ts-budget-2015
-
కేసీఆర్‌పై కోపాన్ని..ఆయనపై చూపారు
హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటెద్దు పోకడలు, నిరంకుశ వైఖరికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని తెలంగాణ టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ తెలంగాణ శాసనసభ సమావేశాల్లో ఒక్క ప్రజా సమస్యను కూడా పరిష్కరించలేకపోయారన్నారు. ప్రజలు కేసీఆర్‌పై ఉన్న కోపాన్ని ఉద్యమ నేత దేవీప్రసాద్‌పై చూపించాల్సి వచ్చిందని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామనే భయంతో కక్ష సాధింపుగా తమను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. జాతీయ గీతం సందర్భంగా తప్పు చేసి ఉంటే క్షమాపణ చెప్తామన్నప్పటికీ స్పీకర్ పట్టించుకోలేదని ఎర్రబెల్లి అన్నారు. సభలో గొడవకు సంబంధించిన వీడియో పుటేజీలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తాము తప్పు చేసి ఉంటే ఉరిశిక్షకైనా సిద్ధమని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు తెలంగాణ వ్యతిరేకులని ఆయన మండిపడ్డారు. కాగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజక వర్గాలకు జరిగిన తొలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి, ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాదరావు ఓటమి పాలైన విషయం తెలిసిందే. -
హరీశ్‌రావుపై హక్కుల ఉల్లంఘన నోటీసు
హైదరాబాద్ : శాసనసభా వ్యవహారాల శాఖమంత్రి హరీష్‌రావుపై తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శుక్రవారం సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. సభలో సభలో తాను లేకపోయినా ...జాతీయ గీతాన్ని అవమానించినట్లు సస్పెండ్ చేయించి, సభను తప్పుదోవ పట్టించారని ఆయన తెలిపారు. ఈ అంశంపై సండ్ర వీరయ్య ఈరోజు ఉదయం హరీష్ రావుకు వ్యతిరేకంగా అసెంబ్లీ స్పీకర్‌కు సభా హక్కుల నోటీసు ఇచ్చారు. -
టీ.అసెంబ్లీలో నేడు ద్రవ్య వినిమయ బిల్లు
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో నేడు రాష్ట్ర ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సభలో బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలను నేటితో ముగించాలని అధికారపక్షం యోచిస్తోంది. దీనిపై స్పీకర్ మధుసూదనాచారి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే శాసనమండలిలో ప్రభుత్వం శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టనుంది. -
'వ్యంగ్యం.. ఆనక క్షమాపణ ఆయనకు అలవాటే'
-
'వ్యంగ్యం.. ఆనక క్షమాపణ ఆయనకు అలవాటే'
మంత్రి జగదీష్ రెడ్డి వ్యంగ్యంగా మట్లాడి తనను అవమానపరిచారని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు. ఆయన ఇంతకుముందు కూడా నోరు పారేసుకుని, ఆ తర్వాత క్షమాపణ చెప్పారని గుర్తుచేశారు. తెలంగాణ సాధన కోసం తాను చేసిన కృషి ఏంటో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అడిగితే చెబుతారని.. ఇప్పటికైనా జగదీష్ రెడ్డి తన తప్పేంటో తాను తెలుసుకుని.. హుందాగా మాట్లాడాలని అన్నారు. రేవంత్ రెడ్డిని సభలో మాట్లాడనీయమన్న టీఆర్ఎస్ మంత్రులు.. అదే పార్టీ సభ్యులు అలా చేస్తే ఎలా సమర్థిస్తారని చిన్నారెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికో న్యాయం.. వారికో న్యాయం అమలుచేస్తారా అంటూ నిలదీశారు. -
పోలీసులతో సస్పెండయిన టీడీపీ ఎమ్మెల్యేల వాగ్వివాదం
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులు, మార్షల్స్ సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వివాదం జరిగింది. మీడియా పాయింట్ వద్దకు వెళ్లడానికి వీళ్లేదంటూ తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు, మార్షల్స్ అడ్డుకున్నారు. వారిని తోసుకుంటూ మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నించగా పోలీసులు, మార్షల్స్ లతో వాగ్వివాదం చోటుచేసుకుంది. -
'మీలాగా ఆంధ్రా నేతల బూట్లు నాకలేదు'
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో బుధవారం గందరగోళం నెలకొంది. మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకె అరుణల మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాలో విద్యుత్ ప్రాజెక్ట్ అంశంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈనేపథ్యంలో డీకె అరుణ మాట్లాడుతూ తొలిసారి గెలిచి ఎమ్మెల్యేగా సభకు వచ్చిన జగదీశ్ రెడ్డి చాలా నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి ...ఆంధ్రా నేతల బూట్లు నాకారని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి అన్నారు. దాంతో జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. దీనిపై స్పీకర్ మధుసుదనాచారి మాట్లాడుతూ అభ్యంతరకర పదాలను రికార్డుల నుంచి తొలగిస్తామన్నారు. మరోవైపు జగదీశ్ రెడ్డి కూడా తాను కేసీఆర్ చలవ వల్ల, సూర్యాపేట ప్రజల ఆశీస్సులతో మంత్రినయ్యానన్నారు తన వ్యాఖ్యల్లో తప్పుంటే రికార్డుల నుంచి తొలగించాలని అన్నారు. దాంతో సభలో గందరగోళం నెలకొనటంతో స్పీకర్ సభను పదినిమిషాల పాటు వాయిదా వేశారు. -
స్పీకర్ కార్యాలయంలో టీడీపీ నేతల బైఠాయింపు
తెలంగాణ స్పీకర్ కార్యాలయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉదయం 9 గంటల నుంచి నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రధానంగా 3 అంశాలపై స్పష్టత ఇవ్వాలని తాము స్పీకర్ మధుసూదనాచారిని కోరామని టీ-టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అసెంబ్లీలో సీట్ల కేటాయింపు, పార్టీ మారిన నేతలపై అనర్హత వేటుతో పాటు.. గవర్నర్ ప్రసంగం సమయం నాటి అసెంబ్లీ ఫుటేజి ఇవ్వాలని తాము స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు. సీట్ల కేటాయింపుపై బుధవారం నాడు స్పష్టత ఇస్తామని స్పీకర్ తెలిపారని, అయితే ఫుటేజి మాత్రం ఇచ్చేది లేదన్నారని ఆయన వివరించారు. అనర్హత విషయం తేల్చేందుకు సమయం పడుతుందని స్పీకర్ సమాధానం ఇచ్చినట్లు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆ రెండు అంశాలపైనా కూడా స్పష్టత ఇచ్చేంతవరకు తాము స్పీకర్ కార్యాలయంలోనే బైఠాయిస్తామన్నారు. -
త్వరలోనే ఉద్యోగ నియామకాల ప్రక్రియ
హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఉద్యోగ నియామాకాల ప్రక్రియ, అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ప్రారంభిస్తామని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. తొలుత అత్యవసరమైన ఆర్డబ్ల్యూఎస్, సింగరేణి పోస్టుల భర్తీని చేపడుతామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులను తప్పకుండా క్రమబద్దీకరిస్తామని ఈటెల స్పష్టం చేశారు. పోస్టుల భర్తీకి అడ్డంకులన్నీ తొలగిపోయాయని చెప్పారు. -
టీ.అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో సోమవారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ఆడపిల్లల విక్రయాలపై సీపీఐ వాయిదా తీర్మానం ఇవ్వగా పార మెడికల్ సిబ్బంది రెగ్యులైజేషన్పై సీపీఎం వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. -
నియామకాలేవి..?
అసెంబ్లీలో సర్కారును నిలదీసిన జానారెడ్డి ఖాళీల భర్తీపై చర్చకు కాంగ్రెస్ వాయిదా తీర్మానం తిరస్కరించిన స్పీకర్, విపక్ష నేత ఆగ్రహం.. సభ నుంచి వాకౌట్ ఖాళీలు ప్రకటించిన వాళ్లం.. ఇవ్వకుండా పోతామా? త్వరలో నోటిఫికేషన్లు ఇస్తామన్న మంత్రి ఈటెల ఓయూలో నిరుద్యోగ జేఏసీ నిరసన సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో ఉద్యోగాల భర్తీ అంశం శుక్రవారం శాసనసభను కుదిపేసింది. నియామకాలను చేపట్టాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో విపక్ష కాంగ్రెస్ ఈ అంశంపై చర్చకు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించింది. ఉద్యోగాల కోసం రాష్ర్ట యువత ఎదురుచూస్తోందని, నియామకాల్లో జాప్యం వల్ల జరుగుతున్న అనర్థాలపై చర్చించాలని కోరింది. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే స్పీకర్ మధుసూదనాచారి ఈ వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రతిపక్ష నేత జానారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ అంశంపై చర్చకు నిరాకరించడమేంటని ప్రశ్నించారు. నిరుద్యోగులపై లాఠీచార్జీలు చేస్తున్నా.. సభలో చర్చకు అవకాశమివ్వరా అని నిలదీశారు. దీనిపై ఆర్థిక మంత్రి ఈటెల వివరణ ఇచ్చినా శాంతించకుండా జానాతో పాటు కాంగ్రెస్ సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్ర ఏర్పాటుతో నిరుద్యోగుల్లో ఆశలు రాష్ర్టం ఏర్పాటైన నేపథ్యంలో ఖాళీల భర్తీపై నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారని, దీనిపై చర్చకు అనుమతించాలని సభాపతిని జానారెడ్డి కోరారు. ‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాల విషయంలో సానుకూల చర్యలు ఉంటాయని అంతా ఆశించారు. ఇప్పుడు దీనిపై వాయిదా తీర్మానాన్ని ఇస్తే తిరస్కరిస్తున్నారు. బడ్జెట్ సమయాన్ని, సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి సహకరిస్తున్నాం. అయినా ప్రతిరోజూ వాయిదా తీర్మానాలను తిరస్కరించడం సమంజసమా? నిరుద్యోగులపై ఓయూలో లాఠీచార్జి జరిగినా చర్చకు అవకాశమివ్వరా? దీనిపై కనీసం స్వల్పకాలిక చర్చకైనా అవకాశమివ్వండి’ అని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి ఈటెల స్పందిస్తూ.. ‘ఐఏఎస్ అధికారుల విభజనే వారం కింద జరిగింది. కమలనాథన్ కమిటీ నివేదిక రావాల్సి ఉంది. హైకోర్టును విభజించాలని కూడా కోరుతున్నాం. శాఖల వారీగా ఖాళీలు తెప్పించుకుంటున్నాం’ అని తెలిపారు. ఉద్యోగ నియామకాల కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ‘విద్యార్థులకు ఉద్యోగాలను ఎప్పటికైనా మేమే ఇస్తాం.. మీరు ఇవ్వలేరు. దీనిపై మాట్లాడే హక్కు కూడా మీకు లేదు. ఇప్పటికే పోలీసు శాఖలో డ్రైవర్లు, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలో ఇంజనీర్ల భర్తీకి సిద్ధమయ్యాం. త్వరలోనే నియామకాలు చేపడతాం’ అని వ్యాఖ్యానించారు. ఇందుకు జానారెడ్డి అభ్యంతరం తెలిపారు. ‘ఇచ్చేది మేము, మీరెవరు’ అన్న ధోరణి మంచిది కాదని, సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం చెప్పినదల్లా వినడానికి సిద్ధంగా లేమన్నారు. ప్రకటించినవాళ్లం.. ఇవ్వకుండా పోతామా?: ఈటెల ‘ఉద్యోగాలు ఎవరిస్తారు.. ప్రభుత్వమే కదా. ఉద్యోగాలు భర్తీ చేస్తామంటే విపక్ష నే త జానారెడ్డికి ఎందుకంత అసహనం? ప్రతిపక్షాలు సూచనలు చేయాలి. జీవోలు ఇవ్వలేవు కదా. అయినా ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఖాళీలను ప్రకటించిన వాళ్లం, ఇవ్వకుండా పోతామా..’ అని మంత్రి ఈటెల అసెంబ్లీ లాబీల్లో మీడియాతో అన్నారు. ఈ విషయంలో విపక్షాలది అనవసర రాద్ధాంతమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ చెల్లింపుల వల్ల ప్రభుత్వంపై రూ.5 వేల కోట్ల భారం పడుతోందని, దాని సర్దుబాటుపై ఆలోచిస్తున్నామన్నారు. రాజకీయ లబ్ధికోసం అనవసర అంశాలను విపక్షాలు ప్రచా రం చేస్తున్నాయని మండిపడ్డారు. కాగా, గత పాలకుల నిర్లక్ష్యంతోనే నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆరోపించారు. లక్ష ఉద్యోగాలేమయ్యాయి?:వంశీ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తూ విసిగి వేసారి ఆందోళనకు దిగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని, లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీలిచ్చిన టీఆర్ఎస్.. ఇప్పుడు తొమ్మిది నెలల్లో ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ తన ఇంట్లో వారికి మాత్రం ఉద్యోగాలు కల్పించుకున్నారని వ్యాఖ్యానించారు. ఓయూలో నిరుద్యోగుల నిరసన ఓయూ: అసెంబ్లీలోని పరిణామాలపై ఉస్మానియా యూనివర్సిటీలోని నిరుద్యోగ సంఘాలు నిరసన తెలిపాయి. మంత్రి ఈటెల రాజేందర్ జన్మదిన వేడుకల ఫ్లెక్సీలను తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ నేతలు దహనం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. శుక్రవారం క్యాంపస్‌లోని ఆర్ట్స్ కళాశాల ఎదుట ముదిరాజ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మంత్రి ఈటెల ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అయితే అసెంబ్లీలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం తిరస్కరణకు గురవడం, ఆ పార్టీ సభ్యులు వాకౌట్ చేయడాన్ని టీవీల్లో చూసిన నిరుద్యోగ జేఏసీ నేతలు ఆగ్రహానికి గురయ్యారు. కొంతమంది విద్యార్థుతో ఆర్ట్స్ కళాశాల వద్దకు చేరుకుని అక్కడి ఈటెల ఫ్లెక్సీలను తగులబెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నార ంటూ కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉద్యోగాల కోసం పోరాడుతుంటే నిరుద్యోగులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని, అయినా భయపడేది లేదని, నియామక ప్రకటనలు వచ్చే వరకు ఉద్యమిస్తామని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కళ్యాణ్, అధ్యక్షుడు కోటూరి మానవతరాయ్ హెచ్చరించారు. -
శాసన సభ వెలవెల!
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రులు ఆ ఆరు జిల్లాల ఎమ్మెల్యేల హాజరూ పలచనే సాక్షి, హైదరాబాద్: శాసన మండలి ఎన్నికల ప్రభావం అసెంబ్లీ సమావేశాలపైనా పడింది. రాష్ట్రంలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి శుక్రవారం ప్రచారానికి చివరి రోజు కావడంతో అధికార టీఆర్ఎస్ సభ్యులు తమ సొంత జిల్లాలకే పరిమితం అయ్యారు. ఏడుగురు మంత్రులు ఆయా జిల్లాల్లో తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో శుక్రవారం సభలో సభ్యుల సంఖ్య పలుచగా కనిపించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సైతం సభలో కొద్దిసేపే ఉన్నారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గం అభ్యర్ధి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తరఫున ఆ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, మంత్రి టి.హరీశ్‌రావు ఖమ్మంలో ప్రచారంలో పాల్గొన్నారు. ఆ జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కూడా హరీశ్‌రావుతో కలసి ప్రచారం చేశారు. మరో మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి గ్యాదరి కిషోర్ నల్లగొండ జిల్లాలో ప్రచారం చేశారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్ధి దేవీప్రసాద్ తర ఫున ఈ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, మంత్రి కె.తారకరామారావు మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రచారంలో ఉన్నారు. కాగా, ఆ జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, డాక్టర్ లక్ష్మారెడ్డి కూడా ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో ఈ మంత్రులు ఎవరూ శుక్రవారం అసెంబ్లీకి హాజరు కాలేదు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి పి.మహేందర్‌రెడ్డి సైతం ఎన్నికల ప్రచారంలోనే ఉన్నారు. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలోని ఆరు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ప్రచారంలోనే ఉన్నారు. వరంగల్ జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్ మాత్రం సభకు హాజరయ్యారు. సీఎం కూడా కొద్దిసేపు మాత్రమే సభలో ఉండి వెళ్లడంతో సభా బాధ్యతలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చూసుకున్నారు. -
టీ.అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో శుక్రవారం సీపీఎం రెండు అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలను విడుదల చేయాలని, గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని సీపీఐ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టింది. మరోవైపు బడ్జెట్ పద్దులపై శాసనసభలో మూడో రోజు చర్చ కొనసాగనుంది. పురపాలక, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి పారుదల, ఇంధన శాఖల పద్దులకు సంబంధించి నిన్న సభలో చర్చ జరిగిన విషయం తెలిసిందే. -
'టీడీపీ, బీజేపీ దొందూ దొందే'
బీజేపీ ముసుగులో టీడీపీ రాజకీయ వ్యవహారాలు నడిపిస్తోంది. చంద్రబాబు తొమ్మిదేళ్లు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలను రాచి రంపాన పెట్టారు. పర్యటన పేరిట చిన్న చిన్న ఉద్యోగులను సస్పెండ్ చేశారు. చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకి. అమరులను, రైతులను అవమానపరిచేలా వ్యవహరించారు. చంద్రబాబును ప్రజలను తిరస్కరించారు. బీజేపీకి తెలంగాణవాదుల పట్ల ప్రేమ ఉంటే ఉద్యమం సందర్భంగా నమోదైన రైల్వే కేసులను ఎత్తివేయాలని కేంద్రాన్ని కోరేది. టీడీపీ, బీజేపీ దొందూ దొందే. -రామలింగారెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే -
పీఆర్సీ జీవో సవరించాలి
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవో లోపభూయిష్టం. వేతనాల సవరణ, బకాయిల చెల్లింపు, స్కేల్ పేమెంట్ తదితర అంశాలపై స్పష్టత లేదు. ఉద్యోగులను ఏప్రిల్ ఫూల్ చేసేలా ఉంది. తక్షణమే జీవోను సవరించాలి. ఉద్యోగుల బకాయిలపై సభలో ప్రస్తావిస్తే దాట వేశారు. గత ప్రభుత్వాలు కూడా ఉద్యోగులకు 39 శాతం వరకు ఫిట్మెంట్ ఇచ్చాయి. ఉద్యోగులకు ఇచ్చిన హెల్త్‌కార్డులు దేనికీ పనికి రాకుండా ఉన్నాయి. ఆస్పత్రులతో ఒప్పందాలు కుదుర్చుకోలేదు. రాష్ట్రంలో ఏకపక్ష, కుటుంబపాలన సాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. సీఎం కార్యాలయం నుంచి సైతం బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన శాస్తి తప్పదు. -కిషన్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే -
పీఆర్సీ బకాయిలపై రచ్చ
ప్రభుత్వ సమాధానం కోసం బీజేపీ పట్టు మంత్రులు, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ బకాయిల చెల్లింపుపై స్పష్టత కోరుతూ భారతీయ జనతాపార్టీ(బీజేపీ) ఆందోళనకు దిగడంతో గురువారం శాసనసభలో కొంతసేపు గందరగోళం నెలకొంది. ఈ అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో బీజేపీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీవీఎస్ ప్రభాకర్, రాజాసింగ్ స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చి నిరసనకు దిగారు. పీఆర్సీ అమలుకు సంబంధించి బుధవారం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో శాఖలవారీగా ఉద్యోగుల పేస్కేళ్ల వివరాలులేవని, వేతన స్థిరీకరణ మెమో రాలేదని, గ్రాట్యూటీని రూ.15 లక్షలకు పెంచుతామని ప్రభుత్వం అంగీకరించిన ఇంకా ఉత్తర్వులు జారీ చేయలేదని బీజేపీ సభ్యుడు జి.కిషన్‌రెడ్డి ‘జీరోఅవర్’లో ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. 2014 జూన్ 2 నుంచి రావాల్సిన పీఆర్సీ బకాయిలను బాండ్ల రూపంలో కాకుండా జీపీఎఫ్ ఖాతాలో జమా చేయాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ సభలో లేకపోవడంతో ప్రభుత్వం తరఫున ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి కె.తారకరామారావులు స్పందిస్తూ ఈ విషయాన్ని ఆర్థికశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమాధానమిప్పిస్తామన్నారు. ఈ సమాధానంపై బీజేపీ సంతృప్తి చెందకపోవడం, జీరోఅవర్‌లో సభ్యులు లేవనెత్తే ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానమిచ్చే సంప్రదాయం లేదని మంత్రులు బదులిచ్చారు. అయినా.. పీఆర్సీ బకాయిల అంశంపై సమాధానం కోసం బీజేపీ సభ్యులు పట్టుబట్టి నిరసనగా దిగారు. మంత్రులు కడియం శ్రీహరి, కేటీఆర్‌లు మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఉద్యోగుల స్నేహపూరిత ప్రభుత్వమన్నారు. ఎక్కడాలేని విధంగా 43 శాతం ఫిట్మెంట్, ప్రత్యేక ఇంక్రిమెంట్‌తోపాటు ఆరోగ్యకార్డులను జారీ చేశామన్నారు. కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే బీజేపీ ఈ ప్రశ్నను లేవనెత్తిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీఎల్పీ నేత కె.లక్ష్మణ్ స్పందిస్తూ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్యకార్డులు నిరుపయోగంగా మారాయని, కార్పొరేట్ ఆస్పత్రులు వీటిని తిరస్కరిస్తున్నాయని మండిపడ్డారు. భవిష్యత్తులో బాండ్లు సైతం ఇలానే చెల్లవన్నారు. ఆర్థికమంత్రితో సమాధానమిప్పిస్తామని స్పీకర్ నచ్చజెప్పి బీజేపీ సభ్యులతో ఆందోళన విరమింపజేశారు. జీరో అవర్‌లో ఎవరెవరు.. బహదూర్‌పూర తహసీల్దార్‌పై దాడి చేసినవారిని పీడీ యాక్టు కింద అరెస్టు చేయాలని అహమ్మద్ పాషా ఖాదీ(ఎంఐఎం) ప్రభుత్వాన్ని కోరారు. హెదరాబాద్-విజయవాడ మార్గంలో సర్వీసు రోడ్డు నిర్మించకపోవడంతో ఇప్పటివరకు 200 మంది ప్రమాదాలకు గురై మృతి చెందారని వేముల వీరేశం(టీఆర్ఎస్) ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఎస్సీ కులాల జాబితాలో నేతకాని కులాన్ని నితారిగా పేర్కొనడంతో కుల ధ్రువీకరణపత్రాలు జారీ కావడం లేదని, దీనిని సరిచేయాలని దుర్గం చెన్నయ్య(టీఆర్ఎస్) విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్-నర్సి రోడ్డులో ఇరుకుగా మారిన బ్రిడ్జీలతో తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే షకీల్ అహమద్(టీఆర్ఎస్) ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనాలను రూ.1000 నుంచి రూ.15 వేలకు పెంచాలని, మెస్ చార్జీలను రూ.4.35 పైసల నుంచి రూ.15కు పెంచాలని రవీంద్ర కుమార్(సీపీఐ) డిమాండు చేశారు. -
చెరువులు ‘ఇరిగేషన్’కు అప్పగించొద్దు
టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ పథకం పూర్తయ్యాక చెరువుల నిర్వహణ బాధ్యతను నీటిపారుదల శాఖకు అప్పగిస్తే అవి మళ్లీ నాశనమయ్యే ప్రమాదం ఉంటుందని టీఆర్ఎస్ సభ్యుడు చెన్నమనేని రమేశ్ అన్నారు. గురువారం పద్దులపై చర్చలో భాగంగా మిషన్ కాకతీయపై ఆయన శాసనసభలో ప్రసంగించారు. చెరువులపై ఆధారపడే కులవృత్తులవారి సం ఘాలు, గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో వాటి నిర్వహణ ఉండాలని, ఇతర ప్రభుత్వ విభాగాల ప్రతినిధులతో కూడిన కమిటీలతో సమష్టి నిర్వహణలోనే అవి వర్ధిల్లుతాయని పేర్కొన్నారు. -
పోలవరం, పట్టిసీమపై పోరాటం
పోలవరంలో అంతర్భాగంగానే పట్టిసీమ: హరీశ్ తెలంగాణకు సంబంధం లేదంటే ఎలా? ఇరు రాష్ట్రాల ప్రజలను మోసం చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ఎత్తును ఎలా పెంచుతారో చూస్తామని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో గొడవకు కారణమైన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల వ్యవహారం గురువారం రాష్ర్ట శాసన మండలి లోనూ ప్రస్తావనకు వచ్చింది. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇప్పటికే ఖమ్మంజిల్లాలోని ఏడు మండలాలను ముంచిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఇప్పుడు పోలవరం ఎత్తును 15అడుగుల మేర పెంచేం దుకు ప్రయత్నిస్తున్నారని పొంగులేటి వ్యాఖ్యానించారు. మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ.. ‘తెలంగాణపై బాబు కుట్రలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. పోలవరం డిజైనే మార్చాలని పోరాడుతుంటే దాన్ని 15 అడుగుల ఎత్తును ఎలా పెంచుతారో చూస్తాం. పట్టిసీమపై తెలంగాణకు, కేసీఆర్‌కు ఏం సంబంధమని అసెం బ్లీలో చెప్పిన బాబు.. గత జనవరి 1న ఇచ్చిన జీవో నెంబర్1లో మాత్రం పోలవరం లో అంతర్భాగంగానే పట్టిసీమను నిర్మిస్తున్నట్లు స్పష్టంచేశారు. గోదావరి నీటిని కృష్ణాకు తరలించి, పోలవరంలో అంతర్భాగంగా పట్టిసీమను నిర్మిస్తామని చెబుతూ తెలంగాణకు సంబంధం లేదంటే ఎలా? పోలవరం ద్వారా 80 టీఎంసీలు తరలించినప్పుడు ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక 35 టీఎంసీలు వాడుకోవాలని, ఆంధ్రప్రదేశ్ మిగతా 45టీఎంసీలు వాడుకోవాలని కృష్ణా జలాలపై బచావత్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. ఇప్పుడు తెలంగాణతో కలసి ఎగువన మూడు రాష్ట్రాలున్నాయి. తెలంగాణకు కూడా వాటా ఉంది. పట్టిసీమను తెలంగాణకు సంబంధం లేకుండా నిర్మించలేరు. పట్టిసీమతో పాటు పోలవరంపై తెలంగాణ పోరాటం చేస్తుంది’ అని స్పష్టంచేశారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీలు నర్సారెడ్డి, పొట్ల నాగేశ్వర్రావు అభ్యంతరం వ్యక్తం చేయాలని చూసినా అవకాశమివ్వలేదు. నాణ్యమైన బియ్యం సరఫరా: ఈటెల పలువురు సభ్యులు అడిగిన మరో ప్రశ్నకు మంత్రి ఈటెల రాజేందర్ సమాధానమిస్తూ.. సంక్షేమ వసతిగృహాలకు, మధ్యాహ్న భోజనానికి అత్యంత నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. 2,695 వసతి గృహాలు, 27,865 పాఠశాలలకు 20,389 టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో 8,109 లెసెన్సులు ఉన్నట్లు సభ్యులు అడిగిన మరో ప్రశ్నకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. నక్కలగండి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి హరీశ్‌రావు తెలిపారు. -
అసెంబ్లీ దృశ్యాలను టీడీఎల్పీలో విడుదల చేస్తారా?
ఏపీ ప్రభుత్వపెద్దల కుసంస్కారం ఇది సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన సభా వ్యవహారాల దృశ్యాలను టీడీపీఎల్పీ కార్యాలయంలో విడుదల చేయడం కుసంస్కారమని, ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకే చెల్లిందని తెలంగాణ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. బుధవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన గొడవ దృశ్యాలను టీడీపీ నాయకత్వం బహిరంగపర్చిన విషయం తెలిసిందే. గురువారం అసెంబ్లీ లాబీల్లో మంత్రి హరీశ్‌రావు చాంబర్ ఎదుట బీజేపీ ఎల్పీ నేత డాక్టర్ లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతుండగా, అదే సమయంలో అక్కడకు వచ్చిన ఆయన కూడా మాటలు కలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎలా నడుస్తుందో, ఏపీ అసెంబ్లీ ఎలా నడుస్తుందో గమనించండి అని పేర్కొన్నారు. స్పీకర్ మధుసూదనాచారిపై టీడీపీ అవిశ్వాసం పెడుతుందన్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకుపోగా ‘ఏం జరిగిందని అవిశ్వాసం పెడతారు..? తీర్మానం ఇచ్చి మూతులు పగుల గొట్టుకుంటారా..’ అని ప్రశ్నిం చారు. ‘ సభను సజావుగా, అర్ధవంతంగా నడపాలనుకున్నాం. అన్ని అంశాలపై చర్చ జరగాలన్నదే తమ అభిమతం. సభలోఉండి గొడవలు పెట్టాలనుకున్నారు. వాయిదాలు వేసుకుంటూ సభను నడపాలా.. పోడియంలోకి వెళితే ఎత్తి అవతల పడేసి సభను జరుపుతాం..’ అని పేర్కొన్నారు. సభలో ఉన్న వారికి మైకు వస్తుందని, మాట్లాడిన వారికి మాట్లాడినంత సమయం ఇస్తామన్నారు. పదేళ్ల అసెంబ్లీ చరిత్రలో ఇంత సమగ్రంగా చర్చలు ఎప్పుడైనా జరిగాయా అని ప్రశ్నించారు. విపక్షాలకూ పూర్తిగా సహకరిస్తున్నామని, డిమాండ్లపై మాట్లాడేందుకు అధ్యయనానికి సమయం కావాలని విపక్షాలు కోరితే వాయిదా వేశామని చెప్పారు. -
స్పీకర్‌పై టీడీపీ అవిశ్వాసం?
జానాతో ఎర్రబెల్లి, రేవంత్ చర్చ నేడు నోటీసు ఇవ్వాలని నిర్ణయం! సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని టీటీడీపీ యోచిస్తోంది. అందుకుగల అవకాశాలు, అవిశ్వాసం పెట్టిన తర్వాత ఉత్పన్నం కాబోయే అంశాలపై చర్చించడానికి టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు, ఉపనేత రేవంత్‌రెడ్డి గురువారం సీఎల్పీ నాయకుడు జానారెడ్డిని కలిశారు. నేరుగా ఆయన నివాసానికి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు దాదాపు అరగంటపాటు సమావేశమయ్యారు. శాసనసభలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న కీలక సమయం లో ఒకసెషన్ మొత్తం, ఒక పార్టీని ఏకపక్షం గా సస్పెండ్ చేయడం చరిత్రలో ఎక్కడా లేదని వివరించినట్టుగా సమాచారం. పార్టీ ఫిరాయింపులు, మంత్రిగా తలసాని కొన సాగింపుపై తాము ఫిర్యాదు చేసినా స్పీకర్ పట్టించుకోవడం లేదని, ఇందుకు నిరసనగా అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం నోటీసివ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇదే విషయంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతోనూ చర్చించారు. టీడీపీపై సస్పెన్షన్ ఎత్తివేయాలి తెలుగుదేశం పార్టీ సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు స్పీకర్ ఎస్.మధుసూదనాచారిని కలసి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు గవర్నర్ ప్రసంగం సందర్భంగా జాతీయగీతాన్ని అవమానించారని, వారంతా బేషరతుగా సభకు క్షమాపణ చెప్పాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించి ఆ మరుసటి రోజు సభలో స్పీకర్‌ను, పోడియంను చుట్టుముట్టడంతో టీడీపీ సభ్యులు 11మందిని ఈ సెషన్స్ మొత్తం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కాగా, మొత్తం సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం సబబు కాదని, వారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ సభ్యులు స్పీకర్‌ను కలిశారు. కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, బీజేపీ ఎల్పీనేత డాక్టర్ లక్ష్మణ్, సీపీఎం, సీపీఐ ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, రవీంద్రకుమార్‌లు స్పీకర్‌ను కలసి చర్చించారు. ఇదే సమయంలో పద్దులపై చర్చకు తాము సమయం అడిగామని, కనీసం అధ్యయనం చేయకుండా చర్చలో ఎలా పాల్గొంటామని స్పీకర్‌కు వివరించినట్లు బీజేపీ ఎల్పీ నేత డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. ఏ రోజు డిమాండ్లు ఆ రోజు పూర్తి చేయాలనుకోవడం వరకూ ఓకే కానీ అప్పటికప్పుడే తాము ఎలా తయారై చర్చిస్తామని ఆయన ప్రశ్నించారు. -
వ్యవసాయమంత్రి సమాధానం లేకుండానే..
మండలిలో రైతుల సమస్యలపై ముగిసిన చర్చ 27న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ఉందంటూ వాయిదా వేసిన చైర్మన్ సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో రైతుల సమస్యలపై స్వల్పకాలిక చర్చ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమాధానం లేకుండానే ముగిసింది. గురువారం కౌన్సిల్లో గిట్టుబాటు ధరలు, విద్యుత్ పరిస్థితి, రైతుల ఇతర సమస్యలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా పలువురు ఎమ్మెల్సీ లు తమ అభిప్రాయాలను తెలియజేశాక చైర్మన్ స్థానంలో ఉన్న నేతి విద్యాసాగర్ సభను 27వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సభ్యులు లేవనెత్తిన అంశాలతో పాటు ఇతరత్రా సమాచారంతో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమాధానమిచ్చేందుకు సంసిద్ధం కాగా, సభ వాయిదాతో ఆయన మిన్నకుండిపోయారు. ఈ అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందని, ఇప్పటికి 775 మంది రైతులు ఆత్మహత్యల చోటుచేసుకున్నట్లు రైతు స్పందన వేదిక ప్రకటించిందన్నారు. బాధిత కుటుంబాలకు ఇచ్చే సహాయాన్ని రూ. లక్షన్నర నుంచి రూ.5 లక్షలకు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. కరెంటు చార్జీల ప్రతిపాదనను విరమించుకోవాలని కోరారు. టీడీపీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం వచ్చినా వ్యవసాయ సంక్షోభం తప్పడం లేదన్నారు. రైతురాజ్యం, బంగారు తెలంగాణ అంటూ ప్రభుత్వం ఏవేవో మాట్లాడుతోందని, విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేయాలని కోరారు. వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకుని కొందరికి చెప్పే అలవాటు ఉంటుందని, చేసే అలవాటు ఉండదని, కానీ తాము అన్నీ అమలుచేసి చూపిస్తామన్నారు. తమకు విజన్డాక్యుమెంట్ అవసరం లేదని అన్నారు. ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం విత్తన భాండాగారం, భూసార పరీక్ష కార్డులు ఇలా రైతులకు ఉపయోగకరమైన అనేక చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ మాట్లాడుతూ రైతులను చైతన్యవంతులను చేసి వారు ఆత్మహత్యల బారినపడకుండా చూడాలని సూచించారు. -
ఫీజుల చెల్లింపుల్లో ఇబ్బంది వాస్తవమే
విద్యా సంవత్సరం పూర్తికాక ముందే చెల్లిస్తాం: కడియం ఆ 26 బీసీ కులాల విద్యార్థులకు కోర్సుల కొనసాగింపు కోసం ఫీజులు వచ్చే ఏడాది కోసం కొత్త విధానం రూపకల్పన ప్రతి జిల్లాకో రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో జాప్యం కారణంగా విద్యార్థులు, కళాశాలలకు కొంత ఇబ్బంది కలిగిన మాట వాస్తవమేనని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అంగీకరించారు. అయితే, ఈ విద్యా సంవత్సరం పూర్తికాక ముందే విడతల వారీగా ఫీజులు విడుదల చేస్తామన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ అమలుపై గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో బీజేపీఎల్పీ నేత కె.లక్ష్మణ్, ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్(బీజేపీ), కొప్పుల ఈశ్వర్(టీఆర్ఎస్), భట్టి విక్రమార్క(కాంగ్రెస్) తదితరులు లేవనెత్తిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమాధానమిచ్చారు. గ్రేడింగ్ విధానం వల్ల ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులు వేర్వేరుగా ఉన్నా, అందుకు తగ్గట్లు ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పూర్తి ఫీజులను చెల్లిస్తామన్నారు. 10 వేలకు లోపు ర్యాంకులు సాధించిన బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులకు సైతం పూర్తి ఫీజులు చెల్లిస్తామన్నారు. విద్యార్థుల స్థానికత నిర్ధారణ కోసం 371డీ ఆర్టికల్ అమలు మినహా ఈ సంవత్సరం ఫీజుల పథకాన్ని యథాతథంగా అమలు చేస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు, కళాశాలలకు ఇబ్బంది కలగకుండా ఫీజుల పథకానికి కొత్త విధానాన్ని రూపొందిస్తున్నామన్నారు. ఈ ఏడాది 15.77 లక్షల విద్యార్థులకు సుమారు రూ.2,300 కోట్ల ఫీజులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. బీసీ కులాల జాబితా నుంచి 26 కులాలను తొలగించినా.. ఇప్పటికే ప్రవేశాలు పొందిన ఆ కులాల విద్యార్థులకు సంబంధిత కోర్సులు పూర్తయ్యే వరకు ఫీజులు చెల్లిస్తామన్నారు. హైదరాబాద్‌లో విద్యార్థులకు కుల సర్టిఫికెట్ల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేయగా.. ఇబ్బందులు తొలగిస్తామని కడియం హామీ ఇచ్చారు. వచ్చే సంవత్సరం నుంచి ప్రతి జిల్లాలో ఒక రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. కేజ్ కల్చర్‌లో చేపల సాగు: పోచారం రాష్ట్రంలో కేజ్ కల్చర్ విధానంలో మత్స్య సంపద పెంపునకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. జార్ఖంఢ్లోని చండియా జలాశయంలో విజయవంతమైన ఈ కేజ్ కల్చర్ విధానంపై స్వయంగా అధ్యయనం చేయగా లాభసాటిగా ఉన్నట్టు తేలిందన్నారు. దీంతో రాష్ట్రంలో తొలిసారిగా ఈ ఏడాది కోయిల్‌సాగర్, లోయర్ మానేరు, శ్రీరాం సాగర్, నిజాం సాగర్, పోచారం ప్రాజెక్టుల్లో కేజ్ కల్చర్ విధానంలో చేపల సాగును ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు. మత్స్య కారుల అంశంపై చిలమల మదన్‌రెడ్డి(టీఆర్ఎస్) అడిగిన ప్రశ్నకు మంత్రి పోచారం ఈ మేరకు సమాధానమిచ్చారు. మెట్రో విస్తరణపై ఆలోచన: తుమ్మల హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ఏడు మార్గాల్లో పొడిగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. మియాపూర్-పటాన్చెరు, ఎల్బీనగర్-హయత్‌నగర్, ఫలక్‌నుమా-శంషాబాద్, తార్నాక-ఈసీఐఎల్, నాగోల్-ఎల్.బి.నగర్-ఈసీఐఎల్ క్రాస్ రోడ్డు మార్గాల్లో మెట్రో పొడిగింపుపై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. మెట్రోపై టీఆర్ఎస్ సభ్యులు మలిపెద్ది సుధీర్‌రెడ్డి, చింతా ప్రభాకర్‌తో పాటు కె.లక్ష్మణ్ (బీజేపీ), ముంతాజ్ అహమ్మద్ ఖాన్(ఎంఐఎం) తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. 2017 జూలై లోగా మెట్రో ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందన్నారు. నాగోల్-మెట్టుగూడ మార్గంలో ఉగాది రోజున ప్రారంభం కావాల్సిన మెట్రో రైలు సర్వీసును నిర్మాణ సంస్థే వాయిదా వేసుకుందన్నారు. సికింద్రాబాద్ వరకు లైను పొడిగించిన తర్వాత సేవలను ప్రారంభించాలని నిర్ణయించిందన్నారు. -
'ప్రతిపక్షాల గొంతు నొక్కేయత్నం'
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో సాక్షాత్తూ సభాపతే ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. సభాపతిగా సభ్యులకు సమ న్యాయం చేయాల్సింది పోయి అధికార పక్షానికి వంత పాడుతున్నారు. అధికారపక్షం సభ్యురాలు గొంగిడి సునిత మద్యం వ్యాపారిని అసెంబ్లీ లాబీకి తీసుకొచ్చి మూసివేసిన దుకాణాన్ని తెరిపించేందుకు సంబంధిత మంత్రి వద్ద పైరవీలు చేసినట్లు పత్రికల్లో వార్తా కథనాలు వచ్చాయి. ఆ వ్యాపారిని ఎలా అనుమతించారని, స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. - డీకే అరుణ, సంపత్‌కుమార్, భాస్కర్‌రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు -
అసెంబ్లీ ఆర్థిక సంఘాలకు ఎన్నికలు
- పీఏసీ, పీయూసీ, అంచనాల కమిటీలకు ప్రభుత్వం ప్రతిపాదన - 23న నామినేషన్లు, 25న ఎన్నిక సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీలో ఆర్థిక సంఘాల ఎన్నికలకు ప్రభుత్తం కసరత్తు మొదలు పెట్టింది. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం సభలో మూడు కమిటీల ఎన్నికలకు సంబంధించి స్రభుత్వం తరపున ప్రతిపాదించారు. ప్రజా (పద్దుల) లెక్కల కమిటీ (పీఏసీ), అంచనాల కమిటీ (ఎస్టిమేట్స్), ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ (పీయూసీ)ల్లో శాసనసభ నుంచి 9 మంది సభ్యుల చొప్పున 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఎన్నుకోనున్నారు. 23న మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల దాఖలు, మూడు నుంచి అయిదు గంటల వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 24న మూడు గంటల వరకు ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. 25న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ ఉంటుంది. మండలిలో... శాసన మండలి నుంచి పీఏసీ, ఎస్టిమేట్స్, పీయూసీ కమిటీల్లో నలుగురేసి సభ్యుల చొప్పున ఎన్నుకునేందుకు మండలి చైర్మన్ కె.స్వామి గౌడ్ షెడ్యూల్ ప్రకటించారు. ఈ కమిటీలకు మండలి నుంచి నలుగురేసి సభ్యుల చొప్పున ఎన్నుకునేందుకు ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి కె. తారక రామారావు కౌన్సిల్ లో ప్రవేశపెట్టారు. -
'గీతారెడ్డిని అవమానించిందెవరు?'
- ఆమెను జైల్లో పెట్టించే ప్రయత్నం జరగలేదా?: రసమయి ఎదురుదాడి - మాటిమాటికి నా పేరెందుకు ఎత్తుతారు: గీతారెడ్డి - ఇది శాసనసభనా, ధూం..ధాం సభనా?: జానారెడ్డి అసహనం సాక్షి, హైదరాబాద్: ‘దళిత ఉప ముఖ్యమంత్రి బర్తరఫ్ అంశాన్ని లేవనెత్తుతున్న కాంగ్రెస్ సభ్యులు వారి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? దళిత మహిళ గీతారెడ్డి భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉంటే చూసి ఓర్వలేక ఆమెను జైల్లో పెట్టే ప్రయత్నం చేయలేదా. ఆ విషయాన్ని మరిచిపోయి ఇప్పుడు మా ప్రభుత్వంపై విమర్శలెందుకు చేస్తున్నారు. దళిత సంక్షేమం అంటే వారి పేరు చెప్పుకుని ఓట్లు అడగ టం కాదు.. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వారి అభ్యున్నతికి కృషి చేయాలి. అది కేసీఆర్ చేస్తున్నారు’ అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత వ్యతిరేకిగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సభ్యులు విమర్శలు చేయటంతో ఆయన ప్రత్యారోపణలతో సభలో వేడి పుట్టించారు. దీంతో రెండు పక్షాల మధ్య వాదోపవాదాలతో గందరగోళం నెలకొంది. పాటలు పాడుతూ హద్దుపద్దూ లేని ఆరోపణలు చేస్తున్నా ఎలా అనుమతిస్తున్నారని సీఎల్పీ నేత జానారెడ్డి ఉపసభాపతిని ప్రశ్నించి అసలు ఇది శాసనసభా.. ధూంధాం సభనా అంటూ అసహనం వ్యక్తం చేశారు. సంపత్ వర్సెస్ రసమయి కాంగ్రెస్ సభ్యుడు సంపత్ ఆవేశ ప్రసంగం.. కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ తర్వాత ప్రసంగం ప్రారంభించిన రసమయి... ఆది నుంచి ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. ఇన్నేళ్ల తర్వాత దళిత పక్షపాత సీఎంగా కేసీఆర్ కనిపిస్తున్నారని, పాటలు పాడుకుంటున్న తనను సాంస్కృతిక సారథికి చైర్మన్ చేశారని రసమయి బాలకిషన్ అన్నారు. హాస్టళ్లలోని పేద పిల్లలు సన్నబియ్యం తింటుంటే అభినందించాల్సిందిపోయి దాన్నీ రాజకీయం చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దశలోనే గీతారెడ్డి ప్రస్తావన తెచ్చారు. దీనికి గీతారెడ్డి లేచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రసమయి సానుభూతి నాకవసరం లేదు ‘సభలో మాటిమాటికి నా ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు. రసమయి సానుభూతి నాకవసరం లేదు. కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని సభలో లేవనెత్తటం సరికాదు’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి అన్నారు. అసలు అప్పుడు ఎవరో చేసిన తప్పుల్లో మంత్రులుగా మా పేరు వచ్చింది. వాస్తవమేంటో కోర్టు తేలుస్తుంది. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కదా... అన్ని ఫైళ్లు తెప్పించుకుని వాస్తవాలేంటో చెప్పమనండని ఆగ్రహంగా మాట్లాడారు. -
'ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం'
ఆరోపణలేంటో చెప్పకుండా రాజయ్యను బర్తరఫ్ చేశారు ఏడాదిలో ఒక్క దళితుడికి ఉద్యోగం ఇవ్వలేదేమిటీ? కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ ఆవేశపూరిత ప్రసంగం సాక్షి, హైదరాబాద్: ‘ఉప ముఖ్యమంత్రి రాజయ్యను బర్తరఫ్ చేసి తీవ్రంగా అవమానపర్చారు. ఆయనపై వచ్చిన ఆరోపణలేంటో కూడా చెప్పకుండా తొల గించారు..అదే సమయంలో తీవ్ర అవినీతి ఆరోపణలున్న వారిని మంత్రులుగా కొనసాగిస్తున్నారు.. ఏడాది కాలంలో ఒక్క దళితుడికీ ఉద్యోగమివ్వలేదు. రాష్ట్రంలో దళితవ్యతిరేక ప్రభుత్వం నడుస్తోంది’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బుధవారం శాసనసభలో పద్దులపై చర్చ ప్రారంభించిన స్పీకర్ తొలుత సంపత్‌కు అవకాశమిచ్చారు. ఆయన ప్రసంగం ప్రారంభం నుంచే ప్రభుత్వంపై దాడి ప్రారంభించారు. ఇందిరమ్మ బిల్లులు నిలిచిపోయి పేదలు ఇబ్బంది పడుతున్నారని చెబితే.. ‘అక్రమాలకు పాల్పడ్డవారి ముక్కుపిండి వసూలు చేసి చెల్లిస్తామ’ని సీఎం అంటున్నారని, ముక్కుపిండి వసూలు చేస్తారో, ముక్కు నేలకి రాసి చెల్లిస్తారో గానీ.. బడాబాబుల జోలికి వెళ్లకుండా పేదలపై ప్రతాపం చూపుతున్నారు’ అని విమర్శించారు. నిరుపేదల ఇంటికి అల్లుడో, కోడలో వస్తే ఇబ్బందిగా ఉందని, కోళ్లు గొర్రెలతోపాటు ఇంట్లో గడుపుతుంటే చూడలేక రెండు బెడ్రూమ్ల ఇంటి హామీ ఇచ్చానన్న ముఖ్యమంత్రి దాన్ని విస్మరించారని, ఇప్పుడు ఆ అల్లుళ్లు, కోడళ్లు జేఏసీగా ఏర్పడి పోరుకు సిద్ధమవుతారని వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఈటెల రాజేందర్ తాత కొర్రబియ్యం తిన్నారని, తండ్రి రాగి సంగటి తిన్నారని, ఈటెల దొడ్డుబియ్యం, ఇప్పుడు సన్నబియ్యం తింటున్నారని.. ఇది కాలక్రమంలో వచ్చే మార్పేనని, హాస్టళ్లకు సన్నబియ్యం పంపిణీని ప్రభుత్వం అంతగొప్పగా చూపాల్సిన అవసరం లేదన్నారు. ఈ సమయంలోనే దళిత వ్యతిరేక ప్రభుత్వం, రాజయ్యకు అవమానంఅంటూ పేర్కొన్నారు. దీంతో అధికారపక్ష సభ్యులు అడుగడుగునా ఆగ్రహం వ్యక్తం చేయడంతో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. సమయం మించిపోయిందంటూ డిప్యూటీ స్పీకర్ ఆయన మైక్ కట్ చేశారు. దీంతో ముందు వరస దగ్గరకొచ్చిన సంపత్ అక్కడి బల్లలను బలంగా చరుస్తూ మాట్లాడడం ప్రారంభించారు. ఆయన తీరును మంత్రులు నాయిని, తుమ్మల తప్పుబట్టారు. స్పీకర్ ఆయనకు మైక్ కేటాయించగా...మళ్లీ దళిత వ్యతిరేక ప్రభుత్వమంటూ సంపత్ ఆరోపణలు చేయటంతో డిప్యూటీ స్పీకర్ మళ్లీ మైక్ కట్ చేశారు. -
సభలో ఇక ‘ఐక్య’ పక్షం
ఏకతాటిపై ఉండాలని విపక్షాల నిర్ణయం సాక్షి, హైదరాబాద్: శాసనసభలో అధికార టీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కొనేందుకు కలసికట్టుగా ఉండాలని విపక్షాలన్నీ ఒక నిర్ణయానికి వచ్చాయి. పార్టీల మధ్య ఉన్న వైరుధ్యాలను పక్కకు పెట్టి ఐక్యతతో లేకుంటే కష్టమన్న భావనకు వచ్చిన కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ ఎమ్మెల్యేలు బుధవారం చర్చించుకున్నారు. ‘కేవలం ఈ ఒక్క సెషన్స్‌కు అని మాత్రమే కాదు. భవిష్యత్తు గురించి కూడా చర్చించుకున్నాం. ప్రభుత్వాన్ని నిలవరించాలంటే ప్రతిపక్ష పార్టీలు ఒక్కటిగా ఉండాల్సిన అవసరం ఉంది..’ అని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి లాబీల్లో విలేకరులతో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నామమాత్రంగానే చర్చించినా, ఆ తర్వాత టీడీపీ సభ్యులనూ కలుపుకొని పూర్తిస్థాయిలో వ్యూహాన్ని ఖరారు చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా, టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి స్పీకర్ ఎస్.మధుసూదనాచారిని కలసి విజ్ఞప్తి చేశారు. బుధవారం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగిశాక కిషన్‌రెడ్డి స్పీకర్‌ను ఆయన చాంబర్లో కలిశారు. -
డీకే అరుణ వర్సెస్ సునీత
అసెంబ్లీలో మహిళా సభ్యుల వాగ్వాదం లాబీల్లోకి మద్యం వ్యాపారిని తెచ్చారన్న డీకే అరుణ మైనింగ్ అక్రమాలపై ఏమంటారంటూ నిలదీసిన సునీత సాక్షి, హైదరాబాద్: శాసనసభలో బుధ వారం అధికార, విపక్ష సభ్యులు గొంగిడి సునీత, డీకే అరుణ మధ్య తీవ్రస్థాయి వాగ్యుద్ధం జరిగింది. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు గుప్పించుకోవడంతో బుధవారం సభ కొద్దిసేపు అట్టుడికింది. జీరో అవర్‌లో కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ ప్రస్తావించిన అంశంపై మాట్లాడేందుకు టీఆర్ఎస్ సభ్యురాలు సునీతకు స్పీకర్ అవకాశమిచ్చారు. అయితే తమకు మరోసారి అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. అయినా స్పీకర్ అనుమతించకపోవడంతో వారంతా వాకౌట్ చేసి నిరసన తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు.. ఓ మద్యం వ్యాపారిని అసెంబ్లీ లాబీల్లోకి తీసుకొచ్చి మంత్రిని కలిపించారన్న అంశాన్ని జీరో అవర్‌లో డీకే అరుణ లేవనెత్తారు. దీనిపై విచారణ జరిపించాలని కోరారు. ఈ సమయంలో ఎక్సైజ్ మంత్రి పద్మారావు కల్పించుకుని, పత్రికల్లో వచ్చిన వార్తను పట్టుకొని ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ‘నేనేమైనా వారికి వత్తాసు పలికానా.. పత్రిక కథనాన్ని పట్టుకుని నన్ను అంటారా’ అని అడిగారు. ఇదే సమయంలో తనకు అవకాశమివ్వాలని గొంగిడి సునీత లేవగా స్పీకర్ అనుమతించారు. ఆమె మాట్లాడుతూ ‘మద్యం వ్యాపారిని తీసుకొచ్చినట్లు నిరూపిస్తారా? ఆ రోజు వచ్చింది ప్రైవేటు పీఆర్వో మాత్రమే. ఆరోపణలు చేసేప్పుడు అరుణ అన్నీ తెలుసుకుని మాట్లాడాలి. అరుణకు సంబంధించి కూడా అక్రమ మైనింగ్ చేస్తున్నారని పత్రికలో వార్త వచ్చింది. అది నిజమే అనుకోవాలా’ అని ఎదురుదాడికి దిగారు. తాము పోరాటాలు చేసి అధికారంలోకి వచ్చామని, అక్రమ మైనింగ్ చేసి రాలేదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు నిరసనకు దిగారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను డీకే అరుణ కోరారు. అయితే మైక్ ఇచ్చేందుకు ఆయన నిరాకరించడంతో ఆమె పోడియం ముందుకు దూసుకొచ్చారు. ఆమెకు మద్దతుగా మిగతా సభ్యులు సైతం పోడియంలోకి వచ్చి మైక్ కోసం పట్టుబట్టారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉంటే రికార్డ్స్ నుంచి తొలగిస్తామని స్పీకర్ చెప్పినా సభ్యులు వినిపించుకోలేదు. దీంతో ఆయన టీ విరామం ప్రకటించారు. సభ తిరిగి ఆరంభమయ్యాక సైతం కాంగ్రెస్ సభ్యులు నిరసనకు దిగారు. అరుణకు ఒక్క నిమిషం అవకాశ మివ్వాలని ప్రతిపక్ష నేత జానారెడ్డి కూడా కోరారు. దీనిపై మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకుంటూ జీరో అవర్‌లో మాట్లాడిన అభ్యంతరకర వ్యాఖ్యలను తీసేస్తామని స్పీకర్ చెప్పినందున కాంగ్రెస్ సభ్యులు సభకు సహకరించాలని కోరారు. అయినా కాంగ్రెస్ సభ్యులు స్పీకర్‌తో వాగ్వాదానికి దిగారు. అనంతరం జానా లేచి ప్రభుత్వ వైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అందరూ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. -
'సబ్‌ప్లాన్ నిధులు పెంచాలి'
వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుడు పాయం వెంకటేశ్వర్లు డిమాండ్ సాక్షి, హైదరాబాద్: దళిత, గిరిజనుల సంక్షేమానికి ఉపయోగపడే సబ్‌ప్లాన్ పద్ధతిని కొనసాగిస్తూనే, దానికి నిధులను పెంచి, ఖర్చు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యుడు పాయం వెంకటేశ్వర్లు ప్రభుతానికి సూచించారు. పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు కేటాయించిన నిధులు సరిపోవన్నారు. కొత్త పింఛన్లు ఇవ్వటంతోపాటు ఇప్పటివరకు అమలులో ఉన్న పాత పింఛన్లను కూడా కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉందని వికలాంగులకు పింఛన్లు ఇవ్వటం లేదని, సదరమ్ క్యాంపుల సంఖ్య పెంచి అందరికీ న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఆధార్ కార్డులో వయసు తప్పుగా పడిందని కొన్ని వృద్ధాప్య పింఛన్లను నిలిపివేశారని, ఓటర్ కార్డు, రేషన్‌కార్డుల్లో ఉన్న వయసు ఆధారంగా వాటిని కొనసాగించాలని కోరారు. పోడు వ్యవసాయంలో ఉన్న వారికి భూమి హక్కు పత్రాలు ఇవ్వాలని, అవి లేనికారణంగా అధికారులు వేధిస్తున్నారని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లేవి? : సీపీఐ కాగా, రెండు పడక గదుల ఇళ్లను గేటెడ్ కమ్యూనిటీ తరహాలో నిర్మిస్తామన్న ప్రభుత్వం ఇప్పటివరకు వాటిని ప్రారంభించలేదని సీపీఐ సభ్యుడు రవీంద్రకుమార్ అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతి పదికన నిధులివ్వాలని, వికలాం గులకు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్నారు. అలాగే, జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి నిధులు కేటాయించాలని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. ఎస్సీల కోసం రూ.16 వేల కోట్లు, ఎస్టీలకు రూ.10 వేల కోట్లు అవసరమ న్నారు. మైనారిటీలుగా ఉన్న ఆంగ్లో ఇండియన్ వర్గం అభ్యున్నతికి ప్రభుత్వం ఒక శాతం రిజర్వేషన్ అమలు చేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కోరారు. ఇళ్లకోసం వారికి కొంతస్థలం కేటాయించాలన్నారు. -
'రైతు ఆత్మహత్యల పరిహారం పెంచలేం'
మండలిలో ఆర్థికమంత్రి ఈటెల స్పష్టీకరణ తెల్లరేషన్ కార్డులు తిరోగమనానికి సూచిక ప్రజలపై పన్నులు వేయబోం జిల్లాలకు ఇన్చార్జి మంత్రిని నియమించే యోచన ప్రాణహిత-చేవెళ్లపై సభలో కాసేపు గందరగోళం సాక్షి, హైదరాబాద్: రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఇస్తున్న పరిహారాన్ని పెంచబోమని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టంచేశారు. గతంలో ఉన్న పరిహారాన్నే కొనసాగిస్తామని చెప్పారు. శాసనమండలిలో బుధవారం బడ్జెట్‌పై జరిగిన చర్చకు ఆయన సమాధానమిస్తూ... ఆత్మహత్యలు ఆపడానికి కృషిచేస్తామన్నారు. తెల్లరేషన్ కార్డులు అభివృద్ధికి సూచిక కాదంటూ వాటిని తిరోగమనానికి సూచికగా అభివర్ణించారు. సంక్షేమంపై ఆధారపడకుండా సొంత కాళ్లపై ఆధారపడేలా చేయడమే అభివృద్ధి అని ఈటెల అన్నారు. పన్నులు పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టంచేశారు. భర్తలు వదిలిపెట్టిన వారికి, జోగినీలకు, వికలాంగ సర్టిఫికెట్ లేనివారికి ఎలా పెన్షన్ ఇవ్వాలో ఆలోచిస్తున్నామన్నారు. పెన్షన్లు పెంచామని... సన్నబియ్యం ఇస్తున్నామని ఇలా ప్రభుత్వ కార్యక్రమాలపై ఈటెల ఊదరగొడుతుండగా... ప్రతిపక్ష నాయకుడు డి.శ్రీనివాస్ జోక్యం చేసుకొని వనరులు పెరిగినందున చేస్తున్నారన్నారు. 1994కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేయని పనులను... 2004 తర్వాత నెరవేర్చినట్లు చెప్పారు. దీనికి ఈటెల స్పందిస్తూ... రాష్ట్రం ఏర్పడిన సమయంలో తనకు, కేసీఆర్‌కు మధ్య జరిగిన సంభాషణను ప్రస్తావించారు. ‘రాష్ట్ర విభజన జరిగింది. ఇంకా ఎన్నికలు కాలేదు. గెలుస్తామా? లేదా? అన్న సంశయం ఉంది. మెజారిటీ స్థానాలు వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. లేకుంటే వద్దు అని కేసీఆర్ అన్నారు. ఉద్యమ నేత కంటే ప్రభుత్వ నేతగా, బుగ్గ కార్లలో తిరగడం గొప్పగా అనుకోవడంలేదు. ఉద్యమ కాలంలో కంటే ఇప్పుడు బాధ్యతలు పెరిగాయి’ అని ఈటెల పేర్కొన్నారు. అన్నీ చేస్తామని అనడంలేదనీ... సత్యసాయి బాబాలా ఏదేదో అద్భుతాలు సృష్టిస్తామని చెప్పడంలేదన్నారు. జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమించే ఆలోచన ఉందన్నారు. టీడీపీ సభ్యుడు పోట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ మిగతా పార్టీలను బతకనిచ్చేలా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకొని తమ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల నియోజకవర్గాలపై ఎలాంటి వివక్ష చూపడంలేదన్నారు. గల్ఫ్‌కు ఉపాధి కోసం వెళ్లే వారు అక్కడ మోసపోతే ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ సభ్యుడు షబ్బీర్ అలీ కోరగా, దీనిపై కేరళ ప్రభుత్వం ఇస్తున్నట్లుగా ఇచ్చే ఆలోచన ఉందని ఈటెల చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల రీడిజైన్ చేస్తాం ప్రాణహిత చెవేళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి పూర్తిచేస్తామన్నారు. కేంద్రం నిధులు ఇస్తుందన్న నమ్మకంలేదన్నారు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించే పరిస్థితి లేదని ఈటెల అన్నారు. ఈ సందర్భంగా కాసేపు గందరగోళం నెలకొంది. పర్యావరణ క్లియరెన్స్ కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పట్టిసీమను ఎవరి అనుమతి తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతోందని కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రస్తావించారు. సింగరేణిని విస్తరించే ఆలోచన ఉందని ఈటెల అన్నారు. కాంట్రాక్టు వ్యవస్థను రూపుమాపుతామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్నారు. ఉద్యోగ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచే ఉద్దేశం లేదన్నారు. ఎంఐఎం సభ్యుడు రజ్వి, డాక్టర్ కె.నాగేశ్వర్, టీడీపీ సభ్యుడు నర్సారెడ్డి, రంగారెడ్డి, ప్రభాకర్ మాట్లాడారు. ముంపు మండలాలపై ఏపీకి జ్ఞానోదయం కావాలి ఆంధ్రప్రదేశ్‌లో 7 మండలాలను విలీనం చేసిన విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మానవతాకోణంలో జ్ఞానోదయం కావాలని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఆలోచించి, తమకు సంబంధంలేని ఏడు మండలాలపై నిర్ణయం తీసుకోవాల న్నారు. పోలవరం ప్రాజెక్టు 7ముంపు మండలాలకు విద్యుత్, సంక్షేమ కార్యక్రమాల వర్తింపుపై ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి పైవిధంగా బదులి చ్చారు. ఇప్పటికే ఈ మండలాల విలీనంపై అసెంబ్లీ, శాసన మండలి ఏకగ్రీవ తీర్మానాలు చేశాయని తెలిపారు. ఆ ఏడు మండలాల్లో కూడా తెలంగాణ ప్రభుత్వమే విద్యుత్, సంక్షేమ పథకాలు ఇతరత్రా అందించేందుకు చర్యలు తీసుకుంటుందని ఈటెల చెప్పారు. -
కుంభమేళా తరహాలో పుష్కరాలు
సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. బుధవారం శాసనసభలో టీఆర్ఎస్ సభ్యులు కొప్పుల ఈశ్వర్, దివాకర్‌రావు, పుట్టామధు, కాంగ్రెస్ సభ్యులు కిష్టారెడ్డి, డీకే అరుణ, బీజేపీ సభ్యుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌లు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. పుష్కరాల సందర్భంగా రోడ్ల నిర్మాణం కోసం ఆర్అండ్బీ నుంచి రూ.182కోట్లు, పంచాయతీరాజ్ నుంచి రూ.57కోట్లు, ఘాట్ల నిర్మాణానికి ఇరిగేషన్ నుంచి రూ.82 కోట్లు కేటాయించామని, మరో రూ.750 కోట్ల కేంద్ర సాయాన్ని కోరామని తెలిపారు. ఆర్టీసీ 900 నుంచి 1500 ప్రత్యేక బస్సులు నడపనుందని, అలాగే ప్రత్యేక రైళ్లను నడిపేందుకు కూడా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రధాని, రాష్ట్రపతిని పుష్కరాలకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. గోదాముల నిర్మాణానికి రూ.1,024కోట్లు : హరీశ్‌రావు రాష్ట్రంలో సుమారు 21 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంగల గోదాముల కొరత ఉందని మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. కొరత తీర్చడానికి మొదట 15లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల గోదాములను నిర్మిస్తామని దీనికోసం రూ.1,024 కోట్లు వ్యయం చేయనున్నామని తెలిపారు. బుధవారం సభలో సభ్యులు హన్మంతు షిండే, సోమారపు సత్యనారాయణ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ ఈ విషయం తెలిపారు. ప్రభుత్వ భవనాలను విక్రయించం: మంత్రి మహమూద్ అలీ ప్రభుత్వ భూములను, భవనాలను విక్రయించడం ద్వారా ఆర్థిక వనరులను సమీకరించాలన్న ఉద్దేశమేదీ ప్రభుత్వానికి లేదని రెవెన్యూ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. కాంగ్రెస్ సభ్యులు డీకే అరుణ, పువ్వాడ అజయ్, జీవన్‌రెడ్డిలు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. గోల్కొండ పరిరక్షణకు చర్యలు: మంత్రి చందూలాల్ గోల్కొండ కోట పరిరక్షణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. కోట లోపల ఉన్న చారిత్రక నిర్మాణాల పరిరక్షణ కోసం రూ.65.90 లక్షల వ్యయంతో పురావస్తు శాఖ పలు చర్యలు చేపట్టగా, రూ.1.20 కోట్లతో కోటలో సౌండ్ అండ్ లైట్ షోను మెరుగు పరిచేందుకు చర్యలు చేపట్టామన్నారు. పెరిగిన సైబర్ నేరాలు : హోంమంత్రి నాయిని హైదరాబాద్‌లో సైబర్ నేరాలు పెరిగాయని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ సభ్యులు మల్లు భట్టి విక్రమార్క, కిష్టారెడ్డి, డీకే అరుణ అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ, హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో 2014లో 632 కేసులు నమోదైనట్లు వివరించారు. 2013లో 276, 2012లో 110, 2011లో 105 కేసులు నమోదయ్యాయని తెలిపారు. -
'బకాయిలు బాండ్ల రూపంలో ఇస్తామనలేదు'
హైదరాబాద్ : ఉద్యోగులకు పెంచిన 43 శాతం ఫిట్మెంట్ బకాయిలు బాండ్ల రూపంలో ఇస్తామన్నది అవాస్తవమని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆయన బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరును జీర్నించుకోలేకే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈటెల స్పష్టం చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంపై విశ్వాసం ఉంచాలని ఆయన అన్నారు. -
టీ.అసెంబ్లీలో వాయిదా తీర్మానాలు
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో బుధవారం వివిధ అంశాలపై రాజకీయ పార్టీలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. దేవాలయాల్లో అర్చకులు, సిబ్బందికి ట్రెజరీ ద్వారా వేతనాల చెల్లింపు అంశంపై బీజేపీ, మూతపడ్డ పరిశ్రమల పునరుద్దరణ అంశంపై సీపీఐ, లేబర్ యాక్ట్ ప్రకారం కార్మికుల వేతనాల చెల్లింపు అంశంపై సీపీఎం వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. కాగా తెలంగాణ అసెంబ్లీ నేడు పీఏసీ, ఇతర కమిటీలను ఏర్పాటు చేయనుంది. తెలంగాణకు అనుగుణంగా నిబంధనల్లో మార్పులు చేయనుంది. -
తెలంగాణ అసెంబ్లీలో వాయిదా తీర్మానాలు
హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో సింగరేణిలో వారసత్వ నియామకాలు, ఓపెన్ కాస్ట్ కాంట్రాక్ట్ కార్మికుల అంశంపై మంగళవారం టీ వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. టీపీపీఎస్సీ ద్వారా లక్ష ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ అంశంపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాయి. అలాగే ఆర్టీసీ వేతన సవరణపై బీజేపీ, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ అమలుపై సీపీఐ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. మరోవైపు టీటీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు ఎత్తివేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం ససేమిరా అంది. ఈ నేపథ్యంలో సదరు నేతలంతా న్యూఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసి టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయనున్నారు. అలాగే ఇదే అంశంపై భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కూడా టీటీడీపీ ఎమ్మెల్యేలు కలవనున్నారు. -
గోదావరి జలాల తరలింపులో అక్రమాలు
* శాసనసభలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ * ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ * మిషన్ కాకతీయలో హైదరాబాద్ చెరువులను చేర్చాలని విజ్ఞప్తి సాక్షి,హైదరాబాద్: గోదావరి జలాలను హైదరాబాద్‌కు తరలించే పథకంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, దీనిపై వెంటనే ప్రభుత్వం విచారణ జరపాలని శాసనసభలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘ఏదైనా ప్రాజెక్టు చేపడితే ముందుగా నీటి కేటాయింపు, పర్యావరణ అనుమతులు తీసుకోవాలి. కానీ, అవేవీ లేకుండానే గోదావరి నీటిని హైదరాబాద్‌కు తరలించే పనికి సంబంధించి పైప్‌లైన్ నిర్మాణం చేసేస్తున్నారు. ఇప్పటికే రూ.2 వేల కోట్లు ఖర్చు చేశారు. ఇందులో భారీ అవినీతి జరిగింది.’ అని అక్బరుద్దీన్ పేర్కొన్నారు. దాదాపు 2,300 చెరువులు హైదరాబాద్ చుట్టూ ఉన్నాయని, మిషన్ కాకతీయ పథకంలో హైదరాబాద్ పరిసర చెరువులను కూడా చేర్చాలని కోరారు. పాతనగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జా అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తన నియోజకవర్గంలో 100 ఎకరాలు కబ్జా కోరల్లో చిక్కుకుంటున్నాయని, పేదల గృహనిర్మాణానికి వీటిని రక్షిస్తుంటే తనపై హత్యాయత్నం జరిగిందన్నారు. పాత నగరంపై తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము తలుచుకుంటే పాత నగరం మీదుగా వెళ్తున్న కృష్ణా పైపులైన్ల నుంచి ఒక్క చుక్క నీరు కూడా ముందుకు వెళ్లకుండా అడ్డుకోగలమని హెచ్చరించారు. కానీ, ఆ పని తాము చేయబోమని పేర్కొన్నారు. యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధికి సీఎం కృషి చేయటం అభినందనీయమని, అయితే అదే సమయంలో పహాడీషరీఫ్ దర్గా, మెదక్ చర్చిలను కూడా అభివృద్ధి చేసి అన్ని మతాలపై సమదృష్టి చూపాలని సీఎంకు సూచించారు. రంజాన్, క్రిస్టమస్ తరహాలో మరుసటి రోజు కూడా శివరాత్రికి సెలవు ప్రకటించాలని కోరారు. వైఎస్‌లా పనిచేయండి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రతి ముస్లిం జీవి తాంతం మరిచిపోలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి మాత్రమేనని అక్బరుద్దీన్ పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో పేద ముస్లిం విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుంటున్నారన్నా, మంచి ఉద్యోగాలు పొంది తమ కాళ్లపై తాము నిలబడుతున్నారన్నా అది నాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పుణ్యమేనని తెలిపారు. ముస్లిం లకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాకుం డా ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో పేద విద్యార్థులను ఆదుకునేందుకు అవకాశం కల్పించారన్నారు. ప్రతి ముస్లిం ైవె ఎస్ఆర్ సం క్షేమ పథకాలను గుర్తుపెట్టుకుంటార న్నారు. కరువు మండలాలను ప్రకటించాలి: వామపక్షాలు వర్షాభావంతో తెలంగాణలో కరువు పరిస్థితు లు నెలకొన్నాయని.. రాష్ట్రంలోని 441 మండలాలను వెంటనే కరువు మండలాలుగా ప్రకటించాలని వామపక్ష ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ‘రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. బడ్జెట్లో ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. ఈ ఆత్మహత్యలపై నిజనిర్ధారణ కమిటీ వేయండి. రుణమాఫీ కింద సర్కారు కేవలం 25 శాతం చెల్లించడంతో కొత్త రుణాలు ఇవ్వకుండా బ్యాంకులు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి.’ అని సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ అన్నారు. తెలంగాణలో దాదాపు 800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని సున్నం రాజయ్య తెలిపారు. చనిపోయిన రైతు కుటుం బాలను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ.5 లక్ష ల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలనిడిమాండ్ చేశారు. సకల జనుల బడ్జెట్: టీఆర్ఎస్ ఉద్యమంలో పాల్గొన్న సకల జనుల ప్రయోజనాలు నెరవేరేలా ప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందించిందని టీఆర్ఎస్ శాసన సభ్యుడు వేముల వీరేశ్ అన్నారు. రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టినా.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలపై ఒక్క పైసా భారం కూడా మోపలేదని మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి సహకరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
హామీలు బారెడు.. కేటాయింపులు మూరెడు
వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుడు పాయం వెంకటేశ్వర్లు ధ్వజం ఈ బడ్జెట్‌తో తెలంగాణ ప్రగతి ఎలా సాధ్యమని ప్రశ్న సాక్షి, హైదరాబాద్: హామీలు బారెడుంటే కేటాయింపులు మాత్రం మూరెడున్నాయని, ఈ అంకెల గారడీ బడ్జెట్ బంగారు తెలంగాణ కు ఎలా బాటలు వేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు పాయం వెంకటేశ్వర్లు అసెంబ్లీలో విమర్శించారు. బడ్జెట్‌పై చర్చలో పాల్గొన్న సందర్భంగా ఆయన టీఆర్ఎస్ హామీలు బారెడు ఉంటే వాటి అమలుకు చేసిన కేటాయింపులు మూరెడు మాత్రమేనని దుయ్యబట్టారు. గతేడాది బడ్జెట్లో భూముల అమ్మకం, కేంద్రం పన్నుల వాటా, గ్రాంట్ల ద్వారా వస్తాయని అంచనా వేసుకున్న మొత్తం రాన ప్పటికీ ఈసారి కూడా ఆయా పద్దులను భారీగా అంచనా వేయటం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. దళితుల భూ పంపిణీ కోసం 1400 ఎకరాల భూమి కొనుగోలు చేయాల్సిన తరుణంలో అందుకు చేసిన కేటాయింపులు సరిగా లేవన్నారు. 2018 నాటికి 23,600 మెగా వాట్లకు పైగా విద్యుదుత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటామని ప్రభుత్వం చెబుతున్నా, అందుకు తగ్గట్టుగా బడ్జెట్ కేటాయింపులు లేవని విమర్శించారు. పినిపాక నియోజకవర్గంలో మణుగూరుకు 1080 మెగావాట్ల పవర్ ప్లాంట్ కేటాయించినందుకు సీఎంకు కృతజ్ఞతలు చెబుతూ.. వెంటనే దాని పనులు మొదలు పెట్టాలని కోరారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో కేటాయింపులు సరిగా లేవని విమర్శించారు. దుమ్ముగూడెం ఇందిర సాగర్, దుమ్ముగూడెం రాజీవ్ సాగర్, కిన్నెరసాని ఎడమ కాలువ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు వెంటనే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ బిల్లులు ఆపడం సరికాదన్నారు. తెలంగాణ అమరవీరుల సంఖ్యను అప్పట్లో 1200గా పేర్కొని ఇప్పుడు 481 మందికే లబ్ధిచేకూర్చే ప్రయత్నం సరికాదన్నారు. రుణమాఫీ అమలు చేయాలని, అంతకు ముందుగానే రైతులకు దన్నుగా ప్రతి రైతు ఖాతాలో రూ. 10 వేల చొప్పున జమ చేయాలని కోరారు. యాదగిరిగుట్ట తరహాలో భద్రాచలం ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలని, ఆశా వర్కర్ల గౌరవ వేతనాన్ని రూ. 10 వేలకు పెంచాలని, కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను వెంటనే క్రమబద్ధీకరించాలని కోరారు. -
డీకే అరుణపై ఈవ్‌టీజింగ్!
* సభలో అధికారపక్ష సభ్యులు వేధించారు: భట్టి విక్రమార్క * పైగా ఆమెతోనే క్షమాపణ చెప్పించారు * ఇది తలదించుకోవాల్సిన విషయం * అధికారపక్షం భౌతిక దాడికి భయపడే మా సభ్యుడు కుర్చీ ఎక్కాడు * జాతీయ గీతానికి అగౌరవం పేరుతో అతనితోనూ సారీ చెప్పించారని వ్యాఖ్య * తీవ్రంగా తప్పుపట్టిన మంత్రులు నాయిని, హరీశ్‌రావు, ఈటెల రాజేందర్ * మైక్ కట్ చేయటంతో నిరసన.. సభ నుంచి కాంగ్రెస్ వాకౌట్ సాక్షి, హైదరాబాద్: నిండు శాసనసభలో ఎమ్మెల్యే డీకే అరుణపై ఈవ్‌టీజింగ్ జరిగిందని, అధికారపక్ష సభ్యులు ఆమెను వేధించారని అసెంబ్లీలో కాంగ్రెస్ ఉపనేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పైగా ఆమెతోనే సభలో క్షమాపణ చెప్పించారని, ఇది తలదిం చుకోవాల్సిన విషయమని అన్నారు. దీంతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. మంత్రులు సహా అధికారపక్ష సభ్యులు భట్టి విక్రమార్కపై మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. ఇదే సమయం లో భట్టికి ఇచ్చిన గడువు ముగిసిందంటూ స్పీకర్ మైక్ కట్ చేయడంతో.. విపక్షం నిరసనకు దిగింది. తమగొంతు నొక్కుతున్నారం టూ సభ నుంచి వాకౌట్ చేసింది. అరుణ విషయంలో అది ఈవ్‌టీజింగే.. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మధ్యాహ్నం అక్బరుద్దీన్ సుదీర్ఘ ప్రసంగం తర్వాత భట్టి విక్రమార్గ ప్రసంగించారు. తొలుత బడ్జెట్ అంకెలు, లెక్కలపై మాట్లాడిన ఆయన తర్వాత గవర్నర్ ప్రసంగం సమయంలో గందరగోళంవైపు మళ్లారు. ‘‘ఇటీవల మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన ‘షీ టీమ్స్’ సమర్థంగా పనిచేస్తున్నాయని, మహిళలపై ఈవ్‌టీజింగ్ తగ్గిందని పేర్కొంటున్నారు. కానీ అసెంబ్లీ సాక్షిగా అది తప్పని నిరూపితమైంది. మా మహిళా ఎమ్మెల్యే డీకే అరుణ మొన్న ప్రసంగిస్తుండగా.. అధికారపక్ష సభ్యులు ఆమెను ఈవ్‌టీజింగ్‌తో వేధించారు. దానిని భరించలేక ఆమె ‘నోరు మూసుకోండి..’ అని అంటే చివరకు ఆమెనే తప్పు చేసినట్టుగా క్షమాపణ చెప్పించారు. మహిళను టీజ్ చేసిన అధికార పార్టీ సభ్యులపై చర్యలు తీసుకోకుండా ఆమెతోనే సారీ చెప్పిం చారు. ఇది తలదించుకోవాల్సిన విషయం..’’ అని భట్టి పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం సమయంలో ప్రతిపక్ష సభ్యులపై అధికారపక్ష సభ్యులు భౌతికదాడికి దిగడంతో.. ప్రాణభయంతో వారి నుంచి తప్పించుకునేందుకు తమ సభ్యుడు బల్లపైకి ఎక్కాడని చెప్పారు. దీంతో అతనితోనూ క్షమాపణ చెప్పించారని, ఇదేం పద్ధతని నిలదీశారు. ఈ వ్యాఖ్యలపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీ జానారెడ్డి ఆదేశంతోనే మీ సభ్యుడు సారీ చెప్పాడు. అంటే మీ నాయకుడి ఆదేశాన్ని ఇప్పుడు మీరు తప్పుపడుతున్నారు. డీకే అరుణతో వాగ్వాదం జరిగింది. అది ఈవ్‌టీజింగ్ అని ఎలా అంటారు. పదేళ్లపాటు తిమ్మిని బమ్మి చేసిన తీరుకు కాలం చెల్లింది..’’ అని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన భట్టి.. అన్ని కెమెరాల ఫుటే జీలను పూర్తిగా చూపితే అసలు విషయం తేలుతుందన్నారు. ఇదే సమయంలో మంత్రి హరీశ్‌రావు లేచి.. అరుణ విషయంలో ఈవ్‌టీజింగ్ జరిగిందనే వ్యాఖ్యలను భట్టి ఉపసంహరించుకోవాలన్నారు. ఎవరో రాసిచ్చిన బడ్జెట్‌ను చదివారు తాజా బడ్జెట్ అంకెల గారడీలా ఉందని భట్టి విక్రమార్క విమర్శించారు. బ్రిటిష్ ఫిలాసఫర్ స్టువర్ట్ మిల్ చెప్పిన ట్రెడ్మిల్ థియరీతో బడ్జెట్‌ను పోల్చారు. ‘‘ట్రెడ్‌మిల్‌పై వేగంగా నడిచేవారు ముందుకు సాగుతున్నామనుకుంటే భ్రమే.. అది ఆగిన తర్వాత తాము అక్కడే ఉన్నామని విషయం తెలుస్తుంది. ఐదేళ్ల తర్వాత కూడా తెలంగాణ ప్రగతి ఇలాగే ఉం టుంది. కానీ గొప్ప పురోగతి ఉందని భ్రమిం చేలా అంకెలతో కేసీఆర్ మాయ చేస్తున్నారు..’’ అని భట్టి పేర్కొన్నారు. గత బడ్జెట్ సవరించిన అంచనాలను విస్మరించిన ఈటెల రాజేందర్.. వాటిని బడ్జెట్ అంచనాలకు తేడా లేకుండా చూపారని, ఎవరో రాసిచ్చిన పుస్తకాన్ని ఆయన సభలో ప్రవేశపెట్టినట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దీంతో ఈటెల తీవ్రంగా మండిపడ్డారు. ‘‘సమగ్ర అవగాహనతో నేను బడ్జెట్ రూపొందించాను. ఎవరో రాసిస్తే నేను చదివానంటే నాకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవగాహన లేదనా మీ అర్థం? ఇలా అనడం భావ్యమా. రాష్ట్రం విడిపోతే తెలంగాణ కుక్క లు చింపిన విస్తరి అవుతుందన్న ఆంధ్రావాళ్ల మాటలను మీరు ఎండార్స్ చేస్తున్నారా, 60 ఏళ్ల కాంగ్రెస్ ఏలుబడిలో తెలంగాణలో అభివృద్ధి లేదంటే ఆ ట్రెడ్మిల్ విధానం మీ పార్టీకే వర్తిస్తుంది. బస్తీని కబ్జా చేసి గాంధీభవన్ కట్టాలనే సిద్ధాంతం ఉన్న మీరు మాకు చెప్తారా..’’ అంటూ ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. రెప్పపాటు కరెంటు కోత ఉండదంటే ఇలాగేనా..? రెప్పపాటు కూడా కరెంటు కోత లేకుండా చేస్తామని సర్కారు ప్రకటించిందని... బడ్జెట్ కేటాయింపులు దానికి విరుద్ధంగా ఉన్నాయని భట్టి విమర్శించారు. ఇది మాటలతో పబ్బం గడిపే ప్రయత్నమన్నారు. ఇప్పటికే 796 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్ నీరుగార్చారని విమర్శించారు. ఇతర పార్టీలను పరిగణనలోకి తీసుకోకుండా తసచివాలయ తరలింపు నిర్ణయం తీసుకోవటం అహంభావం, అహం కారపూరితమని విమర్శించారు. ఈ క్రమంలో అధికారపక్ష సభ్యులు మరోసారి ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో భట్టి విక్రమార్కకు కేటాయించిన గడువు పూర్తయిందంటూ స్పీకర్ ఆయన మైక్‌ను కట్ చేశారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ.. సభ నుంచి వాకౌట్ చేశారు. -
మా సస్పెన్షన్లపై స్పందించరేం?
నేడు ప్రస్తావిస్తానన్న ప్రతిపక్ష నేత సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు తమ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ స్పందించకపోవడంపై టీడీఎల్పీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికార పక్షం నియంతృత్వంగా వ్యవహరిస్తుంటే ప్రశ్నించాల్సిన ప్రధా న ప్రతిపక్షం ఎందుకు నోరు విప్పడం లేదని టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె.జానారెడ్డితో ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. పార్టీ ఫిరాయింపుల అంశం, ఎమ్మెల్సీల విలీనంతో పాటు మాల, మాదిగ, మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలనే అంశాలను తెరపైకి తెచ్చినందుకే టీడీపీ ఎమ్మెల్యేలను సభనుంచి సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. ఈ అంశాలపై స్పీకర్, మండలి చైర్మన్, గవర్నర్‌ను కలసి విన్నవించినా ఫలితం లేకపోయిందన్నారు. స్పందించిన జానారెడ్డి మంగళవారం టీడీపీ సభ్యుల సస్పెన్షన్ విషయాన్ని సభ దృష్టికి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ పక్ష నాయకుడు లక్ష్మణ్‌నూ కలవాలని జానారెడ్డి టీడీపీ ఎమ్మెల్యేలకు సూచించారు. -
మైనారిటీలకు ఎక్కువే కేటాయించాం: కేటీఆర్
-
మైనారిటీలకు ఎక్కువే కేటాయించాం: కేటీఆర్
తాము తమ రెండు బడ్జెట్లలోనూ మైనారిటీల సంక్షేమానికి వెయ్యి కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్టే కేటాయించామని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన సోమవారం మాట్లాడారు. అంతకుముందు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయం చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల విషయంలో మైనారిటీలకు సరైన వాటా రాలేదని ఆయన చెప్పారు. ఇప్పుడు టీపీపీఎస్సీ ద్వారా ముస్లింలకు న్యాయం చేస్తామని, ఆ కమిషన్ సభ్యుల్లో ఖాద్రీ ఒకరని కేటీఆర్ చెప్పారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఇప్పటికే ఓ కమిషన్ వేశామని, అలాగే వక్ఫ్ ఆస్తుల పరిరక్షణపై బాజిరెడ్డి నేతృత్వంలో సభాసంఘం వేశామని కూడా ఆయన వివరించారు. -
'మైనారిటీలకు మేలుచేసింది వైఎస్సార్ మాత్రమే'
-
'మైనారిటీలకు మేలుచేసింది వైఎస్సార్ మాత్రమే'
మైనారిటీలకు మేలు చేసినవాళ్లను ఎప్పటికీ మర్చిపోలేమని తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇప్పటివరకు మైనారిటీలకు మేలు చేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే ముస్లిం విద్యార్థులకు స్కాలర్షిప్లు వచ్చాయని, వైఎస్ఆర్ ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్ల వల్ల మైనారిటీలకు ఎనలేని మేలు జరిగిందని ఆయన చెప్పారు. తాము కేసీఆర్ నుంచి మళ్లీ వైఎస్ఆర్ తరహా పాలనను కోరుకుంటున్నట్లు ఆయన అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో చెప్పారు. -
టీ. అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల దూకుడు
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో సోమవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పక్ష్యాల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. ప్రతిపక్షనేత జానారెడ్డి సభలో లేకపోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దూకుడు పెంచారు. లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. అధికార టీఆర్ఎస్ను ఇరుకునపెట్టే యత్నం చేశారు. చర్చ మధ్యలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించడంతో సభలో దుమారం రేగింది. ఈ సమయంలో నిరసన తెలిపేందుకు మైక్ ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెండుసార్లు స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చారు. ఈ క్రమంలో ఏడు మండలాలపై ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకపోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అనంతరం ఈ విషయంపై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ హరీశ్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒత్తిడి తెచ్చారు. -
లాస్ట్ ఇయర్ బడ్జెట్‌ను కాపీ, పేస్ట్ చేశారా?
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎలాంటి కొత్తదనం లేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అన్నారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన సోమవారం సభలో మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో స్పష్టత లేదని విమర్శించారు. గత ఏడాది బడ్జెట్‌నే కాపీ, పేస్ట్ చేశారని అక్బరుద్దీన్ విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను భారీగా పెంచి చూపారని ఆయన అన్నారు. -
కేసీఆర్ కూడా కాంగ్రెస్ వారసత్వమే...
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ లాబీలో సోమవారం మంత్రి హరీశ్ రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్పీకర్ మధుసూదనాచారి టీ విరామం కోసం పది నిమిషాలు వాయిదా వేశారు. అనంతరం ఈ వాగ్వాదం జరిగింది. ముంపు మండలాల అంశంపై చర్చ సందర్భంగా హరీశ్ రావు చేసిన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ సభ్యులు ఈ సందర్భంగా ఒత్తిడి తెచ్చారు. అయితే ఈ అంశంపై కాంగ్రెస్ సభ్యులు ఇంకా పట్టుబట్టడం సరికాదని అన్నారు. అలా అయితే మీకే ఇబ్బంది అంటూ పువ్వాడ అజయ్‌తో హరీశ్ రావు అనగా, కేసీఆర్ కూడా కాంగ్రెస్ వారసత్వమే అని ...అజయ్ గుర్తు చేశారు. -
''మరో 20ఏళ్లు మీరు అక్కడే ఉంటారు''
-
ముంపు మండలాలపై దద్దరిల్లిన టి.అసెంబ్లీ!
