
సాక్షి, ఢిల్లీ: అమరావతి కేసు నేడు(మంగళవారం) సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. మూడు రాజధానులపై ఏపీ హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో..
హైకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం, సుప్రీం ధర్మాసనానికి తెలియజేసింది. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరుతోంది. ఇప్పటికే మూడు రాజధానుల అంశంపై సుప్రీంలో విచారణ కొనసాగుతుండగా.. మరోవైపు ఏపీ రాజధాని అంశంపై సుప్రీంలో మరో పిటిషన్ దాఖలైంది.
శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు అమలు చేయాలంటూ మరో పిటిషన్ దాఖలైంది. ఒకే చోట కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని శివరామకృష్ణ కమిటీ సూచించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment