తెలంగాణ అసెంబ్లీలో ఐదుగురు బీజేపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఐదుగురు బీజేపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసన చేపట్టడంతో వారిని రెండు రోజుల పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ మధుసూదనాచారి నిర్ణయం తీసుకున్నారు.
కాగా.. బీజేపీ సభ్యుల సస్పెన్షన్‌ను నిరసిస్తూ.. సభ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. ఏకపక్షంగా సభ్యులను సస్పెండ్ చేయడం సరికాదని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి ఈ సందర్భంగా అన్నారు.