కంబదూరు: మద్యం మానేయడం ఇష్టంలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... కంబదూరు మండలం ఓబగానిపల్లికి చెందిన రాజన్న (29) మొదటి భార్య మృతి చెందింది. దీంతో 30 రోజుల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. మద్యానికి బానిస కావడంతో రోజూ తప్పతాగి ఇంటికి చేరుకునేవాడు. శనివారం రాత్రి కూడా మద్యం మత్తులో ఇంటికి చేరుకోవడంతో తల్లి నాగమణి, భార్య చైత్ర మందలించారు.
రోజూ మద్యం తాగుతూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం తగదని, ఏదైనా పని చేసుకుంటూ గౌరవంగా బతుకుదామని హితవు పలికారు. అయితే మద్యానికి పూర్తి స్థాయిలో బానిసైన రాజన్న... అదే రోజు రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. ఇంట్లో వారు గమనించేలోపు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ప్రవీన్ అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment