పీఆర్‌సీ జీవో సవరించాలి
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వం జారీ చేసిన పీఆర్‌సీ జీవో లోపభూయిష్టం. వేతనాల సవరణ, బకాయిల చెల్లింపు, స్కేల్ పేమెంట్ తదితర అంశాలపై స్పష్టత లేదు. ఉద్యోగులను ఏప్రిల్ ఫూల్ చేసేలా ఉంది. తక్షణమే జీవోను సవరించాలి. ఉద్యోగుల బకాయిలపై సభలో ప్రస్తావిస్తే దాట వేశారు. గత ప్రభుత్వాలు కూడా ఉద్యోగులకు 39 శాతం వరకు ఫిట్‌మెంట్ ఇచ్చాయి.
ఉద్యోగులకు ఇచ్చిన హెల్త్‌కార్డులు దేనికీ పనికి రాకుండా ఉన్నాయి. ఆస్పత్రులతో ఒప్పందాలు కుదుర్చుకోలేదు. రాష్ట్రంలో ఏకపక్ష, కుటుంబపాలన సాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. సీఎం కార్యాలయం నుంచి సైతం బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన శాస్తి తప్పదు.
-కిషన్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే