
యడ్యూరప్ప, జగదాంబిక పాల్, నితీష్ (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్: చివరివరకూ ఉత్కంఠ భరితంగా సాగిన కర్ణాటక రాజకీయాలకు క్లైమాక్స్‌లో బీజేపీ నేత యడ్యూరప్ప అనూహ్య ట్విస్ట్ ఇచ్చారు. కేవలం మూడు రోజుల వ్యవధిలో సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసందే. అనంతరం గవర్నర్ వజుభాయ్ వాలాకు రాజీనామా లేఖ సమర్పించారు. తద్వారా భారతదేశ ముఖ్యమంత్రులలో అతి తక్కువ రోజులు సీఎంగా ఉన్న ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేత జగదాంబికా పాల్ సరసన చేరారు. ఈ నెల 17న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప 19న (శనివారం) రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
భారతదేశ రాజకీయాల్లో గతంలో కొన్ని పార్టీల నేతలు రాజకీయ సంక్షోభాల కారణంగా పదవి నుంచి తప్పుకున్నారు. విశ్వాస పరీక్షలో నెగ్గకపోవడం, ఇతర పార్టీల మద్దతు లభించకపోవడంతో పలువురు ముఖ్యమంత్రులు రాజీనామాలు చేశారు.
అతి తక్కువ రోజులు సీఎంగా చేసిన నేతలు వీరే....
- 1) జగదాంబికా పాల్ (ఉత్తర ప్రదేశ్) : మూడో రోజు రాజీనామా (1998లో ఫిబ్రవరి 21 నుంచి 23వరకు)
- 2)యడ్యూరప్ప (కర్ణాటక) : మూడో రోజు రాజీనామా (2018లో మే 17 నుంచి 19వరకు (58 గంటల పాటు))
- 3)సతీశ్ ప్రసాద్ సింగ్ (బిహార్) : ఐదో రోజు రాజీనామా (1968లో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1వరకు)
- 4)ఓం ప్రకాష్ చౌతాలా (హరియాణా) : 6వ రోజు రాజీనామా (1990లో జులై 12 నుంచి 17వరకు)
- 5)నితీష్ కుమార్ (బిహార్) : 8వ రోజు రాజీనామా (2000లో మార్చి 3 నుంచి 10వరకు)
- 6)యడ్యూరప్ప (కర్ణాటక) : 8వ రోజు రాజీనామా (2007లో నవంబర్ 12 నుంచి 19వరకు)
- 7)ఎస్.సీ మరాక్ (మేఘాలయ) : 12వ రోజు రాజీనామా (1998లో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 10వరకు)
- 8)ఓం ప్రకాష్ చౌతాలా (హరియాణా) : 17వ రోజు రాజీనామా (1991లో మార్చి 21 నుంచి ఏప్రిల్ 6వరకు)
- 9)జానకీ రామచంద్రన్ (తమిళనాడు) : 24వ రోజు రాజీనామా (1988లో జనవరి 7 నుంచి 30వరకు)
- 10)బీపీ మండల్ (బిహార్) : 31 రోజులు (1968లో ఫిబ్రవరి 1 నుంచి మార్చి 2వరకు)
Comments
Please login to add a commentAdd a comment