-
'అప్పుడు ఎందుకు అడ్డుకోలేదు'
హైదరాబాద్: కాంగ్రెస్ వల్లే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు, సీలేరు ప్రాజెక్టు తెలంగాణకు దక్కకుండా పోయాయని మంత్రి తన్నీరు హరీశ్ రావు అసెంబ్లీలో అన్నారు. ఏడు మండలాలను ఏపీలో కలిపినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఏడు మండలాలను అనాధగా మార్చింది కాంగ్రెస్సేనని పేర్కొన్నారు. తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన వాటాపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. దిగువ సీలేరు ప్రాజెక్టులో వాటా కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని హరీశ్ రావు చెప్పారు. తెలంగాణకు కొత్త విద్యుత్ ప్రాజెక్టులు వస్తున్నాయని తెలిపారు. తమ పార్టీపై హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. -
తెలంగాణ అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో రైతుల ఆత్మహత్యలు, ఇతర రైతాంగ సమస్యలపై సోమవారం కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్ కార్డుల ద్వారా ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందించకపోవడంపై బీజేపీ, నక్కలగండి, డిండి ప్రాజెక్టులకు పాలనా అనుమతులపై సీపీఐ, దేవ్‌రాజ్ కంపెనీ మూసివేతను అడ్డుకోవాలని సీపీఎం వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. మరోవైపు తమపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలంటూ తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు శనివారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిసిన విషయం తెలిసిందే. -
అసెంబ్లీలో ‘ఇందూరు’ సమస్యలు
నిజామాబాద్ అర్బన్ : అసెంబ్లీ సమావేశాల్లో జిల్లాకు చెందిన పలు అంశాలను ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ స్వాధీనంపై ప్రతిపక్ష సభ్యులు అధికార పక్షాన్ని నిలదీశారు. ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదన్న విషయం ఎంతవరకు వాస్తవమో చెప్పాలన్నారు. ఫ్యాక్టరీకి చెరుకును సరఫరా చేసిన రైతులకు డబ్బులు చెల్లించడం లేదని, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ.. డేల్టా పేపర్ మిల్స్ లిమిటెడ్‌తో ఎన్ఎస్ఎల్ ప్రైవేటీకరణ ఒప్పందాన్ని రద్దు చేసే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ఈ విషయమై అడ్వకేట్ జనరల్ అభిప్రాయూన్ని కోరామన్నారు. రోడ్డు విస్తరణపై.. నిజామాబాద్ -డిచ్పల్లి రోడ్డు విస్తరణపై నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అసెంబ్లీలో మాట్లాడారు. మాధవనగర్ సమీపంలోని రైల్వేవంతెనపై రోడ్డు వంతెన నిర్మించే ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయూ? ఉంటే అంచనా వ్యయంతోపాటు ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధుల వివరాలు ఏమిటి? పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. రవాణా శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ.. నిజామాబాద్ -డిచ్పల్లి మార్గంలో 14.20 కిలోమీటర్ల పొడవులో 10.20 కిలోమీటర్ల రోడ్డు పనులు పురోగతిలో ఉన్నాయని, మిగతా నాలుగు కిలోమీటర్ల కోసం టెండర్లను పిలిచామని తెలిపారు. రెండు వరుసల ఆర్వోబీ కోసం అంచనా వ్యయం రూ. 44.07 కోట్లు అని వివరించారు. దక్షిణ మధ్య రైల్వే కార్యాలయంలో అలైన్మెంట్, జనరల్ అరేంజ్మెంట్ డ్రాయింగ్ పని పూర్తరుు్యందన్నారు. పనులు ప్రారంభించిన ఏడాదిలోపు పనులను పూర్తి చేస్తామన్నారు. -
ప్రాణహిత-చేవెళ్లపై పూర్తిస్థాయి చర్చ
సాక్షి, హైదరాబాద్: శాననసభ సమావేశాలు ముగిశాక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో చర్చించాల్సి ఉందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. ఈ ప్రాజెక్టును ఎక్కడ ఏర్పాటు చేస్తే ప్రయోజనం అధికంగా ఉంటుందనే దానిపై కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన వాప్కోస్ను పూర్తిస్థాయి నివేదికను ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ఈ నివేదికపై అందరి సమక్షంలో చర్చిస్తామని మంత్రి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతం, కృష్ణా పరీవాహక ప్రాంతంలోని వాస్తవ పరిస్థితులపై అందరితో చర్చించి, సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు సాగుతామన్నారు. శనివారం శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర జలవనరుల శాఖ (సీడబ్ల్యూసీ) సమ్మతి, తదితర వివరాలు తెలపాలంటూ ఎమ్మెల్సీ బి.వెంకటరావు వేసిన ప్రశ్నకు మంత్రి హరీశ్‌రావు సమాధానమిచ్చారు. -
'తలసాని బ్లాక్‌మెయిలర్'
సాక్షి, హైదరాబాద్: ‘దున్నపోతుల వెంట తిరుగుతున్న తలసానికి దున్నపోతుల భాషే వస్తుంది. ఆయన రాజకీయ బతుకేందో అందరికీ తెలుసు. బ్లాక్మెయిర్లకు బ్రాండ్ అంబాసిడర్ తలసాని. చంద్రబాబును, నన్ను విమర్శించే ముందు ఆధారాలు చూపాలి. చిల్లర మల్లర రాజకీయాలు చేసి కేసీఆర్ కుటుంబం మెప్పు పొందాలని చూస్తున్నాడు. మతిభ్రమించి మాట్లాడుతున్న ఆయన పదవి ఊడడం ఖాయం. అప్పుడు మళ్లీ మా దగ్గరి కొచ్చి బతిమిలాడితే టీడీపీ ఆఫీసు ముందు గూర్ఖాలాగా నిలబెడతాం’ అని టీడీఎల్పీ ఉప నేత ఎ.రేవంత్‌రెడ్డి మంత్రి తలసానిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘సనత్‌నగర్‌లో ఆయనమీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పోటీ చేయాలా? అయినా శాసనసభకు పక్క రాష్ట్రం వాళ్లు పోటీ చేయరనే విషయం కూడా తెలి యని సన్నాసి. పార్టీ కార్యకర్తను నిలబెడతాం. గెలవమనండి చూద్దాం’ అని పేర్కొన్నారు. -
సొంత ఎమ్మెల్యేలనే కొంటున్న బాబు
* ‘దేశం’లో బ్లాక్‌మెయిలింగ్ ఎమ్మెల్యేలు * ఎమ్మెల్యేగానే పోటీ చేస్తా * మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి తలసాని సాక్షి, హైదరాబాద్: ‘ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలనే కోట్ల రూపాయల ప్యాకేజీలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇంతకంటే దుస్థితి ఏముంటుంది? తమను టీఆర్ఎస్ పిలుస్తోందంటూ టీడీపీ ఎమ్మెల్యేలు బ్లాక్మెయిల్ చేస్తోంటే వారికి కోట్లకు కోట్ల రూపాయలు ఇచ్చే దుస్థితికి చేరారు..’ అని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావే శాల సందర్భంగా శనివారం ఆయన లాబీల్లో మీడియాతో ‘చిట్‌చాట్’ చేశారు. టీడీపీ శాసన సభ్యత్వానికి తాను రాజీనామా చేశాకే మంత్రి మండలిలో చేరానని, రాజీనామా లేఖ స్పీకర్ వద్ద పెండింగులో ఉందన్నారు. తాను మండలికి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోందని, కానీ తాను సనత్‌నగర్ నుంచే పోటీ చేస్తానని కుండబద్ధలు కొట్టారు. దమ్ముంటే చంద్రబాబు కూడా తనపై పోటీ చేయొచ్చని, అయితే ఎవరు ఓడిపోతే వారు రాజకీయాలకు దూరంగా ఉండాలని సవాలు విసిరారు. టీడీపీ ఫ్లోర్‌లీడర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు తనకు మంత్రి పదవి ఇస్తే టీఆర్ఎస్లో చేరతానని సీఎంను కలిశారన్నా రు. చంద్రబాబు గతంలో కేసీఆర్‌పై మోత్కుపల్లితో మాట్లాడించి బకరా చేశారని, ఇప్పుడు రేవంత్‌రెడ్డితో మాట్లాడించి బకరా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతగా జగన్ సక్సెస్ ప్రతిపక్ష నేతగా గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవహరించినట్లే.. జగన్ కూడా చేస్తున్నారని కితాబు ఇచ్చారు. రాజశేఖరరెడ్డి ఎన్నడూ మైక్ అడగలేదని, స్పీకర్ తనకు మైక్ ఇచ్చే విధంగా కనుసైగతో తన వాళ్లతో పనిచేయించే వారని, అదే తరహాలో జగన్ ప్రతిపక్ష నేతగా రాణిస్తున్నారని కొనియాడారు. -
హనీమూన్ అనే ఆగాం..!
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగడతాం.. కట్టుతప్పిన ఎమ్మెల్యేలపై కఠినంగా ఉంటాం షబ్బీర్‌పై విమర్శలు సరికాదు మీడియాతో ప్రతిపక్షనేత జానారెడ్డి సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన రాష్ర్టంలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన టీఆర్ఎస్పై వెంటనే విమర్శలు చేస్తే తొందరపడుతున్నామనే భావన రాకుండా ఉండడానికే హనీ మూన్ సమయం ఇచ్చాం... అంతేకానీ అధికారపక్షానికి అనుకూలంగా ఉన్నామని భావిం చడం సరికాదని కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు కుందూరు జానారెడ్డి అన్నారు. ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు. సీఎల్పీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. క్రమశిక్షణ తప్పిన పార్టీ ఎమ్మెల్యేలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రతిపక్షపాత్రలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. కాంగ్రెస్ సీనియర్‌నేత షబ్బీర్ అలీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలను జానారెడ్డి ఖండించారు. టీడీపీ ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాలు ముగిసేదాకా సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యవ్యవస్థకు మంచిది కాదని, వారిపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఇప్పటికే స్పీకర్‌ను కోరామన్నారు. జాతీయగీతాలాపన సమయంలో జరి గిన ఘర్షణలకు సంబంధించిన వీడియో సీడీల పుటేజీలను పూర్తిగా చూపించాలని స్పీకర్‌కు గతంలోనే లేఖ రాసినట్టు చెప్పారు. అసెంబ్లీలో సీట్ల కేటాయింపుపైనా స్పీకర్‌కు లేఖ రాశానన్నారు. టీపీసీసీ, సీఎల్పీ మధ్య ఎలాంటి విభేదాల్లేవని, అలా ఉన్నాయని ఎవరైనా చెబితే వా రి వ్యాఖ్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కు ఏది ఉపయోగమో, వాటికోసం ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకుని రావడమే లక్ష్యంగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. సీఎల్పీలతో విభేదాలున్నాయని చెప్పే నాయకులు క్రమశిక్షణను ఉల్లంఘించినట్టేనన్నారు. క్రమశిక్ష ణ లేకుండా మాట్లాడడం తనకు చేతకాదన్నారు. -
జనాభా కంటే అధికంగా ‘ఆధార్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర జనాభా కంటే ఆధార్‌కార్డుల సంఖ్య మూడుశాతం ఎక్కువగా ఉంద ని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ వెల్లడిం చారు. రాష్ట్ర జనాభా 3,50,96,453కాగా, కార్డు లు మాత్రం 3,62,05,809 ఉన్నాయని చెప్పా రు. జిల్లాల వారీగా పరిశీలిస్తే...హైదరాబాద్ జిల్లాలో 40,10,238 మంది జనాభాకు గాను 62,68,817 లక్షల కార్డులు నమోదయ్యాయని, ఇది 56శాతం ఎక్కువని తెలిపారు. శనివారం మండలి ప్రశోత్తరాల సమయంలో.. జిల్లాల వారీగా పంపిణీ చేసిన ఆధార్‌కార్డులు ఎన్ని, దీనిని మరింత సమర్థంగా అమలుచేసేందుకు ప్రభుత్వేతర సంస్థల (ఎన్జీవో) సేవలను ఉపయోగించుకునే ప్రతిపాదన ఏదైనా ఉందా అని ఎమ్మెల్సీ ఉల్లోళ్ల గంగాధ ర్‌గౌడ్ వేసిన ప్రశ్నకు ఆర్థికమంత్రి సమాధాన మిచ్చారు. దేశంలో ఎక్కడి నుంైచె నా ఆధార్‌ను నమోదు చేసుకునే అవకాశం ఉన్నందున, రాష్ట్రం బయట కూడా చేసుకుని ఉండొచ్చునన్నారు. పదిజిల్లాల్లో ఇప్పటికీ 450 నమోదు కేంద్రాలు నడుస్తున్నాయని చెప్పారు. కేంద్రవిశిష్ట గుర్తింపు సంస్థ (యూఐడీఏఐ) ఈ పథకాన్ని అమలు చేస్తున్నందున, ఎన్జీవోల సేవల వినియోగం గురించి ప్రభుత్వానికి తెలియదని స్పష్టంచేశారు. పరిశీలనలో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ రాష్ట్రంలో పింఛన్‌దారుల ప్రయోజనం కోసం కేంద్రం ప్రవేశపెట్టిన జీవన్ ప్రమాణ్ మాదిరిగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనను చురుగ్గా పరిశీలిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఇందుకోసం అవసరమయ్యే సాఫ్ట్‌వేర్‌ను నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) రూపొందించాల్సి ఉందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన జీవన్ ప్రమాణ్ మాదిరిగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ప్రవేశపెట్టే ప్రతిపాదన గురించి ఎమ్మెల్సీ పూలరవీందర్ అడిగిన ప్రశ్నకు మం త్రి సమాధానమిస్తూ ఈ వివరాలు తెలిపారు. -
ధనికమైతే ఢిల్లీ వైపు చూపెందుకు?
బడ్జెట్‌పై సాధారణ చర్చలో బీజేపీ పక్షనేత కె.లక్ష్మణ్ పన్నుల వాటాలో రాష్ట్రాలక ఆర్థిక స్వేచ్ఛనిచ్చి కొత్త ఒరవడి సృష్టించిన కేంద్రం తప్పుపట్టిన ఈటెల, కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: డెబ్బై శాతం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు(బీపీఎల్) ఉన్నప్పుడు.. రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రమని ఎలా అంటారని బీజేపీ శాసనసభా పక్ష నేత కె.లక్ష్మణ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒకవేళ నిజంగా ధనిక రాష్ట్రమైతే కేంద్రంపై ఎందుకు ఆధారపడుతున్నారని, నిధుల కోసం ఢిల్లీ వైపు ఎందుకు చూస్తున్నారని అన్నారు. 14వ ఆర్ధిక సంఘం రాష్ట్రంలో కేవలం మిగులు బడ్జెట్ ఉందని మాత్రమే తెలిపిందని, ముఖ్యమంత్రి మాత్రం ధనిక రాష్ట్రమని ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించారు. శనివారం బడ్జెట్‌పై సాధారణ చర్చలో ఆయన మాట్లాడారు. బడ్జెట్ పూర్తిగా వాస్తవ విరుద్ధంగా, ప్రజలను తప్పుదోవ పట్టించే రీతిలో ఉందని, ప్రభుత్వం గొప్పలకు పోయి లక్ష కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందన్నారు. ఇదే సమయంలో పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచి కేంద్రం కొత్త ఒరవడి సృష్టించిందని, ఇది రాష్ట్రాల పురోభివృద్ధికి దోహదం చేస్తుందని లక్ష్మణ్ తెలిపారు. 13వ ఆర్థిక కమిషన్ మేరకు రాష్ట్రానికి రూ.9 వేల కోట్లు రావాల్సి వస్తే, కేంద్ర నిర్ణయంతో 14వ ఆర్థిక కమిషన్‌లో రూ.13 వేల కోట్ల నిధులు వస్తాయని పేర్కొన్నారు. శాఖలకు సరైన కేటాయింపులు ఎక్కడ..? రైతులకు ఉపశమనం కల్గించే, ఆత్మహత్యలను నివారించేందుకు బడ్జెట్లో ఎలాంటి ప్రయత్నం జరగలేదని లక్ష్మణ్ పేర్కొన్నారు. విద్యకు కేటాయింపుల్లో ప్రతికూల పురోగతి(నెగెటివ్ గ్రోత్) ఉందని, యూనివర్సిటీలు ఖాళీలతో సతమతమవుతున్నాయని, రాష్ట్రాన్ని విత్తన భాంఢాగారంగా చేస్తామని ప్రకటించి ప్రభుత్వం దానికి నిధులను రూ.37 కోట్లకే పరిమితం చేసిందని అన్నారు. ఇక ప్రభుత్వం చెబుతున్న ప్రతిష్టాత్మక వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయలకు బయట కొందరు చెబుతున్నట్టుగా భారీగా నిధులేమీ కేటాయించలేదని, తన దృష్టిలో ఆ కేటాయింపులు చాలా తక్కువ అని వ్యాఖ్యానించారు. వాటర్ గ్రిడ్‌కు ఐదే ళ్లలో రూ.26 వేల కోట్లు అంచనా వేసి కేవలం రూ.4 వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ.20 వేల కోట్లు అని చెప్పి రూ.2 వేల కోట్లకే పరిమితం చేశారన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామంటున్న ప్రభుత్వం బస్తీల్లో మరుగుదొడ్ల విషయాన్ని పట్టించుకోలేదన్నారు. అన్నింటికీ కేంద్రంపై ఆధారపడి, లేదంటే అప్పులు తెస్తామని చెప్పి రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చొద్దని సూచించారు. ఇక పార్టీ ఫిరాయింపుల అంశంపై మాట్లాడుతూ, ఈ విధానం సరైంది కాదని, అధికార పక్షం రాజకీయ విలువలు కాపాడాలని కోరారు. తప్పుపట్టిన మంత్రులు.. అంశాల వారీగా మాట్లాడుతూ ప్రభుత్వాన్ని తప్పుపట్టిన లక్ష్మణ్ వ్యాఖ్యలపై మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘సీఎం కేవలం తెలంగాణ వెనుకబడిన ప్రాంతం కాదు. వెనక్కు నెట్టేయబడిన ప్రాంతం మాత్రమే. ఇప్పుడు ఆర్థిక సంఘం మిగులు ఉందని తేల్చడంతో అదే నిజమైందని మాత్రమే అన్నారు. అంతేతప్ప ధనిక రాష్ట్రమని అనలేదు’ అని ఆర్థిక మంత్రి ఈటెల తెలిపారు. అప్పులు తేకుండా, కేంద్రాన్ని కోరకుండా, పన్నులు వేయకుండా శాఖలకు కేటాయింపులు జరపాలంటే ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఇక కేంద్రం రాష్ట్రాల పన్నుల వాటాను పెంచిందన్న లక్ష్మణ్ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. కేంద్రం ఒకచేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కుందని తెలిపారు. -
రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు
* నోటిఫికేషన్లపై కసరత్తు షురూ: ముఖ్యమంత్రి కేసీఆర్ * అందరూ ఒప్పుకుంటే వయోపరిమితిలో పదేళ్ల సడలింపు * ఉద్యోగుల విభజన పూర్తయితే ఖాళీలపై స్పష్టత * కొత్తగా ఉపాధ్యాయ నియామకాలకు నో * కేంద్ర నిధుల కోసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తాం * ఉభయ సభల్లో తీర్మానాలు చేసి ప్రధాని మోదీకి ఇద్దాం * ప్రస్తుతం కరెంట్ కోతలేదు.. మే నెల తర్వాత కనబడదు * భూములు విక్రయించే యోచనను విరమించుకున్నాం * తెలంగాణ ఇచ్చింది సోనియానే.. కాదంటే మూర్ఖత్వమే * మండలిలో డీఎస్ ప్రశ్నలకు సీఎం సుదీర్ఘ సమాధానం సాక్షి, హైదరాబాద్: రెండేళ్లలో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. కమల్‌నాథన్ కమిటీ ఉద్యోగుల విభజనను ఇంకా పూర్తి చేయనందున ఖాళీలపై స్పష్టత రాలేదని ఆయన తెలిపారు. ఉద్యోగ ఖాళీల లెక్కతేలిన అనంతరం భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కేంద్ర నిధులకు సంబంధించిన అంశంపై శనివారం శాసనమండలిలో ప్రతిపక్ష నేత డి.శ్రీనివాస్ అడిగిన పలు ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళతామని.. ప్రధానిని కలిసి విజ్ఞప్తులు చేద్దామని పేర్కొన్నారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలను కేసీఆర్ వివరించారు. రెండేళ్లతో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు. ఇక రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థులతో పోలిస్తే ఉపాధ్యాయులు ఎక్కువ మంది ఉన్నారని... రేషనలైజేషన్ చేసి అవసరమైన చోట వారిని నియమిస్తామని పేర్కొన్నారు. కొత్తగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉర్దూ మాధ్యమంలో కొరత ఉన్నందున ఖాళీగా ఉన్న 1,500 పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసే నిరుద్యోగులకు వయో పరిమితిని ఇప్పటికే ఐదేళ్లు సడలించామని, అన్ని పక్షాలు అంగీకరిస్తే పదేళ్లు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం పేర్కొన్నారు. గౌరవ వేతనాల్లో మనమే టాప్ కేరళ రాష్ట్రంలో కేవలం 967 గ్రామ పంచాయతీలే ఉన్నాయని, అక్కడి ప్రభుత్వం సర్పంచులకు రూ. 6,600 గౌరవ వేతనంగా అందిస్తోందని సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రం విషయానికి వస్తే స్థానిక సంస్థల ప్రతినిధులు (సర్పంచులు, ఎంపీటీసీలు కలిపి) సుమారు 15 వేల మంది ఉన్నారని... గౌరవ వేతనాల మొత్తంలో అన్నిరాష్ట్రాల కన్నా మనమే ముందు వరసలో ఉన్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో సర్పంచులకు గౌరవ వేతనం ఇచ్చే అంశాన్ని గతంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. తాజాగా ప్రకటించిన రూ. 5 వేలకన్నా పెంచలేమని సీఎం స్పష్టం చేశారు. హైకోర్టు విభజన జరగకుంటే రాష్ట్ర విభజన పూర్తికానట్లేనని ప్రభుత్వం భావిస్తోందని.. ఆ విభజన జరగకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని తాము భావిస్తున్నామని చెప్పారు. ఈ విషయమై త్వరలోనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చిస్తామని కేసీఆర్ తెలిపారు. మే తర్వాత కోతలుండవు.. రాష్ట్రంలో ఈ రోజువరకు ఎక్కడా విద్యుత్ కోత లేదని... మే నెల తర్వాత విద్యుత్ కోతలు ఉండబోవని సీఎం చెప్పారు. విభజన చట్టం ప్రకారం ఏపీలోని కృష్ణపట్నం, హిందుజా ప్రాజెక్టుల నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా ను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకున్నా మనకు మేలే జరిగిందని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వ విద్యుత్‌ను ఇచ్చినట్లయితే యూనిట్‌కు రూ. 7.5 చొప్పున చెల్లించాల్సి వచ్చేదని... రాష్ట్రంలో సింగరేణిలో ఉత్పత్తి ధర యూనిట్‌కు రూ. 3.5 మాత్రమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలోని విద్యుత్ ప్రాజెక్టులను క్షణక్షణం పర్యవేక్షిస్తున్నందున 170 మెగావాట్ల విద్యుత్ అదనంగా లభ్యమైందని వెల్లడించారు. పీపీపీ పద్ధతిన గాయత్రి పవర్ ప్రాజెక్టు నుంచి జూన్ నెలలో సుమారు 500 మెగావాట్లు, ఫెర్టిలైజర్ సంస్థ గ్యాస్ ఇవ్వడం ద్వారా మరో 260 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి వస్తుందని సీఎం చెప్పారు. ఈ ఏడాది పవర్‌కట్ ఉంటే.. మార్చి 20నుంచి ఏప్రిల్ 20 మధ్య ఒకట్రెండు రోజుల పాటు ఉండవచ్చని పేర్కొన్నారు. వాటర్‌గ్రిడ్‌కు రూ. 13 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు బడ్జెట్లో కేటాయించిన నిధులే కాకుండా వివిధ ఆర్థిక సంస్థల నుంచి కూడా భారీగా నిధులు అందనున్నాయని సీఎం చెప్పారు. వాటర్‌గ్రిడ్‌కు హడ్కో ఏడాదికి రూ. 2,500 కోట్ల చొప్పున నాలుగేళ్ళలో రూ. 10 వేల కోట్లు, నాబార్డు నుంచి రూ. మూడు వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని చెప్పారు. మిషన్ కాకతీయకు నాబార్డు రూ. వెయ్యి కోట్లు, జపాన్ ఆర్థిక సంస్థ (జైకా) రూ. 3 వేల కోట్లు ఇస్తున్నాయని సీఎం చెప్పారు. బీసీలను నిర్లక్ష్యం చేయం.. రాష్ట్రంలో బలహీనవర్గాల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయబోమని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో బీసీలు 51 శాతం ఉన్నట్లు సమగ్ర సర్వేలో వెల్లడైందని.. వారి సంక్షేమానికి మరిన్ని పథకాలను ప్రవేశపెడతామని పేర్కొన్నారు. బడ్జెట్లో పేర్కొన్న రూ. 1.15 లక్షల కోట్లలో రాష్ట్ర సొంత రెవెన్యూ(ఎస్‌వోఆర్) రూ. 99 వేల కోట్లు ఉందని.. మిగతా రూ. 16 వేల కోట్లలో కమర్షియల్ ట్యాక్స్ బకాయిల నుంచి రూ. 5 వేల కోట్లు అందే అవకాశం ఉందని సీఎం తెలిపారు. కేంద్ర పథకాలకు నిధులు అందుతాయని ఆశిస్తున్నామన్నారు. నిధుల కోసం గతంలో భూములను అమ్మాలనుకున్న మాట వాస్తవమేనని.. ఇప్పుడు నిధులు పుష్కలంగా ఉన్నందున ఆ యోచనను విరమించుకున్నామని తెలిపారు. భూ క్రమబద్ధీకరణ ద్వారా 3.5 లక్షల పేద కుటుంబాలకు ఉచితంగా పట్టాలను అందజేయనున్నట్లు సీఎం చెప్పారు. 125 గజాలకు పైగా ఉన్న స్థలాలను తక్కువ ధరకు క్రమబద్ధీకరిస్తున్నామన్నారు. 12.5 శాతం రిజి స్ట్రేషన్ ధర ప్రకారం రూ. 133 కోట్లు వచ్చాయని.. ప్రక్రియ పూర్తయితే మరో రూ. వెయ్యికోట్లు ప్రభుత్వానికి వస్తాయని పేర్కొన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెద్దాం.. రాష్ట్రానికి నిధుల గురించి కేంద్రంతో కయ్యం పెట్టుకోవడం సబబు కాదని భావిస్తున్నామని, అమల్లో ఉన్న పలు పథకాలకు కేంద్రాన్ని నిధులు అడిగేందుకు ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. నిధులకు సంబంధించి ఉభయ సభల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేసి.. ప్రధాని మోదీకి, నీతి ఆయోగ్ చైర్మన్, వైస్ చైర్మన్లకు అందజేద్దామని ఆయన పేర్కొన్నారు. కేంద్రం అమలుచేస్తున్న 122 పథకాలను ఇటీవల 66 కు తగ్గించిందని.. అదే సమయంలో రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాను భారీగా పెంచిందని సీఎం చెప్పారు. దేశవ్యాప్తంగా గతేడాది కన్నా ఈ సారి రూ. 1.78 లక్షల కోట్లను నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అదనంగా ఇస్తోందని తెలిపారు. అందులో తెలంగాణకు అదనంగా సుమారు రూ. 4 వేల కోట్లు అందనున్నాయని సీఎం చెప్పారు. ఇచ్చింది సోనియానే... తెలంగాణ ఇచ్చింది ముమ్మాటికీ సోనియాగాంధీయేనని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కాదని ఎవరు చెప్పినా వాళ్లు మూర్ఖులేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ చరిత్ర రాసేవాళ్లెవరైనా సోనియాగాంధీ పేరును తప్పక రాయాల్సిందేనన్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అయితే.. తెచ్చిన ఘనత తెలంగాణ ప్రజలందరికీ దక్కుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. -
ప్రణాళికాబద్ధంగానే ముందుకు : కేసీఆర్
-
ప్రణాళికాబద్ధంగానే ముందుకు : కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. శనివారం శాసనమండలిలో ఆయన ప్రభుత్వ పథకాలను వివరించారు. దేశంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, కేంద్రం ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ పథకం తెచ్చిందన్నారు. నిబంధనలు పెట్టకుండా కేంద్రం నిధులు విడుదల చేయాలని కేసీఆర్ కోరారు. రాష్ట్రంలో ఉన్న 122 పథకాలను 66 పథకాలు చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. గతంలో రాష్ట్రాలు అంటే చాలా చిన్న చూపు ఉండేదన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కేంద్రం నిధులు దుర్వినియోగం అయ్యాయన్నారు. రాష్ట్రాలకు రుణపరిమితిని కూడా కేంద్రం పెంచిందన్నారు. -
మా జీతాలు రూ.3 లక్షలకు పెంచండి...
హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి భారీ నజరానా ప్రకటించటంతో మరోవైపు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు కూడా తమకు జీతాలు పెంచాలని కోరుతున్నారు. తమ జీతం నెలకు రూ.3 లక్షలకు పెంచాలని తెలంగాణ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు శనివారం అసెంబ్లీ లాబీలో సంతకాల సేకరణ చేపట్టారు. సంతకాల సేకరణ పత్రాన్ని తెలంగాణ ఎమ్మెల్యేలు...ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేయనున్నారు. కాగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జీతభత్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచనుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే దీనిపై ప్రభుత్వం నిర్ణయం వెల్లడించే అవకాశముంది. రాష్ట్రలోని 120 మంది ఎమ్మెల్యేలు, 36 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ప్రస్తుతం వీరికి రూ. 95 వేల వరకు జీతభత్యాలు అందుతున్నాయి. సీఎం, మంత్రులు, కేబినేట్ హోదా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటరీ సెక్రటరీలు మినహాయిస్తే మిగతా 124 మందికీ రూ. 2 లక్షల చొప్పున జీతాలు చెల్లించాలని భావిస్తోంది. -
'జీతాలపై రాజకీయం చేస్తున్నారు'
హైదరాబాద్ : స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల జీతాలపై రాజకీయం చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అంజయ్య వ్యాఖ్యానించారు. సర్పంచ్ల జీతాలు పెంచలేదని అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన శనివారమిక్కడ అన్నారు. స్థానిక సంస్థలకు ప్రత్యేక గౌరవం తీసుకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అంజయ్య పేర్కొన్నారు. కాగా 'స్థానిక' ప్రజా ప్రతినిధులకు రాష్ర్ట ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. కౌన్సిలర్, సర్పంచ్ మొదలుకొని జెడ్పీ చైర్మన్ వరకు స్థానిక సంస్థల ద్వారా ఎన్నికైన వారందరికీ గౌరవ వేతనాలను అమాంతం పెంచేసింది. ప్రస్తుతం నెలకు రూ. 7,500 తీసుకుంటున్న జెడ్పీ చైర్మన్లు ఇకపై లక్ష రూపాయలు అందుకోనున్నారు. -
రేవంత్‌రెడ్డికి చేదు అనుభవం
హైదరాబాద్: అసెంబ్లీ మెయిన్‌గేటు వద్ద శుక్రవారం టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని చీఫ్ మార్షల్ కమలాకర్ అడ్డుకోవడం వివాదాస్పదమైంది. స్పీకర్‌ను కలిసేందుకు అసెంబ్లీ లాబీల్లోకి వెళుతున్న రేవంత్‌ను కమలాకర్, ఇతర పోలీసులు అడ్డుకోగా తమను అసెంబ్లీ వ్యవహారాల వరకే సస్పెన్షన్ చేశారు తప్ప గేటులోకి రాకుండా కాదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ నిబంధనల మేరకు అడ్డుకున్నారో లిఖితపూర్వకంగా రాసివ్వాలని చీఫ్ మార్షల్‌ను డిమాండ్ చేశారు. రేవంత్‌తో చీఫ్ మార్షల్ గొడవ పడుతున్న విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన ఇతర ఎమ్మెల్యేలు కూడా అధికారుల వైఖరిని తప్పుబట్టారు. ‘స్పీకర్ మౌఖిక ఆదేశాల మేరకే ఈ పని చేస్తున్నాను. మీరు వెళ్లాలనుకుంటే మీ ఇష్టం’అని చీఫ్‌మార్షల్ పక్కకు తప్పుకున్నారు. ‘బాజాప్తా వెళ్తాం. అది మా హక్కు. పైరవీకారులు, ఎమ్మెల్యేలు కాని వారు అసెంబ్లీ లాబీల్లోకి పాస్‌లతో వస్తున్నప్పుడు ప్రజాప్రతినిధులను అడ్డుకుంటారా?’ అంటూ లోపలకు వెళ్లి స్పీకర్‌ను కలిశారు. చీఫ్ మార్షల్ ప్రవర్తనపై ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఆవరణలో ఫ్లెక్సీ పట్టుకోవడంపైనా వివాదం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసేందుకు వెళ్లే ముందు అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యేలకు చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీ ప్రవేశద్వారం వద్ద నిలబడిన ఎమ్మెల్యేలు ‘గవర్నర్ గారూ... ఎమ్మేల్యేల గోడు వినండి - నియంతృత్వ ప్రభుత్వాన్ని నిలువరించండి..ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అని రాసిన ఫ్లెక్సీని ప్రదర్శించడం పట్ల చీఫ్ మార్షల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీని ప్రదర్శించడం నిబంధనలకు విరుద్ధమని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుతో వాదనకు దిగారు. ‘మేమేమైనా సభలో ఫ్లెక్సీని ప్రదర్శిస్తున్నామా? అసెంబ్లీ ముందు ఎమ్మెల్యేలు నిలబడి బ్యానర్లు కూడా ప్రదర్శించకూడదా? అని ఎర్రబెల్లి నిలదీశారు. అయినా ఫ్లెక్సీని ప్రదర్శించడానికి వీల్లేదంటూ చీఫ్ మార్షల్ గొడవకు దిగడంతో డీసీపీ కమలాకర్‌రెడ్డి సర్దిచెప్పి పంపించారు. -
మా సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం
హైదరాబాద్: అసెంబ్లీ నుంచి తమను సస్పెండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రభుత్వ తప్పులను నిలదీస్తామన్న భయంతో తమను బయటకు పంపారని టీడీఎల్పీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ కుటిలనీతిని గమనించి తమకు న్యాయం చేయాలని గవర్నర్ నరసింహన్‌ను కోరినట్లు చెప్పారు. సస్పెన్షన్ అంశంతోపాటు మంత్రిగా తలసాని కొనసాగింపు, టీడీపీ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో విలీనమైనట్లు గుర్తించడం వంటి అంశాలపై ఎర్రబెల్లి నాయకత్వంలో ఎమ్మెల్యేలు సాయన్న, మాగంటి గోపీనాథ్, వెంకటవీరయ్య, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, వివేక్, మాదవరం కృష్ణారావు, గాంధీలు శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ.. సమావేశాలు ప్రారంభమైన రోజు గవర్నర్ సమక్షంలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమపై దాడి చేశారని, వారి నుంచి తప్పించుకునేందుకే బల్లలపైకి ఎక్కిన విషయాన్ని వివరించినట్లు తెలిపారు. సీఎం డెరైక్షన్‌లో మంత్రి హరీశ్‌రావు స్పీకర్ పాత్ర పోషిస్తూ ‘దయాకర్‌రావుకు మైక్ ఇవ్వండి. క్షమాపణలు చెప్పమనండి’ అని ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు. వీడియో ఫుటేజ్‌లో అధికారపక్షం దాడులను కట్‌చేసి చూపారని, పూర్తి వీడియో చూడాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించి మంత్రిగా కొనసాగిస్తున్న విషయాన్ని గవర్నర్‌కు వివరించినట్లు చెప్పారు. ఏ చట్టం ప్రకారం టీడీపీ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో విలీనమైనట్లు మండలి చైర్మన్ చెబుతారని, పార్టీ ఫిరాయించిన వారిని అనర్హులుగా ప్రకటించకుండా టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించడమేంటని గవర్నర్‌ను అడిగినట్లు చెప్పారు. ఈ అంశాలపై గవర్నర్ రెండు రోజుల్లో స్పందించకుంటే సోమవారం ఢిల్లీకి వెళ్లి ఎన్నికల కమిషన్‌కు, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నట్లు ఎర్రబెల్లి తెలిపారు. మీ హీరో రాలేదా..!: బడ్జెట్ సమావేశాల సందర్భం గా రేవంత్‌రెడ్డి చేసిన గొడవ గవర్నర్ మరచిపోలేదు. శుక్రవారం టీడీపీ ఎమ్మెల్యేలు తనను కలిసేందుకు వచ్చిన సమయంలో ‘ మీ హీరో (రేవంత్‌రెడ్డి) రాలేదా?’ అని వారిని ప్రశ్నించారు. కొడంగల్ నుంచి వస్తున్నారు. లేట్ అయిందని ఎర్రబెల్లి చెప్పడంతో ‘అలాగా..!’ అని నవ్వినట్టు అక్కడున్న ఎమ్మెల్యేలు మీడియాకు తెలిపారు. -
సాగునీటి ప్రాజెక్టులకు చికిత్స: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులకు రీ ఇంజనీరింగ్ చేయాల్సిన అసవరముందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ దిశగా ప్రతిపక్షాలను కలుపుని చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ పరిధి లో నిర్మించే ప్రాజెక్టులను కూడా తెలంగాణకు ఉపయోగపడే వీలులేకుండా చేశారని ఆరోపించారు. గతంలో ప్రతిపాదించి కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టుల డిజైన్లు కూడా అలాగే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సీఎల్పీ నేత జానారెడ్డి సాగునీటి ప్రాజెక్టుల్లోని లోపాలను సోదాహరణంగా లేవనెత్తారు. ఆ సమయంలో సభలో లేని సీఎం.. జానా కీలకాంశాలను లేవనెత్తుతుండటంతో సభలోకి వచ్చి ఆయన ప్రసంగంలో జోక్యం చేసుకున్నారు. ‘‘జానారెడ్డి లేవనెత్తిన విషయాలు పూర్తిగా నిజం. అవి చాలా కీలకాంశాలు, ఈ సందర్భంగా నేను కఠోర సత్యాన్ని చెబుతున్నాను. దానిపై అందరూ ఆలోచించాలి. నేను బాధ్యతతో, సమగ్రంగా తెలుసుకుని మాట్లాడుతున్నాను. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో చేపట్టిన కొన్ని ప్రాజెక్టులు ఈ ప్రాంతం విషయంలో ఫక్తు క్రూర పరిహాసం తప్ప చిత్తశుద్ధితో తీసుకున్నవి కాదు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ విషయంలో ఖమ్మం జిల్లాను పరిహసించారు. అక్క డ లిఫ్ట్‌తో నీళ్లు తెచ్చి కాల్వలో పోస్తమన్నరు. దుమ్ముగూడెం టెయిల్‌పాండ్‌తో తెలంగాణకు ఏం ప్రయోజనముంది? భూమి మనదే. కానీ చుక్క నీళ్లు రావు. ఓ కాగితం ఇయ్యలే. పునాది వెయ్యలే. ఇలా సాగింది తెలంగాణ ప్రాజెక్టుల సంగతి. తెలంగాణలో కీలకమైన ఎస్సారెస్పీ ప్రాజెక్టును జాబితాలో మూలకుపెట్టిండ్రు. చెన్నారెడ్డి సీఎంగా ఉండగా కోటిరెడ్డి అనే ఇంజనీరు చొరవతో అది ముందుకొచ్చి సాకారమైం ది. తాజా ప్రణాళిక ప్రకారం ప్రాణహిత 116 కిలోమీటర్లు సాగిన తర్వాత గాని దాని నీళ్లు ఎల్లంపల్లికి చేరుకోవు. ఇందుకు రూ.18,800 కోట్లు ఖర్చు చేయాలి. వెరసి ప్రాణహిత ప్రాజెక్టు ఓ పెద్ద జోక్‌గా మారింది. కానీ దీనికీ మెరుగైన ప్రత్యామ్నాయముంది. ఇది ఇటీవల మహారాష్ట్ర సీఎంతో చర్చ సందర్భంగా కూడా ప్రస్తావనకొచ్చింది’’ అని సోదాహరణంగా వివరించారు. ‘‘అందుకే జానారెడ్డి సూచనలు శిరోధార్యమంటున్న. తక్కువ ఖర్చుతో వెంటనే పూర్తయ్యే ప్రాజెక్టులకే మేమిప్పుడు ప్రాధాన్యమిస్తున్నం. మిగతావాటి విషయంలో ఏం చేద్దమనేది కలిసి కూసొని మాట్లాడి నిర్ణయించుకుందం. నక్కలగండి, పాలమూరు ఎత్తిపోతల పథకం, తడకపల్లి-పాములపర్తి ప్రాజెక్టు తదితరాల విషయంలో ప్రతిపక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటం’’ అని వెల్లడించారు. ‘మీ వాళ్లు చెప్పిన పనులైనా ఫర్వాలేదు’ చర్చ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు, జానారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ప్రాధాన్యమున్న, ముఖ్యమైన చెరువుల పనులనే ముందుగా ప్రారంభించాలని జానా సూచిం చారు. ఆ క్రమంలో, ‘టీఆర్ఎస్ నేతలు చెప్పిన పనులనే ముందుగా తీసుకున్నా ఫర్వాలేదు’ అనడంతో హరీశ్ సుతిమెత్తగా తప్పుబట్టారు. ఈ విషయంలో తాము పార్టీలకతీతంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. తాము మరింత బాగా చేయలేదనే ప్రజలు తమను పక్కనపెట్టారంటూ జానా స్పందించారు. ప్రజల ఆకాంక్షను విస్మరించొద్దనే తాను చెబుతున్నానంటూ ముక్తాయించారు. -
బాండ్ల రూపంలోనే పీఆర్సీ బకాయిలు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన 43 శాతం ఫిట్మెంట్లో భాగంగా 2014 జూన్ 2 నుంచి 2015 ఫిబ్రవ రి 28 వరకు చెల్లించాల్సిన వేతన బకాయిలను బాండ్ల రూపంలో ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఐదేళ్ల తరువాత వాటిని వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. పీఆర్సీ అమలుకు సంబంధించి ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఈటెల సమాధానమిచ్చారు. పెనషనర్లకు ప్రయోజనాలు కల్పించేందుకు 2013 జులై 1 నుంచి 2014 జూన్ 1 వరకు నోషనల్‌గా 10వ పీఆర్సీని అమలు చేస్తామని వివరించారు. సకల జనుల సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వాలని సోమారపు సత్యనారాయణ (టీఆర్ఎస్), హెల్త్ కార్డుల అమలుపై స్పష్టత ఇవ్వాలని గణేష్ గుప్తా (టీఆర్ఎస్) మంత్రిని కోరగా పీఆర్సీ జీఓలు ఎప్పుడు జారీ చేస్తారని, ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారని మోజాంఖాన్ (మజ్లిస్) ప్రశ్నించారు. -
ఇది ఊహల బడ్జెట్
హైదరాబాద్: బడ్జెట్ అంటే అలంకారప్రాయం, నినాదాలతో కూడినది కాదని.. స్పష్టమైన విధానాన్ని కలిగి ఉండాలని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి పేర్కొన్నారు. ‘రాష్ర్ట బడ్జెట్ ఆచరణాత్మకంగా లేదు. అనుభవంతో అధ్యయనం చేసినట్లు లేదు. ఊపుతో ఊహాలోకంలో విహ రించినట్లుగా ఉంది. గత బడ్జెట్లో అంచనాలనే.. సవరించిన బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు. వాస్తవ ఖర్చులను చూపించలేదు. సవరింపులు లేనప్పుడు బడ్జెట్ పుస్తకాల్లో ఖాళీగా చూపెట్టినా సరిపోయేది’ అని శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా జానా వాఖ్యానించారు. రాష్ర్ట ప్రజల ఆకాంక్షల మేరకు ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషిస్తున్నామని, సామాజిక, ఆర్థిక న్యాయంతో కూడిన పాలన అందించేందుకు రాష్ర్ట ప్రభుత్వానికి సహకరిస్తున్నామని పేర్కొన్నారు. అంత ఆదాయం అసాధ్యం పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం రూ. 59 వేల కోట్లుగా చూపిందని, అది అసాధ్యమని జానారెడ్డి తేల్చిచెప్పారు. గత బడ్జెట్లో 8 నెలలకు రూ. 30 వేల కోట్లు వచ్చి ఉంటుందని, ఆ లెక్కన ఏడాదికి చూసుకుంటే అది రూ. 44 వేల కోట్లకు మించదని అంచనా వేశారు. కానీ ప్రభుత్వం మాత్రం పన్ను ఆదాయాన్ని దాదాపు 34 శాతం మేర పెంచి చూపిందన్నారు. పన్నేతర ఆదాయం కింద భూముల క్రమబద్ధీకరణ, మొబిలైజేషన్ తదితరాల ద్వారా రూ. 13,500 కోట్లు చూపారని, గత బడ్జెట్లో రూ. 6,500 కోట్లు చూపితేనే అది అసాధ్యమని తాను అప్పుడే చెప్పానన్నారు. ఇప్పుడు కూడా అదే పునరావృతమవుతుందని పేర్కొన్నారు. అప్పుల లెక్కలూ అంతే.. జీఎస్డీపీలో 3 శాతానికి మించి అప్పులు తెచ్చుకునే అవకాశం లేనప్పటికీ, సభలో సీఎం దాన్ని 3.5 శాతానికి సాధిస్తామని చెప్పారని, అది కూడా కుదరదని జానారెడ్డి పేర్కొన్నారు. ‘ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం అదనంగా అప్పు పుట్టాలంటే రెండు అంశాల్లో అర్హత సాధించాలి. జీఎస్డీపీలో 25 శాతం కంటే తక్కువగా అప్పులు ఉంటే 0.25 శాతం కొత్త అప్పు సాధ్యం. కానీ వడ్డీలు చెల్లించే మొత్తం 10 శాతానికి మించరాదనే నిబంధనలో మనం విఫలమవుతాం. మన వడ్డీలు రూ. 5 వేల కోట్లలోపే పరిమితమై ఉంటే ఈ అర్హత సాధించేవాళ్లం. కానీ మన వడ్డీల మొత్తం రూ. 6 వేల కోట్లకు చేరింది. వెరసి 3.25 శాతానికి మించి అప్పు పుట్టదు’ అని జానా వివరించారు. దీనికోసం అంతా కలిసి ప్రధాని వద్దకు వెళ్దామనే ప్రయాస అనవసరమన్నారు. ప్రణాళిక పద్దు కూడా డొల్లనే... వివిధ పథకాలకు రూ. 52 వేల కోట్లు వ్యయం చేయనున్నట్టు ప్రణాళిక పద్దు కింద చూపడం కూడా నిర్మాణాత్మకంగా లేదన్నారు. ఆ పద్దు కింద రూ. 30 వేల కోట్లను మించి ఖర్చు చేయలేరని ప్రతిపక్ష నేత తేల్చిచెప్పారు. ఈ విషయంలో గత బడ్జెట్ సమయంలో తాను చెప్పిన లెక్కలు నిజమయ్యాయని, అప్పుడు రాసిన కాగితం ఇప్పటికీ తనవద్దే ఉందని దాన్ని చూపించారు. తన మాటలను గమనంలోకి తీసుకుని వెంటనే బడ్జెట్ అంకెలను వాస్తవబద్ధంగా సవరించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. లేకుంటే ప్రజలను గందరగోళపరచడం మినహా ప్రయోజనం ఉండదన్నారు. అలాగే రాష్ర్టంలో సుమారు రూ. 40 వేల కోట్ల విలువైన నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని, వీటిలో తుది దశలో ఉన్న ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలని జానారెడ్డి సూచించారు. టీఎంసీకి అంత స్థిరీకరణ సాధ్యమా? ఒక టీఎంసీ నీటికి 15 వేల ఎకరాల స్థిరీకరణ లెక్కతో ప్రాజెక్టు అంచనాలు రూపొందిస్తున్నారని జానారెడ్డి విమర్శించారు. బిందు, తుంపర సేద్యం పద్ధతిలో అది సాధ్యమని గతంలో లెక్కలేశారని, కానీ ఆ రెండు పద్ధతులు ఖరీదైనవని, వాటికి ప్రత్యేక నిధులెలా కేటాయిస్తారో చూపకుండా తాజా బడ్జెట్‌ను రూపొందించారని పేర్కొన్నారు. మామూలుగా టీఎంసీ నీటితో ఆరేడు వేల ఎకరాల వరకే సాగు సాధ్యమన్నారు. మిషన్ కాకతీయలో ముఖ్య చెరువులనే ఎంపిక చేయాలని, నీటి పారుదల లేని కాలువలను కూడా ఆ పథకంలో చేర్చి మరమ్మతులు పూర్తి చేయాలని సర్కారుకు సూచించారు. కాంగ్రెస్ వల్లే ఈ మాత్రం కరెంటు.. క రెంటు విషయంలో కాంగ్రెస్‌ను నిందించడం మానుకోవాలన్నారు. తమ వల్లనే ప్రస్తుతం ఈ మాత్రం కరెంటు ఉందని, త్వరలో అందుబాటులోకి వచ్చే ప్రాజెక్టులు కూడా తాను శ్రీకారం చుట్టినవేనని జానా గుర్తుచేశారు. త్వరలో అందుబాటులోకి రానున్న 600 మెగావాట్ల భూపాలపల్లి, 1200 మెగావాట్ల సింగరేణి, 209 మెగావాట్ల సీజీఎస్ ప్లాంట్లు కాంగ్రెస్ పుణ్యమేనని, విభజన చట్టంలో పొందుపరిచిన 4 వేల మెగావాట్ల ఎన్టీపీసీ కేంద్రం కూడా కాంగ్రెస్ చలవేనని పేర్కొన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అయితే ఆ పేరుతోఇప్పటికే నిర్మాణంలో ఉన్న 4.67 లక్షల ఇళ్లకు బిల్లు లు ఆపడం సరికాదన్నారు. రెండు పడక గదుల ఇళ్లకు కేవలం రూ. 391 కోట్లు కేటాయించడంపై జానా అసంతృప్తి వ్యక్తం చేశారు. -
వేతనాల పటాస్
హైదరాబాద్: ‘స్థానిక ’ ప్రజా ప్రతినిధులకు రాష్ర్ట ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. కౌన్సిలర్, సర్పంచ్ మొదలుకొని జెడ్పీ చైర్మన్ వరకు స్థానిక సంస్థల ద్వారా ఎన్నికైన వారందరికీ గౌరవ వేతనాలను అమాంతం పెంచేసింది. ప్రస్తుతం నెలకు రూ. 7,500 తీసుకుంటున్న జెడ్పీ చైర్మన్లు ఇకపై లక్ష రూపాయలు అందుకోనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శుక్రవారం శాసనసభలో ప్రకటించారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచే వేతనాల పెంపు అమల్లోకి రానుంది. అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకూ జీతభత్యాలను భారీగా పెంచేందుకు సర్కారు సిద్ధమైనట్లు సమాచారం. ఒక్కో ప్రజాప్రతినిధికి రూ. 2 లక్షల మేర చెల్లించనున్నట్లు ఈ సమావేశాల్లోనే తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. ప్రజా ప్రతినిధులకు ముఖ్యంగా స్థానిక సంస్థల సభ్యులకు గౌరవ వేతనాలను పెంచాలన్న డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. దీనిపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్.. ప్రజాప్రతినిధుల గౌరవాన్ని ఇనుమడింపజేయడంతో పాటు వారి సేవలను సమర్థంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వేతనాల పెంపునకు నిర్ణయించారు. ‘స్థానిక’ ప్రతినిధులకు వేతనాల పెంపు ద్వారా ప్రభుత్వంపై రూ. 93 కోట్ల అదనపు భారం పడనుందని ఆయన సభలో వెల్లడించారు. కొందరు హర్షం.. మరికొందరు నిరసన.. ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని పెంచుతూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల పలు సంఘాలు హర్షం ప్రకటించగా.. మరికొందరు తక్కువ పెంపు పట్ల నిరసన వ్యక్తం చేశారు. ‘స్థానిక’ నేతల సమస్య పట్ల సానుకూలంగా స్పందించినందుకు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య, కార్యదర్శి డాక్టర్ వైబీ సత్యనారాయణ, రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోంరెడ్డి తదితరులు సీఎం కేసీఆర్‌కు, పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తూనే సర్పంచులు, ఎంపీటీసీలకు తక్కువగా పెంచడంపై పునరాలోచన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. సర్పంచుల డిమాండ్ల సాధనకై ఈ నెల 19న తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం విషయమై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు సర్పంచుల సంఘం సచివాలయంలో తలపెట్టిన సన్మాన కార్యక్రమం రసాభాసగా మారింది. సర్పంచుల వేతనాన్ని కేవలం రూ. 5 వేలుగా నిర్ణయించడాన్ని తప్పుబడుతూ కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరికొందరైతే డి బ్లాక్‌లోని కాన్ఫరెన్స్ హాల్ ముందు ధర్నాకు దిగారు. దీంతో సన్మాన కార్యక్రమానికి హాజరు కావాల్సిన మంత్రి కేటీఆర్ తన చాంబర్‌కే పరిమితమయ్యారు. సచివాలయంలో ఆందోళనకు దిగిన సర్పంచులను భద్రతా సిబ్బంది బలవంతంగా బయటకు పంపారు. కాగా, కొందరు సర్పంచ్‌లు కేటీఆర్ చాంబర్‌కే కృతజ్ఞతలు తెలిపారు. మరికొందరు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి కేసీఆర్‌ని కలిశారు. విపక్షాల విస్మయం రాష్ర్టంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తరుణంలో ‘స్థానిక’ ప్రతినిధులకు గౌరవ వేతనాలను పెంచడం చర్చనీయాంశమైంది. సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రకటించడంతో ఈ అంశం కోడ్ పరిధిలోకి వస్తుందా.. రాదా అన్న అంశంపై విపక్షాలు చర్చించుకున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి ఎన్నికల నోటిఫకేషన్ వెలువడకముందే సీఎం ప్రకటన చేసినప్పటికీ.. ఈసీ అనుమతిలో జాప్యం వల్ల ఇప్పటికీ పీఆర్సీ ఉత్తర్వులు జారీ కాలేదు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ప్రతినిధుల వేతనాలకు సంబంధించి ఈసీ అనుమతిపై స్పష్టత లేకపోవడంతో విపక్షాలు విస్మయం వ్యక్తం చేశాయి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకూ పెంపు! ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జీతభత్యాలను కూడా రాష్ర్ట ప్రభుత్వం భారీగా పెంచనుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే నిర్ణయం వెల్లడించే అవకాశముంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించిన జీతాల పెంపు అంశాన్ని నవంబర్లోనే కేసీఆర్ సమీక్షిం చారు. ఎమ్మెల్యేలు సొంత వాహనాల్లో నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. వివిధ కమిటీల్లో సభ్యులుగా ఉండటంతో సమావేశాలకు హాజరవుతున్నా రు. జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్రమాలకు వెళుతున్నారు. ఇందుకు చాలా ఖర్చవుతున్న దృష్ట్యా వారి జీతాలు పెంచడం అనివార్యమని సీఎం అభిప్రాయపడ్డారు. బడ్జెట్ తయారీ సందర్భంగా ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. రాష్ర్టంలో 120 మంది ఎమ్మెల్యేలు, 36 మంది ఎమ్మెల్సీలు ఉన్నా రు. ప్రస్తుతం వీరికి రూ. 95 వేల వరకు జీతభత్యా లు అందుతున్నాయి. సీఎం, మంత్రులు, కేబినేట్ హోదా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట రీ కార్యదర్శులు మినహాయిస్తే మిగతా 124 మంది కి రూ. 2 లక్షల చొప్పున చెల్లించాలని భావిస్తోంది. దీంతో నెలకు రూ. 2.50 కోట్లు, ఏడాదికి రూ. 30 కోట్లు అదనపు భారం పడుతుందని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే దీన్ని అమలు చేయాలని సర్కారు నిర్ణయించ డంతో బడ్జెట్ సమావేశాల్లోనే ఈ ప్రకటన ఉంటుందని సమాచారం. గౌరవ వేతనాల వివరాలు గ్రామీణ ప్రాంతాల్లో.. హోదా - ప్రస్తుతం(రూ.లలో) - పెంచినది(రూ.లలో) జడ్పీ చైర్మన్ - 7,500 లక్ష జడ్పీటీసీ సభ్యుడు - 2,250 - 10,000 ఎంపీపీ అధ్యక్షుడు - 1,500 - 10,000 ఎంపీటీసీ సభ్యుడు - 750 - 5,000 గ్రామ సర్పంచ్ - 1,500 - 5,000 నగర/పట్టణ ప్రాంతాల్లో.. మేయర్ - 14,000- 50,000 డిప్యూటీ మేయర్ - 8,000 - 25,000 కార్పొరేటర్ - 4,000 - 6,000 స్పెషల్ గ్రేడ్ మున్సిపాల్టీల్లో.. మున్సిపల్ చైర్మన్ - 10,000 - 15,000 వైస్ చైర్మన్ - 5,000 - 7,500 కౌన్సిలర్లు - 2,200 - 3,500 ఇతర మున్సిపాల్టీల్లో.. చైర్మన్ - 8,000 - 12,000 వైస్ చైర్మన్ - 3,200 - 5,000 కౌన్సిలర్ - 1,800 - 2,500 -
అలంకారప్రాయంగా బడ్జెట్: జానారెడ్డి
బడ్జెట్ కేటాయింపులు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని తెలంగాణ శాసనసభ ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం సభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మాట్లాడుతూ బడ్జెట్లో చూపిన మేరకు ఆదాయాలు రావని, ట్యాక్స్, గ్రాంట్స్‌లో ప్రభుత్వం చూపినంత రాబడి ఉండదన్నారు. రూ.20వేల కోట్లు నిధులు తగ్గుతాయని, ఈ మేరకు అభివృద్ధి పథకాలకు నిధుల కోత తప్పదన్నారు. బడ్జెట్ అలంకార ప్రాయంగా ఉందని, నిర్ధిష్టంగా, నిర్మాణాత్మకంగా లేదని జానారెడ్డి అభిప్రాయపడ్డారు. అలాగే బడ్జెట్ గణాంకాలు గందరగోళపరుస్తున్నాయని, ఇరిగేషన్లో నిర్మాణం చివరి దశలో ఉన్న ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విద్యుత్ విషయంలో కాంగ్రెస్ ముందుచూపుతో ప్రాజెక్టులు చేపట్టిందన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు సరిపోయే కేటాయింపులు లేవని, దళితులకు మూడెకరాల భూమి పరిస్థితి అలాగే ఉందన్నారు. రుణమాఫీ అంశం ఇటు రైతులకు, ప్రజలకు ఇబ్బందిగా ఉందన్నారు. -
'హరీశ్ రావు నడిపిస్తున్నారు...'
-
'హరీశ్ రావు నడిపిస్తున్నారు...'
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుందని తెలంగాణ టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీలో తమ సస్పెన్షన్ ఎత్తివేసేలా చర్య తీసుకోవాలంటూ టీ.టీడీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. అ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు...తెలంగాణ ప్రభుత్వంపై పలు ఫిర్యాదులు చేశారు. ఆ భేటీ అనంతరం ఎర్రబెల్లి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తెలంగాణ కేబినెట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనసాగింపు, శాసన మండలిలో ఎమ్మెల్సీల విలీన ప్రకటన, టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు.... అప్రజాస్వామికమన్నారు. ఇదే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై నాలుగు సీడీలు ఉంటే వాటిలో ఒక సీడీని కటింగ్ చేసి చూపించారని ఎర్రబెల్లి ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమను కొట్టిన దృశ్యాలున్న సీడీనీ మాయం చేశారని ఆయన అన్నారు. ఆ నాలుగు సీడీలను గవర్నర్ పరిశీలించాలని తాము కోరామన్నారు. అసెంబ్లీని నడిపిస్తున్నది స్పీకర్ కాదని,శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్ రావు అని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. తమను సభ నుంచి సస్పెండ్ చేసిన రోజు స్పీకర్ తమకు మైక్ ఇచ్చి క్షమాపణ చెప్పాలని అడగలేదన్నారు. హరీశ్ రావే ...దయాకరరావుకి మైక్ ఇవ్వండి..క్షమాపణ చెప్పాలని ఆదేశించారని ఈ సందర్భంగా ఎర్రబెల్లి గుర్తు చేశారు. సభా నాయకుడి డైరెక్షన్లో స్పీకర్ పనిచేస్తున్నారని ఆయన అన్నారు. జాతీయ గీతాన్ని అవమానించినట్లు అయితే క్షమాపణలు కోరమని స్పీకర్ కోరాలని అన్నారు. అయితే స్పీకర్ కంటే ముందే హరీశ్ రావే డిమాండ్ చేశారన్నారు. ఈ విషయంపై గవర్నర్ జోక్యం చేసుకోకపోతే రాష్ట్రపతిని కలవడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మండలిలో టీడీపీని విలీనం చేస్తున్నట్టు చెప్పిన బులెటిన్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ ఎర్రబెల్లి చేశారు. మంత్రుల అవినీతి బట్టబయలు చేస్తామనే తమపై సస్పెన్షన్ వేటు వేశారన్నారు. -
ఇది రివైజ్డ్ బడ్జెట్ అనబడుతుందా?
-
'ఊహాలోకంలో విహరించినట్టు ఉంది'
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ చదువుతుంటే ఊహాలోకంలో విహరించినట్టు ఉందని ప్రతిపక్ష నాయకుడు కె. జానారెడ్డి అన్నారు. 2015-16 సంవత్సరానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ ఆచరణాత్మకంగా లేదన్నారు. ఈ బడ్జెట్ కు విశ్వసనీయత లేదన్నారు. శుక్రవారం శాసనసభలో బడ్జెట్ పై చర్చలో ఆయన పాల్గొన్నారు. బడ్జెట్ ను పూర్తిగా అధ్యయనం చేసి ముందుకు సాగాల్సివుంటుందన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా బడ్జెట్ ఉండాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఆర్థి బడ్జెట్ ను ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ఈనెల 11న ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. -
'బ్రాండ్ కార్లు ఇవ్వడం దేశంలోనే ప్రధమం'
హైదరాబాద్: తెలంగాణలో 690 పోలీసు స్టేషన్లకు బ్రాండ్ వాహనాలు దేశంలోనే ప్రధమం అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. నేరం జరిగిన 10 నిమిషాల్లో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుంటారని తెలిపారు. రాజధానిలో ప్రతి కూడలిలో పోలీసులు అప్రమత్తంగా ఉంటారని అసెంబ్లీలో చెప్పారు. ఇన్నోవా కార్ల కొనుగోలులో అవకతవకలు జరిగాయన్న అపవాదు ఉందని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. పోలీసు వాహనాలకు డైవర్ల నియామకంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఏమైనా శిక్షణ ఇచ్చారా అని ఆమె ప్రశ్నించారు. దీనికి నాయిని సమాధానం ఇస్తూ.. పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగానే కనబడుతుందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచితే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరిగినట్టేనని అన్నారు. -
తెలంగాణ అసెంబ్లీలో నేడు బడ్జెట్‌పై చర్చ
హైదరాబాద్ : తెలంగాణ శాసన సభలో శుక్రవారం నుంచి బడ్జెట్‌పై చర్చ ప్రారంభం కానుంది. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సమర్పించిన బడ్జెట్‌పై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తరపున చర్చను ప్రారంభించనున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో భూముల క్రమబద్దీకరణ, ఉద్యోగులకు వేతన సవరణ, నదుల అనుసంధానం, దీపం పథకం, మిషన్ కాకతీయ, యాదగిరిగుట్ట అభివృద్ధి, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్‌కు నూతన భవన నిర్మాణం లాంటి అంశాలు సభ ముందుకు రానున్నాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం పెంపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ఇవాళ ప్రకటన చేసే అవకాశముంది. రైతుల ఆత్మహత్యలు, సమస్యలు , కరువుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చింది. -
బడ్జెట్‌పై కాకి లెక్కలుబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
ఖమ్మం: అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను కాకి లెక్కల బడ్జెట్‌గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అభివర్ణించారు. ఖమ్మంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ప్రభుత్వం వచ్చాక గత డిసెంబర్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో ఎంత ఖర్చు చేశారు..? వేటికి ఎంత వెచ్చించారనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయలేకపోయిందని కిషన్‌రెడ్డి అన్నారు. కేవలం ప్రజలను ఏ విధంగా ఆకట్టుకోవాలన్న ఒకే ఒక్క ఎజెండాకు పరిమితమై రంగుల సినిమా చూపించేందుకు తాపత్రయ పడుతోందన్నారు. వాస్తవాలకు విరుద్ధంగా అంచనాలను పెంచి బడ్జెట్ పెంచడం వల్ల కలిగే ప్రయోజనమేంటో తెలంగాణ సర్కార్కే తెలియాలని కిషన్‌రెడ్డి అన్నారు. -
మధ్యమానేరుకు మంచిరోజులు
మధ్యమానేరుకు మంచిరోజులొచ్చారుు. నిర్మాణం మొదలై ఎనిమిదేళ్లు దాటినా కట్ట దశలోనే ఉన్న ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలిపూర్తిస్థారుు బడ్జెట్లో నిధుల వరద పారించింది. ఆరు నెలల్లో పనులు పూర్తి చేయూలని లక్ష్యంగా నిర్ణరుుంచిన ప్రభుత్వం ఆ మేరకు నిధులు కేటారుుంచింది. పనుల్లో వేగం పెంచడంతోపాటు పునరావాసాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు సిద్ధం చేస్తున్నారు. బోయినపల్లి : తెలంగాణ ప్రభుత్వం మధ్యమానేరు ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయూలని నిర్ణరుుంచింది. 2016 ఖరీఫ్ సీజన్‌నాటికి మిడ్‌మానేరులో మూడు టీఎంసీల నీరు నిల్వ చేస్తామని మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ గత నెల 23న ముస్తాబాద్‌లో జరిగిన రైతు బహిరంగ సభలో ప్రకటించారు. నిర్వాసితులకు త్వరితగతిన పరిహారం అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు తగిన రీతిలో బడ్జెట్లో వరదకాలువ కోసం రూ.747 కోట్లు కేటారుుంచింది. వరదకాలువలో భాగమైన మధ్యమానేరు పనులు ఇక వేగవంతం కానున్నారుు. బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేసిన వైనంపై ముంపుగ్రామాల ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నారుు. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని 2,00,146 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాలని లక్ష్యంగా బోరుునపల్లి మండలం మాన్వాడ వద్ద 25.873 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతోఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఎస్సారెస్పీ వరదకాలువలో భాగంగా నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు రూ.339.39 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. 2006లో ప్రారంభించిన పనులు తొమ్మిదేళ్లుగా కొనసా...గుతూనే ఉన్నారుు. పనులు పొందిన సంస్థ తాము కొనసాగించలేమని చేతులెత్తేయడంతో 2010లో ప్రభుత్వం రూ.454 కోట్ల అంచనాలతో మరోసారి టెండర్లు పిలిచింది. 20 శాతం లెస్తో రూ.360.90 కోట్లకు ఎంఎస్.ఎస్ఏపీఎల్ అండ్ ఎంబీల్, ఐవీఆర్సీఎల్ అనే సంస్థలు జారుుంట్ వెంచర్‌గా ఏర్పడి పనులు దక్కించుకున్నారుు. ప్రాజెక్టు పనులు 2015 ఏప్రిల్ నాటికి పూర్తిచేస్తామని సదరు సంస్థలు చెప్పారుు. గడువు మరో నెలరోజులు మాత్రమే ఉండగా పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. ముంపు గ్రామాల్లో నిర్వాసితులకు ఇంకా పూర్తిస్థారుులో పరిహారం అందించకపోగా, స్పిల్‌వే, కట్ట పనులు కూడా నిలిచిపోయూరుు. తమకు పరిహారం అందించి, పునరావాస కాలనీల్లో వసతులు కల్పించాలని పలుమార్లు నిర్వాసితులు ఆందోళనకు సైతం దిగారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులను సైతం పలుమార్లు కలిసి విన్నవించారు. త్వరలోనే పునరావాసకాలనీల్లో వసతులు కల్పిస్తామని, త్వరలోనే పరిహారం అందిస్తామని వారు సైతం ప్రకటించారు. పనుల్లో వేగం పెంచాలని నిర్ణరుుంచిన ప్రభుత్వం 2016 ఖరీఫ్ సీజన్‌కల్లా రైతులకు సాగునీరందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ మేరకు ఈ బడ్జెట్లో నిధులు కేటారుుంచింది. చకచకా కట్ట పనులు ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా మాన్వాడ వాగు లో స్పిల్‌వే పనులు నిర్వహిస్తున్నారు. 25 గేట్లు, తూములు, క్రాస్ రెగ్యులేటర్లు నిర్మించాల్సి ఉంది. తొమ్మిదేళ్ల తర్వాత మట్టి కట్ట పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. 10 కిలోమీటర్ల మేర రిజర్వాయర్ మట్టికట్ట పనులు చేసేందుకు ఈ నెల 4న ఇంజినీరింగ్ అధికారులు కట్టపనులు ప్రారంభించారు. పనులు చకచకా చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్యాకేజీలపై కొత్త ఆశలు ప్రాజెక్టుకోసం రైతుల నుంచి వేలాది ఎకరాల భూములు సేకరించారు. బోరుునపల్లి మండల గ్రామాల రైతులనుంచే ఎనిమిది వేల ఎకరాాలకు పైగా భూమి సేకరించింది. బడ్జెట్లో పెద్దమొత్తంలో నిధులు కేటారుుంచడంతో నిర్వాసితులు తమకు రావాల్సిన ప్యాకేజీలపై ఆశలు పెంచుకుంటున్నారు. మాన్వాడలో 605 కుటుంబాల ప్యాకేజీ కోసం గత అక్టోబర్‌లో గెజిట్ పబ్లికేషన్ చేశారు. దీనిపై ఈ నెల 7న గ్రామంలో తహశీల్దార్ విచారణ జరిపారు. కొదురుపాక, నీలోజిపల్లి గ్రామాల్లో 2,306 కుటుంబాలను గెజిట్‌లో ప్రచురించారు. ఇందులో 1,560 కుటుంబాలకు రూ. 8.53 కోట్లు చెల్లించారు. ఇంకా 746 కుటుంబాలకు పరిహారం అందాల్సి ఉంది. వరదవెల్లిలో 887 కుటుంబాలు, మాన్వాడలో 584 కుటుంబాలు గెజిట్ కాగా ఇప్పటివరకు రెండు గ్రామాల్లో ఒక్క కుటుంబానికీ పరిహారం అందలేదు. శాభాష్‌పల్లిలో 315 కుటుంబాలు గెజిట్ కాగా, 283 కుటుంబాలకు రూ.3.42 కోట్లు పరిహారం చెల్లించారు. ఇంకా 32 కుటుంబాలకు పరిహారం రావాల్సి ఉంది. వేములవాడ మండలం సంకెపెల్లిలో 617, ఆరెపల్లిలో 26, రుద్రవరంలో 297, అనుపురంలో 1,088, కొడుముంజలో 462 కుటుంబాలకు పరిహారం రావాల్సి ఉంది. సిరిసిల్ల మండలం చీర్లవంచలో 344, చింతల్ఠానాలో 1,209 కుటుంబాలకు, ఇల్లంతకుంట మండలం గుర్రంవానిపల్లిలో 210 కుటుంబాలు గెజిట్కాగా మొత్తం 210 కుటుంబాలకు రూ.2.39 కోట్లు పరిహారం చెల్లించారు. 18 సంవత్సరాలు నిండిన నిర్వాసితులు ఇళ్లు, కుటుంబాల ప్యాకేజీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకా అర్ములకు ఇళ్లు, అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వాల్సి ఉంది. పనులు వేగవంతం నిర్వాసితులు నివసించడానికి ఏర్పాటు చేసిన పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు పూర్తి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొదురుపాక, నీలోజిపల్లి గ్రామాలకు రూ.50 లక్షలతో రక్షిత నీటి ట్యాంకు, పైపులైన్ల నిర్మాణం చేస్తున్నారు. విద్యుత్ సౌకర్యం కోసం ట్రాన్స్ఫార్మర్లు బిగిస్తున్నారు. గతంలో పునరావాస కాలనీలు ముళ్లపొదలతో నిండిపోగా ప్రస్తుతం జంగల్కటింగ్తో కాలనీల్లో పిచ్చిచెట్లు, ముళ్ల పొదలు తొలగిస్తున్నారు. నిర్వాసితులకు మంచి రోజులు మిడ్‌మానేర్ రిజర్వాయర్ నిర్మాణం పనులు, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు యుద్ధప్రాతిపదికన చేసేందుకు ప్రభుత్వం బడ్జెట్లో పెద్దమొత్తంలో నిధులు కేటాయించడం శుభపరిణామం. సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారనడానికి బడ్జెట్ కేటాయింపులే నిదర్శనం. - జోగినిపల్లి రవీందర్రావు, టీఆర్ఎస్ రాష్ర్ట నాయకులు సమస్యలు పరిష్కరించాలి బడ్జెట్లో పెద్దమొత్తంలో నిధులు కేటాయించినందున అధికారులు యుద్ధప్రాతిపదికన మిడ్‌మానేర్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి. కుటుంబ పరిహారం, ఇళ్ల పరిహారం సత్వరమే చెల్లించాలి. పునరావాస కాలనీల్లో అన్ని వసతులు కల్పించాలి. 18 ఏళ్లు దాటినవారికి కుటుంబ ప్యాకేజీ ఇవ్వాలి. - రామిడి శ్రీనివాస్, మాన్వాడ సర్పంచ్ ఎదురుసూత్తన్నం ప్రాజెక్టు ఎప్పుడో అరుుపోతదన్నరు. మా ఊళ్లె భూములన్నీ తీసుకున్నరు. ఇండ్లను కూడా లెక్కలు చేసిండ్రు. కొందరికేమో పైసలిచ్చిండ్రు. ఇంకొందరికి ఇయ్యనే లేదు. ఇండ్లజాగలు కేటారుుంచలేదు. ప్రభుత్వం ఇప్పుడు పైసలు బాగా ఇచ్చిందట. ఇప్పుడన్నా మా పైసలు తొందరగా ఇస్తరని ఎదురుసూత్తన్నం. - పోశవ్వ, నిర్వాసితురాలు -
బంగారు తెలంగాణకు అనుగుణంగా బడ్జెట్
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి జడ్చర్ల: బంగారు తెలంగాణ సాదనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను రూపకల్పన చేసినట్టు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన జడ్చర్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అన్నివర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని తమ ప్రభుత్వం తొలిసారి పూర్తిస్థాయి చక్కటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందన్నారు. బడ్జెట్లో వైద్య రంగానికి అధిక ప్రాధాన్యం కల్పించామన్నారు. కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించేలా చర్యలు తీసుకుని ,సీఎం కేసీఆర్ ఆశించిన విధంగా ప్రభుత్వ ఆసుపత్రులను అబివృద్ధి పరుస్తామన్నారు. మండలస్థాయిలో ఉన్న పీహెచ్‌సీల సామర్థ్యాన్ని 30 పడకలకు పెంచుతామని.. నియోజకవర్గ కేంద్రాలలోని 30 పడకల ఆసుపత్రులను వంద పడకలకు, జిల్లా కేంద్రాలలోని ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయిలో అబివృద్ధి పరుస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ అభ్యర్థి దేవీప్రసాద్ గెలుపు ఖాయమన్న ధీమాను వ్యక్తం చేశారు.తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన దేవీప్రసాద్‌ను ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు పట్టభద్రులు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.సమావేశంలో జెడ్పీటీసీ సభ్యురాలు జయప్రద, నాయకులు గోవర్దన్‌రెడ్డి, కోడ్గల్ యాదయ్య, పిట్టల మురళి, రంజిత్‌బాబు, జంగయ్య, చాంద్‌ఖాన్, నర్సిములు, శ్రీకాంత్, ఉమాశంకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ, తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు
హైదరాబాద్: తెలంగాణతో పోలిస్తే ఏపీ బడ్జెట్ లో కీలక రంగాలకు కేటాయింపులు తగ్గాయి. రెండు రాష్ట్రాల ఆర్థిక బడ్జెట్లను ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ప్రవేశపెట్టారు. రెండు రాష్ట్రాల బడ్జెట్ లో కేటాయింపులు ఇలా ఉన్నాయి. ఆర్థిక బడ్జెట్ 2015-16 తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం బడ్జెట్ రూ.1,10,500 కోట్లు రూ. 1,13,049.00 కోట్లు ప్రణాళికేతర వ్యయం రూ. 63,306 కోట్లు రూ.78,637.00 కోట్లు ప్రణాళికా వ్యయం రూ. 52, 383 కోట్లు రూ.34,412.00 కోట్లు రెవెన్యూ మిగులు : రూ. 531 కోట్లు లోటు రూ.7,300 కోట్లు ఆర్థిక మిగులు రూ. 501 కోట్లు లోటు రూ. 17,584 కోట్లు సాగునీటి రంగం రూ.11,733 కోట్లు రూ.5,258 కోట్లు రైతు రుణమాఫీ రూ.4, 250 కోట్లు రూ.5000 కోట్లు గిరిజన సంక్షేమం రూ.3309 కోట్లు రూ.993 కోట్లు బీసీ సంక్షేమం రూ.2172 కోట్లు రూ.3,231 కోట్లు మైనార్టీ సంక్షేమం రూ.1105 కోట్లు రూ.379 కోట్లు స్త్రీ, శిశు సంక్షేమం రూ.1559 కోట్లు రూ.1080 కోట్లు వికలాంగుల సంక్షేమం - రూ.81 కోట్లు చేనేత, జౌళి రంగం - రూ.46 కోట్లు గృహ నిర్మాణం రూ.874 కోట్లు రూ.897 కోట్లు ఎస్సీ సబ్ ప్లాన్ రూ.5547 కోట్లు రూ.2123 కోట్లు గిరిపుత్ర కల్యాణ పథకం - ఎస్సీలకు 60 శాతం సబ్సీడీతో రుణాలు ఉన్నత విద్య రూ.11,216 కోట్లు రూ.3049 కోట్లు ఇంటర్ విద్య - రూ. 585 కోట్లు పాఠశాల విద్య రూ.7,970 కోట్లు రూ.14,962 కోట్లు పంచాయతీ రాజ్ రూ.6,927కోట్లు రూ.3296 కోట్లు సైన్స్ అండ్ టెక్నాలజీ రూ. 280 కోట్లు గ్రామీణ నీటి సరఫరా - రూ. 881 కోట్లు గ్రామీణాభివృద్ధి రూ.6,256 కోట్లు రూ.8212 కోట్లు పట్టణాభివృద్ధి రూ.4024కోట్లు రూ. 3168 కోట్లు రెవెన్యు శాఖ రూ.1686 కోట్లు రూ.1429 కోట్లు దేవాదాయ, ధర్మాదాయ శాఖ రూ.200 కోట్లు శాంతిభద్రతలు రూ.4313 కోట్లు రూ.4062 కోట్లు వికలాంగుల సంక్షేమం రూ.81 కోట్లు పర్యాటక రంగం రూ.330 కోట్లు రవాణా శాఖ రూ.5917 కోట్లు రూ.122 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ - రూ.360 కోట్లు ఐటీ రంగం రూ.134 కోట్లు రూ.370 కోట్లు వైద్య, ఆరోగ్యం రూ.4932 కోట్లు రూ.5,728 కోట్లు గనులు రూ.27 కోట్లు గోదావరి పుష్కరాలు రూ.100 కోట్లు రూ.1,360 కోట్లు (అన్ని శాఖల నుంచి) పోలీస్ సంక్షేమం రూ.40 కోట్లు బ్రాహ్మణుల సంక్షేమం రూ.37 కోట్లు కాపుల సంక్షేమం - రూ.100 కోట్లు - -
కొత్త సచివాలయానికి రూ. 150 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఎర్రగడ్డలో నిర్మించ తలపెట్టిన కొత్త సచివాలయానికి బడ్జెట్లో ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది. దాన్ని రూ.500 కోట్లతో ఏడు బ్లాకులుగా నిర్మించాలని రోడ్లు భవనాల శాఖ ప్రతిపాదించడం తెలిసిందే. ఛాతీ ఆస్పత్రి పక్కనే ఉన్న మానసిక చికిత్సాలయం స్థలంలో ఐఏఎస్ అధికారుల గృహ సముదాయాన్ని నిర్మించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినా తాజా బడ్జెట్లో దానికి కేటాయింపులేమీ చేయలేదు. -
ఉద్యోగుల జీతాలకు రూ. 20 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2014-15 ఆర్థిక సంవత్సరానికి చెల్లిస్తున్న మొత్తం ఎంతో తెలుసా? అక్షరాలా 16,965.33 కోట్లు. మరి ఉద్యోగులకు ఇటీవలే వేతన సవరణ స్కేళ్లను అమలు చేయాలని నిర్ణయించినందున వచ్చే ఆర్థిక సంవత్సరానికి చెల్లించే మొత్తం ఎంత ఉంటుందని అనుకుంటున్నారా? ఆ మొత్తం 20,045.23 కోట్లు. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే ఇది రూ. 3379.3 కోట్లు అధికం. జీతాలు సరే పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించే పింఛన్లు కూడా వేల కోట్లలోనే పెరిగాయి. మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ. 6580.46 కోట్లు ఉంటే వచ్చే ఏడాదికి అంటే 2015-16కు అది రూ. 8,235.87 కోట్లు అవుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులపై చెల్లించే వడ్డీ ఎంత అనుకుంటున్నారు? ఈ నెల 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి రూ. 5925.06 కోట్లుకాగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి అది రూ. 7554.91 కోట్లు. -
ఇం‘ధన’ శాఖే!
బడ్జెట్లో భారీగా పెరిగిన నిధులు గతంలో రూ. 4,955 కోట్లు, తాజాగా రూ. 7,399 కోట్లు జెన్కోకు నిధులు రెట్టింపు, కొత్త ప్రాజెక్టులకు రూ. వెయ్యి కోట్లు సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో రాష్ర్ట విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో)కు ఊతం లభించగా.. విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు మాత్రం నిరాశే మిగిలింది. గతేడాదితో పోల్చితే ఇంధన శాఖకు కేటాయింపులు భారీగా పెరిగాయి. గతంలో రూ. 4,955.89 కోట్లు కేటాయింపులు జరగ్గా.. తాజాగా రూ. 7,399.96 కోట్లకు పెరిగాయి. ప్రణాళికేతర కేటాయింపులు దాదాపు రెట్టింపు కాగా.. ప్రణాళిక కేటాయింపులు స్వల్పంగా తగ్గాయి. జెన్కోకు కేటాయింపులు గతంలోకన్నా రెట్టింపయ్యాయి. విద్యుదుత్పత్తి కోసం ప్రణాళికేతర పద్దు కింద రూ. వెయ్యి కోట్లు, ప్రణాళిక పద్దు కింద రూ. వెయ్యి కోట్లను పెట్టుబడి నిధిగా జెన్కోకు కేటాయించింది. జెన్కో ఆధ్వర్యంలో కొత్తగూడెంలో 800 మెగావాట్లు, మణుగూరులో 540(2702) మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. ప్రతిపాదన దశలో ఉన్న నల్లగొండ జిల్లా దామరచర్ల, ఆదిలాబాద్ జిల్లా జైపూర్ ప్లాంట్ల కోసం కూడా నిధులను కేటాయించింది. ట్రాన్స్‌కోకు విద్యుత్ బాండ్ల రూపంలో ప్రణాళికేతర పద్దు కింద రూ. 455.76 కోట్లు దక్కాయి. ఇక విద్యుత్ సంస్థ(ఎలక్ట్రిసిటీ బోర్డు)కు రూ. 287 కోట్లను కేటాయించింది. ప్రజలపై భారం తప్పదేమో! విద్యుత్ చార్జీల పెంపుతో 2015-16లో డిస్కంలకు రూ. 1088 కోట్ల అదనపు ఆదాయం రానున్నప్పటికీ.. అవి ఇప్పటికే రూ. 6476.30 కోట్ల నష్టాల్లో మునిగి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలతో ఈ నష్టాలను అధిగమించవచ్చని డిస్కంలు ఆశించాయి. ఇటీవల ఈఆర్సీకి సమర్పించిన వార్షిక ఆదాయ నివేదిక(ఏఆర్ఆర్)లో సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించాయి. వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించిన రాయితీలను అందులో పేర్కొన్నాయి. కానీ తాజా బడ్జెట్లో మాత్రం రాయితీల కింద డిస్కంలకు రూ. 4257.24 కోట్లను మాత్రమే సర్కారు కేటాయించింది. దీంతో మిగిలిన భారాన్ని డిస్కంలు ఏదో ఒక రూపంలో మళ్లీ ప్రజలపైనే వేసే అవకాశాలున్నాయి. లేదంటే ఆర్థిక నష్టాలతో డిస్కంలు కుప్పకూలిపోయే ప్రమాదముంది. గతేడాది రాయితీలు కూడా రూ. 3000 కోట్లు మాత్రమే కాగా, ఈసారి ఈ నిధులు పెరిగినా డిస్కంలకు మాత్రం ఊరట లభించలేదు. -
అన్నదాతకు నిరాశ
వ్యవసాయం, అనుబంధ రంగాలకు తగ్గిన నిధులు అటవీ శాఖతో కలిపి రూ. 8,432 కోట్ల బడ్జెట్ రుణమాఫీకి రూ. 4,250 కోట్ల కేటాయింపు సాక్షి, హైదరాబాద్: వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు బడ్జెట్ తగ్గింది. అటవీశాఖను కూడా కలిపి ప్రభుత్వం కేటాయించిన రూ. 8,432 కోట్ల నిధుల్లో రైతు రుణమాఫీకే రూ. 4,250 కోట్లు పోనున్నాయి. మొత్తం బడ్జెట్లో ప్రణాళిక పద్దు రూ. 2,572.72 కోట్లుగా ఉంది. గత పద్దుకన్నా ఇది ఏకంగా రూ. 478.60 కోట్లు తక్కువ. ప్రత్యేకంగా వ్యవసాయ శాఖకు గత బడ్జెట్లో రూ. 1828.87 కోట్లను ప్రణాళిక పద్దుకింద కేటాయించగా.. తాజా బడ్జెట్లో రూ. 1035.55 కోట్లను మాత్రమే ఇచ్చింది. అంటే ఈసారి రూ. 793.32 కోట్ల మేర కోత పడింది. కేంద్ర నిధులు తగ్గడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా కోత విధించడంతో వ్యవసాయానికి మొత్తంగా పెద్ద ఎత్తున కేటాయింపులు తగ్గాయి. అయితే ఉద్యానశాఖకు రూ. 559.02 కోట్లు దక్కాయి. ఇది గతంలోకంటే అధికం. గ్రీన్‌హౌస్‌కు రూ. 250 కోట్లు కేటాయించారు. ఆ శాఖ మాత్రం రూ. 500 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించింది. పశుసంవర్థక శాఖకు గతం కంటే నిధులు తగ్గాయి. కేజ్‌కల్చర్ ప్రోత్సహించేందుకు రంగం సిద్ధం చేసుకున్న ప్రభుత్వం మత్స్యశాఖకు మాత్రం తక్కువ నిధులే కేటాయించింది. దీనికి గత బడ్జెట్లో రూ. 64.96 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ. 50.57 కోట్లు మాత్రమే దక్కాయి. ఇక మార్కెటింగ్ శాఖకు రూ. 402.82 కోట్లను కేటాయించింది. కాగా, వ్యవసాయం దాని అనుబంధ రంగాలతో సంబంధం లేని అటవీ శాఖను కూడా ఇదే పద్దులో చూపించడంపై విమర్శలున్నాయి. ఆ శాఖకు గతంలో కంటే రూ. 100 కోట్లకుపైగా కోతపెట్టి రూ. 281 కోట్లను కేటాయించింది. కోళ్ల పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీ కోసం రూ. 20 కోట్లు ఇవ్వడం గమనార్హం. పాడి రైతులకు ప్రోత్సాహకం కోసం రూ. 16.30 కోట్లు కేటాయించింది. రైతులకు గిట్టుబాటు ధర అందని స్థితిలో సాయం చేసేందుకు ఉద్దేశించిన మార్కెట్ స్థిరీకరణ నిధిని రూ.400 కోట్ల నుంచి రూ.100 కోట్లకే పరిమితం చేసింది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద గతేడాది రాష్ట్రానికి రూ.765.55 కోట్లు రాగా, ఈసారి రూ.456.95 కోట్లకు తగ్గడం బడ్జెట్లో కోతలకు దారితీసింది. కీలక కేటాయింపుల వివరాలు సూక్ష్మ సేద్యానికి రూ. 200 కోట్లు జాతీయ ఉద్యాన మిషన్‌కు రూ. 109.78 కోట్లు చుక్క నీటితో ఎక్కువ పంట కోసం రూ. 108 కోట్లు సన్న చిన్నకారు రైతుల పంటల బీమాకి రూ. 139 కోట్లు వడ్డీలేని రుణాలు, పంటల బీమాకు రూ. 200 కోట్లు మార్కెట్ స్థిరీకరణ నిధి కోసం రూ. 100 కోట్లు వ్యవసాయ శాఖ భవన నిర్మాణాలకు రూ. 5.19 కోట్లు పావలా వడ్డీ రుణాలకు రూ. 18.05 కోట్లు వ్యవసాయ విస్తరణ కోసం రూ. 28.83 కోట్లు వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 100 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ కోసం రూ. 6.88 కోట్లు రైతులకు విత్తన సరఫరాకు రూ. 64.51 కోట్లు సీడ్ చైన్ బలోపేతానికి రూ. 50 కోట్లు పంట కాలనీలు, భూగర్భ జలాల విశ్లేషణకు రూ. 20 కోట్లు జాతీయ ఆహార భద్రత పథకానికి రూ. 123.30 కోట్లు ఆర్కేవీవై కోసం రూ. 196.26 కోట్లు ఉద్యాన శాఖ కార్యక్రమాలకు రూ. 2 కోట్లు మొబైల్ వెటర్నరీ క్లినిక్స్ కోసం రూ. 2.18 కోట్లు ఫిష్‌సీడ్ ఫామ్స్ కోసం రూ. 11 కోట్లు వైద్యనాథన్ కమిటీ మార్గదర్శకాల అమలుకు రూ. 49.77 కోట్లు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు రూ. 4.08 కోట్లు ఆత్మహత్యల ప్రస్తావనేది కరువు, రైతు ఆత్మహత్యలపై బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడం దారుణం. ఇప్పటికే 760 మంది చనిపోతే ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. రాష్ట్రం లో కరువు విలయతాండవం చేస్తున్నా పట్టించుకోలేదు. - సారంపల్లి మల్లారెడ్డి, రైతు సంఘం నాయకుడు -
సాగుకు నిధుల పొంగు!
రూ. 11,733 కోట్లతో భారీగా కేటాయింపులు సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో సాగునీటి రంగానికి రాష్ర్ట ప్రభుత్వం నిధుల వరద పారించింది. గత ఏడాది కంటే రూ. రెండు వేల కోట్ల మేర అదనపు కేటాయింపులు చేసి అగ్రతాంబూలం వేసింది. తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులన్నింటికీ తొలి ప్రాధాన్యమివ్వడంతో పాటు ఇతర ప్రాజెక్టులకూనిధులిచ్చి ఊపిరి పోసింది. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాన్ని కలుపుకొని మొత్తంగా సాగునీటి రంగానికి బడ్జెట్లో రూ. 11,733.93 కోట్లను ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ కేటాయించారు. ఇందులో భారీ, మధ్య తరహా ప్రాజెక్టులకు రూ. 9,052 కోట్లు, చిన్న నీటి పారుదలకు రూ. 2,232 కోట్లు ప్రతిపాదించారు. దీనికింద గత ఏడాది మాదిరే మిషన్ కాకతీయకు రూ. 2,100 కోట్లను కేటాయించింది. వచ్చే ఏడాదిలోగా ప్రాజెక్టుల కింద 10 లక్షల ఎకరాల ఆయకట్టును లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. ఆ మేరకే ప్రాజెక్టు పరిధిలో జరిగిన, జరుగుతున్న పనుల గీటురాయి లెక్కన నిధుల కేటాయింపు జరిపినట్టు అర్థమవుతోంది. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తొలి ఏడాదే రూ. 100 కోట్ల మేర నిధులు కేటాయించింది. మరో ప్రాజెక్టు జూరాల-పాకాలకు మాత్రం నామమాత్రంగానే నిధులిచ్చింది. ఏఎంఆర్పీ ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ నిర్మాణానికి గతంలో రూ. 325 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ. 600 కోట్లు కేటాయించారు. నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ మండలాల దాహార్తిని తీర్చేందుకు ఉద్దేశించిన నక్కలగండి ఎత్తిపోతల పథకాన్ని ఆర్థికమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించినప్పటికీ దానికి ప్రత్యేకంగా నిధులు మాత్రం కేటాయించలేదు. ‘పాలమూరు’కు పండగే! పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించారు. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు ఈ ఏడాది అనుకున్న స్థాయిలో నిధులు దక్కాయి. మొత్తంగా 942.50 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే సుమారు 70 టీఎంసీల కృష్ణా జలాలు వినియోగంలోకి వస్తాయి. దీంతో వచ్చే ఖరీఫ్ నాటికే 3 లక్షల ఎకరాలకు నీరందించే అవకాశముంటుంది. ఇప్పటికే భూసేకరణ, పునరావాస చర్యలు కొలిక్కి రావడంతో భారీ కేటాయింపులకు ప్రభుత్వం మొగ్గు చూపింది. సుమారు రూ. 16 వేల కోట్లతో చేపట్టనున్న పాలమూరు ఎత్తిపోతల పథకానికి తొలి ఏడాది రూ. 100 కోట్లు కేటాయించింది. జూరాల-పాకాల వరద కాల్వకు మాత్రం కేవలం 3.60 కోట్లతో సరిపెట్టింది. అలాగే కరీంగనర్ జిల్లాలోని ఎల్లంపల్లికి రూ. 558 కోట్లు (గత బడ్జెట్లో రూ. 237 కోట్లు), ఎస్సారెస్పీ వరద కాల్వకు రూ. 747 కోట్లు (గతంలో రూ. 200 కోట్లు) ఇవ్వడం ఊహించని విషయం. ఆదిలాబాద్ జిల్లాలో పనులు చివరి దశలో ఉన్న మధ్యతరహా ప్రాజెక్టులు సాత్నాల, సుద్దవాగు, గొల్లవాగు, జగన్నాథ్‌పూర్ పెద్దవాగు, రాలీ వాగు ప్రాజెక్టులకు గతంలో కంటే కేటాయింపులు పెరిగాయి. వీటికి సుమారు రూ. 80 కోట్ల మేర నిధులు దక్కాయి. ‘ప్రాణహిత’కు కోత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు బడ్జెట్లో భారీ కోత పడింది. గత ఏడాది భారీగా నిధులిచ్చిన సర్కారు.. ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా తగ్గించింది. గత బడ్జెట్లో రూ. 1820 కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ. 1515 కోట్లకు పరిమితం చేసింది. కాగా, ఈ ప్రాజెక్టులో భాగంగా మెదక్ జిల్లాల్లో నిర్మించదలచిన తడ్కపల్లి, పాములపర్తి రిజర్వాయర్ల సామర్థ్యాన్ని 5 టీఎంసీల నుంచి 51 టీఎంసీలకు పెంచుతామని మాత్రం ముఖ్యమంత్రి తన ప్రసంగంలో వెల్లడించారు. వీటికి రూ. వెయ్యి కోట్ల మేర అవసరమని అధికారులు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపారు. ప్రాణహిత ప్రాజెక్టు వ్యయ అంచనా రూ. 38,500 కోట్లు కాగా, ఇప్పటికి రూ. 36,257 కోట్లకు ఒప్పందాలు జరిగాయి. ఇందులో ఇప్పటివరకు రూ. 8 వేల కోట్ల మేర మాత్రమే పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఈసారి నిధులు అంతంతమాత్రంగానే ఇవ్వడంతో ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందన్నది చర్చనీయాంశమైంది. బడ్జెట్ కేటాయింపులు(రూ. కోట్లలో..) దేనికి ఎంత? (రూ. కోట్లలో..) భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు -9,052.17 చిన్న నీటి పారుదల రంగం - 2,232.76 క్యాడ్, వరద కాల్వల నిర్వహణ- 398.98 కేటాయింపుల కన్నా ఖర్చే ముఖ్యం బడ్జెట్ కేటాయింపులు అనుకున్నట్టే ఉన్నాయి. పాలమూరు జిల్లాకు అంచనాలకు తగ్గట్లు కేటాయించారు. అయితే పనులు జరగడం ముఖ్యం. జిల్లాలోని నాలుగు ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే 7 లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. నక్కలగండి ఎత్తిపోతలపై స్పష్టత లోపించింది. రూ. 6 వేల కోట్ల విలువైన పనులకు ప్రత్యేకంగా కేటాయింపులి ఆవ్వల్సింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకూ వెయ్యి కోట్లు కేటాయిస్తే బాగుండేది. - రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం అధ్యక్షుడు శ్యాంప్రసాద్‌రెడ్డి -
వర్సిటీలకు ఊరట!
రూ. 416.15 కోట్లు కేటాయింపు.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు బడ్జెట్లో కొంత ఊరట లభించింది. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ మినహా మిగతా అన్ని వర్సిటీలకు కొంత మేర కేటాయింపులను పెంచారు. ముఖ్యంగా ఉస్మానియా వర్సిటీకి కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇచ్చారు. బడ్జెట్లో యూనివర్సిటీలకు రూ. 416.15 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ రూ. 291.76 కోట్లతో పోల్చితే ఇది రూ. 124.39 కోట్లు అదనం. అయితే వర్సిటీలు అడిగిన నిధులతో పోల్చితే ఈ కేటాయింపులు తక్కువే కావడం గమనార్హం. ఉస్మానియా వర్సిటీకి గత బడ్జెట్లో రూ. 170.14 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 238.19 కోట్లు కేటాయించారు. ఇక కాకతీయ వర్సిటీకి రూ. 19.15 కోట్లను, శాతవాహన వర్సిటీకి రూ. 13.43 కోట్లను అదనంగా కేటాయించారు. ఆర్థిక మంత్రి ఈటెల సొంత జిల్లా కరీంనగర్లో ఉన్న శాతవాహన వర్సిటీకి కొంత వరకు ఎక్కువ కేటాయింపులు చేశారు. ఇక పదో షెడ్యూల్లో ఉన్న తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, చిత్తూరులోని ద్రవిడ వర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలకు రాష్ట్ర వాటా కింద నిధులు కేటాయించారు. సాంకేతిక విద్యకు ప్రాధాన్యం: ఈసారి బడ్జెట్లో సాంకేతిక విద్యకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. గత బడ్జెట్లో ప్రణాళికేతర వ్యయం కింద రూ. 181.11 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ. 253.80 కోట్లకు పెంచారు. ప్రణాళికా వ్యయం కింద గతేడాది రూ. 212.85 కోట్లు ఇవ్వగా... ఈసారి రూ. 255.41 కోట్లు కేటాయించారు. సాధారణ యూనివర్సిటీలే కాకుండా హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ ్ట్స వర్సిటీకి, జేఎన్టీయూ, దాని పరిధిలోని కాలేజీలకు నిధులను పెంచారు. జేఎన్టీయూకు గత ఏడాది రూ. 39.60 కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ. 55.44 కోట్లకు పెంచారు. అంటే అదనంగా రూ. 15.84 కోట్లు కేటాయించారు. జీతాలకే సరిపోవు? వాస్తవానికి గత ఏడాది బడ్జెట్‌పైనే పెదవి విరిచిన విశ్వవిద్యాలయాలు ఈసారి భారీగా నిధులు ఇవ్వాలని కోరాయి. మొత్తంగా దాదాపు రూ. 310 కోట్లకుపైగా అదనంగా నిధులివ్వాలని కోరాయి. కానీ ప్రభుత్వం అదనంగా ఇచ్చింది. రూ. 124 కోట్లు మాత్రమే. మొత్తంగా వర్సిటీలకు ఈసారి బడ్జెట్ కేటాయింపులు ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకే సరిపోతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరిశోధనలకు, ఆవిష్కరణలకు అవకాశమే ఉండదనే వాదన వినిపిస్తోంది. -
వడివడిగా తొలి అడుగులు
మా బాట.. బంగారు తెలంగాణ బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సవాళ్లను అధిగమించి ముందుకు సామాజిక, ఆర్థిక పునర్నిర్మాణమే లక్ష్యం సొంత వనరులతో నవ తెలంగాణ ఆవిష్కరణ సంక్షేమం, వ్యవసాయం, పరిశ్రమలకు ప్రాధాన్యం అంగన్వాడీలకు జీతాల పెంపు, బీడీ కార్మికులకు వెయ్యి భృతి సాక్షి, హైదరాబాద్: ‘వెయ్యి మైళ్ల దూరాన్ని చేరుకోవాలనే లక్ష్యాన్ని మొదటి అడుగుతోనే ప్రారంభించాలి.. బంగారు తెలంగాణను సాధించే క్రమంలో ఎన్నో వ్యయప్రయాసలు ఉన్నప్పటికీ మా ప్రభుత్వం దృఢంగా.. వడివడిగా ప్రయాణం ప్రారంభించింది. గమ్యాన్ని చేరుకునే వరకు ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ మా ముఖ్యమంత్రి వెనుతిరిగి చూడరు. ఇది చరిత్ర నిరూపించిన సత్యం. మా ప్రభుత్వం చేతల ప్రభుత్వం. అందుకు తొమ్మిది నెలల అతి తక్కువ కాలంలో అనుసరించిన విధానమే నిదర్శనం. బడ్జెట్ అంటే చిట్టా పద్దుల పట్టిక కాదు.. జీవంలేని అంకెలు, సారం లేని గణాంకాలు కాదు. బడ్జెట్ అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, వారి కళ్లలో తొణికిసలాడుతున్న కలలు. వారి ఆశలని ఆకాంక్షలని నిజం చేసే నిర్మాణాత్మకమైన ప్రణాళిక. ప్రజాధనాన్ని ప్రజల నిజమైన అభివృద్ధికి వెచ్చించే గంభీరమైన, బాధ్యతాయుతమైన ప్రక్రియ. ఈ బడ్జెట్ తెలంగాణ నెలకొల్పిన సామాజిక విలువల ఆధారంగా రూపొందించిన సజీవ ఆర్థిక ప్రణాళిక..’ అని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో ప్రకటించారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఆయన2015-16 వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ‘ఇప్పుడు ప్రవేశపెడుతున్నది పూర్తి అవగాహనతో, స్పష్టతతో, సమన్వయంతో రూపొందించిన పూర్తిస్థాయి బడ్జెట్. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ర్ట ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం అట్టడుగు వర్గాల నిజమైన అభివృద్ధికి రూపొందించిన పథకాల సమాహారమే ఈ బడ్జెట్. 14వ ఆర్థిక సంఘం నివేదిక ఒక చారిత్రక సత్యాన్ని రుజువు చేసింది. దేశంలో గుజరాత్, తెలంగాణను మిగులు రాష్ట్రాలుగా గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థిక లోటు ఎదుర్కొంటున్న రాష్ట్రంగా ప్రకటించింది. రాష్ట్ర ప్రజల శ్రేయోసంక్షేమాలే ప్రభుత్వానికి గీటురాయి. అదే స్ఫూర్తితో మూడు ప్రాధమ్యాలను గుర్తించాం. అవి బలహీన వర్గాల సంక్షేమం, వ్యవసాయం-అనుబంధ రంగాల వికాసం, పారిశ్రామిక అభివృద్ధి. ఇవి ప్రాధమ్యాలే కాదు.. మా ప్రభుత్వం ఎంచుకున్న సిద్ధాంతాలు’ అని ఈటెల వివరించారు. వృద్ధి రేటుపై ఆశలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాభివృద్ధి ఆశాజనకంగా ఉంటుందని ఆర్థిక మంత్రి అంచనా వేశారు. కొన్నేళ్లుగా తిరోగమనంలో ఉన్న వృద్ధి రేటు గత ఏడాది నుంచే పెరుగుతోందన్నారు. ‘2011-12 నుంచి రాష్ర్ట ప్రగతి కుంటుపడింది. 2004-09 మధ్య 12.87 శాతంగా ఉన్న సగటు వృద్ధి.. 2012-13 నాటికి 4.1 శాతానికి పడిపోయింది. 2014-15లో 5.3 శాతం ఆర్థికాభివృద్ధి ఉండవచ్చని అంచనా. రుతు పవనాలు ఆలస్యంగా రావడం, తక్కువ వర్షపాతం వల్ల వ్యవసాయ రంగం కుదేలైంది. అయితే పారిశ్రామిక, సేవా రంగాలు నిలదొక్కుకోవడం ఆశలకు జీవం పోసింది. సేవా రంగంలో అభివృద్ధి ప్రస్తుతం 9.7 శాతానికి పెరిగింది. ఇక పారిశ్రామిక వృద్ధి గత సంవత్సరం 0.1 శాతంగా ఉంటే ఇప్పుడది 4.1 శాతానికి చేరింది. జాతీయ స్థాయిలో ఆర్థిక రంగ పురోగమనానికి తోడు రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నాను’ అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. వ్యాట్, భూ క్రమబద్ధీకరణ మినహా గత బడ్జెట్లో సమర్పించిన పన్నులు, పన్నేతర ఆదాయాలు దాదాపుగా గాడిలోనే ఉన్నాయని తెలిపారు. క్రమబద్ధీకరణ వల్ల పేదలకు కనీసం రూ. 30 వేల కోట్ల ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేశారు. ఎన్నో సవాళ్లు ఎదురైనా.. అఖిల భారత సర్వీసు అధికారులను రాష్ట్రానికి కేటాయించడంలో తీవ్ర జాప్యం జరిగిందని, రాష్ట్ర స్థాయి సిబ్బంది విభజన కూడా ఇంకా పూర్తి కాకపోవడంతో పాలనలో ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పలేదని ఈటెల వివరించారు. అయినా చురుగ్గా నిర్ణయాలు తీసుకుంటూ పాలనను గాడిన పెట్టిన ఘనత తమదేనన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేయకుండా నిరాటంకంగా నిధులు మళ్లించారని, 14వ ఆర్థిక సంఘం నివేదికతో ఈ విషయం తేటతెల్లమైందని మంత్రి అన్నారు. తెలంగాణలోని మిగులు ఆదాయ వనరులను ఆంధ్రప్రదేశ్‌కు మళ్లించినట్లు ఆర్థిక గణాంకాలను బట్టి స్పష్టమవుతోందన్నారు. ప్రస్తుతం సొంత రాష్ర్టంలో సొంత వనరులను సద్వినియోగం చేసుకుని నవ తెలంగాణను ఆవిష్కరించేందుకు సామాజిక, ఆర్థిక పునర్నిర్మాణానికి బడ్జెట్లో ప్రాధాన్యతనిచ్చినట్లు తెలిపారు. సంక్షేమ పథకాల ఏకరువు రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పలు పథకాలను ఈటెల ప్రధానంగా ప్రస్తావించారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు ముస్లిం, సిక్కు, దళిత క్రిస్టియన్ వర్గాలకు చెందిన పేద ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ప్రభుత్వం తెచ్చిన ‘షాదీ ముబారక్ పథకం’ ప్రజల మన్ననలు అందుకుంటోందన్నారు. అర్హులైన ఆడపిల్లల బ్యాంకు ఖాతాల్లో ముహూర్తం రోజు కంటే ముందే రూ. 51,000 జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వంపై పడుతున్న భారాన్ని కూడా లెక్క చేయకుండా ‘ఆసరా’ పథకం కింద అనేక వర్గాల వారికి పింఛన్లు అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. వృద్ధులు, వితంతువులకు రూ. 1,000, వికలాంగులకు రూ. 1,500 రూపాయలను ఇస్తున్నామని, పింఛన్ల పెంపువల్ల ప్రభుత్వంపై ఏటా రూ. 4,000 కోట్ల భారం పెరిగిందని చెప్పారు. అలాగే బీడీ కార్మికుల కష్టాలను అర్థం చేసుకుని నెలకు రూ. 1,000 భృతిని ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తాజా బడ్జెట్లో ఇందుకు రూ. 188 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తల నెల జీతాన్ని రూ. 4,200 నుంచి రూ. 7,000కు, సహాయకుల నెల జీతాన్ని రూ. 2,450 నుంచి రూ. 4,500కు పెంచినట్లు ఈటెల ప్రకటించారు. వంట పాత్రల కొనుగోలు కోసం ప్రతి కేంద్రానికి రూ. 1,000 చొప్పున గ్రాంటును ప్రకటించారు. కేంద్ర తోడ్పాటు తగ్గినా అంగన్వాడీలకు రాష్ర్టం చేయూతనిస్తోందన్నారు. అందుబాటులో 20 లక్షల ఎకరాలు ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో సాగుకు పనికిరాని భూమి 20 లక్షల ఎకరాలు ఉందని, అందులో పరిశ్రమలకు అనువైన భూమిని గుర్తించి పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తామని మంత్రి చెప్పారు. ‘2015-16 సంవత్సరంలో హైదరాబాద్- వరంగల్ పారిశ్రామిక కారిడార్, వరంగల్‌లో వస్త్రోత్పత్తి పరిశ్రమ, కొత్తగా రానున్న ఫార్మాసిటీ, ఇండస్ట్రియల్ పార్కులకు అనుసంధానంగా మినీ పారిశ్రామిక టౌన్‌షిప్‌ల అభివృద్ధికి సర్కారు నిర్ణయించింది. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే దళితులకు రుణ సౌకర్యం కల్పించి ప్రోత్సహిస్తాం. హైదరాబాద్‌కు సమీపంలోని ముచ్చర్ల ప్రాంతంలో 11వేల ఎకరాల్లో ఫార్మా సిటీని అభివద్ధి చేస్తాం’ అని ఈటెల పేర్కొన్నారు. సోలార్ పవర్‌ను ప్రోత్సహిస్తాం రాష్ట్రంలోని 19.53 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు రోజుకు ఏడు గంటల పాటు విద్యుత్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, సంప్రదాయ విద్యుత్‌తో పాటు సోలార్ పవర్‌నూ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని మంత్రి వెల్లడించారు. సంప్రదాయేతర ఇంధన వనరుల స్థాపనకు కేంద్ర సబ్సిడీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 20 శాతం సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. గృహావసరాల కోసం కిలోవాటు సామర్థ్యంగల 4000 సోలార్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తామన్నారు. 2018 నాటికి రాష్ర్టం మిగులు విద్యుత్ సాధిస్తుందని పేర్కొన్నారు. కాగా, 108 అంబులెన్స్‌ల సంఖ్యను 337 నుంచి 506కు పెంచుతున్నట్లు ఈటెల ప్రకటించారు. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవల కోసం 104 సర్వీసులను మెరుగుపరచడానికి నిర్ణయించామన్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధికి ఈ ఏడాది రూ. 100 కోట్లు మంజూరు చేశామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ నిధులిస్తామని మంత్రి వెల్లడించారు. సీఎంపై ప్రశంసల జల్లు ఈటెల రాజేందర్ తన బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయన పోరాట పటిమను పలుమార్లు కొనియాడారు. ‘ఎవరైతే కాయలు కాసిన భుజాల మీద ఉద్యమ భారాన్ని మోసినారో.. ఎవరైతే క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై వారి ఆకాంక్షలను, అవసరాలను అర్థం చేసుకున్నారో.. ఎవరు ప్రజలను ఒక్క తాటి మీద నడిపించినారో.. ఎవరు త్యాగాలకు వెనుదీయకుండా యుద్ధరంగంలో ముందుండి నడిచారో.. ఎవరు పోరాటాన్ని విజయ తీరానికి చేర్చి గమ్యాన్ని ముద్దాడినారో.. వారి నేతృత్వంలోనే ఏర్పడిన ప్రభుత్వం.. తెలంగాణను అభ్యుదయ పథంలో నడిపించేందుకు నిజాయితీగా రూపొందించిన ఆర్థిక ప్రణాళికల సారమే ఈ బడ్జెట్’ అని ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు. -
దాగుడుమూతలు
లోటును దాచి మిగులు ప్రసంగంలో రూ. 20,277 కోట్ల లోటు ప్రస్తావన రాష్ట్రం తప్పేమీ లేదు...తప్పంతా కేంద్రానిదే: ఈటెల లోటును చూపించకుండాబడ్జెట్ గణాంకాల్లో దాటవేత నిరుటి అంచనాలనే సవరణలుగా చూపించి గారడీ సాక్షి, హైదరాబాద్: ఆదాయ వనరుల్లో లోటు ఉన్నా.. తెలంగాణ మిగులు రాష్ట్రంగా చెప్పుకునేందుకు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అంకెల గారడీ చేశారు. 2014-15 బడ్జెట్ అంచనాలకు సంబంధించిన రాష్ట్ర ఆదాయ వనరుల్లో రూ.20,277 కోట్ల లోటు ఉందని స్వయంగా వెల్లడించారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం తప్పేమీ లేదని.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు బాగా తగ్గినట్లు తన ప్రసంగంలో విశ్లేషించారు. కానీ.. ఈ లోటు మేరకు నిరుటి బడ్జెట్‌ను సవరించారా.. లేదా..? దీని ప్రభావం ఏయే రంగాలపై పడింది.. ఏయే విభాగాలు, పథకాలకు కేటాయింపులు తగ్గాయి..? అనే వివరాలను శాసనసభకు సమర్పించకుండా గోప్యంగా ఉంచారు. కనీసం ఆ మేరకు లోటును సవరించిన బడ్జెట్ గణాంకాలను పొందుపరచకుండా దాట వేశారు. బడ్జెట్ పుస్తకాలు, విభాగాల వారీగా ఇచ్చిన పద్దుల చిట్టాల్లో నిరుటి బడ్జెట్ అంచనాలను.. యథాతథంగా సవరించిన అంచనాలుగా పునర్ ముద్రించడం గమనార్హం. ఆర్థిక లోటుకు రాష్ట్ర ఆదాయ వ్యయాలేవీ కారణం కాదని.. కేంద్రాన్ని వేలెత్తి చూపేందుకు ప్రభుత్వం ఎక్కువ మొగ్గు చూపించింది. ‘‘కేంద్రం నుంచి రావాల్సిన ప్రణాళిక, ప్రణాళికేతర నిధుల్లో తరుగు, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్‌లో పరిహారం, ప్రత్యేక ఆర్థిక సాయం రాకపోవడం.. రుణ పరిమితి పెంపును సడలించకపోవడం... ఇవన్నీ కలిపితే రాష్ట్ర ఆదాయ వనరుల్లో రూ.20,277 కోట్ల లోటు ఏర్పడింది..’ అని ఈటెల వెల్లడించారు. ‘కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు బాగా తగ్గాయి. అంచనాల ప్రకారం వచ్చి ఉంటే.. రాష్ట్ర ఆదాయ వ్యయాలను మరింత సమర్థవంతంగా నిర్వహించగలిగే వాళ్లం. రాష్ట్ర బడ్జెట్లో గత ఏడాది కేంద్రం నుంచి రావల్సిన ప్రణాళికా సాయం రూ.11,781 కోట్లకు గాను 2015 ఫిబ్రవరి వరకు రూ.4,147 కోట్లు మాత్రమే వచ్చాయి. ప్రణాళికేతర గ్రాంట్లు రూ. 9,939 కోట్లు కాగా, రూ.1,346 కోట్లు మాత్రమే అందాయి. ప్రతిపాదించిన మొత్తంలో కేవలం 14 శాతం నిధులు. ఎఫ్ఆర్బీఎం (ఫిస్కల్ రెస్పాన్సిబులిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్) చట్టం కింద కొంతమేర అప్పు తెచ్చుకునే అవకాశం రాష్ట్రాలకు ఉంటుంది. ఈ పరిమితిని సడలించి మరో రూ. 4 వేల కోట్ల అప్పు తెచ్చుకునేందుకు రాష్ట్రానికి అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. కేంద్రం నుంచి ఇంతవరకు ఏ సమాధానమూ రాలేదు. దీనికి తోడు కేంద్ర ప్రణాళికా నిధుల కేటాయింపుపై చాలా ఆలస్యంగా.. ఫిబ్రవరిలో సమాచారం అందించింది..’ అంటూ ఆదాయ వనరుల్లో లోటుకు కారణాలను ఆర్థిక మంత్రి ఈటెల ప్రసంగంలో ప్రస్తావించారు. ద్రవ్యలోటుపై కేంద్రంతో పేచీ అప్పులకు రాష్ర్టం తిప్పలు పడుతోంది. అనుకున్నన్ని అప్పులు తీసుకునేందుకు కేంద్రం విధించిన నిబంధనలు తెలంగాణకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. అందుకే ద్రవ్యలోటు (అప్పులు తెచ్చుకునే పరిమితి) విషయంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని నిందించింది. ‘కేంద్ర ప్రభుత్వం 2015-16 బడ్జెట్ ప్రతిపాదనల్లో జీడీపీలో 3.9 శాతం ద్రవ్యలోటుగా చూపించింది. కానీ రాష్ట్రాలకు జీఎస్డీపీలో 3 శాతానికి ద్రవ్యలోటును పరిమితం చేయడం విచిత్రమైన విషయం. 14వ ఆర్థిక సంఘం కొన్ని నిబంధనలకు లోబడి రాష్ట్రాల అప్పుల పరిమితిని 3.5 శాతానికి పెంచింది. ఈ సిఫారసుపై నేటికీ కేంద్రం నిర్ణయం తీసుకోలేదు..’ అని తప్పు బట్టింది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం.. జీఎస్డీపీలో 3 శాతానికి మించి రాష్ట్రాలు అప్పుగా తెచ్చుకునే అవకాశం లేదు. అంతకంటే ఎక్కువ అప్పులు కావాలంటే కేంద్రం అనుమతించాల్సి ఉంటుంది. గత ఏడాది బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం జీఎస్డీపీలో ద్రవ్యలోటు 4.79 శాతం.. 17,398.72 కోట్లుగా అంచనా వేసుకుంది. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచాలని కోరితే కేంద్రం నుంచి స్పందన లేదు. దీంతో రూ.10 వేల కోట్ల రుణాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అప్పటికీ గుణపాఠం నేర్వని ప్రభుత్వం ఈసారి బడ్జెట్లోనూ ద్రవ్యలోటును ఎక్కువగానే చూపించింది. 2015-16 బడ్జెట్లో ద్రవ్యలోటు 3.49 శాతం రూ.16,969 కోట్లు అంచనా వేసుకుంది. కేంద్రం అనుమతించకపోతే ఈసారి కూడా మూడు శాతానికి మించి అప్పులు తెచ్చుకోవటం కుదరని పరిస్థితి ఉంటుంది. -
హెచ్ఎండీఏకు అంతంతే...
సిటీబ్యూరో: నగరాభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్న హెచ్ఎండీఏకు గ్రాంట్ రూపంలో నేరుగా అందించే నిధులు విషయంలో ప్రభుత్వం మళ్లీ మొండిచెయ్యి చూపింది. ప్రస్తుతం అమలవుతున్న ప్రాజెక్టులకు ‘జైకా’ నుంచి తీసుకున్న రుణాలనే నిధులుగా బడ్జెట్లో చూపించారు. ప్రతిష్టాత్మకమైన ఔటర్ రింగ్‌రోడ్డు, హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంత అభివృద్ధి పనులకు రుణ రూపంలో విదేశీ సాయం పొందేలా ప్రభుత్వం బడ్జెట్లో రూ.250కోట్లు కేటాయించింది. ఓఆర్ఆర్ కాంట్రాక్టు సంస్థలకు యాన్యుటీ పేమెంట్‌కు రూ.415 కోట్లు కోరితే... రూ.345.83 కోట్లు ఇచ్చింది. కొత్త ప్రాజెక్టులకు ప్రణాళికేతర వ్యయంలో రూ.1043.30 కోట్లు కోరగా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. గత ఏడాది బడ్జెట్లో రూ.1985.50 కోట్లు ప్రతిపాదించగా కేవలం రూ.338 కోట్లు కేటాయించి చేతులు దులుపుకొంది. ఈ ఏడాది(2015-16) కూడా రెగ్యులర్ స్కీంల కింద ఔటర్ యాన్యుటీ పేమెంట్‌కు, బాపూఘాట్ బ్రిడ్జికి రూ.416 కోట్లు కోరగా... రూ.250కోట్లు కేటాయించింది. అన్నీ బుట్టదాఖలే... హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్ పరిధిలోని పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులకు రూ.538 కోట్లు కోరగా... ప్రభుత్వం బుట్ట దాఖలు చేసింది. హుస్సేన్‌సాగర్ పరిధిలోని ఎస్టీపీలు, ఐ అండ్ డిల నిర్వహణకు బడ్జెట్లో పైసా కూడా కేటాయించకపోవడంతో సాగర్ నిర్వహణ హెచ్ఎండీఏకు మోయలేని భారంగా మారనుంది. ప్రస్తుతం వాటికి నెలవారీగా రూ.75 లక్షలు కరెంటు బిల్లులు చెల్లిస్తున్నారు. హరితహారానికి రూ.70 కోట్లు ఇవ్వాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పక్కకు పెట్టేసింది. ఔటర్ రింగ్‌రోడ్డులో భూములు కోల్పోయిన బాధితులకు ప్రత్నామ్నాయ ప్లాట్లు ఇచ్చేందుకు కొహెడలో మెగా లేఅవుట్ అభివృద్ధికి రూ.11.40 కోట్లు, ఓఆర్ఆర్ భూ నిర్వాసితుల పరిహారానికి రూ.261.40 కోట్లు కావాలని కోరగా.. సర్కార్ వాటిని పరిగణనలోకే తీసుకోలేదు. చిలుకూరు రిజర్వ్ ఫారెస్టులో కాంపౌండ్ వాల్ నిర్మించేందుకు రూ.9.90 కోట్లతో ప్రతిపాదనలు పంపగా.. వాటిని సైతం పక్కన పెట్టేసింది. -
మొండి చెయ్యే!
- ఊరించి.. ఉసూరుమనిపించిన బడ్జెట్ - జిల్లా వాసులను తీవ్ర నిరాశపరిచిన పద్దు - సాగునీటి కోసం అత్తెసరు నిధులు - కేవలం రూ.81లక్షలతో సరిపెట్టిన వైనం - పాలమూరు ఎత్తిపోతలకు రూ.100 కోట్లే - జీతాల పెంపుతో అంగన్వాడీ వర్కర్లలో ఆనందం సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2015-16 ఆర్థిక బడ్జెట్ జిల్లా ప్రజానికాన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారం చేపట్టిన టీఆర్ఎస్ సర్కారు తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజల్లో సరికొత్త ఆశలు చిగురించాయి. ఫార్మా సిటీ, ఫిల్మ్ సిటీ అంటూ సర్కారు హడావుడి చేయడం.. మరోవైపు క్రమబద్ధీకరణతో భారీగా ఖజానా నింపుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో జిల్లాను ఆర్థికంగా బలోపేతం చేస్తుందని భావించారు. కానీ బుధవారం నాటి బడ్జెట్ నిరుత్సాహానికి గురిచేసింది. జిల్లాలో వ్యవసాయ రంగాన్ని సస్యశ్యామలం చేస్తామని సీఎం కేసీఆర్ ఎన్నికల వాగ్దానాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. కానీ సాగునీరు అందించే పాలమూరు ఎత్తిపోతల పథకానికి తాజా బడ్జెట్లో కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారు. అయితే ఈ నిధులు సర్వే పనులకు అంతంతమాత్రంగా సరిపోనుండగా.. ఈ ప్రాజెక్టు తొలదశలో జిల్లాకు స్థానం లేకుండా పోయింది. ఫలితంగా తాజా బడ్జెట్లో జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యకు ఏమాత్రం పరిష్కరం లభించలేదని స్పష్టమవుతోంది. రూ. 81.81లక్షలు మాత్రమే.. - ఇక జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం కేవలం రూ.81.81 లక్షలు మాత్రమే విదిల్చింది. చిన్ననీటి ప్రాజెక్టులైన జుంటుపల్లి, లక్నాపూర్, కోటిపల్లి ప్రాజెక్టుల మరమ్మతులు, అభివృద్ధికి ఈ నిధులు కేటాయిం చింది. జుంటుపల్లి ప్రాజెక్టుకు అత్యల్ప ంగా రూ.2.74లక్షలు కేటాయిం చగా, లక్నాపూర్ ప్రాజెక్టుకు రూ.46.06 లక్షలు, కోటిపల్లి ప్రాజెక్టుకు రూ.33.01లక్షలు మంజూరు చేసింది. - పర్యటక ప్రాంతంగా అనంతగిరిని తీర్చిదిద్దుతామని ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. తాజాగా నగరంలోని పిచ్చాస్పత్రి, క్షయ ఆస్పత్రులను అనంతగిరికి తరలించారు. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో అనంతగిరికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే వికారాబాద్ వాసులకు కొంతైనా ఊరట లభించేది. కానీ ప్రభుత్వం పర్యటక అభివృద్ధిపై ప్రత్యేకించి అనంతగిరికి ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకపోవడం గమనార్హం. - పారిశ్రామికంగా జిల్లాను ముందుకు తీసుకెళ్తామని సీఎం కేసీఆర్ ఇటీవల పలు సందర్భాల్లో జిల్లానుద్దేశించి ప్రకటనలు చేశారు. ఈ క్రమంలో ఫార్మాసిటీ, ఫిల్మ్‌సిటీ ఏర్పాటు చేస్తామంటూ ఏరియల్ సర్వేచేసి హడావుడి చేశారు. వీటిని తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మక ప్రాజెక్టులంటూ హడావుడి చేసిన ప్రభుత్వం.. తాజా బడ్జెట్లో వీటిపై ప్రత్యేకంగా పేర్కొన అంశాలేవీ లేవు. జిల్లాలో గత ప్రభుత్వాలు వేల ఎకరాల భూములను సేకరించి ఆర్థిక మండళ్లకు కట్టబెట్టింది. ఈ క్రమంలో స్థానిక రైతాంగం తీవ్రంగా నష్టపోగా.. కనీసం ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా చేతులు దులుపుకుంది. తాజాగా ఫార్మాసిటీ, ఫిల్మ్‌సిటీల పేరిట వేలాది ఎకరాల భూములను గుర్తించి ఏరియల్ సర్వే చేపట్టారు. దీంతో ఈ భూములను సేకరిస్తే జిల్లా ఆస్తులు భారీగా అంతరించిపోనున్నాయి. దీంతో ప్రత్యామ్నాయంగా జిల్లా ప్రజలకు ఇతర ఉత్పాదక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో అవకాశం కల్పించాలి. కానీ ప్రభుత్వం తాజా బడ్జెట్లో ఇవేవీ ప్రస్తావించలేదు. కలల ప్రాజెక్టు ఊసేదీ? తెలంగాణ ప్రభుత్వ కలల ప్రాజెక్టుగా సీఎం కేసీఆర్ పలుమార్లు వేదికలపై ప్రకటించిన కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యపై తాజా బడ్జెట్లో ప్రస్తావన రాకపోవడంతో విద్యార్థిలోకం తీవ్ర నిరుత్సాహంలో మునిగింది. తొలి ఏడాది ఆర్నెళ్ల బడ్జెట్ అంటూ ప్రభుత్వం తప్పించుకుంది. తాజాగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున అందరూ కేజీ టూీ పజీపై గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ తాజా బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు పైసా నిధులు విడుదల చేయలేదు. దీంతో ఈ ఏడాది కూడా ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చేలా లేదు. బడ్జెట్లో కలల ప్రాజెక్టు ప్రస్తావన లేకపోవడంతో ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిధులు కేటాయించకుండా ప్రాజెక్టును ఎలా అమలు చేస్తారంటూ ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఈ మేరకు రాష్ట్రోపాధ్యాయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సదానంద్, ప్రవీణ్, ఏవీ సుధాకర్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆంజనేయులు, గాలయ్య, తెలంగాణ పీఆర్టీయూ ఉపాధ్యక్షులు సత్తారి రాజిరెడ్డి వేరువేరు ప్రకటనల్లో నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్లకు కానుక రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి భారీ బహుమతిని ప్రకటించింది. వారి వేతనాలను పెద్ద సంఖ్యలో పెంచింది. అంగన్వాడీ కార్యకర్త వేతనం రూ.4,200 నుంచి రూ.7 వేలకు పెంచింది. అదే విధంగా అంగన్వాడీ కేంద్ర సహాయకురాలి వేతనం రూ.2,450 నుంచి రూ.4,500కు హెచ్చించింది. ఈమేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ప్రస్తుతం జిల్లాలో 2,524 అంగన్వాడీ కేంద్రాలు, 269 మినీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 2,524 అంగన్వాడీ కార్యకర్తలు, 2,524 మంది సహాయకులు, 269 మినీ అంగన్వాడీ కార్యకర్తలున్నారు. తాజా ప్రభుత్వ ప్రకటనతో 5,317 మందికి లబ్ధి చేకూరనుంది. ఈ పెంపు ప్రభావంతో జిల్లాపై నెలకు రూ.1.28కోట్లు, ఏడాదిలో ఖజానాపై రూ.15.36 కోట్ల భారం పడనుంది. -
అవే ప్రాజెక్టులు...మారిన అంకెలు
తెలంగాణ కొత్త రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో అంకెలు మారాయి. జిల్లాలోదీర్ఘకాలికంగా కొనసా గుతున్న సాగునీటి ప్రాజెక్టులకు అటూఇటూగా మంత్రి ఈటెల రాజేందర్ అంకెలు మార్చి బడ్జెట్లో చూపెట్టారు. కొన్ని ప్రాజెక్టులకు నిధులు ఈసారి పెరిగితే, మరికొన్ని ప్రాజెక్టులకు తగ్గాయి. ఇంకొన్ని ప్రాజెక్టులపై ఎప్పటిలాగే ఈ బడ్జెట్ కూడా శీతకన్ను వేసింది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో కొత్తగా రెండు సాగునీటి ప్రాజెక్టులను ప్రతిపాదించిన ఆర్థిక మంత్రి వాటికి నిధులు మాత్రం చూపెట్టలేదు. అదే విధంగా దామరచర్ల పవర్‌ప్లాంటు గురించి ప్రత్యేక ప్రస్తావన లేకపోయినా, ఆ ప్రాజెక్టును బీహెచ్ఈఎల్తో కలిసి చేపడతామని తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పుకొచ్చారు. బీబీనగర్‌మండలం రంగాపూర్ నిమ్స్ అృవద్ధికి రూ.34కోట్లు చూపెట్టడంతో పాటు గత ఏడాదిలాగే యాదగిరిగుట్ట డెవలప్మెంట్ అథారిటీకి మరో రూ.100 కోట్లు కేటాయించారు. అదే విధంగా హైదరాబాద్ - వరంగల్ ఇండస్ట్రీయల్ కారిడార్, అంగన్వాడీల వేతనాల పెంపు, పోలీస్స్టేషన్ల నిర్వహణకు నిధుల కేటాయింపు లాంటి ఊరడింపులతో పాటు పిలాయిపల్లి, బునాదిగానికాల్వల పేర్లు కూడా ఈసారి బడ్జెట్లో లేకపోవడం, ఫ్లోరిన్ నివారణ కార్యక్రమాన్ని కేవలం వాటర్‌గ్రిడ్‌తో సరిపెట్టడం లాంటి నిరాశాజనక అంశాలూ ఈసారి బడ్జెట్లో కనిపించాయి. ‘సా....గు నీరేనా’? జిల్లాలో ఉన్న భారీ, మధ్యతరహా, చిన్న నీటి ప్రాజెక్టులకు కేటాయింపులు చూస్తే ఈ ప్రాజెక్టులు ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. చిన్ననీటి ప్రాజెక్టులకు మొండిచేయి.. జిల్లాలోని చిన్ననీటి ప్రాజెక్టులయిన డిండి, ఆసిఫ్‌నహర్, మూసీ ప్రాజెక్టులకు ఎప్పటిలాగేఈసారి కూడా మొండిచేయే చూపెట్టారు. డిండికి రూ.30లక్షలు, ఆసిఫ్‌నహర్‌కు రూ.80 లక్షలు, మూసీ ప్రాజెక్టు రూ.1కోటి చూపెట్టారు. ఇక, జిల్లాలోని దాదాపు 52వేల ఎకరాలకు సాగునీరందించే చొక్కారావు-దేవాదుల ఎత్తిపోతల పథకానికి రూ.388 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఈ ఏడాది ఈ ప్రాజెక్టు పూర్తికావచ్చనేది అంచనా. ఇక, జూరాల - పాకాల ప్రాజెక్టు సర్వే కోసంగత ఏడాది రూ.5 కోట్లు కేటాయించగా, ఈసారి దానిని రూ.3. 63 కోట్లకు తగ్గించారు. ఇక, జిల్లాలో తాగు, సాగునీటి కోసం రెండు కొత్త ప్రాజెక్టులను ప్ర కటిస్తున్నామని చెప్పారు ఈటెల రాజేం దర్. అందులో పాలమూరు ఎత్తిపోతల ఒకటి కా గా, నక్కల గండి ప్రాజెక్టు కింద 51టీఎంసీల సామర్థ్యం కల రెండు రిజర్వాయర్లను నిర్మిస్తామనడం మరోటి. అయితే, ఈ ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పినా, వీటికి ప్రత్యేక కే టాయింపులు చూపెట్టకపోవడం గమనార్హం. గత నాలుగేళ్లలో జిల్లాలోని భారీ సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులివి: (రూ.కోట్లలో) ప్రాజెక్టు 2012-13 2013-14 2014-15 2015-16 నాగార్జునసాగర్ 700 700 425 210 ఎస్ఎల్బీసీ 451 420 325 599 ఎస్సారెస్పీ-2 74 40 25 23 -
ఆశ..నిరాశ
