
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములు శనివారం తమ లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. వీరిరువురి రాజీనామాలను లోక్ సభ స్పీకర్ ఆమోదించారు. కాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో షికారిపుర నియోజకవర్గం నుంచి యడ్యూరప్ప, మొళకాల్మూరు నియోజకవర్గం నుంచి శ్రీరాములు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం విధాన సౌధలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటివరకూ శ్రీరాములు బళ్లారి, యడ్యూరప్ప షిమోగా ఎంపీలుగా కొనసాగారు. ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప కర్ణాటక అసెంబ్లీలో ఇవాళ సాయంత్రం బలపరీక్షకు సిద్ధం అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment