
దూసుకువస్తున్న కారు
చిలకలగూడ: మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ రోడ్డు పక్కన మాట్లాడుకుంటున్న ఇద్దరు వ్యక్తులను ఢీ కొట్టిన ఘటన తుకారంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తుకారంగేట్ ఎస్‌ఐ శ్రీనివాస్ కథనం మేరకు వివరాలిలా ఉన్నా యి. తుకారంగేట్‌కు చెందిన నరేష్, మానస బంధువులు. శుక్రవారం మధ్యాహ్నాం వారు స్థానిక కేజీ ఆస్పత్రి ఎదురుగా రోడ్డు పక్కన నిలుచుని మాట్లాడుకుంటుండగా అదే సమయంలో మద్యం మత్తులో వేగంగా కారునడుపుతూ వచ్చిన మల్లిఖార్జుననగర్‌కు చెందిన అభిలాష్ వారిని ఢీ కొట్టాడు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. మానస పరిస్థితి విషమంగా ఉంది. అభిలాష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment