prc G.O
-
317 జీవోను వెంటనే రద్దు చేయాలి: టీఈఏ
సాక్షి, హైదరాబాద్: జోనల్ విధానం అమల్లో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోను రద్దు చేయాలని, జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలన్న డిమాండ్లతో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్‌కుమార్ నేతృత్వంలో ఆదివారం ఇంది రాపార్క్ వద్ద నిరసన దీక్ష జరిగింది. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే నియమించి, పంచాయతీ సెక్రటరీల పైన తీవ్ర పనిభారం తగ్గించాలని కోరారు. సెపె్టంబర్ 2020లో అసెంబ్లీలో సీఎం ప్రకటించిన వీఆర్ఏల పే స్కేల్ జీవో వెంటనే అమలు చేయాలన్నారు. నిషేధం ఎత్తివేసి వెంటనే సాధారణ బదిలీలను చేపట్టాలని, దీర్ఘకాలికంగా రెవెన్యూ శాఖ, విద్య శాఖలో ఆగిపోయిన ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ జీవోలో తెలిపిన విధంగా ఏప్రిల్, 2021.. మే, 2021 రెండు నెలల పీఆర్సీ బకాయిలను మార్చి, 2022లోగా చెల్లించాలని కోరారు. దీక్షలో తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొట్టబత్తిని పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల మేలుకే ప్రభుత్వ ప్రాధాన్యం
సాక్షి, అమరావతి/ఆలూరు/కాకినాడ రూరల్/ఒంగోలు సబర్బన్/అద్దంకి: ఉద్యోగుల మేలుకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని పలువురు మంత్రులు తెలిపారు. అందువల్ల ఉద్యోగులు ఆందోళనలు, సమ్మెలు విరమించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా సమయంలో ఆందోళనలు చేయడం సరికాదన్నారు. సామరస్యంగా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. మంత్రుల కమిటీ ఉద్యోగులతో చర్చించడానికి సదా సిద్ధంగా ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వంలో ఉద్యోగులు ముఖ్య భాగమన్నారు. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని తెలిపారు. ఉద్యోగుల ఆందోళనలపై గురువారం పలువురు మంత్రులు రాష్ట్రవ్యాప్తంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఎవరు ఏమన్నారంటే.. బాబు ఏనాడైనా ఉద్యోగులకు మేలు చేశారా? ఉద్యోగులంతా మా కుటుంబ సభ్యులు. ఉద్యోగులు చర్చలకు రావాలని మంత్రుల కమిటీ కోరుతోంది. సీఎం జగన్ ఉద్యోగులందరినీ కుటుంబ సభ్యుల్లా చూస్తారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా ఉద్యోగులకు మేలు చేశారా? ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తుంటే పప్పుబెల్లాల్లా పంచుతున్నారంటూ అర్థం లేని విమర్శలు చేస్తున్నారు. – కె.నారాయణస్వామి, ఉప ముఖ్యమంత్రి చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రభుత్వం చర్చలకు అవకాశం ఇవ్వడం లేదనడం అబద్ధం. ఉద్యోగులతో చర్చల కోసం సీఎం వైఎస్ జగన్ మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఉద్యోగులకు మేలు చేయడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఎక్కడా ఉద్యోగులను గృహనిర్బంధంలోకి తీసుకోలేదు. అయితే అనుమతి లేని సభలకు వెళ్లొద్దని ఉద్యోగులకు చెప్పాం. – మేకతోటి సుచరిత, హోం శాఖ మంత్రి మొండి వైఖరితో ఉన్నామనడం సరికాదు.. మేము మొండి వైఖరితో ఉన్నామని ఉద్యోగులు విమర్శించడం సరికాదు. కొత్త జీతాలు ప్రాసెస్ చేశాక వాటిని ఆపాలని చెప్పడం భావ్యం కాదు. ఉద్యోగుల ఆందోళనపై ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ పూర్తి సంయమనంతో వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు ఆయన ప్రభుత్వ హయాంలో ఉద్యోగులను ఏం ఉద్ధరించారు? ఒక్కసారి గుర్తు చేసుకోండి. – బొత్స సత్యనారాయణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి విద్యుత్ ఉద్యోగులకు నాలుగు డీఏలు ఇచ్చాం.. చర్చల ద్వారా ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలి. నూతన పీఆర్సీతో ఉద్యోగుల జీతాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. విద్యుత్ రంగం అప్పుల్లో ఉన్నా ఆ సంస్థల ఉద్యోగులకు నాలుగు డీఏలు ఇచ్చాం. ప్రభుత్వం అవకాశం ఉన్నంతవరకు ఉద్యోగులకు మేలు చేస్తుంది. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంటుంది. – బాలినేని శ్రీనివాసరెడ్డి, అటవీ, ఇంధన శాఖ మంత్రి రోడ్డెక్కితే సమస్య పరిష్కారం కాదు.. ఉద్యోగులు పీఆర్సీని సమస్యగా భావిస్తున్నారు కాబట్టి వారి సందేహాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందువల్ల మంత్రుల కమిటీ వద్దకు ఉద్యోగులు చర్చలకు రావాలి. రోడ్డెక్కి ఆందోళనలు చేస్తే సమస్య పరిష్కారం కాదు. కావాలనే కొందరు రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలా జగన్ ప్రభుత్వం ఉద్యోగులను వెంటాడి వేధించేది కాదు. – కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి ఉద్యోగుల్లో ఎవరికీ అన్యాయం జరగదు.. ఉద్యోగులకు మేలు చేసే సీఎం జగన్ మనకు ఉన్నారు. మీరంతా మా కుటుంబ సభ్యులు. ఎవరికీ అన్యాయం జరగదు. 2008, 2018 నాటి డీఎస్సీలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించి వైఎస్ జగన్ ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగులకు మంచి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ సమస్య ఉన్నా మంత్రుల కమిటీతో చర్చించండి. – ఆదిమూలపు సురేష్, విద్యా శాఖ మంత్రి ఉద్యోగులు పట్టుదలకు పోవద్దు.. ఉద్యోగులు పట్టుదలకు పోవద్దు. ప్రభుత్వం అన్ని వర్గాలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోంది. రెండేళ్లుగా కరోనాతో అన్ని వ్యవస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే ప్రభుత్వమే ఉద్యోగులకు మరింతగా మేలు చేస్తుంది. ఉద్యోగులంతా మా ప్రభుత్వంలో కుటుంబ సభ్యులే. – పి.విశ్వరూప్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఉద్యోగులంటే సీఎంకు ప్రత్యేకమైన అభిమానం ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏమైనా సమస్యలున్నాయని భావిస్తే.. వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందువల్ల వారు నిరసన కార్యక్రమాలు చేపట్టడంలో అర్థం లేదు. ఉద్యోగుల పక్షపాతి.. సీఎం వైఎస్ జగన్. ఉద్యోగులంటే సీఎంకి ప్రత్యేకమైన అభిమానం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను నానా బాధలకు గురి చేసిన చంద్రబాబు ఇప్పుడు వారి పట్ల మొసలికన్నీరు కారుస్తున్నారు. – అవంతి శ్రీనివాస్, పర్యాటక శాఖ మంత్రి ఉద్యోగులు ఆందోళనకు దిగడం మంచిది కాదు నూతన పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళనకు దిగడం మంచిది కాదు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి. మొండిపట్టు పట్టడం తగదు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. – గుమ్మనూరు జయరాం, కార్మిక శాఖ మంత్రి -
దయచేసి ఉద్యోగులు సమ్మె విరమించాలి: సీఎస్ సమీర్ శర్మ
సాక్షి, అమరావతి: ఉద్యోగుల సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ఏపీ సీఎస్ సమీర్ శర్మ పేర్కొన్నారు. చర్చలు జరపకపోతే సమస్యలెలా తీరుతాయని ప్రశ్నించారు. నిరసనలు, ఆందోళనలతో ఉపయోగం ఉండదని, ఉద్యోగులతో చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు. ఉద్యోగులకు కావాల్సింది ఏంటో చెబితే కూర్చొని మాట్లాడతామని తెలిపారు. ఐఆర్ అంటే ముందస్తు సర్దుబాటు అని, పీఆర్సీ ఆలస్యం అయితే ఇస్తారని పేర్కొన్నారు. దయచేసి ఉద్యోగులు సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. కొత్త పీఆర్సీ వల్ల ప్రభుత్వంపై రూ.10 వేల కోట్ల రూపాయల భారం పడుతుందని, డీఏ మాత్రమే పెంచితే 10 వేల కోట్లు మిగిలేవని సీఎస్ తెలిపారు. కొత్త పీఆర్సీ వల్ల ఎవరి జీతాలు తగ్లేదని, ఐఆర్‌తో కొత్త పీఆర్సీని పోల్చి చూడటం సరికాదన్నారు. పాత పీఆర్సీతో కొత్త పీఆర్సీని పోల్చి చూడాలన్నారు. ఉద్యోగులకు సమస్యలు ఉంటే మంత్రుల కమిటీ ఉందని, ఏదైనా రిపోర్ట్ తయారు చేసి పరిష్కారం ఆలోచిద్దామని సూచించారు. చదవండి: సమస్యను మరింత జఠిలం చేసేలా ఉద్యోగుల తీరు: సజ్జల ఎవ్వరికీ జీతం తగ్గలేదు: ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఉద్యోగుల జీతం తగ్గిందని ఓ పత్రిక రాసిందని, వాస్తవానికి ఎవ్వరికీ జీతం తగ్గలేదని ప్రిన్సిపాల్ సెక్రెటరీ శశిభూషన్ కుమార్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి ఉద్యోగికి ఇంక్రిమెంట్ వస్తుంది. దాని వలన 3 శాతం పెరుగుతుంది. ఐఆర్ కలిపినా, కలపకపోయిన జీతం పెరుగుతుంది. ఐఆర్ కేవలం తాత్కాలిక ప్రయోజనం. ఇప్పటి వరకు అన్ని పీఆర్సీల కంటే అత్యధిక ఐఆర్ ఈ ప్రభుత్వం ఇచ్చింది. అది కూడా అత్యధికంగా 30 నెలలు ఐఆర్ ఇచ్చారు.’’ అని ప్రిన్సిపాల్ సెక్రెటరీ వివరించారు. చదవండి: ‘ఉద్యమాన్ని వారే నడుపుతున్నట్లుగా.. చంద్రబాబు బిల్డప్’ -
జీతం పడకుండా తగ్గినట్లు మీకు ఎలా తెలుసు?: ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: పీఆర్సీ జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. జీతం పడకుండా తగ్గినట్లు మీకు ఎలా తెలుసు అని హైకోర్టు ప్రశ్నించింది. ‘సమస్య పరిష్కారం కోసం కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు సమ్మె చేయడం అంటే ధర్మాసనంపై అనవసర ఒత్తిడి కలిగించడమే.. ఉద్యోగుల సమ్మెతో సమస్య పరిష్కారం కాదు’ అని హైకోర్టు పేర్కొంది. చదవండి: ఏప్రిల్‌లో ఇంటర్ పరీక్షలు కోర్టుకు ఏజీ శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. ఉద్యోగులు అనవసర భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక్క రూపాయి కూడా తగ్గదన్నారు. అత్యున్నతమైన న్యాయస్థానం భావించినట్లే మేము కూడా కోర్టులో పిటిషన్‌కు సంబంధించిన విచారణ నడుస్తున్నప్పుడు సమ్మె చేయటం ప్రయోజనకరం కాదని భావిస్తున్నామని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు. -
పీఆర్సీ జీవో: కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: పీఆర్సీ అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారించింది. ఈ విచారణలో భాగంగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మూడు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. చదవండి: ట్విట్టర్‌పై హైకోర్టు ఆగ్రహం -
పీఆర్సీ వ్యాజ్యం మళ్లీ మొదటికి..
సాక్షి, అమరావతి : ప్రభుత్వోద్యోగుల కొత్త వేతన సవరణపై దాఖలైన వ్యాజ్యం విషయంలో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా మరోసారి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిం ది. ఈ వ్యాజ్యాన్ని ఎవరికి కేటాయించాలన్న దాని పై సీజే తీసుకునే పరిపాలనాపరమైన నిర్ణయాన్ని బట్టి ఈ కేసు విచారణ ఆధారపడి ఉంటుంది. కొత్త వేతన సవరణకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వుల ను సవాలుచేస్తూ ఏపీ గెజిటెడ్ అధికారుల జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య దాఖలు చేసిన వ్యాజ్యాన్ని రోస్టర్ ప్రకారం తాము విచారించలేమని జస్టిస్ అమానుల్లా ధర్మాసనం రెండ్రోజుల క్రితం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యాజ్యాన్ని ఎవరికి కేటాయించాలన్న దానిపై సీజే పరిపాలనా పరమైన నిర్ణయం తీసుకుని, దాన్ని సింగిల్ జడ్జి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తికి కేటాయించారు. దీంతో ఆ వ్యాజ్యం శుక్రవారం జస్టిస్ సత్యనారాయణమూర్తి ముందు విచారణకు వచ్చిం ది. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ స్పందిస్తూ.. ఈ వ్యాజ్యం లో పిటిషనర్ రాజ్యాంగంలోని అధికరణ 309 కింద ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట నిబంధనలను సవాలు చేశారని తెలిపారు. హైకోర్టు రిట్ రూల్స్ ప్రకారం.. దీనిని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనమే విచా రించాల్సి ఉందంటూ సంబంధిత రూల్‌ను చదివి వినిపించారు. అధికరణ 309 కింద ఉద్యోగులకు సంబంధించిన నిబంధనలపై దాఖలయ్యే వ్యాజ్యా లను సాధారణంగా మొదటి కోర్టు ముందే విచారణకు వస్తాయని శ్రీరామ్ వివరించారు. దీనిపై న్యాయమూర్తి పిటిషనర్ న్యాయవాది రవితేజ స్పందన కోరారు. ఇది ఓ ఉద్యోగి స్వతంత్రంగా వేసిన సర్వీ సు పిటిషన్ మాత్రమేనని రవితేజ తెలిపారు. తాని చ్చిన వినతులను పరిగణ నలోకి తీసుకోకుండా వేతన సవరణ చేయడంవల్ల తనకు అన్యాయం జరి గిందంటూ వ్యక్తిగతంగా పిటిషన్ వేశారని ఆయన వివరించారు. మీ వ్యాజ్యంలో మీ అభ్యర్థన ఏమిట ని రవితేజను న్యాయమూర్తి ప్రశ్నించారు. అభ్యర్థన ను స్వయంగా చదివిన న్యాయమూర్తి, ఈ వ్యాజ్యం ధర్మాసనం ముందుకే వెళ్లాలంటూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ వ్యాజ్యం ఎవరికి కేటాయించాలన్న దానిపై తగిన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఈ వ్యాజ్యం తాలుకు ఫైళ్లను సీజే ముందుంచాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు. ఆ రెండు తీర్పులనూ పరిగణనలోకి తీసుకోండి.. ఇక గత విచారణ సమయంలో జస్టిస్ అమానుల్లా ధర్మాసనం ఉద్యోగుల జీతం ఏ విధంగా తగ్గుతుందో వివరించాలని పలుమార్లు అడిగిన నేపథ్యంలో, పిటిషనర్ కేవీ కృష్ణయ్య ఆ వివరాలతో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. 2015 పీఆర్సీ ఆధారంగా తనకు ఎంత జీతం వస్తోంది, 2022 పీఆర్సీ ఆధారంగా ఎంత వస్తుందో ఆయన వివరించారు. అలాగే, 2015 డీఏ ఆధారంగా వచ్చే జీతం, 2022 డీఏ ఆధారంగా వచ్చే జీతం వివరాలను కూడా ఆయన పొందుపరిచారు. మొత్తం మీద తనకు 2022 పీఆర్సీవల్ల రూ.6,072 మేర తగ్గుదల ఉందన్నారు. ఈ అనుబంధ పిటిషన్‌తో పాటు ఆయన రాష్ట్ర విభజన సందర్భంగా జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సమర్పించిన రహస్య నివేదికను బహిర్గతం చేయాలంటూ 2011లో అప్పటి న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి ఇచ్చిన తీర్పును జతచేశారు. ఈ తీర్పు ఆధారంగా పీఆర్సీ విషయంలో అశుతోష్ మిశ్రా సిఫారసుల నివేదికను బహిర్గతం చేయాలని కోరారు. అంతేకాక.. కోవిడ్‌వల్ల ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్లలో 50 శాతం వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తప్పుపడుతూ జీతాలు, పెన్షన్లను 12 శాతం వడ్డీతో సహా చెల్లించాలంటూ న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి 2020లో ఇచ్చిన తీర్పునూ జతచేశారు. తన వ్యాజ్యాన్ని తేల్చేటప్పుడు ఈ రెండు తీర్పులనూ పరిగణనలోకి తీసుకోవాలని కృష్ణయ్య తన పిటిషన్లో కోర్టును కోరారు. -
ఐఆరా.. పీఆర్సీనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న ఐఆర్, పీఆర్సీ అంశాలపై మళ్లీ చర్చ జోరందుకుంది. పీఆర్సీ అమలు, పదవీ విరమణ వయసు పెంపు తదితర అంశాలపై త్వరలోనే చర్చిస్తామంటూ సీఎం నోటివెంట వచ్చిన వ్యాఖ్యలే ఈ చర్చకు కారణం. పీఆర్సీపై సమావేశం ఎప్పుడు? ముందుగా మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తారా? లేక పీఆర్సీనే అమలు చేస్తారా? అనే చర్చ జోరందుకుంది. సీఎంతో సమావేశం ఎప్పుడు ఉంటుందంటూ సంఘాల నేతలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. త్వరగా తేల్చకపోతే ఆందోళన చేస్తామంటూ ఉపాధ్యాయ సంఘాలు ఓ అడుగు ముందుకేశాయి. దీంతో.. ఇప్పటికే ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. ఆ దిశగా కార్యాచరణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు, పింఛనర్లకు ఐఆర్/ఫిట్మెంట్ ఎంత ఇస్తే ఎంత ఖర్చు అవుతుందన్న లెక్కలు తేల్చింది. వీలైనంత త్వరగా ఉద్యోగులకు సంబంధించిన అంశాలకు ఓ పరిష్కారం చూపాలన్న ఆలోచనలతో ముందుకు సాగుతోంది. ఒక్క శాతం ఇస్తే రూ.225 కోట్లు ప్రస్తుతం రాష్ట్రంలో 2.62 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు, 2.67 లక్షల మంది పింఛనర్లు ఉన్నారు. మొత్తంగా 5.29 లక్షల మందికి పీఆర్సీ లేదా ఐఆర్‌ను అమలు చేయాల్సి ఉంది. వారికి ఒక్క శాతం ఐఆర్ ఇచ్చినా లేదా ఫిట్మెంట్ అమలు చేసినా ఖజానాపై రూ.225 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వం లెక్కలు వేసింది. ఇలా ఒక్క శాతం నుంచి మొదలుకొని 35% వరకు ఫిట్మెంట్ లేదా ఐఆర్ ఇస్తే వెచ్చించాల్సిన మొత్తంపై లెక్కలు వేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు 27% ఐఆర్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ కనీసంగా 27% ఐఆర్ ఇస్తారన్న ఆలోచనలతో ఉద్యోగులు అంచనాలు వేసుకుంటున్నారు. ఆ లెక్కన రాష్ట్రంలోని ఉద్యోగులకు ఐఆర్ కింద ఏటా రూ.6,075 కోట్లు ప్రభుత్వం వెచ్చించాల్సి వస్తుందని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేశాయి. అంతేకాదు 35% అమలు చేస్తే ప్రభుత్వం రూ.7,875 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని తేల్చింది. ఎలాగైతే ఉద్యోగులకు సంతృప్తి? ఉద్యోగులకు సంబంధించిన అంశాల పరిష్కారం దృష్టి పెట్టిన ప్రభుత్వం ఏ విధంగా ముందుకు సాగితే మెజారిటీ వర్గానికి సంతృప్తి కలిగించగలమన్న దానిపై కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇంటలిజెన్స్ ద్వారా సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. దీంతోపాటు రాష్ట్ర ఖజానాపై పడే భారంపై అంచనా వేసుకొని చివరగా ఉద్యోగులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. పీఆర్సీ వర్గాలతోపాటు ఆర్థిక శాఖ అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నారు. అనధికారిక సంప్రదింపులు జరుపుతున్నారు. 27% ఐఆర్? 30% ఫిట్మెంట్? ఉద్యోగుల సమస్యల్లో ప్రధానమైన డిమాండ్ ఐఆర్ ఇవ్వడం, పీఆర్సీ అమలు. రెండింటిలో ఏ ఒక్కదానిపై నిర్ణయం తీసుకున్నా ప్రస్తుతానికి చాలు. అయితే ప్రభుత్వం రెండింటిపైనా ఆలోచనలు చేస్తోంది. ఐఆర్ ఇస్తే ఎంతివ్వాలన్న దానిపై తర్జన భర్జన పడుతోంది. ఏపీలో 27% ఇచ్చినందున.. అంతకంటే తక్కువ ఇస్తే ఉద్యోగులు అంగీకరిస్తారా? అన్న అలోచనలు చేస్తోంది. ఒకవేళ ఉద్యోగుల ఒప్పుకోకపోతే సంప్రదింపుల సమయంలో 27 శాతానికి ఓకే చేద్దామా? అన్న ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఇపుడు ఐఆర్ ఇచ్చినా, మరో మూడు నాలుగు నెలల తరువాత మళ్లీ పీఆర్సీ అమలు చేయక తప్పదు. అప్పడే అదే 27% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేస్తామంటే.. మళ్లీ ఉద్యోగులు అలకవహించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడే 30% ఫిట్మెంట్తో పీఆర్సీనే అమలు చేస్తే మరో ఐదేళ్ల వరకు తంటాలుండవన్న ఆలోచనలు కూడా చేస్తున్నట్లు తెలిసింది. గతంలో 43% ఫిట్మెంట్ ఇవ్వడం, అప్పుడు ఇచ్చిన స్కేల్స్ కంటే తరువాత కొన్ని కేటగిరీల్లో స్కేళ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో 30%తో ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేస్తే ఉద్యోగులు సంతృప్తి చెందుతారన్న ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. లేదంటే ఇపుడు 27% ఐఆర్ ఇచ్చి మరో నాలుగైదు నెలల తరువాత 3% కలిపి 30 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీనే తరువాత అమలు చేయాలా? అన్న చర్చ కూడా జరుగుతోంది. తెరపైకి ప్యాకేజీ ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీతోపాటు ప్రధాన డిమాండ్లు అయిన ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 61 ఏళ్లకు పెంచడం, కాంట్రిబ్యూటరీ పింఛను స్కీం రద్దుపై కమిటీ ఏర్పాటు చేయడం వంటి వాటితోపాటు ఇతర సమస్యలను పరిష్కరించేలా ప్యాకేజీ అమలు చేయాలా? అనే కోణంలో చర్చిస్తున్నట్లు ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఐఆర్‌ను 25% ఇస్తూ ఈ ప్రధాన డిమాండ్లకు పరిష్కారం చూపితే, ఐఆర్ కొంత తగ్గినా ఉద్యోగులు సంతృప్తి చెందే అవకాశం ఉంటుందన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి. దానిపైనా ప్రభుత్వం వివరాలను సేకరిస్తున్నట్లు తెలిసింది. మరో నాలుగైదు నెలలకైనా చేయాల్సినవే కదా! మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. పైగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎక్కువగా పట్టుండే పట్టణ ప్రాంతాల్లో జరిగే ఎన్నికల్లో వారి ఓట్లు కీలకం కానున్నాయి. ఒక్క ఓటును కూడా వదులుకునే పరిస్థితి ఉండదు. ఈ క్రమంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తే ఎన్నికల్లో సులభంగా నెగ్గొచ్చనే వాదన ఉంది. పైగా వారి సమస్యలను ఇప్పుడు కాకపోతే మరో నాలుగైదు నెలలకైనా పరిష్కరించాల్సిందే.. అదేదో ఇప్పుడు చేస్తే సరిపోతుంది కదా! అని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఉద్యోగుల సమçస్యలపై ఇప్పుడే ఓ నిర్ణయం తీసుకుంటే వారిలో ఆందోళనను పోగొట్టడంతోపాటు, వారిని దగ్గర చేసుకోవచ్చన్న వాదనను ఉన్నతాధికారులే వ్యక్తం చేస్తున్నారు. -
ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టిన పీఆర్సీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల మధ్య 11వ వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) ఉత్తర్వులు చిచ్చుపెట్టాయి. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సిఫార్సుల సమర్పణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీను ఏర్పాటు చేసింది. అన్ని అంశాలను పరిశీలించి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఆర్థిక నిపుణులతో చర్చించి ఏడాదిలోగా వేతన సవరణపై సిఫారసులను ప్రభుత్వానికి సమర్పించాలని పీఆర్సీని ఆదేశించినట్లు పేర్కొంటూ ప్రభుత్వం శుక్రవారం (మే 18) ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త వేతన సవరణ సిఫారసుల కోసం తక్షణమే 11వ పీఆర్సీని ఏర్పాటు చేయాలంటూ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (అమరావతి జేఏసీ) సమర్పించిన వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకుని కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొనడంతో ఉద్యోగ సంఘాల మధ్య వివాదం నెలకొంది. అశోక్‌బాబు వర్సెస్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలో ఏపీఏన్జీవో, సచివాలయ ఉద్యోగల సంఘాలను ప్రస్తావించక పోవడంపై ఎన్జీవో నేత అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సంఘాలను ఎందుకు పెట్టలేదని అశోక్ బాబు వర్గం మండిపడుతోంది. ఈ నేపథ్యంలో సీఎం కార్యాలయంలో ముఖ్యకార్యదర్శి సతీష్ చంద్రతో సోమవారం అశోక్‌బాబు నేతృత్వంలోని ప్రతినిధులు భేటీ అయ్యారు. జీవోలో తమ సంఘాలను ఎందుకు చేర్చలేదని వారు ప్రశ్నించారు. అయితే పీఆర్సీని నియమించమని వినతిపత్రం ఇవ్వలేనందునే ఏపీఎన్జీవోలో పేర్లు చేర్చలేదని సీఎం వర్గాలు తెలిపాయి. తాజా వివాదంతో అశోక్‌బాబు వర్సెస్ బొప్పరాజు వెంకటేశ్వర్లుగా వ్యవహారం మారిపోయింది. -
పీఆర్సీ జీవో సవరించాలి
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవో లోపభూయిష్టం. వేతనాల సవరణ, బకాయిల చెల్లింపు, స్కేల్ పేమెంట్ తదితర అంశాలపై స్పష్టత లేదు. ఉద్యోగులను ఏప్రిల్ ఫూల్ చేసేలా ఉంది. తక్షణమే జీవోను సవరించాలి. ఉద్యోగుల బకాయిలపై సభలో ప్రస్తావిస్తే దాట వేశారు. గత ప్రభుత్వాలు కూడా ఉద్యోగులకు 39 శాతం వరకు ఫిట్మెంట్ ఇచ్చాయి. ఉద్యోగులకు ఇచ్చిన హెల్త్‌కార్డులు దేనికీ పనికి రాకుండా ఉన్నాయి. ఆస్పత్రులతో ఒప్పందాలు కుదుర్చుకోలేదు. రాష్ట్రంలో ఏకపక్ష, కుటుంబపాలన సాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. సీఎం కార్యాలయం నుంచి సైతం బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన శాస్తి తప్పదు. -కిషన్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే