Jana Reddy
-
రాజకీయ పార్టీలకు భట్టి,జనారెడ్డి బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: రాజకీయ పార్టీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ నేత జానారెడ్డి బహిరంగ లేఖ రాశారు. నియోజకవర్గాల పునర్విభజనపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని.. ప్రతి పార్టీని ఆహ్వానిస్తామని తెలిపారు.జనాభా ప్రాతిపదికన జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉందని.. జరగబోయే నష్టం గురించి అన్ని పార్టీలను ఆహ్వానించి చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశానికి అన్ని పార్టీలు హాజరుకావాలని భట్టి విక్రమార్క, జానారెడ్డిలు సంయుక్తంగా బహిరంగ లేఖ విడుదల చేశారు. ప్రతి పార్టీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తామని.. త్వరలోనే తేదీ, వేదిక ప్రకటిస్తామని బహిరంగ లేఖ ద్వారా వారు స్పష్టం చేశారు. -
తీన్మార్ మల్లన్నవి గాలి మాటలు: జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కులగణ అంశంలో తన పాత్ర లేదని.. గాలి మాటలు మాట్లాడితే కుదరదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. ‘‘తప్పు చేసిన వాడ్ని క్షమించే గుణం నాది. నన్ను ఎవరు తిట్టిన నేను పట్టించుకోను. తీన్మార్ మల్లన్న ప్రెస్‌మీట్ పెట్టికుంటే.. ఏంది..ఇంకేమైనా పెట్టుకుంటే నాకేంటి ఏమైనా పెట్టుకొని.. ప్రత్యేక్ష రాజకీయాలకు నేను దూరం.. సలహాలు అడిగితే ఇస్తాను’’ అని జానారెడ్డి పేర్కొన్నారు.‘‘పరిపాలన చేసే వారు సైతం అడిగితేనే సలహాలు సూచనలు ఇస్తాను. నా పార్టీ నాయకులు నన్ను విమర్మిస్తే... ఖండిస్తలేరు... అలాగని సమర్థించడం లేదు.. ఎందుకో వారినే అడిగి తెలుసుకోండి. కేసీఆర్ పాత్ర ఏంటి అనేది ప్రజలే నిర్ణయిస్తారు’’ అని జానారెడ్డి వ్యాఖ్యానించారు.నాకు సంబంధం లేదు: వీహెచ్వీహెచ్ హనుమంతరావు రావు మాట్లాడుతూ.. కామెంట్స్ తీన్మార్ మల్లన్న అంశం తనకు సంబంధం లేదని.. పార్టీ చూసుకుంటుందన్నారు. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని మీనాక్షి నటరాజన్‌కు చెప్పా.. ఆమె నన్ను ఏమి అడగలేదు.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని మీనాక్షి నటరాజన్‌కు సూచించాను’’ అని వీహెచ్ చెప్పారు.ఇదీ చదవండి: బీజేపీకి రేవంత్ పరోక్షంగా సహకరిస్తున్నారు.. మల్లన్న సంచలన వ్యాఖ్యలు -
జానారెడ్డి, బాలకృష్ణ ఇళ్లకు మార్కింగ్
బంజారాహిల్స్: రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12 విరించి హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు రోడ్డునెంబర్–12 నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు భూసేకరణలో భాగంగా పలు భవనాలకు మార్కింగ్ వేశారు. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–92లో నివసించే మాజీ మంత్రి జానారెడ్డి రోడ్డు విస్తరణలో భాగంగా తన ప్లాట్ నుంచి 600 గజాల స్థలాన్ని కోల్పోనున్నారు. ఆయన ఇంటికి వేసిన మార్కింగ్ ప్రకారం ఆయన ప్లాట్‌లో సగభాగం విస్తరణలో కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45, జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–1 రెండు రోడ్లు కలిపి ఉన్న హీరో నందమూరి బాలకృష్ణ ఇంటికి కూడా జీహెచ్ఎంసీ అధికారులు మార్కింగ్ వేశారు. ఆయన సుమారుగా తన ప్లాట్‌లో 500 గజాల వరకు కోల్పోనున్నారు. అలాగే ఈ రోడ్డులో నివసిస్తున్న మాజీ మంత్రులు సమరసింహారెడ్డి, షబ్బీర్ అలీ, కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డి తదితరుల ఇళ్లకు కూడా మార్కింగ్ వేశారు. త్వరలోనే రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ఒకవైపు ప్రాజెక్ట్ ఇంజనీర్లు సన్నద్ధం అవుతుండగా..ఇంకోవైపు కేబీఆర్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణానికి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఎలా చూసినా ఈ ఆస్తుల సేకరణ తప్పేలా కనిపించడం లేదు. అంతా ప్రముఖులే కావడంతో రోడ్డు విస్తరణ పనులకు తమ స్థలాలను అప్పగించేందుకు ఎంతవరకు ముందుకు వస్తారో చూడాల్సి ఉంది. ఇప్పటికే తమ ఇళ్లకు మార్కింగ్ వేయడం పట్ల పలువురు ప్రముఖులు ప్రభుత్వంపై కస్సుబుస్సుమంటున్నట్లు తెలుస్తోంది. మా ఇంటికే మార్కింగ్ వేస్తారా? అంటూ నిలదీతలు కూడా మొదలయ్యాయి. మరికొంతమంది ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దాకా తీసుకువెళ్తామని చెబుతున్నారు. జూబ్లీహిల్స్‌లో ఒకవైపే.. బంజారాహిల్స్–జూబ్లీహిల్స్ రోడ్డు విస్తరణలో భాగంగా బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని అగ్రసేన్ చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు రోడ్డుకు ఒకవైపే ఆస్తులు సేకరించనున్నారు. ప్రస్తుతం ఇక్కడ 80 అడుగుల రోడ్డు మాత్రమే 120 అడుగుల వరకు విస్తరించనున్నారు. ఒకవైపు కేబీఆర్ పార్కు గోడ ఉండగా, ఆ ప్రాంతాన్ని ముట్టుకోవడం లేదు. సమరసింహారెడ్డి, జానారెడ్డి, బాలకృష్ణ తదితరులు ఉంటున్న వైపు మాత్రమే రోడ్డు విస్తరణ జరగనుంది. ఆ మేరకే మార్కింగ్ వేశారు. ఇదిలా ఉండగా బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12 విరించి ఆస్పత్రి చౌరస్తా నుంచి అగ్రసేన్ చౌరస్తా వరకు ప్రస్తుతం 80 అడుగుల రోడ్డు ఉంది. దీనిని 100 అడుగుల మేర విస్తరించనున్నారు. ఈ రోడ్డుకు రెండు వైపులా ఆస్తుల సేకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే 86 నివాసాలకు మార్కింగ్ చేశారు. ఈ రోడ్డు విస్తరణ పనులు పూర్తయితే బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12 నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు వాహనాల రాకపోకలు సాఫీగా సాగనున్నాయి. అయితే పనులు ముందుకుసాగడంలోనే అధికారులకు అసలైన పరీక్ష ఎదురుకానుంది. అంతా ప్రముఖులే కావడం, ప్రభుత్వంలో ఉండడం వల్ల వీరు తమ ఆస్తులు ఇవ్వడానికి ఎంతవరకు సహకరిస్తారో చూడాల్సి ఉంది. -
జానారెడ్డితో ఇంద్రకరణ్‌రెడ్డి భేటీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి త్వరలోనే కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం ఆయన హైదరా బాద్‌లో సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డితో భేటీ అయిన నేపథ్యంలో ఈ ప్రచారం ఊపందుకుంది. ఇంద్రకరణ్‌రెడ్డి చేరికపై గతంలోనూ ప్రచారం జరిగినా, గురువారం జానా నివాసానికి వెళ్లి గంటకుపైగా చర్చలు జరపడంతో కచ్చితంగా పార్టీ మారతారని భావిస్తున్నారు. -
కాంగ్రెస్ వస్తే.. ఆరు నెలలకో సీఎం
సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి కోసం మాజీ మంత్రి జానారెడ్డి సహా 11 మంది అభ్యర్థులు రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కొత్త సీసాలో పాత సారా లాంటిది. సీల్డ్ కవర్ సీఎంలు, అంతర్గత కుమ్ములాటలు నిత్యకృత్యం. కాంగ్రెస్ ఇస్తున్న గ్యారంటీల సంగతేంటోగానీ ఆరు నెలలకో సీఎం మాత్రం గ్యారంటీ’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారమిక్కడ జరిగిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. సుస్థిర ప్రభుత్వం, దృఢమైన నాయకత్వం ఉంటేనే తెలంగాణ అభివృద్ధి నిరంతరంగా సాగుతుందన్నారు. ‘ఎవరు అవునన్నా, కాదన్నా తొమ్మిదిన్నరేళ్లలో మాకు నికరంగా దొరికిన ఆరున్నరేళ్లలో అసాధారణ విజయాలు సాధించాం. తెలంగాణ భూతల స్వర్గమైందని చెప్పడం లేదు. సమస్యలు నిరంతరం ఉంటూనే ఉంటాయి. వాటిని పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత. కేసీఆర్ ప్రజల మనిష్, ఆయన నాయకత్వంలోనే తెలంగాణ నేడు దేశానికి దిక్సూచీగా మారింది. మా పార్టీ ఎమ్మెల్యేలపై అక్కడక్కడా అసంతృప్తి ఉన్నా బీఆర్ఎస్కే ఓటర్లు మద్దతు పలుకుతారు. మేము దైవాంశ సంభూతులం కాదు. అందరినీ సంతృప్తపరచడం సాధ్యం కాదు. ఏ రకమైన ప్రభుత్వం కావాలో మీరే ఎంచుకోండి’అని కేటీఆర్ పేర్కొన్నారు. మరింత వేగంగా అభివృద్ధి చేస్తాం ‘హైదరాబాద్‌లో అభివృద్ధి ఇప్పటి దాకా చేసింది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది. వచ్చే ప్రభుత్వంలో మరింత వేగంగా హైదరాబాద్ అభివృద్ధి చేసి చూపిస్తాం. 332 కి.మీ. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించడంతోపాటు ఔటర్ రింగ్‌రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు నడుమ కొత్త హైదరాబాద్‌ను నిర్మిస్తాం. గత రెండున్నర దశాబ్దాల్లో అభివృద్ధి కోణంలో తెలంగాణపై ప్రభావం చూపిన వారు వైఎస్, చంద్రబాబు, కేసీఆర్ మాత్రమే’అని కేటీఆర్ అన్నారు. కర్ణాటక పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ఉంది. అక్కడి కొత్త ప్రభుత్వం బిల్డర్లపై విధించిన స్పెషల్ ట్యాక్స్ 40 నుంచి 400 శాతానికి పెరిగింది. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తేనే తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి కళ్లకు కనబడుతుంది’అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రభాకర్‌రావు, రాఘవరావు, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (డిక్కీ) ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. -
తమ్మినేని వీరభద్రంకు కాంగ్రెస్ నేత జానారెడ్డి ఫోన్
సాక్షి, హైదరాబాద్: అభ్యర్థుల ప్రకటన వాయిదా వేసుకోవాలంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి కాంగ్రెస్ నేత జానారెడ్డి ఫోన్ చేశారు. ఇప్పటికే 14 స్థానాల్లో పేర్లు ప్రకటించామని, మరో మూడు స్థానాలు చర్చల్లో ఉన్నాయన్న తమ్మినేని.. కుదరదని తేల్చి చెప్పారు. మిగతా స్థానాలను రెండురోజుల్లో ప్రకటిస్తామని చెప్పిన తమ్మినేని.. కాంగ్రెస్‌తో మాట్లాడటం తప్ప ఎలాంటి నిర్ణయం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా, కాంగ్రెస్ పార్టీతో వామపక్ష పార్టీల పొత్తుల వ్యవహారం ఇప్పటికీ గందరగోళంగానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేయాలనే ఆలోచనతో కమ్యూనిస్టులు కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీతో మంతనాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వనికారణంగా ఒంటరి పోరుకు సీపీఎం సిద్ధం కాగా, పొత్తు పెట్టుకుని పోరులో నిలవాలని సీపీఐ సంప్రదింపుల ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో సీపీఐకి ఒక చోట పోటీతో పాటు ఒక ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ తాజాగా అంగీకరించినట్లు తెలిసింది. ఈ అంశంపై సీపీఐ సైతం సుముఖత వ్యక్తం చేసి పొత్తుతో ముందుకు సాగనున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థిని బరిలోకి దింపేందుకు దాదాపు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం పొత్తు అంశం, సీటు కేటాయింపు పట్ల ఇప్పటికీ అధికారికంగా ప్రకటన చేయలేదు. చదవండి: ఎన్నికల పోరుకు రెడీ.. అభ్యర్థులను ప్రకటించిన సీపీఎం -
telangana: శాసనసభకు అయిదు కంటే ఎక్కువసార్లు ఎన్నికైంది వీరే..
తెలంగాణ నుంచి శాసనసభకు ఐదు లేదా అంతకన్నా ఎక్కువగా ఎన్నికైనవారి సంఖ్య నలబై అయిదు వరకు ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికి ఎనిమిదిసార్లు శాసనసభకు ఎన్నికై రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన తర్వాత ఏడుసార్లు శాసనసభకు ఎన్నికైన వారు ఇద్దరు ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి , ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఈటెల రాజేందర్ ఈ ఘనత పొందారు. జానారెడ్డి 1983,1985 లలో టీడీపీ పక్షాన, 1989,1999,2004,2009,2014లలో కాంగ్రెస్ పక్షాన గెలుపొందారు. ఈటెల రాజేందర్ 2004 ,2008 ఉప ఎన్నిక, 2009, 2010 ఉప ఎన్నిక, 2014,2 018లలో టిఆర్ఎస్ పక్షాన, 2021 ఉప ఎన్నికలో బీజేపీ తరపున ఆయన గెలుపొందారు. ఆరుసార్లు గెలిచినవారిలో జి.గడ్డెన్న, టీ.జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పోచారం శ్రీనివాసరెడ్డి, సీ రాజేశ్వరరావు, తన్నీరు హరీష్ రావు, డాక్టర్ ఎమ్.చెన్నారెడ్డి, ముంతాజ్ అహ్మద్ ఖాన్, నర్రా రాఘవరెడ్డి ఉన్నారు. ఇక ఐదుసార్లు గెలిచిన నేతలలో జి.రాజారాం, గంపా గోవర్దన్, మండవ వెంకటేశ్వరరావు, కరణం రామచంద్రరావు, సి.విఠల్ రెడ్డి, కె.హరీశ్వర్ రెడ్డి, పి.జనార్ధనరెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, దానం నాగేందర్, అక్బరుద్దీన్ ఒవైసి, సలావుద్దీన్ ఒవైసి, అమానుల్లాఖాన్, జి.సాయన్న, డాక్టర్ పి.శంకరరావు, గురునాధరెడ్డి, జె.కృష్ణారావు, ఎన్.ఉత్తం కుమార్ రెడ్డి, పి.గోవర్దనరెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉన్నారు -
మనసులో మాట బయటపెట్టిన జానారెడ్డి!.. కల నెరవేరేనా!
మనసులో మాట బయటపెట్టిన జానారెడ్డి.. కల నెరవేరేనా! -
నేను సీఎంగా ఉన్నట్టే
-
ప్రజల ఆ ఒక్క కోరికా తీరుతుందేమో!
గుర్రంపోడు (నాగార్జునసాగర్): ‘నేను ఏ హోదాలో ఉన్నా ముఖ్యమంత్రిగా ఉన్నట్లుగానే లెక్క.. 55 ఏళ్ల రాజకీయ అనుభవమున్న నన్ను తెలుగు రాష్ట్రాల్లో అందరూ గౌరవిస్తున్నారు, ముఖ్యమంత్రిగా చూడాలనే ఆకాంక్ష ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. నేను ఆశించకుండానే అనేక పదవులు వచ్చాయి. ఏ ముఖ్యమంత్రీ చేయని పలు శాఖలకు మంత్రిగా పనిచేశా.. ప్రజల ఆ చివరి కోరిక కూడా నాకు తెలియకుండానే తీరవచ్చు’అని మాజీమంత్రి కుందూరు జానారెడ్డి వ్యాఖ్యానించారు. ‘పదవుల రేసులో నేను ఎప్పుడూ లేను, పదవే రేసులో ఉండి నన్ను వరిస్తుంది’అని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండానే పీవీ నర్సింహారావు ప్రధానమంత్రి కాలేదా.. ముఖ్యమంత్రి అయినంక, ఆరు నెలల తర్వాత నా కొడుకు రాజీనామా చేస్తాడు.. నేను ఎమ్మెల్యే అవుతా’అంటూ వ్యాఖ్యానించారు. మంగళవారం నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో జెడ్పీటీసీ సభ్యురాలు గాలి సరితా రవికుమార్, పదిమంది సర్పంచ్‌లు, ఒక ఎంపీటీసీ, పలువురు నాయకులు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జానారెడ్డి మాట్లాడారు. మరోమారు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మాయమాటలకు ప్రజలు మోసపోవద్దని కోరారు. సమావేశంలో నాగార్జున సాగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జయవీర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గుర్రంపోడు మండల అధ్యక్షుడు తగుళ్ల సర్వయ్య తదితరులు పాల్గొన్నారు. -
సాగర్‌లో జానా తనయుడివైపే మొగ్గు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో మూడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ల వ్యవహారం తేలలేదు. మిగతా నియోజకవర్గాల్లో దాదాపు కొలిక్కి వచ్చినా దేవరకొండ, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఆశావహులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు నాగార్జునసాగర్‌లో మాజీ మంత్రి జానారెడ్డినే పోటీలో దింపాలని భావించినా ఆయన తన కుమారుడికే టికెట్ ఇప్పించుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇదిలా ఉంటే.. పొత్తులో భాగంగా ఉమ్మడి జిల్లాలో కమ్యూనిస్టులకు రెండు స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకారానికి వచ్చిందంటూ ప్రచారం సాగుతోంది. మిర్యాలగూడ స్థానాన్ని సీపీఎంకు, మునుగోడు స్థానాన్ని సీపీఐకి ఇస్తున్నారన్న విషయంపై సోమవారం రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయా స్థానాలను ఆశిస్తున్న వారు తీవ్ర ఆందోళనలో పడ్డారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న బత్తుల లక్ష్మారెడ్డి వర్గం, మునుగోడులో టికెట్ ఆశిస్తున్న చలమల్ల కృష్ణారెడ్డి వర్గం నిరాశలో పడింది. అయితే, మిర్యాలగూడ, మునుగోడు స్థానాలను ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని కమ్యూనిస్టు పార్టీల నేతలు చెబుతుండగా.. ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వర్గాలు కొట్టి పారేస్తున్నాయి. తేలాల్సి ఉన్న మూడు స్థానాలు ఉమ్మడి జిల్లాలో మూడు స్థానాల్లో ఎవరిని బరిలో నిలుపాలన్న విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా నిర్ణయానికి రానట్లుగా తెలిసింది. అందులో ముఖ్యంగా దేవరకొండ, తుంగతుర్తి స్థానాల్లో తీవ్ర పోటీ నెలకొనగా, సూర్యాపేటలో ఇద్దరి మధ్యే ప్రధానమైన పోటీ నెలకొంది. దేవరకొండలో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కోసం ఐదారుగురు ప్రయత్నిస్తున్నారు. అందులో మాజీ ఎమ్మెల్యే బాలునాయక్‌తోపాటు గతంలో టీడీపీ, పీఆర్పీలో పనిచేసిన వడ్త్యా రమేష్‌నాయక్, కిషన్‌నాయక్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో రమేష్‌నాయక్ మాజీ మంత్రి జానారెడ్డి ద్వారా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గతంలో పీఆర్పీలో పనిచేసినందున సినీ నటుడు చిరంజీవి ద్వారా కూడా రమేష్ నాయక్ ప్రయత్నాలు చేస్తుండటంతో టికెట్ ఎవరికి ఇవ్వాలన్న విషయాన్ని తేల్చలేదు. ఇక, తుంగతుర్తిలో అద్దంకి దయాకర్, పిడమర్తి రవి, నాగరిగారి ప్రీతమ్, భాషపంగు భాస్కర్, వడ్డేపల్లి రవి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మోత్కుపల్లి నర్సింహులు కూడా టికెట్ ఆశిస్తున్నారు. అక్కడ పోటీ అధికంగా ఉండటంతో వెంటనే తేల్చని పరిస్థితి నెలకొంది. ఇక సూర్యాపేటలో మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేష్ మధ్య సయోధ్య కుదిర్చే పనిలోనే అధిష్టానం ఉంది. దీంతో వారిలో ఎవరికి ఇవ్వాలన్న దానిపై ఓ నిర్ణయానికి రాలేదు. నాగార్జునసాగర్‌లో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తన కుమారుడు జైవీర్‌రెడ్డి అవకాశం ఇవ్వాలని పట్టుపడుతున్నారు. అవసరమైతే తాను ఎంపీ వెళతానని ప్రకటించారు. దీంతో అక్కడ జానారెడ్డి కూమారునికే టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారు. -
నాగార్జునసాగర్ బరిలో జానారెడ్డి తనయుడు జైవీర్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎన్నికల సమరానికి కాంగ్రెస్ నాయకులు రెడీ అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. 12 నియోజకవర్గాల పరిధిలో 94 మంది దరఖాస్తులు సమర్పించారు. అందులో ఎవరికి టికెట్ లభిస్తుందో.. ఎవరికి నిరాశ ఎదురవుతుందో త్వరలోనే తేలనుంది. మూడు నియోజకవర్గాల్లో అధిక పోటీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. వారిపై పోటీ చేసేందుకే ఉమ్మడి జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 25వ తేదీ దరఖాస్తులకు చివరి గడువు కావడంతో ఆరోజు వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి 94 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో కొందరు నేరుగా వెళ్లి దరఖాస్తు చేసుకోగా, మరి కొందరు తమ తరఫున ఇతరులను పంపించి గాంధీ భవన్లో దరఖాస్తు చేయించారు. వారిలో నల్లగొండ జిల్లా నుంచి 40 మంది, సూర్యాపేట జిల్లా నుంచి 29 మంది, యాదాద్రి జిల్లా నుంచి 25 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో మూడు నియోజకవర్గాల్లో టికెట్ కావాలంటూ దరఖాస్తు చేసిన వారి సంఖ్య పది దాటిపోయింది. అత్యధికంగా మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి 18 మంది దరఖాస్తు చేసుకోగా.. ఆలేరు నుంచి పోటీచేసేందుకు 16 మంది ఉత్సాహం కనబరిచారు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం అయిన తుంగతుర్తి నుంచి 15 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారుల్లో ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కావాలంటూ ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య నేతలు కూడా దరఖాస్తు చేశారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ హుజూర్నగర్ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకోగా, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. సూర్యాపేట నుంచి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ఇక మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ఏ నియోజకవర్గం నుంచి కూడా దరఖాస్తు చేసుకోలేదు. ఆయన తనయలు జైవీర్‌రెడ్డి నాగార్జునసాగర్ నుంచి, రఘువీర్‌రెడ్డి మిర్యాలగూడ నుంచి టికెట్ ఆశించి దరఖాస్తు చేసుకున్నారు. వీరేశం వస్తారా.. మరెవరికై నా ఇస్తారా? బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం టికెట్ ఆశించినా అధిష్టానం ఇవ్వకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం సాగింది. అయితే, ఇప్పటివరకు ఆయన అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్లో చేరారు. ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్‌పార్టీ ఎవరిని పోటీలో ఉంచుతుందన్నది ఆసక్తికరంగా మారింది. సీనియర్లను కాదని ఇచ్చేనా? ఉమ్మడి జిల్లాలోని సీనియర్ నాయకులు, గతంలో పోటీ చేసిన వారిని కాదని కొత్త వారికి టికెట్ కేటాయిస్తారా? లేదంటే పాత వారికే ఇస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉండే అభ్యర్థులను దీటుగా ఎదుర్కొనే వారికే టికెట్లను కేటాయిస్తారా? అన్నది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ తేల్చాల్సి ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారు ఇప్పుడు కూడా టికెట్లను అడుతున్నారు. నల్లగొండలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కాదని మరొకరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందా? అంటే కష్టమేనన్న వాదన పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. సూర్యాపేటలోనూ అదే పరిస్థితి నెలకొంది. మునుగోడులో ఎవరికి ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన స్రవంతికి ఇస్తారా? ఆ ఎన్నికల నాటి నుంచే టికెట్ ఆశిస్తున్న చలమల్ల కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తారా? ఒక వేళ కమ్యూనిస్టులతో పొత్తు కుదిరితే వారికి కేటాయిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఇక హుజూర్‌నగర్‌లో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టికెట్ ఆశించి మొదటి నుంచి పనిచేసుకుంటున్నారు. అక్కడ కూడా ఆశావహులు దరఖాస్తు చేశారు. మరోవైపు కోదాడ నుంచి పద్మావతి రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఒకే కుటుంబంలో ఇద్దరికి వస్తుందా? ఒక్కరికే ఇచ్చేలా ఒప్పించే ప్రయత్నం చేస్తుందా? వేచి చూడాలి. ఇక భువనగిరి నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయిన కుంభం అనిల్‌రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్లో చేరారు. అక్కడ ఎవరికి ఇస్తారనేది వేచి చూడాల్సింది. కాంగ్రెస్ పార్టీలో భారీగా ఆశావహుల దరఖాస్తులు దరఖాస్తుల వివరాలు ఇవీ.. నియోజకవర్గం దరఖాస్తుల సంఖ్య నల్లగొండ 5 నకిరేకల్ 6 మునుగోడు 3 దేవరకొండ 7 మిర్యాలగూడ 18 నాగార్జునసాగర్ 1 సూర్యాపేట 5 తుంగతుర్తి 15 హుజూర్నగర్ 4 కోదాడ 5 ఆలేరు 16 భువనగిరి 9 మొత్తం 94 -
నాగార్జునసాగర్ బరి నుంచి జానారెడ్డి అవుట్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి ఇక ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పినట్లేనా?. ఎప్పటి నుంచో తన వారసుల్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని కలలు కంటున్న జానారెడ్డి.. ఆ వ్యూహంలో భాగంగా తన చిన్న కుమారుడిని రంగంలోకి దించారు. నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి చిన్న కొడుకు జైవీర్ రెడ్డి పోటీ కోసం దరఖాస్తు చేసుకోవడంతో.. ఈసారి ఎన్నికలకు జానారెడ్డి దూరమైనట్లే భావించొచ్చు. చిన్న కుమారుడు జైవీర్ రెడ్డి గిరిజన చైతన్య యాత్ర పేరుతో జనాల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. పెద్దవూర మండలం గేమ్యా నాయక్ తండా నుంచి పాదయాత్రను మొదలు పెట్టిన జైవీర్‌రెడ్డి.. తనతండ్రి జానారెడ్డి హయాంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ సాగారు. అయితే.. ఉన్నట్లుండి జైవీర్ రంగంలోకి రావడం వెనుక భారీ వ్యూహమే ఉందని తెలుస్తోంది. గతంలో గిరిజన తండాలు కాంగ్రెస్‌కు పెట్టని కోటలా ఉండేవి. కానీ కేసీఆర్ ప్రభుత్వం చిన్న చిన్న తండాలను కూడా గ్రామ పంచాయితీలుగా మార్చడంతో మెజార్టీ తండాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే సర్పంచులుగా ఉన్నారు. దీంతో గిరిజనుల మద్దతును మరోసారి కూడగట్టేందుకు యాత్రను ఉపయోగించుకుంటున్నారని టాక్. కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థుల దరఖాస్తుకు రేపే ఆఖరి రోజు. పీసీసీకి ఇప్పటిదాకా 600 అప్లికేషన్లు వచ్చాయి. ఇవాళ రేవంత్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య దరఖాస్తు చేసుకోగా.. పొంగులేటి, కొమటిరెడ్డి, కొండాసురేఖలు ఇప్పటికే అప్లికేషన్లు సమర్పించారు. ఉత్తమ్, భట్టి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. చదవండి: గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించిన హైకోర్టు -
జానారెడ్డి అసలు స్ట్రాటజీ ఇదేనా?.. సీఎం కుర్చీ కోసమేనా..?
ఆయన తెలంగాణ రాజకీయాల్లో తలపండిన నాయకుడు. వచ్చే ఎన్నికల్లో తన ఇద్దరు కొడుకులను ఎన్నికల్లో దించాలని చాలాకాలంగా ఆలోచిస్తున్నారు. ఆయన కుమారులు కూడా తండ్రికి జరిగిన పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నారు. కాని ఆ సీనియర్ నేత తాను కూడా బరిలోకి దిగాలానుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. మొన్నటివరకు ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్న ఆ సీనియర్ మళ్ళీ బరిలోకి దిగాలని ఎందుకు అనుకుంటున్నారు? కుందూరు జానారెడ్డి గురించి తెలంగాణ రాజకీయాలు తెలిసినవారికి పరిచయం చేయనక్కర్లేని పేరు. ఈయన ఇద్దరు కుమారులు ఇప్పటివరకు తెరముందుకు రాకపోయినప్పటికీ చాలాకాలం నుంచి రాజకీయాల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నాయి. ఎప్పటి నుంచో తన కుమారుల్ని ఎన్నికల రాజకీయాల్లోకి తీసుకురావాలని కలలు కంటున్న జానారెడ్డి ఇదే సరైన సమయం అనుకుంటున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ఉన్నా కూడా జానారెడ్డి మాటను కాదనగల పరిస్థితి ఎవరికీ ఉండదు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఎలా అయినా ఇద్దరిలో ఒకరిని.. కుదిరితే ఇద్దరినీ బరిలో దించేందుకు జానారెడ్డి పావులు కదుపుతున్నారట. వ్యూహంలో భాగంగానే.. జానారెడ్డి వ్యూహంలో భాగంగానే చిన్న కుమారుడు జైవీర్ రెడ్డి గిరిజన చైతన్య యాత్ర పేరుతో జనాల్లోకి వెళుతున్నారు. నియోజకవర్గంలోని 90 తండాలను దాదాపు రెండు వారాల పాటు చుట్టి వచ్చేలా ప్రణాళికను వేసుకున్నారట. పెద్దవూర మండలం గేమ్యా నాయక్ తండా నుంచి పాదయాత్రను మొదలు పెట్టిన జైవీర్‌రెడ్డి.. తన యాత్రలో ఎక్కడా సిట్టింగ్ ఎమ్మెల్యేపై విమర్శలు చేయకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు మోసం చేస్తోందన్న విషయాన్ని మాత్రమే ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా తనతండ్రి జానారెడ్డి హయాంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ ముందుకుపోతున్నారట. గిరిజనుల నుంచి పాదయాత్రకు మంచి మద్దతే లభిస్తోందని కాంగ్రెస్ నేతలు ఖుషీ అవుతున్నారని టాక్. ఉన్నట్లుండి జైవీర్ రంగంలోకి రావడం వెనుక భారీ వ్యూహమే ఉందని తెలుస్తోంది. గతంలో గిరిజన తండాలు కాంగ్రెస్‌కు పెట్టని కోటలా ఉండేవి. కానీ కేసీఆర్ ప్రభుత్వం చిన్న చిన్న తండాలను కూడా గ్రామ పంచాయితీలుగా మార్చడంతో మెజార్టీ తండాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే సర్పంచులుగా ఉన్నారు. దీంతో గిరిజనుల మద్దతును మరోసారి కూడగట్టేందుకు యాత్రను ఉపయోగించుకుంటున్నారట జైవీర్ రెడ్డి. సీఎం కుర్చి కోసం.. ఈ పాదయాత్ర ద్వారా వచ్చే ఎన్నికల్లో సాగర్ నుంచి తానే పోటీ చేస్తానని పార్టీ నేతలకు స్పష్టత ఇస్తున్నారట జైవీర్. అయితే కొందరు అనుచురులు మాత్రం చివరి నిమిషంలో జానారెడ్డి బరిలోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారట. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ వస్తుందని భావిస్తున్న జానారెడ్డి ఈసారికి ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదనే వాదన ఉంది. అయితే ఈ విషయంలో జానారెడ్డి ఇంత వరకు నోరు మెదపనప్పటికీ.. ఒకవేళ తండ్రి పోటీ చేస్తానంటే మాత్రం జైవీర్ తర్వాతి ఎన్నికల వరకు ఆగుతారని అంటున్నారు. ఇదే సమయంలో జానారెడ్డిని అసెంబ్లీకీ కాకుండా నల్లగొండ లోక్‌సభ నుంచి బరిలో నిలిపేతే ఎలా ఉంటుందా అని కూడా కాంగ్రెస్ ఆలోచిస్తోందట. ఎలాగూ ప్రస్తుత ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో లోక్‌సభకు జానారెడ్డి పోటీ చేస్తే ఖచ్చితంగా కలిసి వచ్చే అంశమని కాంగ్రెస్ భావిస్తోందట. మొత్తంగా జైవీర్ పాదయాత్రతో సాగర్ కాంగ్రెస్‌లో ఓ కొత్త ఊపు వచ్చిందని చెబుతున్నారు. నిరంతర ఓటములతో డీలా పడ్డ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈసారి ఎలా అయినా గెలవాలన్న కసితో ఉన్నా.. ఇన్నాళ్లు నాయకత్వం స్తబ్ధుగా ఉండటంతో నిరాశలో ఉండిపోయారు. తాజాగా పాదయాత్ర పేరుతో జైవీర్ లైన్లోకి రావడంతో శ్రేణులు ఉత్సాహంగా కదులుతున్నాయట. ఇదీ చదవండి: JP Nadda Tour: జేపీ నడ్డా తెలంగాణ పర్యటన లైవ్ అప్డేట్స్.. -
అవసరం ఉంటే వాళ్లే వస్తారు
-
కోమటిరెడ్డికి జ్వరమొచ్చిందో.. ఏం నొప్పొచ్చిందో నాకేం తెలుసు?: జానా రెడ్డి
సాక్షి, నల్లగొండ: ‘ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి జ్వరమొచ్చిందో.. నొప్పొచ్చిందో నాకేం తెలుసు? భట్టి విక్రమార్క పాదయాత్రకు ఎందుకు పోలేదో ఆయన్నే అడగాలి.. నన్నుకాదు’ అని కుందూరు జానారెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జానారెడ్డి మాట్లాడారు. భువనగిరి జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో ఎంపీ కోమటిరెడ్డి ఎందుకు పాల్గొనడం లేదని విలేకరులు అడగ్గా జానారెడ్డి పైవిధంగా స్పందించారు. నల్లగొండ జిల్లాలో ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో చేపట్టినవేనని, ఇప్పటికే 14 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నాయని, 7 లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టులు బీఆర్ఎస్ పాలనలో నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం కేసీఆర్ తరమే కాదన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ నిరుద్యోగుల విషయంలో ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే టీఎస్పీఎస్సీ పేపర్లు లీకయ్యాయన్నారు. విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ పాల్గొన్నారు. చదవండి: ముహూర్తం ఫిక్స్!.. పొంగులేటి, జూపల్లి ఏ పార్టీలో చేరుతారో? -
జానారెడ్డి ఎక్కడ?.. ఆ కమిటీ ఉన్నట్లా? లేనట్లా?
తెలంగాణలో ఎన్నికలు తరుముకొస్తున్నాయి. టీ.కాంగ్రెస్ యాక్టివ్ మోడ్‌లోకి వచ్చిందా? రాలేదా? పార్టీల మధ్య జంపింగ్‌లు భారీగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి టీ.కాంగ్రెస్ చేరికల కమిటీ ఉన్నట్లా? లేనట్లా? చేరికల కమిటీ ఛైర్మన్ జానారెడ్డి ఏం చేస్తున్నారు? కాంగ్రెస్‌లోకి రావాలనుకుంటున్నవారితో చర్చిస్తున్నారా? కొత్తవారిని పట్టించుకోవడం మానేశారా? ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో పార్టీల మధ్య కుండమార్పిళ్ళు సహజమే. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి కప్పగెంతులు భారీగానే జరుగుతుంటాయి. అందుకే ప్రతి పార్టీలోనూ చేరికల కమిటీలు ఏర్పాటు చేసుకుంటారు. ఈ బాధ్యతను పార్టీలో ఒక సీనియర్‌కు అప్పగిస్తారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్‌లో కూడా సీనియర్ నేత జానారెడ్డి ఆధ్వర్యంలో చేరికల కమిటీని ఏర్పాటు చేశారు. ఎవరైనా కాంగ్రెస్‌లో చేరాలంటే ఈ కమిటీయే తుది నిర్ణయం తీసుకుంటుంది. పార్టీలో చేరదామనుకుంటున్నవారితో చర్చించి ఫైనల్ చేస్తుంది. ఇటువంటి కీలకమైన కమిటీకి ఛైర్మన్‌గా ఉన్న జానారెడ్డి ఇంతవరకు సమావేశమే ఏర్పాటు చేయలేదు. కమిటీ ఏర్పాటయ్యాక కొత్తవారు ఎవరూ కాంగ్రెస్‌లో చేరింది లేదు. ఎవరితోనూ కమిటీ చర్చించిందీ లేదు. పెద్దలు జానారెడ్డి చేరికల కమిటీ ఉనికినే ప్రశ్నార్థకం చేయడంతో..అసలు ఈ కమిటీ ఉందా లేదా అని గాంధీభవన్‌లో చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్‌లోకి వద్దామని ఎవరైనా అనుకుంటే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితోనో.. లేక సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోనో చర్చిస్తున్నారు గాని.. జానారెడ్డిని ఎవరూ పట్టించుకోవడంలేదు. మరోవైపు చేరికల కమిటీకి పీసీసీ నేతలే విలువ ఇవ్వడంలేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అసలు చేరికల కమిటీ ఏర్పాటైనప్పటి నుంచి ఇతర పార్టీ నేతలను ఆకర్షించడంలో ఫెయిలయ్యిందనే విమర్శలు వస్తున్నాయి. ఇతర పార్టీలలో అసంతృప్తిగా ఉన్న నేతలతో చర్చించి కాంగ్రెస్‌లోకి తీసుకురావడం చేరికల కమిటీ పని. కానీ జానారెడ్డి ఇప్పటి వరకు అలాంటి ఆలోచనే చేయలేదనే అభిప్రాయాలు కాంగ్రెస్‌లోనే వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు బీజేపీ చేరికల కమిటీ ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ అసంతృప్త నేతలతో సంప్రదింపులు జరుపుతూ పార్టీలోకి నేతలను ఆహ్వానిస్తుంటే.. టీ కాంగ్రెస్ చేరికల కమిటీ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదనే అసహనం పార్టీ నేతల్లో కనిపిస్తోంది. చదవండి: పోటీకి వెనకడుగు.. ప్లాన్ ఇదేనా?.. టీ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? బీఆర్ఎస్నుంచి సస్పెండైన సీనియర్ నేతలు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు కొద్దిరోజులుగా చౌరస్తాలో నిలబడి ఏ పార్టీలో చేరాలనేదానిపై తర్జనభర్జన పడుతున్నారు. ఇలాంటి సమయంలో వారితో సంప్రదింపులు జరపాల్సిన చేరికల కమిటీ తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. పార్టీలో చేరాలనుకునే వారు కావాలంటే తమ దగ్గరకే వస్తారు..తాము ఇంకొకరి దగ్గరికి వెళ్ళేది ఏంటనే ధోరణిలో టీ కాంగ్రెస్ చేరికల కమిటీ వ్యవహరిస్తోంది. గాంధీభవన్ నేతల తీరుతో పార్టీలో చేరాలనుకునే వారు కూడా కాంగ్రెస్ పట్ల విముఖత చూపుతున్నారు. గతంలో ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్న సమయంలో కూడా చేరికల కమిటీ సకాలంలో రియాక్ట్ కాకపోవడం వల్లే ఈటల బీజేపీలోకి వెళ్ళారనే విమర్శ ఉంది. చదవండి: ఎమ్మెల్యేగా సీతక్క కొడుకు పోటీ ఇక్కడి నుంచేనా..? వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా చేరికల కమిటీ యాక్టీవ్ గా పనిచేయాలని సూచిస్తున్నారు. పార్టీలో సీనియర్ నేత అయిన జానారెడ్డి చేరికల కమిటీని యాక్టివ్ చేయాలని కోరుతున్నారు. ఇతర పార్టీలలో అసంతృప్తిగా ఉన్న నేతలతో వారి ఇళ్లకు వెళ్లి సంప్రదింపులు జరపాలని.. లేదంటే పార్టీలో చేరేందుకు ఎవరూ ముందుకు రారని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
టీ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: టీ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తెల్లవారు జామున ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను సోమాజిగూడ యశోదా ఆసుపత్రికి తరలించారు. జానారెడ్డికి యాంజియో గ్రామ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. గుండెకు రక్తం సరఫరా అయ్యే వాల్వ్ మూసుకుపోయినట్లు గుర్తించి వెంటనే ఆపరేషన్ చేసి స్టంట్ వేశారు. ప్రస్తుతం జానారెడ్డి యశోదా ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. చదవండి: తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. అత్యధిక ఉష్ణోగ్రత ఇక్కడే! -
బీఆర్ఎస్ పొత్తు వ్యవహారం.. కాంగ్రెస్ శ్రేణులకు తలనొప్పి!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్తో పొత్తు వ్యవహారం రాష్ట్ర కాంగ్రెస్‌లో మరోసారి కలకలం రేపుతోంది. బీఆర్ఎస్తో పొత్తు ఉండాలా, వద్దా అన్నది ప్రజలు నిర్ణయిస్తారంటూ సీనియర్ నేత జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమంటూ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతున్న తరుణంలో.. ఇప్పుడు జానారెడ్డి, గతంలో పలువురు నేతలు చేసిన పొత్తు వ్యాఖ్యలు కేడర్‌ను అయోమయానికి గురిచేస్తున్నాయి. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మరోమారు బీఆర్ఎస్–కాంగ్రెస్ పొత్తు అంశం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారి తీస్తోంది. కొందరు అలా.. కొందరు ఇలా.. రాష్ట్రస్థాయి కాంగ్రెస్ నేతల్లో పొత్తులపై అభిప్రాయం భిన్నంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్తో పొత్తుకు కొందరు నేతలు సుముఖంగా ఉంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న నేపథ్యంలో పొత్తు ఉంటేనే వచ్చే ఎన్నికల్లో పార్టీకి మేలు జరుగుతుందనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తుండగా.. బీఆర్ఎస్తో పొత్తు అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయినట్టేనని, బీజేపీకి అప్పనంగా అవకాశం ఇచ్చిన వాళ్లమవుతామని మరికొందరు వాదిస్తున్నారు. అయితే బీఆర్ఎస్తో పొత్తు ఉండదని పార్టీ అధిష్టానం ఇప్పటికే పేర్కొంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ కూడా వరంగల్, హైదరాబాద్ సభల్లో దీనిపై స్పష్టతనిచ్చారు. ఇటీవల రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే కూడా ఈ విషయాన్ని నొక్కి చెప్పారు. అయినా కాంగ్రెస్‌లో పదేపదే బీఆర్ఎస్తో పొత్తు అంశం తెరపైకి వస్తుండటం గమనార్హం. అలాగైతే ఉనికి కూడా ఉండదు బీఆర్ఎస్తో పొత్తుతో ఎన్నికలకు వెళితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి దెబ్బతింటుందనే వాదన కొందరు టీపీసీసీ నేతల్లో వినిపిస్తోంది. ఒంటరిగా పోటీ చేసి అధికారం కొట్లాడటం ద్వారానే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నాయకత్వం మిగులుతుందని అంటున్నారు. అధికారం దక్కకపోయినా 40 స్థానాల వరకు గెలుచుకోగలిగితే అప్పుడు కాంగ్రెస్ అవసరం టీఆర్ఎస్కు వస్తుందని, ఆ సమయంలో కింగ్‌మేకర్‌గా వ్యవహరించవచ్చని పేర్కొంటున్నారు. ప్రజలు అవకాశమిస్తే నేరుగా, లేదంటే పరోక్షంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం కావచ్చని స్పష్టం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ అనివార్యంగా మూడో స్థానానికి పరిమితం అవుతుందని, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వివరిస్తున్నారు. అలా కాకుండా ఎన్నికల ముందే పొత్తుకు వెళితే 20–30 మంది పెద్ద నేతలకు లబ్ధి కలుగుతుందే తప్ప మిగతాచోట్ల పార్టీ కేడర్ దెబ్బతింటుందని, తద్వారా అధికారానికి శాశ్వతంగా దూరమవుతామని పేర్కొంటున్నారు. బీఆర్ఎస్–కాంగ్రెస్ కలిసి ఎన్నికలకు వెళితే ప్రత్యామ్నాయంగా బీజేపీనే ప్రజలు పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుందని వాదిస్తున్నారు. ఎన్నికల్లో కొట్లాడగలమా? మరికొందరు నేతలు మాత్రం పార్టీ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పొత్తులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ‘‘గత పదేళ్లుగా అధికారంలో లేం. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ ఎన్నికల్లో భారీగా ఖర్చు పెడతాయి. కాంగ్రెస్ నేతలకు అలాంటి పరిస్థితి లేదు. ఈసారి ఎన్నికల్లో ఆ రెండు పార్టీల ధన ప్రవాహాన్ని తట్టుకోవాలంటే పొత్తులు ఉపయోగపడవచ్చు. కనీసం 20–30 స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. అధికారంలోనూ పాలుపంచుకోవచ్చు. అప్పుడు మళ్లీ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టొచ్చు’’ అని పేర్కొంటున్నారు. అందువల్ల ఎన్నికల కంటే ముందే సర్దుబాటుతో వెళితే మేలు జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్చతోనూ నష్టమే.. పొత్తులు ఉంటాయో, లేదోగానీ.. ఇప్పుడు జరుగుతున్న చర్చ కాంగ్రెస్ కేడర్‌ను అయోమయంలోకి నెట్టేస్తోందని మరికొందరు నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇది కాడి ఎత్తేసే ధోరణి అని విమర్శిస్తున్నారు. ఇలాంటి చర్చ కూడా పార్టీకి మంచిది కాదని, దీనికి చెక్ పెట్టకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నోరు జారిన కీలక నేత బీఆర్ఎస్–కాంగ్రెస్ పొత్తు వ్యవహారం రాష్ట్ర కాంగ్రెస్‌లోని ఓ కీలక నేత చరిష్మాకు గండి కొట్టిందని తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించే ఆ నేత గతంలో ఉన్న ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ వద్ద నోరు జారారని, దీనిపై అధిష్టానాన్ని ఒప్పించాలని కోరారని సమాచారం. ఈ మేరకు ఠాగూర్ వెళ్లి అధిష్టానానికి ఈ విషయాన్ని వివరించారని, దీంతో కాంగ్రెస్‌లోని కొందరు నాయకులు బీఆర్ఎస్ పక్షం వహిస్తున్నారనే అభిప్రాయం అధిష్టానంలో మొదలైందని తెలిసింది. ఆ విషయాన్ని గ్రహించిన సదరు కీలక నేత.. మళ్లీ తన చరిష్మా కోసం ఇప్పుడు పడరాని పాట్లు పడాల్సి వస్తోందని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. అన్ని స్థానాల్లో పోటీ చేయాల్సిందే: జగ్గారెడ్డి బీఆర్ఎస్తో పొత్తు, జానారెడ్డి చేసిన వ్యాఖ్యలపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా.. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా, అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాల్సిందేనని పేర్కొన్నారు. ‘‘ఏ పార్టీతోనూ పొత్తుకు పోవద్దు. అప్పుడే పార్టీలో నాయకత్వం నిలబడుతుంది. ప్రజలు అధికారమిస్తారా, ఇవ్వరా అన్నది వారిష్టం. 70సీట్లు దక్కించుకునేందుకు ప్రయత్నం చేయాలి. అలాగాకున్నా అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ కీలకం కావాలి. అప్పుడే భవిష్యత్తుపై ఆశలు సజీవంగా ఉంటాయి’’ అని పేర్కొన్నారు. ఏమైనా జరగొచ్చు? జానారెడ్డి చేసిన వ్యాఖ్యలను తేలిగ్గా తీసిపారేయాల్సిన పనిలేదని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్యారాచూట్లకు (ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి చేరినవారికి) టికెట్లు ఇచ్చేది లేదని 2018 ముందు రాహుల్‌గాంధీనే స్వయంగా చెప్పారని.. కానీ టికెట్ల కేటాయింపులో ప్యారాచూట్లకు కూడా తగిన స్థానం లభించిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్తో పొత్తు విషయంలోనూ ఏదైనా జరగవచ్చని, జాతీయ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏఐసీసీ ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
జానారెడ్డి ఫ్యామిలీ నుంచి పొలిటికల్ ఎంట్రీ.. పోటీ చేసేది ఎవరంటే?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో తన కొడుకు పోటీ చేస్తాడని క్లారిటీ ఇచ్చారు. అలాగే, బీజేపీపై పోరుకు ఎన్నికలకు సంబంధం లేదన్నారు. బీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు తప్పదు అనుకుంటే ప్రజలు నిర్ణయిస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, జానారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుడూ.. బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తాం. పార్లమెంట్లో జరుగుతున్న వ్యవహారంతో దేశం అట్టుడుకుతోంది. దేశంలో బీజేపీ పెట్టుబడుదారుల కొమ్ము కాస్తోంది. అదానీ కంపెనీలో షేర్లు పెట్టిన వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అదానీ, ప్రధాని మోదీ సంబంధాలపై రాహుల్ గాంధీ నిలదీశారు. రాహుల్ ప్రశ్నించకుండా ఉండేదుకే ఇలా ఆయన గొంతు నొక్కారు. అదానీ వ్యవహారం బయటపడొద్దని రాహుల్‌ను పార్లమెంట్ నుంచి బయటకు పంపించారు. అక్రమాలకు, అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ మాట్లాడుతున్నారు. ప్రధాని మోదీ అధికార యంత్రాంగాన్ని వాడుకుని రాజకీయ కక్ష సాధింపులకు దిగుతున్నారు. ప్రజలు గొంతు విప్పాల్సిన సమయం వచ్చింది. దేశవ్యాప్తంగా మోదీ పరిపాలనకు వ్యతిరేకంగా 17 పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. బీజేపీ వ్యతిరేక పార్టీలు అన్ని కాంగ్రెస్‌కు మద్దుతివ్వాలి. ప్రజాస్వామ్య విలువలు కాపాడింది, కాపాడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అధికారం కోసం బీజేపీ అసత్య ప్రచారం చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీకి బుద్ధి చెప్పాలి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో తన కొడుకు బరిలోకి దిగుతున్నట్టు క్లారిటీ ఇచ్చారు. -
కాంగ్రెస్‌లో మరింత ముదిరిన సంక్షోభం.. పీసీసీ పదవులకు 12 మంది రాజీనామా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో సంక్షోభం మరింత ముదురుతోంది. వలస నేతల వల్ల అసలైన కాంగ్రెస్ నాయకులకు అవకాశం లేకుండా పోతోందంటూ పలువురు సీనియర్లు శనివారం ఆరోపణలు చేయగా.. అదే రోజున రేవంత్ అనుచరులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్‌కు లేఖ రాశారు. ఇది ఆదివారం బయటికి వచ్చింది. రేవంత్‌రెడ్డి అనుచరులుగా పేరున్న పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు సీతక్క (ఎమ్మెల్యే), వేం నరేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు సీహెచ్ విజయరమణారావు, దొమ్మాటి సాంబయ్య, వజ్రేష్ యాదవ్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, పీసీసీ ప్రధాన కార్యదర్శులు సుభాష్‌రెడ్డి, చారగొండ వెంకటేశ్, పటేల్ రమేశ్‌రెడ్డి, సత్తుపల్లి మల్లేశ్, చిలుక మధుసూదన్‌రెడ్డి, శశికళ యాదవరెడ్డి రాజీనామా చేసినవారిలో ఉన్నారు. వారు మాణిక్యం ఠాగూర్‌కు రాసిన లేఖలో సీనియర్ల వ్యవహారశైలిని తప్పుపట్టారు. లేఖలోని ప్రధానాంశాలు వారి మాటల్లోనే.. ‘‘మాకు పదవులు రావడమే నేరం అన్నట్టుగా సీనియర్లు వ్యవహరించడం బాధ కలిగించింది. బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్‌ను ఎప్పుడు గెలిపిద్దామా అని చూస్తున్నారు. మనలో మనం విమర్శలు చేసుకోవడంపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. జనంలో కాంగ్రెస్ పట్ల ఉన్న సానుకూలతను చిల్లర రాజకీయాలతో మనమే పాడుచేసుకుంటున్నామన్న అభిప్రాయం ఉంది. కేసీఆర్‌ను గద్దెదింపడానికి మేం రేవంత్ నేతృత్వంలో పనిచేస్తూనే ఉన్నాం. రాజకీయ పునరేకీకరణలో భాగంగా తెలంగాణ ఇచ్చిన సోనియా నేతృత్వంలో పనిచేయడమే సరైన వేదిక అనుకున్నాం. రాహుల్‌గాంధీ ఆహ్వానంతో పార్టీలో చేరాం. సోనియా నేతృత్వంలో పనిచేయడం గౌరవంగా భావించాం. కాంగ్రెస్‌లో చేరిననాటి నుంచి పార్టీ సిద్ధాంతాలకు, నాయకత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ వస్తున్నాం. ఇదివరకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో, ప్రస్తుతం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలమన్న స్పృహతోనే వ్యవహరిస్తున్నాం. వారి వ్యాఖ్యలు బాధించాయి దేశ ప్రధాని అయ్యే అవకాశాన్ని తృణప్రాయంగా వదిలేసిన సోనియా, భారత్ జోడో యాత్రతో దేశం కోసం రాహుల్ పడుతున్న తపన మాకు స్ఫూర్తి. మా ఆరేళ్ల సేవలకు గుర్తింపుగా ఏఐసీసీ ఇటీవల మాకు పదవులు ఇచ్చింది. ఈ పదవులు మా బాధ్యతను పెంచాయని భావించాం. కానీ ఉత్తమ్ నేతృత్వంలో దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ, తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, మహేశ్వర్‌రెడ్డి, కోదండరెడ్డి తదితరులు భట్టి విక్రమార్క నివాసంలో సమావేశమై, తర్వాత మీడియాతో మాట్లాడుతూ పీసీసీ కమిటీల్లో సగానికిపైగా టీడీపీ నుంచి వచ్చిన వారితోనే నింపేశారని ఆరోపణ చేశారు. ఇది మాకు బాధ కలిగించింది. ఈ పరిణామాలు కార్యకర్తల్లో గందరగోళానికి కారణం అవుతున్నాయి. మనమంతా కలిసికట్టుగా బీఆర్ఎస్పై పోరాటం చేయాలని వారు కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో పదవుల పేరుతో పంచాయితీలు పెట్టుకోవడం పార్టీకి నష్టం చేస్తుంది. సమయం లేదు. అందరం కలిసి బీఆర్ఎస్ను ఓడించాలి. సోనియా రుణం తీర్చుకోవాలి. లక్ష్యసాధనలో మాకు పదవులు లేకపోవచ్చు. కేసీఆర్‌తో పోరుకు మా పదవులే అడ్డంకి అయితే మాకు పదవులు వద్దు. ఈ పేరుతో పార్టీని పలుచన చేయొద్దు. రైతులకు మద్దతు ధర లేదు. రుణమాఫీ, పంటలబీమా అందట్లేదు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యలేదు. డ్రగ్స్, గంజాయి మత్తులో యువత చిత్తవుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వ, అరాచక పాలన సాగిస్తున్నది. స్వేచ్ఛ, సామాజిక న్యాయానికి భిన్నంగా పాలన సాగుతోంది. ప్రశ్నించే గొంతులను అణచివేస్తూ కేసీఆర్ రాజ్యమేలుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని సమైక్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది’’ అని నేతలు తమ లేఖ పేర్కొన్నారు. చదవండి: కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?.. కమిటీల ఏర్పాటు దేనికి సంకేతం! -
మునుగోడులో కాంగ్రెస్‌కు మోసం చేసిన వారికి తగిన గుణపాఠం చెప్పాలి: జానారెడ్డి
-
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో 2లక్షల రుణమాఫీ: జానారెడ్డి
దామరచర్ల(మిర్యాలగూడ): ఎన్నికల్లో రైతులకు ఇచి్చన ఏ ఒక్క హామీ కూడా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అమలు చేయకుండా రైతులను దగా చేశారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి, మాజీమంత్రి గీతారెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకుల్లో వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. పంటలు నష్టపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శిం చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల నుంచి వేల కోట్లను దండుకుంటోందని ఆరోపించారు. జానారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ చెప్పే గారడీ మాటల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని హామీనిచ్చారు. మాజీ మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలను నాశనం చేసిందని, దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూపంపిణీ, దళితబంధు వంటి వాటిని విస్మరించిందని విమర్శించారు. -
మంత్రి గౌతమ్ రెడ్డికి కాంగ్రెస్ నేత జానారెడ్డి సంతాపం
-
TPCC: మరి అసంతృప్తుల పరిస్థితి ఏమిటి?
సాక్షి, హైదరాబాద్, న్యూఢిల్లీ: అదుగో.. ఇదుగో అంటూ ఆరు నెలలుగా దోబూచులాడుతూ వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు, కార్యవర్గం ఎంపిక పూర్తయింది. రేవంత్‌రెడ్డికి అధ్యక్ష పదవి, ఐదుగురికి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, పది మందిని సీనియర్ ఉపాధ్యక్షులుగా నియమించడంతోపాటు మరో మూడు కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. మొత్తం కార్యవర్గం, కమిటీల కూర్పులో సామాజిక కోణాన్ని బట్టి ఎంపిక చేసింది. గతంలో పీసీసీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండగా.. ఇప్పుడా సంఖ్యను ఐదుకు పెంచింది. గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న వారిలో రేవంత్‌ను అధ్యక్షుడిగా నియమించగా.. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్‌లను తప్పించింది. అజారుద్దీన్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగిస్తూ.. కొత్తగా సీనియర్ నాయకురాలు గీతారెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మహేశ్‌కుమార్‌గౌడ్‌లకు అవకాశమిచ్చింది. తద్వారా ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాలకు పదవులు ఇచ్చింది. 10 మంది సీనియర్ ఉపాధ్యక్షుల నియామకంలోనూ సామాజిక కూర్పు పాటించింది. ఎస్సీలు ముగ్గురు, ముగ్గురు ఓసీలు, ఒక ఎస్టీ, ఇద్దరు బీసీలు, ఒక మైనార్టీ నాయకుడికి అవకాశమిచ్చింది. ఇక ప్రచార కమిటీ చైర్మన్‌గా బీసీ నేత మధుయాష్కీగౌడ్‌కు, కన్వీనర్‌గా మైనార్టీ నాయకురాలు సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీకి స్థానం కల్పించింది. ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలను ఎస్సీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు ఇవ్వగా, ఏఐసీసీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ బాధ్యతలను ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి అప్పగించింది. అసంతృప్తుల పరిస్థితి ఏమిటి? రేవంత్‌కు పీసీసీ బాధ్యతలను అప్పగించడాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. వారిలో పలువురు బహిరంగంగానే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. మరికొందరు రేవంత్‌ను అడ్డుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేశారు. దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారికి, గాంధీ కుటుంబం పట్ల విధేయంగా ఉండేవారికి మాత్రమే టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ పలువురు పార్టీ సీనియర్లు ఏఐసీసీకి లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో ఆయా నేతల నుంచి రేవంత్‌కు ఏమేర సహకారం లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఒకరిద్దరు నేతలు రాజీనామాలు ప్రకటించగా.. మిగతావారు ఎలా స్పందిస్తారన్న దానిపై టీపీసీసీ వర్గాల్లో ఉత్కంఠ కలిగిస్తోంది. అయితే రేవంత్ సీనియర్లను, తనను వ్యతిరేకించిన వారిని కూడా కలుపుకొని పోయేందుకు సిద్ధంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కోమటిరెడ్డికి ఏఐసీసీ పదవి? టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం గట్టిగా ప్రయత్నించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏఐసీసీలో తగిన ప్రాతినిధ్యం ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్టు తెలిసింది. వెంకటరెడ్డి కొన్నాళ్లు వేచిచూసే ధోరణిలోనే ఉంటారని, తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అట్టహాసంగా బాధ్యతల స్వీకరణ టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలనే యోచనలో రేవంత్ శిబిరం ఉన్నట్టు తెలుస్తోంది. తొలుత రాష్ట్రంలో నేతలను కలిశాక బాధ్యతల స్వీకరణ చేపట్టాలని.. ఆ కార్యక్రమానికి ఏఐసీసీ పెద్దలను, ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేతలను ఆహ్వానించాలని నిర్ణయించినట్టు తెలిసింది. బాధ్యతల స్వీకరణ కార్యక్రమంతోనే కాంగ్రెస్ శ్రేణులకు ఊపు తేవాలని, దూకుడుగా ముందుకెళ్లాలని.. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని రేవంత్ భావిస్తున్నట్టు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. జెడ్పీటీసీ నుంచి ఎదిగి.. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన రేవంత్‌రెడ్డి.. 2006లో మిడ్జిల్ జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి.. అనూహ్యంగా రాజకీయాల్లో ఎదిగారు. 2007–09 మధ్య ఉమ్మడి ఏపీ ఎమ్మెల్సీగా, 2009లో, 2014లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014–17 మధ్య టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న ఆయన.. 2017 అక్టోబర్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 2018 డిసెంబర్లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన రేవంత్.. 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా కాంగ్రెస్ తరఫున గెలిచారు. తాజాగా పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. పదునైన ప్రసంగాలతో ఆకట్టుకుని.. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచీ రేవంత్‌రెడ్డి చురుకైన పాత్ర పోషించారు. ఏఐసీసీ పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు నిర్వహించారు. సీనియర్ నేతల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నా తనదైన రీతిలో పనిచేస్తూ ముందుకు సాగారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పదునైన ప్రసంగాలతో అధికార పక్షంపై విరుచుకుపడి.. ప్రతిపక్షంలో బలమైన నేతగా గుర్తింపు పొందారు. ఇటీవల రైతులకు మద్దతుగా పాదయాత్ర నిర్వహించడం.. అటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపగా, ఇటు ప్రజల్లో ఆదరణ పెరిగింది. పలు అంశాలపై ఎన్జీటీ, కోర్టుల్లో న్యాయ పోరాటం కొనసాగించడం ఆయనకు ఆదరణ పెంచింది. మరోవైపు లోక్‌సభలో ప్రసంగాలతోనూ పార్టీ అధిష్టానాన్ని ఆకట్టుకున్నారు. రైతులకు మద్దతుగా, జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి సం బంధించిన అనుబంధ పద్దులపై చర్చలో ఆయన బీజేపీపై నిప్పులు చెరిగారు. మొత్తంగా రేవంత్ పార్టీలో చేరి నాలుగేళ్లు కాకుండానే రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కించుకుని సంచలనంగా నిలిచారు. జానా, షబ్బీర్ నివాసాలకు రేవంత్ తనను పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించిన వెంటనే రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగారు. తొలుత సీనియర్ నేత జానారెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. తనను ఆశీర్వదించాలని, తగిన సహకారం అందించాలని కోరారు. తర్వాత మైనార్టీ నేత షబ్బీర్ అలీ ఇంటికి వెళ్లి అభినందనలు అందుకున్నారు. రేవంత్ ఆదివారం కూడా పలువురు సీనియర్లను కలవనున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏడేళ్లలో మూడో అధ్యక్షుడు తెలంగాణ ఏర్పాటయ్యాక ఏడేళ్లలో పీసీసీకి మూడో అధ్యక్షుడు వచ్చారు. మొదట పొన్నాల లక్ష్మయ్య చీఫ్‌గా ఉండగా.. 2015 మార్చిలో ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఆయన ఆరేళ్ల మూడు నెలలు పదవిలో కొనసాగారు. తాజాగా రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యారు. ‘సింహం వచ్చింది.. పులి భయపడాలి’: ఆర్జీవీ వివాదాస్పద, ఆసక్తికర కామెంట్లు, ట్వీట్లకు పెట్టింది పేరైన సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ టీపీసీసీ అధ్యక్ష నియామకంపై పెట్టిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ‘ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ సింహం రేవంత్‌రెడ్డిని అధ్యక్షుడిని చేయడం ద్వారా అద్భుత నిర్ణయం తీసుకుంది. ఇప్పుడీ సింహాన్ని చూసి పులి భయపడాల్సి వస్తుంది’అని ట్వీట్ చేశారు. -
సాగర్ టీఆర్ఎస్దే.. ఫలించిన సీఎం కేసీఆర్ వ్యూహం
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో గులాబీ మళ్లీ గుబాళించింది. ఇక్కడ జరిగిన ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ విజయం సాధించింది. దీంతో అది తన సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని అది నిలబెట్టుకున్నట్లు అయింది. గత నెల 17న ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించగా రెండు వారాల తర్వాత ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగింది. చేజారిన స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలనుకున్న కాంగ్రెస్‌కు, తొలిసారి ఉనికి చాటుకోవాలని భావించిన బీజేపీకి భంగపాటు తప్పలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ తరఫున గెలిచిన నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో ఈ ఉపఎన్నిక జరిగింది. ఉపఎన్నికలో టీఆర్ఎస్ తన అభ్యర్థిగా నర్సింహయ్య తనయుడు భగత్‌ను బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్ అభ్యర్థి, సీనియర్ నేత కె.జానారెడ్డికి ఈసారి కూడా చేదు అనుభవమే ఎదురైంది. ఈ ఎన్నికలో మొత్తం 2,20,206 ఓట్లకుగాను 1,90,861 ఓట్లు పోలయ్యాయి. నోముల భగత్‌కు 89,804 ఓట్లు, జానారెడ్డికి 70,932 ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ 18,872 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌పై గెలుపొందింది. కేవలం 7,676 ఓట్లను మాత్రమే బీజేపీ తన ఖాతాలో వేసుకోగలిగింది. ఇక్కడ మొత్తంగా 41 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. టీడీపీ అభ్యర్థి మువ్వా అరుణ్‌కుమార్‌కు 1,714 ఓట్లు వచ్చాయి. కాగా, నోటాకు 498 ఓట్లు పడ్డాయి. ‘జానా’కు నాలుగో ఓటమి తాజా ఓటమితో జానారెడ్డి తన రాజకీయ జీవితంలో ఇప్పటికీ నాలుగుసార్లు అపజయం పొందినట్లు అయింది. జానారెడ్డి వరుసగా రెండుసార్లు పరాజయం పాలవడం గమనార్హం. తన రాజకీయ జీవిత చరమాంకంలో ఆయనకు ఇది ఊహించని దెబ్బ అని చెప్పవచ్చు. తొలిసారి 1978 ఎన్నికల్లో జనతా పార్టీ తరఫున బరిలోకి దిగి ఓడిపోగా, 1994లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా రెండోసారి, 2018 ఎన్నికల్లో మూడోసారి ఓటమి పాలయ్యారు. ఆయన విజయాల సంఖ్య ఏడు కాగా, ఓటముల సంఖ్య నాలుగుగా నమోదైంది. చదవండి: (సాగర్ తీర్పు: జానారెడ్డి షాకింగ్ నిర్ణయం) యాదవుల ఓట్లపై కన్ను.. తలసానికి బాధ్యత ఈ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లున్న యాదవ సామాజికవర్గానికి చెందిన భగత్‌ను బరిలోకి దించిన నేపథ్యంలో వారి ఓట్లను గంపగుత్తగా రాబట్టుకునేందుకు సీఎం కేసీఆర్ ప్లాన్ వేశారు. అందులో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ప్రత్యేక బాధ్యతలు అప్పజెప్పారు. ఈ మేరకు తలసాని సాగర్‌లో మకాం వేసి నియోజకవర్గంలోని అన్ని మండలాల యాదవ సంఘాల నేతలతో సమావేశమై పూర్తి మద్దతును కూడగట్టారు. ఆయా కుల, ఉద్యోగ సంఘాలతోనూ ఆయన భేటీ అయ్యారు. ఏ వర్గాన్నీ విస్మరించకుండా ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. భగత్ అత్యధిక మెజారిటీ సాధించడానికి ఇవన్నీ దోహదం చేశాయని చెప్పవచ్చు. ఫలించిన .. సీఎం కేసీఆర్ వ్యూహం దుబ్బాక ఉపఎన్నికల్లో ఓటమి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆశాజనక ఫలితాలు రాకపోవడంతో సాగర్‌లో విజయం కోసం ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పక్కా వ్యూహాన్ని రూపొందించారు. నామినేషన్ల దాఖలుకు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉందనగా పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. కనీసం నెలన్నర ముందు నుంచే పార్టీ శ్రేణులను ప్రచారంలోకి దింపారు. ఎమ్మెల్యేను ఇన్‌చార్జీలుగా నియమించి గ్రామాలకు పంపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే నాటికే నియోజకవర్గవ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రచారం చేపట్టింది. ప్రభుత్వ పథకాలు, సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కారు పేరున విస్తృతంగా ప్రచారం చేసింది. మండలాల ఇన్‌చార్జీలుగా వచ్చిన ఎమ్మెల్యేలు (మండలానికి ఇద్దరు లేదా ముగ్గురు) అభ్యర్థి పేరును ప్రకటించేసరికే పల్లెపల్లెనా తిరిగారు. మంత్రి జగదీశ్‌రెడ్డి అభ్యర్థి భగత్ వెన్నంటే ప్రచారం చేశారు. ఉపఎన్నిక అనివార్యమయ్యాక ఫిబ్రవరిలో ఒకసారి, ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నెల 14న మరోసారి సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో పర్యటించి, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. -
సాగర్ తీర్పు: జానారెడ్డి షాకింగ్ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: వయసురీత్యా రాజకీయాల నుంచి కొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి తెలిపారు. తనకు ఇప్పుడు 75 ఏళ్లు ఉన్నాయని, అనూహ్య పరిస్థితులు ఏర్పడితే తప్ప మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటిం చారు. తనకు రాజకీయాలపై వైరాగ్యం లేదంటూనే, ఇంకా తాను రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో గెలిచినా ఇలాంటి నిర్ణయమే తీసుకునేవాడినని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తున్నానని అన్నారు. తనపై విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ను అభినందించారు. ఆదివారం సాగర్ ఉప ఎన్నికల ఫలితాల అనంతరం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జానారెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సూచన మేరకు, ప్రజాస్వామ్య విలువల కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేశానని చెప్పారు. ఈ ఎన్నికల వల్ల కాంగ్రెస్ కోల్పోయింది ఏమీ లేదన్నారు. మున్ముందు ఎన్నికలు కూడా ఇలాగే ఉంటాయంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. చదవండి: (సాగర్ టీఆర్ఎస్దే.. ఫలించిన సీఎం కేసీఆర్ వ్యూహం) వైరాగ్యం ఏమీ లేదు.. 20 ఏళ్ల వయసు నుంచి రాజకీయాల్లో ఉన్నానని, 11 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశానని జానారెడ్డి తెలిపారు. అయినా తనకు రాజకీయాలపై విరక్తి, వైరాగ్యం లేవని చెప్పారు. బీజేపీని నిర్మించిన ఎల్కే అద్వానీ లాంటి నాయకులు విశ్రాంతి తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు. తాను నాగార్జునసాగర్‌ను అభివృద్ధి చేయలేదనడంలో వాస్తవం లేదని, తాను శాశ్వత ప్రాతిపదికన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పారు. తాత్కాలిక పథకాల వల్ల అభివృద్ధి జరగదనే విషయం కొంత కాలం తర్వాత ప్రజలకు అర్థమవుతుందన్నారు. తాను తన బయో గ్రఫీ రాసుకోనని, ఎవరైనా రాసేందుకు ముందుకు వస్తే అన్ని విషయాలు చెప్తానని తెలిపారు. అది హైకమాండ్ చూసుకుంటుంది టీపీసీసీ అధ్యక్షుడి రేసులో ఉంటారా? అని విలేకరులు ప్రశ్నించగా.. పీసీసీ అధ్యక్షుడు ఎవరనేది పార్టీ ఇష్టమని, అధ్యక్ష ఎంపిక వ్యవహారాన్ని పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని జానారెడ్డి చెప్పారు. ఈ ఎన్నికల్లో తన గెలుపు కోసం టీపీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు పార్టీ శ్రేణులన్నీ కలసి పనిచేశాయని చెప్పారు. అటు టీఆర్ఎస్ పార్టీ, ఇటు ప్రభుత్వ యంత్రాంగమంతా పనిచేసినా కాంగ్రెస్ సత్తా చాటిందని వ్యాఖ్యానించారు. ఈ ఉత్సాహంతోనే కాంగ్రెస్ శ్రేణులు మరింత ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. తనకు ఇప్పటివరకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కరోనా నెమ్మదించిన తర్వాత అందర్నీ కలుస్తానని చెప్పారు. -
నాగార్జునసాగర్ లో జానారెడ్డి ఓటమి ఖాయం : మంత్రి తలసాని
-
కాంగ్రెస్‌లో సాగర్ ‘మథనం’ మొదలైంది
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో సాగర్ ‘మథనం’ మొదలైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీలతో పాటు ఇటీవలి కాలంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వరుస పరాజయాలు చవిచూసిన నేపథ్యంలో... నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో ఏం జరగనుందోననే ఆందోళన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్‌ను పట్టించుకోకపోవడం, రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ గెలుపుతో టీఆర్ఎస్ ఫుల్ జోష్‌లో కనిపిస్తుండటంతో టీపీసీసీ నేతల్లో టెన్షన్ మొదలైంది. తమ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్న సాగర్ ఎన్నికలో సానుకూల ఫలితం వస్తుందనే ఆశ ఏదో మూల ఉన్నా .. అలా జరగకపోతే మాత్రం ఇక అంతే సంగతులనే చర్చ కాంగ్రెస్‌లో జరుగుతోంది. లోపం ఎక్కడుంది? ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలి తాలు కాంగ్రెస్ పార్టీని షాక్‌కు గురిచేశాయి. రెండు చోట్లా పది శాతానికి మించి ఓట్లు రాకపోవడంతో ఆ పార్టీ నేతలు కంగుతిన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకతతో పట్టభద్రులు తమను ఆదరిస్తారనే గట్టి నమ్మకంతో ఈ ఎన్నికలకు వెళ్లామని, స్వతంత్ర అభ్యర్థులు సాధించిన దాని కన్నా తక్కువ ఓట్లు రావడమేమిటని కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ప్రజలకు చేరువ కావడంలో తాము ఎక్కడ విఫలమవుతున్నామనే అంతర్మథనం టీపీసీసీ నేతల్లో మొదలైంది. దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలకు దరిదాపులో లేకుండా ఓట్లు రావడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం రెండంటే రెండు కార్పొరేటర్ స్థానాలకు పరిమితం కావడం, పట్టభద్రుల ఎన్నికల్లో నాలుగైదు స్థానాలకు దిగజారడం ఆ పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినప్పటికీ... రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు సాధించలేకపోవడానికి కారణమేంటనేది కాంగ్రెస్ నాయకులకు అంతుపట్టడం లేదు. ఈ దశలో జరుగుతున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పుడు టీపీసీసీ నాయకత్వం దృష్టి సారించింది. రెండు నెలలుగా జానా అక్కడే... పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా అక్కడి నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కె.జానారెడ్డి నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. గత రెండు నెలలుగా నియోజకవర్గంలోనే ఉంటూ ఇప్పటికే ఓ దఫా పర్యటన పూర్తి చేశారు. ఆయన కుమారులు రఘువీర్, జైవీర్‌లు కూడా నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీ కేడర్‌ను కదిలించేందుకు ప్రయత్నిస్తున్నారు. తన పాత సంబంధాలను మెరుగుపర్చుకోవడంతో పాటు గతంలో తనతో ఉండి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ సన్నిహితులు, అనుచరులను మళ్లీ అక్కున చేర్చుకునేందుకు జానా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ ఇప్పటికే హడావుడి ప్రారంభించిన నేపథ్యంలో... జానా తనకున్న విస్తృత పరిచయాలు, చరిష్మాను నమ్ముకొని ఎక్కడా వెనుకబడకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. పార్టీ కేడర్‌లో ఉత్తేజం నింపేందుకు ఈనెల 27న హాలియాలో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి, సీఎల్పీ నేత భట్టితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. అనంతరం 29న అట్టహాసంగా నామినేషన్ వేసేందుకు జానా సన్నాహాలు చేసుకుంటున్నారు. -
‘జానారెడ్డి కూడా అసత్యాలకు మొగ్గు చూపడం బాధాకరం’
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీ విషయంలో అసత్యాలతో ప్రజలను గందరగోళ పరిచేందుకు ప్రతిపక్షాలు కొత్త నాటకాన్ని మొదలుపెట్టాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. ఇందులో భాగంగానే నిజాలను దాచి పెడుతున్నాయని మండిపడ్డారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 2020 వరకు రాష్ట్రంలో 1,32,899 ఉద్యోగాలు భర్తీ చేశామని, అనుమానాలుంటే ఆయా శాఖల్లో ధ్రువీ కరించుకోవాలని సూచించారు. ఉద్యోగాల కల్ప నపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నా యంటూ ప్రభుత్వ శాఖల వారీగా భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలతో కూడిన బహిరంగ లేఖను కేటీ రామారావు గురువారం విడుదల చేశారు. నిజాలను జీర్ణించుకోలేకే.. ‘నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగొస్తుందన్న సామెత రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు సరిగ్గా సరిపోతుంది. 2014 నుంచి వివిధ శాఖల్లో భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్యను మీడియా ద్వారా అంకెలతో సహా సాధికారికంగా వివరించా. ఈ నిజాలను జీర్ణించుకోలేని విపక్షాలు అసత్యాలతో తెలంగాణ యువతను గందరగోళానికి గురి చేసేం దుకు ప్రయత్నిస్తున్నాయి’అని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. ‘జానారెడ్డి లాంటి సీనియర్ రాజ కీయ నేత కూడా ఈ అసత్యాలను వల్లెవేసేందుకే మొగ్గు చూపడం బాధాకరం. అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఇస్తామనే హామీ మేరకు మేం పాలన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే ఉన్నాం. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఉద్యోగ నియామకాల వివరాలు ఇస్తా మనే జానారెడ్డి ప్రకటనను స్వాగతిస్తున్నా.. అం దులో తెలంగాణ యువతకు ఎన్ని ఉద్యోగాలి చ్చారో కూడా చెప్పాలని కోరుతున్నా.. ప్రభుత్వ శాఖల్లో అవసరమైన ఖాళీలను భర్తీ చేస్తూనే రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్ఐపాస్ ద్వారా ప్రైవేటు రంగంలో సుమారు 14 లక్షల ఉద్యోగాలను కల్పిం చాం..’అని వెల్లడించారు. ప్రైవేటు రంగంలో ఉద్యో గాల కల్పన చేపడుతూనే ప్రభుత్వ శాఖల్లో ఉద్యో గాల భర్తీ విషయంలో అత్యంత పారదర్శకత పాటించినట్లు కేటీఆర్ తెలిపారు. ఉమ్మడి ఏపీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై అవినీతి ఆరోపణలు ఉండేవని, టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ అత్యంత పారదర్శకంగా జరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని నిరంతర ప్రక్రియగా పేర్కొంటూ, తాజాగా మరో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఉద్యోగాల భర్తీ ప్రకియను వేగంగా పూర్తి చేస్తామని, ఇందులో ఎవరికీ సందేహాలు అవసరం లేదన్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన నాటి నుంచి యువతకు ఉద్యోగాలు కల్పించడంలో గత ప్రభుత్వాలతో పోలిస్తే ఎక్కువ నిబద్ధత, చిత్తుశుద్దితో పనిచేస్తున్న టీఆర్ఎస్కు అండగా నిలబడాలని, కొన్ని పార్టీలు, నాయకులు పనిగట్టుకొని చేసే అసత్య ప్రచారాల ప్రభావానికి లోనుకాకుండా యువత ఆలోచించాలని కేటీఆర్ తన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు కల్పించిన 1,32,899 ప్రభుత్వ ఉద్యోగాల వివరాలను కేటీఆర్ శాఖల వారీగా వెల్లడించారు. -
‘ఎమ్మెల్యే పదవి నాకు చిన్నది.. అయినా పోటీ చేస్తా’
హైదరాబాద్: రెండుమార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి విమర్శించారు. దేశంలో తొలిసారి ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. తెలంగాణను ప్రకటించడంలో కాంగ్రెస్ పాత్ర చాలా ఉందని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకొచ్చిన పరిశ్రమలే ఇప్పుడు తెలంగాణాకు రాబడిని తీసుకొస్తున్నాయన్నారు. ఆరోగ్యశ్రీ, ఉపాధి హామీ, రూపాయికి కిలో బియ్యం వంటి అనేక పథకాలను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని గుర్తుచేశారు. కుల,మతాలకతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన అందించిందని అన్నారు. ఎమ్మెల్యే పదవి నాకు చిన్నది.. అయినా పోటీ చేస్తా ఇక నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక గురించి మాట్లాడిన ఆయన.. ఆ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించిందని జానారెడ్డి తెలిపారు. తనకు పదవులపై ఆశలేదని, అధిష్టానం ఆదేశాల మేరకు పోటీకి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. తనకు ఎమ్మెల్యే పదవి అనేది చాలా చిన్నదని, అయినా పోటీకి దిగుతానన్నారు. తెలంగాణలో ఎక్కువసార్లు గెలిచింది తానేనని జానారెడ్డి తెలిపారు. ఇక్కడ చదవండి: జానాకి పోటీ.. రంగంలోకి యువనేత -
సాగర్ ఉప ఎన్నిక: జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. గతంలో ఇది కాంగ్రెస్‌కు కంచు కోటగా ఉండేది. కానీ గత ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ విజయం సాధించింది. నోముల నర్సింహయ్య టీఆర్ఎస్ తరఫున బరిలో నిలబడి విజయం సాధించారు. అయితే ఆయన అకాల మరణంతో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఇక్కడ జానా రెడ్డిని బరిలో నిలపాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు బీజేపీ ఆయన తనయుడు రఘువీర్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని.. టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. (చదవండి: ‘సాగర్’లో పోటీకి.. నన్నెవరూ అడగలేదు) ఈ నేపథ్యంలో నేడు జానా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగర్ ఉప ఎన్నిక బరిలో తోటి అనుచరులంతా తన కుమారుడు రఘువీర్ రెడ్డిని పోటీలో ఉంచుందాం అంటే తననే నిలబెడతామన్నారు. అలా కాదని.. తన అనుచరులు వేరే ఎవరైనా పోటీలో ఉంటాము అంటే వారికే తన మద్దతు ఉంటుంది అని స్పష్టం చేశారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకం అని జానా రెడ్డి ప్రకటించారు. -
మూడుముక్కలాట.. విజయం ఎవరిదో
సాక్షి, హైదరాబాద్ : ఒకవైపు వరుస ఎదురుదెబ్బలు తగిలిన అధికార టీఆర్ఎస్. పైగా వారికది సిట్టింగ్ స్థానం. మరోవైపు కాంగ్రెస్ అత్యంత సీనియర్ నేతకు రాజకీయంగా జీవన్మరణ సమస్య. దుబ్బాక, జీహెచ్ఎంసీ విజయాలు గాలివాటం కాదని, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే క్రమంలో ఉన్నామని నిరూపించుకోవాల్సిన బాధ్యత బీజేపీది. ఇలా అందరికీ ప్రతిష్టాత్మకంగా మారిన నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తోంది. మూడు ప్రధాన పార్టీలకు ‘పరీక్ష’గా నిలిచి... రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. సాగర్ ఫలితంతో రాష్ట్ర రాజకీయ భవిష్యత్ ముఖచిత్రం ఎలా ఉండనుందనే విషయంలో ఒక స్పష్టత రానుంది. కాబట్టి సాగర్‌లో విజయం మూడు ప్రధాన రాజకీయ పక్షాలకు అనివార్యమయిన పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్తో పాటు మంచి ఊపు మీదున్న బీజేపీకి, ఈ ఎన్నికపై గంపెడాశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ వచ్చే ఫలితం అత్యంత కీలకం కానుంది. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన గుర్తింపు పొందిన కాంగ్రెస్ సీనియర్ నేత కె. జానారెడ్డి రాజకీయ భవితవ్యాన్ని కూడా ఈ ఎన్నిక నిర్దేశించనుంది. సానుకూల ఫలితం వస్తే జానా గ్రాఫ్ రాష్ట్ర రాజకీయాల్లో పెరిగిపోతుందని, అనూహ్య ఫలితం వస్తే మాత్రం ఆయన దాదాపు రాజకీయాల నుంచి తప్పుకుంటారనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ ప్రాభవానికి పరీక్ష నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో అనివార్యమైన ఈ ఉప ఎన్నిక కోసం అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అప్పుడే నియోజకవర్గంలో ఎన్నికల వేడి ప్రారంభం అయింది. అభ్యర్థి ఎంపికపై కసరత్తు, పార్టీ ద్వితీయశ్రేణి నాయకుల మధ్య సమన్వయం, నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై దృష్టి సారించి అధికార టీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందంజలో ఉంది. నోముల సంతాప సభ పేరిట ఇప్పటికే రెండు చోట్ల సమావేశాలు ఏర్పాటు చేసింది. ఇక్కడ అభ్యర్థి ఎవరయితే బాగుంటుందన్న కోణంలో సర్వేలు కూడా పూర్తి చేసింది. మొత్తం మీద నర్సింహయ్య కుమారుడు భగత్, గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ ఎంసీ. కోటిరెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డిల అభ్యర్థిత్వాలను ఆ పార్టీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే సాగర్ ఉపఎన్నిక ఫలితం రాష్ట్రంలో టీఆర్ఎస్ చరిష్మాకు పరీక్షగా మారుతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే సిట్టింగ్ సీటు దుబ్బాకను కోల్పోయి, జీహెచ్ఎంసీలో ఆశించిన ఫలితం రాని పరిస్థితుల్లో... మరో సిట్టింగ్ స్థానంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్కు అత్యంత అవసరం. పార్టీ ప్రాభవం తగ్గలేదని నిరూపించుకోవాల్సిన అనివార్యత. ఒకవేళ కారు అంచనా ఈ ఎన్నికల్లో తప్పితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందనే చర్చ టీఆర్ఎస్ వర్గాల్లోనే జరుగుతోంది. ఈ నేపథ్యంలో సాగర్‌ను మళ్లీ దక్కించుకునేందుకు అధికార పార్టీ సర్వశక్తులు ఒడ్డనుంది. పెద్దాయనకు ‘ఇమేజ్’కలిసొస్తుందా! గత ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి ఎక్కువగా అక్కడే గడుపుతున్నారు. వారానికి కనీసం రెండు రోజులు సాగర్‌లోనే ఆయన మకాం వేస్తున్నారు. ఇక, నోముల మరణం తర్వాత జానా మరింత చురుకుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే పార్టీ బూత్ కమిటీల సమావేశాలు ఓ దఫా పూర్తి చేసిన జానా రెండో దశలో ద్వితీయ శ్రేణి నాయకత్వంతో మంతనాలు జరుపుతున్నారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని, దూరంగా ఉన్న వారిని అక్కున చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తనకున్న విస్తృత పరిచయాలను ఉపయోగించుకుంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. రెండో విడతలో ఆయనకు కుమారుడు రఘువీర్ కూడా తోడయ్యారు. తండ్రీ కొడుకులిద్దరూ నియోజకవర్గంలోని చెరో మండలంలో పర్యటిస్తున్నారు. వ్యక్తిగత చరిష్మా కలిగిన నాయకుడిగా, వివాదరహితుడిగా గుర్తింపు పొందిన జానాకు ద్వితీయ శ్రేణి నాయకత్వం పార్టీ నుంచి వెళ్లిపోవడం ప్రతికూలంగా కనిపిస్తోంది. అయితే, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కేడర్ బలంగానే ఉందని ఆయన విశ్వసిస్తున్నారు. ఈ కోణంలోనే నియోజకవర్గంలోని యువతను ఆకట్టుకుని వారిని నాయకులుగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తోడు రాష్ట్ర కాంగ్రెస్‌లో ఆయన ప్రధాన నాయకుడు కావడం, టీపీసీసీ అధ్యక్షుడి రేసులో ఉండడం, తాజాగా ఆయన విజ్ఞప్తి మేరకు టీపీసీసీ అధ్యక్ష ఎన్నికను పార్టీ అధిష్టానం వాయిదా వేయడం లాంటి అంశాలు... ఆయనకు సానుకూలంగా మారుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీ అభ్యర్థి ఎవరో? ఇక, బీజేపీ కూడా తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. గతంలో ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ పార్టీకి పెద్దగా ఓట్లు రాకపోవడంతో ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తీవ్రంగా కష్టపడాల్సి వస్తుందని రాజకీయ వర్గాలంటున్నాయి. సంస్థాగత నిర్మాణం కూడా బీజేపీ అంతగా లేకపోవడంతో గత ఎన్నికల్లో పోటీ చేసిన కంకణాల నివేదితకు పోలైన ఓట్లలో కేవలం 1.48 శాతం (2.675) ఓట్లే వచ్చాయి. తాజా రాజకీయ పరిస్థితుల్లో ప్రధాన పోటీదారుల్లో ఒకరుగా నిలువడం అంత సులభమైన విషయమేమీ కాదు. ఇప్పుడు అక్కడ బీజేపీ టికెట్ కోసం ఇద్దరు అభ్యర్థులు పోటీపడుతున్నారు. పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి సతీమణి, గత ఎన్నికల్లో పోటీ చేసిన కంకణాల నివేదితతో పాటు కొంతకాలం క్రితం పార్టీలో చేరిన కడారి అంజయ్య యాదవ్ బీజేపీ టికెట్‌ను ఆశిస్తున్నారు. ఇద్దరూ పోటీపోటీగా నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. అయితే, అంజయ్య నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కాకపోవడం ఆయన అభ్యర్థిత్వానికి ఆటంకం అవుతుందని భావించినా.... సాగర్‌లో ఆయన సామాజికవర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉండడం కలిసిరానుంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ లాగే సాగర్‌లోనూ కమలనాథులు దూకుడుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తారనడంలో సందేహం లేదు. ఎన్నికల సమయం సమీపించే కొద్దీ వ్యూహాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని, గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థిని నిలబెట్టి ఈ ఎన్నికల్లో కూడా సత్తా చాటి తెలంగాణలో తమ రాజకీయ భవిష్యత్తును పదిలం చేసుకోవాలన్నది బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆలోచనగా కనిపిస్తోంది. ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్ వస్తుందని, మార్చిలో సాగర్ ఉపఎన్నిక జరుగుతందనే అంచనాతో అన్ని రాజకీయ పార్టీలు పావులు కదుపుతుండటం గమనార్హం. -
జానాకి పోటీ.. రంగంలోకి యువనేత
సాక్షి, నల్గొండ : ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న టీఆర్ఎస్ పార్టీకి రాబోయే ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు సవాల్‌గా మారాయి. మరోవైపు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో మరో ఉప ఎన్నికను ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది. దుబ్బాకలో రామలింగారెడ్డి భార్యను బరిలోకి దింపినా టీఆర్ఎస్ పార్టీ తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోలేకపోయింది. దీంతో ప్రస్తుతం నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ బలమైన స్థానిక నేతను అన్వేషించే పని పడినట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అర్ధాంతరంగా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకే టికెట్ కేటాయించే సంప్రదాయాన్ని టీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తూ వస్తోంది. కానీ, దుబ్బాకలో ఎదురైన చేదు అనుభవం ఆ పార్టీని పునరాలోచనలో పడేసింది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లను మార్చిన చోట విజయం సాధించిన టిఆర్ఎస్.. సిట్టింగులు ఉన్న చోట ఘోరంగా ఓడిన విషయం తెలిసిందే. వీటన్నింటి నేపథ్యంలో నర్సింహయ్య కుటుంబ సభ్యులను బరిలోకి దింపాలా లేక మరొకరికి అవకాశం ఇవ్వాలా అనే విషయంలో టీఆర్ఎస్ తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నోముల కుటుంబానికి టికెట్ ఇవ్వకపోతే.. ఎవరికి అవకాశం ఉంటుందనే చర్చ జోరందుకుంది. జానా రెడ్డికి గట్టి పోటీ! ఇక మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ మనవడు, టీఆర్ఎస్ యువనేత మన్నెం రంజిత్ యాదవ్‌కు ఈసారి టికెట్ దక్కే అవకాశం ఉన్నట్లు ప్రముఖంగా వినబడుతోంది. నియోజకవర్గంలో రామ్మూర్తికి ఉన్న మంచి పేరు రంజిత్‌కు కలిసి వస్తుందని, ఆయనకు టికెట్ కేటాయిస్తే కారు పార్టీకే విజయం వరిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ యువ నేత నియోజకవర్గ స్థాయిలో చాలా యాక్టివ్‌గా ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇప్పటికే మద్దతును కూటగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న రంజిత్ కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో సాగర్ నియోజకవర్గ ప్రజలు తమకు అందుబాటులో ఉండే నేతను ఎమ్మెల్యే అభ్యర్థి నిలిపితే బాగుంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా సీనియర్ నేతైన జానారెడ్డికి గట్టి పోటీ ఇచ్చే నాయకుడు రంజిత్ యాదవ్ అని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే స్థానికంగా బలమైన యాదవ సామాజిక వర్గంనికి చెందిన నేత కావడంతో.. సీనియర్లు సైతం ఆయనవైపే మొగ్గుచూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నియోజవర్గంలో రెడ్డి ఓట్లతో పాటు పెద్ద ఎత్తున యాదవ్ సామాజిక ఓటర్లు కూడా ఉన్నారు. ఇది రంజిత్ యాదవ్‌కు కలిసొచ్చే పరిణామం. మరోవైపు మంత్రి కేటీఆర్‌కు సన్నిహితంగా ఉండే ఎన్ఆర్ఐ గడ్డంపల్లి రవీందర్ రెడ్డికి టిక్కెట్ దక్కే అవకాశం కూడా ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. -
కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీజేపీలోకి జానారెడ్డి!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి జానారెడ్డి బీజేపీలో చేరతారనే వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పాగావేయాలని పావులు కదుపుతున్న బీజేపీ.. కాంగ్రెస్ సీనియర్ నేతలపై గాలంవేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నాగార్జునసాగర్ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో బీజేపీ నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డిని బరిలో నిలపాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు రఘువీర్‌రెడ్డితో బీజేపీ రాష్ట్ర నేతలు సైతం ఇదివరకే సంప్రదింపులు జరిపారని, టికెట్ ఆఫర్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ నాయకురాలు డీకే అరుణ కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే కమలం ఆఫర్‌తో ఆలోచనలోపడ్డ రఘువీర్.. తన తండ్రితో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు సమాచారం. (కాంగ్రెస్ ఓటమి.. రేవంత్ వర్గంలో ఆశలు) మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంచిపట్టున్న జానారెడ్డిని పార్టీలో చేర్చుకుంటే తమకూ లాభిస్తుందని కాషాయదళం లెక్కలువేస్తోంది. బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ప్రయత్నాలను ముమ్మరం చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య చేతిలో జానారెడ్డి ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న జానారెడ్డి.. కుమారుడి భవిష్యత్ కోసం బీజేపీలో చేరేందుకు మొగ్గుచూపుతున్నట్లు ఆయన అనుచరుల ద్వారా తెలుస్తోంది. గత ఎన్నికల్లోనే తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని జానారెడ్డి కోరగా.. ఆయన అభ్యర్థనను కాంగ్రెస్ అధిష్టానం తిరస్కరించింది. దీంతో అయిష్టంగానే బరిలో నిలిచి.. ఊహించని విధంగా ఓటమి చెందారు. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికలో విజయం, గ్రేటర్ ఫలితంతో జోరుమీదున్న కాషాయదళం.. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగానే కాంగ్రెస్ సీనియర్లు, అసంతృప్తులను ఆకర్షిస్తోంది. బీజేపీ గూటికి మాజీ మంత్రి... గ్రేటర్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీకి ఊహించిన షాక్ ఎదురైంది. ఆ పార్టీ మాజీమంత్రి, వికారాబాద్‌కు చెందిన సీనియర్ నేత చంద్రశేఖర్ గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. ఇప్పటికే బీజేపీ నుంచి ఆహ్వానం అందినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. దీనిపై చర్చించేందుకు ఆదివారం ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో భేటీ నిర్వహించనున్నారు. వారి అభిప్రాయం తీసుకున్న అనంతరం బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. -
'ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడి పోతున్నారు'
సాక్షి, హైదరాబాద్: ప్రియాంక రెడ్డి హత్య కేసుపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంక రెడ్డి హత్య కేసు తర్వాత తెలంగాణలో ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడి పోతున్నారని అన్నారు. ఆడపిల్లలు బయటికెళితే ఇంటికొచ్చే వరకు కుటుంబసభ్యులు భయపడుతూనే ఉంటున్నారని చెప్పారు. ప్రియాంక రెడ్డి హత్య ఘటనపై తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయని జానారెడ్డి విమర్శించారు. ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా ఐపీఎస్ అధికారితో వెంటనే ఒక కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి స్పందించి.. బాధిత కుటుంబాలను పరామర్శిస్తే బాగుంటుందని, ప్రజల్లోకి మంచి మెసేజ్ వెళ్తుందని చెప్పారు. చదవండి: (హోం మంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదం: గీతారెడ్డి) చదవండి: (ప్రియాంక చిన్న పొరపాటు వల్లే: మహమూద్ అలీ) -
ఆహ్లాదకరంగా ‘ఎట్ హోం’
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ నరసింహన్ దంపతులు గురువారం రాజ్‌భవన్‌లో ఇచ్చిన తేనీటి విందుకు (ఎట్ హోం) సీఎం కేసీఆర్‌తోపాటు పలువురు మంత్రులు, వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. సుమారు గంటన్నర పాటు సాగిన ఎట్‌హోం కార్య క్రమంలో గవర్నర్ దంపతులు నరసింహన్, విమలా నరసింహన్ అతిథుల వద్దకు వెళ్లి పేరుపేరునా స్వాగతం పలికారు. జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభం కాగా.. సీఎం కేసీఆర్‌తోపాటు గవర్నర్ దంపతులు ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన వేదిక వద్దకు చేరుకున్నారు. తమిళనాడు మాజీ గవర్నర్, మాజీ సీఎం రోశయ్యతో పాటు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ పార్టీల నేతలను పలకరించిన సీఎం కేసీఆర్.. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఐటీ కంపెనీ అధినేత బీవీఆర్ మోహన్‌రెడ్డితో సుదీర్ఘంగా సంభాషించారు. అతిథులను పలకరించిన అనంతరం.. గవర్నర్ నరసింహన్, కేసీఆర్ 25నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఇద్దరి నడుమ ఆసక్తికర చర్చ సాగిందని చెబుతున్నా.. భేటీ వివరాలు మీడియాకు వెల్లడి కాలేదు. కేసీఆర్‌తో జానారెడ్డి కరచాలనం, పక్కన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలిసే సందర్భం రావట్లేదు! ఎట్‌హోం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వివిధ పార్టీల నేతలను గవర్నర్, సీఎం కేసీఆర్ పలకరించారు. ఆహ్లాదకరంగా సాగిన కార్యక్రమంలో గవర్నర్, సీఎం, నేతల నడుమ పలుసార్లు ఆసక్తికర సంభాషణ జరిగింది. సీఎల్పీ మాజీ నేత జానారెడ్డిని ఎలా ఉన్నారంటూ సీఎం కేసీఆర్ పలకరించగా.. ఇప్పుడు మనం కలిసే సందర్భం రావడం లేదని జానారెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో అసెంబ్లీలో అప్పుడో, ఇప్పుడో కలిసే సందర్భం వచ్చేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మమ్ములను కూడా దృష్టిలో పెట్టుకోండని గవర్నర్‌తో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ వ్యాఖ్యానించగా.. అలాంటిదేమీ లేదని గవర్నర్ అన్నారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, గవర్నర్ మధ్య కూడా సుమారు 2 నిమిషాల పాటు ఆసక్తికర సంభాషణ కొనసాగింది. తరలివచ్చిన ప్రముఖులు కార్యక్రమంలో తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు నేతలతో పాటు, ప్రభుత్వాధికారులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఉమ్మడి ఏపీ శాసన మండలి మాజీ ఛైర్మన్ చక్రపాణి, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, బడుగుల లింగయ్య యాదవ్, బండ ప్రకాశ్, సంతోష్‌కుమార్, ఎంపీలు నామా నాగేశ్వర్రావు, రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, క్రీడాకారులు మిథాలీరాజ్, పుల్లెల గోపీచంద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పాల్గొన్నారు. -
‘సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలపై పోరాటం’
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో పార్టీని బతికించుకునేందుకు క్షేత్రస్థాయిలో బలోపేతం అయ్యేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకత్వం కూలంకశంగా చర్చించింది. పార్టీ భవిష్యత్, ప్రభుత్వంపై సాగించాల్సిన పోరాటాలు, దానికి అవలంభించాల్సిన విధానాలు, రానున్న మున్సిపల్ ఎన్నికలు.. సాగునీటి ప్రాజెక్టులు, ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు తదితర అంశాలపై కాంగ్రెస్ పెద్దలు మేధోమథనం చేశారు. ఈ మేరకు నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో శనివారం జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో చర్చ జరిగింది. టీపీపీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ఆర్సీ కుంతి యా, కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస కృష్ణన్, సలీం అహ్మద్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు పాల్గొనగా సుదీర్ఘంగా ఈ సమావేశం సాగింది. ఇన్కేమెరాగా జరిగిన ఈ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు, దాంతో జరిగే నష్టాలపై నైనాల గోవర్ధన్ వివరించగా, సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ఎలాంటి విధానం అవలంభించాలనే దానిపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వివరించారు. జూలై మొదటి వారంలో డీసీసీ సమావేశాలు.. జూలై మొదటి వారంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ సమా వేశాలు జరపాలని నిర్ణయించారు. ముందుగా కొత్త జిల్లాల్లో ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. అనంతరం మున్సిపాలిటీల స్థాయిలో కూడా సమావేశాలు జరపనున్నారు. జూలై 1 నుంచి 4లోగా డీసీసీ విçస్తృతస్థాయి సమావేశాలు.. 5 నుంచి 10లోగా అన్ని మున్సిపాలిటీల్లో సమావేశాలు పెట్టాలని నిర్ణయం జరిగింది. ఎలాంటి ఇబ్బందులూ లేని నియోజక వర్గాల్లో ఆయా నియోజకవర్గ ఇన్చార్జులు, ఎమ్మెల్యేలకు పూర్తి బాధ్యత అప్పజెప్పాలని నిర్ణయించారు. డీసీసీ భవనాలకు ప్రభుత్వం భూములు కేటాయిం చేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సమావేశంలో చర్చకు వచ్చింది. సచివాలయం కూల్చివేత విషయాన్ని కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకించాలని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, టీఆర్ఎస్ను నిలదీయాలని తీర్మానించారు. మునిసిపాలిటీల్లో ఎన్నికల కోసం అభ్యర్థులను ‘సెలక్ట్ అండ్ ఎలెక్ట్’పద్ధతిలో టికెట్లు కేటాయించాలన్న ప్రతిపాదనలకే నాయకత్వం మొగ్గుచూపిందని సమాచారం. టీపీసీసీ ముఖ్య నాయకులు కొన్ని మున్సిపాలిటీల బాధ్యతలు తీసుకోవాలని తేల్చారు. ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ పరిధిలోని 40 మున్సిపాలిటీలపై ఎంపీలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పార్టీ నేత కొండ విశ్వేశ్వర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని తీర్మానించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సచివాలయం సందర్శన... కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సోమవారం సచివాల యాన్ని సందర్శించి భవనాలను పరిశీలించాలని వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. ఏ భవనం ఎప్పుడు నిర్మించారు? ఎప్పుడు శంకు స్థాప న జరిగింది? ఎప్పుడు ప్రారంభించారో తెలుసుకునేందుకు శిలాఫలకాలను పరిశీలించాలని నిర్ణయించారు. పాత భవనాలను కూల్చివేయకుండా ఇతర అవసరాలకు వినియోగించుకోవాలని, ఈ విషయా న్ని ప్రభుత్వానికి సూచించాలని రేవంత్ చెప్పారు. అద్దె గదుల్లో నడుస్తున్న ప్రభుత్వ శాఖలకు సచివాల య భవనాలను వాడుకోవచ్చని సూచించారు. ప్రతి నెలా ఇలాంటి సమావేశాలు: కుంతియా ప్రతినెలా ఇదే తరహాలో సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ఇన్చార్జ్ కుంతియా సూచించారు. సమన్వయ కమిటీ, వర్కింగ్ కమిటీ, టీపీసీసీ కమిటీ కలసి çసమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతినెలా రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, మండలస్థాయి సమావేశాలు తప్పనిసరిగా జరుపుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 38 నియోజకవర్గాల్లో బాధ్యులు లేరని, అక్కడ ఒక కమిటీ వేసి కో–ఆర్డినేటర్లను నియమించి పని చేయించాలని నిర్ణయించారు. రాష్ట్రస్థాయి నాయకులను ఒక్కో నియోజకవర్గంలో ఇన్చార్జ్గా పని చేయించాలని, సీనియర్ లీడర్లు, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులతో రాష్ట్రస్థాయిలో సమన్వయ కమిటీని వేయాలని తీర్మానించారు. రాహుల్ రాజీనామాను ఉప సంహరించుకుని మళ్లీ పార్టీలో యాక్టివ్‌గా పనిచేయాలని కోరాలని ఈ సమావేశం నిర్ణయించింది. బాధ్యతతో పనిచేయాలి: కోమటిరెడ్డి ముఖ్యనేతలంతా మున్సిపల్ ఎన్నికల్లో బాధ్యతతో పనిచేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. కాళేశ్వరం 20 శాతం పూర్తికాకున్నా హడావుడిగా ప్రారంభించారని పేర్కొ న్నారు. కాళేశ్వరంపై ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణంపై పిల్ వేస్తానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. కొత్త జిల్లాల వారీగా దత్తత తీసుకొని పార్టీని బలోపేతం చేద్దామని సూచించారు. గ్రామగ్రామాన తిరిగి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ విధానాలపై పోరాటాలు: ఉత్తమ్ కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలపై పోరాటం చేస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. కొత్త అసెంబ్లీ భవనాల అవసరమే లేదని, ఇక పాత సచివాలయం కూల్చొ ద్దని కోరారు. సోమవారం జీవన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి సచివాలయాన్ని పరిశీలిస్తారని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకుంటున్నారన్న తప్పుడు భావన రాకుండా జాగ్రత్త పడాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీనిపై స్పష్టమైన వైఖరి కోసం కమిటీ వేస్తామన్నారు. అలాగే ప్రాజెక్టులకు బ్యాంకులు ఎలా రుణాలు ఇస్తున్నాయో చూడాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాహుల్ గాంధీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగాలని తీర్మానం చేసి పంపిస్తామని తెలిపారు. -
రాష్ట్రంలో ప్రత్యామ్నాయం మేమే
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అనూహ్య తీర్పునిచ్చారని, 16 సీట్లు గెలుస్తామని చెప్పిన టీఆర్ఎస్ను సింగిల్ డిజిట్‌కు పరిమి తం చేశారని సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలు కాంగ్రెస్ వైపునకు మళ్లారనేందుకు ఈ ఎన్నికలే సంకేతమన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ.. ఈ ఎన్నికలను ప్రభుత్వం గుణపాఠంగా తీసుకోవాలని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీని కూడా గుర్తించారని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం గా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో పూర్తి మెజార్టీ వచ్చి న తర్వాత ఫిరాయింపులను ప్రోత్సహించడం ప్రభుత్వానికి మంచిది కాదని అన్నారు. నాకు టికెట్ ఇప్పిస్తారా? తాను హుజూర్నగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని వస్తున్న వార్తలను జానారెడ్డి ఖండించారు. తనకు అక్కడి నుంచి పోటీ చేసే ఆలోచనే లేదని, అయినా తనకు ఒకరు టికెట్ ఇప్పించే పరిస్థితి ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. టికెట్ కోసం ప్రయత్నాలు చేసిన దాఖలాలు తనకు ఎప్పుడూ లేవని, సోనియాగాంధీ పిలిచి పోటీ చేయమని చెప్పినా తాను సైలెం ట్‌గా ఉన్నానని, తాను ఎంపీగా పోటీ చేయాలనుకుంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెనక్కు తగ్గి ఉండేవాడని అన్నారు. తాను 2024లో కూడా పోటీ చేయాలో లేదోనని ఆలోచిస్తున్నానని, తనకు విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పార్టీ నిర్మాణం తగ్గిపోతోంది అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ పార్టీ నిర్మాణం తగ్గిపోతోందని జానారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు పడిపోయినప్పుడు పార్టీలు దెబ్బతింటాయని చెప్పారు. మోదీని ఓడించాలని జట్టు కట్టిన కూటమిలో కాంగ్రెస్ ముందు వరుసలో ఉండాల్సిందని, అఖిలేష్–మాయావతిలు కాంగ్రెస్‌తో కలిసి ఉంటే బాగుండేదని అన్నారు. ఎవరికి వాళ్లు ప్రధాని కావాలనే కోరిక ఉండటం కూటమిలోని ప్రధాన లోపమని చెప్పారు. రాహుల్ రాజీనామా సహజమని, అయితే రాజీనామాపై పునరాలోచించుకుంటే మంచిదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గెలిచిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి జానా అభినందనలు తెలిపారు. -
లోక్‌సభపై కాంగ్రెస్ సీనియర్ల నజర్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్ సీని యర్లు సిద్ధమవుతున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన నేతలతోపాటు మొద టి నుంచి పార్లమెంటుకు వెళ్లాలన్న ఆలోచనతో ఉన్న నేతలు టికెట్ల కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. సీఎల్పీ నేత హోదాలో పనిచేసిన సీనియర్ నేత జానారెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి తదితరులు లోక్‌సభపై కన్నేశారని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి లోక్‌సభ ఎన్నికల అభ్యర్థులను ఫిబ్రవరిలోనే ప్రకటిస్తారనే అంచనాల నేపథ్యంలో ఆశావహ నేతలు అప్పుడే ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది. తమకు అనుకూలమైన అధిష్టానం పెద్దలను కలసి మనసులో మాట చెబుతున్నారని, అవకాశం ఇస్తే రాహుల్ నాయకత్వంలో లోక్‌సభలో పనిచేస్తామని వారిని ప్రసన్నం చేసుకుంటున్నారని సమాచారం. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో హైదరాబాద్, పెద్దపల్లి స్థానాల నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోతుండటం గమనార్హం. నియోజకవర్గాలవారీగా... లోక్‌సభ నియోజకవర్గాలవారీగా పరిశీలిస్తే నల్లగొండ నుంచి మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సై అంటున్నారు. ఇటీవల జరిగిన పార్టీ సమీక్షా సమావేశానికి హైదరాబాద్ వచ్చిన ఆయన తాను నల్లగొండ ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. కోమటిరెడ్డితోపాటు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సీనియర్ నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతి కూడా మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. భువనగిరి స్థానం నుంచి నలుగురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. మొదటి నుంచీ ఈ స్థానాన్ని ఆశిస్తున్న టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డితోపాటు పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, జనగామ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. భువనగిరి పార్లమెంటరీ స్థానంపై గట్టి పట్టు ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇక్కడి నుంచి వంగాల స్వామిగౌడ్‌ను ప్రతిపాదిస్తున్నారు. బీసీ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతోపాటు స్వామిగౌడ్ స్థానికుడు కూడా కావడం కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ఇటీవలే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసిన పటోళ్ల కార్తీక్‌రెడ్డితోపాటు కాసాని జ్ఞానేశ్వర్ పేర్లు వినిపిస్తున్నాయి. పాలమూరు పార్లమెంటు నుంచి సీనియర్ నేత ఎస్.జైపాల్‌రెడ్డితోపాటు ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్ నేతలుగా గుర్తింపు పొందిన మాజీమంత్రి డి.కె.అరుణ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఖమ్మం నుంచి రేణుకాచౌదరి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఆదిలాబాద్ నుంచి రమేశ్ రాథోడ్, నరేశ్ జాదవ్, మహబూబాబాద్ నుంచి బలరాంనాయక్, రవీంద్రనాయక్, బెల్లయ్యనాయక్, నాగర్‌కర్నూలు నుంచి నంది ఎల్లయ్య, మల్లు రవి, సంపత్, సికింద్రాబాద్ నుంచి అంజన్‌కుమార్ యాదవ్, అజారుద్దీన్, బండ కార్తీకరెడ్డి, మెదక్ నుంచి దామోదర రాజనర్సింహ, నిర్మలాజగ్గారెడ్డి, మల్కాజ్గిరి నుంచి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, రేణుకాచౌదరి, వరంగల్ నుంచి మాజీ ఎంపీలు రాజయ్య, విజయరామారావులతోపాటు ఇటీవలి ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన ఇందిర, నిజామాబాద్ నుంచి ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్, కరీంనగర్ నుంచి సీనియర్ నేత జీవన్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, జహీరాబాద్ నుంచి సురేశ్‌షెట్కార్ పేర్లు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ స్థానం నుంచి మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను బరిలో దింపాలని అధిష్టానం భావిస్తు న్నా ఆయన సికింద్రాబాద్ స్థానంపై కన్నేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్, పెద్దపల్లిల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు నేతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లలో ఎంతమంది ఆశలు ఫలిస్తాయో.. ఎవరు లోక్‌సభకు ఎన్నికవుతారో వేచిచూడాల్సిందే! నష్టాన్నిపూడ్చుకునేపనిలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతటి ఘోర పరాజయం పొందిందో అంతే ఘోర పరాభవాన్ని ఆ పార్టీ సీనియర్లు మూటకట్టుకున్నారు. జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డి.కె.అరుణ, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ, జీవన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 20 మంది సీనియర్ నేతలు అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన రాజకీయనష్టాన్ని పూడ్చుకునేందుకు లోక్‌సభ ఎన్నికలను వేదికగా మార్చుకోవాలని చాలామంది సీనియర్లు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఓటమి పాలయ్యామనే సానుభూతి మరవకముందే లోక్‌సభ ఎన్నికలు వస్తుండటం, గతంలో ఉన్న ఛరిష్మా, సాధారణంగా జాతీయ పార్టీగా కాంగ్రెస్‌కు పార్లమెంటు ఎన్నికల్లో ఉండే సానుకూలతలు కలిసి వస్తాయనే అంచనాతో లోక్‌సభ బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. -
జానారెడ్డి, షబ్బీర్ అలీకి ఇంటెలిజెన్స్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలైన జానారెడ్డి, షబ్బీర్ అలీకి ఇంటెలిజెన్స్ పోలీసులు నోటీసులిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనాల వినియోగంపై రోజువారీ అద్దె, డ్రైవర్ భత్యం కింద రూ.9 లక్షలు చెల్లించాలని జానారెడ్డితో పాటు షబ్బీర్ అలీకి రాష్ట్ర ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్(ఐఎస్‌డబ్ల్యూ)విభాగం శనివారం నోటీసులందించింది. 2007లో సీఈసీ ఆదేశాల ప్రకారం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో భద్రత నిమిత్తం బుల్లెట్ ప్రూఫ్వాహనాలు సమకూర్చుకున్న నేతలు తప్పనిసరిగా సంబంధిత వాహనాల అద్దెతో పాటు డ్రైవర్లకు భత్యం చెల్లించాల్సి ఉంటుందని ఆదేశాల్లో ఉందని, ఈమేరకు బుల్లెట్ వాహనాలు వినియోగించినవారందరికీ నోటీసులు పంపించినట్టు ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన సెప్టెంబర్ 6 నుంచి డిసెంబర్ 7వరకు జానారెడ్డి, షబ్బీర్ అలీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు టీఎస్ 09పీఏ1653, టీఎస్ 09పీఏ1654 వాహనాలు ఉపయోగించారని నోటీసుల్లో పేర్కొన్నారు. షబ్బీర్ అలీ ఈ కోడ్ కాలంలో 12,728 కి.మీ వాహనంలో ప్రయాణించారని, ఇందుకు గాను ప్రతీ కిలోమీటర్‌కు రూ.37లతో పాటు డ్రైవర్ భత్యం రోజు వారీరూ.100లతో కలిపి మొత్తంగా రూ.4,79,936 చెల్లించాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ మంత్రి జానారెడ్డి కోడ్ అమల్లో ఉండగా 11,152 కి.మీలు ప్రయాణించారని, ఇందుకు గాను రూ.4,20,924 చెల్లించాలని పేర్కొన్నారు. ఇద్దరు నేతలు కలిపి మొత్తంగా రూ.9,00,860 చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. అధికార పార్టీకి సైతం రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్లో ఉన్న మంత్రులు, ఇతర వీఐపీలు వాడిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు సైతం ఇదే రీతిలో చెల్లించాలని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు నోటీసులిచ్చినట్టు తెలిసింది. ఎవరెవరికి ఇచ్చారు? ఎంత చెల్లించాల్సి ఉంటుందన్న అంశాలపై సాక్షి ఆరాతీసేందుకు ప్రయత్నించగా సంబంధిత అధికారులెవరు అందుబాటులోకి రాలేదు. -
పార్లమెంట్ హడావుడి..షురూ!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : మరో ప్రధాన పోరుకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. 45రోజుల్లోగా పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందన్న వార్తల నేపథ్యంలో ఆయా పార్టీల్లో అప్పుడే ఎంపీ ఎన్నికల ముచ్చట్లు మొదలయ్యాయి. జిల్లాలోని నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. శాసనసభ ఎన్నికల్లో వచ్చిన విధంగా ఏకపక్షంగా పార్లమెంటు ఎన్నికల తీర్పు ఉండదన్న అంచనాతో ఉన్నారు. శాసనసభకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ నాలుగు చోట్ల పరాజయం పాలైంది. ప్రధానంగా నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ కేవలం హుజూర్నగర్ స్థానంలో మాత్రమే విజయం సాధించింది. మిగిలిన నల్లగొండ, దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, కోదా డ, సూర్యాపేట .. ఇలా ఆరు చోట్లా టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. పార్లమెంటు ఎన్నికల్లో ఇది తమ కు లాభిస్తుందన్న అంచనాలో అధికార టీఆర్ఎస్ ఉండగా, శాసనసభ ఫలితాలు పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఫలించవని, కచ్చితంగా భిన్నమైన తీర్పే వస్తుందన్న భావనలో కాంగ్రెస్ ఉంది. ఈ అంశాల నేపథ్యంలోనే.. టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల నుంచి టికెట్లు ఆశిస్తున్న వారు తమ ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తారా..? టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. దీంతో సహజంగానే టీఆర్ఎస్ శ్రేణులు ఈ ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇటీవలే ముగిసిన శాసనసభ ముందస్తు ఎన్నికల్లో కూడా నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేస్తారన్న మొదట్లో కొంత ప్రచారం జరిగినా, సెప్టెంబరు 6వ తేదీన అభ్యర్థులను ప్రకటించడంతో ఆ ప్రచారానికి తెరపడింది. పార్లమెంటు ఎన్నికలు అనగానే మరోమారు సీఎం కేసీఆర్ నల్లగొండనుంచే పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర రైతు సమన్వయ సమితి అ«ధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనను శాసన మండలికి తీసుకుని కేబినెట్లో అవకాశం కల్పిస్తారని టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన ఈసారి లోక్‌సభకు పోటీ చేయపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెరపైకి బండా నరేందర్‌రెడ్డి పేరు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (ఎఫ్డీసీ) చైర్మన్ బండా నరేందర్ రెడ్డి పేరు కూడా తెరపైకి వస్తోంది. 2014 ఎన్నికల్లోనే ఆయన పేరు పరిశీలనలో ఉన్నా, చివరి నిమిషంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అభ్యర్థిత్వం దక్కింది. ఆ ఎన్నికల్లో ఆయన మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిన శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పల్లా రాజే శ్వర్‌రెడ్డి శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు పార్లమెంటుకు జరగాల్సిన ఎన్నికల్లోనూ నల్లగొండనుంచి రాజేశ్వర్ రెడ్డి పేరు అక్కడక్కడా వినిపిస్తున్నా.. ఎఫ్డీసీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి పేరు ప్రముఖంగా చెబుతున్నారు. గతంలో పార్టీ కోసం .. గెలిచే అవకాశం లేకున్నా, నల్లగొండ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి మండలికి పోటీ చేయడంతోపాటు, పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్లో కొనసాగుతున్న ఆయనకు అధినేత కేసీఆర్ దగ్గర గుర్తింపు ఉంది. సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు లేవనుకుంటున్న నేపథ్యంలో, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇప్పటికే ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌గా ఉండడం, సీఎం కేసీఆర్ నిజంగానే ఇక్కడినుంచి పోటీ చేస్తారా అన్న అంశంలో స్పష్టత లేకపోవడం వంటి కారణాలతో బండా నరేందర్‌రెడ్డి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు. కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి ..? రాష్ట్ర శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరగకుండా ఒకవేళ జమిలి ఎన్నికల జరిగి ఉంటే నల్లగొండ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించానని, అసెం బ్లీకి ముందుగానే ఎన్నికలు జరగడంతో అనివార్యంగా పోటీ చేయాల్సి వచ్చిందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారు. ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో నల్లగొండ నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే కోమటిరెడ్డి ప్రకటించారు. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. మరో రెండు, మూడు నెలల్లోనే లోక్‌సభకు జరగనున్న ఎన్నికల్లో ఆయన నల్లగొండ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నల్లగొండ లోక్‌సభా నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో తనకు ఉన్న పరిచయాలు, సీనియర్ నేతలు జానారెడ్డి, ఆర్.దామోదర్‌రెడ్డి, టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి సహకారంతో ఎంపీగా విజయం సాధిస్తానని కార్యకర్తలకు ధైర్యం చెబుతున్నారు. ఇప్పటికే ఆయన ఎన్నికలపై దృష్టి పెట్టి ఆ మేరకు పావులు కదుపుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కూడా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తన దగ్గరి వారికి సంకేతాలు ఇచ్చారని చెబుతున్నారు. మొత్తంగా ఆటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీల్లో పార్లమెంటు ఎన్నికల ముచ్చట్లు జోరుగా సాగుతున్నాయి. -
టీఆర్ఎస్ పథకాలు కాంగ్రెస్‌వే: జానారెడ్డి
గుర్రంపోడు: టీఆర్ఎస్ అమలు చేస్తున్నవి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలేనని సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో నిర్వహిం చిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద ప్రజల సంక్షేమం కోసం రూపాయి కిలో బియ్యం, ఆరోగ్యశ్రీ, ఉపాధి హామీ లాంటి పథకాలు అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినవేనని, ఇప్పుడు కేసీఆర్ కొత్తగా చేసిందేమి లేదన్నారు. ఈ పథకాలు తీసేసే ధైర్యం ఎవరకీ లేదన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిందని ఎవరూ అధైర్యపడొద్దని తాను అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. తమ ఎన్నికల హామీలను టీఆర్ఎస్ కాపీ కొట్టిందని ఆరోపించారు. -
సీఈసీ ముందు పరేడ్!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం మోసాలు, ఎన్నికల అధికారుల తీరును కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)దృష్టికి తీసుకెళ్లాలని టీపీసీసీ నిర్ణయించింది. అవసరమైతే ఎన్నికల్లో పోటీ చేసిన తమ అభ్యర్థులందరినీ ఢిల్లీ తీసుకెళ్లి సీఈసీకి ఫిర్యాదు చేయించాలని యోచిస్తోంది. ప్రభుత్వం రద్దయిన నాటి నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా పక్షపాతంగా వ్యవహరించిందని, వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై విన్నవించినా పట్టించుకోలేదని సీఈసీ దృష్టికి తీసుకెళ్లాలనే నిర్ణయానికొచ్చింది. శుక్రవారం గాంధీభవన్‌లో ఎన్నికల ఓటమిపై కాంగ్రెస్ సమీక్షించింది. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నేతలు జానారెడ్డి, పొన్నం ప్రభాకర్, సునీతా లక్ష్మారెడ్డి, జీవన్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, ప్రేమ్‌సాగర్‌రావు, ఆరేపల్లి మోహన్, రమేశ్ రాథోడ్, తాహెర్‌బిన్, ఆత్రం సక్కు, అద్దంకి దయాకర్ తదితరులు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో మూడు దశలుగా సమీక్షించారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌తో పాటు ఇతర అంశాలపైనా నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. తన నియోజకవర్గం మంచిర్యాలలో 4 గంటలకే పోలింగ్ పూర్తి చేశారని, ఆ సమయంలో జరిగిన పోలింగ్ కన్నా కౌంటింగ్ సమయంలో చూపిన ఓట్ల శాతం ఎక్కువగా ఉందని ప్రేమ్‌సాగర్‌రావు వివరించారు. త్రిసభ్య కమిటీతో అధ్యయనం.. ఎన్నికల్లో ఈవీఎం మోసాలపై తేల్చేందుకు త్రిసభ్య కమిటీని నియమించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, సీనియర్ నేత ప్రేమ్‌సాగర్‌రావులతో కమిటీని ఏర్పాటు చేశారు. ధర్మపురి, కోదాడ, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం, మంచిర్యాల స్థానాల్లో పోలింగ్ స్టేషన్ల వారీగా నమోదైన ఓట్లు, కౌంటింగ్ నివేదికలను ఈ కమిటీ తెప్పించుకుని అధ్యయనం చేయనుంది. ఇక్కడ పరిశీలనలోకి వచ్చే అంశాలతో అవసరాన్ని బట్టి కోర్టులకు వెళ్లాలని నిర్ణయించింది. పోటీ చేసిన అభ్యర్థులందరితో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించి, న్యాయం చేసేలా ఒత్తిడి తేవాలని నేతలు భేటీలో నిర్ణయించారు. ఓట్ల గల్లంతుపైస్పందన కరువు... నర్సాపూర్ నియోజకవర్గంలో మధ్యాహ్నం సమయానికి 8.83 శాతం పోలింగ్ జరగ్గా, సాయంత్రానికి 70 శాతం పోలింగ్ అయినట్లు చూపారని, ఒక్కో ఓటు వేయాలంటే కనీసం నిమిషం సమయం పట్టినా, అంత తక్కువ సమయంలో ఓటింగ్ శాతం ఎలా పెరిగిందో అర్థం కావట్లేదని సునీతా లక్ష్మారెడ్డి వివరించారు. హైదరాబాద్‌లో 22 లక్షల ఓట్ల గల్లంతుపై ఎంత పోరాడినా రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టించుకోలేదని, చివరికి క్షమాపణతో సరిపెట్టిందని వివరించారు. 40 నుంచి 50 నియోజకవర్గాల్లో సిట్టింగ్ అభ్యర్థులపై తీవ్రమైన ప్రజావ్యతిరేకత ఉందని, వారెక్కడ ప్రచారానికి వెళ్లినా ప్రజలు అడ్డగించారని, అలాంటి నేతలకే 30 నుంచి 40వేల మెజారిటీలు ఎలా వచ్చాయో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. తక్కువ మెజార్టీతో ఓడిన తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం, ధర్మపురి వంటి నియోజకవర్గాల్లో వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని కోరినా పట్టించుకోలేదన్న అభిప్రాయాలను వెలిబుచ్చారు. -
జానా ఇలాకాలో టీఆర్ఎస్ తొలిసారిగా..
సాక్షిప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిం చింది. ముందస్తు ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు నాలుగు నియోజకవర్గాల్లో విజయం సాధించారు. మరో రెండు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. జిల్లాలో టీఆర్ఎస్ తొలిసారిగా నాలుగు నియోజకవర్గాల్లో ఖాతా తెరిచింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐనుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన మిర్యాలగూడ అభ్యర్థి ఎ¯.భాస్కర్‌రావు, దేవరకొండ అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్, నాగార్జునసాగర్‌లో నోముల నర్సింహయ్య, నల్లగొండలో కంచర్ల భూపాల్‌రెడ్డి గెలుపొందారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థిగా కంచర్ల రికార్డుకెక్కారు. గత ఎన్నికల్లో కంచర్ల ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఇక ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించిన కాంగ్రెస్ సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి పరాజయం పాలు కాగా, ఆయన ఇలాకాలో తొలిసారిగా టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. గత ఎన్నికల్లో జానా మీద పోటీచేసి ఓడిన నోముల నర్సింహయ్య ఈ ఎన్నికల్లో గెలుపొంది ఆయన జమానాకు తెరదించారు. జానా కోటలో గెలిచిన రెండో నేత నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డి తొలిసారిగా 1978 ఎన్నికల్లో జనతా పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రెండోసారి 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గుండెబోయిన రామ్మూర్తి యాదవ్‌పైన ఓడిపోయారు. 1994 ఓటమి తర్వాత జరిగిన వరుస ఎన్నికల్లో నాలుగు సార్లు జానా గెలుపొందారు. తిరిగి ఇరవై ఏళ్ల విరామం తర్వాతా అదే యాదవ సామాజిక వర్గానికి చెందిన నోమల నర్సింహయ్య చేతిలో జానా ఓడిపోవడం గమనార్హం. రెండు స్థానాలు కోల్పోయిన టీఆర్ఎస్ 2014 ఎన్నికల్లో తొలిసారి టీఆర్ఎస్ గెలిచిన రెం డు స్థానాలను ఈ ఎన్నికల్లో కోల్పోయింది. కమ్యూనిస్టులకు అడ్డగా అప్పటి దాకా నిలబడిన నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవగా, ఈసారి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. గతంలో ఇవే నియోజకవర్గాల నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేలుగా అరంగ్రేటం చేసిన వేములవీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి రెండోసారి ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో నకిరేకల్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చిరుమర్తి లింగయ్య ఈ ఎన్నికల్లో రెండో సారి గెలుపొందారు. అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా తొలిసారిగా విజయం సాధించా రు. కాగా, ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌పార్టీ 1967, 1972, 1978, 1983, 1999 ఎన్నికల్లో నాలుగు సార్లు విజయం సాధించింది. 2009లో మహాకూటమి పొత్తులో భాగంగా మునుగోడులో సీపీఐ గెలుపొందగా, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఓడిపోయారు. మళ్లీ మూడు ఎన్నికల విరామం తర్వాత రాజగోపాల్‌రెడ్డి రూపంలో కాంగ్రెస్‌ను విజయం వరించింది. జానా, కోమటిరెడ్డి పరాజయం... మహాకూటమి అధికారంలోకి వస్తే సీఎం రేసులో ఉన్నామని చెప్పుకున్న సీఎల్పీ మాజీ నేత కుం దూరు జానారెడ్డి, ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ కంచుకోటలుగా ఉన్న నల్లగొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో తొలిసారి టీఆర్ఎస్ఖా తా లో పడ్డాయి. 1983 నుంచి ఒక్క టర్మ్ మినహా సుధీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఉన్న ఘనత జానారెడ్డిదే. 1994 నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు గెలుస్తూ వస్తోన్న మాజీ మంత్రి, సీఎల్పీ మాజీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తొలిసారి ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన కంచర్ల భూపాల్‌రెడ్డి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొం దారు. దివగంత సీఎం వైఎస్ఆర్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేసిన ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో తన పదవికి రాజీనామా చేశారు. అయిదో సారి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డినా ఓటమి పాలయ్యారు. మిర్యాలగూడలో కారు హవా ! కాంగ్రెస్ కంచుకోటల్లో ఒకటైన మిర్యాలగూడ ని యోజకవర్గంలో సైతం కారు జోరు సాగింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలి చిన ఎన్.భాస్కర్‌రావు ఈసారి టీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచారు. ఈయన పైన బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ నియోజకవర్గంలో 13సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, ఏడు సార్లు గెలుపొందింది. సీపీఎం ఐ దు సార్లు విజ యం సాధిం చిం ది. అయితే ఈ ఎన్నికల్లో బీఎల్ఎఫ్పేరుతో సీపీఎం అభ్యర్థిగా బరిలో నిలిచిన జూలకంటిరంగారెడ్డి పదివేల ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దేవరకొండలో మూడోసారి రవీంద్ర గెలుపు దేవరకొండ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన రవీంద్రకుమార్ మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా గెలిచిన ఆయన టీఆర్ఎస్లో చేరారు. పార్టీ మారాక, ఈ సారి టీఆర్ఎస్ అభ్యర్థిగా రవీంద్రకుమార్ దేవరకొండలో గులాబీ ఖాతా తెరిచారు. 2004, 2014 ఎన్నికల్లో రవీంద్రకుమార్ కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా సీపీఐ నుంచి గెలిచారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో మహాకూటమి పొత్తులో భాగంగా సీపీఐ నుంచి పోటీ చేసిన రవీంద్ర కుమార్ ఓడిపోగా, కాంగ్రెస్ అభ్యర్థిగా బాలునాయక్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తిరిగి ఈ ఎన్నికల్లో వారిద్దరే ప్రత్యర్థులుగా బరిలో నిలిచారు.కాంగ్రెస్ నుంచి జెడ్పీ చైర్మ¯గా ఎన్నికైన బాలునాయక్ టీఆర్ఎస్లో చేరినప్పటికీ పార్టీ టికెట్ ఇవ్వకపోడంతో ఆయన సొంతగూటికి వెళ్లి టికెట్ తెచ్చుకుని పోటీ పడినా పరాజయం పాలయ్యారు. నల్లగొండ : కౌంటింగ్ కేంద్రంలో ఓట్లను లెక్కిస్తున్న అధికారులు -
ఓడిన కాంగ్రెస్ హేమాహేమీలు..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ హేమాహేమీలంతా ఓటమిపాలయ్యారు. మంగళవారం వెల్లడైన ఫలితాల్లో కారు హవా ముందు కాంగ్రెస్ సీనియర్లు నిల వలేకపోయారు. కుందూరు జానారెడ్డితోపాటు ఆ పార్టీకి చెందిన సీనియర్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డి.కె.అరుణ, టి.జీవన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, కొండా సురేఖ, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, సర్వే సత్యనారాయణ, చిన్నారెడ్డి, బలరాంనాయక్, సుదర్శన్‌రెడ్డిలకు ప్రత్యర్థుల చేతిలో భంగపాటు ఎదురైంది. జానారెడ్డిపై రెండోసారి పోటీ పడిన నోముల నర్సింహయ్య (టీఆర్ఎస్) విజయం సాధిం చగలిగారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై కూడా తన ప్రత్యర్థి భూపాల్‌రెడ్డి రెండోసారి పోటీలోనే గెలుపొందారు. దీంతో ఈసారి శాసనసభలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, వనమా వెంకటేశ్వర రావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సబితా ఇంద్రారెడ్డిలతో పాటు సీతక్క, వీరయ్య, జగ్గారెడ్డి లాంటి మాజీ ఎమ్మెల్యేలతోనే ఆ పార్టీ సరిపెట్టు కోవాల్సి వచ్చింది. వీరితోపాటు కాంగ్రెస్ పక్షాన ఆరుగురు తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. జాజుల సురేందర్ (ఎల్లారెడ్డి), కందాల ఉపేందర్‌రెడ్డి (పాలేరు), హర్షవర్దన్‌రెడ్డి (కొల్లాపూర్), హరి ప్రియానాయక్ (ఇల్లెందు), పైలట్ రోహిత్‌రెడ్డి (తాండూరు) తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (మునుగోడు) కూడా తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభలోకి ప్రవేశించనున్నారు. పదవులున్న వాళ్లంతా...! టీపీసీసీ అధ్యక్షుడు, ఆ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ మినహా కాంగ్రెస్‌లో కీలక పదవుల్లో నేతలంతా ఓటమి పాలయ్యారు. ఏఐసీసీ కార్యదర్శులుగా ఉన్న వంశీచంద్‌రెడ్డి, చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, కో చైర్మన్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్ నేత డి.కె.అరుణ తదితరులు ఓటమి పాలైన జాబితాలో ఉన్నారు. కేంద్రమంత్రులుగా పనిచేసి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్‌లకు కూడా ఓటమి తప్పలేదు. -
పాపం పెద్దాయన..!
పెక్కు శాఖల మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపు పొందిన కాంగ్రెస్ కురువృద్ధుడు కుందూరు జానారెడ్డి తన సుదీర్ఘ రాజకీయజీవితంలో రెండోసారి ఓడిపోయారు.తాజా ఎన్నికల్లో జానారెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య విజయం సాధించారు. 1983లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన వరుసగా 1983, 85, 89 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 1994లో వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో టీడీపీ అభ్యర్థి గుండెబోయిన రామ్మూర్తియాదవ్ చేతిలో 2 వేల పైచిలుకు ఓట్లతో ఓడిపోయారు. తాను ప్రచారం చేయాల్సిన పనిలేదని, ప్రచారం చేయకుండానే గెలుస్తానని చెప్పిన జానా ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం కొత్తగా ఏర్పడే ప్రభుత్వం సుపరిపాలన అందించాలి. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలి. అవి అమలు కాని పక్షంలో ఆందోళనలు జరిగే ప్రమాదం ఉంది. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయన్న విషయాన్ని ఎన్నికల సంఘానికి చెప్పినా పట్టించుకోలేదు. దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నాం. పోలైన ఓట్లకు వీవీ ప్యాట్లలో ఉన్న ఓట్లకు పొంతన లేదు. నా విజయం కోసం పార్టీ కార్యకర్తలు, నేతలు కష్టపడి పనిచేశారు. వారి కష్టాన్ని వృథాగా పోనివ్వను. నమ్మిన వారిని ఆదుకునేందుకు ఎప్పుడూ వెనుకాడబోను. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నది నా ఆకాంక్ష. పదవిరానందుకు, గెలవనందుకు బాధ లేదు. నాపై గెలిపొందిన నోముల నర్సింహయ్యకు శుభాకాంక్షలు. – జానారెడ్డి తన జీవితంలో తీరని కోరిక ఒకటి మిగిలిపోయిందని,మీరు సహకరిస్తే అది కూడా పూర్తవుతుందని నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు జానా గతంలో చెప్పారు. సీఎం కావాలన్న ఆయన కోరిక తీరకపోగా, సాగర్ ప్రజానీకం ఆయనను ఓటమిపాలు చేయడం గమనార్హం. – సాక్షి, హైదరాబాద్ -
‘ప్రజా తీర్పును గౌరవిస్తాం’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని సీఎల్పీ మాజీ నేత, మాజీ హోంమంత్రి జానారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్ఎస్ చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొన్న కాంగ్రెస్.. ఈవీఎంలపై అనుమానాలను వ్యక్తం చేసింది. ఇప్పటికే దీనిపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సందేహాలను వ్యక్తం చేయగా, జానారెడ్డి సైతం ఈవీఎంలలోని వీవీ ప్యాట్స్ స్లిప్‌లను లెక్కించాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ ఎన్నికల కమిషన్ దానికి సమ్మతి తెలపకపోతే, కోర్టుల్లోనే తేల్చుకుంటామన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా.. లేకున్నా ప్రజా సేవ చేస్తానని జానారెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో జానారెడ్డి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన జానారెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య చేతిలో పరాజయం చెందారు. ఏడువేలకు పైగా ఓట్ల తేడాతో జానారెడ్డి ఓటమి చవిచూశారు. -
కేసీఆర్‌ను చిత్తుగా ఓడించాలి: జానారెడ్డి
సాక్షి, పెద్దవూర : నియంతలా వ్యహరిస్తున్న కేసీఆర్‌ను చిత్తుగా ఓడించాలని సీఎల్పీ మాజీ నేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు జానారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చలకుర్తి, సంగారం, ముసలమ్మచెట్టు, బట్టుగూడెం, పెద్దవూర గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. మాటల గారడీతో నాడు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నేడు డబ్బుల మూటలతో మళ్లీ అధికారంలోకి రావడానికి కుట్రలు చేస్తున్నాడని అన్నారు. కేసీఆర్ ప్రజలను బాగుపెట్టడానికి కాదని తన కుటుంబాన్ని స్వర్ణయుగం చేసుకోవడానికే అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి అవస్థల పాలైంది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. గత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకే టీఆర్ఎస్ పేర్లు మార్చి ఏదో గొప్ప చేశామని జబ్బలు చర్చుకుంటుందని విమర్శించారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ చర్యలు విపరీతంగా ఉంటాయని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, ప్రజలను రక్షించి వారి ఆత్మగౌరవాన్ని కాపాడి హద్దుమీరిన అహంకార పూరితుడై నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్‌ను గద్దె దింపడానికే ఉత్తర, దక్షిణాలుగా ఉన్న టీడీపీ, కాంగ్రెస్‌లు ప్రజాకూటమిగా ఏర్పాడినట్లు తెలిపారు. జానారెడ్డి అంటే అన్ని కులాలు, మతాల వాడని అన్నారు. ఓట్ల కోసం కులాల పేరుతో రెచ్చగొట్టి ఊర్ల పేర్లు, బజార్లు తెలియని వారు వస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ, రూ.3వేల నిరుద్యోగ భృతి, ఉచితంగా 7 కిలోల సన్నబియ్యం అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ కడారి అంజయ్యయాదవ్, జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, జానా తనయుడు కుందూరు రఘువీర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు రమావత్ శంకర్‌నాయక్, అబ్బిడి కృష్ణారెడ్డి, కూరాకుల అంతయ్య, గడ్డంపల్లి వినయ్‌రెడ్డి, కర్న దామోదర్‌రెడ్డి, పబ్బు యాదగిరిగౌడ్, కర్నాటి పద్మారెడ్డి, నర్సింహారెడ్డి, కూన్‌రెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ కత్తి రమణమ్మవెంకట్రెడ్డి, సంజీవరెడ్డి, ఉపేందర్‌రెడ్డి, వెంకటయ్య, టీడీపీ నాయకులు దేవసాని శ్రీనివాస్‌రెడ్డి, బాబురావునాయక్ పాల్గొన్నారు. జానా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక: మండలంలోని చలకుర్తి, నీమానాయక్‌తండా, కుంకుడుచెట్టుతండా, మల్లేవానికుంటతండా, రామ్మూర్తికాలనీ, బట్టుగూడెం, సంగారం గ్రామాలకు చెందిన పలువురు టీఆర్ఎస్ నుంచి సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. పార్టీలో చేరిన వారిలో తుమ్మలపల్లి శ్రీనివాస్‌రెడ్డి, గోదాసు నారాయణరెడ్డి, సర్థార్‌నాయక్ ఉన్నారు. మరిన్ని వార్తాలు... -
మర్రికి షాక్.. జానాకు సస్పెన్స్.. నెగ్గని ఉత్తమ్!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డికి గట్టి షాక్ తగిలింది. న్యాయపోరాటాలతో అధికార టీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ మొండిచేయి చూపింది. ఆయన ఆశిస్తున్న సనత్‌నగర్ సీటును మహాకూటమి పొత్తుల్లో భాగంగా మిత్రపక్షం టీడీపీకి కట్టబెట్టింది. ఇక్కడ కూన వెంకటేశ్‌గౌడ్‌కు సీటు కట్టబెడుతున్నట్టు టీటీడీపీ అధికారికంగా ప్రకటించింది. దీంతో కినుక వహించిన మర్రి శశిధర్‌రెడ్డి భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. తనకు ప్రత్యామ్నాయ దారులు ఉన్నాయని, అనుచరులతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటానని మర్రి చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మూడో జాబితా విడుదల చేసినప్పటికీ.. ఇంకా ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మిర్యాలగూడ, సికింద్రాబాద్, దేవరకద్ర, మక్తల్, వరంగల్ ఈస్ట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. మిర్యాలగూడ సీటును తన కొడుకుకు కట్టబెట్టాలని సీనియర్ నేత జానారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మిర్యాలగూడ సీటు కేటాయింపుపై సస్సెన్స్ కొనసాగుతోంది. మహాకూటమి పొత్తుల్లో భాగంగా ఈ సీటును తెలంగాణ జనమితికి కేటాయిస్తారని వినిపిస్తోంది. ఎట్టకేలకు జనగామ సీటు విషయంలో పొన్నాల లక్ష్మయ్య తన పంతం నెగ్గించుకోగా.. అద్దంకి దయాకర్ విషయంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట నెగ్గకపోవడం గమనార్హం. ఉత్తమ్ నిరాకరించినప్పటికీ.. తుంగతుర్తి స్థానంలో దయాకర్‌కు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బాల్కొండలో సీనియర్ నాయకురాలు అన్నపూర్ణమ్మ కొడుకుకు చాన్స్ దక్కలేదు. ఇక్కడి నుంచి ఈరపత్రి అనిల్‌కు మరోసారి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. ఎల్బీనగర్ సీటును టీటీడీపీ కోరినప్పటికీ.. ఆ ప్రతిపాదనను తిరస్కరించి.. కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని సుధీర్‌రెడ్డికి కట్టబెట్టింది. -
రాహుల్ గాంధీని కలిసిన జానారెడ్డి కుమారుడు
సాక్షి, న్యూఢిల్లీ: పెండింగ్‌లో ఉన్న స్థానాలకు టికెట్ ఆశిస్తున్న పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో పలువురు ఆశావహులు శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. వీరిలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘవీర్, అద్దంకి దయాకర్లతో పాటు ఇల్లందు, తుంగతుర్తి, హుజురాబాద్, మిర్యాలగూడ టికెట్లు ఆశిస్తున్న పలువురు నాయకులు ఉన్నారు. రాహుల్ వీరితో పలు అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. ఒకరిపై ఒకరు పోటీకి దిగవద్దని రాహుల్ వారికి సూచించారు. టికెట్ ఎవరికిచ్చినా పార్టీ కోసం పనిచేయాలని కోరారు. మరోవైపు ఇప్పటికే రెండు జాబితాల్లో 75 స్థానాలకు టికెట్లను ప్రకటించిన కాంగ్రెస్.. శనివారం మిగతా 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ఢిల్లీలో తాజా పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ ఆర్సీ కుంతియా మాట్లాడుతూ.. ‘ఆదిలాబాద్, ఖమ్మం జిలాల్ల అభ్యర్థులతో రాహుల్ గాంధీ మాట్లాడారు. గెలిచే సత్తా ఉన్నవారికే టికెట్లు ఇవ్వనున్నట్టు రాహుల్ తెలిపారు. ఇల్లందు, తుంగతుర్తి, హుజురాబాద్, మిర్యాలగూడ నియోజకవర్గాలకు సంబంధించి రాహుల్ అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. గెలిచే అవకాశాలు, అక్కడి స్థానిక పరిస్థితుల గురించి నాయకులతో చర్చించారు. రేపు మిగతా స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామ’ని తెలిపారు. -
చంద్రబాబు జోక్యాన్ని సహించం
-
అప్పుడు మాటలు.. ఇప్పుడు మూటలు!
సాక్షి, హైదరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఇప్పుడు మూటలు విప్పుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఎద్దేవా చేశారు. ఏ కారణంతో తొమ్మిది నెలల ముందు ఎన్నికలకు వెళ్లారో ఇప్పటివరకు చెప్పలేకపోవడం అసమర్థతే అని దుయ్యబట్టారు. సెంట్‌మెంట్‌తో ప్రజలను రెచ్చగొట్టి మరోసారి ఓట్లు దండుకునేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని ఆరోపించారు. పొత్తుల వ్యవహారం, సీట్ల సర్దుబాటుపై శుక్రవారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. పొత్తులపై శనివారం పూర్తిస్థాయిలో స్పష్టత వస్తుందని, తమ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుబాయి పర్యటనలో ఉండటం వల్ల ఇంకా ఖరారు కాలేదని వివరించారు. అభ్యర్థుల జాబితా ఖరారు కాగానే హైదరాబాద్‌లో విడుదల చేస్తామని, పార్టీ కేంద్ర కార్యాలయంలో ఢిల్లీలో ఉండటం వల్ల అక్కడ విడుదల చేయడం కూడా తప్పేమీ కాదంటూ టీఆర్ఎస్ ఆరోపణలను కొట్టిపారేశారు. బీసీలకు సీట్ల విషయంలో అన్యాయం జరుగుతోందంటూ వచ్చిన ఆరోపణలపై జానారెడ్డి క్లారిటీ ఇచ్చారు. కేవలం కాం గ్రెస్ పార్టీ తరఫున కాకుండా భాగస్వామ్య పార్టీల్లో కూడా బీసీలున్నారని, గతంలో ఇచ్చినట్టుగానే బీసీలకు సీట్లు కేటాయింపు ఉంటుందని వివరణ ఇచ్చారు. జనగామ నుంచి టీజేఎస్ తరఫున కోదండరాం పోటీ చేస్తారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, జనగామ సీటు పొన్నాల లక్ష్మయ్యకే ఇస్తారని భావిస్తున్నట్టు జానారెడ్డి పేర్కొన్నారు. పొత్తుల్లో భాగంగా ఎవరు ఏ స్థానం నుంచి పోటీ చేయాలన్నదానిపై శనివారం తుది చర్చలుంటా యని, ఆ తర్వాత పూర్తిస్థాయిలో భాగస్వామ్య పక్షాలకు స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. అవి నాన్సెన్స్ వ్యాఖ్యలు... మహాకూటమి మొత్తం చంద్రబాబు చేతిలో ఉందని వస్తున్న వ్యాఖ్యలపై జానారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. అవి నాన్సెన్స్ వ్యాఖ్యలని, టీఆర్ఎస్ నేతలు పనిగట్టుకొని ఆరోపించినంత మాత్రాన తమకేం ఇబ్బంది లేదని స్పష్టంచేశారు. పొత్తుల కమిటీ చైర్మన్ తాను కాదని, కేవలం పార్టీలతో చర్చించాలని సూచించిన మేరకే టీజేఎస్, సీపీఐ, టీడీపీతో చర్చించానని తెలిపారు. దేశంలో ఏ పార్టీ కూడా మూడు నెలల ముందు టికెట్లు ప్రకటించలేదని, కేసీఆర్‌కు అధికార దాహం ఉండటం వల్లే ముందస్తుకు వెళ్లి టికెట్లు కూడా ముందస్తుగా ప్రకటించారని విమర్శించారు. కేసీఆర్ ఫ్రంట్ పేరుతో ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్ తదితర ప్రాంతాల్లో తిరిగారని, కానీ చివరకు అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్కు వంద సీట్లు రాకపోతే కేటీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న సవాల్‌పై జానారెడ్డి స్పందిస్తూ.. పని అయిపోతే ఎవరైనా సన్యాసమే తీసుకుంటారని చమత్కరించారు. సర్వేలపై నమ్మకం లేదు... ఇండియాటుడే నిర్వహించిన సర్వేను జర్నలిస్టులు ప్రస్తావించగా.. అమెరికాలో జరిగిన ఎన్నికల సందర్భంలో ఇదే జాతీయ మీడియా సర్వేలో హిల్లరీ క్లింటన్ గెలుస్తుందని చెప్పారని, కానీ చివరకు ఎవరు గెలిచారో చూసుకోవాలని జానారెడ్డి వ్యాఖ్యానించారు. తమిళనాడులో గత ఎన్నికల సర్వేల్లో డీఎంకే గెలుస్తుందని వచ్చినా, చివరకు అన్నాడీఎంకే గెలిచిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు సీఎం అయినా అభ్యంతరం లేదని, కుటుంబంలో రెండు సీట్ల వ్యవహారంపై అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని పేర్కొన్నారు. తన కుమారుడికి మిర్యాలగూడ టికెట్ విషయంలో అధిష్టానం ఆదేశాల ప్రకారమే వెళ్తామని, గతంలో కూడా అధిష్టానం ఆదేశంతో పోటీచేయలేదని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో బాబు జోక్యం ఉండదని, ఉంటే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను ఎవరు అడ్డుకున్నా ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ప్రాజెక్టుల విషయంలో బాబు లేఖలు రాశారని ఆరోపిస్తున్న కేసీఆర్‌కు, చంద్రబాబుతో మాట్లాడుకొని ఒప్పించే దైర్యం లేదని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ పోలవరంతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాజెక్టులపై లేఖలు రాయలేదా అని ప్రశ్నించారు. మా ఇంటికే బాబు వచ్చాడు... చంద్రబాబును కలిసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా వేచి చూశారని, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటూ జర్నలిస్టులు ప్రశ్నించగా, జానారెడ్డి స్పందిస్తూ.. ‘‘మేమేమీ చంద్రబాబు ఇంటికి గానీ కార్యాలయానికి గానీ వెళ్లలేదు. ఆయనే మా పార్టీ అధినేత రాహుల్ ఇంటికి వచ్చారు. రాహుల్ ఇల్లంటే మా ఇల్లే. అక్కడ చంద్రబాబు ఉండటం వల్ల కలిశాం. అంతేగానీ మేమేమీ బాబు కోసం వెయిట్ చేయలేదు. ఈ విషయంలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారు. కూటమిలో టీడీపీ భాగస్వామ్య పార్టీ. అలాంటప్పుడు చంద్రబాబుతో చర్చించడం తప్పెలా అవుతుంది’’అని ప్రశ్నించారు. ఏపీ భవన్లో ఉన్నప్పుడు కూడా ఒకే చాంబర్లో కలిసి చర్చించామని తెలిపారు. ఒకప్పుడు తన ఇంటి ఎదుట కూడా చాలామంది నేతలు నిలబడ్డారని, కావాలంటే పాత ఫొటోలు రిలీజ్ చేస్తా చూసుకోవాలంటూ టీఆర్ఎస్కు బదులిచ్చారు. నెమ్మదిగా వెళ్లిన తాబేలుదే విజయం.. ఎన్నికల్లో పరిగెత్తిన కుందేలు పడుకోబోతోందని, నెమ్మదిగా వెళ్తున్న తాబేలు గెలుస్తోందని జానారెడ్డి జోస్యం చెప్పారు. టికెట్లపరంగా అందరికీ అవకాశాలు ఇవ్వాలనుకున్నా పొత్తుల వల్ల సమస్య వచ్చిందన్నారు. ఓయూ విద్యార్థి నేతలకు ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టికెట్ల కేటాయింపు ఉండనుందని తెలిపారు. తన కొడుకైనా, ఇంకెవరైనా గెలుపొందే అవకాశాలుంటేనే ఎంపిక చేస్తున్నామని స్పష్టంచేశారు. ఈ సారి ఎన్నికల్లో కేసీఆర్ రికార్డు బ్రేక్ చేస్తామని, ఎన్నో హామీలిచ్చి అమలుచేసిన ఎన్టీఆర్కే 1989లో ఓటమి తప్పలేదని గుర్తుచేశారు. -
కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో గందరగోళం
-
టీఆర్ఎస్కు లాగులు ఊడుతాయి : జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు! నల్గొండలో ప్రచారానికి వచ్చి కాంగ్రెస్ గోసీలు ఊడిపోతాయని అన్నారని, అధికారం కోల్పోతే టీఆర్ఎస్కు లాగులు ఊడుతాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేమన్న భయంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వచ్చారని పేర్కొన్నారు. రుణమాఫీ ఏకకాలంలో చేయకపోవటం వల్ల వడ్డీ భారం రైతులపై పడిందన్నారు. అసెంబ్లీలో నిలదీస్తే వడ్డీ మాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్ మాట నిలుపుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకంతో 2లక్షలు ఇచ్చిందని, తద్వారా లబ్ధిపొందిన వారు భూములు అమ్ముకోకుండా కాంగ్రెస్ కాపాడిందని చెప్పారు. తాము చేసిన సంక్షేమ పథకాల కింద రైతు బంధు పథకం ఏ పాటిది అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఆత్మగౌరవం కోల్పోయామని, కేసీఆర్‌కు అహంకారం ఎక్కువైందని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు అధికారం లేకపోతే అహంకారం పోతుందని అన్నారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే అణిచివేత ధోరణి అవలంభిస్తారని చెప్పారు. కేసీఆర్ ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండకూడదని ప్రజలు అనుకుంటూన్నారని, కేసీఆర్‌ను గద్దెదించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. -
సీట్లు.. నిధులు.. సగమివ్వాలి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా కూటమి కట్టిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను తన వైపు మళ్లించుకునే వ్యూహాలకు పదును పెట్టింది. జనాభాలో సగభాగమున్న బీసీల ఓట్లను అనుకూలంగా మార్చుకునే క్రమంలో శుక్రవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, పలు బీసీ సంఘాల ప్రతినిధులతో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. దాదాపు 2 గంటల పాటు చర్చలు జరిపి బీసీల ప్రధాన డిమాండ్లను తెలుసుకున్నారు. జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు సగం సీట్లివ్వాలని, నిధుల కేటాయింపులో సమాన వాటా ఇవ్వాలని ఆర్.కృష్ణయ్య ప్రతిపాదించారు. అరాచక పాలనను అంతం చేద్దాం: జానా రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక, అప్రజాస్వామిక పాలనను అంతం చేసేందుకు అందరూ కలసి రావాలని జానారెడ్డి కోరారు. ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన సీఎం కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. బీసీ సంఘాల ప్రతినిధులతో సమావేశం అనంతరం వారితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వెనకబడిన వర్గాలకు న్యాయం చేయడంలో అగ్రభాగాన ఉంటుందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. టీఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టోపై స్పందిస్తూ గత ఆర్నెల్లుగా కాంగ్రెస్ చెబుతున్న అంశాలనే టీఆర్ఎస్ మేనిఫెస్టోలో చేర్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రకటించిన హామీలతో దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్ సరిపోదన్న కేసీఆర్, కేటీఆర్‌లు ఇప్పుడు అవే హామీలను ఎలా కాపీ కొట్టారని ప్రశ్నించారు. టీఆర్ఎస్పై ప్రజల్లో విశ్వసనీయత లేదని.. అందుకే అందరిని ఆకట్టుకునేందుకు కేసీఆర్ ఈ పనిచేశారని ఆరోపించారు. ప్రజలను భ్రమపెట్టి, మభ్యపెట్టే విధానం కాంగ్రెస్‌కు లేదని జానా వెల్లడించారు. ప్రధాన డిమాండ్లివే.. 217 అంశాలతో కూడిన బీసీ డిక్లరేషన్ ప్రకటన, రూ.20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్, బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్లకు వచ్చిన దరఖాస్తులన్నీంటి పరిష్కారం, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు, ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్, క్రీమీలేయర్ ఎత్తివేత.. లాంటి ప్రధాన డిమాండ్లను కృష్ణయ్య జానారెడ్డికి వివరించారు. దీనిపై ఆయన స్పంది స్తూ టీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ సీట్లిచ్చేలా కృషి చేస్తామని హామీనిచ్చారు. డిమాండ్లపై మేనిఫెస్టో కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బీసీ సంఘాల ప్రతినిధులకు చెప్పారు. బీసీలకు సగం సీట్లు ఇవ్వండి: జాజుల సాక్షి, హైదరాబాద్: ఆరవై ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను గౌర వించి తెలంగాణ ఇచ్చినట్లు.. ఈ ఎన్నికల్లో బీసీలకు సగం సీట్లు ఇవ్వాలని ఏఐసీసీ అధ్యక్షు డు రాహుల్‌గాంధీని బీసీ సంక్షే మ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరా రు. మేనిఫెస్టో, రాయితీలు, సబ్సిడీలను చూసి మోసపోయేందుకు బీసీలు సిద్ధంగా లేరని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాధికారంలో బీసీలకు వాటా కల్పించాలని, అప్పుడే బీసీ యువత ఓట్లు వేసేందుకు ముం దుకు వస్తారని పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీలో బీసీ వర్గానికి చెందిన 24 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు ఉన్నారని జాజుల తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయంగా బీసీలకు అన్యాయం జరుగుతుందని ఓ ప్రకటనలో వాపోయారు. -
వారంలో పొత్తులు ఖరారు..!
సాక్షి, నాగార్జునసాగర్ : మహాకూటమి పొత్తులు వారం రోజుల్లో ఖరా రవుతాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి తెలిపారు. కలిసివచ్చే పార్టీలతో చర్చలు సాగుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. నాగార్జునసాగర్‌లోని తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నెలాఖరునాటికి అభ్యర్థుల జాబి తా ను పూర్తి చేసి ప్రకటించనున్నట్టు జానారెడ్డి చెప్పారు. రాష్ట్రంలో నాలుగేళ్లు సాగిన నియంతృత్వ, దోపిడీ పాలనను అంతమొందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.నాలుగేళ్లు దోచుకున్న సొమ్ముతోనే టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి విని యోగిస్తుందని ఆయన ఆరోపించారు. ప్రజలకు డబ్బులిచ్చి స భలకు రప్పించుకుంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు.ఆత్మగౌరవమంటూ గద్దెనెక్కిన ప్రజలను ముంచిన టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ది దిగజారుడు రాజకీయం ఆపద్ధరమ్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ది దిగజారుడు రాజకీయమని జానారెడ్డి ధ్వజమెత్తారు. అందుకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను కాపీ కొట్టడమే నిలువెత్తు నిదర్శనమన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలనే కేసీఆర్ పేర్లు మార్చి అమలు చేశారని విమర్శించారు. ఆ ప్రభుత్వ హయాంలో కొత్తగా ఏర్పాటు చేసిన పథకాలన్నీ విఫలమయ్యాయన్నారు.డబుల్బెడ్రూం, దళితులకు మూడు ఎకరాల భూమి, ముస్లిం, ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపు తదితర ఎన్నికల హామీలన్నీ అమలు చేయలేక ప్రజల వద్దకు పోతే ఈసడించుకుని తిరగబడుతారనే భావనతోనే ముందస్తు ఎన్నికలకు పోయారన్నారు. కేవలం అధికారం కోసమే ప్రజలను మభ్యపెట్టేందుకు కొత్త పథకాలు ప్రకటిస్తూ వాగ్దానాలు చేస్తున్నారన్నారు. ప్రజలు కేసీఆర్‌ను నమ్మే స్థితిలో లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో అధిక స్థానాలు కైవసం చేసుకుని కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
మిర్యాలగూడ ఎన్నికల్లో గురుశిష్యులే ప్రత్యర్థులు!
-
మిస్టర్ కేసీఆర్.. ఊడేదీ మీవాళ్ల లాగులే!
త్రిపురారం (నాగార్జునసాగర్): ‘కేసీఆర్ వివిధ సభల్లో కాంగ్రెస్ నేతల గోచీలు ఊడగొడతామని అం టున్నాడు. మిస్టర్ కేసీఆర్.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతల లాగులు ఊడగొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నువ్వు.. విపక్ష పార్టీల నాయకులను ఎగ తాళి చేస్తూ గౌరవం లేకుండా నోటికి వచ్చినట్లు తిడు తున్నావు. నువ్వో సంస్కార హీనుడివి’ అని సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి ఘాటుగా విమర్శలు చేశారు. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలకేంద్రం లో గురువారం జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ నిత్యం మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. సచివాలయానికి రాకుండా ఉన్న సీఎం దేశంలో మరెవరూ లేరని ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట అని, ఆత్మగౌరవం లేని వ్యక్తి అని జానారెడ్డి ధ్వజమెత్తారు. సాగితే సాగు మల్లయ్య.. లేకపోతే బోడ మల్లయ్యలాగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నా రు. తెలంగాణ ఇస్తే మీ వెంటే ఉంటానని ప్రమాణం చేశారన్నారు. అనేక రకాల అవసరాలను ఆసరా చేసుకొని కాంగ్రెస్‌ను మోసం చేసిన ఘనుడు కేసీఆర్ అని ధ్వజమెత్తారు. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్నారన్నారు. జనా లకు డబ్బిచ్చి కొని సభలకు తరలిస్తున్నారన్నారు. -
ఒప్పించి మెప్పించే నైపుణ్యం జానారెడ్డిది
సాక్షి,హైదరాబాద్: అందరినీ ఒప్పించి మెప్పించగల అజాత శత్రువు జానారెడ్డి అని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అభివర్ణించారు. ఆయన ఒక సమర్థవంతమైన శాసనసభ్యుడు, అన్ని విషయాలపై అవగాహన పెంచుకొని సరైన రీతిలో సమాధానాలు ఇవ్వడంలో దిట్ట అని ప్రశంసించారు. బుధవారం గాంధీ భవన్‌లోని ఇందిరాభవన్‌లో ప్రెస్ ఆకాడమీ మాజీ చైర్మన్ తిరుమలగిరి సురేందర్ తాజా మాజీ సీఎల్పీ నేత కె.జానారెడ్డి గురించి రాసిన ‘అజాత–శత్రువు’పుస్తకాన్ని రోశయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జానారెడ్డిపై రాసిన పుస్తకం చిన్నదైనా అందులో ఎంతో విషయం ఉందని రచయితను అభినందించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎవ్వరిని నొప్పించని మనస్తత్వం జానారెడ్డిదన్నారు. తెలుగు రాష్ట్రాలలో జానారెడ్డి గురించి తెలియని వ్యక్తి ఉండరని, రాష్ట్రంలోనే సుదీర్ఘ కాలం పాటు మంత్రి పదవులు నిర్వహించారన్నారు. కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి మాట్లాడుతూ జానారెడ్డి ప్రత్యేక వ్యక్తిత్వం గల వ్యక్తి అన్నారు. రాజకీయాల్లో అజాత–శత్రువుగా ఉండడం ఎంతముఖ్యమో..అవసరమైనప్పుడు ధర్మాగ్రహం ప్రదర్శించడం అంతే అవసరమన్నారు. రాష్ట్రంలో అధర్మ స్థితి ఉందని, మెత్తగా మెల్లగా మాట్లాడితే బలహీనతగా చూస్తారని అందుకే అప్పుడప్పుడు దూకుడు పెంచాలని జానాకు సూచించారు. సీఎం పదవిని తిరస్కరించారు... తెలంగాణ ఉద్యమం కీలక దశలో ఉన్నప్పుడు తమ పార్టీ అధిష్టానం జానారెడ్డిని సీఎం పదవి చేపట్టాలని కోరితే ఆయన తిరస్కరించారని శాసనమండలిలో కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ వెల్లడించారు.తనకు పదవి వస్తే తెలంగాణ రాదని భావించి ఆ పదవిని త్యాగం చేశారని అన్నారు. కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ 16 శాఖలకు మంత్రిగా వ్యవహరించిన అనుభవశీలి జానారెడ్డి అని కొనియాడారు. తుదివరకూ ప్రజోపయోగ కార్యక్రమాలకు.. ప్రజలకు ఉపయోగపడే వ్యక్తిగా అంతిమ దశ వరకు కొనసాగాలని ఉందని జానారెడ్డి మాట్లాడుతూ అన్నారు. అందరి ఆశీర్వాదం, దీవెనలు ఉన్నంత వరకు ఇలాగే ఉంటానని వెల్లడించారు. తన రాజకీయ గురువు కె.వి.సత్యనారాయణ ఈ పుస్తక ఆవిష్కరణకు రావడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా జానారెడ్డి చెప్పారు. ఒక దశలో తన మిత్రుడు రామానుజాచారి మంత్రి అవుతావని జోస్యం చెప్పారని, ఆ తరుణంలో టీడీపీ ఆవిర్భావం కావడం, దానిలో భాగస్వామిని కావడం, తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడం, మంత్రి కావడం అనూహ్యంగా జరిగిపోయిందని అప్పటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచే ఎన్నికల శంఖారావం
సాక్షి, హైదరాబాద్: దేశంలోని అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదోది, తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక శక్తి పీఠమైన జోగుళాంబ సన్నిధి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తోంది. గురువారం ఉదయం 10 గంటలకు జోగుళాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి లాంఛనంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని టీపీసీసీ నిర్ణయించింది. గురువారం గురు బలం కలిసి వస్తుందని, కార్యసాధనకు మంచి రోజనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి. జోగుళాంబ సన్నిధిలో పూజలు నిర్వహించిన అనంతరం అలంపూర్ పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం శాంతినగర్ చౌరస్తా, ఐజ మున్సిపాలిటీలో రోడ్ షోలు నిర్వహించిన తర్వాత మాజీ మంత్రి డీకే అరుణ ప్రాతినిధ్యం వహిస్తున్న గద్వాల నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. అక్కడ జములమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సాయంత్రం 6 గంటలకు పట్టణంలోని రాజీవ్‌చౌక్ వద్ద భారీ బహిరంగ సభలో టీపీసీసీ నేతలు పాల్గొంటారు. ప్రచార కార్యక్రమాన్ని గురువారం లాంఛనంగా మాత్రమే ప్రారంభిస్తున్నామని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ప్రచారానికి సంబంధించిన తుది షెడ్యూల్‌ను రెండు, మూడ్రోజుల్లో వెల్లడిస్తామని చెప్పడం గమనార్హం. హెలికాప్టర్లో అలంపూర్‌కు.. ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా అలంపూర్‌కు హెలికాప్టర్లో వెళ్లనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క, టీపీసీసీ ముఖ్య నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ, విజయశాంతి, పొన్నం ప్రభాకర్, వి.హనుమంతరావు, మహ్మద్ సలీంలు హెలికాప్టర్లో వెళ్లి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. ఆగమేఘాల మీద ఏర్పాట్లు.. తిథి పరంగా గురువారం దశమి కావడం, తర్వాత 4 రోజులు ముహూర్తం అంత బాగా లేకపోవడంతో నేటి నుంచే ప్రచారం ప్రారంభించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముఖ్యులు నిర్ణయించారు. దీంతో డీకే.అరుణ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కు సమాచారమిచ్చారు. అలంపూర్‌లో ప్రత్యేక పూజలు, భారీ బహిరంగ సభ కోసం సంపత్ ఆధ్వర్యంలో ఆగమేఘాల మీద ఏర్పాట్లు జరుగుతున్నాయి. గద్వాల సభ కోసం డీకే.అరుణ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
‘అక్కడ దాడులు చేస్తే వందల కోట్లు దొరుకుతాయి’
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్నాయకులు తప్పుబట్టారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసానికి చేరుకున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డిలు ఈ దాడులను ఖండించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అణచివేత దోరణి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు గళమెత్తినా వారిని టార్గెట్ చేస్తూ కేసులతో వేధిస్తున్నారని విమర్శించారు. కర్ణాటక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు డీకే శివకుమార్‌పై ఐటీ దాడులను యావత్ దేశం చూసిందన్నారు. ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డిని కేంద్ర సంస్థల సహాకారంతో కేసీఆర్ ఎలా ఇబ్బందులు పెట్టి, భయభ్రాంతులకు గురిచేస్తున్నారో ప్రజలందరు గమనించాలని కోరారు. ఎన్నికల వేళ అకారణంగా ఇంట్లో ఎవరు లేనప్పుడు సోదాలు నిర్వహించటాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. నిజంగా ఐటీ శాఖకు డబ్బులు కావాలంటే టీఆర్ఎస్ కార్యలయం, కేసీఆర్ నివాసంపై రైడ్ చేయాలని.. అక్కడ అడ్డగోలుగా దోచుకున్న వందల కోట్లు దొరుకుతాయని ఆరోపించారు. అక్రమ కేసులతో కాంగ్రెస్ శ్రేణులను భయపెడతామంటే.. భయపడేది లేదని.. రెట్టించిన ధైర్యంతో కొట్లాడతామని తెలిపారు. ప్రతిపక్షాల గొంతు నొక్కి, అణచివేసేందుకు జరిగే దాడులను తిప్పి కొడతామని పేర్కొన్నారు. రేవంత్ ఇంటిపై జరుగుతున్న దాడులను.. తెలంగాణ సమాజంపై, తెలంగాణ ప్రజల మీద జరుగుతున్నవిగా ఆయన పేర్కొన్నారు. మోదీతో కుదుర్చుకున్న అంతర్గత ఒప్పందంతోనే దాడులు.. జానారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉన్నవారిని అణచివేసే విధానాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఏర్పరుచుకున్న అంతర్గత ఒప్పందంతోనే కేసీఆర్ ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. చట్టబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ, ఇక్కడ కేసీఆర్ ఒకేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యవాదుల మనుగడ కొనసాగాలంటే ఈ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి రాకుండా చేయాలని ప్రజలను కోరారు. ఇలాంటి దాడులకు కాంగ్రెస్ భయపడదని స్పష్టం చేశారు. మాల్దీవుల్లో ప్రతిపక్షాలను అణగదొక్కిన అక్కడి అధ్యక్షుడు ఓటమిపాలయ్యారని.. తెలంగాణలో కూడా అదే పునరావృతం అవుతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ నాయకులపై కక్ష సాధింపు మరోవైపు కాంగ్రెస్ శ్రేణులపై జరుగుతున్న దాడులపై ఆ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులపై కక్ష సాధింపులకు దిగుతోందని విమర్శించారు. ఇటీవల జగ్గారెడ్డిపైన పాత కేసులు తిరగదోడి, నేడు రేవంత్‌రెడ్డిపైన ఐటీ దాడులు జరిపి ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో కేసీఆర్ ఢిల్లీలో 40 నిమిషాలు ప్రత్యేంగా భేటీ అయ్యారని.. అప్పుడే ఈ దాడులకు ప్రణాళిక సిద్ధం అయిందని ఆరోపించారు. ప్రజల్లో టీఆర్ఎస్పైన తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇదీ పునరావృతం అవుతుందని హెచ్చరించారు. తాము కూడా టీఆర్ఎస్ బొక్కలు తవ్వడం స్టార్ట్ చేస్తామని తెలిపారు. అంతేకాకుండా మెట్రో రైల్ ఓపెనింగ్ సమయంలో గవర్నర్ నరసింహాన్‌తో కలిసి అపద్ధర్మ మంత్రి కేటీఆర్ తొక్కడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ దగ్గరకు వస్తుంటే టీఆర్ఎస్ పేరుపైన ప్రకటనలు ఇవ్వడం ఎంటని ప్రశ్నించారు. -
రాక్షస పాలన త్వరలో అంతం: ఉత్తమ్
పరిగి: మరో రెండు నెలల్లో దుష్ట రాక్షస టీఆర్ఎస్ పాలన అంతమై రాష్ట్రానికి పట్టిన శని విరగడ కానుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. పరిగిలోని తాజా మాజీ ఎమ్మెల్యే టి. రామ్మోహన్‌రెడ్డి నివాసంలో ఆదివారం నిర్వహించిన చండీయాగానికి ఆయన సతీసమేతంగా హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అ«ధికార పార్టీ నేతలు, వారి అండతో కొందరు అధికారు లు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని, తాము అధికారంలోకి రాగానే వాళ్ల పని పడతామని హెచ్చరించారు. కేసీఆర్, మోదీ ఎన్నికల కమిషన్‌తో కుమ్మక్కై తొండి ఆట ఆడుతున్నారన్నారు. కేసీఆర్ తన గోతిని తానే తొమ్మిది నెలల ముందు తవ్వుకున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల కోరికను నెరవేరుస్తామని స్పష్టం చేశా రు. కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుని దాచుకోవటం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. దళిత, గిరిజనులకు రేషన్ సరుకులన్నీ ఉచితంగా ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులు చెల్లిస్తామన్నారు. ఆ హామీ గుర్తులేదు.. గిరిజన రిజర్వేషన్లపై మొదటి సంతకమన్న కేసీఆర్.. నేటికి 10 వేల సంతకాలు చేసినా ఆ హామీ మాత్రం గుర్తుకు రావడం లేదని ఉత్తమ్ ఆరోపిం చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గిరిజన రిజర్వేషన్లను అమలు చేస్తామన్నారు. బీసీ సబ్‌ప్లాన్ అమలు చేస్తామన్నారు. మహిళా సంఘాలకు రూ.10 లక్షల వడ్డీలేని రుణాలతో పాటు ప్రతి సంఘానికి రూ.లక్ష గ్రాంటు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ సునీతాసంపత్, పద్మావతిరెడ్డి, పైలట్ రోహిత్‌రెడ్డి, ఉమా రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర శూన్యం పరిగి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర శూన్యం అని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పరిగిలోని తాజా మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి నివాసంలో నిర్వహిస్తున్న మహా సుదర్శన యాగం, చండీ యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ దీక్ష, ఉద్యమంతో తెలంగాణ రాలేదని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 25 మంది కాంగ్రెస్ ఎంపీలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించారని, కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకే సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిందని చెప్పారు. ఎందరో ఉగ్రవాదులను అణచివేసిన కాంగ్రెస్‌కు నమ్మకద్రోహి కేసీఆర్ ఓ లెక్కా అని వ్యాఖ్యానించారు. కేవలం ఇద్దరు ఎంపీలతో రాష్ట్రం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌తోనే సుపరిపాలన దేశంలో సుపరిపాలన కాంగ్రెస్‌తోనే సాధ్యమని జానారెడ్డి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలనను గాలికొదిలేశాయని ఆయన విమర్శిం చారు. అన్నివర్గాలకు సమన్యాయం జరగాలంటే కాంగ్రెస్‌కే సాధ్యమని, అధికారంలోకి వచ్చేం దుకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రజలకిచ్చిన హామీలను కేసీఆర్ గాలికొదిలేశారన్నారు. రెండు లక్షల ఇళ్లు కట్టిస్తామన్న ఆయన కనీసం 10 వేల ఇళ్లు కూడా నిర్మించలేదన్నారు. హామీల అమలులో విఫలమైన కేసీఆర్ ఓటమి భయంతోనే ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
తనయుడి కోసం తండ్రి త్యాగం!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం తానే అవుతానన్న ధీమాతో మాజీ సీఎల్పీ నేత కె.జానారెడ్డి భవిష్యత్ రాజకీయ వ్యూహ రచనలో మునిగిపోయారు. సుదీర్ఘ కాలం తాను ఎమ్మెల్యేగా పనిచేసిన నాగార్జునసాగర్ (అంతకుముందు చలకుర్తి) నియోజకవర్గంలో తన కుమారుడు రఘువీర్‌రెడ్డిని నిలబెట్టే ఆలోచనలో ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ముందు నుంచి తనకు పట్టున్న మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి ఈసారి పోటీ చేయాలని జానారెడ్డి నిర్ణయించుకున్నారని, ఇందుకు పార్టీ అధిష్టానం కూడా అనుమతి ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. తాను మిర్యాలగూడ నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారు కావడంతో, సాగర్ నుంచి రఘువీర్‌ను బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో జానారెడ్డి నియోజకవర్గం మారితే.. తమకేమన్నా అవకాశం దక్కుతుందేమోనని ఎదురుచూస్తున్న కొందరు ఆశావహులకు నిరాశే కలగనుంది. సీఎం అభ్యర్థిగా ప్రచారం.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తానే సీఎం అవుతానని, ఆ మేరకు నియోజకవర్గంలో సీఎం అభ్యర్థిగానే ప్రచారం చేయాలన్న వ్యూహంతో జానారెడ్డి ఉన్నారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తాను సీఎం పదవిని దక్కించుకోలేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగాలన్న యోచనలో కూడా ఉన్నారని వారు వివరిస్తున్నారు. ఈసారి ఓడినా, గెలిచినా తనకంటూ ఒక నియోజకవర్గం ఉండే విధంగానే రఘువీర్‌కు సాగర్‌ను వదిలి జానారెడ్డి మిర్యాలగూడ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. 1983 నుంచి జానారెడ్డికి తిరుగులేని కోటగా ఉన్న నాగార్జునసాగర్‌లో కుమారుడిని గెలిపించుకోవడం కష్టం కాదని భావిస్తున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో మిర్యాలగూడలో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.భాస్కర్‌రావు గెలిచారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్లో చేరడం తో జానారెడ్డి ఈ స్థానాన్ని ఎంచుకున్నారని ఆయన అనుచరులు అభిప్రాయపడుతున్నారు. -
ప్రణయ్ కేసు: కాంగ్రెస్ నేతను సస్పెండ్ చేస్తున్నాం!
సాక్షి, నల్లగొండ : జిల్లాలోని మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన ప్రణయ్ కుటుంబసభ్యులను పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు సోమవారం పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సీఎల్పీ నేత జానారెడ్డి ప్రణయ్ ఇంటికి వచ్చి.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రణయ్ భార్య అమృతవర్షిణితో మాట్లాడారు. జరిగిన ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణయ్ హత్యలో పాలుపంచుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ కరీంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని తెలిపారు. ప్రణయ్‌ను హత్య చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాజంలో ఇలాంటి హత్యలు అత్యంత ప్రమాదకరమైనవని పేర్కొన్నారు. ప్రణయ్ భార్య అమృతకి ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. విమలక్క పరామర్శ ప్రణయ్ భార్య అమృతను, అతని తల్లిదండ్రులను ప్రముఖ ప్రజా గాయకురాలు విమలక్క సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కులం కంటే గుణం గొప్పదన్నారు. ప్రణయ్ హత్యకు కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేనినైనా శాంతితో జయించాలి తప్ప ద్వేషంతో కాదని హితవు పలికారు. ప్రణయ్ కుటుంబానికి సమాజం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రేమికులను విడదీసి చంపే హక్కు ఎవరికి లేదన్నారు. -
కేసీఆర్ నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తాను
-
ఆశీర్వాద సభలో జానారెడ్డిపై కేసీఆర్ విమర్శలు
-
‘జానారెడ్డి గులాబీ కండువా కప్పుకుంటారా’
సాక్షి, సిద్దిపేట : ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగంగా అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ హుస్నాబాద్‌లో ‘ప్రజా ఆశీర్వాద సభ’ ఏర్పాటు చేశారు. ఈ సభ ద్వారా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఎన్నికల శంఖారావం పూరించారు. సభలో ప్రసంగించిన కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డిపై విమర్శలు గుప్పించారు. వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ ఇస్తే.. గులాబీ కండువా కప్పుకుని ఎన్నికల్లో ప్రచారం చేస్తానని అసెంబ్లీ సాక్షిగా జానారెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మాటకు కట్టుబడి జానారెడ్డి టీఆర్ఎస్ తరపున ప్రచారం చేస్తారా అని సవాల్ విసిరారు. కరెంటు వెలుగులు జానారెడ్డికి కనబడక పోతే.. కంటివెలుగు ద్వారా చికిత్స చేయించుకోవాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రం సాధించిన అభివృద్ధిని చూడకుండా అడ్డగోలు విమర్శలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. దేశాన్ని ముంచారు.. నిర్విరామంగా యాభై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అధోగతిపాలు చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ దరిద్రపు పాలనతో యావత్ భారతదేశం పేదరికంలో మగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనున్న చైనా దేశంలో.. రెండు లక్షల 23 వేల కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ హైవేలు ఉంటే.. భారత దేశంలో 1900 కి.మీ రహదారులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. అంతర్జాతీయంగా ట్రక్కుల సగటు వేగం గంటకు 80 కిలోమీటర్లు అయితే.. భారత్‌లో గంటకు 24 కి.మీ. మాత్రమేనని అన్నారు. ఇంటర్నేషనల్‌గా గూడ్స్ రైళ్ల వేగం గంటకు 86 కి.మీ అయితే.. భారత్‌లో 36 కి.మీ మాత్రమేనని పేర్కొన్నారు. దేశం ఇంతటి వెనకబాటుకు కాంగ్రెస్ అసమర్థ, అవివేవ విధానాలే కారణమని కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలే: కేసీఆర్ -
కేసీఆర్ ధోరణి ప్రజాస్వామ్యానికి చేటు
-
తెలంగాణలో రాజకీయ అనిశ్చితా..?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాడినికే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని కాంగ్రెస్ సీనియర్‌నేత కె జానారెడ్డి విమర్శించారు. శుక్రవారం మీడియాతో ఆయన ముందస్తు ఎన్నికలపై స్పందించారు. తెలంగాణలో రాజకీయ అనిశ్చితి ఎక్కడుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజకీయ కలుషితానికి కేసీఆరే కారణమన్నారు. ఆయన ధోరణి ప్రజాస్వామ్యానికి చేటని మండిపడ్డారు. అసలు కేసీఆర్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకముందా అని ప్రశ్నించారు. కేసీఆర్‌వే బఫున్ చర్యలని, అందితే కాళ్లు లేకుంటే జుట్టు పట్టుకునే రకమని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. నెహ్రు కుటుంబంపై కేసీఆర్ వ్యాఖ్యలు బాధాకరమని, టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. -
నెపం వేసి రుజువులు లేకుండా అరెస్ట్ చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: పౌరహక్కుల నేత వరవరరావును అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. వరవరరావును అరెస్టు చేయడం పౌరహక్కులను కాలరాయడమేనని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఏదో కుట్ర చేశాడనే నెపంతో రుజువులు లేకుండా అరెస్టు చేయడం దారుణమని ఆయన అన్నారు. బుధవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ...వరవరరావు గొప్ప మానవతావాది అని, మావోయిస్టులతో చర్చల సందర్భంగా గొప్ప పాత్ర పోషించారని చెప్పారు. ఆయన అరెస్టుపై కేంద్రం విచారణ జరిపించి వాస్తవాలను బయటపెట్టాలని జానా డిమాండ్ చేశారు. వరవరరావు కుట్ర చేశారనే ఆరోపణలు నమ్మశక్యంగా లేవని మండలిలో విపక్ష నేత షబ్బీర్‌అలీ వ్యాఖ్యానించారు. ప్రశ్నించే గొంతులను ప్రభుత్వాలు అణచివేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. మోదీ ప్రభుత్వ విధానాల్లోని తప్పులను ఎత్తిచూపుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్న వరవరరావును అరెస్టు చేయడాన్ని టీపీసీసీ ముఖ్య అధి కార ప్రతినిధి దాసోజు శ్రావణ్ తప్పుపట్టారు. -
ముందస్తు ఎందుకో ప్రజలకు చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోడానికి అన్ని పార్టీలూ సిద్ధంగా ఉంటాయని, అలాగే తామూ సిద్ధమని.. కానీ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాల్సి వస్తుందో ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాల్సిన అవసరం ఉందని సీఎల్పీ నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లు అధికారంలో ఉండమని ప్రజలు తీర్పిస్తే ముందుగానే ఎందుకు ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందో వివరించాలని నిలదీశారు. ఎన్నికల హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని ప్రజలు ప్రశ్నిస్తారనే ముందస్తుకు వెళుతున్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ముందస్తుకు వెళ్లినా లోక్‌సభ, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగితే బాగానే ఉంటుంది కానీ రెండింటికీ విడివిడిగా జరిగితే మాత్రం ప్రజాధనం వృథా అవుతుందన్నారు. వాళ్ల గురించి నేనేం మాట్లాడను కాంగ్రెస్ నేతలను దూషిస్తూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై జానా స్పందిస్తూ.. ఏదైనా మాట్లాడేటప్పుడు భాష హుందాగా ఉండాలని, కుసంస్కార మాటలు మాట్లాడే వ్యక్తుల గురించి తానేమీ చెప్పనన్నారు. ఎన్నికల్లో తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో చర్చించి నిర్ణయిస్తామని చెప్పారు. తమ పొత్తులు రాష్ట్ర ప్రజలు హర్షించేలా ఉంటాయన్నారు. తాను ఎంపీగా పోటీచేయాలా లేక అసెంబ్లీకా అనేది పార్టీనే నిర్ణయిస్తుందని చెప్పారు. అది రాజ్యాంగ ప్రతిష్ట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌ల అనర్హత కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకోకుండా రాజ్యాంగ ప్రతిష్ట కోణంలో ఆలోచించి అమలు చేయాలని జానా కోరారు. ఈ కేసులో అసెంబ్లీ స్పీకర్‌కు కోర్టు నోటీసులిచ్చిన అంశం కూడా కనబడటం లేదా అని ప్రశ్నించారు. కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి వెంటనే అమలు చేయాలని, కేసును సాగదీయడం మంచిది కాదన్నారు. -
రాహుల్ టూర్: తన్నుకున్న ఓయూ స్టూడెంట్స్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండో రోజు పర్యటనలో గందరగోళం చోటుచేసుకుంది. హరిత ప్లాజాలో ఏర్పాటు చేసిన సీనియర్ నేతలతో సమావేశం రసాభసగా మారింది. ముఖ్యనేతల జాబితాలో సీనియర్ నేత జానారెడ్డి పేరు లేకపోవడంతో ఆయన షబ్బీర్ అలీలు అలిగి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. దీంతో గూడూరు నారయణ రెడ్డి బుజ్జగించి లోపలికి పంపించారు. ఇక రేవంత్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలకు సైతం చేదుఅనుభవం ఎదురైంది. సీనియర్ల మీటింగ్ లోపలికి వెళ్లడానికి రేవంత్ రెడ్డికి పాస్ నిరాకరించగా.. సునీతా లక్ష్మారెడ్డిని అనుమతించలేదు. దీంతో ఆమె కంట తడిపెట్టారు. ఉస్మానియా విద్యార్థుల భేటీలో సైతం గొడవ చోటుచేసుకుంది. కొందరికి అనుమతి లేదనడంతో రెండు వర్గాలుగా విడిపోయిన విద్యార్థులు హోటల్లోనే కొట్టుకున్నారు. ఈ గొడవతో విద్యార్థులతో రాహుల్ భేటీ రద్దైంది. చదవండి: టీడీపీతో పొత్తు అవకాశాలు: రాహుల్ -
రాహుల్ పర్యటన విజయవంతం చేయాలి
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శాసనసభా పక్షం నిర్ణయించింది. రాహుల్ పాల్గొనే కార్యక్రమాలన్నింటిలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే భారీగా జనసమీకరణ చేయాలని నేతలకు సూచించింది. రాహుల్ పర్యటనపై శనివారం సీఎల్పీ నేత జానారెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కార్యాలయంలో సమావేశమైంది. ఈ భేటీకి ఎమ్మె ల్యేలు గీతారెడ్డి, భట్టి విక్రమార్క, వంశీచంద్ రెడ్డి, మాధవరెడ్డి, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఆకుల లలిత హాజరయ్యారు. రాహుల్ పర్యటించే ప్రాంతాల్లో మహిళలు, యువత పెద్దఎత్తున పాల్గొనేలా ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలన్న అంశాలపై చర్చించారు. రాహుల్‌ను ఓయూలోకి అనుమతించకపోవడాన్ని వారంతా మూకుమ్మడిగా ఖండించారు. అనంతరం జానారెడ్డి మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం కొందరిని రెచ్చగొట్టి రాహుల్ ను ఓయూకు రాకుండా అడ్డుకుందని ఆరోపించారు. రాష్ట్ర సమస్యలు తెలుసుకునేందుకే రాహుల్ వస్తున్నారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా కేసీఆర్ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలోనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని రాహుల్ చెప్పబోతున్నారన్నారు. -
‘రాష్ట్రంలో నిర్భంద పాలన కొనసాగుతోంది’
సాక్షి, హైదరాబాద్ : ఏ రాష్ట్రం కోసమైతే ఉస్మానియా విద్యార్థులు జైలుకెళ్లి మరీ పోరాడారో నేడు అదే రాష్ట్రంలో వారిని ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు కలవాలంటే ప్రభుత్వం అనుమతించడం లేదంటూ ప్రతిపక్ష నేత జానారెడ్డి మండిపడ్డారు. శనివారం జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ మాత్రం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వారిని ఆవేదనకు గురిచేస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రజల దుస్థితిని చూసి రాహుల్ గాంధీ బాధపడుతున్నారని అన్నారు. వారి బాధలు తెలుసుకోవడం కోసమే ఆయన రాష్ట్రంలో పర్యటిస్తున్నారని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ వివిధ వర్గాల వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటరని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉస్మానియా విద్యార్థులు అనేక సార్లు జైలుకు వెళ్లి, ఉద్యమాలలో పాల్గొని పోరాడారు. నేడు ఆ విద్యార్థులను కలవాలని రాహుల్ అనుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలిపారు. అందువల్లే రాహుల్ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన రద్దు చేసుకున్నారని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాంటిది నేడు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదో ప్రజలు గమనించాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. అందుకే విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాహుల్ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశానికి జానారెడ్డితో పాటు, వంశీచంద్ రెడ్డి, గీతారెడ్డి, పొంగులేటి, దొంతి మాధవరెడ్డి, ఆకుల లలిత, భట్టి విక్రమార్క తదితర నాయకులు హాజరయ్యారు. -
అభ్యర్థుల ప్రకటనలో ఆలస్యం వద్దు
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ప్రకటించే విషయంలో ఆలస్యం చేయొద్దని కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ నేతలు సూచించారు. నామినేషన్ గడువు ముగిసే రెండు, మూడు రోజుల ముందు అభ్యర్థులను ప్రకటించడం వల్ల ప్రజల్లో గందరగోళం నెలకొనే పరిస్థితి ఉంటుందని వివరించారు. ఇబ్బందులు లేని పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను వీలైనంత ముందే ఖరారు చేయాలని కోరారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తెలంగాణ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత జానారెడ్డి, మండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, సీనియర్ నేతలు చిన్నారెడ్డి, వి.హనుమంతరావు, మధుయాష్కీగౌడ్, సంపత్‌కుమార్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తరువాత మేనిఫె స్టోను ప్రకటించడం వల్ల ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నామనే విషయాన్ని వివరించామన్నారు. అభ్యర్థుల ప్రకటన, మేనిఫెస్టో విడుదల ఆలస్యం వల్ల గెలుపు అవకాశాలు దెబ్బతినే ప్రమాదముందని చెప్పామన్నారు. ఎన్నికలకు ముందే ఐదు ప్రధాన హామీలను నిర్దేశించుకొని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్లు చెప్పారు. రైతు రుణమాఫీతోపాటు పంట బీమా కూడా ప్రకటించాలని కోరామన్నారు. పంటకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించేలా నిబంధనలను రూపొందించి మేనిఫెస్టో విడుదల చేయాలని చెప్పామన్నారు. మేనిఫెస్టోలో రైతులు, డ్వాక్రా సంఘాలకు ఆకర్షణీయ పథకాలను పొందుపరచాలని సూచించినట్లు పేర్కొ న్నారు. ఆర్మీలో పనిచేసిన వ్యక్తిగా తనకున్న అనుభవం మేరకు యుద్ధవిమానాలను ఏ దేశం నుంచి కొనుగోలు చేసినా ఆ ఒప్పందాలను బహిర్గతం చేయకూడదనే నిబంధన ఉండదని చెప్పారు. దీనిపై రాహుల్‌గాంధీ లోక్‌సభలో ప్రస్తావించిన విషయం సరైందేనన్నారు. జన్మ ధన్యమైంది: సంపత్ సీడబ్ల్యూసీ సమావేశ మందిరంలోకి ప్రవేశించిన రాహుల్‌కు సంపత్‌కుమార్ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాసనసభ సభ్యత్వ అనర్హత కేసు ఏమైందని అడిగారని సంపత్ చెప్పారు. సాధారణ కార్యకర్తగా ఉన్న తనను సీడబ్ల్యూసీ సమావేశానికి ఆహ్వానించడం, ఆ సమావేశంలో తాను పాల్గొనడం ఊహించలేదని, తన జన్మ ధన్యమైందని సంపత్ వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని రాహుల్‌కు చెప్పానన్నారు. -
కత్తి మహేష్ వ్యాఖ్యలు క్షమించరానివి
-
కత్తి వ్యాఖ్యలపై స్పందించిన జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: సమాజ సామరస్యానికి భంగం కలిగించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కత్తి మహేశ్ లాంటి వారి వ్యాఖ్యలు వర్గాలను రెచ్చ గొట్టే విధంగా ఉన్నాయన్నారు. సమాజంలో ఆందోళనలు కలిగించే విధంగా మాట్లాడటం క్షమించరానిదన్నారు. ఇలాంటి విషయాల్లో జర్నలిస్టులు సంయనం పాటించాలని, అసహ్యమైన మాటలు ప్రచురించకూడదన్నారు. అలాంటప్పుడే రాజకీయ నాయకులు.. ఇది సరికాదని తెలుసుకుంటారన్నారు. సంస్కార హీనంగా ఎవరు మాట్లాడినా తప్పేనని ఆయన వ్యాఖ్యానించారు. రైతుబంధుపై వివరణ ఇవ్వాలి మరోవైపు రేషన్ డీలర్ల సమస్య విషయంలో ప్రభుత్వం దిగి వచ్చినందుకు అభినందిస్తున్నామన్నారు. రైతుబంధు పథకాన్ని ప్రభుత్వం ఎందుకు పెట్టిందో వివరణ ఇవ్వాలన్నారు. రైతులకు పెట్టుబడి సహాయం కోసమే పథకం అయితే పర్వాలేదు. కానీ పథకం లక్ష్యం నెరవేరటం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం వద్ద లెక్కలు లేకపోవటంతో వ్యవసాయం చేసే వారికి నష్టం జరుగుతుందన్నారు. రైతుబంధు పథకాన్నీ స్వాగతిస్తూనే.. నిజమైన సాగుదార్లకు న్యాయం చేయాలని కోరుతున్నట్టు ఆయన తెలిపారు. ఇందుకు అవసరమైతే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. వివరాలు, సూచనలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని, వ్యవసాయం చేసే వారికి మాత్రమే సహాయం అందాలన్నారు. అవసరమైతే పట్టాదారుల నుంచి సాగుదార్లకు సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
వలసలను అడ్డుకుందాం!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి దానం నా గేందర్ రాజీనామా, మరికొందరు సీనియర్లు అదే బాటలో నడువనున్నారన్న వార్తల నేప థ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. పీసీసీ ముఖ్య నేతలు సీఎల్పీ నేత కె.జానారెడ్డి నివా సంలో శుక్రవారం సాయంత్రం అత్యవసరంగా భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ, వి.హన్మంతరావు, మహేశ్వర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. నేతలు పార్టీ వీడకుండా తీసుకోవాల్సిన చర్యలపై వారంతా మల్లగుల్లాలు పడ్డారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, వలసలకు అడ్డుకట్ట, అధికార టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న నేతలను త్వరగా చేర్చుకోవడం, పార్టీని బలోపేతం చేయడంపై చర్చించారు. ఎవరూ వీడినా కాంగ్రెస్‌కు నష్టం లేదని, అసంతృప్త నేతలు పార్టీని వీడకుండా చూడాలని నిర్ణయించారు. టీఆర్ఎస్కు చిక్కకుండా నేతలను అప్రమత్తం చేయాలని భావించారు. పార్టీ పదవుల్లో అన్ని వర్గాలకూ ప్రాధాన్యమిచ్చి అసంతృప్తి సెగలను చల్లార్చాలన్న అభిప్రాయపడ్డారు. పార్టీ నుంచి ఎవరు వెళ్లినా నష్టమేనని భేటీ అనంతరం వీహెచ్ అన్నారు. బీసీలకు పార్టీలో అన్యాయం జరిగితే ఊరుకోనన్నారు. -
‘కేసీఆర్ వైఖరిపై మళ్లీ కోర్టు కెళతాం’
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ శాసన సభ్యత్వాలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసినా, వారి సభ్యత్వాలు పునరుద్ధరించడం లేదని ఆయన మండిపడ్డారు. సీఎల్పీ నాయకుడు, ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి నివాసంలో శుక్రవారం జరిగిన సీఎల్పీ భేటీ అనంతరం ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌పై కోర్టు ధిక్కరణ కింద మళ్లీ కోర్టుకు వెళతామని ప్రకటించారు. కోర్టు తీర్పుని గౌరవించని కేసీఆర్‌కు సీఎం పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని అన్నారు. ప్రభుత్వ నియంతృత్వ వైఖరిపై మొదటగా గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ నెల 11న గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కలుస్తామని వెల్లడించారు. రాష్ట్రపతిని కూడా కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వామిక చర్యలను వివరిస్తామని తెలిపారు. -
కోర్టుకెళితే చట్టం నిలవదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పంచాయతీరాజ్ చట్టం కోర్టులో నిలబడదని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ చట్టంపై చర్చించేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చాలని డిమాండ్ చేశారు. సోమవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ సభ్యులందరినీ సభ నుంచి సస్పెండ్ చేయడంతో పంచాయతీరాజ్ చట్టంపై చర్చ జరగలేదన్నారు. ఈ చట్టాన్ని చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్నైనా ఏర్పాటు చేసి, అందులో వచ్చిన అభిప్రాయాల మేర కు చట్టంలో సవరణలు తీసుకురావాలన్నారు. తమ ఎమ్మెల్యేల బహిష్కరణ విషయంలో గతంలోనే హైకోర్టు ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా తీర్పు ఇచ్చిందన్న ఆయన తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్‌ను కొట్టివేయడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును అమలు చేసేలా అసెంబ్లీ కార్యదర్శి చొరవ తీసుకోవాలని, లేదంటే కోర్టు ధిక్కారం కింద మళ్లీ కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తాం... కాంగ్రెస్ పార్టీ పదులసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, నాలుగేండ్లు అధికారంలో లేనంత మాత్రా న తమకేమీ ఆదుర్దా లేదని, తాము మళ్లీ అధికారంలోకి వస్తామని జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో విభేదాలు సహజమని, చిన్న, చిన్న అభిప్రాయభేదాలున్నా అందరం కలసికట్టుగా పనిచేస్తా మని చెప్పారు. సీఎం అయ్యే అర్హత ఉన్నవారిలో తాను ముందుంటానని చెప్పానే తప్ప తానే సీఎం అవుతానని ఎప్పుడూ చెప్పలేదని, ఎవరు సీఎం అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. -
రాజీనామాపై కోమటిరెడ్డి నాతో చర్చించలేదు
-
ముందు నేనే రాజీనామా చేస్తా: జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కోలేకపోయిందన్న విమర్శలను ప్రతిపక్షనేత కె. జానారెడ్డి కొట్టిపారేశారు. తనతో మూకుమ్మడి రాజీనామా చేద్దామని కోమటిరెడ్డి అననేలేదని, ఒకవేళ అధిష్టానమే గనుక ఆదేశిస్తే అందరికంటే ముందు తానే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. (చదవండి: టీ సర్కార్‌కు కోమటిరెడ్డి డెడ్‌లైన్) ఆ ముచ్చటే నాకు చెప్పలేదు: ‘‘మావాళ్లలోనే కొంతమంది ఒత్తిడితోనో, ఆవేదనతోనో నాయకత్వంపై ఆరోపణలు చేసిఉండొచ్చు. అందుకు ఎవరినీ తప్పుపట్టడంలేదు. సీఎల్పీ తరఫున చట్టబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలేమైనా ఉంటే తప్పకుండా పరిశీలిస్తాం. సభ్యత్వాల రద్దు విషయంలో ఇంకాస్త గట్టిగా ప్రతిస్పందించాల్సి వస్తే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అధిష్టానం సూచనల మేరకు ముందడుగు వేస్తాం. ప్రచారంలో ఉన్నట్లు రాజీనామాల అంశమేదీ మా మధ్య చర్చకు రాలేదు. ఒకవేళ అధిష్టానమే గనుక ఆ నిర్ణయం తీసుకుంటే, ముందు నేనే రాజీనామా చేస్తా. నిజానికి రాజీనామాల గురించి కోమటిరెడ్డి నాతో చెప్పనేలేదు. అలా చెప్పినట్లు ఎవరైనా అంటే.. ఆ వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నా. జానారెడ్డి ఎప్పుడైనా దేనికైనా రెడీగానే ఉంటాడని మరోసారి సవాల్ చేస్తున్నా. నాపైనగానీ, మరొకరిపైనగానీ ప్రతిసారి ఇలా మాట్లాడటం సరికాదు. ఈ కేసీఆర్ ప్రభుత్వపు కక్ష, అనైతికత, నిరంకుశత్వం అందరిపట్లా ఒకే విధంగా ఉంది. అందుకు నేను మినహాయింపు కాదు. వ్యక్తులను, పార్టీలను అణిచివేసేందుకు టీఆర్ఎస్ సర్కార్ ప్రయత్నిస్తున్నది’’ అని జానా వివరించారు. (చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మళ్లీ ఊరట) కోర్టు తీర్పుపై హర్షం: కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేత తీర్పును సవాలు చేస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంపై జానా హర్షం వ్యక్తం చేశారు. ‘‘మొన్న కర్ణాటకలో, ఇప్పుడు తెలంగాణలో కోర్టులు ఇచ్చిన తీర్పులు.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింతగా చాటాయి. సస్పెన్షన్‌ను ఎత్తివేయాలన్న కోర్టు గత తీర్పును అనుసరించాల్సిందిగా స్పీకర్‌ను విజ్ఞప్తి చేస్తున్నా. అసెంబ్లీ కార్యదర్శి కూడా చొరవతీసుకోవాలి. లేదంటే కోర్ట్ కంటెప్ట్‌కు వెళ్లాల్సి వస్తుంది’’ అని జానా పేర్కొన్నారు. పంచాయితీ రాజ్ చట్టానికి నగుబాటు తప్పదు: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన పంచాయితీరాజ్ చట్టానికి కూడా కోర్టులో ఎదురుదెబ్బ తగలడం ఖాయమని జనారెడ్డి అన్నారు. తక్షణమే అసెంబ్లీని లేదా అఖిలపక్షం సమావేశాన్ని ఏర్పాటుచేసి పీఆర్ చట్టంపై అందరి అభిప్రాయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘‘సర్కారు రూపొందించిన పంచాయితీ రాజ్ చట్టంలో చాలా లోపాలున్నాయి. ఇలాగే కోర్టుకు వెళితే ఎదురుదెబ్బ తప్పదు. కీలకమైన చట్టం కాబట్టి విపక్షాల సూచనలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. అందుకోసం తక్షణమే ప్రభుత్వం ముందుకురావాలి’’ అని వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులు అయినా, కాకపోయినా ప్రాణహాని ఉన్నవారికి రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని జానా గుర్తుచేశారు. -
టీ సర్కార్‌కు కోమటిరెడ్డి డెడ్‌లైన్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దు విషయంలో డివిజన్ బెంచ్ వెలువరించిన తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు చేయడాన్ని తప్పబడుతూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంలో సోమవారం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ సందర్బంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.‘ కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్యే సభ్యత్వం పునరుద్ధరించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలి. రాజ్యాంగం, న్యాయవ్యవస్థ మీద కేసీఆర్‌కు నమ్మకం లేదు. ఇలాంటి నియంత తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కావటం దౌర్భాగ్యం. న్యాయ వ్యవస్థతో నాటకాలు ఆడుతున్నారు. ప్రజల్ని మోసం చేసినట్టు, న్యాయస్థానాన్ని కూడా మోసం చేస్తున్నారు. డబ్బుల కోసం పార్టీ మారిన ఎమ్మెల్యేలు పిటిషన్ వేశారు. కోర్టు ధిక్కార నోటీసులు ఇస్తాం. అసెంబ్లీ కార్యదర్శి.. సీఎస్‌లను కూడా బాధ్యులను చేస్తాం. సీఎం రాజీనామా చేసే పరిస్ధితి వస్తుంది. రేపటి లోపల మా సభ్యత్వాన్ని పునరుద్ధరించాలి.’ అని ఆయన పేర్కొన్నారు. మా నాయకత్వం స్పందించలేదు మా సభ్యత్వాల రద్దు విషయంలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జానారెడ్డి లకు చెప్పాను. మేము మా కోసం సభలో ఆందోళన చేయలేదు. అందరం రాజీనామా చేయాలి అనుకున్నాం. ఇప్పుడైనా.. రాజీనామాల మీద నిర్ణయం తీసుకోమని చెప్తున్నా. సీఎల్పీ నేతగా మమ్మల్ని కాపాడుకోవాలి. పార్టీ నాయకులతో చర్చించి అందరం రాజీనామా చేద్దాం. ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి. కానీ రాష్ట్ర నాయకత్వం సరిగా స్పందించడం లేదు. రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలి. ఎందుకు పట్టించుకోవటం లేదో వాళ్లనే అడగండి. -
జానా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక
త్రిపురారం : మండలంలోని కాపువారిగూడెం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ అబంగాపురం ఎంపీటీసీ హంజీ, మాజీ సర్పంచ్ మంగ్లానాయక్‌తో పాటు మరికొంత మంది కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మర్ల చంద్రారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ధనావత్ భాస్కర్‌నాయక్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో సీఎల్పీనేత కుందూరు జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీఎల్పీనేత జానారెడ్డి పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి సాధరంగా ఆహ్వానించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధిని ఆకాంక్షించి టీఆర్ఎస్లోకి వలసలు వెళ్లిన వారంతా తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చి చేరుతున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో పేద ప్రజలకు అనేక సంక్షేమాలు ప్రవేశపెట్టి అమలు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కలిసి కట్టుగా ఉండి వచ్చే 2019 ఎన్నికల్లో సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో నేనావత్ జాంమ్లా, పానుగోతు గాస్యా, సీతారాంనాయక్, మూడు హన్మంతు ఉన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనుముల శ్రీనివాస్‌రెడ్డి, సొసైటీ చైర్మన్లు అనుముల నర్సిరెడ్డి, బుసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు మైలారిశెట్టి సైదయ్య, నాయకులు అల్లంపల్లి జానయ్య, మట్టాయ్యచారి, వస్త్రాం, ధర్మానాయక్ తదితరులు ఉన్నారు. -
సీఎం అయ్యే అర్హత నాకుంది: జానా
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘‘ముఖ్యమంత్రి అయ్యే అర్హత నాకుంది.. అలాగే అనేకమందికీ ఉంది.. అలాగనీ ఎన్నికలు జరగకుండా.. అధిష్టానం నిర్ణయించకుండా.. ఎవరికివారు అనుకోవడం సరికాదు.. ఏదైనా సీఎం విషయంలో అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం’’అని సీఎల్పీ నేత కె.జానారెడ్డి అన్నారు. సీఎం కావడానికి అర్హత ఒక్కటే ప్రామాణికం కాదని, చాలా సమీకరణాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఆదివారం కరీంనగర్ ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ‘‘టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో నాకు ఎలాంటి విభేదాలూ లేవు. సీఎల్పీ, టీపీసీసీ కలిసి చాలా బాగా పనిచేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కడతారు. కాంగ్రెస్‌కు అధికారమే లక్ష్యంగా అందరం పనిచేస్తున్నాం. కొందరు కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు అసందర్భంగా అసత్య ప్రచారం చేస్తున్నారు’’అని అన్నారు. ‘‘మీలాగే హైదరాబాద్‌లో చిట్‌చాట్ పెట్టినప్పుడు ‘టీమ్ లీడర్ గట్టిగా ఉండాలి’అని కొంతమంది మిత్రులంటే మా టీమ్‌లీడర్ బాగానే ఉన్నాడు కదా అన్నాను. గెలవడానికి టీమ్లీడరే కీలకం కాదు.. టీమ్‌లీడర్ గట్టిగా ఉన్నా.. మిగతా సభ్యులు ఆడకపోతే ఫెయిల్ అయితం. ఒకవేళ టీమ్‌లీడర్ గాయపడి సభ్యులు బాగా ఆడితే గెలుస్తుంటం. ఆ పేరు కెప్టెన్‌కే వస్తుంది. అన్నింటికీ సమన్వయం ముఖ్యం’’అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు ఎలాంటి అవగాహన లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదని, దానికి ఇంకా సమయం ఉందని అన్నారు. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని ప్రజలు భావించారని కానీ నాలుగేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలోని ఏ ఒక్కదాన్ని పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. మభ్యపెట్టేందుకు రోజుకో హామీ ఇస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. -
కేసీఆర్ రాజ్యాంగాన్ని కూనీ చేస్తున్నారు
-
ఎమ్మేల్యేలు అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు
-
అది కోమటిరెడ్డి, సంపత్‌ల ప్రచారం: జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కమార్ శానససభా సభ్యత్వాల రద్దు విషయంలో కాంగ్రెస్ పార్టీ సరిగా స్పందించలేదన్న వాదనను సీఎల్పీ నేత కె. జానారెరెడ్డి తోసిపుచ్చారు. ఈ అంశంలో చేయాల్సిందంతా చేశామని చెప్పుకొచ్చారు. తన నివాసంలో శనివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష అత్యవసర సమావేశంలో రాష్ట్రంలో సంభవించిన అకాల వర్షాలు, పంట నష్టం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. సమావేశానంతరం జానారెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘రాష్ట్రంలో తాజా పరిణామాలు, అకాల వర్షాలపై సమావేశంలో చర్చించాం. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌లను మేము పట్టించుకోవటం లేదన్నది అసత్యం. వారి కోసం అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు చేశాం. అదే సమయంలో ప్లీనరీకి వెళ్ళాం. ఆ ఇద్దరు కూడా ప్లీనరీకి వచ్చారు కదా. ఇంకా ఏంచేయాల్సి ఉందో చెప్పండి. అభిషేక్ సింఘ్విని హైకోర్టుకి పిలిచింది పార్టీనే. ఆయనతో మాట్లాడింది కూడా నేనే. ప్లీనరీ కంటే ముందే రాహుల్ గాంధీ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాం. లా కమిటీ సభ్యుడితో కూడా మాట్లాడి సలహాలు తీసుకున్నాం. అభిషేక్ సింఘ్వితో మాట్లాడిన అంశాన్ని సంపత్, కోమటిరెడ్డికి కూడా వివరించా. రాహుల్ గాంధీ కూడా సింఘ్విని పిలిచి ఎమ్మెల్యేల కేసును చూడమని చెప్పారు. పార్టీ పట్టించుకోవటం లేదని సంపత్, కోమటిరెడ్డిలు చేసుకునే ప్రచారం మాత్రమే. వాళ్ళ వ్యాఖ్యలు దృష్టిలో పెట్టుకుంటాం.. అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తాం. ఫిరాయింపుదారులు రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ఓటేశారని సుప్రీంకోర్టులో సాక్ష్యంగా ఇస్తాం. కాంగ్రెస్‌కు 10 ఓట్లే ఉన్నాయని మాకు తెలుసు. గెలుస్తామని పోటీ పెట్టలేదు. పార్టీలో మార్పులు, చేర్పులు గురించి నాకు తెలియదు. తెలంగాణలో ఎన్నికలకు ఏడాది సమయం ఉంది.. పార్టీ కార్యాచరణ మరింత వేగం పెరుగుతుంది. ఎన్నికల నాటికి పార్టీ కార్యక్రమాలు ఉదృతం అవుతాయని నమ్ముతున్నా. తెలంగాణ రాష్ట్రం ఆరు నెలల ముందే ఇచ్చి ఎన్నికలకు పోతే బాగుండేది అని భావన ఉంది. కానీ కేంద్రంలో 25 మంది ఎంపీలు బయటకు పోతే.. ప్రభుత్వమే పడిపోయేది. అపుడు తెలంగాణ రాకుండా పోయేదన్న చర్చ కూడా ఉంది. రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ చేసింది కరెక్టు. పార్టీ అధికారంలోకి రావాలని అందరం ప్రయత్నం చేస్తున్నాం. కొన్నిసార్లు టీమ్ లీడర్ సెంచరీ కొట్టినా మ్యాచ్ గెలవరు. కానీ లీడర్ 10 పరుగులు చేసినా ఒక్కొక్కసారి టీమ్ గెలుస్తుంది. మా స్పిరిట్ కూడా అంతే. ఎవరి స్థాయిలో వారు పని చేస్తున్నారు. జానారెడ్డి ముఖ్యమంత్రి కావాలని అనే వారున్నారు. నా కంటే ఎక్కువ అర్హత ఉంది అని ఎవరన్నా అనుకుంటే అందరూ ఒప్పుకోరు. మా అబ్బాయి ఎక్కడ నుంచి పోటీ చేయాలనే దానిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ప్రజలు సీరియస్‌గా కాంగ్రెస్ గురించి ఆలోచించాలి. కర్ణాటకలో మళ్లీ మా పార్టీయే గెలుస్తుంద’ని జానారెడ్డి పేర్కొన్నారు. -
రామచంద్రారెడ్డి మృతిపై జానారెడ్డి సంతాపం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ మాజీ స్పీకర్, మాజీ మంత్రి పి.రామచంద్రారెడ్డి మృతి పట్ల ప్రతిపక్ష నేత జానారెడ్డి సంతాపం తెలిపారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నఆయన హైదరాబాద్ ఎస్ఆర్నగర్లోని స్వగృహంలో మృతి చెందారు. రామచంద్రారెడ్డి పంచాయితీ సభ్యుడి నుంచి శాసనసభ స్పీకర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి అని జానారెడ్డి అన్నారు. ఐదు సార్లు శాసన సభ్యునిగా, మంత్రిగా, న్యాయవాదిగా పనిచేసి సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని కలిగిన వ్యక్తి అని, ఆయన మరణం తీరని లోటు అని జానారెడ్డి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
‘హైకోర్టు తీర్పు వారికి చెంప పెట్టు’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌ల సభ్యత్వ రద్దు చెల్లదని మంగళవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఇది ప్రజల విజయమని ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. సభలో ప్రతిపక్షాలు లేకుండా పాలన సాగిద్దామనుకున్న ప్రభుత్వానికి ఈ తీర్పు చెంప పెట్టు అని ఆయన అన్నారు. న్యాయాన్ని, వాస్తవాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లడంలో న్యాయవాది జంధ్యాల రవిశంకర్ విజయం సాధించారని అభినందించారు. సభ్యత్వ రద్ధు చెల్లదంటూ వెలువరించిన 175 పేజీల హైకోర్టు తీర్పు చరిత్రాత్మకమైందని కొనియాడారు. కుటిల రాజకీయాలు చేసే నేతలకు ఈ తీర్పు కనువిప్పు అని పేర్కొన్నారు. ప్రశ్నించే వారే ఉండొద్దన్న ధోరణిలో టీఆర్ఎస్ ఉందని జానా మండిపడ్డారు. అందుకనే కోదండరాం పార్టీ సభకు అనుమతి ఇవ్వడానికి ప్రభుత్వం వెనుకాడుతోందని ఆరోపించారు. ప్రజలు తమ సమస్యలపై నిరసన గళమెత్తకుండా చేసేందుకు ధర్నా చౌక్‌ను ఎత్తివేశారని విమర్శించారు. తీర్పు అనంతరం ఎమ్మెల్యే సంపత్ విలేకర్లతో మాట్లాడారు. గత నెలలో జరిగిన పరిణామాలు కుటిల రాజకీయాలకు తార్కాణమని అన్నారు. అయినా ‘మేం ధైర్యం కోల్పోలేదు. మాకు న్యాయ వ్యవస్థపై నమ్మకముంది. ప్రజాస్వామ్యాన్ని దొరల గడీలో బంధించాలన్న కుట్రలకు మా విజయం తగిన గుణపాఠం’ అని సంపత్ అన్నారు. -
టీడీపీ, టీఆర్ఎస్ నుంచి...కాంగ్రెస్‌లోకి...
మిర్యాలగూడ టౌన్ : ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ఆదర్శిస్తునే పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని సీఎల్పీ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని రాజీవ్ భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో త్రిపురారం మండల పార్టీ అధ్యక్షులు మర్ల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో అప్పలమ్మగూడెం గ్రామ పంచాయతీలోని లోక్యతండాకు చెందిన టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన 50 కుటుంబాల కార్యకర్తలు సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలను కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధే కానీ టీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. పార్టీలో చేరిన వారిలో జి. రాజు, జి. వెంకటేశ్వర్లుతో పాటు మరో 50 కుటుంబాల కార్యకర్తలున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మర్ల చంద్రారెడ్డి, స్కైలాబ్‌నాయక్, బసవయ్య, శంకర్‌నాయక్, ఖరీం ఉన్నారు. -
‘దమ్ముంటే అన్ని వీడియోలు బయటపెట్టండి’
సాక్షి, హైదరాబాద్ : తమను సస్సెండ్ చేసే అధికారం అధికారపక్షానికి లేనేలేదని విపక్ష కాంగ్రెస్ వాదిస్తోంది. గవర్నర్ ప్రసంగం సదర్భంగా జరిగిన ఘటనలపై నిర్ణయాధికారం గవర్నర్దేతప్ప అసెంబ్లీదో, రాష్ట్రప్రభుత్వానిదో కాదని ప్రతిపక్షనేత జానారెడ్డి అన్నారు. నియంతృత్వ ధోరణిలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా మూకుమ్మడి రాజీనామాలు చేయనున్నట్లు తెలిపారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. అసలు చైర్మన్ స్వామిగౌడ్‌పై దాడి జరగనేలేదని, దమ్ముంటే వీడియోలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో టీఆర్ఎస్ తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని శ్రేణులకు సూచించింది. అది గవర్నర్ పరిధిలోని అంశం : ‘‘నిన్న సభలో జరిగిన ఘటన గవర్నర్ పరిధిలోని అంశం. చర్యలు తీసుకునే అధికారం ఆయనకు మాత్రమే ఉంది. అందరినీ సస్పెండ్ చేయడం రాజ్యంగ విరుద్ధం. సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది కాబట్టే ప్రజల దృష్టిని మరల్చేందుకు సస్పెన్షన్లను తెరపైకి తెచ్చింది. ప్రభుత్వం అవలంభిస్తోన్న అప్రజాస్వామిక చర్యలను అందరూ ఖండించాలి’’ అని సీఎల్పీనేత జానారెడ్డి అన్నారు. దమ్ముంటే వీడియోలు బయటపెట్టండి : ‘‘కావాలనే మమ్మల్ని సభ నుంచి గెంటేశారు. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశాడు. సభలో జరిగిందివేరు.. బయట సీఎం నడిపిన డ్రామా వేరు. మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై దాడి జరిగిందనడం అవాస్తవం. మావాళ్లు హెడ్సెట్ విసిరిన దృశ్యాలే చూపెడుతున్నారుగానీ, వేరే దృశ్యాలు చూపెట్టట్లేదంటే ఏమిటి అర్థం? దమ్ముంటే అన్ని వీడియోలు బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సభ ముగిశాక చైర్మన్.. గవర్నర్‌ను కారుదాకా తీసుకెళ్లి, నవ్వుతూ సాగనంపారని, ఆ తర్వాత సీఎం పథకం ప్రకారం నాటకానికి తెరలేచింది. ఈ సస్పెన్షన్లకు ప్రభుత్వం మూల్యం చెల్లించుకోకతప్పదు. న్యాయం కోసం ప్రజల్లోకి వెళతాం..’ అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ అన్నారు. -
స్పీకర్ చర్యలను నిరసిస్తూ కాంగ్రెస్ సంచలన నిర్ణయం
-
కాంగ్రెస్ సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : తమపై శాసనసభ సభ్యత్వాల రద్దు, సస్పెన్షన్ల వేటును విపక్ష కాంగ్రెస్ తీవ్రంగా పరిగణించింది. స్పీకర్ చర్యలను తీవ్రంగా నిరసిస్తూ ఈమేరకు సంచలన నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు ప్రకటించింది. అందరికీ అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని సీఎల్పీ నేత జానారెడ్డి చెప్పారు. ‘ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తున్నది. ఏ నిబంధన ప్రకారం మా సభ్యుల సభ్యత్వాలు రద్దు చేస్తారు? ఏం తప్పు చేశామని సస్సెన్షన్ విధించారు? కనీసం వివరణ తీసుకోకుండా ఇంత తీవ్ర నిర్ణయం తీసుకుంటారా? ఇక మీతో మాట్లాడి ప్రయోజనం లేదు. ప్రజాక్షేత్రంలోనే అమీతుమీ తేల్చుకుంటాం..’ అని కాంగ్రెస్ పక్షనేత జానా రెడ్డి అన్నారు. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ తర్వాతే.. : మంగళవారం శాసన సభ ప్రారంభమైన వెంటనే 11 మంది ఎమ్మెల్యేలపై వేటు వేయాలన్న తీర్మానం ఆమోదం పొందింది. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ల సభ్యత్వాల రద్దు, ఇతర సభ్యులపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో సభ నుంచి బయటికొచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీ ఆఫీసులో అత్యవసరంగా సమావేశమయ్యారు. మెజారిటీ ఎమ్మెల్యేలు ‘‘వాళ్లు సస్పెండ్ చెయ్యడం కాదు.. మనమే మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం..’ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఢిల్లీ అధిష్టానానికి కూడా తెలియజేశామని, అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రాజీనామాలు చేస్తామని నేతలు చెప్పారు. -
మార్షల్స్ నెట్టేయడంతోనే..
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగంలో కొన్ని అంశాలు లేనందున తాము నిరసన తెలిపే ప్రయత్నం చేశామని.. కానీ మార్షల్స్ తమను నెట్టివేయడంతోనే అసెంబ్లీలో ఘటన జరిగిందని సీఎల్పీ నేత జానారెడ్డి పేర్కొన్నారు. స్వామిగౌడ్ ప్రసంగం ముగిశాక గవర్నర్‌ను దగ్గరుండి తీసుకెళ్లారని.. అప్పుడు స్వామిగౌడ్ బాగానే ఉన్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించి.. కాంగ్రెస్ ఏదో చేసినట్టుగా చిత్రీకరిస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ ఘటన నేపథ్యంలో కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని అధికారపక్షం నిర్ణయించినట్లు సమాచారం అందడంతో.. సోమవారం మధ్యాహ్నం జానారెడ్డి, భట్టి విక్రమార్క, జీవన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. తాను నిల్చున్న టేబుల్ విరిగి తనపై పడిందని, అందుకే టేబుల్ మారానని.. తమ సభ్యుల నుంచి దూరంగా వెళ్లేందుకు కాదని జానారెడ్డి చెప్పారు. పార్లమెంటులో టీఆర్ఎస్ సభ్యులు కూడా పేపర్లు చించారని గుర్తుచేశారు. గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ప్రజల సమస్యలను ప్రస్తావించకపోవడం తమను అసహనానికి గురిచేసిందని భట్టివిక్రమార్క వివరించారు. అసెంబ్లీలో జరిగిన ఘటనకు సీఎందే బాధ్యత అని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. రెండు సార్లు భేటీ.. బడ్జెట్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించేందుకు కాంగ్రెస్ శాసనసభాపక్షం రెండు సార్లు సమావేశమైంది. సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు సమావేశమయ్యారు. గవర్నర్ ప్రసం గం సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించారు. సభలో పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలపాలని నిర్ణయించారు. ఈ మేరకు నిరసన తెలిపారు. అయితే కోమటిరెడ్డి మైకు విసరడం, అది వివాదాస్పదంగా మారడంతో.. అనంతరం మరోసారి సీఎల్పీ భేటీ జరిగింది. అసెంబ్లీలో ఘటనపై ఎలా వ్యవహరించాలన్న దానిపై చర్చించారు. తర్వాత సీఎల్పీ నేతలు మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వంపై ఎదురుదాడికి యత్నించారు. బీఏసీ సమావేశంలోనూ జానా తమ వాదనను వినిపించారు. -
యూపీఏ, ఎన్డీఏ తప్ప ఏ ఫ్రంట్ నిలవదు
మిర్యాలగూడ: దేశంలో యూపీఏ, ఎన్డీఏ కూటములు తప్ప ఏ ఫ్రంట్ ఏర్పాటు చేసినా నిలవదని సీఎల్పీనేత కె.జానారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో విలేకరులతో మాట్లాడారు. ఏ ప్రాంతీయ పార్టీ అయినా యూపీఏ లేదా ఎన్డీఏ కూటమిలో ఉండాల్సిందేనని, ఇది కాదని కొత్తగా ఫ్రంట్ ఏర్పాటు చేస్తే కాలక్రమంలో ఏం జరుగుతుందనే విషయాన్ని ప్రజలే చూస్తారని వ్యాఖ్యానించారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పోటీలో ఉంటారని తెలిపారు. గెలవటానికి సరిపడా ఓట్లు లేవని తెలిసినా పోటీలో తమ అభ్యర్థిని నిలుపుతున్నట్లు పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సుప్రీంకోర్టులో ఉందని, రాజ్యసభ ఎన్నికల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు నిబంధనలకు విరుద్ధంగా ఓటు వేస్తే సుప్రీంకోర్టులో ఆధారాలతో కేసు వేయవచ్చునని అన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు రబీ సీజన్లో ఏప్రిల్ 15వ తేదీ వరకు సాగునీరివ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడనున్నట్లు తెలిపారు. -
'కేటీఆర్ పార్లమెంటరీ పద్ధతిలోనే మాట్లాడారు'
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌పై జానారెడ్డి వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాడ్లాడుతూ కేటీఆర్ పార్లమెంటరీ పద్ధతిలోనే మాట్లాడారని స్పష్టం చేశారు. సంస్కారం గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడటం విడ్డూరమని ఉందని ఆయన ఏద్దేవా చేశారు. జానారెడ్డికి కాంగ్రెస్ నేతలు ఇవ్వని గౌరవాన్ని కేసీఆర్ ఇచ్చారన్నారు. మరో వైపు ప్రధాని మోదీపై కేసీఆర్ ఎలాంటి పరుష వ్యాఖ్యలు చేయలేదని.. బీజేపీ నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. -
వృత్తి నిపుణులు రాజకీయాల్లోకి రావాలి
సాక్షి, హైదరాబాద్: రాజకీయాలతోపాటు దేశాభివృద్ధిలో వృత్తి నిపుణులు భాగస్వామ్యం కావాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శనివారం జరిగిన సదస్సులో ఉత్తమ్‌తోపాటు ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, ప్రొఫెషనల్ కాంగ్రెస్ దక్షిణ భారత ఇన్చార్జి జె.గీతారెడ్డి, ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే పద్మావతీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు. దేశంలో, రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోందని విమర్శించారు. ప్రధానిగా మోదీ, సీఎంగా కేసీఆర్ రాజ్యాంగ పదవుల్లో ఉండటానికి అనర్హులని నిప్పులు చెరిగారు. పెళ్లి, సినిమా, తిండిపై వ్యక్తిగత స్వేచ్ఛను కేంద్ర ప్రభుత్వం హరిస్తోందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేయటంలో సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని విమర్శించారు. నెహ్రూ, పటేల్ మధ్య విభేదాలున్నట్లుగా చరిత్రను మోదీ వక్రీకరిస్తున్నారన్నారు. ఆర్ఎస్ఎస్ను సర్దార్ పటేల్ నిషేధించారని, దాన్ని ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు. పిల్లగాడు కేటీఆర్ కూడా గాంధీ, నెహ్రూలపై మాట్లాడితే రాజకీయాలపై ఎలాంటి అభిప్రాయం కలుగుతుందో ఆలోచించాలని వ్యాఖ్యానించారు. హుస్సేన్‌సాగర్ నీటిని కొబ్బరినీళ్లుగా చేస్తామని కేసీఆర్ చెప్పారని.. మరి ‘కొబ్బరినీళ్లు అయినయా’అని ప్రశ్నించారు. స్వాతంత్య్ర ఉద్యమం నుంచి దేశం కోసం, ప్రజల కోసం వృత్తి నిపుణులు పని చేస్తున్నారని ప్రతిపక్ష నేత జానారెడ్డి ప్రశంసించారు. దేశ భద్రత, అభివృద్ధిలో ప్రొఫెషనల్స్ బాధ్యత కీలకమన్నారు. రాజకీయాల్లో భాగస్వామ్యం చేసేందుకే రాహుల్ గాంధీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఏర్పాటు చేశారని చెప్పారు. ఇన్చార్జి జె.గీతారెడ్డి మాట్లాడుతూ.. వివిధ రంగాల్లోని ప్రొఫెషనల్స్‌ను కాంగ్రెస్‌కు దగ్గర చేసేందుకే ఇది ఏర్పాటైందన్నారు. ప్రొఫెషనల్ కాంగ్రెస్‌లో ప్రస్తుతం తెలంగాణలో 400 మందికి పైగా సభ్యులు చేరినట్టుగా వెల్లడించారు. -
టీఆర్ఎస్ను బ్రోకర్ పార్టీ అంటే ఏమంటారు?
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉందని, ఇది రాజకీయ దిగజారుడుకు పరాకాష్ట అని ప్రతిపక్షనేత కె.జానారెడ్డి మండి పడ్డారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై కేటీఆర్ ఉపయోగించిన పదజాలం అభ్యంతరకరమని.. ఎదుటివారిని చులకన చేస్తే ఉన్న తులం అవుతామనుకోవడం మంచిది కాదని సూచించారు. శుక్రవారం పార్టీ నేతలు గీతా రెడ్డి, జీవన్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, సంపత్‌కుమార్‌తో కలసి జానారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఏహ్యమైన మాటలు మాట్లాడడం టీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందన్నారు. కనీస సంస్కారంతో వ్యవహరించాలని.. హుందాగా, సంయమనంతో పద్ధతిగా ఉండాలని హితవు పలికారు. లోఫర్లు, బ్రోకర్లు, కాలిగోర్లు వంటి భాషతో సభ్యత, సంస్కారం నాశనమై.. రాజకీయ విలువలు దిగజారుతాయని పేర్కొన్నారు. ఇలా గతంలో కేసీఆర్ మాట్లాడినా, కాంగ్రెస్ నేతలు మాట్లాడినా.. వద్దని తాను వారించానన్నారు. కేసులకు భయపడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు: జీవన్‌రెడ్డి జై తెలంగాణ అని ముఖ్యమంత్రి అయిన కేసీఆర్.. ఇప్పుడు జై ఆంధ్రా అనే స్థాయికి వచ్చారని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు లేకున్నా, తెలంగాణ ఏర్పాటు ను ప్రధాని మోదీ అవమానించినా.. టీఆర్ ఎస్ స్పందించలేదేమని నిలదీశారు. కేసీఆర్ సీబీఐ కేసులకు భయపడి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ఇక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పై సభ్యత, సంస్కారం లేకుండా కేటీఆర్ మాట్లాడారని.. విదేశాల్లో తిరుగుతూ ఆయన నేర్చుకున్న విద్య, సంస్కారం ఇదేనా అని గీతారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చిన దేవత అంటూ కేసీఆర్ సహా కుటుంబ సభ్యులంతా సోనియా కాళ్ల దగ్గర మోకరిల్లారని పేర్కొన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదన్నారు. ఆరోగ్యశ్రీ వంటి గొప్ప పథకాలను అమలు చేసిన కాంగ్రెస్‌పై విమర్శలు చేసే స్థాయి కేటీఆర్‌కు లేదని సీఎల్పీ కార్యదర్శి టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పై నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్న కేటీఆర్‌ను ప్రజలు నమ్మక ద్రోహి అంటూ అసహ్యించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. గతంలో కాళ్లు పట్టుకున్నది ఏమైంది? కాంగ్రెస్‌ను లోఫర్ అంటూ మాట్లాడుతున్నారని.. మరి టీఆర్ఎస్ను బ్రోకర్ పార్టీ అంటే ఏం చెబుతారని జానారెడ్డి ప్రశ్నించారు. కాలిగోరుతో పోల్చినవారే గతంలో కాళ్లు పట్టుకున్న దాన్ని ఏమనాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు కనీస గౌరవం ఇవ్వకపోవడం ప్రజలను బాధిస్తోందని, వారు సమయం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ప్రధాని అయ్యే అవకాశమున్నా త్యాగం చేసిన నాయకుడు రాహుల్ అని... ప్రధాని మోదీని గుజరాత్లో మూడు చెరువుల నీళ్లు తాగించారని చెప్పారు. -
రాజకీయ కోణంలోనే తెలుగు సభలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలను భాషాభివృద్ధికోసం కాకుండా రాజకీయకోణంలో నిర్వహిస్తున్నారని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహాసభలకోసం ఆర్భాటం చేస్తున్న ప్రభుత్వం తెలుగు భాష అమలుపై ఆచరణలో చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని అన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు భాషను పెద్దగా పట్టించుకోరని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ దేశ సమగ్రతను, ఐక్యతను కాపాడటంలో ఎంతో కృషి చేశారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ అని జీవన్‌రెడ్డి కొనియాడారు. మావోయిస్టుల విధానమే తన విధానమన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎన్కౌంటర్లు చేయడం సరికాదన్నారు. ప్రజలకు ఒరిగేదేం లేదు..ప్రపంచ తెలుగు మహాసభలపై డీకే అరుణ సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ద్వారా తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన గురించి గొప్పలు చెప్పించుకోవడానికే రూ. కోట్ల నిధులు వెచ్చించి ఈ మహాసభలు నిర్వహిస్తున్నారన్నారు. శుక్రవారం ఆమె ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో తెలంగాణలో 4 వేల మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాటకు కట్టుబడే తెలంగాణ ఇచ్చారు సోనియా పార్టీ ఖ్యాతిని నిలబెట్టారు: సీఎల్పీనేత జానారెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల హృదయ ఘోషను అర్థం చేసుకుని, ఇచ్చిన హామీకి కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు కె.జానారెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డితో కలసి అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ చేసిన ఉద్యమానికి భయపడి, విధిలేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్న మాటల్లో వాస్తవంలేదని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, గుండెకోతను అర్థం చేసుకుని ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని జానారెడ్డి కొనియాడారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా 19 సంవత్సరాలపాటు సేవలందించిన సోనియా, పార్టీ ఖ్యాతిని నిలబెట్టారని పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి ఢిల్లీ వెళుతున్నందున తాను ప్రపంచ తెలుగు సభలకు హాజరుకాలేక పోతున్నానని చెప్పారు. వ్యక్తిగత రాగద్వేషాలను, మనస్పర్థలను పక్కనబెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్, తెలుగు మహాసభలకు అందరు కవులు, కళాకారులను ఆహ్వానించాలని జానారెడ్డి సూచించారు. అందెశ్రీ వంటివారిని ఆహ్వానించకపోవడం సరికాదన్నారు. -
జానారెడ్డిని పరామర్శించిన రేవంత్
సాక్షి, హైదరాబాద్ : ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని మంగళవారం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా జానారెడ్డి ప్రస్తుతం సోమాజీగూడ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 16న అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన ఆయన ...అక్కడే అస్వస్థతకు గురి కావడంతో ...హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి జానారెడ్డి ఆస్పత్రిలోనే ఉన్నారు. ఇప్పుడు ఆయన కోలుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సర్కార్‌పై అవిశ్వాసం పెడతాం!
సాక్షి, హైదరాబాద్: రైతాంగ సమస్యల పరిష్కారంపై ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధిలేదని, ప్రధాన ప్రతిపక్షంగా రైతుల పక్షాన పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని, దీనికి నిరసనగా సర్కార్‌పై అవిశ్వాసం పెట్టే ఆలోచనలో ఉన్నామని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సీఎల్పీ నేత జానారెడ్డి, డిప్యూటీ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలసి ఆయన బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. శాసన సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ తీరు అత్యంత అప్రజాస్వామికంగా ఉందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్, శాసన వ్యవహారాల మంత్రి, వ్యవసాయ మంత్రి గంటలు గంటలు మాట్లాడారని, చివరకు ప్రతిపక్ష నేతకు కనీసం నిరసన తెలిపేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదన్నారు. డిప్యూటీ స్పీకర్ ప్రవర్తన పట్ల సీఎల్పీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందన్నారు. సచివాలయంలో అగ్నిమాపక వాహనం తిరగలేదని, శాసన సభలో సీఎం, స్పీకర్ వాహనాలు ఎండ లో ఉంటున్నాయని రూ.500 కోట్లు వెచ్చించి కొత్త సచివాలయం, శాసన సభ భవనాలు నిర్మిస్తామని అంటున్నారని మండిపడ్డారు. వాస్తు కారణంగా వందల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చుపెట్టడానికి అబ్బసొత్తు కాదని, దీన్ని అడ్డుకుని తీరుతామని ఉత్తమ్ పేర్కొన్నారు. రుణమాఫీని విడతల వారీగా చేపట్టినందున రైతులపై వడ్డీ భారం పడిందని, వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తామని చెప్పినా.. ఆ హామీని నిలబెట్టుకోవడం లేదన్నారు. రైతులు.. తహసీల్దార్లు, కాంగ్రెస్ నేతలు, బ్యాంక్ మేనేజర్లకు రుణమాఫీ తర్వాత వడ్డీ భారమెంతో వివరిస్తూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. రైతులకు కనీస మద్దతు ధరపై బోనస్ ఇవ్వడం లేదని, విద్యుత్‌పైనా సీఎం, మంత్రులు పచ్చి అబద్దాలు మా ట్లాడుతున్నారని విమర్శించారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని, వ్యవసాయ సంక్షోభానికి, వేలాది మంది రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ప్రతిపక్షాల మాట వినట్లేదు: జానారెడ్డి ప్రభుత్వం సమస్యలను దాటవేస్తోందని, సీఎం ఉపన్యాసాలు ఇస్తున్నారని, సభ నిబంధనల ప్రకారం నడవడం లేదని సీఎల్పీ నేత జానారెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ప్రతిపక్షాల మాటే వినడం లేదని, రుణ విముక్తి పూర్తిగా గందరగోళ అంశమని చెప్పారు. రుణాలపై వడ్డీలను ప్రభుత్వమే చెల్లిస్తుందని గతంలో అసెంబ్లీ వేదికగా సీఎం హామీ ఇచ్చారని, వడ్డీ రూ.3 వేల నుంచి రూ.4 వేలు అవుతుండడం తో వెనక్కి తగ్గారన్నారు. సభలో నిరసన తెలుపుతామంటున్నా అవకాశం ఇవ్వడం లేదని, అంతా బావుందని రాష్ట్ర ప్రజలను భ్రమిం పజేస్తున్నారని తెలిపారు. సభలో అధికార పక్షం తీరు అప్రజాస్వామికంగా ఉందన్నారు. -
కేసీఆర్.. ఇదేం భాష?
మా ఓపికకూ హద్దుంటుంది: జానారెడ్డి సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ భాష, వ్యాఖ్యల తీరు సరికాదని, తమ సహనానికీ ఓ హద్దుంటుందని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి హెచ్చరించారు. తాము కూడా సీఎం భాషను ఉపయోగించాలనుకుంటే మూడు రెట్లు ఎక్కువగా మాట్లాడగలమన్నా రు. కానీ హుందాతనం, సంస్కారం అడ్డు వస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార పైత్యంతో పైశాచికంగా వ్యవహరిస్తోందన్నా రు. అధికారంలో ఉన్నవారు అవగాహన లేకుండా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వారి తీరువల్లే కోర్టుల్లో సర్కారుకు మొట్టికాయలు పడుతున్నాయన్నారు. అవగాహనారాహిత్యాన్ని, తప్పులను కప్పిçపుచ్చుకోవడానికే కాంగ్రెస్‌పై కేసీఆర్ నోరు పారేసుకుంటున్నారన్నారు. గురువారమిక్కడ శాసన మండలిలో కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ, ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డితో కలసి జానా విలేకరులతో మాట్లాడారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను అడ్డుకున్నది జాగృతి నేతలు కాదని చెప్పగలరా అంటూ సవాల్ విసిరారు. ‘‘సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని కాంగ్రెస్సే కోరింది. మా పార్టీ అభివృద్ధిని అడ్డుకోవడం లేదు. ప్రభుత్వ నిర్ణయాలతో కడుపు మండినవారు కోర్టులకు పోతే కాంగ్రెస్‌పై నిందలు వేయడం కేసీఆర్‌కు తగ దు. న్యాయం కోసం కోర్టులకు పోవడం నేర మా? గతంలో టీఆర్ఎస్ ఎన్నిసార్లు కోర్టుకుపోయిందో గుర్తుకు తెచ్చుకోవాలి. సీఎం అడ్డ్డ గోలుగా రాజ్యం నడపాలని చూస్తున్నారు. కొత్త ప్రాజెక్టుల ద్వారా 2018లోపు విద్యుదుత్పత్తి జరిగితే అద్భుతమే. కానీ కేసీఆర్ చెబు తున్న ఆ స్థాయిలో ఉత్పత్తి 2020కి కూడా సాధ్యంకాదు. వాస్తవాలను చెప్పకుండా నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సీఎం ఆయన స్థాయికి తగినట్టుగా వ్యవహరించాలి. వట్టి మాటలు, అబద్ధాలు మానుకోవాలి’’ అని జానారెడ్డి హితవు పలికారు. కేసీఆర్ వాడుతున్న భాష రాష్ట్రానికి మంచిది కాదని, ఇదే భావజాలాన్ని ప్రజలకు చెప్పాలని భావిస్తున్నారా అని ప్రశ్నించారు. కమ్యూనిస్టు పార్టీలను ఉద్దేశించి ‘నా కొడుకులు..’ అని సీఎం మాట్లాడటం దారుణమన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం చేసిన చరిత్ర వామపక్షాలదన్నారు. అధికారం శాశ్వతం కాదన్న సంగతిని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. -
సిరిసిల్ల ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ
♦ ప్రతిపక్ష నేత జానారెడ్డి డిమాండ్ ♦ ఎస్పీ విశ్వజిత్‌పై అట్రాసిటీ కేసులు పెడతాం: భట్టి సాక్షి, హైదరాబాద్: సిరిసిల్లలో దళితులపై సీసీఎస్ పోలీసులు దాడి చేయడం వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా ఉందని, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి డిమాండ్ చేశారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, పీఏసీ చైర్పర్సన్ జె.గీతారెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులతో కలసి గాంధీభవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు మానవత్వం లేకుండా దళితులను అమానుషంగా కొట్టారని జానారెడ్డి విమర్శించారు. దళితులపై దాడి చేసిన ప్రభుత్వానికి, పోలీసులకు కనువిప్పు కలిగేలా కార్యక్రమాలు చేస్తామన్నారు. దాడి చేసిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. భట్టి మాట్లాడుతూ 8 మంది దళితులను మఫ్టీలో వచ్చిన పోలీసులు ఈ నెల 4 నుంచి నాలుగు రోజులపాటు పోలీసు స్టేషన్లో అక్రమంగా నిర్బం« దించి కొట్టారన్నారు. ఎస్పీ విశ్వజిత్ మానవత్వానికి మచ్చ తెచ్చేలా వ్యవహరించారని, ఆయనపై అట్రాసిటీ కేసులు పెడతామన్నారు. పోలీసుల తప్పులు కప్పిపుచ్చుకునేందుకే... దళితులపై దాడులకు పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలను తీసుకోవాలని షబ్బీర్ అలీ, జె.గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ డిమాండ్ చేశారు. పోలీసుల తప్పులను కప్పిపుచ్చుకోవడానికే డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఇలాంటి అమానుష చర్యలు సిగ్గుచేటని గీతారెడ్డి మండిపడ్డారు. దళిత మహిళలతో అభ్యంతరకరంగా మాట్లాడిన అధికారులపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. -
కేటీఆర్.. అహంకారం మంచిది కాదు
పాతాళానికి ఎవరుపోతారో చూద్దాం: జానా, షబ్బీర్ సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని పాతాళానికి తొక్కాలని కుసంస్కారంతో మాట్లాడిన మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు కె.జానారెడ్డి, ఉపనేత టి.జీవన్‌రెడ్డి, శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు. గాంధీభవన్‌లో సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. కుసంస్కారం కలిగినవారు మంత్రులైనా, మరెవరైనా ఒక్కటేనని జానారెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ గురించి నోటికొచ్చి నట్టుగా మాట్లాడిన ఎన్నో పార్టీలు పాతాళానికి వెళ్లడం కాంగ్రెస్ పార్టీ చూసింద న్నారు. కాంగ్రెస్ పార్టీని తిడితే ఆకాశంపై ఉమ్మివేసినట్టేనని షబ్బీర్ అలీ అన్నారు. అహంకారం తలకెక్కిన మంత్రి కేటీఆర్‌ను రాళ్లతోకొట్టే రోజు త్వరలోనే ఉందని హెచ్చరించారు. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, మంత్రి కేటీఆర్‌కు రోజులు దగ్గరప డుతు న్నాయని హెచ్చరించారు. ఎవరు పాతాళానికి వెళ్తారో చూద్దామని సవాల్ చేశారు. తప్పుడు కేసులతో తలవంపులు తేవద్దు: రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులుపెట్టి పోలీసు వ్యవస్థకు ప్రభుత్వం తలవం పులు తెస్తోందని జానారెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వరంగల్‌లో టీఆర్ఎస్ నేతను హత్య చేసినవారు స్వయంగా లొంగిపోయారని, అయినా కాంగ్రెస్ నేత రాజేందర్‌రెడ్డిపై కేసు పెట్టడం అన్యాయమని అన్నారు. హతునితో రాజకీయ వైరాన్ని సాకుగా చూపించి, కేసును బనాయించడం రాజకీయాల్లో మంచిదికాదని, ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలుంటాయని జానారెడ్డి, షబ్బీర్‌అలీ హెచ్చరించారు. -
రాహుల్‌గాంధీ బచ్చా కాదా?
నాకు పెళ్లయింది.. పిల్లలున్నారు.. ఆయనకు అదీ లేదు ► తెలంగాణకు ప్రథమ శత్రువు కాంగ్రెస్సే: మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీనేత జానారెడ్డి హుందాగా మాట్లాడటం లేదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ‘‘పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నన్ను ‘బచ్చా’ అని అంటున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ బచ్చా కాదా? నేను పెళ్లిచేసు కున్నా.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాహుల్‌కు కనీసం పెళ్లి కూడా కాలేదు. మాట్లాడేముందు ఇజ్జత్ ఉండాలి’’ అని తెలంగాణ భవన్లో సోమవారం జరిగిన టీఆర్‌ఎస్‌ఎస్‌వీ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ కాంగ్రెస్ నేత లపై మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు అపరిచి తుడు, గజినీ సినిమాలో హీరోల్లాగా మాట్లా డుతున్నారని, పంచభూతాలను సైతం పర మాన్నంగా కాంగ్రెస్ దోచుకుతిన్నదన్నారు.తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని విమర్శించారు. ఆనాడు తెలం గాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపింది కాంగ్రెసేనని గుర్తు చేశారు. ఉద్యమ సమ యంలో తెలంగాణ నినాదాన్ని అణచివేయా లని ప్రయత్నించిందన్నారు. ఇప్పుడేమో తెలంగాణ అభివృద్ధిని కాంగ్రెస్ అడుగడుగు నా అడ్డుకుంటున్నదన్నారు. ఇంటింటికీ మంచి నీళ్లు ఇవ్వాలనే ఆలోచన గతంలో ఏ సీఎంకు గుర్తు రాలేదని, సీఎం కేసీఆర్ మాత్రం మిషన్ భగీరథ చేపట్టారని తెలిపారు. ఆనాడు ఒక్క చిత్తూరు జిల్లాలో మంచినీటి పథకానికి రూ.9 వేల కోట్లు ఖర్చుయితే తెలంగాణలో 31 జిల్లాల తాగునీటికి రూ.43వేల కోట్లు ఖర్చు కావా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు కాంట్రా క్టర్లు, సబ్ కాంట్రాక్టర్లు, బిల్లులు తప్ప మరేం కనిపించవని ఆయన ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ఎస్‌వీ... తెలంగాణ ప్రగతి సైన్యం టీఆర్ఎస్ విద్యార్థి విభాగం (టీఆర్‌ఎస్‌ఎస్‌వీ) తెలంగాణ ప్రగతి సైన్య మని కేటీఆర్ అన్నారు. విద్యార్థి విభాగం అన్ని కాలేజీలు, యూనివర్సిటీలు తిరగాల ని సూచించారు. కాలేజీల్లో, నియో జకవర్గ స్థాయిలో కమిటీలు వేయాలని, 31 జిల్లాల్లో సదస్సులు జరిపాక రాజధానిలో రాష్ట్ర సదస్సు నిర్వహిద్దామన్నారు. సమావేశం అనంతరం ఆయన టీఆర్‌ఎస్‌ఎస్‌వీ ర్యాలీని జెండాఊపి ప్రారంభించారు. ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌ఎస్‌వీ సైన్యంగా పనిచేసిందని, ఇప్పుడుకూడా బంగారు తెలంగాణ కోసం పనిచేయాలని పిలుపుని చ్చారు. జ్ఞానంకోసం చదువు.. జనంకోసం నడువు అన్నది సీఎం కేసీఆర్ ఆలోచనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలిలో ప్రభుత్వవిప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మేయర్ బొంతురామ్మోహన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
జీఎస్టీ వల్ల రైతులపై పెనుభారం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయంలో కీలకమైన ట్రాక్టర్ల మీద పన్ను, బ్యాంకుల్లో సేవా పన్నుతో రైతులపై జీఎస్టీ భారంగా మారుతుందని అసెంబ్లీలో కాంగ్రెస్ లిజిస్లేటివ్ పార్టీ(సీఎల్పీ)నేత జానారెడ్డి విమర్శించారు. శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, సీఎల్పీ ఉపనేతలు జీవన్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డితో కలసి శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. రైతులపై భారం వల్ల వ్యవసాయంపై ఆసక్తి తగ్గే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ హామీ ప్రకటనలకే పరిమితమైందని, రుణమాఫీ కాక రైతులు ఇంకా రుణగ్రస్తులుగానే ఉన్నారని పేర్కొన్నారు. బ్యాంకుల్లో రైతుల ఖాతాల్లో ఉన్న డబ్బులనూ వారికి అందించలేదని, రైతులపై వడ్డీ భారం అలాగే ఉందన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు గులాబీ రంగులు వేస్తున్నారని, కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని టీఆర్ఎస్ పార్టీ రంగులతో దాచలేరని ఎద్దేవా చేశారు. -
బంగారు తెలంగాణ అంటే అప్పులేనా?
- టీఆర్ఎస్ వచ్చాక రూ. 2 లక్షల కోట్లకు చేరిన అప్పులు - అభివృద్ధి పేరిట అప్పులు చేస్తున్న కేసీఆర్ సీఎంగా అర్హుడు కాదు - సీఎల్పీ నేత కె.జానారెడ్డి విమర్శలు బీబీనగర్ (భువనగిరి)/యాదగిరికొండ (ఆలేరు): బంగారు తెలంగాణ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టాను సారంగా అప్పులు తెస్తోందని, మున్ముందు రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చే ప్రమాదముందని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కె.జానారెడ్డి విమర్శించారు. యాదా ద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌తో పాటు వెంకిర్యాల, రాఘ వాపురంల్లోని చెరువులను బుధవారం సందర్శించారు. వాటిలో ప్రభుత్వం వేయించిన చేపలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఉన్న అప్పులు రూ. 2 లక్షల కోట్లకు చేరాయన్నారు. అభివృద్ధి పేరుతో అప్పులు చేస్తున్న కేసీఆర్ సీఎంగా అర్హుడు కాదన్నారు. రైతు రుణమాఫీ కింద వడ్డీ కూడా కలిపి ఇస్తామని చెప్పిన ప్రభు త్వం ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని జానారెడ్డి అన్నారు. ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చ రించారు. 2019లో బాలాలయంలోని స్వామి, అమ్మవార్ల సన్నిధిలో జానారెడ్డి తన మనవరాలికి అన్నప్రాసన చేయించేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లా డారు. ప్రాజెక్టులను అడ్డుకో వడం మా అభిమతం కాదని, బాధితులకు తగిన న్యాయం చేయాలన్నారు. -
సర్వేలపై మాకు నమ్మకం లేదు
-
ట్రంప్‌లాగే అధికారంలోకి వస్తాం
► అమెరికా ఎన్నికల్లో హిల్లరీనే గెలుస్తుందని సర్వేలన్నీ చెప్పాయి: జానారెడ్డి ► కేసీఆర్ సర్వే హాస్యాస్పదం ► ప్రజా సమస్యలను పక్కనబెట్టి సర్వేలు, ఎన్నికలేంటి? ► ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలే కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తారని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలను గాలికొదిలేసి ఎన్నికలు, సర్వేలే ముఖ్యమన్న ట్టుగా సీఎం కేసీఆర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు కె.జానారెడ్డి విమర్శించారు. అమెరికాలో హిల్లరీ క్లింటన్ గెలుస్తారని సర్వేలన్నీ వెల్లడిస్తే అనూహ్యంగా ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచారని గుర్తుచేశారు. ‘అమెరికాలో ట్రంప్లాగానే 2019లో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. ఇక్క డ కాంగ్రెస్ పార్టీయే ట్రంప్.. వ్యక్తులు కాదు’ అని వ్యాఖ్యానించారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డితో కలసి అసెంబ్లీ ఆవరణలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లా డారు. ప్రజా సమస్యలు, రైతుల ఆత్మహత్య లు, ఆందోళనలను పక్కన బెట్టిన ప్రభుత్వం సర్వేలతో ప్రజలను పక్కదారి పట్టించే ప్రయ త్నం చేస్తున్నదని దుయ్యబట్టారు. ఇలాంటి సర్వేలను తాను విశ్వసించనన్నారు. ప్రజా స్వామ్య పరిరక్షణ కోసం 2019లో కాంగ్రెస్‌కు ప్రజలే పట్టం కడతారన్నారు. ‘ప్రజల ఆకాంక్ష లను తీర్చి, వారి మన్ననలు పొందడంలో తప్పులేదన్నారు. దేశానికి స్వాతంత్య్రం లేన ప్పుడు ప్రజల కోసం నిలబడి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే కాంగ్రెస్ ధ్యేయం. 2019 ఎన్నికల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ను ప్రజలే అధికారం లోకి తెస్తారన్న విశ్వాసముంది. మాకు సర్వే లపై కన్నా ప్రజలపై విశ్వాసం ఉంది. సీఎం చేయించుకున్న సర్వే ఫలితాలు హాస్యాస్ప దంగా ఉన్నాయి. అందులో వాస్తవాలేమిటో, ఎలాంటి సర్వేనో ప్రజలే తేలుస్తారు’ అని ఆయన పేర్కొన్నారు. అందరితో చర్చించాకే పొత్తులపై నిర్ణయం టీడీపీతో పొత్తు అంశం ఇప్పుడు అసందర్భ మని, పొత్తులపై చర్చించాల్సిన అవసరమే లేదని జానా పేర్కొన్నారు. పొత్తులపై కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి వ్యాఖ్యలను వక్రీక రించినట్టుగా ఉందన్నారు. పొత్తుల అంశంపై మాట్లాడాల్సి వస్తే ముందుగా పార్టీలో అన్ని స్థాయిల్లోని నాయకులంతా చర్చించుకున్న తర్వాత నిర్ణయాలుంటాయన్నారు. ‘రాష్ట్రం ఏర్పాటై మూడేళ్లవుతున్న సందర్భంగా జూన్ 1న సంగారెడ్డిలో తెలంగాణ ప్రజాగర్జన పేరు తో బహిరంగ సభను నిర్వహిస్తున్నాం. ఇందు లో ఈ మూడేళ్లలో రైతులు, ప్రజా సమ స్యలను ప్రజలకు వివరిస్తాం’ అని చెప్పారు. ప్రాజెక్టులు పూర్తి కాకుండా కాల్వలు తవ్వొద్దన్న సీఎం ఇప్పుడు కాల్వలే ముందు తవ్వాలని ఎందుకు అంటున్నారని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ప్రజాగర్జన సభలో కేంద్రం, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై రాహుల్ గాంధీ చార్జిషీట్ పెడతారని పొంగులేటి సుధాకర్‌రెడ్డి చెప్పారు. -
సర్వే గురించి మాట్లాడం హాస్యాస్పదం
హైదరాబాద్: అన్ని సమస్యలను పక్కన పెట్టి రెండు ఏండ్ల తర్వాత వచ్చే ఎన్నికల సర్వేల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో విలేకరులతో మాట్లాడుతూ..సమస్యలు దాటవేసి..ఎప్పుడో వచ్చే ఎన్నికల ముఖ్యమా లేక ప్రజా సమస్యలు ముఖ్యమా ప్రభుత్వం ఆలోచించాలన్నారు. సర్వేల పేరు చెప్పి ప్రజలను పక్క దారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వంలో ఉన్నా, లేకున్నా ప్రజా సమస్యలపై పోరాటం చెయ్యడమే మా ధ్యేయమన్నారు. టీడీపీతో పొత్తు అసందర్భ విషయమని తెలిపారు. జైపాల్ రెడ్డి మాట్లాడిన విషయంపై వక్రీకరణ చేసారేమో అని అనుమానంగా ఉందన్నారు. తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా..జూన్ ఒకటిన సంగారెడ్డిలో సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మూడు ఏండ్లుగా దేశంలో, రాష్ట్రంలో రైతాంగ పరిస్థితులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హామీల అమలు నిర్లక్ష్యంపై రాహుల్ గాంధీ ప్రజలకు వివరిస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రాహుల్ సభకు వేలాదిగా తరలి రావాల్సిందిగా సీఎల్పీ తరపున ప్రజలను కోరారు. -
రైతులపై కుట్ర కేసులా..?
► వారిని సంఘ వ్యతిరేక శక్తులుగా ముద్ర వేస్తారా? ► ఖమ్మం మార్కెట్‌ను సందర్శించిన సీఎల్పీ నేత జానారెడ్డి సాక్షి, ఖమ్మం: ‘‘మిర్చిని అమ్ముకోవడానికి రైతులు మార్కెట్‌కు తెచ్చారు.. ధర లేదని ఆవేశంతో రైతులు ఆందోళన చేస్తే ప్రభుత్వా న్ని కూల్చేందుకు కుట్ర చేశారని కేసులు పెడ తారా’’అంటూ కాంగ్రెస్ శాసనసభా పక్షనేత కుందూరు జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఖమ్మం మార్కెట్‌ను సం దర్శించారు. తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, కార్యదర్శి ప్రసాదరావుతో ఘటన జరిగిన తీరుపై మాట్లాడారు. ఈ సం దర్భంగా కాంగ్రెస్ నేత లు, మార్కెట్ కమిటీ చైర్మన్ మధ్య వాగ్వాదం జరిగింది. అనం తరం ఖమ్మం మార్కెట్‌పై దాడి ఘటనలో అరెస్టయి ఖమ్మం జిల్లా జైలులో ఉన్న రైతు లను కాంగ్రెస్ నేతలు కె. జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ వి. హనుమంతరావు తదితరు లు సోమవారం పరామర్శించా రు. జానారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం పంట లకు గిట్టుబాటు ధర ఇవ్వా ల్సిందిపోయి రైతులపట్ల అహం కారంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతులను సంఘ వ్యతిరేక శక్తులుగా ముద్రవేసి జైల్లో పెట్టించిందని, తాము బాధిత కుటుంబాలతో మాట్లాడితే వారు రైతులేనని తేలిందన్నారు. రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. కొందరు వ్యా పారులు టీఆర్ఎస్లో చేరిన తర్వాత రైతు లను దోచుకుంటున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన: సీతక్క రాష్ట్రంలో రాక్షసపాలన నడుస్తోందని టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సీతక్క అన్నారు. జైలు లో ఉన్న రైతులను ఆమె పరామర్శించారు. -
‘తూతూగానా?.. మాట్లాడే చాన్స్ ఇవ్వరా!’
-
కాంగ్రెస్‌లో అంతా కట్టప్పలే..!
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సరదాగా ఒక హ్యూమరస్ ఔట్లుక్! ‘బాహుబలి–2 వస్తున్నది... ఫస్ట్ డే రోజే చూడాలె’ అన్నడు నర్సింగ్. ‘అవ్‌గనీ... గీపారి బాహుబలి ఏషం ఎవరేసిండ్లే...?’ అని అడిగిండు యాదగిరి. ‘ఎవరేసుడేందిరా? బాహుబలి అంటే ప్రభాసే కదా...?’ అన్నడు నర్సింగ్. ‘అరెవారీ... నీకు గింతగూడ జన్రల్ నాలెడ్జ్ లేదురా. మొన్న తెలంగాణ అసెంబ్లీల జానారెడ్డి సారేమన్నడు. కాంగ్రెస్ పార్టీకి ఒక బాహుబలి ఒస్తడు... పార్టీని గెలిపిస్తడు అని అన్నడు కదా...’ అన్నడు యాదగిరి. ‘అవ్ అవ్... జానారెడ్డి సారు గా మాట అనంగనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గీతారెడ్డి అసొంటోళ్లు లేసి జానారెడ్డే మా బాహుబలి అని చెప్పిండ్లు కదా ’ అన్నడు నర్సింగ్. ‘జానారెడ్డి లెక్కల బాహుబలి అంటే రాహుల్ గాంధీ. కోమటిరెడ్డి లెక్కల జానారెడ్డే బాహుబలి. జానారెడ్డి అంటే పడనోళ్లకు మరో లీడర్ బాహుబలి. ఇగ కొంతమంది లీడర్లయితే మాకంటే బాహుబలి ఎవరున్నరు అని మనసుల అనుకున్నరు. మరి వీళ్లల్ల రాజమౌళి ఎవరికి బాహుబలి వేషమిస్తడో ఏందో చూడాలె’ అన్నడు యాదగిరి. ‘మొత్తానికి కాంగ్రెసోళ్లందరు బాహుబలికి బాగనే ప్రచారం చేస్తున్నరు... అసలు కాంగ్రెస్‌ల ఎంతమంది బాహుబలులు ఉన్నరే?’ అని అడిగిండు నర్సింగ్. ‘కాంగ్రెస్‌ల బాహుబలులు ఉన్నారో లేదో తెల్వదుగనీ... కట్టప్పలు మాత్రం మస్తు మందున్నరు’ అన్నడు యాద్గిరి. ‘కాంగ్రెస్‌ల ప్రతి ఒక్కడూ కట్టప్పనే. జానా బాహుబలి అయితే పొన్నాల కట్టప్ప అయితడు... కోమటి రెడ్డి బాహుబలి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కట్టప్ప అయితడు’ అని యాదగిరి చెబుతుంటే... ‘మరి అట్లయితే భళ్లాల దేవుడెవర్రా?’ అని అడిగిండు నర్సింగ్. ‘పిసిసి ప్రెసిడెంట్ కుర్చీల ఎవరు కూసుంటే వాళ్లే భళ్లాల దేవుడు’ అన్నడు యాదగిరి. అబ్బర నాయనా... మస్తు చెప్పినవ్... అన్నడు నర్సింగ్. – ఓరుగల్లు శ్రీ -
కళ్లు తెరవకుంటే మాల్యా గతే
⇒ రాష్ట్రం అప్పుల కోసం ఆదాయం పెంచి చూపింది ⇒ మేం చెప్పిందే కాగ్ నివేదికలో పొందుపరిచింది: జానారెడ్డి సాక్షి, హైదరాబాద్: వివిధ ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకునేందుకు రాష్ట్ర ఆదా యాన్ని పెంచి చూపించారని కాంగ్రెస్ శాసన సభాపక్ష నాయకుడు కె.జానారెడ్డి విమర్శించా రు. పార్టీ నేతలు షబ్బీర్‌అలీ, టి.జీవన్‌రెడ్డితో కలసి మంగళవారమిక్కడ ఆయన విలేకరుల తో మాట్లాడారు. ‘‘ప్రభుత్వ ఆదాయం కంటే అప్పులు ఎక్కువయ్యాయి. ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే విజయ్‌మాల్యాకు పట్టిన గతి పట్టే ప్రమాదం ఉంది. అప్పు తెచ్చి మోటారు సైకిళ్లపై విహారాలు చేయడం మంచిది కాదు. ప్రభుత్వ ఖజానాకు వాస్తవంగా వస్తున్న ఆదా యం, అంచనాలు,వినియోగం వంటి వాటిపై స్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయి. వీటిలోని వాస్తవాలను ప్రభుత్వం అంగీకరించకుంటే కాగ్ బయటపెడుతుందని చెప్పిన మాటలు నిజమయ్యాయి. వాస్తవాలకు భిన్నంగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయని కాగ్ చెప్ప డంతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తేట తెల్లమైంది’’ అని జానారెడ్డి అన్నారు. 2015–16 బడ్జెట్లో నిబంధనలకు విరుద్ధం గా రాబడిగా వచ్చిన రూ.4,215 కోట్ల నిధులు మురిగిపోయాయన్నారు. బడ్జెట్‌పై చర్చలో రాబడికి, ఖర్చుకు మధ్య దాదాపు రూ.8 వేల కోట్ల వ్యత్యాసం కనిపిస్తోందని అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేలు హెచ్చరించారన్నారు. ఇదే విషయాన్ని కాగ్ కూడా గుర్తించి, హెచ్చరిం చిందన్నారు. లేని కార్పొరేషన్ల ద్వారా తీసుకు న్న రుణాలను కూడా ఖజానాలో వేసుకుని, రాబడులుగా చూపించారని విమర్శించారు. భ్రమల్లో ఉంచుతున్నారు... ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ప్రకారం 2015–16లో ఖర్చు చేయాల్సిన మొత్తంలో కేవలం 49 శాతం మాత్రమే ఖర్చు చేసి, మిగిలిన వాటిని 2016–17లో ఖర్చు చేశారని జానా చెప్పారు. 2016–17కు సంబంధించిన ఒక్కపైసా కూడా వినియోగించకుండా, ఆ వర్గాలను భ్రమల్లో ఉంచుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సభ్యులు లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇవ్వకుండా వాస్తవాలను పక్కదారి పట్టించే లా సీఎం మాట్లాడారన్నారు. ప్రతిపక్షాల సూచనలను పట్టించుకోకుంటే అవి ప్రజాం దోళనలుగా మారే ప్రమాదముందన్నారు. కాంగ్రెస్ ఎప్పటినుంచో చెబుతున్న అంశా లను ఇప్పుడు కాగ్ వెల్లడించిం దని షబ్బీర్ అలీ చెప్పారు. ఎక్సైజ్ శాఖలో తప్ప దేని లోనూ ఆదాయం రావడం లేదన్నారు. -
ఇలాగే అప్పులైతే.. రాష్ట్రానికి మాల్యా పరిస్థితే
హైదరాబాద్: బడ్జెట్ వాస్తవ విరుద్ధంగా వుందని అసెంబ్లీలో తాను చెప్పిన విషయాలు కాగ్ నివేధికాలోను వెల్లడయ్యాయని కాంగ్రెస్ నేత జానారెడ్డి తెలిపారు. ఆయనిక్కడ మంగళవారం మాట్లాడుతూ 'బడ్జెట్ గణాంకాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని కాగ్ కూడా తేల్చింది. పద్దులు నిర్వహణ నిబంధనలను ప్రభుత్వం అతిక్రమించింది అని కాగ్ ఆక్షేపించింది. Sc,st సబ్ ప్లాన్ నిధుల్లో సగం కూడా ఖర్చుచేయలేదని కాగ్ తేల్చింది. టీఆర్ఎస్ హామీలకు తగిన విధంగా ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. కేటాయించిన నిధులను కూడా పూర్తిగా ఖర్చు చేయడంలేదు. కొత్త రాష్ట్రం అనే సంయమనం పాటిస్తూ ప్రభుత్వానికి సహకరిస్తున్నాం. మా సహకారాన్ని ప్రభుత్వం సరిగా అర్ధం చేసుకోలేకపోతే ప్రజా ఆందోళనలు వస్తాయి. ఆస్తులు.. ఆదాయాల కంటే.. అప్పులు ఎక్కువయితే ప్రమాదం. ప్రభుత్వం ఇష్టానుసారంగా చేస్తున్న అప్పులు ఆందోళన కరంగా ఉన్నాయి. ప్రభుత్వ ఆర్ధిక విధానాలు రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితిలను ఆర్ధిక వేత్తలు ప్రజలకు తెలియజేయాలి. ప్రభుత్వం ఇలాగే అప్పులు చేసుకుంటూ పోతే విజయ్ మాల్యాకి పట్టిన పరిస్థితే రాష్ట్రానికి పడుతుంది. అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే ప్రభుత్వానికే కాదు.. ఇతరపార్టీలకు కూడా కాంగ్రెస్ సహకరించింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పై చేసిన వాఖ్యలు పసలేనివి.. ఉద్వేగం, ఉద్రేకం తో మాట్లాడినవి. రేవంత్ కాదు చంద్రబాబు మాట్లాడితే స్పందిస్తా' నని ఆయన తెలిపారు. కాగా మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ బడ్జెట్ పై మేము విమర్శలు చేస్తే రాజకీయం అన్నారు. ఇపుడు కాగ్ కూడా మేము చేసిన ఆరోపణలే తన నివేదికలో పేర్కొంది. కాగ్ నివేదికను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని తప్పుని సరిదిద్దుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. -
‘జానా’ తీరుపై సంపత్ నిరసన
నల్ల కండువాతో అసెంబ్లీకి హాజరు ♦ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధి బిల్లుపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదని అసంతృప్తి ♦ తాను మాట్లాడతానన్నా జానారెడ్డి పట్టించుకోలేదని కినుక ♦ వంశీకే మైక్ ఇప్పించడానికి ప్రయత్నించారని ఆరోపణ ♦ ప్రభుత్వం కూడా అవకాశం రాకుండా కుట్ర పన్నిందని ధ్వజం ♦ కాంగ్రెస్ శాసనసభాపక్షం అండగా నిలవకపోవడంపై ఆవేదన సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభ్యుడు సంపత్‌కుమార్ శనివారం నల్లకండువాతో శాసనసభకుహాజరవడం చర్చనీయాంశమైంది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేకనిధి బిల్లుపై చర్చ సం దర్భంగా శుక్రవారం శాసనసభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు నిరసనగా నల్లకండువాతో సభకు హాజరైనట్లు సంపత్ మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను మాట్లాడతానన్నా సీఎల్పీ నేత జానారెడ్డి తనకు అవకాశం కల్పించలేదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను కాంగ్రెస్ పార్టీ తెచ్చిందని, దానిలోని లోతుపాతులపై అధ్యయనం చేశానని, తనకు అవగాహన ఉందని, అయినా మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం అన్యా య మని అన్నారు. కాంగ్రెస్‌కే చెందిన వంశీచంద్ రెడ్డికి మైక్ ఇప్పించడానికి జానారెడ్డి పదేపదే ప్రయత్నం చేశారని సంపత్‌కుమార్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సంక్షేమ పద్దులపై చర్చలో ప్రభుత్వ విధానాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిని ఎత్తి చూపానని, దాంతో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధి బిల్లుపై మాట్లాడే అవకాశం రాకూడదని ప్రభుత్వం కుట్ర చేసిందని, ప్రభుత్వ ఒత్తిడికి స్పీకర్ తలొగ్గారని ఆరోపించారు. అభివృద్ధి నిధిపై సబ్‌కమిటీలో సభ్యునిగా ఉన్న తనకు అవకాశం రాకపోతే కాంగ్రెస్ శాసనసభాపక్షం కూడా తనకు మద్దతుగా నిలవకపోవడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని సంపత్ అన్నారు. అన్ని పక్షాలు దళితుల విషయంలో సభను తప్పుదారి పట్టించాయన్నారు. కాంగ్రెస్‌పార్టీ హయాం లోనే దళితులకు మేలు జరిగిం దన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మేలును శాసనసభలో మాట్లాడే అవకాశం వచ్చిన తమ పార్టీ సభ్యులు కూడా సరిగా చెప్పలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం కుట్రచేస్తే, దళిత బిడ్డగా తనకు కాంగ్రెస్ సభ్యులు అండగా ఉండకపోవడంతో రాత్రంతా తీవ్ర ఆవేదన చెందినట్టుగా సంపత్‌కుమార్ వెల్లడించారు. సీనియర్ల బుజ్జగింపులు నల్లకండువాతో అసెంబ్లీకి వచ్చిన సంపత్ కుమార్‌ను కాంగ్రెస్‌పార్టీ సీనియర్ ఎమ్మె ల్యేలు పలువురు బుజ్జగించే ప్రయత్నం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జి.చిన్నారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి తదితరులు ఆయనకు నచ్చ జెప్పారు. సంపత్‌కుమార్‌తో మాట్లాడటానికి జానారెడ్డి కూడా సీఎల్పీ కార్యాలయం వైపు వచ్చారు. సంపత్ కోసం సీఎల్పీ కార్యాలయం ఎదుట జానారెడ్డి కొంతసేపు వేచిచూశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి చెప్పినా సంపత్ పట్టించుకోలేదు. ఇప్పుడు జానారెడ్డితో మాట్లాడేదీ ఏమీ లేదని, ఆయన ఇంటికి వెళ్లి మాట్లాడతానని బెట్టు చేశారు. దీంతో జానారెడ్డి కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత మరోసారి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సంపత్ శాసనసభలో జరిగిన అంశాలపై తనకు ఆవేదన ఉందని. అన్ని విషయాలను అంత ర్గతంగానే చెప్పుకునేందుకు సీఎల్పీ సమా వేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్లో చేరుతారా? టీఆర్ఎస్లోని ఓ ప్రముఖ నేతతో సంపత్ టచ్‌లో ఉన్నారని, ఆ పార్టీలో చేరడానికి వ్యూహంలో భాగంగానే నల్లకండువాతో సభకు వచ్చి ఉంటారని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. సంపత్‌కుమార్ టీఆర్ఎస్లో చేరడానికి సదరు ప్రముఖ నేతతో ఇప్పటికే చాలా సార్లు సంప్రదింపులు జరిపినట్లు తమ దృష్టికి వచ్చిందని సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు. కాంగ్రెస్ దళి తులకు వ్యతిరేకం అన్న అపవాదు కలిగించే ప్రయత్నంలోనే సంపత్ కుమార్ ఇలా చేసి ఉంటారని కాంగ్రెస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడబోనని సంపత్‌కుమార్ చెప్పారు. తన కుటుంబం యావత్తు మొదటి నుంచి కాంగ్రెస్‌తోనే ఉన్నదని, భవిష్యత్‌లో కూడా తాను కాంగ్రెస్‌తోనే ఉంటానని ఆయన విస్పష్టంగా చెప్పారు. -
బీజేపీ సభ్యుల సస్పెండ్.. కాంగ్రెస్ వాకౌట్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఐదుగురు బీజేపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసన చేపట్టడంతో వారిని రెండు రోజుల పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ మధుసూదనాచారి నిర్ణయం తీసుకున్నారు. కాగా.. బీజేపీ సభ్యుల సస్పెన్షన్‌ను నిరసిస్తూ.. సభ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. ఏకపక్షంగా సభ్యులను సస్పెండ్ చేయడం సరికాదని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి ఈ సందర్భంగా అన్నారు. -
జానారెడ్డి కారెక్కుతారు: రసమయి
హైదరాబాద్: సాధారణ ఎన్నికలకు ఆరు నెలల ముదు కాంగ్రెస్‌లో నేతలెవరు మిగలరని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ జోస్యం చెప్పారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ముఖ్యనేతలంతా త్వరలో కారుక్కుతారని తెలిపారు. కాంగ్రెస్ నేత జానరెడ్డి కూడా వలసలకు మినహాయింపు కాదని.. ఎన్నికలకు ముందే ఆయన కూడా కారెక్కుతారని అభిప్రాయపడ్డారు. మంత్రి హరీష్ రావుకు నేను జీరాక్స్‌నని, ఆయన ఏం చేస్తే అది నేను ఫాలో అవుతానన్నారు. కానీ ఆయనకు ఇచ్చినంత ప్రచారం మీడియా నాకు ఇవ్వడం లేదని వాపోయారు. క్యాష్ లెస్ గ్రామాల్లో ఆయనే నాకు ఆదర్శమని చెప్పారు. రాష్ట్రంలో అధికారులు ఎమ్మెల్యేలకు తగిన గౌరవం ఇవ్వడం లేదని.. కనీస ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపించారు. ఉద్యమంలో నుంచి వచ్చారు.. వీళ్లకేం తెలుసు అనే ధోరణిలో ప్రవర్తిస్తున్నారన్నారని, రాష్ట్రంలో అడ్మినిస్ర్టేషన్ సరిగ్గా లేదని నా నోటితో చెప్పలేనని వ్యాఖ్యానించారు. -
60 రోజులు నీరుతోడే పంపుసెట్లు ఎందుకు?
-
60 రోజులు నీరుతోడే పంపుసెట్లు ఎందుకు?
♦ ‘పాలమూరు’పై అసెంబ్లీలో ప్రశ్నించిన జానారెడ్డి ♦ ఒక టీఎంసీ నీటితో 13వేల ఎకరాలకు నీరెలా ఇస్తారు? సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌లో నీటిలభ్యత 30 రోజులు ఉంటే, 60 రోజుల పాటు నీటిని తోడే పంప్సెట్లను ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రతిపక్ష నేత జానారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శాసనసభలో నీటిపారుదల శాఖ పద్దుపై బుధ వారం ఆయన మాట్లాడుతూ.. నీటి లభ్యత కన్నా ఎక్కువ సామర్థ్యంతో పంప్సెట్ల ఏర్పాటు వల్ల అనవసర సమస్యలు వస్తాయన్నారు. మరోవైపు నీటి లభ్యత మేరకు అనుమతులు ఇస్తామని కేంద్ర జల సంఘం చెబుతుండడాన్ని జానారెడ్డి ప్రస్తావించారు. ప్రాణహిత ద్వారా ఒక టీఎంసీ నీటిని 13,700 ఎకరాలకు ఏ విధంగా సరఫరా చేస్తారు.. అందుకు వినియోగించబోయే టెక్నాలజీని డీపీఆర్‌లో ఎందుకు పేర్కొనలేదు అని ప్రశ్నించారు. కాళేశ్వరం ద్వారా రబీ పంటకు 5లక్షల ఎకరాలకు నాలుగు నెలల పాటు నీరిస్తామంటున్న ప్రభుత్వం, 120 రోజులపాటు పొలాలకు నేరుగా నీరిస్తే రిజర్వా యర్లను ఎప్పుడు నింపుతారో చెప్పాలన్నారు. భూసేకరణతోనే ప్రాజెక్ట్‌లు పూర్తికావు: హరీశ్‌రావు కేవలం భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసినంత మాత్రాన ప్రాజెక్ట్‌లు పూర్తి అయినట్లు కాదన్న విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గ్రహించాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. భూసేకరణతో పాటు సాంకేతిక, డిజైన్, రైల్వే, అటవీ.. తదితర అనుమతులు కూడా అవసరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్ట్‌లకు అవసరమైన దాంట్లో అది 50శాతమే సేకరించారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 2013 భూసేకరణ చట్టం మేరకు దేశంలో ఎక్కడా ప్రాజెక్ట్‌లు నిర్మాణం కాలేదన్నారు. రాష్ట్ర అవసరాల మేరకే ప్రాజెక్ట్‌లకు భూమిని సేకరిస్తామని, గతంలో సేకరించి.. ఆయా ప్రాజెక్ట్‌లకు వినియోగించని భూములను తిరిగి రైతులకు ఇచ్చేస్తామని మంత్రి తెలిపారు. -
మా బాహుబలి జానా, ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీకి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డిలే బాహుబలి అని ఆ పార్టీ ఎమ్మెల్యే గీతారెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చాలా బలముందని, ఇతర పార్టీల నుంచి బాహుబలి రావాల్సిన అవసరం లేదన్నారు. గత ప్రభుత్వాల్లో మీడియా ప్రతినిధులు అసెంబ్లీ అం తటా కనిపించేవారని, ఇప్పుడెందుకు కనిపించడంలేదన్నారు. కాంగ్రెస్ కుస్తీ పార్టీకాదు: మల్లు రవి బాహుబలిలు ఎవరైనా ఉంటే సినిమాల్లోకి లేదా కుస్తీపోటీలకు పోతే మంచిదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కుస్తీల పార్టీ కాదని, రాజకీయాల్లో బాహుబలికి స్థానం లేదన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, వైఎస్ రాజశే ఖరరెడ్డి వంటివారంతా ప్రజల నాయకులు అని, వారంతా బాహుబలిలు కాదన్నారు. -
చేతులెత్తి దండం పెడుతున్నా..
ప్రాజెక్టులకు అడ్డం పడొద్దు: కాంగ్రెస్‌కు హరీశ్ విన్నపం ⇒ జనం ఉసురు పోసుకోవద్దని వ్యాఖ్య ⇒ అక్రమ ప్రాజెక్టులకు గేట్లెత్తి హారతులిచ్చింది ఎవరో తెలుసంటూ విమర్శలు ⇒ గత వైఫల్యాలకు తమను బాధ్యులను చేయొద్దన్న జానారెడ్డి ⇒ తాము మొదలుపెట్టిన ప్రాజెక్టులనే పూర్తి చేశారన్న డీకే అరుణ ⇒ సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో వాడివేడి చర్చ సాక్షి, హైదరాబాద్: ‘‘దండం పెడుతున్నా.. మా మీద కోపం ఉంటే తిట్టండి.. కానీ ప్రాజెక్టులను మాత్రం దయచేసి అడ్డుకోవద్దు. జనం ఉసురు పోసుకోవద్దు. ఇక మీ దయ..’’ అంటూ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చేతులెత్తి కాంగ్రెస్ సభ్యులను వేడుకున్నారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలకు, సాగునీటి ప్రాజెక్టులు ఒక్కటీ పూర్తి కాకపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని మండిపడ్డారు. నందికొండ దగ్గర కట్టాల్సిన నాగార్జునసాగర్ స్థలాన్ని మార్చడం మొదలు ప్రాజెక్టులను, చెరువులను పట్టించుకోకపోవడంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణకు అన్యాయం చేసే అక్రమ ప్రాజెక్టులకు, అనుమతుల్లేని ప్రాజెక్టులకు గేట్లు ఎత్తి, మంగళ హారతులు ఇచ్చిన కాంగ్రెస్ సభ్యులు ఇప్పుడు కూడా అడుగడునా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం శాసనసభలో నీటిపారుదల శాఖ పద్దుపై చర్చ అనంతరం హరీశ్ సమాధానం ఇచ్చారు. నీటి లభ్యత లేనందునే ప్రాణహిత రీ డిజైన్ తమ్మిడిహెట్టి వద్ద సరైన నీటి లభ్యత లేని కారణంగానే ప్రాణహిత ప్రాజెక్టును రీ డిజైన్ చేశామని హరీశ్ తెలిపారు. నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ 2015లో చెప్పిందన్నారు. తమ్మిడిహెట్టి వద్ద 270 టీఎంసీలు అనుకున్నామని... కానీ 165 టీఎంసీలే ఉన్నాయని సీడబ్ల్యూసీ పేర్కొందన్నారు. 152 మీటర్ల వరకు కడితే 120 టీఎంసీలు వస్తాయని.. 148 వద్ద కడితే 44 టీఎంసీలే లభ్యతగా ఉంటాయని చెప్పిందన్నారు. 2013లో అప్పటి మహారాష్ట్ర సీఎం సైతం ముంపును ఒప్పుకోమని చెప్పారన్నారు. ‘‘మల్లన్నసాగర్‌ను నిలుపుదల చేసేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేసింది. సిరిసిల్లలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన మహేందర్‌రెడ్డి మల్లన్నసాగర్‌పై చనిపోయిన వ్యక్తుల పేర్లపై కేసులు వేశారు. రెండేళ్ల క్రితం చనిపోయిన రైతులు ఆత్మలుగా వచ్చి కాంగ్రెస్ తరపున కేసులు వేశాయా? కొల్హాపూర్‌లో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేశారు. అడవి ఉందని... పులులు చనిపోతాయని చెప్పి పాలమూరు ప్రాజెక్టును అడ్డుకున్నారు. నిజానికి అక్కడ పులులు కాదు కదా పిల్లులు, తొండలు కూడా లేవు..’’ అని హరీశ్ అన్నారు. మేం నీళ్లిచ్చింది వాస్తవం కాదా: జానా మంత్రి హరీశ్ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంతో ప్రతిపక్ష నేత జానారెడ్డి జోక్యం చేసుకుని మాట్లాడారు. తమ హయాంలో మొదలు పెట్టిన ప్రాజెక్టుల పనులే కొనసాగుతున్నాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం మొదలు పెట్టిన పనులు ఒక్కటీ ముందుకు సాగడం లేదన్నారు. . ‘‘భీమా, నెట్టెంపాడులో మేం 70 శాతం నుంచి 80 శాతం నీళ్లు ఇచ్చింది వాస్తవం కాదా? దేవాదుల కింద నీళ్లు ఇచ్చింది వాస్తవం కాదా? గత వైఫల్యాలకు మమ్మల్ని బాధ్యులను చేసి మాట్లాడటం సరికాదు’’ అని ఆయన అన్నారు. కొత్త ప్రాజెక్టులు ఏవీ?: డీకే అరుణ కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టులనే పూర్తి చేసి అంతా తామే చేశామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పడం హాస్యాస్పదమని ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. ఈ ప్రభుత్వం రెండేళ్లలో ఎన్ని ప్రాజెక్టులు కొత్తగా మొదలుపెట్టిందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా ప్రాజెక్టులను 2012లోనే తామే పూర్తి చేశామని... అప్పుడే నీరిచ్చామన్నారు. అలాంటిది ఈ మంత్రి వచ్చి ఎలా ప్రారంభోత్సవం చేశారని ప్రశ్నించారు. -
'అసలు బాహుబలి జానారెడ్డే'
హైదరాబాద్: టీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్‌ను ఓడించడానికి బాహుబలి వస్తాడని కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు కే. జానారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గీతారెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌లో సమర్థులు లేరా.. అని జానారెడ్డి వ్యాఖ్యల పట్ల విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. తమపార్టీలోనే చాలా మంది బాహుబలులు ఉన్నారని గీతారెడ్డి అన్నారు. అసలు బాహుబలి సీఎల్పీ నేత జానారెడ్డే అని ఆమె వివరణ ఇచ్చారు. జానారెడ్డి బాహుబలి వ్యాఖ్యలు.. పార్టీలో సమర్థులు లేరన్నట్టుగా, బయట పార్టీల నుంచి వస్తే తప్ప కాంగ్రెస్ పార్టీని కాపాడలేరని అన్నట్టుగా తప్పు డు సంకేతాలను పంపిస్తున్నాయని పార్టీ నేతలు కొందరు అసంతృప్తికి లోనైనట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. -
ప్రతి కార్యకర్తా ఒక బాహుబలి కావాలి
► కష్టపడి పని చేస్తేనే గుర్తింపు ► సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి మిర్యాలగూడ : కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్తా ఒక బాహుబలి కావాలని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీపట్టణ కార్యనిర్వహక అధ్యక్షుడిగా ఖరీం, పట్టణ అధ్యక్షుడిగా కేతావత్ శంకర్‌నాయక్, బ్లాక్ కాంగ్రెస్–2 అధ్యక్షుడిగా పొదిల శ్రీనివాస్ నియామకమైనే సందర్భంగా నిర్వహించిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రానున్న 45 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ, అనుబంధ సంఘాల కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యకర్తల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటే పక్కనబెట్టి సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసిన వారికే పదవులు వస్తాయన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో నాలుగు సీజన్లకు సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయలేదన్నారు. ప్రస్తుతం రబీ సీజన్లో నీటిని విడుదల చేసినా పాలకులు, అధికారుల అవగాహన లోపంతో పంటలు చేతికొచ్చే పరిస్థితి లేదన్నారు. కర్నాటక ప్రభుత్వంతో మాట్లాడి ఆల్మట్టిడ్యామ్ నుంచి కనీసం 10 టీఎంసీల నీటిని తీసుకొస్తేనే పంటలు చేతికొచ్చే అవకాశం ఉందన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్లని అన్నారు. గ్రామజ్యోతి కార్యక్రమం ద్వారా నిధులు విడుదల చేస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలో ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు చేసి మార్చి నెలాఖరు వరకు పనులు పూర్తి చేయాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో మాజీ శాసనమండలి విప్ ధీరావత్ భారతీరాగ్యానాయక్, పీసీసీ సభ్యుడు పగిడి రామలింగయ్య, స్కైలాబ్‌నాయక్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ చిరుమర్రి కృష్ణయ్య, సల్కునూరు పీఎసీఎస్ చైర్మన్ కందిమళ్ల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ బాహుబలిపై జోకులే జోకులు!
-
‘బాహుబలి’పై చర్చే చర్చ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించేందుకు ఒక బాహుబలి వస్తాడన్న సీఎల్పీ నేత జానారెడ్డి చేసిన వ్యాఖ్యలపై అసెంబ్లీ లాబీల్లో శనివారం ఆసక్తికరమైన చర్చ జరిగింది. అధికార పార్టీ సభ్యులతోపాటు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన వారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దీనిపై సరదా వ్యాఖ్యలు జోడిస్తూ చర్చలకు దిగారు. ఏ ఇద్దరు నాయకులు కలిసినా.. విలేకరులు ఎదురైనా బాహుబలిపైనే జోకులు వేయడం కనిపించింది. బాహుబలి ఎవరో కాదు.. మాలో నుంచే ఒకరు వస్తారంటూ తనను కలసిన విలేక రులతో జానారెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ‘మీరు నా అంతరార్థాన్ని గ్రహించారేమో అనుకుంటున్నా...’ అంటూ విలేకరులకు ఓ పజిల్ విసిరారు. బాహుబలి బయట ఎక్కడ్నుంచో వస్తాడని అనలేదని, కాంగ్రెస్ నుంచే ఒక బాహుబలి వస్తాడని మరోసారి చెప్పారు. ‘‘కాంగ్రెస్ నాయకుల్లో ఎవరైనా బాహుబలి కావచ్చు. ఎవరికి వారే బాహుబలి అనుకుంటే తప్పేమీ లేదు. అప్పుడు విజయం మాదే కదా..’’ అని వ్యాఖ్యానించారు. మా బాహుబలి ఆయనే: కోమటిరెడ్డి కాంగ్రెస్‌కు బాహుబలి జానారెడ్డేనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో చాలామంది బాహుబలిలు ఉన్నారని, సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ చేసింది కట్టప్ప పనే: డీకే అరుణ కట్టప్పలాంటి సీఎం కేసీఆర్‌ను ఓడించేందుకు కాంగ్రెస్‌లోనే ఒకరు బాహుబలిగా బలోపేతం అవుతామని ఎమ్మెల్యే డి.కె.అరుణ అన్నారు. జానారెడ్డి కూడా అదే చెప్పారని, కాంగ్రెస్‌లోనే బాహుబలి ఉన్నారన్నారు. బాహుబలి మొదటి భాగంలో కట్టప్ప వెన్నుపోటు పొడిచాడని, ఇప్పటిదాకా కేసీఆర్ చేసింది అదేనన్నారు. బాహుబలి రెండో భాగం వస్తోందని, ఇక రానున్నదంతా కట్టప్ప చరిత్రను ముగించేయడమేనన్నారు. తెలంగాణకు నేనే బాహుబలి: సంపత్ తెలంగాణకు బాహుబలిని తానేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నారు. ఢిల్లీలో బాహుబలి రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు. తెలంగాణకు బాహుబలి సంపత్ అని జానారెడ్డి చెప్పారని వెల్లడించారు. గతంలో అభిమన్యుడు అని వ్యాఖ్యానించిన జానారెడ్డి... ఇప్పుడు బాహుబలిగా తనకు ప్రమోషన్ ఇచ్చారన్నారు. టీఆర్ఎస్పై బాహుబలి స్థాయిలో పోరాడుతానని చెప్పారు. సత్తా లేని వారని ఒప్పుకున్నారు: జగదీశ్‌రెడ్డి కాంగ్రెస్‌లో సత్తా ఉన్న బాహుబలి వంటివారెవరూ లేరని జానారెడ్డి అంగీకరించినట్టుగా ఉందని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ వాస్తవ పరిస్థితిని అంగీకరించిం దన్నారు. టీఆర్ఎస్ను ఎదుర్కొనే వారెవరూ కాంగ్రెస్‌లో లేరన్న విషయాన్ని అంగీకరించడంతోపాటు, సత్తాలేని వారంతా కాంగ్రెస్‌లోనే ఉన్నారని స్వయంగా జానారెడ్డి అంగీకరించారని చెప్పారు. కాంగ్రెస్‌లో సత్తా ఉన్నవారె వరూ లేరని ఏడాది క్రితమే తెలిసిందని కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నవారంతా నాజర్ క్యారెక్టర్లేనని వ్యాఖ్యానించారు. -
కేసీఆర్‌ను ఓడించేందుకు బాహుబలి వస్తాడేమో!
⇒ ఆయన తలరాత ఎలా ఉందో నాకేం తెలుసు: జానారెడ్డి ⇒ ఎన్నికల నాటికి కూడా డబుల్బెడ్రూం ఇళ్లు పూర్తికావు ⇒ నమూనాగా కొన్ని కట్టినా లబ్ధిదారులకు ఇవ్వరు ⇒ వాటినే చూపించి జనాన్ని మభ్యపెడతారు ⇒ మంత్రులెందరో తనతో బాధలు చెబుతుంటారని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాదికి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెబుతు న్నా.. ఎన్నికల నాటికి కూడా పూర్తి చేయరని ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి అన్నారు. నమూనా గా కొన్ని ఇళ్లు పూర్తిచేసినా వాటిని లబ్ధిదారుల కు కేటాయించరని పేర్కొన్నారు. పార్టీ ఎమ్మె ల్యేలు టి.జీవన్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డితో కలసి అసెంబ్లీలోని తన చాంబర్లో శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. టీఆర్ఎస్ను ఓడించడానికి, కేసీ ఆర్‌ను ఎన్నికల్లో కొట్టడానికి రాష్ట్రంలోనూ ఒక బాహుబలి వస్తాడేమోనని వ్యాఖ్యానించారు. ‘‘సీఎం కేసీఆర్ తలరాత ఎలా ఉందో నాకేం తెలుసు? అది పైన ఉన్నోడికి తెలుస్తుంది. పైన అంటే టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలోని హరీ శ్‌రావుకు కాదు. పైన అంటే ఆ దేవుడికి అని నా ఉద్దేశం..’’ అని జానా అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు పూర్తి చేయడానికి ప్రభుత్వం ఇబ్బందులు పడుతోందని చెప్పారు. ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలంటూ పెద్దపెద్ద కాం ట్రాక్టర్లను బలవంతంగా తీసుకువస్తున్నారని, అయినా ఎన్నికలనాటికి కూడా పూర్తి చేయ కుండా నాన్చుతారని చెప్పారు. ‘‘అక్కడక్కడా పూర్తి చేసిన కొన్ని ఇళ్లను నమూనాగా (మోడల్) గా చూపి.. మళ్లీ అధికారంలోకి వస్తే ఇస్తామని మభ్యపెడతారు. పూర్తి చేసిన ఇళ్లను కూడా లబ్ధి దారులకు కేటాయించకుండా ఎన్నికలను దాటే యడానికి కేసీఆర్ ప్రయత్ని స్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నమ్మిన ప్రజలు తమకు ఇళ్లు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్లు చెబుతున్న మాటలు కూడా ఇంకా నమ్మ కాన్ని నిలబెడుతున్నాయి. వాటిని పూర్తి చేయ డం సాధ్యం కాదని అందరికీ తెలుసు. అయితే నా ఒక్కడికైనా రాక పోతుందా అని ఎవరికి వారు ఆశల పల్లకిలో ఉన్నారు. ఈ విషయం ప్రజలకు చెప్పినా అర్థం కాదు. టీఆర్ఎస్ వాళ్లు ఇస్తామంటుంటే జానారెడ్డి అడ్డం పడుతు న్నడని అనుమానించే ప్రమాదం ఉంది. సరే వాళ్లు ఎన్నికల నాటికి పూర్తి చేయనీ.. ప్రజలకు వాస్తవాలు అర్థంకానీ.. అని ఓపిక పడుతు న్నాం. ఒక ఊరిలో వందమంది ఆశప డుతుంటే 20 ఇళ్లు కూడా పూర్తి చేసే పరి స్థితి లేదు. భూమి దొరికిన ప్రాంతాల్లో కొన్నింటిని పూర్తి చేసి నట్టుగా చూపి, మిగతా చోట్ల ఎన్నికలైన తర్వాత ఇస్తామంటారు. లబ్ధిదారులకు కేటా యిస్తే.. ఇళ్లు రాని వాళ్లు వ్యతిరేకం అవుతారని టీఆర్ఎస్ వాళ్లకు తెలుసు. అందుకే లబ్ధిదా రులకు కూడా ఇవ్వకుండా అందరినీ ఆశల్లో ఉంచుతారు’’ అని జానారెడ్డి వివరించారు. విద్యుత్ రంగాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని టీఆర్ఎస్ అస్తవ్యస్తం చేస్తోందని, దీనివల్ల భవిష్యత్‌లో విద్యుత్ సంస్థలు తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతాయని జానారెడ్డి హెచ్చరించారు. ఏడాదికి డిస్కంలకు రూ.10 వేల కోట్లు లోటుందన్నారు. ఇందులో రూ.4 వేల కోట్లు మాత్రమే ప్రభుత్వం ఇస్తోందని, మిగిలిన రూ.6 వేల కోట్లు డిస్కంలు ఎలా భరిస్తాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అవగాహన, ముందుచూపు లేకపోవడం వల్ల ఛత్తీస్‌గఢ్‌కు, పవర్‌గ్రిడ్‌కు అనివార్యంగా కొన్ని వృథా చెల్లింపులు ఉంటాయన్నారు. ఇలాంటివన్నీ ప్రజలపై పెనుభారంగా మారతాయన్నారు. మంత్రులు కూడా సంతోషంగా లేరు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సంతోషంగా లేరని జానారెడ్డి పేర్కొన్నారు. ‘‘రాజ కీయాల్లో నేను సీనియర్‌ను. ఏమైనా సమస్యలుంటే పరిష్కారం చూపి స్తారని.. కనీసం ఓదారుస్తారనే విశ్వాసంతో చాలామంది మంత్రులు నా దగ్గరి వస్తారు. అయితే ఎవరొచ్చారు.. ఏం చెప్పారనేది మీకెలా చెప్తా? నేనొక సీనియర్ డాక్టర్ లేదా సైకియాట్రిస్ట్ వంటివాణ్ణి. చాలా మంది సమస్యలతో వస్తారు. సమస్యతో వచ్చిన వారి గురించి బయ టకు చెప్పడం.. సమస్యలతో వచ్చిన వారితో అసభ్యంగా, చిన్నచూపు చూడటం డాక్టర్‌కు తగదు. నేను కూడా మీతో అలాంటివేమీ చెప్పను. నాకు కొంత సైకాలజీ కూడా తెలుసు. నా దగ్గరకు ఎవరు, ఎందుకొ స్తున్నారో అంచనా వేయగలను. మీరడిగే ప్రశ్నలు ఏ ఉద్దేశంతో అడు గుతున్నారో కూడా అంచనా వేయగలను’’ అని విలేకరులను ఉద్దేశించి జానా అన్నారు. ఇప్పుడున్న రాజకీయాల్లో తానొక విత్తనంలాంటి వాడినని, ఇలా మిగిలితే భావితరాలు వాడుకుంటాయని వ్యాఖ్యానిం చారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీది ఐరన్ లెగ్గా, గోల్డెన్ లెగ్గా అనేది భవిష్యత్ నిర్ణయిస్తుందన్నారు. -
ఎంబీసీలంటే ఎవరంటారా?
ఇదేనా ప్రధాన ప్రతిపక్ష నేత అడిగే ప్రశ్న: సీఎం ఫైర్ ⇒ బడ్జెట్లో వృత్తులకు ప్రాధాన్యమిస్తే హేళనగా మాట్లాడుతున్నారు ⇒ డిస్కంల అప్పులపైనా అలాగే అంటున్నారు ⇒ అప్పు చేయడం తప్పు కాదు.. ⇒ మన రాష్ట్రాన్ని మనమే శపించవద్దు సాక్షి, హైదరాబాద్: ‘‘ఎంబీసీలు అంటే ఎవరు.. వారికి రూ.1000 కోట్లు ఎలా ఖర్చు చేస్తారని జానారెడ్డి అడిగారు.. ఇదేనా ప్రధాన ప్రతిపక్ష నేత అడిగే ప్రశ్న? బడ్జెట్లో వృత్తుల వారు తాము కనబడుతున్నామని అనుకుంటుంటే ప్రధాన ప్రతిపక్షం హేలనగా మాట్లాడుతోంది. డిస్కంల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే... ఇంకా అప్పులని మాట్లాడుతున్నారు.. ప్రతిపక్ష నాయకుని పరిజ్ఞానానికి వందనాలు..’’అంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రతిపక్ష నేత జానారెడ్డిపై ఫైర్ అయ్యారు. శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సీఎం వివిధ సందర్భాల్లో జానారెడ్డి, ఎమ్మెల్యేలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, చిన్నారెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిపై మండిపడ్డారు. డిస్కంల రూ.12 వేల కోట్ల అప్పులను ప్రభుత్వం తీసుకోవడంతో అవి ఏటా చెల్లించే రూ.820 కోట్ల వడ్డీ భారం తగ్గిందన్నారు. విద్యుత్ చార్జీలు పెంచాలంటే తాను ఒప్పుకోలేదని, వడ్డీ భారం తగ్గించామని, చార్జీలు పెంచవద్దని చెప్పినట్లు పేర్కొన్నారు. ఇన్ని చేస్తుంటే డిస్కంలకు అప్పులు అంటూ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రధాన ప్రతిపక్షం తీరుతో బాధ కలిగి ఈ మాటలు చెబుతున్నానన్నారు. ‘‘కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నపుడు రాష్ట్రం కోసం 1000 మెగావాట్ల కారిడార్ బుక్ చేయమంటే చేయలేదు. ఇప్పుడేమో 2 వేల మెగావాట్ల కారిడార్ అనవసరం అని మాట్లాడుతున్నారు. భవిష్యత్ అవసరాలపై అవగాహనతోనే మేం ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) కుదుర్చుకున్నాం. పీపీఏలు ఉంటేనే కారిడార్ కేటాయింపు ఉంటుంది. అప్పులు అనడం ప్రగతి విషయంలో అవగాహన లేని వారు చెప్పే మాటలు’’అని సీఎం అన్నారు. తాము ఏటా రూ.20 వేల కోట్ల అప్పులు చెల్లిస్తున్నామని, చెల్లింపులను బట్టే అప్పులు తీసుకుంటున్నామన్నారు. అప్పు చేయడం తప్పు కాదని, అనుకున్న అభివృద్ధి సాధించాలంటే క్వాంటమ్ జంప్ తీసుకోవాలని ప్రధాని మోదీనే చెబుతున్నారన్నారు. తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు నర్సింగరావును సింగరేణి ఎండీగా పెట్టామని, అప్పటి కేంద్రమంత్రి శిబూసోరెన్ గదువ పట్టుకొని బతిమిలాడి ఒప్పించి 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి అనుమతులు సాధించామని వివరించారు. ‘‘అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. తెలంగాణ ఉద్యమాన్ని తట్టుకోలేక కేటీపీపీ పెట్టారు. బడ్జెట్ రూపకల్పన విధానం కేంద్రం, ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లే మన దగ్గరా ఉంది. బడ్జెట్ అంచనాలకు, సవరణ అంచనాలకు మధ్య వ్యత్యాసం 15 శాతం నుంచి 25 శాతం ఉంటుంది. మన కొత్త రాష్ట్రాన్ని మనమే శపించవద్దు’’అని పేర్కొన్నారు. కేంద్రానిది అణా పైసా లేదు గొర్రెల పెంపకం పథకం విషయంలో కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించారు. ‘‘అది కేంద్ర పథకమని, కేంద్రం డబ్బు ఉందని కిషన్‌రెడ్డి అన్నారు. కానీ అది కేంద్ర పథకమే కాదు. ఎన్సీడీసీ అనేది రుణాలిచ్చే సంస్థ. 10.3 శాతం వడ్డీకి రుణాలు తెస్తున్నాం’’అని చెప్పారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి కల్పించుకొని... అది మొత్తం కేంద్రం పథకమని తాను అనలేదని, కేంద్రం కొంత డబ్బు ఇస్తోందని చెప్పానని పేర్కొన్నారు. అందుకు సీఎం బదులిస్తూ.. అందులో కేంద్రానిది అణా పైసా కూడా లేదని, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ డబ్బేనని స్పష్టంచేశారు. ఎమ్మెల్యే చిన్నారెడ్డి తనకు మంచి మిత్రుడని, కానీ గొర్రెల పెంపకం, పందుల పెంపకం అంటూ హేళనగా మాట్లాడుతున్నారని సీఎం అన్నారు. పేపర్లు అడ్డుపెట్టుకొని నవ్వడం కాదని, సంపద సృష్టించడమే తమ లక్ష్యమని చెప్పారు. దేశంలో 33 శాతం పౌల్ట్రీ ఉత్పతి, 40 శాతం ఫార్మా ఉత్పత్తి మన రాష్ట్రం నుంచే ఉందన్న సంగతిని గ్రహించాలన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని చైనా కూడా పక్కనపెట్టింది కమ్యూనిస్టు సిద్ధాంతంపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలకు సీఎం వివరణ ఇస్తూ.. ‘చైనా కూడా కమ్యూనిజం సిద్ధాంతాలు పనికిరావని పక్కన పెట్టి అభివృద్ధి సాధించింది. అమెరికాతో పోటీ పడుతోంది’అన్నారు. సీఎం వ్యాఖ్యలపై సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ.. ‘కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రపంచంలోనే మంచి సిద్ధాంతం. అది పనికి రాదన్నట్లు మాట్లాడటం బాధ కలిగించింది’అని పేర్కొన్నారు. వెంటనే సీఎం మాట్లాడుతూ.. కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని తానేమీ తప్పు పట్టలేదన్నారు. ‘నిజంగానే ప్రపంచంలో కమ్యూనిస్టు సిద్ధాంతానికి మించిన సిద్ధాంతం లేదు. అయితే మావో, లెనిన్ చెప్పినట్లు అది పరిణామ లంగా ఉండాలి. వాళ్లు చెప్పింది పాటించకపోవటం వల్లే భారత కమ్యూనిస్టు పార్టీలకు ఈ పరిస్థితి వచ్చింది. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కమ్యూనిస్టు పార్టీలు జడత్వ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నాయి. దీనికో ఉదాహరణ చెబుతా. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం చేపట్టినప్పుడు హెచ్ఐసీసీలో సదస్సు ఏర్పాటు చేశాం. మురికిని ఎత్తిపోసే సఫాయి కార్మికులు తల్లిదండ్రుల్లాంటి వారు. సఫాయన్నా నీకు సలామన్నా.. అని గొప్పగా మాట్లాడుకున్నాం. వాళ్ల జీతాలు పెంచుతామని సీఎం హోదాలో నేనే ప్రకటించా.. సరిగా నాలుగో రోజే కమ్యూనిస్టుల అనుబంధ సంఘం సీఐటీయూ సమ్మెకు నోటీసిచ్చింది. ఇదీ కమ్యూనిస్టుల పంథా. సీఎంగా నేనిచ్చిన మాటకు విలువ లేదా.. సమ్మె చేస్తే ఏమొచ్చింది’అని సీఎం వివరించారు. -
ఆ ఒక్కటీ నెరవేరాలంటే..రాష్ట్రమంతా తిరగాలి
భవిష్యత్‌లో ముఖ్యమంత్రి అంటూ చెప్పకుండానే.. చెప్పిన జానారెడ్డి గుర్రంపోడు: సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు అనుభవించా.. ఇప్పుడున్న బాధ్యతలతోపాటు మీరు కోరుకున్న ఆ ఒక్కటీ నెరవేరాలంటే రాష్ట్రమంతా తిరగాల్సి ఉంది. మీకు ఎప్పుడూ అందుబాటులో లేకున్నా అద్దంలో చూసుకుంటే కనిపించే ముఖంలాగా మీరు, మీ సమస్యలు కనిపిస్తుంటూనే ఉంటాయి. ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు అంటూ సీఎల్పీ నేత జానారెడ్డి ముఖ్యమంత్రి పదవి గురించి నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. నల్లగొండ జిల్లా గుర్రంపోడులో శుక్రవారం జన ఆవేదన సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. జానారెడ్డికి దశాబ్దాలుగా మీరిచ్చిన ప్రజాశక్తి ఇదని.. ఈ శక్తి తగ్గకుండా చూసుకుని ముందుకు నడిపిస్తే ఏదైనా సాధ్యమేనన్నా రు. మీరు కోరుకున్న ఆ పదవి అంటూ ఒకటికి, రెండుసార్లు చెప్పిన జానారెడ్డి.. కార్యకర్తలకు తాను భవిష్యత్‌లో ముఖ్యమంత్రి అంటూ చెప్పకుండానే ఆశలు కల్గించారు. -
రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన
అక్రమ అరెస్టులు, నిర్బంధాలు సరికాదు: జానారెడ్డి చౌటుప్పల్: రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన సాగుతోందని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కుందూరు జానారెడ్డి ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డితో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలన సాగడంలేదన్నారు. తెలంగాణ సాధనకోసం ముందుండి పోరాటాలు చేసిన కోదండరాం వంటి నాయకుడిని అరెస్ట్ చేయడం సరైనది కాదన్నారు. నిరుద్యోగ ర్యాలీకి వెళ్లకుండా గ్రామస్థాయి నుంచి ఎక్కడికక్కడ అరెస్టులు చేయించి నిర్బంధించడం శోచనీయం అన్నారు. అక్రమ అరెస్ట్‌లను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందనీ, ప్రజాస్వామికవాదులు ప్రభుత్వ తీరును ఖండించాలని కోరారు. ప్రభుత్వ పాలనా తీరు ప్రజలకు త్వరలోనే అర్థమవుతుందన్నారు. -
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జానా సీఎం
మా మద్దతు సీఎల్పీ నేతకే: ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి త్రిపురారం: సీఎల్పీ నేత జానారెడ్డి నాయకత్వం వహించి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే ఆయనే సీఎం అవుతారని, ఆయనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుం దని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడారు. కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు లేకుండా చూసే బాధ్యత సీఎల్పీ నేతపైనే ఉందన్నారు. టీఆర్ఎస్ లో ఏ ఒక్కనేత కూడా ఆత్మగౌరవంతో ఉండలేకపోతు న్నారన్నారు. టీఆర్ ఎస్‌లోకి వెళ్లిన ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్రావులకు సీఎం కేసీఆర్ అపా యింట్ మెంట్ కూడా లభించడం లేదని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌ను మచ్చిక చేసుకుని జగదీశ్‌రెడ్డి మంత్రి అయ్యాడే తప్ప ఆయన ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఉత్తమ్ సర్వే ఉత్తుత్తిదే: రాజగోపాల్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల చేయించిన సర్వే ఉత్తుత్తిదేనని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 50 సీట్లల్లో గెలుస్తాం, మరో 20 సీట్లలో కష్టపడితే విజయం సాధిస్తామంటూ వచ్చిన రిపోర్ట్ ఎలా రూపొందించారన్నారు. -
కాబోయే సీఎం ఆయనే : కోమటిరెడ్డి
నల్లగొండ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి అయ్యేది సీఎల్పీ నేత జానారెడ్డేనని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. నల్లగొండలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో చాలెంజ్ చేసి మరీ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులు, కార్యకర్తలు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పట్టుబట్టడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన ప్రతీ నాయకుడు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడతారన్నారు. కోదండరాంను అరెస్ట్ చేసిన తీరును చూస్తే సీఎం కేసీఆర్‌కు రోజులు దగ్గర పడ్డాయని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. మరోవైపు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పటికైనా సీఎం అయ్యేది నేనే అని చెబుతుంటే... ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. -
ఎడ్డెమంటే తెడ్డెం అంటే ఎలా?
ఉత్తమ్, జానాలపై ఎంపీ కవిత విసుర్లు మిర్యాలగూడ: ప్రభుత్వం పట్ల పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డిలు తమ వైఖరి మార్చుకోవాలని టీఆర్ఎస్ ఎంపీ కె.కవిత సూచించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి జరుగుతోందని, అయినా జానా, ఉత్తమ్‌లు ఎడ్డెం అంటే తెడ్డెం అంటే ఎలా అని ప్రశ్నించారు. ఆదివారం మిర్యాలగూడలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావులతో కలసి ఆమె విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన పెద్దలు విమర్శించడం సరికాదన్నారు. వేలాది ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడుతుంటే పూర్తి సమాచారం తెలుసుకోకుండానే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. వారి వైఖరి మార్చుకొని ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వాలని కోరారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. థర్మల్ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే నల్లగొండ తెలంగాణకే ఒక కలికితురాయిగా ఉంటుందన్నారు. అదే విధంగా తెలంగాణ రాకముందు ఎత్తిపోతల పథకాలకు 16 గంటలు కరెంటు ఇస్తే ప్రస్తుతం 24 గంటల పాటు కరెంటు అందిస్తున్నట్లు తెలిపారు. చివరి రైతులకు కూడా సాగు నీరందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. రైతులకు ఉచితంగా 9 గంటల పాటు విద్యుత్ అందిస్తున్నట్లు కవిత తెలిపారు. -
వచ్చే ఎన్నికల్లో త్రిబుల్ బెడ్రూం అంటారేమో!
సీఎం కేసీఆర్‌పై సీఎల్పీ నేత జానారెడ్డి విసుర్లు కేతేపల్లి: వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ త్రిబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చినా ఆశ్చర్యపో నవసరం లేదని సీఎల్పీ నేత కె. జానారెడ్డి ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చ లేదని మండిపడ్డారు. నల్లగొండ జిల్లా కేతేపల్లిలో పునఃప్ర తిష్ఠించిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహాన్ని సోమవారం ఆయన ఆవిష్క రించారు. కేసీఆర్ సర్కార్‌పై ధ్వజమె త్తారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణను బంగారు పల్లెంలో పెట్టి అప్పజెబితే గడిచిన రెండేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆయన ధ్వజమెత్తారు. -
ప్రజాస్వామ్య స్ఫూర్తితో సహకరించాం
పక్కకు పోతే చాప సర్దుకుని పోవాలనుకున్న ప్రభుత్వం: జానా సాక్షి, హైదరాబాద్: శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్షాలు తప్పుకొంటే చాపను సర్దేసుకుని పోవాలని ప్రభుత్వం ప్రయత్నించినా.. ప్రజాస్వామ్య స్ఫూర్తితో సహకరించామని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ ఎమ్మెల్యేలు మల్లు భట్టివిక్రమార్క, టి.జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డితో కలసి ఆయన బుధవారం అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ దగ్గర మాట్లాడారు. ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలను అసెంబ్లీలో చర్చించి, పరిష్కరించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, ఒప్పించామని జానారెడ్డి చెప్పారు. ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలుచేసే విధంగా ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో సఫలమయ్యామ న్నారు. రైతు రుణమాఫీపై, ఫీజు రీయింబర్స్మెంట్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు వంటివాటిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీని సాధించామని వివరించారు. దళితులకు మూడెకరాల భూమి అని ఇచ్చిన హామీలోని డొల్లతనాన్ని అసెంబ్లీలో ఎండగట్టామన్నారు. 2013 భూసేకరణ చట్టం కన్నా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన సవరణ లేదా కొత్త చట్టం ఎందుకు మెరుగైందో శాసనసభలో సభ్యులకు, ప్రజలకు చెప్పడంలో ప్రభుత్వం విఫలమైందని జానారెడ్డి విమర్శించారు. అయితే ప్రభుత్వమే గొప్పతనం ప్రదర్శించాలనుకుందని, మాటల మాయతో బురిడీ కొట్టించే ప్రయత్నం చేసిందని విమర్శించారు. ప్రజల సమస్యలను చర్చించి, పరిష్కారం కోసం ప్రశ్నించాల్సిన బాధ్యత ఉన్నందున కొన్నిసార్లు ఇబ్బం దులు పడినా రెచ్చిపోకుండా, నిస్పృహ చెందకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తితో సహకరించామని వివరించారు. ప్రభుత్వం కొన్నిసార్లు పారిపోవాలని ప్రయత్నిం చినా, తొందరపడినా వేరే భావన లేకుండా పనిచేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ సహ కారం వల్లనే సభ 18 రోజులపాటు జరిగిందన్నారు. కొత్త రాష్ట్రంలో సభను కొత్త ఒర వడితో నడిపించాలని బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించామన్నారు. -
నాయిని వర్సెస్ భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీఎల్పీ ఉపనేత భట్టి విక్రమార్క పరస్పరం మాటలు తూటాలు పేల్చుకోవడంతో సభ కాస్తంత వేడెక్కింది. చర్చ సందర్భంగా ప్రభుత్వ జవాబుకు నిరసన తెలిపే అవకాశం ఇవ్వాలని విపక్ష నేత జానారెడ్డి స్పీకర్‌ను కోరగా ఆయన అనుమతించారు. నిరసనను తెలిపేందుకు జానారెడ్డి అనుమతితో భట్టి మాట్లాడుతుండగా, నిరసన తెలిపే హక్కు విపక్ష నేతకే ఉందని నాయిని అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు మండలి సభ్యులు కనుక అసెంబ్లీ నియమాలు తెలిసి ఉండకపోవచ్చని భట్టి అనడంతో.. నాయిని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ జోక్యంతో ఇద్దరి మధ్య ఆవేశం కొద్ది సేపటికి చల్లారింది. -
మేం పాండవులం.. నేను ధర్మరాజును!
• ధర్మం పక్షాన పోరాడుతున్నాం: జానారెడ్డి • కెప్టెన్ ఒక్కడే బ్యాటింగ్ చేయడు.. అందరికీ అవకాశమివ్వాలి • మంత్రులు హద్దు మీరి మాట్లాడుతున్నారు • ప్రభుత్వం హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందని సూచన సాక్షి, హైదరాబాద్: ‘‘మేం ధర్మం పక్షాన పోరాడుతున్న పాండవుల్లాంటి వాళ్లం. కాంగ్రెస్ పార్టీ ధర్మం వైపు ఉంది. అందులో నాది ధర్మరాజు పాత్ర. ధర్మరాజు ఒక్కడే గద పట్టుకుని, బాణాలు వేసి యుద్ధం చేశాడా? ధర్మరాజు మాట్లాడుతుంటే భీముడు గద పట్టుకుని లేవాలి, అర్జునుడు బాణాలు వేయాలి. పాండవుల్లో ఎవరి పాత్ర వారు నిర్వహించినట్టుగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరి బాధ్యత వారు నిర్వహిస్తారు. ఏమైనా తప్పులు, లోపాలుంటే నేను సరిచేస్తా..’’ అని కాంగ్రెస్ శాసనసభాపక్షనేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం శాసనసభ లోని చాంబర్లో తనను కలిసిన విలేక రులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్షనేతగా, సభలో సీనియర్ సభ్యుడిగా హుందాగా వ్యవహరించాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. శాసనసభ గౌరవం పెంచే విధంగా వ్యవహరి స్తున్నానన్నారు. ‘‘నేను మా టీం కెప్టెన్‌ను. ఓపెనింగ్ నుంచి మొత్తం నేనే బ్యాటింగ్, బౌలింగ్ చేయలేను. ఎవరిలో ఏ నైపుణ్యం ఉందో గుర్తించి, వారికి ఆ బాధ్యత అప్ప గిస్తా. మొత్తం నేనే ఆడితే మిగిలినరికి అవకాశం ఎలా వస్తుంది? ఆడటానికి శిక్షణ ఇస్తా, సూచనలు చేస్తా, ప్రోత్సహిస్తా. వారేమైనా తప్పులు చేస్తే సవరించి, టీమ్ సమష్టి ప్రయోజనాలను కాపాడుకుంటా. మొత్తం నేనే ఆడి, గీత దాటితే.. నేనూ ఔట్ అవుతా..’’ అని వ్యాఖ్యానించారు. హుందాగా ఉంటే బాగుండేది తెలంగాణ వస్తే ఎలా ఉంటుందని ఆశించామో, ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని జానారెడ్డి పేర్కొన్నారు. బాధ్యతాయుత ప్రతిపక్షంగా తాము హుందాగా, గౌరవం పెంచే విధంగా ఉన్నా మని, తమ వల్లే శాసనసభ సజావుగా సాగుతోందని చెప్పారు. ఇదే సమయంలో ప్రభుత్వం కొంత హుందాగా ఉంటే బాగుం డేదన్నారు. కొందరు మంత్రులు హద్దు మీరుతున్నారని, విపక్ష సభ్యులు కూడా తమ లాంటి సభ్యులేనని మరిచిపోయి మాట్లాడుతున్నారని... అది మంచిదికాదని హితవు పలికారు. ‘‘మంత్రులు మాటి మాటికి తెలంగాణ ప్రజలు నా బిడ్డలు, మా కడుపులో పెట్టుకుంటామని అంటున్నారు. మేమేమన్నా పారేస్తున్నమా? బుధవారం కూడా మల్లు భట్టి విక్రమార్కపై మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు సిల్లీగా ఉన్నాయి. భట్టి కూడా మరింత గట్టిగా మాట్లాడాల్సి ఉండేది. హరీశ్‌రావు హుందాగా మాట్లాడాల్సింది..’’ అని ఆయన చెప్పారు. చిల్లర అవుతుందని మాట్లాడలేదు ఎర్ర రొయ్యలను కళ్లతో చూడటానికే మల్లన్నసాగర్ కడుతున్నట్టుగా ముఖ్య మంత్రి కేసీఆర్ చెప్పారని.. రొయ్యల కోసం అంతపెద్ద ప్రాజెక్టు కడుతున్నట్టుగా మాట్లా డారని జానారెడ్డి విమర్శించారు. చిల్లరగా ఉంటుందనే దానిపై తాను మాట్లాడలేదని చెప్పారు. భూసేకరణ చట్ట సవరణ విష యంలో తాను అనుమానాలు లేవనెత్తే వరకూ ప్రభుత్వమే దాన్ని గమనిం చలేదని.. ప్రభుత్వం తీరు చూస్తుంటే ఎం దుకు చెప్పానా అనిపిస్తోందని వ్యాఖ్యానిం చారు. కానీ సభలో సభ్యుడిగా తన ధర్మాన్ని పాటించానన్నారు. ఈ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదిస్తారని తాను అనుకోవడం లేదని చెప్పారు. విద్యుత్ రంగంలో గత పాలకులు లోపభూయిష్టంగా వ్యవహరించారని సీఎం మాట్లాడటం సరికాదన్నారు. ఇప్పటికే 20 రాష్ట్రాలు ఉదయ్ పథకంలో చేరాయని, తెలంగాణే చివరలో చేరుతోందని.. రెండున్నరేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. ఇప్పుడున్న విద్యుత్ ప్రాజెక్టులన్నీ గత పాలకులు పూర్తిచేసినవేని గుర్తుచేసుకోవాలన్నారు. -
‘రొయ్యల కోసమే ప్రాజెక్టులు కడుతున్నకేసీఆర్’
హైదరాబాద్ : ఆ నాడు సభలో మాదిరి కాంగ్రెస్ ధర్మం వైపు ఉందని శాసనాసభా పక్ష నేత జానారెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో మీడియా తో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కాంగ్రెస్ వల్లే సభ హుందాగా జరుగుతుందన్నారు. పాండవుల మాదిరి తాము ఎవరి పాత్ర వారు నిర్వర్తిస్తున్నామన్నారు. తనది ధర్మరాజు పాత్ర అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏడాది పాటు నిద్రపోయి ఇప్పుడు మేల్కొందని వ్యాఖ్యానించారు. కేంద్ర పథకం ఉదయ్ లో 20 రాష్ట్రాలు చేరితే లోపభూయిష్టం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రాజెక్టులపై కేసీఆర్ మాటలు వింటుంటే ఎర్ర రొయ్యల కోసం ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. కొందరు మంత్రులు సభలో మాట్లాడుతున్న తీరు సరిగాలేదని, మాటికి మాటికి ‘నా బిడ్డలు.. మా కడుపులో పెట్టుకుంటాము’ అంటున్నారన్నారు. భూ సేకరణ చట్టం పై తాను సభలో లేవనేత్తె వరకు ప్రభుత్వం కూడా దాన్ని మన్నించలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే తాను ఎందుకు చెప్పానని అనిపిస్తోందని.. కానీ సభలో ఓ సభ్యుడుగా తన ధర్మాన్ని తాను పాటించానన్నారు. ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదం ఇస్తారని అనుకోవడం లేదని, ప్రతి ఒక్కరు సత్యాన్ని, ధర్మాన్ని పాటించాలన్నారు. గురువారం(నిన్న) సభలో భట్టి విక్రమార్క పై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు చాలా సిల్లీ అని, భట్టి విక్రమార్క కాంగ్రెస్ సభ్యుడన్న సంగతి హరీష్ గుర్తించక పోతే ఎలా..? అని ప్రశ్నించారు. సభలో హరీష్ రావు హుందాగా మాట్లాడాల్సిందన్నారు. విద్యుత్ రంగంలో గత పాలకుల లోపాలున్నాయని అని కేసీఆర్ అనడం హాస్యాస్పదమని, దేశంలోనే ఏ రాష్ట్రానికి దక్కనన్ని అవార్డ్ లు ఉమ్మడి ఏపీ కి వచ్చాయని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఉన్న ప్రాజెక్టు లు అన్ని కాంగ్రెస్ హయాంలో తెచ్చినవని, టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చింది ఏమి లేవని విమర్శించారు. కేసీఆర్ పూర్తి చేస్తామన్న భద్రాద్రి, యాదాద్రి ప్రాజెక్టు లు 2022 కి కూడా పూర్తికావని జానారెడ్డి వ్యాఖ్యానించారు. -
‘ప్రతిపక్ష నేతగా ఎప్పటికీ ఆయనే ఉండాలి’
వచ్చేసారి నువ్వే ప్రతిపక్ష నేత అవుతావేమో: జానారెడ్డి సాక్షి, హైదరాబాద్: ‘ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉండేలా ఆయనను ఆశీర్వదించండి’ అని ప్రతిపక్ష నేత కె.జానారెడ్డిని ఉద్దేశించి నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి దీటుగా జానారెడ్డి స్పందిస్తూ ‘ప్రజలు ఎప్పుడు, ఎట్లా తీర్పునిస్తారో తెలియదు. వచ్చేసారి ప్రతిపక్ష నేత స్థానంలో నువ్వే ఉంటావేమో. అప్పటివరకు ఎవరి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు’ అని వ్యాఖ్యానించారు. ధర్మపురి నుంచి కొంతమంది అర్చకులు సీఎం కేసీఆర్ ను కలవడానికి వచ్చారు. ఈ సందర్భంగా హరీశ్‌రావును కలసి, శాలువాను కప్పి, ఆశీర్వదించారు. హరీశ్‌తో కలసి చాంబర్ నుంచి బయటకు వచ్చిన అర్చకులకు సభకు వస్తున్న జానారెడ్డి ఎదురయ్యారు. దీంతో జానారెడ్డికి కూడా శాలువాను కప్పి ఆశీర్వదించారు. -
హరీశ్, జానా మధ్య సరదా సన్నివేశం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ లాబీలో బుధవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మంత్రి హరీశ్ రావు, ప్రతి పక్ష నేత జానారెడ్డి మధ్య సరదా సంవాదం జరిగింది. మంత్రి హరీశ్ రావు లాబీలోనే జానారెడ్డికి ధర్మపురి ఆలయ కమిటీని పరిచయం చేశారు. ఆ సమయంలో పూజారులు జానారెడ్డిని దీవిస్తుండగా 'మీరెప్పుడూ ఇలాగే ప్రతిపక్ష నేతగా ఉండాలి' అంటూ హరీశ్ రావు సరదా కామెంట్ చేశారు. దానికి వెంటనే స్పందించిన జానారెడ్డి 'అప్పటికీ ఎవరుంటారో పరిస్థితులను బట్టి డిసైడ్ అవుతుంది' అంటూ హరీశ్ రావుకు నవ్వుతూ సమాధానం ఇచ్చారు. -
భ్రష్టు తెలంగాణగా మారుస్తున్నారు
టీఆర్ఎస్పై జానారెడ్డి, ఉత్తమ్ ధ్వజం మిర్యాలగూడ: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ కాదు భ్రష్టు తెలంగాణగా మారుస్తున్నారని సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి విమర్శించారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఆదివారం నిర్వహించిన పార్టీ సమావేశంలో వారు మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుపై రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 6 లేదా 7న కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అలాగే రబీలో రైతులకు సబ్సిడీ ఇవ్వాలని, ఉపాధి కోల్పోయిన మహిళలకు రూ.25 వేలు చెల్లించాలని, ఉపాధి హామీ పనులు 200 రోజులకు పెంచాలని, ఆదాయం తగ్గిన రాష్ట్రాలకు రాయితీలు సమకూర్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టనున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా 9వ తేదీన మహిళలతో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వాలు మాటల గారడీతో ప్రజలను మోసం చేస్తున్నాయని దుయ్యబట్టారు. పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని ప్రపంచ ఆర్థిక వేత్తలు తప్పుడు నిర్ణయంగా పేర్కొన్నారని తెలిపారు. నోట్ల రద్దుతో దేశంలోని చిన్న సన్నకారు రైతులు, వ్యాపారులు, మహిళలు, విద్యార్థులు, చిరుద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి 30 మాసాలు గడిచినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. 11వ తేదీన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. నోట్లను రద్దు చేసి 51 రోజులుగా గడిచినా సాధించినదేమీ లేదని, పేదలను మాత్రం బ్యాంకుల వద్ద క్యూలో నిలబెట్టారని ధ్వజమెత్తారు. గిరిజనుడిగా పుట్టాలని ఉంది: జానా ఆయా పార్టీల నుంచి కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్న సందర్భంగా మిర్యాలగూడలో భారీ సభ నిర్వహించారు. సభకు సమీప ప్రాంతాలకు చెందిన గిరిజనులు భారీ సంఖ్యలో వచ్చారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడే సందర్భంలో జానారెడ్డి.. సభకు వచ్చిన గిరిజనులను చూసి ఆనందంతో ఉప్పొంగిపోయారు. తలపాగా ధరించి.. మళ్లీ జన్మంటూ ఉంటే గిరిజనుడిగా పుట్టాలని ఉందని అనడంతో సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది. -
రాజకీయాల్లో నా స్టైల్ నాకుంది
నా పనితీరు బాగోలేదని ఎవరూ అన్లేదు: జానారెడ్డి సాక్షి, హైదరాబాద్: శాసనసభలో తన పనితీరు బాగోలేదని ఎవరూ చెప్పలేదని సీఎల్పీ నేత కె.జానారెడ్డి పేర్కొన్నారు. బుధవారం సీఎల్పీ కార్యాలయంలో తనను కలసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘సీఎల్పీ పనితీరు బాగాలేదని, మారుస్తారని మీడియాలో రాసే రాతలకు భయపడను, బాధపడబోను. పెద్ద మనిషి తరహాలో నేను సీఎల్పీ నేతగా వ్యవహరిస్తున్నా. ఇప్పటి పోటీ రాజకీయాలకు నేను సరిపోననే అభిప్రాయం కొందరికి ఉంటే ఉండొచ్చు. రాజకీయాల్లో ఎలా పనిచేయాలనే దానిపై నాకో స్టైల్ ఉంది. పార్టీ వ్యూహాలు, ఎత్తుగడలు పరిస్థితులను బట్టి మారుతుంటాయి. వాటిని ఎమ్మెల్యేలైనా, ఇంకెవరైనా ముందుగానే లీక్ చేయడం సరికాదు. నా పని తీరు బాగాలేదని ఎవరూ నాతో చెప్పలేదు’ అని పేర్కొన్నారు. సీఎల్పీ పదవిపై ఎవరికైనా ఆసక్తి ఉంటే చెప్పాలని తమ ఎమ్మెల్యేలకు ముందుగానే సూచించానన్నారు. -
తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో జేసీ హల్చల్
-
నువ్వు లేచి.. నేను లేచి..!
మంత్రి హరీశ్‌రావుకు ప్రతిపక్ష నేత జానా క్లాస్ - కౌంటర్లు వేసుకుంటే సమయం వృథా అవుతుంది - సభ్యులు మాట్లాడిన తర్వాతే మంత్రి వివరణ ఇవ్వాలి సాక్షి, హైదరాబాద్: శాసనసభ వ్యవహారాల్లో విలక్షణంగా వ్యవహరించే ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి బుధవారం మంత్రి హరీశ్‌రావుకు క్లాస్ తీసుకున్నారు. అందరూ మాట్లాడిన తర్వాతే మంత్రులు మాట్లాడాలని, ఇది గతం నుంచి కొనసాగుతున్న సంప్రదాయమని హితవు పలి కారు. వ్యవసాయంపై జరిగిన చర్చలో ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతుండగానే.. హరీశ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సంద ర్భంగా కోమటిరెడ్డి, సంపత్ పేర్లను ప్రస్తావించారు. హరీశ్ వివరణ అనంతరం ఉత్తమ్ తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. తర్వాత డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి ఐఐఎం సభ్యుడు మొజాంఖాన్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఈ సమయంలో మంత్రి తమ పేర్లు ప్రస్తావించినందున తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోమటిరెడ్డి, సంపత్ కోరారు. అందుకు ఆమె అంగీకరించకపోవ డంతో గందరగోళం ఏర్పడింది. ఆ సమ యంలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరిన జానా తనదైన శైలిలో మాట్లాడారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడిన అంశాలన్నింటినీ నోట్ చేసుకుని, ఆ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందనే అంశంపైనే మంత్రులు వివరణ ఇవ్వాలని, అప్పుడు ప్రభుత్వం చెప్పిన విషయాలు సరైనవా? ప్రతిపక్షాలు చెప్పినవి సరైనవా అనే విషయాన్ని ప్రజలే నిర్ణయిం చుకుంటారని చెప్పారు. ‘‘మంత్రులు మధ్యలో జోక్యం చేసుకోవద్దు. హరీశ్ కాంగ్రెస్‌నుద్దేశించి మాట్లాడిన మాటలకు నాకు కూడా కౌంటర్ ఇవ్వాలని ఉంది. నువ్వు లేచి నేను లేచి.. నువ్వు కౌంటర్ ఇచ్చి.. నేను కౌంటర్ ఇచ్చి.. ఇలా దానికే సమయం సరిపోతుంది. అంతా అయిపోయిన తర్వాతే మంత్రులు మాట్లాడాలి. ఇది గతం నుంచి కొనసాగుతున్న సంప్రదాయం’’ అని క్లాస్ తీసుకున్నారు. రైతులను విస్మరించిన ప్రభుత్వం వ్యవసాయ పరిస్థితిపై చర్చ జరుగుతున్న సం దర్భంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవసాయంపై చేసిన కృషిని వివరించారు. రైతులకు ఇచ్చిన హామీలను మోదీ పూర్తిగా విస్మరించారని ఆరోపిం చారు. స్పందించిన కిషన్‌రెడ్డి తాను మాట్లాడుతున్న సమయంలో సింహ భాగం కేంద్రం తీసుకుంటున్న చర్యలు గురించే వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా రూ.790 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ రాలేదని, వేపపూత పూసిన ఎరువులను సరఫరా చేయడం ద్వారా బ్లాక్‌మార్కెటింగ్‌ను మోదీ ప్రభుత్వం అరికట్టిందని చెప్పారు. పెద్దాయన ఇబ్బంది సభలో జానారెడ్డి మాట్లాడేందుకు ప్రయత్నించగా స్పీకర్ అటువైపు దృష్టి సారించలేదు. దీంతో కాంగ్రెస్ సభ్యులు వెనుక నుంచి ‘పెద్దాయన అడుగుతున్నారు కదా? ఆయన్నెందుకు ఇబ్బంది పెడ తారు..?’ అని వ్యాఖ్యానించారు. ఇందుకు హరీశ్ స్పం దిస్తూ.. ‘పెద్దాయనకు మేమివ్వాల్సిన గౌరవం ఇస్తు న్నాం. మేమెంత గౌరవం ఇస్తున్నామో.. మీరెంత గౌరవం ఇస్తున్నారో రోజూ పత్రికలు రాస్తు న్నా యి. పెద్దాయనను ఎవరు ఇబ్బంది పెడు తున్నారో అందరికీ తెలుసు..’ అని ఎద్దేవా చేశారు. -
మమ్మల్ని కలిపి ఉంటే..
- తెలంగాణలో పరిస్థితి ఇలా ఉండేది కాదు: జేసీ - లాబీల్లో జానారెడ్డి, ఉత్తమ్లతో వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడితే ప్రయోజనం ఏమిటని రాయలసీమకు చెందిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి.. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో వ్యాఖ్యానించారు. బుధవారం జేసీ కాసేపు అసెంబ్లీ లాబీల్లో హల్చల్ చేశారు. సీఎల్పీ నేత కె.జానారెడ్డి, పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి తదితరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘‘కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణతో కలిపి ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉండేది కాదు. విభజన సమయంలో మేం చెప్పిన సూచనలేవీ మీరు వినలేదాయె.. టీఆర్ఎస్ను సరిగా ఎదుర్కోవడం లేదు. ప్రతిపక్ష పార్టీగా ఫెయిల్ అయ్యారు. అసెంబ్లీలో ఏదో మాట్లాడితే ఇçప్పుడు ప్రయోజనం ఏమిటి? చాలా తçప్పులు చేస్తున్నా టీఆర్ఎస్ను గట్టిగా కొట్టలేకపోతున్నారు. మమ్ములను కలుపేసుకుంటే పరిస్థితి ఇట్లానే ఉండేదా?’’ అని జేసీ వ్యాఖ్యానించారు. అందుకు జానారెడ్డి నవ్వుతూ చర్చను దాటేయడానికి అన్నట్టుగా చాయ్ తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించారు. ‘చాయ్ వద్దూ.. ఏమీ వద్దు. ఇక్కడ చాయ్ తాగితే నాలో ఉన్న పౌరుషం కూడా సచ్చుబడిపోతుంది. మీతో కలసి చాయ్ కూడా తాగను’’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు జరుగుతుంటే సభలో ఉంటూ సాధిస్తున్నదేమిటని ఉత్తమ్‌ను జేసీ ప్రశ్నించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఎదురుగా పెట్టుకుని సభలో ఉండి సాధిస్తున్నదేమిటని నిలదీశారు. సభను అడ్డుకోవడం కాదు.. మాట్లాడితేనే సస్పెండ్ చేస్తున్నారని ఉత్తమ్ బదులిచ్చారు. జీరో అవర్‌లో మాట్లాడొచ్చు కదా అని రేవంత్‌ను ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేను మంత్రివర్గంలోకి తీసుకోవడం కన్నా అనైతిక, అప్రజాస్వామిక రాజకీయాలు ఏముంటాయి?’’ అని వ్యాఖ్యానించారు. -
నా తెలంగాణా?.. మన తెలంగాణా?
అసెంబ్లీలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం - ‘నా తెలంగాణ’ అన్న టీఆర్ఎస్ నేతల మాటలపై జానారెడ్డి ఆగ్రహం - కాంగ్రెస్ లేకుండా మీరు తెలంగాణ తెచ్చేవారా అని నిలదీత సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఘనత తమదంటే తమదంటూ అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మంగళవారం శాసనసభలో మాటల యుద్ధానికి దిగాయి. అటు మంత్రి కేటీఆర్.. ఇటు సీఎల్పీ నేత జానారెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమారెడ్డిల మధ్య మాటల తూటాలు పేలాయి. మంగళవారం ‘మిషన్ భగీరథ’పై జరిగిన చర్చలో ప్రతిపక్షం తరఫున మాట్లాడిన భట్టి విక్రమార్క చేసిన ఆరోపణలను ఖండిస్తూ.. మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలతో ‘తెలంగాణ’ వివాదం తలెత్తింది. ఈ అంశంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా జోక్యం చేసుకోవడంతో సభ దద్దరిల్లింది. ఈటల వ్యాఖ్యలపై.. తొలుత ఈ చర్చలో భట్టి మాట్లాడుతూ.. మిషన్ భగీరథలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. టెండర్ల ప్రక్రియ, డీపీఆర్‌లపై అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. అనంతరం దీనిని ఖండిస్తూ మంత్రి కేటీఆర్, ఆ తర్వాత ఈటల రాజేందర్ మాట్లాడారు. ‘‘గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఫ్లోరైడ్ వల్ల కాళ్లు చేతులు చచ్చుబడిపోయిన వారిని తీసుకెళ్లి ప్రధాని ముందు పడుకోబెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. నా తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చేందుకు మేం ప్రయత్నిస్తుంటే దానిని విమర్శించడం తగదు..’’ అని ఈటల పేర్కొన్నారు. అయితే ఈటెల తన ప్రసంగంలో పలుమార్లు ‘నా తెలంగాణ’ అంటూ మాట్లాడడంపై సీఎల్పీ నేత జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవేశంగా లేచి.. ‘‘నా తెలంగాణ.. నాతెలంగాణ అంటున్నవు. నువ్వు తెచ్చినవా తెలంగాణను. మాటిమాటికీ అలా మాట్లాడడం తగదు. మన బిడ్డలు.. మన తెలంగాణ.. మన అభివృద్ధి అనండి. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షల కోసం తెలంగాణ ఏర్పడింది. టీఆర్ఎస్ కన్నా గొప్పగా మేం ముందుండి తెలంగాణను ఏర్పాటు చేశాం..’’ అని జానా పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే లేకపోతే మీకు అక్కడ కూర్చుని మాట్లాడే అవకాశం వచ్చేదా? అని ప్రశ్నించారు. మీ ఒక్కళ్లే అనే భావన మంచిది కాదని, మీరు చేసిన పనులన్నీ మెచ్చుకునే వేదిక ఇది కాదని, సభలో వచ్చిన సద్విమర్శలు, సలహాలను తీసుకుని ముందుకెళ్లడం ప్రభుత్వానికి మంచిదని సూచించారు. అందుకే మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు జానారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని జానారెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 1956లో ఆంధ్రాతో బలవంతపు పెళ్లి చేసి, 1969 ఉద్యమంలో 370 మందిని కాల్చి చంపి, 2004 నుంచి 2014 వరకు తాత్సారం చేసి.. విధిలేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ‘‘మీకు మీరు సర్టిఫికెట్లు ఇచ్చుకోవడం మంచిది కాదు. ప్రజలు ఎవరేం చేశారో గుర్తించారు. అందుకే మిమ్మల్ని అక్కడ (ప్రతిపక్షంలో) కూర్చోబెట్టి మమ్మల్ని ఇక్కడ (అధికారంలో) కూర్చోబెట్టారు..’’ అని పేర్కొన్నారు. ఉత్తమ్‌తో మళ్లీ మొదలు జానారెడ్డి, కేటీఆర్‌ల వాగ్యుద్ధం ముగిశాక కేటీఆర్ ‘మిషన్ భగీరథ’పై ఇచ్చిన వివరణలో ఉత్తమ్‌పై ఆరోపణలు చేశారు. ఆ పథకాన్ని ప్రారం భించేందుకు రావొద్దంటూ ప్రధానికి లేఖలు రాసిన దుస్థితికి కాంగ్రెస్ చేరిందని విమర్శించారు. దీనిపై ఉత్తమ్ తీవ్ర స్థాయిలో కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. ప్రధానికి తాను లేఖ రాసిన మాట వాస్తవమేనని.. ఏమీ చేయకుండా తామే అన్నీ చేశామని చెప్పు కుంటున్న పథకాన్ని ప్రారంభించేందుకు ప్రధాని హోదాలో రావాలో, వద్దో ఆలోచించుకోవాలంటూ లేఖరాశానని చెప్పారు. తామేదో ఆంధ్రా పాలకులకు వత్తాసు పలుకు తున్నట్టు కేటీఆర్ మాట్లాడు తున్నారని.. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆంధ్రా ప్రాంత కాంట్రాక్టర్లకు టెండర్లు ఇవ్వడం లేదాని నిలదీశారు. సీడీఆర్ నిబంధన కింద టెండర్లను పిలవడంలో అవకతవకలు జరిగాయని, దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి లేఖ రాసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఉత్తమ్ వ్యాఖ్యలపై కేటీఆర్ కూడా ఆవేశంగా స్పందించారు. తమపై అడ్డగోలుగా అవి నీతి ఆరోపణలు చేయవద్దని, స్వీయ మానసిక ఆం దోళనలను ప్రజలపై రుద్దాలనుకుంటే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. మంత్రి పదవులు వదులుకోలేక ఇళ్లలో కూర్చుని సంతకాలు పెట్టిన వారు కూడా మమ్మల్ని విమర్శిస్తారా అని ఎద్దేవా చేశారు. దీంతో ఉత్తమ్ మరోసారి ఫైరయ్యారు. ‘‘ఒక్క ఎంపీ ఉన్న టీఆర్ఎస్ వల్ల తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిందా? భగీరథలో 1,800 కోట్లతో నిర్మిస్తున్న ఇన్‌టేక్ వెల్స్ టెండర్లలో కేటీఆర్ నిబంధనలను మార్చి అవకతవకలకు పాల్ప డ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ సభ ముందు పెట్టండి. అక్రమాలను నిరూపించకపోతే ఏ శిక్షకైనా సిద్ధం..’’ అని సవాల్‌చేశారు. టీఆర్ఎస్ సభ్యులు గొడవ చేయడంతో.. ‘ఒక కుటుం బాన్ని సమర్థిస్తే మీకేనష్టం..’ అంటూ వ్యాఖ్యానించారు. అసలు కథ ఇక్కడే మొదలు అయితే మంత్రి కేటీఆర్ విమర్శలపై జానారెడ్డి మరింత ఆగ్రహంగా స్పందించారు. ‘‘కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటించినప్పుడు.. ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. అప్పుడు తెలంగాణను ఎలా కాపాడుకోవాలంటూ కేసీఆర్ నా దగ్గరకు వచ్చిన మాట వాస్తవం కాదా? తెలంగాణను కాపాడుకునేందుకు ఏదైనా చేస్తానని చెప్పి... తెలంగాణ నేతలందరి చేతా రాజీనామాలు చేయించింది నేను, కాంగ్రెస్ పార్టీ కాదా..? ఆ చర్యలతోనే కదా తెలంగాణ ఉద్యమ ఉధృతి కొనసాగింది..’’ అని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నామని, సోనియాకు కూడా ఎన్నోసార్లు రాష్ట్రం కోసం నచ్చజెప్పామని చెప్పారు. కానీ తామేమీ చేయలేదని పదేపదే అనడం బాధ కలిగిస్తోందని జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు వింటుంటే అసలు తాము పొరపాటు చేశామేమో అన్న బాధ కలుగుతోందన్నారు. అప్పుడు అక్కడా (కేంద్రంలో), ఇక్కడా (రాష్ట్రంలో) తమ ప్రభుత్వమే ఉందని.. మిమ్మల్ని అణచాలనుకుంటే నిమిషం పట్టేది కాదని వ్యాఖ్యానించారు. కానీ ప్రజాస్వామికవాదులుగా తామలా చేయలేదని, టీఆర్ఎస్ మాత్రం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ఇవ్వడం పొరపాటా..? పొరపాటు చేశామంటూ జానారెడ్డి పేర్కొనడంపై తిరిగి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. జానారెడ్డి తన హోదాకు, అనుభవానికి, గౌరవానికి తగినట్టు మాట్లాడడం లేదని విమర్శించారు. పొరపాటు ఎందుకు చేశారో జానారెడ్డి చెప్పాలని, తెలంగాణ ఇవ్వడమే కాంగ్రెస్ చేసిన పొరపాటా అని ప్రశ్నించారు. ఎవరిని అణచివేయాలనుకున్నారని నిలదీశారు. ఇలాంటి ఫ్యూడల్ ధోరణితో కాంగ్రెస్ పాలించింది కనుకే జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్.. ఓ పెద్ద ప్రాంతీయ పార్టీగా మారిందని విమర్శించారు. వెంటనే జానా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన జానా... ప్రజాస్వామికంగా వ్యవహరించాలని చెప్పాలనుకున్నానే తప్ప తెలంగాణ ఇవ్వడం పొరపాటనేది తమ అభిమతం కాదని స్పష్టం చేశారు. తెలంగాణ ఇవ్వడం కాంగ్రెస్ విధి కనుకనే ఇచ్చిందన్నారు. ఎన్నిసార్లు రెచ్చగొట్టినా సంయమనం పాటించామని, అయినా తమను గౌరవించకుండా కామెంట్లు చేస్తున్నారని చెప్పి జానారెడ్డి కూర్చోవడంతో చర్చ ఆగిపోయింది. మోతీలాల్ నుంచి రాహుల్ వరకు.. అయితే ‘ఒక కుటుంబం’ అంటూ ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. ‘‘మోతీ లాల్ నెహ్రూ కుమారుడు జవహర్లాల్ నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరాగాంధీ, ఆమె కొడుకు రాజీవ్‌గాంధీ, ఆయన భార్య సోనియా గాం ధీ.. ఇలా కాంగ్రెస్‌లో అంతా వారసత్వమే. సోనియా కుమారుడు రాహుల్ ఆ పార్టీ ఉపాధ్యక్షుడు కూడా. అలాంటి పార్టీకి ఉత్తమ్ రాష్ట్ర అధ్యక్షుడు. ఉత్తమ్ సతీమణి కూడా ఎమ్మెల్యేగా సభకు రావచ్చు. కానీ మా కుటుంబం నుంచి రాకూడదా..?’’ అని వ్యాఖ్యానించారు. ఆధారా లుంటే ఆవేశం, హడావుడి ఉండవని.. అవినీతిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ ప్రకటించారు. దీంతో తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని ఉత్తమ్ మరోసారి స్పష్టం చేస్తూ.. కూర్చోవడంతో మాటల యుద్ధం ముగిసింది. -
వందేళ్ల వెలుగులకు పునాది
మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: జగదీశ్‌రెడ్డి • మా ప్రణాళికతోనే గృహాలకు 24 గంటలు, సాగుకు 9 గంటల విద్యుత్ • ఏపీ సీఎంకు జానారెడ్డి వంతపాడుతున్నారని విమర్శ • ఇప్పుడొచ్చిన వెలుగులన్నింటికీ పునాదులు మావే: జానారెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి శాసనసభలో చెప్పారు. గత అరవైఏళ్ల నష్టాన్ని పూడుస్తూ.. వందేళ్ల వెలుగులకు పునాదులు వేస్తున్నామన్నారు. గృహాలకు 24 గంటలు, సాగుకు 9 గంటలు, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు చర్యలు చేపట్టామ ని తెలిపారు. శనివారం అసెంబ్లీలో విద్యుత్ అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో జగదీశ్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2 వేల మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ‘కాకతీయ థర్మల్ ప్రాజెక్టు నుంచి 2,400 మెగావాట్లు, సింగరేణిలో 1,200, జూరాలలో 240, పులిచింతలలో 30 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేశాం. సోలార్ ద్వా రా వెయ్యి మెగావాట్లు, పవన విద్యుత్ ద్వారా 99 మెగావాట్లను ఉత్పత్తి చేస్తున్నాం. మణు గూరు, కొత్తగూడెం, దామరచర్ల ప్రాజెక్టుల ద్వారా 5,880 మెగావాట్లు, ఎన్టీపీసీ 4,000, సౌర విద్యుత్ ద్వారా 2,200 మెగావాట్ల విద్యు దుత్పత్తికి పనులు మొదలయ్యాయి’ అని పే ర్కొన్నారు. టీఎస్ ఐపాస్‌తో పరిశ్రమల విద్యు త్ డిమాండ్ 2 వేల మెగావాట్లు పెరిగిందని, గత సెప్టెంబర్‌లో రాష్ట్రంలో అత్యధికంగా 8,484 మెగావాట్ల డిమాండ్ రికార్డయిందని తెలిపారు. ఎత్తిపోతల పథకాలకు 7,500 మెగా వాట్లు అవసరమని, ఆ మేరకు సరఫరా చేసే లా చర్యలు మొదలుపె ట్టామని వివరించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక్క సెకను కూడా కరెంట్ పోని పరిస్థితి తెస్తామని చెప్పారు. విద్యుత్ శాఖలో పని చేస్తున్న 20 వేల మంది ఔట్సోర్సింగ్/కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీ కరించేందుకు సీఎం నిర్ణ యం తీసుకున్నారని.. ఇప్పటికే 1,175 మంది జేఎల్ఎంఈలను క్రమబద్ధీకరించారన్నారు. పక్క రాష్ట్ర సీఎంపై జానాకు ప్రేమ ప్రతిపక్ష నేత జానారెడ్డిపై జగదీశ్‌రెడ్డి విరుచు కుపడ్డారు. జానారెడ్డి పక్క రాష్ట్ర సీఎంకు వంత పాడుతున్నారని, ఆ రాష్ట్రం తెలంగాణపై చేసిన కుట్రలు మరిచి ప్రేమ కనబరుస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని చీకట్లో ఉంచిన తోడు దొంగలు ఈ చర్చలో తలెత్తుకునే పరిస్థితి లేదని తెలిసి పారిపోయారని వ్యాఖ్యానించారు. ప్రణాళిక లేకుంటే గ్రిడ్లాప్రభుత్వం కూలుతుంది: జానారెడ్డి తెలంగాణ ఏర్పాటు తర్వాత అదనంగా ఒక్క యూనిట్ విద్యుదుత్పత్తి జరగలేదని... ఇటీవ ల అందుబాటులోకి వచ్చిన 2 వేల మె.వా. విద్యుత్‌కు తామే పునాదులు వేశామని జానారె డ్డి స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం దేశమంతా అవస రానికి మించి విద్యుత్ ఉంది. దానికి కారణం మేము, మా ప్రభుత్వాలు కాదా? మాహయాం లో మొదలుపెట్టిన విద్యుత్ కేంద్రాల్లోనే నేడు ఉత్పత్తి జరుగుతోంది’ అని పేర్కొన్నారు. సరైన ప్రణాళిక లేకుంటే గ్రిడ్ కుప్పకూ లినట్లే ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు. రెండోమారు వాకౌట్ విద్యుత్ అంశంపై 40 నిమిషాలు మాట్లాడిన జానారెడ్డి.. అనంతరం సభ నుంచి మరోసారి వాకౌట్ చేశారు. ‘మా సభ్యులు సభలో లేనప్పుడు ఇంతకు మించి మాట్లాడటం సబబు కాదు. సభ గౌరవంగా జరగాలంటే కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలి.’’ అని డిమాండ్ చేస్తూ సభ నుంచి వెళ్లిపోయారు. ఆ సమయంలో సభలోనే ఉన్న ఉత్తమ్ కూడా బయటికి వెళ్లారు. మాట్లాడిందంతా మాట్లాడి, ప్రభుత్వం సమాధానం చెప్పే సమయంలో వాకౌట్ చేయడం సరికాదని మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ సభ్యులకు సూచించారు. ఒక్క యూనిట్ పెరగలేదు: బీజేపీ రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ఒక్క యూనిట్ విద్యుత్ అదనంగా ఉత్పత్తి చేయలేదని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 13 ఏళ్ల కనిష్ట ఉత్పత్తికి పడిపోయామని, వ్యవసాయ వినియోగం పడిపోయిందన్నారు. వ్యవసాయానికి 9 గంటలు ఇస్తున్నా మని చెబుతున్నా 6 గంటలకు మించి ఇవ్వడం లేదన్నారు. హైదరాబాద్‌లో భారీగా విద్యుత్ కోతలు హైదరాబాద్‌లో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయని.. ఈ ఏడాది 6,518 బ్రేక్డౌన్లు నమోదయ్యాయని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశా రు. సౌర విద్యుత్ ఉత్పత్తి పెంచాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కోరగా.. ఉద్యోగుల క్రమబద్ధీకరణ వేగిరం చేయాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య కోరారు. విద్యుత్‌పై చర్చకు ఒకే ఒక్కడు కాంగ్రెస్ సభ్యులు వారించినా సభకు వెళ్లి మాట్లాడిన జానా.. సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ ఎమ్మెల్యేలను అప్రజాస్వామికంగా సస్పెండ్ చేసినందున విద్యు త్‌పై చర్చలో పాల్గొనాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. పార్టీ ఫిరాయించినవారిపై చర్యలు తీసుకోవాలని కోరిన సభ్యులను సస్పెండ్ చేసిన తర్వాత అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జానారెడ్డి చాంబర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. వి ద్యుత్‌పై చర్చలో జానారెడ్డి పాల్గొనాలా? వద్దా అన్న అంశంపై చర్చ జరిగింది. విద్యుత్‌పై చర్చ ను బహిష్కరించాలని సభ్యులు సూచించారు. సభ్యుల ప్రతిపాదనను జానారెడ్డి వ్యతిరేకిం చారు. విద్యుత్ వంటి సమస్యపై మాట్లాడే అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని, ప్రభుత్వా న్ని ఎండగట్టే అవకాశాన్ని వాడుకుందామని వ్యాఖ్యానించారు. మెజారిటీ సభ్యుల అభిప్రాయా లను పట్టించుకోకుండానే సభలోకి వెళ్లి జానారెడ్డి మాట్లాడారు. తర్వాత వాకౌట్ చేశారు. -
జై తెలంగాణ అంటేనే సస్పెండ్ చేశారు!
సమైక్య ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీలో జై తెలంగాణ అంటేనే సస్పెండ్ చేశారని, తెలంగాణకు సంబంధించిన సమస్యలు ప్రస్తావించినా పంపేశారని.. అసలు కుర్చీలోంచి లేస్తేనే సస్పెండ్ చేశారని మంత్రి హరీష్ రావు అన్నారు. అలాంటిది సభను అడ్డుకుంటే ఎందుకు ఊరుకుంటారని ప్రశ్నించారు. అటు పార్లమెంటులోను, ఇటు అసెంబ్లీలోను కూడా సభను జరగనివ్వకుండా కాంగ్రెస్ సభ్యులు అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయంలో అనేక అంశాలు ప్రస్తావనకు వస్తాయని, ఈ సభ ఏదో కొంతమందిది కాదు.. 119 మంది సభ్యులందరిదీ అని చెప్పారు. అంతకుముందు తొమ్మిది మంది కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయడంతో.. ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఎప్పుడైనా తాము ప్రస్తావించిన అంశాలను చర్చకు రానిచ్చారా అని అడిగారు. ప్రశ్నోత్తరాల సమయం అయిపోయిన తర్వాత వాయిదాలు వేస్తున్నారని.. ఇప్పుడు సభ్యుల సస్పెన్షన్ అంశాన్ని పునరాలోచించాలని, లేనిపక్షంలో తాను కూడా నిరసనగా వాకౌట్ చేయాల్సి వస్తుందని జానారెడ్డి అన్నారు. మెజారిటీ ఉందని రెండు నిమిషాల్లోనే సస్పెండ్ చేస్తారా, ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. వెల్ లోకి రాకముందే సస్పెండ్ చేయడానికి కారణం ఎంటని అడిగారు. ప్రభుత్వ చర్యలు, వైఫల్యాలను ప్రశ్నించకూడదా అని ప్రశ్నించారు. దానికి హరీష్ స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. ఫిరాయింపుల గురించి బీఏసీలో ప్రస్తావించలేదని, అయినా అది స్పీకర్ పరిధిలోని అంశమని చెప్పారు. మాట్లాడటానికి ఏమీ లేదు కాబట్టే కాంగ్రెస్ పార్టీ సభను అడ్డుకోవాలని చూస్తోందన్నారు. గతంలో జై తెలంగాణ అన్నందుకే తమను సస్పెండ్ చేసినప్పుడు మంత్రిగా ఒక్క మాట కూడా మాట్లాడని జానారెడ్డి.. ఇప్పుడు సభకు అంతరాయం కలిగించినందుకు సభ్యులను సస్పెండ్ చేస్తే ఎలా ప్రశ్నిస్తారన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేశామని, ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని చెప్పారు. జానారెడ్డి వాకౌట్ కాగా.. ప్రభుత్వ తీరును నిరసిస్తూ జానారెడ్డి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ఆయన చాంబర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అయి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.