హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులు, మార్షల్స్ సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వివాదం జరిగింది. మీడియా పాయింట్ వద్దకు వెళ్లడానికి వీళ్లేదంటూ తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు, మార్షల్స్ అడ్డుకున్నారు. వారిని తోసుకుంటూ మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నించగా పోలీసులు, మార్షల్స్ లతో వాగ్వివాదం చోటుచేసుకుంది.