తెలంగాణ అసెంబ్లీ లాబీలో బుధవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మంత్రి హరీశ్ రావు, ప్రతి పక్ష నేత జానారెడ్డి మధ్య సరదా సంవాదం జరిగింది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ లాబీలో బుధవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మంత్రి హరీశ్ రావు, ప్రతి పక్ష నేత జానారెడ్డి మధ్య సరదా సంవాదం జరిగింది. మంత్రి హరీశ్ రావు లాబీలోనే జానారెడ్డికి ధర్మపురి ఆలయ కమిటీని పరిచయం చేశారు.
ఆ సమయంలో పూజారులు జానారెడ్డిని దీవిస్తుండగా 'మీరెప్పుడూ ఇలాగే ప్రతిపక్ష నేతగా ఉండాలి' అంటూ హరీశ్ రావు సరదా కామెంట్ చేశారు. దానికి వెంటనే స్పందించిన జానారెడ్డి 'అప్పటికీ ఎవరుంటారో పరిస్థితులను బట్టి డిసైడ్ అవుతుంది' అంటూ హరీశ్ రావుకు నవ్వుతూ సమాధానం ఇచ్చారు.