
పీఆర్సీ జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. జీతం పడకుండా తగ్గినట్లు మీకు ఎలా తెలుసు అని హైకోర్టు ప్రశ్నించింది.
సాక్షి, అమరావతి: పీఆర్సీ జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. జీతం పడకుండా తగ్గినట్లు మీకు ఎలా తెలుసు అని హైకోర్టు ప్రశ్నించింది. ‘సమస్య పరిష్కారం కోసం కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు సమ్మె చేయడం అంటే ధర్మాసనంపై అనవసర ఒత్తిడి కలిగించడమే.. ఉద్యోగుల సమ్మెతో సమస్య పరిష్కారం కాదు’ అని హైకోర్టు పేర్కొంది.
చదవండి: ఏప్రిల్‌లో ఇంటర్ పరీక్షలు
కోర్టుకు ఏజీ శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. ఉద్యోగులు అనవసర భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక్క రూపాయి కూడా తగ్గదన్నారు. అత్యున్నతమైన న్యాయస్థానం భావించినట్లే మేము కూడా కోర్టులో పిటిషన్‌కు సంబంధించిన విచారణ నడుస్తున్నప్పుడు సమ్మె చేయటం ప్రయోజనకరం కాదని భావిస్తున్నామని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు.