సాక్షి, హైదరాబాద్: జోనల్ విధానం అమల్లో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోను రద్దు చేయాలని, జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలన్న డిమాండ్లతో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్‌కుమార్ నేతృత్వంలో ఆదివారం ఇంది రాపార్క్ వద్ద నిరసన దీక్ష జరిగింది.
ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే నియమించి, పంచాయతీ సెక్రటరీల పైన తీవ్ర పనిభారం తగ్గించాలని కోరారు. సెపె్టంబర్ 2020లో అసెంబ్లీలో సీఎం ప్రకటించిన వీఆర్‌ఏల పే స్కేల్ జీవో వెంటనే అమలు చేయాలన్నారు. నిషేధం ఎత్తివేసి వెంటనే సాధారణ బదిలీలను చేపట్టాలని, దీర్ఘకాలికంగా రెవెన్యూ శాఖ, విద్య శాఖలో ఆగిపోయిన ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పీఆర్సీ జీవోలో తెలిపిన విధంగా ఏప్రిల్, 2021.. మే, 2021 రెండు నెలల పీఆర్సీ బకాయిలను మార్చి, 2022లోగా చెల్లించాలని కోరారు. దీక్షలో తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొట్టబత్తిని పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment