సాక్షి, గుంటూరు: పేదల ఇళ్ల నిర్మాణంపై న్యాయపోరాటం చేయాలనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఆర్-5 జోన్ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఇవాళ ఏపీ హైకోర్టు వెల్లడించిన తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
రాజకీయ కుట్రలు, కోర్టు కేసుల ఆటంకాలు దాటుకుని ఇటీవలే అమరావతిలోని ఆర్-5 జోన్‌లో సీఎం జగన్ చేతుల మీదుగా పట్టాలు అందజేయించి మరీ ఇళ్ల నిర్మాణం ప్రారంభించింది ప్రభుత్వం. అయితే ఇళ్ల నిర్మాణాన్ని ఆపేలా కుట్రపూరితంగా కొన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
ఈ నేపథ్యంలో గురువారం హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇళ్ల నిర్మాణాలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. స్టే ద్వారా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీ హైకోర్టు విధించిన స్టేను జగన్ సర్కార్ సవాల్ చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment