Opposition members
-
జేపీసీ సమావేశంలో రగడ
న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లుపై జరిగిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) సమావేశంలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ నేత, చైర్మన్ జగదాంబికా పాల్ నేతృత్వంలో జేపీసీ శుక్రవారం సమావేశమైంది. చైర్మన్ తీరుపై విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ఆయన నడుచుకుంటున్నారని, నియమ నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. మీటింగ్ ఎజెండాను రాత్రికి రాత్రే ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారని ధ్వజమెత్తారు. జేపీసీ కార్యకలాపాలను ఒక ఫార్స్‌గా మార్చేశారని దుయ్యబట్టారు. విపక్ష సభ్యుల తీరుపై జగదాంబికా పాల్ అభ్యంతరం వ్యక్తంచేశారు. తనను ఇష్టానుసారంగా దూషిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు కల్యాన్ బెనర్జీపై మండిపడ్డారు. సమావేశానికి అంతరాయం కలిగించడానికే వచ్చారా? అని నిలదీశారు. దీంతో జగదాంబికా పాల్‌కు వ్యతిరేకంగా విపక్ష సభ్యులు బిగ్గరగా నినాదాలు చేశారు. రెండో చైర్మన్ సమావేశాన్ని రెండు సార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పది మంది విపక్ష సభ్యులను ఒకరోజుపాటు సస్పెండ్ చేస్తూ బీజేపీ సభ్యుడు నిశికాంత్ దూబే తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మాన్ని జేపీసీ ఆమోదించింది. దీంతో కల్యాణ్ బెనర్జీ, నదీమ్–ఉల్ హక్(తృణమూల్ కాంగ్రెస్), మొహమ్మద్ జావెద్, ఇమ్రాన్ మసూద్, సయీద్ నసీర్ హుస్సేన్(కాంగ్రెస్), ఎ.రాజా, మొహమ్మద్ అబ్దుల్లా(డీఎంకే), అసదుద్దీన్ ఓవైసీ(ఎంఐఎం), మొహిబుల్లా(సమాజ్‌వాదీ పారీ్ట), అరవింద్ సావంత్(శివసేన–ఉద్ధవ్) జేపీసీ భేటీ నుంచి సస్పెండయ్యారు. విపక్ష సభ్యులు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఒక లేఖ రాశారు. ఈ నెల 27న జరగాల్సిన జేపీసీ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరారు. మరోవైపు జమ్మూకశీ్మర్‌కు చెందిన మతపెద్ద మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ నేతృత్వంలో ఓ బృందం శుక్రవారం జేపీసీతో సమావేశమైంది. వక్ఫ్ సవరణ బిల్లుపై తమ అభ్యంతరాలను కమిటీ దృష్టికి తీసుకొచి్చంది. ఈ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ నెల 29వ తేదీన తమ తుది నివేదికను సిద్ధం చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వక్ఫ్ సవరణ బిల్లు–2024ను కేంద ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 8వ తేదీన జేపీసీకి పంపించిన సంగతి తెలిసిందే. -
Waqf Amendment Bill: రేపు రాబోం
కోల్‌కతా/న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లుపై సమీక్ష చేపడుతున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నవంబర్ 9వ తేదీ నుంచి మొదలుకానున్న తదుపరి సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు కమిటీలోని విపక్ష సభ్యులు ప్రకటించారు. కమిటీ సభ్యులు కల్యాణ్ బెనర్జీ, నదీముల్ హక్ గురువారం కోల్‌కతాలో మాట్లాడారు. ‘‘విరామం ఇవ్వకుండా, సమీక్షలకు మేం సిద్ధమయ్యే అవకాశం లేకుండా చైర్మన్, బీజేపీ నేత జగదాంబికా పాల్ సమావేశాలకు తేదీలు ఖరారు చేశారు. వేర్వేరు రాష్ట్రాల్లో గువాహటి, భువనేశ్వర్, కోల్‌కతా, పట్నా, లక్నోల్లో ఆరు రోజుల్లో సమావేశాలకు రమ్మంటున్నారు. పాల్ ఏకపక్ష నిర్ణయాలను మేం వ్యతిరేకిస్తున్నాం. అందుకే ఈ దఫా భేటీలను మేం బహిష్కరించబోతున్నాం’’ అని అన్నారు. -
రాజ్యసభలో తీవ్ర రగడ
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌పై అనర్హత వేటు అంశం పట్ల రాజ్యసభలో అలజడి రేగింది. ప్రతిపక్ష సభ్యులు, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. వినేశ్ ఫోగాట్ అంశంపై సభలో చర్చించేందుకు చైర్మన్ అనుమతి ఇవ్వకపోవడంపై విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ జగదీప్ ధన్‌ఖడ్ సభ నుంచి వెళ్లిపోయారు. ఎగువ సభ గురువారం ఉదయం ప్రారంభం కాగానే ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. వినేశ్ ఫోగాట్‌పై అనర్హత అంశంపై తక్షణమే చర్చించాలని పట్టుబట్టారు. అందుకు ధన్‌ఖడ్ అంగీకరించకపోవడంతో తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ ఆయనతో వాగ్వాదానికి దిగారు. డెరెక్ ఓబ్రెయిన్‌తోపాటు విపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండడంతో సభలో గందరగోళం నెలకొంది. ఫోగాట్‌పై చర్చించేందుకు ధన్‌ఖడ్ అనుమతి ఇవ్వకపోవడంతో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. విపక్ష ఎంపీల తీరు పట్ల ధన్‌ఖడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ఉండలేనని చెప్పారు. భారమైన హృదయంతో సభ నుంచి నిష్కృమిస్తున్నానని తెలిపారు. -
Parliament Budget Session 2024: మాటల యుద్ధం
న్యూఢిల్లీ: అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదాలు, నినాదాలతో లోక్‌సభ గురువారం దద్దరిల్లింది. పలుమార్లు వాయిదా పడింది. కేంద్ర బడ్జెట్‌పై ప్రారంభమైన చర్చ పూర్తిగా పక్కదారి పట్టింది. తొలుత కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ మాట్లాడుతూ బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి రవనీత్‌సింగ్ బిట్టూ తాత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్‌సింగ్ హత్య ఘటనను ప్రస్తావించారు. దీనిపై బిట్టూ అభ్యంతరం వ్యక్తం చేశారు. చన్నీ, బిట్టూ మధ్య మాటల యుద్ధం జరిగింది. కాంగ్రెస్ నేత సోనియా గాం«దీతోపాటు చన్నీపై బిట్టూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. దీంతో విపక్ష ఎంపీలు ఒక్కసారిగా ఆయనపై విరుచుకుపడ్డారు. బిట్టూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యుడు అమరీందర్‌సింగ్ రాజా వెల్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయతి్నంచారు. రాహుల్ గాంధీ ఆయనను ఆపేశారు. బిట్టూతోపాటు పలువురు బీజేపీ ఎంపీలు వెల్‌లోకి ప్రవేశించేందుకు ప్రయతి్నంచగా స్పీకర్ స్థానంలో ఉన్న సంధ్యా రే సభను వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. సభ సజావుగా జరిగేలా చూడాలని స్పీకర్ ఓం బిర్లాను కోరారు. సభ్యులంతా సభ గౌరవాన్ని కాపాడాలని స్పీకర్ అన్నారు. నిబంధనలు అతిక్రమించకూడదని చెప్పారు. తర్వాత చన్నీ తన ప్రసంగం కొనసాగించారు. రైతులకు ఇచి్చన హామీలను మోదీ ప్రభుత్వం నిటబెట్టుకోలేదని విమర్శించారు. రైతులను ఖలిస్తానీలు చిత్రీకరించారని బీజేపీ నేతలపై మండిపడ్డారు. సభను చన్నీ తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. చన్నీ మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ చన్నీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆయనపై సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలని అన్నారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య మళ్లీ వాగ్వాదం కొనసాగింది. తర్వాత సభ రెండుసార్లు వాయిదా పడింది. పార్లమెంట్ బయట బిట్టూ మీడియాతో మాట్లాడారు. చన్నీ జాతి వ్యతిరేక శక్తిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇండియా నుంచి పంజాబ్‌ను విడదీయాలన్నదే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ: చన్నీ దేశంలో నరేంద్ర మోదీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని చరణ్‌జిత్ సింగ్ చన్నీ మండిపడ్డారు. 20 లక్షల మంది ప్రజలు ఎన్నుకున్న ఎంపీని(అమృత్‌పాల్ సింగ్) జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు వేసిన ప్రజల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించే అవకాశం ఆయనకు ఇవ్వడం లేదని, ఇది ఎమర్జెన్సీ కాక మరేమిటని ప్రశ్నించారు. చన్నీ లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. అయితే, అమృత్‌పాల్ పేరును నేరుగా ప్రస్తావించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్‌సాహిబ్ నియోజకవర్గం నుంచి వివాదాస్పద సిక్కు మత బోధకుడు, ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ స్వతంత్ర అభ్యరి్థగా 2 లక్షల మెజారీ్టతో గెలిచిన సంగతి తెలిసిందే. ఆంధ్రా–బిహార్ బడ్జెట్: సౌగతా రాయ్ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ లోక్‌సభలో విమర్శలు గుప్పించారు. అది ఆంధ్రా–బిహార్ బడ్జెట్ అని ఆక్షేపించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శిక్షణ పొందిన ఆర్థికవేత్త కాదని అన్నారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా కేవలం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచి్చన సూచనల ఆధారంగా బడ్జెట్ రూపొందించారని విమర్శించారు. గతంలో ఆర్థిక మంత్రులుగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, పి.చిదంబరం హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారని, నిర్మలా సీతారామన్ మాత్రం జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకున్నారని సౌగతా రాయ్ వ్యాఖ్యానించారు. -
Manipur violence: ఆరని మంటలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో మణిపూర్ హింసాకాండ మంటలు కొనసాగుతున్నాయి. మణిపూర్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తక్షణమే సమాధానం ఇవ్వాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. ప్రతిపక్ష సభ్యుల నినాదాలు, ఆందోళనలు, నిరసనలతో ఉభయ సభలు స్తంభిస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వరుసగా మూడో రోజూ సోమవారం సైతం ఇదే అంశంపై విపక్షాలు ఉభయ సభలను అడ్డుకున్నాయి. దీంతో పలుమార్లు సభలను వాయిదా వేయాల్సి వచి్చంది. ఇదే సమయంలో ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) ఎంపీ సంజయ్ సింగ్ సస్పెన్షన్ వ్యవహారం రాజ్యసభను మరింత వేడెక్కించింది. డిమాండ్‌పై వెనక్కి తగ్గని విపక్షాలు మణిపూర్ ఘటనలపై చర్చించాలని కోరుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాలు లోక్‌సభలో సోమవారం వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ సభలో సమాధానం ఇవ్వాలని ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరీ డిమాండ్ చేశారు. ఆయనకు మద్దతుగా విపక్ష ఎంపీలు తమ స్థానాల్లోంచి లేచి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. స్పీకర్ ఓంబిర్లా స్పందిస్తూ.. దీనిపై సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే కేంద్రం తరఫున ఎవరూ సమాధానమివ్వాలో మీరు ఆదేశించలేరని అన్నారు. ఇదే సమయంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నా«థ్ సింగ్ మాట్లాడుతూ.. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోగా మరింత తీవ్రస్వరంతో నినాదాలు చేశారు. ‘ఇండియా ఫర్ మణిపూర్’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. లోక్‌సభలో బీజేపీ ఎంపీలు కూడా ఎదురుదాడికి దిగారు. పశి్చమ బెంగాల్, రాజస్తాన్‌లో మహిళలపై అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష ఎంపీల నినాదాల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. నినాదాల హోరు ఆగకపోవడంతో కొద్దిసేపటికే సభను మధ్యాహ్నం 12 గంటల దాకా, ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటల దాకా.. అనంతరం మంగళవారానికి వాయిదా వేశారు. నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లు–2023, నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కమిషన్ బిల్లు–2023, కానిస్టిట్యూషన్(ఎస్సీలు) ఆర్డర్(సవరణ) బిల్లు–2023ని కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. సంజయ్ సింగ్ సస్పెన్షన్ మణిపూర్ హింసపై రాజ్యసభలోనూ విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్), కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా విపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సభా కార్యకలాపాలను అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల వరకూ సభ వాయిదా పడింది. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా ఆందోళన కొనసాగించారు. సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్న ‘ఆప్’ ఎంపీ సంజయ్ సింగ్ తీరుపై చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను సభ నుంచి సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. దీంతో సంజయ్ సింగ్‌ను సస్పెండ్ చేయాలనే తీర్మానాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టారు. దీనిని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీంతో వర్షాకాల సమావేశాల్లో సభ జరిగే మిగిలిన దినాలకు సంజయ్ సింగ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. ‘ఆప్’ ఎంపీని సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. దీంతో సభను చైర్మన్ వాయిదా వేశారు. ఆ తర్వాత అన్ని పారీ్టల సభాపక్ష నేతలతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సభ సక్రమంగా జరిగేందుకు సహకరించాలని కోరారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్లో సజావుగా చర్చ జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని హోంమంత్రి అమిత్ అన్నారు. ఆయన సోమవారం లోక్‌సభలో మాట్లాడారు. మణిపూర్ అంశంలో నిజాలు బయటకు రావాల్సిందేనని, వాస్తవాలు దేశ ప్రజలకు తెలియాలని పేర్కొన్నారు. పార్లమెంట్ వెలుపల నిరసన మణిపూర్‌లో మహిళలపై అకృత్యాలపై ప్రధాని నరేంద్ర మోదీ సమగ్ర ప్రకటన చేయాలని ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ పార్లమెంట్ ఆవరణలో సోమవారం ఆందోళన చేపట్టింది. ‘మణిపూర్ కోసం భారత్’, ‘భారత్ డిమాండ్ మణిపూర్’ అని రాసి ఉన్న ప్లకార్డులు, బ్యానర్లు చేతపట్టుకుని ప్రతిపక్ష ఎంపీలు బిగ్గరగా నినాదాలు చేశారు. -
Parliament Monsoon session: ‘మణిపూర్’ రగడ..
సాక్షి, న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండ వరుసగా రెండో రోజు శుక్రవారం సైతం పార్లమెంట్‌ను కుదిపేసింది. ఈ అంశంపై తక్షణమే చర్చ ప్రారంభించాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. నినాదాలు, నిరసనలతో హోరెత్తించడంతో ఉభయసభలు స్తంభించాయి. మణిపూర్ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పలువురు కేంద్ర మంత్రులు ప్రకటించారు. అయినా విపక్షాలు వెనక్కి తగ్గలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే నోరు విప్పాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే పార్లమెంట్ ఉభయసభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. మణిపూర్ అంశంపై 267 నిబంధన కింద పూర్తిస్థాయిలో చర్చించాలని, అనంతరం ప్రధానమంత్రి ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. అయితే, 176 నిబంధన కింద చర్చకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం తేలి్చచెప్పింది. ఇందుకు ప్రతిపక్ష ఎంపీలు అంగీకరించలేదు. మణిపూర్ రక్తమోడుతోంది మణిపూర్ అంశంపై లోక్‌సభ, రాజ్యసభలో చర్చించాలని కోరుతూ మంగళవారం ఉదయం ఉభయ సభల ప్రారంభానికి ముందే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా ఇతర పారీ్టలు వాయిదా తీర్మానం నోటీసులిచ్చాయి. లోక్‌సభ ఆరంభమైన వెంటనే ప్రతిపక్ష ఎంపీలు తమ స్థానాల్లో లేచి నిల్చున్నారు. ప్లకార్డులు ప్రదర్శించారు. మణిపూర్ కు రక్తస్రావమవుతోంది అని పేర్కొన్నారు. మణిపూర్‌లో కొనసాగుతున్న దారుణ హింసపై తక్షణమే చర్చ చేపట్టాలని పట్టుబట్టారు. ప్రధాని మోదీ మౌనం వీడాలని, సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ బిగ్గరగా నినాదాలు చేశారు. శాంతించాలంటూ విపక్షాలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పదేపదే విజ్ఞప్తి చేశారు. సభ సక్రమంగా కొనసాగడం, ప్రశ్నోత్తరాలు నిర్వహించడం మీకు ఇష్టం లేదా? అంటూ ప్రతిపక్షలపై అసహనం వ్యక్తం చేశారు. నినాదాలతో సమస్యకు పరిష్కారం లభించదని, చర్చలే అందుకు మార్గమని సూచించారు. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించవద్దని కోరారు. అయినప్పటికీ ప్రతిపక్ష ఎంపీలు వెనక్కి తగ్గలేదు. ఈ సమయంలో మాట్లాడేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు స్పీకర్ అనుమతి ఇచ్చారు. మణిపూర్ ఘటనలపై చర్చకు తాము సిద్ధమేనని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. ‘‘మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడం చాలా హేయమైన చర్య అని, ఈ ఘటన యావత్ దేశం తలదించుకునేలా చేసిందని ప్రధానమంత్రి మోదీ స్వయంగా చెప్పారు. మణిపూర్ అంశంపై చర్చించాలని ప్రభుత్వం కోరుకుంటోంది. అయినా ప్రతిపక్షాలు పార్లమెంట్లో చర్చ జరగకుండా గందరగోళం సృష్టిస్తున్నాయి. ఈ అంశంపై చర్చకు విపక్షాలు సీరియస్‌గా లేవని భావిస్తున్నా’’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. అయినా ప్రతిపక్షాలు వెనక్కి తగ్గలేదు. నినాదాలు ఆపలేదు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల దాకా వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. చర్చకు సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు. అయినా ప్రతిపక్షాలు వినిపించుకోలేదు. గందరగోళం కొనసాగుతుండడంతో స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ లోక్‌సభను సోమవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఆందోళన మణిపూర్ అంశంపై చర్చకు రాజ్యసభలోనూ విపక్షాలు పట్టుబట్టాయి. సభా కార్యకలాపాలను అడ్డుకున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియాన్ పార్లమెంట్లో ఉపయోగించే పదాలపై పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. మణిపూర్ సమస్యపై మాట్లాడేందుకు సభలో ప్రధానమంత్రి ఉండాలని గురువారం ప్రతిపక్షాలు కోరాయని అన్నారు. అయితే ప్రధానమంత్రి, మణిపూర్ అనే పదాలను రికార్డు నుండి తొలగించారని సభాపతి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు సహా మణిపూర్ అంశంపై విపక్షాలు ఆందోళన కొనసాగించడంతో రాజ్యసభ తొలుత మధ్యాహ్నం 2.30 గంటల దాకా, ఆ తర్వాత సోమవారానికి వాయిదా పడింది. లోక్‌సభలో ‘ఇండియా’ ప్లకార్డులు ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ ప్లకార్డులు తొలిసారిగా శుక్రవారం లోక్‌సభలో దర్శనమిచ్చాయి. మణిపూర్ హింసపై ప్రధానమంత్రి సమాధానం చెప్పాలంటూ విపక్ష సభ్యులు ఈ ప్లకార్డులను సభలో ప్రదర్శించారు. ‘ఇండియా సమాధానం కోరుతోంది. మౌనాన్ని కాదు’, ‘పార్లమెంట్లో ప్రధాని మాట్లాడాలని ఇండియా కోరుతోంది’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. -
అట్టుడికిన పార్లమెంటు
న్యూఢిల్లీ: రాహుల్‌గాంధీపై అనర్హత వేటు మొదలుకుని పలు అంశాలపై పార్లమెంటు సోమవారం అట్టుడికిపోయింది. విపక్ష సభ్యుల ఆందోళనలు, డిమాండ్లు, నినాదాలతో ఉభయ సభలూ దద్దరిల్లాయి. పెద్దగా ఎలాంటి కార్యకలాపాలూ చేపట్టకుండానే మరోసారి వాయిదాపడ్డాయి. ఇటు లోక్‌సభ, అటు రాజ్యసభ ఉదయం సమావేశమవుతూనే కాంగ్రెస్, విపక్ష సభ్యులు మూకుమ్మడిగా ఆందోళనకు దిగారు. ప్లకార్డులు చేబూని నినాదాలతో హోరెత్తించారు. అదానీ అవకతవకలపై జేపీసీ దర్యాప్తు కోరుతూ వెల్‌లోకి దూసుకెళ్లారు. లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ కుర్చీపైకి కాగితాలు విసిరారు! సభాధ్యక్షులు ఎంత ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. దాంతో ఉభయ సభలూ మధ్యాహ్నం రెండింటి దాకా వాయిదా పడ్డాయి. తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు రాకపోవడంతో మంగళవారానికి వాయిదా పడ్డాయి. రాహుల్‌పై వేటును నిరసిస్తూ కాంగ్రెస్‌తో పాటు విపక్ష సభ్యులంతా నల్ల దుస్తులు ధరించి సభలకు హాజరయ్యారు. అంతకుముందు ఈ అంశంపై వ్యూహరచనకు కాంగ్రెస్ సారథ్యంలో విపక్షాలన్నీ సమావేశమై చర్చించాయి. ఆర్థిక బిల్లుకు రాజ్యసభ ఆమోదం ఎలాంటి చర్చలూ చేపట్టకుండానే ఆర్థిక బిల్లు–2023ను, జమ్మూ కశ్మీర్ బడ్జెట్, పలు ఇతర బిల్లులను రాజ్యసభ సోమవారం మూజువాణి ఓటుతో ఆమోదించి లోక్‌సభకు తిప్పి పంపింది. సభలో విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. వీటిపై చర్చకు 10 గంటల సమయాన్ని సభ్యులు వినియోగించుకోలేదంటూ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ఆవేదన వెలిబుచ్చారు. గత వారం లోక్‌సభ కూడా ఈ బిల్లులను చర్చ లేకుండానే ఆమోదించడం తెలిసిందే. మోదీకి ఎందుకంత భయం? ‘‘ప్రధాని మోదీ జీ! ప్రజల రిటైర్మెంట్ నిధులను అదానీ గ్రూప్‌లో ఎందుకు పెట్టుబడులుగా పెట్టాల్సి వచ్చిందన్న విపక్షాల ప్రశ్నలకు మీ నుంచి సమాధానం లేదు. అదానీ గ్రూప్ అవకతవకలపై విచారణ లేదు. మీకెందుకంత భయం?’’ అని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. ‘‘మోదీ–అదానీ బంధం బయటపడ్డాక కూడా ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసీ, ఎస్బీఐ, ఈపీఎఫ్ఓ పెట్టుబడులన్నింటినీ అదానీ సంస్థల్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది?’’ అంటూ సోమవారం ఆయన ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌కు తృణమూల్ బాసట కొన్నాళ్లుగా కాంగ్రెస్‌తో ఉప్పూనిప్పుగా ఉంటున్న మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సోమవారం ఆ పార్టీకి సంఘీభావం ప్రకటించింది. లోక్‌సభ నుంచి రాహుల్‌ను అనర్హునిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన వ్యూహరచన భేటీలోనూ, అదానీ ఉదంతంపై జరిగిన నిరసనల్లోనూ పాల్గొంది. తృణమూల్ కాంగ్రెస్, బీఆర్ఎస్, శివసేన (యూబీటీ)తో సహా మొత్తం 16 విపక్షాలు వీటిలో పాల్గొన్నాయి. తమ మద్దతు కేవలం రాహుల్ అంశానికే పరిమితమని అనంతరం తృణమూల్ స్పష్టత ఇచ్చింది. ‘‘పార్లమెంటును, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు జరిపే ఆందోళనల్లో కాంగ్రెస్‌తో పాటు అన్ని పార్టీలతోనూ మేం కలిసి సాగుతాం. అదే సమయంలో పలు అంశాలపై కాంగ్రెస్‌తో తమ అభిప్రాయ భేదాల్లో ఏ మార్పూ లేదు’’ అని పేర్కొంది. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమికి తృణమూల్ కొంతకాలంగా దూరంగా ఉంటుండటం తెలిసిందే. బంగ్లా ఖాళీ చేయండి లోక్‌సభ సభ్యత్వం రద్దయిన నేపథ్యంలో అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలంటూ రాహుల్‌గాంధీకి తాఖీదులందాయి. ఎంపీ హోదాలో 12, తుగ్లక్ లేన్‌లో ఆయనకు కేటాయించిన బంగ్లాను ఏప్రిల్ 22కల్లా ఖాళీ చేయాలని లోక్‌సభ హౌజింగ్ కమిటీ పేర్కొంది. అనర్హత వేటు పడ్డ ఎంపీలు నెలలోపు అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుందని సీనియర్ అధికారి ఒకరు గుర్తు చేశారు. బంగ్లాలో మరింతకాలం ఉండాలనుకుంటే కమిటీకి రాహుల్ లేఖ రాయవచ్చన్నారు. -
సభ్యుల తీరుపై వెంకయ్య కంటతడి
సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సభలో భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. సభలో సభ్యులు వ్యవహరించిన తీరుతో తాను నిద్రలేని రాత్రి గడిపినట్టు పేర్కొన్నారు. బుధవారం సభ ప్రారంభం కాగానే ముందురోజు మంగళవారం సభలో విపక్ష సభ్యులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ ప్రకటన చేశారు. పార్లమెంటును ప్రజాస్వామ్య దేవాలయంగా, సభలో సెక్రటరీ జనరల్, ఇతర అధికారులు కూర్చునే టేబుల్ ఉండే చోటును గర్భగుడిగా అభివర్ణిస్తూ, అలాంటి ప్రదేశం పవిత్రతను నాశనం చేస్తున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ‘నిన్న ఈ పవిత్రతను నాశనం చేశారు. కొంతమంది సభ్యులు టేబుల్ మీద కూర్చున్నారు. మరికొందరు టేబుల్ పైకి ఎక్కారు. నా ఆవేదనను తెలియజేయడానికి, ఈ చర్యను ఖండించడానికి నాకు మాటలు లేవు..’ అని పేర్కొన్నారు. మంగళవారం జరిగిన సంఘటన వల్ల తాను నిద్ర లేని రాత్రి గడిపానని చెబుతూ చైర్మన్ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. ‘వ్యవసాయ సమస్యలు, పరిష్కారాలు’ అంశం చర్చ జరుగుతున్నప్పుడు సభ్యులు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి, ప్రత్యేకించి గత సంవత్సరం తెచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్న వారికి సువర్ణావకాశం లభించిందని, కానీ చర్చ జరపకుండా సభ్యులు అంతరాయం సృష్టించారని ఆవేదన వ్యక్తంచేశారు. -
8 మంది ఎంపీల సస్పెన్షన్
న్యూఢిల్లీ: రాజ్యసభలో సోమవారం కూడా గందరగోళం కొనసాగింది. వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా ఆదివారం పలువురు విపక్ష సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లి, డెప్యూటీ చైర్మన్ హరివంశ్‌తో అనుచితంగా ప్రవర్తించడం తెల్సిందే. బిల్లులను సభాసంఘానికి పంపించాలన్న తీర్మానంపై డివిజన్ ఓటింగ్ నిర్వహించాలన్న తమ డిమాండ్‌ను తోసిపుచ్చడంతో ఆయన ముఖంపై రూల్ బుక్‌ను విసిరేయడం తెల్సిందే. సభామర్యాదలకు భంగం కలిగించిన 8 మంది విపక్ష సభ్యులను సోమవారం సస్పెండ్ చేశారు. ఈ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు వారిపై సస్పెన్షన్ కొనసాగుతుందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్, ఆప్ సభ్యులు సంజయ్ సింగ్, డోలాసేన్, కాంగ్రెస్ ఎంపీలు రాజీవ్ సత్వ, సయ్యద్ నాజిర్ హుస్సేన్, రిపున్ బోరా, సీపీఎం సభ్యులు కేకే రాగేశ్, ఎలమారమ్ కరీన్‌లను సస్పెండ్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించగా, మూజువాణి ఓటుతో సభ ఆమోదం తెలిపింది. అంతకుముందు, హరివంశ్‌పై విపక్షపార్టీలు ఇచ్చిన అవిశ్వాస నోటీసును చైర్మన్ వెంకయ్య తోసిపుచ్చారు. జీరో అవర్ అనంతరం వెంకయ్య మాట్లాడుతూ.. ఆదివారం సభలో చోటు చేసుకున్న ఘటనలపై ఆవేదన చెందానన్నారు. ‘కొందరు సభ్యులు రాజ్యసభ సెక్రటరీ జనరల్ టేబుల్‌పైకి ఎక్కి, గట్టిగా అరుస్తూ, డాన్స్‌లు చేశారు. పేపర్లు చింపి, మైకులు విరగ్గొట్టి, డెప్యూటీ చైర్మన్ విధులకు ఆటంకం కలిగించారు. మార్షల్స్ అడ్డుకోకుంటే, డెప్యూటీ చైర్మన్‌పై దాడి కూడా జరిగేది. ఇదేనా పార్లమెంటరీ సంప్రదాయం? ఆత్మ విమర్శ చేసుకోండి’ అని ప్రతిపక్ష సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీమీ స్థానాలకు వెళ్లండి. డివిజన్ ఓటింగ్ చేపడ్తామ’ని డెప్యూటీ చైర్మన్ చెప్పినా విపక్షసభ్యులు పట్టించుకోలేదన్నారు. వెంకయ్యనాయుడు ప్రసంగిస్తున్న సమయంలో విపక్ష సభ్యులు పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తి, ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనిపై వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష సభ్యుల సస్పెన్షన్‌పై సహచర ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వేటు పడిన సభ్యులు ఆ తరువాత బయటకు వెళ్లేందుకు నిరాకరిస్తూ, సభలోనే కూర్చుని నిరసన కొనసాగించారు. వారికి ఇతర విపక్ష సభ్యులు జతకలవడంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడిన సభ.. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో మంగళవారానికి వాయిదా పడింది. విపక్ష సభ్యుల ధర్నా: తమపై విధించిన సస్పెన్షన్‌కు నిరసనగా ఆ 8 మంది సభ్యులు పార్లమెంట్ కాంప్లెక్స్‌లో నిరవధిక ధర్నాకు దిగారు. నిరవధిక నిరసనకు వీలుగా దుప్పట్లు, దిండ్లు తెచ్చుకున్నారు. ఇతర విపక్ష ఎంపీలతో కలిసి గాంధీజీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. నినాదాలు, పాటలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. శివసేన, సీపీఐ, ఎస్పీ, జేడీఎస్ తదితర ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వారికి మద్దతుగా నిలిచారు. ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి ఈ సస్పెన్షన్ ఒక ఉదాహరణ అని టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ విమర్శించారు.వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా భారీ స్థాయిలో ప్రజా ఉద్యమం నిర్వహిస్తామని, రెండు కోట్లమంది రైతుల సంతకాలతో రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ బిల్లులకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 25న జరిగే దేశవ్యాప్త నిరసనలకు మద్దతు తెలుపుతూ సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), ఆర్ఎస్పీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. సభ్యులను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని కాం గ్రెస్ మండిపడింది. ఇది ప్రజాస్వామ్య భారత్ గొంతు నొక్కడమేనని రాహుల్ అన్నారు. ఆరోగ్య సిబ్బంది భద్రత బిల్లు: కరోనాపై పోరాడే ఆరోగ్య సిబ్బందిపై దాడులకు పాల్పడే వారికి ఐదేళ్ల జైలు శిక్ష విధించేందుకు ఉద్దేశించిన ఎపిడెమిక్ డిసీజెస్(సవరణ)బిల్లును సోమవారం పార్లమెంట్ ఆమోదించింది. రాజ్యసభ ఇప్పటికే ఆమోదించిన ఈ బిల్లుకు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. -
ప్రశ్నోత్తరాల సమయం లేదా?
సాక్షి బెంగళూరు: విధాన పరిషత్తులో ప్రశ్నోత్తరాల సమయం తీసివేయడంతో ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు. సభ ఆరంభంలోనే ప్రశ్నోత్తరాల సమయం లేకపోవడం ఏంటని బీజేపీ సభ్యులు అరుణ్‌శాహపుర అభ్యంతరం వ్యక్తం చేశారు. అదేవిధంగా రఘునాథ్ మల్కాపుర కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జేడీఎస్ సభ్యులు శరవణ, భుజేగౌడ స్పందిస్తూ మల్కాపుర వ్యాఖ్యలను ఖండించారు. ప్రభుత్వాన్ని అనవసరంగా విమర్శించరాదని సూచించారు. ఈసందర్భంగా సభాపతి బసవరాజు హొరట్టె కల్పించుకుని మాట్లాడారు. పరిషత్తు సజావుగా సాగడానికి సహకరించాలని కోరారు. సభాపతి అనుమతి లేకుండా ఎవరూ మాట్లాడకూడదన్నారు. ప్రశ్నోత్తరాల సమయం ఉంటే సభ్యులు ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. అయితే ప్రశ్నోత్తరాల సమయం లేకపోవడంతో సమావేశం నడిచేందుకు సహకరించాలని కోరారు. కాగా ప్రశ్నోత్తరాల సమయం లేదనే విషయం ముందే తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. సమయం లేకపోవడంతో ప్రశ్నోత్తరాలు తొలగించారని సభాపతి బసవరాజు హొరట్టె స్పష్టం చేశారు. అయితే రానున్న రోజుల్లో ప్రశ్నోత్తరాల సమయం తప్పకుండా నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం ప్రతిపక్ష నాయకుడు కోటా శ్రీనివాస్ పూజారి మాట్లాడుతూ సభ్యుల ఆధారంగా సమావేశం జరగాలన్నారు. అనంతరం మంత్రి యూటీ ఖాదర్ మాట్లాడుతూ ప్రశ్నోత్తరాల సమయం ఉండాలని తాను కూడా ఒప్పుకుంటున్నానన్నారు. అయితే అనివార్య కారణాల రీత్యా ప్రశ్నోత్తరాల గంట లేదన్నారు. ప్రభుత్వం, అధికారుల చేతకాని తనం వల్లే ప్రశ్నోత్తరాల గంట తీసివేశారని సభాపతి బసవరాజు హొరట్టె విమర్శించారు. అనుచరులకు ప్రవేశం బంద్ విధాన పరిషత్తు సభ్యుల గన్మెన్లు, అనుచరులు, వ్యక్తిగత కార్యదర్శులకు ప్రవేశం లేదని సభాపతి బసవరాజు హొరట్టె హెచ్చరించారు. ఈమేరకు విధాన పరిషత్తు ద్వారం వద్ద మార్షల్స్‌ను నియమించారు. వారి సభ్యులను తప్ప ఎవరినీ లోపలికి అనుమతించలేదు. సభాపతి ఆదేశాలు అని చెప్పుకొచ్చారు. దీంతో గన్మెన్లు, అనుచరులు బయటే ఉండిపోయారు. ఈసందర్భంగా కొత్త సభ్యులను సభాపతి పరిచయం చేశారు. -
అసెంబ్లీ నడిపే తీరు గౌరవంగా లేదు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ సమావేశాల తీరుపై విపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. స్పీకర్ సభ నడిపే తీరు గౌరవంగా లేదంటూ ఆయన చాంబర్‌కు వెళ్లి నిరసన తెలిపారు. ఈ పరిస్థితి మారకపోతే తాము శాసనసభకు రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. బుధవారం ప్రశ్నోత్తరాల అనంతరం శాసనసభాపతి మధుసూదనాచారితో కాంగ్రెస్ సభ్యులు భేటీ అయ్యారు. బీజేపీ, టీడీపీ, సీపీఎం సభ్యులతో కలసి స్పీకర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సభ జరుగుతున్న తీరుపై కాంగ్రెస్ సభ్యులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడికి గౌరవం ఇవ్వకపోవడంతో సభకు హుందాతనం పోతోందని స్పీకర్‌కు విన్నవించారు. సభా నాయకుడికి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి మధ్య సమన్వయం చేయాలని సూచించారు. ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్వకుండా స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించటం సరికాదన్నారు. స్పీకర్, శాసనసభ గురించి మాట్లాడే పరిస్థితి రావటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సభ నిర్వహణ సజావుగా లేకపోతే బాధ్యత స్పీకర్దేనని, ఇది మీ గౌరవానికి కూడా మంచిదికాదని స్పీకర్‌కు విన్నవించారు. అసెంబ్లీ ప్రభుత్వ సచివాలయం కాదని, అన్ని రాజకీయ పార్టీలకు వేదిక లాంటిదని విపక్ష సభ్యులు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. -
‘ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతాం’
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలను తమకు అనుకూలంగా నడుపుకోవాలని హరీష్ రావు చూస్తున్నారని కాంగ్రెస్ నేత డీకే అరుణ విమర్శించారు. 9 మంది కాంగ్రెస్ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయడంపై ఆమె మండిపడ్డారు. ప్రజా సమస్యలపై వాయిదా తీర్మానాలు ఇస్తూనే ఉంటామన్నారు. సభ్యులను సస్పెండ్ చేస్తే ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగడతామని తెలిపారు. అవసరమైతే టీఆర్ఎస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామన్నారు. కాగా తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశాల్లో 11 మంది ప్రతిపక్ష సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంపై కాంగ్రెస్ వాయిదా తీర్మానాన్ని సమర్పించగా.. కేజీ టు పీజీ విద్య, ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్, విద్యారంగ సంస్ధలపై టీటీడీపీ, బీజేపీలు వాయిదా తీర్మానాన్ని సమర్పించాయి. ప్రశ్నోత్తరాలు నిర్వహించకముందే వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన తొమ్మిది మందిని, టీటీడీపీకు చెందిన ఇద్దరు సభ్యులను సభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. సభ నుంచి సస్పెండ్ అయిన వారిలో కాంగ్రెస్ కు చెందిన డీకే అరుణ, మల్లు భట్టి విక్రమార్క, వంశీచందర్ రెడ్డి, జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి, గీతా రెడ్డి, ఎన్.పద్మావతి, సంపత్ కుమార్ లు, టీటీడీపీకి చెందిన రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య తదితరులు ఉన్నారు. -
చర్చకు పట్టు..ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్
-
చర్చకు పట్టు.. ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశాల్లో 11 మంది ప్రతిపక్ష సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంపై కాంగ్రెస్ వాయిదా తీర్మానాన్ని సమర్పించగా.. కేజీ టు పీజీ విద్య, ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్, విద్యారంగ సంస్ధలపై టీటీడీపీ, బీజేపీలు వాయిదా తీర్మానాన్ని సమర్పించాయి. ప్రశ్నోత్తరాలు నిర్వహించకముందే వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన తొమ్మిది మందిని, టీటీడీపీకు చెందిన ఇద్దరు సభ్యులను సభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. సభ నుంచి సస్పెండ్ అయిన వారిలో కాంగ్రెస్ కు చెందిన డీకే అరుణ, మల్లు భట్టి విక్రమార్క, వంశీచందర్ రెడ్డి, జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి, గీతా రెడ్డి, ఎన్.పద్మావతి, సంపత్ కుమార్ లు, టీటీడీపీకి చెందిన రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య తదితరులు ఉన్నారు. -
ఇదేమి చోద్యం !
సాక్షి, బెంగళూరు: రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా? ఈ విషయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, సహకార శాఖ మంత్రి హెచ్.ఎస్ మహదేవ ప్రసాద్ తలోదారిలో ప్రయాణిస్తున్నారా?.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇందుకు మంగళవారం జరిగిన సంఘటనలను విపక్షాలతో పాటు రైతుల సంఘాల నాయకులు ప్రస్తావిస్తున్నారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా బెళగావిలో రెండో రోజు మంగళవారం ప్రశ్నోత్తరాల సమయం కంటే ముందే శాసనసభలో విపక్ష సభ్యులు కరువుపై చర్చకు పట్టుబట్టాయి. 50 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొని రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం తక్షణం వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని పట్టుబట్టారు. కలుగజేసుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య..రైతుల కష్టాలు తమకూ తెలుసన్నారు. సహకార సంఘాల్లో తీసుకున్న పంటరుణాలను మాఫీ చేసే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. ఈ విషయమై ఇప్పటికే వివిధ మార్గాల్లో నివేదికలు కూడా తెప్పించుకున్నామని పేర్కొంటూ మొదట ప్రశ్నోత్తరాల సమయానికి సహకరించాలని విపక్షాలకు సూచించారు. ఈ సమయంలో స్పీకర్ కోడివాళ కలుగజేసుకోవడంతో కొశ్చన్ అవర్ ప్రారంభమైంది. ఇదిలాఉండగా చెరకు ఫెరుుర్ అండ్ రెమ్యూనిరేటీవ్ (ఎఫ్ఆర్పీ) ధరను పెంచే విషయంతో పాటు బకాయిల చెల్లింపు తదితర విషయాలకు సంబంధించి రైతు సంఘం నాయకులతో సహకార శాఖ మంత్రి మహదేవ ప్రసాద్ బెళగావిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో వ్యసాయ రుణాలను మాఫీ చేస్తే ప్రభుత్వ ఖజానాపై రూ.9,978 కోట్లు భారం పడుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత ఆర్థికభారాన్ని ప్రభుత్వం మోయలేదని తేల్చిచెప్పారు. అందువల్ల రైతుల రుణాల మాఫీ చేయలేమని స్పష్టం చేశారు. అరుుతే రుణాల వడ్డీలను రీ షెడ్యూల్ చేసే విషయం మాత్రం అలోచిస్తామన్నారు. దీనిపై రాష్ట్ర చెరుకు రైతు సంఘం అధ్యక్షుడు కురుబూరు శాంతకుమార్ స్పందిస్తూ..ఒకే విషయమై బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వారు విరుద్ధ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. చర్చలు విఫలం... చెరకుకు ఫెయిర్ అండ్ రెమ్యూనిరేటీవ్ (ఎఫ్ఆర్పీ) పెంపు విషయంతో పాటు బకారుుల చెల్లింపుపై ప్రభుత్వం, రైతు సంఘం నాయకుల మధ్య ఏర్పడిన ప్రతిష్టంబన తొలగలేదు. ఎఫ్ఆర్పీని టన్నుకు రూ.3,050 వరకు పెంచాలని రైతు సంఘం నాయకులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా రైతులకు చక్కెర కర్మాగారాల నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలనేది వారి మరొక ప్రధాన డిమాండ్. ఈ నేపథ్యంలో రాష్ట్ర సహకార శాఖ మంత్రి మహదేవ ప్రసాద్ అధ్యక్షతన బెళగావిలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చెరకు రైతు సంఘం నాయకులు, వివిధ ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు, చక్కర కర్మాగార యాజమాన్యం ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చెరుకు ఎఫ్ఆర్పీ పెంచడం సాధ్యం కాదని మహదేవ ప్రసాద్ రైతులతో పేర్కొన్నారు. దీంతో ఆగ్రహం చెందిన రైతులు ’చక్కెర యాజమాన్యం లాబీకి తలొగ్గిన మంత్రికి రైతుల కష్టాలు అర్థం కావడం లేదు. చెరుకు ఎఫ్ఆర్పీ పెంచేంతవరకూ తాము వెనకడుగువేసేది లేదు. వెంటనే బకాయిలను చెల్లించాలి. అప్పటి వరకూ బెళగావిలో వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తుంటాం’ అని పేర్కొంటూ సమావేశం నుంచి అర్థాతరంగా బయటకి వచ్చేశారు. అటుపై మంత్రి మహదేవ్ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ...మంగళవారం జరిగిన చర్చలు అసంపూర్ణంగా ముగిసాయన్నారు. ఈ విషమై ఈనెల 24న మరోసారి రైతు సంఘం నాయకులతో చర్చిస్తామన్నారు. సమస్యకు తప్పక పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
కార్పొరేట్ విద్యకు కళ్లెం వేయాలి
♦ విపక్ష సభ్యుల సూచన ♦ ఫీజుల నియంత్రణకు చట్టాలు తేవాలి ♦ ఉపాధ్యాయ యూనియన్లను తగ్గించాలని హితవు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యావ్యవస్థను శాసిస్తున్న కార్పొరేట్ వ్యవస్థకు తక్షణం కళ్లెం వేయాల్సిన అవసరం ఉందని విపక్ష సభ్యులు ప్రభుత్వానికి సూచించారు. కార్పొరేట్ల కబంధ హస్తాల్లో పూర్తిగా విద్యావ్యవస్థ చిక్కుకుపోయిందని, దాన్ని సాహసోపేతమైన నిర్ణయాలు, గట్టి చట్టాల ద్వారానే నియంత్రించవచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ యూనియన్లను తగ్గించాలని సూచించారు. బుధవారం విద్యావిధానంపై చర్చల్లో పలువురు సభ్యులు మాట్లాడారు. ఫీజుల నియంత్రణ చేపట్టాలి: కె.లక్ష్మణ్ ‘ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్‌లో ఫీజులు వసూలు చేస్తున్నారు. విద్య పూర్తిగా కార్పొరేట్ల పద్మవ్యూహంలో చిక్కుకుంది. కఠిన చట్టాలు చేయకుంటే సామాన్యుడికి పూర్తిగా అందకుండా పోతుంది. కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకి కమిటీలను ఏర్పాటు చేసి, ఫీజుల నియంత్రణ చేయాలి’. కార్పొరేట్లను నియంత్రించాలి: ఆర్.కృష్ణయ్య ‘కార్పొరేట్లు విద్యను వ్యాపారంగా మార్చారు. వారిని నియంత్రించాలంటే కచ్చితంగా మాతృభాషలో విద్యాబోధన ఉండేలా చట్టాన్ని తేవాలి. ఒక యాజమాన్యం కింద ఒకే సంస్థ ఉండేలా, అడ్మిషన్లలో నియంత్రణ పెట్టేలా మార్పులు తేవాలి. ఫీజుల రేట్ల మీద సైతం కఠినంగా వ్యవహరించాలి. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమాన్ని తేవడంతోపాటు, మౌలిక వసతులను కల్పించాలి. ఆలస్యం చేయకుండా రెసిడెన్షియల్, ఎయిడెడ్, మోడల్, కస్తూర్భా పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి. రాష్ట్రంలో 40 ఉపాధ్యాయ యూనియన్లు ఉన్నాయి. వీటిలో ఉపాధ్యాయులంతా యూనియన్ల పేరుతో చదువు చెప్పడం మానేసి తిరుగుతున్నారు. అలా కాకుండా ఒకే యూనియన్ ఉండేలా, దానికి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేలా చూడాలి’. బొందపెట్టే పరిస్థితి తెచ్చుకోకండి: సంపత్ ‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకముందు విద్యార్థులు చేయూతనిచ్చిన ఆందోళనలతో ఉస్మానియా యూని వర్సిటీ ఆర్ట్స్ కాలేజీ సాక్షిగా టీఆర్ఎస్ పార్టీ ఎది గింది. అదే పార్టీ ఇపుడు అధికారంలోకి వచ్చి విద్యార్థులను, యూనివర్సిటీని పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలు క్షణాల్లో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అవుతుంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మెస్ బకాయిలు మాత్రం మూడునెలలైనా యూనివర్సిటీకి చేరలేదు. బకాయిల కారణంగా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, వారు పై చదువులకు, ఉద్యోగాలకు వెళ్లలేక పోతున్నారు. ఇదిలాగే కొనసాగితే.. అదే ఆర్ట్స్ కాలేజీ సాక్షిగా టీఆర్ఎస్ పార్టీని బొందపెట్టే పరిస్థితి వస్తుంది, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు’ అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలో అన్‌పార్లమెంటరీ పదం ఉన్నందున, దాన్ని రికార్డుల్లోంచి తొలగిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి ప్రకటించారు. పర్యవేక్షణ లేని స్కూళ్లు: మనోహర్‌రెడ్డి పాఠశాలలపై పర్యవేక్షణ లేకుండా పోయిందని, ఎంఈవోలు, డిప్యూటీ ఈవోలు లేకుండాపోయారు. వారి నియామకాలకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. పాఠశాలలను రేషనలైజేషన్ చేయాలి.. విద్యార్థులు ఉపాధి అవకాశాలు లభించేలా 8వ తరగతి నుంచే వృత్తి, సాంకేతిక విద్యా కోర్సులను ప్రవేశ పెట్టాలి. యూనియన్లు ఎక్కువగా ఉన్నాయి. ఇన్ని అవసరమా.. అందరూ ఆలోచించాలి’. -
వైద్యం గాలికొదిలేశారు
- వైద్యులు, సిబ్బంది కొరత, మందులు లేవు - అడిగినా పలికే వారు లేరు - డెంగీ వచ్చినా పట్టించుకోలేదు - జెడ్పీ సమావేశంలో నిలదీసిన ప్రతిపక్ష సభ్యులు సాక్షి, చిత్తూరు : ‘జిల్లాలో మలేరియా, డెంగీలాం టి ప్రమాదకర వ్యాధులు ప్రబలాయి. వేలాది మంది వ్యాధుల బారిన పడ్డారు. వంద మంది వరకు మృత్యువాతపడ్డారు. చెన్నై, బెంగళూరు ప్రాంతాలకు వైద్యం కోసం వెళ్లి వందల కుటుంబాలు అప్పులపాలయ్యాయి. ప్రభుత్వం పట్టిం చుకుని ఏ ఒక్కరికీ వైద్యం అందించడం లేదు. డాక్టర్లు, సిబ్బంది లేరు. మందులు లేదు ... అడిగితే సమాధానమిచ్చే వారు లేరు.. చనిపోయిన వారికి పరిహారమైనా ఇవ్వండి’ ... అంటూ మంగళవారం జెడ్పీ సర్వసభ్యసమావేశంలో జిల్లాపరిషత్ చైర్పర్సన్ గీర్వాణి, కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌ను ప్రతిపక్ష సభ్యులు (వైఎస్సార్సీపీ) నిలదీశారు. సంక్షేమం, వైద్యఆరోగ్యం తదితర అంశాల అజెండాగా జరిగిన సమావేశంలో జిల్లా పరిషత్ నిధులు, చేపట్టిన పనులపై మొదట చర్చించాలని ఫ్లోర్‌లీడర్ వెంకటరెడ్డి యాదవ్ కోరగా, చైర్పర్సన్ అంగీకరించలేదు. అనంతరం జిల్లా వైద్యఆరోగ్యంపై చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి మాట్లాడుతూ జిల్లాలో వేలాది మంది డెంగీ బారిన పడ్డారన్నారు. ప్రభుత్వఆరోగ్య కేంద్రాలకు వెళితే వైద్యులు, సిబ్బంది కూడా అందుబాటులో ఉండడం లేదన్నారు. బెంగళూరు, చెన్నైకు వెళ్లి చూపించే ఆర్థిక స్థోమత లేక ఇప్పటికే వంద మంది వరకు మరణించారని తెలిపారు. చనిపోయిన వారికి పరిహారమివ్వాలని డిమాండ్‌చేశారు. పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి మాట్లాడుతూ పలమనేరులో డెంగీ వ్యాధి ఎక్కువగా ఉందన్నారు. ఇటీవల జడ్జి కుమారుడికి సైతం డెంగీ సోకిందన్నారు. వైద్యులు వైద్యం చేయక ప్రైవేటు ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారని విమర్శించారు. తక్షణం వ్యాధిగ్రస్తులందరికీ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ జిల్లాలో ఏ ఒక్క ఆస్పత్రుల్లో వైద్యులు సక్రమంగా లేరన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకెళ్లి వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేకనే పేదలు మృత్యువాతపడుతున్నారన్నారు. ఆస్పత్రుల కమిటీలో ప్రజాప్రతినిధులు సభ్యులుగా ఉండాల్సి ఉన్నా ఇది సక్రమంగా అమలు చేయడంలేదన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో స్విమ్స్‌లో ప్రత్యేక ఫీవర్ ఆస్పత్రి ఏర్పాటు చేయాలన్నారు. వచ్చే జెడ్పీ సమావేశంలో రెవెన్యూపై చర్చ జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు మట్టినమూనా ఫలితాలను ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మదనపల్లె ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యసేవలతో పాటు పారిశుద్ధ్యం సైతం అధ్వానంగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పేదలకు వైద్యం అందించాలన్నారు. విద్యాశాఖను పట్టించుకోలేదని డీఈవోపై ధ్వజమెత్తారు. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ మాట్లాడుతూ ఆస్పత్రి కమిటీలో సభ్యులుగా ఉన్న ప్రజాప్రతినిధులకు ఏమాత్రం విలువ లేకుండా పోయిందన్నారు. ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాల మేరకు కమిటీలు పనిచేయాలన్నారు. ఎమ్మెల్సీ శ్రీనివాసులు మాట్లాడుతూ చిత్తూరు ఆస్పత్రిని అపోలోకు అప్పగించడం దారుణమన్నారు. జిల్లాలో ప్రజలకు మంచినీరు అందకనే రోగాలు ప్రబలుతున్నాయన్నారు. ప్రతిపక్ష సభ్యులు సభలో ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిసారి అధికార పార్టీ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సంక్షేమంతో పాటు పలు శాఖలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, ఎమ్మెల్యే తలారి ఆదిత్య, జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ కోటీశ్వరి, బీసీ సంక్షేమ శాఖ డీడీ రామచంద్రరాజు, జిల్లాపరిషత్ సభ్యులు పాల్గొన్నారు. -
వారి తీరును టీవీల్లో చూపండి!
విపక్ష సభ్యులు ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు * లోక్‌సభను అడ్డుకుంటున్న సభ్యులపై స్పీకర్ కన్నెర్ర న్యూఢిల్లీ: నిరసనలు, నినాదాలు, ప్లకార్డులతో సభలో గందరగోళం సృష్టిస్తూ, సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న విపక్ష సభ్యులపై మంగళవారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మండిపడ్డారు. వారి వైఖరి ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనన్నారు.నిరసనలకు పాల్పడుతున్న 40, 50 మంది ప్రతిపక్ష సభ్యులు సభలోని 440 మంది ఇతర సభ్యుల హక్కులను హైజాక్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, స్పీకర్ పోడియం వద్ద కెమెరాలకు కనిపించేలా వరకు ప్లకార్డులను ఎత్తి పట్టుకోవడంపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే. నేను సభను వాయిదా వేయను. లోక్‌సభ టీవీని కోరుతున్నా. టీవీలో కనిపించాలన్న కోరిక నాకు లేదు. టీవీల్లో వారిని కనిపించనివ్వండి. సభలో వారి తీరు ఎలా ఉందో ప్రజలను చూడనివ్వండి. వారి బాధ్యతారాహిత్యాన్ని దేశమంతా చూడాలి’ అంటూ నిప్పులు చెరిగారు. విపక్ష సభ్యుల తీరుపై అంతకుముందు మంత్రి వెంకయ్య నాయుడు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘సభను కేవలం 20 మంది సభ్యులు తమ అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలనుకుంటున్నారా?’ అంటూ మండిపడ్డారు. యథావిధిగా.. లలిత్ మోదీ వ్యవహారంలో విదేశాంగమంత్రి సుష్మ, రాజస్తాన్ సీఎం వసుంధర రాజే, వ్యాపమ్ స్కామ్‌కు సంబంధించి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్లు రాజీనామా చేయాలనే డిమాండ్‌తో విపక్షాలు కార్యక్రమాలను మంగళవారమూ అడ్డుకున్నాయి. కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులతో వెల్‌లో నిరసన తెలిపారు. తమ వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించడంతో వారు నిరసనలను తీవ్రం చేశారు. డిప్యూటీ స్పీకర్ తంబిదురై సభాపతి స్థానంలో ఉన్న సమయంలో.. వారు తమ చేతిలోని కాగితాలను చింపి, ఆయనపై విసిరారు. దాంతో తొలుత రెండు సార్లు వాయిదా పడిన సభ, పరిస్థితిలో మార్పు రాకపోవడంతో బుధవారానికి వాయిదా పడింది. కాగితాలు విసరడం క్షమార్హం కాదని సుమిత్ర మండిపడ్డారు. -
నేడు అఖిలపక్ష సమావేశం
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన గురువారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. విపక్ష సభ్యులు అడ్డుకోవడంతో ప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇప్పటివరకు సజావుగా సాగని విషయం తెలిసిందే. లలిత్‌మోదీ వివాదం, వ్యాపమ్ కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులను తొలగించాలని పట్టుపడుతూ విపక్షాలు లోక్‌సభను స్తంభింపజేయడం విదితమే. ఈ నేపథ్యంలో సమావేశాలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అన్ని రాజకీయ పక్షాలతో చర్చించేందుకుగాను స్పీకర్ ఈ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మంగళవారం మాజీ రాష్ట్రపతి కలాంకు నివాళి అనంతరం వాయిదా పడిన లోక్‌సభ గురువారం సమావేశం కానుంది. నేడు స్మోకింగ్ రూం పునఃప్రారంభం! ధూమపాన ప్రియులైన ఎంపీలు పార్లమెంట్ భవనంలోనూ పొగ తాగేందుకు మళ్లీ వీలు కానుంది. పార్లమెంట్ భవనంలోని చరిత్రాత్మక సెంట్రల్ హాల్‌కు పక్కన పునరుద్ధరించిన స్మోకింగ్ రూంను నేడు(గురువారం) ప్రారంభించనున్నారు. వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా జూలై 21 నుంచి ఈ గదిని స్టెనోగ్రాఫర్ల కోసం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కేటాయించారు. అయితే, తమకు స్మోకింగ్ రూంను కేటాయించాలంటూ సమావేశాల ప్రారంభం రోజే అధికార, ప్రతిపక్ష సభ్యులు పలువురు స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అది సెంట్రల్ హాల్‌కు సంబంధించిన గది అని, దానిని ఎంపీల అవసరాలకే వినియోగించాలని కోరారు. దీంతో స్టెనోగ్రాఫర్లకు మూడో అంతస్తులోని గదిని స్పీకర్ కేటాయించారు. కాగా, 2004లో పార్లమెంట్ హౌస్, సెంట్రల్ హాల్, లాబీలను నో స్మోకింగ్ జోన్‌గా ప్రకటించారు. అప్పుడే ఎంపీలు పొగతాగేందుకు ప్రత్యేక గదిని కేటాయించారు. -
అసెంబ్లీలో ‘ఇందూరు’ సమస్యలు
నిజామాబాద్ అర్బన్ : అసెంబ్లీ సమావేశాల్లో జిల్లాకు చెందిన పలు అంశాలను ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ స్వాధీనంపై ప్రతిపక్ష సభ్యులు అధికార పక్షాన్ని నిలదీశారు. ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదన్న విషయం ఎంతవరకు వాస్తవమో చెప్పాలన్నారు. ఫ్యాక్టరీకి చెరుకును సరఫరా చేసిన రైతులకు డబ్బులు చెల్లించడం లేదని, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ.. డేల్టా పేపర్ మిల్స్ లిమిటెడ్‌తో ఎన్ఎస్ఎల్ ప్రైవేటీకరణ ఒప్పందాన్ని రద్దు చేసే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ఈ విషయమై అడ్వకేట్ జనరల్ అభిప్రాయూన్ని కోరామన్నారు. రోడ్డు విస్తరణపై.. నిజామాబాద్ -డిచ్పల్లి రోడ్డు విస్తరణపై నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అసెంబ్లీలో మాట్లాడారు. మాధవనగర్ సమీపంలోని రైల్వేవంతెనపై రోడ్డు వంతెన నిర్మించే ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయూ? ఉంటే అంచనా వ్యయంతోపాటు ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధుల వివరాలు ఏమిటి? పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. రవాణా శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ.. నిజామాబాద్ -డిచ్పల్లి మార్గంలో 14.20 కిలోమీటర్ల పొడవులో 10.20 కిలోమీటర్ల రోడ్డు పనులు పురోగతిలో ఉన్నాయని, మిగతా నాలుగు కిలోమీటర్ల కోసం టెండర్లను పిలిచామని తెలిపారు. రెండు వరుసల ఆర్వోబీ కోసం అంచనా వ్యయం రూ. 44.07 కోట్లు అని వివరించారు. దక్షిణ మధ్య రైల్వే కార్యాలయంలో అలైన్మెంట్, జనరల్ అరేంజ్మెంట్ డ్రాయింగ్ పని పూర్తరుు్యందన్నారు. పనులు ప్రారంభించిన ఏడాదిలోపు పనులను పూర్తి చేస్తామన్నారు. -
డిప్యూటీ స్పీకర్ వివక్ష: జానా
సాక్షి, హైదరాబాద్: ‘సభలో సంయమనం పాటిస్తూ అర్థవంతమైన చర్చ కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. విపక్ష సభ్యులు మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో మంత్రులు మధ్య మధ్య అడ్డుతగులుతున్నారు. అధికారపక్షానికి అత్యధిక సమయం ఇస్తూ, ప్రతిపక్ష సభ్యులను పట్టించుకోవడం లేదు. పాలకపక్షం, విపక్షాల నడుమ మధ్యవర్తిగా ఉండాల్సిన చైర్ ఆ పనిచేయడం లేదు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పూర్తి వివక్ష చూపిస్తున్నారు..’ అని సీఎల్పీ నేత కె.జానారెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బుధవారం శాసనసభలో సంక్షేమ అంశాలపై కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ మాట్లాడుతుండగా పదేపదే మంత్రులు అడ్డుపడడం, మధ్యలో టీఆర్ఎస్కు చెందిన ఓ సభ్యునికి అవకాశం కల్పించడం, సంపత్‌కు అసలు మైక్ ఇవ్వకపోవడం వంటి పరిణామాలతో కాంగ్రెస్ శాసనసభా పక్షం వాకౌట్ చేసింది.అనంతరం సీఎల్పీ నేతజానారెడ్డి ఎమ్మెల్యేలతో కలసి విలేకరులతో మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ తమను గుర్తించడం లేదని, విపక్ష సభ్యులకు మైక్ ఇవ్వడం లేదన్నారు. సభావ్యవహారాలు పూర్తిగా అప్రజాస్వామికంగా ఉన్నాయని, వాకౌట్ చే స్తున్నామని విపక్ష నేత ప్రొటెస్ట్ చేయడానికి కూడా మైక్ ఇవ్వడం లేదని ఎమ్మెల్యే భట్టివిక్రమార్క విమర్శించారు. మంత్రి హరీష్‌రావు స్క్రీన్‌ప్లేతో, ఆయన కనుసన్నల్లో సభా వ్యవహారాలు సాగుతున్నాయని ఆరోపించారు. సభను టీఆర్ఎస్ ఆఫీసులా భావిస్తున్నారని విరుచుకుపడ్డారు. -
ఇళ్ల కేటాయింపులపై... దద్ధరిల్లిన అసెంబ్లీ
ఫలించని స్పీకర్ రాజీ యత్నాలు బీజేపీకి జేడీఎస్ ఎమ్మెల్యేల మద్దతు రేపటికి సభ వాయిదా వారం లోగా చెరుకు రైతులకు బకాయిలు బెంగళూరు : రాష్ట్రంలో వాజ్‌పేయి గృహ నిర్మాణ పథకం కింద ఇళ్ల కేటాయింపులో అన్యాయం జరుగుతోందంటూ తాము చేసిన ఆరోపణలపై గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీశ్ స్పందించిన తీరుకు నిరసనగా ప్రతిపక్ష సభ్యులు మంగళవారం శాసన సభలో ధర్నాకు దిగారు. దీనిపై స్పీకర్ కాగోడు తిమ్మప్ప రాజీ కుదర్చడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జీరో అవర్‌లో ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ మాట్లాడుతూ.. ఇళ్ల కేటాయింపులో మంత్రి పక్షపాతం చూపుతున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన అంబరీశ్ ‘ఎనిమిదేళ్ల పాటు కాంగ్రెస్ అజ్ఞాతంలో ఉండిందని, మీరు చేసిన పనే మేమూ చేశాం’ అని చెప్పారు. సీనియారిటీ ఆధారంగా ఇళ్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ దశలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ సభ్యులతో పాటు జేడీఎస్ సభ్యులు శెట్టర్‌కు మద్దతుగా నిలవడంతో సభలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో ఎక్కువ ఇళ్లను కేటాయించారని, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఒక్క ఇంటినీ కేటాయించలేదని ఆరోపించారు. ఇకమీదట ఇలాంటి పక్షపాతం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ దశలో మంత్ర మళ్లీ మాట్లాడుతూ మూడు లక్షల ఇళ్లను కేటాయించాలనేది లక్ష్యమని చెప్పారు. తొలుత అర్జీలు సమర్పించిన వారికి ప్రాధాన్యతనిచ్చామని తెలిపారు. 142 నియోజక వర్గాలకు ఇళ్లను కేటాయించినట్లు వివరించారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు స్పీకర్ పొడియం ఎదుట ధర్నాకు దిగారు. ఈ దశలో స్పీకర్ సభను కాసేపు వాయిదా వేసి, పాలక, ప్రతిపక్షాల మధ్య తన ఛాంబర్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే అక్కడా ప్రతిష్టంభన తొలగిపోలేదు. అన్ని నియోజక వర్గాలకు సమానంగా ఇళ్లను కేటాయిస్తామంటూ సభలో హామీ ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించగా, ప్రతిపక్షాలు తిరస్కరించాయి. నిర్దిష్టంగా ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశాయి. దీనికి ప్రభుత్వం సమ్మతించక పోవడంతో సభ తిరిగి ప్రారంభమైన వెంటనే విపక్షాలు ధర్నాను కొనసాగించాయి. దీంతో స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేశారు. వారంలోగా చెరకు రైతులకు బకాయిలు ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్షాలు ధర్నాను కొనసాగించాయి. రాష్ర్టంలోని చెరకు రైతులకు రావాల్సిన బకాయిలను చక్కెర కర్మాగారాలు వెంటనే చెల్లించేలా చూడాలంటూ సోమవారం సాయంత్రం విపక్షాలు ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. అనంతరం స్పీకర్ సభను వాయిదా వేశారు. దీనిపై సభలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటన చేస్తూ వారంలోగా రైతులకు బకాయిల చెల్లింపులు ప్రారంభమవుతాయని తెలపడంతో విపక్షాల సభ్యులు ధర్నాను విరమించారు.