
సాక్షి, హైదరాబాద్ : జూబ్లీ హిల్స్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి డ్రంక్అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేశారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మొత్తం 108 కేసులు నమోదయ్యాయి. ఇందులో 57 ద్విచక్ర వాహనాలు, 51 కార్లు ఉన్నట్లు సమాచారం.
అయితే జూబ్లిహిల్స్ చెక్ పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నా నారాయణగూడ ట్రాఫిక్ ఎస్సై అత్యుత్సాహం ప్రదర్శించాడు. కవరేజ్ చేస్తున్న మీడియాను దురుసుగా ప్రవర్తిస్తూ.. మీడియాను అడ్డుకున్నాడు. మీరు డిస్టర్బ్ చేస్తున్నారంటూ ట్రాఫిక్ ఎస్సై మీడియాపై చిందులేశాడు.
Comments
Please login to add a commentAdd a comment