
దామరచర్ల(మిర్యాలగూడ): ఎన్నికల్లో రైతులకు ఇచి్చన ఏ ఒక్క హామీ కూడా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అమలు చేయకుండా రైతులను దగా చేశారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి, మాజీమంత్రి గీతారెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకుల్లో వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. పంటలు నష్టపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శిం చారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల నుంచి వేల కోట్లను దండుకుంటోందని ఆరోపించారు. జానారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ చెప్పే గారడీ మాటల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని హామీనిచ్చారు. మాజీ మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలను నాశనం చేసిందని, దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూపంపిణీ, దళితబంధు వంటి వాటిని విస్మరించిందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment