నిజామాబాద్ అర్బన్ : అసెంబ్లీ సమావేశాల్లో జిల్లాకు చెందిన పలు అంశాలను ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ స్వాధీనంపై ప్రతిపక్ష సభ్యులు అధికార పక్షాన్ని నిలదీశారు. ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదన్న విషయం ఎంతవరకు వాస్తవమో చెప్పాలన్నారు. ఫ్యాక్టరీకి చెరుకును సరఫరా చేసిన రైతులకు డబ్బులు చెల్లించడం లేదని, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ..
డేల్టా పేపర్ మిల్స్ లిమిటెడ్‌తో ఎన్‌ఎస్‌ఎల్ ప్రైవేటీకరణ ఒప్పందాన్ని రద్దు చేసే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ఈ విషయమై అడ్వకేట్ జనరల్ అభిప్రాయూన్ని కోరామన్నారు.
రోడ్డు విస్తరణపై..
నిజామాబాద్ -డిచ్‌పల్లి రోడ్డు విస్తరణపై నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అసెంబ్లీలో మాట్లాడారు. మాధవనగర్ సమీపంలోని రైల్వేవంతెనపై రోడ్డు వంతెన నిర్మించే ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయూ? ఉంటే అంచనా వ్యయంతోపాటు ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధుల వివరాలు ఏమిటి? పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారని ప్రశ్నించారు.
రవాణా శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ.. నిజామాబాద్ -డిచ్‌పల్లి మార్గంలో 14.20 కిలోమీటర్ల పొడవులో 10.20 కిలోమీటర్ల రోడ్డు పనులు పురోగతిలో ఉన్నాయని, మిగతా నాలుగు కిలోమీటర్ల కోసం టెండర్లను పిలిచామని తెలిపారు. రెండు వరుసల ఆర్‌వోబీ కోసం అంచనా వ్యయం రూ. 44.07 కోట్లు అని వివరించారు. దక్షిణ మధ్య రైల్వే కార్యాలయంలో అలైన్‌మెంట్, జనరల్ అరేంజ్‌మెంట్ డ్రాయింగ్ పని పూర్తరుు్యందన్నారు. పనులు ప్రారంభించిన ఏడాదిలోపు పనులను పూర్తి చేస్తామన్నారు.
అసెంబ్లీలో ‘ఇందూరు’ సమస్యలు
Published Sun, Mar 15 2015 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 10:51 PM
Advertisement