Hyderabad: KTR Inaugurated Steel Bridge Flyover From Indira Park To VST - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: నాయిని స్టీల్‌ బ్రిడ్జ్‌ ప్రారంభించిన కేటీఆర్‌.. ఎన్ని ప్రత్యేకతలో తెలుసా?

Published Sat, Aug 19 2023 11:39 AM | Last Updated on Sat, Aug 19 2023 1:42 PM

KTR Launched Hyderabad Indira Park VST steel Bridge Specialties - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నగరంలో నూతన బ్రిడ్జిలను నిర్మిస్తోంది. ఈ క్రమంలో మరో ప్రత్యేకమైన వంతెన ఇవాళ తెరుచుకుంది. ఇందిరా పార్క్‌-వీఎస్టీ ఉక్కు వంతెనను మంత్రి కేటీఆర్‌ శనివారం ఉదయం ప్రారంభించారు.

ఈ వంతెన పేరు ఇందిరా పార్కు నాయిని నరసింహ రెడ్డి స్టీల్ బ్రిడ్జ్. కార్మిక నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి గౌరవార్థం నామకరణం చేశారు.  ఇందిరా పార్క్‌ చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్‌ భవన్ సమీపంలోని VST చౌరస్తా వరకు ఈ బ్రిడ్జిని నిర్మించారు. తద్వారా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, అశోక్‌ నగర్‌, వీఎస్టీ జంక్షన్లలో ఏర్పడే ట్రాఫిక్‌ రద్దీ తగ్గనుందని ప్రభుత్వం భావిస్తోంది. 

  • దక్షిణ భారత దేశంలోనే మొదటి పొడవైన స్టీల్‌ బ్రిడ్జ్‌. 
  • జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే ఈ బ్రిడ్జికి ఓ ప్రత్యేకత ఉంది. తొలిసారి భూసేకరణ లేకుండానే ఈ బ్రిడ్జిని నిర్మించారు. 
  • మెట్రో పై నుంచి ఉండడం  ఈ బ్రిడ్జికి ఉన్న మరో ప్రత్యేకత.
  • బ్రిడ్జి పొడవు 2.62 కిలోమీటర్లు.. వెడల్పు నాలుగు లైన్లు 
  • ఈ బ్రిడ్జి కోసం   12, 316 మెట్రిక్‌ టన్నుల ఉక్కు వినియోగించారు. 
  • 81 స్టీల్‌ పిల్లర్లు, 426 ఉక్కు దూలాలు వినియోగించారు. 
  • కాంక్రీట్‌ 60-100 ఏళ్లు, స్టీల్‌ 100 ఏళ్లకు పైగా మన్నికగా ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు. 
  • స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం కింద(ఎస్‌ఆర్‌డీపీ) రూ. 450 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని జీహెచ్‌ఎంసీ నిర్మించింది. 
  • రోజుకు లక్ష వాహనాలు తిరిగే ఈ రూట్‌లో వాహనదారులకు బిజీ టైంలో 30-40 నిమిషాల టైం పట్టేది. ఈ వంతెన నిర్మాణంలో కేవలం ఐదే నిమిషాల్లో ప్రయాణం కొనసాగించొచ్చని అధికారులు చెబుతున్నారు. 

స్టీల్‌ బ్రిడ్జికి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాం. ఈ బ్రిడ్జి నిర్మాణంతో ట్రాఫిక్‌ కష్టాలు తీరతాయి.  ఎస్‌ఆర్‌డీపీలో ఇది 36వ ప్రాజెక్టు. హైదరాబాద్‌లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం.
:::బ్రిడ్జిని ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్‌

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement