హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో శనివారం వాయిదా తీర్మానంపై కాంగ్రెస్ పార్టీ పట్టు పట్టింది. ఓయూ, హెచ్సీయూలో విద్యార్థులపై దాడులతోపాటు ఎమ్మెల్యే సంపత్కుమార్పై దాడి ఘటనపై కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే ప్రశ్నోత్తరాల తర్వాత చర్చిద్దామని మంత్రి హరీశ్రావు... సదరు పార్టీ సభ్యులకు తెలిపారు. అలా కాదు వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని సీఎల్పీ నేత కె.జానారెడ్డి సూచించారు. అందుకు మంత్రి హరీశ్రావు.. ప్రశ్నోత్తరాల తర్వాత ఆ చర్చ చేపడదామన్నారు.
అంతలో జానారెడ్డి జోక్యం చేసుకుని... ప్రాధాన్యత గత అంశాలను ముందు చర్చిద్దామని గతంలో సీఎం కేసీఆర్ చెప్పిన సంగతిని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు. ఓయూ, హెచ్సీయూలో విద్యార్థులపై దాడులతోపాటు ఎమ్మెల్యే సంపత్కుమార్పై దాడి నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యులంతా నల్లబ్యాడ్జీలు ధరించిన సభకు హాజరయ్యారు.