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విపక్షాల నేతలు పెదవి విరుస్తున్నారు. ఇది ఆశ..నిరాశల బడ్జెట్ అని అభిప్రాయపడ్డారు. సంక్షేమ రంగానికి, సాగునీటి రంగానికి పెద్దపీట వేస్తామని ఎన్నికల ముందు చెప్పిన సీఎం కేసీఆర్ ఆ దిశగా కే టాయింపులు చేయలేదని విమర్శించారు. జిల్లాలో తాగు, సాగునీటి అవసరాలకు సంబంధించి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించలేదని పేర్కొన్నారు. బడ్జెట్ లెక్కలన్నీ అంకెల గారడీని తలపిస్తున్నాయని, గత బడ్జెట్ ఖర్చు వివరాలను ఈ బడ్జెట్లో చూపకపోవడం ప్రభుత్వ పనితీరు అద్ధంపడు తోందని దుయ్యబట్టారు. నల్లగొండ బడ్జెట్లో జిల్లాకు కేటాయింపులపై పెదవి విరుపు రాష్ట్ర బడ్జెట్లో బ్రాహ్మణుల సంక్షేమానికి సంబంధించిన ప్రస్తావన లేకపోవడం శోచనీయం. ధూపదీప నైవేద్యాల పథకం, పెంచిన నెలసరి భత్యానికి ఎలాంటి కేటాయింపులు చేయలేదు. హైదరాబాద్‌లో భ్రాహ్మణ భవన్ నిర్మిస్తామని ప్రకటించిన సీఎం, బడ్జెట్లో పైసా విది ల్చకపోవడం విచారకరం. సవరించిన బడ్జెట్లోనైనా బ్రాహ్మణుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. డి. వాసుదేవ శర్మ, అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడు అంగన్వాడీల వేతనాలు పెంపు నల్లగొండ: అంగన్వాడీల పోరాటం ఫలించింది. చాలీచాలనీ జీతాలతో కాలం వెళ్ల దీస్తున్న అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాల వేతనాలు పెంచుతూ రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించింది. దీనివల్ల జిల్లాలోని 4,202 మంది అంగన్ వాడీ కార్యకర్తలు , 1800 మంది ఆయాలకు మేలు చేకూరనుంది. కొద్ది రోజుల క్రితం సీఎం కేసీఆర్‌ను కలిసిన అంగన్ వాడీకార్యకర్తలు, ఆయాలు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఆరేళ్ల నుంచి జీతాలు పెంచలేదని, అరకొర జీతాలతో జీవనం సాగించడం కష్టంగా ఉందని తమ ఆవేదనను సీఎం ఎదుట వ్యక్తం చేయగా పెంచుతామని సీఎం హామీ ఇచ్చారు. ఈమేరకు బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధులు కేటాయించారు. దీంతో పాటు అంగన్ వాడీ కేంద్రాల నిర్వహణ సంవత్సరానికి కలిపి రూ. వెయ్యి కేటాయించారు. జిల్లాలో అంగన్ వాడీ కేంద్రాలు 3,801, మినీ అంగ న్ వాడీ కేంద్రాలు 401 ఉన్నాయి. ఈ కేంద్రాల్లో అంగన్ వాడీ కార్యకర్తలు 4,202 మ ంది పనిచేస్తున్నారు. వీరికి ప్రస్తుతం నెలసరి వేతనం రూ.4,200 చెల్లిస్తున్నారు. దీనిని రూ. 7 వేలకు పెంచారు. ప్రస్తుతం చెల్లిస్తున్న జీతం కంటే రూ.2,800 అదనంగా పెంచారు. ఈ పెంపు కారణంగా నెలకు జీతాల వ్యయం రూ.1,17,65,600 పెరిగింది. జిల్లాలో ఆయాలు (హెల్పర్స్) 3,801 మంది ఉన్నారు. వీరికి ప్రస్తుతం నెలసరి వేతనం రూ.22 00 చెలిస్తున్నారు. దీనిని రూ.4 వేలకు పెంచారు. ఒక్కో ఆయాకు నెలకు వేతనం రూ.1800 పెంచారు. ఈ ఆయా లకు చెల్లిస్తున్న నెలవారీ వేతనాల వ్యయం రూ.68,41,800 పె రిగింది. ఇదిలాఉంటే అంగన్ వాడీ కేంద్రాల మెయింటెన్స్ గ్రాంటు (నిర్వహణ ఖర్చుల కి ంద) ఏడాదిగాను రూ.వెయ్యి ఇవ్వనున్నారు. జిల్లాలోని 4,202 అంగన్ వాడీ కేంద్రాలకు ఏడాదికి మొత్తం మీద రూ.5,04,24 వేల గ్రాంటు రానుంది. జీతాల పెంపు హర్షణీయం అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాల జీతాలు పెంచక దాదాపు ఆరేళ్లైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అంగన్వాడీలకు జీతాలు పెంచడం హర్షణీయం. అంగన్ వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం నిర్వహణ గ్రాంటు మ ంజూరు చేయడం కూడా కొంతమేర సమస్యలు తీరుతాయి. - ఎన్. మోతీ, ఐసీడీఎస్ పీడీ ప్రభుత్వ అసమర్థత కనిపిస్తోంది తెలంగాణ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ చూపడం ప్రభుత్వం అసమర్థతకు నిదర్శనం. శ్రీశైలం ఎడమకాల్వ సొరంగ మార్గం పనులకు, ఫ్లోరైడ్ నివారణకు కేటాయింపులు జరపలేదు. శ్రీరాంసాగర్ లక్షల ఎకరాలకు ఆవశక్యతను ప్రాజెక్టు సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు. ఉత్పాదకత రంగాల మీద బడ్జెట్ కేటాయింపులు సరిపడా లేవు. - గట్టు శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ర్ట ప్రధానకార్యదర్శి బలహీన వర్గాలను మోసం చేశారు ఈ బడ్జెట్ పేద ప్రజలను మోసం చేసే విధంగా ఉంది. అంకెల గారడీ తప్ప అభివృద్ధి శూన్యం. గత సంవత్సర బడ్జెట్ వివరాలు ఈ బడ్జెట్లో ఇవ్వకపోవడం శోచనీయం. దేశ చరిత్రలో ఏ అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ విధంగా జరగలేదు. గత బడ్జెట్ పద్దుల గురించి ఈ బడ్జెట్లో ఖర్చు వివరాలు చూపకపోవడం ప్రభుత్వం దగా చేస్తుందని అర్థమవుతోంది. కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇళ్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్ బడ్జెట్లో ఒక్కరూపా యి కూడా కేటాయించలేదు. బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం మొండిచేయి చూపిం ది. - బూడిద భిక్షమయ్య గౌడ్, డీసీసీ అధ్యక్షుడు బంగారు తెలంగాణ సాకారం టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు బడ్జెట్ కేటాయింపులు చేశారు. మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, నక్కల గండి, ఎస్ఎల్బీసీ, ఇతర అభివృద్ధి సంక్షేమ పథకాలు మేళవింపు చేసి అన్ని రంగాలకు సముచితమైన స్థానం కల్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు ఇంత భారీ స్థాయిలో నిధులు ఎప్పుడు కేటాయించ లేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌తో బంగారు తెలంగాణ కల సాకారమవుతుంది. - బండా నరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఇది అంకెల బడ్జెట్ జిల్లా సమగ్రాభివృద్ధికి, సాగునీటి ప్రాజెక్టులకు సరైన నిధులను కేటాయించ లేదు. ఎన్నికల హామీలకు సంబంధించి ఏ ఒక్క అంశానికి న్యాయం చేకూర్చే విధంగా బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. దళితులకు భూపంపిణీ, కేజీ నుంచి పీజీ విద్య, రైతుల ఆత్మహత్యలు, ప్ర కృతి వైపరీత్యాల చెల్లింపులకు బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. దళిత, గిరిజన , మైనార్టీ, బీసీల సంక్షేమానికి సరైన నిధులు ఇవ్వలేదు. - నంద్యాల నర్సింహారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి మాటలు తప్ప చేతల్లేవు మసిపూసి మారేడుకాయ చేసిన విధంగా ప్రభుత్వం బడ్జెట్ లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వం మాటలు తప్ప చేతల్లేవు. నిరుద్యోగుల ప్రస్తావన లేదు. పేద ప్రజల సంక్షేమాన్ని నీరుగార్చే విధంగా బడ్జెట్ కేటాయింపులు చేశారు. సంక్షేమ రంగానికి పెద్ద పీట వేస్తామని చెప్పిన సీఎం ఆ దిశగా నిధులు కేటాయించకపోవడం విచారకరం. - బిల్యా నాయక్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రజలను విస్మరించిన బడ్జెట్ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రజలను పూర్తిగా విస్మరించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తామని చెప్పి భారీ నీటిపారుదలశాఖకు కేవలం రూ. 450 కోట్లు మాత్రమే కేటాయించారు. రైతులను విస్మరించి ఆత్మహత్యల గురించి మాట్లాడకపోవడం బాధాకరం. దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేస్తామని గత బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లు కేటాయించి కేవలం 1400 ఎకరాలు మాత్రమే కొనుగోలు చేశారు. ఈ బడ్జెట్లో కేవలం రూ.వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ బడ్జెట్ అంకెల గారడీగా ఉంది. రమావత్ రవీంద్రకుమార్, సీపీఐ శాసనసభాపక్ష నేత ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కేటాయింపులు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. ఎన్నికల ముందు సాగు,తాగునీటి ప్రాజెక్టులు, చెరువుల మరమ్మతులకు నిధులు ఇస్తామని, బడ్జెట్లో పూర్తి స్థాయి కేటాయింపులు చేయలేదు. ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలు సాగునీటిని ఇస్తామని ప్రస్తావనే లేదు. కేటాయించిన నిధులను విడుదల చేసి ఖర్చుచేయాలి. ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు అనుగుణంగా నిధుల కేటాయింపులు చేయాలి. - మల్లేపల్లి ఆదిరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి లేవు ఒక్కో ప్రాజెక్టుకు ఇలా... గుట్టకు మళ్లీ రూ.100 కోట్లు యాదగిరిగుట్ట అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో మరో రూ.100 కోట్లు చూపెట్టారు. గుట్ట డెవలప్మెంట్ అథారిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు ఈటెల. అయితే, గత ఏడాది కూడా అంతే కేటాయించగా, అందులో ఖర్చు కాని నిధులను కలిపి ఈ ఏడాది ఖర్చు చేస్తారని, దీనికి తోడు కార్పొరేట్ సంస్థల సాయం కూడా కలుస్తుంది కనుక గుట్ట అభివద్ధి పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని అధికార వర్గాలు అంటున్నాయి. నిధుల్లో కోత నాగార్జునసాగర్ ఆధునికీకరణకు భారీ స్థాయిలో నిధుల కోత విధించారు. గత ఏడాది ఇందుకోసం రూ.425 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి దానిని రూ.210 కోట్లకు తగ్గించింది. అందులో ప్రాజెక్టు ఆధునికీకరణకు కేటాయించింది రూ.154.68 కోట్లే. మరో రూ.12.50 కోట్లు డ్యాం భద్రత కోసం కేటాయించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చివరి భూముల వరకు నీరుపారే పరిస్థితి లేకపోగా, ఈసారి బడ్జెట్ తక్కువ కావడంతో ఇప్పటికి నీరు పారుతున్న కాల్వల మరమ్మతులు కూడా కష్టమేననే భావన వ్యక్తమవుతోంది. పవర్‌ప్లాంట్‌కు లైన్‌క్లియర్ ఈ ఏడాది మొత్తం 6600 మెగావాట్ల సామర్థ్యం కల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని, ఇందుకోసం విద్యుత్ శాఖకు 7,800 కోట్లకు పైగా కేటాయిస్తున్నామని చెప్పడం ద్వారా జిల్లాలో నిర్మించ తలపెట్టిన దామరచర్ల పవర్‌ప్లాంటు పనులు ఈ ఏడాదే ప్రారంభిస్తామని చెప్పారు ఈటెల. అయితే, ఈ ప్రాజెక్టును భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)తో కలిసి చేపడతామని, దేశంలోనే తొలిసారి జీటూజీ (గవర్నమెంట్ టు గవర్నమెంట్) పద్ధతిలో చేపట్టిన ఈ ప్రాజెక్టును ప్రధాని కూడా ప్రశంసించారని చెప్పారాయన. ఇక, హైదరాబాద్-వరంగల్ మధ్య పారిశ్రామిక కారిడార్‌ను నిర్మాణం చేపడతామని బడ్జెట్లో పేర్కొన్నారు. ఈ కారిడార్ ద్వారా జిల్లాలోని బీబీనగర్, భువనగిరి, ఆలేరు ప్రాంతాల్లో అభివద్ధి జరిగే అవకాశముంది. మరోవైపు రాచకొండ గుట్టల గురించి బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేకపోయినా, అసెంబ్లీ వాయిదా తర్వాత ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మాత్రం రాచకొండ గృట్టల అభివద్ధి గురించి ప్రస్తావించారు. అక్కడ 35వేల ఎకరాల్లో ఎలక్ట్రానిక్, హార్డ్‌వేర్ పార్కుతో పాటు చిత్రనగిరిని ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించడం గమనార్హం. తగ్గిన కేటాయింపులు.. మరో పెద్ద ప్రాజెక్టు అయిన ఎస్సారెస్పీ రెండోదశకు ఈసారి కూడా కేటాయింపులు తగ్గాయి. గత ఏడాది బడ్జెట్ కన్నా ఈసారి రూ.రెండు కోట్లు తగ్గించి కేవలం రూ.23 కోట్లతోనే సరిపెట్టారు. దాదాపు రూ.1000 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకు గత నాలుగేళ్లలోనూ కలిపి కేవలం రూ.150 కోట్లే కేటాయించిన నేపథ్యంలో జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలకు తాగు, సాగునీరు అందడం ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. -
మహానందం
బడ్జెట్లో గ్రేటర్‌కు అగ్రతాంబూలం జీహెచ్ఎంసీకి రూ.628 కోట్లు జంట పోలీసు కమిషనరేట్లకు రూ.1112 కోట్లు జలమండలికి రూ.1000.11కోట్లు మెట్రో రైలుకు రూ.416 కోట్లు హెచ్ఎండీఏకు రూ.596.25 కోట్లు మైనార్టీల సంక్షేమం,అభివృద్ధికి రూ.550 కోట్లు పెన్షన్లు, సంక్షేమం, సామాజికాభివృద్ధికి రూ.219 కోట్లు నగరంలోని విశ్వవిద్యాలయాలకు రూ.583.21 కోట్లు ఎంఎంటీఎస్ రెండోదశకు రూ.20.83 కోట్లు {పభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులకు రూ.520 కోట్లు సిటీబ్యూరో: గ్రేటర్‌పై నిధుల వాన కురిసింది. అభివృద్ధి ‘భాగ్యం’ దక్కనుంది. ఈటెల బడ్జెట్ సిటీజనుల్లో మహానందాన్ని నింపింది. భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించింది. తాను కలలుగంటున్న విశ్వనగరం వైపు హైదరాబాద్‌ను నడిపించే దిశగా సీఎం కేసీఆర్ వేస్తున్న అడుగులకు బడ్జెట్ అద్దం పట్టింది. గత మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈసారి నిధులు దక్కడంతో వివిధ విభాగాల పరిధిలో అభివృద్ధి పథకాలు శరవేగంగా ముందుకు సాగనున్నాయి. జలమండలి ఆధ్వర్యంలో చేపట్టిన కృష్ణా మూడోదశ, గోదావరి మంచినీటి పథకం, జీహెచ్ఎంసీ పరిధిలో మంచినీటి సౌకర్యానికి సింహభాగం నిధులు కేటాయించారు. దీంతో శివారు దాహార్తి తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. నగరంలో పౌర పాలనకు కేంద్రంగా ఉన్న జీహెచ్ఎంసీకి సైతం గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.628 కోట్లు దక్కాయి. హైదరాబాద్, సైబరాబాద్ జంట పోలీసు కమిషనరే ట్ల పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, నిఘా కెమెరాల ఏర్పాటు...ఇతర సౌకర్యాలకు రూ.1112 కోట్లు కేటాయించారు. మెట్రో ప్రాజెక్టుకు రూ.416 కోట్లు, మైనార్టీల అభ్యున్నతికి రూ.550 కోట్లు, నగరంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల అభివృద్ధికి రూ.583.21 కోట్లు, ఎంఎంటీఎస్ రెండోదశకు రూ.20.83 కోట్లు కేటాయించారు. సర్కారు ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన, వైద్యపరికరాల కొనుగోలుకు రూ.520 కోట్లు కేటాయించడం ద్వార ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యమిచ్చినట్టుసర్కారు ప్రకటించింది. మొత్తంగా మహా నగరంలోని వివిధ విభాగాలకు తాజా బడ్జెట్లో కేటాయింపులు.. వాటిపై నిపుణుల విశ్లేషణలు జీహెచ్ఎంసీపై నిధుల వర్షం తెలంగాణ ఆవిర్భావం తరువాత... టీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన తొలి పూర్తి స్థాయి బడ్జెట్ నగర ప్రజల్లో కొత్త ఆశలు రేపింది. గడచిన మూడేళ్లతో పోలిస్తే నిధుల కేటాయింపు మెరుగ్గానే ఉంది. స్లమ్ ఫ్రీ సిటీ పథకానికి రూ.250 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లోనూ దీనికి రూ.250 కోట్లు కేటాయించారు. మొత్తంగా రూ.500 కోట్లు కేటాయించినట్లయింది. హరిత తెలంగాణకు రూ.25 కోట్లు కేటాయించారు. మిగతా అంశాల్లో పెద్దగా చెప్పుకోదగ్గ విశేషాల్లేవు. ప్రణాళిక, ప్రణాళికేతర నిధులకు గత రెండు బడ్జెట్లలో వరుసగా రూ.215 కోట్లు, రూ.370 కోట్లు కేటాయించగా... ఈసారి ఆ సంఖ్య రూ.628 కోట్లకు పెరిగింది. 2014-15 బడ్జెట్ కంటే అదనంగా రూ.258 కోట్లు పెరిగింది. ఆశాజనకమే అయినా.. జీహెచ్ఎంసీకి కేటాయింపులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ... గ్లోబల్సిటీకి వివిధ పనులు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనలకు అనుగుణంగా మరిన్ని నిధులు ఇస్తే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరద కాలువల ఆధునికీకరణకు రూ.10 వేల కోట్లు.. రోడ్లకు రూ. 10 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం తొలిదశలో రహదారులకు రూ.250 కోట్లు కేటాయించింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్కైవేలు, ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వేలు, మల్టీ గ్రేడ్ సెపరేటర్లు వంటివి నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటికీ... జీహెచ్ఎంసీకి కేటాయించిన నిధుల్లో వీటి ప్రస్తావన లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఆస్తిపన్నుగా రూ.20 కోట్లు రావాల్సి ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ విలేకరులకు చెప్పారు. త్వరలో జీహెచ్ంఎసీ బడ్జెట్ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా... రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు తెలియడంతో ఇక జీహెచ్ఎంసీ నిధులతో చేపట్టాల్సిన పనులపై అధికారులు దృష్టి సారించారు. ఏటా రాష్ట్ర బడ్జెట్లో తగినన్ని నిధులు లేకపోవడం.. జీహెచ్ఎంసీ బడ్జెట్లో రూ.వేల కోట్లు కేటాయిస్తున్నప్పటికీ పనులు జరగకపోవడం తెలిసిందే. దీంతో ఈసారి వాస్తవిక బడ్జెట్‌ను రూపొందించాలనే యోచనలో జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ ఉన్నారు. దాదాపు రూ. 5వేల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. వచ్చేవారం ముసాయిదా బడ్జెట్‌ను జీహెచ్ఎంసీ వెబ్సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచుతామని సోమేశ్ కుమార్ విలేకరులకు తెలిపారు. వారి అభిప్రాయాలకు అనుగుణంగా వివిధ పథకాలు, పనులకు నిధులు కేటాయిస్తామన్నారు. జీహెచ్ఎంసీకి రూపాయి రాక.. పోక వివరాలు కూడా ప్రజలకు అర్థమయ్యేలా పారదర్శకంగా వ్యవహరిస్తామన్నారు. జీహెచ్ఎంసీ చరిత్రలో ఇదే ప్రథమం రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీకి ఇంత భారీ మొత్తంలో నిధులు కేటాయించడం ఇదే ప్రథమం. మున్నెన్నడూ లేని విధంగా ప్రభుత్వం జీహెచ్ఎంసీకి ప్రాధాన్యమివ్వడం ఆనందంగా ఉంది. స్లమ్ఫ్రీలో భాగంగా కేటాయించిన నిధులతో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తాం. ప్రజోపయోగమైన అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ నిధులతో చేపడతాం. -సోమేశ్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ -
తెలంగాణ బడ్జెట్‌పై సీఎం సంతృప్తి
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా తాము మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలుచేసేందుకు వీలుగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయన్నారు. అన్ని రంగాలకు న్యాయం చేస్తూ, సరైన నిధులను కేటాయిస్తూ సమతుల్యత పాటించారని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌పై ప్రశంసలు కురిపించారు. సంక్షేమం, వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉందన్నారు. చెరువుల పునరుద్ధరణ, రహదారుల అభివృద్ధి, వాటర్ గ్రిడ్ పథకాలకు సముచిత ప్రాధాన్యం దక్కిందని కేసీఆర్ తెలిపారు. మంచి బడ్జెట్‌ను రూపొందించారని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌ను, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు. -
అన్నదాతకు అగ్ర తాంబులం
హైదరాబాద్ : ప్రధాన ఓటు బ్యాంకు రైతులకు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పెద్దపీట వేసే ప్రయత్నం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన రైతు రుణ మాఫీ ప్రకటనకు కట్టుబడి ఉన్నామని బుధవారం బడ్జెట్ ప్రసంగంలో ఆయన అన్నారు. రైతుల రుణాల మాఫీకి 2015-16లో రైతు రుణ మాఫీకి రూ.4250 కోట్లు కేటాయించారు. దీంతో పాటు కూరగాయల మార్కెటింగ్‌కు 'మన ఊరు - మన కూరగాయలు' పథకం ప్రకటించారు. రాష్ట్రంలోని 19.53లక్షల వ్యవసాయ పంపు సెట్లకు రోజుకు ఏడు గంటల విద్యుత్ ఇస్తామని తెలిపారు. కృష్ణా నదిపై పాలమూరు ఎత్తిపోతల పథకం, నక్కలగండి ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదనను ఈటెల తన బడ్జెట్లో ప్రకటించారు . 2014-15లో ఆర్థికాభివృద్ధి 5.3శాతమని, వచ్చే ఏడాది మరింత ఆశాజనకంగా ఉండొచ్చన్నారు. అయితే ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే 30శాతం తక్కువ వర్షాలు పడ్డాయని, గత ఏడాదితో పోల్చితే 42 శాతమేనని అన్నారు. బడుగు బలహీన వర్గాల రైతులకు భూమి ఇచ్చేందుకు అదనంగా మరింత భూమిని కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు. ఎకరాకు రూ.2 నుంచి రూ.7లక్షల చొప్పున 9 జిల్లాల్లో సాగుభూమిని కొనుగోలు చేసే అధికారం కలెక్టర్లకు ఇచ్చారు. -
'గ్రేటర్' కానుక
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న కేసీఆర్ ప్రభుత్వం తాజా ఆర్థిక బడ్జెట్లో హైదరాబాద్‌కు మరిన్ని వరాలు ఇచ్చింది. శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పుకొచ్చిన ఈటెల.. ఎక్కడ క్రైం జరిగినా పది నిమిషాల్లో పోలీసులు చేరుకునేలా 1500 బైక్‌లు ఇస్తున్నామని, మరిన్ని రక్షక్ వాహనాలు ఇస్తున్నామని ప్రకటించారు. మహానగరంలో ఏకంగా లక్ష సిసి కెమెరాలు ఏర్పాటు చేసి వాటన్నింటిని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో స్కై వే ఏర్పాటుకు రూ.1600 కోట్లు, మెట్రో రైల్‌కు రూ.416 కోట్లు కేటాయించి ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చెప్పే ప్రయత్నం చేశారు. హైదరాబాద్‌లో మంచినీటి సరఫరా, మురుగు నీటి కాల్వల శుభ్రతకు వెయ్యి కోట్లు కేటాయిస్తున్నామన్నారు. గ్రేటర్లో ఉంటున్న ఎస్టీలను ఆకట్టుకునేందుకు వాల్మీకీ బోయ, కాయితీ లంబాడా కులాల్ని STలలో చేర్చేందుకు విచారణ సంఘం ఏర్పాటు చేస్తున్నామని, బంజారాహిల్స్‌లో బంజారా భవన్, ఆదివాసీ భవన్ల ఏర్పాటు త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. -
ఆ పరిస్థితి తెచ్చుకోం: ఈటెల
హైదరాబాద్: బంగారు తెలంగాణ లక్ష్యంగా తమ పయనం సాగుతోందని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆర్థిక బడ్జెట్ 2015-16 ప్రవేశపెట్టిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ రూపకల్పన చేసినట్టు చెప్పారు. పరిశ్రమల స్థాపన, ఐటీ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. రాబోయే కాలంలో సంక్షేమ రంగానికి కేటాయింపులు పెంచుతామన్నారు. పూర్తి అవసరాలు తీర్చే సత్తా ఏ ప్రభుత్వానికి ఉండదని, ఉన్న నిధులతోనే సమర్థవంతంగా పాలన సాగించాల్సివుంటుందన్నారు. తమ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించే పరిస్థితి తెచ్చుకోమని ఈటెల రాజేందర్ అన్నారు. -
వరంగల్‌కు వరాలు...
హైదరాబాద్ : తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్లో వరంగల్‌కు వరాలు ప్రకటించారు. హైదరాబాద్ - వరంగల్‌ను పారిశ్రామిక కారిడార్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించిన ఆయన దాంతో పాటు వరంగల్‌లో టెక్స్టైల్స్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఫార్మాసిటీకి అనుబంధంగా మినీ ఇండస్ట్రియల్ టౌన్షిప్ అభివృద్ధి చేస్తామని అన్నారు. అలాగే వరంగల్‌కు వెళ్లే రహదారిలో ఉన్న యాదగిరి గుట్టకు భారీగా నిధులిచ్చారు. ఇక్కడ టెంపుల్ డెవలప్మెంట్ ఆథారిటీ ఏర్పాటు చేస్తున్నామని, గతానికి అదనంగా మరో వంద కోట్లు ఇస్తున్నామన్నారు. -
గుజరాత్ తర్వాత తెలంగాణే..
హైదరాబాద్ : దేశంలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాలు కేవలం రెండేనని, గుజరాత్‌తో పాటు తమది ఒకటని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సగర్వంగా ప్రకటించారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆయన అన్ని వర్గాలకు ప్రాధాన్యమిచ్చేందుకు తాపత్రయపడ్డారు. కొత్తగా ప్రజాకర్షక పథకాల జోలికిపోకుండా.. ఉన్న పథకాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన భూ క్రమబద్ధీకరణను క్రెడిట్‌గా చెప్పుకున్న ఈటెల రాజేందర్.. బంగారు తెలంగాణ మరెంతో దూరంలో లేదని చెప్పుకొచ్చారు. మిషన్ కాకతీయకు అగ్ర తాంబూలం వేసిన ఈటెల.. మేడిన్ తెలంగాణ ఉత్పత్తులు రావాలని ఆకాక్షించారు. తెలంగాణ మొత్తం బడ్జెట్ రూ.115689 కోట్లని, అందులో ప్రణాళికా వ్యయం రూ. 52383కోట్లు, ప్రణాళికేతర వ్యం రూ.63306 కోట్లగా పేర్కొన్నారు. -
'ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేసీఆర్'
హైదరాబాద్: శాసనసభలో తమ పార్టీ సభ్యులు లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో బుధవారం ఆందోళనకి దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సర్కారు తీరును ఖండిస్తూ ఛలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని తలపెట్టారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైటాయించి కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. -
'ఇళ్లు లేవు...రావు, గాల్లోకి వదిలేశారు'
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీ వాయిదా అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి...అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్...ఇప్పుడు ఆ విషయాన్ని మరిచిపోయిందన్నారు. ఇళ్లు లేవు...ఇళ్లు రావనేదే టీఆర్ఎస్ సర్కార్ విధానమని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ధ్వజమెత్తారు. ఇక విద్యారంగానికి వస్తే కేజీ నుంచి పీజీ వరకూ మేథోమధనం తర్వాత చూద్దామంటూ విద్యను గాలికి వదిలేశారని ఆయన మండిపడ్డారు. హామీలను ఎన్నికల ప్రచారానికి మాత్రమే టీఆర్ఎస్ వాడుకుందన్నారు. అలాగే సాగునీటి విషయానికి వస్తే ప్రతి నియోజకవర్గంలోనూ భూమిని సాగులోకి తెస్తామని ఆ విషయాన్నే ప్రభుత్వం మరచిందన్నారు. అలాగే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మికి, షాదీ ముబారక్‌లకు ఎంత ఖర్చుచేశారో చెప్పలేనివిధంగా సర్కార్ ఉందన్నారు. -
మాటలు కోటలు దాటుతున్నా...
హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక బడ్జెట్ లో అంకెల గారడీ చేశారని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య విమర్శించయారు. మాటలు కోటలు దాటుతున్నా కాళ్లు గడప దాటడంలేదన్న చందంగా బడ్జెట్ ఉందన్నారు. గత బడ్జెట్ లో జరిపిన కేటాయింపులు ఖర్చు చేయలేదని మళ్లీ వాటినే ఈ బడ్జెట్ లో చూపించారని ఆరోపించారు. సేవా రంగాన్ని పూర్తిగా విస్మరించారన్నారు. పెరుగుతున్న ధరలకు హాస్టల్ విద్యార్థులకు ఉపకార వేతనాలు పెంచలేదన్నారు. అణగారిన వర్గాలకు నామమాత్రంగా కేటాయింపులు జరిపారని దుయ్యబట్టారు. గిరిజన సంక్షేమానికి కనీసం పదివేల కోట్ల రూపాయిలు కేటాయించాల్సిందని అభిప్రాయపడ్డారు. అంగన్ వాడీలకు కంటితుడుపు వేతనాలు పెంచారన్నారు. -
రైతు రుణమాఫీకి రూ.4, 250 కోట్లు
-
మా మీద నిందలు వేస్తారా: చింతల
హైదరాబాద్ : కేంద్రం నుంచి నిధులు రావటం లేదని తెలంగాణ ప్రభుత్వం చెప్పటం సరికాదని ఖైరతాబాద్ బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ కేంద్రం సహకరిస్తున్నా... తమపై నిందలు వేయటాన్ని ఖండించారు. అలాగే యువతకు ఉపాధి విషయంలో కూడా తెలంగాణ బడ్జెట్లో ప్రస్తావన ఇవ్వలేదన్నారు. -
'పాత పథకాలకే కొత్త పేర్లు'
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ లో కొత్తదనం ఏమీ లేదని టీడీపీ నేత అరికెల నర్సారెడ్డి పెదవి విరిచారు. పాత పథకాలకే కొత్త పేర్లు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చెరువుల అభివృద్ధి కోసం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం కొత్తది కాదన్నారు. దీని ద్వారా అదనంగా ఒక్క టీఎంసీ నీళ్లు కూడా రావని చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రయత్నం చేస్తున్నామని చెప్పకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే ఈ ప్రాజెక్టును ఎత్తివేస్తారనే భయం కలుగుతోందన్నారు. పంచదార పరిశ్రమల గురించి ప్రస్తావించలేదన్నారు. -
అంగన్వాడీ సిబ్బందికి తీపికబురు
-
ఆరోగ్యశ్రీ...ఊసేది: చిన్నారెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి పెదవి విరిచారు. ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రసంగం అనంతరం ఆయన బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ బడ్జెట్లో ఆరోగ్యశ్రీ ఊసే లేదన్నారు. అలాగే మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్లకు కేటాయించిన నిధులతో ఎప్పటికి పనులు పూర్తి చేస్తారన్నారు. వాస్తవ పరిస్థితులను గుర్తించి నిధుల కేటాయింపులు జరగాలన్నారు. అలాగే విద్యుత్ సమస్య ఉన్నందున ఆ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలే మిగులు వ్యయం కలిగి ఉన్నాయని చెప్పుకుంటూ...మరోవైపు ప్రజలపై వ్యాట్ పెంపు చేయటం దారుణమన్నారు. -
ముచ్చెర్లలో ఫార్మా సిటీ
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ లో పారిశ్రామిక ప్రోత్సహకాలకు రూ. 974 కోట్లు కేటాయించారు. ముచ్చెర్లలో 11వేల ఎకరాలతో ఫార్మా సిటీ, హైదరాబాద్-వరంగల్ మధ్య ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. కిలోవాట్ సామర్థ్యం గల 4వేల సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పుతామన్నారు. -
ఆర్టీసీకి రూ.400 కోట్లు
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీకి రూ.400 కోట్లు కేటాయించారు. ఫ్లై ఓవర్లకు నిర్మాణానికి రూ.1600 కోట్లు, రహదారుల అభివృద్ధి కోసం రూ.2,421 కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. -
తెలంగాణ అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రసంగం అనంతరం స్పీకర్ మధుసూదనాచారి సభలో ఎల్లుండికి వాయిదా వేశారు. అంతకు ముందు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందన్న ఈటెల రాజేందర్ 2015-16 బడ్జెట్‌ను రూ.1,10,500 కోట్లతో ప్రవేశపెట్టారు. ఆయన సుమారు గంటపాటు బడ్జెట్ ప్రసంగాన్ని చదవి వినిపించారు. -
అంగన్వాడీ సిబ్బందికి తీపికబురు
హైదరాబాద్: అంగన్వాడీ సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వేతనాలు పెంచుతున్నట్టు ప్రకటించింది. అంగన్వాడీ టీచర్లకు నెలకు రూ.7 వేలు, కార్యకర్తలకు రూ.4 వేలు వేతనం ఇవ్వనుట్టు తెలిపింది. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి వెయ్యి వన్‌టైమ్ గ్రాంట్ మంజూరు చేస్తామని ప్రకటించింది. తెలంగాణ బడ్జెట్ 2015-16 ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈమేరకు శాసనసభలో ప్రకటించారు. వేతనాలపై పెంపు ప్రకటనపై అంగన్వాడీ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఉస్మానియా యూనివర్శిటీకి రూ.238 కోట్లు
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఉద్యోగులు, విద్యార్థులకు బడ్జెట్ లో సముచిత ప్రాధాన్యం కల్పించారు. ఉద్యమంలో ప్రాధానపాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్శిటీకి రూ.238 కోట్లు కేటాయించారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం రూ.22,889 కేటాయించినట్టు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. -
రైతు రుణమాఫీకి రూ. 4,250 కోట్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ లో రైతు రుణమాఫీకి రూ.4, 250 కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగానికి సముచిత కేటాయింపులు జరిపారు. గ్రీన్హౌస్ వ్యవసాయానికి రూ.250 కోట్లు, డ్రిప్ ఇరిగేషన్ కోసం రూ.200 కోట్లు, గ్రీన్హౌస్ వ్యవసాయానికి రూ.250 కోట్లు, ఎర్రజొన్న రైతులకు రూ.13.5 కోట్లు కేటాయించినట్టు ఈటెల రాజేందర్ ప్రకటించారు. -
సంక్షేమ రంగానికి పెద్దపీట
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ లో సంక్షేమ రంగానికి పెద్దపీట వేశారు. ఆసరా పెన్షన్ల కోసం రూ.4వేల కోట్లు కేటాంచారు. ఎస్సీ సంక్షేమానికి రూ.5,547 కోట్లు, గిరిజన ఎస్టీ సంక్షేమం కోసం రూ.2,578 కోట్లు, బీసీ సంక్షేమంకు రూ.2,172 కోట్లు, మైనార్టీ సంక్షేమం కోసం రూ.1105 కోట్లు, బీడీ కార్మికుల సంక్షేమానికి రూ.188 కోట్లు కేటాయించినట్టు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. -
వాటర్ గ్రిడ్ కు రూ.4 వేల కోట్లు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా భావిస్తున్న మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులకు బడ్జెట్ లో భారీగా కేటాయింపులు జరిపారు. మిషన్ కాకతీయ కు రూ. 2,083 కోట్లు, వాటర్ గ్రిడ్ కు రూ.4 వేల కోట్లు కేటాయించారు. డ్రిప్ ఇరిగేషన్ కోసం రూ. 200 కేటాయించినట్టు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. గ్రీన్ హౌస్ వ్యవసాయం కోసం రూ.250 కోట్లు కేటాయించారు. -
అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈటెల రాజేందర్
-
'బడ్జెట్ అంటే చిట్టాపద్దుల పట్టిక కాదు'
-
మెట్రో రైలుకు రూ. 416 కోట్లు
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ లో హైదరాబాద్ కు సముచిత కేటాయింపులు జరిపారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్: 2015-16లో గ్రేటర్ హైదరాబాద్ కు రూ. 536 కోట్లు ఇచ్చారు. నీటి సరఫరాకు రూ.1000 కోట్లు కేటాయించారు. మెట్రో రైలుకు రూ. 416 కోట్లు ఇచ్చారు. -
'బడ్జెట్ అంటే చిట్టాపద్దుల పట్టిక కాదు'
హైదరాబాద్: బడ్జెట్ అంటే చిట్టాపద్దుల పట్టిక కాదని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. పూర్తి అవగాహన, స్పృహతో బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఆశలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని ఆయన భరోసాయిచ్చారు. కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం సమగ్ర దృక్పధం, దార్శినికతకు అనుగుణంగా బడ్జెట్ తయారు చేసినట్టు తెలిపారు. -
తెలంగాణ బడ్జెట్ ముఖ్యాంశాలు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం 2015-16 బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందన్న ఆయన తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం గర్వంగా ఉందని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు అవకాశం ఇచ్చిందనకు ఈటెల కృతజ్ఞతలు తెలిపారు. ప్రతీ పైసా తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కేటాయిస్తామని, బడ్జెట్ అంటే చిట్టాపద్దుల పట్టిక కాదని, జీవం లేని అంకెల కూర్పు కాదని.. సారం లేని గణాంకాలు అంతకన్నా కాదన్నారు. బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చే బడ్జెట్ అని తెలిపారు. సంక్షేమం, వ్యవసాయం, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ఈటెల ప్రకటించారు. తెలంగాణ బడ్జెట్ ముఖ్యాంశాలు: * తెలంగాణ బడ్జెట్ రూ.1,10,500 కోట్లు * ప్రణాళిక వ్యయం రూ. 52, 383 కోట్లు * ప్రణాళికేతర వ్యయం రూ. 63,306 కోట్లు * ఆర్థిక మిగులు రూ. 501 కోట్లు * ద్రవ్యలోటు అంచనా రూ.16,969 కోట్లు * రెవిన్యూ మిగులు : రూ. 531 కోట్లు * పన్నుల రాబడి రూ.12,823 కోట్లు *ఎస్సీ సంక్షేమానికి రూ.5,547 కోట్లు * గిరిజన ఎస్టీ సంక్షేమం రూ.2,578 కోట్లు * బీసీ సంక్షేమం రూ.2,172 కోట్లు * మైనార్టీ సంక్షేమం రూ.1105 కోట్లు * ఆసరా పెన్షన్లు రూ.4వేల కోట్లు *కేంద్ర పన్నుల వాటా: రూ.12, 823 కోట్లు * గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి రూ.526 కోట్లు * విద్యా రంగానికి రూ.11,216 * విద్యుత్ శాఖకు రూ.7,400 * మిషన్ కాకతీయకు రూ.2,083 * ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు రూ.22,889 *ఎర్రజొన్న రైతులకు రూ.13.5 కోట్లు * హైదరాబాద్ నీటి సరఫరాకు వెయ్యి కోట్లు * స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు రూ. 771 రూ. కోట్లు * ఆర్టీసీకి రూ.400 కోట్లు * రైతు రుణమాఫీకి రూ.4, 250 కోట్లు * గ్రీన్హౌస్ వ్యవసాయానికి రూ.250 కోట్లు * ఉస్మానియా యూనివర్శిటీ రూ.238 కోట్లు * అటవీ శాఖ, పర్యావరణానికి రూ.325 కోట్లు * తెలంగాణ వాటర్ గ్రిడ్‌కు రూ.4వేల కోట్లు * రోడ్లు అభివృద్ధికి రూ.2,421 కోట్లు * డ్రిప్ ఇరిగేషన్ కోసం రూ.200 కోట్లు *లక్ష ఎకరాల సాగు నీరందించటమే లక్ష్యం * పారిశ్రామిక ప్రోత్సహాలకు రూ. 974 కోట్లు *బీడీ కార్మికుల సంక్షేమానికి రూ.188 కోట్లు * దళితుల భూముల కొనుగోలుకు వెయ్యి కోట్లు * అంగన్వాడీ సిబ్బందికి వేతనాలు పెంపు * అంగన్వాడీ టీచర్లకు రూ.7వేలు, కార్యకర్తలకు రూ.4వేలు * ప్రతి అంగన్వాడీ కేంద్రానికి వెయ్యి వన్‌టైమ్ గ్రాంట్ * వైద్య శాఖకు రూ.4,932 కోట్లు * ఆహార భద్రత, సబ్సిడీకి రూ.1,105 కోట్లు *ముచ్చెర్లలో 11వేల ఎకరాలతో ఫార్మా సిటీ *హైదరాబాద్-వరంగల్ మధ్య ఇండస్ట్రియల్ కారిడార్ * ఫ్లై ఓవర్లకు రూ.1600 కోట్లు * సిటీ పోలీస్ స్టేషన్ అభివృద్ధికి రూ.50వేలు * గ్రామీణ పోలీస్ స్టేషన్ అభివృద్ధికి రూ.25 వేలు * పంచాయతీ రాజ్‌కు రూ.2,421 కోట్లు * కిలోవాట్ సామర్థ్యం గల 4వేల సోలార్ విద్యుత్ ప్లాంట్లు -
అసెంబ్లీకి బడ్జెట్ పత్రాలతో ఈటెల
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందేలా బడ్జెట్ ఉంటుందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. సంక్షేమం, వ్యవసాయం, ఉపాధి కల్పనలే తమ ప్రభుత్వ ఎజెండా అన్నారు. బుధవారం ఉదయం ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి చేరుకున్నారు. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. తొలిసారి తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. తొలి ఏడాది పది నెలలకు బడ్జెట్ తయారు చేసిన టీఆర్ఎస్ సర్కారు... ఈసారి పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను రూపొందించింది. ఐదు నెలల వ్యవధిలోనే రెండోసారి రెండో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండడం గమనార్హం. అలాగే శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. -
‘కోట్ల’ ఆశలు!
బడ్జెట్ వైపు... ప్రభుత్వ శాఖల చూపు నిధుల కోసం నిరీక్షణ మరికొన్ని గంటల్లో తేలనున్న ‘లెక్క’ సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర బడ్జెట్‌పై గ్రేటర్‌లోని సర్కారు విభాగాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో బుధవారం ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్లో అవసరమైన నిధులు కేటాయించాలని కోరుకుంటున్నాయి. విశ్వనగరం దిశగా వడివడిగా అడుగులేస్తున్న మహా నగర పరిధిలో మౌలిక వసతుల కల్పనకు సర్కారు విభాగాలు భారీ లక్ష్యాలు నిర్దేశించుకున్నాయి. వీటికి బడ్జెట్లో నిధుల వరద పారుతుందని ఆశిస్తున్నాయి. రహదారులు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్య పరిరక్షణ, మురికివాడల్లో కనీస వసతుల కల్పన, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలతో పాటు నేర రహిత రాజధానిగా తీర్చిదిద్దేందుకు భారీగా నిధులు అవసరమవుతాయని జీహెచ్ఎంసీ, జలమండలి, మైనార్టీ సంక్షేమ, గృహ నిర్మాణ శాఖలు, హెచ్ఎండీఏ, వైద్య ఆరోగ్యశాఖ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు విభాగాలు ఆశిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి తొలిబడ్జెట్ ఇదే కావడంతో దీనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. దీనికి అనుగుణంగా సర్కారు నిధులు విదిలిస్తుందా? లేదా? అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. బల్దియా... రూ.2796 కోట్లు గత ఏడాది బడ్జెట్ (2014-15)లో జీహెచ్ఎంసీ రూ.1093 కోట్లు కోరగా... కేవలం రూ.373 కోట్లు కేటాయించారు. అయితే అది కేవలం నాలుగు నెలలకు సంబంధించినది కావడం గమనార్హం. ఆ మాత్రం నిధులు కేటాయించినా ఖర్చు చేసేందుకు వ్యవధి లేకపోయింది. ఈ నిధుల్లో యూసీడీకి రూ.35.03 లక్షలు, ఎంఎంటీఎస్‌కు రూ. 20.83 కోట్లు, పాదచారుల పథకానికి రూ.కోటి, హరిత నగరం ప్రాజెక్టుకు రూ.25 కోట్లు, స్లమ్ ఫ్రీ సిటీకి రూ.250 కోట్లు కేటాయించారు. విశ్వసనీయ సమాచారం మేరకు తాజా బడ్జెట్ (2015-16)లో వృత్తిపన్ను, ఆక్ట్రాయ్ పన్ను వాటా, వినోద పన్ను, ప్రభుత్వ భవనాల ఆస్తిపన్ను తదితరమైనవి దాదాపు రూ.1750 కోట్లు ప్రణాళికేతర బడ్జెట్లో కేటాయించాల్సిందిగా జీహెచ్ఎంసీ కోరినట్లు తెలిసింది. ప్రణాళిక నిధుల కింద మరో రూ.1046 కోట్లు కోరినట్లు సమాచారం. మొత్తం రూ. 2796 కోట్లు కోరినట్లు తెలుస్తోంది. బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించి పత్రికలకు ఎలాంటి సమాచారం ఇవ్వరాదనే ఆదేశాలు ఉండటంతో అధికారులెవరూ పెదవి విప్పడానికి సాహసించడం లేదు. -
అసెంబ్లీలో మళ్లీ రభస
* హద్దులు దాటిన మాటలు.. అధికార, విపక్షాల పరస్పర దూషణలు * టీఆర్ఎస్ సభ్యుల క్షమాపణ కోసం కాంగ్రెస్ పట్టు * డీకే అరుణను నోర్మూసుకుని కూర్చోమన్న అధికార ఎమ్మెల్యేలు * దాదాగిరి నడవదన్న మంత్రి కేటీఆర్ * మైకును విరిచి పోడియం వద్ద బైఠాయించిన అరుణ * జానారెడ్డి, కేసీఆర్ జోక్యంతో వెనక్కి తగ్గిన ఇరుపక్షాలు * సమస్యల ప్రస్తావన లేకుండానే ముగిసిన ప్రశ్నోత్తరాలు సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో మళ్లీ రభస. సభ్యులు విచక్షణ కోల్పోయి నోరు జారారు. మైకు విరిచి నేలకేసి కొట్టారు. పోడియంలోకి దూసుకెళ్లి ఆందోళన చేశారు. నిరసనలు, నినాదాలతో సభ అట్టుడికింది. బడ్జెట్ సమావేశాల మూడో రోజైన మంగళవారం కూడా పరిస్థితి మారలేదు. అదే గందరగోళం.. దుమారం. దీంతో ప్రశ్నోత్తరాల సమయమంతా సభ్యుల గొడవతోనే గడిచిపోయింది. ఉదయం సభ సమావేశం కాగానే పరిస్థితి అదుపు తప్పింది. పదో తరగతి విద్యార్థులకు సౌర విద్యుద్దీపాల పంపిణీ అంశంపై కొందరు అడిగిన ప్రశ్నకు కొనసాగింపుగా టీఆర్ఎస్ సభ్యుడు గువ్వల బాలరాజు మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డుతగిలారు. సమావేశాల తొలిరోజున గవర్నర్ ప్రసంగం సమయంలో జాతీయ గీతాలాపన జరుగుతుం డగా అమర్యాదగా ప్రవర్తించిన టీఆర్ఎస్ సభ్యులు సైతం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ క్షమాపణ చెప్పారని.. అధికార సభ్యులకు మినహాయింపు ఎందుకని నిలదీశారు. అప్పటి వీడియో ఫుటేజీలను పూర్తిగా బయటపెట్టాలని పట్టుబట్టడంతో సభలో గందరగోళం మొదలైంది. దీనికి సభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ.. జాతీయగీతాన్ని అగౌరవపరిచిన వారంతా క్షమాపణ చెప్పాల్సిందేనని, తమ వాళ్లు తప్పు చేస్తే క్షమాపణ చెబుతారని చెప్పారు. ఎప్పుడైనా వీడియో ఫుటేజీ చూపించేందుకు సిద్ధమన్నారు. దీంతో బుధవారం సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వా త ఫుటేజీలను చూపిస్తామని స్పీకర్ పేర్కొన్నారు. అయితే మంగళవారమే చూపించాలని సీఎల్పీ నేత జానారెడ్డి డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలపైనే చర్యలు తీసుకున్నారన్న అపవాదు రాకుండా చూస్తే పాలకపక్షానికే మం చిదని బీజేఎల్పీ నేత లక్ష్మణ్ హితవు పలికారు. దీనికి స్పీకర్ అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం సౌర విద్యుద్దీపాల పంపిణీపై సమాధానమిచ్చేందుకు జగదీశ్‌రెడ్డి ఉపక్రమిస్తూ.. ‘చెప్పింది వినరా.. మీ అవ్వ!’ అని కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి అనడంతో కొద్దిసేపు అలజడి రేగింది. కేసీఆర్, జానాల పెద్దరికం అనంతరం కేటీఆర్, కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ మధ్య మాటల యుద్ధం జరగడంతో సభ వాయిదా పడింది. మళ్లీ సభ ప్రారంభమైన వెంటనే డీకే అరుణతో పాటు కాంగ్రెస్ సభ్యులు గీతారెడ్డి, పద్మావతి, జీవన్ రెడ్డి తదితరులు స్పీకర్ పొడియం వద్ద బైఠాయించారు. కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారిని సముదాయించేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్పీకర్ మధుసూదనాచారి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అప్పుడే సభకు వచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, సీఎల్పీ నేత జానారెడ్డి ఇద్దరూ కల్పించుకుని ఇరువర్గాలను చల్లార్చే ప్రయత్నం చేశారు. సీఎం కుమారుడే మహిళలను అవమానిస్తే ఏం చేయాలని అరుణ ప్రశ్నించారు. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ.. ‘ఎవరు ఏం చేశారో.. ఏం మాట్లాడాలో రికార్డులు తీయండి. తర్వాత చర్యలు తీసుకోండి’ అని స్పీకర్‌ను కోరారు. మరోవైపు ఆందోళన విరమించి ఎవరి సీట్లలో వారు కూర్చోవాలని తమ పార్టీ సభ్యులకు జానారెడ్డి సూచించారు. అయిష్టంగానైనా కాంగ్రెస్ సభ్యులు ఆందోళన విరమించారు. అడుగు తీసి అడుగు వేస్తే ఆరోపణలా? సీఎం కేసీఆర్ స్పందిస్తూ జానారెడ్డి సూచనలను వంద శాతం ఆమోదిస్తున్నామన్నారు. జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యను టీవీలో చూసి తాను విస్మయానికి గురయ్యానని చెప్పారు. సభకు వచ్చిన తర్వాత మంత్రిని మందలించినట్లు తెలిపారు. సభలో ఉన్నప్పుడు విపక్షాలు అసహనానికి గురి చేసినా.. జాగ్రత్తగా ఉండాలని సూచించానన్నారు. అయితే, తాను అడుగు తీసి అడుగు వేసినా.. కాంగ్రెస్ సభ్యులు అవినీతి ఆరోపణలు చేస్తున్నారన్నారు. చినజీయర్ స్వామితో యాదగిరిగుట్ట ఆలయ సందర్శనకు వెళ్లినా విమర్శలు చేశారన్నారు. ఛత్తీస్‌గఢ్ వెళ్లి విద్యుత్ ఒప్పందాలు చేసుకుని వస్తే ఎంత తీసుకున్నావని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బట్ట కాల్చి మీద వేస్తామంటే ఒప్పుకోమన్నారు. రెండువైపులా సంయమనం ఉండాలని హితవు పలికారు. ప్రధాన ప్రతిపక్షాన్ని నడిపించడంలో జానారెడ్డి చూపిస్తున్న చొరవను ఈ సందర్భంగా కేసీఆర్ కొనియాడారు. ఇప్పుడే వీడియో ఫుటేజీలను పరిశీలిస్తామన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ సూచన మేరకు మంత్రి జగదీశ్‌రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ విచారం వ్యక్తం చేశారు. అనంతరం ప్రశ్నోత్తరాల పర్వం ముగిసిందని ప్రకటించిన స్పీకర్.. వీడియోల వీక్షణం కోసం సభను వాయిదా వేశారు. విచారంవ్యక్తం చేసిన కేటీఆర్, ఆరుణ భోజన విరామ సమయం తర్వాత సభ తిరిగి సమావేశమైంది. సభలో రేగిన దుమారంపై ముందుగా ఎవరు విచారం వ్యక్తం చేయాలనే దానిపై కొంత చర్చ జరగగా.. సీఎం జోక్యం చేసుకుని ముందుగా అధికారపక్షం నుంచే చెప్పిస్తామన్నారు. దీంతో తన మాటల వల్ల ఎవరి మనసైనా నొచ్చుకుంటే.. వాటిని ఉపసంహరించుకుని విచారం వ్యక్తం చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. దీనిపై డీకే అరుణ స్పందిస్తూ తనను కించపరిచే వ్యాఖ్యలు, రన్నింగ్ కామెంటరీతో ఇబ్బంది కలుగుతోందన్నారు. టీఆర్ఎస్ సభ్యులు తనను అసభ్య పదజాలంతో దూషించారని, అందుకే తాను తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని ఆమె వివరణ ఇచ్చారు. మైక్‌ను విరిచినందుకు విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు. తన వ్యాఖ్యలు అన్‌పార్లమెంటరీగా ఉంటే వాటిని ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. దీంతో సభలో మూడు గంటలపాటు రేగిన వివాదం సమసిపోయింది. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ మొదలైంది. వీడియో పుటేజీల పరిశీలన అన్ని పార్టీల నేతలతో స్పీకర్ ప్రత్యేకంగా సమావేశమై మంత్రి కేటీఆర్, డీకే అరుణ మధ్య జరిగిన మాటల యుద్ధానికి సంబంధించిన వీడియోలను సుమారు గంటన్నరపాటు పరిశీలించారు. మొదట డీకే అరుణ మైకు విరగ్గొట్టిన దృశ్యాలే ఉండడంతో ఆమె క్షమాపణ కోరాలని నిర్ణయించారు. మరో కెమెరా దృశ్యాలను కూడా చూడాలని కాంగ్రెస్ నేతలు పట్టుబట్టడంతో వాటిని కూడా స్పీకర్ పరిశీలించారు. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై కూడా స్పందిస్తూ ఇద్దరి క్షమాపణలు కోరాలని నిర్ణయించారు. అధికార దర్పంతో అదుపు తప్పారు..: జానా జానారెడ్డి మాట్లాడుతూ మంత్రులు, అధికార పార్టీ సభ్యుల తీరుపై సుతిమెత్తగా విమర్శలు చేశారు. ఓవైపు కాంగ్రెస్ పూర్తిగా సహకరిస్తుంటే మరోవైపు టీఆర్ఎస్ సభ్యులు అధికార దర్పంతో అదుపుతప్పి మాట్లాడుతున్నారని చురకలంటించారు. కొత్త రాష్ట్రంలో ఆదర్శ విధానంలో సభ నిర్వహణ కోసం తాను తాపత్రాయపడుతుంటే కొందరి వల్ల సాధ్యం కావడం లేదన్నారు. మంత్రి ఉద్యోగాలు తామూ చేశామని, అదంతా తమకు కొత్త కాదన్నారు. పాత వివాదానికి ముగిం పు పలికేందుకు ఆలోచిస్తుంటే, మరో వివాదం పుట్టుకొచ్చిందని వ్యాఖ్యానిం చారు. అధికారపార్టీ సభ్యులను అదుపులో పెట్టుకోవాలని కేసీఆర్‌కు సూచించారు. గవర్నర్ ప్రసంగంతో పాటు తాజా ఘటనకు సంబంధించిన వీడియోలను పరిశీలించి మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కేటీఆర్ వర్సెస్ డీకే అరుణ గద్వాల నియోజకవర్గంలోని గుర్రం గడ్డ దీవి-రంగాపూర్ మధ్య కృష్ణా నదిపై వం తెన నిర్మించే అంశాన్ని కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ లేవనెత్తగా అలాంటి ప్రతిపాదన లేదని మంత్రి తారక రామారావు పేర్కొన్నారు. ఆ సమయంలో నీటి పారుదల శాఖ మంత్రి సభలో లేరు. దీంతో మంత్రి లేనందున తన ప్రశ్నను బుధవారానికి వాయిదా వేయాలని అరుణ కోరారు. అయితే ఇరిగేషన్ శాఖ పరిధిలోని రోడ్లు, వంతెనలను రోడ్లు, భవనాల శాఖకు బదలాయించినట్టు ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. దీనికి కొనసాగింపుగా అరుణ మాట్లాడుతుండగా అధికారపక్ష సభ్యులు అడ్డుకున్నారు. ప్రశ్నను రేపటికి వాయిదా వేయమని కోరి మళ్లీ ఎందుకు మాట్లాడుతున్నావు.. నోర్మూసుకుని కూర్చో! అంటూ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు వ్యాఖ్యానించగా, మరో ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా వంతపాడారు. దీనికి అరుణ తీవ్రంగా స్పందించారు. ‘ఏం మాట్లాడుతా వ్.. నీకు మహిళల పట్ల గౌరవం లేదు.. మీ ప్రభుత్వంలో మహిళా మంత్రులకు స్థానం లేదు. మీరేనోర్మూసుకోండి’ అంటూ మండిపడ్డా రు. దీంతో మంత్రి కేటీఆర్ ఎదురుదాడికి దిగారు. కొన్ని సమీకరణాల వల్ల మహిళలకు స్థానం ఇవ్వలేకపోయామని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలా మహిళా అధికారులను జైలుకు పంపలేదని, మహిళా మంత్రులను సీబీఐ కేసుల్లో ఇరికించలేదని అన్నారు. ‘మీ దాదాగిరి మహబూబ్‌నగర్‌లో నడిచిందేమోగాని ఇక్కడ నడవదు. ఇది శాసనసభ, బంగళా రాజకీయాలు చెల్లవు’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అరుణ... మైక్‌ను విరిచి నేలపైకి విసిరికొట్టారు. తర్వాత పోడియం వద్దకు వచ్చి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమెకు మద్దతుగా ఇతర కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు చేరి నినాదాలు చేశారు. ప్రతిగా టీఆర్ఎస్ సభ్యులు కేకలు వేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో స్పీకర్ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు. -
ఈసారి బడ్జెట్ 1,10,500 కోట్లు
* నేడు అసెంబ్లీలో 2015-16 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి ఈటెల రాజేందర్ * ప్రణాళిక వ్యయం రూ. 52,200 కోట్లు * ప్రణాళికేతర వ్యయం రూ. 58,300 కోట్లు * కేంద్రం నుంచి పన్నుల వాటా, గ్రాంట్లు కలిపి రూ. 18,000 కోట్లు వస్తాయని అంచనా * రెండోసారీ భారీ బడ్జెట్టే.. మిగులు ఖాయం * మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం * బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర తొలి పూర్తిస్థాయి బడ్జెట్ నేడు శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. తొలి ఏడాది పది నెలలకు బడ్జెట్ తయారు చేసిన టీఆర్ఎస్ సర్కారు... ఈసారి పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను రూపొందించింది. ఐదు నెలల వ్యవధిలోనే రెండోసారి రెండో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండడం గమనార్హం. బుధవారం ఉదయం పది గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో శాసనమండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బడ్జెట్ ప్రవేశపెడతారు. మంగళవారంనాటి అసెంబ్లీ సమావేశం ముగిసిన అనంతరం సచివాలయంలో భేటీ అయిన రాష్ట్ర మంత్రివర్గం 2015-16 బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. అనంతరం గవర్నర్ ఆమోదానికి పంపారు. భారీ అంచనాలు.. తొలి ఏడాది తరహాలోనే.. 2015-16 బడ్జెట్‌పైనా భారీ అంచనాలున్నాయి. అందుకే ఈ సారి రూ. 1,10,500 కోట్లతో భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. అందులో ప్రణాళికా వ్యయం కింద రూ. 52,200 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ. 58,300 కోట్లను పొందుపరిచినట్లు సమాచారం. ద్రవ్యలోటు ఉన్నప్పటికీ గత బడ్జెట్ తరహాలోనే మిగులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. 14వ ఆర్థిక సంఘం దేశంలో రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రస్తావించింది. అదే అంశాన్ని ్రపతిబింబించేలా సర్కారు కొత్త బడ్జెట్ తయారు చేసింది. అంచనాల్లో మార్పులు.. నిరుటి బడ్జెట్లో భూముల అమ్మకం, క్రమబద్ధీకరణ ద్వారా రూ. 6,500 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసుకుంది. కానీ దానిద్వారా కేవలం రూ. 120 కోట్ల ఆదాయం రావడం బెడిసికొట్టింది. వచ్చే ఏడాది క్రమబద్ధీకరణ ద్వారా కేవలం రూ. 2,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ప్రభుత్వ వాణిజ్య సంస్థల నుంచి వచ్చే వడ్డీలు, గనులు, పరీక్ష రుసుములు, పాఠ్య పుస్తకాల విక్రయాలు, నీటి సరఫరా నుంచి వచ్చే మొత్తాలు, యూజర్ చార్జీలతో పాటు భూముల అమ్మకం పన్నేతర రాబడుల్లోనే (నాన్ ట్యాక్స్ రెవెన్యూ) ఉంటాయి. గత ఏడాది రూ. 13 వేల కోట్లకుపైగా ఉన్న పన్నేతర రాబడి అంచనా ఈసారి కొంతమేరకు తగ్గుముఖం పట్టనుంది. రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల మంది పింఛన్‌దారులు ఉన్నారు. పెరిగిన వేతన సవరణ ప్రకారం పింఛన్ల వ్యయం కూడా భారీగా ఉండబోతోంది. 2015-16లో తెలంగాణలో పన్నులు, పన్నేతర ఆదాయం ద్వారా రూ. 57,426 కోట్ల రెవెన్యూ ఆదాయం వస్తుందని, రెవెన్యూ ఖర్చు రూ. 56,607 కోట్లు ఉంటుందని 14వ ఆర్థిక సంఘం ఇటీవలి నివేదికలో వెల్లడించింది. ఈ లెక్కన రూ. 818 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని లెక్కలేసింది. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాతో ఈ మిగులు రూ. 15 వేల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. తాజా బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం అదే తీరుగా మిగులును చూపించే అవకాశముంది. కానీ ఆదాయ వ్యయాల్లో ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు అప్పులు, ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితి పెంపు, రాష్ట్రంలో పన్నుల పెంపు, సమర్థంగా పన్నులు వసూలు చేయక తప్పని పరిస్థితి ఉండటంతో... కొత్త బడ్జెట్ ఆసక్తి రేపుతోంది. సంక్షేమమే ధ్యేయం.. బంగారు తెలంగాణ సాధన ధ్యేయంగా ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించేలా రాష్ట్ర సర్కారు ఈ సారి కూడా సంక్షేమానికే పెద్దపీట వేయనుంది. దానితో పాటు పల్లెల ప్రగతి, వ్యవసాయం, నిరుద్యోగులకు ఉపాధి కల్పన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనుంది. గత ఏడాది టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 1,00,637 కోట్లతో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అందులో రూ. 301.02 కోట్ల రెవెన్యూ మిగులును చూపించింది. అయితే రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు ఢోకా లేకున్నా కేంద్రం నుంచి ఆశించినన్ని నిధులు రాకపోవటంతో అంచనాలు తప్పాయి. కేంద్రం నుంచి పన్నుల వాటాతో పాటు గ్రాంట్ల ద్వారా దాదాపు రూ. 30 వేల కోట్లు వస్తాయని భావించగా... కేంద్రం నుంచి వచ్చిన నిధులు రూ. 9,000 కోట్లు దాటలేదు. ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితి వెసులుబాటుకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవటంతో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం రూ. 10 వేల కోట్ల అప్పులు తెచ్చింది. గతంలో ఉన్న అప్పుతో కలిసి ఇది రూ. లక్ష కోట్లకు చేరింది. ఈ వాస్తవాన్ని గుర్తించిన సర్కారు ఈసారి బడ్జెట్‌ను ఆచరణాత్మకంగా రూపొందించింది. రాష్ట్రంలో సొంత పన్నులు, పన్నేతర రాబడి దాదాపు రూ. 60 వేల కోట్లు దాటుతుందని... వీటికి తోడు కేంద్రం నుంచి పెరిగిన పన్నుల వాటా, గ్రాంట్లు కలిపి రూ. 18 వేల కోట్లు వస్తాయనే అంచనాలున్నాయి. దీంతోపాటు మరో రూ. 15 వేల కోట్లు అప్పుగా తెచ్చుకునే అవకాశముంది. మరోవైపు అప్పులపై వడ్డీలకు, బాండ్ల అమ్మకం ద్వారా తెచ్చిన అప్పులకు వడ్డీ చెల్లించేందుకు దాదాపు రూ. 7 వేల కోట్లకుపైగా కేటాయించబోతోంది. -
'వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు'
-
విలీనంపై దద్దరిల్లిన మండలి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులు ఐదుగురిని టీఆర్ఎస్లో విలీనం చేస్తూ మండలి చైర్మన్ స్వామిగౌడ్ జారీ చేసిన బులెటిన్‌పై సోమవారం శాసనమండలి దద్దరిల్లింది. ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన టీడీపీ సభ్యులు సభా కార్యక్రమాలకు అడుగడుగునా అడ్డు తగిలారు. చైర్మన్ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా ఆక్షేపించింది. అయితే, రాజ్యాంగానికి అనుగుణంగానే తాను నిర్ణయం తీసుకున్నానని, ఎవరికైనా సందేహాలు ఉంటే తనకు నోటీసు ఇవ్వాలని చైర్మన్ స్వామిగౌడ్ స్పష్టం చేశారు. మండలిలో ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే గవర్నర్ ప్రసంగంపై ప్రసంగించాల్సిందిగా చైర్మన్ సభ్యులను కోరారు. టీఆర్ఎస్ సభ్యులు ఒకరిద్దరు మాట్లాడాక తమ సభ్యులు ఐదుగురిని టీఆర్ఎస్లో విలీనం చేయడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీకి చెందిన ఎ. నర్సారెడ్డి మాట్లాడుతూ పెద్దల సభ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎలా అని మండిపడ్డారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడం తగదని, పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే హక్కు మండలికి లేదని ఎమ్మెలీ నాగేశ్వర్ అన్నారు. చైర్మన్ ఇచ్చిన రూలింగ్‌ను ఉపసంహరించుకోవాలని సూచించారు. దీనికి స్వామిగౌడ్ సమాధానం ఇస్తూ నిబంధనలకు లోబడే విలీనం నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. మంగళవారం టీడీపీ సభ్యులను తన ఛాంబర్‌కు పిలిచి సలహా తీసుకుంటానన్నారు. దీనికి శాంతించని టీడీపీ సభ్యులు సభలో మరింత రభస చేశారు. మండలి ప్రతిపక్ష నాయకుడు డి.శ్రీనివాస్ మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు విలీనం చేశామని బులిటెన్ విడుదల చేస్తే ఎలా అని... ఇలా అయితే భవిష్యత్తులో ఏ పార్టీ వారినైనా ఇలా చేసే అవకాశం ఉందన్నారు. ఇందులో వాస్తవాలను సభకు చెప్పాలని చైర్మన్‌ను కోరారు. టీఆర్ఎస్ చెప్పినట్టు విలీనం చేశారని టీడీపీ సభ్యుడు నర్సారెడ్డి అనడంతో స్వామిగౌడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను తప్పు చేసినట్లు భావిస్తే నోటీసు ఇవ్వాలని, దానిపై సభలో చర్చకు సిద్ధమని స్వామిగౌడ్ అనడంతో... మంత్రి కడియం శ్రీహరి జోక్యం చేసుకొని ‘చైర్మన్ నిర్ణయం ఫైనల్. దీనిపై చర్చ అవసరమే లేద’ని పేర్కొన్నారు. దీంతో సంతృప్తి చెందని టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి బయటకు వెళ్లిపోయారు. గవర్నర్ ప్రసంగం టీఆర్ఎస్ కరపత్రంలా ఉంది.. గవర్నర్ ప్రసంగం టీఆర్ఎస్ కరపత్రంలా, ఆ పార్టీ ఎన్నికల ప్రణాళికలా ఉందని డీఎస్ వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగంతో ఒరిగేదేమీలేదన్నారు. తాము గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. ‘కేసీఆర్ చాలా మాటలు చెప్పగలరు. అంతా జరిగిపోయినట్లే భ్రమింపజేయగలరు. అందులో ఆయన దిట్ట’ని విమర్శించారు. బంగారు తెలంగాణ కాంగ్రె స్ నినాదమని... ఈ ప్రభుత్వం వజ్రాల తెలంగాణ తీసుకురావాలని ఆయన కోరారు. సోనియాగాంధీ వల్లనే తెలంగాణ సాకారమైందని పేర్కొన్నారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ సోనియానే తెలంగాణ ఇచ్చిందని తాము కూడా అంటున్నామని... ఇంతమంది బలిదానానికి కూడా కారణం ఆమేనని విమర్శించారు. టీఆర్ఎస్ సభ్యులు సుధాకర్‌రెడ్డి, రాములు నాయక్‌లు మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగం బ్రహ్మాండంగా ఉందన్నారు. టీఆర్ఎస్లో టీడీపీ ఎమ్మెల్సీల విలీనం హైదరాబాద్: ఐదుగురు టీడీపీ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో విలీనమైనట్లు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అధికారికంగా గుర్తించారు. ఈ మేరకు శాసనసభ వ్యవహారాల కార్యదర్శి రాజాసదారాం సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ నిబంధన ప్రకారం మండలిలోని టీడీపీ సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది(ఐదుగురు) టీఆర్ఎస్లో చేరినందున వారిని టీఆర్ఎస్ సభ్యులుగా పరిగణిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. దీంతో ఇప్పటివరకు టీడీపీ ఎమ్మెల్సీలుగా ఉన్న బోడకుంటి వెంకటేశ్వర్లు, బి.లక్ష్మీనారాయణ, పట్నం నరేందర్‌రెడ్డి, గంగాధర్‌గౌడ్, మహ్మద్ సలీంను ఇకపై టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తామని, ఆ మేరకు వారికి సీట్లు కేటాయిస్తామని శాసనసభ కార్యదర్శి స్పష్టంచేశారు. టీడీపీకున్న ఏడుగురు సభ్యుల్లో ఐదుగురు ఎమ్మెల్సీలు తాము టీఆర్ఎస్లో విలీనమవుతున్నట్లు గత నవంబర్ 3న కౌన్సిల్ చైర్మన్‌కు ఉమ్మడిగా, వ్యక్తిగతంగా లేఖలు సమర్పించిన సంగతి తెలిసిందే. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో పేర్కొన్న మేరకు తమ సంఖ్య మొత్తం పార్టీ సభ్యుల్లో మూడోవంతు ఉన్నందున ఈ విలీనాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో తాజాగా మండలి చైర్మన్ ఇందుకు ఆమోదం తెలి పారు. ఈ మేరకు తమకు అధికారికంగా సమాచారం అందినట్లు ఆ సభ్యులు కూడా టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో స్వయంగా వెల్లడించారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో (బీఎస్పీ) నుంచి గెలుపొందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు కోనప్ప తాము టీఆర్ఎస్లో విలీనమవుతున్నట్లు రాసిన లేఖలకు శాససనసభ స్పీకర్ ఆమోదం తెలిపారు. ఈ విలీనాన్ని గుర్తిస్తున్నట్లు తాజాగా బులెటెన్ విడుదలైంది. దీంతో వారిద్దరూ అధికారికంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తింపు పొందినట్లయింది. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి, కాగజ్‌నగర్ నుంచి కోనప్ప బీఎస్పీ తరఫున శాసనసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. -
తగునా ఇది.. జానా
హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల ఆరంభంలోనే చోటుచేసుకున్న ఘటనలతో ప్రతిపక్ష కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. సోమవారం నాటి పరిణామాలతో పార్టీ సీనియర్ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తొలిరోజు గవర్నర్ ప్రసంగానికి ముందు జాతీయ గీతాలాపన సమయంలో కొందరు టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు వ్యవహరించిన తీరుపై క్షమాపణ కోరాలని సోమవారం సభా వ్యవహారాల సంఘం సమావేశంలో నిర్ణయించారు. దీనికి ప్రతిపక్ష నేత జానారెడ్డి కూడా సమ్మతి తెలిపారు. అయితే గందరగోళ పరిస్థితుల్లో టీడీపీ సభ్యులు సస్పెండ్ కావడంతో తర్వాత కాంగ్రెస్ వంతు వచ్చింది. పార్టీ సభ్యుడు సంపత్‌కుమార్ క్షమాపణ చెబుతారని ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి సభలోనే చెప్పారు. అయితే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క మాత్రం జానా దగ్గరకు వెళ్లి ఆయన నిర్ణయంతో విభేదించారు. జాతీయ గీతాలాపన విషయంలో టీఆర్ఎస్ సభ్యులు కూడా తప్పుగా వ్యవహరించారని, వారి నుంచి క్షమాపణ కోరకుండా.. కాంగ్రెస్ సభ్యుడి క్షమాపణ అడగడమేంటని జానారెడ్డి దృష్టికి తెచ్చారు. శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు కూడా బాధ్యుడేనని ఆయనతో కాంగ్రెస్ నేతలు వాదించారు. అధికార పార్టీ సభ్యులు కూడా స్పీకర్ వెల్‌లోకి వెళ్లి ప్రతిపక్ష సభ్యులతో దురుసుగా ప్రవర్తించిన విషయంపై చర్చించిన తర్వాతే క్షమాపణ విషయం చూద్దామని పేర్కొన్నారు. దీనికి జానారెడ్డి ససేమిరా అన్నారు. సభా సాంప్రదాయాలు, శాసనసభ గౌరవం వంటి వాటిని విస్మరించి పనిచేయడం తన వల్ల కాదని తెగేసి చెప్పారు. అధికారపక్షంపై దూకుడుగా వ్యవహరించడానికి తనకు అభ్యంతరం లేదని, అందుకు అనుగుణంగా వ్యూహం రూపొందించుకోవచ్చునని జానా అన్నట్లు సమాచారం. ఆయనకు మంత్రి గీతారెడ్డి మద్దతుగా నిలిచినట్లు తెలిసింది. కాంగ్రెస్ నేతలు ఇలా చర్చించుకుంటున్నంత సేపు సంపత్.. క్షమాపణ చెప్పవడానికి బదులు టీఆర్ఎస్ సభ్యులపై ఆరోపణలకు దిగారు. చివరకు క్షమాపణ చెప్పాలని ఓ కాగితంపై జానా రాసి పంపడంతో చేసేదేమీ లేక సంపత్ దాన్ని పాటించారు. తర్వాత లాబీల్లో జానాను కలిసిన ఉత్తమ్, భట్టి మరోసారి అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. అనంతరం జానా మీడియాతో మాట్లాడుతూ జాతీయగీతాన్ని అవమానించిన వారెవరైనా క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. టీఆర్ఎస్ సభ్యులు కూడా తప్పుచేశారని, వాటికి సంబంధించిన వీడియో క్లిప్పింగుల కోసం కూడా అడిగినట్టుగా ఆయన చెప్పారు. వాటి ఆధారంగా సభ్యుల తప్పొప్పులపై నిర్ణయం జరగాలన్నారు. -
ప్రజాక్షేత్రంలోకి టీడీపీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల నంచి సస్పెండైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించారు. పార్టీ అధినేత చంద్రబాబుతో వారు సోమవారం రాత్రి చర్చించారు. శాసనసభలో మాట్లాడే అవకాశం లేకుండా సస్పెండ్ చేసినప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్లడమే మార్గమని సూచించినట్టు తెలిసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ప్రజా సమస్యలపై ప్రతీరోజు చర్చ ఉండే విధంగా ప్రత్యక్ష కార్యాచరణపై ప్రణాళిక రూపొందించుకోవాలని చంద్రబాబు సూచించారు. దీనికోసం మంగళవారమే భేటీ కావాలని తెలంగాణ టీడీపీ నిర్ణయించింది. అలాగే గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. తర్వాత జిల్లాల వారీగా బస్సు యాత్రలను నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ సమావేశంలో ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు, అరికెల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలుగుదేశం పార్టీ సెల్ఫ్ గోల్!
హైదరాబాద్: అసెంబ్లీలో అధికార పార్టీ పక్కా వ్యూహంతో వ్యవహరించగా.. విపక్ష టీడీపీ సెల్ఫ్‌గోల్ చేసుకుంది. సమావేశాల తొలిరోజున(శనివారం) గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన ఉదంతాన్ని టీఆర్ఎస్ గట్టిగా పట్టుకుంది. జాతీయగీతాన్ని అవమానించిన విషయాన్ని ఎత్తిచూపి ఇతర పక్షాల మద్దతును కూడగట్టింది. ఈ వ్యవహారాన్ని క్షమాపణతో సరిపెట్టాలనుకున్నా.. టీడీపీ స్వీయ తప్పిదాలే టీఆర్ఎస్కు అనుకూలంగా మారాయి. సభకు అడ్డు తగులుతున్నారన్న కారణంతో పది మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంతో కీలకమైన బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ గొంతు మూగబోయింది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కష్ణయ్య మినహా ఆ పార్టీకి ప్రస్తుతం సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. నిజానికి సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ టికెట్‌పై గెలిచి, టీఆర్ఎస్ తీర ్థం పుచ్చుకుని మంత్రి కూడా అయిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని టీడీఎల్పీ వ్యూహ రచన చేసుకుంది. కానీ, ఆచరణలో విఫలమై అధికార పక్షానికి చిక్కింది. అనుకున్నదొక్కటి..అయ్యిందొక్కటి! గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే క్రమంలో మంత్రి తలసాని అనర్హత అంశాన్ని ప్రస్తావించి, ఆయనను బర్తరఫ్ చేయాలన్న డిమాండ్‌ను వినిపిం చిన టీడీపీ.. సోమవారం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. తొలిరోజు ఘటనపై స్పీకర్ వద్ద జరిగిన ఫ్లోర్‌లీడర్ల సమావేశంలో వీడియో ఫుటేజీ కోసం టీడీపీ డిమాండ్ చేసింది. చివరకు క్షమాపణకు అంగీకరించకుండానే భేటీ నుంచి బయటకొచ్చింది. రెండోరోజు క్షమాపణ చెప్పే విషయంపై టీడీఎల్పీ నేత ఎర్రబెల్లికి స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడే అవకాశమిచ్చారు. స్పీకర్ పదే పదే కోరినా పట్టించుకోకుండా.. కేబినెట్లో ఎస్సీ, ఎస్టీ, మహిళలకు అవకాశమివ్వాలంటూ తమకు సంబంధం లేని కొత్త నినాదాన్ని తలకెత్తుకుని టీడీపీ బొక్క బోర్లాపడింది. ఎమ్మెల్యే పదవికి తలసాని రాజీనామా చేసినా.. అది స్పీకర్ వద్దే పెండింగులో ఉంది. ఈ సమావేశాలకు ఆయన మంత్రిగా హాజరుకావడాన్ని జీర్ణించుకోలేకపోయిన టీడీపీ చివరకు ఆ విషయాన్నే పక్కనబెట్టింది. ‘క్షమాపణ చెప్పాల్సిన ఐదుగురు ఎమ్మెల్యేల వరకు సస్పెండ్ అయినా బాగుండేది. కనీసం మరో ఐదుగురం సభలో ఉండి గొంతు వినిపించేవాళ్లం. ఇపుడు అవకాశం లేకుండా పోయింది’ అని సస్పెండ్ అయిన ఓ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తంచేశారు. తలసాని వ్యవహారంలో ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి టీఆర్ఎస్ బయట పడిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇక టీడీపీ సభ్యులను ఏకంగా సెషన్ మొత్తం సస్పెండ్ చేయడాన్ని విపక్షాలు తప్పుబట్టినప్పటికీ సభలో ఎవరూ ఆ పార్టీకి మద్దతుగా నిలవలేదు. టీ విరామ సమయం తర్వాత బీజేపీపక్ష నేత లక్ష్మణ్ ఈ అంశాన్ని లేవనెత్తినా అధికారపక్షం లెక్కపెట్టలేదు. బడ్జెట్ తర్వాతే ఈ సస్పెన్షన్ నిర్ణయాన్ని సమీక్షించే అవకాశముందని రాజకీయవర్గాలు అంటున్నాయి. -
సభలో క్షమాపణ రచ్చ
హైదరాబాద్ : విపక్ష సభ్యులు జాతీయగీతాన్ని అవమానపరిచారన్న దానిపై కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ క్షమాపణ వ్యవహారం సోమవారం అసెంబ్లీలో ఆసక్తి రేపింది. ‘క్షమాపణ’ అనే పదం వాడకుండానే అధికార సభ్యులను ఇరుకున పెట్టేందుకు ఆయన ప్రయత్నించారు. క్షమాపణ చెప్పడం లేదంటూ స్పీకర్ పదే పదే మైక్ కట్ చేయడం.. సంపత్ సస్పెన్షన్‌కు హరీశ్ సిద్ధమవడం.. ప్రతిపక్ష నేత జానారెడ్డి కల్పించుకొని క్షమాపణ చెప్పాలని సొంత పార్టీ సభ్యుడికే సూచించడం వంటి పరిణామాలతో శాసనసభలో హైడ్రామా చోటు చేసుకుంది. నాలుగుసార్లు మైక్ కట్ టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌కు స్పీకర్ మాట్లాడే అవకాశమిచ్చారు. అయితే క్షమాపణ అంశాన్ని పక్కనబెట్టి.. గవర్నర్ ప్రసంగం సందర్భంగా టీఆర్ఎస్ సభ్యులు వ్యవహరించిన తీరుపై సంపత్ చురకలంటించారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. స్పీకర్ చూపిన వీడియో ఫుటేజీ స్పష్టంగా లేదని కూడా ఆయన చెప్పారు. దీంతో క్షమాపణ చెప్పడం లేదంటూ స్పీకర్ మైక్ కట్ చేశారు. జానారెడ్డి జోక్యం చేసుకుని తమ సభ్యుడు క్షమాపణ చెప్పేందుకు అవకాశమివ్వాలని కోరడంతో స్పీకర్ మళ్లీ అవకాశమిచ్చారు. సంపత్ మళ్లీ అధికార పార్టీ సభ్యులపై ధ్వజమెత్తారు. దీనికి టీఆర్ఎస్ సభ్యులు అడ్డుతగిలారు. దీంతో స్పీకర్ మళ్లీ మైక్ కట్ చేశారు. తిరిగి అవకాశం ఇచ్చినప్పుడు సంపత్ మాట్లాడుతూ ‘సభ ఆర్డర్లో లేని పరిస్థితుల్లో జాతీయ గీతాలాపన మొదలుపెట్టారు. ఈ విషయంలో ఒకరికి ఒక నీతి, మరొకరికి ఇంకో నీతి ఉండకూడదు. అవమానపరిచే రీతిలో వ్యవహరించిన అందరితో క్షమాపణ చెప్పించండి’ అన్నారు. క్షమాపణ చెప్పకపోవడంతో మంత్రి హరీష్‌రావుకు స్పీకర్ మైక్ ఇచ్చారు. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆహ్వానిస్తామని మంత్రి అన్నారు. అనంతరం సంపత్‌కు తిరిగి స్పీకర్ మైకివ్వగా, ఎవరో చెప్పింది చెప్పేందుకు సభకు రాలేదని ఆయన అనడంతో సభలో మళ్లీ గందరగోళం రేగింది. క్షమాపణ చెప్పాలని అధికార పార్టీ నేతలు నినాదాలు చేస్తుండటం, సంపత్ క్షమాపణ చెప్పకపోవడంతో స్పీకర్ మళ్లీ మైక్ కట్ చేశారు. దీంతో మంత్రి హరీష్ లేచి సభ్యుడు క్షమాపణ చెప్పనందున సస్పెన్షన్ ప్రతిపాదన చేయబోయారు. ఈ దశలో మరోమారు కల్పిం చుకున్న జానారెడ్డి.. క్షమాపణకే పరిమితం కావాలని సంపత్‌కు సూచించారు. దీంతో మళ్లీ లేచిన సంపత్ ‘జరిగిన సంఘటనకు చింతి స్తున్నా. బాధపడుతున్నా. క్షమించాలని కోరుతున్నా’ అనీ అనగానే స్పీకర్ మైక్ కట్ చేశారు. విద్యా సంస్థల్లో గీతాలాపన అంశం ప్రస్తావన కాగా, కొందరు ప్రజా ప్రతినిధులు తమ విద్యా సంస్థల్లో జాతీయగీతాలాపన చేయడం లేదని సంపత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారు ఇప్పుడు జాతీయ గీతాన్ని అవమానిస్తారా అని మండిపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలకు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఘాటుగా స్పందించారు. సంపత్ ఎవరి పేరునూ ప్రస్తావించనప్పటికీ అక్బరుద్దీన్ స్పందించిన తీరును సభ్యులు ఆసక్తిగా గమనించారు. విద్యా సంస్థల్లో జాతీయ గీతాలాపన చేయకుండా ఆంక్షలు పెట్టిన వారెవరో బయటపెట్టాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. ‘ఇది చాలా తీవ్ర అంశం. దీన్ని అన్ని పార్టీలు సీరియస్‌గా తీసుకోవాలి. వారి వారి సంస్థల్లో జాతీయ గీతాలాపన చేయని వారిని కఠినంగా శిక్షించాలి. దేశంలో ఉంటూ, ఇక్కడి ఉప్పు తింటూ జాతీయ గీతాలాపన చేయకపోవడం దారుణం. అలాంటి వారు దేశం బయట ఉండాలి’ అన్నారు. జాతీయ గీతాన్ని ఎవరు అగౌరవ పరిచినా కేవలం క్షమాపణతో సరిపోదని, వారిపై కఠిన చర్యలుండాలన్నారు. ఇది దేశ సమగ్రతకు సంబంధించిన అంశమని, ఈ విషయంలో మెతక వైఖరి మంచిది కాదని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. -
సంక్షేమ కోణంలోనే బడ్జెట్: ఈటెల
హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్‌ను (2014) సంక్షేమ కోణంలో ప్రవేశపెట్టాం. అప్పుడుదాన్ని పది నెలలకాలానికే తయారు చేశాం. 2015-16 సంవత్సరానికి సంబంధించి.. పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. తొలి ఏడాదితో పోలిస్తే మా ప్రభుత్వ ప్రాధాన్యమేమీ మారలేదు. ఈ బడ్జెట్లోనూ ప్రజల సంక్షేమానికే పెద్దపీట వేస్తాం. సంక్షేమంతో పాటు వ్యవసాయం, నిరుద్యోగుల ఉపాధి కల్పనకు ప్రాధాన్యమిస్తాం’ అని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ వార్షిక బడ్జెట్ ఎలా ఉండబోతోందో సంక్షిప్తంగా వివరించారు. బుధవారం 11వ తేదీన అసెంబ్లీలో ఆయన తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కొత్త బడ్జెట్ ... ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి తన అభిప్రాయాలు వెల్లడించారు. ‘గతంతో పోలిస్తే ఆర్థిక అంశాలపై అవగాహన పెరిగింది. బృహత్తర పథకాలు.. భారీ అంచనాలుండటంతో వీటన్నింటికీ డబ్బులు ఎక్కడినుంచి తెస్తారు? అని అనుకుంటున్నారు. తెలంగాణ రెవెన్యూ మిగులు రాష్ట్రమని 14వ ఆర్థిక సంఘం ఇటీవలే తమ నివేదికలో స్పష్టం చేసింది’ అని అన్నారు. గత బడ్జెట్ అంచనాలు తప్పింది కదా? అన్న ప్రశ్నకు స్పం దిస్తూ .. ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదని మంత్రి అంగీకరించారు. సీఎం ఇస్తున్న హామీలు ఆర్థికంగా భారంగా మారుతున్నాయా..? అన్న ప్రశ్నకు బదులిస్తూ ‘సీఎం ఇచ్చే హామీలన్నీ ప్రజసంక్షేమానికి సంబంధించినవే. ప్రజల ఆశలు, ఆకాంక్షలనే మేం పథకాలుగా రూపకల్పన చేశాం. మేనిఫెస్టోలో ప్రకటించకున్నా కల్యాణ లక్ష్మి, మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ పథకాలను ప్రవేశపెట్టాం. వీటిని అమలు చేసేందుకు నిధుల కొరత ఉంటుందని అనుకోవడం లేదు. ఇప్పుడున్న పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం వద్ద పక్కా ప్రణాళిక ఉంది’ అని తెలిపారు. రాష్ట్రం కుదురుకోవద్దన్నదే టీడీపీ అభిమతం ‘ఈ రాష్ట్రం కుదురుకోవద్దని, కుక్కలు చింపిన విస్తరిలా కావాలని టీడీపీ కోరుకుంటోంది, ఇది తప్ప ఆ పార్టీకి మరో ఎజెండా లేదు’ అని ఈటెల తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ కాళ్లకింద భూమి ఇప్పటికే కదిలిపోయిందని వ్యాఖ్యానించారు. ‘ఏపీలో వైఎస్ఆర్సీపీని చీల్చి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకుంటున్న టీడీపీ ఇక్కడ మాత్రం గగ్గోలు పెడుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తున్న రాద్ధాంతం చేస్తున్నారు’ అని మండిపడ్డారు. -
క్షమాపణ చెప్పే అవకాశమూ ఇవ్వరా?
హైదరాబాద్: బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేవరకు తెలుగుదేశం పార్టీ సభ్యులను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయటాన్ని బీజేపీ తప్పుపట్టింది. గవర్నర్ ప్రసంగం సమయం లో జాతీయగీతాలాపన సందర్భంగా ఆ పార్టీ సభ్యులు అనుచితంగా ప్రవర్తించారని తేలితే క్షమాపణ చెప్పేందుకు అవకాశం కూడా ఇవ్వకుండా సస్పెం డ్ చేస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకోవటం సరికాదని బీజేపీ శాసనసభా పక్ష నేత లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తర్వాత మధ్యాహ్నం టీ విరామం అనంతరం సభ ప్రారంభమవుతూనే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి మద్దతుగా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ప్రసంగం ప్రారంభించారు. వెంటనే లక్ష్మణ్ లేచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాం డ్ చేశారు. టీడీపీ సభ్యులు అనుచితంగా వ్యవహరించారని సస్పెండ్ చేసినప్పుడు, అదేసమయంలో అధికారపక్ష సభ్యులు కూడా తమ స్థానాల నుంచి పక్కకు వచ్చిన విషయాన్ని ఎందుకు పరిగణించలేదని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దీనిపై హరీశ్ మాట్లాడుతూ జరిగిన పొరపాటుకు క్షమాపణ చెప్పాల్సిందిగా పేర్కొంటూ స్పీకర్ వారిని పలుమార్లు అడిగారని, అయినా వారు స్పందించలేదని, తప్పని పరిస్థితిలోనే సస్పెం డ్ చేయాల్సి వచ్చిందని అన్నా రు. దీనికి నిరసనగా బీజేపీ వాకౌట్ చేసింది. ఆ రెండు పార్టీల మధ్య ఎన్నికల అవగాహన ఉండటం, త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నందున అందు లో లబ్ధి చేజారుతుందనే భావనతోనే వాకౌట్ చేశారని హరీశ్ ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాల గొంతునొక్కే ఆలోచన అధికారపక్షానికి లేదని, టీడీపీ సభ్యుడు ఆర్.కృష్ణయ్య సభలో ఉన్నా తామేమీ అభ్యంతరం వ్యక్తం చేయకపోవటమే దీనికి నిదర్శనమన్నారు. జాతీయ గీతాలాపన సమయంలో అధికారపార్టీ సభ్యుల ప్రవర్తనపై వీడియో ఫుటేజ్ పరిశీలించి చర్యలు తీసుకోవాలని సీఎల్పీ నేత జానారెడ్డి డిమాండ్ చేశారు. -
బడ్జెట్‌కు నేడు కేబినెట్ ఆమోదం
హైదరాబాద్: సంప్రదాయానికి భిన్నంగా తెలంగాణ వార్షిక బడ్జెట్‌కు ఈసారి ఒక రోజు ముందే రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలపనుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆనవాయితీ ప్రకారం అదే రోజు ఉదయం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌ను ఆమోదిస్తుంది. ఆ వెంటనే గవర్నర్‌కు పంపించి ఆయన ఆమోద ముద్ర తర్వాత సభలో ప్రవేశపెడుతుంది. కానీ.. ఈసారి ఒక రోజు ముందే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను నిర్వహిస్తోంది. బడ్జెట్‌కు ఆమోదం తెలిపేందుకు మంగళవారం సాయంత్రం కేబినెట్ భేటీ అవనుంది. ఆ వెంటనే గవర్నర్‌కు పంపించి సభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి తీసుకోనుంది. బుధవారం గవర్నర్ స్థానికంగా అందుబాటులో ఉండే అవకాశం లేదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
నిధులు మూరెడు.. పథకాలు బారెడు!
హైదరాబాద్: పథకాలు బారెడు.. నిధులు మాత్రం మూరెడు అన్నట్లుగా ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. ఎన్నో పథకాలను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. నిధుల సమీకరణ కోసం భారీ అంచనాలే వేసింది. కానీ ఆ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. రాష్ట్రంలో ఆశించిన ఆదాయం రాకపోవడంతో పాటు, కేంద్ర పన్నుల వాటా ఆదాయం కూడా తగ్గిపోవడంతో సర్కారు నెత్తిన పిడుగుపడినట్లయింది. మొత్తంగా రూ. లక్ష కోట్లకు పైగా అంచనాలతో భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినా.. మార్చి నెలాఖరుకు రాష్ట్ర ఆదాయ వ్యయాల మొత్తం రూ. 70 వేల కోట్లకు మించేలా కనిపించడం లేదు. దీంతో బడ్జెట్లో భారీగా కోతలు తప్పదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఈ సారి బడ్జెట్‌పైనే.. రాష్ట్ర ఆవిర్భావంతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్ ఆసక్తి రేపుతోంది. బంగారు తెలంగాణ లక్ష్యంగా ఎంచుకొని.. సంక్షేమమే ఎజెండాగా గత నవంబర్‌లో పది నెలల కాలానికి ప్రభుత్వం తొలి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఐదు నెలల వ్యవధిలోనే రెండో బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. మరి ఈ సారి బడ్జెట్ ప్రజాకాంక్షలను ప్రతిబింబిస్తుందా, సరిపడేన్ని నిధులు కేటాయిస్తారా? అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిధుల సమీకరణ ప్రశ్నార్థకమే.. కేంద్రం నుంచి పన్నుల వాటా తగ్గటం, రాష్ట్రంలోనూ ఆశించిన స్థాయిలో నిధులు సమకూరని నేపథ్యంలో... దాదాపు రూ. రెండున్నర లక్షల కోట్ల భారీ మొత్తం ఎలా సమకూరుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు రాష్ట్రంలో ప్రణాళికేతర వ్యయం పెరిగిపోతోంది. వేతన సవరణతో ఏటా రూ. 6,500 కోట్ల భారం పెరిగింది. ఇప్పటికే ప్రణాళికేతర వ్యయం ఏటా రూ. 50 వేల కోట్లు దాటింది. ఇంత ప్రణాళికేతర వ్యయా న్ని భరిస్తూ అభివృద్ధికి నిధులు సమకూర్చాలంటే.. ప్రభుత్వానికి కత్తిమీద సామే. తొలి ఏడాదే దాదాపు రూ. 10 వేల కోట్లు అప్పు తెచ్చిన సర్కారుకు... ఇక ముందు రుణాలు చేయడం తప్ప గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది. భారీ పథకాల పురోగతి.. రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేసేందుకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ. లక్ష వరకు పంట రుణాల మాఫీని ప్రభుత్వం అమలు చేసింది. మొదటి విడతగా తొలి బడ్జెట్లో రూ. 4,250 కోట్లు ఇచ్చింది. మిగతా దాదాపు రూ. 12,750 కోట్లను మూడు విడతలుగా వచ్చే మూడేళ్లలో చెల్లిస్తామని ప్రకటించింది. ఇక ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా నీటిని అందించేందుకు రూ. 25 వేల కోట్లతో వాటర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తామని గత బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. ఇందుకోసం తొలి ఏడాది రూ. 2,000 కోట్లు కేటాయించారు. కానీ ఇప్పటికీ నిధుల విడుదల లేదు. మరోవైపు చిన్నతరహా సాగునీటి చెరువులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమాన్ని తలపెట్టింది. రాబోయే ఐదేళ్లలో రూ. 20 వేల కోట్ల అంచనాతో 46,447 చెరువులు, కుంటలను పునరుద్ధరించాలని లక్ష్యంగా ఎంచుకుంది. ఇందులో గత ఏడాది రూ. 2,000 కోట్లు కేటాయించింది. ఇంకా రూ.18,000 కోట్లు కావాలి. డబుల్ బెడ్ కింద ఎన్ని ఇళ్లు.. గత ఏడాది బడ్జెట్లో పేర్కొన్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికీ పట్టాలెక్కలేదు. రూ. 3.50 లక్షలతో ఒక్కో ఇంటిని నిర్మిస్తామని ప్రకటించిన టీఆర్ఎస్ సర్కారు... ఎన్ని ఇళ్లను నిర్మించాలి, ఎప్పుడు ఈ పథకాన్ని ప్రారంభించాలనేది నిర్ణయించలేదు. పాత గృహ నిర్మాణ పథకంలో జరిగిన అవినీతి, అవకతకల విచారణతో దీనికి ముడిపెట్టింది. సమగ్ర సర్వే ప్రకారం పది జిల్లాల పరిధిలో 14 లక్షలకుపైగా ఇళ్లను నిర్మించాల్సి ఉంటుంది. జిల్లాకో లక్ష ఇళ్ల చొప్పున ఐదేళ్లలో పది లక్షల ఇళ్లు నిర్మించాలనేది సర్కారు ఆలోచన. ఈ లెక్కన రూ. 35,000 కోట్ల బడ్జెట్ అవసరం. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 33 సాగునీటి ప్రాజెక్టులకు రూ. 40,000 కోట్లు అవసరం. కొత్తగా రూ. 16,000 కోట్ల అంచనాతో పాలమూరు ఎత్తిపోతల పథకానికి టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో సాగునీటి ప్రాజెక్టులకు భారీగానే నిధుల అవసరముంది. మొగ్గు దేనివైపు..? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, రుణమాఫీ, ఎస్సీ, బీసీల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులకు నిధులెలా వస్తాయనే దానిపై సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికీ పట్టాలెక్కని డబుల్ బెడ్ రూం ఇళ్లు, కేజీ టు పీజీ, రహదారుల నిర్మాణానికి సర్కారు ఈ సారైనా మొగ్గు చూపుతుందా..? అనేదానిపై స్పష్టత లేదు. ఈ పథకాలన్నింటికీ ప్రభుత్వం ఐదేళ్ల కాల పరిమితి పెట్టుకుంది. కానీ ఆరంభస్థాయిలోనే తొలి ఏడాది ముగిసింది. మిగతా నాలుగేళ్ల వ్యవధిలో ఈ పథకాలన్నీ సాకారం కావాలంటే.. ప్రభుత్వానికి కనీసం రూ. 2.50 లక్షల కోట్లు అవసరమవుతాయి. మరింత సంక్షేమం.. రాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటించిన సర్కారు... రాబోయే ఐదేళ్లలో ఎస్సీల సమగ్ర అభివృద్ధికి రూ. 50 వేల కోట్లను వ్యయం చేస్తామని ప్రతిపాదించింది. కానీ అందులో తొలి ఏడాది ప్రకటించింది కేవలం రూ. 1,000 కోట్లు మాత్రమే. అంటే మరో రూ. 49 వేల కోట్లు కావాలి. ఇక రాష్ట్ర జనాభాలో అధికంగా ఉన్న బీసీల అభివృద్ధికి రాబోయే ఐదేళ్లలో రూ. 25 వేల కోట్లు సమకూరుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందులో తొలి ఏడాది రూ. 2,022 కోట్లు కేటాయించింది. ఇంకా భారీగా నిధులుకావాల్సి ఉంది. ఇక వచ్చే రెండేళ్లలో రూ. 10 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా రహదారులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ తొలి బడ్జెట్లో ఇచ్చింది కేవలం రూ. 400 కోట్లే. ఉచిత విద్యుత్, కొత్త విద్యుత్ ప్రాజెక్టులకు గత ఏడాది రూ. 4,500 కోట్లు ప్రతిపాదించారు. ఈ లెక్కన విడుదల చేసినా.. రాబోయే నాలుగేళ్లకు రూ. 18,000 కోట్లు అవసరం. వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, గీత కార్మికులకు ఇచ్చే పింఛన్లను రూ. వెయ్యికి పెంచటం, వికలాంగులకు రూ. 1,500 పింఛన్, బీడీ కార్మికులకు కూడా వర్తింపు వంటివాటితో పింఛన్ల కోసం ఏటా రూ.4000 కోట్లు అవసరం పడుతోంది. అంటే మిగతా నాలుగేళ్లలో అవసరమైనది ఏకంగా రూ. 16,000 కోట్లు. -
ఎల్లో టెన్ సస్పెన్షన్
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాల వేడి తగ్గలేదు. రెండో రోజు కూడా నిరసనల పర్వం కొనసాగింది. సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో ఇందుకు కారణమైన పది మంది టీడీపీ సభ్యులపై వేటు పడింది. సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్న ఎమ్మెల్యేలను సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు ప్రతిపాదించడం, తీర్మానాన్ని సభ ఆమోదించడం క్షణాల్లో జరిగిపోయింది. అసెంబ్లీ కార్యకలాపాలను ఎవరు అడ్డుకోవాలని చూసినా పనిగట్టుకొని సస్పెండ్ చేస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించడంతో సభలో మరింత వేడి పుట్టింది. శనివారం బడ్జెట్ సమావేశాల ప్రారంభంలోనే గవర్నర్ ప్రసంగానికి టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు అడుగడుగునా అడ్డుతగిలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం కూడా సభ మొదలుకాగానే అగ్గి రాజుకుంది. గవర్నర్ ప్రసంగం సందర్భంగా జాతీయ గీతాన్ని అవమానపరిచిన ప్రతిపక్ష సభ్యులు క్షమాపణ చెప్పాలని అధికార పార్టీ ఒకవైపు.. మంత్రివర్గంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని టీడీపీ సభ్యులు మరోవైపు పట్టుబట్టడంతో తీవ్ర దుమారం రేగింది. ఈ క్రమంలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన టీడీపీ నేతలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. దీంతో ఈ సమావేశాలు ముగిసేవరకు పది మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రి హరీశ్‌రావు ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని స్పీకర్ మధుసూదనాచారి ఆమోదించడంతో సదరు ఎమ్మెల్యేలను మార్షల్స్ బలవంతంగా సభ నుంచి బయటకు తీసుకెళ్లారు. అయితే ఈ చర్యపై కాంగ్రెస్, బీజేపీ అభ్యంతరం తెలిపాయి. ఆది నుంచీ సభలో గందరగోళం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన అసెంబ్లీ.. సోమవారం గంట ఆలస్యంగా 11 గంటలకు మొదలైంది. ఆ వెంటనే టీడీపీ సభ్యులు పోడియంలోకి దూసుకొచ్చారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ మంత్రివర్గంలో మాల, మాదిగ, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలంటూ నినాదాలు చేశారు. దీంతో మంత్రి హరీశ్‌రావు కల్పించుకుని.. జాతీయ గీతాన్ని అవమానించిన సభ్యులు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై మాట్లాడటానికి టీడీపీపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుకు స్పీకర్ మైక్ ఇచ్చారు. అయితే ఆయన మాట్లాడేందుకు లేచినా ఇతర సభ్యుల నినాదాలతో గందరగోళం మధ్య మాట్లాడలేకపోయారు. దీంతో మళ్లీ హరీశ్‌రావు లేచి మాట్లాడుతూ.. టీడీపీ సభ్యుల ధోరణి చూస్తే సభను అడ్డుకోవడానికే వచ్చినట్లు అనిపిస్తోందన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పది మంది సస్పెన్షన్ కోరుతున్నట్లు మంత్రి ప్రతిపాదించారు. దీంతో టీడీపీ సభ్యులు ఎర్రబెల్లి దయాకర్‌రావు(పాలకుర్తి), రేవంత్‌రెడ్డి(కొడంగల్), సండ్ర వెంకట వీరయ్య(సత్తుపల్లి), వివేకానంద(కుత్బుల్లాపూర్), అరికెపూడి గాంధీ(శేరిలింగంపల్లి), సాయన్న(కంటోన్మెంట్), మాగంటి గోపీనాథ్(జూబ్లీహిల్స్), మాధవరం కృష్ణారావు(కూకట్పల్లి), ప్రకాశ్‌గౌడ్(రాజేంద్రనగర్), రాజేందర్‌రెడ్డి(మక్తల్)ని బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్, బీజేపీ తప్పుబట్టాయి. టీడీపీ సభ్యులను రెండు, మూడు రోజుల పాటు కాకుండా సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడం సరికాదని, దీనిపై పునరాలోచించాలని కోరాయి. జాతీయ గీతాలాపన సందర్భంగా జరిగిన మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియోలను పరిశీలించి పారదర్శకంగా వ్యవహరించాలని ఆ పార్టీలు అభిప్రాయపడ్డాయి. సభను అడ్డుకుంటే అంతే: కేసీఆర్ సస్పెన్షన్‌పై పునరాలోచించాలని సీఎల్పీ నేత జానారెడ్డి చేసిన సూచనపై ముఖ్యమంత్రి స్పందించారు. టీడీపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే సభను అడ్డుకోవాలని చూస్తున్నారని, దీన్ని ఉపేక్షించబోమని అన్నారు. ‘అసంబద్ధమైన, అనవసరమైన రభస సృష్టించాలనే ఉద్దేశంతో టీడీపీ సభ్యులున్నారు. ఇంత అసహనంగా వ్యవహరించడం రాష్ట్రానికి మంచిది కాదు. ప్రతిరోజూ వాయిదా తీర్మానాలు జరగాలంటే కుదరదు. జాతీయగీతాన్ని అవమానించడమే కాకుండా గవర్నర్‌నూ కించపరిచారు. అధికారపక్ష సభ్యులు కూడా అలా ప్రవర్తించి ఉంటే వారితోనూ క్షమాపణ చెప్పిద్దాం. ప్రతి అంశంపై చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే బడ్జెట్ సమావేశాలను మరిన్ని రోజులు పెంచడానికీ సిద్ధమే. అయితే కొందరు మాత్రం సభ జరగనివ్వమంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం. సభను జరగనివ్వని వారిని పనిగట్టుకొని సస్పెండ్ చేస్తాం. ఇంకా ఏ రకమైన చర్యలకైనా వెనుకాడం. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఔన్నత్యాన్ని జాతీయ స్థాయిలో కాపాడుతాం. దాన్ని దెబ్బతీయాలని చూస్తే గుణపాఠం తప్పదు’ అని కేసీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇప్పటికిప్పుడు కొంపలు అంటుకోవట్లేదని, తప్పుచేసినట్లు సదరు సభ్యులు తెలుసుకుంటే సస్పెన్షన్ కుదింపుపై రెండుమూడు రోజుల తర్వాత నిర్ణయం తీసుకుందామని సీఎం అన్నారు. కేసీఆర్ మాట్లాడిన తర్వాత.. పార్టీ ఫిరాయింపులు, కరువు మండలాల ప్రకటనపై పలువురు సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. -
క్షమాపణ చెప్పించాల్సిందే!
హైదరాబాద్: శాసనసభలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన గలాటా, జాతీయగీతానికి అవమానం జరగడంపై బాధ్యులతో క్షమాపణ చెప్పించాలని శాసనసభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశం అభిప్రాయపడినట్లు సమాచారం. శనివారం శాసనసభలో గవర్నర్ ప్రసంగం సమయంలో, జాతీయ గీతాలాపన సమయంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు సభ్యులు టేబుళ్లు ఎక్కి, నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. దాంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలను బీఏసీ సమావేశంలో ఫ్లోర్‌లీడర్లకు చూపించి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం ఉదయమే స్పీకర్‌తో మంత్రి హరీశ్‌రావు, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, డి.శ్రీనివాస్, టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, డాక్టర్ లక్ష్మణ్, సున్నం రాజయ్య, రవీంద్రకుమార్ భేటీ అయ్యారు. ఘటనకు బాధ్యులైన సభ్యులపై చర్య తీసుకోవాలని ఎంఐఎం అంతకు ముందే స్పీకర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీంతో ఆ పార్టీ నేత అక్బరుద్దీన్ ఒవైసీ సమావేశానికి హాజరుకాలేదు. ఈ సందర్భంగా శని వారం నాటి సభలోని వీడియో దృశ్యాలను ఫ్లోర్‌లీడర్లకు చూపారు. అవి చూసిన నేతలంతా బాధ్యులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే ఆ రోజు మొత్తం రికార్డయిన దృశ్యాలను చూపాలని, ఎడిట్ చేసి చూపిస్తే ఎలాగని టీడీపీ అభ్యం తరం తెలిపిన ట్లు సమాచారం. ముందు జాతీయ గీతాన్ని అవమానించిన విషయాన్ని తేల్చాక.. మిగతా దృశ్యాలు కూడా చూపెడతామని మంత్రి హరీశ్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా క్షమాపణ చెప్పాలన్న నిర్ణయం జరిగిందని అధికారపక్షం పేర్కొన గా.. తాము అంగీకరించలేదని టీడీపీ, మరోసారి అన్ని దృశ్యాలు చూపాలని ఇతర నేతలు కోరినట్లు సమాచారం. జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డి, గాంధీ, ప్రకాశ్‌గౌడ్, వివేకానంద, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ టేబుళ్లు ఎక్కినట్లు నిర్ధారించారని.. వారు క్షమాపణ చెబితే చాలని బీఏసీ భేటీలో నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సీట్ల కేటాయింపు.. గందరగోళం శాసనసభలో ఎట్టకేలకు సభ్యులకు సీట్ల కేటాయింపు జరిగింది. గత సంప్రదాయాలకు అనుగుణంగానే అధికారపక్ష సభ్యులకు స్పీకర్ స్థానానికి కుడివైపున, విపక్ష సభ్యులకు ఎడమవైపున సీట్లను కేటాయించారు. అధికారపక్షం వైపు ముందు సీట్లన్నీ మంత్రులకు, విపక్షం వైపు ముందుసీట్లను ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఇచ్చారు. సీపీఐ, సీపీఎంలకు మాత్రం ముందు వరుసలో సీట్లు లభించలేదు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లిన తాటి వెంకటేశ్వర్లు పార్టీ ఫ్లోర్లీడర్గానే కొనసాగుతుండటంతో ఆయనకు కూడా ముందు వరుసలోనే సీటు కేటాయించారు. ఇక ఈ సారి తొలిసారిగా సభ్యులకు సీట్లు కేటాయించి, పేర్లను అతికించడంతో... సభలోకి వచ్చిన సభ్యులంతా తమ సీట్లను వెతుక్కుంటూ కనిపించారు. ఇక పార్టీల వారీగా సీట్ల కేటాయింపు ఉండటంతో పార్టీలు మారిన ఎమ్మెల్యేలు ఎక్కడ కూర్చోవాలో తెలియక గందరగోళంలో పడి.. మంత్రుల వద్దకు వెళ్లి ఆరా తీశారు. పార్టీ మారిన టీడీపీ సభ్యులు చల్లా ధర్మారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కనకయ్య తదితరులు సభ ప్రారంభానికి ముందు వరకూ వారికి కేటాయించిన సీట్లలోనే కూర్చోగా... సభ ఆరంభమయ్యాక మాత్రం వీరితో పాటు మిగతా ఎమ్మెల్యేలు ఖాళీగా ఉన్న కుర్చీల్లో వెనుక వరుసలో కూర్చున్నారు. గంట ఆలస్యంగా సభ సభావ్యవహారాల కమిటీ (బీఏసీ)లో నిర్ణయించిన మేరకు సోమవారం ఉదయం 10 గం టలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ స్పీకర్‌తో ఫ్లోర్‌లీడర్ల భేటీ 11 గంటలదాకా కొనసాగడంతో.. సభ గంట ఆలస్యంగా మొదలైంది. రాష్ట్ర శాసనసభ చరిత్ర (ఉమ్మడి రాష్ట్రం సహా)లో ఇలా ఎప్పుడూ జరగలేదని, ఇది బీఏసీ నిర్ణయానికి విరుద్ధంగా ఉందని కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. స్పీకర్ వద్ద సమావేశం ముఖ్యమైనదని భావించినట్లయితే, ముందు బీఏసీ రూల్స్ మేరకు సభను ప్రారంభించి, వాయిదా వేస్తే సరిపోయేదని వారు పేర్కొన్నారు. అలాగాకుండా శాసనసభను ప్రారంభించే సమయం అవుతున్నా.. భేటీ కొనసాగించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
తెలంగాణ మండలి మీడియా పాయింట్
మాది ఏ పార్టీనో చెప్పండి? టీఆర్ఎస్లో టీడీపీని విలీనం చేసినట్లు శాసన మండలిలో చైర్మన్ ప్రకటించడాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. టీడీపీ నుంచి ఏడుగురు సభ్యుల్లో ఐదుగురు టీఆర్ఎస్లో విలీనమైన తర్వాత.. ఇంకా ఇద్దరం మిగిలాం. మరి మాది ఏ పార్టీ అనేది సభ్యులే చెప్పాలి. పెద్దల సభ ఆదర్శంగా ఉండాలి. కానీ అగౌరవ పరుస్తున్నారు. కౌన్సిల్ ఉంది టీఏ,డీఏల కోసం కాదు. విలీనంపై కోర్టుకు వెళ్లి అక్కడే తేల్చుకుంటాం.. న్యాయం జరిగేదాకా పోరాడతాం. - అరికెల నర్సారెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ ఫిరాయింపులనుప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం పథకం ప్రకారమే ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో పేర్కొన్న ప్రకారం.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన సభ్యులపై అనర్హత వేటు పడాలి. కానీ ఇది ఎక్కడా జరగడం లేదు. పైగా.. టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేసినట్లు బులిటెన్ విడుదల చేశారు. అధికార దుర్వినియోగానికి ఇంతకంటే సాక్ష్యం మరేం ఉంటుంది. - పొట్ల నాగేశ్వరరావు, టీడీపీ ఎమ్మెల్సీ ఈ ప్రభుత్వానికి సోయి లేదు రైతు ఆత్మహత్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వం స్పం దించడం లేదు. తమ ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి 69 మంది రైతులే ఆత్మహత్య చేసుకున్నారని టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్సీలు చెబుతున్నారు. కానీ, 500కు పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు మావద్ద రిపోర్ట్ ఉంది. రోజుకు ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా.. ఈ ప్రభుత్వానికి సోయి లేదు. దీనిపై వ్యవసాయ శాఖమంత్రి రైతులను కించపరిచేలా మాట్లాడుతుండడం సిగ్గుచేటు. - షబ్బీర్ అలీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆత్మహత్యలపై కమిటీ వేయండి ఒక పక్క రైతు ఆత్మహత్యలు, మరోపక్క విద్యుత్ కోతలు, గిట్టుబాటు లేని ధరలు, రాష్ట్రంలోని 80 శాతం మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్ఎస్ అధికారం చేపట్టాక 740 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలతో రైతు స్వరాజ్య వేదిక నివేదిక ఇచ్చింది. వీటిపై స్పందించకపోగా.. చివరకు ఆత్మహత్యలనూ కించపరుస్తున్నారు. రైతు ఆత్మహత్యలపై ఓ కమిటీ వేయండి. - పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ . -
తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్
తప్పు చేస్తే క్షమాపణ చెబుతాం శాసనసభలో జాతీయ గీతం వస్తున్న సమయంలో మా వైపు నుంచి ఎలాంటి తప్పిదం జరిగినట్లు తేలినా.. వందసార్లు క్షమాపణ చెప్పడానికి సిద్ధం. పూర్తిస్థాయి వీడియోలు చూపకుండా క్షమాపణ చెప్పాలని కోరడం భావ్యం కాదు. జాతీయ గీతం, దేశభక్తిపై అనవసర చర్చ శోచనీయం. -టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా దాడి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సాక్షిగా టీడీపీ సభ్యులపై దాడిచేశారు. దాని సీడీని మాయం చేసి, అఖిలపక్షంలో కొన్ని క్లిపింగ్స్ మాత్రమే చూపించారు. స్పీకర్ సైతం అధికారపక్షానికి వంతపాడుతున్నారు. జాతీయ గీతం ఆలపించే ముందు ప్రకటన చేయలేదు. నేరుగా ప్రారంభించారు. అయినా మేం వెంటనే సెలైంట్‌గా ఉండిపోయాం. కానీ అధికారపక్షంపై గొంతు విప్పినందుకు సస్పెన్షన్ చేసి బయటికి పంపారు. - ఎర్రబెల్లి దయాకర్ రావు, టీడీపీ ఎమ్మెల్యే క్షమాపణ చెప్పిస్తే బాగుండేది.. గవర్నర్ ప్రసంగం సందర్భంగా తోపులాట, ఘర్షణ సభా మర్యాదలను తగ్గించడమే. జాతీయ గీతాన్ని అగౌరవపర్చడం సరైంది కాదు. అసెంబ్లీ సాక్షిగా గుండాల్లా వ్యవహరించారు. తప్పు ఎవరు చేసినా క్షమాపణ చెప్పాల్సిందే. టీడీపీ సభ్యులు ఒకవేళ తప్పు చేసివుంటే క్షమాపణ చెప్పిస్తే బాగుండేది. సస్పెండ్ చేయడం బాధాకరం. ఇప్పటికైనా అధికార పక్షం పునరాలోచించాలి. - పాయం వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తప్పును కప్పిపుచ్చుకుంటున్న అధికారపక్షం అధికారపక్ష సభ్యుల తప్పులను కప్పిపుచ్చుతూ ఇతర పక్షాల వారిని తప్పుగా చూపిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా అధికారపక్ష సభ్యులే ప్రతిపక్షాలపై గుండాయిజం ప్రదర్శించారు. ఎవరు త ప్పు చేసినా క్షమాపణ చెప్పాలిందే. - సంపత్‌కుమార్, కాంగ్రెస్ ఎమ్మెల్యే సర్కారుది నియంతృత్వం సభ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ ఏకపక్ష నిర్ణయం. ప్రతిపక్షాలను విస్మరించారు. సభ్యుల సూచనలను కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదు. అధికార పక్షం నియంతగా వ్యవహరిస్తోంది. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసి ఇతర పక్షాల సభ్యులను భయపెట్టాలని చూస్తున్నారు. - రవీంద్ర నాయక్, సీపీఐ ఎమ్మెల్యే ప్రతిపక్షాలు లేకుండా నడిపించుకుంటారా? బడ్జెట్ సమావేశాలను ప్రతిపక్షాలు లేకుండా నడిపిం చుకుంటారా? ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలు తగవు. శాసనసభలో గవర్నర్ ప్రసంగం, జాతీయగీతం సందర్భంగా జరిగిన ఘటనకు కేవలం ప్రతిపక్షాలు మాత్రమే క్షమాపణ చెప్పాలా? అధికార పక్ష సభ్యుల కు వర్తించదా? పూర్తి స్థాయి వీడియోను చూపించాలి. - లక్ష్మణ్, ప్రభాకర్, చింతల, బీజేపీ ఎమ్మెల్యేలు దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలి రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో దెబ్బతిన్న ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. సుమారు పదిలక్షల ఎకరాలకుపైగా పంటలు దెబ్బతిన్నాయి. బాధిత రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి. - సున్నం రాజయ్య, సీపీఎం ఎమ్మెల్యే ఫిరాయింపులు కొత్తేమీ కాదు పార్టీ ఫిరాయింపులు కొత్తేమీకాదు. చట్టం దానిపని అది చేస్తోంది. ఏపీలో చంద్రబాబు ఇతర పార్టీ వారిని టీడీపీలో చేర్చుకుంటే అది సంసారం.. తెలంగాణలో మేం చేర్చుకుంటే వ్యభిచారమా..? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఫిరాయింపులు జరిగాయి. బంగారుతెలంగాణ సాధనలో భాగస్వాములయ్యేందుకే పార్టీలో చేరుతున్నారు. - జీవన్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే దళితుల పట్ల టీడీపీ కపట ప్రేమ టీడీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. జాతీయ గీతాన్ని అగౌరవపర్చారు. చంద్రబాబు డెరైక్షన్‌లో దళితుల పట్ల కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారు. వారు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారు. టీడీపీలో ఉన్నప్పుడు కడియం శ్రీహరి దళితుడు, టీఆర్ఎస్లో చేరితే దళితుడు కాదా..? వారు దళితులకు క్షమాపణ చెప్పాల్సిందే. - రసమయి బాలకిషన్, బాలరాజు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉద్యమంలో కలిసి రాలేదు ఉద్యమంలో కలిసి రాలేదు. కనీసం ప్రజా సమస్యలపై చర్చించేందుకు కూడా టీడీపీ సభ్యులు కలిసి రావడం లేదు. సభలో ప్రజల పక్షాన మాట్లాడితే వారుహర్షిస్తారు. రాజ్యాంగాన్ని, జాతీయ గీతాన్ని అగౌరవపర్చే విధంగా వ్యవహరిస్తే గుణపాఠం తప్పదు. - ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే. -
కుటుంబ సభ్యులతోనే సభ నడుపుతారా?
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతోనే శాసనసభ సమావేశాలను నడుపుతున్నారని టీడీపీ శాసనసభ్యులు ఆరోపించారు. రాష్ట్ర కేబినెట్లో మహిళలకు, మాదిగలకు, మాలలకు స్థానం లేకపోవడంపై చర్చించాలంటూ అసెంబ్లీలో సోమవారం పట్టుబట్టిన టీడీపీ శాసనసభ్యులను కొద్దిసేపటికే సస్పెండ్ చేశారు. దీంతో వారు సభలోకి ప్రవేశించే ద్వారం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సభలో అధికారపక్షం దాడులకు దిగుతున్నదని, సీఎం నియంతృత్వ వైఖరి నశించాలని టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసి, ప్రజల సమస్యలను మాట్లాడనివ్వకుండా గొంతు నొక్కున్నారని ఆరోపించారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, కె.పి.వివేకానంద, వెంకటవీరయ్య, గోపీనాథ్, అరికెపూడీ గాంధీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇష్టారాజ్యమైపోయింది.. టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన సమయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆర్.కృష్ణయ్య, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సభలో లేరు. ఆలస్యంగా వచ్చిన కృష్ణయ్య, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేర్లను సస్పెండ్ చేసిన ఎమ్మెల్యే జాబితాలో మంత్రి హరీశ్‌రావు చదవలేదు. దీనితో కృష్ణయ్య, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి శాసనసభలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. ఆర్.కృష్ణయ్యను అనుమతించిన అసెంబ్లీ మార్షల్స్ మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని అడ్డుకున్నారు. దాంతో మార్షల్స్‌పై మంచిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల ఇష్టారాజ్యంగా శాసనసభ మారిపోయిందని విమర్శించారు. అయితే టీడీపీ పక్షం నుంచి శాసనసభలో ఆర్.కృష్ణయ్య ఒక్కరే ఉన్నారు. -
మా సీట్లు ముందుకు మార్పించండి
హైదరాబాద్: అసెంబ్లీలో కమ్యూనిస్టు పార్టీల సభ్యులు ‘వెనుక’బడిపోయారు. సీపీఐ, సీపీఎంల నుంచి ఒక్కరేసి చొప్పున ఉన్న తమను ‘ముందుకు’తీసుకురావాలని స్పీకర్‌కు మొరపెట్టుకున్నారు. రాష్ట్రవిభజన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశ హాలు లో తాజాగా మార్పుచేర్పులు చేశారు. కుర్చీల సర్దుబాటుతో సభ్యుల స్థానాలు మారిపోయాయి. సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య, సీపీఐ సభ్యుడు రవీంద్రకుమార్‌ల స్థానాలు వెనుకకు చేరాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన వారిద్దరూ సోమవారం నిండు సభలో ఆవేదన వ్యక్తం చేశారు. ఏక సభ్య ప్రాతినిథ్యంగా ఉన్నందున, తమ స్థానాలను ముందుకు మార్చాలని వారు కోరారు. -
రైతు ఆత్మహత్యలు అరవై తొమ్మిదే!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన రైతు ఆత్మహత్యలు 69 మాత్రమేనని, అలా విగతజీవులైన 55 మంది రైతుల కుటుంబాలకు జీవో 421 ప్రకారం ఒక్కో కుటుంబానికి రూ.లక్ష వంతున ఎప్పటికప్పుడు ఆర్థికసాయం అందిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సోమవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి రైతుఆత్మహత్యలపై లేవనెత్తిన ప్రశ్నకు పోచారం జవాబిచ్చారు. మంత్రి మాట్లాడుతూ.. ఆత్మహత్యలు చేసుకున్నవారిలో మహబూబ్‌నగర్ జిల్లాలో 13, రంగారెడ్డిలో11, అదిలాబాద్‌లో 9, కరీంనగర్లో7, మెదక్ జిల్లాలో 29 రైతులు ఉన్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాల పిల్లలకు సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్లలో ప్రవేశాలు కల్పిస్తున్నామని, ఐఏవై కింద గృహాల కేటాయింపు, వివిధ ప్రభుత్వ పథకాల కింద ఆర్థిక మద్ధతు ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 500ల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వారి కుటుంబాలన్నింటినీ ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. భర్తీకాని టీచర్ పోస్టులు డి-రిజర్వ్: కడియం ఉర్దూ మాధ్యమంలో టీచర్ పోస్టులకు ఎస్సీ,ఎస్టీ,బీసీ కేటగిరీల నుంచి అభ్యర్థులు కరువవడంతో.. మిగిలిపోతున్న పోస్టులను డి-రిజర్వ్ చేసి ఓపెన్ కేటగిరీలో నియమాకాలు చేస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. హైదరాబాద్‌లో రైల్వే క్రాసిం గ్లున్న 94 ప్రాంతాల్లో ఫుట్ఓవర్ బ్రిడ్జిలు అవసరమని భావిస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి ప్రశ్నకు జవాబిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ 75వేల జ నాభాకు ఒక 108 అంబులెన్స్ ఉండేలా చూస్తామని ఆరోగ్యమంత్రి లకా్ష్మరెడ్డి తెలిపారు. సభ్యులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, షబ్బీర్ అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. అదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల గుండా వెళుతున్న 4 జాతీయ రహదారులను నాలుగులేన్లుగా మార్చినట్లు ఎమ్మెల్సీ ఆమోస్ ప్రశ్నకు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సమాధానమిచ్చారు. నవంబరు కల్లా జైపూర్ విద్యుత్ అదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ సమీపంలోని జైపూర్ విద్యుత్‌ప్లాంట్‌ను వచ్చే నవంబరు కల్లా ప్రారంభించబోతున్నట్లు విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు తెలపాలని ఎమ్మెల్సీ వెంకటరావు కోరగా ఈ ప్లాంట్‌లోని రెండు యూనిట్లు పూర్తయితే విద్యుదుత్పత్తి సామర్థ్యం 700 మెగావాట్లు కానుందన్నారు. రైతు ఆత్మహత్యలు 97 హైదరాబాద్: తెలంగాణలో 97మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గత నెల చివరినాటికి ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య ఇదేనని వెల్లడించింది. ఐదు జిల్లాల్లోనే ఆత్మహత్యలు జరిగాయని.. నాలుగు జిల్లాల్లో ఒక్కఆత్మహత్య కూడా జరగలేదని స్పష్టం చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో 16 మంది, కరీంనగర్లో 12, మహబూబ్‌నగర్‌లో 20, మెదక్‌లో 36, రంగారెడ్డి జిల్లాలో 13 మంది ఆత్మహత్య చేసుకున్నారని వ్యవసాయశాఖ కమిషనర్ ప్రియదర్శిని ‘సాక్షి’కి చెప్పారు. మిగిలిన జిల్లాల్లో ఒక్క ఆత్మహత్య కూడా జరగలేదన్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల్లో 65 మందికి ఇప్పటికే ఎక్స్‌గ్రేషియా అందించారని ఆమె చెప్పారు. -
ఆంధ్రాలో అలా..ఇక్కడ ఇలానా..!ఈటెల
-
నిరుటి కంటే తక్కువే..!
హైదరాబాద్: ఆశల పల్లకి నుంచి ఆచరణాత్మక బడ్జెట్ దిశగా తెలంగాణ సర్కారు కొత్త పంథాకు శ్రీకారం చుడుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఆదర్శంగా చేసుకొని.. ఈసారి కొత్త బడ్జెట్ రూపకల్పనకు మొగ్గు చూపుతోంది. వృద్ధి రేటు, అభివృద్ధిని పక్కనబెట్టి వాస్తవాలను ప్రతిబింబించే విధంగా 2015-16 బడ్జెట్‌ను తయారు చేసింది. ఈ నెల 11న ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ అందరి దృష్టినీ ఆకర్షించనుంది. పూర్తిస్థాయి బడ్జెట్ కావటంతో ఎంత మొత్తం కేటాయింపులుంటాయి..? తొలి బడ్జెట్ రూ.లక్షా 637 కోట్లతో ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఈసారి అంతకుమించి భారీ బడ్జెట్ ప్రవేశపెడుతుందా.. లేదా కొంత వెనక్కు తగ్గుతుందా..? అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం గత నవంబర్ లో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. లక్షకోట్ల పైచిలుకు బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం అం చనాలన్నీ ఆచరణలో తలకిందుల య్యాయి. ఆశించినంత రెవెన్యూ రాబడి లేకపోవటం.. కేంద్రం నుంచీ పెద్దగా నిధులు రాకపోవటం తో సర్కారు ఇరకాటంలో పడింది. ఫిబ్రవరి వరకు ఉన్న ఆదాయ వ్యయాల అంచనాలను విశ్లేషిస్తే 2014-15 బడ్జెట్లో దాదాపు రూ. 40 వేల కోట్ల కోత తప్పని పరిస్థితి తలెత్తింది. అందుకే ఈ ఏడాది ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్‌ను సమగ్రంగా రూపొందించాలని.. వాస్తవాల ఆధారంగా మంచి చెడులను ప్రజ లకు విడమర్చి చెప్పాలని.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, మంత్రి ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో గతంలోలా పెద్ద మొత్తంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాల్లేవని తెలుస్తోంది. ఆశించిన స్థాయిలో రాని ఆదాయం నవంబర్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ నాటి నుంచి నేటివరకు ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు. రూ.80,090 కోట్ల రెవె న్యూ ఆదాయం లభిస్తుందని భావించింది. ఫిబ్రవరి ఒకటి నాటికి కేవలంరూ.30,187కోట్ల ఆదాయమే వచ్చింది. రెండోవారానికి ఈ ఆదాయం రూ.33 వేల కోట్లకు పెరిగినప్పటికీ ఖజానాకు పెద్దగా ఒరి గిందేమీ లేదు. దీంతో ఆర్థిక లోటు రూ.47 వేల కోట్లకు చేరినట్లు స్పష్టమవుతోంది. మార్చి మొదటివారంలోనూ ఇంచుమించుగా ఈ లోటు రూ.40 వేల కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో.. గతంలో నేల విడిచి సాము చేసిన సర్కారు ఇప్పుడు దిగొచ్చింది. తగ్గిన కేంద్ర నిధులు కేంద్ర ప్రభుత్వ పన్నులు, గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి రావాల్సిన రూ.14 వేల కోట్ల నిధుల్లో ఇప్పటి వరకు రూ. 8,768 కోట్లే వచ్చాయి. మిగతా రూ.6 వేలకోట్లకు పైగా నిధులపై కేంద్రం నోరు మెదపటం లేదు. పదమూడో ఆర్థిక సంఘం నిధుల్లోనూ భారీ కోతలే పడ్డాయి. విభజనానంతరం ఆర్థిక సంఘం నుంచి తెలంగాణ వాటాగా రూ.3 వేల కోట్లు రావాల్సి ఉండగా.. వెయ్యి కోట్లే వచ్చాయి. భూముల అమ్మకం ద్వారా వస్తాయని భావిం చిన రూ.6,500 కోట్లలో రూ.66 కోట్లే వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్ గతం కంటే తక్కువగా ఉండే అవకాశాలున్నాయని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొత్త పథకాలు ఉండనట్టే! తొలి బడ్జెట్‌ను పరిశీలిస్తే పది నెలల కాలానికి రూ.లక్షా 637 కోట్లు కేటాయించారు. ఈ ప్రకారంగా చూస్తే ప్రస్తుత బడ్జెట్ రూ.లక్షా 20 కోట్లు దాటాలి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితేం కనిపిం చడం లేదు. ‘గతంలో ప్రవేశపెట్టింది తొలి బడ్జెట్. ఉద్యమ సమయంలోనూ ఆ తర్వాత సీఎం కేసీఆర్ అంచనాలకు మించి హామీలి చ్చారు. వాటిని అమలు చేయాలన్నా.. జనం లో ఆత్మస్థైర్యం నింపాలన్నా.. ప్రజల ఆకాం క్ష ల మేరకు భారీ బడ్జెట్ ప్రవేశపెట్టడం తప్పనిసరైంది. ఇప్పుడు వాస్తవ పరిస్థితి అర్థమైంది. అందుకే కొంత వెనుకడుగు వేయక తప్పదు..’ అని ఆర్థికశాఖ వర్గాలు తమ అభిప్రాయం వ్య క్తం చేశాయి. కొత్త పథకాల జోలికి వెళ్లకుండా.. ఉన్నవాటికే నిధులు కేటాయించాలనేది సర్కారు ఆలోచనగా కనిపిస్తోంది. ఉన్నవాటికే ప్రాధాన్యం కేజీ టు పీజీ పథకాన్ని కొత్త ఆర్థిక సంవత్సరం లో ప్రారంభించాలని.. దీన్ని అమలు చేసేం దుకు మండల స్థాయిలో ప్రస్తుతమున్న రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, జ్యోతి రావు పూలే పాఠశాలలన్నీ ఒకే గొడుగు కిందకు తెచ్చే ప్రతిపాదనల్ని పరిశీలిస్తోంది. డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకా నికి చోటు కల్పించే అవకాశముంది. అమల్లో ఉన్న పది పథకాలను ఈసారి బడ్జెట్లో మరిం త ఫోకస్ చేయాలని నిర్ణయించింది. హరితహారం, కొత్త రోడ్ల నిర్మా ణం, మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ, వాటర్‌గ్రిడ్, ఇరిగేషన్, వ్యవసాయం, విద్యు త్తు, భూముల కొనుగో లు, హాస్టళ్లకు సన్నబి య్యం, అంగన్వాడీలకు అదనపు పౌష్టికాహారం, కల్యాణలక్ష్మి పథకాలకు అత్యంత ప్రాధాన్యమివ్వనుంది. ఉచిత విద్యుత్తుకు ఇచ్చే సబ్సిడీకి, విద్యుత్తు సమస్యను అధిగమిం చేందుకు నిర్మించ తలపెట్టిన కొత్త ప్లాంట్లను వేగవంతం చేసేందుకు ఈసారి బడ్జెట్లో అదనంగా నిధులు కేటాయించే అవకాశముంది. -
‘బడ్జెట్’.. బాగేనా?
సాగునీరు, తాగునీరే జిల్లాకు ప్రధాన అవసరం ఏఎమ్మార్పీ, నక్కలగండి, మూసీ ప్రాజెక్టులకు నిధులొచ్చేనా? డబుల్బెడ్రూం, దళితులకు మూడెకరాల పంపిణీకి ఏ మేరకో? జిల్లా ప్రజాప్రతినిధులు ఏం చేస్తారో? గంపెడాశలతో నేటినుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు షురూ నల్లగొండ : రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై జిల్లావాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రధాన సమస్యలైన తాగునీరు, సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్లు ఏ మేరకు కరుణ చూపుతారని జిల్లా ప్రజానీకం ఎదురుచూస్తోంది. జిల్లాకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు అధికారపక్షంలో, మరో ఆరుగురు ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో స్థానిక సమస్యల పరిష్కారానికి ఏ మేరకు నిధులు కేటాయిస్తారు..ఏయే సమస్యలు లేవనెత్తుతారనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. తొలి అసెంబ్లీ బడ్జెట్లో జిల్లా ప్రజలకు ప్రధాన అవసరాలైన తాగు, సాగునీటికి సంబంధించి నిధుల కేటాయింపు అత్తెసరుగానే ఉన్న పరిస్థితుల్లో ఈసారైనా కాసుల వర్షం కురుస్తుందా...జిల్లా ప్రజల సమస్యలు తెలంగాణ రాష్ట్రంలోనయినా తీరుతాయా అనే ఆశలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాకు ప్రధాన సాగునీటి వనరులైన నాగార్జునసాగర్ ప్రాజెక్టు, ఎస్ఎల్బీసీ, నక్కలగండి, మూసీ ప్రాజెక్టులకు తగినన్ని నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు మినహా మిగిలిన వాటికి ఏటా కనీసం రూ.400 కోట్లయినా కేటాయించాల్సిన పరిస్థితుల్లో ఈసారి ఎన్ని నిధులు పెడతారు... జిల్లా ఆయకట్టు వరకు నీటిని ఏ మేరకు తెస్తారు అనేది ఇప్పుడు ప్రజానీకం ఆశగా ఎదురుచూస్తోంది. ఇక, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమవుతున్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు ఆధునీకరణ, జిల్లాలో ఎడమకాల్వపై ఉన్న లిఫ్టుల నిర్వహణలకు పెద్దఎత్తున నిధులు కేటాయించాల్సి ఉంది. ఇక తాగునీటి అవసరాలను తీర్చే ఉదయసముద్రం లాంటి ప్రాజెక్టులకు కూడా నిధులివ్వాల్సి ఉంది. సం‘క్షేమ’మేనా? సాగు,తాగునీటి అవసరాల మాట అటుంచితే రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోన్న పలు సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధుల కేటాయింపు కూడా ప్రాధాన్యతాంశంగా మారింది. ముఖ్యంగా జిల్లాలో గృహనిర్మాణానికి సంబంధించిన పనులు ఆగిపోయాయి. గృహ నిర్మాణాలకు సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికల రూపొందించుకున్న నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నిర్మాణాల మాట అటుంచితే బిల్లుల చెల్లింపు కూడా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన టీఆర్ఎస్ హామీ ఏ మేరకు నెరవేరుతుంది... ఎంతమంది లబ్ధిదారులకు ఇళ్లు కట్టించేందుకు నిధులు మంజూరు చేస్తారనేది కూడా ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఇక, మరో ముఖ్యమైన అంశం దళితులకు భూపంపిణీ. భూమి లేని దళితులకు మూడెకరాల భూమి ఇచ్చే కార్యక్రమానికి నిధులు కేటాయించాల్సి ఉంది. ఇప్పటివరకు జిల్లాలో రూ8కోట్లు వెచ్చించి 117మంది లబ్ధిదారులకు మాత్రమే భూమి కేటాయించారు. వేలాది మంది దళితులు ఈ భూమి కొనుగోలు పథకం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో పాటు ఆసరా పెన్షన్లు, ఆహారభద్రత, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, వాటర్‌గ్రిడ్, మిషన్‌కాకతీయ, రోడ్ల నిర్మాణం లాంటి కార్యక్రమాలకు ఏ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది? అందులో జిల్లాకు ఏ మేరకు చేరుతుంది? జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఈ సమావేశాల్లో ఏ మేరకు గళం విప్పుతారు? జిల్లాకు ఏ మేరకు ప్రత్యేక నిధులు కేటాయిస్తారో వేచిచూడాల్సిందే.