హైదరాబాద్: నగరంలో శనివారం రాత్రి మద్యం మత్తులో నైజీరియన్లు వీరంగం సృష్టించారు. బసవతారకం ఆస్పత్రి వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రవ్ నిర్వహించి మద్యం సేవించి వాహనం నడిపే వారి ఆటకట్టించారు. ఈ నేపథ్యంలో మద్యం సేవించిన నైజీరియన్లను ఆపి చెక్ చేశారు. దాంతో ఆగ్రహించిన వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చిత్రీకరిస్తున్న మీడియాపై దాడికి పాల్పడి కెమెరాలను లాక్కునేందుకు యత్నించారు. దాంతో డ్రంక్ అండ్ డ్రవ్ కేసులో ఆరుగురి నైజేరియన్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.