‘వక్ఫ్’ జేపీïసీ కమిటీ భేటీపై విపక్షాలు
కోల్‌కతా/న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లుపై సమీక్ష చేపడుతున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నవంబర్ 9వ తేదీ నుంచి మొదలుకానున్న తదుపరి సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు కమిటీలోని విపక్ష సభ్యులు ప్రకటించారు. కమిటీ సభ్యులు కల్యాణ్ బెనర్జీ, నదీముల్ హక్ గురువారం కోల్‌కతాలో మాట్లాడారు.
‘‘విరామం ఇవ్వకుండా, సమీక్షలకు మేం సిద్ధమయ్యే అవకాశం లేకుండా చైర్మన్, బీజేపీ నేత జగదాంబికా పాల్ సమావేశాలకు తేదీలు ఖరారు చేశారు. వేర్వేరు రాష్ట్రాల్లో గువాహటి, భువనేశ్వర్, కోల్‌కతా, పట్నా, లక్నోల్లో ఆరు రోజుల్లో సమావేశాలకు రమ్మంటున్నారు. పాల్ ఏకపక్ష నిర్ణయాలను మేం వ్యతిరేకిస్తున్నాం. అందుకే ఈ దఫా భేటీలను మేం బహిష్కరించబోతున్నాం’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment