తెలంగాణలో 690 పోలీసు స్టేషన్లకు బ్రాండ్ వాహనాలు దేశంలోనే ప్రధమం అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్: తెలంగాణలో 690 పోలీసు స్టేషన్లకు బ్రాండ్ వాహనాలు దేశంలోనే ప్రధమం అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. నేరం జరిగిన 10 నిమిషాల్లో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుంటారని తెలిపారు. రాజధానిలో ప్రతి కూడలిలో పోలీసులు అప్రమత్తంగా ఉంటారని అసెంబ్లీలో చెప్పారు.
ఇన్నోవా కార్ల కొనుగోలులో అవకతవకలు జరిగాయన్న అపవాదు ఉందని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. పోలీసు వాహనాలకు డైవర్ల నియామకంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఏమైనా శిక్షణ ఇచ్చారా అని ఆమె ప్రశ్నించారు. దీనికి నాయిని సమాధానం ఇస్తూ.. పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగానే కనబడుతుందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచితే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరిగినట్టేనని అన్నారు.