997 1997 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగదాంబిక పాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఒక్క రోజులోనే ఆ ప్రభుత్వం కుప్పకూలింది. ఉత్తరప్రదేశ్ చరిత్రలో అత్యంత ప్రముఖ ఘటన ఇది. ఒక్క రోజు సీఎంగా ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికీ జగదాంబిక పాల్‌ను స్థానికులు చెప్పుకుంటుంటారు. ఎన్నికల్లో మెజారిటీ సాధించిన భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నాయకుడు కళ్యాణ్ సింగ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించకపోవడం అప్పట్లో ఉత్తరప్రదేశ్‌లో వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటుకు జగదాంబిక పాల్‌ను ఆహ్వానించిన గవర్నర్ రోమేష్ భండారీ బల నిరూపణ చేసుకోవాలని సూచించారు. విశ్వాస పరీక్ష సమయంలో అసెంబ్లీలో హింస చెలరేగి రక్తపాతం జరగడంతో రాష్ట్రపతి పాలన విధించాలని భండారీ కేంద్రానికి సూచించారు. అయితే, ఇందుకు కేంద్రం నిరాకరించడంతో బీజేపీకి చెందిన కళ్యాణ్ సింగ్ ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బయట పార్టీల ఎమ్మెల్యేలను కేబినేట్ సభ్యులుగా గుర్తించేందుకు గవర్నర్ నిరాకరించడంతో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ వెంటనే కాంగ్రెస్‌కు చెందిన జగదాంబిక పాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, పాల్ ప్రభుత్వం ఒక్క రోజుకు మించి నిలబడలేదు. పాల్ బీజేపీ తరఫున లోక్‌సభలో ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీకి 104 ఎమ్మెల్యేలు, బయట నుంచి ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు ఉంది. ఇదే సమయంలో కాంగ్రెస్-జేడీఎస్‌లకు 116 (కాంగ్రెస్ :78, జేడీఎస్ : 38) మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే, అజ్ఞాతంలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఈ నేపథ్యంలో రేపు విశ్వాస పరీక్షలో యడ్యూరప్ప నెగ్గుతారా? లేక మూడు రోజుల ముఖ్యమంత్రిగా మిగిలిపోతారా? అనేది వేచి చూడాల్సిందే. -
1996లో అలా.. 2018లో ఇలా!
ఇప్పుడు కర్ణాటకలో తమను కాదని గవర్నర్ వజూభాయ్ వాలా బీజేపీ నేత యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ఆహ్వానించడాన్ని కాంగ్రెస్, దేవెగౌడ పార్టీ జేడీఎస్ అన్యాయం, అక్రమమని గొంతు చించుకుంటున్నాయి. అయితే, ఒకప్పుడు గుజరాత్లో పూర్తి మెజారిటీ ఉన్న బీజేపీ సర్కారును అక్రమంగా గద్దెదించడంలో కాంగ్రెస్ పార్టీ, దేవెగౌడ తమ పాత్రలను మరచిపోయినట్లు కనిపిస్తోంది. గవర్నర్ సిఫార్సుతో మెహతా బర్తరఫ్! అది 1996 సెప్టెంబర్. గుజరాత్లో సురేశ్ మెహతా నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై సీనియర్ నేత శంకర్‌సింహ్ వాఘేలా వర్గీయులు తిరుగుబాటు చేశారు. మెహతా ప్రభుత్వానికి అసెంబ్లీలో 121 మంది బీజేపీ శాసనసభ్యుల మద్దతు ఉండగా, వారిలో 40 మంది తనను సమర్థిస్తున్నారని వాఘేలా ప్రకటించి, ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. వాఘేలా, కాంగ్రెస్‌కు చెందిన పారిఖ్ కలిసి సురేశ్మెహతా సర్కారుపై అవిశ్వాసం ప్రకటించి, తిరుగుబాటు చేయడంతో బీజేపీ ప్రభుత్వానికి అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీకి చెందిన స్పీకర్ హెచ్ఎల్ పటేల్ అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న సమయంలో సభను నడిపిన కాంగ్రెస్‌కు చెందిన ఉపసభాపతి చందూభాయ్ ధాబీ వాఘేలా–పారిఖ్ వర్గానికి గుర్తింపు ఇచ్చారు. మళ్లీ కోలుకుని అసెంబ్లీకి వచ్చిన స్పీకర్ పటేల్ డెప్యూటీ స్పీకర్ ఉత్తర్వును రద్దు చేయడం గందరగోళం, కొట్లాటలకు దారితీసింది. అసెంబ్లీలో రభస జరగడంతో బలపరీక్షకు ఓటింగ్ నిర్వహించడం కుదరలేదు. వాఘేలా వర్గం, కాంగ్రెస్ నేతలు గవర్నర్ కృష్ణపాల్ సింగ్‌ను కలసి మెహతా సర్కారును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ సర్కారు రద్దుకు గవర్నర్ సిఫార్సు దాంతో మెహతా ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశా>రు. ఆ సమయంలో దేవెగౌడ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వానికి కాంగ్రెస్ బయటినుంచి మద్దతిస్తోంది. దేవెగౌడ ప్రభుత్వం గుజరాత్ నుంచి గవర్నర్ నివేదిక అందిన వెంటనే సురేశ్ మెహతా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసింది. ఇప్పటి కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా అప్పుడు గుజరాత్ బీజేపీ అధ్యక్షుని హోదాలో తమ పార్టీ సర్కారుకు జరిగిన ‘అన్యాయాన్ని’ కళ్లారా చూశారు.. అర్థం చేసుకున్నారు. ఇప్పుడు అదే దేవెగౌడ కొడుకు కుమారస్వామికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ప్రభుత్వం ఏర్పాటుకు ఆయనను ఆహ్వానించాలని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు కోరినా వజూభాయ్ పట్టించుకోలేదు. వాజ్‌పేయి ఔట్.. దేవెగౌడ ఇన్ 1996లోనే సభలో మెజారిటీ నిరూపించుకోలేక ప్రధాని పదవికి వాజ్‌పేయి రాజీనామా చేసిన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. 1996 లోక్‌సభ ఎన్నికల తర్వాత 161 సీట్లతో అతి పెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ తరఫున ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా అటల్ బిహారీ వాజ్‌పేయిని అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ ఆహ్వానించారు. బలపరీక్ష నాటికి అవసరమైన మద్దతు కూడగట్టుకోలేకపోవడంతో.. ఓటింగ్‌కు ముందే వాజ్‌పేయి రాజీనామా చేశారు. అయితే, విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా వాజ్‌పేయి చేసిన ఆవేశపూరిత ప్రసంగాన్ని నేటికీ గుర్తు చేసుకుంటారు. అనంతరం, కాంగ్రెస్ నాయకత్వాన ఏర్పడే సంకీర్ణ సర్కారుకు మద్దతివ్వడానికి కాంగ్రెసేతర జాతీయ. ప్రాంతీయపార్టీలు అంగీకరించకపోవడంతో.. కాంగ్రెస్ మద్దతుతో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కొలువుతీరింది. ఆ ప్రభుత్వానికి దేవెగౌడ నేతృత్వం వహించడం కొసమెరుపు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
యడ్డీ గట్టెక్కేదెలా..?
న్యూఢిల్లీ: సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప ముందు బలనిరూపణ పెద్ద సవాలుగా నిలిచింది. ఒక స్వతంత్ర ఎమ్మెల్యేతో కలిపి బీజేపీ బలం 105 మాత్రమే. మెజారిటీ మేజిక్ ఫిగర్ మాత్రం 112. ఈ పరిస్థితుల్లో విశ్వాస పరీక్ష నెగ్గడమెలా? ఇందుకు సంబంధించి యడ్యూరప్ప ముందు రెండు మార్గాలున్నాయి. అవి.. 1. విపక్ష సభ్యుల గైర్హాజరు విశ్వాస పరీక్ష సమయంలో కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన కనీసం 13 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా చేయాలి. లేదా అసెంబ్లీకి హాజరైనా ఓటింగ్‌లో పాల్గొనకుండా చూడాలి. దానివల్ల అసెంబ్లీకి హాజరై ఓటేసే ఎమ్మెల్యేల సంఖ్య 209కి పడిపోతుంది. అప్పుడు హాజరైన లేదా ఓటేసిన ఎమ్మెల్యేల్లో యూడ్యూరప్పకు మెజారిటీ(సగం కన్నా ఒకరు ఎక్కువ) లభిస్తే సరిపోతుంది. అంటే 105 మంది ఎమ్మెల్యేల మద్దతుంటే యడ్యూరప్ప గట్టెక్కుతారు. ఒక స్వతంత్ర ఎమ్మెల్యేతో కలిపి బీజేపీకి ఇప్పటికే 105 మంది శాసన సభ్యుల మద్దతుంది. గైర్హాజరైన లేదా ఓటేయని ఎమ్మెల్యేలను ఆయా పార్టీలు బహిష్కరిస్తే ఉప ఎన్నికలు జరుగుతాయి. 2. కాంగ్రెస్, జేడీఎస్‌ల్లో చీలిక కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల్లో.. ఏ ఒక్క పార్టీ నుంచైనా కనీసం మూడింట రెండొంతుల మంది ఆయా పార్టీల నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరాలి. ఫిరాయింపుల నిరోధక చట్టం ద్వారా ఎమ్మెల్యేలు అనర్హతకు గురి కాకుండా ఉండాలంటే.. కాంగ్రెస్ నుంచి కనీసం 52 మంది లేదా జేడీఎస్ నుంచి 24 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించాలి. కాంగ్రెస్ నుంచి మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు వస్తే బీజేపీ బలం 157 చేరుతుంది. లేదా జేడీఎస్ నుంచి మూడింట రెండొంతుల మంది వస్తే బీజేపీ బలం 129కి చేరుతుంది. అయితే, ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను ఫిరాయించేలా ఒప్పించడం కష్టసాధ్యమే. -
యడ్యూరప్ప అనే నేను...
సాక్షి, బెంగళూరు: కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభాపక్ష నేత బూకనకెరె సిద్ధలింగప్ప యడ్యూరప్ప (75) గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో యడ్యూరప్పతో రాజ్‌భవన్‌లో గవర్నర్ వజూభాయ్ వాలా ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన కాసేపటికే రైతు రుణమాఫీపై యడ్యూరప్ప అధికారులతో చర్చించారు. రెండ్రోజుల్లో దీనిపై తీర్మానం చేస్తామని ఆయన వెల్లడించారు. యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై స్టే విధించాలన్న కాంగ్రెస్, జేడీఎస్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో గురువారం ఉదయం యడ్డీ ప్రమాణం చేశారు. దీనికి నిరసనగా కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ముందు ఆందోళన నిర్వహించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్, జేడీఎస్ నేతల నుంచి ఆటంకం కలుగుతుందనే ముందస్తు సమాచారంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాజ్‌భవన్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. యడ్డీ సీఎంగా బాధ్యతలు తీసుకోవటం ఇది మూడోసారి. గతంలో 2007లో నవంబర్ 12న తొలిసారిగా (వారం రోజులపాటు), రెండోసారి 2008, మే 3న మరోసారి సీఎంగా ప్రమాణం చేశారు. రెండోసారి సీఎం అయ్యాక మూడేళ్ల 10 నెలల పాటు ఆ పదవిలో కొనసాగారు. రైతుల సాక్షిగా.. ప్రచారంలో తనను రైతుబంధుగా చెప్పుకున్న యడ్యూరప్ప తెల్లని సఫారీపై ఆకుపచ్చ శాలువా వేసుకుని విజయ సంకేతం చూపుతూ రాజ్‌భవన్ చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ యడ్డీని ఆహ్వానించారు. ‘భగవంతుడి సాక్షిగా, రైతు సాక్షిగా..’ అని ఆయన ప్రమాణం చేశారు. సాధారణంగా బీజేపీ సీఎంల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్‌షాలు ఈసారి గైర్హాజరవటం గమనార్హం. కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, అనంత్‌కుమార్ సహా ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో కార్యకర్తలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. యడ్యూరప్ప కుటుంబసభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 104 మంది శాసనసభ్యులున్న బీజేపీ తగిన సంఖ్యాబలం సాధించాలంటే మరో 8 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఇప్పటికే ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు ప్రకటించారు. గవర్నర్ ఆదేశాల మేరకు 15 రోజుల్లోగా రాష్ట్ర విధానసభలో యడ్యూరప్ప బలనిరూపణ చేయాల్సి ఉంది. ఆ తరువాతే కేబినెట్ విస్తరణ చేపడతామని యడ్యూరప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన ఎంతో ఉద్విగ్నంగా కనిపించారు. ‘విశ్వాసం’ నిలబెట్టుకుంటా ప్రమాణం తరువాత నేరుగా విధానసౌధకు వెళ్లిన యడ్డీ.. ముఖద్వారం మెట్లకు నమస్కరించి లోపలికెళ్లారు. సీఎస్ రత్నప్రభ, ఇతర ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అధికారులతో సమావేశం అనంతరం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులందరికి రూ. లక్ష రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులతో చర్చించి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసుకుని మరో రెండు రోజుల్లో రుణమాఫీపై ప్రకటన చేస్తామని తెలిపారు. వీలైనంత త్వరగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకుంటామని.. విశ్వాస పరీక్షలో 100% విజయం సాధిస్తామన్నారు. ‘మా ప్రభుత్వం విశ్వాస పరీక్ష నెగ్గుతుంది. ఐదేళ్లపాటు అధికారంలో ఉంటుంది. ఆ నమ్మకం నాకుంది. గవర్నర్ అవకాశం ఇచ్చిన 15 రోజుల పాటు నేను వేచిచూడను. వీలైనంత త్వరగా మెజారిటీ నిరూపించుకుంటాను’ అని యడ్డీ పేర్కొన్నారు. ‘రిసార్టు’ భద్రత ఉపసంహరణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మకాం వేసిన బెంగళూరు బిడది సమీపంలోని ఈగల్టన్ రిసార్డు వద్ద భద్రతను ఉపసంహరించారు. యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీంతో తమ ఎమ్మెల్యేల భద్రతపై కాంగ్రెస్ నాయకుల్లో ఆందోళన నెలకొంది. పాత్రికేయులను రిసార్ట్ లోనికి అనుమతించటం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే అక్కడ పహారా కాస్తున్నారు. తమ ఎమ్మెల్యేలను సంప్రదించటానికి గురువారం మధ్యాహ్నం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. -
యడ్యూరప్ప ఏలుబడి
కర్ణాటక ఓటర్లు నికరమైన తీర్పు ఇవ్వని పర్యవసానంగా అక్కడ కొనసాగుతున్న ఉత్కంఠభరిత డ్రామాలో తొలి అంకం బీజేపీ నాయకుడు బీఎస్ యడ్యూరప్ప గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో ముగిసింది. బల నిరూపణ కోసం గవర్నర్ వాజూభాయ్ వాలా ఆయనకు పక్షం రోజుల వ్యవధి ఇచ్చారు గనుక మున్ముందు ఈ డ్రామాలో మరిన్ని మలుపులు ఉండటం ఖాయం. ఈ పదిహేను రోజుల్లో ప్రతిపక్ష శిబిరం నుంచి ఎందరు కొత్త కండువాలు కప్పుకుని సరికొత్త మాటలు మాట్లాడతారో చూడాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు నోట్ల కట్టలు పంపి ప్రలోభపెట్టిన ఉదంతాల వంటివి కర్ణాటకలో చోటుచేసుకోకూడదని ప్రజాస్వామ్యవాదులు గట్టిగా కోరుకుంటారు. అలాంటి మరక పడకుండా యడ్యూరప్ప గట్టెక్కగలరా అన్నది చూడాలి. ఎందుకంటే ఆయన ప్రభుత్వం సుస్థిరంగా నిలబడటానికి బీజేపీకి ఇప్పుడున్న 104మంది ఎమ్మెల్యేలు సరిపోరు. అదనంగా కనీసం 9మంది ఎమ్మెల్యేలు అవసరమవుతారు. కనుకనే బేరసారాలు మొదలయ్యాయన్న ఆరోప ణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఎవరిని పిలవాలన్న అంశంలో బుధవారమంతా వాదోపవా దాలు జోరుగా సాగాయి. అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని పిలవాలా లేక జేడీ(ఎస్)– కాంగ్రెస్‌లు ఏర్పాటుచేసుకున్న ఎన్నికల అనంతర కూటమికి అవకాశమివ్వాలా అన్న విషయం చుట్టూ ఇవి తిరిగాయి. తమ కూటమికి మొత్తంగా 116మంది మద్దతు ఉంది గనుక ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాలని జేడీ(ఎస్)–కాంగ్రెస్... తమది అతి పెద్ద పార్టీ గనుక అవకాశమీయాలని బీజేపీ వాదించాయి. రాజ్యాంగ నిపుణులు సైతం ఈ విషయంలో రెండుగా చీలిపోయారు. రాత్రి 11 గంటల వేళ కాంగ్రెస్ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. అప్పటికప్పుడు ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌ను ఏర్పాటైంది. ఆ బెంచ్ దాదాపు మూడున్నర గంటలపాటు వాదప్రతివాదాలు విని గవర్నర్ ఉత్తర్వుపై స్టే ఇవ్వడం సాధ్యంకాదని రాత్రి 2 దాటాక తేల్చింది. అయితే శుక్రవారం కొనసాగే వాదనల తర్వాత యడ్యూరప్పకు గవర్నర్ ఇచ్చిన 15 రోజుల వ్యవధి యధాతథంగా ఉంటుందా, మారుతుందా అన్న విషయం తేలుతుంది. గవర్నర్ల వ్యవస్థ తటస్థంగా ఉండి ఉంటే అసలు ఈ వివాదమంతా వచ్చేదే కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు గవర్నర్లను నియమించడం, కీలక సమయాల్లో ఆ గవర్నర్లు కేంద్ర పాలకుల అభీష్టాన్ని నెరవేర్చడం ఒక సంప్రదాయంగా స్థిరపడిపోయింది. నిరుడు గోవా, మణిపూర్, మేఘా లయల్లో అక్కడి గవర్నర్లు ఎన్నికల అనంతర కూటములను గుర్తించి అధికారం కట్టబెట్టకుండా అతి పెద్ద పార్టీనే పిలిచి ఉన్నా తాజా వివాదం ఏర్పడేది కాదు. ఆ రాష్ట్రాల్లో గవర్నర్లు అనుసరించిన విధానం కర్ణాటకలో ఎందుకు మాయమైందన్న జేడీ(ఎస్)–కాంగ్రెస్‌ల ప్రశ్న సమంజసమైనదే. అయితే గోవా వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గమనించదగ్గది. అతిపెద్ద పార్టీగా అవ తరించిన తమకు ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశమీయకుండా గోవా గవర్నర్ అన్యాయం చేశా రంటూ కాంగ్రెస్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు గవర్నర్‌కు విచక్షణాయుత అధికారాలుంటాయని ధర్మాసనం తేల్చి చెప్పింది. సుస్థిర ప్రభుత్వాన్ని నెలకొల్పేంత స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి లేన ప్పుడు అతి పెద్ద పార్టీని కాదని కొత్తగా ఏర్పడిన కూటమికి అవకాశమీయడంలో తప్పులేదని స్పష్టం చేసింది. కర్ణాటకలోనూ ఇదే సూత్రం వర్తింపజేయాలని ఇప్పుడు కాంగ్రెస్ వాదిస్తోంది. గోవా, మణిపూర్, మేఘాలయల్లో గతంలో కాంగ్రెస్ చేసిన వాదనను కర్ణాటకలో బీజేపీ నెత్తికెత్తుకుంటే... ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ అప్పట్లో చేసిన తర్కాన్ని ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ సమర్థిస్తోంది. అయితే ఈ నాలుగుచోట్లా లబ్ధి పొందిన ఏకైక పార్టీ మాత్రం బీజేపీయే! అయితే ఈ పరిణామాలపై నిర్ద్వంద్వంగా, నిజాయితీగా స్పందించగల నైతిక స్థైర్యం ఉన్న పార్టీల, నేతల సంఖ్య అరుదుగా మారడం ఆందోళన కలిగించే అంశం. కర్ణాటకలో బీజేపీని ఓడించడానికి లోపాయికారీగా, బాహా టంగా కృషి చేసిన చంద్రబాబు ఇందుకు ఉదాహరణ. కర్ణాటక గవర్నర్ నిర్ణయంపై ఆయన బహి రంగంగా మాట్లాడలేక కేబినెట్ సమావేశంలో అభిప్రాయాలు వెల్లడించి, వాటిని లీక్ చేయించి సరిపెట్టుకున్నారు. బీజేపీకి మెజారిటీ లేనప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు దాన్ని ఆహ్వానించడం సరి కాదని ఆయన కేబినెట్ సమావేశంలో అన్నారట! పైగా అవి ప్రమాదకర రాజకీయాలట!! ఆంధ్ర ప్రదేశ్‌లో ఆయన 23మంది విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. అంతటితో ఊరుకోక పొరుగునున్న తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారు. బాబుకు కర్ణాటక గవర్నర్‌ను తప్పుబట్టే నైతిక అర్హత ఉంటుందా? రాజకీయ వాతావరణం వేడెక్కి ఉన్నప్పుడు జాగ్రత్తగా అడుగేయాలి. కానీ కర్ణాటక బీజేపీ ఎందుకనో తొట్రుపాటుకు లోనయింది. యడ్యూరప్పను గవర్నర్ ఆహ్వానించడాన్ని మొదటగా బీజేపీ ట్వీటర్ ద్వారా వెల్లడించడం, ఆ తర్వాత దాన్ని తొలగించడం, మళ్లీ కొత్తగా పెట్టడం వంటివి ఉన్న సవాలక్ష సందేహాలను మరింత పెంచాయి. లోక్‌సభ ఎన్నికలకు ఇక ఏడాదే గడువున్నది గనుక ఇప్పుడు కర్ణాటకను చేజిక్కించుకోవడం మాత్రమే కాదు...జేడీ(ఎస్)ను మచ్చిక చేసుకో వడం కూడా మున్ముందు బీజేపీకి చాలా అవసరం. రాష్ట్రంలో ఆ పార్టీతో పొత్తుంటే తప్ప అధిక స్థానాలు సంపాదించలేమని కాంగ్రెస్‌తోపాటు బీజేపీకి కూడా ఈ ఎన్నికలతో అర్ధమై ఉంటుంది. అయితే జేడీ(ఎస్) నేత కుమారస్వామికి రావలసిన సీఎం పదవిని కాస్తా తన్నుకుపోయిన బీజేపీకి అది అంత సులభమేమీ కాదు. ఏదేమైనా కర్ణాటక పరిణామాలు మరిన్నిరోజులపాటు పతాక శీర్షిక లకు ఎక్కుతూనే ఉంటాయి. ఇవన్నీ త్వరగా కొలిక్కి వచ్చి రాష్ట్ర ప్రజలకు మెరుగైన పాలన అందా లని అందరూ ఆశిస్తారు. -
ఢిల్లీలో అర్ధరాత్రి హైడ్రామా.. యడ్యూరప్పకు లైన్ క్లియర్
సాక్షి, ఢిల్లీ : కర్ణాటక రాజకీయాలపై సుప్రీంకోర్టు కేంద్రంగా బుధవారం అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు యడ్యూరప్పను గవర్నర్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారాన్ని ఆపాలని కాంగ్రెస్, జేడీఎస్‌లు కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి. కానీ కాంగ్రెస్-జేడీఎస్‌లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి సుప్రీంకోర్టు లైన్ క్లియర్ చేసింది. కాంగ్రెస్-జేడీఎస్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. దీంతో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్‌లు ఉన్నారు. సుప్రీంకోర్టు గురువారం తెల్లవారుజామున 2 గంటలకు విచారణను ప్రారంభించింది. కాంగ్రెస్ తరఫున అభిషేక్ సింఘ్వి, కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్, తుషార్ మెహతాలు హాజరై తమ వాదనాలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు యడ్యూరప్ప ప్రమాణ స్వీకారంపై స్టే విధించలేమని తెలిపింది. అంతేకాకుండా గవర్నర్ అధికారాలను అడ్డుకోలేమని స్పష్టం చేసింది. గురువారం ఉదయం 9గంటలకు యథాతథంగా సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 02 గంటలోగా ఎమ్మెల్యేల మద్దతు లేఖను సమర్పించాలని యడ్యూరప్పకు సుప్రీంకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్, జేడీఎస్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేయలేదు. ప్రమాణస్వీకారం అంశం తుది తీర్పుకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. కాంగ్రెస్ తరపున వాదనలు వినిపించిన సింఘ్వి కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి 117మంది ఎమ్మెల్యేల మద్దతుందని తెలిపారు. అంతేకాక 104 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్న యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు ఎలా ఆహ్వానిస్తారని సింఘ్వి అన్నారు. కేంద్ర తరపున అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదనలు వినిపించారు. యడ్యూరప్ప తరఫున మాజీ అటార్నీ జనరల్ ముఖుల్రోత్గి తన వాదనలు వినిపించారు. దాదాపుగా మూడున్నర గంటలపాటు వాదనలు కొనసాగాయి. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన లేఖను మధ్యాహ్నం 2గంటల కల్లా తమ ముందుంచాలని ధర్మాసనం యడ్యూరప్పకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను శుక్రవారం ఉదయం 10. 30కి (మే 18) ధర్మాసం వాయిదా వేసింది. -
వజూభాయ్ కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నారు
న్యూఢిల్లీ: కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్పను ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా మాట్లాడుతూ.. వజూభాయ్ బీజేపీ కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ‘వజూభాయ్ గవర్నర్ కార్యాలయ గౌరవాన్ని దిగజార్చారు. రాజ్యాంగాన్ని అణగదొక్కారు. చట్టాలను దుర్వినియోగం చేసి బీజేపీ కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ఆదేశాలతో వజూభాయ్ రాజ్యాంగానికి తూట్లు పొడిచారు. ఆయన రాజ్యాంగ విలువల్ని కాకుం డా బీజేపీ అధిష్టానం ఆదేశాలను పాటించాలని నిర్ణయించుకున్నారు’ అని ట్వీట్ చేశారు. -
రేపు మధ్యాహ్నం ప్రమాణం చేస్తా : యడ్యూరప్ప
సాక్షి, బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం మధ్యాహ్నం 12.20 నిమిషాలకు ప్రమాణం స్వీకారం చేయబోతున్నట్లు బీజేపీ శాసనసభా పక్ష నేత బీఎస్ యడ్యూరప్ప పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు హాజరుకాబోతున్నట్లు వెల్లడించారు. ప్రమాణస్వీకారం కోసం బీజేపీ ఇప్పటికే ఏర్పాట్లను సైతం పూర్తి చేసినట్లు తెలిసింది. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన అనంతరం యడ్యూరప్ప ఎమ్మెల్యేలతో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌కు లేఖను సమర్పించిన విషయం తెలిసిందే. మరో వైపు ఒక స్వతంత్ర అభ్యర్థి బీజేపీకి మద్దతు ప్రకటించారు. దీంతో బీజేపీ బలం అధికారికంగా 105కు చేరుకుంది. మరోవైపు మిగిలిన ఎమ్మెల్యేల మద్దతు కోసం బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. ఈలోగా యడ్యూరప్ప తరచూ సంచలన ప్రకటనలు చేస్తూ కాంగ్రెస్-జేడీఎస్‌లలో గుబులు పుట్టిస్తున్నారు. -
గవర్నర్‌ను కలిసిన యడ్యూరప్ప బృందం
సాక్షి, బెంగళూరు: ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కర్ణాటక గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా నిర్ణయం కీలకంగా మారింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ముందుకొచ్చిన బీజేపీ అభ్యర్థనను గవర్నర్ స్వీకరించారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం మాత్రం పలకకపోవడం గమనార్హం. గవర్నర్‌తో భేటీ అనంతరం బయటికొచ్చిన యడ్యూరప్ప బృందం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఏడు రోజుల్లోగా అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని గవర్నర్ సూచించారు. నూటికి నూరు శాతం బలాన్ని నిరూపించుకుంటాం’’ అని చెప్పారు. యడ్యూరప్పతోకలిసి గవర్నర్‌ను కలిసిన వారిలో కేంద్ర మంత్రి అనంతకుమార్, బీజేపీ నేతలు శ్రీరాములు తదితరులు ఉన్నారు. తొలుత బీజేపీ నేతలను కలిసిన గవర్నర్.. తర్వాత జేడీఎస్-కాంగ్రెస్ నేతలకు టైమిచ్చారు. -
‘కాంగ్రెస్-జేడీఎస్‌ల గురించి మాట్లాడను’
సాక్షి, బెంగుళూరు : కాంగ్రెస్-జేడీఎస్‌ల గురించి మాట్లాడటం తనకు ఇష్టం లేదని భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెల్లడైన అనంతరం భవిష్యత్ ప్రణాళికను రచిస్తామని చెప్పారు. పార్టీ జాతీయ స్థాయి నాయకులతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయాన్ని ప్రకటిస్తానని పేర్కొన్నారు. గవర్నర్ బీజేపీనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని అన్నారు. కాగా, యడ్యూరప్ప కూడా ఈ సాయంత్రమే గవర్నర్‌ను కలవనున్నట్లు సమాచారం. ఇంకోవైపు కర్ణాటకను చేజారకుండా కాంగ్రెస్ పార్టీ ఆఖరి ప్రయత్నాలు చేస్తోంది. జేడీఎస్ అధినేత కుమారస్వామిని ముఖ్యమంత్రిగా చేయడానికి సమ్మతం తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రతిపాదనను పంపింది. ఈ మేరకు జేడీఎస్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు కర్ణాటక పీసీసీ చీఫ్ పరమేశ్వర ప్రకటన కూడా చేశారు. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప ఢిల్లీ పయనం వాయిదా పడినట్లు సమాచారం. -
బి.ఎస్. యడ్యూరప్ప (బీజేపీ) రాయని డైరీ
ప్రమాణ స్వీకారం పదిహేడున గానీ, పద్దెనిమి దిన గానీ ఉండొచ్చు. ‘బూకనకేరే సిద్ధలింగప్ప యడ్యూరప్ప అనే నేను’.. అని నేను ప్రమాణ స్వీకారం చేస్తానా, లేక ‘బి.శ్రీరాములు అనే నేను’ అని శ్రీరాములు ప్రమాణ స్వీకారం చేస్తాడా అన్నదే డౌటుగా ఉంది! అమిత్‌షా రెండు చోట్ల నుంచి శ్రీరాములు చేత పోటీ చేయిస్తున్నప్పుడే నాకు డౌటు వచ్చింది.. సీఎం క్యాండిడేట్ నేనా? శ్రీరాములా? అని! ‘నువ్వే సీఎం. శ్రీరాములు డిప్యూటీ సీఎం’ అన్నాడు అమిత్‌షా. ఎక్కడైనా సీఎంలు, మాజీ సీఎంలు రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారు. ఇప్పుడున్న కాంగ్రెస్ సీఎం కూడా రెండు చోట్ల నుంచి పోటీ చేశాడు. నేను మాజీ సీఎంనని తెలిసి కూడా నన్ను ఒక్క చోటే పోటీ చేయించాడు అమిత్‌షా! సేఫ్ సైడ్‌గా రెండో చోట కూడా నిలబడతానని చెప్పబోతోంటే నా ఫేస్ సైడ్ కూడా చూడలేదు. సభలకి జనాల్ని రప్పించలేకపోతున్నానని మొన్న మాండ్యాలో నా ముఖం మీదే కాలూపుతూ కూర్చున్నాడు. ఆ రాజసం చూళ్లేక నేనే కళ్లు మూసుకున్నాను. బీజేపీ నుంచి రెండు చోట్ల పోటీ చేసింది శ్రీరాములు ఒక్కడే. అందులో ఒకటి సిద్ధరామయ్య నిలబడిన సీటు. అక్కడ సిద్ధరామయ్యపై శ్రీరాములు గెలిస్తే, ఇక్కడ నా సీట్లో నేను గెలిచినా అది పెద్ద లెక్కలోకి రాదు! సీఎంనే ఓడించాడని చెప్పి శ్రీరాముల్ని సీఎంని చేసేస్తాడు అమిత్‌షా. సెంటిమెంటు ప్రకారం చూసినా శ్రీరాములే సీఎం అయ్యే ప్రమాదం కనిపి స్తోంది. సిద్ధరామయ్యలో రాముడున్నాడు. శ్రీరాములులో రాముడున్నాడు. సిద్ధరామ య్యను శ్రీరాములు ఓడిస్తే.. కాంగ్రెస్ రాముణ్ణి బీజేపీ రాముడు ఓడించినట్లవుతుంది. అప్పుడు సీటు శ్రీరాములుది అవుతుంది. ఇంకో లాజిక్ ప్రకారం చూసినా శ్రీరాములే సీఎం అయ్యేలా ఉన్నాడు. శ్రీరాములు గాలి జనార్దన్‌రెడ్డి మనిషి. జనార్దన్‌రెడ్డి బీజేపీకి కావలసిన మనిషి. ఫస్ట్ టైమ్ బీజేపీ లైఫ్‌లో ఒక సౌత్ స్టేట్ వచ్చిందంటే అది అతడి వల్లే. సీఎం సీటు కోసం అప్పట్లో లెక్క తగ్గితే జనార్దన్‌రెడ్డే ఎమ్మెల్యేలని వెంటబెట్టుకొచ్చాడు. అప్పుడు నేను అడక్కపోయినా అంతా నన్ను సీఎంని చేశారు కాబట్టి, ఇప్పుడు నేను అడిగినా నన్ను సీఎంని చేయకపోయే నైతిక హక్కు తనకు ఉంటుందని బీజేపీ అనుకుం టుంది. బీజేపీ అనుకున్నా, అనుకోకున్నా అమిత్‌షా అనుకుంటాడు. అమిత్‌షాకి ఉన్నంత జనార్దన్రెడ్డికీ ఉంది. ‘నేను బీజేపీకి క్యాంపెయిన్ చెయ్యడం లేదు. నా ఫ్రెండ్ శ్రీరాములుకు చేస్తున్నాను’ అని జనార్దన్ ప్రచారం చేశాడు. రేప్పొద్దున బీజేపీకి అరకొర సీట్లు తగ్గినా అప్పుడు కూడా ఫ్రెండ్ శ్రీరాములు కోసమే అతడు కావలసి నంత మంది ఎమ్మెల్యేల్ని కానుకగా ఇవ్వగలడు. ఫ్రెండ్‌కి అంత చేసినవాడికి.. ఫ్రెండ్‌ని ఏదో ఒకటి చేసి చూపించకుండా ఉంటాడా అమిత్‌షా!! -మాధవ్ శింగరాజు -
డేట్ డిక్లేర్ చేసేసిన యడ్యూరప్ప...
సాక్షి, బెంగళూర్ : ఓ వైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగానే రాష్ట్ర సీఎంగా తాను మే 17న ప్రమాణ స్వీకారం చేస్తానని బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే మే 15న తాను ఢిల్లీ వెళ్లి 17న జరిగే తన ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తానని చెప్పారు. షికారిపురలో ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం యడ్యూరప్ప విలేకరులతో మాట్లాడారు. 224 మంది సభ్యులు కలిగిన కర్ణాటక అసెంబ్లీలో తమ పార్టీ 145 నుంచి 150 స్ధానాలు గెలుపొందుతుందని యడ్యూరప్ప అంచనా వేశారు. తాను రాష్ట్రమంతా మూడుసార్లు చుట్టివచ్చానని, బీజేపీ ఘనవిజయం సాధిస్తుందనే పూర్తి విశ్వాసం తనకుందని ఆయన చెప్పుకొచ్చారు. సిద్ధరామయ్య నేతృత్వంలోని పాలక కాంగ్రెస్ సర్కార్ పట్ల ప్రజలు విసిగివేసారారన్నారు. 2008లో బీజేపీ దక్షిణాదిలో తొలిసారిగా కర్ణాటకలో అధికార పగ్గాలు చేపట్టినప్పుడు యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. 2011లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆయన అధికార పీఠం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. -
సిద్ధూ సర్కార్‌కు కౌంట్‌డౌన్ : యడ్యూరప్ప
సాక్షి, బెంగళూర్ : సిద్ధరామయ్య నేతృత్వంలోని పాలక కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారని బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప అన్నారు. ప్రజలంతా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి బీజేపీకి అనుకూలంగా ఓటు వేయాలని ఆయన కోరారు. తాను సుపరిపాలన అందచేస్తానని కర్ణాటక ప్రజలకు హామీ ఇస్తున్నానన్నారు. షికార్పూర్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. కాగా సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని, అందుకే పోలింగ్ శాతం పెరుగుతోందని బీజేపీ సీనియర్ నేత సదానందగౌడ అన్నారు. ప్రజలు పెద్దసంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారన్నారు. యడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. మే 15న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. -
మోదీ శ్రమిస్తుంటే... సిద్దరామయ్య నిద్ర..
శివాజీనగర: దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అధోగతికి చేరుకుందని, ఉత్తరప్రదేశ్, త్రిపుర, హర్యానా తదితర రాష్ట్రాల్లో బీజేపీకి వచ్చిన సీట్లకంటే అత్యధికంగా స్థానాలు వచ్చాయని, అదే విధంగానే ఈసారి రాష్ట్రంలో బీజేపీకి ఊహించిన అత్యధిక మెజారిటీ వస్తుందని కేంద్ర మంత్రి అనంతకుమార్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో నిర్వహిచిన మీట్‌ది ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ... స్వాతంత్య్రం వచ్చిన తరువాత 55 ఏళ్ల పాటు సుదీర్ఘ పరిపాలన చేసిన కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం ఆధ్వాన్న స్థితిలో ఉందన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ 18 గంటల పాటు ప్రజల కోసం శ్రమిస్తుంటే సిద్దరామయ్య 18 గంటల పాటు నిద్రపోతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో గత ఐదేళ్ల పాలనలో అస్తవ్యస్థంగా శాంతిభద్రతలు, అత్యాచారాలు, హత్యలు, దోపిడీ, దొంగతనాలు అధికమయ్యాయని పేర్కొన్నారు. బీహర్‌లో లాలు ప్రసాద్‌ను సిద్దరామయ్య కూడా అనుసరిస్తూ పరిపాలన చేశారన్నారు. ఓటు బ్యాంకు రాజకీయ చేస్తూ మత ఘర్షణలు సృష్టించటం లాంటి కార్యకలాపాలు అ«ధికంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగాయని ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా బీజేపీ హైకమాండ్ నిర్ణయించిందని, అదే విధంగానే యడ్యూరప్ప సంపూర్ణ మెజారిటితో సీఎం పీఠాన్ని అధిరోహిస్తారని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సిద్దరామయ్య బీజేపీ–జేడీఎస్‌ల మధ్య పొత్తు ఉందని ప్రచారం చేస్తున్నారని, అయితే కాంగ్రెస్–జేడీఎస్‌ల మధ్య ఉన్న సంబంధాలు లేవని ప్రజలను నమ్మించటానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. యడ్యూరప్ప శివమొగ్గ జిల్లా శికారిపురలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడని ఈసారి 50 వేల మెజారిటీతో గెలుపొందుతారని అనంతకుమార్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సీఎం సిద్దరామయ్య చాముండేశ్వరిలో ఓటమి తప్పదని తెలుసుకొని బాదామి నుంచి పోటీ చేశారని తెలిపారు. సిద్దరామయ్య రాజకీయ జీవితంలో వలస పక్షిగా ఉన్నాడని, ముందుగా జనతా పార్టీలో ఉండి ఆ తరువాత జనతాదళ, అహింద తరువాత కాంగ్రెస్‌లోకి చేరుకున్నారని విమర్శించారు. కార్యక్రమంలో బెంగళూరు ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు సదాశివ శెణై, ప్రధాన కార్యదర్శి కిరణ్, రిపోర్టర్స్ గిల్డ్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
24 గంటల్లోగా రైతు రుణాల మాఫీ
శివాజీనగర : రాష్ట్రంలో బీజేపీ ఈసారి 150 స్థానాల్లో గెలుపొందటంలో ఎలాంటి సందేహం లేదని, 17న తాను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయటం తథ్యమని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీఎస్.యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. అధికారం స్వీకరించిన 24 గంటల్లోగా జాతీయ, సహకార బ్యాంకుల నుంచి పొందిన రూ. లక్ష వరకు రుణ మాఫీ చేస్తానని, లేనిపక్షంలో ఒక్క రోజు కూడా అధికారంలో కొనసాగనని శపథం చేశారు. ఆదివారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో విలేకరులతో మాట్లాడుతూ... జాతీయ బ్యాంకుల రుణమాఫీ చేయాలని సిద్దరామయ్య బోదిబోమంటూ కొట్టుకొంటున్నారని, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానాతో పాటు అనేక రాష్ట్రాల్లో రుణ మాఫీ చేసినా కేంద్ర ప్రభుత్వం మాఫీ చేయాలని ఎవ్వరు చెప్పటం లేదన్నారు. అయితే సిద్దరామయ్య మాత్రం ఇటువంటి వితండమైన ప్రశ్నను ముందుంచుతున్నారని అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంపూర్ణ మెజారిటీతో తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తున్నందున జేడీఎస్‌తో పొత్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బళ్లారి రెడ్డి సహోదరులకు సర్వే ఆధారంగా టికెట్ ఇవ్వడమైనదని, జనార్ధనరెడ్డి టికెట్ పంపిణీ విషయంలో జోక్యం చేసుకోలేదని తెలిపారు. రెడ్డి సహోదరుల, వారి అనుచరులపై ఎలాంటి ఆరోపణలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఆనంద్‌సింగ్, నాగేంద్రలను పక్కలో కూర్చోపెట్టుకుని మరొకరి గురించి మాట్లాడే నైతిక హక్కు సిద్దరామయ్యకు ఉందా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత క్యాబినెట్లో ముస్లీంలకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్తమ పథకాలను కొనసాగించటంతో పాటు ఇందిరా క్యాంటిన్‌ను అన్నపూర్ణ పథకంగా పేరుమార్చి ముందుకు కొనసాగిస్తామని బీఎస్‌వై తెలిపారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ.పరమేశ్వర్, లోక్‌సభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేలు ఒకే వేదికపై కూర్చొని పార్టీ తరపున ప్రచారం జరపాలని ఆయన సవాల్ చేశారు. కాంగ్రెస్ విడిపోయిన ఇల్లుగా మారిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాదనే విషయం అటు ఉంచిన చాముండేశ్వరి, బాదామిలో ముందు సీఎం గెలిచి రావాలని ఎదురుదాడి చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లో సిద్దరామయ్యకు ఓటమి తప్పదని, బాదామిలో బీజేపీ అభ్యర్థి శ్రీరాములు విజయం సాధిస్తారని, ఏ కారణానికి సిద్దరామయ్య గెలుపొందడని ఆయన ఓటమి సద్దిమూట అని జోస్యం చెప్పారు. అవినీతితో లూటీ చేసిన సిద్దరామయ్య తన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, 70 లక్షల హుబ్లెట్ వాచ్ ఎవరు ఇచ్చారని రాష్ట్ర ప్రజల ముందు బహిరంగపరచాలని యడ్యూరప్ప తెలిపారు. కుల,మతాల మధ్య విష బీజం విత్తి రాజకీయ తీగను విస్తరించుకునేందుకు ప్రయత్నిస్తున్న సిద్దరామయ్యకు ఇదే తిరుగు బాణం అవుతుందన్నారు. ప్రత్యేక లింగాయత్ మతం చేయాలని వీరిని ఎవరు అడిగారని, తాను ముఖ్యమంత్రి కాకూడదని ఒకే కారణానికి దానిని విడగొట్టే నీచమైన సంస్కృతికి దిగజారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని ప్రతిఫలం కూడా నేడు సిద్దరామయ్య అనుభవిస్తారని తెలిపారు. -
కాళ్లు చేతులు కట్టేసి.. బీజేపీకి ఓటు వేయించండి
బెంగళూరు : అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓటు వేయకుండా ఇళ్లలో కూర్చునే వారి కాళ్లు చేతులు కట్టేసి మరి బీజేపీ అభ్యర్థికి ఓటు వేయించాలని ఆ పార్టీ సీఏం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం బెలగావి ప్రచారసభలో పాల్గొన్న ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘ఇప్పుడు విశ్రాంతి తీసుకోకండి. ఓటువేయకుండా దూరంగా ఉండాలని ఎవరైన ఉన్నారని మీకనిపిస్తే.. వారి ఇంటికి వెళ్లండి. కాళ్లు, చేతులు కట్టేసి మరి బీజేపీ అభ్యర్థి మహంతేష్ దొడ్డగౌడార్(కిత్తూర్ అభ్యర్థి) కు ఓటు వేయించండి’ ’ అని కార్యకర్తలకు సూచించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. యడ్యూరప్ప రాజ్యంగాన్ని అవమాన పరిచారని, బీజేపీకి ఓటమి భయం పట్టుకోవడంతోనే ఓటర్లను బెదిరించే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రన్‌దీప్ సుర్జేవాలా ట్వీట్ చేశారు. ఇక అంతకు ముందే బీజేపీ ప్రకటించిన అభ్యర్థులను, యడ్యూరప్ప అవినీతిని, ప్రధాని మోదీని ఉద్ధేశిస్తూ 80 సెకన్ల వీడియోను రాహుల్ గాంధీ ట్విటర్లో పోస్టు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి సోదరులకు టికెట్టు ఇవ్వడాన్ని తప్పుపడుతూ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 11 మంది అభ్యర్ధుల గురించి ఏం సమాధానం చెప్తారంటూ మోదీని నిలదీసారు. -
15 రోజుల్లో నేనే సీఎం
సాక్షి, బెంగళూరు: మరో 15 రోజుల తర్వాత తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యురప్ప ధీమా వ్యక్తం చేశారు. నెలమంగలలో జరిగిన బీజేపీ పార్టీ సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి యడ్యురప్ప మాట్లాడారు. 15 రోజుల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో లక్షల మంది ప్రజల మధ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని యడ్యురప్ప చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చరమగీతం పాడాలని, కాంగ్రెస్ లేని కర్ణాటకగా రాష్ట్రాన్ని మారుద్దామని సూచించారు. 150 స్థానాల్లో బీజేపీ గెలిచి అధికారంలోకి వస్తామని చెప్పారు. మరో 12 రోజుల్లో ఈ అవినీతి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాలన నుంచి విముక్తి లభిస్తుందని జోస్యం చెప్పారు. అవినీతికి అంకితమైన సీఎం సాక్షి,బెంగళూరు: ‘సీఎం సిద్దరామయ్య ఓ మూర్ఖుడు, ఆయన అంతటి అవినీతి పరుడిని నేనింత వరకు చూడనేలేదు, అవినీతికి అంకితమైన సీఎం సిద్దరామయ్యకు నా గురించి మాట్లాడే నైతిక హక్కులేదు, నా గురించి మాట్లాడానికి సీఎం సిద్దరామయ్య సిగ్గుండాలి’ అంటూ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప తీవ్ర పదజాలంతో సీఎం సిద్దరామయ్యపై ధ్వజమెత్తారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన యడ్యూరప్ప ప్రసంగం ఆసాంతం ఇలానే కొనసాగింది. అవినీతి పరుడంటూ పదేపదే నాపై ఆరోపణలు చేస్తున్న సీఎం సిద్దరామయ్య ముందు తన చుట్టూ ఉన్న దోపిడీదారుల గురించి తెలుసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చేసిన అవినీతి పనులు లోకాయుక్త అడ్డు వస్తుందనే భయంతో లోకాయుక్తను నిర్వీర్యం చేసారంటూ సీఎం సిద్దరామయ్యపై విమర్శలు చేశారు. లోకాయుక్త సక్రమంగా ఉండిఉంటే మీతో పాటు మీచుట్టూ ఉన్న దోపిడీ మంత్రులంతా సంవత్సరాల తరబడి జైలులో గడపాల్సి వచ్చేదన్నారు. చాముండేశ్వరితో పాటు బాదామిలో కూడా ఓటమికి సిద్ధంగా ఉండాలని రెండు నియోజకవర్గ ప్రజలను మిమ్మల్ని ఘోరంగా ఓడించడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారన్నారు. బీజేపీలో యడ్యూరప్ప డమ్మి అంటూ వ్యాఖ్యలు చేసే అధికారం మీకు ఎవరిచ్చారంటూ ప్రశ్నించడంతో పాటు కాంగ్రెస్ పార్టీలో నయాపైసా కూడా ఉపయోగం లేని నేతల జాబితాలో మొదటిస్థానంలో మీరు ఉంటారని మీ పార్టీలోనే మీకు గౌరవం లేదని అటువంటి నీకు నాపై వాఖ్యలు చేసే నైతిక హక్కు ఉందా అంటూ ప్రశ్నించారు. రాహుల్‌గాంధీని మీ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నకున్నపుడే మీ పార్టీ స్థాయి ఏంటో ప్రజలందరికీ తెలిసిపోయిందని, రాహుల్‌గాంధీ చెబుతున్నదేమిటో ప్రజలెవరికీ అర్థం కావడం లేదని అందుకు రాహుల్‌గాంధీ ప్రచారం చేసిన ప్రతీ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు ఓటమి ఎదురవుతోందన్నారు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీకి అదేగతి పట్టనుందని మీతో పాటు మీ మంత్రులంతా ఇళ్లకే పరిమితం కానున్నారని యడ్యూరప్ప మండిపడ్డారు. -
ఆవేదనతో ఇద్దరు కార్యకర్తల ఆత్మహత్య
మైసూరు: కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప కొడుకు విజయేంద్రకు పార్టీ టికెట్ నిరాకరించడంతో ఆవేదన చెందిన ఇద్దరు కార్యకర్తలు గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. సీఎం సిద్దరామయ్య కొడుకు యతీంద్రకు పోటీగా యడ్యూరప్ప కుమారుడు విజయేంద్రను వరుణ స్థానం నుంచి బరిలోకి దింపాలని బీజేపీ యోచించింది. దీంతో విజయేంద్ర నియోజకవర్గంలో రెండు వారాలపాటు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయితే అధిష్టానం చివరి నిమిషంలో విజయేంద్రకు మొండిచేయి చూపింది. దీంతో గర్గేశ్వరినికి చెందిన హెళవరహుండి గూళప్ప, సరగూరుకు చెందిన బసవణ్ణలు ఆవేదన చెంది ఉరి వేసుకుని ఆత్మహత్యచేసుకున్నారు. -
యడ్యూరప్పకు నిరాశ
బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్పకు తీవ్ర నిరాశే ఎదురైంది. కుమారుడు విజయేంద్రతోపాటు, సన్నిహితురాలు శోభా కరాంద్లజే (యశ్వంత్‌పూర్ కోసం) లకు సోమవారం విడుదల చేసిన నాలుగో జాబితాలోనూ చోటు దక్కలేదు. మైసూరు జిల్లా వరుణ నియోజకవర్గం నుంచి తన కొడుకు విజయేంద్ర పోటీ చేయడంలేదని నంజనగుడులో ఏర్పాటుచేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో యడ్యూరప్ప చెప్పారు. దీంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికతోపాటు.. అక్కడున్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అటు, రెండ్రోజుల క్రితం బీజేపీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి రేవణ్ణ సిద్దయ్య (లింగాయత్ వర్గం బలమైన నాయకుడు)కు వరుణ నుంచి బీ–ఫామ్ ఇచ్చే అవకాశముంది. రేవణ్ణకు ఆరెస్సెస్‌నుంచి బలమైన మద్దతుంది. వరుణ, యశ్వంత్‌పూర్ సహా మరో రెండు నియోజకవర్గాలకు మంగళవారం అభ్యర్థులను ప్రటించే అవకాశం ఉంది. బళ్లారిలో రెడ్డి సోదరులపైనే ఆధారం తూర్పు కర్ణాటక ప్రాంతంలో గాలి జనార్దనరెడ్డి సోదరులపైనే బీజేపీ నమ్మకం పెట్టుకుంది. అందుకే శ్రీరాములు, రెడ్డి సోదరుల కుటుంబసభ్యులు, అనుచరులకు ఏడు టికెట్లు ఇచ్చింది. గాలి మేనల్లుడు, రియల్టర్ లల్లేశ్ రెడ్డిని కన్నడ హోం మంత్రి ఆర్ రామలింగారెడ్డిపై (బీటీఎం లేఔట్ నుంచి) పోటీకి దించనుంది. ఈ ప్రాంతంలోని రెడ్డి ఓట్లను బీజేపీ వైపుకు తీసుకురావటంలో గాలి పాత్ర కీలకం కానుంది. బీజేపీ దీనిపైనే విశ్వాసం ఉంచింది. -
సిద్ధూ ఓటమి ఖాయం
సాక్షి, బెంగళూరు: ‘వచ్చే నెలలో జరిగే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా రావు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చాముండేశ్వరి, బాదామి నియోజకవర్గాల్లోఓడిపోతారు. ఆయన తనయుడు యతీంద్ర కూడా వరుణ నియోజకవర్గంలో ఓడిపోతారు’ అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప జోస్యం చెప్పారు. మరో నెల రోజుల్లో తాను సీఎం పదవి చేపడుతానన్నారు. రాష్ట్రంలో బీజేపీ అత్యధిక సీట్లు సాధించి అధికారంలోకి వస్తుందని చెప్పారు. బీజేపీలో చేరిక : కాంగ్రెస్ తరఫున ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎన్వై గోపాలకృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం బీఎస్ యడ్డూరప్ప సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయనతో పాటు చలవాది నారాయణస్వామి, పూర్ణిమ మల్లేష్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈసందర్భంగా వారు బీఎస్ యడ్డూరప్ప నివాసానికి వెళ్లి కలిశారు. బీఎస్ యడ్యూరప్ప వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా యడ్యూరప్ప మాట్లాడుతూ... మే నెలలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ 50 – 60 సీట్లు మాత్రమే సాధిస్తుందన్నారు. సీఎం సిద్ధరామయ్యకు ఓటమి తప్పదన్నారు. రూ.5 కోట్లకు టికెట్ : చలవాది నారాయణస్వామి మాట్లాడుతూ.... కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్ టికెట్లను అమ్ముతున్నారని ఆరోపించారు. ఈమేరకు బెంగళూరు నగరంలోని మహదేవపుర, నెలమంగళ టికెట్లను రూ.5 కోట్లు చొప్పున విక్రయించారన్నారు. -
సిద్ధూపై వ్యతిరేకత
సాక్షి, బళ్లారి: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతి చోటా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై జనం తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారని, అదే సందర్భంలో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్పపై జనం ఎంతో అభిమానం కనబరుస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. ఆయన శుక్రవారం కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బెళగావిలో కిత్తూరు రాణి చెన్నమ్మ విగ్రహం, సంగొళ్లి రాయణ్ణ సమాధులను దర్శించుకున్న అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలోను, విలేకరులతోను మాట్లాడారు. ఎందరో మహానుభావులు, స్వామీజీలకు జన్మనిచ్చిన కన్నడ నేలపై ప్రస్తుతం అవినీతి రాజ్యమేలుతోందని, దీంతో జనంలో సిద్ధరామయ్య సర్కార్‌పై తీవ్ర అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయన్నారు. సిద్ధరామయ్య ఎన్నికల అనంతరం ఇంటికి పరిమితం అవుతారని జోస్యం చెప్పారు. యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ఆయన నేతృత్వంలో కర్ణాటక సమగ్రాభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్రం లోను బీజేపీ అధికారంలో ఉండటంతో ప్రధాని మోదీ సహకారం కూడా యడ్యూరప్పకు ఎంతో లభిస్తుందని, ఇద్దరు నేతలు కర్ణాటకను దేశంలోనే నంబర్ వన్ చేస్తారనే విషయం జనం నమ్ముతున్నారని గుర్తు చేశారు. ఎన్నికలు జరగక ముందు గెలుపు సందేశం వ్యక్తం అవుతోందన్నారు. కర్ణాటక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని రాహుల్ గాంధీ సర్వశక్తులు ఒడ్డుతున్నారని, అయితే ఆయన ఆశలు ఫలించబోవన్నారు. కర్ణాటక ఎన్నికల అనంతరం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ముక్త్ కాబోతుందన్నారు. కార్యక్రమంలో యడ్యూరప్ప, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
రేపే కాషాయ జాబితా?
సాక్షి, బెంగళూరు: ప్రధాన ప్రతిపక్షం లిస్టు తయారీలో తలమునకలైంది. గతానుభవాల దృష్ట్యా ఈసారి జాగ్రత్తగా అడుగులేస్తోంది. అభ్యర్థుల తుది జాబితాలో తమకు చోటు దక్కుతుందో లేదోనని మథనపడుతూ గతనెల రోజులుగా బీజేపీ నేతలు చూస్తున్న ఎదురుచూపులకు ఎట్టకేలకు సోమవారం లోపు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి ప్రజాదరణ కలిగిఉన్న నేతలకు టికెట్లు ఇవ్వడానికి బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. అదేవిధంగా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నుంచి వలస వచ్చిన నేతలు, గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన నేతలకు కూడా టికెట్లు ఇవ్వాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవడంతో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇలా ఇప్పటి వరకు ఎంపిక చేసిన అభ్యర్థుల తుదిజాబితాపై శనివారం బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప,రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ మురళీధర్‌రావుల నేతృత్వంలో నగరశివార్లలోని ఓ రెసార్ట్‌లో కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇద్దరు కంటే ఎక్కువ ఆశావహులున్న నియోజకవర్గాల్లో టికెట్లు ఎవరికి ఇవ్వాలో, టికెట్లు దక్కని నేతలను ఎలా బుజ్జగించాలనే విషయాలతో పాటు తీవ్రమైన పోటీ ఉండే, ముఖ్యమైన నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై కూడా చర్చించినట్లు సమాచారం. టికెట్లు దక్కలేదని ఎవరూ అల్లరి చేయరాదని, వారికి తగిన అవకాశం కల్పిస్తామని బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. నేడు, రేపు ఢిల్లీలో మథనం 16 రకాల కేటగిరీల్లో సమీక్షలు నిర్వహించి రూపొందించిన అభ్యర్థుల జాబితాతో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప, కేంద్రమంత్రి అనంతకుమార్లు నేడు (ఆదివారం)ఢిల్లీకి చేరుకోనున్నారు. నెలరోజుల పాటు ముమ్మర కసరత్తులు చేసి సిద్ధం చేసిన అభ్యర్థుల జాబితాపై పార్టీ సీనియర్ నేతలతో పాటు స్క్రీనింగ్ కమిటీతో చర్చించిన అనంతరం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా వంద మంది అభ్యర్థులతో మొదటి జాబితాను సోమవారం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు విజయం బీజేపీదేనన్న నమ్మకం ఉన్న మరో 40 నియోజకవర్గాలకు కూడా అదేరోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు సమాచారం. మిగిలిన నియోజకవర్గాలకు మరింత లోతుగా విశ్లేషణలు,సమీక్షలు నిర్వహించి అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయడానికి బీజేపీ అధిష్టానం నిర్ణయించుకున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం నగరానికి చేరుకున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ లిస్టుపై కసరత్తుకు నాయకత్వం వహించారు. -
2014 ఫలితాలు కర్ణాటక బీజేపీకి సాధ్యమేనా?
సాక్షి, హైదరాబాద్ : కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి బీజేపీ అభ్యర్థి బీఎస్ యెడ్యూరప్ప కిందటి (2013) అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ పెట్టి కాషాయపక్షానికి ఉత్తర కర్ణాటకలో ఎనలేని నష్టం కలిగించారు. అయితే 2014 లోక్‌సభ ఎన్నికల నాటికి ఆయన మళ్లీ బీజేపీలో చేరడంతో ఉత్తర కర్ణాటక బీజేపీ కంచుకోటగా మారింది. నాలుగేళ్ల కిందటి యెడ్యూరప్ప ‘మేజిక్’ వచ్చే కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో పనిచేస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ బొంబాయి-కర్ణాటక, హైదరాబాద్-కర్ణాటకగా పిలిచే ఉత్తర కర్ణాటక గత పాతికేళ్లలో బీజేపీకి కంచుకోటగా మారింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెసెస్), మహారాష్ట్ర ప్రభావం గణనీయంగా ఉన్న ఈ ప్రాంతం బీజేపీ కర్ణాటకలో ప్రబల శక్తిగా మారడానికి కారణమైంది. కానీ, కిందటి అసెంబ్లీ ఎన్నికలకు ఆర్నెల్ల ముందు యెడ్యూరప్ప బీజేపీ నుంచి వైదొలగి కర్ణాటక జనతా పక్ష(కేజేపీ) స్థాపించి ఎన్నికల్లో పోటీచేయడంతో బీజేపీకి ఈ ప్రాంతంలో చావుదెబ్బ తగిలింది. కేజేపీ మొత్తం 224 సీట్లకుగాను 203 స్థానాలకు పోటీచేసి కేవలం 8 స్థానాలే గెల్చుకుంది. ఈ పార్టీకి పది శాతం ఓట్లు దక్కడంతో బీజేపీ ఓట్ల శాతం గతంలో సాధించిన 34 నుంచి కేవలం 20 శాతానికి పడిపోయింది. ఫలితంగా బీజేపీ 2013 ఎన్నికల్లో 40 సీట్లకు పరిమితమైంది. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ మొత్తం 110 స్థానాలు గెల్చుకుంది. అయితే, మళ్లీ యెడ్యూరప్ప బీజేపీలో చేరడం, పార్టీ రాష్ట్ర శాఖలో మార్పులు తీసుకురావడంతో 2014 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి ఓట్ల శాతం అనూహ్యంగా 43కు పెరిగింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఎన్నికల్లో 132 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యత సాధించింది. కోస్తా కర్ణాటకలో 2014 గెలుపు పునరావృతమౌతుందా? 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర కర్ణాటకలో మాదిరిగానే కోస్తా కర్ణాటకలో కూడా బీజేపీ ఘోర పరాజయం పాలయింది. అయితే, పైన జరిగినట్టే 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన రీతిలో విజయాలు నమోదు చేసుకుంది. కోస్తా ప్రాంతంలోని దక్షిణ కార్వార్ నుంచి మంగళూరు వరకూ ఉన్న ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోనూ బీజేపీ మెజారిటీ సాధించింది. ప్రధాని నరేంద్రమోదీ చొరవతో రాష్ట్ర బీజేపీకి, యెడ్యూరప్పకు మధ్య సయోధ్య కుదరడంతో కాషాయపక్షానికి కోస్తాలో రికార్డుస్థాయిలో గెలుపు సాధ్యమైంది. ఫలితంగా కర్ణాటకలోని మొత్తం 28 సీట్లకుగాను బీజేపీ 17 సీట్లు కైవసం చేసుకుని లోక్‌సభలో సాధారణ మెజారిటీ సాధించగలిగింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ 2014 నాటి లోక్‌సభ ఎన్నికల నాటి ఫలితాలను సొంతం చేసుకుంటే కర్ణాటకలో సర్కారు ఏర్పాటుకు అవసరమైన 113 సీట్లు సాధించగలుగుతుంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, యెడ్యూరప్ప సొంత పార్టీ కేజేపీకి కలిపి 34 శాతం ఓట్లు వచ్చాయి. ఈ మూడో వంతు ఓట్ల శాతానికి కాంగ్రెస్ సర్కారుపైజనంలో వ్యతిరేకత. నరేంద్రమోదీ ఉధృత ప్రచారం, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎత్తుగడలు తోడయితే బీజేపీకి 37 నుంచి 39 శాతం ఓట్లు పడవచ్చని కర్ణాటక ఎన్నికల విశ్లేషకులు అంచనావేస్తున్నారు. కాని, నాలుగేళ్ల తేడాతో వరుసగా జరిగే రెండు ఎన్నికల ఫలితాలు ఒకే విధంగా ఉంటాయన్న గ్యారంటీ ఏమీ లేదని చరిత్ర చెబుతోంది. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కమలం వికసిస్తుందా... హస్తం పిడికిలి బిగిస్తుందా...
వేసవికాలం ఎండలకు సమాంతరంగా కర్ణాటకలో ఎన్నికల వేడి రోజురోజుకు పెరిగిపోతోంది. అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీజేపీ బలగాలను మోహరిస్తున్నాయి. వ్యూహ, ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్ ఉపఎన్నికల్లో దెబ్బతిన్న (సాక్షి ప్రత్యేకం) బీజీపీకి కర్నాటక ఎన్నికల్లో పాగా వేయడం తక్షణ అవసరం. అలాగే నరేంద్రమోడికి వ్యతిరేకంగా భావ సారూప్యత ఉన్నా లేకున్నా శత్రువు శత్రువులని కూడగట్టుకొని బీజేపీని చావుదెబ్బకొట్టి కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవడం రాహుల్ గాంధీకి తక్షణ కర్తవ్యం. ఎన్నికలు కర్ణాటక విధానసౌధ కోసం అయినా.... నమో, రాగాలకు ఇవి 2019 ఎన్నికలకు ముందు ప్రతిష్టాత్మకమైనవే.. గణాంకాలు ఏమి చెప్పినా, కుల సమీకరణాలు ఎలా ఉన్నా అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడానికి రెండు పార్టీలు సిద్ధంగా లేవు. గత అసెంబ్లీ ఎన్నికలకు (2013) ముందు కర్ణాటక జనతాపక్ష పార్టీ ఏర్పాటు చేసి 9.8 శాతం ఓట్లు 6 సీట్లు సాధించిన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తిరిగి సొంతగూటికికి చేరి బీజేపి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తన అదృష్టాన్ని, పార్టీ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే 75 రోజుల పాటు రాష్ట్రమంతా పర్యటించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై విమర్శలు దాడి మొదలు పెట్టేసారు. ఫిబ్రవరి 4న జరిగిన బెంగుళూరు సభలో ప్రధాని నరేంద్రమోడి సిద్ద రామయ్య ప్రభుత్వ అవినీతిని ఉద్దేశించి ‘‘10 శాతం ప్రభుత్వం’’ గా చిత్రీకరించారు. కర్ణాటకలో రాజకీయ హింస కాదు... రాజకీయ తీవ్రవాదం రాజ్యమేలుతోందని దాడికి దిగారు. గత అయిదు సంవత్సరాల్లో 23 మంది బీజేపీ నాయకుల హత్యలు జరిగాయనేది ఆ పార్టీ ఆరోపణ. అదే సమయంలో గౌరీలంకేశ్ హత్యపై ప్రధాని మౌనం ఇబ్బంది కలిగించే అంశమే. ఫిబ్రవరి 4కి ఇప్పటికి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఉత్తరప్రదేశ్, బీహార్ ఎన్నికల్లో బీజీపీ చావుదెబ్బతినడం ఆ పార్టీ వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ని ప్రచారస్త్రంగా వినియోగించుకోవాలన్న ఎత్తుగడ విషయంలో ఆ పార్టీ పునరాలోచనలో పడింది. (సాక్షి ప్రత్యేకం) యోగీ ముందు ఉత్తరప్రదేశ్ గురించి ఆలోచిస్తే బాగుంటుందని సిద్దరామయ్య విమర్శల దాడి మొదలుపెట్టారు. బీజీపీ (2008–2013) హయాంలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. అవినీతి ఆరోపణలు, కుమ్ములాటలు మత ఉద్రిక్తతలు ఆ పార్టీని చావు దెబ్బ తీసాయి. 2013 ఎన్నికల్లో అధికారం కోల్పోయి 40 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దేవెగౌడ పార్టీ బీజీఎస్ తో సమానంగా సీట్లు గెలుచుకున్నప్పటికి ఆ పార్టీ కన్నా తక్కువశాతం ఓట్లతో మూడోస్థానంతో సరిపెట్టుకొంది. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న సిద్దరామయ్య బలమైన నాయకుడిగా నిలదొక్కుకున్నారు. అయితే శాంతిభద్రతలు, అవినీతి ఆరోపణలు, రైతుల ఆత్మహత్యలు (ఈ ఐదేళ్ల కాలంలో దాదాపు 4000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు గణాంకాలు చెపుతున్నాయి) సిద్ధరామయ్యకు ఇబ్బందికరమైన అంశాలు. బీజీపీ ఈ అంశాలనే ప్రచారాస్త్రాలుగా వాడుకొంటున్నాయి. (సాక్షి ప్రత్యేకం) ఇక 1985 తర్వాత ఏ పార్టీ కూడా కర్ణాటకలో రెండవసారి అధికారంలోకి రాలేదు. ఏ ముఖ్యమంత్రి కూడా రెండవసారి ప్రమాణ స్వీకారం చేయలేదు. దళితులు, వెనకబడిన తరగతులు, కురబలు, ముస్లింల ఓట్లపై కాంగ్రెస్ ఆధారపడుతూ వస్తోంది. లింగాయత్‌లు, బ్రాహ్మణులు బీజేపీ అండగా ఉంటోండగా మరో బలమైన పార్టీ జేడీఎస్ వక్కళిగల ఓటుబ్యాంక్‌పై నమ్మకాన్ని పెట్టుకున్నాయి. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మంట్ల వారీగా పరిశీలిస్తే బీజేపీ 132 అసెంబ్లీ సీట్లలో మెజారిటీ సాధించింది. కాంగ్రెస్ 77 సీట్లలో మెజారిటీ సాధించగా, జీజీఎస్ 15 స్థానాలకే పరిమితమైంది. అయితే అప్పటి మోడీ హవా వేరు. (సాక్షి ప్రత్యేకం) గత సంవత్సర కాలంలో 10 రాష్రాల్లో ఎన్నికలు జరగగా బీజేపీ , బీజేపీ మిత్ర పక్షాలు తొమ్మిందింటిలో పాగా వేశాయి. పంజాబ్ మినహా.. దేశంలో 21 రాష్ట్రాల్లో కాషాయం జెండా రెపరెపలాడుతోంది. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో లింగాయత్‌లకు ప్రత్యేక మతహోదా కల్పిస్తూ సిద్దరామయ్య ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. రాష్ట్ర జనాభాలో 17% లింగాయత్‌లు ఇప్పటివరకు బీజేపీకి మద్దతుగా ఉన్నారు. నాలుగు దశాబ్ధాల్లో ఐదు సంవత్సరాల పూర్తి కాలం పనిచేసిన మొట్టమొదటి కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రికార్డు సృష్టించారు. ఈ ఐదు సంవత్సరాల్లో బలమైన నాయకుడిగా ఎదిగారు సిద్ధరామయ్య. మంత్రులపైన అవినీతి ఆరోపణలు కాంగ్రెస్‌కు సిద్ధరామయ్యకు కొంచెం చికాకు కలిగించే అంశాలే. సిద్దరామయ్య చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, కన్నడిగుల ఆత్మగౌరవ నినాదంతో తలపెట్టిన ‘ప్రత్యేక జండా’ ఉద్యమం వెనుకబడిన కులాలు, దళితులు, ముస్లింల మద్దతు కాంగ్రెస్‌కు కలిసివచ్చే అంశాలు. (సాక్షి ప్రత్యేకం) ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయలేమి, కాంగ్రెస్ సంస్కృతిలో భాగమైన గ్రూపులు. కాంగ్రెస్‌కు ప్రతిబంధకాలుగా కనపడుతున్నాయి. పది సంవత్సరాల క్రితం వింధ్య పర్వతాలకు ఈవల మొదటిసారిగా పాగా వేసిన బీజేపి బలమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన యడ్యూరప్పని ముఖ్యమంత్రిని చేసింది. తర్వాత జరిగిన వివిధ పరిణామాల వల్ల ముగ్గురు ముఖ్యమంత్రులు మారి 2013లో పీఠం కోల్పోయింది. యడ్యూరప్ప తప్ప మరో బలమైన నాయకుడిని తయారు చే సుకోలేకపోయిన బీజీపి ఈ సారి కూడా యడ్యూరప్పని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేస్తోంది. (సాక్షి ప్రత్యేకం) అలాగే బీజీపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చాణక్యం, ప్రధానమంత్రి మోడీ ఆకర్షణలో గట్టెక్కాలని బీజీపి ఆరాటం. అంతర్గత కుమ్ములాటలు కూడా అధిగమించడం బీజీపికి తక్షణ అవసరం. మూడో ప్రధానమైన పార్టీ జేడీఎస్ తండ్రీకొడుకుల పార్టీ ముద్ర నుండి బయటపడలేక పోయింది. అసంఘటితరంగ కార్మికుల్లో కుమారస్వామికి మంచిపేరే ఉంది. బీఎస్సీ, వామపక్ష పార్టీలతో పొత్తు కొంత వరకు కలిసి వచ్చే అంశం. అటు రాహుల్ గాంధీ, ఇటు అమిత్‌షా సర్వశక్తులూ ధారపోసి కర్ణాటకలో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. పంజాబ్ తర్వాత హస్తం చేతుల్లో ఉన్న పెద్ద రాష్ట్రం కర్ణాటక మాత్రమే. ఉత్తరప్రదేశ్, బీహార్ ఉప ఎన్నికల్లో ఎదురు దెబ్బతిన్న బీజేపీకి కర్ణాటకలో షాక్ ఇచ్చి 2019 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం అవాలనేది కాంగ్రెస్ వ్యూహం. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొట్టాలనేది బీజేపీ ప్రతివ్యూహం. (సాక్షి ప్రత్యేకం) కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఆ గెలుపు రాహుల్ గాంధీ ఖాతాలోకి వెళుతుంది. తద్వారా జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ శక్తుల పునరేకీకరణ కార్యక్రమంలో కాంగ్రెస్ తన మాటను చెల్లించుకునే అవకాశం దొరుకుతుంది. ఓడిపోతే... ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’’ ... షా... మోడీల నినాదానికి ప్రజల మద్దతు దొరికినట్టు అవుతుంది. ఎన్నికలు మే 12న ... ఫలితాలు మే 15న ... నడివేసవిలో కమలం వికసిస్తుందా... హస్తం పిడికిలి బిగిస్తుందా... ఎస్ . గోపీనాథ్‌రెడ్డి -
చికెన్ తిని.. నరసింహస్వామిని దర్శించుకున్నాడు!
సాక్షి, బెంగళూరు: ఎన్నికల ప్రచారంలో బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల తరచూగా ఆలయాలను దర్శించుకుంటున్న సంగతి తెలిసిందే. గుజరాత్ ఎన్నికల సందర్భంగా రాహుల్ ‘టెంపుల్ రన్’ ప్రధానంగా మీడియా దృష్టిని ఆకర్షించింది. ఎన్నికల రాష్ట్రమైన కర్ణాటకలోనూ రాహుల్ ఆలయాలను దర్శించుకుంటుండటంతో బీజేపీ.. ఆయనను ‘ఎన్నికల హిందువు’గా అభివర్ణిస్తోంది. రాహుల్ గాంధీ ఆలయాలను దర్శించుకోవడం ఎన్నికల స్టంట్ అని ఆరోపిస్తోంది. తాజాగా ఆయన ’జవారీ చికెన్’ తినిమరీ ఆలయానికి వెళ్లారని కర్ణాటక బీజేపీ చీఫ్ బీఎస్ యడ్యూరప్ప తాజాగా ఆరోపించారు. ‘ఒకవైపు టెన్ పర్సెంట్ సీఎం సిద్దరామయ్య చేపల కూర తిని.. ధర్మస్థల మంజునాథుడిని దర్శించుకుంటే.. మరోవైపు ఎన్నికల హిందువు అయిన రాహుల్‌గాంధీ జవారీ చికెన్ తిని నరసింహస్వామిని దర్శించుకున్నారు’ అని యడ్యూరప్ప ట్వీటర్లో విమర్శించారు. ‘హిందువుల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ ఎందుకు గాయపరుస్తోంది? ఆ పార్టీది సమాజవాదం కన్నా మజావాదం( ఎంజాయ్ చేయడం) ఎక్కువ కనిపిస్తోంది’ అని పేర్కొన్నారు. రాహుల్ నరసింహస్వామిని దర్శించుకున్న ఫొటోలను ఆయన ట్వీట్ చేశారు. గత ఏడాది చేపల కూరతో మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం సీఎం సిద్దరామయ్య మంజునాథ ఆలయాన్ని దర్శించుకోవడం వివాదానికి దారితీసింది. -
ట్విట్టర్లోనూ మాటల తూటాలే
సాక్షి, బెంగళూరు: బీజేపీ పరివర్తన ర్యాలీ ముగింపు సందర్భంగా ఆదివారం నగరంలోని ప్యాలెస్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమం, ప్రధాని నరేంద్రమోదీ పర్యటన, చేసిన ప్రసంగంపై అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల విమర్శల యుద్ధం, కన్నడ సంఘాల నిరసనలు చోటుచేసుకున్నాయి. సిద్ధు ట్వీట్.. యడ్డి రిట్వీట్ బెంగళూరుకు ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ సీఎం సిద్ధరామయ్య... నంబర్ వన్ రాష్ట్రానికి ప్రధాని మోదీకి ఘన స్వాగతం ఆదివారం ట్విట్టర్లో ట్వీట్ చేశారు. దీనిపై బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప స్పందిస్తూ.. అవును కర్ణాటక రాష్ట్రం దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉంది, అది కేవలం అవినీతి, అక్రమాలు, రైతుల ఆత్మహత్యలు,నేరాల్లో మాత్రమే.. అని రిట్వీట్ చేశారు. ట్విట్టర్లో కుమారస్వామి కూడా ట్విట్టర్ నుంచే మోదీకి జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి స్వాగతం పలికారు. దశాబ్దాల కాలంగా ఉత్తర కర్ణాటక తాగు,సాగునీటికి ప్రాణవాయువు లాంటి మహదాయి, కళసా బండూరీ నదీ జలాల పంపిణీ వివాదాన్ని కూడా పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. మహదాయి రైతుల నిరసన మహదాయి నదీ జలాల పంపిణీపై ప్రధాని మోదీ ప్రస్తావించకపోవడంపై మహదాయి పోరాట సంఘాల కార్యకర్తలు నగరంలో పలుచోట్ల నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని చిత్రపటానికి పూలమాలలు వేసి మోడీజీ గెట్వెల్ సూన్ ఫర్ మహదాయి నినాదాలతో కూడిన ప్లకార్డులతో నిరసనలు జరిపారు. కన్నడ పోరాట సంఘాల కార్యకర్తలు ప్యాలెస్ మైదానం వెలుపల శవయాత్రను నిర్వహించారు. పకోడీల విక్రయాలతో నిరసనకు యత్నం పకోడీలు విక్రయించడం కూడా గౌరవప్రదమైన వ్యాపారమేనని ప్రధాని చెప్పడం సరికాదంటూ ప్యాలెస్ మైదానం ఎదుట పకోడీలు విక్రయించడం ద్వారా కాంగ్రెస్ విద్యార్థి సంఘం కార్యకర్తలు నిరసనకు విఫలయత్నం చేశారు. నిరసనలకు అనుమతినివ్వాలని ఎన్ఎస్యూఐ చేసిన విన్నపాన్ని పోలీస్ కమిషనర్ సునీల్‌కుమార్ తిరస్కరించారు. అయినప్పటికీ కార్యకర్తలు పకోడీ విక్రయం ద్వారా నిరసన చేయడానికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. -
‘ముచ్చటేలేదు.. 150 కొట్టేస్తాం.. ’
సాక్షి, బెంగళూరు : ‘సిద్ద రామయ్య ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీని ఇక మా రాష్ట్రంలో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మార్పు మొదలైంది. మరో మాటకు అవకాశం లేదు. కచ్చితంగా 150 సీట్లు గెలిచి తీరుతాం’ అని బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత 75 రోజులుగా పరివర్తన యాత్ర చేస్తున్న ఆయన తన సొంత జిల్లా మాండియా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పచ్చి అవకాశ వాది అని, హిందుత్వం పేరిట లాభం పొందాలనుకుంటున్నారని అన్నారు. హిందువుల గురించి తెగ మాట్లాడుతున్న రాహుల్ ఎన్నికలు ముగిశాక ఆ విషయం మరిచిపోతారని విమర్శించారు. ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేదని అన్నారు. కాంగ్రెస్ విభజన రాజకీయాలు చేస్తోందని, లింగాయత్‌లు వీరశైవులు తన దృష్టిలో ఒకటేనని చెప్పారు. గుజరాత్ 150 సీట్ల మార్క్ బీజేపీ అందుకోలేకపోయిందిగా అని ప్రశ్నించగా కర్ణాటకలో మాత్రం తమ పార్టీ కచ్చితంగా 150 సీట్ల మార్క్‌ను అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. -
ఇది ఆరంభం, ఇక వలసల వెల్లువే
సాక్షి, బెంగళూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ఆరోపించారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసుగెత్తి పోయారని, త్వరలో జరిగే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గె లుపొంది అధికారంలో వస్తామని అన్నారు. గురువారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇద్దరు జేడీఎస్ ఎమ్మెల్యేల చేరిక సందర్భంగా యడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ఎన్నికల్లోపు మరింతమంది బీ జేపీలోకి వలస వస్తారని చెప్పారు. త్వరలో ఎన్నికలు ఉన్నం దున పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడం చట్టవిరుద్ధమని యడ్డి అన్నారు. మూడు నెలలకు గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని సూచించారు. గత బడ్జెట్లో కనీసం 50 శాతం నిధులను కూడా ఖర్చు చేయలేదని తెలిపారు. ఎన్నికల ముందు ఈ మూడు నెలల్లో ఏకంగా రూ. 80 వేల కోట్లు ఖర్చు చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. జేడీఎస్‌లో మాకు ప్రాధాన్యం లేదనే రాజీనామా శాసనసభ స్పీకర్ కేబీ కోళివాడ్ అందుబాటులో లేకపోవడంతో గురువారం శాసనసభ కార్యదర్శి ఎస్.మూర్తికి జేడీఎస్ ఎమ్మెల్యేలు వజ్జల్, పాటిల్ తమ రాజీనామా లేఖలను అందజేశారు. గడిచిన ఏడాది కాలంగా జేడీఎస్ అధినాయకత్వం తమను పక్కన పెట్టిందని వారిద్దరూ ఆరోపించారు. చాలా కార్యక్రమాల్లో తమ ఇద్దరికీ సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తాము జేడీఎస్ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారు. రాజీనామా పత్రాలపై హైడ్రామా రాజీనామా లేఖల విషయంలో భారీ హైడ్రామా చోటుచేసుకుంది. జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామా లేఖలను అందుకునేందుకు శాసనసభ కార్యదర్శి మూర్తి సంశయించారు. నియమాల ప్రకారం రాజీనామా లేఖలను స్పీకర్‌కే సమర్పించాలని వారిద్దరికీ సూచించారు. అయితే గత రాత్రే తాము స్పీకర్‌తో మాట్లాడినట్లు, స్పీకర్ అసెంబ్లీ సెక్రటరీకి రాజీనామా లేఖలు ఇవ్వాల్సిందిగా సూచించినట్లు వారు చెప్పినా మూర్తి ఒప్పుకోలేదు. దీంతో వారు బలవంతంగా మూర్తికి రాజీనామా లేఖలు సమర్పించి వెళ్లిపోయారు. ఫిబ్రవరి 4న బెంగళూరుకు ప్రధాని మోదీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఎన్నికలకు వెళ్తామని బీజేపీ కర్ణాటక ఇన్చార్జి పి.మురళీధర్‌రావు చెప్పారు. ఐదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, పలువురు హిందూ కార్యకర్తలు దారుణ హత్యలకు గురయ్యారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్పనేనని తెలిపారు. బెంగళూరులో ఫిబ్రవరి 4న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించి బహిరంగ సభలో ప్రసంగిస్తారని రావ్ తెలిపారు. -
కర్ణాటకలో యడ్డీ, షా పాచికలు పారవు
సాక్షి, బళ్లారి : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా,కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్పలు శతవిధాలా ప్రయత్నం చేసినా కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావడం కల్ల అని కాంగ్రెస్ సినియర్ నేత, విధాన పరిషత్ సభ్యుడు ఉగ్రప్ప పేర్కొన్నారు. ఆయన బుధవారం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వ వ్యవస్థనే భ్రష్టుపట్టిస్తున్నారని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా బీజేపీ గాలి రోజు రోజుకూ తగ్గుముఖం పడుతోందన్నారు. ఇందుకు ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే సాక్ష్యం అన్నారు. గుజరాత్లో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ నైతికంగా కాంగ్రెస్‌దే విజయమని చెప్పారు. కర్ణాటకలో బీజేపీ పాచికలు పారవన్నారు. యడ్యూరప్ప బీజేపీ పరివర్తన యాత్ర పేరుతో అన్ని జిల్లాలు పర్యటిస్తున్నారని, అయితే ఆయా జిల్లాలో ప్రజల నుంచి పెద్ద స్పందన లేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా పాలన జరుగుతుందనే విషయం ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. అక్రమ మైనింగ్ సంబంధించి, రాష్ట్రాల సరిహద్దులు గుర్తించే విషయమై సీఎం సిద్ధరామయ్యతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. సీట్లు పంపిణీ విషయం తన పరిధిలో లేదని,హైకమాండ్ ఆదేశిస్తే తాను కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. బీజేపీ నేతలు అసెంబ్లీ ఎన్నికలు చావోరేవో అనే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాము చేపట్టిన అభివృద్ధి పనులే ఈ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదం చేస్తాయన్నారు. -
బ్లూ ఫిల్మ్ అంటే నీలిచిత్రాలు
సాక్షి, బెంగళూరు: బ్లూ ఫిల్మ్ అంటే తెలుసా?.. ఇలా ప్రశ్నించింది ఎవరో కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. నగరంలో విజయనగర నియోజకవర్గంలో రూ.64 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ ‘యడ్యూరప్పకు వయసైపోయింది. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు. గతంలో జరిగినవన్నీ మరిచిపోతున్నారు. యడ్యూరప్ప, ఆయన పార్టీ సీనియర్లు అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లి వచ్చారు. కొంతమంది మంత్రులు అసెంబ్లీ సమావేశాల్లో బ్లూ ఫిల్మ్‌లు చూసి పదవులు పోగొట్టుకున్నారు. బ్లూ ఫిల్మ్‌లు అంటే తెలుసా? నీలి చిత్రాలు’ అన్నారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి. అవినీతిపై బహిరంగ చర్చకు యడ్యూరప్ప, బీజేపీ నాయకులతో సిద్ధమని సిద్ధరామయ్య ప్రకటించారు. మేయర్ సంపత్‌రాజ్ మాట్లాడుతూ... సిద్ధరామయ్యను సచిన్ టెండూల్కర్‌తో పోల్చారు. ‘సచిన్ క్రికెట్ ప్రపంచంలో ఎన్నో రికార్డులను నెలకొల్పారు. అయితే చాలా మంది వాటిని మరిచిపోయారు. అదే విధంగా సిద్ధరామయ్య కూడా అనేక పథకాలను ప్రవేశపెట్టినా చాలా వాటిని మరిచిపోయార’ ని అన్నారు. మంత్రి కృష్ణప్ప, ఆయన కుమారుడు ప్రియకృష్ణలు ఈ సభలో పాల్గొన్నారు. -
రథయాత్రలో అపశృతి.. యడ్యూరప్పపై రాళ్లవర్షం..!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నవ కర్ణాటక నిర్మాణ పరివర్తన యాత్రలో శనివారం అపశృతి చోటుచేసుకుంది. రథయాత్ర చేపడుతున్న బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ సీఎం యడ్యూరప్ప వాహనంపై బీజేపీ అసమ్మతి కార్యకర్తలు రాళ్లవర్షం కురిపించారు. ఇటీవల పార్టీ నుంచి బహిష్కరణకు గురైన చౌదరి నాగేశ్ మద్దతుదారులు యడ్యూరప్ప వాహనంపై రాళ్లదాడి చేశారు. ఈ దాడి నుంచి యడ్యూరప్ప తృటిలో తప్పించుకున్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలో మళ్లీ అధికారమే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ రథయాత్రను ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
'సీఎం రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తున్నారు'
సాక్షి,బళ్లారి: రాష్ట్ర ముఖ్యమంత్రి పదవీ కాలం దగ్గరపడుతున్న కొద్ది రాష్ట్ర ఖజానాను లూటీ చేయడమే పనిగా పెట్టుకున్నారని మాజీ సీఎం యడ్యూరప్ప పేర్కొన్నారు.ఆయన శనివారం హుబ్లీలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికార కాలం మరో ఆరు నెలల మాత్రమే ఉంది. దీంతో సీఎం, ఆయన మంత్రి వర్గ సహచరులు కలిసికట్టుగా రాష్ట్రంలో అవినీతి అక్రమాలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇలాంటి మొండీ సీఎంను రాష్ట్ర ప్రజలు ఎన్నడూ చూడలేదన్నారు. రాష్ట్ర మంత్రి జార్జ్ తో రాజీనామా చేయించాల్సింది పోయి ఆయనపై జార్జీ షీట్ వేసే వరకు ఆగడం సరికాదని హితవు పలికారు. జార్జ్ కూడా నైతికత వహించి తన పదవీకి రాజీనామా చేసి నిరూపించుకోవాని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదన్నారు. అంతేకాక మంత్రుల అక్రమాలకు అడ్డు అదుపులేకుండా పోయిందని తెలిపారు. ఈ విధమైన వాటిని సీఎం సమర్ధించుకుంటున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. విద్యుత్ కొనుగోలు విషయంలో డీకేశీ అక్రమార్గాలు ఎంచుకుంటున్నారని ధ్వజమెత్తారు.కోట్లాది రూపాయలు దండుకునేందుకు సీఎం, డీకేశీలు ఇద్దరూ దొందూ దొందేనన్నారు. విజయశంకర్ రాజీనామా విషయంపై కూడా ఆయన స్పందించారు. పార్టీ అన్ని విధాలుగా ఆయనకు పదవులు ఇచ్చిందని, అయితే రాజీనామా చేశారని ఈ విషయం తనకు పూర్తిగా తెలియదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లు తెచ్చుకుని అధికారంలోకి రావడం ఖాయమని యడ్యూరప్ప అన్నారు. -
బెంగళూరు గుంతల రోడ్లపై బీజేపీ వినూత్న నిరసన
-
పాదచారుడిపైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు
సాక్షి, బెంగుళూరు: మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తనయుడు, శికారీపూర్ ఎమ్మెల్యే బీవై రాఘవేంద్ర కారు పాదచారుడిపైకి దూసుకెళ్లిన దుర్ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. రాఘవేంద్ర తన నియోజకవర్గం శికారీపూర్ వైపు వెళ్తున్న సమయంలో హోన్నాళి తాలుకా వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సురేష్(24) అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఎంపీ రేణుకా చార్య ఘటనాస్థలిని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
డీఎస్పీ మృతిపై సీబీఐ విచారణ జరపాలి
∙ సీఎం సిద్ధు, మంత్రి జార్జి దిగిపోవాలి: యడ్యూరప్ప సాక్షి, బెంగళూరు: ‘డీఎస్పీ గణపతి ఆత్మహత్మ కేసు విషయంలో సాక్ష్యాలు నాశనమయినట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదికలో బయటపడింది. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పదవికి రాజీనామ చేయాలి.’ అని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప డిమాండ్ చేశారు. బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎస్పీ గణపతి చావుకు అప్పటి హోంశాఖ మంత్రి కే.జే జార్జ్ ప్రధాన కారణమని తాము మొదటి నుంచి చెబుతున్నామన్నారు. కేసును పక్కదోవ పట్టించడానికే సాక్ష్యాలను నాశనం చేశారన్నారు. ఈ విషయాలన్నీ ఎఫ్ఎస్ఎల్ నివేదికలో బయటికి వచ్చాయన్నారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రితో పాటు మంత్రి కే.జే జార్జ్ వెంటనే పదవులకు రాజీనామ చేయాలన్నారు. లేదంటే ఈనెల 26న బీజేపీ రాష్ట్ర శాఖ తరఫున కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ఈ విషయమై ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరతామన్నారు. మాజీ ఐపీఎస్ అధికారి, రాష్ట్ర హోంశాఖ సలహాదారు కెంపయ్య వల్ల రాష్ట్ర పోలీసు వ్యవస్థ మొత్తం నాశనమవుతోందన్నారు. వెంటనే ఆయన్ను ఆ స్థానం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా, డీఎస్పీ గణపతి ఆత్మహత్య కేసుకు సంబంధించి కేంద్ర మంత్రి సదానందగౌడ కుమారుడు కార్తీక్‌గౌడ పేరు కూడా వినిపిస్తోంది కదా అన్న ప్రశ్నకు నిజంగా తప్పు చేసి ఉంటే శిక్ష పడాల్సిందేనన్నారు. మొత్తంగా డీఎస్పీ గణపతి కుటుంబానికి న్యాయం జరగాలన్నదే తమ అభిమతమని యడ్యూరప్ప పేర్కొన్నారు. -
రూపను బదిలీ చేయడం దారుణం: యెడ్డీ
న్యూఢిల్లీ: కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప సోమవారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. జైళ్ల శాఖ డీఐజీ రూప బదిలీ వ్యవహారంపై ఆయన ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌తో చర్చించారు. భేటీ అనంతరం యడ్యూరప్ప మాట్లాడుతూ... డీఐజీ రూపను బదిలీ చేయడం దారుణమని, నిజాయితీపరులైన ప్రభుత్వ అధికారులకు రాష్ట్రంలో భద్రత లేదని వారిని సిద్ధరామయ్య సర్కార్ శిక్షిస్తోందన్నారు. డీజీపీకి రూప ఇచ్చిన నివేదికను తక్షణమే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో జరిగిన రాజకీయ హత్యలపై విచారణ జరిపించాలని, మంగళూరులో వెంటనే ఎన్ఐఏ కార్యాలయాన్ని ప్రారంభించాలన్నారు. మరోవైపు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు సూపరిండెంటెంట్ కృష్ణ కుమార్‌పై కూడా బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో ఆర్.అనిత నియమితులయ్యారు. కాగా డీఐజీ రూప బదిలీపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. సాధారణ బదిలీల్లో భాగంగా రూప బదిలీ జరిగిందని, అందులో ఎలాంటి ఒత్తిళ్లు లేవని ఆయన స్పష్టం చేశారు. కాగా అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు పరప్పన అగ్రహార జైలులో వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారని సంచలన ఆరోపణలు చేసిన జైళ్ల శాఖ డీఐజీ రూప పై బదీలీ వేటు పడిన విషయం తెలిసిందే. ఆమెను జైళ్లశాఖ నుంచి ట్రాఫిక్‌కు బదిలీ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. శశికళకు జైల్లో అక్రమంగా సౌకర్యాలు కల్పించినందుకు దాదాపు రూ.2 కోట్ల మేర ముడుపులు అందాయని డీఐజీ రూప డీజీపీకి ఆరు పేజీల లేఖ రాయడం కలకలం రేపింది. -
నాకు సీఎం కావాలనే ఆశ లేదు..
– లక్షల కోట్ల నిధులు ఏమయ్యాయి? – అవినీతిలో నంబర్–1 కాంగ్రెస్ సర్కార్ – కేంద్రం నిధులతో రాష్ట్రం సోకులు – టికెట్ల పంపిణీ బాధ్యత ఆయనదే – మాజీ సీఎం యడ్యూరప్ప బళ్లారి: వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు టికెట్ల పంపిణీ విషయం తన చేతుల్లో లేదని మాజీ సీఎం, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప పేర్కొన్నారు. ఈ విషయాల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాదే తుది నిర్ణయమని ఆయన అన్నారు. మంగళవారం జిల్లాలోని జన సంపర్క అభియానలో పాల్గొనేందుకు వచ్చిన సందర్బంగా స్థానిక ప్రభుత్వ అతిధిగృహంలో విలేకరులతో మాట్లాడారు. కొందరు లోక్‌సభ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు టికెట్లు ఆశిస్తున్నారని, అయితే ఎవరికి టికెట్ ఇవ్వాలన్నా అమిత్ షాదే తుది నిర్ణయమన్నారు. ఇప్పటికే సర్వేలు చేస్తున్నారని, సర్వే ఆధారంగా టికెట్ల పంపిణీ జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము ఐదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. గతంలో తాము చేపట్టిన అభివృద్ధి పనులు, మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ నాలుగేళ్ల పాలనలో విజయాల గురించి ప్రజలకు తెలుపుతాం. ఒకే అజెండాతో రాష్ట్ర సంక్షేమానికి ఎవరు పాటు పడతారో వారికే ఓటు వేయాలనే నినాదంతో ఎన్నికలకు వెళతామని ఆయన అన్నారు. రాష్ట్రంలో సిద్ధరామయ్య అవినీతి కుంభకోణాల్లో పీకల్లోతుకు కూరుకుపోయారని విమర్శించారు. లక్షన్నర కోట్ల మేర అప్పులు చేసిన సీఎం రాష్ట్రంలో ఎక్కడెక్కడ అభివృద్ధి చేశారో తెలపాలన్నారు. తాము ఐదేళ్ల అధికార వ్యవధిలో రూ.46 వేల కోట్ల అప్పులు చేయగా, సిద్ధరామయ్య లక్షా 28 వేల 361 కోట్ల మేర అప్పులు చేశామని తెలిపారు. కేంద్రం నుంచి వచ్చిన లక్ష కోట్ల నిధులతో ఎక్కడెక్కడ అభివృద్ధి చేపట్టారో తెలపాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లలో కేవలం నీటిపారుదల రంగానికి రూ.36 వేలకోట్లతో మాత్రమే పనులు చేపట్టారని ఆవేద వ్యక్తం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన తర్వాత నల్లధనం వెలికితీతకు ఎంతో ప్రయత్నం చేశారన్నారు. యుద్దం లేకుండానే పొరుగు దేశం పాకిస్థాన్ గుండెలో దడ పుట్టించారన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నా వాటిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. దళితుల సంక్షేమానికి బీజేపీ ఎంతో పాటుపడుతోందని, వారి సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలతోపాటు మొత్తం రాష్ట్రంలో 150 కు పైగా స్థానాలలో బీజేపీ గెలుపొందడం ఖాయమన్నారు. సీఎం కుర్చీపూ తనకు ఆశ లేదని, అయితే పార్టీని అధికారంలోకి తేవడమే తేన ముఖ్య ఉద్దేశమన్నారు. ఈశ్వరప్పకు, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. అందర కలిసి కట్టుగా అహర్నిశలు పని చేసి బీజేపీని అధికారంలోకి తెస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు. -
'మా ఆస్తులన్నీ రాసిచ్చేస్తా..'
► నాపై ఐటీకి ఫిర్యాదు యడ్యూరప్ప పనే ►రూ.300-400 కోట్లిస్తే మా ఆస్తులు రాసిస్తా ►జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి బెంగళూరు: తన కుటుంబం వద్ద రూ. 20 వేల కోట్ల బినామీ ఆస్తులున్నట్లు కేంద్ర ఐటీకి ఫిర్యాదు వెళ్లడం వెనుక బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప హస్తం ఉన్నట్లు జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి ఆరోపించారు. తనకెవరైనా రూ.300– 400 కోట్లు ఇస్తే తన కుటుంబం పేరుతో ఉన్న ఆస్తులన్నీ రాసిచ్చేస్తానని సవాల్ విసిరారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది ఉండగా, తమ కుటుంబంపై రాజకీయ అక్కసుతో ఈ ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు. బుధవారం ఆయన విధానసౌధలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తనపై ఫిర్యాదు చేసిన వెంకటేష్‌గౌడ కాంగ్రెస్ కార్యకర్త కాదని పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ ప్రకటించారని, అతడు యడ్యూరప్ప మనిషని కుమార విమర్శించారు. ఆ ఫిర్యాదు ఎక్కడ టైప్ అయ్యిందనేది తనకు తెలుసన్నారు. ఈ కుతంత్రం వెనక యడ్యూరప్ప హస్తం ఉంది. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి పనులు చేస్తున్నారన్నారు. యడ్యూరప్పతో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెబుతున్నా...సదరు ఫిర్యాదు పై సీబీఐతో దర్యాప్తు జరిపించాలి, ఒకవేళ బినామి ఆస్తులు రూ.20వేల కోట్లు బయటపడితే వెంటనే సదరు సొమ్మును రాష్ట్రంలోని రైతుల రుణాలను మాఫీ చేయడానికి వినియోగించవచ్చు.’ అని కుమారస్వామి సవాలు విసిరారు. రానున్న ఎన్నికల్లో పార్టీకి రూ.300 నుంచి రూ.400 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఎవరైనా ఈ సొమ్మును ఇస్తే తమ కుటుంబం పేరుమీద ఉన్న ఆస్తులు రాసిస్తానని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు కుమారస్వామి సమాధానమిచ్చారు. కుమార ఆస్తులు రూ.20 వేల కోట్లు జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి, ఆయన కుటుంబం బినామీ పేర్లతో రూ.20వేల కోట్ల ఆస్తులు సంపాదించిందని వెంకటేష్ గౌడ అనే వ్యక్తి కేంద్ర ఆదాయపు పన్ను శాఖకు ఫిర్యాదు చేశారు. రియల్ఎస్టేట్, చిత్రనిర్మాణం, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు తదితర రంగాల్లో కుమారస్వామి కుటుంబం బినామీ పేర్లతో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తోందని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. కుమారస్వామి, కుటుంబానికి రూ.20 వేల కోట్ల విలువ చేసే స్థిరాస్తులు బెంగళూరు, ఢిల్లీతో పాటు అమెరికా తదితర చోట్ల ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో ఎక్కువ భాగం జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవేగౌడ కోడలు కవిత పేరు పైన ఉన్నాయన్నారు. సాధారణ గృహిణి అయిన కవిత కోట్ల ఆస్తులను ఎలా సంపాదించారని అన్నారు. ఈ విషయమై దర్యాప్తు జరిపితే మరిన్ని విషయాలు బయటికి వస్తాయని అందులో పేర్కొన్నారు. -
యడ్యూరప్ప హోటల్లో ఎందుకు తెప్పించారంటే..
-
యడ్యూరప్ప హోటల్లో ఎందుకు తెప్పించారంటే..
బెంగళూరు: దళితుల ఇంటికి వెళ్లిన బీజేపీ నేత యడ్యూరప్ప అక్కడ భోజనం చేయకుండా హోటల్ నుంచి తెప్పించుకుని తిన్నారంటూ వస్తున్న ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. ఆ రోజు యడ్యూరప్ప దళితుల ఇంట్లో తిన్నారని, ఆయనతోపాటు ఉన్న కొంతమందికి ఆహారం సరిపోకపోవడంతోనే బయట నుంచి తెప్పించాల్సి వచ్చిందని బీజేపీ నేత సురేశ్ కుమార్ చెప్పారు. చిత్రదుర్గాలోని ప్రస్తుతం దళిత వాడల్లో పర్యటిస్తున్న యడ్యూరప్ప మధుకుమార్ అనే ఓ దళిత వ్యక్తి ఇంటికి వెళ్లిన సందర్భంలో అక్కడ తినకుండా బయటనుంచి తెప్పించుకొని తిని కులవివక్షను చూపారని డీ వెంకటేశ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఈ విషయాన్ని తమ ఆయుధంగా మలుచుకొని ఆయనపై విమర్శల దాడి ఎక్కుపెట్టారు. ఈ నేపథ్యంలో సురేశ్ కుమార్ వివరణ ఇస్తూ ‘యెడ్యూరప్ప, పార్టీ కార్యకర్తలు ఆ రోజు ఓ దళితుడి ఇంటికి వెళ్లారు. ఆ కుటుంబ సభ్యులు వండివడ్డించారు. వారు ఏం వడ్డించారనే విషయం చెప్పలేంగానీ, చాలా అద్భుతమైన భోజనం పెట్టారు. యడ్యూరప్ప కూడా చక్కగా తిన్నారు. అదొక సంతోషకరమైన వేడుక’ అని ఆయన చెప్పారు. మరోపక్క, మధుకుమార్ అనే ఆ వ్యక్తి కూడా తన ఇంట్లో తయారుచేసిన ఆహారాన్నే యడ్యూరప్ప తిన్నారని తెలిపాడు. ఇదిలాఉండగా, 40 ఏళ్లపాటు రాజకీయాల్లో ఉన్న యడ్యూరప్ప ఇప్పుడెందుకు దళితుల ఇళ్లచుట్టూ తిరుగుతున్నారని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రశ్నించారు. ఇన్ని రోజులు వారు గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. దళితుల ఇళ్లకు వెళుతూ వారిని యడ్యూరప్ప అవమానిస్తున్నారని విమర్శించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కమలం కరువు భేరి
► తుమకూరులో శ్రీకారం ► హాజరైన కేంద్రమంత్రులు ►పార్టీలో విభేదాల్లేవు: యడ్డి తుమకూరు: తమ మధ్య ఎటువంటి విభేదాలు, అంతర్గత కలహాలు లేవు, పార్టీ సమావేశాలు, కార్యక్రమాల్లో మేమంతా కలిసే పాల్గొంటున్నాం, రాష్ట్ర బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోయిందంటూ వచ్చిన వార్తలు కేవలం మీడియా సృష్టేనని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప అన్నారు. కేంద్రమంత్రులు సదానందగౌడ, అనంత్‌కుమార్, బీజేపీ రాష్ట్ర ఇన్చార్జ్ మురళీధర్‌రావు, ఇతర సీనియర్ నాయకులు 40 రోజుల రాష్ట్రవ్యాప్త కరువు పర్యటనను గురువారం తుమకూరులో ఆరంభించారు. తుమకూరు సిద్ధగంగా మఠాధీశుడు శివకుమార్స్వామీజీ దర్శనం చేసుకున్నారు. అనంతరం యడ్యూరప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు నివారణ చర్యలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 40 రోజుల పాటు అన్ని జిల్లాలు, తాలూకాల్లో పర్యటించి కరువుపై సమాచారాన్ని సేకరించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. నిత్యం ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కరువు అధ్యయన పర్యటన సాగుతుందని చెప్పారు. పార్టీలో ఎలాంటి అనైక్యత లేదని తేల్చిచెప్పారు. త్వరలో సిద్ధగంగ మఠానికి ప్రధాని మోదీ కేంద్రమంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ.. ఇటీవల అనారోగ్యానికి గురైన శివకుమార్స్వామీజీ ఆరోగ్యంపై విచారించిన ప్రధాని నరేంద్రమోదీ త్వరలోనే మఠానికి వచ్చి స్వామీజీని దర్శించుకుంటారని తెలిపారు. రాష్ట్ర కరువు నివారణ అధ్యయన పర్యటనను స్వామీజీ ఆశీర్వాదంతో తుమకూరు జిల్లా నుంచి ప్రారంభించడం సంతోషకరమన్నారు. అనంతరం తుమకూరు నగరంలోని దళితవాడలో కరువు నివారణ, తాగునీరు తదితర సమస్యలపై ప్రజలతో మాట్లాడారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి రమేశ్ జిగజణగి, నేతలు జగదీశ్ శెట్టర్, ఈశ్వరప్ప, శోభ, శ్రీరాములు పాల్గొన్నారు. -
యడ్యూరప్పకు కోర్టు నోటీసులు
సాక్షి, బెంగళూరు: కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్‌తో పాటు కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్పకు బెంగళూరు సెషన్స్ కోర్టు శనివారం నోటీసులు జారీ చేసింది. రెండు నెలల కిందట నగర బీజేపీ కార్యాలయంలో వీరిద్దరూ వేదికపై ‘మనం కూడా హైకమాండ్‌కు ముడుపులు ఇచ్చాం. అయితే అందరికీ తెలిసేటట్టు ఇస్తామా’ అని ఒకరికొకరు చెప్పుకుంటున్నట్లున్న వీడియోను కాంగ్రెస్ నాయకులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ సీడీలను కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఉగ్రప్ప సిటీ సైబర్ పోలీస్‌స్టేషన్‌లో అందజేసి దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా కోరారు. పోలీసులు కోర్టును ఆశ్రయించగా వీరిద్దరికీ కోర్టు నోటీసులు జారీ చేస్తూ, ఇవి అందిన ఏడు రోజుల్లోపు స్వర పరీక్షలకు హాజరు కావాలని ఆదేశించింది. -
డబ్బులు పంచుతూ కెమెరాకు దొరికిపోయారు!
-
డబ్బులు పంచుతూ కెమెరాకు దొరికిపోయారు!
కర్ణాటకలో ప్రతిష్టాత్మకంగా మారిన ఉప ఎన్నికల్లో ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, అటు ప్రతిపక్ష బీజేపీ జోరుగా ప్రలోభాలకు తెరతీశాయి. నంజన్‌గుడ, గుండ్లుపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికలను రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు సవాలుగా తీసుకోవడంతో.. ఇక్కడ డబ్బులు ఏరులై పారుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తాజాగా బీజేపీ రాష్ట్ర చీఫ్ బీఎస్ యడ్యూరప్ప ఓటర్లకు డబ్బులు ఇస్తూ కెమెరా కంటికి దొరికిపోయారు. చామ్రాజ్ నగర్ జిల్లాలో ఓ కుటుంబానికి ఆయన డబ్బులు ఇస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోపై ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తుండగా.. యడ్యూరప్ప మాత్రం తన చర్యను సమర్థించుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు కుటుంబానికి తాను మానవతా దృక్పథంతో ఆర్థిక సాయం చేశానని, ఇంటి పెద్ద అయిన రైతు చనిపోవడంతో ఆ కుటుంబం దీనస్థితిని గమనించి.. పార్టీ ఫండ్ నుంచి వారికి సాయం చేశామని ఆయన ‘ఇండియా టుడే’తో చెప్పారు. అంతకుముందే కాంగ్రెస్ నాయకులు ప్రచారంలో డబ్బులతో తిరుగుతున్న వీడియో ఒకటి వెలుగుచూసింది. కర్ణాటక కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు లక్ష్మి హెబల్కర్ రూ. 2వేల నోట్లను చేతిలో పట్టుకొని ప్రచారం నిర్వహిస్తున్న వీడియో దుమారం రేపింది. ఈ వీడియోల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నాయకులు డబ్బులు పంచుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. BJP Karnataka chief B S Yeddyurappa gives money to family of deceased farmer.Congress alleges violation of model code(bypolls) (7.4.17) pic.twitter.com/OhaI7MJnUj — ANI (@ANI_news) 8 April 2017 -
ఆయన చేరికతో అదనంగా 40 సీట్లు గెలుస్తాం
బెంగళూరు: ఉత్తరప్రదేశ్‌లో ఘనవిజయం సాధించడంతో జోష్ మీదున్న బీజేపీ.. దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో కాషాయ జెండా ఎగరేయాలని దృష్టిసారిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ చేరికతో తమకు విజయావకాశాలు మరింత పెరిగాయని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో 224 అసెంబ్లీ సీట్లకు గాను 150 సాధించడం తమకు కష్టంకాదని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. కృష్ణ చేరిక వల్ల తమ పార్టీ అదనంగా 40 సీట్లు గెలుస్తుందని చెప్పారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో పనిచేసిన కృష్ణ ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీలోకి కృష్ణ చేరడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని యడ్యూరప్ప ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ముఖ్యమంత్రిగా పనిచేసినపుడు ఎస్ఎం కృష్ణ బెంగళూరు అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ఆయన హయాంలోనే ఐటీ రంగం అభివృద్ధి చెందిందని తెలిపారు. దీంతో బెంగళూరు ప్రజల్లో ఆయనకు మంచి ఇమేజ్ ఉందని, ఇది తమ పార్టీకి ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కర్ణాటకలో బీజేపీని గెలిపిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే తానే ముఖ్యమంత్రిని అవుతానని, ఇందులో సందేహం లేదని యడ్యూరప్ప చెప్పారు. -
'సిద్ధుపై పరువునష్టం దావా వేస్తా'
మైసూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై పరువునష్టం దావా వేస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప హెచ్చరించారు. నిర్దోషిని అని కోర్టులు తీర్పులిచ్చినా కూడా సిద్ధరామయ్య తనను జైలుకు పోయివచ్చాడని, కేసులున్నాయని అని బహిరంగ సమావేశాల్లో పదేపదే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం నంజనగూరు నియోజకవర్గంలో బదనవాళు గ్రామంలో బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ ప్రసాద్‌కు మద్దతుగా యడ్యూరప్ప ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనపైన ఉన్న కేసులను కోర్టులు కొట్టివేసినా సిద్దరామయ్య నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇలాగే మాట్లాడితే ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. సిద్ధు ఆరోపణలకు భయపడబోనని చెప్పారు. దేశంలోనే ఆయన అత్యంత అవినీతిపరుడైన నాయకుడని వ్యాఖ్యానించారు. డైరీల కుంభకోణంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని యడ్యూరప్ప సవాల్ విసిరారు. -
కర్ణాటకలో ‘డైరీ’ రాజకీయం
సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ మంత్రులు హైకమాండ్‌కు ముడుపులు ఇచ్చారంటూ కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప విడుదల చేసిన డైరీ ప్రకంపనలు ఆగకముందే మరో డైరీ బీజేపీకి చెమటలు పట్టిస్తోంది. బీజేపీ నేతలు ఆ పార్టీ హైకమాండ్‌కు ముడుపులు ఇచ్చారంటూ సామాజిక మాధ్యమాల్లో మరో డైరీ దర్శనమిచ్చింది. యడ్యూరప్ప ఆప్తుడు, విధానపరిషత్ సభ్యుడు లేహర్‌సింగ్ ఇంటిపై ఐటీ సోదాల్లో డైరీ లభించినట్లు వార్తలొచ్చాయి. అందులో ‘రిసీవ్డ్’ శీర్షికతో సీఎంఓ, ఆర్ఏ అనే వ్యక్తులు రూ.67కోట్లు, ఎంఐఆర్, ఏఎల్ఈ అనే వ్యక్తులు రూ.128కోట్లు, రేణు పేరుతో రూ.13కోట్లు, జేఎస్ పేరుతో రూ.9 కోట్లు, ఎస్క్యూ పేరుతో రూ.3 కోట్లు, ఎస్ఆర్ పేరుతో రూ.1.80 కోట్లు, ఆర్ఏ, కేఎస్ఈ పేరుతో రూ.31 కోట్లు, డీవీఎస్, పీఎస్ అనే వ్యక్తులు రూ.11 కోట్లు, ఇతర కంపెనీలు, కార్పొరేటర్లు రూ.128 కోట్లు... మొత్తం రూ.391.08 కోట్లు అందించినట్లుగా ఉంది. మొత్తం రూ.391.08 కోట్ల ముడుపులు అందించినట్లు, అందుకు సాక్ష్యంగా లెహర్‌సింగ్ సంతకం కూడా ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో డైరీ హల్చల్ చేస్తోంది. -
మనమూ ముడుపులిచ్చాం కదా!
► బీజేపీ నేత యడ్యూరప్ప, కేంద్ర మంత్రి అనంత్ సంభాషణ! ► సీడీ విడుదల చేసిన కర్ణాటక మంత్రులు సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రధాన విపక్షమైన బీజేపీ మధ్య ఎత్తుకు పైఎత్తులతో రాజకీ యం జోరుగా సాగుతోంది. సీఎం సిద్ధరామయ్య పదవిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పెద్దలకు రూ. వెయ్యికోట్ల ముడుపులిచ్చాడని, ఆ డైరీ ఈడీ వద్ద ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప ఆరోపించడం, ఆయనపై పరువునష్టం దావావేస్తానని సీఎం ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మంత్రులు బసవరాజ రాయ రెడ్డి, ఎంబీ పాటిల్, రమేష్‌కుమార్ సోమవారం విధానసౌధలో ఒక చేశారు. యడ్యూరప్ప, కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌లు ఆదివారం బెంగళూరు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి. అందులో సిద్ధరామయ్యపై ఆరోపణలు చేసి భలే ఇరికించారని అనం త్.. యడ్యూరప్పతో అంటారు. మీరు, నేను కూడా పార్టీ పెద్దలకు ముడుపులు ఇచ్చాం కదా.. అని అనంత్‌కుమార్ మళ్లీ అంటారు. యడ్యూరప్ప స్పందిస్తూ ఎంత ఇచ్చినా ఎవరైనా డైరీలో రాస్తారా? అని సమాధానం ఇస్తారు. ఈ సంభాషణపై సుప్రీంకోర్టు జడ్జితో దర్యాప్తు చేయించాల ని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. సీడీ విషయంపై అనంత్‌కుమార్, యడ్యూరప్ప స్పందిస్తూ.. తాము మాట్లాడిన పూర్తి మాటలను కాకుండా అక్కడొక పదం, ఇక్కడొక పదం తీసి సీడీని రూపొందించారని ఆరోపించారు. -
బీజేపీ గూటికి సీనియర్ నేత, మాజీ సీఎం!
-
బీజేపీ గూటికి సీనియర్ నేత, మాజీ సీఎం!
బెంగళూరు: ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన అత్యంత సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ బీజేపీ గూటికి చేరబోతున్నారు. ఈ విషయాన్ని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప వెల్లడించారు. ఎస్ఎం కృష్ణ త్వరలోనే బీజేపీ కండువా కప్పుకోనున్నారని తెలిపారు. ఎస్ఎం కృష్ణ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారని, అయితే ఆయన ఎప్పుడు చేరుతారనే తేదీని ఇంకా ఖరారు చేయలేదని ఆయన శనివారం మీడియాతో చెప్పారు. కానీ, ఎస్ఎం కృష్ణ బీజేపీలో చేరడం 100శాతం ఖాయమని స్పష్టం చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రిగా, యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన ఎస్ఎం కృష్ణ గతవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కాంగ్రెస్ వర్కింట్ కమిటీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ.. శనివారం ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖను పంపారు. కర్ణాటకలో సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న నేతగా మంచి పేరున్న ఎస్ఎం కృష్ణ కాంగ్రెస్‌ను వీడటంతో ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమిటన్నదని చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల నుంచి తప్పుకొని.. విశ్రాంత జీవితం గడపాలని ఆయన కోరుకుంటున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి కూడా. అయితే, ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎస్ఎం కృష్ణ చేరిక తమకు లాభిస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. -
రాజీకి రాకపోతే.. పార్టీ నుంచి వెళ్లిపోండి!
కర్ణాటక నేతలకు అమిత్ షా సీరియస్ వార్నింగ్! బెంగళూరు: పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గట్టిగా మందలించడంతో కర్ణాటక బీజేపీ అగ్ర నేతలు బీఎస్ యడ్యూరప్ప, కేఎస్ ఈశ్వరప్ప విభేదాలు పక్కనబెట్టి రాజీకి అంగీకరించారు. కన్నడ పోరాటయోధుడు సంగోలి రాయన్న సంస్మరణార్థం నిర్వహించనున్న కార్యక్రమాలు పార్టీ వేదికలో ఉమ్మడిగా నిర్వహించేందుకు అంగీకరించారు. సంగోలి రాయన్న సంస్మరణ కార్యక్రమాలు సంగోలీ రాయన్న బ్రిగేడ్ పేరిట పార్టీకి అతీతంగా కర్ణాటక శాసనమండలి ప్రతిపక్ష నేత కేఎస్ ఈశ్వరప్ప ప్రత్యేకంగా నిర్వహించేందుకు సిద్ధపడటంతో పార్టీలో ముసలం తలెత్తింది. ఈ కార్యక్రమాలను రాష్ట్ర బీజేపీ చీఫ్ యడ్యూరప్ప వ్యతిరేకించారు. దీంతో ఇరువురు నేతల మధ్య ప్రచ్ఛన్నయుద్ధానికి తెరలేచింది. దీంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు షా రంగంలోకి దిగి ఇరువురు నేతలకు గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. పార్టీ సంప్రదాయాలకు అనుగుణంగా పనిచేయకుంటే.. పార్టీని వీడి వెళ్లిపోవచ్చునంటూ ఇరువురు నేతలకు ఆయన ఘాటుగా చెప్పడంతో ఇద్దరు దిగొచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమంలో యడ్యూరప్ప, ఈశ్వరప్ప ఇద్దరూ పాల్గొంటారని బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తెలిపారు. పార్టీలో ఇరువురు అగ్రనేతల మధ్య విభేదాలతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు గందరగోళం నెలకొందని కర్ణాటకకు చెందిన కేంద్రమంత్రులు అధిష్టానానికి నివేదించడంతో షా కల్పించుకొని ఈమేరకు ఇరువురు నేతల మధ్య సయోధ్య కుదిర్చినట్టు తెలుస్తోంది. -
యడ్డీ.. చెప్పుడు మాటలు వినొద్దు
బెంగళూరు: భారతీయ జనతా పార్టీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప చెప్పుడు మాటలు వినడం మానుకోవాలని అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సోమణ్ణ అభిప్రాయపడ్డారు. బెంగళూరులో శుక్రవారం ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతం కావాలంటే యడ్యూరప్ప అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఒకరిద్దరు మాటలు విని నిర్ణయం తీసుకుంటే పార్టీలో అసంతృప్తి పెరగడం ఖాయమన్నారు. ‘ కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్ లాంటి వారు కూడా నేను ఎదురుపడితే పలకరిస్తారు. అయితే యడ్యూరప్ప, ఆయన చుట్టూ ఉన్న కొంతమంది నన్ను కూడా పట్టించుకోవడం లేదు. నా పరిస్థితే ఇలా ఉంటే మిగిలిన వారి పరిస్థితి మీరే( మీడియా ప్రతినిధులు) అర్థం చేసుకోండి’ అని సోమణ్ణ వాపోయారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. పార్టీ ప్రయోజనాల రీత్యా యడ్యూరప్ప, కే.ఎస్ ఈశ్వరప్పలు ఒకే చోట చేరి ముఖాముఖి చర్చలు జరిపి తమ మధ్య ఉన్న మనస్పర్థలు తొలగించుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్.అశోక్ అభిప్రాయపడ్డారు. -
పెళ్లికి వెళ్లొద్దని ఎవరూ చెప్పలేదు!
అంగరంగ వైభవంగా జరగనున్న గాలి జనార్దనరెడ్డి కుమార్తె పెళ్లికి వెళ్లొద్దని తనకు ఎవరూ చెప్పలేదని బీజేపీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అన్నారు. ఈ పెళ్లికి వెళ్లాలా.. వద్దా అనే విషయంలో చాలామంది నాయకులకు శషభిషలున్నాయి. గాలి జనార్దనరెడ్డితో సత్సంబంధాలున్న బీజేపీ అగ్రనాయకత్వం కూడా దీనిపై ఏమీ చెప్పలేదు. వెడ్డింగ్ కార్డుతోనే అదరగొట్టిన జనార్దనరెడ్డి సోదరులు.. ఇక పెళ్లిని ఇంకెంత వైభవంగా చేస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పార్టీ నాయకులు ఎవరూ ఈ పెళ్లికి హాజరు కావొద్దని బీజేపీ అగ్రనాయకత్వం చెప్పిందంటూ వచ్చిన కథనాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయిన యడ్యూరప్ప తోసిపారేశారు. జనార్దనరెడ్డి ఇప్పుడు, ఎప్పుడూ కూడా బీజేపీ నాయకుడేనని.. అందువల్ల ఆయన కూతురి పెళ్లికి పార్టీ నాయకులు వెళ్లడంలో తప్పేమీ లేదని బళ్లారి జిల్లా బీజేపీ అధ్యక్షుడు గురులింగన గౌడ అన్నారు. ఇప్పటికే కర్ణాటకకు చెందిన కేంద్రమంత్రులతో సహా పలువురు అగ్రనేతలకు ఒక్కోటి రూ. 10వేల విలువైన పెళ్లి శుభలేఖలు వెళ్లాయని తెలుస్తోంది. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, మాజీ ప్రధాని దేవెగౌడలను కూడా పెళ్లిక ఆహ్వానించారు గానీ.. వాళ్లు హాజరు అవుతారో లేదో అన్నది అనుమానంగానే కనిపిస్తోంది. 660 ఎకరాల విస్తీర్ణం ఉన్న బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో బుధవారం ఈ పెళ్లి జరగనుంది. పెళ్లి వేదికను ముందుగానే మీడియా ఫొటోగ్రాఫర్లు ఎక్కడ అత్యుత్సాహంతో ఫొటోలు తీసి బయటపెడతారోనని ముందు జాగ్రత్తగా దాదాపు 3వేల మంది సెక్యూరిటీ గార్డులు, బౌన్సర్లను వివాహ వేదిక వద్ద నియమించారని తెలుస్తోంది. పెళ్లికి దాదాపు 50 వేల మంది అతిథులు వస్తారని అంచనా. ఒక జాతీయ మీడియాకు చెందిన రిపోర్టర్ తన సెల్‌ఫోన్‌తో వివాహ వేదిక ఫొటో తీసేందుకు ప్రయత్నించగా, బౌన్సర్లు అతడి ఫోన్ లాగేసుకున్నారు. -
టిప్పు జయంతికి సర్వం సిద్ధం
అవాంఛనీయ ఘటనలు జరిగితే యడ్డీదే బాధ్యత హెచ్చరించిన సీఎం సిద్ధరామయ్య బెంగళూరు(బనశంకరి): తీవ్ర వ్యతిరేకత మధ్య టిప్పు జయంతి ఆచరణకు ప్రభుత్వం సన్నద్ధమైంది. గురువారం నిర్వహించే టిప్పు జయంతి సందర్భంగా ఎక్కడైనా బీజేపీ, ఆర్ఎస్ఎస్, భజరంగదళ్ కార్యకర్తలు ఇబ్బందులు సృష్టిస్తే నిర్ధాక్షిణ్యంగా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీఎం సిద్ధరామయ్య హెచ్చరించారు. సీఎం నివాస కార్యాలయం కృష్ణాలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, భజరంగదళ్ సంఘాలు సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కుటిల ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. టిప్పు జయంతి సందర్భంగా శాంతిభద్రతలకు అడ్డుతగిలిన వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకాడదని సీఎం స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీఎస్.యడ్యూరప్ప నీతినియమాలు వదిలేశారని విమర్శించారు. ఆయన కేజీపీలో ఉండగా టిప్పుసుల్తాన్ను శ్లాఘించారన్నారు. బీజేపీలోకి వచ్చిన అనంతరం టిప్పును వ్యతిరేకిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుతం రాజకీయం చేయడానికి టిప్పు జయంతిని యడ్యూరప్ప వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. టిప్పు జయంతి సందర్భంగా శాంతిభద్రతలకు భంగం వాటిల్లితే యడ్యూరప్పదే బాధ్యత అని సిద్ధరామయ్య హెచ్చరించారు. విపక్షనేత జగదీశ్ షెట్టర్, ఉప నేత ఆర్.అశోక్‌లు టిప్పు ధరించిన టోపీ పెట్టుకొని ఫోజులు ఇచ్చిన విషయాన్ని ప్రజలు మరచిపోలేదన్నారు. టిప్పు జయంతి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఎం చెప్పారు. -
టిప్పు జయంతి నిర్వహించొద్దు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప బెంగళూరు: ఎట్టి పరిస్థితుల్లోనూ టిప్పు జయంతిని ప్రభుత్వం నిర్వహించకూడదని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకు విరుద్ధంగా జరిగితే పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా వీధి పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన కన్నడ రాజ్యోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిగా టిప్పు జయంతిని నిర్వహించాలని భావించడం సరికాదన్నారు. దీని వల్ల శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కన్నడ మాత భువనేశ్వరీదేవి విగ్రహాన్ని పూర్తి చేస్తామన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భువనేశ్వరీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం రూ.25 కోట్లను బడ్జెట్లో కేటారుుంచినట్లు ఈ సందర్భంగా గుర్తుచేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ... నదీ జలాల విషయంలో సిద్ధరామయ్య రాజకీయాలు చేయడం తగదన్నారు. కావేరి, మహదారుు విషయంలో కేంద్రానిదే బాధ్యత అన్నట్లు భ్రమలు కల్పించే ప్రయత్నం మానుకోవాలన్నారు. శాంతిభద్రతల అదుపు చేయడంలో కూడా సిద్ధరామయ్య విఫలమయ్యారన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త రుద్రేశ్ హత్య విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా సిద్ధు ప్రభుత్వం వ్యవహరిస్తోందని అనంతకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
యడ్డీకి క్లీన్ చిట్.. బీజేపీలో సంబరాలు
మైసూరు : ముడుపుల కేసుల నుంచి మాజీ సీఎం, బీజేపీ రాష్ట్రశాఖ అద్యక్షుడు బీ.ఎస్. యడ్యూరప్పకు క్లీన్ చిట్ రావడంతో గురువారం మైసూరు నగరంలో మాజీ మంత్రి.ఎస్.ఎ. రామదాసు నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. అగ్రహారలో ఉన్న గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 101 కొబ్బరి కాయలు కొట్టి స్వీట్లు పంపిణీ చేశారు. రామదాసు మాట్లాడుతూ యడ్యూరప్పపై లేనిపోని ఆరోపణలు చేయగా కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందన్నారు.